ప్రతీకాత్మక చిత్రం
అది 2005! నేను 8వ తరగతిలోకి అడుగు పెట్టాను. మా క్లాస్‌లో కొత్తగా ఓ అమ్మాయి చేరింది. తను ఆగష్టు 15న పాట పాడింది. మొదటి సారిగా తను పాడుతుంటే నేను వినడం. ఎంత స్వీట్ వాయిసో తనది! మళ్లీ మళ్లీ వినాలనిపించింది. రెండు జడలు వేసుకుని చాలా క్యూట్‌గా ఉండేది. స్కూల్ వెనకే వాళ్ల ఇల్లు. రోజు స్కూల్ అయిన వెంటనే తనని ఫాలో చేసేవాడిని. సెలవులు అయితే చాలు సైకిల్ వేసుకుని వాళ్ల వీధిలో తిరగటమే నా పని. నా ప్రేమ సంగతి ఆమెకు చెప్పాలంటే భయం. టెన్త్‌లో తను జాయిన్ అయిన ట్యూషన్‌లోనే నేనూ జాయిన్ అయ్యా. ఎప్పుడూ ఆమెను అలా చుస్తూ ఉండి పోయే వాడ్ని తప్ప ధైర్యం చేసి చెప్పలేకపోయా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను తనకి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ప్రేమించే వయసు కాదని చెప్పి పంపింది.
తన కళ్లను చూసినప్పుడల్లా తను నన్నే చూస్తోందని అనుకునే వాడ్ని. అలా టెన్త్ కూడా అయిపోయింది. తరువాత మేము వేరే వేరే కాలేజీలలో చేరటంతో దూరం పెరిగి పోయింది. కానీ, తను గుర్తుకు రాని రోజు లేదు. ఎప్పుడు తన ధ్యాసే. డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నపుడు తనకు పెళ్లి అయి పోయింది.ఇప్పటికీ అనుకుంటూ ఉంటా‘ ఒకవేళ తనకి చెప్పి ఉంటే నా ప్రేమను అంగీకరించి ఉండేదేమో?’ అని!(ఆ ఊహే బాగుంది లేకుంటే, నేను చెప్పి తను కాదని ఉంటే తట్టుకోలేకపోయేవాడ్ని).
- మణికంఠ
లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment