Kiss Day
-
‘కిస్ డే’ ఎలా పుట్టిందో.. ప్రాధాన్యత ఏంటో తెలుసా?
వాలెంటైన్ వీక్‌లో ప్రేమికుల రోజుకు ముందుగా వచ్చే రోజును ‘కిస్ డే’ అని అంటారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రేమికులు పరస్పరం ముద్దులు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటారు. వాలెంటైన్ వీక్‌లో ఫిబ్రవరి 13న ‘కిస్ డే’గా సెలబ్రేట్ చేస్తారు. ప్రేమించిన వారికి ముద్దు పెట్టి తమ ప్రేమను వారి ఎదుట వ్యక్తం చేస్తారు. ఇంతకీ ఈ వాలెంటైన్ వీక్‌లోకి ‘కిస్ డే’ ఎలా వచ్చింది? దీని ప్రాధాన్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమికుల వారోత్సవంలో ఈ వారమంతా కలిసి సమయాన్ని వెచ్చించేందుకు ప్రేమికులంతా ప్లాన్ చేసుకుంటారు. తమకు ఇష్టమైర రీతిలో గడిపేందుకు ఈ వారాన్ని ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే వాలంటైన్ వీక్‌లో వచ్చే ‘కిస్ డే’ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ, దీని చరిత్రకు సంబంధించిన వివరాలు చాలామందికి తెలియదు. నిజానికి ‘కిస్ డే’ అనేది ప్రేమ జంటల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. జంటల మధ్యనున్న రిలేషన్‌ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. చాలామంది ప్రేమికులు ప్రేమలో తమ కొత్త ప్రయాణానికి ముద్దుతో శ్రీకారం చుడతారు. ‘కిస్ డే’.. వాలెంటైన్స్ డేని మరింత రొమాంటిక్‌గా మారుస్తుంది. ప్రేమికులు తమలోని ప్రేమ, ఆప్యాయతలను వ్యక్తపరచడానికి ఇదొక అర్థవంతమైన మార్గమని చెబుతుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఉండే ముద్దులో పరస్పర ఆప్యాయత తొణికిసలాడుతుంది. ఈ కిస్ డే అనేది 19వ శతాబ్ధం నాటి విక్టోరియన్ శకంలో అత్యంత ప్రజాదరణ పొందిందని చెబుతుంటారు. ఆ సమయంలో బహిరంగంగా ముద్దు పెట్టుకోవడాన్ని తప్పుగా చూసేవారట. అందుకే కిస్డేని సీక్రెట్‌గా చేసుకునేవారని చెబుతారు. ప్రపంచంలోని వివిధ దేశాలలో కిస్ డేను జరుపుకుంటారు. తమ సన్నిహితులపై తమకు ఉండే అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఈ రోజును సద్వినియోగం చేసుకుంటారు. కొన్ని దేశాల్లో ప్రేమికులు అక్కడ నిర్వహించే రొమాంటిక్ ఈవెంట్లలో పాల్గొని ముద్దులు పెట్టుకుంటారు. ఇళ్లలోనూ దీనిని ఘనంగా సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. ముద్దు అనేది ప్రేమ, అభిరుచితో పాటు ఓదార్పు, ఆనందంతో సహా పలు భావాలను వ్యక్త పరుస్తుంది. నిజానికి ముద్దు అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుతుంది. వారి సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తుంది. మాట కన్నా ముద్దుతో ప్రేమను సంపూర్ణంగా వ్యక్తం చేయవచ్చని చాలామంది చెబుతుంటారు. కిస్ డే సందర్భంగా ప్రేమికులు తమ ప్రైవేట్ క్షణాలను ఆనందంగా గడుపుతారు. చాక్లెట్లు, పూలు లేదా ప్రేమ లేఖలు ఇచ్చి, ఈ డేని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే కిస్ డే అనేది పాశ్చాత్య పోకడలు కలిగిన రోజు కావడంతో భారత్‌లో దీనికి అంత ప్రాధాన్యత లేదు. అందుకే ప్రేమికులు ఈ రోజును ప్రైవేట్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. -
ఫిబ్రవరి 14 మాత్రమే కాదు.. ప్రతి నెల 14 వారికి ప్రేమికుల రోజే! ఎక్కడంటే?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు 'ఫిబ్రవరి 14'వ తేదీనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో ఎంతో ప్రత్యేకం. నిజమైన ప్రేమకు గుర్తుగా దీన్ని ప్రేమికుల రోజుగా ఏటా జరుపుకొంటారు. అయితే ప్రపంచం మొత్తం ఒక్కరోజే వాలెంటైన్స్ డేను జరుపుకొంటే కొరియాలోని యువత మాత్రం ప్రతి నెల 14వ తేదీని ప్రేమికుల రోజుగానే జరుపుకొంటారు. ఇలా మొత్తం ఏడాదిలో 12 రోజులు తమ ప్రియమైన వారికి కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. మరి ఆ 12 రోజుల ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం... డైరీ డే (జనవరి 14) దక్షిణ కొరియాలో జనవరి 14ను 'డైరీ డే'గా జరుపుకొంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు, స్నేహితులు, ఈరోజున కొత్త డైరీలను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. కొత్త ఏడాది తర్వాత డైరీ డే రావడంతో వ్యాపారులు కూడా ఆకర్షణీయంగా వీటిని రూపొందించి విక్రయిస్తారు. మరొకొందరు ఈ రోజును 'క్యాండిల్ డే'గా జరుపుకొంటారు. అలంకరించిన క్యాండిల్స్‌ను కానుకలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ప్రపంచంలోని అన్ని దేశాల్లాగే ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకొంటారు కొరియా యువత. అయితే వీళ్ల ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు అమ్మాయిలు మాత్రమే అబ్బాయిలకు చాక్లెట్లను కానుకగా ఇస్తుంటారు. అబ్బాయిలు రిటర్న్ గిఫ్ట్‌గా ఏమీ ఇవ్వకూడదు. ఇది వీళ్ల సాంప్రదాయంగా కొనసాగుతోంది. అందుకే కొరియా వ్యాపారులు ఈరోజు రకరకాల చాక్లెట్లను ప్రదర్శిస్తూ యువతను ఆకర్షిస్తుంటారు. వైట్ డే (మార్చి 14) వాలెంటైన్స్ డే తర్వాత వచ్చే 'వైట్ డే' కొరియాలో చాలా స్పెషల్. ప్రేమికుల రోజు తమ ప్రేయసి నుంచి చాక్లెట్లు కానుకగా అందుకున్న అబ్బాయిలు.. వైట్ డే రోజు వాళ్లకు రిటర్న్ గిఫ్టులు ఇస్తారు. తెల్లరంగు చాక్లెట్లనే ఇవ్వడం వల్ల ఈ రోజుకు వైట్ డే అని పేరు పెట్టారు. అయితే ఈ మధ్య కాలంలో తెల్లరంగుతో పాటు నల్లరంగు చాక్లెట్లను కూడా రిటర్న్ గిఫ్టులుగా ఇవ్వడం అలవాటైంది. అయితే అమ్మాయిలు వాలెంటైన్స్ డే రోజు ఒక్క చాక్లెట్ గిఫ్ట్‌గా ఇస్తే.. అబ్బాయిలు మాత్రం రిటర్న్‌గా మూడు గిఫ్టులు ఇస్తారు. వైట్ చాక్లెట్‌తో పాటు క్యాండీస్, లాలీపప్లను కలిపి ఇస్తుంటారు. బ్లాక్ డే (ఏప్రిల్ 14) వాలెంటైన్స్ డే, వైట్ డే రోజున ఎలాంటి కానుకలు రాని యువత బ్లాక్ డేను జరపుకొంటారు. సింపుల్‌గా చెప్పాలంటే ఇది సింగిల్స్ డే. తమకు ప్రేమ ప్రపోజల్ రాని యువతీయువకులు ఈ రోజు కలిసి బ్లాక్ నూడుల్స్ తింటారు. సింగిల్స్ మీటింగ్‌గా చెప్పుకునే బ్లాక్ డే రోజున తమను ప్రేమించేవారు లేరని యువత కాస్త ఒత్తిడికి గురవుతారు. ఎల్లో డే (మే 14) ఈ రోజున ప్రేమికులు, దంపతులు పుసుపు రంగు పూలను ఇచ్చిపుచ్చుకుంటారు. తమ ప్రియమైన వారితో కలిసి రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేస్తారు. ఈ రోజు ఎక్కువ సమయం వారికి కేటాయిస్తారు. కిస్ డే (జూన్ 14) కొరియన్ల ఫేవరెట్ డే ఇది. తమ గాఢమైన ప్రేమను వ్యక్తపరిచేందుకు ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటారు. జంటలకు ఇది బెస్ట్ రొమాంటిక్ డే అని చెప్పుకుంటారు. సిల్వర్ డే (జులై 14) ఈ రోజున ప్రేమికులు ఉంగరాలు మార్చుకుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే నిశ్చితార్థంలా అనమాట. జీవితాంతం కలిసి ఉంటామని ఇద్దరు ప్రామిస్ చేసుకుని రింగ్స్ మార్చుకుంటారు. గ్రీన్ డే (ఆగస్టు 15) ఈ రోజున ప్రేమికులు, దంపతులు అందమైన పశ్చికబయళ్లు ఉంటే ప్రదేశాలను సందర్శిస్తుంటారు. అక్కడే భోజనం చేస్తుంటారు. వీలైతే ఆకుపచ్చరంగు దుస్తులు ధరిస్తారు. ఈ రోజు ఫ్యామిలీస్ ఎక్కువగా పార్కులకు వెళ్లి ఆనందంగా గడుపుతారు. ఫొటో డే (సెప్టెంబర్ 14) ఈరోజున ప్రేమికులు, స్నేహితులు, ఫ్యామిలీస్ ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. సెల్ఫీలతో పాటు స్టూడియోలకు వెళ్లి ఫొటో షూట్లు నిర్వహిస్తారు. తమ జీవితంలో ఈ రోజు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చూసుకుంటారు. వైన్ డే (అక్టోబర్ 14) ఇది వైన్ ప్రియులకు ఇష్టమైన రోజు. ప్రేమికులు, దంపతులు వైన్ డే రోజున ప్రత్యేక పార్టీలు చేసుకుంటారు. స్నేహితులు, కుటంబసభ్యులతో కలిసి బార్లకు, పార్టీలకు వెళ్లి ఇష్టమైన వైన్ తాగుతారు. మూవీ డే (నవంబర్ 14) కొరియన్లకు ఇది కూడా చాలా ఇష్టమైన రోజు. తమ ప్రియమైన వారిని సినిమా హాళ్లలో కలుస్తారు. కొత్త సినిమాలు చూస్తారు. మరికొందరేమో ఇళ్లలోనే డీవీడీలు అద్దెకు తెచ్చుకుని పాప్‌కార్న్ తింటూ మూవీస్ చూసి ఎంజాయ్ చేస్తారు. హగ్ డే (డిసెంబర్ 14) ఈ రోజున కొరియన్ ప్రజలు తమకు ఇష్టమైన వారిని ఆలింగనం చేసుకుంటారు. ప్రేమికులు ఎక్కడున్నా ఈరోజు కలుసుకొని హగ్ ఇస్తుంటారు. సింగిల్స్ అయితే తమ ఇంట్లో వాళ్లని, స్నేహితులను ఆలింగనం చేసుకుంటారు. ఏడాదికి 12 రోజులు ఇలా ప్రత్యేకంగా జరుపుకొన్నా.. వాలెంటైన్స్ డే, వైట్ డే రోజుల్లో మాత్రం సందడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు రోజులు వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి. చదవండి: ప్రేమ కానుక.. మనసు దోచెనిక.. ప్రేమికుల రోజు ఇచ్చే గిఫ్ట్‌లు ఇవే..! -
కిస్ డే స్పెషల్.. ‘ముద్దు’పాటలు మీకోసం
ముద్దు కు ఓ రోజు ఉంది. ఆ రోజు ఈ రోజే( ఫిబ్రవరి 13). వాలెంటైన్స్ డేకి ఒక రోజు ముందు ప్రపంచ వ్యాప్తంగా కిస్ డే జరుపుకుంటారు.ఈ రోజు ప్రేమికులు ముద్దుల ప్రపంచంలో మునిగితేలిపోతారు. కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. ఒక్క కిస్‌తో మనసులో ఉన్న ప్రేమనంతా వ్యక్తం చేయ్యొచ్చు. ఈ విషయం తెలుగు గేయ రచయితలకు బాగా తెలుసు. అందుకే తెలుగులో ‘ముద్దు’పై ఎన్నో పాటలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. కిస్‌డే సందర్భంగా తెలుగు ‘ముద్దు’పాటల్లో కొన్ని మీకోసం. -
కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు..
కిస్.. అంటే ముద్దు పెట్టుకోవడం అని సింపుల్‌గా తీసిపారేయడానికి లేదు. ముద్దువల్ల వ్యక్తులు పొందే అనుభూతి అనిర్వచనీయం. ఇది మనసుకు దగ్గరైన వారితో మాత్రమే పంచుకునే ఒక తియ్యని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో లవర్స్ ఈరోజు (ఫిబ్రవరి 13)ను కిస్‌డే గా సెలబ్రెట్ చేసుకుంటారు. అయితే ఈ కిస్‌లో అనిర్వచనీయ భావాలతోపాటు, మనసును ఉత్సాహపరిచే రొమాంటిక్ ఫీలింగ్స్‌లు ఎన్నో ఉంటాయి. అవేంటో చదివేయండి... ప్రేమికులు తమ మనసులోని ప్రేమను, వారి లవర్‌కి కొంత రొమాంటిక్‌గా వ్యక్తపరచుకోవాలన్నప్పుడు కిస్ చేస్తారు. ఈ చర్యతో వారే తమ ప్రపంచమని మనసులో ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇలా చేయడం వలన ప్రేమించిన వారి పట్ల తమకున్న ప్రేమ, నమ్మకం, పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ప్రేమికులు గాఢంగా చుంబించుకోవడం వలన కొన్ని రకాల రసాయనాలు విడుదలై ఒత్తిడి తగ్గి వారి మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అవుతుందని కొన్ని పరిశోధనల్లో కూడా వెల్లడైంది. కిస్ చేస్తే.. తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గర తీసుకొని నుదుటి పైన కిస్ చేస్తారు. ఈ చర్యతో వారిని ఆశీర్వదిస్తారు. ఒక్కొసారి పిల్లలు తమ వారు కిస్‌చేయడం వలన తామున్నమనే భరోసా ఏర్పడుతుందని అనుకుంటారు. చుంబించుకోవడం అనే చర్య వలన మానసిక ఆనందం కలిగి మాములు కన్నా 5 ఏళ్ల ఆయుర్దాయం పెరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చదవండి: ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! -
అదే మోస్ట్ రొమాంటిక్ కిస్!!
వాలెంటైన్స్ వీక్‌లోని ఏడవ రోజు! వాలెంటైన్స్ డే ముందు రోజు ‘కిస్ డే’.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమ జంటలు మధురమైన ముద్దుతో ప్రేమికులరోజుకు స్వాగతం పలుకుతాయి. ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పద్దతుల్లో ముద్దు పెట్టుకోవటం కూడా ఒకటి. జంటల మధ్య మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటానికన్నట్లు ప్రకృతి సృష్టించిన అద్భుతం ఈ ముద్దు. ముద్దనగానే మూతి ముడుచుకునేవాళ్లు లేకపోలేదు. ముద్దు కేవలం శృంగార భావమే కాదు! ఓ ఆరోగ్య సూత్రం కూడా. ముద్దుతో ఆరోగ్యం.. 1) ముద్దుతో శరీరంలోని రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ‘జర్నల్ మెడికల్ హైపోథెసిస్’ పరిశోధనల్లో తేలింది. 2) ముద్దు పెట్టుకోవటం ద్వారా నిమిషానికి 2నుంచి 6 క్యాలరీలు ఖర్చవుతాయి. 3) గాఢమైన ముద్దుతో ముఖ కండరాలు దృఢంగా తయారవుతాయి. 4) ముద్దు పెట్టుకోవటం ద్వారా శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై మనకు ప్రశాంతతను కలుగజేస్తాయి. 5) ముద్దు జంట మధ్య బంధాన్ని బలంగా ఉంచేలా చేస్తుంది. 6) ముద్దు పెట్టుకోవటం ద్వారా పలు రకాల దంత సమస్యలు దూరమవుతాయి. ముద్దుల్లో రకాలు 1) నుదటిపై ముద్దు : మన కిష్టమైన వ్యక్తులను నుదటి పెట్టుకోవటం వారిపై మనకున్న ప్రేమ, అడ్మిరేషన్కు గుర్తు. 2) చేతులపై ముద్దు : చేతులపై మద్దు పెట్టుకోవటం గౌరవానికి, శూరత్వానికి ప్రతీక. 3) ఎస్కిమో కిస్ : ఒకరి ముక్కులను ఒకరు రాసుకోవటాన్ని ఎస్కిమో కిస్ అంటారు. సాధారణంగా పసి పిల్లల తల్లులు ఎస్కిమో కిస్ ద్వారా తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. 4) ఫ్రెంచ్ కిస్ : ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచూర్యం పొందిన ముద్దు ఇది. మోస్ట్ రొమాంటిక్ కిస్ అని కూడా చెప్పొచ్చు. నాలుకలతో ముద్దుపెట్టుకోవటం దీని ప్రత్యేకత 5) స్పైడర్ మాన్ కిస్ : స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో గోడ మీదనుంచి కిందకు వేలాడుతూ హీరోయిన్ను మద్దు పెట్టుకుంటాడు. అప్పటినుంచి ఈ ముద్దు ప్రాచూర్యం పొందింది. -
వాలెంటైన్స్ వీక్! 8రోజుల ప్రేమ పండుగ!
ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండగే. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్ డే రాకకోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ డే ప్రత్యేక ఆ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. ప్రేమికుల రోజు.. ఫిబ్రవరి 14వ తేదీకి వారం రోజుల ముందు ఫిబ్రవరి 7నుంచే వేడుకలు మొదలవుతాయి. దీన్నే వాలెంటైన్స్ వీక్‌గా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్‌లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లోని ఎనిమిది రోజులల్లో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 1) రోజ్ డే : వాలెంటైన్ వీక్.. రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 7నుంచి 14 వరకు వారం రోజుల పాటు ఈ స్పెషల్డేస్ ఉంటాయి. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. దానితో పాటు గులాబీ పువ్వులు ఉండే మంచి మెసేజ్‌లు ఉన్న గ్రీటింగ్ కార్డులను గిఫ్ట్‌లుగా ఇస్తారు. ‘మనసుకు మాత్రమే తెలిసిన భాషలో.. నా ప్రేమను ఈ గులాబి పువ్వు నీకు తెలియజేస్తుంది’ లాంటి కొటేషన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తాయి. 2) ప్రపోజ్ డే : ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఈరోజున తాము ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎన్ని రోజుల నుంచో ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మీరు కూడా మీకిష్టమైన వారికి మీ మనసులో మాట చెప్పాలనుకంటే ఈ ఏడాది కచ్చితంగా చెప్పేయండి. ఒక మంచి గులాబీతోనో, లేక చేతికి రింగ్ తొడిగో మీ ప్రేమను వ్యక్తపరచండి. 