ప్రేమ ఎప్పుడు , ఎక్కడ , ఎలా మొదలవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఒకసారి ప్రేమ లో పడితే ఇంకా ఆ ప్రపంచమే వేరు. ఈ రోజుల్లో కొందరు మాత్రమే నిజంగా ప్రేమిస్తున్నరు, మరికొందరు అవసరానికి వాడుకుని వదిలేస్తున్నారు. అయితే మనల్ని మనస్పూర్తిగా ప్రేమించే వాళ్ళు మన పక్కన ఉంటే చాలు మనకి తెలియకుండానే మనం సంతోషంగా ఉంటాం. మన కళ్ళల్లోకి చూసి మన మనసులో ఏమి ఉందో చెప్పేస్తారు. మన గతంతో సంబంధం లేకుండా ప్రస్తుతం , భవిష్యత్తులో మనల్ని ఎలా సంతోషంగా చూసుకోవాలి అనే ఆలోచిస్తారు. నేను నా జీవితంలో ఈ రెండు ప్రేమలని ( అవసరం కోసం ప్రేమిస్తున్నట్టు నటించే ప్రేమని, మన కోసం, మన సంతోషం కోసం మనల్ని మనల్ని గా ప్రేమించే ప్రేమని ) అనుభవించాను . నేను నా జీవితంలో ఎదుర్కొన్న ప్రేమ అనే భూటపు నాటకాన్ని , ఆ తర్వాత నేను అనుభవించిన సంఘటనలు , ఎదుర్కొన్న పరిణామాలను నేను మీతో పంచుకొబోతున్నాను.
నా పేరు ప్రజ్ఞ. నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. నా తల్లిదండ్రులు నేను ఏది అడిగినా కాదు, లేదు అనకుండా అన్ని ఇచ్చి నన్ను సంతోషంగా చూసుకునేవారు. అలాంటి తల్లిదండ్రులకి నేను ఏమి ఇవ్వగలను మంచిగా చదువుకుని ఒక గొప్ప ఉద్యోగం చేసి వారిని సంతోషంగా చూసుకోవడమే నేను వాళ్ళకి ఇచ్చే గౌరవం. అలా అని నేను ప్రతి రోజూ కళాశాలకు వెళ్తూ చదువుకుంటూ , ఇంటికి వచ్చాక ప్రతి రోజూ రాత్రి నా తల్లిదండ్రులతో కాసేపు సమయం గడిపి నా రోజూ పూర్తి చేసుకునేదానిని. ఇలా సాఫీగా సాగుతున్న నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన నా జీవితంలో కలలో కూడా ఊహంచని మలుపు తీసుకొచ్చింది.
నేను ప్రతి రోజులానే కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నన్ను నా చిన్ననాటి మిత్రుడు కలిశాడు. తన పేరు రేవంత్. చాలా సంత్సరాల తర్వాత కలవడం వల్ల నేను తనని మొదట్లో గుర్తు పట్టాలేకపోయా. కానీ మా పాత రోజులని గుర్తు చెయ్యడం వల్ల తనని గుర్తు పట్టా. ఇక కాసేపు తనతో అలానే మాట్లాడి ఇంటికి ఆలస్యం అవుతుందని నేను వచ్చేశా. మళ్లీ తనని కలుస్తా అని కూడా అనుకోలేదు. కాని ప్రతి రోజూ నా కళాశాల అయిపోగానే నన్ను కలవడం మొదలు పెట్టాడు. నేను నా చిన్ననాటి మిత్రుడే కదా అని కలిసిన ప్రతి సారి మాట్లాడేదాన్ని. కాని ఒకరోజు తను అలా ప్రతి రోజు కలవడం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు. అది ఏంటి అంటే......తను నన్ను ప్రేమిస్తున్నాడు అని....ఈ విషయాన్ని నాకు కొన్ని రోజుల తరువాత అది కూడా ఇలా ప్రతి రోజూ మాట్లాడడం సరియైనది కాదు అని నేను మాట్లాడడం మానేస్తే చెప్పాడు.
తనకి చిన్నతనం నుండే నేను అంటే ఇష్టం అని, అప్పుడు ప్రేమ అంటే ఏంటో తెలియని వయస్సు అని , తీరా తెలిసే సరికి నేను ఎక్కడ ఉంటున్నానో తెలియక తన ప్రేమని తనలోనే దాచుకుని నా కోసం వెతికితే నేను ఆ కళాశాలలో చదువుతున్నాను అని తెలిసి నాకోసం ఆ కళాశాలకు రావడం ప్రారంభించాను అని మొత్తం చెప్పేశాడు. తను అలా చెప్పేసరికి నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే నాకు కొంత సమయం కావాలి అని ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళాక మొత్తం అదే ఆలోచనతో ఉండిపోయాను.నేను బాగా ఆలోచించాను. చిన్నతనం నుండి నన్నే ప్రేమిస్తున్నాడు. మా ఇద్దరి మధ్య దూరం పెరిగినా, నేను ఎక్కడ ఉంటానో తెలియకున్నా, మళ్లీ కలుస్తానో లేనో కూడా తెలియకున్నా, నన్నే ప్రేమించాడు. నన్ను తప్ప ఇంకే అమ్మాయి వెంట పడలేదు, ఏ అమ్మాయి నీ ప్రేమించలేదు. ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు ఎవరు ఉన్నారు అని, తనపై నాకు ఇష్టం పెరిగింది. కొన్ని రోజులకు ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారి మేము ఇద్దరం సంతోషంగా పార్కులకి , సినిమాలకి , షికార్లకు తిరిగాం. నా తల్లదండ్రులు నేను అడిగింది ఏదైనా ఇస్తారు అలాగే రేవంత్ తో కూడా నా పెళ్లి చేస్తారు అనే నమ్మకంతో అన్ని తిరిగాం.
ప్రతి రోజు లానే ఆ రోజు కూడా నా తల్లిదండ్రులలో రాత్రి మాట్లాడుతూ... రేవంత్ విషయం చెప్పేశాను. వాళ్ళు ఒప్పుకోలేదు కదా.. వెంటనే వాళ్ళు నాకు వేరే సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఇక నేను వెంటనే తన దగ్గరికి వెళ్లి జరిగింది అంతా చెప్పి , ఇద్దరి ఇళ్ళల్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం అని అడిగాను. దానికి రేవంత్ ఒకేసారిగా గట్టిగా నవ్వి పెళ్లా...?? నువ్వు ఏమి మాట్లాడుతున్నావు ??? నేను నా అవసరం కోసం ప్రేమించాను అని చెప్పాడు. నా అవసరం తీరింది, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం నాకు లేదు ఇక నువ్వు నాకు వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేను ఎంత వేడుకున్నా వినకుండా వెళ్ళిపోయాడు. తను నా నుండి కోరుకుంది నా అందం మాత్రమే. నా ప్రేమ కాదు అని నాకు అప్పుడు తెలిసింది. తను చేసిన ఆ మోసాన్ని నేను తట్టుకోలేకపోయా... చనిపోదాం అని నిర్ణయించుకుని ఆ ప్రయత్నం కూడా చేశాను. కాని నా తల్లదండ్రులు నన్ను కాపాడారు. ఇలా చావడం కోసమేనా మేము నిన్ను ఇంత కష్ట పడి పెంచి చదివించింది అని అన్నారు. తను ఏలాంటి వాడో తెలియడం కోసమే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు నటించాం. ఇప్పటికీ అయినా నీకు తను ఎలాంటి వాడో తెలిసింది కదా...!! ఇకపై నువ్వు తనని మర్చిపోయి మంచిగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలి అని నన్ను ప్రోత్సహించారు.
వారి ప్రోత్సాహంతో , రేవంత్ పై ఉన్న కసితో పీ.జీ పూర్తి చేసుకుని ఒక మంచి కంపెనీ లో ఉద్యోగం లో చేరాను. అనుకున్నట్టుగానే నా తల్లిదండ్రులను సంతోషంగా చూసుకున్నాను. కాని ఎక్కడో ఒక లోటు , ఒక బాధ మనస్పూర్తిగా ప్రేమించినందుకు ఇంత మోసమా అని....నా బాధని నా తల్లిదండ్రులు అర్థం చేసుకుని నాకు ఆ బాధని, ఆ లోటుని తీర్చాలని ఒక మంచి వ్యక్తిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. విచిత్రం ఏమిటంటే నన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తికి నా గతం అంతా తెలుసు...నా గురించి నా గతం గురించి తెలుసుకుని మనస్పూర్తిగా నన్ను నన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నేను అనుకున్నావన్ని నాతో చేయిస్తున్నాడు. నేను కొంచెం బాధ పడ్డాకాని నా కళ్ళలోకి చూసి నా బాధని అర్థం చేసుకుని నాకు ఆ బాధ లేకుండా చేస్తాడు. తనతో ఉంటే నాకు ఇంకా వేరే ప్రపంచమే గుర్తురాకుండా చూసుకుంటున్నాడు. తన ప్రేమ ఎలా ఉంటుంది అంటే "అబ్బా..!!! ఒక మనిషిని ప్రేమిస్తే ఇంతలా ప్రేమిస్తారా ....???" అని అనిపించేలా ఉంటది..తన ప్రేమ నాకు రేవంత్ నీ తను చేసిన మోసాన్ని కూడా మర్చిపోయేలా చేసింది.
ఇలా నా జీవితంలో ఒకరితో ప్రేమలో మోసపోయి, జీవితాంతం తోడుండి సంతోషంగా చూసుకుని ప్రేమని పంచే మరొకరిని పెళ్ళిచేసుకున్నాను.మన జీవితంలో ఒకరిని ప్రేమించి మోసపోతే మన జీవితం అక్కడికే అయిపోయినట్టు కాదు. మనల్ని ప్రేమించే మన తల్లిదండ్రులు, మన గురించి మన గతం గురించి తెలుసుకుని మనకి మంచి భవిష్యత్తునీ ఇచ్చి మనల్ని మనలా ప్రేమించే వారు తప్పకుండా వస్తారు. "ప్రేమిస్తున్నాను అనే మాటలో ప్రేమ ఇవ్వడం మాత్రమే కాదు ,, మనం ప్రేమించిన వారికి మంచి జీవితాన్ని , సంతోషాన్ని కూడా ఇవ్వాలి. ఇది నా కథ ......
నా పేరు ప్రజ్ఞ
( ప్రజ్ఞ శ్రీనివాస్ )
Comments
Please login to add a commentAdd a comment