రెబెక్కాకు సోకో రాసిన ప్రేమలేఖ
‘‘ఈ ప్రేమ వ్యవహారం చాలా హాస్యాస్పదమైనది. నేను నిర్మించుకున్న ప్రశాంతమైన వాతావరణాన్ని ధ్వంసం చేసి, నాలో కల్లోలాన్ని రేపుతోంది. చాలా బాధగా కూడా ఉంది. నాకిప్పుడు అర్థమవుతోంది! పెళ్లి సమయాల్లో ఆడపిల్లలు ఎందుకు ఏడుస్తారో.. నువ్వేంటో నాకు తెలుసు! అందుకే నువ్వంటే నాకిష్టం. ’’ తన చేతిలోని ప్రేమలేఖలో ఉన్న వ్యాఖ్యాలను చదవగానే సోన్య బెర్తిన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. గుండె కొద్దిగా బరువెక్కింది. ఆ లేఖ ఆమె కోసం రాసింది కాదు! ఆమెకు సంబంధించి అసలే కాదు. ఆమె పుట్టక చాలా ఏళ్ల ముందుదా లేఖ. కెనడా.. విన్నీపెగ్‌లోని ‘‘పారిస్ బిల్డింగ్’’ అనే ఓ పురాతన భవనంలో దొరికిందది. భవనాన్ని కొత్తగా తీర్చిదిద్దుతున్న సమయంలో ఓ ఫైల్‌లో దానితో పాటు మరికొన్ని ప్రేమ లేఖలు కూడా ఆమెకు దొరికాయి. ఆ ఫైల్‌ను తెరిచి లేఖలను చదివితే కానీ తెలియలేదు! అవి ఎంత విలువైనవో. 1918, 1919 సంవత్సరాలలో విన్నీ పెగ్‌లోని తన ప్రియురాలు రెబెక్కాకు సోకో అనే ఓ యద్ధ సైనికుడు రాసిన ప్రేమ లేఖలు అతడి మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
సోన్య బెర్తిన్, రోస్ మెకైలే
ఆ లేఖలో వారు ప్రేమించుకున్నట్లు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఏమైంది? అన్న ప్రశ్న ఆమె మెదడును పురుగులా తొలుచసాగింది. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ లేఖలో ఉన్న వారికోసం అన్వేషణ ప్రారంభించింది. ఎలాగైతేనేం కొన్ని నెలల నిరంతర శ్రమ తర్వాత ఆ లేఖలు రాసిన వ్యక్తిని కనుగొంది. వందేళ్ల నాటి ఆ ప్రేమ లేఖలు విన్నిపెగ్‌కు చెందిన హైమన్ సోకోలోవ్ అనే ప్రముఖ లాయర్, జర్నలిస్టువని. అతడు రెబెక్కాను పెళ్లి చేసుకున్నాడని, వారికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారని తెలిసి చాలా సంతోషించింది. సోకో, రెబెక్కాలు ప్రాణాలతో లేకపోయినప్పటికి ఆ లేఖలను వారి కుటుంబానికి తిరిగిచ్చేందుకు నిర్ణయించుకుంది.
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment