ఏడు రోజుల వాలంటైన్స్ డే వీక్ జోరుగా..హుషారుగా సాగుతోంది. పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన వాలంటైన్స్ డే క్రమంగా విశ్వవ్యాపితమైంది. ఎక్కడ చూసినా... వాలెంటైన్స్ సందడి. ప్రేమ కోసం, ప్రేమ కొరకు ,ప్రేమతో అంటూ లవ్‌బర్డ్స్ ప్రేమికుల దినోత్సవాన్ని ఎంజాయ్ చేస్తారు.. మరి ఈరోజు స్పెషల్ ఏంటి?
‘ప్రేమ’ అటే మ్యాజిక్.. అదో మాయ. మాటల్లో వర్ణించలేని తీయని అనుభూతి. అందుకే వాలెంటైన్స్ డే వీక్‌లో చాకోలెట్ డే చాలా ఇంపార్టెంట్. ఫిబ్రవరి 9న అత్యంత మధురంగా జరుపుకునేదే చాకొలెట్ డే. అలాంటి స్వీటెస్ట్ డే కోసం ప్రేమజంటలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పెళ్లికి ముందు గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడితే.. పెళ్లి తరవాత తన జీవిత భాగస్వామితో ఈ చాక్‌లెట్ డే ఎంజాయ్ చేయవచ్చు. ప్రేమ భావన తరువాత మన మనసును ఆహ్లాదంగా, తీపి చేసేవి చాకోలెట్లే! మరి అలాంటి చాకొలెట్స్‌ను ప్రేమించిన వ్యక్తికి షేర్ చేయకుండా ఎలా ఉంటారు. నో. వే ..కదా.. రకరకాల ప్రేమ చాక్‌లెట్లు, డార్క్ చాకోలెట్లు.. అబ్బో.. చాలానే మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. వాటిలో మీ టేస్ట్‌కు తగ్గట్టుఎంచుకుని మీ వాలెంటైన్ స్వీట్ మూడ్‌లోకి తీసుకెళ్లండి.
చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు. చిన్న పిల్లల దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇష్టపడతారు. అంతే కాదు ప్రేమికులు ఎక్కువగా ఇచ్చుకునే గిప్ట్ కూడా చాక్లెట్ అనే చెప్పుకోవాలి. అసలు చాక్లెట్ చూడగానే మనసు తేలికపడుతుంది. చాక్లెట్ తింటే డిప్రెషన్ హుష్ కాకి అవుతుంది. మనసు ఉత్సాహంగా ప్రశాంతంగా మారిపోయి మెదడు పనితీరునీ మెరుగు పరుస్తుందట. సో.. అలిగి కోపంతో రగిలిపోతున్న ప్రేయసినీ లేదా ప్రియుడిని చాకొలెట్ ఇచ్చి కూల్ చేసేయండి.. బీపీని కంట్రోల్ చేయడానికి చాక్‌లెట్ దివ్య ఔషధమని చాలా స్టడీస్ చెప్పాయి. ఖరీదైన గిప్ట్స్ ఇవ్వలేని ఆనందాన్ని ఒక చిన్న చాక్‌లెట్‌తో పొందవచ్చు. హ్యాపీ చాక్‌లెట్ డే..
ఫిబ్రవరి 14న వచ్చే వాలంటైన్స్ డే రోజు ప్రేమజంటలు ఫుల్‌బీజీ. అసలు 7 రోజుల వాలంటైన్స్ వీక్ సందడి షురూ అవుతుంది. రోజ్ డేతో మొదలైన వాలెంటైన్స్ వీక్ కిస్ డే తో ముగుస్తుంది. చివరిగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే గాసెలబ్రేట్‌గా చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment