valentines week
-
ప్రేమికుల దినోత్సవం.. ఆన్లైన్లో వీటి అమ్మకాలు బీభత్సం!
ఈ వారంలో వాలెంటైన్స్ డే సందర్భంగా భారత్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లను ఆర్డర్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంపై గులాబీలు, చాక్లెట్స్, రొ**** గిఫ్ట్‌ల ఆర్డర్లు వెల్లువెత్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే వేడుకలు జరుగుతాయి. కానీ భారత్‌లో మాత్రం వారం రోజుల ముందు నుంచే ఊపందుకున్నాయి. దీంతో ఈ-కామర్స్,డేటింగ్ సైట్స్ యూజర్ల తాకిడితో కిక్కిరిసిపోయాయి. రొ**** ప్రోడక్ట్స్, గిఫ్ట్‌ల సేల్స్ విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ వారంలో నిమిషానికి 350 రోజెస్, 406 చాక్లెట్స్ వినియోగదారులు కొనుగోలు చేయగా.. ఫిబ్రవరి 9న తాము నిమిషానికి 406 చాక్లెట్స్ డెలివరీ చేశామని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం బ్లింకిట్ సీఈవో అల్బిందర్ థిండ్సా ట్వీట్ చేశారు. మరో 20,000కిపైగా చాక్లెట్స్, చాక్లెట్ బాక్స్‌లు మరో పది నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ అవుతాయని తెలిపారు. The peak is here and currently running at 406 CPM! More than 20k chocolates and chocolate boxes are on the way and will be delivered in the next 10 minutes ✌️ https://t.co/8ZGzncSzq3 — Albinder Dhindsa (@albinder) February 9, 2024 వాలెంటెన్స్ డే రోజు అమ్మకాలపై స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ట్వీట్ చేశారు. భారతీయులు వాలెంటెన్స్ డేను సెలబ్రేట్ చేసుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారని ట్వీట్ షేర్ చేశారు. అందులో నిన్నటి నుంచి వాలెటెంటైన్స్ కోసం కేక్ ఆర్డర్లు పెరిగాయి. గరిష్టంగా రాత్రి 10 గంటల సమయంలో నిమిషానికి ఏడు కేకు ఆర్డర్లు వచ్చినట్లు చెప్పారు. అలాగే, ఎఫ్ఎన్పీ. కామ్ సంస్థ వాలెంటైన్స్ డే కి ఒక్కరోజు ముందు (ఫిబ్రవరి 13) నిమిషానికి 350 గులాబీలను అందజేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది. అంతే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆన్లైన్ పెట్టే కేక్ ఆర్డర్లు నిమిషానికి అంతకంతకూ పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. -
సెట్లో ప్రేమించుకున్నారు.. పెళ్లి సెట్ చేసుకున్నారు
ఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాలెంటైన్స్ డేకు అంత ప్రాముఖ్యత ఉంది. ప్రేమ తర్వాత పెళ్లి వరకు చేరిన జంటలు మాత్రం ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కానీ బాలీవుడ్లో అలాంటి ప్రేమజంటలు ఎక్కువగానే ఉన్నాయి. తెరపై చూసిన ప్రేమ కథలే నిజ జీవితంలో ఒక్కటయ్యాయి. ప్రేమ పెళ్లిళ్లతో బాలీవుడ్ జంటలు అభిమానులకు సర్ప్రైజ్లు కూడా ఇచ్చాయి. కొన్ని జంటలు ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లడంలో విఫలమైనా.. మరికొన్ని జంటలు మాత్రం పెళ్లి బంధంలో అడుగుపెట్టాయి. బాలీవుడ్లో ఇటీవలే పెళ్లి చేసుకున్న కియారా-సిద్ధార్థ్ జంట నుంచి ఇప్పటిదాకా ఒక్కటైనా జంటలు ఏవో తెలుసుకుందాం. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సెట్లో ప్రేమించి పెళ్లి సెట్ చేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంటలపై ఓ లుక్కేద్దాం పదండి. కాజోల్, అజయ్ దేవగన్ : కాజోల్, అజయ్ దేవగన్ 1995 చిత్రం హల్చల్ షూటింగ్ సెట్లో కలుసుకున్నారు. నాలుగేళ్ల ప్రేమ తర్వాత 1999లో పెళ్లి చేసుకున్నారు. కాజోల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అజయ్‌ని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయించికున్నప్పుడు నెలల తరబడి తన తండ్రి తనతో మాట్లాడలేదని ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత సంతోషంగా వివాహం చేసుకున్నారు. కాగా వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ఆదరణ పొందిన నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ జంట 1970లో మొదటిసారి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కలుసుకున్నారు. అయితే ఆ గుడ్డి సినిమా షూటింగ్ సమయంలో వీరి ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఏక్ నాజర్ సెట్స్‌లో ఉన్నప్పుడు వారి బంధం మరింత బలపడింది. చివరికి జూన్ 3, 1973న వివాహం చేసుకున్నారు. జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ సెట్లో పరిచయమై పెళ్లిదాకా వెళ్లిన జంటల్లో జెనీలియా డిసౌజా, రితీష్ దేశ్‌ముఖ్. ఈ జంట2003లో తుజే మేరీ కసమ్ సెట్స్‌లో మొదటిసారి పరిచయంతోనే మంచి స్నేహితులయ్యారు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రేమ జంట ఫిబ్రవరి 3, 2012న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తేరే నాల్ లవ్ హో గయా, మస్తీ, లై భారీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. ట్వింకిల్ కన్నా, అక్షయ్ కుమార్ షూటింగ్ సెట్లో పరిచయంతో ఒక్కటైన జంట అక్షయ్ కుమార్, ట్వింకిల్ కన్నా. మొదటిసారి ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ షూటింగ్లో ఈ జంట కలుసుకున్నారు. ఆ తర్వాత అక్షయ్‌కి ట్వింకిల్‌పై ప్రేమ ఏర్పడింది. ఈ జంట ప్రేమ వ్యవహారం 1999లో ఇంటర్నేషనల్ ఖిలాడీ మేకింగ్ సమయంలో మొదలైంది. రెండేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట చివరికి జనవరి 17, 2001న వివాహం చేసుకున్నారు. దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ జంటల్లో దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఒకరు. వీరి ప్రేమ 2013లో గోలియోన్ కి రాస్లీలా రామ్-లీలా సెట్స్‌లో చిగురించింది. దాదాపు ఆరేళ్ల పాటు కలిసి ప్రేమలో ఉన్న ఈ జంట 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత పద్మావత్, ఫైండింగ్ ఫ్యానీ, బాజీరావ్ మస్తానీ సినిమాల్లో కనిపించారు. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ బాలీవుడ్లో మరో పవర్ ఫుల్ కపుల్ ఎవరంటే విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. ఈ జంట డిసెంబర్ 2021లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. బాలీవుడ్లో జరిగిన అతిపెద్ద వివాహాలలో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ బాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్. దాదాపు ఐదేళ్లపాటు డేటింగ్లో ఉన్న ఏప్రిల్ 2022లో ఒక్కటైంది. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ జోడికి నవంబర్‌లో ఓ పాప కూడా జన్మించింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మణిరత్నం చిత్రం గురు షూటింగ్ సమయంలో కలుసుకున్న జంట ఐశ్వర్య అభిషేక్. ఈ జంట సెట్లోనే ప్రేమలో పడ్డారు. కొన్నేళ్ల పాటచు ప్రేమలో ఉన్న జంట ఏప్రిల్ 10, 2007న వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరు ఉమ్రావ్ జాన్, ధూమ్ 2 వంటి చిత్రాలలో పనిచేశారు. ఈ జంట 2011లో ఆరాధ్య జన్మించింది కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్లో మరో ప్రేమజంట షాహిద్ కపూర్, కరీనా కపూర్. మొదట ఆమె తాషాన్ సెట్లో సైఫ్‌ను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్, కరీనా రెండేళ్ల పాటు డేటింగ్ అనంతరం అక్టోబర్ 16, 2012న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు ఉన్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఈ ఏడాదిలో ఒక్కటైన బాలీవుడ్ ప్రేమజంట సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ. రాజస్థాన్‌లో సూర్యగడ్లో ఫిబ్రవరి 7న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరి ప్రేమకథ మొదటి చిత్రం షేర్షా సెట్స్‌లో ప్రారంభమైంది. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా పుట్టినరోజు సందర్భంగా కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తమ రిలేషన్‌షిప్‌ను అధికారికంగా తెలియజేసింది. -
‘సాక్షి’ వాలంటైన్స్‌డే స్పెషల్: తనువులు వేరైనా.. మనసులు ఒకటేనని.. ( ఫోటోలు)
-
Valentines Day Special: హ్యాపీ వాలెంటైన్స్ డే
-
‘ఐ లవ్ యూ’ చెప్తే సరిపోదండోయ్.. ఈ అయిదూ పాటిస్తే లవ్ లైఫ్ లక్కీనే
అన్యోన్యంగా ఉండే దంపతుల బంధాన్ని ‘స్వచ్ఛమైన ప్రేమ’ అంటారు. ఎటువంటి పొరపొచ్చాలు.. అనుమానాలు.. అపార్థాలు రానివ్వకుండా.. కలకాలం పట్టి ఉంచుతుంది. కానీ నేటి తీరికలేని డిజిటల్ లైఫ్‌స్టైల్ వల్ల ఎంతో దృఢమైన బంధాల్లో సైతం బీటలు ఏర్పడుతున్నాయి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు, పెద్దలు కలిపిన పరిణయ జంటలు ఎన్నో అపార్థాలతో అన్యమనస్కంగా ‘ఎడముఖం పెడ ముఖం’గా ఉంటున్నాయి. బంధం ఏర్పడిన కొద్దికాలానికే విడాకులతో విచ్ఛిన్నమవుతున్నాయి. అతి చిన్న కారణాలకే తెగిపోతున్న అనుబంధాలను నిలబెట్టుకోవడానికి ‘లవ్ లాంగ్వేజ్’లు వారధిగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు.. ‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’, ‘‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని చెప్పి అవతలి వ్యక్తి మీద తమకు ఉన్న అపారమైన ప్రేమను వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రేమను వ్యక్తం చేయడానికి ‘ఐ లవ్ యూ’ అన్న ఒక్క పదం సరిపోవడం లేదు. అంతకు మించి కావాలనిపిస్తుంది. పార్టనర్‌కు ప్రేమను అందించడానికి, పార్టనర్ అలిగినప్పుడు, కోప్పడినప్పుడు, అనుమానపడినప్పుడు.. అపోహలు తొలగించి ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేందుకు ఈ ‘లవ్‌లాంగ్వేజ్’లు భరోసాను ఇస్తున్నాయి. ఆత్మీయ ఊసులు.. మనకు ఇష్టమైన వారిని కలిసినప్పుడు ముచ్చటించే పలకరింపులు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. పార్టనర్‌తో మాట్లాడే ప్రతిసారి అప్యాయత, ఆత్మీయ అనురాగాన్ని కనపరచాలి. వారు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలను మెచ్చుకుంటూనే లోటుపాటులను కూడా సున్నితంగా తెలియజెబుతుండాలి. ప్రతిపనిని నువ్వు చేయగలవని ప్రోత్సహించాలి. విమర్శ మీ మధ్య దూరాన్ని పెంచితే అభినందన బంధాన్ని మరింత బలపరుస్తుంది. చేదోడుగా.. మీ పార్టనర్ చేస్తోన్న పని కష్టమైనదిగా ఉండి ఇబ్బంది పడుతుంటే ఆ పనిలో సాయం చేసి వారి పని భారం తగ్గించాలి. ఈ విధంగా వారి మీద మీకున్న ప్రేమను వ్యక్తం చేయవచ్చు. రోజూ పార్టనర్ చేసే పనిని అప్పుడప్పుడు మీరు చేసి ఆశ్చర్యపరచాలి. ఇచ్చిపుచ్చుకోవడం ఏదైనా ఇచ్చిపుచ్చుకుంటే ఎంతో బావుంటుంది. ఇది కూడా ప్రేమను వ్యక్తం చేయడానికి మంచి మార్గం. సందర్భం ఉన్నా లేకపోయిన స్థోమతకు తగ్గట్టుగా బహుమతులు, చిన్నపాటి సర్ప్రైజ్లు ఇస్తూ పార్టనర్‌ను ఆనంద పరచాలి. పోతే రానిది.. ఈ ప్రపంచంలో ఎంతో విలువైనది ఏంటీ? అడిగితే టక్కున చెప్పేది సమయం. జరిగిపోయిన కాలం తిరిగి రాదు. అందుకే బిజీలైఫ్‌లో దొరికే కాస్త ఖాళీ సమయాన్ని పార్టనర్‌తో గడపడానికి కేటాయించాలి. అతిముఖ్యమైన సమయాల్లో కొన్ని పనులు పక్కనపెట్టాలి లేదంటే వాయిదా వేసి మరీ పార్టనర్‌తో గడపాలి. ఇలా చేయడం ద్వారా ‘‘జీవితంలో నువ్వే నాకు ముఖ్యం.. నీ తర్వాతే ఏదైనా’’ అనే భావన కలుగుతుంది. పార్టనర్ పదేపదే ఒకే విషయాన్ని చెబుతూ విసిగిస్తున్నారని దూరంగా వెళ్లకూడదు. వారితో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించి వారిని ఆ మూడ్ నుంచి బయటకు తీసుకు రావాలి. ఇలా చేయడం వల్ల బలహీన సమయాల్లో పార్టనర్ తీసుకునే అపాయకరమైన నిర్ణయాల నుంచి వారిని కాపాడగలుగుతారు. చేతలతో.. కొన్నిసార్లు మౌనమే అన్నింటికి సమాధానం చెబుతుంది అంటారు. ఈ మౌనానికి స్పర్శ జోడిస్తే పార్టనర్ మీద మనకున్న అపారమైన ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ప్రేమను పంచడంలో స్పర్శకూడా ముఖ్యమైనదే. ఆత్మీయ స్పర్శ ద్వారా పార్టనర్ మానసికంగా, భౌతికంగా తనతోనే ఉన్న అనుభూతి కలిగి బంధం మరింత గట్టిపడుతుంది. ఈ ఐదింటిలో పార్టనర్ మనస్తత్వాన్ని బట్టి కనీసం రెండైనా అనుసరించి ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఒక్కొక్కరు ఒక్కో భాషను ఇష్టపడతారు కాబట్టి వారి అభిరుచికి తగ్గట్లు వ్యవహరించి అనుబంధాన్ని దృఢపరుచుకోవాలి. ఇంకెందుకాలస్యం ఈ వ్యాలంటైన్స్డే నుంచే లవ్ లాంగ్వేజ్‌తో మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరవ్వండి. -
ఆమెకు ప్రామిస్ చేస్తావా
మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్‌లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా? చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్‌లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్‌లు ఏమిటో తెలుసా? ► రాష్‌గా డ్రైవ్ చేయకు. ► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు. ► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు. ► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు. ► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు ► పొదుపు చేస్తానని చెప్పు ► ఫేస్బుక్లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు ► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్‌లు కోరుకుంటారు. ► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి. ► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి. ► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి. ► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి. ► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. ► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్‌లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్. ► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు. ► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి. గమనించి చూస్తే ఈ ప్రామిస్లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. ‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు నిలదీసే హక్కూ వస్తుంది. ‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు. హ్యాపీ ప్రామిస్ డే. -
వాలెంటైన్స్ డే వీక్: అసలా కెమిస్ట్రీ ఏంటి?
అందమైన అమ్మాయి..ఆమె చేతిలో క్యూట్ క్యూట్ టెడ్డీ. ప్రేమికుల వారోత్సవాల్లో భాగంగా టెడ్డీ డే రోజు కనిపించే దృశ్యాలివే. నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డేగా జరుపుకుంటారు. అసలు ప్రేమికులకు ఈ టెడ్డీకి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి? ఈ రోజు ఎందుకు టెడ్డీ బేర్ గిఫ్టుగా ఇస్తారు. మీ వాలెంటైన్‌కి ఎలాంటి టెడ్డీ సూట్ అవుతుంది. వైట్.. రెడ్ ఎలాంటి టెడ్డీ ఇస్తే లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అనిపిస్తుంది... లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ప్రేమను గిఫ్ట్‌లతో కొలవలేం కానీ, పెద్దదైనా, చిన్నదైనా ఎప్పుడైనా సరే గిఫ్ట్ ప్రేమను పంచుతుంది. పెంచుతుంది కూడా. ప్రేమను చాటడమే దాని ఉద్దేశం. ప్రేమికుల వారంలో భాగంగా నాలుగో రోజు ఫిబ్రవరి 10న టెడ్డీ డే గా వ్యవహరిస్తాం. ప్రేమికుల మధ్య ప్రేమను చాటేందుకు టెడ్డీ డే రోజున అబ్బాయిలు అమ్మాయిలకు టెడ్డీ బేర్‌ను ఇస్తారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పటినుంచి అమ్మాయిలకు కూడా టెడ్డీ బేర్ అంటే ప్రాణం. తమకలవాటైన టెడ్డీ లేకుండా క్షణం కూడా నిద్రపోని అమ్మాయిలున్నారంటే అతిశయోక్తి కాదు. అమ్మాయిలు టెడ్డి బేర్స్‌ని ఎక్కువగా ఇష్టపడటం వెనుక కొన్ని మానసిక కారణాలు ఉన్నాయి. తమకు తోడుగా, అండగా మరో మనిషి ఉన్నారనే భరోసా వారికి చాలా ధైర్యాన్నిస్తుంది. అలా ఒంటరితనాన్ని పోగొట్టుకుంటారు. తన ప్రేయసికి సరిగ్గా ఇలాంటి సపోర్ట్ ఇచ్చేందుకే ఏ అబ్బాయైనా టెడ్డీని బెస్ట్ గిఫ్ట్‌గా ఎంచుకుంటాడు. 24/7 నేను నీతోనే..నీ పక్కనే అంటూ తన కలల రాణికి ధైర్యం చెబుతాడన్నమాట. తమ పెయిన్, గెయిన్ ఏదైనా టెడ్డి బేర్స్‌కు మాత్రమే చెబుతారు. ఎందుకంటే ఏ టెడ్డీ నెవర్ బ్రేక్స్ ద రూల్ అండ్ నెవర్ బ్రేక్స్ అప్ ది రిలేషన్. మరి ఎలాంటి టెడ్డీ ఇస్తే.. మీ కరెక్ట్ ఫీలింగ్ కన్వే అవుతుందో తెలుసా. రెడ్ టెడ్డీ బేర్ ఇస్తే.. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అని అర్థం. పిచ్చి పిచ్చిగా ప్రేమించేస్తున్నట్టు అర్థం. ఇక పింక్ గులాబీ రంగు టెడ్డీతో ఇస్తే అవతలి వాళ్ల ప్రేమను హార్ట్‌ఫుల్‌గా స్వీకరించినట్టు. ఇక పవర్‌కి, హ్యాపీనెస్‌కి గుర్తు ఆరెంజ్. కాబట్టి, త్వరలోనే ఎవరికైనా ప్రపోజ్ చేయాలి అనుకుంటే టెడ్డీ డే రోజున ఆరెంజ్ టెడ్డీ ఇచ్చేయొచ్చు. బ్లూ టెడ్డీని బహుమతి ఇచ్చి పిచ్చి పిచ్చిగా ప్రేమించడమే కాదు..నువ్వు నా పక్కన ఉండటం అదృష్టం అని గట్టిగా చెప్పేసినట్టే. గ్రీన్ టెడ్డీ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పడం. టెడ్డీ డే రోజున బ్రౌన్ టెడ్డీ ప్రేమించిన వ్యక్తి గుండెను బద్దలు చేశారన్న బాధకు చిహ్నం. లాస్ట్ బట్ నాట్ ద లీ స్ట్. ప్రేమికులకు మాత్రం టెడ్డీ డే రోజున వైట్ టెడ్డీ అంత గుడ్ సింబల్ కాదు. ఆల్రెడీ వారు వేరే వ్యక్తితో లవ్‌లో ఉన్నట్టు అర్థం. సో.. సిల్కీ అండ్ స్మూదీ టెడ్డీ బేర్‌తో మీ ట్రూ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయండి.. హ్యాపీ టెడ్డీ డే. అరుదైన సందర్భాల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఇస్తుంటారు. సాధారణంగా క్యూట్ యానిమల్స్ బొమ్మల్ని, లేదా హార్టీ టెడ్డీ బేర్‌ను గిఫ్టుగా ఇస్తారు. అయితే ఎంత ఖరీదైన బహుమతి ఇచ్చామన్నది కాదు, ప్రేమను ఎలా వ్యక్తం చేశామన్నదే ముఖ్యం. వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే తర్వాత ఫిబ్రవరి 11న హ్యాపీ ప్రామిస్ డే, 12న హ్యాపీ హగ్ డే, 13న హ్యాపీ కిస్ డే జరగనుంది. చివరగా14న హ్యాపీ వాలెంటైన్స్ డే జరుపుకుంటారు. -
Chocolate Day 2022: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
-
వాలెంటైన్స్ డే వీక్: స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’
ఏడు రోజుల వాలంటైన్స్ డే వీక్ జోరుగా..హుషారుగా సాగుతోంది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన వాలంటైన్స్ డే క్రమంగా విశ్వవ్యాపితమైంది. ఎక్కడ చూసినా... వాలెంటైన్స్ సందడి. ప్రేమ కోసం, ప్రేమ కొరకు ,ప్రేమతో అంటూ లవ్‌బర్డ్స్ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారు.. మరి ఈరోజు స్పెషల్ ఏంటి? ‘ప్రేమ’ అటే మ్యాజిక్.. అదో మాయ. మాటల్లో వర్ణించలేని తీయని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ డే వీక్‌లో చాకోలెట్ డే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 9న అత్యంత మధురంగా జరుపుకునేదే చాకొలెట్ డే. అలాంటి స్వీటెస్ట్ డే కోసం ప్రేమజంటలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడితే.. పెళ్లి తరవాత తన జీవిత భాగస్వామితో ఈ చాక్లెట్ డే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమ భావన తరువాత మన మనసును ఆహ్లాదంగా, తీపి చేసేవి చాకోలెట్లే! మరి అలాంటి చాకొలెట్స్ను ప్రేమించిన వ్యక్తికి షేర్ చేయకుండా ఎలా ఉంటారు. నో. వే ..కదా.. రకరకాల ప్రేమ చాక్లెట్లు, డార్క్ చాకోలెట్లు.. అబ్బో.. చాలానే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ టేస్ట్‌కు తగ్గట్టుఎంచుకుని మీ వాలెంటైన్ స్వీట్ మూడ్‌లోకి తీసుకెళ్లండి. చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి. అసలు చాక్లెట్ చూడగానే మనసు తేలికపడుతుంది. చాక్లెట్ తింటే డిప్రెషన్ హుష్ కాకి అవుతుంది. మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా మారిపోయి మెదడు పనితీరునీ మెరుగు పరుస్తుందట. సో.. అలిగి కోపంతో రగిలిపోతున్న ప్రేయసినీ లేదా ప్రియుడిని చాకొలెట్ ఇచ్చి కూల్ చేసేయండి.. బీపీని కంట్రోల్ చేయడానికి చాక్లెట్ దివ్య ఔషధమని చాలా స్టడీస్ చెప్పాయి. ఖరీదైన గిప్ట్స్ ఇవ్వలేని ఆనందాన్ని ఒక చిన్న చాక్లెట్‌తో పొందవచ్చు. హ్యాపీ చాక్లెట్ డే.. ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డే రోజు ప్రేమజంటలు ఫుల్బీజీ. అసలు 7 రోజుల వాలంటైన్స్ వీక్ సందడి షురూ అవుతుంది. రోజ్ డేతో మొదలైన వాలెంటైన్స్ వీక్ కిస్ డే తో ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే గాసెలబ్రేట్గా చేసుకుంటారు. -
వాలెంటైన్స్ డే వీక్: మోస్ట్ రొమాంటిక్ డే.. ‘ప్రపోజ్ డే’
వాలెంటైన్స్ డే వీక్‌లో రొమాంటింక్ డే ప్రపోజ్ డే. ప్రేమ ఎప్పడు ఎక్కడ ఎలా పుట్టిందనే దానికంటే...ఎలా ప్రపోజ్ చేశామన్నదే లెక్క. వాలెంటైన్‌ను ఎలా ఇంప్రెస్ చేశామన్నదే మేటర్. వాలెంటైన్స్ డే వీక్‌లో రెండో రోజు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే గురించి ఈ విషయాలు తెలుసా మీకు... వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్స్ డే ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రేమను ప్రకటించుకోవడానికి, అవతలి వారి మనసు తెలుసుకోవడానికి ఫిబ్రవరి 14 కూడా ఒక ముహూర్తం లాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నప్పటికీ, వాలెంటైన్స్ వీక్ అనేది భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారు. ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచడం, వారి మనసు గెల్చుకోవడం అనుకున్నంత సులువు కావు. ఒక విధంగా అదొక ఆర్ట్. అందుకే లవ్ బర్డ్స్ ప్రపోజ్ డే కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు. ప్రేమ మాటల కందని మధరానుభూతి. అనుభవిస్తేనే కానీ తెలియని ఓ ఉద్వేగం. కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రేమ భావనకు అతీతులు కాదు. ప్రపోజ్ డే రోజున ఎదుటివారి పట్ల మీలో ఉన్న భావనలను వ్యక్తపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వారికిష్టమైన వాచ్ లేదా రింగ్ లేదా ఏదైనా వస్తువు గిఫ్ట్ గా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు. మంచి కవిత రాయొచ్చు.. మీరు మంచి ఆర్టిస్టులయితే ఆ పోర్ట్రయిట్ గీసి ఇచ్చి ఎందుకు నచ్చారో మీ ఫీలింగ్స్ చెప్పి చూడండి. ఇంకా స్మార్ట్‌గా...మీకు నచ్చిన మూవీ సాంగ్‌ను కోట్ చేస్తూ.. మీ ఫస్ట్ లవ్‌కు సింపుల్‌గా వాట్సాప్ చేసేయండి. ఎలా చెప్పనమ్మా అంటూ వెయిట్ చూస్తూ కూర్చుంటే కుదరదు కదా.. సో మనసులోని ప్రేమను వ్యక్తం చేసి ప్రపోజ్ డేని ఎంజాయ్ చేయండి. ప్రేయసి లేదా ప్రియుడికి ఒక రెడ్ రోజ్ ఇచ్చి మాటలతో చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే గిఫ్ట్స్ కార్డులు, గిఫ్ట్స్, చాక్లెట్లు, టెడ్టీ ఇవ్వడం కామన్.. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా ప్రేమను ప్రకటించి సర్ప్రైజ్ చేయడం విశేషం. అవతలి వారి అభిరుచులకు తగ్గట్టు, వారు ఊహించని విధంగా తమ మనసులోని మాటను వ్యక్తం పరుస్తారు చాలామంది. అలా తమ జీవితంలోని ఎమోషనల్ మూమెంట్‌ను రొమాంటిగ్గా సూపర్ డూపర్గాసెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వాలెండైన్ వీక్‌లో 3వ రోజు ఫిబ్రవరి 9ని చాక్లెట్ డేగా, తర్వాత 4వ రోజున టెడ్డీ డేని ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఈ వరుసలోనే ప్రామీస్ డే, హగ్ డే, కిస్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. -
పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్
ముంబై : బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ కూతురు ఇరా ఖాన్ లవ్ ఎఫైర్‌తో గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్ ఫిట్నెస్ కోచ్ నుపూర్ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తాజాగా ప్రామిస్‌డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్ నుపూర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మై వాలెంటైన్ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అఫీషియల్‌గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇరా పోస్ట్‌పై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎమోజీల రూపంలో ఆమెకు విషెస్ చెబుతున్నారు. ఇక గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్‌కు పరిచయం చేసిన ఇరా..కొన్నాళ్లు ఆమిర్ ఫాంహౌజ్‌లోనే ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్ చేసుకున్నట్లు సమాచారం. (నాలుగేళ్లు డిప్రెషన్లో ఉన్నా: ఇరా ఖాన్) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) గతంలో ఇరా మిషాల్ అనే వ్యక్తితో ఇరా ఖాన్ ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్డౌన్లో ఇరా ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టడంతో నుపూర్ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు.ఈ క్రమంలో నుపూర్ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో ఇరా తన బాయ్‌ఫ్రెండ్ నుపూర్ పచ్చబొట్టును వేయించుకుంది. మొదటిసారి టాటూ వేయించుకున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. (లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె) View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
ఈ గిఫ్ట్ చాలు...ఇక ప్రేయసి మీ వెంటే!
ప్రేమించిన వారు ప్రతిక్షణం మనతోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు! కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ విరహ వేదనను టెడ్డీబేర్లు దూరం చేయగలవు. అందుకే ఈ టెడ్డీలకు వాలెంటైన్స్ వీక్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. లవర్స్ ఈరోజును (ఫిబ్రవరి10) టెడ్డీబేర్ డేగా జరుపుకుంటారు. ఇంకేం.. ప్రేమికుల్లారా! మీ నిచ్చెలికి ఒక టెడ్డీ ఇచ్చి తన పక్కనే ఉండే ఛాన్స్ కొట్టేయండి మరి... మరోవైపు టెడ్డీబేర్‌లకు, అమ్మాయిలకు మధ్య చిన్ననాటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వారు రకారకాల బొమ్మలతో ఆడుకుంటుంటారు. ఒక్కరే ఉన్నప్పుడు టెడ్డీలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులతో సరదాగా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పక్కనే టెడ్డీ ఉండాల్సిందే. చిన్నారి పాపలు కొన్నిసార్లు తమ టెడ్డీలకు ప్రాణం ఆపాదించి అందంగా ముస్తాబు చేసి తయారుచేసి సంతోషపడిపోతారు. బెడ్‌పైనే తమ పక్కనే పెట్టుకుని నిద్రపోతారు. ఇక ప్రేమికుల విషయానికొస్తే.. మనసుపడిన వారికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ప్రియుడు/ప్రియురాలు టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తుంటారు. తమవారు గుర్తుగా ఇచ్చే టెడ్డీ బొమ్మలతో వారు లోన్లీ ఫీలింగ్‌ను కొంతవరకు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమే కాకుండా కోపతాపాలకు కొన్నిసార్లు వేదిక అవుతుంటాయి. ప్రేమించినవారిపై అలకను, చిరుకోపాన్ని టెడ్డీలపై చూపించి వారు తెగ ఆనందపడిపోతారు. -
ప్రేమకు ఓకే చెప్పట్లేదా? వెంటనే ఈ పని చేయండి
ప్రేమికులన్నాక అలకలు, కోపాలు కామన్.. వారిని కూల్ చేయడంలో చాక్లెట్ కీ రోల్ ప్లే చేస్తోందట.. అందుకే దానికి వాలంటైన్స్ వీక్‌లో ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. ఈ రోజు(ఫిబ్రవరి 9)ను లవర్స్ చాక్లెట్ డేగా జరుపుకుంటారు. వీరప్రేమికుల్లా ఊరికే రంగంలోకి దిగితే సరిపోదు. స్వచ్ఛమైన ప్రేమను కనబరస్తూ చాకెట్లు ఇస్తే ఫలితం ఉంటుంది. అమ్మాయిలు కరిగిపోతారు. అదెలా సాధ్యమంటారా? అయితే ఇది చదివేయండి. అమ్మాయిలకు, చాక్లెట్లకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారు మన ఎదుట ఉంటే కళ్ళలో మెరుపు, మనసుకు ఆనందం ఎలా పుట్టుకొస్తాయో... అలాంటి ఫీలింగే చాక్లెట్‌తో కూడా కల్గుతుందట. మరీ ముఖ్యంగా డార్క్ చాక్లెట్ మనసును ఉల్లాసంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. పైగా దీన్ని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టంగా తింటారు. ప్రేమికులైతే ఒకరిపై మరొకరు అలిగినా, చిన్నపాటి కోపాలతో ముఖం మాడ్చుకున్నా చాక్లెట్ ఇచ్చి ఎదుటివారిని ఈజీగా కూల్ చేస్తుంటారు. ప్రేమికుల రోజు మొదలు, పుట్టినరోజు, పెళ్ళిరోజు.. ఇలా ప్రతి వేడుకలో చాక్లెట్ తప్పకుండా ఉండాల్సిందే. పశ్చిమ దేశాలలో చాక్లెట్‌ను దేవాతాహరంగా చెబుతారు. అందుకే మీరు ఆరాధించే అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే ఇట్టే బుట్టలో పడిపోతారు. విభిన్న చాక్లెట్లు ► చాక్లెట్లు తెలుపు, డార్క్ విభిన్న రంగులలో లభిస్తున్నాయి. ► వీటిని కోకో చెట్ల నుంచి లభించే కాయల నుంచి తయారు చేస్తారు. ► విభిన్న ఆకారాలలో, అనేక ఫ్లేవర్స్‌లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. ► చాక్లెట్లను కాఫీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీంలు వంటి వాటిల్లోనూ ఉపయోగిస్తారు. ► చాకలెట్లను సింపుల్ టెక్నిక్‌తో ఇంటిదగ్గర కూడా తయారు చేయవచ్చు. చాక్లెట్ ఉపయోగాలు: ► చర్మం కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది. ► అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తోంది. ► శారీరక బరువును తగ్గించడంతోపాటు, మానసికం ఉల్లాసానికి కారణమవుతుంది. ► ఒక చాక్లెట్ తిన్నాక మెదడు 2 నుంచి 3గంటలు ఆక్టివ్‌గా పనిచేస్తోందట. ► డార్క్ చాక్లెట్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలూ, అమ్మాయిలూ.. వెంటనే ఆలస్యం చేయకుండా ఓ చాక్లెట్ కొనేయండి. ప్రియుడి/ ప్రేమికురాలి నోరు తీపి చేసేయండి. వారి మనసు దోచేయండి. ఆల్ ద బెస్ట్!! చదవండి: ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే! -
ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే!
ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్..! ఎలా ప్రపోజ్ చేస్తారో తెలుసుకుందాం.. ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్ప్రైజ్ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్ కప్ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు. సాహసాలకు సిద్ధపడతారు.. మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్ మై లవ్ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. -
రెండు అక్షరాలు.. వేల కోట్లు..
ప్రేమ.. ఇదిప్పుడు రెండు అక్షరాల కలయిక మాత్రమే కాదు..వేల కోట్ల రూపాయల బిజినెస్ ఐడియా కూడా! అందుకే కొన్ని వ్యాపార సంస్థలు ప్రేమను క్యాష్ చేసుకుంటున్నాయి. తమ రంగురంగుల ప్రకటనలతో ప్రేమ జంటల్ని ఆకర్షించి సొమ్మ చేసుకుంటున్నాయి. కొత్తకొత్త ఆఫర్లతో.. సరికొత్త ఆలోచనలతో తమ బిజినెస్‌ను మూడు చాక్లెట్లు, ఆరు టెడ్డీబేర్లలా కొనసాగిస్తున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే సేల్స్ మానియా కొనసాగుతోంది. 2019 లెక్కల ప్రకారం వాలెంటైన్స్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా 30వేల కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని అంచనా. అమెరికా వంటి సంపన్న దేశం ఆ ఒక్కరోజే ఖర్చు చేసిన మొత్తం 20.7 బిలియన్ డాలర్లు. సగటున ఒక్కో అమెరికన్ ప్రేమ కానుకల కోసం 200 డాలర్లు(రూ.14వేలు)ఖర్చు చేసినట్లు ఓ సర్వే తెలిపింది. ఆడ,మగ తేడా లేకుండా ఇష్టమైన వారిని కానుకలతో ఇంప్రెస్ చేయాలని చూస్తుండటంతో ప్రతీ సంవత్సరం వాలెంటైన్స్ డే వ్యాపారం ఊపందుకుంటోంది. డిమాండ్ ఉన్నవి ఇవే! వాలెంటైన్స్ డే సందర్భంగా ఎక్కువ మొత్తం డబ్బు ఖర్చు చేసిన బహుమతుల్లో క్యాండీలు మొదటి స్థానాన్ని ఆక్రమించాయి. వీటి కోసం చేసిన ఖర్చు మొత్తం దాదాపు 2.4 బిలియన్ డాలర్లు. దాని తర్వాతి స్థానాల్లో వరుసగా చాక్లెట్లు, గ్రీటింగ్ కార్డ్స్ హాలిడే స్పాట్స్, పువ్వులు, నగలు ఉన్నాయి. బ్రాండెడ్ బట్టలు, బొమ్మలు, సిల్వర్ కప్లింగ్స్, పట్టు టైలు, లెదర్ బెల్టులు, వాలెట్స్, కీచైన్లు, డైమెండ్ జ్యుయెలరీ, రిస్ట్‌వాచ్‌లు, స్మార్ట్ ఫోన్లు, బ్రాండెడ్ చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వస్తువులు వాటి తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఎర్ర గులాబీల రూటే వేరు.. వాలెంటైన్స్ డే రోజు ఎన్ని వెరైటీ గిఫ్ట్స్ వరుసలో ఉన్నా గులాబీ ప్రత్యేకత వేరు. మనం ఇచ్చే గిఫ్ట్ ఎంత ఖరీదైనా గులాబీ తోడులేకుంటే అది వెలవెలబోతుంది. అందుకే ప్రేమకుల రోజున గులాబీలు నిచ్చెనెక్కెస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో గులాబీల ధర మామూలు కంటే పదిరెట్లు ఎక్కువగా ఉంటోంది. ప్రేమికుల రోజున ఒక్కో గులాబీ ధర దాదాపు రూ. 150 నుంచి రూ. 200లకు చేరుతోంది. అంతేకాకుండా మన గులాబీలు చూడటానికి ఎంతో అందంగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ అధికంగా ఉంది. యూకేలో మన గులాబీల డిమాండ్ గురించయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్‌లు మన గులాబీలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలు గులాబీలను ఎగుమతి చేసే రాష్ట్రాలుగా అగ్ర స్థానంలో ఉన్నాయి. గత సంవత్సరం 30 కోట్ల రూపాయల విలువైన గులాబీలు ఇతర దేశాలకు ఎగుమతయ్యాయి. మగాళ్లే ఎక్కువ.. వాలెంటైన్స్ డే కోసం ఆసక్తిగా ఎదురుచూసేది మగవారే! అందుకే ఆ రోజున ఆడవాళ్ల కంటే ఎక్కువగా డబ్బులను ఖర్చుపెట్టేస్తున్నారు. ఓ సర్వే ప్రకారం ఓ మగాడు తన భాగస్వామి కోసం దాదాపు 300 డాలర్లు ఖర్చు చేస్తున్నాడని తేలింది. ఇక ఆడవారు మాత్రం కేవలం 63 డాలర్లకే పరిమితమయ్యారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే! రెండు సంవత్సరాలకంటే ఎక్కువ కాలం కలిసున్న జంట మాత్రమే ఒకరిపై ఒకరు ఎక్కువ మొత్తం ఖర్చు చేయటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఎనిమిది రోజుల ప్రేమ పండుగ వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14కు మాత్రమే పరిమితం కాలేదు. అంతకు ఏడు రోజుల ముందు నుంచే వాలెంటైన్స్ వీక్ పేరిట సంబరాలు మొదలవుతాయి. ఫిబ్రవరి 7నుంచి ఫిబ్రవరి 14 వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ సందడి ఉంటుంది. ఈ వారంలోని ఒక్కోరోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులు సైతం ఒక్కోరోజు ఒక్కోవిధంగా తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేస్తారు. కానుకల రూపంలో ఒకరినొకరు పలకరించుకుంటారు. వాలెంటైన్స్ డే వ్యాపారానికి ఈ ఏడు రోజులు ఎంతో ఉపకరిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. -
అదే మోస్ట్ రొమాంటిక్ కిస్!!
వాలెంటైన్స్ వీక్‌లోని ఏడవ రోజు! వాలెంటైన్స్ డే ముందు రోజు ‘కిస్ డే’.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమ జంటలు మధురమైన ముద్దుతో ప్రేమికులరోజుకు స్వాగతం పలుకుతాయి. ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పద్దతుల్లో ముద్దు పెట్టుకోవటం కూడా ఒకటి. జంటల మధ్య మాటల ప్రవాహానికి అడ్డుకట్ట వేయటానికన్నట్లు ప్రకృతి సృష్టించిన అద్భుతం ఈ ముద్దు. ముద్దనగానే మూతి ముడుచుకునేవాళ్లు లేకపోలేదు. ముద్దు కేవలం శృంగార భావమే కాదు! ఓ ఆరోగ్య సూత్రం కూడా. ముద్దుతో ఆరోగ్యం.. 1) ముద్దుతో శరీరంలోని రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ‘జర్నల్ మెడికల్ హైపోథెసిస్’ పరిశోధనల్లో తేలింది. 2) ముద్దు పెట్టుకోవటం ద్వారా నిమిషానికి 2నుంచి 6 క్యాలరీలు ఖర్చవుతాయి. 3) గాఢమైన ముద్దుతో ముఖ కండరాలు దృఢంగా తయారవుతాయి. 4) ముద్దు పెట్టుకోవటం ద్వారా శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలై మనకు ప్రశాంతతను కలుగజేస్తాయి. 5) ముద్దు జంట మధ్య బంధాన్ని బలంగా ఉంచేలా చేస్తుంది. 6) ముద్దు పెట్టుకోవటం ద్వారా పలు రకాల దంత సమస్యలు దూరమవుతాయి. ముద్దుల్లో రకాలు 1) నుదటిపై ముద్దు : మన కిష్టమైన వ్యక్తులను నుదటి పెట్టుకోవటం వారిపై మనకున్న ప్రేమ, అడ్మిరేషన్కు గుర్తు. 2) చేతులపై ముద్దు : చేతులపై మద్దు పెట్టుకోవటం గౌరవానికి, శూరత్వానికి ప్రతీక. 3) ఎస్కిమో కిస్ : ఒకరి ముక్కులను ఒకరు రాసుకోవటాన్ని ఎస్కిమో కిస్ అంటారు. సాధారణంగా పసి పిల్లల తల్లులు ఎస్కిమో కిస్ ద్వారా తమ ప్రేమను తెలియజేస్తూ ఉంటారు. 4) ఫ్రెంచ్ కిస్ : ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచూర్యం పొందిన ముద్దు ఇది. మోస్ట్ రొమాంటిక్ కిస్ అని కూడా చెప్పొచ్చు. నాలుకలతో ముద్దుపెట్టుకోవటం దీని ప్రత్యేకత 5) స్పైడర్ మాన్ కిస్ : స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో గోడ మీదనుంచి కిందకు వేలాడుతూ హీరోయిన్ను మద్దు పెట్టుకుంటాడు. అప్పటినుంచి ఈ ముద్దు ప్రాచూర్యం పొందింది. -
వాలెంటైన్స్ డే స్పెషల్ ఈవెంట్స్!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు మరింత దగ్గర పడింది. రేపు ఒక్కరోజు గడిస్తే ఆ మరుసటి రోజే ప్రేమికుల పండుగ. అయితే వాలెంటైన్స్ వీక్ పేరిట ప్రేమ పండుగ వేడుకలు ఐదురోజుల క్రితం నుంచే మొదలయ్యాయి. ఈ వారంలోని ప్రతీరోజు కానుకలతో ప్రేమికులు తమని తాము పలకరించుకుంటూనే ఉన్నారు. మిగితా రోజులకంటే వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది. అందుకే ప్రేమికులు ఆరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలనుకుంటారు. అలాంటి వారు తమ ప్రియమైన వారితో అలా సరదాగా క్యాండిల్ లైట్ డిన్నర్‌లోనో, ఏదైనా ఈవెంట్లోనో గడిపితే ఆ కిక్కేవేరు. ఇందుకోసం ఎక్కడికో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పనిలేదు. మన హైదరాబాద్ నగరంలోనే వాలెంటైన్స్ డేన చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. మీరు చేయవల్సిందల్లా ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకోవటమే.. ప్రేమికుల రోజున నగరంలో జరిగే కొన్ని ఈవెంట్స్ మీకోసం.. 1) వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ ప్రదేశం : హోటల్ సియెష్టా హైటైక్, గచ్చిబౌలీ-మియాపూర్ రోడ్, హనుమాన్ నగర్, మార్తాండ నగర్, కొండపూర్, హైదరాబాద్ సమయం : రాత్రి 7 గంటలకు హైలెట్స్ : క్యాండిల్ లైట్ గాలా డిన్నర్ టిక్కెట్ ధర : రూ.799నుంచి 2) వాలెంటైన్స్ డే బాశ్ 2020 ప్రదేశం : ఎన్చేట్ కేఫ్ అండ్ కాన్ఫెక్సనరీ, ఫ్లాట్ నెంబర్ . 402, రోడ్ నెంబర్ 81, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ సమయం : ఉదయం 6 : 30 నుంచి రాత్రి 11:45వరకు హైలెట్స్ : డీజే, లవ్ గేమ్స్, వీజే పాటలకు జుంబా డ్యాన్స్ టిక్కెట్ ధర : రూ. 2499( జంట) 3) హ్యాపీ హార్ట్స్ ప్రదేశం : ప్లిఫ్సైడ్ అడ్వంచర్ పార్క్, ఐఎస్బీ రోడ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, హైదరాబాద్ సమయం : సాయంత్రం 4 గంటలనుంచి హైలెట్స్ : పాటరీ వర్క్‌షాప్, ట్రెజర్ హంటర్, ఎంగేజ్మెంట్ టిక్కెట్ ధర : రూ.2,360(జంట) 4) హ్యాపీ వాలెంటైన్స్ డే పార్టీ ప్రదేశం : స్పాయిల్ , 8-3-293/82/A/70, 4th ఫ్లోర్, అన్షూ కలర్స్ బిల్డింగ్స్, రోడ్‌నెంబర్ 1, చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ఎదురుగా, జూబ్లీహిల్స్, హైదరబాద్ సమయం : రాత్రి 1నుంచి ఉదయం 5 గంటల వరకు హైలెట్స్ : కాంప్లిమెంటరీ ఫుడ్ అండ్ డ్రింక్స్ టిక్కెట్ ధర : రూ. 499 5) వాలెంటైన్స్ ఈవినింగ్ - రూఫ్‌టాప్ పూల్‌సైడ్ రొమాంటిక్ డైనింగ్ ప్రదేశం : మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్స్ , లెవెల్ 10, ఎస్ఎల్ఎన్ టెర్మినస్, సర్వే నెం: 133, బొటానికల్ గార్డన్ పక్కన హైదరాబాద్ సమయం : రాత్రి 7:30 గంటలకు హైలెట్స్ : క్యాండిల్ లైట్ అండ్ స్టారీ నైట్ టిక్కెట్ ధర : రూ. 5,000( జంట) 6) స్టాండ్‌అప్ కామెడీ షో ప్రదేశం : జేఎక్స్టాపోస్, ప్లాట్ నెం:587, రోడ్ నెంబర్ 32, జూబ్లీహిల్స్, హైదరాబాద్ సమయం : రాత్రి 7 గంటల నుంచి 8:30 వరకు హైలెట్స్ : సందీప్ జానీ, యశ్ బజాజ్ కామెడీ టిక్కెట్ ధర : రూ.235 (మగవారికి మాత్రమే) -
ప్రేమను వ్యక్తపర్చడానికి ఇదే మంచి మార్గం!
వాలెంటైన్స్ డేకు మరో ఒక రోజు మాత్రమే ఉంది. ఈ వాలెంటైన్స్ వీక్‌లో ముఖ్యమైన, ప్రత్యేకమైనది ‘హగ్ డే’... ఈ రోజున ప్రియమైన వారికి మనమిచ్చే కానుకు ప్రత్యేకమైనది. ఇది వస్తువు రూపంలో లేకపోయినా ఎదుటి వ్యకికి ఎంతో సంతోషాన్నిస్తుంది.. ఓ చిరకాల జ్ఞాపకంగా వారి మనసుల్లో మిగిలిపోతుంది. కోటి మాటలు ఓ కౌగిలింతకు సరికావు! ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను వ్యక్త పరచడానికి ఇంతకన్నా మంచి మార్గం ఇంకోటి లేదని చెప్పొచ్చు. ఓ బలమైన కౌగిలింత ద్వారా ఎదుటివ్యక్తిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో చెప్పకనే చెప్పొచ్చు. ఎంత డబ్బు ఖర్చు చేసినా పొందలేని ఆనందం దీని సొంతం. కౌగిలింతతో లాభాలెన్నో.. కౌగిలింతతో మన ప్రేమను వ్యక్తపర్చటమే కాదు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా మనకు ఎన్నో లాభాలున్నాయి. 1) మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా ఓ సారి ప్రియమైన వారి కౌగిలింతలోకి చేరితో ఆ బాధ ఇట్టే దూరమైపోతుంది. 2) కౌగిలింత కారణంగా మన పనితనం మెరుగుపడుతుంది. 3) కౌగిలింత ‘బిహేవియరల్ మెడిసిన్’గా పనిచేస్తుంది. సభల్లో మాట్లాడటానికి ఇబ్బంది పడేవాళ్లకు ఇది చక్కటి ఔషదంలా మారుతుంది. ఓ 20 సెకన్ల కౌగిలింత వారి హార్ట్‌బీట్ రేటును తగ్గించి చక్కగా మాట్లాడేలా చేస్తుంది. 4) ఓ బలమైన కౌగిలింత ఒత్తిడికి కారణమైన కార్టిసాల్ హార్మోన్‌ను తగ్గిస్తుంది. 5) ఓ కౌగిలింత జంట మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఎందుకంటే కౌగిలింత ద్వారా వ్యక్తుల శరీరాల్లో విడుదలయ్యే ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్ ఇందుకు కారణం. అంతేకాకుండా ఈ హార్మోన్ కారణంగా గుండె పనితీరు కూడా మెరుగు పడుతుంది. 6) కౌగిలింత నొప్పిని తగ్గించే మందులా కూడా పనిచేస్తుంది. కౌగిలింత ద్వారా విడుదలయ్యే ఎండార్ఫిన్ అనే హార్మోన్ నొప్పులను తగ్గిస్తుంది. -
ప్రేమలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తొచ్చేవి!
ప్రేమ ఎవ్వరినైనా పిచ్చి వాళ్లను చేయగలదు. ప్రేమ మత్తులో ఒక్కసారి మునిగితే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రేమ ఎవ్వరినైనా ఎదురించేలా చేయగలదు, రాజ్యాన్ని సైతం త్యజించేలా చేయగలదు. అలాంటి ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అలాంటి భావాల్ని వ్యక్తపరచాలంటే మాటలు పాటల్లా మారాల్సిందే. కొందరు ‘నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి’ అని ప్రేయసిని బ్రతిమిలాడుకుంటే.. ఇంకొందరు ‘ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని చేరి నిన్ను కోరుకుంటే చౌకబేరమా’ అంటూ ప్రేమలో పడేస్తున్నారు. ప్రేమను వ్యక్త పరచడంలో, ఆ ప్రేమను ఫీలవ్వడంలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు. అందుకే ఇప్పటికే ప్రేమ మీద వేల కొద్ది పాటలు వచ్చినా ఇంకా అనేక పాటలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. వాటిలో అందమైన ఆకట్టుకునే కొన్ని పాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రేమికుల రోజు నాడు కచ్చితంగా మనకు గుర్తొచ్చే పాట ప్రేమికుల రోజు సినిమాలోని ‘వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన! నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపు చూసి శిలను అయితినే.. ఓ మాట రాక మూగబోతినే’. ప్రేమించే ప్రతి అబ్బాయి తన ప్రేయసి గురించి ఇలా ఫీలవుతూనే ఉంటాడు. ఇక అమ్మాయిలు‘ మన్మధుడా నీ కల కన్నా.. మన్మధుడా నీ కథ విన్న మన్మధుడంటే ప్రాణంలే మన్మధుడే నాక్కావలలే’ అంటూ మురిసిపోతూ ఉంటారు. ‘ఫీల్ మై లవ్’ అంటూ మీ ప్రేమను ఫీలయ్యేలా చేసిన తరువాత ‘నిజంగా నేనే నా....ఇలా నీ జతలో ఉన్నా’ అంటూ ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి ఒక్కరోజు కనబడకపోతే చాలు ‘పిల్లారా!.. నువ్వు కనపడవా’ అంటూ ప్రాణం పోతున్నట్లు విలవిలలాడిపోతారు. అంత బాధ తరువాత తను ఒక్కసారి కనిపిస్తే చాలు ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే...చాలే ఇది చాలే’ అంటూ ఎగిరి గంతెస్తాం. మన ప్రేమ ప్రయాణంలో ఏ పాట విన్నా, ఏ సినిమా చూసినా మనం ప్రేమించిన వారే కనబడతారు. ప్రపంచం అంతా ప్రేమమయం అనిపిస్తుంది. అందుకే ప్రేమ, పాట ఒక చక్కని జోడి. ఎన్నో భావాలను అందంగా తెలియజేయడానికి పాట ఒక సాధనం. అందుకే ప్రేమికుల రోజున మీకు నచ్చిన వారికి మనసుకు హత్తుకునే పాటను షేర్ చేస్తూ మీ ప్రేమను వ్యక్త పరచండి. మీ కోసం మాకు తెలిసిన కొన్ని అందమైన పాటల్ని కొన్నింటిని మీతో పంచుకుంటున్నాం. -- నన్నుదోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి - గులేబకావళి కథ -- నా హృదయంలో నిదురించే చెలి నీ హృదయంలో చోటిస్తావా మరి-- నా హృదయంలో నిదురించే చెలి -- ఈ హృదయం కరిగించి వెళ్లకే -ఏ మాయ చేశావే -- కన్నల్లో నీ రూపమే గుండెల్లోనీ ధ్యానమే- నిన్నే పెళ్లాడతా -- మధురమే మధురమే మధురమే --సత్యం -- నువ్వేప్పుడొచ్చావో అపుడే పుట్టింది ఈ ప్రేమ - అమ్మాయిలు అబ్బాయిలు -- నా గుండెలో నువ్వుండి పోవా - నువ్వు నేను -- ఓ చెలియ నా ప్రియ సఖియా చేజారేను నా మనసే- ప్రేమికుడు -- తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక -సొంతం -- తెలియదులే ఇది తెలియదులే - సింగం -- ప్రియతమా ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా -మజిలీ -- నీ జతగా నేనుండాలి, నీ యదలో నేనిండాలి - ఎవడు -- మెల్లగా కరగని రెండు మనసుల దూరం - వర్షం. -- బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే - అల వైకుంఠపురం. -- నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మౌనంగా ఉన్నా.. - 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?.. ఇలా పది కాదు వంద కాదు ప్రేమ మీద వేల కొద్ది పాటలు ఉన్నాయి. మీకు నచ్చిన ఒకపాటను ప్రేమికుల రోజు సందర్భంగా మీరు ప్రేమించే వాళ్లకు అంకితమివ్వండి. కమ్మని పాటలా మీరు కూడా కలకాలం గుర్తుండిపోతారు. -
ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా అది!
ప్రేమ..ఈ రెండక్షరాలు మనల్ని ఊహల్లో విహరించేలా చేస్తాయి. ప్రపంచాన్ని మరిచేలా చేస్తాయి. అందుకే ప్రేమకథాచిత్రాలు ఎన్ని వచ్చినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అందులోని ఎమోషన్స్ కొన్ని రోజుల దాకా మనతోనే ట్రావెల్ చేస్తాయి. ప్రేమకథల్లో ఏముంటాయి? అదొక సుత్తి అంటారు కొంతమంది. ఇంకొంతమందికి ప్రేమంటే అదొక పిచ్చి. లవ్ జానర్‌కు ప్రపంచమంతా ఫాలోయింగ్ ఉంది. ప్రేమకథలు తీస్తే..ఏ స్టార్డమ్ లేకున్నా దానికదే తెచ్చుకొని థియేటర్లలో వందల రోజులు ఆడేస్తుందని నమ్ముతారు ఫిల్మ్‌మేకర్స్. అందుకే లవ్ జానర్లో అనేక సినిమాలు వచ్చాయి..వస్తూనే ఉన్నాయి. కానీ దేనికదే ప్రత్యేకత. దేనిలో ఉండే ఎమోషన్స్ దానివే. అందుకే ప్రేమకు మనందరం అంతలా కనెక్ట్ అయిపోతాం. వాలైంటైన్స్ వీక్ సందర్భంగా ప్రేమకథాచిత్రాలను ఓసారి గుర్తుచేసుకుందాం. తొలిప్రేమ ప్రేమలోని అమాకయత్వం అంతా ఈ సినిమాలో ఉంటుంది. మొదటిసారి ప్రేమలో పడినప్పుడు ఎలా ఉంటుంది, ప్రేమించిన వ్యక్తిని చూడటానికి ఎంత ఆరాటపడతారు, ప్రేమను తెలియజేయడానికి ఎంత కష్టపడతారు లాంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఆర్య నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు..నా ప్రేమను ఫీల్ అవ్వు అంటూ ఆర్య అనే యువకుడు తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆర్య ఒక కొత్తరకం ప్రేమ కథ. ఇలా కూడా ప్రేమ ఉంటుందా అన్నట్లుగా ఈ కథ నడుస్తుంది. చివరికి సుఖాంతమే అయినా, అంతవరకూ ఈ ప్రమకథలో చాలా గమ్మత్తైన మలుపులు ఉంటాయి. నా ఆటోగ్రాఫ్..స్వీట్మెమురీస్ జీవితంలో మూడు దశల్లో తను ప్రేమించిన ముగ్గురు గుర్తుచేసుకుంటూ ఒక వ్యక్తిచేసే ప్రయాణమే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమురీస్. ప్రేమలోని అమాయకత్వం, స్వచ్చమైన ప్రేమ, బాధ అన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఇలాంటి కథతో మలయాళంలో ప్రేమమ్ సినిమా రూపొంది మంచి విజయం సాధించింది. ఏ మాయ చేశావే ఈ సినిమాలో ఎన్ని అలకలు ఉంటాయో,అంతే ప్రేమ ఉంటుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ సినిమాల్లో ‘ఏ మాయ చేశావేకి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే, నేను నిన్నే ఎందుకు ప్రేమించాలి? అని అడుగుతాడు హీరో. ప్రేమ కథల్లో ఉండే మ్యాజిక్ అంతా ఈ సినిమాలో ఉంటుంది. 100% లవ్ మనసునిండా ప్రేమ ఉన్నా ఇగోల కారణంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనుకునే క్యూట్ అండ్ రొమాంటిక్ బావా మరదళ్ల కథ ఇది. అన్నింట్లో తనే గ్రేట్ అని ఫీలయ్యే హీరోకి..తన టాలెంట్‌తో ధీటైన సమాధానం చెప్తుంది హీరోయిన్. ఇక అప్పట్నుంచి ఎవరికి వారు గ్రేట్ అని నిరూపించుకోవడం కోసం చేసే క్యూట్ టామ్ అండ్ జెర్రీ ఫైట్లా సాగుతుంది. ఎదుటివాళ్ల భావాలతో సంబంధం లేకుండా తన పంతమే నెగ్గాలనుకుంటాడు హీరో. చివరికి హీరో మరదలి ప్రేమతో మిస్టర్ పర్ఫెక్ట్‌లా మారతాడు. నిన్నుకోరి ప్రేమ పుట్టడానికి క్షణకాలం చాలు. కానీ అది పెళ్లిబంధంగా మారడానికి మధ్య చాలా పరిస్థితులు అడ్డంకులుగా మారతాయి. ఈ సినిమాలోనూ అదే జరుగుతుంది. ఇద్దరూ ప్రేమించుకున్నా కొన్ని కారణాల వల్ల పెళ్లిచేసుకోలేకపోతారు. అప్పటినుంచి తనకోసం అనునిత్యం తపన చెందుతుంటాడు హీరో నాని. ఈ క్రమంలో తన ప్రేయసి వాళ్లింటికి వెళతాడు. తను ప్రేమించిన అమ్మాయి వాళ్ల భర్తతో కలిసి సంతోషంగా ఉందని తెలుసుకున్నాక హీరో కూడా మారతాడు. తర్వాత తెలిసిన బంధువులమ్మాయితో హీరో పెళ్లి జరుగి కథ సుఖాంతమవుతుంది. చాలా మందికి ఈ కథ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలోని పాటలు కూడా మంచి విజయం సాధించాయి. అర్జున్‌రెడ్డి ప్రమలో ఎంత ప్రేమ ఉంటుందో, అంతే బాధ కూడా ఉంటుంది. ఆ బాధను చెప్పే సినిమా అర్జున్‌రెడ్డి. ప్రేమించిన అమ్మాయి అకస్మాత్తుగా దూరమైతే అర్జున్‌రెడ్డి అనే వ్యక్తి జీవితమంతా తలకిందులు అయిపోతుంది. కొన్నినెలలపాటు తనలో తానే ఒకనరకం అనుభవిస్తాడు. అతడి కథే ఈ సినిమా. ప్రేమకథల్లో మరో కొత్తకోణం ఈ సినిమా. దొరసాని స్వచ్ఛమైన ప్రేమకు కులాలు,అంతస్తులు అడ్డురావని ఓ దొరసాని పేదింటి అబ్బాయిని ప్రేమిస్తే ...అందుకు ఒప్పుకోని దొరసాని కుటుంబసభ్యలు వారిని ఏం చేశారుట? . వారి ప్రాణం పోతుందని తెలిసినా ప్రేమ కోసం వారు చేసిన పోరాటం ఏంటి అన్నదే ఈ సినిమా కథ.ఈలాంటి జానర్లో ఇదివరకే సినిమాలు వచ్చినా దేనికదే ప్రత్యేకం. తెలంగాఫ గడీల నేపథ్యంలో ఓ ఊరి దొరసానికి ,పేదింటి అబ్బయికి మధ్య సాగిన ప్రేమకథకు తెలంగాణ యాసను జోడించి తీసిన స్వచ్ఛమైన ప్రేమకథ. కమర్షియల్‌గా కాకుండా అందంగా తీర్చిదిద్దిన రియల్స్టోరి ఇది. డియర్ కామ్రేడ్ విప్లవ భావాలున్న ఓ వ్యక్తి ప్రేమలో పడటం, ఆ తర్వాత తన భావాలకు,ప్రేమకు మధ్య జరిగే సంఘర్షణ, వాటి వల్ల ఎదురైన పరిస్థితులు, మహిళా క్రికెట్ అసోసియేషన్‌లో వేదింపుల నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. జాను తమిళంలో క్లాసిక్ హిట్‌గా నిలిచిన 96 సినిమాకి రీమేక్ ఈ సినిమా. వృత్తిపరంగా ట్రావెల్ ఫోటోగ్రాఫరైన రామ్..అనుకోకుండా తను చదువుకున్న స్కూల్‌కి వెళతాడు. స్కూల్‌ని చూసి పాత ఙ్ఞాపకాల్ని నెమరేసుకుంటాడు. రామ్, జాను పదో తరగతిలో ప్రేమలో పడతారు. కానీ అనుకోకుండా విడిపోతారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో కలుసుకున్న వాళ్లిద్దరూ తమ తొలిప్రేమ గురించి ఏం మాట్లాడుకున్నారు? అన్ని సంవత్సరాల తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు ఏంటి అన్నదే ‘జాను’ కథ. ప్రతీ ఒక్కరి జీవితంలో ఫస్ట్‌లవ్ చాలా స్పెషల్. అలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఈ సినిమా. -
మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తే! వెంటనే..
వాలెంటైన్స్ వీక్ మొదలై అప్పుడే నాలుగు రోజులు అవుతోంది. వాలెంటైన్ వీక్ సందర్భంగా బహుమతులతో ప్రేమను వ్యక్తపరుచుకునే జంటలకు మరో ముఖ్యమైన రోజు ‘టెడ్డీ డే’... ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు అందమైన టెడ్డీ బేర్ బొమ్మలను ఇచ్చిపుచ్చుకుని ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటారు. టెడ్డీ బేర్ క్యూట్‌నెస్, సంతోషానికి గుర్తు. మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే టెడ్డీ బేర్ రకాల్ని బట్టి మనం వారిని ఎంత ప్రేమిస్తున్నామో తెలియజేయవచ్చు. ఇద్దరి మధ్యా అందమైన బంధాన్ని నెలకొల్పటానికి టెడ్డీ బేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఆడపిల్లల జీవితంలోని ఏదో ఒక సందర్భం ఈ టెడ్డీ బేర్‌తో ముడిపడిఉండటం పరిపాటి. అందుకే ఓ అందమైన టెడ్డీ బేర్‌ను ఎంచుకోండి! మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వండి. అయితే మనం చేయవల్సిందల్లా మన మనసులోని భావాలను ప్రతిబింబించేలా ఓ టెడ్డీ బేర్‌ను ఎంచుకోవటమే. ఆ తర్వాత మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో తెలియజేస్తూ ఓ సందేశాన్ని రాసి ఆ బొమ్మకు అతికించండి. ఎందుకంటే కేవలం బహుమతులే కాదు! మనం ప్రేమగా వారిని ఉద్ధేశించి రాసే నాలుగు వాఖ్యాలు కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మీ ప్రేమకు రంగులద్దండి! ఒక్కో రంగు టెడ్డీ బేర్ ఒక్కో అర్థాన్నిస్తుంది. అందుకే బొమ్మను కొనబోయే ముందు మీ ప్రియమైన వారికి ఎలాంటి రంగు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవటం ముఖ్యం. పింక్ : ఈ రంగు ఎదుటి వ్యక్తిపై మనకున్న అన్‌కండిషనల్ లవ్‌ను, ఎఫెక్షన్, కంపాషన్ను తెలియజేస్తుంది. తెలుపు : ఈ రంగు అమాయకత్వానికి, అందానికి ప్రతిబింబంలాంటిది. ఈ రంగు ఓ కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఎరుపు : ఇది ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఆరెంజ్ : ఈ రంగు సంతోషాన్ని, ప్యాషన్, పాజిటివ్ ఎనర్జీని సూచిస్తుంది. నీలం : ఈ రంగు టెడ్డీ బేర్ నిజాయితీ, నమ్మకానికి చిహ్నం. మీరో వ్యక్తిని మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తున్నట్లయితే వెంటనే నీలం రంగు టెడ్డీ బేర్‌ను కొని వారికి బహుమతిగా ఇవ్వండి. -
ప్రపోజ్ డే! ఇలా ఇంప్రెస్ చేయండి
వాలెంటైన్స్ వీక్ మొదలై ఓ రోజు గడిచిపోయింది. వారంలోని రెండో రోజు రానే వచ్చింది! అదే ప్రపోజ్ డే. ప్రేమలో ఉన్నవారు భాగస్వామి మెచ్చేలా తమ మదిలోని ప్రేమను వ్యక్తపరచటం.. కొత్తగా ప్రేమలో పడ్డవారైతే తమకిష్టమైన వారి మనసును గెలిచేలా ప్రపోజ్ చేయటం ఈ రోజు ప్రత్యేకత. ఎలా ప్రపోజ్ చేయాలన్న దానిపైన ప్రతీఒక్కరికి ఓ ఆలోచన ఉంటుంది. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే అందరూ ట్రెండ్‌లో ఉన్నవాటినే ఫాలో అవ్వటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, మీరు అలా చేయకండి. ఓల్ట్ ఈజ్ గోల్డ్ అన్నట్లు కొంచెం కొత్తగా.. పాత పద్దతుల్ని అవలంభించండి. మీ ప్రేమను ఆలోచనలుగా మలిచి.. భావాల్ని అక్షరాలుగా చేసి చక్కటి ప్రేమలేఖ రాయండి. ఆ ప్రేమలేఖ మీ మనసు ప్రతిబింబించాలని మాత్రం మర్చిపోకండి. ఎదుటి వ్యక్తి ఇంప్రెస్ అయ్యేలా కవితలు, కొటేషన్లు రాసినా మంచిదే. ఇక పెళ్లైన మగవాళ్లైతే మీ భాగస్వామి కోసం ప్రేమగా వండిపెట్టండి! కాసేపు వారితో సరదాగా గడపండి. బెస్ట్ ప్రపోజ్ డే కొటేషన్స్ : ప్రేమంటే ఎదుటి వ్యక్తిలో ప్రేమను వెతుక్కోవటం కాదు! నిన్ను వెతుక్కోవటం నాదో కోరిక! ఆ సూర్యుడు భూమిపై తెగిపడే దాకా నేను నీ తోడుగా ఉండాలని నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నానో నాకు తెలియదు.. ఓ క్షణం నువ్వు కనిపించకపోతే ఎందుకు బాధపడుతున్నానో తెలియదు.. కానీ, నువ్వు లేకుండా నేను లేనని మాత్రం తెలుసు! నా హృదయాన్ని ఉంగరం చేసి అందించా.. ఎన్నడూ నువ్వు ఒంటరిగా నడవకూడదని ఆశించా.. నా హృదయాన్ని నీ నివాసం చేసి.. గది బయట నా ఆలోచనల్ని కాపలా ఉంచా.. -
వాలెంటైన్స్ వీక్! 8రోజుల ప్రేమ పండుగ!
ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండగే. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్ డే రాకకోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ డే ప్రత్యేక ఆ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. ప్రేమికుల రోజు.. ఫిబ్రవరి 14వ తేదీకి వారం రోజుల ముందు ఫిబ్రవరి 7నుంచే వేడుకలు మొదలవుతాయి. దీన్నే వాలెంటైన్స్ వీక్‌గా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్‌లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లోని ఎనిమిది రోజులల్లో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 1) రోజ్ డే : వాలెంటైన్ వీక్.. రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 7నుంచి 14 వరకు వారం రోజుల పాటు ఈ స్పెషల్డేస్ ఉంటాయి. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. దానితో పాటు గులాబీ పువ్వులు ఉండే మంచి మెసేజ్‌లు ఉన్న గ్రీటింగ్ కార్డులను గిఫ్ట్‌లుగా ఇస్తారు. ‘మనసుకు మాత్రమే తెలిసిన భాషలో.. నా ప్రేమను ఈ గులాబి పువ్వు నీకు తెలియజేస్తుంది’ లాంటి కొటేషన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తాయి. 2) ప్రపోజ్ డే : ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఈరోజున తాము ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎన్ని రోజుల నుంచో ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మీరు కూడా మీకిష్టమైన వారికి మీ మనసులో మాట చెప్పాలనుకంటే ఈ ఏడాది కచ్చితంగా చెప్పేయండి. ఒక మంచి గులాబీతోనో, లేక చేతికి రింగ్ తొడిగో మీ ప్రేమను వ్యక్తపరచండి. 3) చాక్లెట్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ప్రేమ బంధం ఎంతో తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. తాము ప్రేమించిన వారు పక్కన ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. అలాంటి ఆ బంధాన్ని మరింత మధురంగా మలుచుకోవాలంటే చాక్లెట్ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్ షేర్ చేసుకోవాల్సిందే. 4) టెడ్డీ డే : ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని జరుపుకుంటారు. టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి ఎంతో అందంగా మృధువుగా ఉండే టెడ్డీలు ఎంతో ఆకర్షిస్తాయి. అంతే కాకుండా అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో టెడ్డీని ప్రజెంట్ చేయడం ద్వారా మీ అందమైన ప్రేమసికి ఎంతో క్యూట్‌గా మీ ప్రేమను తెలియజేయవచ్చు. 5) ప్రామిస్ డే : ఈరోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికులు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నీకు బాసటగా నిలుస్తాను అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ బంధం మరింత బలపడటానికి మీరు చెప్పే ఒక్క మాట చాలు. అందుకే మీ మనసులో ఉన్న భావాల్ని మీరు ప్రేమించిన వారికి అర్థం అయ్యేలా అందంగా చెప్పండి. ‘ నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికి మర్చిపోను! నిన్ను ఎప్పటికీ వీడిపోను’’ అంటూ మీ ప్రేమను తెలపండి. ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. 6) హగ్ డే : ఈ డే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిళ్లలోకి తీసుకుని మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ భావాలు మాటల్లో వర్ణించలేము. ఆ అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే హగ్డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్ కార్డును బహుమతిగా ఇస్తారు. 7) కిస్ డే : వాలెంటైన్స్ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్ డేగా జరుపుకుంటారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. ఆ బాధలన్నింటిని దూరం చేస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో.. రోజును ప్రారంభిస్తే ఆరోజంతా ఆనందంగానే గడుస్తుంది. 8) వాలంటైన్స్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంతో పాటు ఆరోజంతా వారితో ఆనందంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు. తెలుసుకున్నారుగా వాలెంటైన్ వీక్‌లో ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రత్యేకతలు ఇంకెందుకు ఆలస్యం! ఆరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. -
ప్రేమికుల మొదటి ఛాయిస్ అదే!
సాధారణంగానే ప్రేమికులు సందర్భం లేకుండానే బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా ఎదురుచూసే వాలెంటైన్స్‌డేని మరింత అందంగా, మదుర ఙ్ఞాపకంలా మలుచుకునేందుకు ప్రేమికులంతా గిఫ్ట్‌లతో రెడీ అయిపోతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన బహుమతులు ఇచ్చి తమవారిని ఇంప్రెస్ చేస్తుంటారు. వాటిలో ప్రత్యేకంగా వాలెంటైన్స్ డేకి ఇచ్చిపుచ్చుకునే మోస్ట్ పాపలర్ గిఫ్ట్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 1. రోజా పువ్వు : ప్రేమను వ్యక్తపరచడానికి దాదాపు ఎనభై శాతం ప్రేమికుల మొదటి ఛాయిస్ రోజా పువ్వేనట. రోజా పువ్వులోనూ రకరకాల రంగులున్నా ఎర్ర గులాబీకే ఎక్కువ మక్కువ చూపుతారు. 2. చాక్లెట్స్ : వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఇష్టపడేది చాక్లెట్స్. వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రతీ ఒక్కరి గిఫ్ట్ బాక్స్‌లలో ఉండే కంపల్సరీ ఐటెమ్. చాక్లెట్‌లోని తీపిదనంతో ఆ బంధం మరింత దృఢంగా మారుతుందనేది ప్రేమికుల నమ్మకం. 3. రింగ్ : తాము ప్రేమించినవారి ముందు మోకాళ్లపై కూర్చొని వారి చేతిని దగ్గరగా తీసుకొని ఉంగరాన్ని తొడుగుతూ ప్రేమను వ్యక్తపరుస్తారు. పట్టుకున్న చేతిని వదలకుండా జీవితాంతం వారికి తోడుగా నిలుస్తామని భరోసానిస్తూ ప్రపోజ్ చేస్తారు. ఇలా ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు త్వరగా ప్రేమను అంగీకరిస్తారని ఓ సర్వేలో తేలింది. 4. వ్రిస్ట్ వాచ్ : తమ మనసుకు నచ్చినవారికి అమ్మాయిలు ఎక్కువగా వాచ్ ఇవ్వడానికి ఇష్టపడతారు. అబ్బయిలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా తక్కువ ఆఫ్షన్స్ ఉంటాయి. వాటిలో వాచీలదే ప్రథమ స్థానం. అంతేకాకుండా చేతికి ఉండే గడియారం అనుక్షణం తమను గుర్తుచేస్తూ ఉంటుందని ఉద్దేశంతో చాలామంది అమ్మాయిలు వాచ్‌లను ఇవ్వడానికి మక్కువ చూపిస్తుంటారట. 5. టెడ్డీబేర్ : చూడటానికి చాలా క్యూట్‌గా, అందంగా ఉండే టెడ్డీస్ అంటే ఇష్టపడని మగువ ఉండదు. అందుకే తమ ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి చాలామంది అబ్బయిలు టెడ్డీ బేర్లను గిఫ్ట్‌లుగా ఇస్తుంటారు. తాము వారి పక్కన లేకున్నా వారున్నట్లుగా భావించి మనసులో మాటలు చెప్పుకోవడానికి టెడ్డీబేర్ బెస్ట్ ఛాయిస్ 6. కాఫీ మగ్ : ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగనిదే మత్తు వదలదు చాలామందికి. ఉదయం లేవగానే తాము గుర్తొచ్చేలా ఉండేందుకు చాలా మంది కాఫీ మగ్‌లను గిఫ్ట్ చేస్తుంటారు. వీటిలో చాలా రకాలున్నాయి. వాళ్ల అభిరుచికి తగ్గట్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంచుకుంటుంటారు. 7. గాగుల్స్ : బయటికి వెళ్లాలంటే కాలంతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి ఆల్‌టైం ఫేవరెట్ ఛాయిస్ గాగుల్స్. సో వారి ప్రేమించినవారికి గాగుల్స్ ని గిఫ్ట్ గా ఇస్తుంటారు. 8. సెల్‌ఫోన్ : సెల్‌ఫోన్ ప్రతీ ఒక్కరి జీవితంలో ఓ భాగమైపోయింది. అందుకే తమ జీవిత భాగస్వామికి సెల్‌ఫోన్ ఇచ్చి సర్ఫ్రైజ్ చేస్తుంటారు చాలా మంది ప్రేమికులు. తమతో గడిపిన ప్రతీ క్షణాన్ని మధురానుభూతిగా మలచుకోవడానికి సెల్ఫోన్లో బందిస్తుంటారు. 9. మేకప్ సెట్ : ప్రతీ అమ్మాయి తన అందానికి మరింత మెరుగులు దిద్దేందుకు మేకప్‌ను ఉపయోగిస్తుంటారు. సందర్భానికి తగ్గట్లు వారి అలంకరణలో మార్పులు చేసుకుంటూ మరింత అందంగా కనబడేందుకు సిద్దమతుంటారు. ఇక వాలెంటైన్స్ డే న వారికి ఎంతో ఇష్టమైన మేకప్సెట్ గిఫ్ట్‌గా ఇస్తే అమ్మాయిలు ఫుల్ ఖుష్ అవుతారు. 10. పరఫ్యూమ్ : పర్ఫ్యూమ్ మన ఆలోచనలపై చాలా ప్రభావం చూపుతుంది. అయితే లైట్ స్మెల్లింగ్ పర్ఫ్యూమ్స్ని చాలా మంది ఇష్టపడుతుంటారు. మంచి సువాసనాభరితమైన పర్ఫ్యూమ్ తమ వారిని ఆకర్షించుకునేందుకు మరో సున్నతిమైన ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. 11. గ్రీటింగ్ కార్డ్ : ఏ చిన్న వేడుక జరిగినా గ్రీటింగ్ కార్డు ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. గ్రీటింగ్ కార్డుల్లోనూ అకేషన్‌కి తగ్గట్లు చాలా వెరైటీస్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా తమ ప్రేమికుల కోసం స్వయంగా వారే గ్రీటింగ్ కార్డులను రూపొందించవచ్చు. అది కూడా చాలా సులభమైన పద్దతిలో. సో మీరు ప్రేమించేవారికోసం కొంత సమయం కేటాయించి గ్రీటింగ్కార్డును మీరే అందంగా తీర్చిదిద్దవచ్చు. మీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలతో హ్యండ్ క్రాఫ్ట్ ఇచ్చినా బావుంటుంది. -
కుచ్ మీఠీ బాత్
వీలైతే నాలుగు మాటలకు.. కుదిరితే కప్పు కాఫీకి మధ్యలో.. ఇచ్చిపుచ్చుకునే ఇదొకటి ఉంది. పరిచయాలు పెంచే అమోఘమైన ప్రేమ గుళిక అది. తొలిచూపులో పుట్టి.. కొంటె చూపులతో కనెక్టై.. ముసిముసి నవ్వుల తో ముడిపడే.. అందమైన ఫీలింగ్‌ను తర్వాతి మెట్టుకు తోసే మహత్తర మార్గం ఏదైనా ఉందంటే అది చాక్లెట్ల రాయబారమే. ప్రేమలో ఎంత కమిట్మెంట్ ఉందో చాటడానికి చాక్లెట్లే కొలమానం. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పడానికి ప్రేమపక్షులు వీటినే ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్లు ప్లేస్ కొట్టేశాయి. ప్రేమ ఎంతో మధురమో.. ప్రియురాలూ అంతే మధురంగా ఉండాలని.. ప్రేమికుడు చాక్లెట్ ఆఫర్ చేస్తాడు. చాక్లెట్ అంటే చిన్ని చిన్ని ఆశ చాక్లెట్ కాదు.. ఓపిగ్గా తింటే.. ఎంత లేదన్నా మినిమమ్ ఓ గంటైనా పట్టే చాక్లెట్. ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ రుచిని ఆస్వాదించిన తర్వాత.. సదరు ప్రేయసి మనసు మాటున దాగున్న మాటల మూటలు.. తీపి కబుర్లుగా మారిపోతాయి. ఈ చాక్లెట్ల పంపకాలు రోజులకు రోజులు అలా సాగిపోతూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా రోజుకింత దృఢంగా మారిపోతుంది. 3డీ ఇంప్రెస్ 200 ఏళ్ల కిందటే ప్రేమికులు చాక్లెట్ల వాయనం మొదలు పెట్టారు. ఈ ట్రెండ్ ముదిరిపాకాన పడ్డాక.. రకరకాల చాక్లెట్లు మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి. చాక్లెట్ల మీద మెసేజ్‌లు చేర్చి మరీ ఒకరికొకరూ ప్రేమగా ఇచ్చుకుంటున్నారు. చాకో తాజ్‌మహల్‌ను తయారు చేసి.. ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఇలా డిఫరెంట్ థీమ్స్‌తో వస్తున్న చాక్లెట్లు.. ఇద్దరి మధ్య ప్రేమ చప్పున పుట్టేట్టు చేస్తున్నాయి. చాక్లెట్లే కాదు.. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా ప్రేమను వ్యక్తపరచడానికి చాక్లెట్ బొకేలు కూడా వచ్చేశాయి. ప్రేయసి ఫొటోను, అది పొందుపరిచే ఫ్రేమ్‌ని.. 3డీ ప్రింటింగ్ సహాయంతో చాక్లెట్‌తోనే రూపొందించి.. గిఫ్ట్‌గా ఇచ్చి ఆమె మనసును గెలుచుకుంటున్నారు. . .:: శిరీష చల్లపల్లి