గ్రూప్‌–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ | Nalla Lavanya Reddy Talent Group 1 Result, Know About Her Inside | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 పరీక్షలో నల్ల లావణ్యరెడ్డి ప్రతిభ

Published Tue, Mar 11 2025 9:02 AM | Last Updated on Tue, Mar 11 2025 9:56 AM

Nalla Lavanya Reddy Talent Group 1Result

మంచిర్యాల: గ్రూప్‌–1 ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. ఇందులో పలువురుయువకులు ప్రతిభ కనబర్చారు. కొందరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. పరీక్ష రాసి ఉత్తమ మార్కులు సాధించారు. తాంసి మండలంలోని బండల్‌నాగాపూర్‌కు చెందిన సురుకుంటి సచిన్‌.. 454.5 మార్కులు సాధించాడు. ఈయన వార్డు ఆఫీసర్‌గా ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు.

 భీంపూర్‌ మండలం కరంజి(టి) గ్రామానికి చెందిన ఎల్టి కార్తీక్‌రెడ్డి..443 మార్కులు సాధించాడు. బోథ్‌ మండలం ధనోర గ్రామానికి చెందిన నల్ల లావణ్యరెడ్డి.. తాంసి మండలం హస్నాపూర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌–1 పరీక్ష రాయగా 441.5 మార్కులు సాధించింది. తాంసికి చెందిన జానకొండ అశోక్‌ పంచాయతీ కార్యదర్శిగా జైనథ్‌ మండలం సుందరగిరిలో విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్‌–1 పరీక్ష రాశాడు. 398.50 మార్కులు సాధించాడు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement