వాలెంటైన్స్ డే వీక్‌లో రొమాంటింక్ డే ప్రపోజ్ డే. ప్రేమ ఎప్పడు ఎక్కడ ఎలా పుట్టిందనే దానికంటే...ఎలా ప్రపోజ్ చేశామన్నదే లెక్క. వాలెంటైన్‌ను ఎలా ఇంప్రెస్ చేశామన్నదే మేటర్. వాలెంటైన్స్ డే వీక్‌లో రెండో రోజు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే గురించి ఈ విషయాలు తెలుసా మీకు...
వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్స్ డే ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రేమను ప్రకటించుకోవడానికి, అవతలి వారి మనసు తెలుసుకోవడానికి ఫిబ్రవరి 14 కూడా ఒక ముహూర్తం లాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నప్పటికీ, వాలెంటైన్స్ వీక్ అనేది భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారు. ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచడం, వారి మనసు గెల్చుకోవడం అనుకున్నంత సులువు కావు. ఒక విధంగా అదొక ఆర్ట్. అందుకే లవ్ బర్డ్స్ ప్రపోజ్ డే కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు. ప్రేమ మాటల కందని మధరానుభూతి. అనుభవిస్తేనే కానీ తెలియని ఓ ఉద్వేగం. కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రేమ భావనకు అతీతులు కాదు.
ప్రపోజ్ డే రోజున ఎదుటివారి పట్ల మీలో ఉన్న భావనలను వ్యక్తపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వారికిష్టమైన వాచ్ లేదా రింగ్ లేదా ఏదైనా వస్తువు గిఫ్ట్ గా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు. మంచి కవిత రాయొచ్చు.. మీరు మంచి ఆర్టిస్టులయితే ఆ పోర్‌ట్రయిట్ గీసి ఇచ్చి ఎందుకు నచ్చారో మీ ఫీలింగ్స్ చెప్పి చూడండి. ఇంకా స్మార్ట్‌గా...మీకు నచ్చిన మూవీ సాంగ్‌ను కోట్ చేస్తూ.. మీ ఫస్ట్ లవ్‌కు సింపుల్‌గా వాట్సాప్ చేసేయండి. ఎలా చెప్పనమ్మా అంటూ వెయిట్ చూస్తూ కూర్చుంటే కుదరదు కదా.. సో మనసులోని ప్రేమను వ్యక్తం చేసి ప్రపోజ్ డేని ఎంజాయ్ చేయండి.
ప్రేయసి లేదా ప్రియుడికి ఒక రెడ్ రోజ్ ఇచ్చి మాటలతో చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే గిఫ్ట్స్ కార్డులు, గిఫ్ట్స్, చాక్లెట్లు, టెడ్టీ ఇవ్వడం కామన్.. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా ప్రేమను ప్రకటించి సర్‌ప్రైజ్ చేయడం విశేషం. అవతలి వారి అభిరుచులకు తగ్గట్టు, వారు ఊహించని విధంగా తమ మనసులోని మాటను వ్యక్తం పరుస్తారు చాలామంది. అలా తమ జీవితంలోని ఎమోషనల్ మూమెంట్‌ను రొమాంటిగ్గా సూపర్ డూపర్‌గాసెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వాలెండైన్ వీక్‌లో 3వ రోజు ఫిబ్రవరి 9ని చాక్లెట్ డేగా, తర్వాత 4వ రోజున టెడ్డీ డేని ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఈ వరుసలోనే ప్రామీస్ డే, హగ్ డే, కిస్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment