Propose
-
స్టార్ హీరోకు క్యూట్ ప్రపోజ్.. మహిళ అభిమానానికి ఫిదా!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం భూల్ భూలయ్యా-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విద్యా బాలన్, త్రిప్తి డిమ్రీ, మాధురి దీక్షిత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే హీరో కార్తీక్ ఆర్యన్‌కు ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఓ మహిళా అభిమాని ఏకంగా ఆయనకు ప్రపోజ్ చేసింది. కార్తీక్ ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరు కాగా.. ఉహించని విధంగా ఓ అభిమాని సాంగ్ పాడి మరీ అతనికి ప్రపోజ్ చేసింది. ఈ సంఘటనతో ఆశ్చర్యానికి గురైన కార్తీక్.. తన మొత్తం ఫిల్మోగ్రఫీని ఒక్క కవితలో ఆలోచనాత్మకంగా చేప్పినందుకు అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
Priyanka Jain- Shivakumar: తాజ్‌మహల్ ముందు ప్రియాంకకు ప్రపోజ్ చేసిన నటుడు (ఫోటోలు)
-
అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?
స్టార్ హీరోయిన్ అమలాపాల్‌కు రెండో పెళ్లికి సిద్ధమైంది. అయితే ఇప్పటికే డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన మలయాళీ భామ మరోసారి పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతోంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో వివాహబంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఓ వీడియోను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది. అయికే ఆమెను చేసుకోబోతున్న జగత్ ఎవరనే దానిపై నెటిజన్స్‌తో పాటు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మీకు కూడా అతను ఎవరు? ఏం చేస్తాడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్) జగత్ దేశాయ్ ఎవరు? అమలాపాల్ పెళ్లాడబోతున్న జగత్ దేశాయ్ ఎవరనే విషయంపై ఆమె ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దీంతో అతను ఏం చేస్తాడా? అని తెగ ఆరా తీస్తున్నారు. జగత్ దేశాయ్ గోవాలోని ఓ విల్లా గ్రూప్‌లో సేల్స్ హెడ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే గతంలో అమలాపాల్ సైతం గోవా బీచ్‌లో ఉన్న ఫోటోలు తన ఇన్‌స్టాలో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూన్ నుంచే అమలాపాల్ అతనితో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరు డేటింగ్ను అత్యంత రహస్యంగా ఉంచినట్లు సమాచారం. జగత్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లు చూస్తే అమలాపాల్ లైక్ కొట్టడం, కామెంట్స్ చేయడం కనిపించింది.. ఇప్పటి వరకు ఎక్కడా కూడా తన రిలేషన్ గురించి బయటికి చెప్పలేదు. తాజాగా తన బర్త్‌డే రోజున అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. (ఇది చదవండి: మహిళలు కేవలం దాని కోసమే కాదు: కంగనా రనౌత్ గట్టి కౌంటర్) View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Jagat Desai (@j_desaii) -
పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్‌గా ప్రకటించిన భామ!
కభీ ఖుషీ కభీ ఘమ్‌లో పూజా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక రాజ్. ఈ చిత్రం 2001లో రిలీజ్ కాగా.. సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది ముద్దుగుమ్మ. ప్రముఖ వ్యాపారవేత్త ప్రణవ్ బగ్గాతో పెళ్లికి రెడీ అయిపోయింది. టర్కీలో ప్రియుడు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని పంచుకుంది. ఇద్దరు జంటగా దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అఫీషియల్‌గా ప్రకటించింది. (ఇది చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) ఇన్‌స్టాలో మాళవిక రాస్తూ..' మేము మేము త్వరలోనే కొత్త ప్రపంచంలో అడుగుపెట్టబోతున్నాం. చాలా కాలం తర్వాత మాకు సమయం వచ్చింది. ఈ బంధంతో మేము ఇంకా బలంగా తయారయ్యాం.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, స్నేహితులు కాబోయే జంటకు అభినందనలు తెలిపారు. అవంతిక దస్సాని, స్టెబిన్ బెన్‌తో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మాళవిక, ప్రణవ్ పెళ్లి ఎప్పుడనే మాత్రం వెల్లడించలేదు. కాగా.. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కరణ్ జోహార్ తెరకెక్కించిన 'K3G' అనే చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ పాత్రను మాళవిక పోషించింది. అంతే కాకుండా ఆమె 2017లో వచ్చిన చిత్రం జయదేవ్లో కూడా కనిపించింది. ఆ తర్వాత ఆమె 'స్క్వాడ్' అనే చిత్రంలో రిన్జింగ్ డెంజోంగ్పా సరసన ప్రధాన పాత్ర పోషించింది. మాళవిక ప్రముఖ బాలీవుడ్ నటుడు జగదీశ్ రాజ్ మనవరాలు, బాబీ రాజ్ కుమార్తె. అంతేకాకుండా ప్రముఖ నటి అనితా రాజ్ మేనకోడలు కూడా. (ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) View this post on Instagram A post shared by Malvika Raaj (@malvikaraaj) -
డెలివరీ బాయ్ నిర్వాకం.. మహిళకు పుడ్ డెలివరీ చేసి, ఆపై ఐ లైక్ యూ అంటూ..
మొబైల్ వాడకం, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతీది ఆన్‌లైన్‌లోకి మారుతోంది. తినే తిండి నుంచి ధరించే బట్టలు, కూరగాయలు ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అర చేతిలో మొబైల్ అందులో సంబంధిత యాప్ ఉంటే చాలు.. ఆర్డర్ పెట్టిన వెంటనే మన ఇంటి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. డెలవరీ కోసం మన ఇంటి అడ్రస్‌తో పాటు మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలకు అందిస్తున్నాం. అయితే కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ సంఘటన రుజువు చేసింది. అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. ఈ నేపథ్యంలో డొమినో డెలివరీ బోయ్ ఆమెకు ఫుడ్ డెలివరీ చేశాడు. అయితే అతను అంతటితో ఆగకుండా ఆ తరువాత... ‘నేను నిన్ను ఇష్టపడుతున్నాను’ అంటూ వాట్సాప్‌లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె షాకైంది. అనంతరం దీని నుంచి తేరుకుని తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వ్యక్తి.. ‘క్షమించండి.. నా పేరు కబీర్, నిన్న మీకు పిజ్జా ఇవ్వడానికి వచ్చాను.. నేను అదే.. నేను నిన్ను ఇష్టపడ్డాను’ అంటూ ఆమెకు వాట్సాప్‌లో ఈ రకంగా మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో వైపు డొమినోస్ దీనిపై స్పందిస్తూ.. "ఈ సంఘటన గురించి విన్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా, డొమినోస్ ఇండియా ఏ విధమైన దుష్ప్రవర్తన లేదా వేధింపుల పట్ల జీరో-టాలరెన్స్ పాలసీకి నిస్సందేహంగా కట్టుబడి ఉంది. తక్షణమే ఈ ఘటనపై విచరణ జరిపి చర్యలు తీసుకుంటామని హామి’ ఇచ్చింది. చదవండి: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు.. మహారాష్ట్ర బస్సు ప్రమాదానికి కారణాలేంటి? -
ఎన్నికలకు ఫార్ములా రెడీ, ఇక రంగంలోకి దూకడమే..
లక్నో: త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీజీపీని ఓడించాలంటే విపక్షాలు ఐక్యంగా పోరాడటమొక్కటే మార్గమన్నారు సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్. ఈ సందర్బంగా ఐక్య ప్రతిపక్ష కూటమి విధానాలపై తమ పార్టీ ధృక్కోణాన్ని వివరిస్తూ 80 మందిని ఓడించి, బీజేపీని తరిమికొట్టండని నినదించారు. 2024 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దారుణ ఓటమి తప్పదని.. బీసీలు, దళితులు, మైనారిటీలే బీజీపీని ఓడిస్తారన్నారు అఖిలేష్ యాదవ్. ఈసారి ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి మా దగ్గరొక ఫార్ములా ఉంది. ఐక్య ప్రతిపక్ష కూటమి నుండి పెద్ద జాతీయ పార్టీలు మాకు మద్దతిస్తే 80 మంది బీజేపీ ఎంపిలను ఓడిస్తాం.. బీజేపీని తరిమికొడతాం. అందుకే యూపీలో "80 గెలుద్దాం, బీజేపీని తరిమేద్దాం.." అన్న నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నామని అన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యంగా పోరాడాలన్న సంకల్పంతో ఐక్య ప్రతిపక్ష కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సమాజ్ వాది పార్టీ గతంలో కూడా కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రస్తావన తీసుకురాగా తామెప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకున్నా నిజాయతీగానే వ్యవహరించామని ఎప్పుడూ సీట్ల కోసం పట్టుబట్టలేదని గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు -
కార్పొరేట్ గవర్నెన్స్ బలోపేతానికి చర్యలు
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కార్పొరేట్ గవర్నెన్స్ (కంపెనీల నిర్వహణ/పాలన వ్యవహారాలు) బలోపేతానికి సెబీ చర్యలను ప్రతిపాదించింది. కొందరు వాటాదారులు ప్రత్యేక హక్కులను శాశ్వతంగా అనుభవించే అంశాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. లిస్టెడ్ కంపెనీలు చేసుకునే ఒప్పందాలు, బోర్డులో డైరెక్టర్ స్థానాలకు సంబంధించి కూడా పలు కొత్త ప్రతిపాదనలు చేసింది. ఆస్తుల అమ్మకం లేదా లీజు అంశాలనూ పరిష్కరించనుంది. ఈ ప్రతిపాదిత చర్యలపై సలహాలు, సూచనలను మార్చి 7లోపు తెలియజేయాలని సెబీ కోరింది. సెబీ ప్రతిపాదనలు ► ఒక కంపెనీ ఏదైనా వాటాదారునకు శాశ్వత హక్కులు కల్పిస్తే.. దీనిపై ఐదేళ్లకోసారి వాటాదారుల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ► ఇప్పటికే కల్పించిన ప్రత్యేక హక్కులను సైతం ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణపైనా వాటాదారుల ఆమోదం కోరాల్సి ఉంటుంది. ► ప్రమోటర్లు, వ్యవస్థాపకుడు, కొన్ని కార్పొరేట్ బాడీలకు ప్రత్యేక హక్కులు కల్పించడంపై వాటాదారుల నుంచి ఆందోళన వస్తుండడంతో సెబీ ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హక్కులు పొందిన వాటాదారులు, తర్వాతి కాలంలో వారి వాటాలను తగ్గించుకున్నప్పటికీ, అవే హక్కులను అనుభవిస్తుండడాన్ని సెబీ గుర్తించింది. ఇది వాటాదారుల హక్కులకు విరుద్ధమని సెబీ అభిప్రాయపడింది. ► కంపెనీ బోర్డులో నియమితులయ్యే డైరెక్టర్లు అందరూ ఎప్పటికప్పుడు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుందని సెబీ తన తాజా ప్రతిపాదనలలో పేర్కొంది. దీంతో కొందరు వ్యక్తులకు కంపెనీ బోర్డుల్లో శాశ్వత స్థానం కల్పిస్తున్నారనే ఆందోళనను పరిష్కరించనుంది. ముఖ్యంగా, ప్రమోటర్లు, డైరెక్టర్లకు సంబంధించిన వారిని ఇలా నియమిస్తుండడం గమనార్హం. ► 2024 ఏప్రిల్ 1 నుంచి బోర్డు డైరెక్టర్ల నియామానికి ప్రతీ ఐదేళ్లకోసారి వాటాదారుల ఆమోదం కోరాల్సి ఉంటుంది. 2024 మార్చి నాటికి బోర్డుల్లో డైరెక్టర్లుగా అధికారం అనుభవిస్తున్న వారికి సంబంధించి కూడా తదుపరి జరిగే ప్రథమ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల అనుమతి తీసుకోవాలని సెబీ పేర్కొంది. ► యాజమాన్యం లేదా కంపెనీ నిర్వహణపై ప్రభావం చూపించే ఒప్పందాలు, కంపెనీపై ఏవైనా బాధ్యతలు మోపే వాటి గురించి స్టాక్ ఎక్సేంజ్‌లకు తెలియజేయాలి. ► కంపెనీ వ్యాపార కార్యకలాపాలు, సరఫరా, కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించి తెలియజేయాల్సిన అవసరం ఉండదు. ఈఎస్జీ కింద మరిన్ని పథకాలు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (ఏఎంసీలు) ఈఎస్జీ కింద ఐదు కొత్త విభాగాల్లో ఫండ్స్‌ను తీసుకొచ్చేందుకు సెబీ ప్రతిపాదన చేసింది. ఈఎస్జీ అనేది పర్యావరణానికి హాని చేయని, సామాజిక, పరిపాలన ప్రమాణాలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే విధానం. ప్రస్తుతం ఒక ఏఎంసీ ఒక ఈఎస్జీ పథకాన్ని ప్రారంభించేందుకు అనుమతి ఉంది. కానీ ఒకటికి మించి భిన్నమైన పథకాలను ఈఎస్జీ కేటగిరీలో ఆఫర్ చేయాలనుకుంటే అందుకు ప్రస్తుతం అనుమతి లేదు. సెబీ నూతన ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఏంఎసీలు ఐదు ఈఎస్జీ కేటగిరీల్లో కలిపి మొత్తం మీద ఐదు పథకాలను ఆఫర్ చేయవచ్చు. ఈ పథకాల కింద మొత్తం ఆస్తుల్లో 80 శాతం వరకు ఈక్విటీ లేదా డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎస్జీ థీమ్‌లో అధికంగా పెట్టుబడులు కలిగి ఉండేట్టు అయితే దాన్ని విధిగా తెలియజేయాల్సి ఉంటుందని సెబీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాలకు అదనంగా, ఈఎస్జీ రేటింగ్లను సైతం ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్లకు విధిగా వెల్లడించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై సలహా, సూచనల తర్వాత సెబీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
ఆలియాకు రణ్‌బీర్ ప్రపోజ్.. ప్లాన్ మామూలుగా లేదుగా..!
బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ గురించి పరిచయం అక్కర్లేదు. అంతలా ఫేమస్ అయింది ఈ బాలీవుడ్ జంట. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఎలా మొదలైంది? మొదట ఆలియా భట్ ప్రపోజ్ చేసిందా? లేదా రణ్‌బీర్ కపూర్ ప్రపోజ్ చేశాడా? అని అభిమానుల్లో ఓ చిన్న సందేహం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఆలియా భట్. (ఇది చదవండి: బేబీ ఆలియా భట్.. వావ్ ఎంత క్యూట్‌గా ఉందో..!) గతంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఆలియా భట్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. కెన్యాలో జరిగిన ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం రణబీర్ కపూర్ ప్రపోజ్ చేసిన ఆ ఫోటో తెగ వైరలవుతోంది. ఆ ఫోటోలో రణ్‌బీర్ కపూర్ మోకాళ్లపై కూర్చుని ఆలియాకు సర్ప్రైజ్ షాక్ ఇచ్చాడు. దీంతో ఆలియా తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ సమయంలో ఏడుస్తూ కనిపించింది. అలియా మాట్లాడుతూ.. 'రణ్‌బీర్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని వివరించింది. చాలా అద్భుతమైన ప్రదేశంలో రణ్‌బీర్ నాకు ప్రపోజ్ చేశారు. అది కెన్యాలోని అడవుల్లోని ఓ అందమైన ప్రదేశం. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ మా గైడ్ ఆ ఫోటోలు తీసేలా రణ్‌బీర్ ప్లాన్ చేశాడు. ఆ తర్వాత నేను ఇంకా షాక్‌తో ఉన్నా. చాలా భావోద్వేగానికి గురయ్యా. ఆ ఫోటో నా జీవితంలో చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది ఆలియా భట్. (ఇది చదవండి: ఆలియా భట్ షాకింగ్ కండీషన్.. బేబీని చూడాలంటే ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!) అలియా, రణబీర్‌ల పెళ్లి: అలియా, రణబీర్ ఐదేళ్ల పాటు డేటింగ్ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో సన్నిహితుల, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది నవంబర్లోనే ఈ జంట ఓ పాప జన్మించింది. వీరి బేబీకి రాహ కపూర్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది అలియా భట్, రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మస్త్ర బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. -
వాలెంటైన్స్ డే వీక్: మోస్ట్ రొమాంటిక్ డే.. ‘ప్రపోజ్ డే’
వాలెంటైన్స్ డే వీక్‌లో రొమాంటింక్ డే ప్రపోజ్ డే. ప్రేమ ఎప్పడు ఎక్కడ ఎలా పుట్టిందనే దానికంటే...ఎలా ప్రపోజ్ చేశామన్నదే లెక్క. వాలెంటైన్‌ను ఎలా ఇంప్రెస్ చేశామన్నదే మేటర్. వాలెంటైన్స్ డే వీక్‌లో రెండో రోజు ఫిబ్రవరి 8 ప్రపోజ్ డే గురించి ఈ విషయాలు తెలుసా మీకు... వాలెంటైన్స్ డే లేదా సెయింట్ వాలెంటైన్స్ డే ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రేమను ప్రకటించుకోవడానికి, అవతలి వారి మనసు తెలుసుకోవడానికి ఫిబ్రవరి 14 కూడా ఒక ముహూర్తం లాంటిదే. అయితే ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నప్పటికీ, వాలెంటైన్స్ వీక్ అనేది భారతదేశంలో మాత్రమే జరుపుకుంటారు. ఇష్టమైన వ్యక్తికి ప్రేమను వ్యక్తపరచడం, వారి మనసు గెల్చుకోవడం అనుకున్నంత సులువు కావు. ఒక విధంగా అదొక ఆర్ట్. అందుకే లవ్ బర్డ్స్ ప్రపోజ్ డే కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు. ప్రేమ మాటల కందని మధరానుభూతి. అనుభవిస్తేనే కానీ తెలియని ఓ ఉద్వేగం. కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రేమ భావనకు అతీతులు కాదు. ప్రపోజ్ డే రోజున ఎదుటివారి పట్ల మీలో ఉన్న భావనలను వ్యక్తపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వారికిష్టమైన వాచ్ లేదా రింగ్ లేదా ఏదైనా వస్తువు గిఫ్ట్ గా ఇచ్చి ప్రేమను వ్యక్తపరచవచ్చు. మంచి కవిత రాయొచ్చు.. మీరు మంచి ఆర్టిస్టులయితే ఆ పోర్ట్రయిట్ గీసి ఇచ్చి ఎందుకు నచ్చారో మీ ఫీలింగ్స్ చెప్పి చూడండి. ఇంకా స్మార్ట్‌గా...మీకు నచ్చిన మూవీ సాంగ్‌ను కోట్ చేస్తూ.. మీ ఫస్ట్ లవ్‌కు సింపుల్‌గా వాట్సాప్ చేసేయండి. ఎలా చెప్పనమ్మా అంటూ వెయిట్ చూస్తూ కూర్చుంటే కుదరదు కదా.. సో మనసులోని ప్రేమను వ్యక్తం చేసి ప్రపోజ్ డేని ఎంజాయ్ చేయండి. ప్రేయసి లేదా ప్రియుడికి ఒక రెడ్ రోజ్ ఇచ్చి మాటలతో చెప్పలేని భావాలను వ్యక్తం చేస్తారు. అలాగే గిఫ్ట్స్ కార్డులు, గిఫ్ట్స్, చాక్లెట్లు, టెడ్టీ ఇవ్వడం కామన్.. అయితే వెరీ వెరీ స్పెషల్‌గా ప్రేమను ప్రకటించి సర్ప్రైజ్ చేయడం విశేషం. అవతలి వారి అభిరుచులకు తగ్గట్టు, వారు ఊహించని విధంగా తమ మనసులోని మాటను వ్యక్తం పరుస్తారు చాలామంది. అలా తమ జీవితంలోని ఎమోషనల్ మూమెంట్‌ను రొమాంటిగ్గా సూపర్ డూపర్గాసెలబ్రేట్ చేసుకుంటారు. ఇక వాలెండైన్ వీక్‌లో 3వ రోజు ఫిబ్రవరి 9ని చాక్లెట్ డేగా, తర్వాత 4వ రోజున టెడ్డీ డేని ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఈ వరుసలోనే ప్రామీస్ డే, హగ్ డే, కిస్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రపోజ్ డే స్పెషల్
-
ఆరేళ్ల వయసులో జూహీకి ప్రపోజ్ చేసిన హీరో..
Juhi Chawla Reveals Imran Khan Proposed To Her At Age Of 6: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో నటించి అనేక హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల 5జీ నెట్‌వర్క్‌పై పోరాటం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జూహీ ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ముద్దుల మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ పుట్టినరోజు గురువారం (జనవరి 13) జరిగింది. ఈ సందర్భంగా బీటౌన్ ప్రముఖులంతా ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు చెప్పారు. జూహీ కూడా బర్త్‌డే బాయ్‌కు ఆసక్తికరంగా విష్ చేసింది. 1988లో అమీర్ ఖాన్, జూహీ చావ్లా జంటగా నటించిన 'ఖయామత్ సే ఖయామత్ తక్' చిత్రంలోని ఒక బాబు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ బాబు ఎవరో కాదు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. ఆ ఫొటో షేర్ చేస్తూ 'ఆరేళ్ల వయసులో ఇమ్రాన్ నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచే ఈ వజ్రాన్ని గుర్తు పెట్టుకున్నాను. నా చిన్నప్పటి భాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్ నిండు నూరేళ్లు జీవించాలి.' అని జూహీ రాసుకొచ్చింది. అయితే 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమాలో ఇమ్రాన్ కూడా నటించాడు. 2008లో జెనీలియా దేశ్‌ముఖ్ సరసన ఇమ్రాన్ 'జానే తు యా జానే నా' సినిమాలో తొలిసారిగా నటించాడు. 2015లో కంగనా రనౌత్‌తో కలిసి నటించిన 'కత్తి బట్టి' చిత్రంలో చివరిసారిగా కనిపించాడు ఇమ్రాన్ ఖాన్. View this post on Instagram A post shared by Juhi Chawla (@iamjuhichawla) ఇదీ చదవండి: ఆర్యన్ బెయిల్ కోసం రూ. లక్ష బాండ్‌పై సంతకం -
మైదానంలోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు
న్యూయార్క్: అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు హసాని డాట్సన్ స్టిఫెన్‌సన్ తన ప్రేయసికి గ్రౌండ్‌లోనే లవ్ ప్రపోజ్ చేశాడు. మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ డ్రాగా ముగియగానే స్టీఫెన్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ పెట్రా వుకోవిక్ దగ్గరికి వెళ్లి మొకాలిపై కూర్చొని ‘విల్ యు మ్యారీ మీ’ అంటూ ఉంగరంతో ప్రపోజ్ చేశారు. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సర్ప్రైజ్తో షాక్‌కు గురైన అతని లవర్ వెంటనే అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అనంతరం ఉంగరాన్ని ప్రేయసి చేతికి తొడగి, ఈ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులు గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా స్టీఫెన్సన్ ప్రపోజ్ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Petra Vučković (@croatianchick31) View this post on Instagram A post shared by Hassani Dotson Stephenson (@hassanidotson) -
ప్రేమికుల రోజు; ఈ రంగు ‘విఫల ప్రేమ’కు సింబల్!
వాలెంటైన్ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ఏ కలర్ డ్రెస్ వేసుకుని బయటకు వెళితే ఏంటో అనే ఆలోచన ఉండేవాళ్లూ సహజం. సహజంగానే రెడ్ కలర్ ప్రేమకు, పసుపు స్నేహానికి.. అని బేరీజులు వేసుకునేవారూ ఉంటారు. కలర్ డ్రెస్సింగ్ విషయంలో గ్లోబల్ వైజ్‌గా ఉన్న కలర్‌ఫుల్ ముచ్చట్లివి.. నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట. ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట. పచ్చ: ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట. ఆరెంజ్ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట. నలుపు: హాట్ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు అర్ధమట. తెలుపు: ఈ రంగు ప్రేమికుల రోజున ఎదుటివారికి మనల్ని ఎలా పరిచయం చేస్తుందంటే.. మీకు ‘వేరొకరితో ‘పెళ్లికి నిర్ణయమైపోయింద’ని అర్ధమట. పసుపు: ఎలాగూ ఈ రంగు గురించి తెలిసిందే సింపుల్‌గా ‘ఫ్రెండ్షిప్’ అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఈ రోజున కేవలం స్నేహానికే నా ప్రాముఖ్యత అని పసుపు రంగు డ్రెస్ ద్వారా తెలియజేయడం. బూడిద: ‘నా కెవ్వరిమీదా ఇంట్రస్ట్ లేదు’ అనే వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం గ్రే కలర్ ఇస్తుందట. పింక్: గులాబీ రంగును ప్రేమికుల రోజున ధరించారు అంటే మీరు ‘ప్రపోజల్స్‌కి సిద్ధం’గా ఉన్నారని అర్ధం వస్తుందట. అందుకని, పింక్ డ్రెస్ ధరించేవారు కొంచెం ఆలోచించుకోవాలట. పర్పుల్: వంగపండు రంగు అంటారు దీన్నే. ‘మొదటి చూపులోనే ఎవరితోనో ప్రేమలో పడ్డారు’ అని తెలిసిపోతుందట. పీచ్: ‘నాకు ఫ్రెండ్స్, పార్టనర్ లేరు’ అనే భావం వస్తుందట. ఎదుటి వారు కొంత జాలి కూడా చూపుతారట. అందుకని, పీచ్ కలర్ డ్రెస్ ధరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదట. చదవండి: సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్ కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు.. -
ప్రేమకు ఓకే చెప్పట్లేదా? వెంటనే ఈ పని చేయండి
ప్రేమికులన్నాక అలకలు, కోపాలు కామన్.. వారిని కూల్ చేయడంలో చాక్లెట్ కీ రోల్ ప్లే చేస్తోందట.. అందుకే దానికి వాలంటైన్స్ వీక్‌లో ప్రత్యేక స్థానాన్ని కేటాయించారు. ఈ రోజు(ఫిబ్రవరి 9)ను లవర్స్ చాక్లెట్ డేగా జరుపుకుంటారు. వీరప్రేమికుల్లా ఊరికే రంగంలోకి దిగితే సరిపోదు. స్వచ్ఛమైన ప్రేమను కనబరస్తూ చాకెట్లు ఇస్తే ఫలితం ఉంటుంది. అమ్మాయిలు కరిగిపోతారు. అదెలా సాధ్యమంటారా? అయితే ఇది చదివేయండి. అమ్మాయిలకు, చాక్లెట్లకు విడదీయలేని అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారు మన ఎదుట ఉంటే కళ్ళలో మెరుపు, మనసుకు ఆనందం ఎలా పుట్టుకొస్తాయో... అలాంటి ఫీలింగే చాక్లెట్‌తో కూడా కల్గుతుందట. మరీ ముఖ్యంగా డార్క్ చాక్లెట్ మనసును ఉల్లాసంగా ఉంచడంలో తోడ్పడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. పైగా