ప్రతీకాత్మక చిత్రం
వాలెంటైన్స్ వీక్‌లోని ఏడవ రోజు! వాలెంటైన్స్ డే ముందు రోజు ‘కిస్ డే’.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమ జంటలు మధురమైన ముద్దుతో ప్రేమికులరోజుకు స్వాగతం పలుకుతాయి. ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పద్దతుల్లో ముద్దు పెట్టుకోవటం కూడా ఒకటి. జంటల మధ్య మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటానికన్నట్లు ప్రకృతి సృష్టించిన అద్భుతం ఈ ముద్దు. ముద్దనగానే మూతి ముడుచుకునేవాళ్లు లేకపోలేదు. ముద్దు కేవలం శృంగార భావమే కాదు! ఓ ఆరోగ్య సూత్రం కూడా.
ముద్దుతో ఆరోగ్యం..
1) ముద్దుతో శరీరంలోని రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ‘జర్నల్ మెడికల్ హైపోథెసిస్’ పరిశోధనల్లో తేలింది.
2) ముద్దు పెట్టుకోవటం ద్వారా నిమిషానికి 2నుంచి 6 క్యాలరీలు ఖర్చవుతాయి.
3) గాఢమైన ముద్దుతో ముఖ కండరాలు దృఢంగా తయారవుతాయి.
4) ముద్దు పెట్టుకోవటం ద్వారా శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై మనకు ప్రశాంతతను కలుగజేస్తాయి.
5) ముద్దు జంట మధ్య బంధాన్ని బలంగా ఉంచేలా చేస్తుంది.
6) ముద్దు పెట్టుకోవటం ద్వారా పలు రకాల దంత సమస్యలు దూరమవుతాయి.
ముద్దుల్లో రకాలు
1) నుదటిపై ముద్దు : మన కిష్టమైన వ్యక్తులను నుదటి పెట్టుకోవటం వారిపై మనకున్న ప్రేమ, అడ్మిరేషన్‌కు గుర్తు.
2) చేతులపై ముద్దు : చేతులపై మద్దు పెట్టుకోవటం గౌరవానికి, శూరత్వానికి ప్రతీక.
3) ఎస్కిమో కిస్ : ఒకరి ముక్కులను ఒకరు రాసుకోవటాన్ని ఎస్కిమో కిస్ అంటారు. సాధారణంగా పసి పిల్లల తల్లులు ఎస్కిమో కిస్ ద్వారా తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు.
4) ఫ్రెంచ్ కిస్ : ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచూర్యం పొందిన ముద్దు ఇది. మోస్ట్ రొమాంటిక్ కిస్ అని కూడా చెప్పొచ్చు. నాలుకలతో ముద్దుపెట్టుకోవటం దీని ప్రత్యేకత
5) స్పైడర్ మాన్ కిస్ : స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో గోడ మీదనుంచి కిందకు వేలాడుతూ హీరోయిన్‌ను మద్దు పెట్టుకుంటాడు. అప్పటినుంచి ఈ ముద్దు ప్రాచూర్యం పొందింది.
Comments
Please login to add a commentAdd a comment