3) చాక్లెట్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ప్రేమ బంధం ఎంతో తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. తాము ప్రేమించిన వారు పక్కన ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. అలాంటి ఆ బంధాన్ని మరింత మధురంగా మలుచుకోవాలంటే చాక్లెట్ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్ షేర్ చేసుకోవాల్సిందే. 4) టెడ్డీ డే : ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని జరుపుకుంటారు. టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి ఎంతో అందంగా మృధువుగా ఉండే టెడ్డీలు ఎంతో ఆకర్షిస్తాయి. అంతే కాకుండా అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో టెడ్డీని ప్రజెంట్ చేయడం ద్వారా మీ అందమైన ప్రేమసికి ఎంతో క్యూట్‌గా మీ ప్రేమను తెలియజేయవచ్చు. 5) ప్రామిస్ డే : ఈరోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికులు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నీకు బాసటగా నిలుస్తాను అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ బంధం మరింత బలపడటానికి మీరు చెప్పే ఒక్క మాట చాలు. అందుకే మీ మనసులో ఉన్న భావాల్ని మీరు ప్రేమించిన వారికి అర్థం అయ్యేలా అందంగా చెప్పండి. ‘ నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికి మర్చిపోను! నిన్ను ఎప్పటికీ వీడిపోను’’ అంటూ మీ ప్రేమను తెలపండి. ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. 6) హగ్ డే : ఈ డే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిళ్లలోకి తీసుకుని మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ భావాలు మాటల్లో వర్ణించలేము. ఆ అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే హగ్డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్ కార్డును బహుమతిగా ఇస్తారు. 7) కిస్ డే : వాలెంటైన్స్ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్ డేగా జరుపుకుంటారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. ఆ బాధలన్నింటిని దూరం చేస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో.. రోజును ప్రారంభిస్తే ఆరోజంతా ఆనందంగానే గడుస్తుంది. 8) వాలంటైన్స్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంతో పాటు ఆరోజంతా వారితో ఆనందంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు. తెలుసుకున్నారుగా వాలెంటైన్ వీక్‌లో ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రత్యేకతలు ఇంకెందుకు ఆలస్యం! ఆరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. -
‘ముద్దు’ మందారం
ముద్దు అంటే..? ఛీ.. ఏమిటా ప్రశ్న అని అనుకుంటున్నారా.? మీరు ఆ ఆలోచనల్లోంచి ముందు బయటకు వచ్చేయండి... ఎందుకంటే ముద్దు అంటే కేవలం శృంగార భావన మాత్రమే కాదు. అప్పుడే బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందుకు పొత్తిళ్లలో అమ్మ ఇచ్చే తొలి కానుక ముద్దు. మీ అబ్బాయి చాలా మంచోడని ఎదుటివారి మెచ్చుకోలు విని నాన్న ఇచ్చే ప్రేమ బహుమతి ముద్దు. గెలుపు తలుపు తట్టినప్పుడు పట్టరాని సంతోషంతో స్నేహితుడు ఉద్వేగంతో ఇచ్చే తొలి కానుక ముద్దు. అందుకే ముద్దు అంటే రెండు బంధాలను కలిపే నులివెచ్చని స్పర్శ. ఆనందాన్ని పంచే లకింత. ఎదుటివారికి ఓ పలకరింత సాక్షి, విశాఖపట్నం : ఒక్కో బంధంలో ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుందీ ముద్దు. తల్లి బిడ్డకు ఇచ్చే ముద్దులో కడుపు తీపి, అన్న.. చెల్లికి ఇచ్చే ముద్దులో అనురాగం.. స్నేహితులు ఇచ్చుకునే ముద్దులో నమ్మకం.. ప్రేమికుడు ఇచ్చే ముద్దులో వలపు విశ్వాసం.. ఇలా ఒక్కో ముద్దు.. ఒక్కో అనుబంధాన్ని.. అనుభూతిని అందిస్తుంది. భావం వేరైనా ముద్దుతో పరవశాన్నే కాదు.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ చుంబనాల సంగతుల్ని ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే సందర్భంగా ముద్దు ముద్దుగా చదువుకుందాం. పక్షులు ముక్కులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి.. పశువులు మూతులు రాసుకుంటూ ముద్దు పెట్టుకుంటాయి. ఏ ప్రాణి ఎలా ముద్దు పెట్టుకున్నా.. ముద్దు ప్రస్తావన మాత్రం తొలిసారి మహాభారతంలోనే వచ్చింది. అంటే.. అధర చుంబనానికి నాంది భారతదేశమే అయినా.. అది విశ్వవ్యాప్తం అవ్వడానికి మాత్రం అలెగ్జాండరే కారణమని చరిత్ర చెబుతోంది. ఏదేమైనా..గుండెల్లో ఘనీభవించిన ప్రేమను.. ధ్రువీకరించుకునే ప్రయత్నమే ముద్దు. నిన్ను ముద్దాడాలంటే మనసంటూ ఉండాలే వెర్రిదానా.. అన్నాడో సినీ కవి. నిజమే మరి.. ముద్దు పెట్టాలంటే మనసు ప్రతిస్పందించాలి. కిస్ అంటే ఇష్టం లేనివారెవ్వరూ లేరు ఈ సమాజంలో పసి పిల్లల ముద్దుల నుంచి బోసి నవ్వుల బామ్మల కిస్ వరకూ అందరికీ ఇష్టమే. సులభమైన మార్గంలో ఎదుటి వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు ఉన్న విశ్వంలోని ఏకైక భాష చుంబనం. ముద్దెందుకు పెట్టుకుంటారు... ఇది చిలిపి ప్రశ్నే అయినా.. సమాధానంలో మాత్రం చాలా భావం దాగి ఉంది. అసలు ఎందుకు చుంబించుకుం టారంటే.. సరదాకని కొందరు, ఆనందానికని ఇంకొందరు, ప్రేమతో అని మరికొందరు.. ఇలా నచ్చినట్లుగా చెబు తా రు. కానీ అసలు దాని వెనుక ఉన్న ప్రేరణ గురిం చి మాత్రం చెప్పలేరు. ఎందుకంటే.. ఎదుటి వ్యక్తిని ముద్దుపెట్టు కోవాలంటే శరీరంలో కొన్ని నరాల్లో ప్రకంపనాలు కలుగుతూ హార్మోనులు ఉత్పత్తై కిస్ చెయ్యాలనే ప్రేరణ కలిగిస్తాయి. పాలిచ్చినప్పుడు కొడుకుని చూసి మురిపెంతో ముద్దు పెట్టేందుకు కలిగే ప్రేరణ, బుల్లిపెదాలపై బోసి నవ్వులు పులుముకొని పలకరించేలా చూసే చిన్నారి బుగ్గల్ని ముద్దు పెట్టాలనే ప్రేరణ.. ఇలా హార్మోనులు మెదడుపై చూపించే ప్రభావమే ముద్దుకు మూలకారణం. ఆనందం పెరుగుతుందా... చుంబించుకుంటే.. అదో పెద్ద రిలీఫ్. ఎందుకంటే శరీరంలోని వివిధ కండరాలు ఒక్కసారిగా వ్యాకోచిస్తాయి. దాంతో శరీరమంతా రిలాక్స్అవుతుంది. అడ్రినల్, పిట్యుటరీ, గొనాడ్.. ఇలా అనేక గ్రంథులు ఇందుకు సహకరిస్తాయి. ఇవన్నీ మనిషిలో ముద్దు ప్రవర్తనను నియంత్రిస్తాయి. ఈ గ్రంథులు స్రవించే హార్మోన్లు రక్తంలోకి ప్రవేశించి అక్కడి నుంచి వివిధ అవయవాలకు వెళ్లి వాటిపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. అందుకే.. ఎదుటి వ్యక్తిని ముద్దు పెట్టిన తర్వాత.. మనసుకు హాయిగా ఉంటుంది. శరీరం అలసటతో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిని ముద్దు పెట్టుకుంటే ఒత్తిడి మాయమవుతుందని వివిధ పరిశోధనలు చెబుతున్నాయి. చుంబనం.. ఓ దివ్యౌషధం... రోజుకో యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదని అంటారు కదా.. కానీ.. ఆపిల్ కొనుక్కోవడం ఖర్చుతో కూడుకున్న పని. అదే.. ఇష్టమైన వాళ్లకో ముద్దు ఇస్తే.. వైద్యుడు అవసరం లేదని తెలుసా..? లాకింగ్ పెదవుల మానసిక ప్రభావం మీ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ముద్దు అనేది మానసిక, శారీరక ఆరోగ్యాల్ని పెంపొందిస్తుంది. ► ముద్దు పెట్టుకోవడం వల్ల మీ శరీరంలో ఎపినెర్ఫిన్ విడుదలవుతుంది. దీనివల్ల రక్తనాళాలు వెడల్పుగా మారి రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు దోహదపడి మానసిక విశ్రాంతిని అందిస్తుంది. గుండె రేటును పెంచడం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రవాహం సక్రమంగా సాగుతుంది. ► ఒత్తిడిలో ఉన్నప్పుడు నచ్చిన వ్యక్తికి ముద్దు పెడితే.. రక్తపోటు తగ్గుతుంది. ► ఇద్దరు వ్యక్తులు చుంబించుకునే సమయంలో ఉత్పత్తయ్యే సెరోటోనిన్ డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి సంతోష రసాయనాలు.. ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ► ఒక బలమైన ముద్దుకి 8–16 కేలరీలను కరిగించే సామర్థ్యం ఉంది. ► ఎదుటి వ్యక్తిని చుంబించే సమయంలో 34 ముఖ కండరాలతో పాటు 112 ఇతర కండరాలు పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ► ఇన్ని లాభాలున్న ముద్దుతో.. కాస్తా.. జాగ్రత్తగా ఉండాలి సుమా.. ఎందుకంటే.. ముద్దు పెట్టుకున్నప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే బ్యాక్టీరియాతో పాటు 278 రకాల సూక్ష్మ జీవులూ దూసుకొచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు సుమా.. ఎన్ని ముద్దులో... దేశాలు, ప్రాంతాలు, సంస్కృతులు బట్టి.. ముద్దు గౌరవాన్ని, హోదాని సంతరించుకుంది. ఇలా.. వివిధ దేశాలు, ప్రజలు, బంధాల మధ్య మొదలైన చుంబనం.. వివిధ రకాలుగా మారిపోయింది. అధర చుంబనం.. మహాభారతంలో చెప్పిన అధర చుంబనమే ఇప్పుడు ఫ్రెంచ్ కిస్‌గా మారిపోయింది. దీన్ని ఫ్లోరెంటీనా కిస్ అని కూడా అంటారు. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకల్లో ఈ అధర చుంబనం సంప్రదాయంగా మారింది. చేతి ముద్దు.. ఎదుటివారి చేతిపై పెట్టే ముద్దు ఇది. ఉన్నత స్థాయికి చెందినవారు.. గౌరవ సూచకంగా పెట్టే ముద్దు ఇది. ఈ ముద్దు పొందే వ్యక్తి తన చేతిని ముందుకు వంచిప్పుడు ఎదుటి వ్యక్తి ఆ చేతిని తీసుకొని సున్నితంగా వేళ్లపై చుంబిస్తారు. చెక్కిలి ముద్దు.. ఇంగ్లిష్‌లో చీక్ కిస్ అని పిలిచే ఈ ముద్దే ఎక్కువ మంది అందుకుంటుంటారు. ఎదుటి వ్యక్తిపై స్నేహం, ప్రేమ.. గౌరవం, భక్తితో ఇచ్చే ముద్దు ఇది. తల్లిదండ్రులు, స్నేహితులు ఎక్కువగా ఇచ్చుకునే ముద్దులివే. ఫ్లయింగ్ కిస్.. ఒక సంకేతంగా ఇచ్చే ఊహాజనితమైన ముద్దు ఇది. పెదాలను గుండ్రంగా చుట్టి.. చేతులపై శబ్దంతో ముద్దు పెట్టి.. దాన్ని గాల్లో పంపించడమే. ఇష్టపడే వ్యక్తి దూరంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తారు. ఎస్కిమో కిస్ ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని ఎస్కిమో కిస్ అని పిలుస్తారు. తండ్రీ కుమార్తె, భార్య భర్తలు, ప్రేమికులు.. ఎక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇచ్చి పుచ్చుకునే ముద్దు ఇది. ఇద్దరి ముక్కులతోనూ రబ్ చేసుకోవడమే ఎస్కిమో కిస్.. స్నిఫ్ కిస్... కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా కనిపించే ముద్దు ఇది. బుగ్గపైనా, చెవి వెనుకభాగంలో.. చెంపపైనా.. ముక్కుతో ముద్దు పెట్టుకోవడాన్ని స్నిఫ్ కిస్ అంటారు. ఇది ఎక్కువగా ఆసియా దేశాల్లో ప్రాచుర్యం పొందిన ముద్దు. ఇవే కాదు.. ఫ్లావర్డ్ కిస్, ఫిష్ కిస్, లిక్ కిస్, స్లైడింగ్ కిస్.. ఇలా విభిన్న రకాల చుంబనాలతో ఎదుటివారి మనసు దోచెయ్యొచ్చు మనస్ఫర్థలు దూరం చేస్తుంది... ఆఫీస్ పని ఒత్తిడితో ఒక్కోసారి నా భార్యను పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలో.. జీవిత భాగస్వామి చాలా బాధపడుతుంటారు. ఈ సమయంలోనే మనస్ఫర్థలు వచ్చి.. జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు.. ఒక్క ముద్దు ఇస్తే.. చాలు.. అప్పటివరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. – శ్రీను, ఉమ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు -
లవ్ కిస్మత్
‘పెదవికి పెదవి రాసే ప్రేమలేఖ ముద్దు’ అన్నాడో కవి. నిజమే కావచ్చు. ఎందుకంటే... చుంబనం అనేది ఓ భావ వ్యక్తీకరణ. తల్లి బిడ్డకు, ప్రేమికుడు ప్రేయసికి, భర్త భార్యకి... తమ మనసును, ప్రేమను తెలిపేందుకు ఉపయోగించే చక్కని సాధనం ముద్దు. ఇష్టం, ప్రేమ, ఆరాధన, అనురాగం, అనునయం, ఓదార్పు, పలకరింపు.. ఏ భావాన్నైనా అందంగా ప్రకటించగల శక్తి ఉంది దీనికి! ..:: సమీర నేలపూడి విదేశాల్లో ముద్దుకు దాపరికం ఉండదు. ఏటా వాలెంటైన్ వీక్‌లోని ఆరో రోజైన ‘కిస్ డే’ నాడయితే.. ప్రేమికులు వీధుల్లో గుంపులుగా చేరి చుంబించుకునే దృశ్యాలు కోకొల్లలుగా కనిపిస్తుంటాయి. అయితే మనకు ముద్దు అనేది వ్యక్తిగత వ్యవహారం. తల్లిదండ్రులు పిల్లలను ముద్దాడే సన్నివేశాలు సైతం తక్కువగానే కళ్లబడుతుంటాయి మనకి. ఇక ప్రేమికులు, భార్యాభర్తల చుంబనం పూర్తి రహస్యం. మన సంస్కృతి మనకు నేర్పిన క్రమశిక్షణ అది. ముత్యమంతా ముద్దు.. ప్రేమంటూ కలిగాక.. దానికి అవతలి వ్యక్తి అంగీకారం లభించాక.. అది మనసును అసలు కుదురుగా ఉండనివ్వదు. తనకు మరింత చేరువ కావాలని, తను మీకే సొంతం అన్న నమ్మకాన్ని పొందాలని ప్రతి క్షణం ఉవ్విళ్లూరుతుంటుంది. ఆ నమ్మకం కలగడానికి ఓ తీయని ముద్దు తప్పకుండా సహకరిస్తుంది. మనసులు ముడిపడిన తర్వాత, మనుషులను మరింత చేరువ చేయడంలో ముద్దుది పెద్ద పాత్రే. ఒకరికొకరు సొంతమన్న భరోసానూ కలిగిస్తుంది. అందుకే మీ ప్రేమపై ముద్దు ముద్ర వేయడంలో తప్పు లేదు. ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేసే ప్రదేశానికో, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే జలపాతాల చెంతకో తనను తీసుకెళ్లండి. అలాంటి ప్రదేశాలకు మన సిటీలో కొదవేమీ లేదు కదా! ఓ మంచి చోటును సెలెక్ట్ చేసుకోండి. అక్కడికి తీసుకెళ్లి కాసేపు మనసు విప్పి మాట్లాడండి. ఇష్టాలు తెలుసుకోండి. అభిప్రాయాలను పంచుకోండి. చివరిగా ఓ చిన్న ముద్దుతో ముగింపు పలకండి. కానీ ఒక్క విషయం.. తనకి అభ్యంతరం లేకపోతేనే ప్రొసీడ్ అవ్వండి. తొలిముద్దు జీవితాంతం గుర్తుండే తీయని జ్ఞాపకం కావాలి తప్ప.. అనుబంధాన్ని ఆదిలోనే తుంచేసే ఆయుధంగా మారకూడదు. ముద్దు ముద్దుకో మీనింగ్ ఎయిర్ కిస్: దీన్నే ఫ్లయింగ్ కిస్ అనీ అంటుంటారు. కాస్త దూరంలో ఉన్న వారికి పలకరింపుగా గానీ, సెండాఫ్ ఇస్తున్నట్టుగా గానీ ఈ ముద్దును ఇస్తారు. ఫోర్‌హెడ్ కిస్: నుదుటి మీద పెట్టే ఈ ముద్దు స్నేహానికి, ప్రేమకు ప్రతీక. హ్యాండ్ కిస్: ఇది పలకరింపు ముద్దు. ఒక వ్యక్తిని కలసినప్పుడు వారి చేతిని అందుకుని, వెనక్కి తిప్పి ముద్దు పెడితే.. వారిపై మీ గౌరవాన్ని, భక్తిని, అభిమానాన్నీ చాటుతున్నట్లు అర్థం. చీక్ కిస్: మరీ కొత్తవారిని కాకుండా, బాగా పరిచయం ఉన్న వారిని, అభిమానించేవారిని చెంపలపై ముద్దాడుతాం కదా..! అదే చీక్ కిస్. ఎస్కిమో కిస్: మీ ముక్కును తన ముక్కుకి రాసి, తర్వాత ముక్కును చుంబిస్తే అది ముద్దుగా పెట్టే ముద్దు. సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇలా ముద్దాడుతారు. ఏంజిల్ కిస్: మూసి ఉన్న కనుపాపలపై పెట్టే ముద్దు ఇది. నిద్ర లేచిన వెంటనే గానీ, సెండాఫ్ ఇచ్చేటప్పుడు గానీ ఇలా ముద్దాడుతుంటారు. ఫ్రెంచ్ కిస్: ఇది మోస్ట్ రొమాంటిక్ ముద్దు. చాలా పాపులర్ కూడా. అధరాలపై చేసే ఈ గాఢ చుంబనం ప్రేమికులు, భార్యాభర్తల మధ్య అనురాగానికి గుర్తు. ఇంకా జాలైన్ కిస్, టీజర్ కిస్, వాంపైర్ కిస్, సీక్రెట్ మెసేజ్ కిస్ అంటూ చాలా రకాలున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రేమయాత్రను ప్రారంభించిన వారు హ్యాండ్ కిస్‌తోనో, ఫోర్‌హెడ్ కిస్‌తోనో మొదలుపెడితే బెటర్. బంధం బలపడేవరకూ ఫ్రెంచ్ కిస్ జోలికి వెళ్లొద్దు. మొదటికే మోసం రావచ్చు!