ప్రతీకాత్మక చిత్రం
2006 నా లైఫ్‌ను మార్చేసిన సంవత్సరం. అవి నేను ఇంటర్ చదువుత్నురోజులు. చాలా అల్లరిగా.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడిని. నేనప్పటివరకు ఏ అమ్మాయినీ లవ్ చేయలేదు. ఓ రోజు లంచ్ బ్రేక్‌లో.. క్లాస్ రూంలో ఓ ఇద్దరు ఫ్రెండ్స్ చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా మీ గోల అని నేను వెళ్లి అడిగాను. వాళ్లు ఒక అమ్మాయికోసం అని చెప్పారు. ‘ఏవర్రా అమ్మాయి’ అని అడిగా. వాళ్లు ఓ పేరు చెప్పారు. ‘ఆ అమ్మాయి నాకు తెలియదు రా!’ అన్నాను. ‘చూపిస్తాము ఆగు’ అన్నారు. అమ్మాయి కోసం వేయిట్ చేస్తున్నాం. అప్పుడు వచ్చింది.. నా లైఫ్‌లోకి ఒక అమ్మాయి. అలా గేట్ వైపు చూశాను.
అప్పుడే సైకిల్ దిగి నడుచుకుంటూ వస్తోంది. ఆమె కళ్లు కారు లైట్లలా ఉన్నాయి. ఆ ఒక్క క్షణంలో నా మనసును దోచేసింది. ఇంకేం ఉంది! నా లైఫ్ పట్టాలు ఎక్కింది. ఇక ప్రతీరోజు తననే చూస్తూ, తను నవ్వితే నాలో తెలియని ఆనందం. ఫైనల్‌గా క్లాస్‌లోని కొందరు వెర్రి వాళ్లు నేనా అమ్మాయికి లైన్ వేస్తున్నానని చెప్పేశారు. అదేంటో నా లక్! తను ఆ రోజునుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ నావైపు చూస్తూ ఉండేది. అలా ఓ సంవత్సరం గడిచిపోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. నా మనసులోని మాట తనకు చెప్పలేకపోయా. తనే ధైర్యం చేసి ‘నన్ను లవ్ చేస్తున్నావా’ అని అడిగింది.
కానీ, నేను పూర్ ఫ్యామిలీ, తనకి ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేకపోయా. కానీ, తను చాలా సార్లు నా ప్రేమను తెలిపే చాన్స్‌లు ఇచ్చింది. నేనే ఉపయోగించుకోలేకపోయా. ఇంటర్ అయిపోయింది. తను డిగ్రీ, నేను బీటెక్ జాయిన్ అయ్యాను. అప్పటికీ నేను వాళ్ల కాలేజీకి వెళ్లే వాడిని తనను చూడటానికి. అయినా నా ప్రేమను తనకు చెప్పలేకపోయా. నా లైఫ్‌లో మర్చిపోలేని అమ్మాయి తను. 2012లో బీటెక్ అయిపోయింది. బెంగళూరులో జాబ్‌లో జాయిన్ అయ్యాను. తర్వాత తెలిసింది! తనకు పెళ్లి అయిపోయిందని. ఇప్పటికీ తను నా మనసులో ఉంది.
- సందీప్, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment