ప్రేమించిన వారు ప్రతిక్షణం మనతోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు! కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ విరహ వేదనను టెడ్డీబేర్‌లు దూరం చేయగలవు. అందుకే ఈ టెడ్డీలకు వాలెంటైన్స్ వీక్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. లవర్స్ ఈరోజును (ఫిబ్రవరి10) టెడ్డీబేర్ డేగా జరుపుకుంటారు. ఇంకేం.. ప్రేమికుల్లారా! మీ నిచ్చెలికి ఒక టెడ్డీ ఇచ్చి తన పక్కనే ఉండే ఛాన్స్ కొట్టేయండి మరి...
మరోవైపు టెడ్డీబేర్‌లకు, అమ్మాయిలకు మధ్య చిన్ననాటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వారు రకారకాల బొమ్మలతో ఆడుకుంటుంటారు. ఒక్కరే ఉన్నప్పుడు టెడ్డీలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులతో సరదాగా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పక్కనే టెడ్డీ ఉండాల్సిందే. చిన్నారి పాపలు కొన్నిసార్లు తమ టెడ్డీలకు ప్రాణం ఆపాదించి అందంగా ముస్తాబు చేసి తయారుచేసి సంతోషపడిపోతారు. బెడ్‌పైనే తమ పక్కనే పెట్టుకుని నిద్రపోతారు.
ఇక ప్రేమికుల విషయానికొస్తే.. మనసుపడిన వారికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ప్రియుడు/ప్రియురాలు టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తుంటారు. తమవారు గుర్తుగా ఇచ్చే టెడ్డీ బొమ్మలతో వారు లోన్లీ ఫీలింగ్‌ను కొంతవరకు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమే కాకుండా కోపతాపాలకు కొన్నిసార్లు వేదిక అవుతుంటాయి. ప్రేమించినవారిపై అలకను, చిరుకోపాన్ని టెడ్డీలపై చూపించి వారు తెగ ఆనందపడిపోతారు.
Comments
Please login to add a commentAdd a comment