World of Love
-
తనని మనసులో ఉంచుకొని వేరే పెళ్లి చేసుకున్నాను, అప్పుడు...
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో ఎవరం చెప్పలేము, ఎవరికి తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకి వయస్సుతో పని లేదంటారు. చిన్న పెద్ద అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ప్రేమ అవసరమే. మన జీవితంలో ఈ ప్రేమ మనకి తెలియకుండానే ఎక్కడో, ఎప్పుడో మొదలయి, ఇంకెక్కడో, ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది. అలా ప్రేమంటే ఎంటో తెలియని వయస్సులో మన జీవితంలోకి వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్లిపోయి మళ్లీ మనకి ఆ ప్రేమ దోరుకుంతుందో లేదో అనే సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తే....??? అదే నా ప్రేమ కథ. నాకు అప్పుడు సరిగ్గా పన్నెండేళ్ళు . అప్పుడు నాకు ప్రేమంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. అప్పుడే ప్రేమ నాకు పరిచయం అయింది. నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి వేసవి సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని. అలాగే నా పన్నెండేళ్ళ వయసప్పుడు వేసవి కాలం సెలవులు రాగానే యధావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను. కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేని జ్ఞాపకాలని ఇస్తాయి అనుకోలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు సాయి ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళిన ప్రతి సారి సాయిని కలిసేదాన్ని. అలాగే అప్పుడు కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడే నేను అక్కడ సాయి తో తన స్నేహితుడు కూడా ఉండడం చూశాను. సాయి నాకు తనని పరిచయం చేశాడు, తన పేరు విక్కీ. అలా సాయిని కలవడానికి వెళ్లిన ప్రతి సారి విక్కీ కూడా అక్కడే ఉండడం తో మెల్ల మెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలియదు నేను విక్కీ తో ఉన్నంత సేపు, తనతో మాట్లాడినప్పుడు నాకు ఏదో తెలియని సంతోషం కలిగేది. తనతో అలాగే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేది. అలా సెలవులు గడిచిపోవడంతో నేను మా ఇంటికి తిరిగి వెళ్లాను. తనని విడిచి వెళ్తుంటే ఏదో బాధ కానీ తప్పదు ఇక వెళ్లాల్సిందే మళ్లీ వేసవి కాలం సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉన్నా అంతలోనే రానే వచ్చాయి. ఇక ఎంతో ఆనందంతో, ఎప్పుడు లేని సంతోషంతో వెళ్ళాను. (తప్పు నాదీ...శిక్ష ఆమెకి) విక్కీ నీ కలుద్దాం అని ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడే నాకు తెలిసింది విక్కీ వాళ్ళ తండ్రికి గవర్నమెంటు ఉద్యోగం, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడం వలన వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు అని . ఏ ఊరో కూడా సాయి కి తెలియదు అని చెప్పాడు. నా ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేశాను. కానీ ప్రతి సంవత్సరం విక్కీ వస్తాడేమో అన్న చిన్న ఆశతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. కానీ తనని మాత్రం మళ్లీ కలవలేదు. ఎందుకో తెలియదు కానీ తను మాత్రం నా మనసుకి చాలా దగ్గర అయ్యాడు, తనతో గడిపిన అన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవి, తనని తలచుకొని రోజు అంటూ ఉండేది కాదు. ఆ కొద్ది రోజుల మా పరియచయానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా అలా నా చదువు పూర్తయింది. మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలని ఒక మంచి సంబంధం తెచ్చారు. కానీ అప్పటికి నా మనసులో ఇంకా విక్కీ నే ఉన్నాడు, తనని నేను చాలా వెతికాను, తనకోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా విక్కీ నాకు దొరకలేదు. ఇక చేసేది ఏమీ లేక మా తల్లిదండ్రులు తెచ్చిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను, తన పేరు విక్రమ్, తనది గవర్నమెంటు ఉద్యోగం. విక్రమ్ కూడా చాలా మంచివాడు, నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ నా మనసులో ఏదో వెలితి, విక్కీని మళ్లీ కలవలేకపోయా అని. (తను చనిపోయాడు అనుకున్నాను, కానీ...!) కలలో కూడా విక్కీని మళ్లీ కలుస్తానో లేనో అని అనుకునే సమయంలో, మళ్లీ విక్కీ రాకా నా జీవితంలో సంతోషాన్నిచ్చింది. పెళ్లి అయిన మూడు నెలలకి నేను విక్రమ్ తో కలిసి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా నేను విక్రమ్ చిన్నప్పటి ఫోటోని చూశాను. ఆ ఫోటో చూడగానే నేను ఆనంద, ఆశ్చర్యాలతో ఉండిపోయాను. విక్రమ్ మరెవరో కాదు నేను చిన్నప్పుడు కలిసిన విక్కీనే...విక్రమ్. ఎంతో సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నేనే తన చిన్నప్పటి నీతూని అని చెప్పాలి అనేలోపు విక్రమ్ నా దగ్గరికి వచ్చి.... నేను విక్కీని కలిశాక నాకు ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భావనలు అయితే కలిగాయో విక్కీ కి కూడా అలాంటి భావనలే కలిగాయి అని ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం వల్ల మళ్లీ కలవలేకపోయా అని, తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి దగ్గరికి వెళ్లి నా వివరాలు అన్ని తెలుసుకుని, ఇప్పటికీ నేను తన గురించి వెతుకుతున్న అని తెలుసుకుని, తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చానని చెప్పాడు. తన మాటలు విని నేను ఆనందంతో ఉప్పొంగి పోయాను. ఇలా విక్కీనే.. విక్రమ్ గా వచ్చి మా చిన్నప్పటి పరిచయానికి పేరే "ప్రేమ" అని నా ప్రశ్నకి సమాధానాన్ని, నా జీవితానికి ప్రేమని, సంతోషాన్ని ఇచ్చాడు. ఇది మా కథ నిత్య - విక్రమ్ ( నీతూ ❤విక్కీ ) -
తప్పు నాదీ...శిక్ష ఆమెకి
అబద్ధం అనేది ఈ ప్రపంచంలో ప్రతి మనిషి తన జీవితంలో ఎదో ఒక విషయంలో చెప్తాడు. కానీ అబద్ధం చెప్పడం వలన కలిగే అనర్థాలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే అబద్ధం చెప్పి అన్ని అనర్థాలకు కారణం అయ్యే బదులు నిజం చెప్పి సంతోషంగా ఉండడం ఉత్తమం. అబద్ధం మనం చెప్పిన ఆ ఒక్క క్షణం ప్రశాంతతని ఇస్తుంది కావచ్చు, కానీ నిజం చెప్పడానికి కష్టం అయినా అది మనకి జీవితాంతం ప్రశాంతతని ఇస్తుంది. మనం ఆడే అబద్దం ఇతరుల జీవితంలో ఊహించని మలుపు కి దారి తీస్తే.. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే. ఒక్క క్షణం సంతోషం కోసం నేను ఆడిన అబద్ధం నా జీవితంలో ఎలాంటి బాధని తీసుకొచ్చిందో నేను మీతో పంచుకోబోతున్నాను. నేను బి.టెక్ చదువుతున్న రోజుల్లో నాకు ముగ్గురు స్నేహితులు ఉండేవారు. నేను ఎక్కువగా ఆ ముగ్గురితోనే ఉండేవాడిని, వారితోనే కళాశాలకు వెళ్ళడం రావడం చేసేవాడిని. ప్రతి ఒక్కటి వారితోనే పంచుకునేవాడిని. నా స్నేహితులందరిలో కూడా నేను ఆ ముగ్గురిని ఎక్కువగా నమ్మేవాడిని. అంతేకాకుండా మా కళాశాలలో నాకు ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు రక్ష. నేను ఆ కళాశాలలో చేరిన మొదటి రోజే రక్షని చూశాను. నేను తనని చూసిన క్షణం నుండే తనని ప్రేమించడం మొదలు పెట్టాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను కానీ నా ప్రేమ విషయం మాత్రం రక్ష కి ఇంతవరకు చెప్పలేదు. కారణం రక్ష నన్ను ఒక మంచి స్నేహితుడిగా భావిస్తోంది. ఇప్పుడు నేను తనని ప్రేమిస్తున్న విషయం చెప్తే రక్ష తన స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని ఎక్కడ బాధ పడుతుందో అని, నాతో మాట్లాడడం ఎక్కడ మానెస్తుందో అని, తనని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రేమికుడిలా కాకపోయినా ఒక మంచి స్నేహితుడిలా అయినా ఉందాం అని చెప్పలేదు. నా స్నేహితులు ముగ్గురికి కూడా నా ప్రేమ విషయం తెలుసు. అది అలా ఉండగా బీ.టెక్ నాలుగవ సంవత్సరం రానే వచ్చింది. రక్ష కి నాకు మధ్య స్నేహం ఇంకా పెరిగి మేమిద్దరం చాలా దగ్గరయ్యారు. అది గమనించిన నా స్నేహితులు నాతో రక్ష కూడా నన్ను ప్రేమిస్తుందనీ అందుకే నాతో అంత సన్నిహితంగా ఉంటుందనీ చెప్పారు. ఇక మిగిలింది ఒక్క సంవత్సరం మాత్రమే ఇప్పుడు కూడా నేను నా ప్రేమ విషయం చెప్పకపోతే తనని కోల్పోయి చాలా బాధ పడాల్సి వస్తుంది అని హెచ్చరించారు. వెంటనే వెళ్లి రక్ష కి నా ప్రేమ విషయం చెప్పమన్నారు. నేను కూడా ఏమి ఆలోచించకుండా నా స్నేహితులు చెప్పింది విని రక్ష దగ్గరికి వెళ్ళి నా ప్రేమ విషయం చెప్పాను. కానీ ఇక్కడ నేను మొదట్లో అనుకున్నదే నిజం అయింది. రక్ష నన్ను ప్రేమించడం లేదు. నన్ను ఓ మంచి స్నేహితుడిగానే భావిస్తోంది. ఇక చేసేది ఏమి లేక తిరిగి నా స్నేహితుల దగ్గరికి వచ్చాను. అప్పటికే నా స్నేహితులు రక్ష కూడా నన్ను ప్రేమిస్తుంది అనే నమ్మకంతోనే ఉన్నారు, వారికి రక్ష నన్ను ప్రేమించడం లేదని చెప్పలేక, చెప్తే స్నేహితుల ముందు నా పరువు పోతుందేమో అని ఆలోచించి వారికి రక్ష కూడా నన్ను ప్రేమిస్తుంది అని, ఆ ఒక్క క్షణం సంతోషం, ప్రశాంతత కోసం అబద్ధం చెప్పాను. ఇక మా ప్రేమ విషయం నా స్నేహితుల ద్వారా కళాశాల మొత్తం తెలిసింది. అంతేకాకుండా మా కళాశాలలోనే రక్ష వాళ్ళ బంధువుల అమ్మాయి కూడా చదువుతుండడం తో తనకి కూడా ఈ విషయం తెలిసింది. ఆ అమ్మాయి రక్ష ఎవరినో ప్రేమిస్తుంది అని తన ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. వారు రక్ష కి బంధువులే కావడం వలన ఆ విషయం రక్ష వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసింది. (కోవిడ్–19 లవ్‌స్టోరీ) రక్ష ప్రేమ విషయం తెలిసి తన పరువు అందరి ముందు పోయింది అని రక్ష తండ్రి తనని చదువు మాన్పించి, తను ఎవరిని ప్రేమించడం లేదని ఎంత చెప్పినా వినకుండా వేరే సంబంధం తెచ్చి పెళ్లి చేశాడు. కానీ ఈ విషయాలేవీ కూడా అప్పటికి నాకు తెలియవు. నేను నా బీ.టెక్ పూర్తి చేసుకుని, రక్ష ఎలాగో నన్ను ప్రేమించడం లేదు కదా అని తనని మెల్ల మెల్లగా మర్చిపోతూ, జీవితంలో పైకి ఎదగాలని ఒక మంచి ఉద్యోగం చేస్తూ బెంగుళూర్ లో స్థిర పడ్డాను. కొన్నాళ్ళకు నా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం తెచ్చి నా పెళ్లి చేశారు, ఆ అమ్మాయి చాలా మంచిది, నేను తనతో సంతోషంగా నా జీవితాన్ని గడుపుతున్నాను. ఇది ఇలా ఉండగా ఒకరోజు రక్ష భర్త తాగి వాహనం నడపడం వలన ప్రమాదం జరిగి చనిపోయాడు. దాంతో రక్ష తన కలలు తన చదువు అంతేకాకుండా తన జీవితం కూడా ఇలా మధ్యలో ఆగిపోయినందుకు డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ విషయాలన్ని నేను ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా స్నేహితులని కలిస్తే వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఆ విషయాలన్ని తెలిసి నేను చాలా బాధ పడ్డాను. నేను ప్రేమించిన అమ్మాయి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానా అని కృంగిపోయాను. వెంటనే వెళ్ళి రక్షని కలవడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు. చేసేది ఏమీ లేక బెంగుళూర్ తిరిగి వెళ్ళిపోయాను. కానీ నా వల్లేరక్ష జీవితం ఇలా అయిందన్న బాధ నన్ను వెంటాడుతూ ఉంటుంది. అంతేకాకుండా నేను చేసిన తప్పుకి జీవితాంతం పశ్చాత్తాప పడుతూనే ఉంటాను. చదవండి: (ఎవరైనా ఇలా ప్రేమిస్తారా?) ఇలా నా జీవితంలో నేను క్షణ కాల సంతోషం, ప్రశాంతత కోసం చెప్పిన అబద్దం మరొకరి జీవితంతో ఆడుకోవడమే కాకుండా జీవితాంతం భరించలేని బాధని కూడా నాకు ఇచ్చింది. "మనం మన జీవితంలో అబద్దంఆడాల్సి వస్తే అది పది మందికి ఉపయోగపడేలా ఉండాలి కానీ మరొకరి జీవితాంతంతో ఆడుకునేలా మాత్రం కాదు. ఇట్లు వివేక్. -
జీవితాన్ని మార్చిన చిన్న పరిచయం
పరిచయం అనేది నాలుగు అక్షరాల పదమే అయినా ఎంతో మందిని కలుపుతున్న ఒక అద్బుతం. ఒక్క చిన్న పరిచయం ఎన్నో సంబంధ బాంధవ్యాలకి మూల కారణమవుతుంది. చిన్న చిన్న పరిచయాలే కొన్ని గొప్ప గొప్ప స్నేహాలు గా, మరికొన్ని ప్రేమగా, ఇంకొన్ని బంధుత్వాలుగా మారితాయి. పరిచయం అనేది ఒకరి నుండి మరొకరికి, వారి నుండి ఇంకొకరికి అలా అలా పెరుగుతూ పోతూ ఎక్కడో ఉన్న ఒకరిని, ఇంకెక్కడో ఉన్న మరొకరిని కలుపుతుంది. అలా ఏర్పడ్డ ఒక చిన్న పరిచయమే నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి, తనని నా జీవితంలోకి ఆహ్వానించింది. ఆ చిన్న పరిచయం నా జీవితంలో చేసిన మార్పులని నేను మీతో పంచుకోబోతున్నాను. నేను పీ.జీ చదువుతున్న రోజులవి. అప్పట్లో నాకు స్నేహం అన్నా స్నేహితులు అన్నా చాలా ఇష్టం. నాకు స్నేహితులు కూడా ఎక్కువే. అమ్మాయి, అబ్బాయి అని ఏ తేడా కూడా లేకుండా స్నేహం చేసేవాడిని. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతా ఇచ్చి అందరితో సంతోషంగా ఉండేవాడిని. నా స్నేహితులకి నేనంటే కూడా అంతే ఇష్టం ఉండేది. కాకపోతే చిన్న చిన్న పరిచయాల ద్వారా కలిసిన వాళ్ళతో నేను ఎక్కువగా ఉండేవాడిని కాదు. వాళ్ళతో స్నేహం చేసేవాడిని కాదు. చిన్న చిన్న పరిచయాలు ఎక్కువ కాలం ఉండవు అని నమ్మేవాడిని. కానీ నా నమ్మకం నిజం కాదు అని చెప్పడానికి నా జీవితంలోకి వచ్చింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి నా జీవితంలోకి రావడమే కాదు తానే నా జీవితంగా మారిపోయింది. నాకున్న స్నేహితుల పిచ్చితో నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో స్నేహితులు ఉండేవారు. అందులో ఒక డిపార్ట్మెంట్ అమ్మాయితో నా స్నేహం కొంచెం ఎక్కువగానే ఉండేది. తన పేరు లేఖ్య. నా ఖాళీ సమయాల్లో ఎక్కువగా లేఖ్య దగ్గరికి వెళ్ళి తనతో సమయాన్ని గడిపేవాడిని . నా గురించి నా జీవితం గురించి ప్రతి ఒక్కటి తనకి తెలుసు. లేఖ్యకి తన ఇంటివద్ద చిన్ననాటి స్నేహితురాలు కీర్తి ఉండేది. ఇద్దరు చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు. ఒకసారి లేఖ్య, కీర్తిని తీసుకుని మా కళాశాలకు వచ్చింది. నేను కీర్తి నీ మొదటి సారి చూసింది అక్కడే. లేఖ్య తన స్నేహితులు అందరికి కీర్తిని పరిచయం చేసింది. అప్పుడే నాకు తను పరిచయం అయ్యింది. ఆ క్షణం తనని అలానే చూస్తూ ఉండిపోవాలని అనిపించింది. తను అక్కడ ఉన్నంత సేపు నేను తననే చూస్తూ ఉండిపోయా. కాసేపటి తరువాత తను వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి నా మనసు నాలో లేదు, తనని చూడాలి మాట్లాడాలి అనే తపన నాలో పెరిగింది. లేఖ్య దగ్గరికి వెళ్ళి తన గురించి తెలుసుకుని, తన ఫోన్ నంబర్ అడగాలి అనిపించింది. కానీ అలా అడిగి తర్వాత నా వల్ల వారిద్దరి మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చి, గొడవ రాకూడదు అని అడగకుండానే ఉండిపోయా. ఇక ఆ తర్వాత అప్పుడప్పుడు కీర్తి మా కళాశాలకు వచ్చేది, వచ్చిన ప్రతి సారి నేను ఏమి మాట్లాడకుండా తనని చూస్తూ ఉండేవాడిని. తను కూడా ఏమి మాట్లాడేది కాదు. అలా అలా కొన్ని రోజులు గడిచాయి, అయినా నేను తనని చూడడం, తను నన్ను చూడడంతోనే సరిపోయేది. కొన్ని రోజుల తర్వాత నేను మా స్నేహితులు, లేఖ్య అందరం కలిసి ఒక చిన్న విహార యాత్రకి వెళ్ళాలి అని నిర్ణయించుకుని వెళ్ళాం, అక్కడికి మాతో పాటు కీర్తి కూడా వచ్చేది. నాకు తనకి మధ్య మాటలు కలిశాయి. మెల్ల మెల్లగా మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించాం. మేమందరం ఒకసారి విహారయాత్రకి వెళ్లాం. విహారయాత్ర లో ఎంతో ఆనందంగా గడిపి తిరిగి ఇంటికి వచ్చేశాం. ఆ విహార యాత్ర నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని, జ్ఞాపకాలని ఇచ్చింది. ఎప్పుడు కుటుంబం తో, స్నేహితులతో వెళ్ళినా రాని సంతోషం ఎందుకో నాకు తెలియకుండానే ఈ విహారయాత్ర నాకు ఇచ్చింది, దానికి కారణం కీర్తి రాకనే అని నా మనసు చెప్పింది. ఇక బాగా ఆలోచించాను, కీర్తితో నేను చేసిన విహారయాత్ర నే నాకు అంత సంతోషాన్ని, ఆనందాన్ని, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చినప్పుడు, నేను నా జీవితం మొత్తం కనుక కీర్తి తో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అనిపించింది. తను నాతో ఉన్న అన్ని రోజులు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, అదే తను నాతో జీవితాంతం ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటానో అనిపించింది. ఇక ఆలస్యం చెయ్యకుండా కీర్తిని కలవాలి అనేలోపు కీర్తినే నన్ను కలవడానికి వచ్చింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కీర్తి తో నేను చెప్పేలోపు తానే నన్ను ప్రేమిస్తున్నాను అని, లేఖ్య నిన్ను పరిచయం చేసినప్పుడే, నీ గురించి ఏమీ తెలియకుండానే నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను... అంతేకాకుండా మీ కళాశాలకు పదే పదే రావడానికి కారణం కూడా నిన్ను చూడడానికే. నీతో మాట్లాడాలి అని చాలా సార్లు ప్రయత్నించాను, కానీ ఎందుకో నా వల్ల కాలేదు. ప్రతి రోజు నీ గురించి లేఖ్యని అడిగి తెలుసుకునే దానిని. విహారయాత్ర లో నీతో గడిపిన ప్రతి రోజూ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అందుకే ఆ సంతోషం నాకు జీవితాంతం కావాలి అని నిర్ణయించుకుని నీ దగ్గరికి వచ్చాను. నన్ను పెళ్ళిచేసుకుని నాకు నా సంతోషాన్ని ఇస్తావా ?? అని అడిగింది. తను అలా అడిగేసరికి నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. నిజానికి నేను తనకి ఇదే విషయం చెప్పడానికి వచ్చాను అని నేను కూడా తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాను.ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయింది. నాకు ఒక సాఫ్టువేర్ కంపెనీలో లో మంచి ఉద్యోగం వచ్చింది. వెంటనే నేను కీర్తి విషయం మా ఇంట్లో చెప్పి మా పెళ్లికి నా తల్లిదండ్రులని ఒప్పించాను. కానీ కీర్తి ఇంట్లో మాత్రం మా పెళ్ళికి ఒప్పుకోలేదు, అంతేకాకుండా కీర్తి కి మరో సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలని చూశారు. తన తల్లిదండ్రులకి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కీర్తి ఉండిపోయింది. ఇక నేను నా తల్లిదండ్రుల అండతో కీర్తి దగ్గరికి వెళ్లి నాతో పాటు వస్తావా?? పెళ్లి చేసుకుని జీవితాంతం నిన్ను సంతోషంగా చూసుకుంటా అని అడిగాను. తను నాతో నా తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం నేను చేసుకోలేను, గడిపితే నీతోనే సంతోషంగా నా జీవితాన్ని పంచుకుంటాను, లేకుంటే నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు అని చెప్పేసింది. ఇదే విషయం తన ఇంట్లో వాళ్ళకి చెప్పి తను నాతో పాటు వచ్చేసింది. నా తల్లిదండ్రులు మా ఇద్దరి పెళ్లి చేసేశారు. అంతేకాకుండా తన తల్లిదండ్రులు తనతో లేరు అన్న లోటు తనకి తెలియకుండా నా తల్లిదండ్రులు కీర్తి నీ సంతోషంగా చూసుకుంటున్నారు. నన్ను నమ్మి నాకోసం తన తల్లిదండ్రులని వదులుకున్న కీర్తి కి నేను వాళ్ళని తిరిగి ఇవ్వ లేకపోవచ్చు కానీ, జీవితాంతం తనకి ఎలాంటి కష్టం రాకుండా, సంతోషంగా చూసుకుంటాను. ఇలా నా జీవితంలో ఏర్పడిన చిన్న పరిచయం కాస్తా ప్రేమగా మారి నాకు జీవితాంతం సంతోషాన్ని ఇస్తూ, నాతో జీవితాన్ని పంచుకుంది. ఇట్లు ఆదిత్య (హైదరాబాద్) -
తను చనిపోయాడు అనుకున్నాను, కానీ...!
ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా వారికే తెలియకుండా జరిగేవి రెండే రెండు విషయాలు. ఒకటి జననం ; రెండు మరణం. ఈ రెండు విషయాలు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భావనని మాత్రం కలిగిస్తాయి. జననం పది మందికి సంతోషాన్ని కలిగిస్తే , మరణం వంద మందికి బాధని కలిగిస్తుంది. అయితే ఈ జనన మరణాల మధ్య కొట్టు మిట్టాడే ప్రతి మనిషి జీవితంలో కలిగే మధురానుభూతి ప్రేమ. ఈ ప్రేమ కూడా జనన మరణాల్లో ఒక భాగమే. "రెండు ప్రేమల కలయిక జననం అయితే ... అదే రెండు ప్రేమలు విడిపోవడం మరణం". జననం ఎంత సంతోషాన్ని ఇస్తుందో మరణం అంతకు రెట్టింపు బాధని ఇస్తుంది. ఆ బాధకి కారణం కూడా ప్రేమే. మనం ప్రేమించిన వాళ్ళు మరణిస్తే ఆ బాధ ఇంకా చెప్పలేనిది. ఆ వార్త వినడానికి కూడా మనం సిద్దంగా ఉండం. ఒకవేళ అదే వార్త ఒక అబద్ధం అయితే , అబ్బా ..!! ఆ ఊహ కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా !? ఇప్పుడు చెప్పబోయే నా ఈ కథ కూడా అలాంటిదే. నా పేరు దీక్ష. నేను పీజీ చదువుతున్న రోజులవి. ప్రతి రోజు కళాశాలకు వెళ్ళడం ఇంటికి రావడం నా తల్లిదండ్రులతో సంతోషంగా గడపడం ఇదే నా దిన చర్య గా ఉండేది. నేను నా తల్లిదండ్రులకి ఒక్కగానన్కొక్క కూతురిని కావడం వల్ల నన్ను కొంచెం గారంబంగానే పెంచారు. అంతే కాకుండా వాళ్ళకి నేను అంటే ఎంతో ఇష్టం. నాకు నా తల్లిదండ్రులు అంటే చాలా ప్రేమ. నా తల్లిదండ్రులు, వాళ్ళ ప్రేమ తప్ప ఇంకొక మనిషికి, వారి ప్రేమకి నా మనసులో చోటు ఉండేది కాదు. అలాంటి నన్ను మార్చి నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేలా చేసి ఇంకో ప్రేమని పరిచయం చేసిన వ్యక్తి ఆనంద్. తను నేను చదివే కళాశాల లోనే పీజీ చదువుతున్నాడు. మొదట్లో తనకి నాకు అస్సలు పడేది కాదు, కానీ నిజానికి తను చాలా మంచివాడు, మంచి మనస్తత్వం కలవాడు, సున్నిత స్వభావి. తనని నేను మొదటిగా మా కళాశాలలో ఒకరితో గొడవ పడుతుండగా చూశాను. అలా గొడవ పడటం నాకు నచ్చలేదు, తర్వాత తను నా సహా విద్యార్థే అని తెలిసింది. మొదట్లో నేను తనతో సరిగ్గా మాట్లాడేదాన్ని కాదు. ఒకే తరగతి కావడం వల్ల తర్వాత తర్వాత మా ఇద్దరి మధ్య మాటలు కలిశాయి కానీ, ఆ మాటలు కూడా తూటాల్లా ఉండేవి. అలా మేము కలిసిన ప్రతి సారి ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళం. మా ఇద్దరికీ రోజు ఏదో ఒక గొడవ కాకపోతే ఆ రోజు గడిచినట్టే అనిపించేది కాదు. అలా ఉన్న సమయంలో ఒకరోజు ఆనంద్ కళాశాలకు రాలేదు, ఎవరికి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నేను నేనుగా లేను. ఏదో తెలియని కల్లోలం, ఎందుకో తెలియని బాధ, ఏదో కోల్పోతున్న అనే భావన నాలో కలిగింది. అలా ఒక వారం తరువాత తను కళాశాలకు వచ్చాడు. తనని చూడగానే నాకు ప్రాణం తిరిగివచ్చినట్టుగా అనిపించింది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి రాకపోవడానికి గల కారణాన్ని తెలుసుకుని, నాకు కలిగిన భావన నేను తనతో చెప్పాను. అప్పుడు ఆనంద్ నీకు అలా జరగడానికి గల కారణం ప్రేమ అని చెప్పాడు. ఎందుకంటే ఈ వారం రోజులు తన పరిస్థితి కూడా అలానే ఉండడం వల్ల దానికి గల కారణం గురించి ఆలోచిస్తే తనకి బాగా అర్థం అయిన విషయం అది అని నాకు చెప్పాడు. నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, కానీ తీరిగ్గా ఆలోచిస్తే తను చెప్పిందే వాస్తవం అని తెలిసింది. ఇక ఇద్దరికీ అర్ధం అయ్యింది ఏంటంటే ఒకరికి తెలియకుండానే ఒకరం తిట్టుకుంటూ, గొడవ పడుతూ ప్రేమలో పడ్డాం అని. ఒకరు లేకుంటే ఒకరం ఉండలేము అని. ఇక అలా మా ప్రేమ యాత్ర మొదలయింది. మేము మా ప్రేమ యాత్ర లో మునిగి తేలుతూ ఉండగా, ఒకరోజు ఆనంద్ కళాశాలకు వస్తుండగా అనుకోకుండా ఒక కారు తప్పు దారిలో వచ్చి ఆనంద్ నీ ఢీకొంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆనంద్ నీ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ , చిగురిస్తున్న మా ప్రేమ పూవుగా మారకముందే వాడిపోయింది. ఆ ప్రమాదంలో ఆనంద్ తలకి గాయం అయి బాగా రక్తం పోవడంతో తను మరణించాడు అనే వార్త నాకు తెలిసింది. ఆ వార్త విన్న క్షణం ఒక్కసారిగా నా గుండెలు పగిలిపోయాయి. ప్రాణాలు పోయినట్టుగా అనిపించింది, పిచ్చిదానిలా గుండెలు బాదుకుంటూ ఏడ్చాను. ఆ సమయంలో నా బాధ చెప్పుకుని ఏడ్వటానికి కూడా ఎవరు లేరు, నా తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు వాళ్ళతో అయినా నా బాధ నీ పంచుకుందాం అంటే. ఇక ఏమి చెయ్యాలో తోచక పిచ్చిదానిలా అయి చనిపోదాం అని అనుకున్నాను, కానీ, ఇంత ఇష్ట పడ్డ ఆనంద్ దూరం అవుతేనే నా పరిస్థితి ఇలా ఉంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా తల్లిదండ్రులకి నేను దూరం అయితే ఇక వాళ్ళు ఎలా తట్టుకుంటారని నా ప్రేమని, నా బాధని నా గుండెల్లోనే దాచుకుని వాళ్ళకోసం బ్రతుకుతూ ఉన్నాను. అంతలోనే నా పీజీ పూర్తి కావచ్చింది. ఇక నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలి అని సంబంధాలు చూడడం ప్రారంభించారు. ఒక మంచి సంబంధం వచ్చిందిజ అబ్బాయి పేరు కృష్ణ, అమెరికా లో ఉద్యోగం, మంచి కుటంబం ఇలాంటి సంబంధం మళ్లీ రాదు అని నన్ను ఒప్పించారు, నేను వాళ్ళ మాట కాదు అనలేక ఆనంద్ ఎలాగో తిరిగి రాడు, తననే తలచుకుంటూ నా తల్లిదండ్రులని బాధ పెట్టలేక, ఆ పెళ్లి చేసుకుని ఇక్కడి నుండి దూరంగా వెళ్తే అయినా ఆనంద్‌ని మరిచిపోతా అని ఆ సంబంధం ఒప్పుకున్నాను. ఒప్పుకోవడమే ఆలస్యం పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. నిశ్చితార్థం రానే వచ్చింది. నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే కృష్ణ తో నా నిశ్చితార్థం అయ్యింది. నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య రెండు నెలల వ్యవధి రావడంతో జీవితాంతం కలిసి ఉండాల్సింది తనతోనే కాబట్టి ఒకరి అభిప్రాయాలు ఒకరం తెలుసుకోవాలి అని మెల్ల మెల్లగా కృష్ణతో మాట్లాడడం మొదలుపెట్టాను. తను నాపై చూపించే ప్రేమాభిమానాలకి తన దగ్గర నా గతం దాచడం సరైంది కాదు అని ఆనంద్ విషయం చెప్పేశాను. తను నా ప్రేమని అర్థం చేసుకుని నా బాధని పంచుకుంటూ నా బాధలో నాకు తోడుగా ఉంటూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. తను చూపించే ప్రేమాభిమానాలు, జాగ్రత్తలు నాకు తన మీద ప్రేమ కలిగేలా చేశాయి. . అలా మెల్ల మెల్లగా నేను కృష్ణ నీ ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ ఇంతలోనే ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మళ్లీ నన్ను మొదటికి తీసుకొచ్చింది. ఒకరోజు మా స్నేహితులని పెళ్లికి ముందు కలవాలని, పెళ్లి తర్వాత అమెరికా వెళ్ళడం, మళ్లీ కలవడం కుదురుతుందో లేదో అని అందరం అనుకుని కలుసుకున్నాం. కానీ అక్కడ నేను ఊహించనిది ఒకటి జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే అక్కడికి ఆనంద్ కూడా వచ్చాడు. ఆ రోజు ప్రమాదం లో ఆనంద్ కి తలకి గాయం అయి రక్తం బాగా పోవడం వలన తను కోమా లోకి వెళ్ళాడు, మళ్లీ ఎన్ని రోజులకు కోమా నుండి వస్తాడో తెలియక, తనకోసమే చూస్తూ నేను నా జీవితాన్ని పాడు చేసుకోకూడదు అని తన తల్లిదండ్రులే నాకు తను చనిపోయాడు అని అలా అబద్ధం చెప్పారు. ( ఆనంద్ మా ప్రేమ విషయం ఆ ప్రమాదం జరిగే ముందు రోజే తన తల్లిదండ్రులకి చెప్పి వాళ్ళని ఒప్పించాడు ). తనని చూడగానే నాకు ప్రాణాలు లేచి వచ్చినట్టుగా, ఇన్ని రోజుల తరువాత ఊపిరి పీల్చుకున్న ట్టుగా అనిపించింది, వెంటనే తనని పట్టుకుని గట్టిగా ఏడ్చాను, తను లేని నా జీవితం ఎలా ఉందో, ఎలా గడిపానో జరిగింది అంతా చెప్పాను. నాకు నిశ్చితార్థం అయింది అని తెలిసి ఆనంద్ నిర్ఘాంతపోయాడు. చాలా బాధ పడ్డాడు, పెళ్లి అంటూ చేసుకుంటే అది నన్నే అంటూ ఏడ్చాడు. ఇక ఏమి చెయ్యాలో తోచక ఇప్పటికే నిశ్చితార్థం అయిన అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది అని తెలిస్తే నా తల్లిదండ్రుల గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మా విషయం తెలిసింది కృష్ణకే కాబట్టి తన దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పాను. కృష్ణ కూడా మా ప్రేమని అర్థం చేసుకుని ఇంకొకరిని ప్రేమించి తననే మనసులో పెట్టుకుని నువ్వు నాతో జీవితాంతం సంతోషంగా ఉండలేవు. నాపై నీకు ఇష్టం ప్రేమ లేనప్పుడు నేను నిన్ను చేసుకుని సంతోషంగా ఉండలేను కాబట్టి నువ్వు ఆనంద్ నీ పెళ్లి చేసుకోవడమే సరైనది అన్నాడు. కృష్ణ నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మా ప్రేమ గురించి, మా గతం గురించి అంతా చెప్పాడు. మొదట్లో నా తల్లిదండ్రులు మా పెళ్ళికి ఒప్పుకోలేదు, ఒక అబ్బాయితో నిశ్చితార్థం జరిగి ఇంకొకరితో పెళ్లి చేస్తే మా పరువు పోతుంది అని అన్నారు. కానీ బాగా ఆలోచించిన తర్వాత కొన్ని రోజులకు నా సంతోషం ముందు వాళ్ళకి అవి అన్ని కూడా చిన్నగానే అనిపించాయి. చివరికి ఆనంద్ తో నా పెళ్లికి ఒప్పుకున్నారు. నా తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి కారణం అయిన కృష్ణనే దగ్గర ఉండి మా పెళ్లి జరిపించాడు. అలా నా జీవితంలో ఊహించని మలుపులతో ఆనంద్ తో నా పెళ్లి జరిగింది. "ఒకసారి మనం ప్రాణంలా ప్రేమించిన వాళ్ళు దూరం అయితే వాళ్లు దూరంగా ఉన్నా బ్రతికే ఉన్నారు అన్న ఒక్క చిన్న ఆశ మనల్ని బ్రతికిస్తుంది. అదే వాళ్ళు చనిపోయారు అని తెలిస్తే ఆ ఊహ కూడా మనల్ని చంపేస్తుంది, అలా మరణించి ఇక వాళ్ళు మనకి లేరు అని అనుకునే సమయానికి వాళ్ళు మళ్లీ మన జీవితంలోకి తిరిగి వస్తే....!!!" "అదే నా జీవితం". ఇట్లు దీక్ష ఆనంద్. -
నా వల్లే తను చనిపోయింది.
ఈ ప్రపంచాన్ని అందులో ఉన్న మనుషులను నడిపిస్తుంది రెండే రెండు అక్షరాల రెండు పదాలు. అందులో మొదటి రెండు అక్షరాల పదం డబ్బు అయితే... రెండోది ప్రేమ. డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతక లేడు. కానీ ప్రేమ లేకుండా ఏ మనిషికి జీవం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి మనిషి డబ్బుకోసం మాత్రమే బ్రతుకుతున్నాడు. ప్రేమ ఉన్నా లేకున్నా డబ్బు ఉంటే చాలు జీవితాంతం సంతోషంగా బ్రతికేయ్యొచ్చు అనే ఆలోచనలతోనే ఉంటున్నాడు. డబ్బు మాయలో పడి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో నిజమైన ప్రేమని కూడా అబద్దంగా మార్చేస్తున్నాడు. నిజానికి ప్రేమ గొప్పదా ...? డబ్బు గొప్పదా...? అనే ప్రశ్నకి జవాబు మాత్రం దొరకడం లేదు. ఇలాంటి చిక్కు ప్రశ్న కి సమాధానం వెతుక్కోవాల్సి న రోజూ వస్తుంది అని ఎవరం అనుకోం కదా ! కాని నా జీవితం లో అలాంటి రోజు ఒకటి వచ్చింది. ఆ క్షణం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నేను ఆ ప్రశ్న కి సమాధానాన్ని , నేను ఎదుర్కొన్న సంఘటనని మీకు చెప్పబోతున్నాను. నా పేరు అరుణ్. మాది ఒక బీద కుటుంబం. నేను , అమ్మ , నాన్న ఉండేవాళ్ళం. నా తల్లిదండ్రులు రోజూ వారి కూలి చేసి దానితో వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవాళ్ళం. ఒక్క రోజు కూలీ కి వెళ్లకుంటే ఆ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లదండ్రులు పస్తులు ఉంటూ మరీ కూలీతో వచ్చిన డబ్బులతో నన్ను బడికి పంపించి చదువించేవారు. వాళ్ళు ప్రతి రోజు నాకు ఒకటే మాట చెప్పేవారు... నువ్వు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలి అని. వాళ్ళలా నేను కూలీ పని చేసుకోకూడదు అని , బాగా కష్ట పడి చదివి బాగా డబ్బులు సంపాదించాలని వాళ్ళ కోరిక. నేను నా తల్లిదండ్రుల కష్టం చూడలేక బాగా చదువుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ప్రతి రోజూ పాఠశాలకి వెళ్తూ మంచిగా చదువుకుంటూ నా ఎం. బి. ఎ నీ మొదటి తరగతిలో పూర్తిచేశాను. తర్వాత నా మార్కులను , నాలోని నైపుణ్యాలను చూసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నాకు వాళ్ళ కంపెనీ లో పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. నేను ఎంతో సంతోషంగా వెళ్లి నా తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పాను, వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇక నేను ఆ కంపెనీకి వెళ్లి పని చెయ్యడం ప్రారంభించాను. అలా నా జీవితంలో సంపాదన ప్రారంభం అయింది. నేను అనుకున్నట్టుగానే బాగా సంపాదించడం ప్రారంభించాను. నేను పని చేస్తున్న కంపెనీ లోనే ప్రమోషన్లు పొందుతూ బాగా సంపాదిస్తూ నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే ఉన్నత స్థాయికి ఎదిగాను. ఇలా సంపాదనలో మునిగి తేలుతున్న నా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ మలుపుకి కారణం ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రాక నన్ను నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. డబ్బు పిచ్చితో బ్రతుకుతున్న నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి , ప్రేమ లోతుల్ని అర్థం అయ్యేలా చేసిన ఆ అమ్మాయి పేరు దీప్తి. తను నేను పనిచేసే కంపెనీలోన నా సహోద్యోగి. నేను కంపెనీలో చేరిన మొదట్లో పని విషయంలో నాకు ఎలాంటి సందేహం ఉన్న తీర్చేది. ఒక్కోసారి నా పని కూడా తనే చేసేది. అలా అలా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. తను మొదటి నుండి నాపై ఎక్కువగా జాగ్రత్త , ప్రేమ , అభిమానాలు చూపించేది. ఇక అలా తను చూపించే ప్రేమాభిమానాలకి నేను ముగ్ధుడిని అయ్యాను. నాకు తెలియకుండానే నేను తనతో ప్రేమలో పడిపోయాను. అలా అలా మా పరిచయం కాస్తా ప్రేమగా, సన్నిహితులం కాస్తా ప్రేమికులుగా మారిపోయాం. ఒకే కంపెనీ కావడంతో మా ప్రేమకి ఎలాంటి అడ్దంకులు , ఇబ్బందులు ఉండేవి కావు. దీప్తి మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. నన్ను మా ఇంట్లో చెప్పి ఒప్పించమంది. సరే అని నేను చెప్పబోయాను . కానీ అంతలోనే సిటీలోనే అతి పెద్ద కంపెనీకి ఓనరు వచ్చి నా నైపుణ్యాలను , సామర్థ్యాల ను చూసి నన్ను వాళ్ళ కంపెనీలో చేరమని చెప్పడానికి వచ్చారు . అంతే కాకుండా నన్ను తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీని కూడా నా సొంతం చేస్తాను అని అన్నాడు. ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు , బాగా ఆలోచించాను ఇంత డబ్బు దానితో పాటు అమ్మాయి వస్తుంది అంటే ఏ అబ్బాయి అయినా ఎందుకు కాదు అంటాడు. పైగా నాకు ఉన్న డబ్బు పిచ్చితో ప్రేమ కావాలా...? డబ్బు కావాలా...?అంటే డబ్బే కావాలి అని నేను దానికి ఒప్పుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న దీప్తి ఏకంగా మా ఇంటికే వచ్చి నా తల్లిదండ్రులకు జరిగింది అంతా చెప్పి ,,," ఛీ!!! నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు. నీకు డబ్బు అంటే ఇంత పిచ్చి ఉంది. నువ్వు డబ్బుకోసం ఏం అయినా చేస్తావ్ , ఎంతకైనా దిగజారుతావు అని నాకు ఇన్ని రోజులలో తెలియలేదు , తెలిసుంటే నీలాంటి వాడిని అస్సలు ప్రేమించేదానినే కాదు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను నా ప్రేమని కాదని వెళ్ళావో ఏదో ఒక రోజు నువ్వు నీ డబ్బు తప్ప నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను చూసుకునేవారు ఎవరు ఉండరు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను మోసం చేశావో అదే డబ్బు మాయలో పడి నువ్వు తప్పకుండా మోసపోతావు" అని నన్ను తిట్టి....బోరుమని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన నా తల్లిదండ్రులు ఎంతో బాధ పడుతూ " నువ్వు ఇంత బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఇంత సంపాదిస్తుంటే నా కొడుకు అని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్పుకుని తిరిగాం... కానీ నువ్వు ఇంత నీచుడివని, డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీ వదులుకున్నావు, నీలాంటి కొడుకు మాకు పుట్టకున్న బాగుండు అనిపిస్తుందన్నారు. దీప్తి మాటలు , నా తల్లిదండ్రుల మాటలు విన్నాక నాపై నాకే అసహ్యం వేసింది. నేను చేసిన తప్పు ఏంటో బాగా తెలిసొచ్చింది. ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా దీప్తి దగ్గరకి వెళ్ళాను. కానీ.... నేను వెళ్ళే సరికి దీప్తి లేదు తన శవం మాత్రం ఉంది. నన్ను తిట్టి అక్కడి నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్తున్న దీప్తినీ ఒక లారీ వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ వార్త విని ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను . ఏమి చెయ్యలేక పిచ్చి వాడిలా దీప్తి పై పడి నువ్వు , నీ ప్రేమ నాకు కావాలి అని గుండెలు పగిలేలా ఏడ్చాను . కానీ ఏమి లాభం బ్రతికుండగా వద్దు అని చనిపోయాక కావాలి అంటే ఏదీ రాదు కదా..!! నాకున్న నా డబ్బు పిచ్చే దీప్తి చావు కి కారణం అయింది. డబ్బే లోకం అనుకునే నన్ను తన లోకంగా భావించి, ప్రేమించిన దీప్తి నీ దూరం చేసుకునీ ,,, చివరకి తప్పు తెలుసుకుని తను తన ప్రేమ కావాలని వెళ్తే అందనంత దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళింది నా దీప్తి. తను లేని లోటు తీరనిది. తను చనిపోయాక దీప్తినే తల్చుకుంటూ , నేను చేసిన తప్పుకి బాధ పడుతూ నా తల్లిదండ్రులు చెప్పింది వింటు ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నా ఈ జీవితానికి నేనే విలన్ . డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ దానికంటే విలువైంది మరొకటి ఉంది అదే ప్రేమ అని తెలుసుకోలేక పోయాను. నేను డబ్బు కావాలా? ప్రేమ కావాలా ? అన్నప్పుడు నాకు ప్రేమే కావాలి అని అనుంటే ఈ రోజు నా జీవితం దీప్తి తో చాలా అద్భుతంగా ఉండేది. నా జీవితం నాకు నేర్పింది ఏంటంటే డబ్బు కన్న ప్రేమే గొప్పది . ఎందుకంటే డబ్బుతో ప్రపంచం నడుస్తుండొచ్చు కానీ మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రేమ కావాలి ""మనం పుట్టినప్పుడు మనల్ని జాగ్రత్త గా చూసుకునే "అమ్మ ప్రేమ" పెరుగుతూ ఉన్నప్పుడు మనల్ని నడిపించే "నాన్న ప్రేమ" సరదాగా ఆనందించే సమయంలో "మిత్రుల ప్రేమ" పెళ్లి అయ్యాక "భార్య/ భర్త ప్రేమ" ముసలి వాళ్ళం అయ్యాక "పిల్లల ప్రేమ" . ఇక్కడ ప్రేమించే విధానం , ప్రేమించే వ్యక్తులు వేరు కావచ్చు కానీ , ప్రేమ మాత్రం ఒక్కటే ,,,,అదే శాశ్వతం. డబ్బు ప్రతి ఒక్కరీ దగ్గరా ఉంటుంది కానీ ప్రేమ మాత్రం కొందరికే దక్కుతుంది. మన జీవితం లో ఒక్క నిమిషంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ఊహించలేని మలుపు తిప్పుతాయి. కాబట్టి ఆ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ప్రేమ బాటకై అడుగేద్దాం ఇట్లు ఈ విషాద గాథకి విలన్ అరుణ్ (హైదరాబాద్). -
మీ ప్రేమ జాతకం తెలుసుకోండి!
మేషం: అనుకున్న ఇష్టులైన వారికి సందేశాలు అందించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలు అవతలివారు వినమ్రంగా స్వీకరించే వీలుంటుంది. ఇక ఈ సమయంలో మీరు ఆరెంజ్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. వృషభం: మీ మనస్సులో ఇంతకాలం దాచుకున్న భావాలను మీరు అత్యంత ఇష్టపడే వారికి తెలిపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, శుక్ర, బుధవారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమిస్తే మంచిది. మిథునం: మీమనస్సులో ఉన్న వారికి ప్రేమసందేశాలు అందించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవిగా చెప్పొచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వైపు నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, పింక్ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి. కర్కాటకం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను శుక్ర, బుధవారాలు వెల్లడిస్తే అనుకూలత ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రతిపాదనలను అవతలి వారు సైతం అంగీకరించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు రెడ్, వైట్ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి ఉత్తరఈశాన్యదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. సింహం: మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని అభిప్రాయాన్ని తెలియజేసేందుకు ఆది, సోమవారాలు అనువైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఇక ఈసమయంలో మీరు ఆరెంజ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే అనుకూలం. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. కన్య: మీ మనస్సులోని భావాలను ఇష్టపడే వారికి తెలిపేందుకు సోమ, మంగళవారాలు అత్యంత అనుకూలత ఉంటుంది. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలను అవతలి వారు మన్నించే అవకాశాలుంటాయి. ఈ సమయంలో మీరు ఎల్లో, వైట్ రంగు దుస్తులు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే మంచిది. ఇక, శుక్ర, బుధవారాలు మీ ప్రయత్నాలను విరమించండి. తుల: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ మదిలో దాచుకున్న అభిప్రాయాలను తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ మనోగతాన్ని అర్థం చేసుకున్న అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లోరంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరితే శుభప్రదంగా ఉంటుంది. ఇక, శుక్ర, శుక్రవారాలు వీటికి దూరంగా ఉండండి. వృశ్చికం: మీరు కోరుకున్న వ్యక్తులకు మీ ప్రేమసందేశాలను అందించేందుకు శని, బుధవారాలు అత్యంత అనువైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలు అవతలి వారి ఆమోదం పొందే వీలుంది. ఈ సమయంలో మీరు బ్లూ, వైట్ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే శుభప్రదంగా ఉంటుంది. ఇక, ఇటువంటి వాటికి సోమ, మంగళవారాలు దూరంగా ఉండండి. ధనుస్సు: మీ మనస్సులోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలు అవతలి వారిని ఆకట్టుకుంటాయి. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లోరంగు దుస్తులు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, మీ ప్రయత్నాలకు శుక్ర, బు«దవారాలు స్వస్తి చెప్పడం మంచిది. మకరం: మీ మనోగతాన్ని ఇష్టులకు తెలిపేందుకు శుక్ర,మంగళవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో అవతలి నుంచి కూడా అనుకూల స్పందనలు వచ్చే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, బ్లూ రంగు దుస్తులు «ధరిస్తే మంచిది. అలాగే, పశ్చిమదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక, ఆది, గురువారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. కుంభం: మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని భావాలను తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజులో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు ఎల్లో, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే మంచిది. ఇక, శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి. మీనం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలియజేసేందుకు మంగళ, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలను అవతలి వారు ఆమోదించే వీలుంది. ఈ సమయంలో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభప్రదంగా ఉంటుంది. అయితే, శుక్ర, ఆదివారాలు వీటికి దూరంగా ఉండండి. -
ఎవరైనా ఇలా ప్రేమిస్తారా?
ప్రేమ ఎప్పుడు , ఎక్కడ , ఎలా మొదలవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఒకసారి ప్రేమ లో పడితే ఇంకా ఆ ప్రపంచమే వేరు. ఈ రోజుల్లో కొందరు మాత్రమే నిజంగా ప్రేమిస్తున్నరు, మరికొందరు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. అయితే మనల్ని మనస్పూర్తిగా ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే చాలు మనకి తెలియకుండానే మనం సంతోషంగా ఉంటాం. మన కళ్ళల్లోకి చూసి మన మనసులో ఏమి ఉందో చెప్పేస్తారు. మన గతంతో సంబంధం లేకుండా ప్రస్తుతం , భవిష్యత్తులో మనల్ని ఎలా సంతోషంగా చూసుకోవాలి అనే ఆలోచిస్తారు. నేను నా జీవితంలో ఈ రెండు ప్రేమలని ( అవసరం కోసం ప్రేమిస్తున్నట్టు నటించే ప్రేమని, మన కోసం, మన సంతోషం కోసం మనల్ని మనల్ని గా ప్రేమించే ప్రేమని ) అనుభవించాను . నేను నా జీవితంలో ఎదుర్కొన్న ప్రేమ అనే భూటపు నాటకాన్ని , ఆ తర్వాత నేను అనుభవించిన సంఘటనలు , ఎదుర్కొన్న పరిణామాలను నేను మీతో పంచుకొబోతున్నాను. నా పేరు ప్రజ్ఞ. నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. నా తల్లిదండ్రులు నేను ఏది అడిగినా కాదు, లేదు అనకుండా అన్ని ఇచ్చి నన్ను సంతోషంగా చూసుకునేవారు. అలాంటి తల్లిదండ్రులకి నేను ఏమి ఇవ్వగలను మంచిగా చదువుకుని ఒక గొప్ప ఉద్యోగం చేసి వారిని సంతోషంగా చూసుకోవడమే నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం. అలా అని నేను ప్రతి రోజూ కళాశాలకు వెళ్తూ చదువుకుంటూ , ఇంటికి వచ్చాక ప్రతి రోజూ రాత్రి నా తల్లిదండ్రులతో కాసేపు సమయం గడిపి నా రోజూ పూర్తి చేసుకునేదానిని. ఇలా సాఫీగా సాగుతున్న నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితంలో కలలో కూడా ఊహంచని మలుపు తీసుకొచ్చింది. నేను ప్రతి రోజులానే కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నన్ను నా చిన్ననాటి మిత్రుడు కలిశాడు. తన పేరు రేవంత్. చాలా సంత్సరాల తర్వాత కలవడం వల్ల నేను తనని మొదట్లో గుర్తు పట్టాలేకపోయా. కానీ మా పాత రోజులని గుర్తు చెయ్యడం వల్ల తనని గుర్తు పట్టా. ఇక కాసేపు తనతో అలానే మాట్లాడి ఇంటికి ఆలస్యం అవుతుందని నేను వచ్చేశా. మళ్లీ తనని కలుస్తా అని కూడా అనుకోలేదు. కాని ప్రతి రోజూ నా కళాశాల అయిపోగానే నన్ను కలవడం మొదలు పెట్టాడు. నేను నా చిన్ననాటి మిత్రుడే కదా అని కలిసిన ప్రతి సారి మాట్లాడేదాన్ని. కాని ఒకరోజు తను అలా ప్రతి రోజు కలవడం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు. అది ఏంటి అంటే......తను నన్ను ప్రేమిస్తున్నాడు అని....ఈ విషయాన్ని నాకు కొన్ని రోజుల తరువాత అది కూడా ఇలా ప్రతి రోజూ మాట్లాడడం సరియైనది కాదు అని నేను మాట్లాడడం మానేస్తే చెప్పాడు. తనకి చిన్నతనం నుండే నేను అంటే ఇష్టం అని, అప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలియని వయస్సు అని , తీరా తెలిసే సరికి నేను ఎక్కడ ఉంటున్నానో తెలియక తన ప్రేమని తనలోనే దాచుకుని నా కోసం వెతికితే నేను ఆ కళాశాలలో చదువుతున్నాను అని తెలిసి నాకోసం ఆ కళాశాలకు రావడం ప్రారంభించాను అని మొత్తం చెప్పేశాడు. తను అలా చెప్పేసరికి నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే నాకు కొంత సమయం కావాలి అని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక మొత్తం అదే ఆలోచనతో ఉండిపోయాను.నేను బాగా ఆలోచించాను. చిన్నతనం నుండి నన్నే ప్రేమిస్తున్నాడు. మా ఇద్దరి మధ్య దూరం పెరిగినా, నేను ఎక్కడ ఉంటానో తెలియకున్నా, మళ్లీ కలుస్తానో లేనో కూడా తెలియకున్నా, నన్నే ప్రేమించాడు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వెంట పడలేదు, ఏ అమ్మాయి నీ ప్రేమించలేదు. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు ఎవరు ఉన్నారు అని, తనపై నాకు ఇష్టం పెరిగింది. కొన్ని రోజులకు ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారి మేము ఇద్దరం సంతోషంగా పార్కులకి , సినిమాలకి , షికార్లకు తిరిగాం. నా తల్లదండ్రులు నేను అడిగింది ఏదైనా ఇస్తారు అలాగే రేవంత్ తో కూడా నా పెళ్లి చేస్తారు అనే నమ్మకంతో అన్ని తిరిగాం. ప్రతి రోజు లానే ఆ రోజు కూడా నా తల్లిదండ్రులలో రాత్రి మాట్లాడుతూ... రేవంత్ విషయం చెప్పేశాను. వాళ్ళు ఒప్పుకోలేదు కదా.. వెంటనే వాళ్ళు నాకు వేరే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇక నేను వెంటనే తన దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పి , ఇద్దరి ఇళ్ళల్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దానికి రేవంత్ ఒకేసారిగా గట్టిగా నవ్వి పెళ్లా...?? నువ్వు ఏమి మాట్లాడుతున్నావు ??? నేను నా అవసరం కోసం ప్రేమించాను అని చెప్పాడు. నా అవసరం తీరింది, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు ఇక నువ్వు నాకు వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఎంత వేడుకున్నా వినకుండా వెళ్ళిపోయాడు. తను నా నుండి కోరుకుంది నా అందం మాత్రమే. నా ప్రేమ కాదు అని నాకు అప్పుడు తెలిసింది. తను చేసిన ఆ మోసాన్ని నేను తట్టుకోలేకపోయా... చనిపోదాం అని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం కూడా చేశాను. కాని నా తల్లదండ్రులు నన్ను కాపాడారు. ఇలా చావడం కోసమేనా మేము నిన్ను ఇంత కష్ట పడి పెంచి చదివించింది అని అన్నారు. తను ఏలాంటి వాడో తెలియడం కోసమే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు నటించాం. ఇప్పటికీ అయినా నీకు తను ఎలాంటి వాడో తెలిసింది కదా...!! ఇకపై నువ్వు తనని మర్చిపోయి మంచిగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలి అని నన్ను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో , రేవంత్ పై ఉన్న కసితో పీ.జీ పూర్తి చేసుకుని ఒక మంచి కంపెనీ లో ఉద్యోగం లో చేరాను. అనుకున్నట్టుగానే నా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకున్నాను. కాని ఎక్కడో ఒక లోటు , ఒక బాధ మనస్పూర్తిగా ప్రేమించినందుకు ఇంత మోసమా అని....నా బాధని నా తల్లిదండ్రులు అర్థం చేసుకుని నాకు ఆ బాధని, ఆ లోటుని తీర్చాలని ఒక మంచి వ్యక్తిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. విచిత్రం ఏమిటంటే నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తికి నా గతం అంతా తెలుసు...నా గురించి నా గతం గురించి తెలుసుకుని మనస్పూర్తిగా నన్ను నన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నేను అనుకున్నావన్ని నాతో చేయిస్తున్నాడు. నేను కొంచెం బాధ పడ్డాకాని నా కళ్ళలోకి చూసి నా బాధని అర్థం చేసుకుని నాకు ఆ బాధ లేకుండా చేస్తాడు. తనతో ఉంటే నాకు ఇంకా వేరే ప్రపంచమే గుర్తురాకుండా చూసుకుంటున్నాడు. తన ప్రేమ ఎలా ఉంటుంది అంటే "అబ్బా..!!! ఒక మనిషిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా ....???" అని అనిపించేలా ఉంటది..తన ప్రేమ నాకు రేవంత్ నీ తను చేసిన మోసాన్ని కూడా మర్చిపోయేలా చేసింది. ఇలా నా జీవితంలో ఒకరితో ప్రేమలో మోసపోయి, జీవితాంతం తోడుండి సంతోషంగా చూసుకుని ప్రేమని పంచే మరొకరిని పెళ్ళిచేసుకున్నాను.మన జీవితంలో ఒకరిని ప్రేమించి మోసపోతే మన జీవితం అక్కడికే అయిపోయినట్టు కాదు. మనల్ని ప్రేమించే మన తల్లిదండ్రులు, మన గురించి మన గతం గురించి తెలుసుకుని మనకి మంచి భవిష్యత్తునీ ఇచ్చి మనల్ని మనలా ప్రేమించే వారు తప్పకుండా వస్తారు. "ప్రేమిస్తున్నాను అనే మాటలో ప్రేమ ఇవ్వడం మాత్రమే కాదు ,, మనం ప్రేమించిన వారికి మంచి జీవితాన్ని , సంతోషాన్ని కూడా ఇవ్వాలి. ఇది నా కథ ...... నా పేరు ప్రజ్ఞ ( ప్రజ్ఞ శ్రీనివాస్ ) -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం : మీ మనోగతాన్ని ఇష్టులకు తెలిపేందుకు శని, ఆదివారాలు అద్భుతమైన రోజులని చెప్పవచ్చు. ఈ కాలంలో మీ ప్రయత్నాలు సఫలమై శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. వృషభం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ భావాలను వ్యక్తం చేసేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో అవతలి వైపు నుంచి కూడా సానుకూల స్పందనలు రావచ్చు. ఈరోజుల్లో మీరు గ్రీన్, పింక్ రంగు దుస్తులు ధరించడం ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది. మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని అభిప్రాయాలను తెలిపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సఫలమై అవతలి వారు కూడా అనుకూల సందేశాలు ఇచ్చే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభాలు కలుగుతాయి. అయితే, శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండడం ఉత్తమం. కర్కాటకం : మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు చెప్పేందుకు మంగళ, బుధవారాలు అత్యంత అనుకూల సమయాలు. ఇటువంటి సమయంలో మీ ప్రయత్నాలు కొనసాగిస్తే అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు చేసే రోజుల్లో గ్రీన్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలు విరమిస్తే మంచిది. సింహం : మీ భావాలను మనస్సులోని వారికి తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ ప్రతిపాదనల సమయంలో మీరు ఎల్లో, బ్లాక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక, మంగళ, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి. కన్య : మీ అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు సోమ, మంగళవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలపై అవతలి వారి నుంచి అనుకూలత వ్యక్తం కావచ్చు. ఈ రోజుల్లో మీరు పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు ప్రయత్నాలు విరమించడం మంచిది. తుల : మీరు అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను తెలిపేందుకు శుక్ర, సోమవారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వైపు నుంచి కూడా సానుకూల వైఖరి వ్యక్తం కావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. అయితే, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి. వృశ్చికం : మీలోని అభిప్రాయాలను మీరు ఇష్టపడే వారికి తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇక ఈరోజుల్లో ఆరెంజ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, శని, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. ధనుస్సు: మీ మనస్సులోని అభిప్రాయాలను మీరు ఇష్టపడే వారికి తెలియజేసేందుకు శుక్ర, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వ్యక్తుల నుంచి శుభవార్తలు అందే వీలుంటుంది. ఈ సమయంలో మీరు ఆరెంజ్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలలో ఈ వ్రయత్నాలు విరమించండి. మకరం : మీరు కోరుకున్న వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. ఈ సమయంలో అవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు వైట్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే మంచిది. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. కుంభం : మీ అభిప్రాయాలను ఇష్టమైన వారికి తెలిపేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా శుభవర్తమానాలు అందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే మంచిది. ఇక, మంగళ, బుధవారాలు మీ ప్రయత్నాలు విరమిస్తే మంచిది. మీనం : మీరు కోరుకున్న వారికి మనస్సులోని అభిప్రాయాలను తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత శుభదాయకమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలపై అవతలి వ్యక్తులు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. -
వారంలో పెళ్లి... అంతలోనే!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఊహించలేము. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్లుగా మనం ఎన్ని చేద్దాం అనుకున్నా జరిగేది ఆపలేము. ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. మాది చాలా రిచ్ ఫ్యామిలీ. నేను కోరుకున్నది అప్పటి వరకు అన్ని దక్కాయి. ఓడిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మనాన్నలకు నేనొక్కడినే. నా పేరు అభి. నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నేను అడగకుండానే అన్ని ఇచ్చారు. ఏది అడిగిన ఎప్పుడు కాదనలేదు. నేను మా కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సరిత. చాలా మంచిది. మానవత్వం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. చిన్న వయస్సులోనే ఇలా ఉండటం చూసి నాకు చాలా బాగా నచ్చింది. నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాను. తను కొన్ని రోజులు తరువాత నాకు ఒకే చెప్పింది. వాళ్ల ఇంట్లో ఒప్పుకుంటే నన్ను చేసుకోవడానికి తనకి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని చెప్పింది. నేను మా ఇంట్లో విషయం చెప్పాను. ఎప్పటిలాగానే వాళ్లు నా ఇష్టానికి అడ్డుచెప్పలేదు. వాళ్లే వెళ్లి సరిత వాళ్ల ఇంట్లో మాట్లాడారు. కులాలు వేరు కావడంతో మొదట వాళ్లు ఒప్పుకోకపోయిన తరువాత అంగీకరించారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకున్నాం. పెళ్లి పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. పెళ్లి ఇంకో వారం ఉందనగా అనుకోని ఘటన జరిగింది. సరిత యాక్సిడెంట్లో చనిపోయింది. రెండు కుటుంబాలలో విషాదం అలముకుంది. నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా బాధ చూడలేక మా అమ్మ ఆరోగ్యం కూడా పాడైంది. నేను ఆ బాధలో నుంచి బయటపడటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సరిత రోజు గుర్తుకొస్తూనే ఉంటుంది. మనం ఎన్ని అనుకున్న ఏదీ జరగాలనుంటే అదే జరుగుతుందని అర్థం అయ్యింది. మా ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నేను మాత్రం సరిత ఆలోచనల్లో నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నాను. తన స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. అభి, కృష్ణా జిల్లా. -
అంతా బాగున్న సమయంలో అలా జరిగింది!
నా పేరు వినయ్. నాది చాలా హ్యాపీ లైఫ్. అన్ని ఉన్నాయి నాకు. మంచి అమ్మనాన్న, అల్లరి చేసే చెల్లి, ప్రేమగా చూసుకునే నాన్నమ్మ, తాతయ్య అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా ఆనందంగా ఉండేది మా లైఫ్. అంతా మంచిగా ఉంటుంది అనుకున్న సమయంలో మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. అంతా ఒక్కసారిగా తలకిందులై పోయింది. మా ఇంట్లో నవ్వులు మాయమయ్యాయి. మా నాన్న ఇష్టం లేకపోయిన రెండో పెళ్లి చేసుకోవల్సి వచ్చింది. మా చెల్లి చాలా చిన్నపిల్ల. తనకోసమే మా నాన్న మా పిన్నిని చేసుకున్నారు. ఇంకా మాకు కష్టాలు మొదలయ్యాయి. రోజు ఏదో ఒక గొడవ. ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వేసేది. నేను ఇంటర్ అయిపోయి బీటెక్‌లో జాయిన్ అయ్యాను. ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు. చాలా సైలెంట్‌గా ఉండేవాడ్ని. అప్పుడే నా లైఫ్‌లోకి నందు వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ పక్క వారిని నవ్విస్తూ ఉండేది. తను నా దగ్గరకు కూడా వచ్చి ఎందుకు బాబు ఎప్పుడు మొహం ఉమ్మ్...అని పెట్టుకొని ఉంటావు అంది. నాకు కోపం వచ్చి నువ్వు ఎవరివే నన్ను అడగడానికి పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాను. అంతే తన కంట్లో నుంచి నీళ్లు ధారలా కారిపోయాయి. తను ఎప్పుడు ఏడవడం నేను చూడలేదు. నాకే చాలా బాధ వేసింది. తరువాత కొద్దిసేపటికి నేనే వెళ్లి సారీ చెప్పాను. నందు చాలా మంచిది వెంటనే క్షమించేసింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మొదలు పెట్టాను. చాలా చక్కగా మాట్లాడేది. మా ఇంట్లో విషయాలు తనతో చెప్పాను చాలా బాధపడింది. నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. నా కోసం స్పెషల్‌గా బాక్స్ తెచ్చేది. మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. మళ్లీ నా లైఫ్‌లోకి హ్యాపీ డేస్ వచ్చాయి అనిపించింది. తను లేకుండా నేను ఉండలేకపోయేవాడ్ని. అందుకే తనకు ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లైఫ్ లాంగ్ మా అమ్మను ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తాను అని చెప్పాను. తను కూడా ఒక వారం టైం తీసుకొని మా ఇంట్లో ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటాను అంది. మా ఇద్దరి కాస్ట్‌లు వేరు. అయినా నేను చదువు అయిపోయిన వెంటనే మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ల ఇంట్లో ఒప్పించాను. మా నా జీవితంలోకి సంతోషం వచ్చింది. నందు, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి ఉంటున్నాం. మా చెల్లిని కూడా నందు అమ్మలా చూసుకుంటుంది. నా నందు దొరకడం నా అదృష్టం. ఐ లవ్ యూ సో మచ్ నందు. వినయ్ కర్నూలు. -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం: మీ అభిప్రాయాలను, మనోగతాన్ని ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈకాలంలో మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తే అవతలి నుంచి కూడా సానుకూల సందేశాలు రావచ్చు. ఇక ఈరోజుల్లో మీరు పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, సోమ, మంగళవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. వృషభం: మీ మనస్సులోని భావాలను ప్రీతిపాత్రులకు తెలియజేసేందుకు శని, బుధవారాలు సానుకూలం. ఈరోజుల్లో మీనోట వచ్చిన శుభసందేశంతో అవతలి వారు మరింత ఉత్సాహం చూపుతారు. ఈ సమయంలో మీరు రెడ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, ఆది, సోమవారాలు వీటికి స్వస్తి చెప్పడం మంచిది. మిథునం: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ సమయంలో మీ అభిప్రాయాలను అవతలి వారు మన్నించి మీకు సానుకూల సందేశం అందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక శుక్ర, శనివారాలు ఇటువంటి ప్రయత్నాలు విరమించండి. కర్కాటకం: మీరు కోరుకున్న వ్యక్తులకు ఇంతకాలం మీలో దాచుకున్న భావాలను తెలియజేసేందుకు శని, సోమవారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు గ్రీన్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. సింహం: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు సోమ, గురువారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే అవకాశాలుంటాయి. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. కన్య: మీమనస్సులో ఆరాధించే వారికి మీ అభిప్రాయాలను వెల్లడించేందుకు శుక్ర, సోమవారాలు విశేషమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ అభిప్రాయాలపై అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేయవచ్చు. ఈరోజుల్లో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే అనుకూలం. ఇక ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, ఆది, బుధవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. తుల: మీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను మీరు ఇష్టపడే వారికి తెలిపేందుకు శని, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీకు అవతలి వ్యక్తులు కూడా సానుకూల సందేశాలు అందించే వీలుంది. ఈరోజుల్లో మీరు ఆరెంజ్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇక, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంద. ఇక, సోమ, మంగళవారాలు మాత్రం మీ ప్రయత్నాలు విరమించండి. వృశ్చికం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ మనోగతాన్ని తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ అభిప్రాయాలకు అవతలి వారు సైతం అనుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మీ ప్రతిపాదనల సమయంలో ఎల్లో, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శని, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ధనుస్సు: మీరు మనస్సులో ఆరాధించే వ్యక్తులకు మీ మనోగతాన్ని తెలిపేందుకు సోమ, బుధవారాలు చాలా అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ అభిప్రాయాలకు అవతలి వారు కూడా తక్షణం స్పందించే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మకరం: మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలు మీరు కోరుకున్న వ్యక్తులకు అందించేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి నుంచి కూడా సానుకూల సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరితే లాభదాయకంగా ఉంటుంది. ఇక, సోమ, మంగళవారాలు మాత్రం ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. కుంభం: మీరు అభిమానించే వ్యక్తులకు మనస్సులోని భావాలను తెలిపేందుకు శని, ఆదివారాలు చాలా అనుకూలమైనవి. ఈ సమయంలో మీ ప్రతిపాదనలు విన్న అవతలి వారు అనుకూలంగా స్పందించే వీలుంది. ఈ రోజుల్లో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. ఇక, మంగళ, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మీనం: మీరు ఇష్టపడే వారికి మనోగతాన్ని తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ అభిప్రాయాలకు అవతలి వారు కూడా తమ ఇష్టాన్ని తెలియజేసే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభకరంగా ఉంటుంది. అయితే, శుక్ర, శనివారాలు మాత్రం మీ ప్రయత్నాలను విరమిస్తే మంచిది. -
ఎన్నోసార్లు అడిగింది కానీ....
మాది అందమైన ఊరు. చుట్టూ పచ్చని పొలాలు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కల్మషం లేని మనుషులు. నేను ఇంటర్ వరకు మా ఊరిలోనే చదివాను. చాలా హ్యాపీగా గడిచిపోయేది జీవితం. తరువాత బీటెక్ చదవడం కోసం నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ వాళ్లను చూస్తేనే భయమేసేది. ఎవ్వరూ నాలా లేరు. అందరూ చాలా స్టైల్‌గా ఉన్నారు.వాళ్లందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవారు. నేను క్లాస్‌లో జాయిన్ అయిన రోజే నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఫస్ట్ టైమ్ తనని ఎల్లో కలర్ డ్రెస్‌లో చూశాను. తన జుట్టు రింగులు రింగులుగా ముఖం మీద పడుతూ ఉండేది. చాలా అందంగా ఉండేది. తనని అలా చూస్తూ ఉండాలనిపించేది. తను రాగానే ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంది. చాలా సైలెంట్‌గా ఉండేది.అందరు పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటుంటే తన పేరు చందు అని తెలిసింది. తను ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. తనతో మాట్లాడం ఎలా అని ఆలోచించేవాడిని. క్లాస్‌లో ఎప్పుడు ఏ కార్యక్రమ జరిగిన తను ముందుండేది. ఇంగ్లీష్‌లో టకటక మాట్లాడేది. అది చూస్తేనే నా గుండె దడదడ అనేది. తనతో ఎలా అయిన ఫ్రెండ్షిప్ చేయాలి అని ఆలోచించే సమయంలో తను మా ఫ్రెండ్ వాళ్ల లవర్ రూమ్మేట్ అని తెలిసింది. ఇంకా నా లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాను. మా ఫ్రెండ్‌కు చెబితే కావాలని మేం ఇద్దరం కలిసేలా ప్లాన్ చేశారు. మేం కలిసిన తరువాత తను అడిగిన ప్రశ్న విని నేను షాక్ అయ్యాను. నువ్వు మా క్లాస్యేనా? నిన్ను ఎప్పుడూ చూడలేదే నీ పేరు ఏంటి అని అడిగింది. అప్పుడు నన్ను నేనే ఎన్ని తిట్టుకున్నానో తెలియదు. తరువాత నుంచి రోజు క్లాస్‌లో చూసి నవ్వేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేది. తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆమెతో నాతో మాత్రమే మాట్లాడేది. నా నెంబర్, తన నెంబర్ పక్కపక్కనే ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగిన తన వెనకాలే నేను ఉండేవాడిని. తను మాత్రం కొంచెం కూడా కాపీ కొట్టనిచ్చేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాక నేను,చందు, చందు వాళ్ల ఫ్రెండ్ బాగా క్లోజ్ అయిపోయాం. రోజు కలిసి క్యాంటీన్‌కి వెళ్లి తిని రచ్చ రచ్చ చేసేవాళ్లం. అందరు మమ్మల్ని చూసి మా లాగా ఉండాలి అనుకునే వాళ్లు. అలాగే చాలా మంది చందు నాకు ఓకే చెప్పేసింది, మేమిద్దరం లవర్స్ అనుకునేవాళ్లు. వాళ్ల మాటలన్ని విని తను చాలా సార్లు నేనుంటే నీకిష్టమా? ఎందుకు అందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడిగేది. తను అంటే ఇష్టం ఉన్ననిజం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందో అని అదేం లేదు, చాలా మంది చాలా అనుకుంటారు వదిలేయ్ అని చెప్పేవాడ్ని. మా ఫైనల్ ఇయర్లో తనకు మా ప్రేమ విషయం చెబుదాం అనుకున్నాను. కానీ ఇంతలో తను నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తను వేరు అతనితో ప్రేమలో పడింది అని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడకుండా సరే అని అన్నాను. తరువాత నాకేమైందో తెలియదు ఆరోజు రాత్రి తనని ఫోన్ చేసి అసలు నువ్వు వాడిని ఎందుకు లవ్ చేశావ్. వాడు నీకు సెట్ కాడు. మీరు విడిపోతారు అని ఇష్టం వచ్చినట్లు తిట్టేశాను. తనని చాలా బాధ పెట్టాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చాలా సార్లు అడిగాను అప్పుడు ఏం చెప్పలేదు. ఎప్పుడు ఇలా మాట్లాడతావనుకోలేదు అని చెప్పింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. నన్ను చూడలేదు. మా కాలేజ్ అయిపోయి నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు తను ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. ఒక్కసారి తనకి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాలనుంది. ఇట్లు అరవింద్‌కుమార్ కరీంనగర్ -
అతనికి లవర్ ఉందని తెలిసినా....?
నా పేరు కావ్య. నేను ఇంటర్వ్యూ కోసం ఒక ఆఫీస్‌కు వెళ్లాను. ఆ ఆఫీస్ చూడటానికి చాలా బాగుంది. అంత పెద్ద బిల్డింగ్‌ను చూడగానే భయపడుతూనే లోపలికి వెళ్లాను. రిసెస్ఫన్లో కుర్చున్నాను. ఇంటర్వ్యూ కోసం లోపలికి పిలవడానికి చాలా సేపే పట్టింది. నేను ఒక సోఫాలో కూర్చొని వచ్చే పోయే వాళ్లను గమనిస్తూ ఉన్నాను. అప్పుడే ఫస్ట్ టైం తనని చూశాను. చూడటానికి చాలా పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరిని చూసినా నాకు అంతలా నచ్చలేదు. వచ్చిన ఇంటర్య్వూ గురించి కాకుండా నా ఆలోచనలన్ని అతని చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఉద్యోగం వస్తే అతనిని కలవచ్చు అనుకున్నాను. అసలు అతను ఎవరో కూడా తెలియదు. కానీ ఎందుకో నన్ను కట్టిపడేసేలా ఉన్నాడు. అందమైన అమ్మాయిని చూడగానే అబ్బాయిలు కవిత్వాలు ఎలా చెబుతారా అనుకునే దాన్ని. తనని చూశాక నచ్చిన వాళ్లు కనబడితే కవితలు, పాటలు అలాగే వస్తాయి అని అర్థం అయ్యింది. ఇంటర్వ్యూ బాగానే జరిగింది. ఇంటికి వెళ్లిపోయాక కూడా ఎందుకో తనే కనబడుతున్నట్లు ఉంది. ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ ఆఫీస్ నుంచి సెలెక్ట్ అయినట్లు ఫోన్ వచ్చింది. ఎగిరిగంతేశాను. ఉద్యోగం వచ్చింది అన్న ఆనందం కన్నా అతన్ని చూస్తాను అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. నేను జాయిన్ అయిన రెండు మూడు రోజుల దాకా అతను కనిపించలేదు. తరువాత ఒక రోజు మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మళ్లీ అనుకోకుండా తనని చూశాను. తన పేరు ఏంటో, ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవాలనిపించింది. నా కోలింగ్కు నేను అతనిని ఇష్టపడుతున్న విషయం చెప్పాను. అతని పేరు కాంత్ అని చెప్పాడు. రోజు లంచ్ టైమ్‌లో అతనిని చూసేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అతనిని చూడగానే నన్ను ఆట పట్టించే వారు. ఒక్కరోజు తనని చూడకపోయిన చాలా బాధగా అనిపించేది. నేను తనని చూస్తున్న అన్న విషయం తనకి కూడా తెలుసు. నన్ను చూడగానే వాళ్ల ఫ్రెండ్స్ కూడా తనని ఏడిపించేవారు. కాంత్‌తో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాను. కానీ ధైర్యం చాలలేదు. ఒకరోజు తనకి లవర్ ఉంది అనే విషయం తెలిసింది. చాలా ఏడుపొచ్చింది. కానీ తను వస్తే మాత్రం చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అనుకోకుండా ఒక రోజు తను ఆఫీస్ మానేసి వేరే జాబ్‌లో జాయిన్ అయ్యాడని తెలిసింది. అప్పటి నుంచి ఎప్పుడు లంచ్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లిన తనే గుర్తుకు వస్తాడు. తనని చాలా మిస్ అవుతున్నాను. ఇట్లు కావ్య(హైదరాబాద్) -
అప్పుడు వద్దన్నా... ఇప్పుడు కావాలనిపిస్తోంది!
నా పేరు శ్రీదేవి. నేను చాలా యాక్టివ్.అందరితో ఇట్టే కలిసి పోతాను. తన పేరు రాహుల్. తను మా ఆఫీస్‌లోనే పనిచేస్తూ ఉంటాడు. కానీ తన డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు. అప్పుడప్పుడు తను మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేవాడు. చూడటానికి చాలా బాగుండే వాడు. చాలా పొడవుగా ప్రభాస్‌లా ఉండేవాడు. కాకపోతే తను నాకు పూర్తి భిన్నంగా ఉండేవాడు. చాలా సైలెంట్‌గా ఎవరితో మాట్లాడేవాడు కాదు. తను నాతో ఒకేఒక్కసారి మాట్లాడాడు. తరువాత కొన్ని రోజులకు తను నన్ను నా ఫోన్ నంబర్ అడిగాడు. నేను ఎందుకు అడిగాడు అనుకుంటూనే ఇచ్చాను. తను ఫోన్ నంబర్ తీసుకున్న రోజే నాకు కాల్ చేశాడు. నేను ఆఫీస్‌లో చూసిన రాహుల్‌కు నేను మాట్లాడిన అతనికి సంబంధమే లేదు. నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు రాహుల్ చాలా యాక్టివ్‌గా మాట్లాడేవాడు. చాలా జోక్‌లు వేసేవాడు. తనకు కూడా సరదాగా ఉండటమంటే ఇష్టమని, కానీ అందరితో కలవలేనని చెప్పాడు. నేను చేసే అల్లరి తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అలా రోజు మాట్లాడే రాహుల్ ఒక రోజు సడెన్‌గా నాకు ప్రపోజ్ చేశాడు. నాకు టైం కావాలి అని చెప్పాను. తరువాత కూడా రోజు కాల్ చేసి మాట్లాడుకునే వాళ్లం. చాలా రోజుల తరువాత తను మళ్లీ కాల్ చేసి నేను నీకు ఎందుకు నచ్చడం లేదు అని అడిగాడు. నేను అదేం లేదు. నువ్వంటే ఇష్టమే కానీ అది ప్రేమ కాదు. గతంలో నాకు బ్రేకప్ అయ్యింది అని చెప్పాను. తరువాత నుంచి తను నన్ను ఇంకా బాగా చూసుకోవడం మొదలుపెట్టాడు. బాధ అనిపించినప్పుడల్లా తనతో చెప్పుకొని బాధపడేదాన్ని. చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. రోజు మాట్లాడుకుంటూనే ఉండే వాళ్లం. తను మళ్లీ ప్రేమ విషయం అడిగాడు. మాట్లాడటం అంటే ఇష్టం కానీ ప్రేమించలేను అని చెప్పాను. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం తగ్గించాడు. ఎందుకు మాట్లాడటం లేదు అని అడిగితే నీతో మాట్లాడుతూ ఉంటే నీ మీద ఇష్టం పెరిగిపోతుంది. నీకు దూరంగా ఉండలేకపోతున్నా అందుకే కావాలనే దూరంగా ఉంటున్నాను అని చెప్పాడు. నేను కూడా అదే మంచిది కదా అని దూరంగా ఉన్నాను. తరువాత తనకి వేరే ఊర్లో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాకు అసలు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం లేదు. తను నాతో మాట్లాడకుండా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. తను నాకు దూరంమవుతున్నాడు అంటే గుండె పిండేస్తున్నట్లుగా ఉంది. నాకు తను కావాలి అనిపిస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావడం లేదు. ఫోన్ చేసి మాట్లాడితే అసలుఏం అంటాడో అర్థం కావడం లేదు. ఇట్లు శ్రీదేవి (హైదరాబాద్) -
బిజినెస్‌లో నష్టం వచ్చింది...అప్పుడు తను!
డియర్ ‘సాక్షి’ నేను నా ఫ్రెండ్స్ స్టోరీని చెప్పాలనుకుంటున్నాను.నా స్కూల్ డేస్‌లో నాకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారిద్దరు నాకు చాలా క్లోజ్. ముగ్గురం కలసి ఒకే చోట తినేవాళ్లం, చదువుకునే వాళ్లం. నా ఫ్రెండ్స్ ఇద్దరు వరుసకు బావ మరదళ్లు అవుతారు. మేం డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం. డిగ్రీ అయ్యాక నా స్నేహతురాలికి పెళ్లి చేయలానుకున్నారు. అప్పుడు వాళ్లిద్దరు దూరంమవుతున్నమన్న బాధలో వారిద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని అర్థం చేసుకున్నారు. ఆ విషయం ఇంట్లో చెప్పారు. ఇంట్లో వాళ్లు కూడా వెంటనే ఒప్పుకన్నారు. నా స్నేహితుడికి చదువు అయిపోయిన వెంటనే జాబ్ వచ్చింది. వెంటనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల జీవితం చాలా చక్కగా సాగిపోతున్న సమయంలో నా ఫ్రెండ్ బిజినెస్ స్టాట్ చేశాడు. అది మూడు సంవత్సరాలు బాగానే కలిసొచ్చింది. కానీ తరువాత చాలా నష్టాలు వచ్చాయి. ఆ టైంలో నా స్నేహితురాలు తనకు చాలా సపోర్టు ఇచ్చింది. తను లేకపోతే సూసైడ్ చేసుకునే వాడేమో. తరువాత బిజినెస్ వదిలేసి జాబ్‌లో జాయిన్ అయ్యాడు. వాళ్లకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అంతా చక్కగా సాగిపోతున్న సమయంలో ఆ దేవుడికి కన్ను కుట్టిందేమో నా స్నేహితురాలికి క్యాన్సర్ అని తెలిసింది. ఆ విషయం తనకు చెప్పకుండా నా ఫ్రెండ్ ట్రీట్మెంట్ ఇప్పించేవాడు. కానీ రెండు సంవత్సరాల తరువాత తను దేవుడి దగ్గరకు వెళ్లిపోయింది. తను ఆ బాధను పంటిబిగువన భరిస్తూ ఇద్దరి పిల్లల్ని చూసుకుంటూ అలానే ఉంటున్నాడు. నేను ‘సాక్షి’ ద్వారా తనకు చెప్పాలనుకుంది ఒక్కటే మీ లైఫ్ మళ్లీ కొత్తగా మొదలు పెట్టండి. మీరు జీవితంలో ఇంకా ఉన్నతస్థాయికి చేరుకోవాలి. దానికి మీకు ఒక తోడు కావాలి. మీ ముఖం మీద మీ హృదయం నుంచి వచ్చే చిరునవ్వు ఉండాలి. ఇట్లు మీ చిన్ననాటి స్నేహితురాలు మీనాక్షి. -
నేను దుబాయ్‌కు వెళ్లే రెండు రోజుల ముందు!
నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా పెద్దబాపు కొడుకు దుబాయ్ నుంచి వచ్చాడు. తన వాళ్ల ఫ్రెండ్స్ అందరి కోసం గిఫ్ట్‌లు తీసుకువచ్చాడు. అవి వాళ్లకు ఇవ్వడానికి నేను కూడా తనతోపాటు వెళ్లాను. అక్కడే నేను మొదటిసారి ఆమెను చూశాను. తనని చూడగానే తను నాకు బాగా నచ్చింది. మాట్లాదాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేం ఇంటికి తిరిగి వచ్చేశాం. తరువాత మళ్లీ వాళ్ల బంధువుల పెళ్లి అయితే వెళ్లాం. నేను తనని చూస్తూ ఉండిపోయాను. తనతో ఒక్కసారి మాట్లాడాను. తరువాత మా పెద్దబాపు కొడుకును అడిగి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాను. తనకి మెసేజ్ చేశాను. చాలా రోజుల వరకు రిప్లై రాలేదు. తరువాత ఎవరు మెసేజ్ చేసింది అని రిప్లై వచ్చింది. నేను చెప్పగానే నన్ను గుర్తుపట్టింది. నేను ఇంకా రోజు మెసేజ్ చేసేవాడ్ని బాగానే మాట్లాడేది. తనకి నా ప్రేమ విషయం ఎదురుగా వెళ్లి చెబుదాం అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. ఫోన్లోనే నా ప్రేమ విషయం చెప్పాను. తను రిప్లై ఇవ్వలేదు. కానీ తరువాత రోజు నుంచి నాతో మాములుగానే చాట్ చేసేది. నాకు ఎందుకో తనని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది. నేను దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను దుబాయ్ వెళ్లే రెండు రోజుల ముందు తను నాకు ఐ లవ్ అని చెప్పింది. దుబాయ్ హ్యాపీగా వెళ్లిరా అని చెప్పింది. రెండు సంవత్సరాలు దుబాయ్ లోనే ఉన్నాను. నేను ఒకసారి తన ఫోటో అడిగాను. తను ఎందుకు అని అడిగింది. నిన్ను చూడాలనిపిస్తోంది అని చెప్పాను. తను పంపింది. అది ఒక్కటే ప్రస్తుతం నాకు మిగిలింది. కొన్ని రోజులకు వాళ్ల ఇంటిలో తనకు సంబంధాలు చూస్తున్నారు అని ఇంట్లో వచ్చి మాట్లాడమని చెప్పింది. నేను మాట్లాడితే బాగోదు అని మా ఇంట్లో ఒప్పించి వాళ్ల ఇంటికి పంపిచాను. వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. తనకు వేరే వాళ్లతో పెళ్లి అయిపోయింది. నాకు అసలు అర్థం కానీ విషయం ఏంటంటే అమ్మాయిలు అంత తేలికగా ఎలా మారిపోతారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతారు.అసలు తను నన్న ఎలా మర్చిపోయిందో అర్థం కావడం లేదు. నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. కొన్ని కొన్ని సార్లు అయితే చచ్చిపోవాలనిపిస్తోంది. తనతో మాట్లాడిన ప్రతి మాట నాకొక మధుర జ్ఞాపకమే. తను ఎక్కడ ఉన్న ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు, నాని(హైదరాబాద్). -
నువ్వూ వద్దు నీ ప్రేమా వద్దు..
తన పేరు బుజ్జి నా జూనియర్. హ్యాపిడేస్ సినిమాలో లాగా తనని మొదటిసారి చూడగానే ప్రేమించా. వెంటనే తనకి చెప్పా. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. కానీ నేను మాత్రం తనని వదులుకోలేకపోయా. నా చదువు పూర్తవగానే జాబ్‌లో జాయిన్ అయ్యాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు తన నుంచి కాల్ వచ్చింది. ఓ ప్రాజెక్ట్‌లో హెల్ప్ కావాలి అని. అలా తను నాకు మళ్లీ దగ్గరైంది. అప్పుడే తన మనసులో మాటని నాతో పంచుకుంది. నువ్వంటే నాకిష్టమే. కానీ మంచి జాబ్‌లో స్థిరపడితే మా ఇంట్లో వాళ్లని ఒప్పిస్తా అంది. అప్పటికి నా జీతం 16 వేలు మాత్రమే. సో ఇంకా మంచి జాబ్ కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఉద్యోగం సంపాదించి వాళ్లింటికి వెళ్లి మా ప్రేమ గురించి చెప్పి ఒప్పించాలనుకున్నా. అందుకే బాగా కష్టపడేవాడ్ని. ఈ గ్యాప్‌లో తనతో పెద్దగా ఫోన్లో మాట్లాడుకునే టైం దొరికేది కాదు. దీంతో మా ఇద్దరి మధ్యా గొడవలు వచ్చేవి. ఎంత గొడవపడినా మళ్లీ తనే కాల్చేసి మాట్లాడేది. కానీ ఓరోజు మా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నా ఓప్కి నశించి తనమీద గట్టిగా అరిచేశా. అంతే ..నీమీద ఉన్న నమ్మకం అంతా పోయింది నువ్వు నాకొద్దు. నీ ప్రేమా వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. అరిచింది నా బుజ్జిపైనే కదా ఎప్పటిలానే తనే మళ్లీ కాల్ చేస్తుంది అనుకున్నా. కానీ నా మాటలు తనని ఎంత గాయపరిచాయో అప్పుడు అర్థమైంది. కాల్ చేసేది కాదు. నేను ఫోన్ చేసినా మాట్లాడేది కాదు. కొన్నిరోజులకి నాకు పెళ్లి అని తన నుంచి కాల్ వచ్చింది. ముందుగా నేను నమ్మలేదు. ఏదో కోపంగా అంటుంది అనుకున్నా .తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ చెప్పాకా ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది. తనకి పెళ్లి అని తెలిసినప్పటినుంచి కన్నీళ్లతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. చివరిగా తను నాతో అన్న ఒకే ఒక్కమాట..నన్ను ప్రశాంతంగా బతకనివ్వు అని. ఇప్పడు జాబ్ చేయడం మానేశా. కోచింగ్ కూడా వదిలేశా. వచ్చే నెలలో తన పెళ్లి. తను ఎక్కుడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. --హరీష్ రాజు, నెల్లూరు -
తనని ఆ ఒక్క విషయం అడగాలనుంది!
తన పేరు శిల్పా. నేను 6 వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను చూశాను. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె అందమైన ముఖం నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తోంది. తనని ప్రతి రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యేవాడ్ని. నాకు పేవర్గా ఉండే ఒక సార్ నన్ను క్లాస్ లీడర్‌గా చేశారు. తనని కూడా చేశారు. నాకు ప్రతి రోజు తనని చూడటమే సరిపోయేది. కానీ ఎప్పుడు నా ఫీలింగ్స్ చెప్పలేదు. వాళ్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నని మా నాన్న నన్ను వేరు స్కూల్లో చేర్చించారు. తను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఉండిపోయింది. నేను ప్రతి రోజు స్కూల్ నుంచి రాగానే తనని చూసే వరకు నిద్రపోయే వాడ్ని కాదు. తను ట్యూషన్లో చేరిందని తెలిసి నేను కూడా అదే ట్యూషన్లో చేరాను. కానీ తను ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు. మా 9వ తరగతిలో తను కూడా ఏదో ప్రైవేట్ స్కూల్లో చేరింది. నేను రోజు వాళ్ల హాస్టల్ దగ్గరకు వెళ్లిన తను కనిపించేది కాదు. ప్రతి రోజు బాధపడే వాడ్ని. ఇంటర్‌కు వెళ్లాక తన కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడ్ని. కానీ నేను తన చుట్టూ తిరుగుతున్న ఒక్కసారి కూడా తనకి ఆ విషయం తెలిసేది కాదు. ఎన్నోసార్లు ప్రయత్నించా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి కానీ ఊర్లో తెలిస్తే గొడవలు అవుతాయని భయంవేసేది. తన ఊరు వచ్చినప్పుడల్లా నేను వాళ్ల ఇంటివైపు ఏదో పని వంకతో వెళ్లి చూసి వచ్చేవాడ్ని. అలాగే ఒక్కసారి అయినా నాతో మాట్లాడుతుందేమో అనే ఆశతో 2002 నుంచి 2017 వరకు తన చుట్టూ తిరిగాను. కానీ నా బ్యాడ్ లక్ నేను నా ప్రేమ విషయం తనకు చెప్పకుండానే తనకు పెళ్లి అయిపోయింది. కానీ నేను ఇప్పటికీ తనని ఒక దేవతలానే చూస్తాను. నేను చచ్చేలోపు ఒక్కసారి అయినా నేను నీతో మాట్లాడాలి శిల్ప ప్లీజ్. నేను అసలు ఎవరో తనకి తెలుసా లేదో అనే విషయాన్ని ఒక్కసారి తనని అడగాలనుంది. ఒకే ఒక్క మాట నేను నీకు తెలుసా అని అడగాలి అని చాలా సార్లు అనిపిస్తుంది. తనని మొదటిసారి చూసిన ఆ క్షణం తన ముఖం ఎప్పుడూ నాకు గుర్తువస్తూనే ఉంటుంది. అది తల్చుకున్నప్పుడల్లా నా ముఖం మీద చిరునవ్వు వస్తుంది. శిల్ప ఈ మెసేజ్ నువ్వు చూస్తే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇది నువ్వు గుర్తుపట్టాలి అనుకుంటే ఒక హింట్ ఇస్తాను నీకు అరవ తరగతిలో ఉన్నప్పుడు ప్రతిమ, గీత అనే ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లీజ్ శిల్ప నువ్వు గుర్తుపడితే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇట్లు కుమార్ (పేరు మార్చాం) ఒంగోలు. -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం: అనుకున్న వ్యక్తులకు ప్రేమసందేశాన్ని అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత సానుకూలమైనవి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. ఈ సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి తూర్పు ఈశాన్యదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండండి. వృషభం: మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అనుకూలం. ఈ సమయంలో అవతలి వారి నుంచి కూడా ఊహించిన సమాచారం రావచ్చు. అలాగే, ఇటువంటి సమయంలో పింక్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరించండి. ఇక, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు విరామం ఇవ్వండి. మిథునం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వారి నుంచి అనుకూల సందేశాలు సైతం అందుకోవచ్చు. ప్రతిపాదనలు చేసే రోజుల్లో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇక ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే, మంగళ, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి. కర్కాటకం: మీరు అత్యంత ఇష్టపడే వారికి మీ ప్రతిపాదనలు అందించేందుకు శని, గురువారాలు చాలా అనుకూలమైనవి. ఈరోజులలో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి సానుకూలత వ్యక్తం కావచ్చు. ఈ సమయంలో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, సోమ, మంగళవారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది. సింహం: మీరు అత్యంత ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు, ప్రతిపాదనలు అందించేందుకు ఆది, బుధవారాలు చాలా అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలు ఆమోధం పొందే అవకాశాలున్నాయి. అలాగే, ఇటువంటి సమయంలో మీరు రెడ్, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమదిశ బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. అయితే, శుక్ర, శనివారాలు దూరంగా ఉండండి. కన్య: మీ మనస్సులోని భావాలను ఇష్టులకు అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రయత్నాలకు అవతలి వారి నుంచి సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. తుల: మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమసందేశాలను శుక్ర, శనివారాలు అందించండి. అవతలి వారి నుంచి సైతం శుభసందేశాలు అందుతాయి. ఇటువంటి రోజుల్లో మీరు బ్లూ, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. అయితే, సోమ, బుధవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. వృశ్చికం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టమైన వ్యక్తులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి విశేష స్పందనలు రావచ్చు. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు విరామం ప్రకటించడం మంచిది. ధనుస్సు: మీరు ఇష్టపడే వారికి మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శుక్ర, శనివారాలు చాలా మంచివని చెప్పాలి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే,ఆది, మంగళవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. మకరం: మీ ప్రేమసందేశాలు, ప్రతిపాదనలు ఇష్టులకు అందించేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వారు కూడా మీ సందేశాలకు స్పందించే వీలుంటుంది. ఈసమయంలో మీరు రెడ్, గ్రీన్ రంగు దుస్తులు «ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది. కుంభం: మీ అత్యంత ఇష్టపడే వారికి మనస్సులోని ఉద్దేశాలను ప్రతిపాదనల రూపంలో అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు సైతం అనుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు బ్లూ, బిస్కెట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మీనం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలకు అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి మంచిది. -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
ప్రేమజాతకం.. 21.02.20 నుంచి 29.02.20 వరకు –––––––––––––––––––––––––––––––– మేషం : మీకు ఇష్టులైన వారికి సందేశాలు అందించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనుకూలమైన రోజులు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతుంది. ఇక ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుముఖంగా బయలుదేరండి శుభాలు జరుగుతాయి. అయితే, సోమ, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. వృషభం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు సోమ, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి అనుకూల స్పందనలు రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు రెడ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు మీ ప్రయత్నాలు విరమించడం మంచిది. మిథునం: మీరు అత్యంత అభిమానించే వారికి మీ అభిప్రాయాలను తెలిపేందుకు బుధ, గురువారాలు అనుకూలమని చెప్పాలి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలివారి నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు గ్రీన్, బ్రౌన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, శుక్ర,ఆదివారాలు వీటికి దూరంగా ఉండండి. కర్కాటకం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శుక్ర, శనివారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అనుకూలత వ్యక్తం కావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయ దిశగా బయలుదేరండి. ఇక ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. సింహం: మీరు అత్యంత అభిమానించే వారికి మీ ప్రేమసందేశాలు అందించేందుకు శని, ఆదివారాలు అత్యంత సానుకూలమని చెప్పాలి. ఈరోజుల్లో మీకు అవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, బుధ, గురువారాలు ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. కన్య : మీ ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు ఇష్టులకు అందించేందుకు సోమ, బుధవారాలు అనుకూలమైనవి. ఈ రోజులలో మీరు పంపే ప్రతిపాదనలపై అనుకూల సందేశాలు రావచ్చు. అలాగే, ఈ సమయంలో మీరు వైట్, రెడ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండండి. తుల: మీ మనస్సులో దాగిన ప్రేమసందేశాలను అత్యంత ఇష్టపడే వారికి అందించేందుకు బుధ, గురువారాలు విశిష్ఠమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలివారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే ఇంటి నుంచి ఉత్తర ఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక, శని, ఆదివారాలు మీ ప్రయత్నాలు విరమించండి. వృశ్చికం: మీరు ఆరాధించే వ్యక్తులకు మీ మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించేందుకు శని, ఆదివారాలు అత్యంత అనుకూలం. ఈ రోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. ఇక, మంగళ, బుధవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. ధనుస్సు: మీ అభిప్రాయాలను, ప్రతిపాదనలు ఇష్టులకు తెలియజేసేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ప్రతిపాదనలు అందించే సమయంలో మీరు ఎల్లో, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి. మకరం: మీ మనస్సులోని భావాలను మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో గ్రీన్, బ్రౌన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. ఇక, శని, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. కుంభం: మీరు ఆరాధించే వ్యక్తులకు మీ ఆభిప్రాయాలను తెలియజేసేందుకు సోమ,మంగళవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈ రోజుల్లో మీరు వైట్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, శని, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి. మీనం: మీ మనోగతాన్ని ఇష్టపడే వారికి తెలియజేసేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలమైనవిగా భావించాలి. ఈ సమయంలో మీ సందేశాలకు అవతలి వైపు నుంచి అనుకూల సందేశాలు రావచ్చు. ఇటువంటి సమయంలో పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, ఆది, సోమవారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది. -
లాగిపెట్టి కొట్టి ‘పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?’..
నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తను ఏడవ తరగతి చదువుతుండేది. ఒకే ఊరు కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసే వాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ, ప్రేమ అని అనుకోలేదు. తను నా మీద పెంచుకుంటున్న ఇష్టం అందరూ గమనించారు! నేను తప్ప. ఆమె మా పేర్లు ఫ్లేమ్స్ వేసుకుని, ఆ పేపరు బ్యాగులో ఉంచుకుంది. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా దాచుకునేది. అవన్నీ గమనించిన వాళ్ల ఇంట్లో వాళ్లు తనని నా నుండి దూరం పెట్టారు. అప్పుడు అర్థమైంది నాకు, తనని నేను ఇష్టపడతున్నానని. ఇక అప్పటినుంచి తనకు దూరంగా ఉండటం నరకంలా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నా పక్కనే కూర్చునేది. ఊర్లో అందరూ మేము భార్యాభర్తలం అనుకునేలా ఉండేది. కొద్ది రోజులకి తనని నాతో పూర్తిగా మాట్లాడకుండా చేశారు. వాళ్ల పిన్ని ఆ అమ్మాయిని కొట్టి నాకు దూరం చేసింది. అలా రెండేళ్లు మేము దూరంగా ఉన్నాం. తర్వాత మళ్లీ మాట్లాడింది. కానీ, ఇక మీదట మేము అందరిలో కలిసి ఉండకూడదు అని నిశ్చయించుకున్నాం. ఎవరికీ తెలియకుండానే మాట్లాడుకునేవాళ్లం. అందుకు వాళ్ల చెల్లెలు కూడా మాకు హెల్ప్ చేసింది. మెసేజెస్, కాల్స్ చేసుకునేవాళ్లం. మాకు ఆస్తిలేని కారణంగా తనని దూరం చేశారు. వాళ్ల మామయ్యకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఖాయం చేశారు. తను అప్పటినుంచి ఏడుస్తూ ఉండేది. ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నా వయసు 19 తనను తీసుకుని వెళ్లలేను. అలా అని ఆపలేను. చచ్చిపోవాలనుకున్నా. తను కూడా అలానే అనుకుంది. ఆస్తి, వయసు కారణంగా నా ప్రేమ నాకు దూరం అయింది. ఒకసారి అడిగా నేనంటే అంత ఇష్టమా అని తను లాగిపెట్టి కొట్టింది. ‘నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు అలా అడిగావు. ఇంకెప్పుడూ అలా అడగకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను తలుచుకుని చచ్చిపోతాను. ఎప్పటికీ నీ కోసమే ఆలోచిస్తూ బ్రతుకుతాను’ అంది. ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడ్చింది. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక అమ్మాయిని పట్టుకోవటం అదే మొదటిసారి. నా లైఫ్‌లో ఆరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అడిగా ‘మరి నాతో వచ్చేయొచ్చు కదా’ అని. తను రాను అంది. ఏం అంటే ‘మా ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. నా మూలంగా వాళ్లు అవమానపడకూడదు.’ అంది. ‘మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు’ అన్నాను. ‘ నా లైఫ్ అంతే! ఈ జన్మకు ఇలా అవ్వాలని రాశాడేమో దేవుడు’ అంది. చాలా బాధగా అనిపించింది. అప్పుడు తనో కోరిక కోరింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని. ‘అదేంటీ?’ అన్నా. ‘ఎవరికీ తెలియకపోయినా నువ్వు నా వాడివి అనే ఫీలింగ్ నాకు చాలు. నువ్వు నన్ను చేసుకో’ అంది. తన బర్త్‌డే రోజు బొట్టు పెట్టించుకుంది. ‘నా బర్త్ డే అని కాకుండా నువ్వు బొట్టు పెట్టిన రోజుగా గుర్తుంచుకుంటా’ అని ఏడ్చింది. ‘ఇలానే ఉండిపోవాలని ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రేమంటే ఎదుటి వ్యక్తి కళ్లల్లోనే తెలుస్తుంది. తన కళ్లు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెబుతాయి. తన కళ్లు చూస్తే ఆ కళ్లు నా కోసం బాధపడుతున్నాయని నాకు అర్థం అవుతుంది. ఇంకో లైఫ్ ఉంటే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ప్రేమించే నీ ప్రేమని, ఐ మిస్ యూ బంగారం! - స్వామి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నువ్వు కుదరదంటే చచ్చిపోతా!!
అతడి పేరు సుభాష్! మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్లు. మా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దూరపు బంధుత్వం కూడా. తను నాకు బావ వరుస అవుతాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్లం చిన్నప్పటినుంచి. ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నపుడు నాకు ప్రపోజ్ చేశాడు. నేనప్పుడు ఓకే చెప్పలేదు. డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజ్‌లో చేరాము. నెలకోసారైనా నాకు ఐ లవ్ యూ చెప్పేవాడు. తెలిసిన వ్యక్తి, మంచి వాడు, పైగా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది! కాబట్టి, పెళ్లికి ఒప్పుకుంటారని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఓకే చెప్పాను. నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఓ వ్యక్తినాపై ఇంతలా ప్రేమ చూపించడం నాకు బాగా నచ్చేది. చూస్తుండగానే మా ప్రేమలో ఏడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఎన్నో మార్పులు. నాకు, అతడికి మధ్య ఎన్నో కలవని పాయింట్లు ఉన్నాయి. రోజురోజుకు అతడిపై ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఇక మీదట అతడితో కలిసి ఉండటం కుదరదనిపించింది. ఇదే విషయం అతడికి చాలాసార్లు చెప్పి చూశాను. ‘ నేను నీతో కలిసి ఉండలేను’ అని. దానికి అతడు చాలా సీరియస్ అయ్యేవాడు, బాగా తిట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి, ‘ నువ్వు కుదరదంటే నేను చచ్చిపోతాను’ అనేవాడు. అయినా పట్టువదలకుండా అతడికి నచ్చజెప్పటానికి ప్రయత్నించేదాన్ని. ‘మనిద్దరి దార్లు వేరు.. ఎప్పటికీ కలవవు’ అని. పట్టించుకునేవాడు కాడు. మేమిద్దరమూ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. నేను మా ఇంట్లో ఈ విషయం చెప్పటానికి ప్రయత్నించినపుడు వాళ్లు కూడా నా మాట వినలేదు. అతడితో బ్రేకప్ చెప్పి, మా రిలేషన్‌కు ఓ ఎండ్‌కార్డ్ వేద్దామని చేస్తున్న ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుందో. - శీ విధ్య, సూర్యాపేట లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఒంటిరిగా ఉండటానికి భయపడుతున్నారా?
మనం ఎవరితోనైనా ప్రేమలో పడగానే వారితో రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టాలని కోరుకోవటం పరిపాటి. ముఖ్యంగా ఎదుటి వ్యక్తిపై నమ్మకం, వారు పాటించే విలువులు, ఇద్దరి మధ్యా సామీప్యతలు బంధంలోకి అడుగుపెట్టడానికి కారణాలుగా కనిపిస్తాయి. అయితే చాలామంది ఒంటరిగా ఉండటానికి ఇష్టంలేక..భయపడి ప్రేమబంధంలోకి అడుగుపెడతారు. అలాంటి వారు తమ భాగస్వామి ఇతరుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపించినా తట్టుకోలేరు. స్వార్థపూరితమైన బంధం ఎక్కువకాలం నిలవలేదన్న విషయాన్ని గుర్తించలేరు. ఓ వ్యక్తి ఒంటరిగా ఉండటానికి ఇష్టంలేక.. భయపడి ప్రేమబంధంలోకి అడుగుపెట్టారని చెప్పే కొన్ని లక్షణాలు.. 1)కామన్ థింగ్స్ ! ఇష్టపడే ఆహారం, నచ్చే హీరో, ప్రదేశాలు.. హాబీస్ ఇలా ఏ విషయంలోనైనా ఓ జంట మధ్య చాలా పోలికలు ఉన్నట్లయితే కుటుంబమో.. స్నేహితులో.. మీ మధ్య చాలా విషయాల్లో పోలికలు ఉన్నాయంటూ పొగడటం మామూలే. అయితే ఎవరైనా మీ జంటలోని మీ ఇద్దరి మధ్య కామన్ థింగ్స్ ఏంటంటూ మిమ్మల్ని అడిగారనుకో.. అవేంటో చెప్పటానికి మీరు బుర్ర బద్ధలు కొట్టుకుంటుంటే మటుకు మీరు ఒంటరిగా ఉండలేక బంధంలోకి అడుగుపెట్టారనడానికి సూచన. 2) అభద్రతా భావం ఓపెన్‌గా చెప్పటానికి మీరు ఇబ్బంది పడొచ్చుకానీ, మీ పార్ట్నర్ ఎవరితోనైనా చనువుగా ఉంటే మాత్రం మీరు తట్టుకోలేరు. మాటలో వర్ణించలేని ఈర్ష్యతో రగిలిపోతారు. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ మోసం చేస్తారోనన్న భయంతో అల్లాడిపోతారు. ఇది మీరు ఒంటరిగా ఉండటానికి భయపడుతున్నారనడానికి సూచన 3) ఎదుటి వ్యక్తి సంతోషం కోసం.. ఎదుటి వ్యక్తిని సంతోషపెట్టడానికి మీకు సంబంధించిన కొన్ని విషయాల గురించి అబద్ధాలు చెబుతున్నారా? అవునంటే! మీలోని కొన్ని లక్షణాలు ఎదుటి వ్యక్తికి నచ్చవన్న భావన మీకు ఉన్నట్లు గుర్తించాలి. వాటి వల్ల మీ బంధానికి ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయం మీకు కచ్చితంగా ఉండిఉంటుంది. ఇలా అయితే గనుక మీ బంధం గురించి ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 4) భాగస్వామి పక్కనలేకపోతే.. మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా?.. ‘నన్ను విడిచి దూరంగా వెళ్లొద్దు’ అంటూ ఆమె/అతడితో గొడవపడుతున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండలేక ప్రేమ బంధంలోకి అడుగుపెట్టారని కచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మీ భాగస్వామి మీ ఫోన్ కాల్స్‌కు రిప్లై ఇవ్వకుండా, మీ స్నేహితులతో చనువుగా ఉన్నపుడు ఏదో కోల్పోయిన వారిలా ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఆలోచించాల్సిన విషయమే.. ఇలాంటి ప్రవర్తన మీ బంధాన్ని ఇరకాటంలో పడేస్తుందని గుర్తించండి. 5) భాగస్వామితో బంధం ఓ పెద్ద అచీవ్మెంట్! మీ భాగస్వామితో బంధంలోకి అడుగుపెట్టడమే ఓ పెద్ద అచీవ్‌మెంట్‌లా ఫీలవతున్నారా? ఇతరుల ఎదుట మీరు ఒంటరివారు కాదని నిరూపించుకోవటానికి పరితపిస్తున్నారా? మీ భాగస్వామి మిమ్మల్ని విడిచిపెట్టివెళ్లకుండా ఏ విధంగా ఇబ్బందిపెట్టినా పర్లేదనుకుంటున్నారా? అయితే మీరు ఒంటరిగా ఉండటానికి భయపడేవారని గుర్తించండి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
తనతో గొడవ.. ఫైనల్ రౌండ్లో..
కాలేజీకి వెళ్లి చదువు కోవడం.. ఇంట్లో పని చేయడం తప్ప ఏమీ తెలియని నా జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే మేము ఫ్రెండ్స్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడినా గొడవ పడేది. అప్పుడే అర్థం అయింది.. తను నన్ను ప్రేమిస్తోందని. తన పుట్టినరోజుకు ముందు రోజు నాకు ప్రపోజ్ చేసింది. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, హాలిడేస్‌కు తను ఇంటికి వెళుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ రోజు అర్థమైంది! తనని నేను ప్రేమిస్తున్నానని. ‘నేను ఎక్కడికీ వెళ్లను బుజ్జి! మళ్లీ వస్తాగా’ అని తను వెళ్లిపోతుంటే చాలా బాధ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను వచ్చి వెళ్లిన ప్రతీసారి బాధ పడుతూనే ఉన్నా. ఎందుకంటే ఎంత సేపు చూసినా తను నన్ను వదిలి వెళ్లే చివరి నిమిషం చాలా బాధిస్తోంది. అందరి లవ్ స్టోరీలో లాగే మా లవ్‌లో కూడా గొడవలు వచ్చాయి. కానీ, అపుడు మేము విడిపోలేదు. అడ్జస్ట్ అవుతూనే వచ్చాము. కానీ మా ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్లాలంటే మనీ, క్యాస్ట్ ప్రాబ్లమ్స్‌గా మారాయి. క్యాస్ట్ మార్చలేం కదా అందుకే మనీ అయినా ఉండాలనుకున్నాం. మాది ఒక పూర్ ఫ్యామిలీ! ఎంత పూర్ అంటే తనతో ఒక నైట్ ఫోన్ కాల్ మాట్లాడాలంటే వన్ డే హోటల్ సర్వర్‌గా పనిచేసే వాడిని. తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో సర్వర్‌గా పని చేశా. తను రిచ్ గాళ్! ఎలా అయినా మా ఫ్యామిలీ, నేనూ డెవలప్ అవ్వాలనుకున్నాం. మా డాడీని ఒప్పించి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాం. ఎలాగో డెవలప్ అయ్యాం. ఇక నేను మంచి జాబ్ చేయాలనుకున్నపుడు! ‘సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చెయ్’ అని చెప్పింది. ఎందుకంటే కొద్ది టైంలో ఎక్కువ శాలరీ రావాలంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కరెక్ట్ అనుకున్నాం. తనని సీఏ చేయమని చెప్పా. నాకా ఒక ముక్క ఇంగ్లీష్ రాదు! సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా? అనుకున్నా అప్పుడే వాళ్ల అక్కకి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాయి. తరువాత తనకి, సో! త్వరగా కోర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఆరు నెలల్లో చేయాల్సిన కోర్స్ ఒక నెలలో చేసి జాబ్ ట్రైల్స్‌కు ఫిబ్రవరి 14న వెళ్లా. నాకు తన దగ్గరకి వెళ్లాలని ఉండేది. తనకేమో నేను జాబ్ కోసం వెళ్లాలని ఉండేది. జాబ్‌కోసం సెర్చ్ చేస్తున్న టైంలో తనకి ఎగ్జామ్స్. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా! ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్‌కు వెళ్లా. మా ఇద్దరి మధ్యా చిన్న గొడవ వల్ల సరిగా ఏకాగ్రత ఉంచలేక ఫైనల్ రౌండ్లో జాబ్ మిస్ అయింది. చదవకుండా టైం వేస్ట్ చేస్తోందని తనని తిట్టా. కానీ, మామూలే మళ్లీ చదవకుండా ఉండే సరికి కోపంలో బాగా తిట్టి, ‘నెల రోజులు వెయిట్ చెయ్ అమ్ము! గొడవ పడటానికి కరెక్ట్ టైం కాద’ని చెప్పా. వన్ మంత్ మాట్లాడలేదు. నాకు జాబ్ వచ్చేసింది! ఫుల్ హ్యాపీతో తనకి చెప్పా. అంతే ఏమైందో తెలీదు. ఆ వన్ మంత్ తను చాలా బాధ పడి నాపై ద్వేషం పెంచుకుంది. ‘నేను నీ సెకండ్ ఆప్షన్! నేను ఉంటే జాబ్ తెచ్చుకోలేవా’ అని వెళ్లి పోయింది. తనే తిరిగి వస్తుందిలే అనుకున్నా. కానీ రాలేదు . తను వస్తుందని 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నా. ‘తప్పకుండా వస్తావ్ కదా అమ్ము .. నీకోసం ఎదురు చూస్తూనే వుంటా . మిస్ యూ అమ్ము.. లవ్ యు బంగారం ...లవ్ యూ ఫరెవర్ బంగారం.. - బుజ్జి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కోర్టు కేసులు, జైలు.. మూడేళ్ల ప్రేమ
తొండంగి కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన నులక తాటి సతీష్, కృష్ణా జిల్లా వీర్లుపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పడిగెల అఖిల మధ్య మూడేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. చిట్టచివరకు కోర్టు కేసులు,జైలు తదితర పరిణామాలను అధిగమించి చట్టప్రకారం ఒక్కటైంది ఆ జంట. సతీష్‌ది కొమ్మనాపల్లిలో కూలీ పని చేసుకుని జీవించే చిన్న కుటుంబం. ఆశించిన స్థాయిలో పని లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. చిక్కడ్పల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్ వాచ్‌మన్‌గా అతడి తండ్రి దాసు పనిచేయటంతో కుటుంబం అంతా అక్కడే నివాసం ఉంది. ఇంటర్ వరకూ చదువుకున్న సతీష్ మాదాపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరాడు. అదే అపార్ట్మెంట్లో కృష్ణాజిల్లా వీర్లుపాడు మండటం జయంతి గ్రామానికి చెందిన పి.అయ్యప్ప వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడి కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటోంది. ఆఫీస్ బాయ్‌గా ఉన్న సతీష్ వస్తూపోతూ ఉండడంతో అయ్యప్ప కుమార్తె అఖిలకు, అతడికి మధ్య స్నేహం ఏర్పడింది. 2017నాటికి అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది జనవరి 20న వారిద్దరూ ప్రేమ బాసలు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వ్యవహారం పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావటంతో అఖిల తండ్రి ఆమెను స్వగ్రామం జయంతికి పంపించారు. సుమారు ఆరునెలల అనంతరం ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు. ఆగస్టులో వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లారు. దీంతో అఖిల తల్లిదండ్రులు స్వగ్రామం పరిధి పోలీస్ స్టేషన్లో సతీష్‌పై మైనర్ అయిన తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సతీష్ తల్లిదండ్రులుకు సతీష్, అఖిల చెన్నైలో ఉన్నారని తెలియడంతో ఫోన్లో వారికి నచ్చచెప్పారు. దీంతో సతీష్, అఖిల ఇద్దరూ తొండంగి మండలంలోని స్వగ్రామం కొమ్మనాపల్లికి వచ్చారు. సతీస్ తల్లిదండ్రులు వీరిద్దరినీ ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అఖిల తండ్రి సతీష్‌పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయ్యప్పను కూడా రప్పించారు. మైనర్ కావటంతో పోలీసులు అఖిలను అయ్యప్పతో పంపించారు. కేసుకు సంబంధించి వీర్లుపాడు పోలీస్స్టేసన్నుంచి ఒంటిమామిడి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అప్పటికే సతీష్‌పై కేసు నమోదు చేయడంతో ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నందిగామ సబ్‌జైలులో సతీష్ సుమారు 63రోజులు ఉన్నాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. కాలం గడుస్తోంది. సతీష్ మళ్లీ హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు.అఖిల నందిగామలో టైలరింగ్ నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా సతీష్ నెంబర్ సేకరించిన అఖిల ఫోన్ చేసి తన ప్రేమను కొనసాగించింది. ఈ ఏడాదితో మైనార్టీ తీరి జనవరి నాటికి మేజర్ కావడంతో సతీష్‌ను పెళ్లిచేసుకునేందుకు నందిగామ నుంచి అన్నవరం చేరుకుంది. అన్నవరంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. 2017లో తన ప్రియురాలు తనకు ప్రపోజ్ చేసిన రోజైన జనవరి 20నే వివాహం చేసుకున్నట్లు సతీష్ తెలిపాడు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నిద్రలేమికి మందేంటో తెలుసా?
నిద్రపట్టకపోవటానికి మానసిక, భావోద్వేగ సమస్యలు ఏవైనా కారణం కావచ్చు! మీ భాగస్వామి ధరించిన దుస్తుల వాసన మీకు దివ్య ఔషదంలా పనిచేయనుంది. అవును! కెనడాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు ఈ విషయాన్ని నొక్కివక్కానిస్తున్నారు. రొమాంటిక్ పార్ట్నర్ మన నిద్ర క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడతారని చెబుతున్నారు. భాగస్వామి ధరించిన టీషర్ట్‌ను తలగడకు చుట్టి దానిపై నిద్రిస్తే చక్కగా నిద్రపడుతుందని వారు జరిపిన పరిశోధనలో తేలింది. స్లీప్ క్వాలిటీ, లవర్స్ స్మెల్ మధ్య సంబంధాలను తెలుసుకోవటానికి ఓ భిన్నమైన ప్రయోగం చేశారు. భాగస్వాములున్న ఆడ,మగలను 24 గంటల పాటు నిర్విరామంగా టీషర్ట్ వేసుకునేలా చేశారు. వారు శరీరపరిమళాలు వాడకూడదని, ఘాటైన వాసనలు కలిగిన ఆహారపదార్థాలు తినకూడదని నిబంధన విధించారు. ఆ తర్వాత ఓ జంటలోని ఓ వ్యక్తికి భాగస్వామి టీషర్టుతో పాటు ఇతర వ్యక్తి టీషర్టును కూడా ఇచ్చారు. ఆమె/అతడు ఆ టీషర్టులపై నిద్రపోయేలా చేశారు. ఇతర వ్యక్తి టీషర్టుపై నిద్రించినప్పటికంటే భాగస్వామి టీషర్టుపై నిద్రించినపుడు వారు ఎక్కువ సేపు నిద్రపోయినట్లు కనుగొన్నారు. భాగస్వామి శరీర వాసనలకు దగ్గరగా నిద్రించినవారు నిద్ర మధ్యలో మేల్కోవటం, కదలటం లాంటివి చేయకపోవటం గమనించారు. ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు భాగస్వామి శరీర వాసల్ని బంధించిన వస్త్రాన్ని తీసుకెళ్లటం ఉత్తమమని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. ‘ భాగస్వామి శరీరవాసనలు నిద్ర పట్టడానికి ఉపయోగించే స్లీపింగ్ ట్యాబ్లెట్లలా పనిచేశాయి. మన ప్రియమైనవారి శరీర వాసన మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంద’ని పరిశోధకుడు మార్లిసే హోఫర్ తెలిపారు. -
ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు! బస్‌లో...
2008లో నేను బీటెక్‌లో జాయిన్ అయ్యాను! అప్పుడే మొదటిసారి ఈడీసీ ల్యాబ్‌లో ఆద్యను చూశాను. ఆమె అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అది చూసి నాకు కూడా తనతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించేది. నేను చాలా షైగా ఉండేవాడిని. సో తనతో మాట్లాడటానికి, ఫ్రెండ్షిప్ చెయ్యడానికి చాలా రోజులు పట్టింది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి కొంచెం క్లోజ్ అయ్యాం. కానీ, తన మీద లవ్ ఉందని నాకు తెలియలేదు. వేరే ఎవరైనా నా కన్నా తనతో క్లోజ్‌గా ఉంటే బాగా కుళ్లు వచ్చేది. సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ ఒకడు తనకి లవ్ ప్రపోజ్ చేశాడు. తను కూడా ఒప్పుకుంది. ఫస్ట్ నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్లిద్దరూ నా ఫ్రెండ్స్ కాబట్టి. కానీ ఉండేకొద్దీ వాళ్లిద్దరూ బాగా క్లోజ్‌గా ఉండటం, అన్నీ షేర్ చేసుకోవడం అన్నీ చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే అర్ధం అయ్యింది! నేను తనని లవ్ చేస్తున్నా అని. ఎందుకో తెలీదు వాళ్ళ లవ్ ఒక నెలలోనే బ్రేకప్ అయింది. ఆ తర్వాత తన ఫ్యామిలీలో కొన్ని విషాద సంఘటనలు జరిగాయి. వాటి వల్ల తను మెంటల్‌గా ఇబ్బందికి గురయ్యింది. తనకి నేను చాలా ధైర్యం ఇవ్వాలనుకున్నా. కానీ, కాలేజ్‌కి కూడా సరిగా వచ్చేది కాదు. నా ఫ్రెండ్ లాగా నేను మాటకారిని కూడా కాదు. థర్డ్ ఇయర్ చివర్లో తను కోలుకుంది. వాళ్ల ఫ్యామిలీ కూడా మా ఇంటి వెనక లైన్లోకి షిప్టు అయ్యారు. థర్డ్ ఇయర్ తర్వాత సమ్మర్ హాలిడేస్‌లో తను కొన్ని కోర్సెస్‌లో జాయిన్ అయ్యింది. అది తెలిసి నేను కూడా తను ఉన్నచోటే జాయిన్ అయ్యాను. ఆ రోజులు నా జీవితంలో గోల్డెన్ డేస్. తనతో చాలా సేపు కలసి ఉండేవాడిని. ఇంటికి కలిసి వెళ్లేవాళ్లం. చాలా ఫాస్ట్‌గా రెండు నెలలు గడిచిపోయాయి. అప్పుడే తనకి నా లవ్ గురించి చెప్పాను. మెసేజ్‌లో, డైరెక్ట్‌గా చెప్పే అంత ధైర్యం నాకు లేదు. అది చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు నేను తనని డైరెక్ట్‌గా చూడలేకపోయా. తను నార్మల్‌గానే ఉంది. కానీ, నాకు మాత్రం ఏదో తెలియని ఫీలింగ్. నన్ను తను ఎప్పుడు ఒక పిల్లోడి లాగా, అమాయకుడిలాగా, ఫ్రెండ్ లాగానే చూసింది. కానీ నేనంటే చాలా కేరింగ్‌గా ఉండేది. చాలా వాల్యూ అండ్ ఇంఫార్టెన్స్ ఇచ్చేది. అందుకే తను అంటే నాకు చాలా అభిమానం. అవునని లేదా కాదని ఏమీ చెప్పలేదు. మేము అలానే కంటిన్యూ అయ్యాము. నేను తనని లవ్ చేస్తున్నా అని, నన్ను బాగా టీజ్ చేసేది. తను అలా చేస్తుంటే నేను కూడా ఎంజాయ్ చేసేవాడిని. తను నాతో చాలా సీక్రెట్స్ షేర్ చేసుకునేది. అలా మా క్లాస్‌కి సంబంధించి ఎదో ఒకటి షేర్ చేసుకునేది. దాన్ని నేను నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడికి ఒకసారి మాటల్లో చెప్పాను. వాడు దాన్ని ఒక గొడవ నుండి బయట పడటానికి వాడుకున్నాడు. దాని వల్ల తను నాతో చాలా రోజులు మాట్లాడలేదు. లాస్ట్ డేస్‌లో మళ్లీ మాట్లాడింది. అప్పుడు నాకు చాలా సంతోషం వేసేది. దాన్ని అలానే కంటిన్యూ చేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ, కాలేజ్ అయిపోయిన ఒక రెండు నెలల తర్వాత ఎదో విషయం మళ్లీ ఎవరికో చెప్పానని మాట్లాడటం ఆపేసింది. చాలా బాధ పడ్డాను. తర్వాత మాట్లాదిద్ది అనుకున్నా. కానీ, 8 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎన్నో సార్లు మెసేజ్ చేసినా నో రిప్లై. నేను ఫారెన్ వెళ్లి సెటిల్ అయ్యాను. అయినా తన పుట్టినరోజు అప్పుడు న్యూ ఇయర్‌కి మెసేజెస్ చేస్తూనే ఉన్నాను. కానీ నో రెస్పాన్స్. తన రిప్లై కోసం ఎంత తపించానో నాకు తెలుసు. తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసి నేను కూడా పెళ్లి చేసుకున్నా. కానీ, తనను నేను ఇంకా మిస్ అవుతున్నాను, ఒక మంచి ఫ్రెండ్‌లాగా తనతో మళ్లీ మాట్లాడాలని ఉంది కానీ ఏమీ చెయ్యలేకపోతున్నా. తనంటే నాకు చాలా ఇష్టం. తన క్యారెక్టర్ అంటే ఇష్టం! నా పట్ల తను చూపించే ప్రేమ, కేరింగ్ అంటే ఇష్టం. తనని ఎంత ఇష్టపడ్డా, ఎప్పుడూ లిమిట్స్ దాటలేదు నేను, బస్‌లో కూడా అవకాశం వచ్చినా పక్కన కూర్చునే వాడిని కాదు. అందరూ తనని ఏం అనుకుంటారో అని. తనని చూడటం, తనతో మాట్లాడటం...ఇవే నాకు చాలా మ్యాజికల్ ఫీలింగ్స్ ఇచ్చేవి. తనని మిస్ అవ్వడమే నా జీవితంలో నేను ఎప్పటికి తిరిగి పొందలేనిది, ఎప్పటికి బాధ పడే విషయం. ఆమె ముందు అన్నీ చిన్నవే అనిపిస్తుంది, ఆద్య నన్ను ఒక్కసారి అయినా లవ్ చేసిందో లేదో తెలీదు. కానీ, నేను ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు ఏం అనుకున్నా తను, ఆ రోజులు మళ్లీ తిరిగి రావు. - చంద్రకాంత్ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ ఉద్యోగంలో అందుకే చేరానేమో!
నేను బీటెక్ చేశాను. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక నాకు సరియైన జాబ్ రాలేదు. ఏదో చిన్న జాబ్‌లో చేరాను. బాగా చదివి టాప్‌లో ఉండే నాకు సరిగా మాట్లాడలేకపోవడం, ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మంచి జాబ్‌లో చేరలేకపోయాను. ఆ బాధ నన్ను చాలా వెంటాడుతూ ఉండేది. ఎందుకు ఈ జాబ్ చేస్తున్నానో కూడా అర్థం అయ్యేది కాదు. చాలా డిప్రెషన్లో ఉండే వాడిని. నవ్వి కూడా చాలా రోజులు అయ్యింది. అలా డల్‌గా ఉన్న నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి వచ్చింది. ఆమె కోసమే అక్కడ చేరాను అని తరువాత అర్థం అయ్యింది. అంతేనేమో లైఫ్ లో జరిగే ప్రతి విషయం మరో విషయంతో ముడిపడి ఉంటుందేమో!. ఆమె అక్కడ హెచ్ఆర్గా చేరింది. చాలా యాక్టివ్‌గా ఉండేది. అందరితో మంచిగా మాట్లాడేది. ఎప్పుడు నవ్వతూనే ఉంటుంది తను. నాతో కూడా తనే వచ్చి మాట్లాడింది. అప్పటి నుంచి రోజు మాట్లాడుతూనే ఉండేది. నేను బీటెక్ మంచి మార్కులతో పాస్ అయిన ఇంగ్లీష్ రాకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇలా అయ్యానని తెలుసుకొని చాలా బాధపడింది. తరువాత నుంచి నన్ను ప్రతి విషయంలో ప్రోత్సహిస్తూ నాలో ధైర్యాన్ని నింపింది. నెమ్మది నెమ్మదిగా రోజు నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ నా స్కిల్స్ ఇంప్రూవ్ కావడంలో సహాయం చేసింది. తరువాత నాకొక మంచి జాబ్ వచ్చింది. నా జీవితమే మారిపోయింది. నాకు ఇంతలా సాయం చేసిన ఆమెనే పెళ్లి చేసుకోవాలనుంది. కానీ ఆమె ఏమంటుందో అని నా ప్రేమను చెప్పలేకపోతున్నాను. సురేష్ (గుంటూరు). -
వాడో సైకో! టార్చర్ పెట్టేవాడు..
‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’ ఆడవాళ్లను ఉద్ధేశించి ఓ సినీకవి రాసిన పాట ఇది. ఈ పాట విన్నప్పుడల్లా నా మనసులో మరో పాట మెదిలేది! ‘ ప్రేమ ఎంత మధురం చెలికాడు అంత కఠినం’ అని. ఓ మగాడి బాధకు ఆడది ఎంత కారణమవుతుందో.. ఓ ఆడదాని బాధకు మగాడు కూడా అంతే కారణం అవుతాడు. నా కష్టాలకు నిలువెత్తు రూపం భార్గవ్! ఎంబీఏ చదువుతున్నపుడు పరిచయమయ్యాడు. తనది ఎంఎస్సీ! ఇద్దరం ఒకే క్యాంపస్‌లో చదువుకునేవాళ్లం. మా కాలేజ్‌లో జరిగే ఈవెంట్స్‌లో చురుగ్గా పార్టిసిపేట్ చేసేవాడు. డ్యాన్స్ చేసేవాడు, డ్రామాలువేసేవాడు. అతడంటే ఇష్టం పెరగటానికి అవికూడా ఓ కారణం అని చెప్పొచ్చు. ఓ సాంఘీక నాటకం వేయటానికి నన్ను అప్రోచ్ అయ్యారు. నాకు యాక్టింగ్ రాదన్నా వినలేదు! పట్టుబట్టి మరీ లాక్కెళ్లారు. క్లాసులు జరుగుతున్నా ఓ గంట పాటు రిహార్సల్స్ చేసేవాళ్లం. అప్పుడే మా ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. నాటకం వేయటం అయిపోయినా మా స్నేహం కొనసాగింది. తరచు ఫోన్లలో మాట్లాడుకునే వాళ్లం. ఓ రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నపుడు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అతనంటే నాకూ ఇష్టం కాబట్టి సరే అన్నాను. ఓ 6నెలలు ఫోన్లలోనే గడిపాం. తర్వాత అప్పుడప్పుడు సరదాగా బయటకు వెళ్లే వాళ్లం. ఇద్దరి చదువులు పూర్తయి కాలేజీనుంచి బయటపడ్డాం.. ఆ తర్వాతి నుంచి నా కష్టాలు మొదలయ్యాయి. తనకు బుద్ధిపుట్టినప్పుడల్లా నాకు ఫోన్‌చేసేవాడు. ఇంట్లో ఉండటం వల్ల అతడి ఫోన్‌ను తీయటం సరిగా కుదిరేది కాదు. బాగా తిట్టేవాడు! ఎంత చెప్పినా నా పరిస్థితి అర్థం చేసుకునేవాడు కాదు. ఓ రోజు ఫోన్ చేసి ‘బయటకు వెళదాం రా!’ అన్నాడు. ఇంట్లో పరిస్థితి చెప్పి రావటం కుదరదన్నా. తిట్టాడు, తర్వాత ‘ నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది’ అంటూ ఏడ్చినంత పనిచేశాడు. నాకు బాధేసింది.. తర్వాత భయమేసింది. ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డా. ఓ రోజు ఫోన్ చేశాడు.. నేను వెంటనే ఫోన్ తీశా ‘నీకూ నాకు సెట్ అవ్వదు. విడిపోదాం’ అని ఫోన్ పెట్టేశాడు. నేను ఫోన్ చేసినా తీయలేదు. ఇలా నెల రోజులు.. చాలా బాధపడ్డా. ఓ రోజు రాత్రి 11 గంటలకు బాగా తాగి నాకు ఫోన్ చేశాడు. ‘ సారీ! ఆ రోజు నేను జోక్ చేశా. నువ్వంటే నాకు ప్రాణం, నిన్నెలా వదులుకుంటా’ అన్నాడు. నా మతి పోయింది! ఏం మాట్లాడుతున్నాడో అతడికైనా అర్థం అయ్యుండదు.. దాదాపు ఒంటి గంట వరకు నాన్‌స్టాప్‌గా మాట్లాడాడు. ఫోన్ పెట్టేద్దామంటే ఏమనుకుంటాడో అన్న భయం. చెవులు చిల్లులు పడ్డాయి.. కళ్లు మంటలు పుట్టాయి. అతన్ని ప్రేమించినందుకు నా మీద నాకే జాలేసింది. నేను ఎంత బిజీగా ఉన్నా అతడి ఫోన్ వస్తే మాత్రం తీసేదాన్ని. కొద్దిసేపు నవ్వుతూ మాట్లాడేవాడు.. తర్వాత కోపం.. ఏడుపు.. ఫోన్లోనే నవరసాలు పండించేవాడు. అతనితో ఫోన్ మాట్లాడటం కమల్ హాసన్ సినిమా చూసినట్లు ఉండేది. ఓ సైకోలాగా నన్ను ప్రతీరోజు టార్చర్ చేసేవాడు. మొన్న డిసెంబర్ 31నుంచి నాతో కాంటాక్ట్‌లో లేడు. విచారిస్తే బాగా తప్పతాగి ఎవరితోనో గొడవపడితే బాగా కొట్టారంట, ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ విషయం తెలియగానే నా ముఖంలో ఓ క్వచ్ఛన్ మార్క్! పీడాపోయిందని సంతోషించాలా? బాధపడాలా? - నవ్య లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఉద్యోగం లేదు.. ఎలా జీవిస్తారు..
మాది కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్ల వాలేరు గ్రామం. మా గ్రామంలో నాది తూర్పు వీధి, నేను మా ఊళ్లోని పడమర వీధికి చెందిన అరుణశ్రీ అనే అమ్మాయిని ప్రేమించాను. ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే పెద్దలకు చెప్పాం. అయితే వాళ్లు ముందు అంగీకరించలేదు. ‘నీకు ఉద్యోగం లేదు. ఎలా జీవిస్తారు’ అంటూ ప్రశ్నించేవారు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, ఇష్టమైన అమ్మాయితో వివాహం చేస్తేనే నేను సంతోషంగా ఉంటానని నచ్చచెప్పేవాడిని. అయినా పెద్దలు సుముఖత వ్యక్తం చేయలేదు. వివాహం చేసుకుంటే అరుణశ్రీనే చేసుకుంటానని.. లేదంటే వివాహం అవసరం లేదని తేల్చిచెప్పేశాను. ఇంతలోనే నాకు ఆర్టీసీలో ఉద్యోగం వచ్చింది. దీంతో పెద్దలు జోరుగా పెళ్లి సంబంధాలు చూసేపనిలో పడ్డారు. నేను ముందుగా చెప్పిన విషయాన్ని పెద్దలకు స్పష్టం చేశాను. ‘మా సంతోషం ముఖ్యమా.. లేదా మీకు ఆర్ధిక అసమానతలంటూ కాలయాపన చేస్తారా?’ అని.. పదే పదే అడిగాను. దీంతో ఇరువురి పెద్దలు ఆర్ధిక అసమానతలతో పాటు అన్ని విషయాలను పక్కన పెట్టారు. దీంతో 2019 మేలో పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాము. మేము పెద్దల గౌరవానికి, వాళ్ల మనోభావాలకు, సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా ఎంతో అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నాం. - గుడి రాజేష్ కుమార్, డిపో మేనేజర్, ఆర్టీసీ, అలిపిరి డిపో కులాంతర వివాహమని ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు డాక్టర్ పెంచలయ్య దంపతులు మాది నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం. నాన్న వెంకటయ్య, అమ్మ సుబ్బమ్మ వ్యవసాయ కూలీలు. మా ఆవిడ చిట్టి! అనంతపురం జిల్లా వజ్రకరూర్కు చెందిన అంజనయ్య, మాణిక్యమ్మల కుమార్తె. 1986లో తిరుపతిలోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివే సమయంలో చిట్టి బీఎస్సీ నర్సింగ్ చదివేది. ఆ సమయంలో మా ఇద్దరి మధ్యా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరి ఇష్టాలు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, కులాంతర వివాహమని ఆమె ఇంట్లో ఒప్పుకోలేదు. నాలుగు సంవత్సరాలు ఆగి, ఆ తర్వాత మళ్లీ అడిగి చూశాం. మాపై నమ్మకంతో పెద్దలు పెళ్లికి అంగీకరించడంతో లవ్ అండ్ అరెంజెడ్ మ్యారేజ్ జరిగింది. పెళ్లి జరిగిన సంవత్సరం తర్వాత ఇద్దరం ప్రభుత్వ కొలువులు సాధించాం. మాకు ఇద్దరు పిల్లలు. బాబు డాక్టర్ తేజ్‌దీప్ ఎంఎస్ జనరల్, పాప దీప్తి నాలుగో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. ప్రేమికులకు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ కాలంలో ప్రేమ, వ్యామోహం, ఆకర్షణకు తేడా కొందరు పిల్లలకు తెలియడం లేదు. - డాక్టర్ పెంచలయ్య, డీఎంఅండ్‌హెచ్‌ఓ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అలాగని చీటికిమాటికి గొడవపడితే..
ఓ ఇద్దరు వ్యక్తులు జంటగా బంధంలోకి ప్రవేశించినపుడు అన్ని రకాల ఛాలెంజ్‌లను వారు ఫేస్ చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది. ఏ జంటకైనా కొన్ని కష్టసమయాల్లో ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి జంటలకు చిన్న సలహాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి జంటల కోసం బెస్ట్ రిలేషన్షిప్ టిప్స్!! 1) వ్యక్తిగత సరిహద్దులు జంట మధ్య బంధం సాఫీగా సాగాలంటే వ్యక్తిగత సరిహద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరికొకరు కొంత ఫ్రైవేట్ స్పేస్‌ను ఏర్పరచుకోవాలి. అనుమతి లేకుండా భాగాస్వామి సెల్‌ఫోన్‌ను చెక్చేయటం, పర్శనల్ వస్తువులను వారికి తెలియకుండా వాడుకోవటం లాంటివి చేయకూడదు. దీనివల్ల ఎదుటివ్యక్తికి మనపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది. 2) నచ్చని అలవాట్లు .. బంధం అంటేనే అంగీకారం, సర్దుకుపోవటం. బంధంలోకి అడుగుపెట్టగానే ఎదుటి వ్యక్తిని లేదా వారి అలవాట్లను మార్చాలనుకోవటం, అది కుదరక నిరుత్సాహపడిపోవటం మామూలే. అయితే మనం నిజంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే వారిని లేదా వారి అలవాట్లను మార్చాలని అనుకోము! వారిని వారిగా స్వీకరిస్తాము. అయితే ఎదుటి జీవితాన్ని నాశనం చేసే ఆరోగ్యపు అలవాట్ల విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. 3) అన్యోన్యమైన జంట గొడవపడదు! అన్యోన్యమైన జంట గొడవపడదు అని చెప్పటం జంటలను పక్కదోవ పట్టించటమే. జంటల మధ్య గొడవలు జరగటం వల్ల వారి బంధం మరింత బలపడుతుంది. గొడవలు పడకుండా జంట సర్దుకుపోవటం వల్ల ధీర్ఘకాలంలో వారి బంధాన్ని నాశనం చేసే విషయాలను వారు స్వేచ్ఛగా చర్చించలేరు. అలాగని చీటికిమాటికి గొడవపడటం ఎంత మాత్రమూ మంచిది కాదు. 4) అనుకూలమైన భాగస్వామి భాగస్వామి కోసం వెతుకుతున్నపుడు అనుకూలమైన వారి కోసం అన్వేషించటం పరిపాటి. చాలామంది అనుకూలతలేని భాగస్వామితో జీవితం బాగుండదని నమ్ముంతుంటారు. అయితే అనుకూలత అన్నది ఓ స్థిరమైన గుణం కాదని, నెమ్మదిగా అలవర్చుకునేదని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది మొదటి చూపులోనే అనుకూలంగా కనిపించకపోవచ్చు. అలాగని వారిని దూరం చేసుకోవటం మంచిదికాదు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ ఊహే బాగుంది! లేకుంటే..
అది 2005! నేను 8వ తరగతిలోకి అడుగు పెట్టాను. మా క్లాస్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది. తను ఆగష్టు 15న పాట పాడింది. మొదటి సారిగా తను పాడుతుంటే నేను వినడం. ఎంత స్వీట్ వాయిసో తనది! మళ్లీ మళ్లీ వినాలనిపించింది. రెండు జడలు వేసుకుని చాలా క్యూట్‌గా ఉండేది. స్కూల్ వెనకే వాళ్ల ఇల్లు. రోజు స్కూల్ అయిన వెంటనే తనని ఫాలో చేసేవాడిని. సెలవులు అయితే చాలు సైకిల్ వేసుకుని వాళ్ల వీధిలో తిరగటమే నా పని. నా ప్రేమ సంగతి ఆమెకు చెప్పాలంటే భయం. టెన్త్‌లో తను జాయిన్ అయిన ట్యూషన్లోనే నేనూ జాయిన్ అయ్యా. ఎప్పుడూ ఆమెను అలా చుస్తూ ఉండి పోయే వాడ్ని తప్ప ధైర్యం చేసి చెప్పలేకపోయా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను తనకి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ప్రేమించే వయసు కాదని చెప్పి పంపింది. తన కళ్లను చూసినప్పుడల్లా తను నన్నే చూస్తోందని అనుకునే వాడ్ని. అలా టెన్త్ కూడా అయిపోయింది. తరువాత మేము వేరే వేరే కాలేజీలలో చేరటంతో దూరం పెరిగి పోయింది. కానీ, తను గుర్తుకు రాని రోజు లేదు. ఎప్పుడు తన ధ్యాసే. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నపుడు తనకు పెళ్లి అయి పోయింది.ఇప్పటికీ అనుకుంటూ ఉంటా‘ ఒకవేళ తనకి చెప్పి ఉంటే నా ప్రేమను అంగీకరించి ఉండేదేమో?’ అని!(ఆ ఊహే బాగుంది లేకుంటే, నేను చెప్పి తను కాదని ఉంటే తట్టుకోలేకపోయేవాడ్ని). - మణికంఠ లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఇలాంటి మగాళ్లు ఒట్టి మోసగాళ్లు!!
ఫేసు చూసి వారి క్యారెక్టర్ చెప్పేయటం మనలో చాలా మందికి అలవాటు. అయితే ‘డోన్ట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్’ అన్నట్లు కొందరి విషయంలో మన అంచనాలు తప్పొచ్చు. కానీ, కొంతమంది మగాళ్ల ముఖతీరును బట్టి వారి స్వభావాన్ని చెప్పేయొచ్చని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా బలమైన దవడలు, చిన్న పెదాలు ఉన్నవారు భాగస్వాములను ఎక్కువగా మోసం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారని వెల్లడైంది. రాయల్ సొసైటీ ఓపెన్ సైన్సెస్‌లో ఈ సర్వే ప్రచురితమైంది. కొంతమంది పరిశోధకుల బృందం దాదాపు 1500 మంది మగ,ఆడవారిపై ఆన్లైన్ సర్వే నిర్వహించింది. వీరంతా 18నుంచి 75 సంవత్సరాల వయసు కలిగిన వారే. 299 మంది మగవారి ఫొటోలను 452 మంది ఆడవారికి చూపించి వారెలాంటి వారో చెప్పాలని కోరారు. అంతేకాకుండా ఆ మగవారు ఎంత తరచుగా మోసాలకు పాల్పడతారో రేటింగ్ ఇవ్వమన్నారు. ‘మీరు ఎంత తరచుగా ఇతరుల భాగస్వాములను లోబర్చుకోవటానికి చూస్తారు’ అంటూ ఆ 299 మంది మగవారినే అడిగారు. మగవారు చెప్పిన వివరాలు ఆడవారు చెప్పిన వివరాలతో సరిపోలాయి. దీంతో మగవారి ముఖతీరును బట్టే వారి స్వభావాన్ని అంచనా వేయొచ్చని తేలింది. అయితే ఇదే సర్వేను ఆడవారిపై నిర్వహించినపుడు వారి ముఖతీరును బట్టి ఓ అంచనాకు రాలేమని తేలింది. కాగా, వ్యక్తుల స్వరాన్ని బట్టి వారు మంచివారా కాదా అన్నది అంచనా వేయొచ్చని మరో సర్వేలో తేలింది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ భయం నా కోపాన్ని చంపేసింది..
2012లో బీటెక్ ఫేయిలై నేను ఇంటి దగ్గర ఉన్నా. ఏమీ తోచేది కాదు.. ఇంట్లో వాళ్లు నన్ను తిట్టని తిట్టులేదు. బాగా ఇబ్బంది పడ్డరోజులవి. ఇంట్లో దిక్కుతోచక ఓ బట్టల షాపులో పనికి కుదిరా. ఉదయం వెళితే.. రాత్రి పదయ్యేది ఇంటికి వచ్చేసరికి. పైగా తక్కువ జీతం! కానీ, తప్పలేదు. నాకు ఏపనైనా ఎక్కువ రోజులు చేయటం ఇష్టముండేదికాదు. అందుకే రోజురోజుకు నాకు పని మీద శ్రద్ధ తగ్గుతూ వచ్చేది. నాతోపాటు పనిచేసే ఓ అమ్మాయి పని మానేయటంతో పనిభారం కూడా పెరిగింది. దీంతో నేను పని మానేయాలని ఫిక్స్ అయ్యా!. అలాంటి సమయంలో షాపులో సేల్స్‌గర్ల్‌గా చేరిందో అమ్మాయి! పేరు సుహాసిని. చూడ్డానికి చాలా అందంగా ఉండేది. కానీ, నేను అంతగా తనవైపు చూసేవాడిని కాదు. అప్పుడప్పుడు అవసరం ఉన్నపుడు మాట్లాడేవాడ్ని. ఓసారి అర్జంటు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కొంత డబ్బు కావాల్సి వచ్చింది. ఎవరిని అడగాలో తెలియలేదు. షాపులో ఇదివరకే బాకీ ఉంది. అడగటానికి ఇబ్బందిపడ్డా! ధైర్యం చేసి అడిగా. ఓనర్ ఊర్లో లేడు! ఇవ్వటం కుదరదన్నాడు మేనేజర్. కొద్దిగా మనసు చివుక్కుమంది. ఏదో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. పక్కకు చూశా..‘ మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర కొంత డబ్బుంది తీసుకోండి! తర్వాత ఇద్దరు గానీ’ అంది. ఓ పక్క అవసరం.. మరోపక్క మొహమాటం.. అవసరమే గెలిచింది. ‘వీలైనంత తొందరగా తిరిగిచ్చేస్తాను’ కాస్త బొంగురుపోయిన గొంతుతో అన్నాను. ‘పర్లేదు! మీకు వీలైనప్పుడే ఇవ్వండి’ అంది నవ్వుతూ. నాకప్పటినుంచి తనంటే గౌరవం పెరిగింది. నా చేతికి డబ్బు రాగానే తన డబ్బు తిరిగిచ్చేశాను. నాకే కాదు తను నా కళ్లముందే చాలా మందికి సహాయం చేసింది. తనపై ఉన్న గౌరవం కాస్తా! ఆరాధనగా మారింది. కొన్ని నెలలు తనను మూగగా ఆరాధించా. ఓసారి సుహాసిని ఇంటికి వెళ్లే సమయంలో నేను కూడా తన వెంట వెళ్లాను. ప్రేమిస్తున్న సంగతి చెప్పేశా! తను ఆలోచించుకుని చెబుతా అంది. మరుసటి రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నా. తనురాలేదు. వరుసగా మూడు రోజులు గడిచిపోయాయి. నాకు భయం వేసింది! నా ప్రేమ సంగతి చెప్పి తనను ఇబ్బంది పెట్టాననిపించింది. నా బాధకు అడ్డులేకుండా పోయింది. ఆలోచనలతో రాత్రిళ్లు నిద్రకూడా పట్టలేదు. మరసటి రోజు నీరసంగానే షాపుకు వెళ్లా. కొద్దిసేపటి తర్వాత తను వచ్చింది. నా పెదవులపైకి చిరునవ్వులు తెచ్చింది. కొద్దిగా కోపం కూడా వచ్చింది. ఏం అయ్యుంటుందోనన్న భయం నా కోపాన్ని చంపేసింది. ‘‘ఏం జరిగింది! మూడు రోజులు ఎందుకురాలేదు. నా ప్రేమ సంగతి నీకు చెప్పి ఇబ్బంది పెట్టినందుకు సారీ! ఇకమీదట నిన్ను ఇబ్బంది పెట్టను’ అన్నాను కొంచెం బాధగా. ‘అదేం లేదు! మా అమ్మకు ఒంట్లో బాగోలేకపోతే ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది.’ చెప్పింది. ఆ మాటలు నాలో కొండంత ధైర్యం నింపాయి. వెంటనే నా ప్రేమ సంగతి అడగాలనిపించింది. కానీ, బాగోదని ఆగిపోయా. అప్పుడు తనే‘ ప్రేమ! గీమా అంటే మా ఇంట్లో కుదరదు. మా వాళ్లతో మాట్లాడి ఒప్పించండి.’ అంది. ఇది చాలు అనుకున్నా! మా ఇంట్లో వాళ్లను ఒప్పించి, వాళ్లింటికి తీసుకెళ్లాను. ఇది వరకే మా నాన్నకు వాళ్లతో పరిచయం ఉండటంతో మంచి ఉద్యోగం వస్తే పెళ్లి చేయటానికి అభ్యంతరం లేదన్నారు. సబ్జెక్టులు కంప్లీట్ చేయటం, ఉద్యోగంలో చేరిపోవటం అంతా చకచకా జరిగిపోయింది. 2019 నవంబర్‌లో మాకు ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాం. నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. - నవీన్ కుంట, నంద్యాల లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ప్రేమించే స్నేహితుడు! అజ్ఞాత ప్రేమికుడు..
సినిమా : తాజ్ మహాల్(2010) తారాగణం : శివాజీ, శృతి, కోటాశ్రీనివాసరావ్, బ్రహ్మానందం, నాజర్, రఘుబాబు డైరెక్టర్ : అరుణ్ శింగరాజు సంగీతం : అభిమన్ కథ : అజయ్( శివాజీ) ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. డిగ్రీ చదువుల కోసం హైదరాబాద్ వస్తాడు. నగరంలో అడుగుపెట్టగానే అతడి వేషభాషల్లో, ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి. పేదవాడిననే విషయాన్ని దాచిపెట్టి బాగా డబ్బున్నవాడినని చెప్పుకుంటూ ఉంటాడు. ఇలాంటి సమయంలోనే తన కాలేజ్‌లో చదివే శృతి(శృతి)తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం పరితపిస్తాడు. కానీ, శృతి మాత్రం అతడ్ని ఫ్రెండ్‌లానే ట్రీట్ చేస్తుంది. ఇదిలా ఉండగా శృతి, కుమార్ అనే ఓ అజ్ఞాత వ్యక్తితో ప్రేమలో పడుతుంది. అతడ్నే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. ఈ నేపథ్యంలో శృతి ప్రేమను పొందటానికి అజయ్ చేసే ప్రయత్నాలేంటి? చివరకైనా శృతి! అజయ్ ప్రేమను అంగీకరిస్తుందా? ఇంతకీ ఆ అజ్ఞాత ప్రేమికుడు ఎవరు? అన్నదే మిగితా కథ. విశ్లేషణ : 2010లో విడుదలైన తాజ్ మహాల్ ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. 2008లో విడుదలైన కన్నడ చిత్రం తాజ్‌మహాల్‌కు ఇది రీమేక్. వన్‌సైడ్ లవర్‌గా శివాజీ నటన అద్భుతంగా ఉంటుంది. అజ్ఞాత ప్రేమికుడి కోసం పరితపించే యువతిగా శృతి నటన ఆకట్టుకుంటుంది. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. పాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. క్లైమాక్స్‌లో చోటుచేసుకునే సంఘటనలు సినిమాకు హైలెట్‌గా నిలవటమే కాకుండా మన మనసులో ముద్రపడిపోతాయి. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
చాలా సార్లు అనిపించింది! ధైర్యం చాల్లేదు..
నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లో అభిని చూశాను. తను మా సీనియర్! చాలా అందంగా ఉండేవాడు. చూడగానే నచ్చేశాడు. ప్రతిరోజూ కాలేజీలో అతడ్ని చూసేదాన్ని. రోజులు గడుస్తున్న కొద్దీ అతడిమీద చాలా ఆశలు పెంచుకున్నాను. నా ప్రేమ సంగతి అతని చెబుదామని లెక్కలేనన్ని సార్లు అనిపించింది! ధైర్యం చాలక ఆగిపోయాను. తను కనిపించని రోజు చాలా బాధగా ఉండేది. వేసవి సెలవుల్లో అయితే ఇంకా కష్టంగా. అందరు సెలవుల కోసం ఎదురుచూస్తే.. నేను సెలవులు ఎప్పుడు అయిపోతాయా! అభిని ఎప్పుడు చూస్తానా అని ఎదురుచూసేదాన్ని. నేను సెకండ్ ఇయర్, తను థర్డ్ ఇయర్. తనతో ఒక్కసారైనా మాట్లాడే అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తున్నాను. ఓ రోజు తనే నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. మాట్లాడింది రెండు మాటలే అయినా చాలా సంతోషంగా అనిపించింది. చూస్తుండగానే అతడి ఫైనల్ ఇయర్ ఎండింగ్‌కు వచ్చింది. ఫేరెవల్ పార్టీలో చివరిసారిగా అతడ్ని చూశాను. తర్వాత చూడలేదు. ఐదేళ్లు గడిచిపోయింది. అయినా అతడ్ని మర్చిపోలేకపోతున్నా. ప్రతిరోజూ అతడు గుర్తుకువస్తూనే ఉంటాడు. తను ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. వచ్చే జన్మకైనా నా ప్రేమ ఫలిస్తుందని ఆశిస్తూ.. - సణ్ముఖి, గోపల్లె చదవండి : అయ్యో! వాలెంటైన్స్ రోజు.. ఫీల్ పోయింది.. నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
అయ్యో! వాలెంటైన్స్ రోజు.. ఫీల్ పోయింది..
వాలెంటైన్స్ డే వేడుకలు నిన్నటితో ముగిశాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్రేమ జంటలు గులాబీలు, ప్రేమ కానుకలు, క్యాండీల్ లైట్ డిన్నర్లు, వెకేషన్లతో తమకు తోచినట్లుగా రోజును గడిపేశాయి. అయితే వాలెంటైన్స్ డేను గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలనుకున్న కొన్ని ప్రేమ జంటలకు మాత్రం నిరాశే ఎదురైంది. ఆ ప్రేమ జంటల్లో ఒక్కోరిది ఒక్కో అనుభవం. వారంతా లవర్స్ డే వేడుకల సందర్భంగా తాము ఎదుర్కొన్న వింత అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సందిట్లో సడేమియా అంటూ వ్యాపారులు తమను మోసం చేసిన తీరును, ఒకరికి చేరవల్సిన కానుకలను, గిఫ్ట్ కార్డులను ఇంకొకరి పంపి కొరియర్ సంస్థలు ఇబ్బంది పెట్టిన వైనాన్ని వివరిస్తూ తోటి నెటిజన్ల ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. 1) నాకు రోజా పూలంటే నచ్చవు. కానీ, నా భర్త వాలెంటైన్స్ డే సందర్భంగా వాటిని నాకు బహుమతిగా ఇచ్చాడు. వాటిని చూడగానే ఫీల్ మొత్తం పోయింది. దేవుడా! వాడిన పూలను ఎందుకమ్ముతారో!! 2) ఖర్మ కాలి ఓ వారం రోజుల ముందు రోజా పూలు ఆర్డర్చేశా. 13న డెలివరీ ఇచ్చారు! అదీ కూడా వేరే అడ్రస్‌లో.. సగం వాడిన పూలను. 3) అయ్యో! వాలెంటైన్స్ రోజు టామీ అనే వ్యక్తికి వెళ్లాల్సిన విషెస్ కార్డు మా అడ్రస్‌కు వచ్చింది. దాని మీద‘ హ్యాపీ వాలెంటైన్స్ గే’ అని రాసి ఉంది. అయ్యా టామీ! ఎక్కడున్నావయ్యా! నీ కార్డు నా దగ్గరే ఉంది. వచ్చి తీసుకెళ్లు. 4) వాలెంటైన్స్ డే కోసం మా ఆయన్ని సర్‌ఫ్రెజ్ చేద్దామని 1800 పూలు ఆర్డర్ చేశా. మా ఆయనకు పంపించమంటే మా అమ్మకు ఆ పూలను పంపించారు. 5) వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా ఆయన నాకు విషెస్ కార్డు ఇచ్చాడు. నేను ఎంతో సంతోషంగా దాన్ని తెరిచి చూశాను. షాక్! దాన్లో హ్యాపీ యానివర్శరీ అని ఉంది. 6) నేను పబ్లిక్‌గా ‘మూన్పిగ్ యూకే’( కొరియర్ సంస్థ)కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను పంపినవి కాకుండా వేరే వాళ్ల వాలెంటైన్స్ కార్డును నా బాయ్‌ఫ్రెండ్‌కు పంపినందుకు. అటువైపు నా ఫొటోలు ఉన్న వాలెంటైన్స్ కార్డు అందుకున్న వారికి నా క్షమాపణలు. -
నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది
కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మానాన్నల బలవంతంమీద ఓ మాట్రిమొనియల్ సైట్లో నా వివరాలు నమోదుచేశా. ఆ మాట్రిమొనియల్ సైట్లోనే వరుణ్‌తో నాకు పరిచయం ఏర్పడింది. పరిచయం పెరిగే కొద్ది అతడిపై ప్రేమ పుడుతుందని భావించా. అయితే ఆ సమయంలో మానసికంగా నా ఆరోగ్యం అంతగా బాగోలేదు. నా బెస్ట్ ఫ్రెండ్స్‌తో కూడా ఈ విషయాలు మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతడిని సరిగా పట్టించుకునేదాన్ని కాదు. అతడు మాత్రం నాకు తరచు ఫోన్ చేస్తుండేవాడు. ప్రేమగా మాట్లాడుతుండేవాడు. నాకు ఇష్టం లేకపోయినా ఇబ్బంది పడుతూనే మాట్లాడేదాన్ని. అతడి వైపునుంచి నాపై ఆశలు పెరుగుతూపోయాయి. నాకు మాత్రం అతడిమీద ఇష్టం కలగలేదు. దీంతో నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి, వరుణ్‌తో మాట్లాడటం మానేశాను. అయితే పూర్తిగా సంబంధాలు తెంచుకున్న రెండు సంవత్సరాల తర్వాత అతడిపై ఇష్టం మొదలైంది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత పిచ్చిపని చేశానో అర్థమవుతోంది. తప్పు చేశానన్న భావనలోంచి బయటపడలేకుండా ఉన్నా. ఎలాగైనా అతడ్ని కలిసి క్షమాపణ చెప్పాలనిపిస్తోంది. దానికి తోడు మా వాళ్లు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని చూస్తున్నారు. నాకు మాత్రం వరుణ్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది. అర్థం కాని విషయం ఏంటంటే అతడింకా పెళ్లి చేసుకోకుండా అలానే ఉన్నాడా? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఎలా స్పందిస్తాడు? ఇలాంటి ప్రశ్నలే నా మెదడును తినేస్తున్నాయి. ఎలాగైనా అతడితో మాట్లాడాలని ఉంది. - శైలజా, చిత్తూరు చదవండి : ఆ రోజునే పెళ్లి చేసుకుంటాం! లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆ రోజునే పెళ్లి చేసుకుంటాం!
ప్రేమకు రెండు మనసులు కలిస్తే సరిపోతుంది! అదే పెళ్లి విషయానికి వచ్చేసరికి రెండు కుటుంబాలు కలవాల్సి ఉంటుంది. అందుకే చాలా ప్రేమ కథలు పెద్దల అంగీకారం దగ్గరే చతికిలబడి పోతున్నాయి. ఒక వేళ పెద్దలు పెళ్లికి ఒప్పుకుంటే మటుకు.. మంచి పంతులుగారిని వెతుక్కోవాలి.. ఎవరికీ ఇబ్బంది లేని ఓ పెళ్లి రోజును ఫిక్స్ చేయాలి, పెళ్లి చేయటానికి మంచి కళ్యాణ మండపం.. ఒకటేంటి ఎన్నో పనులు.. పెళ్లంటే మాటలు కాదుగా మరి. ప్రేమించుకోవటం మాత్రమే జంట ఇష్టం. ఆ తర్వాత పెత్తనమంతా పెద్ద వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక జంట అభిప్రాయాలకు విలువుండదనే చెప్పొచ్చు. ఒక వేళ ‘మీరు పెళ్లి చేసుకోవటానికి ఓ మంచి రోజును మీరే ఎంచుకోండి’ అని జంటను అడిగితే. ఎక్కువ శాతం జంటలు చెప్పేపేరు.. వాలెంటైన్స్ డే.. అవును! ఇదిప్పుడు ప్రేమికుల రోజు మాత్రమే.. పెళ్లిళ్లు చేసుకోవటానికి జంటలు ఎంచుకునే రోజు కూడా! అందుకే 55శాతం మంది యువత వాలెంటైన్స్ డేన పెళ్లి చేసుకోవటానికి ఉత్సాహం చూపిస్తోంది. ఓ ప్రముఖ మాట్రిమొనియల్ సైట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇందుకోసం దాదాపు 1000మందిపై సైట్ సర్వే నిర్వహించింది. వీరిలో 55 శాతంమంది 26-33 సంవత్సరాల వయసు కల్గిన వారే. ‘మీరు పెళ్లి చేసుకోవటానికి ఏ రోజును ఎంచుకుంటారు’ అని అడిగినపుడు. వీరంతా వాలెంటైన్స్ డేకే ఓటేశారు. రొమాంటిక్ డేనే తాము పెళ్లి చేసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది మహిళలు వాలెంటైన్స్ రోజున ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతున్నట్లు తేలింది. 25 శాతం మంది వాలెంటైన్స్ డేను తమ ప్రియమైన వారితో గడపటానికి ఇష్టపడ్డారు. 4 శాతం మంది బీజీ లైఫ్‌కు దూరంగా పేరెంట్స్‌తో వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడ్డారు. చదవండి : ప్రేమికుల రోజునే.. పెళ్లి బాజాలు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నా లక్! ఆమె కూడా ఆ రోజునుంచి..
2006 నా లైఫ్‌ను మార్చేసిన సంవత్సరం. అవి నేను ఇంటర్ చదువుత్నురోజులు. చాలా అల్లరిగా.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని. నేనప్పటివరకు ఏ అమ్మాయినీ లవ్ చేయలేదు. ఓ రోజు లంచ్ బ్రేక్‌లో.. క్లాస్ రూంలో ఓ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా మీ గోల అని నేను వెళ్లి అడిగాను. వాళ్లు ఒక అమ్మాయికోసం అని చెప్పారు. ‘ఏవర్రా అమ్మాయి’ అని అడిగా. వాళ్లు ఓ పేరు చెప్పారు. ‘ఆ అమ్మాయి నాకు తెలియదు రా!’ అన్నాను. ‘చూపిస్తాము ఆగు’ అన్నారు. అమ్మాయి కోసం వేయిట్ చేస్తున్నాం. అప్పుడు వచ్చింది.. నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి. అలా గేట్ వైపు చూశాను. అప్పుడే సైకిల్ దిగి నడుచుకుంటూ వస్తోంది. ఆమె కళ్లు కారు లైట్లలా ఉన్నాయి. ఆ ఒక్క క్షణంలో నా మనసును దోచేసింది. ఇంకేం ఉంది! నా లైఫ్ పట్టాలు ఎక్కింది. ఇక ప్రతీరోజు తననే చూస్తూ, తను నవ్వితే నాలో తెలియని ఆనందం. ఫైనల్‌గా క్లాస్‌లోని కొందరు వెర్రి వాళ్లు నేనా అమ్మాయికి లైన్ వేస్తున్నానని చెప్పేశారు. అదేంటో నా లక్! తను ఆ రోజునుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ నావైపు చూస్తూ ఉండేది. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. నా మనసులోని మాట తనకు చెప్పలేకపోయా. తనే ధైర్యం చేసి ‘నన్ను లవ్ చేస్తున్నావా’ అని అడిగింది. కానీ, నేను పూర్ ఫ్యామిలీ, తనకి ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేకపోయా. కానీ, తను చాలా సార్లు నా ప్రేమను తెలిపే చాన్స్‌లు ఇచ్చింది. నేనే ఉపయోగించుకోలేకపోయా. ఇంటర్ అయిపోయింది. తను డిగ్రీ, నేను బీటెక్ జాయిన్ అయ్యాను. అప్పటికీ నేను వాళ్ల కాలేజీకి వెళ్లే వాడిని తనను చూడటానికి. అయినా నా ప్రేమను తనకు చెప్పలేకపోయా. నా లైఫ్‌లో మర్చిపోలేని అమ్మాయి తను. 2012లో బీటెక్ అయిపోయింది. బెంగళూరులో జాబ్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత తెలిసింది! తనకు పెళ్లి అయిపోయిందని. ఇప్పటికీ తను నా మనసులో ఉంది. - సందీప్, ఒంగోలు లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
ఆమె మాటలు విని నేను షాక్!
తన పేరు కౌసల్య! మెడిసిన్ చదువుతున్నపుడు మా మధ్య ప్రేమ చిగురించింది. మెడిసిన్ అయిపోయిన తర్వాత వేరు వేరు హాస్పిటల్లలో డాక్టర్లుగా జాయిన్ అయ్యాం. తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. ఎంత బిజీగా ఉన్నా.. వారంలో కనీసం మూడు సార్లైనా కలుసుకునేవాళ్లం. మా ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. చిన్నచిన్న గొడవలు, అలకలు, సర్దుకుపోవడాలు మామూలైపోయాయి. అయినా మా మధ్య ప్రేమ తగ్గలేదు. ఇద్దరివీ వేరువేరు కులాలు! పెద్ద వాళ్లను ఒప్పించటానికి కష్టపడాల్సి వస్తుందనుకున్నాం. అనుకున్నట్లుగానే జరిగింది. తన ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకున్నా. మా ఇంట్లో ససేమీరా! అన్నారు. నిత్యం మా వాళ్లతో గొడవలు పడేవాడ్ని. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోవటం లేదని కౌసల్య వాళ్ల ఇంట్లో తెలిసినప్పటినుంచి వాళ్లలో మార్పు వచ్చింది. నేను వాళ్ల ఇంటికి వెళ్లినపుడు సరిగా పలకరించేవారు కాదు. నేను మాత్రం పట్టించుకునేవాడిని కాదు. నెల రోజుల తర్వాత మా ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వెంటనే తనకు ఫోన్ చేసి విషయం చెప్పా. తను మొదట నమ్మలేదు! నిజమని తెలిసి సంతోషించి. ఇంట్లో వాళ్లకు చెప్పి ఫోన్ చేస్తానంది. నేను తన ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. కానీ గంటలు గడుస్తున్నా తన నుంచి ఫోన్ రాలేదు. నేను ఫోన్ చేస్తుంటే తియ్యటం లేదు. రాత్రి పడుకోబోయేముందు ఓ సారి ట్రై చేద్దామని ఫోన్ చేశా. తను ఫోన్ ఎత్తింది. నా మాటలకు సరిగా స్పందించ లేదు. ఏమైందని అడిగా.. ఏం లేదంది. చెప్పమని పట్టుబట్టే సరికి చెప్పింది. తన మాటలు విని నేను షాక్ అయ్యాను. ఈ పెళ్లి తన ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదంట. ఎందుకంటే మా అమ్మానాన్నలకు ఇష్టం లేకుండా కౌసల్యను పెళ్లిచేసుకుంటే. అత్తారింట్లో వేధింపులు తప్పవని వాళ్లు భయపడుతున్నారు. నేను వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. పెళ్లైన తర్వాత వేరు కాపురం పెడతానని కూడా మాటిచ్చాను. ఏం చెప్పినా వినే పరిస్థితిలో వాళ్లు లేరు. కొన్ని రోజులకే కౌసల్యకు వేరే వ్యక్తితో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నేను తనని ఇంటికి తీసుకొస్తానని మా అమ్మానాన్నకు చెప్పా. వాళ్లు ఒప్పుకోలేదు. కౌసల్య అమ్మానాన్నలు ఒప్పుకుంటేగానీ, పెళ్లి జరగదని తెగేసి చెప్పారు. తన మనసులో ఏం ఉందో అడిగా.. తను మాత్రం నేనేం చేసినా తనకు ఓకే అంది. ఆ మరుసటి రోజే రిజిస్ట్రర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నాం. రెండు ఇళ్లకు దూరంగా ఇళ్లు తీసుకుని కాపురం పెట్టాం. సంవత్సరం గడిచింది. కౌసల్య ఇంట్లో వాళ్లు మాతో కలిసిపోయారు. కానీ, మా ఇంట్లో వాళ్లు సీరియస్‌గానే ఉన్నారు. మేము విడిపోయి పెద్దవాళ్లను సంతోషపెట్టగలమనే నమ్మకం నాకు లేదు. పిల్లల సంతోషం పెద్దలకు ముఖ్యం కానప్పుడు వారి గురించి ఎందుకు ఆలోచించాలి అనిపించింది. అందుకే అలా చేశా. మా వాళ్లు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. - గోకుల్ రమణ, గుత్తి -
ఆ మార్పు ప్రేమికులకు వరమైంది
సౌదీ అరేబియాలో రూల్స్‌ను అతిక్రమించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఓ జంట పెళ్లికి ముందు ఎలాంటి సంబంధం కొనసాగించినా వారికి దారుణమైన శిక్షలు తప్పవు. బాహాటంగా ప్రేమ పేరెత్తితే చాలు నాలుక తెగ్గోస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువత ప్రాణాలకు తెగించి ముందడుగు వేయలేక.. ప్రేమ అనే మధురానుభవాన్ని రుచిచూడలేక అల్లాడిపోయింది. అందుకే ఆన్లైన్ ప్రేమ బాట పట్టించింది. ట్వీటర్, స్నాప్ చాట్, డేటింగ్ యాప్‌ల ద్వారా తమ ప్రేమకు తలుపులు తెరిచారు యువతీ,యువకులు. ప్రేమించుకోవటానికో వేదిక దొరికినందుకు తెగ సంతోష పడిపోయారు. సంబంధాలు వెతికి తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసే ఓపిక లేక కొందరు తల్లిదండ్రులు కూడా వీటిని ప్రోత్సహించారు. అయితే ప్రేమించిన వారిని నేరుగా కలుసుకోలేకపోతున్నామన్న బాధ వారిని వేధిస్తుండేది. అది కూడా నిన్నమొన్నటి వరకు. ప్రస్తుతం సౌదీ ప్రభుత్వం చట్టాల్లో తీసుకొస్తున్న మార్పు ప్రేమికులకు వరంగా మారింది. ఆ మార్పుల్లో భాగంగానే యువజంటలు కేఫ్‌లలో, రెస్టారెంట్లలో కలిసి కూర్చునే అవకాశం కలిగింది. దీనిపై అక్కడి యువత మాట్లాడుతూ... ‘సౌదీ అరేబియాలో ఎర్ర గులాబీలు అమ్మటం డ్రగ్స్ అమ్మినంత నేరం.. సంబంధంలేని ఓ యువకుడి పక్కన ఓ యువతి కూర్చుని మాట్లాడం అన్నది ఒకప్పుడు ఊహించుకోవటానికే సాధ్యం కాని విషయం.’’ అని అన్నారు. -
ప్రేమికులు! ఈ రోజు ఇలా చేయకండి..
ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్ డే రానే వచ్చింది. ప్రియమైన వారితో ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకునేవారు చాలామందే ఉంటారు. గిఫ్టులు, సరదా షికార్లు, రొమాంటిక్ డిన్నర్లతో ఈ రోజును మరింత మధురంగా మార్చుకోవాలనే ప్లాన్స్ ఉండనే ఉంటాయి. అయితే టూసైడ్ లవ్‌లో ఉన్న వారు ఈ రోజున మీరు చేయకూడని కొన్ని పనులను దృష్టిలో ఉంచుకోవాలి. వాటి గురించి తెలుసుకుని, ఎదుటి వ్యక్తి సంతోషం కోసమైనా జాగ్రత్తగా ఉండాలి. 1) వాలెంటైన్స్ డే వేడుకలు నిజానికి చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకోవటానికి ఇష్టపడరు. బహుశా మీకు కూడా వాలెంటైన్స్ డే జరుపుకోవటం నచ్చకపోవచ్చు. కానీ, ఎదుటి వ్యక్తి ఈ రోజును సెలబ్రేట్ చేయటానికి ఇష్టపడుతున్నా, మనల్ని సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తున్నా.. మీరు కొద్దిగా ఆలోచించాలి. ‘ నాకు వాలెంటైన్స్ డే జరుపుకోవటం ఇష్టంలేదు’ అంటూ వారి ముఖాన చెప్పేయకుండా ఉండటం మంచిది. భాగస్వామి సంతోషానికి ప్రాధాన్యత ఇస్తే మరింత మంచిది. 2) మాజీ భాగస్వామి ఉదా : ‘ నేను నిన్ను కావ్య (మాజీ భాగస్వామి) కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా’ అని మాత్రం చెప్పకండి. ఈ రోజునే కాదు ఎప్పుడు కూడా. మీరు ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపర్చడానికే ఇలా చెప్పిఉండవచ్చు. కానీ, దీని వల్ల పెద్దగా నష్టం లేకపోయినా. ఆ మాటలు మీ భాగస్వామి మూడ్‌ను నాశనం చేయవచ్చు. 3) విమర్శనాత్మక ప్రమాణాలు ‘ నువ్వు ముసలి దానిలా ఉన్నావు.. బరువెక్కావు.. అయినా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎలా ఉన్నా ఎప్పటికీ ప్రేమిస్తుంటాను’. మీరు ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నామన్న భావన బహుశా మీకు కలుగపోవచ్చు. వారిపై మీకున్న ప్రేమను ఇలా వ్యక్తపర్చిఉండవచ్చు. కానీ, వారి లోపాలను ఇది ఎత్తి చూపటం లాంటిదే. మీ మాటలు వారికి విపరీతమైన కోపం తెప్పించవచ్చు. 4) వేడుకల రద్దు వాలెంటైన్స్ డేను జరుపుకోవటానికి వేసుకున్న ప్లాన్లను చిన్న చిన్న కారణాలకు రద్దు చేసుకోవద్దు. ఇది మీ భాగస్వామిని తీవ్ర నిరాశకు గురిచేయవచ్చు. 5) బంధంపై జోకులు ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే జంటల మధ్య బంధం దృఢంగా ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బంధంపై సెటైర్లు వేసుకుంటూ.. ఎదుటి వ్యక్తిని కించపర్చేలా జోకులు వేస్తే మాత్రం బంధం మూడు ముక్కలవుతుంది. ‘‘ నేను ఆ రోజు జోక్‌గా ఐ లవ్ యూ చెబితే నువ్వు సీరియస్‌గా తీసుకున్నావు. నేనూ కూడా టైం పాస్‌కు సర్దుకుపోతున్నా’’ అంటూ కామెడీ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు.. -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం : మీలోనే దాచుకున్న ప్రేమ విషయాలను ఇష్టులకు తెలియజేసేందుకు శని, ఆదివారాలు అనుకూలం. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. వృషభం : మనస్సులోని భావాలను, పెళ్ళి ప్రతిపాదనలను మీరు అభిమానించే వారికి తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలివారు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ప్రతిపాదనల సమయంలో మీరు రెడ్, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అయితే, మంగళ,బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. మిథునం : ఇంతకాలం నిగూఢంగా మనస్సులోనే దాచుకున్న ప్రేమ సందేశాలను ఇష్టులకు తెలియజేసేందుకు ఆది, బుధవారాలు అత్యంత అనుకూలం. అవతలి వారు కూడా వీటికి సానుకూలంగా స్పందించే వీలుంటుంది. ఈ సమయంలో మీరు ఆరెంజ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభదాయకంగా ఉంటుంది. ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. కర్కాటకం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను బుధ, గురువారాలు వెల్లడించండి. అవతలి వైపు నుంచి మీరు ఆశించిన సందేశాలు రావచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే అనుకూలత ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, శని, మంగళవారాలు మీ ప్రతిపాదనలకు విరామం ఇవ్వడం మంచిది. సింహం : మీరు అత్యంత ప్రేమించే వ్యక్తులకు మీ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అత్యంత అనుకూలమని చెప్పాలి. ఈరోజుల్లో చేసే ప్రతిపాదనలకు అవతలి వైపు నుంచి కూడా అనుకూల సందేశాలు రావచ్చు. ఇక ఇటువంటి సమయంలో మీరు రెడ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. అయితే, సోమ, బుధవారాలు వీటికి దూరంగా ఉండండి. కన్య : మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలను ఇష్టులకు అందించేందుకు మంగళ, బుధవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు కూడా సానుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఈరోజుల్లో మీరు ఆరెంజ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. అయితే, శని, సోమవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. తుల : మీ మనస్సులోని అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలపై అవతలివారు అనుకూలంగా స్పందించే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు విరామం ఇవ్వండి. వృశ్చికం : మీరు ఇష్టులైన వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, బుధవారాలు అనుకూలం. ప్రతిపాదనలు చేసిన మరుక్షణం అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభవర్తమానాలు అందుతాయి. అయితే, శుక్ర, మంగళవారాలు వీటికి కొంత విరామం ఇవ్వడం మంచిది. ధనుస్సు : మీరు కోరుకున్న వ్యక్తులకు ప్రేమసందేశాలు అందించేందుకు శని, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. మీరు చేసే ప్రతిపాదనలపై అవతలి వారు సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకం. ఇక, ఆది, బుధవారాలు మీ ప్రయత్నాలను విరమించండి. మకరం : మీ మనస్సులోని భావాలను ఇష్టులకు వెల్లడించేందుకు ఆది, మంగళవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో అవతలి వారు కూడా మీపట్ల మరింత ప్రేమానురాగాలు చూపే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. అయితే, శని, గురువారాలు మీ ప్రతిపాదనలకు విరామం ఇవ్వండి. కుంభం : మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు ఆది,బుధవారాలు అత్యంత అనుకూలమని చెప్పవచ్చు. మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా సానుకూల వైఖరి ప్రకటించవచ్చు. ఈ రోజుల్లో మీరు వైట్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే మంచిది. ఇక, శుక్ర, శనివారాలు దూరంగా ఉండండి. మీనం : ఇష్టమైన వ్యక్తులకు మీ మనస్సులోని భావాలను వెల్లడించేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైన రోజులు. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు కూడా తక్షణం స్పందించే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో మీరు బ్లూ, వైట్ రంగు దుస్తులు ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. -
ప్రేమికుల రోజున ఎన్నో ప్రేమ చిత్రాలు
న్యూఢిల్లీ : ‘ప్రేమ’ అంటే ఎన్నో అనుభూతులు, మరెన్నో అర్థాలు. కాల గమనంలో ప్రేమ వ్యక్తీకరణ పద్ధతులు మారుతూ వస్తున్నాయి. మార్గాలు, పద్ధతులు ఎన్ని మారినా ‘ప్రేమ’కు భావోద్వేగం అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే అని ప్రేమ ఫిలాసఫర్లు వాదిస్తున్నారు. అసలు ఏది నిజమైన ప్రేమ ? అంటూ ఇప్పటికీ అన్వేషిస్తున్నవారు, నిజమైన ప్రేమను ఎలా దక్కించుకోవాలంటూ శోధిస్తున్న వాళ్లూ సమాజంలో అక్కడక్కడా మనకు కనిపిస్తారు. అలా శోధించే ఇద్దరు యువకులకు సంబంధించిన ప్రేమ కథే ‘లవ్ ఆజ్ కల్ 2’ బాలీవుడ్ చిత్రం ‘వాలంటైన్స్ డే’ సందర్భంగా శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అందులో వీర్, జో అనే కథానాయకులిద్దరూ ప్రేమాన్షేషణలో తమ అదష్టాన్ని వెతుక్కుంటూ వెళతారు. కార్తీక్ ఆర్యన్, సార అలీ ఖాన్, అరుషి శర్మ, రందీప్ హూడ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఎంత మేరకు ప్రేమను పడ్డిస్తుందో, ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. వరల్డ్ ఫేమస్ లవర్ ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని నేటి తరం యువ నటుడు విజయ్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా నాలుగు కథల సమాహారం. ఓ గ్రామంలో సీనయ్య, సువర్ణ అనే మధ్య తరగతికి చెందిన ఓ జంట ప్రేమించుకోవడం, గౌతమ్ అనే రోమాంటిక్ హీరో పారిస్ వీధుల్లో తన గర్ల్ ఫ్రెండ్ ఐజాతో తిరగడం, కార్మిక సంఘం నాయకుడు హై హీల్స్ సుందరి అయిన తన బాస్‌ను ప్రేమించడం, మరో కాలేజీ ప్రేమ కథ సమాహారమే ఈ సినిమా. ఇందులో విజయ దేవరకొండతోపాటు రాశి ఖన్నా క్యాథరినా ట్రేసా, ఇజా బెల్లా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ మై కడువలే ప్రేమ ప్రపంచంలో ఈత కొట్టడం, మిత్రులతో ఎల్లప్పుడూ సరదాగ గడపడమే ప్రధాన సూక్తిగా విడుదలవుతున్న ఈ తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి, అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హిప్పాప్ తమిళ, ఐశ్వర్య మీనన్‌లు నటించిన మరో తమిళ సినిమా ‘నాన్ సిరిథాల్’ కూడా శుక్రవారమే విడుదలవుతోంది. ఆపేక్ష పీ మహేశ్, ఆశిక్ నటించిన కన్నడ చిత్రం ‘సగుటా దూర దూర’, విక్రమ్ రవిచంద్రన్, ఆకాంక్ష శర్మ నటించిన మరో కన్నడ చిత్రం ‘త్రివిక్రమ్’, ప్రజ్వల్ దేవరాజ్, భావన నటించిన ‘ఇనిస్పెక్టర్ విక్రమ్’ కన్నడ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. పలు బెంగాలీ, పంజాబ్, మరాఠీ చిత్రాలతోపాటు పలు ఆస్కార్ అవార్డులు పొందిన ‘జోకర్, వన్సాపనే టైమ్ ఇన్ హాలివుడ్లతోపాటు ఫాంటసీ ఐలాండ్, ఆర్డినరీ లవ్, బెర్లిన్ ఐ లవ్ యూ చిత్రాలు ‘వాలంటైన్స్ డే’ను పురస్కరించుకొని విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని కొత్తగా విడుదలవుతుండగా, కొన్ని పునర్ విడుదలవుతున్నాయి. -
తను నవ్వింది! బాగుందని పొగిడింది..
2008 డిసెంబర్ నెలలో సైన్స్ ఫేయిర్ కోసమని నాగలాండ్ బయలుదేరాం. విజయవాడనుంచి మా ప్రయాణం మొదలైంది. మూడు రోజుల పాటు ట్రైన్లో ప్రయాణిస్తే కానీ, మేము వెళ్లాల్సిన చోటుకు చేరుకోలేము. మొదటిసారి అన్ని రోజులు ప్రయాణించటం చాలా కొత్తగా ఉంది. సాయంత్రమే ట్రైన్ బయలుదేరింది. ఎవరి సీట్లు వాళ్లకు కేటాయించారు. ఓ రోజు ఆలోచిస్తూనే స్తబ్ధుగా గడిచిపోయింది. మరుసటి రోజునుంచి కొత్త స్నేహాలు మొదలయ్యాయి. ఆడ,మగ తేడాలేకుండా అందరం కలిసిపోయి బాగా మాట్లాడుకునేవాళ్లం. నాకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయినప్పటికి కొంచెం ధైర్యం చేసి అందరితో కలిసిపోయాను. సాయంత్రం సరదాగా కబుర్లు చెప్పుకున్నాం, అంత్యాక్షరి ఆడుకున్నాం. అప్పుడే ఓ అమ్మాయి మాట, పలుకు, పాట నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పటివరకు నేను తన ముఖంవైపు నేరుగా చూడలేదు. అప్పుడు చూడాలనిపించి చూశా! చూడగానే నా మనసు దోచేసింది. అప్పటినుంచి ఆమె మాటలు కూడా నాకు తియ్యటి పాటల్లా వినిపించటం మొదలయ్యాయి. ఎందుకో ఒకరకమైన ఆకర్షణకు గురయ్యాను. ఏ పనీ లేకపోయినా తనకోసమే ఆమె బోగిలోకి వచ్చేవాడిని, అటు ఇటు తిరిగేవాడిని. మొత్తానికి తను కూడా నన్ను చూడటం మొదలుపెట్టింది. మరసటి రోజు సాయంత్రం మళ్లీ అందరు గ్రూపుగా అయ్యారు. సరదాగా మాట్లాడుకోవటం, పాడుకోవటం చేశారు. నేను తన ఎదురుగా కూర్చుని ఉన్నా. నేను పాడాల్సిన టైం వచ్చింది. ‘ నాలోనె పొంగెను నర్మదా.. నీళ్లలో పూసిన తామర.. అంతట్లో మారెను రుతువులా! పిల్లా నీ వల్ల’ తనవైపు చూస్తూ పాడాను. తను నవ్వింది! బాగుందని పొగిడింది. థాంక్స్ కూడా చెప్పింది.. కళ్లతో.. అది నాకు మాత్రమే అర్థమైంది. నాగాలాండ్‌లో ఉన్నన్ని రోజులు ఇద్దరం కలిసే ఉండేవాళ్లం. అయినా ఏదీ మాట్లాడుకునే వాళ్లం కాదు. అలా పది రోజులు! టెన్ బ్యూటిఫుల్ డేస్ తనతో ఉన్నాను. సైన్స్ ఫేయిర్ అయిపోయి తిరిగి వస్తున్నపుడు చాలా బాధేసింది. ఆ రోజు రాత్రి డిసెంబర్ 31.. ట్రైన్లోనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. అప్పట్లో మా దగ్గర ఫోన్లు ఉండేవి కావు. ఉన్నా ఏం లాభం ఈ పదిరోజుల్లో ఏ రోజూ మేము మాట్లాడుకోలేదు! ఏం చేస్తాం. మళ్లీ అందరూ ఓ చోట గ్రూపుగా అయ్యారు. పాటలు, ఆటలు మొదలుపెట్టారు. తనిప్పుడు నా ఎదురుగా ఉంది. ఇద్దరం ఒకరినొకరు చూసుకుంటున్నాం. ఎందుకో సందర్భం కాకపోయినా ఓ పాట‘ అదే నువ్వు! అదే నేను అదే గీతం పాడనా..’ తన కళ్లలో భావాల్ని నేను కనిపెట్టలేకపోయాను. అది బాధో! ప్రేమో!.. ఏదో తెలియదు కానీ, నా కళ్లు కొద్దిగా చెమర్చాయి. రాత్రి నిద్ర పట్టలేదు. తనను కలిసి కనీసం వెళ్లొస్తానని కూడా చెప్పలేకపోయాను. పొద్దున లేచే సరికే తను దిగిపోయింది. నా గుండెలో కలుక్కుమన్న భావన. మాట్లాడలేకపోయానని నన్ను నేను చాలా తిట్టుకున్నా. ఇది జరిగి దాదాపు 12 సంవత్సరాలు అవుతోంది. తన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. తన మనసులో నా స్థానం ఏంటన్న ప్రశ్న ఇప్పటికీ నన్ను తొలుస్తూనే ఉంది. - విఘ్నేశ్, రాయచోటి -
ప్రేమకు నిర్వచనం ‘ప్రేమ లేఖలే’
సాక్షి, న్యూఢిల్లీ : యువతీ యువకుల మధ్య ప్రేమ అనేది ఓ మధురానుభూతి. ఈ ప్రేమనే శాస్త్రవిజ్ఞాన పరిభాషలో సంక్లిష్ట భావోద్వేగ ఆలోచన అంటారు. ఒకప్పుడు పరస్పరం ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి పాటలు, పద్యాలు, కవిత్వం, ఉత్తరాలు, చిత్రలేఖనం, డైరీలు, గ్రీటింగ్ కార్డులు తోడ్పడ్డాయి. వీటిలో ప్రధాన పాత్ర ఉత్తరాలదే. కాలగమనంలో ప్రముఖుల కాలం తీరిపోయినా వారి ప్రేమ లేఖలకు మాత్రం కాలం చెల్లలేదనే విషయం వేలం పాటల ద్వారా ఇప్పటికీ వెల్లడవుతూనే ఉంది. నేటి స్మార్ట్ ఫోన్ యుగంలో మెసేజ్‌లు, వాట్సప్‌లు, డేటింగ్ ఆప్‌లు, వీడియోల ద్వారానే కాకుండా స్క్రీన్‌పై ముఖాముఖి చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకునే అవకాశం వచ్చింది. అయితే పరస్పర ప్రేమ వ్యక్తీకరణకు ఓ బలమైన సందర్భం కూడా కావాలి. అలాంటి గొప్ప సందర్భమే ‘వాలంటైన్స్ డే’. అంటే ప్రేమికుల రోజు. రోమన్ సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన ఈ రోజు, కొంతకాలం క్రితం వరకు యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యక్తీకరణకే పరిమితమైంది. గత కొంతకాలంగా తల్లీ తండ్రీ, అన్నా చెల్లీ అనే తేడా లేకుండా కుటుంబ సభ్యులతోపాటు బంధు, మిత్రులంతా పరస్పరం ప్రేమను వ్యక్తీకరించుకునే పరిపూర్ణ ప్రేమకుల రోజుగా మారింది. ఉత్తర, ప్రత్యుత్తరాల ద్వారా ప్రేమను వ్యక్తీకరించుకోవడం అనేది ఎప్పుడో ప్రారంభమైనా, వాటి స్థానంలో 1913లో ‘హాల్‌మార్క్’ ప్రచురణలతో వాణిజ్యపరంగా ‘వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల’ యుగం ప్రారంభమయింది. ఇప్పుడు డిజిటల్ కార్డులు కూడా వచ్చాయి. ఎలక్ట్రానిక్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా ప్రేమ వ్యక్తీకరణకు ప్రేమ లేఖలే ఇప్పటికీ ఉత్తమమైనవని చరిత్రకారుల నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ చెబుతున్నారు. పెన్ను పట్టుకొని ప్రేమ లేఖలు రాస్తున్నప్పుడు భావోద్వేగం వల్ల మెదడులో కలిగే ప్రకంపనల అనుభూతి ఎంత మాధుర్యంగా ఉంటుందో, అది చదివే వారికి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. అందమైన పియానో సంగీతం వినాలన్నా చేతులు, చేతి వేళ్లే కదలాలి. సర్జరీలో వైద్యుడికి చేతులు ఎంత ముఖ్యమో, పర్వతారోహకుడికి అవి అంతే ముఖ్యం. అందమైన బొమ్మ గీయాలన్నా, భరత నాట్యం చేయాలన్నా చేతుల కదలిక ఎంతో ముఖ్యం. పెన్ను పట్టాలన్నా చేతులే ముఖ్యం. అంటే చేతికి, మెదడుకు అవినాభావ సంబంధం ఉందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మానవ పరిణామ క్రమంలో చేతులకున్న ప్రాధాన్యతను ‘ది హ్యాండ్’ అనే పుస్తకంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ ఫ్రాంక్ ఆర్. విల్సన్ తెలియజేశారు. చేతుల కదలికతో మెదడులో న్యూరాన్లు సర్కులేట్ అవుతాయట. అందుకేనేమో గొప్ప నవలా రచయితల నుంచి చిన్న కథా రచయితల వరకు, సినిమా కథా రచయితల నుంచి సినీ గేయ రచయితల వరకు చేతిలో పెన్ను పట్టుకుని రాయడానికే నేటికి ఇష్ట పడుతున్నారు. కాగితం, కలం పట్టనిదే ఆలోచనే రాదనే మేధావులు కూడా ఉన్నారు. -
బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి..
డిగ్రీ అయిపోగానే జర్నలిజం చేయటానికి హైదరాబాద్‌లోని ఓ కాలేజ్‌లో చేరాను. జర్నలిజం అంటే నాకు చిన్నప్పటినుంచి ఇష్టం. కాలేజ్‌కు దగ్గరలో ఓ హాస్టల్లో ఉండేదాన్ని. క్లాసులు స్టార్ట్ అయిన కొద్ది రోజుల వరకు నాకెవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు. నెల తర్వాత అందరితో నాకు మంచి బాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రాజీవ్‌తో! అతడు నా బెస్ట్ ఫ్రెండ్. అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు. పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకునేవాళ్లం. అయినప్పటికి ఎప్పుడూ హద్దులు దాటలేదు. కించపర్చుకునేలా మాట్లాడుకోలేదు. అతనంటే నాకు అభిమానం, గౌరవం ఏర్పడింది. అతడికి కూడా నేనంటే అంతే మర్యాద. చూస్తుండగానే రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఉద్యోగాలు ఇద్దరినీ దూరం చేశాయి. ఎంత దూరం ఉన్నా మేము రెగ్యులర్‌గా ఫోన్లోనో, సోషల్ మీడియాలోనో టచ్‌లో ఉండేవాళ్లం. ఉద్యోగంలో చేరిన కొద్దిరోజులకే నాకు పెళ్లి జరిగింది. అతడ్ని కూడా పెళ్లికి పిలిచా! రాలేదు. తర్వాత చాలా రోజులు అతడితో నేను టచ్‌లో లేను. ఓ సంవత్సరం తర్వాత అతడే నాకు కాల్ చేశాడు. ఇక అప్పటినుంచి మేము టచ్‌లో ఉంటున్నాం. ఓ సారి మాటల సందర్భంలో ‘‘ఇంకెన్నాళ్లని ఇలా ఉంటావ్. పెళ్లి చేసుకోవా’’ అని అడిగా. అందుకు తను నన్ను ఎదురు ప్రశ్నించాడు‘‘ నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావ్?’’ అని. నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకుని‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని ఉండింది. అందుకే చేసుకున్నాను’’ అని చెప్పా. దానికి అతడు ‘‘ నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నేను చేసుకోను’’ అన్నాడు. అతడి మాటల్లో ఏదో బాధ తొంగిచూసింది. నాకప్పుడర్థమైంది! రాజీవ్ నన్ను ప్రేమిస్తున్నాడని. అతడు ఇన్ని రోజులు చూపించిన అభిమానం, గౌరవం నాపై ప్రేమ అని తెలిసి నా మనసులో ఏదో మూల బాధకలిగింది. ఫోన్ పెట్టేసి బాగా ఏడ్చాను. అతను చాలా మంచి వాడు. తను ప్రేమకు దూరమవ్వటానికి నేనే కారణమని తట్టుకోలేకపోతున్నా. అప్పుడు అతడి ప్రేమను అర్థం చేసుకోలేకపోయా. ధైర్యం చేసి తను కూడా చెప్పలేకపోయాడు. బెస్ట్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలిసి ఏం చేయాలో అర్థం కావటం లేదు. - మౌనిక, బళ్లారి -
రెండు అక్షరాలు.. వేల కోట్లు..
ప్రేమ.. ఇదిప్పుడు రెండు అక్షరాల కలయిక మాత్రమే కాదు..వేల కోట్ల రూపాయల బిజినెస్ ఐడియా కూడా! అందుకే కొన్ని వ్యాపార సంస్థలు ప్రేమను క్యాష్ చేసుకుంటున్నాయి. తమ రంగురంగుల ప్రకటనలతో ప్రేమ జంటల్ని ఆకర్షించి సొమ్మ చేసుకుంటున్నాయి. కొత్తకొత్త ఆఫర్లతో.. సరికొత్త ఆలోచనలతో తమ బిజినెస్‌ను మూడు చాక్లెట్లు, ఆరు టెడ్డీబేర్లలా కొనసాగిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే సేల్స్ మానియా కొనసాగుతోంది. 2019 లెక్కల ప్రకారం వాలెంటైన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 30వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని అంచనా. అమెరికా వంటి సంపన్న దేశం ఆ ఒక్కరోజే ఖర్చు చేసిన మొత్తం 20.7 బిలియన్ డాలర్లు. సగటున ఒక్కో అమెరికన్ ప్రేమ కానుకల కోసం 200 డాలర్లు(రూ.14వేలు)ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది. ఆడ,మగ తేడా లేకుండా ఇష్టమైన వారిని కానుకలతో ఇంప్రెస్ చేయాలని చూస్తుండటంతో ప్రతీ సంవత్సరం వాలెంటైన్స్ డే వ్యాపారం ఊపందుకుంటోంది. డిమాండ్ ఉన్నవి ఇవే! వాలెంటైన్స్ డే సందర్భంగా ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు చేసిన బహుమతుల్లో క్యాండీలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. వీటి కోసం చేసిన ఖర్చు మొత్తం దాదాపు 2.4 బిలియన్ డాలర్లు. దాని తర్వాతి స్థానాల్లో వరుసగా చాక్లెట్లు, గ్రీటింగ్ కార్డ్స్ హాలిడే స్పాట్స్, పువ్వులు, నగలు ఉన్నాయి. బ్రాండెడ్ బట్టలు, బొమ్మలు, సిల్వర్ కప్లింగ్స్, పట్టు టైలు, లెదర్ బెల్టులు, వాలెట్స్, కీచైన్లు, డైమెండ్ జ్యుయెలరీ, రిస్ట్‌వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లు, బ్రాండెడ్ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వస్తువులు వాటి తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఎర్ర గులాబీల రూటే వేరు.. వాలెంటైన్స్ డే రోజు ఎన్ని వెరైటీ గిఫ్ట్స్ వరుసలో ఉన్నా గులాబీ ప్రత్యేకత వేరు. మనం ఇచ్చే గిఫ్ట్ ఎంత ఖరీదైనా గులాబీ తోడులేకుంటే అది వెలవెలబోతుంది. అందుకే ప్రేమకుల రోజున గులాబీలు నిచ్చెనెక్కెస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో గులాబీల ధర మామూలు కంటే పదిరెట్లు ఎక్కువగా ఉంటోంది. ప్రేమికుల రోజున ఒక్కో గులాబీ ధర దాదాపు రూ. 150 నుంచి రూ. 200లకు చేరుతోంది. అంతేకాకుండా మన గులాబీలు చూడటానికి ఎంతో అందంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అధికంగా ఉంది. యూకేలో మన గులాబీల డిమాండ్ గురించయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లు మన గులాబీలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలు గులాబీలను ఎగుమతి చేసే రాష్ట్రాలుగా అగ్ర స్థానంలో ఉన్నాయి. గత సంవత్సరం 30 కోట్ల రూపాయల విలువైన గులాబీలు ఇతర దేశాలకు ఎగుమతయ్యాయి. మగాళ్లే ఎక్కువ.. వాలెంటైన్స్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూసేది మగవారే! అందుకే ఆ రోజున ఆడవాళ్ల కంటే ఎక్కువగా డబ్బులను ఖర్చుపెట్టేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం ఓ మగాడు తన భాగస్వామి కోసం దాదాపు 300 డాలర్లు ఖర్చు చేస్తున్నాడని తేలింది. ఇక ఆడవారు మాత్రం కేవలం 63 డాలర్లకే పరిమితమయ్యారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే! రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం కలిసున్న జంట మాత్రమే ఒకరిపై ఒకరు ఎక్కువ మొత్తం ఖర్చు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎనిమిది రోజుల ప్రేమ పండుగ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14కు మాత్రమే పరిమితం కాలేదు. అంతకు ఏడు రోజుల ముందు నుంచే వాలెంటైన్స్ వీక్ పేరిట సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 7నుంచి ఫిబ్రవరి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సందడి ఉంటుంది. ఈ వారంలోని ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు సైతం ఒక్కోరోజు ఒక్కోవిధంగా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తారు. కానుకల రూపంలో ఒకరినొకరు పలకరించుకుంటారు. వాలెంటైన్స్ డే వ్యాపారానికి ఈ ఏడు రోజులు ఎంతో ఉపకరిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. -
అదే మోస్ట్ రొమాంటిక్ కిస్!!
వాలెంటైన్స్ వీక్‌లోని ఏడవ రోజు! వాలెంటైన్స్ డే ముందు రోజు ‘కిస్ డే’.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమ జంటలు మధురమైన ముద్దుతో ప్రేమికులరోజుకు స్వాగతం పలుకుతాయి. ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పద్దతుల్లో ముద్దు పెట్టుకోవటం కూడా ఒకటి. జంటల మధ్య మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటానికన్నట్లు ప్రకృతి సృష్టించిన అద్భుతం ఈ ముద్దు. ముద్దనగానే మూతి ముడుచుకునేవాళ్లు లేకపోలేదు. ముద్దు కేవలం శృంగార భావమే కాదు! ఓ ఆరోగ్య సూత్రం కూడా. ముద్దుతో ఆరోగ్యం.. 1) ముద్దుతో శరీరంలోని రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ‘జర్నల్ మెడికల్ హైపోథెసిస్’ పరిశోధనల్లో తేలింది. 2) ముద్దు పెట్టుకోవటం ద్వారా నిమిషానికి 2నుంచి 6 క్యాలరీలు ఖర్చవుతాయి. 3) గాఢమైన ముద్దుతో ముఖ కండరాలు దృఢంగా తయారవుతాయి. 4) ముద్దు పెట్టుకోవటం ద్వారా శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై మనకు ప్రశాంతతను కలుగజేస్తాయి. 5) ముద్దు జంట మధ్య బంధాన్ని బలంగా ఉంచేలా చేస్తుంది. 6) ముద్దు పెట్టుకోవటం ద్వారా పలు రకాల దంత సమస్యలు దూరమవుతాయి. ముద్దుల్లో రకాలు 1) నుదటిపై ముద్దు : మన కిష్టమైన వ్యక్తులను నుదటి పెట్టుకోవటం వారిపై మనకున్న ప్రేమ, అడ్మిరేషన్కు గుర్తు. 2) చేతులపై ముద్దు : చేతులపై మద్దు పెట్టుకోవటం గౌరవానికి, శూరత్వానికి ప్రతీక. 3) ఎస్కిమో కిస్ : ఒకరి ముక్కులను ఒకరు రాసుకోవటాన్ని ఎస్కిమో కిస్ అంటారు. సాధారణంగా పసి పిల్లల తల్లులు ఎస్కిమో కిస్ ద్వారా తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. 4) ఫ్రెంచ్ కిస్ : ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచూర్యం పొందిన ముద్దు ఇది. మోస్ట్ రొమాంటిక్ కిస్ అని కూడా చెప్పొచ్చు. నాలుకలతో ముద్దుపెట్టుకోవటం దీని ప్రత్యేకత 5) స్పైడర్ మాన్ కిస్ : స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో గోడ మీదనుంచి కిందకు వేలాడుతూ హీరోయిన్ను మద్దు పెట్టుకుంటాడు. అప్పటినుంచి ఈ ముద్దు ప్రాచూర్యం పొందింది. -
ఈ సెలవుల్లో తనకు ప్రపోజ్ చేస్తా!..
ఓ రెండు కళ్లు నన్ను సంకెళ్లలా ఎటూ కదలనీయకుండా కట్టిపడేస్తాయని నేనెన్నడూ అనుకోలేదు. బస్‌లో మొదటిసారి తన కళ్లల్లోకి సూటిగా చూసేవరకు. ఆమె చూపు మరల్చినా నేనుమాత్రం ఆమె వైపు నుంచి నా చూపు తిప్పుకోలేకపోయాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో పిలిచినట్లై వెనక్కుతిరిగాను. వెనకాల మా మామయ్య.. ‘ఏంట్రా ఊరికేనా?’ అడిగాడు. అవునని చెప్పా. మామయ్య నాతో మాట్లాడుతున్నా.. అవేవీ నాకు వినిపించటంలేదు. నా ధ్యాసంతా ఆమెమీదే ఉంది. ‘ ఊరొచ్చింది, ముందుకు పద’ అంటు దారి తీశాడు మామయ్య. నేను ఆమెకోసం వెతికాను. తను కూడా పుట్‌బోర్డు దగ్గరకు నడిచింది. అంటే తనది కూడా ఈ ఊరే అనుకున్నా మనసులో. తను ముందు నడుస్తుంటే మామయ్యతో పాటు నేను ఆమె వెకనాల నడుస్తున్నా. తన ఇళ్లు కూడా మామయ్యవాళ్ల ఇంటి దగ్గరే. సాయంత్రం వరకు తన కోసం వాళ్ల ఇంటివైపు చూస్తూ ఉన్నా! కానీ, ఆమె బయటకు కూడా రాలేదు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నాను. తన పేరు భాను అని తెలుసుకోవటానికి రెండు రోజులు పట్టింది. కొద్దిరోజుల తర్వాత తనతో పరిచయం పెంచుకున్నాను. ప్రతిరోజూ బాగా మాట్లాడుకునే వాళ్లం. మా మధ్య స్నేహం పెరిగింది. ఆ రోజు ఊర్లో జాతర జరుగుతోంది. ఊరంతా చాలా సందడిగా ఉంది. వాళ్లిళ్లు మా ఇళ్లు బంధువులతో నిండిపోయాయి. మేము కలుసుకోవటానికి, మాట్లాడుకోవటానికి కుదరలేదు. ఆ రాత్రి ఊర్లో ఆర్కేస్ట్రా జరిగింది. అక్కడికి తను కూడా వచ్చింది. ఆ రాత్రి భానును చూస్తూ పాటలు వినడం కొత్తగా ఉంది. తను కూడా నన్ను చూస్తోందన్న సంతోషం మరింత కొత్తగా ఉంది. ‘ కొంటె చూపుతో.. ఓ కొంటె చూపుతో .. నా మనసు మెల్లగా చల్లగా దోచావే..’ అంటూ మనసులో పాట పాడుకున్నా. నేను ఊర్లో ఉన్నన్ని రోజులు ఇట్టే గడిచిపోయాయి. భానుతో స్నేహం మరింత పెరిగింది. తనను వదిలి రావాల్సి వచ్చినపుడు చాలా బాధేసింది! అక్కడినుంచి కదలేకపోయాను. పోయిన సంక్రాంతి సెలవుల్లో నా ప్రేమ కథ మొదలైంది. తర్వాత ఆ ఊరు వెళ్లలేదు. ఈ సారి వేసవి సెలవులకు నా ప్రేమను ఆమెకు తెలియజేస్తా! కచ్చితంగా ఒప్పుకుంటుందని... - వినయ్, కొత్తపేట -
వాలెంటైన్స్ డే స్పెషల్ ఈవెంట్స్!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు మరింత దగ్గర పడింది. రేపు ఒక్కరోజు గడిస్తే ఆ మరుసటి రోజే ప్రేమికుల పండుగ. అయితే వాలెంటైన్స్ వీక్ పేరిట ప్రేమ పండుగ వేడుకలు ఐదురోజుల క్రితం నుంచే మొదలయ్యాయి. ఈ వారంలోని ప్రతీరోజు కానుకలతో ప్రేమికులు తమని తాము పలకరించుకుంటూనే ఉన్నారు. మిగితా రోజులకంటే వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ప్రేమికులు ఆరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలనుకుంటారు. అలాంటి వారు తమ ప్రియమైన వారితో అలా సరదాగా క్యాండిల్ లైట్ డిన్నర్‌లోనో, ఏదైనా ఈవెంట్లోనో గడిపితే ఆ కిక్కేవేరు. ఇందుకోసం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. మన హైదరాబాద్ నగరంలోనే వాలెంటైన్స్ డేన చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు చేయవల్సిందల్లా ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకోవటమే.. ప్రేమికుల రోజున నగరంలో జరిగే కొన్ని ఈవెంట్స్ మీకోసం.. 1) వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ ప్రదేశం : హోటల్ సియెష్టా హైటైక్, గచ్చిబౌలీ-మియాపూర్ రోడ్, హనుమాన్ నగర్, మార్తాండ నగర్, కొండపూర్, హైదరాబాద్ సమయం : రాత్రి 7 గంటలకు హైలెట్స్ : క్యాండిల్ లైట్ గాలా డిన్నర్ టిక్కెట్ ధర : రూ.799నుంచి 2) వాలెంటైన్స్ డే బాశ్ 2020 ప్రదేశం : ఎన్చేట్ కేఫ్ అండ్ కాన్ఫెక్సనరీ, ఫ్లాట్ నెంబర్ . 402, రోడ్ నెంబర్ 81, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ సమయం : ఉదయం 6 : 30 నుంచి రాత్రి 11:45వరకు హైలెట్స్ : డీజే, లవ్ గేమ్స్, వీజే పాటలకు జుంబా డ్యాన్స్ టిక్కెట్ ధర : రూ. 2499( జంట) 3) హ్యాపీ హార్ట్స్ ప్రదేశం : ప్లిఫ్సైడ్ అడ్వంచర్ పార్క్, ఐఎస్బీ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్ సమయం : సాయంత్రం 4 గంటలనుంచి హైలెట్స్ : పాటరీ వర్క్‌షాప్, ట్రెజర్ హంటర్, ఎంగేజ్మెంట్ టిక్కెట్ ధర : రూ.2,360(జంట) 4) హ్యాపీ వాలెంటైన్స్ డే పార్టీ ప్రదేశం : స్పాయిల్ , 8-3-293/82/A/70, 4th ఫ్లోర్, అన్షూ కలర్స్ బిల్డింగ్స్, రోడ్‌నెంబర్ 1, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఎదురుగా, జూబ్లీహిల్స్, హైదరబాద్ సమయం : రాత్రి 1నుంచి ఉదయం 5 గంటల వరకు హైలెట్స్ : కాంప్లిమెంటరీ ఫుడ్ అండ్ డ్రింక్స్ టిక్కెట్ ధర : రూ. 499 5) వాలెంటైన్స్ ఈవినింగ్ - రూఫ్‌టాప్ పూల్‌సైడ్ రొమాంటిక్ డైనింగ్ ప్రదేశం : మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ , లెవెల్ 10, ఎస్ఎల్ఎన్ టెర్మినస్, సర్వే నెం: 133, బొటానికల్ గార్డన్ పక్కన హైదరాబాద్ సమయం : రాత్రి 7:30 గంటలకు హైలెట్స్ : క్యాండిల్ లైట్ అండ్ స్టారీ నైట్ టిక్కెట్ ధర : రూ. 5,000( జంట) 6) స్టాండ్‌అప్ కామెడీ షో ప్రదేశం : జేఎక్స్టాపోస్, ప్లాట్ నెం:587, రోడ్ నెంబర్ 32, జూబ్లీహిల్స్, హైదరాబాద్ సమయం : రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు హైలెట్స్ : సందీప్ జానీ, యశ్ బజాజ్ కామెడీ టిక్కెట్ ధర : రూ.235 (మగవారికి మాత్రమే) -
ఈ ప్రేమికులరోజున కూడా అదే చేస్తాం..
నాకు మా మామయ్య ఆది నారాయణ అంటే చాలా ఇష్టం. ఆయన చిన్న కూతురు దుర్గ శ్రీ అంటే చెప్పలేని ప్రేమ. తను ఇప్పుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను తనకి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేయగానే నా వైపు చాలా కోపంగా చూసింది. ‘నువ్వంటే నాకూ ఇష్టమే! కానీ, మా నాన్నని అడుగు’ అంది. నాకు మా మామయ్యను నేరుగా అడిగేంత ధైర్యం లేదు. ఆయనను అడిగితే ఏం అంటాడేమోనని భయమేసింది. ఒక సారి మా మామయ్య పెద్ద అల్లుడు శ్రీను అన్నతో అడిగించాను. అప్పుడు మామయ్య అన్నాడట ‘వాడంటే నాకూ ఇష్టమే’ అని. ఈ విషయమే అన్న నాకు చెప్పాడు. ఇక నా ఆనందానికి అవధులు లేవు. తను కూడా నా ప్రేమని అంగీకరించింది. మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు. తనకి ఓ వాలెంటైన్స్ డేన చాక్లెట్ ఇస్తే వద్దు అంది. ‘ఎందుకు వద్దు’ అని అడిగాను. అప్పుడు ఇలా అంది ‘ప్రతి ప్రేమికుల దినోత్సవం రోజున ఒక 5గురు అనాథ పిల్లలకి భోజనం పెడదాం’ అని. అప్పుడు నేను తనని హగ్ చేసుకుని ‘చాలా మంచి ఆలోచన’ అని చెప్పి ‘అలానే చేద్దాం’ అన్నాను. అప్పటినుండి ప్రతి వాలెంటైన్స్ డేకు ఐదుగురు అనాథ పిల్లలకి భోజనం పెట్టేవాళ్లం. ఈ వాలెంటైన్స్ డేన కూడా అలానే చేస్తాం. - సుబ్బు, పెద్ద దేవరంపాడు చదవండి : ప్రేమను వ్యక్తపర్చడానికి ఇదే మంచి మార్గం! ప్రేమలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తొచ్చేవి! -
ప్రేమను వ్యక్తపర్చడానికి ఇదే మంచి మార్గం!
వాలెంటైన్స్ డేకు మరో ఒక రోజు మాత్రమే ఉంది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో ముఖ్యమైన, ప్రత్యేకమైనది ‘హగ్ డే’... ఈ రోజున ప్రియమైన వారికి మనమిచ్చే కానుకు ప్రత్యేకమైనది. ఇది వస్తువు రూపంలో లేకపోయినా ఎదుటి వ్యకికి ఎంతో సంతోషాన్నిస్తుంది.. ఓ చిరకాల జ్ఞాపకంగా వారి మనసుల్లో మిగిలిపోతుంది. కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు! ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను వ్యక్త పరచడానికి ఇంతకన్నా మంచి మార్గం ఇంకోటి లేదని చెప్పొచ్చు. ఓ బలమైన కౌగిలింత ద్వారా ఎదుటివ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పకనే చెప్పొచ్చు. ఎంత డబ్బు ఖర్చు చేసినా పొందలేని ఆనందం దీని సొంతం. కౌగిలింతతో లాభాలెన్నో.. కౌగిలింతతో మన ప్రేమను వ్యక్తపర్చటమే కాదు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా మనకు ఎన్నో లాభాలున్నాయి. 1) మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ సారి ప్రియమైన వారి కౌగిలింతలోకి చేరితో ఆ బాధ ఇట్టే దూరమైపోతుంది. 2) కౌగిలింత కారణంగా మన పనితనం మెరుగుపడుతుంది. 3) కౌగిలింత ‘బిహేవియరల్ మెడిసిన్’గా పనిచేస్తుంది. సభల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాళ్లకు ఇది చక్కటి ఔషదంలా మారుతుంది. ఓ 20 సెకన్ల కౌగిలింత వారి హార్ట్‌బీట్ రేటును తగ్గించి చక్కగా మాట్లాడేలా చేస్తుంది. 4) ఓ బలమైన కౌగిలింత ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. 5) ఓ కౌగిలింత జంట మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఎందుకంటే కౌగిలింత ద్వారా వ్యక్తుల శరీరాల్లో విడుదలయ్యే ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ ఇందుకు కారణం. అంతేకాకుండా ఈ హార్మోన్ కారణంగా గుండె పనితీరు కూడా మెరుగు పడుతుంది. 6) కౌగిలింత నొప్పిని తగ్గించే మందులా కూడా పనిచేస్తుంది. కౌగిలింత ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ నొప్పులను తగ్గిస్తుంది. -
నన్ను మోసం చేసింది అనుకున్నా... కానీ!
నా ప్రాణ స్నేహితురాలు అలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. నేను ఎవరినైతే నా కంటే ఎక్కువగా ప్రేమించానో తనే ఇలా చేస్తుందని ఎన్నడూ అనుకోలేదు. నేను నమ్మిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి వెన్నుపోటు పొడిచి నాకు ద్రోహం చేసిన ఆ క్షణం నేను ప్రాణాలతో ఎందుకున్నానా అని తొలిసారి అనిపించింది. దేనినైనా భరించగలం కానీ అలాంటి బాధను భరించలేము. అసలేం జరిగిందంటే నా పేరు లిఖిత, తన పేరు లాస్య. మా ఇంటిపక్కనే వాళ్ల ఇళ్లు. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. ఎప్పుడూ కలిసే ఆడుకునే వాళ్లం, కలిసే స్కూల్‌కు వెళ్లే వాళ్లం. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. నేను అన్ని విషయాలు తనతో పంచుకునే దాన్ని. మేం 8వ తరగతిలో ఉన్నప్పుడు వాళ్ల నాన్న ఉద్యోగం వేరే చోటకు మారడంతో వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోయారు. అయినా కూడా మా స్నేహం కొనసాగుతూనే ఉంది. తరువాత బీటెక్‌లో మేం ఇద్దరం ఒకే కాలేజీలో చేశాం. చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. బీటెక్ 3వ సంవత్సరంలో నాకు శ్యామ్ అనే ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తను మా క్లాసే. చాలా జోవియల్‌గా ఉండే వాడు. అతనంటే నాకు కూడా చాలా ఇష్టం. అందుకే తను ప్రపోజ్ చేయగానే నేను కూడా ఓకే చెప్పేశాను. ఆ విషయం నేను వెంటనే లాస్యకు చెప్పాను. లాస్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. శ్యామ్ నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. మాతో అప్పుడప్పుడు లాస్య కూడా వచ్చేది. కొన్ని రోజుల తరువాత శ్యామ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు. నాకు ఒక రోజు డౌట్ వచ్చి తన ఫోన్‌ను చెక్ చేశాను. ఆ ఫోన్ చూసి నేను షాకయ్యాను. ఎందుకంటే లాస్య శ్యామ్ ఒకరితో ఒకరు చాలా క్లోజ్‌గా చాట్ చేసుకోవడం చూశాను. ఇద్దరు నన్ను మోసం చేశారని తెలుసుకున్నాను. నేను శ్యామ్‌ను ఈ విషయం గురించి ప్రశ్నించాను. నాకు లాస్య అంటే మొదటి నుంచి ఇష్టం. తనతో క్లోజ్ అవడం కోసమే నీకు ప్రపోజ్ చేశాను అని చెప్పాడు. ఆ మాటలు వినగానే నేను ఎంతలా మోసపోయానో అర్ధం అయ్యింది. ఇంకా లాస్యతో మాట్లాడాలి అనిపించక లాస్య హాస్టల్ నుంచి వేరు హాస్టల్‌కు వెళ్లిపోయాను. కొన్ని రోజుల తరువాత శ్యామ్ ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి లాస్య తనని మోసం చేసిందని చెప్పాడు. తనకు అంతకు ముందే లవర్ ఉన్నాడంటా వాడితోనే ఉంటా అంటుంది,నన్ను మోసం చేసింది అన్నాడు. నేను లాస్యను చాలా రోజులు తరువత కలిసి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా అని అడిగాను. అవుతుంది. నీకు శ్యామ్ అంటే చాలా ఇష్టం కానీ శ్యామ్ ఒక ప్లేబాయ్. ఆ విషయం నీకు అర్థం కావాలనే శ్యామ్‌తో క్లోజ్‌గా ఉన్నట్లు నటించాను. తరువాత మోసం చేస్తే ఎంత బాధగా ఉంటుందో తనకి తెలిసేలా చేశాను అంది. నాకు ఒక్కసారిగా లాస్య మీద ఎంతో గౌరవం పెరిగింది. నేను తనని తప్పుగా అర్థం చేసుకున్నాను అని తెలిసింది. లాస్యను నేను జీవితాంతం నిన్ను గుర్తుపెట్టుకుంటాను. నువ్వు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పాను. కొన్ని సార్లు మనం నమ్మిన వాళ్లు మోసం చేశారనుకొని ద్వేషం పెంచుకుంటాం. కానీ నిజమైన స్నేహితులు మన మంచి కోసం ఏదైనా చేస్తారు. ప్రేమ విషంలో నేను మోసపోయిన ఫ్రెండ్షిప్ విషయంలో నేను గెలిచాను. లవ్ యూ లాస్య. లిఖిత( ఏలూరు) -
ప్రేమలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తొచ్చేవి!
ప్రేమ ఎవ్వరినైనా పిచ్చి వాళ్లను చేయగలదు. ప్రేమ మత్తులో ఒక్కసారి మునిగితే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రేమ ఎవ్వరినైనా ఎదురించేలా చేయగలదు, రాజ్యాన్ని సైతం త్యజించేలా చేయగలదు. అలాంటి ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అలాంటి భావాల్ని వ్యక్తపరచాలంటే మాటలు పాటల్లా మారాల్సిందే. కొందరు ‘నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి’ అని ప్రేయసిని బ్రతిమిలాడుకుంటే.. ఇంకొందరు ‘ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని చేరి నిన్ను కోరుకుంటే చౌకబేరమా’ అంటూ ప్రేమలో పడేస్తున్నారు. ప్రేమను వ్యక్త పరచడంలో, ఆ ప్రేమను ఫీలవ్వడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే ఇప్పటికే ప్రేమ మీద వేల కొద్ది పాటలు వచ్చినా ఇంకా అనేక పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిలో అందమైన ఆకట్టుకునే కొన్ని పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రేమికుల రోజు నాడు కచ్చితంగా మనకు గుర్తొచ్చే పాట ప్రేమికుల రోజు సినిమాలోని ‘వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన! నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపు చూసి శిలను అయితినే.. ఓ మాట రాక మూగబోతినే’. ప్రేమించే ప్రతి అబ్బాయి తన ప్రేయసి గురించి ఇలా ఫీలవుతూనే ఉంటాడు. ఇక అమ్మాయిలు‘ మన్మధుడా నీ కల కన్నా.. మన్మధుడా నీ కథ విన్న మన్మధుడంటే ప్రాణంలే మన్మధుడే నాక్కావలలే’ అంటూ మురిసిపోతూ ఉంటారు. ‘ఫీల్ మై లవ్’ అంటూ మీ ప్రేమను ఫీలయ్యేలా చేసిన తరువాత ‘నిజంగా నేనే నా....ఇలా నీ జతలో ఉన్నా’ అంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి ఒక్కరోజు కనబడకపోతే చాలు ‘పిల్లారా!.. నువ్వు కనపడవా’ అంటూ ప్రాణం పోతున్నట్లు విలవిలలాడిపోతారు. అంత బాధ తరువాత తను ఒక్కసారి కనిపిస్తే చాలు ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాలే ఇది చాలే’ అంటూ ఎగిరి గంతెస్తాం. మన ప్రేమ ప్రయాణంలో ఏ పాట విన్నా, ఏ సినిమా చూసినా మనం ప్రేమించిన వారే కనబడతారు. ప్రపంచం అంతా ప్రేమమయం అనిపిస్తుంది. అందుకే ప్రేమ, పాట ఒక చక్కని జోడి. ఎన్నో భావాలను అందంగా తెలియజేయడానికి పాట ఒక సాధనం. అందుకే ప్రేమికుల రోజున మీకు నచ్చిన వారికి మనసుకు హత్తుకునే పాటను షేర్ చేస్తూ మీ ప్రేమను వ్యక్త పరచండి. మీ కోసం మాకు తెలిసిన కొన్ని అందమైన పాటల్ని కొన్నింటిని మీతో పంచుకుంటున్నాం. -- నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి - గులేబకావళి కథ -- నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి-- నా హృదయంలో నిదురించే చెలి -- ఈ హృదయం కరిగించి వెళ్లకే -ఏ మాయ చేశావే -- కన్నల్లో నీ రూపమే గుండెల్లోనీ ధ్యానమే- నిన్నే పెళ్లాడతా -- మధురమే మధురమే మధురమే --సత్యం -- నువ్వేప్పుడొచ్చావో అపుడే పుట్టింది ఈ ప్రేమ - అమ్మాయిలు అబ్బాయిలు -- నా గుండెలో నువ్వుండి పోవా - నువ్వు నేను -- ఓ చెలియ నా ప్రియ సఖియా చేజారేను నా మనసే- ప్రేమికుడు -- తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక -సొంతం -- తెలియదులే ఇది తెలియదులే - సింగం -- ప్రియతమా ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా -మజిలీ -- నీ జతగా నేనుండాలి, నీ యదలో నేనిండాలి - ఎవడు -- మెల్లగా కరగని రెండు మనసుల దూరం - వర్షం. -- బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే - అల వైకుంఠపురం. -- నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మౌనంగా ఉన్నా.. - 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. ఇలా పది కాదు వంద కాదు ప్రేమ మీద వేల కొద్ది పాటలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒకపాటను ప్రేమికుల రోజు సందర్భంగా మీరు ప్రేమించే వాళ్లకు అంకితమివ్వండి. కమ్మని పాటలా మీరు కూడా కలకాలం గుర్తుండిపోతారు. -
నీతో కలిసి రోడ్డు మీద అడుక్కుతినాలా?
సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం మొదలైంది నా తొలిప్రేమ. తన పేరు లక్ష్మీ ప్రియ, మా దగ్గరి బంధువు! మరదలవుతుంది వరుసకు. మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే మొదటిసారి చూశాను ప్రియని. చూడగానే నచ్చేసింది. తనతో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని ఉండేది. పెళ్లికాని అమ్మాయితో చనువుగా మాట్లాడితే బంధువులు ఏమనుకుంటారోనని ఆగిపోయేవాడిని. కానీ, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను చూడటానికి ప్రయత్నించేవాడిని. ఎవరికీ అనుమానం రాకుండా ఫాలో అయ్యేవాడిని. నేను ఫాలో అవుతున్నట్లు ప్రియకు తెలిసిపోయింది. తనకూడా నన్ను చూసేది. ‘‘ఫంక్షన్లకు ఎంతో మంది బంధువులు వస్తుంటారు.. పోతుంటారు.. సన్నీగాడు లోకల్’ అనుకున్నా మనసులో. ధైర్యం చేసి మొదటిమాట మాట్లాడా‘ మీ అమ్మ పిలుస్తోంది’ అని. ఆ తర్వాత మరింత ధైర్యం తెచ్చుకుని మరో మూడు ముక్కలు మాట్లాడా. మొదటిది తను టీ నా చేతికిచ్చినపుడు‘‘ థాంక్స్’’ అని.. రెండోది భోజనాల సమయంలో అన్నం ఎక్కువగా వడ్డిస్తోంటే.. ‘చాలు’ అని.. చివరగా ఫంక్షన్ అయిపోయి ఇంటికి వెళుతూ.. ‘వెళ్లోస్తాను’ అంటే సరేనని. ప్రియ వెళ్లిపోయిన తర్వాత నా మనసు మనసులో లేదు. ప్రతీరోజు తనగురించే ఆలోచించేవాడిని. అలాంటి సమయంలో ఓ రోజు తననుంచి ఫోన్ వచ్చింది. నేను మొదట గుర్తు పట్టలేదు. తర్వాత ప్రియ అని తెలిసి, ఊపిరి ఆడనంత పనైంది. ఎలాగోలా మాట్లాడటం మొదలుపెట్టాను. ఆ తర్వాతి నుంచి ప్రతిరోజూ నేను ఫోన్ చేసేవాడిని. కొద్దిరోజులకే మా మధ్య స్నేహం బలపడింది. మా రెండు కుటుంబాల ఫంక్షన్లనో తరచూ కలుసుకునేవాళ్లం. నా ప్రేమను ఎలా చెప్పాలా అనుకుంటున్న సమయంలో తనే నాకు ‘ఐ లవ్ యూ’ చెప్పింది. ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రేమలో నాలుగు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ నాలుగు సంవత్సరాలలో ఆర్థికంగా మా కుటుంబం బాగా వెనకబడిపోయింది. అక్కపెళ్లి చేయటంతో అప్పుల్లో కూరుకుపోయాం. వడ్డీలు కట్టడానికి ఉన్న పొలంలో చాలా భాగం అమ్మాల్సి వచ్చింది. బంధువులందరికీ ఈ విషయం తెలిసిపోయింది. తలో రకంగా అనుకోవటం మొదలుపెట్టారు. నేను ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాను. ప్రియతో మాట్లాడటం తగ్గించేశాను. తను కూడా పెద్దగా నా గురించి పట్టించుకునేది కాదు! నేను ఫోన్ చేయకపోతే’ ఎందుకు ఫోన్ చేయలేదు’ అని అడిగేది కూడా కాదు. ఫోన్ చేసినపుడు మాత్రం బాగానే మాట్లాడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒకరు మా ఇంటి కొచ్చాడు. మాటల సందర్భంలో ప్రియను తన కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. తను నన్ను కాదని వేరే వాడ్ని చేసుకోదనుకుని పెద్దగా పట్టించుకోలేదు. మేము మాట్లాడుకుంటున్నపుడు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. కొన్ని రోజుల తర్వాత తనకు పెళ్లి నిశ్చయమైనట్లు తెలిసింది. తనను అడిగితే అలాంటిదేమీ లేదంది. ఆ కొద్దిరోజులకే ప్రియ నిశ్చితార్థానికి మా కుటుంబానికి పిలుపొచ్చింది. నా దిమ్మతిరిగిపోయింది. షాక్‌నుంచి తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. వెంటనే తనకు ఫోన్ చేశాను. స్విచ్ఛాఫ్ వచ్చింది. నిశ్ఛితార్థం అయిపోయిన తర్వాత ఫోన్ కలిసింది. నిశ్చితార్థం గురించి అడిగా..సరిగా స్పందించలేదు. క్యాన్సిల్ చేసుకోమన్నాను. ‘‘ నీతో కలిసి రోడ్డుమీద అడుక్కుతినమంటావా’’ అంది. నాకేం అర్థం కాలేదు. ఏంటని అడిగా.. ‘‘ ఉన్న ఆస్తి పోయింది. నువ్వే ఇప్పుడు ఉద్యోగం కోసం రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు. నేను మీ ఇంట్లో అడుగుపెట్టి సంతోషంగా ఎలా ఉండగలను. నన్ను అర్థం చేసుకో! ఇకపై ఫోన్లు చేయటం మానేయ్’’ అని ఫోన్ కట్ చేసింది. నా మనసు ముక్కలైంది. - సన్నీ, హైదరాబాద్ -
మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తే! వెంటనే..
వాలెంటైన్స్ వీక్ మొదలై అప్పుడే నాలుగు రోజులు అవుతోంది. వాలెంటైన్ వీక్ సందర్భంగా బహుమతులతో ప్రేమను వ్యక్తపరుచుకునే జంటలకు మరో ముఖ్యమైన రోజు ‘టెడ్డీ డే’... ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు అందమైన టెడ్డీ బేర్ బొమ్మలను ఇచ్చిపుచ్చుకుని ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటారు. టెడ్డీ బేర్ క్యూట్‌నెస్, సంతోషానికి గుర్తు. మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే టెడ్డీ బేర్ రకాల్ని బట్టి మనం వారిని ఎంత ప్రేమిస్తున్నామో తెలియజేయవచ్చు. ఇద్దరి మధ్యా అందమైన బంధాన్ని నెలకొల్పటానికి టెడ్డీ బేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఆడపిల్లల జీవితంలోని ఏదో ఒక సందర్భం ఈ టెడ్డీ బేర్‌తో ముడిపడిఉండటం పరిపాటి. అందుకే ఓ అందమైన టెడ్డీ బేర్‌ను ఎంచుకోండి! మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వండి. అయితే మనం చేయవల్సిందల్లా మన మనసులోని భావాలను ప్రతిబింబించేలా ఓ టెడ్డీ బేర్‌ను ఎంచుకోవటమే. ఆ తర్వాత మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో తెలియజేస్తూ ఓ సందేశాన్ని రాసి ఆ బొమ్మకు అతికించండి. ఎందుకంటే కేవలం బహుమతులే కాదు! మనం ప్రేమగా వారిని ఉద్ధేశించి రాసే నాలుగు వాఖ్యాలు కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మీ ప్రేమకు రంగులద్దండి! ఒక్కో రంగు టెడ్డీ బేర్ ఒక్కో అర్థాన్నిస్తుంది. అందుకే బొమ్మను కొనబోయే ముందు మీ ప్రియమైన వారికి ఎలాంటి రంగు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవటం ముఖ్యం. పింక్ : ఈ రంగు ఎదుటి వ్యక్తిపై మనకున్న అన్‌కండిషనల్ లవ్‌ను, ఎఫెక్షన్, కంపాషన్ను తెలియజేస్తుంది. తెలుపు : ఈ రంగు అమాయకత్వానికి, అందానికి ప్రతిబింబంలాంటిది. ఈ రంగు ఓ కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఎరుపు : ఇది ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఆరెంజ్ : ఈ రంగు సంతోషాన్ని, ప్యాషన్, పాజిటివ్ ఎనర్జీని సూచిస్తుంది. నీలం : ఈ రంగు టెడ్డీ బేర్ నిజాయితీ, నమ్మకానికి చిహ్నం. మీరో వ్యక్తిని మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తున్నట్లయితే వెంటనే నీలం రంగు టెడ్డీ బేర్‌ను కొని వారికి బహుమతిగా ఇవ్వండి. -
ఆమెతో మాట్లాడటం నా భార్యకు నచ్చడంలేదు
నేను మా ఊర్లో స్కూలింగ్ కంప్లీట్ చేసి, ఉన్నత చదువుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లాను. ఒక రెండు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ ద్వారా నాతో స్కూల్లో చదువుకున్న అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టాను. అలా చాలా రోజులు మాట్లాడుకున్నాం. తను నాకు మంచి ఫ్రెండ్ అయింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కోపంగా ఉన్నా.. బాధ అనిపించినా తనతోనే పంచుకునేవాడిని. తనతో మాట్లాడకుండా ఒక రోజైనా ఉండేవాడిని కాదు. నాలైఫ్‌లో జరిగిన ప్రతీచిన్న విషయాన్ని తనతో పంచుకునే వాడిని. తను నాతో మాట్లాడకపోతే మరుసటి రోజు నేను తనని తిట్టేవాడిని. తనునాకు చాలా సపోర్టివ్‌గా ఉండేది. చాలా కేరింగ్‌గా ఉండేది. నేనంటే తనకు ఇష్టం.. తనంటే కూడా నాకు చాలా ఇష్టం. నాకు నా మరదలితో ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికి కూడా తనతో చాలా క్లోస్‌గా ఉండేవాడిని. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. నేను తనని ముద్దగా సెల్ఫీ అని పిలిచేవాడిని. నా ఎంగేజ్మెంట్కి, పెళ్లికి మధ్యకాలంలో మరింత క్లోజ్ అయ్యాం. మ్యారేజ్ తర్వాత మాట్లాడుకోవటం మంచిది కాదని చెప్పేవాడిని. తను మాత్రం ఎంగేజ్మెంట్కు ముందు ఎలా ఉండేవాళ్లమో అలానే ఉండాలి అనేది. తనతో మాట్లాడటం మా భార్యకు నచ్చనం లేదు. తనకు తెలియకుండా మాట్లాడుతూ ఉండేవాడ్ని. కానీ, తను మాత్రం ప్రతీదానికి అలగటం నువ్వు మారిపోయావ్ అని గొడవ పెట్టడం చేసేది. ఏం జరిగినా తను ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకుని పెట్టుకుని అలగటం మొదలుపెట్టేది. తను చేసేది నాకు కోపం వచ్చి గట్టిగా అరిచేవాడిని. మూడు నెలలక్రితం కూడా అదే జరిగింది. తను ఏమనుకుందో ఏమో నాతో మాట్లాడటం మానేసింది. నేను తనను చాలా మిస్ అవుతున్నా. ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.. .. నీ చిన్నా -
కలరింగ్ లేక తెగ బోర్ కొట్టేది... అప్పుడు!
ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో తీపిని నింపుతుంది. కానీ నా జీవితంలో మాత్రం అది విషాన్ని మిగిల్చింది. ఎప్పుడు నవ్వుతూ ఉండే నా పెదాలపై ఆ నవ్వునే లేకుండా చేసింది రెండక్షరాల ప్రేమ. నేను ప్రేమించిన అమ్మాయి పేరు శ్రావ్య. పేరుకు తగ్గట్టుగానే వినసొంపైన గొంతు, అందమైన రూపం ఆమెది. ఎన్నో ఆశలతో లైఫ్‌ను ఎంజాయ్ చేయెచ్చని ఒక ఆఫీస్‌లో చేరాను. ఆ ఆఫీస్‌లో పనిలో ఒత్తిడి లేకపోయినా కలరింగ్ లేక లైఫ్ చాలా బోర్ కొడుతూ ఉండేది. అలాంటి టైంలో నేను ఉదయం ఆఫీస్‌కు వచ్చే టైంకు నాకు ఒక విషయం తెలిసింది. కొత్తగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఒక ఐదుగురు అమ్మాయిలు మా డెస్క్‌లో చేరారు అని. వెంటనే వాళ్లని చూడాలనిపించి వాళ్ల కోసం ఎదురుచూశాను. సరిగ్దా ఉదయం 10 గంటలు కాగానే వాళ్లు డెస్క్‌లో అడుగు పెట్టారు. అందరూ బాగానే ఉన్నారు. కానీ అందులో నలుపు రంగు డ్రెస్‌లో ఉండి హెయిర్ లీవ్ చేసుకున్న ఉన్న అమ్మాయి నాకు బాగా నచ్చింది. చాలా సేపు ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను. కొత్తగా రావడంతో వాళ్లు ఒక్కక్కరి దగ్గర ఒక్కో విషయం నేర్చుకుంటూ ఉన్నారు. నా దగ్గరకు ఎప్పుడు వస్తుందా తను అని చాలా రోజులు ఎదురు చూశాను. ఇంకా ఏం చేయాలో తెలియక తను నా కొలిగ్ దగ్గర డౌట్ కోసం వెళితే నా దగ్గరకు పంపియ్యమని రిక్వెస్ట్ చేశాను. తను నా దగ్గరకు వచ్చింది. ఒక్క క్షణం ఆకాశాన్ని జయించినంత ఆనందం కలిగింది. మనసులోనే ఎగిరి గంతేశాను. తను రాగానే పేరు తెలియనట్టు నీ పేరేంటి అని అడిగాను. శ్రావ్య అని చెప్పింది. ఎందుకో అప్పుడే నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఫోన్‌నంబర్ చెప్పు అని అడిగేశాను. తను ఏమనుకుందో కానీ ఏదో అనుకుంటూనే నాకు నంబర్ ఇచ్చింది. నేను సాయంత్రం అవగానే తనకు కాల్ చేశాను. తను సరిగా రెస్పాన్డ్ కాలేదు. తరువాత రోజు నేను కాల్ చేయడానికి రీజన్ వేరే ఉంది అని కవర్ చేశాను. తను సరే సార్ అంది. ఆ తరువాత నుంచి కాల్ చేసినప్పుడు బాగానే మాట్లాడేది. చాలా జోవియల్ గా మాట్లాడేది. తన మాటలు రోజు కొత్తగా అనిపించేవి. చాలా అందంగా ఉండేవి ఆ రోజులు. తను నన్ను లవ్ చేస్తోందో లేదో తెలుసుకోవడానికి నేను తన ఫ్రెండ్ ఫోన్ నంబర్ కూడా తీసుకొని తనతో క్లోజ్‌గా మాట్లాడుతున్నట్లు నటించాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నన్ను ప్లేబాయ్ అనుకుంది. ఎన్ని సార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా నీకు నేను కాకపోతే ఇంకోటి వస్తుందిలే అని దూరం పెట్టింది. నా ఫోన్ లిఫ్ట్ చేయదు. మెసేజ్‌కు రిప్లై ఇవ్వదు. అంత మంచిగా మాట్లాడిన తను ఒక్కసారిగా మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపోతున్నా. నేను చేసిన చిన్న తప్పు నన్ను ఆ అమ్మాయి ముందు దోషిగా నిలబెట్టింది. ఆ తప్పు గురించి ఎప్పుడూ బాధ పడుతూనే ఉంటాను. ప్రవీణ్(విజయవాడ) -
చాక్లెట్ వస్తువు కాదు! కమిట్మెంట్
వాలెంటైన్ వీక్‌లోని మూడోరోజు, ప్రపోజ్ డే తర్వాతి రోజు ‘చాక్లెట్ డే’.. ప్రియమైన వారితో తీపిని పంచుకోవటం అన్నది చాలా ప్రత్యేకమైనది. దానర్థం మరిన్ని మధురమైన క్షణాలను నీ కందిస్తానని ఎదుటివ్యక్తికి భరోసా ఇవ్వటమే. చాక్లెట్ అంటే తినే వస్తువు మాత్రమే కాదు! ప్రేమకు గుర్తు కూడా. ఇది ఒకరిపై ఒకరి ఉండాల్సిన కమిట్మెంట్ను తెలియజేస్తుంది. చాక్లెట్ డేను జరుపుకోవటానికి ఇది కూడా ఓ ప్రధానమైన కారణం. చాక్లెట్లు.. హెల్త్ బెనిఫిట్స్ చాక్లెట్లంటే అంటే చాలా మందికి ఇష్టం. రోజుకో చాక్లెట్ చొప్పున తినటం అన్నది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మన గుండెను భద్రంగా ఉంచుతుంది. మన మూడ్‌ను సెట్ అయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా చాక్లెట్ తినటం అన్నది సూథింగ్ థెరపీలాగా పనిచేసి బొంగురు పోయిన గొంతును బాగుపరచటంలో తోడ్పడుతుంది. మన మెదడును చురుకుగా పనిచేసేలా చేసి, సంరక్షిస్తుంది. చాక్లెట్లో రకాలను బట్టి అవి చేసే మేలులో కూడా తేడాలు ఉంటాయి. డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే మన బంధాన్ని మరింత తియ్యగా, కొండంత బలంగా ఉంచుకోవాలంటే బోలెడన్ని డార్క్ చాక్లెట్లు మీ భాగస్వామికి గిఫ్ట్ ఇవ్వండి. -
శేషు ప్లీజ్ వెళ్లిపో!..
తన పేరు లక్ష్మి! ప్రైవేట్ జాబ్ చేసేది. మా ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే. దీంతో మేము బాగా మాట్లాడుకునేవాళ్లం. కానీ, ఎప్పుడు కూడా లవ్ చేస్తున్నానని తనకు చెప్పలేదు. అప్పుడప్పుడు ‘ఐ లవ్ యూ’ అని లిప్ మూవ్మెంట్ ఇచ్చేవాడిని. అది చూసి ఏమీ అనేది కాదు. తర్వాత తను జాబ్ మానేసింది. అలా కొన్ని నెలల తర్వాత ఓ రోజు ‘నీ తో ఓ విషయం చెప్పాలి’ అన్నాను తనతో. ఆ వెంటనే ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పేశాను. ‘ఏంటి వినబడలేదు! ఏమంటున్నారు’ అని నాతో మూడు సార్లు ఐ లవ్ యూ చెప్పించుకుంది. తర్వాత తను అన్న మాటకు నీరసం వచ్చింది. ‘ ఇది చెప్పటానికి ఇంత టైం పట్టిందా. ఎంత ఎదురుచూస్తున్నానో’ అంది. తను ప్రతి రోజూ చాల చక్కగా తయారయ్యేది. నాకు బొట్టుబిళ్లలంటే చాలా ఇష్టం. చాలా ప్యాకేట్లు ఇచ్చేవాడిని. తనతో ఏ రోజూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. బయట ఎక్కడికీ వెళ్లలేదు. ఒకరోజు మా ఫ్యామిలీల మధ్య గొడవైంది. దాంతో తను నాతో మాట్లాడటం మానేసింది. ‘నీకు నాకు మధ్య గొడవలేమీ లేవు కదా!’ అన్నా నేను. ‘వద్దు! ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది’ అని మాట్లాడేది కాదు. అలా నన్ను చూస్తూ ఉండేది అంతే. మా ఇంటి పనిమనిషికి మా ప్రేమ విషయం తెలుసు. గొడవలు అయినపుడు మా విషయం మా వాళ్లకు చెప్పేసిందనుకుంటా! నా మీద నిఘా పెట్టారు. ఈ లోపు వాళ్ల ఫాదర్ రిటైర్ అయ్యాక సడన్‌గా వేరే ఏరియాకు షిఫ్ట్ అయ్యారు. నేను ఫాలో అవుదాం అని బయటకు వెళ్తుంటే అమ్మ చూసి ‘ఎక్కడికి.. తర్వాత వెళ్లొచ్చు! వచ్చి కూర్చో’ అంది. అలా వాళ్లు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. తనని మిస్ అయ్యా. చాలా వెతికాను! కొన్ని నెలలకి వాళ్లు ఉండే హౌస్ దొరికింది. నన్ను చూసి ఎంతో సంతోషించి నవ్వింది. ఎలా ఉన్నారని అడిగింది. ఈ లోపు వాళ్ల చెల్లి వచ్చేసింది. వాళ్ల వాళ్లని పిలిచింది. తను ‘శేషు ప్లీజ్ వెళ్లిపో!’ అంది. నేను ఇంటికి వచ్చేశా. తరువాత ఎన్నో సార్లు వాళ్ల వీధిలోకి వెళ్లా. ఎప్పుడూ బయట ఉండేది కాదు. అలా ఒకరికి ఒకరం ఇష్టపడ్డా ఫ్యామిలీల వల్ల వేరయ్యాం. తను ఎక్కడవుందో తెలియదు. మ్యారేజై ఉంటుంది. ‘శేషు! నీ నవ్వు, నువ్వు ఏమిటో.. ఎందుకో..’ అని తను దీర్ఘం తీస్తూ అనే మాటలు ఇప్పటికి మర్చిపోలేదు. ఎక్కడ ఉన్నా నువ్వు సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నా. .. నీ శేఖర్ చదవండి : ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది! -
ప్రపోజ్ డే! ఇలా ఇంప్రెస్ చేయండి
వాలెంటైన్స్ వీక్ మొదలై ఓ రోజు గడిచిపోయింది. వారంలోని రెండో రోజు రానే వచ్చింది! అదే ప్రపోజ్ డే. ప్రేమలో ఉన్నవారు భాగస్వామి మెచ్చేలా తమ మదిలోని ప్రేమను వ్యక్తపరచటం.. కొత్తగా ప్రేమలో పడ్డవారైతే తమకిష్టమైన వారి మనసును గెలిచేలా ప్రపోజ్ చేయటం ఈ రోజు ప్రత్యేకత. ఎలా ప్రపోజ్ చేయాలన్న దానిపైన ప్రతీఒక్కరికి ఓ ఆలోచన ఉంటుంది. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే అందరూ ట్రెండ్‌లో ఉన్నవాటినే ఫాలో అవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, మీరు అలా చేయకండి. ఓల్ట్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కొంచెం కొత్తగా.. పాత పద్దతుల్ని అవలంభించండి. మీ ప్రేమను ఆలోచనలుగా మలిచి.. భావాల్ని అక్షరాలుగా చేసి చక్కటి ప్రేమలేఖ రాయండి. ఆ ప్రేమలేఖ మీ మనసు ప్రతిబింబించాలని మాత్రం మర్చిపోకండి. ఎదుటి వ్యక్తి ఇంప్రెస్ అయ్యేలా కవితలు, కొటేషన్లు రాసినా మంచిదే. ఇక పెళ్లైన మగవాళ్లైతే మీ భాగస్వామి కోసం ప్రేమగా వండిపెట్టండి! కాసేపు వారితో సరదాగా గడపండి. బెస్ట్ ప్రపోజ్ డే కొటేషన్స్ : ప్రేమంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమను వెతుక్కోవటం కాదు! నిన్ను వెతుక్కోవటం నాదో కోరిక! ఆ సూర్యుడు భూమిపై తెగిపడే దాకా నేను నీ తోడుగా ఉండాలని నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియదు.. ఓ క్షణం నువ్వు కనిపించకపోతే ఎందుకు బాధపడుతున్నానో తెలియదు.. కానీ, నువ్వు లేకుండా నేను లేనని మాత్రం తెలుసు! నా హృదయాన్ని ఉంగరం చేసి అందించా.. ఎన్నడూ నువ్వు ఒంటరిగా నడవకూడదని ఆశించా.. నా హృదయాన్ని నీ నివాసం చేసి.. గది బయట నా ఆలోచనల్ని కాపలా ఉంచా.. -
ప్రేమ ప్రయోగం నా కొంపముంచింది!
నేను డిగ్రీ చదువుతున్న రోజులు. ఇంటర్ తర్వాత డిగ్రీకి మా ఊరు నుంచి టౌన్‌కు డైలీ అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది. కొత్తలో బస్‌స్టాండ్‌లోకి.. ముఖ్యంగా నలుగురు ముందుకు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాన్ని. అలా రోజులు గడిచిపోతున్నాయి. నాకు చిన్నప్పటినుంచి హీరో సూర్య అంటే చాలా ఇష్టం. అతడి సినిమాలు బాగా చూసేవాడ్ని. సూర్య సన్ఆఫ్ కృష్ణన్ సినిమాను డీవీడీలో ఎన్ని సార్లు చూశానో లెక్కేలేదు. ముఖ్యంగా అందులోని ట్రైన్ సీన్ నన్ను బాగా ఆకట్టుకుంది. నాకప్పుడు అనిపించింది.. ఓ అమ్మాయి వైపు చూడగానే ప్రేమలో పడతామా అని! ఆలోచించాను.. మరీ ఎక్కువగా ఆలోచించి జుట్టుపీక్కోవటం ఇష్టంలేక ఓ నిర్ణయానికి వచ్చాను. ఎవరైనా ఓ అందమైన అమ్మాయి మీద ప్రయోగం చేద్దామనుకున్నాను. అప్పుడప్పుడు మా బస్సులో కనిపించేది ఓ అమ్మాయి.. మా కంటే సీనియర్! అప్పుడు తను ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆమె అయితే బాగుంటుంది అనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ రోజు బస్సులు ఆలస్యంగా వచ్చాయి. వెంటవెంటనే రెండు బస్సులు రావటంతో అందరూ ముందుగా కదిలే బస్సు ఎక్కి వెళ్లిపోయారు. వేళ్ల మీద లెక్కపెట్టే మందిమి మాత్రమే రెండో బస్సులో ఉన్నాము. అందులో ఆమె కూడా ఉంది. వెన్నెల రాత్రిలో.. బస్సులోకి చల్లగా వీస్తోంది గాలి. అంతా ఓ కళలా ఉంది! తను ఎడమ వైపు ఉండే సీట్లో నా ముందుగా కూర్చుంది. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాను. ఎంత సేపు చూస్తూ ఉన్నానో నాకు తెలియదు.. గంట ఇట్టే గడిచిపోయింది. అంతలోనే నేను దిగాల్సిన స్టాప్ వచ్చింది. అయిష్టంగానే దిగివెళ్లిపోయాను కానీ, తనంటే అప్పటినుంచి ఇష్టం ఏర్పడింది. ఇక ప్రతి రోజూ తన కోసం బస్సు వెతికే వాడ్ని. తను రోజూ వచ్చే బస్సుకే నేను కూడా ఎక్కేవాడ్ని. ఒక వేళ తను ఆ బస్సుకు రాకపోతే! మధ్యలో బస్సు దిగి ఆమె వస్తుందనే నమ్మకం ఉన్న వేరే బస్సు ఎక్కేవాడ్ని. తను కనిపించపోతే ఏదోలా ఉండేది. కొన్ని నెలల తర్వాత నేను తనని చూస్తూన్నానని తనుకు కూడా తెలిసిపోయింది. ఎవరా! అని నన్ను చూడటం మొదలుపెట్టింది. నేను కొద్దిగా ధైర్యం చేసి తన సీటు పక్కగా నిలబడటం, లేదా ఆమె దగ్గరిగా ఉండే సీట్లో కూర్చోవటం చేసేవాడ్ని. కొన్ని రోజుల తర్వాత తను కనిపించలేదు. ఎందుకని ఆరా తీస్తే! ఫైనల్ సెమిస్టర్ ఎక్షామ్ అని.. ఆ తర్వాతినుంచి తను రాదని తెలిసింది. అంతే! నా మనసు మనసులో లేదు. రాత్రిళ్లు నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. నాకు మొదటిసారి మా హీరో మీద కోపం వచ్చింది.. ప్రేమ ప్రయోగం నా కొంపముంచిందనిపించింది. ఓ వారంరోజుల తర్వాత తను కనిపించింది. అదే తనని చివరి సారి చూడటం. తను కనిపించని రోజులు నేను పడ్డ బాధ ఆ దేవుడికే తెలుసు ఆ బాధనుంచి కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. ఇంకెప్పుడూ ప్రేమ ప్రయోగాల జోలికి పోకూడదనిపించింది. - శేషు, చెన్నై -
ఈ సర్ఫ్రైజ్ అద్భుతంగా ఉంటుంది
వాలెంటైన్స్ డే అంటే ఎదుటివ్యక్తికి ఓ మంచి గిఫ్ట్ ఇచ్చి ఇంఫ్రెస్ చేయటమే కాదు.. వారి మనసుకు నచ్చేలా ఏదైనా చేసి సర్ఫ్రైజ్ చేయటం కూడా. మీరు ఇవ్వబోయే సర్ఫ్రైజ్! అందమైన ప్రదేశంలో ప్రియమైన వారితో గడిపే విలువైన కొన్ని క్షణాలైతే.. అద్భుతంగా ఉంటుంది. బిజీ షెడ్యూల్లతో నిత్యం సతమతమయ్యే జీవితాలకు కొంత మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మరి మీ బడ్జెట్ తగ్గట్లుగా వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమజంటలు విహరించటానికి నగరంలో బోలెడన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకండి! ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేసుకోండి. ఈ ప్రేమికుల రోజును మరింత అందంగా.. మధుర జ్ఞాపకంగా మార్చుకోండి. 1) అనంతగిరి హిల్స్ హైదరబాద్‌లో ఉన్న అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. పచ్చదనం పరుచుకున్న ప్రదేశాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. 3763 ఎకరాల విస్తిర్ణంలో ఉన్న కొండలు, పచ్చని చెట్లు మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాయి. మూసీ నది జన్మస్థానమైన అనంతగిరి కొండలు సినిమ షూటింగులకు ప్రసిద్ధి. 2) దుర్గం చెరువు ప్రకృతిలో గడపాలనుకునే జంటలకు ఇదో చక్కటి ప్రదేశం. ఇక్కడి ప్రకృతి అందాలు మనల్ని ఆకట్టుకుంటాయని చెప్పటంలో అతిశయోక్తిలేదు. ప్రశాంతమైన వాతావరణంలో బోటింగ్ చేస్తూ గడపొచ్చు. లేదా, కొండలు, గుట్టలు మధ్య ఉన్న చెరువును చూస్తూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటి వాటికి అవకాశం ఉంది. 3) లియోనియా రిసార్ట్ ఇది శామీర్ పేటలో ఉన్న ఓ ప్రముఖ రిసార్ట్. ప్రియమైన వారితో వీకెండ్‌ను ఎంజాయ్ చేయటానికి అనువైన ప్రదేశం. సకల హంగులతో కూడిన హోటళ్ల సముదాయాలు దీని ప్రత్యేకత. మెడి స్పా, సినిమా థియోటర్లు, లైవ్ ఫర్ఫార్మ్మెన్స్, సర్ఫింగ్ రిడ్జ్, వాటర్ పార్క్ మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. 4) లుంబినీ పార్క్ ఈ లుంబినీ పార్క్ హుస్సేన్ సాగర్‌కు సమీపంలో ఉంది. ఇది సంతవ్సరం పొడవునా పర్యటకులతో రద్దీగా ఉంటుంది. లేజర్ షో, సంగీత ఫౌంటెన్లు ఈ ప్రదేశానికి ప్రత్యేక ఆకర్షణ. 5) ఎన్టీఆర్ గార్డెన్ హుస్సేన్ సాగర్‌కు సమీపంలో ఉన్న మరో అద్భుతం అని చెప్పొచ్చు. 36 ఎకరాల్లో ఉన్న ఈ పార్కు నగరం మధ్యలో బిర్లామందిర్, నెక్లస్ రోడ్డులకు దగ్గరగా ఉంది. ఇక్కడ ఉన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు మ్యూజియం ఓ ప్రత్యేక ఆకర్షణ. 6) రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్దదైన ఫిల్మ్ సిటీగా పేరుగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీ మీ జంటకు ఓ కొత్త అనుభవాన్ని, అనుభూతిని ఇస్తుంది. ఓ అధ్బుత లోకంలోకి అడుగుపెట్టినట్లుగా భ్రాంతి కలిగిస్తుంది. సరదాగా గడపాలనుకునే ప్రేమ జంటలకు ఇది అనువైన ప్రదేశం. 7) నెక్లెస్ రోడ్ రాత్రి వేళ నెక్లెస్ రోడ్ అందాలు చూడటంలో మజానే వేరు. ఇక్కడి రోడ్డు ట్యాంక్‌బండ్ చుట్టూ నెక్లస్ ఆకారంలో ఒంపు తిరిగి ఉన్న కారణంగా ఈ ప్రదేశానికి నెక్లెస్ రోడ్ అని పేరు. ఇక్కడికి దగ్గరలో ఉన్న పురాతన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 8) ట్యాంక్ బండ్ ప్రేమపక్షులు నిత్యం సేదతీరే ప్రదేశాలలో ట్యాంక్‌బండ్ ఒకటి. ట్యాంక్‌బండ్ అందచందాలు మనల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. సాయం సంధ్యలలో ట్యాంక్‌బండ్ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. సాగర్‌లో బోటింగ్ చేస్తూ నీటి మధ్యలో ఉన్న ఎత్తైన బుద్ధున్ని చూస్తూ సంతోషంగా గడపొచ్చు. 9) వాటర్ ఫ్రంట్ హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లలో ఇది ఒకటి. హుస్సెన్ సాగర్‌కు సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ పర్యటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. చక్కటి భోజనంతో పాటు వినసొంపైన సంగీతం వింటూ సాగర్ అందాలను చూస్తూ ఆనందించవచ్చు. 10) గోల్కొండ ఫోర్ట్ వందల ఏళ్లనాటి ఈ కట్టడం పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి. దేశం నలువైపుల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు దీన్ని చూడటానికి వస్తుంటారు. చెదిరినప్పటికి కోట అందాలు మనల్ని ముగ్ధుల్ని చేస్తాయి. -
‘మీ ఆయనకు విడాకులిచ్చేయ్..’
2017లో డిగ్రీ కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా. అప్పుడే ఆర్ఆర్బీ పోస్టులు పడితే అప్లై చేసి కోచింగ్ తీసుకుంటున్నాను. కోచింగ్ సెంటర్లో చేరినపుడు స్టడీ.. హోమ్ తప్ప ఇంకేమీ ఉండేది కాదు. ఆ ఇన్స్టిట్యూట్లో చాలా మంది నాకు ప్రపోజ్ చేశారు. బట్ పెద్దగా పట్టించుకునేదాన్ని కాను. ఓ రోజు మధ్యాహ్నం ఒక అబ్బాయి నాతో మాట్లాడటానికి ట్రై చేశాడు. సైన్స్ బుక్ గురించి అడుగుతున్నాడు.. మా ఫ్రెండ్ రెస్పాండ్ అవుతోంది‘ మేము తీసుకోలేదు.. వేరే వాళ్ల దగ్గర జిరాక్స్ ఉంది తీసుకోండి’ అంది. తర్వాత తను నాకు సైట్ కొడుతున్నాడని తెలిసింది. ఓ రోజు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ ఐడీలు అడిగాడు. ఇవ్వాలా? వద్దా? అనుకున్నా.. తను ఫ్రెండ్లీగా అడుగుతున్నాడేమో అనుకుని చెప్పేశా. తర్వాతి రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేశాడు. ‘హాయ్’ అని. అలా పరిచయం మొదలైంది. ఎంతో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడేవాడు. కొన్ని రోజుల తర్వాత ప్రపోజ్ చేశాడు. నేనపుడు ఒప్పుకోలేదు. తను ఏప్రిల్‌లో ప్రపోజ్ చేస్తే నేను డిసెంబర్లో ఓకే చెప్పాను. ప్రేమించుకున్నప్పటికి ఎప్పుడు కూడా మేము బయట తిరగలేదు! కాల్స్, చాటింగ్స్ అంతే.. తనకు డిసెంబర్లో జాబ్ వచ్చి వెళ్లిపోయాడు. మా మధ్యలో అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండేది కాదు. ఏదో మాట్లాడుకున్నామా అంతే! అలా మా రిలేషన్లో గొడవలు కూడా అయ్యేవి. ఒకసారి ఓ నెల రోజులు ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత మాట్లాడుకున్నాం. ఇంట్లో వాళ్లు నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. తనకు చెప్పా! పెద్దగా రియాక్ట్ కాలేదు. ‘ అనవసరమైన విషయాలు నాకెందుకు చెబుతున్నావ్!’ అన్నాడు ఒకసారి. ఆ రోజునుంచి నేను తనతో మ్యాచెస్ గురించి చెప్పటం మానేశాను. కొన్ని రోజులకు నాకు పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి కుదిరిన రెండురోజులకు తనకి మెసేజ్ చేశా. శుభాకాంక్షలు చెప్పాడు. ఏమీ అనలేకపోయా! తర్వాతి రోజు నాతో‘ మ్యారేజ్ క్యాన్సిల్ చేస్కో! నువ్వు నాకు కావాలి.’ అనటం మొదలుపెట్టాడు. ఇన్ని రోజులు ఏమైంది అనుకున్నా మనసులో. నిజానికి తనంటే నాకు కూడా ఇష్టమే.. తనే చాలా నార్మల్‌గా ఉండేవాడు మా రిలేషన్లో. నేను కూడా అలాగే ఉండేదాన్ని. ‘నేనిపుడు ఏమీ చేయలేను! ఇప్పుడంతా అయిపోయింది. మా వాళ్లు అబ్బాయి వాళ్లకు డౌరీ కూడా ఇచ్చేశారు. అందరికీ చెప్పేసుకున్నారు. నాకసలు ఈ పెళ్లి ఇష్టంలేదు. కానీ, మా వాళ్లు బలవంతపెట్టేసరికి ఒప్పుకోవల్సి వచ్చింది’ తనకు అంతా క్లియర్‌గా చెప్పేశాను. అతను చాలా ఏడ్చాడు! సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. కానీ, నా పెళ్లి అయిపోయింది. నేనిప్పుడు ఢిల్లీలో ఉంటున్నా. ఓ రోజు ఓ ఈవెంట్ ఉంటే ఊరికి వచ్చాను. ఆ విషయం తెలుసుకుని ఆ ఈవెంట్‌కు వచ్చేశాడు. నేను ఆటో దిగేసరికి అక్కడ ఉన్నాడు. ‘అతనేంటి ఇక్కడ’ అని షాక్ అయ్యాను. ‘నీతో కొంచెం మాట్లాడాలి! బైక్ ఎక్కు బయటకు వెళదాం’ అన్నాడు. నేను వినిపించుకోలేదు. అతన్ని వెళ్లిపోమని చెప్పి లోపలికి నడిచా. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు. మా స్నేహితులు వార్నింగ్ ఇద్దామనుకున్నారు. మేము బయటకు వచ్చేలోపు వెళ్లిపోయాడు. చాలాసార్లు కాల్ చేశాడు. ఏంటో అని నేను లిఫ్ట్ చేశా. ‘నాకు నువ్వు కావాలి. నువ్వులేకుండా ఉండలేను’ అని చెప్పుకుంటుపోయాడు. నేను నచ్చచెప్పటానికి ఎంతో ట్రై చేశా. వాడికి తెలుసు.. వాడంటే నాకు చాకు చాలా ఇష్టం అని. ఆ రోజు మాకు గొడవ కాకుండా ఉండిఉంటే ఈ రోజు ఇలా ఉండేది కాదేమో.. వాడు ఇప్పుడు ఇస్తున్న ప్రాధాన్యత, చూపిస్తున్న ప్రేమ అప్పుడు చూపించి ఉంటే అసలు ఈ పెళ్లి జరగకపోయేది. మ్యారేజ్ గురించి చెప్పినా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని అడిగా. ‘నాకు నీపై నమ్మకంరా నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోవని, అందుకే రియాక్ట్ కాలేదు. సరే నా తప్పు ఒప్పుకుంటున్నా. ఇప్పుడు పెళ్లి చేసుకుందాంరా! మీ ఆయనకు విడాకులు ఇచ్చేయ్’ అన్నాడు. వాడిని చూస్తుంటే ఏం చేసుకుంటాడో అని భయం వేస్తోంది. ‘ సరే చేసుకుందాం. నువ్వేమీ చేసుకోకు’ అన్నా. అప్పటినుంచి పిచ్చిపిచ్చిగా చేయటం మానేశాడు. నేను ఇప్పటికీ చెబుతూనే ఉన్నా మన మ్యారేజ్ జరగదురా అని కానీ తను అస్సలు అర్థం చేసుకోవటం లేదు. డైలీ ఏదో ఒకటి చేసుకుంటున్నాడు.. ఏడుస్తున్నాడు. ఎప్పుడైనా వీడియో కాల్ చేస్తే! చాలా ఎమోషనల్ అయిపోతాడు. వాడికి ఎలా నచ్చచెప్పాలో అర్థంకావటం లేదు. పోనీ మొత్తానికే వదిలేద్దామనుకుంటే ఏమన్నా చేసుకుంటాడేమోనని భయం. ఏమైనా అంటే ‘నువ్వు నా దానివి అంతే’ అంటాడు. తను కోరుకున్న చిరునామా తనది కాదని చెప్పినా అర్థంకాదు. నేను మా భర్తతో దిగిన ఫొటోలు ఎఫ్బీలో చూసినపుడు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆ ఫొటోలు తీసేదాకా ఊరుకోడు. వాడికి కోపం ఎక్కువే.. ప్రేమ ఎక్కువే. చాలా సార్లు చెప్పా‘ నీకు మంచి జాబ్ ఉంది. పెళ్లైన అమ్మాయిని చేసుకోవల్సిన అవసరం ఏముంది. చక్కగా వేరే అమ్మాయిని చేసుకో.. నువ్వు అనుకుంటున్నవి ఏవీ జరగవు’అని. నాకు పెళ్లైందన్న మాట వింటేనే అతడికి చాలా కోపం వస్తుంది. ‘ నా దృష్టిలో నీకు ఇంకా పెళ్లి కాలేదు. నువ్వు ఆ టాపిక్ తీయకు’ అంటాడు. ‘ ఈ ప్రేమ మనం ప్రేమించుకునే సమయంలో చూపించాల్సింది. ఇప్పుడుకాదు’ అంటే. ‘ అపుడు నువ్వు నాతోనే ఉంటావనుకున్నా’ అని అంటాడు. ఏది ఏమైనా వాడికి ఇంకా అర్థం కావటం లేదు. రీసెంట్గా మిర్రర్ పగులగొట్టి చెయ్యి మొత్తం కోసుకున్నాడు. అర్థం చేసుకోవట్లేదు. నా మాట అస్సలు వినటం లేదు. ఈ విలువలు కట్టుబాట్లు తెంచుకుని నీ కోసం రాలేనురా! నన్ను క్షమించు.. దయచేసి నాపై కాకుండా నీ కెరీర్‌పై దృష్టి పెట్టు. నీకు మంచి వైఫ్ వస్తుంది. ఇదంతా నీకు అర్థం కావాలని కోరుకుంటున్నా. .. నీ లవ్లీ స్వీటీ -
వాలెంటైన్స్ వీక్! ఈ వారం మీ ప్రేమ జాతకం
మేషం : ఓర్పుతో తీసుకునే నిర్ణయాలు మీరు ఇష్టపడే వారిని ఆకట్టుకుంటాయి. శుక్ర, బుధవారాలు మీ అభిప్రాయాలను అవతలి వారికి వెల్లడించేందుకు అనుకూలం. అవతలి వారి వైపు నుంచి కూడా సానుకూలత వ్యక్తమయ్యే అవకాశం. ఈ సమయంలో ఎరుపు, గులాబీ రంగు దుస్తులు ధరించాలి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. వృషభం : మీరు ఇష్టపడే వారికి మీ ప్రేమను తెలియజేసేందుకు ఆది, గురువారాలు అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు చేసే ప్రతిపాదనలకు అవతలి వారి నుంచి కూడా అనుకూలత వ్యక్తవుతుంది. ఈరోజుల్లో మీరు ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు ధరించండి. ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, సోమ, బుధవారాలు ఇటువంటి వాటికి స్వస్తి చెప్పండి. మిథునం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు మీ అభిప్రాయాలను శని, మంగళవారాలలో వెల్లడిస్తే మంచిది. అవతలి వారు కూడా అనుకూలంగా స్పందించే వీలుంది. ఈ సమయంలో మీరు ఎరుపు, నేరేడు రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలు మీ ప్రయత్నాలకు దూరంగా ఉండండి. కర్కాటకం : మీ ప్రతిపాదలను ఇష్టులైన వారికి ఆది, గురువారాలలో వెల్లడించండి శుభదాయకంగా ఉంటుంది. అవతలి వారు కూడా మీపట్ల సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఈ సమయంలో మీరు గులాబీ, నేరేడు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి తూర్పుఈశాన్యదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. సింహం : మీ మనస్సులోని భావాలను శుక్ర, శనివారాలలో ఇష్టపడే వారికి తెలియజేయండి ఆశింఛిన ఫలితం కనిపిస్తుంది. అవతలి వారు కూడా అనుకూల సమాచారం అందించే వీలుంది. ఈరోజుల్లో మీరు నీలం, తెలుపు రంగు దుస్తులు «ధరిస్తే శుభదాయకంగా ఉంటుంది. అలాగే, దక్షిణ ఆగ్నేయదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. అయితే, సోమ, బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. కన్య : మీలోని భావాలను బుధ, గురువారాలు ఇష్టులకు తెలియజేయండి. వారి నుంచి కూడా సానుకూల స్పందనలు రావచ్చు. మీ మంచితనం, ప్రేమను గుర్తిస్తారు. ఈ సమయంలో మీరు ఆకుపచ్చ, తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరండి శుభప్రదంగా ఉంటుంది. అయితే, ఆది, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. తుల : మీరు ఇష్టపడే వారికి మీ మనస్సులోని అభిప్రాయాలను ఆది, బుధవారాలలో వెల్లడిస్తే ఫలితం ఉంటుంది. అవతలివారు మీ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేస్తారు. ఇటువంటి సమయంలో మీరు ఎరుపు, ఆకుపచ్చ రంగులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, మంగళవారాలు మీ ప్రతిపాదనలకు స్వస్తి చెప్పండి. వృశ్చికం : మీ మనోగతాన్ని, అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు బుధ, గురువారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. అవతలి వారు కూడా మీపట్ల ప్రేమాభిమానాలు వ్యక్తం చేస్తారు. ఈ సమయంలో మీరు గులాబీ, నేరేడు రంగు దుస్తులు ధరిస్తే ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, సోమవారాలు వీటికి దూరంగా ఉండండి. ధనుస్సు : మీరు ఇష్టపడే వారికి మీ ప్రతిపాదనలను శని, బుధవారాలు అందించండి. అవతలి వారు కూడా తగినట్లుగా స్పందించి ప్రేమను పంచే వీలుంటుంది. ఈ సమయంలో మీరు ఆకుపచ్చ, ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అనుకూల ఫలితాలు ఉండవచ్చు. అలాగే, ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి, శుభదాయకంగా ఉంటుంది. ఇక, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండండి. మకరం : మీలోని భావాలను అత్యంత ఇష్టపడే వారికి తెలిపేందుకు శుక్ర, ఆదివారాలు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీ ప్రతిపాదనలకు అవతలి వారు కూడా అనుకూలంగా స్పందిస్తారు. ఈ సమయాల్లో మీరు పసుపు, గులాబీ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి శుభవార్తలు వింటారు. ఇక, బుధ, గురువారాలు వీటికి స్వస్తి చెప్పండి. కుంభం : మీ అభిప్రాయాలు, ప్రేమసందేశాలను సోమ, బుధవారాలలో ఇష్టులకు తెలియజేయండి. అవతలి నుంచి కూడా మీరు ఊహించిన సందేశాలు రావచ్చు. అలాగే, ఇంటి నుంచి ఎరుపు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి ఉత్తరఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే, శని, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మీనం : మీ ప్రతిపాదనలను, అభిప్రాయాలను ఇష్టపడే వారికి మంగళ, గురువారాలు వెల్లడిస్తే మంచిది. ఈ ప్రతిపాదనలను అవతలి వారు ఆమోదించే వీలుంటుంది. ఈ సమయంలో గులాబీ, పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, ఆదివారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి. -
చీటీలో పేరు.. అతడే ఆమె బాయ్‌ఫ్రెండ్!
ప్రేమికులు, కొత్తగా ప్రేమలో పడ్డవారు మనసు నిండా కళ్లు చేసుకుని ఎదురుచూసే రోజు ‘ వాలెంటైన్స్ డే’ . ఫిబ్రవరి 14 రాగానే తమ ప్రియమైన వారిని బహుమతులతో సరఫ్రైజ్ చేసే వారు కొందరైతే.. ప్రేమికుల రోజునైనా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేయాలనుకునే వారు మరికొందరు. కానీ, చాలా మందికి ఆ రోజు అంత ప్రముఖ్యత ఎందుకు సంతరించుకుందో తెలియదు. వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించరు. అయితే వాలెంటైన్స్ డే ఆవిర్భావం గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికి కొన్ని కథలు మాత్రమే ప్రాచూర్యం పొందాయి. ప్రేమను గెలిపించి.. మరణానికి తలొగ్గి.. పూర్వం... క్లాడియస్ రాజు రోమ్ను పరిపాలిస్తున్న కాలంలో... సైనికులు పెళ్లిళ్లు చేసుకోకూడదనే నియమం ఉండేది. కానీ పాపం సైనికులూ మనుషులే కదా! వారి బాధను అర్థం చేసుకున్న వాలెంటైన్ అనే సెయింట్... సైనికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేస్తుండేవాడు. అది రాజుకు తెలిసిపోయింది. వాలెంటైన్‌ను జైల్లో బంధించాడు. మరణ దండన విధించాడు. ఆ దండనను ఆమలు చేసే రోజు వచ్చింది. చనిపోయే ముందు ఈ ప్రపంచానికి తన చివరి సందేశాన్ని వినిపించాలనుకున్నాడు వాలెంటైన్. ఎలా ఆ పని చేయాలా అని ఆలోచిస్తుంటే రాలిపడిన రావిచెట్టు ఆకులు కనిపించాయి. వాటి మీద... ‘నేను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపాలని వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. ప్రతి మనిషికీ ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే జీవితమే ఉండదు. ప్రేమను బ్రతికించండి. ఇదే నా చివరి సందేశం’ అని బొగ్గుముక్కతో రాసి, తన గది కిటికీలోంచి వాటిని బయటకు విసిరేశాడు. ఆ తర్వాత మరణ దండనకు తలవంచాడు. అయితే వాలెంటైన్‌కు తెలియదు... తాను ఇచ్చిన ఆ సందేశం ఈ ప్రపంచం మొత్తాన్నీ తనకు అభిమానులుగా మార్చేస్తుందని. తాను మరణించిన రోజు వాలెంటైన్స్‌డేగా ప్రేమికులకు అంకితం అవుతుందని. వాలెంటైన్ తన చివరి సందేశాన్ని రాసిన రావి ఆకును అతని హృదయంగా భావించి, దాని ఆకారాన్ని హృదయా కారంగా, ప్రేమకు గుర్తుగా స్థిరపరిచారని ఓ కథనం. దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. పూర్వం గ్రీకు దేశాన్ని పాలిస్తున్న క్లాడియస్ 2 తాను నమ్మే పన్నెండు దేవతలను మాత్రమే పూజించాలని రోమన్లందరినీ ఆజ్ఞాపిస్తాడు. క్రిస్టియన్లతో ఎవరైనా సన్నిహితంగా మెదిలారని తెలిస్తే మరణశిక్ష ఖాయమని హెచ్చరిస్తాడు. కానీ, వాలెంటినస్ అనే సాధువు చక్రవర్తి మాటను చెవికెక్కించుకోడు. తన జీవితాన్ని క్రిస్తుకే అంకితం చేస్తాడు. దాంతో కన్నెర్ర చేసిన క్లాడియస్ వాలెంటినస్‌ను జైల్లో పెట్టి మరణ శిక్ష విధిస్తాడు. ఆయనకు జూలియా అనే కూతురు ఉంటుంది. ఆమె పుట్టుకతో అంధురాలు. వాలెంటినస్ తన కూతరుకి అన్నీ నేర్పిస్తాడు. తనకళ్లతో ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. వారం రోజుల్లో ఆ సాధువుకు మరణశిక్ష అమలవుతుండగా జైలర్ అయన్ని అడుగుతాడు..‘ నీ కూతుర్ని చూడాలనుకుంటున్నావా? అని. ఆమెను పిలిపిస్తాడు. జైల్లోంచే తన కూతురికి జీవన సత్యాలు బోధిస్తుంటాడు. సెయింట్ వాలెంటైన్ రాసినట్లుగా చెప్పబడుతున్న 1477 నాటి సందేశం ఆ జ్ఞానంతో జూలియాకు చూపు వస్తుంది. చివరకు తాను చనిపోయే ముందు రోజు జూలియాకు ఓ ఉత్తరం రాస్తాడు.. ‘దైవాన్ని నమ్ము.. ప్రపంచాన్ని ప్రేమించు.. ఫ్రమ్ యువర్ వాలెంటైన్’ అని! ఆ తర్వాత రోజు అంటే క్రీ.శ 270, ఫిబ్రవరి 14న వాలెంటినస్కు మరణ శిక్ష అమలవుతుంది. తన తండ్రిని సమాధి చేసిన చోట గులాబిరంగులో పూత పూసే బాదం మొక్క నాటుతుంది. ఆ మొక్క తర్వాత కాలంలో వృక్షమై ప్రేమ,స్నేహానికి చిహ్నంగా నిలిచిందని అంటారు. ఆ ప్రేమను స్నేహాన్ని ప్రపంచానికి చాటడానికే ప్రతి ఫిబ్రవరి 14న వాలెంటినస్ పేరుమీద ప్రపంచ వ్యాప్తంగా వాలెంటైన్స్ డేని జరుపుకోవటం మొదలుపెట్టారనే మరో కథనం. వాలెంటైన్స్ గుర్తుగా.. ప్రాచీన రోమన్లు ఫిబ్రవరి నెలలో ‘‘లూపెర్కాలియా’’ అనే పండుగను జరుపుకునేవారు. ఈ పండుగ వేడుకల్లో భాగంగా అబ్బాయిలు.. అమ్మాయిల పేర్లను చీటీలో రాసి డబ్బాలో వేసేవారు. ఆ తర్వాత ఒక్కో అబ్బాయి ఒక్కో చీటీని తీసేవాడు. అలా ఆ చీటీలో పేరు వచ్చిన అమ్మాయికి అతడు బాయ్‌ఫ్రెండ్ అవుతాడు. ఇదంతా ఆ పండుగ వరకు మాత్రమే. కానీ, కొన్ని సందర్భాలో ఆ జంట పెళ్లిళ్లు కూడా చేసుకునేది. ఆ తర్వాత కొన్ని చర్చీలు దీన్ని క్రిస్టియన్ వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించాయి. అంతేకాకుండా ఆ రోజు సెయింట్ వాలెంటైన్‌ను గుర్తు చేసుకునేలా కూడా ఉండాలని భావించాయి. అలా 496వ సంవత్సరంలో మొదటి వాలెంటైన్స్ డే జరిగింది. తదనంతరం ప్రజలు తమ ప్రేమను వ్యక్తపరచటానికి సెయింట్ వాలెంటైన్స్ డేను ఎంచుకోవంటం ప్రారంభించారు. ఎనిమిది రోజుల ప్రేమ పండుగ వాలెంటైన్స్ డేకు ఏడు రోజుల ముందునుంచే ప్రేమ పండుగ మొదలవుతుంది. ఫిబ్రవరి 7నుంచి ఫిబ్రవరి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సందడి ఉంటుంది. ఈ వారంలోని ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు సైతం ఒక్కోరోజు ఒక్కోవిధంగా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తారు. 1) ఫిబ్రవరి 7 : రోజ్ డే 2) ఫిబ్రవరి 8 : ప్రపోజ్ డే 3) ఫిబ్రవరి 9 : చాక్లెట్ డే 4) ఫిబ్రవరి 10 : టెడ్డీ డే 5) ఫిబ్రవరి 11 : ప్రామిస్ డే 6) ఫిబ్రవరి 12 : హగ్ డే 7) ఫిబ్రవరి 13 : కిస్‌డే 8) ఫిబ్రవరి 14 : వాలెంటైన్స్ డే -
నన్ను కాదని పెళ్లైన వ్యక్తి మాయలో..
నేను హైదరాబాద్‌లో ఓ ఇంట్లో అద్దెకి ఉండేవాన్ని. ఆ ఇంట్లో నేను పై పోర్షన్లో ఉండేవాన్ని.. క్రింద ఉన్న ఓ పోర్షన్లో ఓ అమ్మాయి ఉండేది. తను అప్పుడే ఎంబీఏ జాయిన్ అయ్యింది. నేను కాంట్రాక్టు వర్క్ మీద బాన్సువాడకి పోయాను. అప్పడు తను చేసిన కాల్‌తో మా మధ్య పరిచయం ఏర్పడింది. చిన్న పరిచయం కాస్తా స్నేహంగా మారింది. మొదట్లో నేను వద్దనుకున్నా కానీ, ఆమె చూపించే ప్రేమకి నేను కూడా పడిపోయాను. ఈ లోపు ఎలా మారిందో తెలియదు కానీ స్నేహం కాస్తా నా వైపు నుంచి ప్రేమగా మారింది. అలా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంతగా అంటే తెలియకుండానే రోజులు గడిచిపోయాయి. మా కబుర్లకు గంటలు కూడా సెకన్లలా గడిచిపోయేవి. తనకి దేవాలయాలు అంటే చాలా ఇష్టం! నన్ను అన్ని టెంపుల్స్‌కి తిప్పేది. నాతో చేయించని పూజలు లేవు. ఒకరిని విడిచి ఒకరం ఉండలేని అనుబంధం మా మధ్య ఏర్పడింది. తెలియకుండానే ఒకరంటే ఒకరికి ప్రాణమైపోయాం. ఏ దేవుడు మమ్మల్ని విడదీయలేడు అనుకున్నా. నా రోజు తన మాటతోనే మొదలవుతుంది.. ముగుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా.. నాకు ఐ లవ్ యూ, గుడ్ నైట్ చెప్పనిదే పడుకునేది కాదు. మేమిద్దరం రహస్యంగా పెళ్లి చేసుకుందామని చాలా సార్లు అనుకున్నాం. ఒకసారి టెంపుల్‌కి వెళ్లాం. కానీ, వేరే కారణం వల్ల తిరిగి వచ్చేశాము. నా ఫోన్ కలువకుంటే తను మా ఫ్రెండ్స్‌కి చేసేది. అంతగా ఇష్టపడేది. తను మా ఇంట్లో వాళ్లతో.. మా బంధువులందరితో మాట్లాడేది. నన్నే పెళ్లి చేసుకుంటానని అందరికీ చెప్పేది. ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అలానే దాచుకున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యాక వేరే అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకుంటానని తనే అన్నది. అవన్నీ మరచిపోని అనుభూతులు. తన ఎంబీఏ కంప్లీట్ అయ్యాక కొన్ని రోజులకి తనకు జాబ్ వచ్చింది. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత జాబ్ చేయటం ఇష్టం లేదంది. ‘మొదట్లో ఎక్కడైనా అలానే ఉంటది’ అని చెప్పి నేనే పంపించాను. అదే నేను చేసిన మిస్టేక్.. తన మీద నమ్మకం చాలా ఉండేది. ఆఫీస్‌కు పోయినప్పటి నుండి ఇంటికి వెళ్ళేదాక ఎప్పుడు టైం దొరికినా కాల్ చేసేది. ప్రశాంతంగా సాగిపోతున్న నా ప్రేమ కథలోకి వచ్చిందో ప్రమాదం. ఆఫీస్‌లో పని చేస్తున్న ఓ పెళ్లైన వ్యక్తితో తనకు పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి అంత వయస్సు ఉన్న కూతురు.. ఒక అబ్బాయి ఉన్నాడు. కానీ, అతడి ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండదు. అదే తనకి కలిసి వచ్చింది. వాళ్ల మధ్య ఏ బంధం లేదని తను చెబితే నమ్మాను. నేను కూడా అసలు అలా అనుకోలేదు కొన్ని రోజులు. కానీ తను ఫస్ట్‌లో తండ్రి లాంటి వ్యక్తి అంది. పోను పోనూ వాళ్ల మధ్య బంధం దగ్గర అవుతూ.. మా మధ్య బంధం దూరం అవుతూ వచ్చింది. నేను ఫోన్ చేసిన ప్రతీసారి కాల్ వెయిటింగ్ అని వచ్చేది. అడిగితే అమ్మ అనేది. నా కాల్ కట్ చేసి ఆఫీస్‌లో బిజీగా ఉన్నా అని మెసేజ్ పెట్టడం.. ఆఫీస్ అయ్యాక అతడి కార్లో పోతూ మెట్రోలో పోతున్నా అని చెప్పేది. ఆ వ్యక్తి ఇల్లు ఆఫీస్ దగ్గరే.. అయినా ఆమె కోసం ఎక్కడో దూరంగా వున్న తన ఇంటి దగ్గర డ్రాప్ చెయ్యటం చేసేవాడు. నేను అడిగితే మెట్రోలో పోతున్నా అనటం నాకు అనుమానాన్ని తెచ్చాయి. కొన్ని పరిణామాలతో నాలో అనుమానాలు బలపడ్డాయి. తను నాతో ఉన్నా కూడా ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడేది. నెంబర్ చూపించమంటే తీసేసేది. ఎందుకంటే వేరే ఫ్రెండ్ అని చెప్పేది. నన్ను కాదని ఆ వ్యక్తితో సినిమాలకి షాపింగ్‌లకి పోవడం నాలో భరించలేని బాధని తెచ్చాయి. ఓసారి ఇద్దరూ నా కంట పడ్డారు. సరే అని వదిలేసాను. తర్వాత అడిగాను ‘మీరిద్దరూ ఆఫీస్‌లో ఉండేటోళ్లు కదా మళ్లీ ఎందుకు అక్కడ ఆగటం?’ అని. తనకు చాలా సార్లు చెప్పి చూశాను. కానీ, తను వినలేదు. ‘అలా ఎందుకు చేస్తున్నావ్?’ అని అడగటమే నేను చేసిన తప్పు. ఆ వెంటనే నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. నా నెంబర్ కూడా బ్లాక్ చేసింది. అసలు నేనేమి తప్పు చేశానో నాకే అర్థమవ్వట్లే.. అసలు తను ఎందుకు అలా చేస్తుందో, తను చేసేది తప్పని తనకి ఎందుకు అర్దమవ్వట్లే. ఆ వ్యక్తికి అయినా అది తప్పని అనిపించట్లేదా? తను ఆ వ్యక్తి మాయలో పడటం నాకు ఇంకా బాధగా ఉంది. భరించరాని నరకంలా ఉంది. ప్రేమంటే స్థాయి, అంతస్తులు చూసి లెక్కలేసుకోవడం కాదు. ఏమీ లేకున్నా, ఏమీ ఆశించకుండా నేనున్నాను అనే భరోసా ఇవ్వడం. కానీ, నీకోసం పడే ఈ బాధ కూడా నాకు మధురంగానే ఉంది. తనని వదిలి వస్తాను అని హామీ ఇస్తానంటే జీవితాంతం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. లేదంటే ఇక నువ్విచ్చిన ఈ మధురస్మృతులతోనే జీవితం గడిపేస్తాను.. - నీ నాని -
ఇద్దరం విడిపోయేదాకా వెళ్లాం.. ఆయన వల్ల..
‘ప్రేమ’ .. ఈ పదం వినటానికి బాగుంటుంది! అనుభవించేదాకా తెలీదు ఆ ఎదలోని చిక్కులు. ఆ చిక్కుముడుల్ని విప్పినపుడే ఆ ప్రేమ ఫలిస్తుంది. కాదని లాగావో అదింకా చిక్కుపడిపోతుంది. చాలా ఓపికగా నేను ఆ ముడుల్ని విప్పాననే అనుకుంటున్నా. దాని ఫలితమే నా ప్రేమ.. నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రోజులవి. రోజూ కాలేజీకి వెళ్లడం, రావడం, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయటం, చదువుకోవటం.. ఇదే నాలోకం. అయితే ఒకరోజు అనుకోకుండా ఓ పెళ్లికి బంధువుల ఇంటికి నేనొక్కదాన్నే వెళ్లాల్సివచ్చింది. ఆ పెళ్లిలోనే పరిచయమయ్యాడు హరీష్. అతని రాకతో నా జీవితం చాలా పెద్ద మలుపు తిరిగిందనే చెప్పాలి. అతను నాకు వరసకు బావ అవుతాడు. చిన్నప్పటినుంచి పరిచయమున్నా. అతనితో ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ, అతనికి నేనంటే ఎప్పటినుంచో ఇష్టమని ఆ రోజే తెలిసింది. పెళ్లిలో అతను అందరితో కలిసిపోవటం అందరినీ బాగా చూసుకోవటం, పెళ్లి బాధ్యతంతా తనదే అయినట్టు నడుచుకోవటంతో అతనిపై నాకు మంచి అభిప్రాయం కల్గింది. ఫంక్షన్ అయ్యేసరికి చాలా ఆలస్యం అవడంతో అతను నన్ను ఇంటి దగ్గర దింపటానికి వచ్చాడు. ఆ జర్నీలోనే అతడు నాకు ప్రపోజ్ చేశాడు. ముందుగా నేను ఆశ్చర్యపోయాను. కానీ, నాక్కూడా అతని ప్రవర్తన నచ్చింది. తెలిసిన వ్యక్తే కావడంతో ఓకే చెప్పేశా. ఇక అప్పటినుంచి అన్నీ తానే అయ్యాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒకమ్మాయిని పరిచయం చేసి తను నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు. తన పేరు స్వాతి! నేను తనతో బాగా మాట్లాడేదాన్ని. తనూ నాతో అలాగే మాట్లాడేది. కానీ, మాటిమాటికీ.. మా బావ అలా.. మీ బావ ఇలా.. నువ్వు బాగా చూసుకోవాలి.. నీకేం తెలీదు అని చెప్తూ ఉండేది. మొదట్లో ఏం అనిపించకపోయినా, తర్వాతర్వాత కోపం వచ్చేది. మా బావ గురించి నాకు తెలీకపోవడమేంటి? రెండు సంవత్సరాలనుంచి తనతో ఉంటున్నా కదా అనిపించేది. అయినా అంతగా పట్టించుకునేదాన్ని కాదు. గడుస్తున్న కొద్దీ మా బావంటే తనకూ ఇష్టమని నాకు తెలిసింది. కానీ, ఆ విషయం బావకి తెలీకపోవడటంతో ఆమెకే ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చేవాడు. నాకు నచ్చేది కాదు. ఏమైనా అంటే తను నా ఫ్రెండ్ అనేవాడు. ఆమె మాత్రం మేము విడిపోవడానికి చేయాల్సిన పనులన్నీ చేసేది. కానీ, నా ప్రేమ ముందు అవేవీ నిలబడలేదేమో. నా బాధ చూడలేక ఆ దేవుడే మా బావని తనకు దూరం చేశాడేమో అనిపిస్తుంది.. కాకపోతే ఏంటి? దాదాపు విడిపోయేదాకా వెళ్లిన మేము, స్వాతి వాళ్ల నాన్న వల్ల ఒక్కటయ్యాం. వాళ్ల నాన్నకి నేనెవరో తెలీకపోవచ్చు. కానీ, తన కూతురి జీవితం బాగుండాలని చేసిన ఒక పని వల్ల నా జీవితం నిలబడింది. తన తండ్రికిచ్చిన మాట వల్ల తనూ సంతోషంగా ఉంది. నేను నా బావతో సంతోషంగా ఉన్నా.. మొదట్లో ఆమె మాట్లాడకపోతే ఎంతో బాధపడిన బావే.. మెల్లిమెల్లిగా తన పనిలో పడిపోయాడు. నన్ను మొదటికన్నా ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు. మా ఇంట్లో వాళ్లని కూడా మా పెళ్లికి ఒప్పించాడు. ఇక మిగిలింది మా పెళ్లిరోజే అందుకే అంటారేమో.. ఎప్పుడు ఏది జరగాలనుంటే అది జరుగుతుంది. ఆవేశపడకుండా కాస్త వేచి చూడటం ఉత్తమం.. - దీప్తి, జగిత్యాల -
తను ప్రేమించింది మా అన్నయ్యనే!
నా పేరు రవి. మేము వైజాగ్‌లో ఉంటాం. మా స్కూల్లో రాధా అని ఒక అమ్మాయి ఉండేది.నాకెందుకో ఎప్పుడూ ఆ అమ్మాయితో మాట్లాడాలి అనిపిస్తూ ఉండేది. కానీ ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడేది కాదు. చాలా సైలెంట్‌గా ఉండేది. కానీ చదువులో అన్నింటిలో ముందుండేది. చూడటానికి చాలా అందంగా కూడా ఉండేది. నేనే కాదు మా స్కూల్లో చాలా మంది ఆమె అంటే ఇష్టపడేవాళ్లు. ఆమె మాత్రం వాళ్లను ఎవరిని పట్టించుకునేది కాదు. నా మనసులో మాట చెప్తాదామని చాలా సార్లు అనుకున్నాను.కానీ ఎప్పుడూ ధైర్యం చాలలేదు. నేను తనకు నా ప్రేమ విషయం చెప్పకుండానే మా టెన్త్ క్లాస్ అయిపోయింది. ఇంటర్లో నేను వేరే కాలేజీ, తను వేరే కాలేజీలో చేరాం. కానీ నేనెప్పుడు తనని మర్చిపోలేదు. ఎవరిని చూసిన తనే గుర్తొచ్చేది. ఆ రెండు సంవత్సరాలు నేను ఒక్కసారి కూడా తనని కలవలేదు. చూడలేదు. తరువాత అనుకోకుండా నేను తను బీటెక్‌లో ఒకే బ్రాండ్ ఒకే కాలేజ్‌లో జాయిన్ అయ్యాము. మా కాలేజీలో మొదటిసారి తనని చూసినప్పుడు నా ఆనందానికి అవధులు లేవు. తను నాకు రాసిపెట్టి ఉంది కాబట్టే మా కాలేజీలో చేరింది అనిపించింది. నా ప్రేమ కొత్త రెక్కలు తొడుక్కున్నట్లు, మళ్లీ చిగురించినట్లు ఎక్కడలేని ఆనందం ఏవేవో ఆలోచనలు. ఎలాగైనా తనతో పరిచయం పెంచుకోవాలని , ప్రతి చిన్న విషయానికి తనతో మాట్లాడేవాడిని. నెమ్మదిగా తను కూడా నాతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఇక చాటింగ్ స్టాట్ అయ్యింది. అక్కడి నుంచి ఫోన్లు మాట్లాడుకోవడం మొదలయ్యింది. తను నాతో క్లోజ్‌గా ఉంటుంది కదా అని నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని క్లారిటి కోసం అడిగాను. అప్పుడు తను చెప్పిన మాట విని నాకు గుండె ఆగినంత పని అయ్యింది. తను ఇంటర్లో ఉండగానే తన సీనియర్ ఒకతన్ని లవ్ చేశాను అని చెప్పింది. అతను ఎవరు అని తెలుసుకుంటే నాకు మరో షాక్ తగిలింది. అతను నాకు వరుసకు అన్నయ్య అవుతాడు. ఇక నాకు అంతా చీకటి అయిపోయినట్లు అనిపించింది. నెమ్మది నెమ్మదిగా తనకి దూరంగా ఉంటూ వచ్చాను. ఇక తనని మర్చిపోవాలని బీటెక్ అయిపోగానే యమ్ ఎస్ చేయడానికి అమెరికా వెళ్లిపోయాను. తన ఆలోచనలను పూర్తిగా తీసేయాలి అనుకున్నాను. నెమ్మది నెమ్మదిగా తనని మర్చిపోతున్నాను. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. రవి (వైజాగ్). -
నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే!
హాయ్ నా పేరు కృష్ణ. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. తన పేరు శృతి. తను టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చేది. అప్పుడే తను నాకు పరిచయం అయ్యింది. కొద్ది రోజుల తరవాత అది ప్రేమగా మారింది. నేను ఒక రోజు శృతికి ఆ విషయం చెప్పాను. తను కూడా నా ప్రేమను ఒప్పుకుంది. మా ప్రేమ విషయంలో మాకు చాలా గొడవలు అయ్యాయి. అయిన మేం ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోయేవాళ్లం. ఎన్ని గొడవలు అయిన ఒక్క రోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడిని. శృతి అంతలా నా మీద ప్రేమ చూపించేది. ఒక రోజు తను వాళ్ల ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. నేను మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాను. తను సరే అంది. మా ఇద్దరి కులాలు వేరు. అందుకే నేను ఒక సంవత్సరం పాటు ఎదురు చూశాను. తను ఒకరోజు ఫోన్ చేసి నాకు ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నాకు ఇంకా ఫోన్ చేయకు అని చెప్పింది. అప్పుడు నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత బాధ వేసింది. శృతికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయిన వాళ్ల ఇంట్లో వాళ్ల కోసం ఆ పెళ్లికి ఒప్పుకుందని తరువాత నాకు తెలిసింది. అప్పుడు నేను వచ్చేసేయ్ మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను. తను రాలేదు. ఇప్పుడు కూడ తన కోసమే నా ఆలోచన. నా స్థానంలో వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నాను. నా ఊపిరి ఉన్నంత కాలం నేను తనని మర్చిపోలేను. నువ్వు జాగ్రత్త శృతి నువ్వు లేని జీవితం శూన్యం శృతి. నువ్వే నా ప్రపంచం. నువ్వు గుర్తురాని క్షణం లేదు. ఐ లవ్ యూ శృతి. ఐ మిస్ యూ. నేను నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే. కృష్ణ(అమలాపురం). -
అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు!
నేను జాబ్ చేసే టైంలో నాతో పాటు జాజ్ చేసే ఒక అమ్మాయి చాలా రోజులు నా వెంట పడింది. ప్రేమిస్తున్న అని చాలా కాలం నా కోసం ఎదురు చూసింది. నేను అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రేమలో నిజాయితీ చూసి ఒప్పుకున్నా. నాలుగు సంవత్సరాలు మా ప్రేమ ప్రయాణం సాగింది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని పెళ్లి చేసుకుందాం అంది. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాను, ఆమె మాత్రం వాళ్ళ నాన్న ను ఓప్పించి చేసుకోవాలి అంది. అలా ఒప్పుకోరు పెళ్లి చేసుకున్నాక వాళ్లే ఒప్పుకుంటారు అన్నాను. అయినా ఆమె నా మాట వినలేదు. ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయ్యింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా నన్ను లవ్ చేశావు, పెళ్లి కి మాత్రం అందరూ ఒప్పుకోవాలి అనడం కరెక్ట్ కాదు అని నేను ఆమెతో విడిపోయాను. నేను మాత్రం మా నాన్న కి తెలియకుండా అసలు చేసుకొను అంది. అలా మేమిద్దరం విడిపోయాం. ఆమె మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. నేను మాత్రం ఆమె జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నా. ఆమె వస్తుంది అని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నా. లవ్ చేసే ముందు గుర్తు రాని తల్లిదండ్రులు పెళ్లి చేసుకునే ముందు ఎందుకు గుర్తు వస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఫోన్ చేస్తోంది. పెళ్లి చేసుకో అని చెప్తుంది. నేను ఒకటే చెప్పా తనతో నువ్వు చేసిన మోసం నుంచే ఇంకా కోలుకోలేదు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయలేను అని చెప్పాను. కమల్(సికింద్రాబాద్). -
తనతో ఉంటే ఈ లోకాన్నే మరిచిపోతా..
నా పేరు అఖిల. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా ఒక అబ్బాయిని కలిశా. మా డాడీ, వాళ్ల డాడీ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మేం కూడా అలానే ఉండేవాళ్లం. నాకు తనంటే చాలా ఇష్టం. తనకి కూడా నేనంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడు ఫ్యామిలీ టుగెదర్ జరిగినా నాతోనే ఉండేవాడు. నన్ను చాలా బాగా ప్యాంపర్ చేసేవాడు. మా విషయం ఇంట్లో తెలిసి రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. సంవత్సరం అయ్యాక తను కాల్ చేశాడు. కానీ రెగ్యులర్‌గా మాట్లాడుకునేవాళ్లం కాదు. నాకు నమ్మకం ఉండేది ఎప్పటికైనా తను నాకోసం వస్తాడని. అలా ఐదేళ్లయ్యాక మళ్లీ తను కనిపించాడు. వాళ్ల ఫ్రెండ్ ద్వారా తన నెంబర్ తీసుకున్నా. నేనే మెసేజ్ చేశా. తర్వాత తను చాలా క్యాజువల్‌గా మాట్లాడాడు. తనకి నేనంటే ఇష్టం లేదేమో అని నేను ఫోన్ చేయడం మానేశా. పది రోజులయ్యక తన నుంచి కాల్ వచ్చింది. నేను కూడా తన లాగే చాలా కూల్‌గా మాట్లాడా. తనకి అర్థమైపోయింది. నేనేదో నిన్ను ఏడిపిద్దాం అనుకుంటే నువ్వు కూడా నాలానే చేస్తున్నావేంటి అని నాతో గొడవపడ్డాడు. మా ప్రేమను ఇంట్లో ఒప్పుకోరు అని తెలుసు కానీ తనలా నన్ను ప్రేమించేవాడు దొరకడని మాత్రం చెప్పగలను. తనతో ఉంటే ఈ లోకాన్నే మర్చిపోతా. అంత ప్రేమ కురిపిస్తాడు. పెద్ద వాళ్లకి ఇష్టం లేకుండా మేం పెళ్లి చేసుకోలేం. అలా అని ఇష్టంలేని వ్యక్తితో నా జీవితాన్ని ముడిపెట్టలేను. మా ప్రేమను అర్థం చేసుకోండి నాన్నా. --అఖిల (చిన్నారి) -
మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రమే అంది!
నేను ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. అందరి అబ్బాయిల్లాగా అమ్మాయిల వెంట పడే వాడ్ని కాదు. ఎప్పుడూ చదువు మీదే ఉండేది నా ధ్యాసంతా. అలా నా డిగ్రీని 2015 లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. తరువాత ఐసెట్ ద్వారా ఎంసీఏ హైదరాబద్ లో పూర్తి చేశాను. నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్ళేవాడిని. అలా నేను కాలేజీకి వెళ్లకుండానే ఫస్ట్ క్లాస్ లో ఎంసీఏ పూర్తి చేశాను. ఎంసీఏ పూర్తి చేసిన తరువాత అందరి లాగా ఏదో సాఫ్టువేర్ కంపెనీ లో జాబ్ చేయాలి అనుకోలేదు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని సోషల్ మీడియాను ఎంచుకున్నాను. ఎందుకంటే నా ఆలోచనలు ఎప్పుడు పెద్దవిగా వుండేవి. ఆ ఆలోచనలే ఇప్పుడు నన్ను అయోమయంలో పడేస్తాయి అని ఎప్పుడూ అనుకోలేదు. నా బిజినెస్ ఐడియా ఏంటంటే చాలా మంది ప్రజలు టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతారు. కొంత మంది తమ వెబ్ సైట్ డిజైన్ కోసం సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తారు. కొంత మంది వెబ్సైట్ ట్రాఫిక్ కోసం గూగుల్ లాంటివి సంప్రదిస్తారు. వాళ్ళ అందరి కోసం నేను కొన్ని ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ను క్రియేట్ చేశాను. అలా నేను ఒక ఫేస్బుక్ పేజీను సైన్స్ & టెక్నాలజీ పేరుతో స్టార్ట్ చేశాను. అలా నేను సోషల్ మీడియాలో లీనం అయ్యాను. నాలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. నేను ఎప్పుడూ మెసేజెస్ పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి కూడా నాలాగే ఫేస్బుక్ సొసైటీకి సంబంధించిన పేజిని రన్ చేస్తుండేది. ఆమె ఎప్పుడూ సొసైటీ మీదే ఎక్కువ దృష్టి పెట్టేది. అలా నేను ఆమె ప్రతి పోస్ట్ కు లైక్స్, కామెంట్స్ పెట్టేవాడిని. ఎవరైనా నెగటివ్ గా కామెంట్స్ పెడితే నేను హీరో లాగా వాళ్ళకు రిప్లై ఇచ్చేవాడిని. ఆమె నన్ను ఇష్టపడుతుంది అనే భ్రమలో నేను నా బిజినెస్, జాబ్ మీద దృష్టి పెట్టలేదు. ఒక రోజు నా మనస్సు లోనీ మాట ఆమెకు చెప్పాను. కానీ ఆమె నాకు ఇలా రిప్లై ఇచ్చింది. నువ్వు జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్‌వు మాత్రమే అని అంది. నేను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాను. నాకు అందరిలాగ ఫ్రెండ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల అలా అయ్యాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ను పక్కన పెట్టి జాబ్ కోసం ట్రై చేస్తున్న. ఇప్పుడు ప్రేమ అంటేనే చాలా భయం వేస్తోంది. విజయ్(పేరు మార్చాం). -
ప్రేమలో ఉన్నారా.. ఈ వారం మీ జాతకం తెలుసుకోండి!
మేషం : మీరు అభిమానించే వారికి ప్రేమసందేశాలు అందించేందుకు ఆది, బుధవారాలు దివ్యమైన కాలమని చెప్పాలి. ఈ సమయంలో మీరు అభిమానించే వారి నుంచి సైతం సానుకూల సందేశాలు రావచ్చు. ఈరోజుల్లో పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి శుభాలు కలుగుతాయి. ఇక శుక్ర, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. వృషభం : మీ ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, బుధవారాలు అత్యంత అనుకూలం. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలివారి నుంచి అనుకూల సందేశాలు అందవచ్చు. ఇక ఈరోజుల్లో మీరు వైట్, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరితే సానుకూలత ఉంటుంది. ఇక ఆది, సోమవారాలు మౌనం మంచిది. మిథునం : మీరు ఇష్టపడే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శని, గురువారాలు అనుకూలమైనవి. ఈరోజుల్లో మీపట్ల అవతలి వారు కూడా అనుకూలత వ్యక్తం చేయవచ్చు. ప్రతిపాదనల సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే ఉత్తమం. అలాగే, ఇంటి నుంచి తూర్పుఈశాన్య దిశగా బయలుదేరండి. ఇక ఆది, సోమవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. కర్కాటకం: మీ మనస్సులో ఉన్న వారికి సందేశాలు అందించేందుకు ఆది, మంగళవారాలు అత్యంత అనుకూలం. ఈరోజుల్లో అవతలి వారు కూడా సానుకూలంగా స్పందించే వీలుంది. ఇటువంటి ప్రతిపాదనలు చేసే వారు వైట్, పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంటి నుంచి పశ్చిమవాయువ్య దిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, శనివారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. సింహం: మీ అభిప్రాయాలను ఇష్టులకు తెలియజేసేందుకు బుధ, గురువారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో మీరు ఇష్టపడే వారు మరింత సానుకూలత వ్యక్తం చేసే వీలుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్, వైట్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఉత్తర ఈశాన్య దిశగా ఇంటి నుంచి బయలుదేరండి, శుభాలు కలుగుతాయి. ఇక, శని, ఆదివారాలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కన్య: మీరంటే ఇష్టపడే వారు మీ సందేశాల కోసం ఎదురుచూస్తుంటారు. మీ ప్రతిపాదనలు శని, సోమవారాలు అందించండి, అవతలి వారు కూడా తక్షణం సానుకూల సందేశాలు పంపే వీలుంటుంది. ఈరోజుల్లో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మరింత శుభదాయకంగా ఉంటుంది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి, లక్ష్యం నెరవేరవచ్చు. అయితే, శుక్ర, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వడం మంచిది. తుల: మీరు అత్యంత ఇష్టపడేవారికి ప్రేమప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు ప్రయత్నించండి. ఈరోజులు అనుకూలమైనందున అవతలి వారు కూడా వెంటనే సానుకూలత వ్యక్తం చేసే వీలుంటుంది. ఇటువంటి సమయంలో మీరు ఆరెంజ్. పింక్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి దక్షిణదిశగా బయలుదేరండి. ఇక, బుధ, గురువారాలలో వీటికి దూరంగా ఉండండి. వృశ్చికం: మీరు అభిమానించే వారికి మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించేందుకు శని, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో మీ ప్రతిపాదనలపై అవతలి వారు అనుకూలత వ్యక్తం చేసే అవకాశం ఉంది. అలాగే, ఇటువంటి సమయంలో మీరు గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే శుభాలు సిద్ధిస్తాయి. అలాగే, ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. ఇక, శుక్ర, గురువారాలు వీటికి దూరంగా ఉండండి. ధనుస్సు: మీరు అత్యంత ఇష్టపడేవారికి మనస్సులోని భావాలను వ్యక్తం చేసేందుకు సోమ, బుధవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలను అవతలి వారు వినయంగా స్వీకరించే వీలుంటుంది. ఈరోజుల్లో మీరు వైట్, ఆరెంజ్ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరితే విజయం సిద్ధిస్తుంది. ఇక, శుక్ర, ఆదివారాలు వీటికి విరామం ప్రకటించడం మంచిది. మకరం: మీ ప్రేమసందేశాలను ఇష్టులకు అందించేందుకు శని, గురువారాలు మంచివి. మీ ప్రతిపాదనలపై అవతలి నుంచి కూడా అనుకూల స్పందనలు వచ్చే వీలుంది. ఈ సమయంలో మీరు రెడ్, గ్రీన్ రంగు దుస్తులు ధరిస్తే శుభాలు కలుగుతాయి. అలాగే, ఇంటి నుంచి ఉత్తర ఈశాన్యదిశగా బయలుదేరండి. ఇక, ఆది, మంగళవారాలు వీటికి దూరంగా ఉండడం మంచిది. కుంభం: మీ మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు ఆది, సోమవారాలు అత్యంత అనుకూలమైనవి. ఈరోజుల్లో అవతలి నుంచి కూడా సానుకూలత వ్యక్తమయ్యే వీలుంది. ఈ సమయంలో మీరు ఎల్లో, బ్లూ రంగు దుస్తులు ధరించండి. ఇక, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే, శుక్ర, బుధవారాలు మీ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. మీనం: మీరు ఇష్టపడే వారికి ప్రేమసందేశాలు, పెళ్లి ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు అత్యంత సానుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో అవతలి వైపు నుంచి కూడా శుభసందేశాలు రావచ్చు. -
తన బెంచ్ ఎదురుగా కూర్చొని సైట్ కొట్టేవాడ్ని.
తనని మొదటిసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చూశాను. చూడగానే నచ్చేసింది. తను కూర్చునే బెంచ్‌కి ఎదురుగా కూర్చొని తననే చూస్తూ ఉండేవాడిని. రెండు సంవత్సరాలు అలా గడిచిపోయాయి. మా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో తనతో మొదటిసారి మాట్లాడాను. తర్వాత మాట్లాడాలని ఉన్నా ధైర్యం చేయలేకపోయా. డిగ్రీ లాస్ట్ ఇయర్ లాస్ట్ డే చూశా తనని ఓ టెంపుల్లో. తర్వాత రెండేళ్లకి ఓ బస్టాప్‌లో ఎదురుపడింది. నన్ను చూడగానే నవ్వుతూ పలకరించింది. తనే మాట్లాడింది కదా అని నేను ఆరోజు కాల్ చేశా. ఆరోజు నుంచి రోజూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. అలా మూడేళ్లు గడిచాయి. కానీ ఒక్కసారి కూడా డైరెక్ట్‌గా కలవలేదు. ఓరోజు ఫోన్ చేసి నాకు పెళ్లి కుదిరింది అని చెప్తూనే నువ్వంటే నాకిష్టం కానీ మా ఫ్యామిలీని బాధపెట్టలేను అంది. నేను కూడా ఆలోచించి తన నిర్ణయాన్ని కాదనలేదు. ఫ్రెండ్స్‌లా ఉండాలని డిసైడ్ అయ్యాం. అలానే ఉంటున్నాం కూడా. తనని అప్పుడప్పుడు చాలా మిస్ అవుతుంటా. ఇప్పటికీ నువ్వంటే అదే ప్రేమ. కానీ ఒక్కసారి కూడా నిన్ను డైరెక్ట్‌గా కలిసి మాట్లాడలేదు అనే చిన్న బాధ మాత్రం ఉంది. మిస్ యూ... --ఉదయ్ (పేరు మార్చాం), కామారెడ్డి -
పెళ్లి కుదిరింది.. ఫోన్ చేయవద్దు అంది
నా పేరు శ్రీనివాసులు. మాది నెల్లూరు. నేను వృత్తిరీత్యా సివిల్ కాంట్రాక్టర్. ఒక రోజు పని మీద ఒక ఊరికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. తను చాలా అందంగా ఉండేది. తను ఎదుటివారి పట్ల చూపించే గౌరవం చాలా నచ్చింది. అలా అమ్మాయిని చూస్తూ చూస్తూ నేను ప్రేమలో పడ్డాను. వాళ్ళ ఇంటి దగ్గర్లోనే మేము కూడా ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ఇక అప్పటి నుంచి వాళ్లతో పరిచయం పెరిగింది. అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్లడం వాళ్ళతో మాట్లాడడం జరిగేది. ఒక రోజు నేను దైర్యం చేసి తన ఫోన్ నెంబర్ అడిగాను, కానీ తను ఇవ్వలేదు. ఎలాగోలా నెంబర్ తెలుసుకున్నాను. ఇక అప్పటి నుంచి తనతో ప్రతి రోజు మాట్లాడే వాడిని. మా ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది అయినా తను నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. అలా మా ప్రేమ ఆరు నెలల పాటు సంతోషంగా సాగింది. తర్వాత వాళ్ళ బంధువుల అమ్మాయి మా ఇద్దరి గురించి చెడ్డగా ఊరిలో ప్రచారం చేసింది. అయినా కూడా తను నాతో మాట్లాడకుండా ఉండేది కాదు. అలా ఒక రెండు నెలల పాటు చాలా హ్యాపీగా ఉన్నాం. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ తను నాకు ఫోన్ చేయడం మానేసింది. కొన్ని రోజులకు నా ఫోన్ చేసి నాకు పెళ్లి కుదిరింది నాకు ఫోన్ చేయవద్దు అని చెప్పింది. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను ఎక్కడ ఎప్పుడు చూసినా నీ ముఖం పై చిరునవ్వు ఉండాలని కోరుకుంటున్నాను. నిరంతరం నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. ప్రేమతో -- నీ శ్రీనివాస్ -
ఇంట్లో వాళ్లను మోసం చేయలేనంది!
తనని మొదటిసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చూశాను. చూడగానే నచ్చేసింది. రోజు తనని అలాగే చూస్తూ ఉండేవాడిని. తను లాస్ట్ బెంచ్‌లో కూర్చునేది. నేను కూడా అలాగే కుర్చునేవాడిని. 2 సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. ఒకసారి ధైర్యం చేసి మా ఫ్రెండ్‌కు చెప్పి పంపాను. తను ఒకసారి నా వైపు చూసింది. రెండు రోజుల తరువాత పిలిచి నువ్వే కదా రోజు నాకు ఫోన్ చేసేది అని అడిగింది. నేను కాదు అని చెప్పాను. అదే ఫస్ట్ టైమ్ నేను తనతో మాట్లాడింది. ఆ తరువాత 2,3 సార్లు మాట్లాడాను. డిగ్రీ చివరి ఎగ్జామ్స్ రోజు గుడిలో నాతో మాట్లాడతాను అని తన ఫ్రెండ్ ద్వారా నాకు చెప్పించింది. ఆ రోజు వెళ్లే సరికి తను వెళ్లి పోయింది. తననే అదే చివరిసారి చూశాను. ఆ తరువాత నేను బస్టాండ్‌లో ఉన్నప్పుడు తను కోచింగ్‌కు వెళుతూ ఒకసారి కనిపించింది. తను నన్ను చూసి నవ్వింది. రెండు రోజుల తరువాత తనకి కాల్ చేశాను. తన నంబర్ నా దగ్గర ఉన్న నేను ఎప్పుడూ తనకి కాల్ చేయలేదు. నేను ఫోన్ చేసినప్పుడు తను నాతో చాలా మంచిగా మాట్లాడింది. అలా ఆరోజు నుంచి రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. మూడు సంవత్సరాలు ఫోన్లో మాట్లాడుకున్నాం. కానీ ఎప్పుడు తనని కలవలేదు. నేను తనని చాలా నిజాయితీగా ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని ఆమె నమ్మింది. కొన్ని రోజుల తరువాత పెళ్లి విషయం వచ్చింది. ఆమె వాళ్ల ఫ్యామిలీ చూపించిన అబ్బాయినే చేసుకుంటాను, ఇంట్లో వాళ్లని మోసం చేయలేను అని చెప్పింది. నేను కూడా ఆలోచించాను. తన ఇష్టానికి నేను కూడా ఓకే చెప్పాను. ఫ్రెండ్స్ లాగా ఉందామని డిసైడ్ అయ్యాం. తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నన్ను మిస్ అవుతున్నాను అని చెప్పింది. నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ నువ్వంటే ఇష్టమే. ఇప్పటి వరకు నీ పక్కన కూర్చోని మాట్లాడలేకపోయాను అని ఒక బాధ. మిస్ యు. పేరు చెప్పలేదు(కామారెడ్డి). -
అమ్మ వద్దంది. అమ్మాయిని వదులుకున్నా..
నా పేరు మహేశ్. ఓ కోచింగ్ సెంటర్లో చూశాను అమృతని (పేరు మార్చాం) చూడటానికి చాలా యావరేజ్‌గా ఉంది కానీ నాకెందుకో చాలా బాగా నచ్చింది. నాకు అప్పటికే చాలా ప్రపోజల్స్ వచ్చాయి. మా కోచింగ్ సెంటర్లో కూడా కొంతమంది అమ్మాయిలు నన్ను ఇష్టపడేవాళ్లు అలా అందరినీ సిస్టర్ అని పిలిచేవాడ్ని, ఒక్క అమృతని తప్పా. అప్పుడే అర్థమైంది నా ఫ్రెండ్స్‌కి. అలా నన్ను బాగా ఆటపట్టించేవాళ్లు. తను కూడా నాతో బాగా మాట్లాడేది. కోచింగ్ అయ్యాక ఫోన్ నెంబర్స్ తెలుసుకొని మాట్లాడుకునేవాళ్లం. ఒకరోజు తనే మెసేజ్ చేసి తన లవ్ ప్రపోజ్ చేసింది. ఇక నా ఆనందానికి అవధుల్లేవు. అలా మొదలైన మా ప్రేమ ఐదు సంవత్సరాలు చాలా సాఫీగా సాగింది. మా విషయం ఒకరోజు వాళ్లింట్లో తెలిసి అమృతని బాగా కొట్టారు. నాకు కాల్ చేసి వాళ్లింటికి పిలిచారు. చాలా టెన్షన్‌తో వెళ్లాను ఏం జరుగుతుందో అని. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అనుకుంటే పెళ్లి చేసుకోండి మీ ఇంట్లో ఒప్పించి రా అన్నారు వాళ్ల నాన్న. చాలా సంతోషంగా ఇంటికి వెళ్లా ఇంక నా సైడ్ నుంచి ఒప్పిస్తే సరి అని. కానీ మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఒకవేళ కాదని పెళ్లిచేసుకుంటే తన చనిపోతానంది. ఇంక నాకు ధైర్యం చాలలేదు. ఇంట్లో జరిగిన విషయాన్నంతా వాళ్ల నాన్నకి కాల్ చేసి చెప్పాను. ఆయన చాలా సింపుల్‌గా ఇక నుంచి మా అమ్మాయిని కలుసుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నన్ను అమృతని వార్న్ చేశారు. కట్ చేస్తే..తనకి పెళ్లి జరిగింది. మా అమ్మ తర్వాత అమ్మగా అనుకున్న అమృత నాకు దూరమైంది. తను నాకు దూరమై 18 నెలలు అవుతుంది ఈ మద్యకాలంలో నేనెంత క్షోభను అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. అమ్మప్రేమను వదులుకోలేక అమ్మాయి ప్రేమను చంపుకోవాల్సి వచ్చింది. అప్పడు తెలియలేదు ఇది నన్ను ఇంత దహిస్తూ ఉంటుందని. చివరగా..నువ్వు ఎక్కుడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా --మహేశ్, కాకినాడ.