Love Letters
-
హలో ప్రేమపక్షులారా.. ఈ యాప్ మీకోసమే..
కాలం మారినా కవితలతో ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులు ఇంకా ఉన్నారు. అయితే కవితల కోసం కవితాత్మక ఆలోచనలు అందరికి రావు, రావాల్సిన అవసరమూ లేదు. అలాంటి వాటికి ChatGPT చాలా ఉపయోగపడుతుంది. ఈ కథనంలో చాట్‌జీపీటీ ద్వారా ప్రేమలేఖలు ఎలా రాయాలి, కవితల కోసం ఎక్కడ సర్చ్ చేయాలనే మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో చాట్‌జీపీటీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ పూర్తిగా ఉచితం, దీనికి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ మెయిల్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ఉపయోగించుకోవచ్చు. చాట్‌జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తరువాత టెక్స్ట్/సర్చ్ బాక్స్ కనిపిస్తుంది, అందులో మీరు అడగాల్సిన ప్రశ్నను టైప్ చేయాలి. మీరు టెక్స్ట్ బాక్స్‌లో టైప్ చేసిన ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది. లవ్ లెటర్ కావాలని సర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే.. వెంటనే పైన మీకు ఒక లెటర్ సమాధానం రూపంలో కనిపిస్తుంది. లెటర్ మాత్రమే కాకుండా మీరు ప్రేమించే అమ్మాయి లేదా అబ్బాయి కోసం కవితలు కావాలనుకుంటే కూడా సర్చ్ బాక్స్‌లో టైప్ చేస్తే.. కవితలు కూడా అక్కడ డిస్ప్లే అవుతాయి. చాట్ జీపీటీ ఇచ్చిన ఫలితాల్లో మీకు అవసరమైన కంటెంట్ తీసుకుని, మీకు నచ్చినట్లు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి! చాట్‌జీపీటీ ఇచ్చిన కంటెంట్‌ను లేదా సమాధానాలను జాగ్రత్తగా పరిశీలించాలి.. ఎందుకంటే ఆ కంటెంట్‌లో చిన్న పొరపాట్లు జరిగిన పదాలకు అర్థాలు మారిపోతాయి, తరువాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైన కంటెంట్ ఉంచి, అనవసరమైన కంటెంట్ తీసివేసి సొంతంగా తయారు చేసుకోవడం ఉత్తమం. -
Valentine's Day 2023:వామ్మో..చాట్‌జీపీటీని అలా కూడా వాడేస్తున్నారట!
సాక్షి: ముంబై: వాలెంటైన్స్ డే సందర్భంగా ఏఐ సంచలనం చాట్‌జీపీటీ క్రేజ్‌ను లవ్‌బర్డ్స్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నారు.లవర్స్ ఇంప్రెస్ చేసేందుకు చాట్‌జీపీటీ సాయం తీసుకుంటున్నారట అబ్బాయిలు. ప్రేమలేఖలు రాయడానికి భారతీయ పురుషులు, టీనేజర్లు చాట్ జీపీటీ సహాయం తీసుకుంటున్నారని తాజాగా ఒక సర్వే వెల్లడించింది. అంతేకాదు 73 శాతం మంది డేటింగ్ యాప్‌లలో తమ ప్రొఫైళ్లను మార్చుకునేందుకు ఏఐ టూల్‌ని వాడుకోవాలని చూస్తున్నారట. (ఇది కూడా చదవండి: Valentines Day2023: జియో బంపర్ ఆఫర్స్) తమ స్వీటీలను ఎలాగైనా ఆకర్షించాలనే ఉద్దేశంతో 60 శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమ లేఖలు రాయడానికి చాట్‌జీపీటీ సహాయం తీసుకోవాలని భావించారని సైబర్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ తేల్చింది 'మోడరన్ లవ్' పేరుతో జరిపిన అధ్యయనంలో 78 శాతం మంది భారతీయ వయోజనులు చాట్‌జీపీటీలో రాసిన ప్రేమ లేఖల పట్ల మక్కువ చూపుతున్నారని, అసలు దానినిఏఐ లెటర్‌గా గుర్తించలేకపోతున్నారని మెకాఫీ స్టడీ తేల్చింది. అంతేకాదు ప్రేమలేఖలు రాయడానికి చాట్‌జీపీటీని వాడుకున్న ఎనిమిది దేశాలలో భారతీయులే ఎక్కువమంది ఉన్నారని కూడా తెలిపింది. తమ ప్రేమను వ్యక్తం చేయడానికి మాటలు రాని , ప్రేమలేఖలు రాయలేని లేదా దానికి పదాలు దొరకని వారు ఈ ఓపెన్ ఏఐని ఆశ్రయిస్తున్నారట. వాలెంటైన్స్ డేసందర్భంగా నిర్వహించిన ‘మోడరన్ లవ్’ పరిశోధనలో 9 దేశాల నుండి 5000 మందికి పైగా వ్యక్తులను సర్వే చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 27 శాతం మంది వ్యక్తులు చాట్‌జీపీటీ లేఖను పంపడం వల్ల తమకు మరింత ఆత్మవిశ్వాసం ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 49 శాతం మంది చాట్‌జీపీటీ రాసిన ప్రేమ లేఖలు అందుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా గగుల్కు షాకిస్తూ ఇటీవలి కాలంలో చాట్‌జీపీటీ దూసుకు పోతోంది. దీంతో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కూడా చాట్ జీపీటీకి పోటీగా ఏఐటూల్ బార్డ్‌ను తీసుకిచ్చింది. అయితే, ఒక తప్పిదం కారణంగా బార్డ్ భవిష్యత్తులో చాట్‌జీపీటీతో ఎలా పోటీ పడుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. అప్రమత్తత చాలా అవసరం ప్రపంచవ్యాప్తంగా, నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది (26 శాతం) ఏఐ ద్వారా నోట్‌ను రాయాలని ప్లాన్ చేస్తున్నారనీ, ఆన్లైన్ డేటింగ్ ప్రపంచంలోఇది రెండు వైపులా పదును ఉన్న కత్తిలాంటిదని మకాఫీ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ప్రేమికులు టార్గెట్ చేసే ప్రమాదం ఉందని, మనుషులు, ఏఐ మధ్య తేడాను గుర్తించగలరో లేదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నివేదికలో పేర్కొంది. అలాగేపార్ట్నర్తో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డబ్బులు, వ్యక్తిగత వివరాలపై అనుమానాస్పదంగా అడిగినప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని బమెకాఫీ స్టీవ్ గ్రోబ్‌మాన్ సూచించారు. -
వాలెంటైన్స్ డే జోష్! చాట్‌జీపీటీతో ప్రేమ లేఖలకు సిద్ధపడ్డ లవ్ బర్డ్స్
న్యూఢిల్లీ: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులంతా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి కొత్త జోష్‌తో ఉన్నారు. మనసులో ప్రేమ భావనలు ఉప్పొంగుతున్నా వాటిని చక్కగా కాగితంపై పెట్టలేని వారు చాట్‌జీపీటీ సాయంతో ప్రేమలేఖలు రాయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు! 62% మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్‌డేకి చాట్‌జీపీటీ సాయంతో తమ మనసులో ఉన్న మాటల్ని రాస్తామని ఒక సర్వేలో వెల్లడించారు. 30% మంది తమ లవర్‌కి ఈ టూల్ సాయంతో ప్రేమలేఖ రాస్తామని చెప్పారు. మోడరన్ లవ్ రీసెర్చ్ తొమ్మిది దేశాల్లో 5 వేల మందిని ప్రశ్నించి ఒక నివేదిక రూపొందించింది. సహజసిద్ధంగా పుట్టే ప్రేమను వ్యక్త పరచడానికి కృత్రిమ మేధపై ఆధారపడతామని చెప్పిన వారిలో అత్యధికులు భారతీయులే! -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్‌కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! -
82 ఏళ్ల తాత ఎగిరి గంతేశాడు.. కారణం ఏంటంటే!
యాభై ఏళ్ల తరువాత ఫస్ట్ లవ్ ను కలుసుకోబోతున్నందుకు 82 ఏళ్ల తాత ఎగిరి గంతేస్తున్నాడు. రాజస్థాన్‌లోని కులధార గ్రామంలో గేట్ కీపర్ గా పనిచేస్తోన్న తాత 30 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మరీనాతో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా తాతను ప్రేమించింది. వాళ్ల ప్రేమకు పెద్దవాళ్లు అడ్డుచెప్పలేదు, కానీ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో విడిపోయారు. ఇది జరిగి 50 ఏళ్లు అయింది. తాజాగా మరీనా తాతకు ‘హౌ ఆర్ యూ, మై ఫ్రెండ్’ అని లెటర్ రాస్తూ...‘త్వరలో ఇండియా వచ్చి నిన్ను కలుస్తాను’ అని చెప్పడంతో తాత ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ 82 ఏళ్ల వ్యక్తి రాజస్థాన్‌లోని కులధార గ్రామంలో గేట్ కీపర్‌గా పనిచేస్తున్నాడు. 30 లలో ఉన్నప్పుడు అతను ప్రేమలో పడ్డాడు. అది 1970. ఓ ఐదురోజుల పర్యటనలో భాగంగా మరీనా అనే అమ్మాయి ఆస్ట్రేలియా నుంచి జైసల్మీర్‌ను చూసేందుకు వచ్చింది. తాతా, మరీనా అనుకోకుండా ఎదురు పడ్డారు. కళ్లూ కళ్లూ కలిశాయి. అంతే! తొలిచూపులోనే ఒకరితో ఒకరు పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. అయితే ఇద్దరూ ఇష్టపడినప్పటికీ ..ఐదురోజులు ఒకరినొకరు చూసుకుంటూ గడిపారు. మరీనా పర్యటన ముగియడంతో ఆస్ట్రేలియా తిరిగి వెళ్తూ.. తాతకు ‘ఐ లవ్ యూ’ అని చెప్పి, తన అడ్రస్ ఇచ్చింది. ఆ తరువాత ఇద్దరూ ఒకరికొకరు ఉత్తరాలు రాసుకుంటూ ఉండేవారు. ఉత్తరాలతో వారి ప్రేమ మరింత బలపడడంతో.. మరీ నా తాతను ఆస్ట్రేలియా రమ్మని పిలిచింది మరీ నా. పిలిచిన వెంటనే తాత రెక్కలు కట్టుకుని మరీ ఆస్ట్రేలియాలో వాలిపోయాడు.అక్కడ ఓ మూడు నెలలపాటు ఎంతో ఆనందంగా గడిపారు ఇద్దరూ. ఆ తరువాత మరీనా తాతను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండమని అడిగినప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. తాత ఇండియా వదిలివెళ్లడానికి ఇష్టపడలేదు, మరీనా కూడా ఆస్ట్రేలియా వదిలి ఇండియాలో ఉండడానికి ఇష్టపడలేదు. దీంతో ఇద్దరూ దీర్ఘకాలం కలిసి ఉండడం కుదరదని నిశ్చయించుకుని విడిపోయారు.విడిపోవడం ఇద్దరికీ ఇష్టంలేకపోయినా తమ తమ దేశాలను వదిలి వెళ్లలేక ఇద్దరూ ప్రేమకు దూరమయ్యారు. ఆ తరువాత ఇద్దరూ తనకి పెళ్లి అయ్యిందా? నేను గుర్తుంటానా? అని అనుకునేవారు. ఇది ఇలా కొనసాగుతుండగానే కులధారలో తాతకు గేట్‌కీపర్ ఉద్యోగం దొరికింది. దీంతో ఇంట్లో వాళ్లు పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో తాత మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలగడంతో వారికి మంచి భవిష్యత్ అందించే క్రమంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ పెద్దయ్యారు. రెండేళ్ల క్రితం తాత భార్య మరణించింది. సంసార సాగరంలో తాత పడిపోయినప్పటికీ మరీనా పెళ్లి అయి ఉంటుందా? తనని నేను మళ్లీ కలుసుకోగలనా? అనుకుంటూ ఉండేవాడు. అయితే ఇక్కడితో తాత ఫస్ట్ లవ్‌స్టోరీ ముగిసిపోలేదు. రెండు నెలల క్రితం తాతకు మరీనా నుంచి ఒక ఉత్తరం వచ్చింది. దానిలో ‘‘హౌ ఆర్ యూ, మై ఫ్రెండ్? నేను ఇప్పటిదాకా ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే ఇండియా వస్తున్నాను’’ అని చెప్పింది. యాభై ఏళ్ల తరువాత కూడా మరీనా తనని గుర్తుపెట్టుకోవడంతో.. తాత ఆశ్చర్యానందాలలో మునిగి తేలాడు. ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఇద్దరూ లవ్ బర్డ్స్‌లా రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ బంధాన్ని మరింత దృఢపరుచుకున్నారు. తాత ఈ విషయాన్నీ ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ వారితో పంచుకోవడంతో 50 ఏళ్ల నాటి ప్రేమ వెలుగులోకి వచ్చింది. తాత మాట్లాడుతూ..‘‘మరీనా మళ్లీ నా దగ్గరకొస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు నా మనసు 21 ఏళ్ల కుర్రాడిలా పరుగులు పెడుతోంది. అయితే భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ నా ఫస్ట్ లవ్ ఆరోగ్యంగా, సజీవంగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని తాత ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయం సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో నువ్వు గ్రేట్ తాత! అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. -
నటి హీరాకు అజిత్ ప్రేమలేఖలు!
చెన్నై: నటుడు అజిత్‌కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీసెంట్గా అజిత్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1990లో నటి హీరా రాజ్‌గోపాల్‌తో అజిత్ నడపిన ప్రేమాయణం అప్పట్లో టాక్ ఆప్ ది టౌన్‌గా ఉండేది. అయితే ఆ సమయంలో హీరాకు అజిత్ ప్రేమలేఖలు రాసేవారట. ఈ విషయాన్ని నటి బాయిల్వాన్ రంగనాథన్ వెల్లడించారు. ఆ లెటర్స్‌లో ఒకదాన్ని తాను చదివానని పేర్కొనడంతో వీరి లవ్‌స్టోరి మరోసారి వార్తల్లో నిలిచింది. (అందుకు నేను బాధ్యున్ని కాను!) కాథల్ కొట్టై అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించిన అజిత్ - హీరా షూటింగ్ సమయంలోనే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆ తర్వాత 'తోడారమ్' అనే మరో చిత్రంలోనూ కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ బంధం పెళ్లిదాకా మాత్రం వెళ్లలేదు. వీరి వివాహానికి హీరా తల్లి నో చెప్పిందని, దీంతో వీరి లవ్ స్టోరికి ఫుల్స్టాప్ పడినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. కాగా కొన్నేళ్లకు అజిత్ నటి షాలినిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అనోష్కా, ఆద్విక్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నటిగా కెరియర్లో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకున్న షాలిని ఆ తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది. గృహిణిగా, నటిగా రెండు బాధ్యతలను తాను నిర్వహించలేనని అందుకే తన మొదటి ప్రయారిటీ కుటుంబమే అని షాలిని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా?) -
‘ఇప్పటికి నా భార్యకి లవ్ లెటర్స్ రాస్తాను’
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోకి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక షోని రక్తికట్టించడంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్ సీటులో కూర్చున్న వారిని నవ్విస్తూ.. టెన్షన్ పెడుతూ.. వారి జీవితం గురించి తెలుసుకుంటూ.. తన ప్రయాణం గురించి వారికి చెప్తూ షోపై ఆసక్తి పెంచుతారు. ఇక తాజా ఎపిసోడ్లో మహారాష్ట్రకు చెందిన రైతు యోగేష్ పాండే ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో గెలిచి హాట్ సీట్లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో కేబీసీ టీం యోగేష్‌కు సంబంధించిన వీడియో ఇంట్రడక్షన్‌ని ప్రసారం చేసింది. ఇక యోగేష్, బిగ్ బీల మధ్య జరిగిన సంభాషణ హాట్ సీటును కాస్త కూల్‌గా మార్చేసింది. ఇక గేమ్‌లో ముందుకు వెళ్తున్న కొద్ది యోగేష్ తనకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తనకు నిశ్చితార్థం అయ్యిందని తెలిపాడు యోగేష్. అయితే కరోనా వ్యాప్తితో వివాహం పోస్ట్ పోన్ అయ్యిందని.. కానీ తామిద్దరూ ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని.. వీడియో కాల్ చేసుకుంటామని తెలిపాడు. ఈ విషయాలేవి ఇంట్లో వారికి తెలియదన్నాడు యోగేష్. ఇక ఈ లవ్ స్టోరిని అర్థం చేసుకోవడానికి బిగ్ బీ, యోగేష్ లవర్‌గా మారి పోయారు. కంటెస్టెంట్‌కి కాల్ చేసి అతడి లవర్‌గా మాట్లాడి సెట్లో నవ్వులు పూయించారు. (మళ్లీ వివాదం: అమితాబ్‌పై కేసు) ఇక ఎలాంటి లైఫ్లైన్ల సాయం లేకుండానే యోగేష్ గేమ్‌లో ముందుకు వెళ్లాడు. ఇక వివాహ జీవితం గురించి తనకు తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా యోగేష్, బిగ్ బీని కోరాడు. అలానే అమితాబ్ లవ్ స్టోరిని చెప్పమని అడగడమే కాక భార్య జయా బచ్చన్‌కి ఏవైనా లవ్ లెటర్స్ రాశారా అని ప్రశ్నిస్తాడు యోగేష్. దాంతో అమితాబ్ మరోసారి తన లవ్ స్టోరిని ప్రేక్షకులకు తెలిపారు. అంతేకాక ఇప్పటికి తన భార్య జయా బచ్చన్‌కి లవ్ లటర్స్ రాస్తానని తెలిపి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇక బిగ్‌బీ తన లవ్ స్టోరిని గుర్తు చేసుకుంటూ.. ‘1973లో విడుదలైన జంజీర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దాంతో స్నేహితులతో కలిసి లండన్ ట్రిప్ వెళ్లాలని భావించాను. నాతో పాటు జయా బచ్చన్‌ని కూడా తీసుకెళ్లాలని అనుకున్నాను. మా నాన్న హరివంశరాయ్ బచ్చన్ అనుమతి కోరాను. దానికి ఆయన ముందు మీరిద్దరు వివాహం చేసుకొండి.. ఆ తర్వాత వెళ్లండి అన్నారు. దాంతో ఆ మరుసటి రోజే జయా బచ్చన్‌ని వివాహం చేసుకున్నాను’ అని తెలిపారు. ఇక ఈ షోటో యోగేష్ పాండే 12.50 లక్షల రూపాయల ప్రశ్నకి తప్పు సమాధానం చెప్పి.. 3,20,000 రూపాయలతో ఇంటికి వెళ్లాడు. -
మణివణ్ణన్.. పోలీస్ మన్మథుడు
సాక్షి, చెన్నై: ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే అందమైన యువతుల నంబర్లు సేకరించి ప్రేమ పాఠాలు వళ్లిస్తూ వచ్చిన ఓ సీఐ మన్మథుడి లీల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విచారణలో ఒకటి కాదు, పదుల సంఖ్య మహిళలకు ఈ అధికారి వేధింపులు ఇచ్చి ఉండడంతో బలవంతంగా పదవీ విరమణకు ఆదేశాలు జారీ చేసి ఉండడం వెలుగు చూసింది. (ఎంక్వైరి పేరుతో మహిళకు అర్థరాత్రి ఫోన్) తిరుచ్చి జిల్లా మన్నచ్చనల్లూరు సిరువనూరు పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్గా మణివణ్ణన్ పనిచేస్తున్నారు. పలు స్టేషన్లలో పనిచేసి, ఇక్కడకు వచ్చిన మణివణ్ణన్, తానోమన్మ«థుడు అన్నట్టుగా వ్యవహరించే వారని సమాచారం. స్టేషన్‌కు అందమైన యువతులు, మహిళలు వస్తే చాలు తన గదిలోకి పిలిపించి మరీ వారి విన్నపాలు, ఫిర్యాదులు స్వీకరించే వారు. వారి ఫోన్ నంబర్లను సేకరించి రాత్రుల్లో విచారణ పేరిట మాటలు కలిపి, తర్వాత ప్రేమ పాఠాలు వల్లించే పనిలో పడ్డట్టున్నారు. ఓ యువతిని తన వైపునకు తిప్పుకునేందుకు మణివణ్ణన్ సాగించిన లీల అంతా ఇంతా కాదు. చివరకు ఫిర్యాదు ఇచ్చిన ఆ యువతికి వ్యతిరేకంగానే కేసు నమోదు చేయించేందుకు సిద్ధమయ్యారు. చివరకు విసిగి వేసారిన ఆ యువతి ఏకంగా డీఐజీ బాలకృష్ణన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న ఆడియోను సమర్పించారు. దీనిపై రహస్య విచారణ సాగగా, ఒక్క ఆయువతినే కాదు, అనేక మంది మహిళలు వద్ద, గతంలో తాను పనిచేసిన చోట్ల కూడా ఈ పోలీసు మన్మథుడు సాగించిన లీలలు ఒకటి తర్వాత మరకొటి వెలుగు చూశాయి. బలవంతంగా పదవీ విరమణ.. ఈ పోలీసు మన్మథుడి లీలలు ఆధారాలతో సహా బయట పడడంతో డీఐజీ బాలకృష్ణన్ కఠినంగానే వ్యవహరించారు. ఇతగాడు విధుల్లో కొనసాగిన పక్షంలో ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చే యువతులు, మహిళలకు భద్రత కరువు అవుతుందేమో అన్న ఆందోళనను పరిగణించినట్టున్నారు. ఇక, విధుల్లో మణివణ్ణన్ కొనసాగేందుకు వీలు లేదని ఆదేశిస్తూ, బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు తగ్గ చర్యలు చేపట్టారు. మణివణ్ణన్ పదవీ విరమణ చేయడానికి మరో ఆరేళ్లు సమయం ఉన్నా, ముందుగానే ఆయన చేత బలవంతంగా పదవీ విరమణ చేయించేందుకు సర్వం డీఐజీ సిద్ధం చేసినట్టున్నారు. దీంతో సెలవుపై చెక్కేసిన మణివణ్ణన్ తాజాగా మళ్లీ స్టేషన్లో ప్రత్యేక్షం అయ్యారు. ఇందుకు కారణం, డీఐజీ మార్పు జరగడమే. డీఐజీ మారడంతో తన ఉద్యోగానికి ఇక, డోకా లేదనుకున్న మణివణ్ణన్‌కు పెద్ద షాక్ తప్పలేదు. స్టేషన్‌కు వెళ్లిన ఆయనకు అక్కడి సిబ్బంది డీఐజీగా బాలకృష్ణన్ జారీ చేసి వెళ్లిన ఆదేశాల ఉత్తర్వులను మణివణ్ణన్ చేతిలో పెట్టడం గమనార్హం. -
కరోనా విధుల్లో విద్యార్ధికి ప్రేమ వల..
సాక్షి, చెన్నై: కరోనా కట్టడి విధుల్లో ఉన్న కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ ఒకరు వలంటీరుగా సేవకు వచ్చిన ఓ కళాశాల విద్యార్థినిని ప్రేమ వలలో పడేయడానికి యత్నించాడు. విధుల్ని పక్కన పెట్టి ప్రేమ పాఠాలు వళ్లిస్తూ ఆడియో రూపంలో అడ్డంగా బుక్కైన ఈ అధికారిని సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు.చెన్నై పరిధిలో కరోనా కట్టడి విధుల్లో మైక్రో టీం సేవలు అభినందనీయం. కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య , రెవెన్యూ, పారిశుధ్య కార్మికులే కాదు, వలంటీర్లుగా స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు వార్డుల్లో బృందాలు సేవల్ని అందిస్తున్నారు. ఇంటింటా పరిశీలనతో జ్వరం బారిన పడ్డ వారిని గుర్తించడం, కరోనా బారిన పడి హోం క్వారంటైన్లలో ఉన్న కుటుంబాలకు కావాల్సిన అన్ని రకాల వస్తువులను దరి చేర్చడం, వైద్య సంబంధిత సేవలు అంటూ ఈ బృందాలు పరుగులు తీస్తున్నాయి. ఆదిశగా రాయపురం మండలం పరిధిలోని ప్రాంతాల్ని అసిస్టెంట్ ఇంజివనీర్ కమల కన్నన్ పర్యవేక్షిస్తున్నారు. మన్నడిలో వలంటీర్‌గా కరోనా సేవలో ఉన్న ఓ కళాశాలకు చెందిన విద్యార్థినిపై మనస్సు పడ్డాడు. శ్రీమతి కమలకన్నన్.. ఆమెకు దగ్గరయ్యే దిశగా తన పరిధిలోని చిన్న చిన్న పనుల్ని అప్పగించడం మొదలెట్టాడు. తమ జాబితాలోని ఫోన్ నంబర్ ఆధారంగా ఆ యువతికి దగ్గరయ్యే దిశగా ప్రేమ పాఠాలు వళ్లించే పనిలో పడ్డాడు. టిక్ టాక్‌లో నిన్ను చూసిన క్షణాన....అంటూ మొదలెట్టి...ఆ యువతిని రోజు వేధించడం మొదలెట్టాడు. రెండేళ్ల క్రితం నిన్ను చూసి ఉంటే, ఈ పాటికి శ్రీమతి కమలకన్నన్ అయ్యే దానివి అని, ఆ అదృష్టం లేకుండా పోయిందని, అయినా, మరో చాన్స్ దేవుడు ఇచ్చినట్టుందంటూ ఆ యువతిని వలలో వేసుకునే పనిలో పడ్డాడు. అలాగే, ఏఈ ఉద్యోగం అంటే, అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ర్యాంక్ తనది అని, తన జీతం నెలకు రూ. 78 వేలు అని, దీన్ని బట్టి చూస్తే, ఏ మేరకు సుఖంగా, ఆనందంగా జీవితాన్ని గడపవచ్చో అంటూ ఆశలు రేకెత్తించే వ్యాఖ్యలు చేసినా, ఆ యువతి ఎక్కడా చిక్కలేదు. చివరకు వేధింపులు అన్నది రోజు రోజుకు పెరగడంతో విసిగి వేసారిన ఆ యువతి ఇతగాడ్ని రెడ్ హ్యాండడ్‌గా పట్టించేందుకు సిద్ధమైంది. విధుల్ని పక్కన పెట్టి కమల కన్నన్ ఫోన్లో సాగిస్తున్న లీలల్ని రికార్డు చేసి ఎస్ ప్లనేడ్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఆడిటో సామాజిక మాధ్యమాల్లో నూ వైరల్‌గా మారడంతో కరోనా విధుల్లో కమల కన్నన్ ప్రేమ పాఠాల లీల చర్చకు దారి తీసింది. రేయింబవళ్లు అనేక మంది అధికారులు కరోనా కట్టడిలో శ్రమిస్తుంటే, విధుల్ని పక్కన పెట్టి, సేవకు వచ్చిన యువతిని ముగ్గులో దించేందుకు కమల కన్నన్ సాగించిన లీల కార్పొరేషన్ కమిషనర్ ప్రకాష్ వరకు వెళ్లింది. దీంతో కమలకన్నన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. -
ప్రేమకు నిర్వచనం ‘ప్రేమ లేఖలే’
సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ ప్రేమనే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో సంక్లిష్ట భావోద్వేగ ఆలోచన అంటారు. ఒకప్పుడు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి పాటలు, పద్యాలు, కవిత్వం, ఉత్తరాలు, చిత్రలేఖనం, డైరీలు, గ్రీటింగ్ కార్డులు తోడ్పడ్డాయి. వీటిలో ప్రధాన పాత్ర ఉత్తరాలదే. కాలగమనంలో ప్రముఖుల కాలం తీరిపోయినా వారి ప్రేమ లేఖలకు మాత్రం కాలం చెల్లలేదనే విషయం వేలం పాటల ద్వారా ఇప్పటికీ వెల్లడవుతూనే ఉంది. నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో మెసేజ్‌లు, వాట్సప్‌లు, డేటింగ్ ఆప్‌లు, వీడియోల ద్వారానే కాకుండా స్క్రీన్‌పై ముఖాముఖి చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకునే అవకాశం వచ్చింది. అయితే పరస్పర ప్రేమ వ్యక్తీకరణకు ఓ బలమైన సందర్భం కూడా కావాలి. అలాంటి గొప్ప సందర్భమే ‘వాలంటైన్స్ డే’. అంటే ప్రేమికుల రోజు. రోమన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన ఈ రోజు, కొంతకాలం క్రితం వరకు యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యక్తీకరణకే పరిమితమైంది. గత కొంతకాలంగా తల్లీ తండ్రీ, అన్నా చెల్లీ అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులతోపాటు బంధు, మిత్రులంతా పరస్పరం ప్రేమను వ్యక్తీకరించుకునే పరిపూర్ణ ప్రేమకుల రోజుగా మారింది. ఉత్తర, ప్రత్యుత్తరాల ద్వారా ప్రేమను వ్యక్తీకరించుకోవడం అనేది ఎప్పుడో ప్రారంభమైనా, వాటి స్థానంలో 1913లో ‘హాల్‌మార్క్’ ప్రచురణలతో వాణిజ్యపరంగా ‘వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల’ యుగం ప్రారంభమయింది. ఇప్పుడు డిజిటల్ కార్డులు కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా ప్రేమ వ్యక్తీకరణకు ప్రేమ లేఖలే ఇప్పటికీ ఉత్తమమైనవని చరిత్రకారుల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ చెబుతున్నారు. పెన్ను పట్టుకొని ప్రేమ లేఖలు రాస్తున్నప్పుడు భావోద్వేగం వల్ల మెదడులో కలిగే ప్రకంపనల అనుభూతి ఎంత మాధుర్యంగా ఉంటుందో, అది చదివే వారికి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. అందమైన పియానో సంగీతం వినాలన్నా చేతులు, చేతి వేళ్లే కదలాలి. సర్జరీలో వైద్యుడికి చేతులు ఎంత ముఖ్యమో, పర్వతారోహకుడికి అవి అంతే ముఖ్యం. అందమైన బొమ్మ గీయాలన్నా, భరత నాట్యం చేయాలన్నా చేతుల కదలిక ఎంతో ముఖ్యం. పెన్ను పట్టాలన్నా చేతులే ముఖ్యం. అంటే చేతికి, మెదడుకు అవినాభావ సంబంధం ఉందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మానవ పరిణామ క్రమంలో చేతులకున్న ప్రాధాన్యతను ‘ది హ్యాండ్’ అనే పుస్తకంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ ఫ్రాంక్ ఆర్. విల్సన్ తెలియజేశారు. చేతుల కదలికతో మెదడులో న్యూరాన్లు సర్కులేట్ అవుతాయట. అందుకేనేమో గొప్ప నవలా రచయితల నుంచి చిన్న కథా రచయితల వరకు, సినిమా కథా రచయితల నుంచి సినీ గేయ రచయితల వరకు చేతిలో పెన్ను పట్టుకుని రాయడానికే నేటికి ఇష్ట పడుతున్నారు. కాగితం, కలం పట్టనిదే ఆలోచనే రాదనే మేధావులు కూడా ఉన్నారు. -
నానమ్మకు మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో
-
'మేమిచ్చిన ఉత్తమ కానుక ఇదేనేమో'
ప్రపంచంలో ఎక్కడైనా భార్యభర్తల మధ్య ఉండే అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియోలో ఒక బామ్మకు ఆమె కుటుంబసభ్యులు ఒక గిఫ్ట్‌బాక్స్‌ను కానుకగా ఇచ్చారు. ఆమె బాక్స్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఆ బాక్స్‌లో ఉన్నవి ఏంటో తెలుసా.. తన భర్త ఆమెకు రాసిన ప్రేమ ఉత్తరాలు. అందుకే మనల్ని ప్రేమించేవారు దూరమైనా మనకంటూ కొన్ని జ్ఞాపకాలను విడిచి వెళ్లిపోతారని ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. 'మా తాతయ్య చనిపోయి 7నెలలు అవుతుంది. అయితే తాతయ్య లేకుండా మొదటిసారి నానమ్మ జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగ కావడంతో తనకు ఏదైనా మరిచిపోలేని కానుకను ఇవ్వాలనుకున్నా. మా నానమ్మ, తాతయ్యలది ప్రేమవివాహం. కాగా మా తాతయ్య 1962లో వారి కాలేజ్ డేస్‌లో నానమ్మకు రాసిన ప్రేమలేఖలు మాకు దొరికాయి. కానీ ఆ ప్రేమలేఖలను మా తాతయ్య చనిపోయేవరకు తన దగ్గరే భద్రపరచుకున్నారు. వీటిని ఒక కానుక రూపంలో మా నానమ్మకు అందజేయగానే ఆమె బావోద్వేగానికి గురవడం నేను చూశాను. దీంతో నానమ్మకు నేనిచ్చిన ఉత్తమ కానుక ఇదే కావొచ్చు' అంటూ ట్వీట్ చేసింది. ఈ వీడియోనూ కాస్తా ఆమె తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 16 మిలియన్ల మంది వీక్షించారు. 'నేను చూసిన వీడియోల్లో ఇది నా హృదయాన్ని కదిలించింది' అంటూ ఒకరు ట్వీట్ చేశారు. 'మీ నానమ్మ ఎప్పుడూ ఇంతే సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నట్లు పలువురు కామెంట్లు పెట్టారు. -
‘ఆడపిల్లలు ఎందుకు ఏడుస్తారో అర్థమవుతోంది!’
‘‘ఈ ప్రేమ వ్యవహారం చాలా హాస్యాస్పదమైనది. నేను నిర్మించుకున్న ప్రశాంతమైన వాతావరణాన్ని ధ్వంసం చేసి, నాలో కల్లోలాన్ని రేపుతోంది. చాలా బాధగా కూడా ఉంది. నాకిప్పుడు అర్థమవుతోంది! పెళ్లి సమయాల్లో ఆడపిల్లలు ఎందుకు ఏడుస్తారో.. నువ్వేంటో నాకు తెలుసు! అందుకే నువ్వంటే నాకిష్టం. ’’ తన చేతిలోని ప్రేమలేఖలో ఉన్న వ్యాఖ్యాలను చదవగానే సోన్య బెర్తిన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. గుండె కొద్దిగా బరువెక్కింది. ఆ లేఖ ఆమె కోసం రాసింది కాదు! ఆమెకు సంబంధించి అసలే కాదు. ఆమె పుట్టక చాలా ఏళ్ల ముందుదా లేఖ. కెనడా.. విన్నీపెగ్లోని ‘‘పారిస్ బిల్డింగ్’’ అనే ఓ పురాతన భవనంలో దొరికిందది. భవనాన్ని కొత్తగా తీర్చిదిద్దుతున్న సమయంలో ఓ ఫైల్లో దానితో పాటు మరికొన్ని ప్రేమ లేఖలు కూడా ఆమెకు దొరికాయి. ఆ ఫైల్‌ను తెరిచి లేఖలను చదివితే కానీ తెలియలేదు! అవి ఎంత విలువైనవో. 1918, 1919 సంవత్సరాలలో విన్నీ పెగ్లోని తన ప్రియురాలు రెబెక్కాకు సోకో అనే ఓ యద్ధ సైనికుడు రాసిన ప్రేమ లేఖలు అతడి మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. సోన్య బెర్తిన్, రోస్ మెకైలే ఆ లేఖలో వారు ప్రేమించుకున్నట్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఏమైంది? అన్న ప్రశ్న ఆమె మెదడును పురుగులా తొలుచసాగింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ లేఖలో ఉన్న వారికోసం అన్వేషణ ప్రారంభించింది. ఎలాగైతేనేం కొన్ని నెలల నిరంతర శ్రమ తర్వాత ఆ లేఖలు రాసిన వ్యక్తిని కనుగొంది. వందేళ్ల నాటి ఆ ప్రేమ లేఖలు విన్నిపెగ్‌కు చెందిన హైమన్ సోకోలోవ్ అనే ప్రముఖ లాయర్, జర్నలిస్టువని. అతడు రెబెక్కాను పెళ్లి చేసుకున్నాడని, వారికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారని తెలిసి చాలా సంతోషించింది. సోకో, రెబెక్కాలు ప్రాణాలతో లేకపోయినప్పటికి ఆ లేఖలను వారి కుటుంబానికి తిరిగిచ్చేందుకు నిర్ణయించుకుంది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రియురాలికి లేఖ రాసి ప్రియుడి ఆత్మహత్య
అన్నానగర్: ప్రేమించిన యువతికి ద్రోహం చేశానని, అందుకు తనను క్షమించాలని కోరుతూ ప్రియుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఈరోడ్ సమీపంలో సోమవారం జరిగింది. వివరాలు.. ఈరోడ్ సమీపం కాలింగరాయన్ కాలువ బ్రిడ్జ్‌కి సమీపంలోని పట్టాలపై సోమవారం ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు ఈరోడ్ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ 35 ఏళ్ల వయసున్న ఓ యువకుడి మృతదేహం పడి ఉంది. యువకుడి ప్యాంట్ ప్యాకెట్లో ఓ లేఖ ఉంది. అందులో ‘తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు, ఆ అమ్మాయికి ద్రోహం చేసినట్లుగా తెలిపి, క్షమాపణ కోరాడు. వచ్చే జన్మలో ఆ మహిళకి బిడ్డగా పుడతాను. నా చావుకి ఎవరు కారణం కాదు. అమ్మా నన్ను క్షమించు’అని రాసి ఉంది. ఆ లేఖ ఆధారంగా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
మీ ప్రేమకు.. మా ప్రపోజ్
ప్రేమించడం అందరూ చేస్తారు.. కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచేది మాత్రం కొందరే. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటానికి ఉండే సిగ్గు.. భయం.. మొహమాటం.. ఏమంటారో అనే సందేహం.. ఇలా ఏదైనా కావచ్చు.. కొన్ని ప్రేమలు చూపులతో ప్రారంభమై.. చూపులతోనే ఆగిపోతాయి. ఇలాంటి వారి కోసమే జపాన్‌లోని ‘కొకునావీ’ అనే కంపెనీ మేమున్నాం మీకోసం అంటోంది. మీ ప్రేమను మీ తరఫున మేము ప్రపోజ్ చేస్తామంటోంది. మీ ప్రేమ భావాలకు మరింత మెరుగులు దిద్ది.. కవితలుగా మార్చి మీరు ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తామని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే స్నేహితులకు ప్రేమ లేఖలు ఇచ్చి ప్రేయసి/ప్రియుడికి ఇవ్వమని పంపే విషయం గుర్తుకు వస్తుంది కదూ.. ఇది కూడా అలాంటిదే. కానీ ఇదంతా కొకునావీ ఊరికే ఏం చేయదు. కొంత చార్జ్ చేస్తుంది. ఇలా ప్రపోజ్ చేయడానికి 3 రకాల ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయి వారి దగ్గర. తక్కువ ఖర్చుతో.. సింపుల్‌గా చెప్పాలనుకునే వారికి బేసిక్ ప్లాన్ సరిపోతుందట. ఇక ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారికి కొకునావీ సపోర్ట్ ప్లాన్ సరిగ్గా సూట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరో ప్యాకేజ్ కూడా ఉంది. మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలంటే ఈ ప్యాక్ తీసుకోవాల్సిందేనని చెబుతోంది. ఈ ప్యాక్‌లో భాగంగా ఎలా ప్రేమను ప్రపోజ్ చేస్తే ఇష్టపడతారు.. గతంలో లవ్ సక్సెస్ అయిన సందర్భాలు.. ప్రేమ లేఖలో ఎలాంటి కవితలు ఉండాలి.. తదితర విషయాలని డేటా ఎనాలసిస్ సాంకేతికతను ఉపయోగించి ఓ అందమైన ప్రపోజల్‌ను మీ ప్రేయసి/ప్రియుడి ముందు ఉంచుతారు. ఇప్పటికే కొకునావీ సహాయంతో చాలా మంది ఒక్కటయ్యారు. జపాన్‌లో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందడంతో కంపెనీకి బాగా పేరొచ్చింది. -
అమ్మానాన్న.. వందల ప్రేమలేఖలు!
వకుళానాయక్ చిత్రకారిణి. అందమైన భావం ఆమె కుంచె నుంచి అద్భుతంగా ఆవిష్కారమవుతుంది. వాస్తవికతకు గీతల్లో రూపమిస్తుంది. ‘ఇది చిత్రకారులందరూ చేసే పనే కదా! కొత్తగా ఏదైనా చేయాలి’ అని వకుళానాయక్ అనుకుంటుండగా.. ఆ అన్వేషణలో యాదృచ్ఛికంగా జరిగిందో సంఘటన. వాళ్ల నాన్నగారు, వాళ్ల అమ్మకు రాసిన ప్రేమలేఖలు వకుళానాయక్ కంటపడ్డాయి. ఆయన ఉత్తరాల్లోని భావుకత, అక్షరాల్లో ఒలికించిన ప్రేమ భావం గొప్పగా ఉన్నాయి. ప్రతి ఉత్తరాన్ని క్షుణ్నంగా చదివారామె. ఆ ఉత్తరంలో వ్యక్తమైన భావానికి రూపమిచ్చారు. అలా ఆమె వేసిన బొమ్మలతో బెంగుళూరులో ప్రదర్శన కూడా పెట్టారామె. భావాల బొమ్మలు నీటి ఉపరితలం మీద పడవ ప్రయాణిస్తుంటుంది. రెండు చేపలు నీటి లోపల ఈదుతూ ఒకదానికొకటి ఎదురుపడతాయి. ఆరాధనాభావంతో చూసుకుంటూ ఉంటాయి. పడవలో నుంచి ఒక ఎర చేపల మధ్య వేళ్లాడుతూ ఉంటుంది. ఆ ఎరకు కొసన ప్రేమచిహ్నం ఉంటుంది. మరో చిత్రంలో ఒక రాకెట్ ఆకాశం నుంచి నేల వైపు పయనిస్తుంటుంది. అందులో ఉన్న వ్యక్తి చేతిలో ఒక జెండా. ఆ జెండా మీద ప్రేమ చిహ్నంగా ఎర్రటి హృదయం బొమ్మ. మరో చిత్రంలో ప్రేమగా ముక్కులు రాసుకుంటున్న రెండు రామచిలుకలు. ఇంకో చిత్రంలో రెండు గోరువంకల మధ్య ఫోన్ రిసీవర్ వేళ్లాడుతూ ఉంటుంది. రెండు ప్రేమ పక్షులు చెరొక కాఫీ కప్పులో కూర్చుని ఒకదానిని మరొకటి చూసుకుంటుంటాయి. రోజుకో ప్రేమలేఖ! ‘‘మా అమ్మానాన్న ఉద్యోగరీత్యా చాలా కాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. ఎప్పుడో ముఖ్యమైన సందర్భాల్లో తప్ప తరచూ కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన మా అమ్మకు తరచూ ఉత్తరాలు రాసేవాడు. కొన్ని ఉత్తరాల మీద తేదీలను చూస్తే రోజుకొక ఉత్తరం రాసిన రోజులూ ఉన్నాయి వాళ్ల జీవితంలో. ఇప్పటిలా ఫోన్లు ఉన్న రోజులు కావవి. టెలిఫోన్ ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ‘ఫలానా రోజు ఫోన్ చేస్తాను’ అనే సంగతి కూడా ఉత్తరంలో సమాచారం ఇచ్చుకోవాల్సిన రోజులవి. అప్పుడు వారి మధ్య దూరాన్ని తగ్గించిన నేస్తాలా ఉత్తరాలు. అందులో ఆయన రాసిన విషయాలకు నేను బొమ్మలు వేశాను. నాన్న పోయాక ఆయన వస్తువులు చూస్తున్నప్పుడు ఈ ఉత్తరాలు దొరికాయి’’ అని వివరించారు వకుళా నాయక్. ఉత్తరాలే కాదు ఏ రకమైన పాత కాగితం కనిపించినా దానికి నప్పే బొమ్మ వేసి ఆ బొమ్మలో ఈ కాగితాన్ని ఇమడ్చడం ఆమె ప్రత్యేకత. పాత దస్తావేజులు, సరుకులు కొన్న చీటీలు, సంగీతం నోట్స్... ఏదైనా సరే... ఆ కాన్సెప్ట్‌కు తగినట్లు బొమ్మ వేసి ఒక డెకరేటివ్ పీస్‌గా మారుస్తారు వకుళ. ఈ ఆర్ట్‌ను వింటేజ్ లవ్ లెటర్స్ ఎగ్జిబిషన్ అంటారు. – మంజీర -
ప్రేమలేఖలు రాసే ఏజ్‌లో ఎన్నో కష్టాలుపడ్డా: నటి
ముంబై: ‘ప్రేమలేఖలు రాస్తూ.. ప్రేమలో గుడ్డిగా విహరించాల్సిన వయస్సులోనే నేను ఎన్నో కష్టాలు పడ్డాను’ అంటున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తాజాగా ఓ టీవీ చానెల్లో ప్రసారమయ్యే ‘అనుపమ్ ఖేర్స్ పీపుల్’ షోలో మాట్లాడారు. ‘అమ్మాయిలు ప్రేమలేఖలు రాస్తూ.. ప్రేమలో విహరించే సమయంలో నేను ఎంతో కష్టపడ్డాను. సుదీర్ఘంగా పనిచేయాల్సి వచ్చేది. మహేశ్ భట్ లాంటి మేధావులు, సామాజికవేత్తలతో కలిసి కూచొని పని చేయాల్సి వచ్చేది. మీరొక టీనేజర్‌గా ఉండి అంతటివారితో కూర్చున్నప్పుడు ఏమీ మాట్లాడే వీలుండదు’ అని ఆమె చెప్పారు. ‘చిన్న వయస్సులోనే ఇంటి నుంచి వచ్చేయడంతో అందరి పిల్లలాగా నాకు ఆడుకునే వీలుగా చిక్కలేదు. టీనేజర్‌గా ఉండగానే నాకు కష్టాలు ఎదురయ్యాయి. సెట్స్‌లో పనిచేయాల్సి వచ్చింది. 17 ఏళ్ల వయస్సులోనే జీవన్మరణ సమస్యలు ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఎప్పుడూ తిరుగుబాటుతత్వమే’ అని ఆమె తెలిపింది. కరణ్ జోహర్ షో ‘కాఫీ విత్ కరణ్’లో బాలీవుడ్లో ఆశ్రితపక్షపాతం గురించి బోల్డ్‌గా స్పందించడంపైనా ఆమె మాట్లాడారు. ఈ చర్చ వల్ల తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని, తాను సొంతంగా ప్రొడక్షన్‌హౌస్ ప్రారంభించి స్వయంగా నిలదొక్కుకునే దశలో ఉన్నానని ఆమె చెప్పారు. -
ఐరన్ ఇరోమ్
ఈ నెల రెండో తేదీన ఆమెను మళ్లీ అరెస్టు చేశారు. ప్రస్తుత దేశ పరిణామాల మీద, ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల మీద వ్యాఖ్యానాలతో, విమర్శలతో తలమునకలై ఉన్న జాతీయ మీడియా ఆమె అరెస్టు సంగతి పూర్తిగా మరచిపోయినట్టుంది! ఇంఫాల్లోనే చరిత్రాత్మక షామిద్ మినార్ దగ్గర ఈ నెల 1న ఆమె మళ్లీ నిరాహార దీక్ష ఆరంభించినట్టు ప్రకటించారు. మరునాడే అరెస్టు చేశారు. ఇరోమ్ చాను షర్మిల. పూర్తిగా పదిహేను సంవత్సరాల నుంచి అకుంఠిత నిరాహార దీక్షలో ఉన్న ‘మణిపూర్ ఉక్కు మహిళ’. ఈ దీక్షలో నోటి నుంచి మంచినీటి చుక్క కూడా తీసుకోలేదు. కానీ పన్నెండు రోజుల నిరాహార దీక్ష చేసిన అన్నా హజారేకు మరో గాంధీజీగా దేశంలో ఖ్యాతి వచ్చింది. అవినీతి మీద కత్తి కట్టిన వీరునిగా బిరుదులు, ప్రశంసలు వర్షించాయి. కారణం- ఆయన దేశ రాజధానిలో పెద్ద దీక్షా శిబిరం నిర్మించుకుని, వేలాదిమంది సమక్షంలో దీక్ష సాగించారు. మొత్తం మీడియా దృష్టి కేంద్రీకరించింది. మరి షర్మిల! విసిరేసినట్టుండే ఈశాన్య భారతంలో, మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంటారు. నిజానికి ఆమె కోసం జైలుగా మారిన వార్డు అది. త ను ఎంతో ఆరాధించే నెల్సన్ మండేలా బొమ్మను ఎదురుగా గోడకు తగిలించుకున్నారామె. దీక్ష.. అరెస్టు, దీక్ష.. అరెస్టు చిత్రం ఏమిటంటే, 2006లో షర్మిల దేశ రాజధానిలో దీక్ష చేశారు. గాంధీజీ సమాధిని సందర్శించి వచ్చి ఆమె దీక్షలో కూర్చున్నారు. కానీ వెంటనే అరెస్టయ్యారు. ఈ ఘట్టం కూడా పెద్ద ప్రాధాన్యం సంతరించుకోలేదు. తరువాత మళ్లీ ఇంఫాల్ వెళ్లి అక్కడే దీక్ష చేయడానికి ఆమె ఉపక్రమించారు. ఎక్కడ ఉన్నా నిత్య నిర్బంధం. ప్రతి మూడు వారాలకు ఒకసారి కోర్టు బోనులో నిలబడి రావడం, మళ్లీ ఆస్పత్రి వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉండడం-ఇదే కథ. భారత ప్రభుత్వ వైఖరికి నిరసగా ఆమె ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రపంచంలోనే సుదీర్ఘ నిరశన వ్రతమది. కానీ మణిపూర్ ప్రభుత్వం ఆమెను బతికిస్తోంది, నిమ్మరసం ఇచ్చి కాదు, నాసోగాస్ట్రిక్ ఇన్‌ట్యూబేషన్ పద్ధతిలో. అంటే ముక్కులో నుంచి గొట్టం అమర్చి ఆహారం, ఇతర ఔషధాలు పంపిస్తారు. కోర్టు విధించిన శిక్షాకాలం పూర్తవుతుంది. ఆమె కోసం జైలుగా మారిన ఆ వార్డు నుంచి విడుదలవుతారు షర్మిల. అదే ఆస్పత్రికి ఎదురుగా ఆమె అభిమానులు నిర్మించిన ఒక వెదురు శిబిరంలో కొన్ని గంటలు గడుపుతారు. నిజానికి ఆ ఆస్పత్రికి కొద్దిదూరంలోనే ఆమె కుటుంబం నివసిస్తున్నది. కొద్దిసేపటికి మళ్లీ దీక్ష ఆరంభమవుతుంది. మళ్లీ అరెస్టు చేస్తారు. గడచిన పదిహేనేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ‘అఫ్స్పా’ రద్దు కోసమే దీక్ష ‘అఫ్స్పా’ (బాక్స్ చూడండి) సాయుధ బలగాలు తన కంటి ఎదుట జరిపిన ఒక రక్తపాతానికి నిరసనగానే షర్మిల ఈ నిరాహార దీక్ష ఆరంభించారు. నవంబర్ 2, 2000 సంవత్సరం. తన మత విశ్వాసాల మేరకు ఉపవాసం చేస్తున్న షర్మిల ఆ రోజు హక్కుల కార్యకర్తగా ఒక ఊరేగింపులో పాల్గొనడం కోసం మాలోం అనే చిన్న పట్టణంలోని ఒక బస్టాప్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇది మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు సమీపంలోనే ఉంది కూడా. ఏదో పల్లె నుంచి వచ్చిన కొందరు కార్యకర్తలు ఒక నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత అక్కడే పెద్ద శబ్దం వినిపించింది. అది వేర్పాటువాదులు విసిరిన బాంబు పేలుడు. అంతే అస్సాం రైఫిల్స్ (పారా మిలటరీ) రంగంలోకి దిగి కాల్పులు జరిపింది. అక్కడికక్కడ పదిమంది చనిపోయారు. ఇందులో 62 ఏళ్ల లెసాంగ్బమ్ ఐబెటోమీ అనే మహిళతో పాటు, 18 సంవత్సరాల సినాం చంద్రమణి కూడా ఉన్నాడు. ఇతడు 1988లో సాహసబాలుడు అవార్డు అందుకున్నాడు. ఇదంతా ఆ బస్టాండ్ దగ్గరే, షర్మిల కళ్ల ఎదుటే జరిగింది. తరువాత సాయుధులు ఊరి మీద పడి బాంబు విసిరిన ఉగ్రవాదులు ఎవరో చెప్పమంటూ కనిపించిన ప్రతివారి మీద జులుం ప్రద ర్శించారు. దీనినే మాలోం ఊచకోత అంటారు. ఇది జరిగిన రెండు రోజుల తరువాత షర్మిల నిరాహార దీక్ష ఆరంభించారు. అదే ఆమె గొప్పదనం! ఇంతటి వివాదాస్పద ప్రత్యేక అధికారాల చట్టాన్ని రాష్ట్రంలో ఎత్తివేస్తారని షర్మిల విశ్వసించడంలోనే ఆమె గొప్పతనం కనిపిస్తుంది. మరి ‘అఫస్పా’ను ఎత్తివేస్తే.. ఉగ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాల మాటేమిటి? దీనికి షర్మిల ఇచ్చిన వివరణ (వాల్‌స్ట్రీట్ జర్నల్, జనవరి 7, 2015) ఎంతో హృద్యంగా ఉంటుంది. ‘‘నేను ఆయుధాలను పక్కన పెట్టాలని కోరుకుంటున్నాను. సమాజంలో మెరుగైన పరిస్థితికీ, పురోగతికీ మార్పు అవసరమే. కానీ ఆయుధాల ప్రమేయం లేని విప్లవాలు కావాలి. ప్రేమ, దయ ఉండే విప్లవాలు రావాలి. ఈ మధ్య (నవంబర్ 30, 2015) భారత ప్రధాని నరేంద్ర మోదీ (సాంగై అనే జానపద ఉత్సవం ముగింపు ఉత్సవం కోసం) ఇంఫాల్ వచ్చారు. ఆయన నన్ను చూసి వెళతారని ఆశించాను. కానీ అది కలగానే మిగిలిపోయింది. ఆయన వచ్చి ఉంటే ఒక విషయం స్పష్టం చేయాలన్నదే నా కోరిక. మీరు వివాదాస్పద చట్టాన్ని ఎత్తి వేస్తే, మీ పర్యటన పట్ల వేర్పాటువాదులకు ఉన్న దృక్పథం మారిపోతుంది అని చెప్పాలని అనుకున్నాను. ఆయనను ఒప్పించాలని అనుకున్నాను’’. ఈ రాక్షస చట్టాన్ని ఏదో ఒకరోజున భారత ప్రభుత్వం రద్దు చేస్తుందనే ఇప్పటికీ షర్మిల నమ్ముతున్నారు. అందుకే మళ్లీ దీక్ష ఆరంభించారు. ఎంతైనా ఆమె ఉక్కు మహిళ. శాంతి పరిమళాన్ని వెదజల్లుతాను నేను పుట్టిన కాంగ్లీ నుంచి రాబోయే యుగాలలో ఆ పరిమళం ప్రపంచమంతా విస్తరిస్తుంది (షర్మిల కవిత). - డాక్టర్ గోపరాజు నారాయణరావు ఉక్కు మహిళ ప్రేమలేఖలు దీక్ష ప్రారంభించే సమయానికి షర్మిల వయసు 28 సంవత్సరాలు. వివాహం కాలేదు. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ పత్రిక ఇంటర్వ్యూలో షర్మిల కొన్ని ‘లలిత’మైన విషయాలు వెల్లడించారు. ‘సాధారణ జీవితంలో మళ్లీ ప్రవేశించాలని ఉంది. తల్లిని కావాలని కూడా కోరిక ఉంది. జీవితంలో ఉండే అన్ని దశలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ఇంకా విస్తుగొలిపే విషయం - ఈ ఉక్కు మహిళ ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిలే (సెప్టెంబర్ 5, 2011, ది టెలిగ్రాఫ్) అంగీకరించారు. గోవాలో పుట్టి ప్రస్తుతం బ్రిటిష్ పౌరుడిగా ఉన్న డెస్మాండ్ కాతిన్హో తన మీద మనసు పడిన సంగతిని ఎలాంటి సంకోచం లేకుండా షర్మిల వెల్లడించారు. తాను కూడా అతడితో ప్రేమలో పడ్డానని కూడా చెప్పారు. డెస్మాండ్ కూడా షర్మిల మాదిరిగానే హక్కుల కార్యకర్త, రచయిత కావడం విశేషం. అతడి వయసు 48 ఏళ్లు. షర్మిల వయసు (మార్చి 14,1972. ఇంఫాల్ దగ్గరే కొంగ్పాల్ అనే చోట పుట్టారామె) 44 సంవత్సరాలు. ఇద్దరి మధ్య ఉత్తరాలు సాగాయి. షర్మిల వ్యతిరేకిస్తున్న చట్టం... అఫ్స్పా మణిపూర్- మైన్మార్ సరిహద్దులలో రెండున్నర కోట్ల జనాభా పైబడిన రాష్ట్రం. ఈ ఈశాన్య భారత రాష్ట్రంలోని సమస్యలే షర్మిల చేత ఇంత కఠోరమైన దీక్షకు పూనుకునేటట్టు చేశాయి. ఈ సమస్య మణిపూర్‌కు మాత్రమే కాదు, సెవెన్ సిస్టర్స్‌గా చెప్పే మిగిలిన ఈశాన్య భారత రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. మణిపూర్ అక్టోబర్ 15, 1949న భారత యూనియన్‌లో విలీనమైంది. 1972లో పూర్తి స్థాయి రాష్ట్రంగా ఆవిర్భవించింది. అంతకు రెండు సంవత్సరాల ముందు నుంచే ఇక్కడి సామాజిక పరిస్థితులు అవాంఛనీయంగా మారిపోయాయి. నిరుద్యోగం పెద్ద సమస్య. పక్కనే ఉన్న మైన్మార్ నుంచి దిగుమతయ్యే మత్తు పదార్థాలు యువతను పూర్తిగా నిర్వీర్యం చేసేశాయి. భారత్‌లో విలీనం, పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరించడం అనే పరిణామంలో సామాజిక అంతరాలు, ఘర్షణలు వేర్పాటువాద ఉద్యమాలకు దారి తీశాయి. ఇక్కడ మితీస్ తెగవారు యాభయ్ శాతం ఉన్నారు. కానీ వీరంతా కలిపి పదిశాతం భూభాగంలోనే ఉండిపోయారు. వీరు భారతదేశ ప్రధాన స్రవంతితో కలసిపోవాలని కోరుతున్నవారు. ఇంకా నాగాలు, కుకీలు, రాల్టెస్, గాంగ్టెస్, హమర్స్ వంటి గిరిజన తెగులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ తెగలు దాదాపు ముప్పయ్. వీరందరికీ సంబంధించిన ఉగ్రవాద, వేర్పాటువాద సంస్థలే యూఎన్సీఎఫ్, పీఎల్ఏ, ప్రెపాక్, కేసీపీ, పీఆర్ఏ, ఎన్ఎస్సీఎన్ -ఐఎమ్, కేఎన్‌ఎఫ్ మొదలైనవి. అక్కడి అల్లర్లు, ఆందోళనలు అన్నీ గిరిజన తెగల మధ్య సంఘర్షణలే. రాష్ట్రంలో రోజురోజుకీ హింసాత్మక ధోరణి పెరిగిపోవడంతో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం- 1958 (అఫ్స్పా)ని మణిపూర్‌లో కూడా 1980 నుంచి అమలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ 2005 నుంచి 2015 మధ్య 5,500 రాజకీయ హత్యలు జరిగాయంటేనే తీవ్రతను గమనించవచ్చు. ఈ చట్టాన్ని సంక్షుభిత ప్రాంతాలలో అమలు చేస్తారు. అక్కడి పరిస్థితిని అదుపు చేయడానికి సాయుధ బలగాలు దిగుతాయి. వీరికి అసాధారణమైన అధికారాలు కల్పిస్తుందీ చట్టం. ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. ఎవరి ఇంటినైనా సోదా చేయవచ్చు. కారణం అవసరం లేదు. వారెంట్ అడిగే హక్కు లేదు. ఎక్కడ అఫ్స్పా అమలులో ఉన్నా కచ్చితంగా వచ్చే విమర్శ - అత్యాచారాలు. ముఖ్యంగా అమాయకుల మీద జులుం. లేదా స్త్రీల మీద లైంగిక అత్యాచారాలు. వీటిని నిరోధించడానికే ఈ చట్టాన్ని రద్దు చేయమని షర్మిల పదిహేనేళ్లుగా పోరాడుతున్నారు. మహిళల నగ్న ప్రదర్శన జూలై 11, 2004న అస్సాం రైఫిల్స్ దళాలు తంగజం మనోరమాదేవి అనే 32 ఏళ్ల మహిళను ఇంఫాల్లోనే ఆమె ఇంటిలో అరెస్టు చేసి తీసుకువెళ్లాయి. మరునాడు వేకువన, ఆమె ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో శవమై కనిపించింది. ఒళ్లంతా తూటాలతో జల్లెడైపోయి ఉంది. ఆమెను తామే కాల్చామనీ, పారిపోతుండగా ఎన్కౌంటర్ చేయవలసి వచ్చిందని దళాలు వివరణ ఇచ్చాయి. కానీ ఆమెను లైంగికంగా హింసించి తరువాత కాల్చి చంపారని కుటుంబ సభ్యులు, ఆమె సహ ఉద్యమకారులు ఆరోపించారు. అందుకు నిరసనగా జూలై 15న నలభయ్ నుంచి యాభయ్ ఏళ్లు ఉన్న దాదాపు డజను మంది మహిళలు పూర్తి నగ్నంగా ఇంఫాల్‌లోని కాంగ్లా భవంతి (అస్సాం రైఫిల్స్ బస చేసిన భవంతి) ముందు ప్రదర్శన చేశారు. ‘భారత సైనికులారా! మమ్మల్ని రేప్ చేయండి!’ అంటూ ఎర్రటి అక్షరాలు రాసిన బ్యానర్‌తో ఆ మహిళలు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇది ఎంత ప్రభావం చూపిందంటే, ‘అఫ్స్పా’. చట్టం ఎత్తివేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి సిఫార్సు చేయడానికి బీపీ జీవన్‌రెడ్డి నాయకత్వాన మన్మోహన్సింగ్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 2005లోనే ఆయన నివేదిక ఇచ్చి, ఈ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేయవచ్చునని నిర్ద్వంద్వంగా చెప్పారు. కానీ ఈ పరిణామంతో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుందనీ, అది బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందన్న భయంతో, సైనికాధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగాను ఆ సిఫార్సును అమలు చేయలేదు. అయినప్పటికీ షర్మిల తన దృఢ సంకల్పాన్ని విడిచిపెట్టక పోవడం గమనించక తప్పదు. -
విద్యార్థినికి ప్రేమలేఖలు
ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగింపు ఈఓ మోత్కూరు(నల్గొండ జిల్లా): విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా ప్రోత్సహించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినికి ప్రేమ లేఖలు రాసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం అడ్డగూడూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడేళ్లుగా ఆర్డ్స్ అండ్ క్రాఫ్స్ టీచర్‌గా పనిచేస్తున్న గూడెపు పరమేశ్ అదే పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తనను ప్రేమించాలంటూ ప్రేమ లేఖలు రాశాడు. గతంలో ప్రేమ లేఖలు రాసిన సందర్భంలో పరమేశ్‌ను ప్రధానోపాధ్యాయుడు మందలించాడు. అయినా అతని ప్రవర్తనలో మార్పులేదు. గత 15 రోజుల్లో రెండుసార్లు విద్యార్థినికి ప్రేమలేఖలు రాశాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో వారు ఉపాధ్యాయుడిపై ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదుచేశాడు. డీఈఓ ఆదేశాల మేరకు ఎంఈఓ విచారణ జరిపారు. అనంతరం ప్రేమ లేఖలు రాసిన ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంఈఓ అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు అనంతరెడ్డి తెలిపారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు. -
లవ్వు బువ్వ
లవ్ లెటర్స్ కావలసినవి: మైదా పిండి - 2 కప్పులు; పంచదార - అర కప్పు; ఉప్పు - టీ స్పూను; బటర్ - కప్పు; నిమ్మతొక్కల తురుము - 2 టీ స్పూన్లు; కమలాపండు తొక్కల తురుము - టేబుల్ స్పూను; సోర్ క్రీమ్ - అర కప్పు; చెర్రీ ముక్కలు - కప్పు; పంచదార పొడి - 4 టీ స్పూన్లు తయారీ: 475 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ఒక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు వేసి కలపాలి బటర్, నిమ్మతొక్కల తురుము, కమలాపండ్ల తొక్కల తురుము వేసి బాగా కలపాలి సోర్ క్రీమ్‌ను గిలక్కొట్టి జత చేయాలి అన్నీ బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేయాలి ఒక్కో ఉండను ఒత్తి, ఎన్వలప్ కవర్లా మడిచి, మధ్య భాగంలో చెర్రీ ఉంచాలి బేకింగ్ షీట్ మీద ఒక్కో కవరును జాగ్రత్తగా ఉంచాలి పై భాగం మీద నీళ్లను బ్రష్ చేసి, పంచదార చల్లి, సుమారు ఎనిమిది నిమిషాలు బేక్ చేసి తీసేయాలి. స్వీట్ హార్ట్ కావలసినవి: వైట్ కేక్ మిక్స్ - ఒక ప్యాకెట్; నీళ్లు - 1 + 1/4 కప్పులు; వెజిటబుల్ ఆయిల్ - 1/3 కప్పు; కోడిగుడ్లు - 3 (తెల్ల సొన మాత్రమే వాడాలి); రెడ్ ఫుడ్ కలర్ - 8 చుక్కలు; రాస్ప్బెర్రీ క్యాండీ ఆయిల్ - 2 చుక్కలు తయారీ: అవెన్‌ను 350 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి మఫిన్ టిన్‌లో పేపర్ కప్ కేక్ లైనర్లు ఉంచాలి ఒక పాత్రలో కేక్ మిక్స్, నీళ్లు, వెజిటబుల్ ఆయిల్, కోడిగుడ్ల తెల్ల సొన వేసి బాగా గిలక్కొట్టాలి కప్ కేక్‌లో మూడు వంతుల మిశ్రమం వే సి పక్కన ఉంచాలి మిగిలిన మిశ్రమంలో నాలుగు చుక్కల రెడ్ ఫుడ్ కలర్ వేసి కలిపాక, రాస్ప్బె ర్రీ ఆయిల్ వేసి, 1/3 వంతు మిశ్రమంలో పింక్ రంగు మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో వేసి పక్కన ఉంచాలి మిగిలిన మిశ్రమంలో రెట్టింపు ఫుడ్ కలర్ నీళ్లు వేసి, మిశ్రమాన్ని మరో ప్లాస్టిక్ కవర్లో వేసి పక్కన ఉంచాలి లేత గులాబీ రంగు మిశ్రమం ఉన్న కవర్‌ను కోన్‌లా పట్టుకుని చివర్లు కట్ చేసి రెండు మిశ్రమాలను కప్ కేక్‌ల మధ్య భాగంలో రెండు టీ స్పూన్ల మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి ముదురు గులాబీ రంగులో ఉండే మిశ్రమం ఉన్న కవర్‌ను కూడా అదేవిధంగా కట్ చేసి టీ స్పూను మిశ్రమం వచ్చేలా గట్టిగా పిండాలి ఈ కప్ కేక్‌లను అవెన్‌లో ఉంచి సుమారు 20 నిమిషాల సేపు బేక్ చేసి బయటకు తీసి చల్లారనివ్వాలి ఫ్రిజ్‌లో ఉంచి కొద్దిగా చల్లబడ్డాక అందించాలి. సుగర్ లిప్స్ కావలసినవి: బటర్ - ఒకటిన్నర కప్పులు; పంచదార - 2 కప్పులు; కోడిగుడ్లు - 4; వెనిలా ఎక్స్ట్రాక్ట్ - టీ స్పూను; మైదా పిండి - 5 కప్పులు; బేకింగ్ సోడా - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత తయారీ: ఒకపెద్ద పాత్రలో బటర్, పంచదార వేసి బాగా మెత్తగా క్రీమీగా అయ్యేవరకు గిలక్కొట్టాలి కోడిగుడ్లు, వెనిలా వేసి బాగా గిలక్కొట్టి, మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు మిశ్రమానికి జత చేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఒకరోజు రాత్రంతా ఉంచాలి అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయాలి ఫ్రిజ్‌లో నుంచి మిశ్రమాన్ని బయటకు తీసి, సుమారు పావు అంగుళం మందంగా ఒత్తి, కుకీ కటర్‌తో కావలసిన ఆకారంలో కట్ చేసి, అన్ గ్రీజ్డ్ కుకీషీట్ మీద ఉంచి, సుమారు ఎనిమిది నిమిషాలు వుంచి తీసి, చల్లారాక అందించాలి. -
ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి: వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు మంగళవారం తన ఛలోక్తులతో లోక్‌సభలో నవ్వులు పూయించారు. ‘నాకు ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి. అయినా.. నా భార్య అవేవీ పట్టించుకోదు’ అని అన్నారు. ఢిల్లీలోని అనధికారిక కాలనీల క్రమబద్ధీకరణ బిల్లును తెచ్చినందుకుగాను వెంకయ్యను తాను ప్రేమిస్తున్నానంటూ భోజ్‌పురి గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ‘వెంకయ్యజీ ఐ లవ్ యూ’ అని ఓ పాట పాడారు. దీనిపై వెంకయ్య స్పందిస్తూ.. మనోజ్ ప్రేమపై తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు. -
లవ్ లెటర్స్ ఆక్షన్!
హాలీవుడ్ కలల రాణి మార్లిన్ మన్రో ప్రేమ లేఖలు ఆక్షన్ వేయనున్నారు. బెవర్లీ హిల్స్‌లో వచ్చే నెల 15, 16 తేదీల్లో నిర్వహించే వేలం పాటలో మూడొందల లెటర్స్ అందుబాటులో ఉంచుతున్నారు. మాజీ భర్త జో డిమాగియోకు మార్లిన్ రాసిన లేఖలు ఇందులో ఉన్నాయి. ‘నిన్ను ప్రేమిస్తున్నాను. నీతోనే ఉండాలనుకుంటున్నాను. నాపై నీకు నమ్మకం కలగడానికి ఇంతకంటే నేనేమీ చేయలేను’ అంటూ మార్లిన్ రాసిన ఓ లేఖ అందరినీ కదిలించింది. ఇలాంటివెన్నో హృదయాలను తాకే లెటర్స్ ఆక్షన్‌లో పెడుతున్నారు. -
మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?
ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేసి వచ్చి.. కేంద్రమంత్రిగా ఉండి, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా, కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే శశి థరూర్.. త్వరలోనే పార్టీ మారబోతున్నారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన నుంచి ప్రేమలేఖలు వెళ్తున్నాయని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వ్యవహారాన్ని శశి థరూర్ కూడా పరోక్షంగా బలపరిచారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తననెప్పుడూ బయటివాడిగానే చూశారని ఆయన వాపోతున్నారు. తాను నరేంద్రమోదీని ప్రశంసించానని అంటున్నవాళ్లు తన వ్యాఖ్యలను అర్థం చేసుకోలేదని, అందువల్ల వాళ్ల విమర్శలపై స్పందించేది లేదని థరూర్ అంటున్నారు. రాజకీయాల్లోకి తాను చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే బహుశా వీటిలో సరిగా ఇమడలేకపోతున్నానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీజయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అక్కడున్న తొమ్మిది మంది ప్రముఖుల్లో థరూర్ కూడా ఒకరు కావడం కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆహ్వానం వచ్చినందుకు తానెంతో గౌరవంగా ఫీలవుతున్నానని ఆయన అనడాన్ని కేరళ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆయన ప్రధానికి ప్రేమలేఖలు రాస్తున్నారని కూడా కేరళ కాంగ్రెస్ పత్రిక ఆరోపించింది. టీవీలలో వచ్చినవాళ్లందరి వద్దా తన నెంబరు ఉందని, వాళ్లు కావాలంటే తనకు నేరుగా ఫోన్ చేయచ్చు గానీ, అలా చేయకుండా బహిరంగ విమర్శలకు దిగారని, దాన్ని బట్టే వాళ్ల కోరిక ఏంటో తెలిసిపోతోందని థరూర్ వ్యాఖ్యానించారు. -
ఎంత సజీవ ప్రేమయో!
‘ప్రేమ’ అనేది మనుషులకు మాత్రమే పరిమితమైన వ్యవహారమా? ‘అవును కదా’ అని ఎవరైనా అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్లే. పార్క్‌లు, లవ్లెటర్లు, బ్యాండ్ మేళాలు, శుభలేఖలు, విందులు వినోదాలు...ఇలాంటి వేమీ లేకపోయినా జీవప్రపంచంలో కూడా పవిత్రమైన ప్రేమ, వివాహబంధాలు ఉంటాయి. అలాగే అపోహలు, అలకలు, విభేదాలతో...వాటికి కూడా మనలాగే ‘బ్రేక్ అప్’లూ ఉంటాయి. నమ్మశక్యంగా అనిపించకపోయినా ఇది ఎన్నో పరిశీలనల ద్వారా తెలిసిన వాస్తవం. కొంతకాలం క్రితం ‘ఆస్ట్రియన్ టైమ్స్’లో వచ్చిన ఒక కథనం ప్రపంచాన్ని ముక్కున వేలేసుకునేలా చేసింది. ‘తాబేలు జంట విడాకులు తీసుకుంది’ అనేది హెడ్ లైన్. ‘ఎనభై సంవత్సరాల నుంచి అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట విడాకులు తీసుకోక తప్పలేదు’ అనే వాక్యం మరింత ఆశ్యర్యానికి గురి చేసింది! మన్మథ రాణి! రాణి తేనెటీగ ఒకటి నుంచి నలభైవరకు భాగస్వాములను ఎంచుకుంటుంది. ‘ఏకపతీవ్రతం’ నిబంధన రాణి తేనెటీగ దగ్గర పనిచేయదు. ఇప్పుడొక చిన్న ఫ్లాష్‌బ్యాక్: ఆస్ట్రియాలో జూ. ‘బాబీ’లాంటి ఒక ‘బీబి’ ప్రేమకథ! బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బాబీ’ గుర్తుకు రాగానే లవ్ సీన్స్ గుర్తుకు వస్తాయి. ‘హమ్ తుమ్..’ పాట నోటికొస్తుంది. ఆ జూలో ఉండే ఆడతాబేలు పేరు బీబి. ఈ బీబి అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ‘పోల్డి’ లవ్‌లో పడింది. ఈ పోల్డి ఒక మగతాబేలు. స్విట్జర్లాండులోని బసెల్ జూలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కారణం తెలియదుగానీ, ఆ తరువాత ఆస్ట్రియాలోని క్లజెన్ఫర్ట్ జూకు ఈ జంటను తీసుకు వచ్చారు. దేశం మారవచ్చుగానీ...వాటి మధ్య ఉన్న ప్రేమ మారలేదు. ‘నీకు నేను...నాకు నువ్వు...ఒకరికొకరం’ అని డ్యూయెట్లు కూడా పాడుకునేవి. వాటి బంధం జూ సిబ్బందికి కన్నులపండుగగా ఉండేది. ఒక తరం ఉద్యోగులు మరో తరం ఉద్యోగులకు ఈ జంట గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్లు. కారణం ఏమిటో తెలియదుగానీ, ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్న ఈ జంట విడిపోయింది. సిబ్బంది వాటిని వేరు వేరు ఎన్క్లోజర్లలో పెట్టారు. ‘బ్రేకప్’కు ముందు ఆడ తాబేలు బీబి తరచుగా మగతాబేలు ‘పోల్డి’ పైకి దాడికి దిగేదట! సుదీర్ఘమైన ప్రేమబంధంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ జంట మధ్య దూరాన్ని తగ్గించాలని జూ సిబ్బంది రంగంలోకి దిగారు. ‘కౌన్సిల్సింగ్’ ‘రొమాంటిక్ గుడ్‌ఫుడ్’ ‘జాయింట్ గేమ్స్’...ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించలేదు. వాటి మధ్య దూరం తగ్గనే లేదు! అంతమాత్రాన వాటి సంతోషానికి వచ్చిన ఇబ్బంది లేదు. ‘సింగిల్’గా కొత్త జీవితాన్ని సంతోషంగానే గడుపుతున్నాయి. ఇదీ ‘విడాకులు తీసుకున్న’ ఆ తాబేలు జంట కథ. ఈ నేపథ్యంలో జీవప్రపంచంలో కొన్ని జీవుల ప్రేమ, బ్రేకప్‌ల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. సంక్షిప్తంగా... ఒక లైలా కోసం... తిరిగాను వనం! మన కథల్లో మామూలుగా తోడేళ్లకు విలన్ ఇమేజ్ ఉంది. ప్రేమ విషయంలో మాత్రం వాటికి క్లీన్ ఇమేజ్ ఉంది. తోడేళ్లు ఒకరితో మాత్రమే వీలైనంత ఎక్కువగా ప్రేమానురాగాలు పంచుకుంటాయి. వాటి బంధాలు మనుషులను తలపిస్తాయి. అవును...వాళ్లిద్దరూ కష్టపడ్డారు! ఇంగ్లండ్‌లోని ఒక వన్యప్రాణి సంరక్షణకేంద్రంలో ప్రేమికులైన హంసల జంట మధ్య విభేదాలు ఏర్పడి ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. విరహాన్ని భరించలేక అవి నానా కష్టాలు పడ్డాయి. ఇలా అయితే కుదరదని విభేదాలను సమాధి చేసి మళ్లీ కలిసాయి. ఒక పత్రిక సరదాగా ఇలా హెడ్లైన్ పెట్టింది: ‘వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.’ ఆనాటి ఆ ప్రేమబంధం...ఏమైనదో! గిబన్ కోతులు బ్రేకప్‌లకు దూరంగా ఉంటాయి. అన్యోన్యంగా కలిసి ఉంటాయి. వాటివి బలమైన బంధాలు. కానీ ఈమధ్య కాలంలో కాస్త తేడా వచ్చిందట. మునుపటి అనుబంధం కనిపించడం లేదట. ఒకదాన్నొకటి మోసం చేసుకుంటున్నాయట! మన్మథరాజా.. మన్మథరాజా! బొనొంబొ మగ చింపాంజీలు ఎక్కువ సంఖ్యలో జీవితభాగస్వాములను ఎంచుకుంటాయి. కొత్త వారిని ‘ప్రేమముగ్గు’లో దించడానికి సృజనాత్మక మార్గాలలో ఆలోచిస్తుంటాయి.