
లవ్ లెటర్స్ ఆక్షన్!
హాలీవుడ్ కలల రాణి మార్లిన్ మన్రో ప్రేమ లేఖలు ఆక్షన్ వేయనున్నారు. బెవర్లీ హిల్స్‌లో వచ్చే నెల 15, 16 తేదీల్లో నిర్వహించే వేలం పాటలో మూడొందల లెటర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. మాజీ భర్త జో డిమాగియోకు మార్లిన్ రాసిన లేఖలు ఇందులో ఉన్నాయి. ‘నిన్ను ప్రేమిస్తున్నాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. నాపై నీకు నమ్మకం కలగడానికి ఇంతకంటే నేనేమీ చేయలేను’ అంటూ మార్లిన్ రాసిన ఓ లేఖ అందరినీ కదిలించింది. ఇలాంటివెన్నో హృదయాలను తాకే లెటర్స్ ఆక్షన్‌లో పెడుతున్నారు.