దీన్ని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయస్సుల వారు ఇష్టంగా తింటారు. ప్రేమికులైతే ఒకరిపై మరొకరు అలిగినా, చిన్నపాటి కోపాలతో ముఖం మాడ్చుకున్నా చాక్లెట్ ఇచ్చి ఎదుటివారిని ఈజీగా కూల్ చేస్తుంటారు. ప్రేమికుల రోజు మొదలు, పుట్టినరోజు, పెళ్ళిరోజు.. ఇలా ప్రతి వేడుకలో చాక్లెట్ తప్పకుండా ఉండాల్సిందే. పశ్చిమ దేశాలలో చాక్లెట్‌ను దేవాతాహరంగా చెబుతారు. అందుకే మీరు ఆరాధించే అమ్మాయిలకు చాక్లెట్ ఇస్తే ఇట్టే బుట్టలో పడిపోతారు. విభిన్న చాక్లెట్లు ► చాక్లెట్లు తెలుపు, డార్క్ విభిన్న రంగులలో లభిస్తున్నాయి. ► వీటిని కోకో చెట్ల నుంచి లభించే కాయల నుంచి తయారు చేస్తారు. ► విభిన్న ఆకారాలలో, అనేక ఫ్లేవర్స్‌లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. ► చాక్లెట్లను కాఫీలు, మిల్క్‌షేక్‌లు, ఐస్‌క్రీంలు వంటి వాటిల్లోనూ ఉపయోగిస్తారు. ► చాకలెట్లను సింపుల్ టెక్నిక్‌తో ఇంటిదగ్గర కూడా తయారు చేయవచ్చు. చాక్లెట్ ఉపయోగాలు: ► చర్మం కాంతివంతంగా మెరిసేందుకు దోహదపడుతుంది. ► అధిక రక్తపోటును తగ్గిస్తుంది. శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ బయటకు వెళ్ళిపోయేలా చేస్తోంది. ► శారీరక బరువును తగ్గించడంతోపాటు, మానసికం ఉల్లాసానికి కారణమవుతుంది. ► ఒక చాక్లెట్ తిన్నాక మెదడు 2 నుంచి 3గంటలు ఆక్టివ్‌గా పనిచేస్తోందట. ► డార్క్ చాక్లెట్లో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి అబ్బాయిలూ, అమ్మాయిలూ.. వెంటనే ఆలస్యం చేయకుండా ఓ చాక్లెట్ కొనేయండి. ప్రియుడి/ ప్రేమికురాలి నోరు తీపి చేసేయండి. వారి మనసు దోచేయండి. ఆల్ ద బెస్ట్!! చదవండి: ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే! -
ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో!
ప్రేమ... కలకాలం కలిపి ఉంచే బంధం. అందంగా అల్లుకున్న ప్రేమబంధం...రోజు రోజుకీ మరింతగా బలపడాలి. ఎప్పటికీ దూరంకానంత దగ్గరగా ఉంచాలి. బంధించినంత దృఢంగానూ ఉండాలి. అవసరమైతే గుండె గదికి తాళం వేయాలి. ప్రేమకు తాళం వేస్తున్న ప్రేమికులు ఎందరో! ఒక దేశంలో చెట్టుకు తాళం వేస్తే..మరికొన్ని దేశాల్లో వంతెనలకు తాళం వేస్తున్నారు. ఎంతసేపూ మాట్లాడే పిల్లలను నోటికి తాళం వేయమని టీచర్లు గదిమేవాళ్లు. పిల్లలు చూపుడు వేలిని పెదవుల మీద ఆన్చి దొంగ చూపులు చూస్తూ ఉంటారు. టీచర్ దృష్టి తమ మీద నుంచి పక్కకు మళ్లగానే నోటి మీదున్న చూపుడు వేలిని అలాగే ఉంచి పక్కనున్న పిల్లలతో మెల్లగా గుసగుసలాడుతుంటారు గడుగ్గాయిలు. స్కూలు దశలో మొదలయ్యే ఈ అలవాటు పెద్దయినా పోయేటట్లు లేదు. నిబంధనల కళ్లుగప్పి ప్రేమతాళాలు వేస్తూనే ఉన్నారు ప్రపంచంలోని ప్రేమికులు. ప్రేమను పండించుకోవడానికి తాళాలు వేసే అలవాటు సరదాగా మొదలైంది. ఆ అలవాటును మాన్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ప్రపంచంలో ప్రేమికుల తాళాల అడ్డాలు చాలానే ఉన్నాయి. మనదేశానికీ పాకింది. కానీ వెర్రి తలలు వేయడం లేదు. ప్రేమబంధం కలకాలం ఫ్రాన్స్ దేశం, పారిస్ నగరంలో సీయెన్ నది మీద ఓ వంతెన. పేరు పాంట్ ద ఆర్ట్స్. ఈ వంతెన ప్రేమబంధాన్ని కలకాలం నిలబెడుతుందని ఓ నమ్మకం. వంతెన రెయిలింగ్‌కు ఉన్న తాళాలన్నీ ప్రేమికులు ప్రేమతో వేసినవే. ప్రేమికులు తాళం కప్ప మీద తమ పేర్లు రాసుకుని మరీ తాళం వేస్తారు. తాళం చెవిని నదిలోకి విసిరేస్తారు. అంతే... అలా చేస్తే తమ ప్రేమబంధానికి తాళం వేసినట్లేనని వారి నమ్మకం. ఇది సరదాగానే మొదలైంది. కానీ విపరీతంగా ప్రచారంలోకి రావడంతో స్థానికులే కాక పారిస్ పర్యటనకు వచ్చిన వాళ్లు కూడా తాళాలు వేయడం మొదలుపెట్టారు. ప్రపంచప్రేమికుల ప్రేమ బరువు మోయలేక వంతెన చేతులెత్తేసింది. ఇప్పుడు ఇక తాళాలు వేయవద్దు బాబోయ్ అంటూ వేడుకుంటున్నారు పారిస్ నగర నిర్వహకులు. అయినా వారి కళ్లుగప్పి తాళాలు పడుతూనే ఉన్నాయి. వేసేవాళ్లు వేస్తూనే ఉన్నారు. నగర పాలక సిబ్బంది వాటిని తొలగిస్తూనే ఉన్నారు. ‘ఐ వాంట్ యూ’ ప్రభావం ఫ్రాన్స్‌లో జరుగుతోంది కాబట్టి ఫ్రెంచ్ వాళ్ల నమ్మకం అనిపిస్తుంది. ఇటాలియన్ నవల ‘ఐ వాంట్ యూ’తో మొదలైంది. ఇందులో నాయికానాయకులైన రోమన్ ప్రేమికులు తమ ప్రేమను పండించుకోవడానికి వంతెనకు తాళం వేయడాన్ని వర్ణించాడు రచయిత. అంతే దశాబ్దంలోపే పారిస్ వంతెనకు ఏడు లక్షల తాళాలు పడ్డాయి. వెర్రితలలు వేస్తున్న ఈ అలవాటును మాన్పించడానికి ‘లవ్ విదవుట్ లాక్స్’ ప్రచారం మొదలైంది. ‘వంతెన మీద నిలబడి ఒక సెల్ఫీ తీసుకోండి. ప్రేమ ఎల్లప్పటికీ నిలిచి ఉంటుంది’ అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ తాళం పడటం ఆగలేదు, తాళాలు వేస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. స్కాట్లాండ్లో... ‘మార్క్ యువర్ స్పాట్’ ఇలాంటిదే. ఈ వంతెన మీద ఏటా ప్రేమికుల కోసం వేడుకలు జరుగుతాయి. వంతెనలకు తాళాలు వేయడాన్ని నిషేధిస్తున్నారు. అయితే ఈ నిషేధం తాళాలకే, ప్రేమకు కాదు. సౌత్ కొరియాలో... సౌత్ కొరియాలోని డియాగులో ఉన్న సుసెయాంగ్ సరస్సు కూడా ప్రేమికుల సెంటిమెంట్‌ను పండించే అడ్డానే. ఈ వంతెన మీద ఉండే రెయిలింగ్‌కు తాళాలు వేసి తాళం చెవిని నీటిలోకి విసిరేస్తారు. మాస్కో ప్రేమ మాస్కోలో వోడూట్డోట్నీ కెనాల్ మీద కట్టిన వంతెన ప్రేమికుల అడ్డా. ఈ వంతెన మీద ఇనుప చెట్లకు నిండా పూలు విరగబూసినట్లు తాళాలుంటాయి. అవన్నీ లవ్లాక్లే. -
ప్రపోజ్ కోసం, ఎంతటి రిస్కు అయినా ఓకే!
ప్రేమికులు ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్ డేగా జరుపుకుంటారు. అయితే ఈ వారం రోజులను సంబరంగా చేసుకుంటారు. ఈ వారంలో వచ్చే రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంది. అలా రోజ్ డేతో మొదలయ్యే ప్రేమికుల హుషారు వాలేంటైన్స్ డేతో ముగుస్తుంది. ఫిబ్రవరి 7ను రోజ్ డే జరుపుకున్న ప్రేమికులు, ఈ రోజు ప్రపోజ్ డే జరుపుకుంటారు. ప్రేమించడం ఒక ఆర్ట్ అయితే ప్రేమను వ్యక్తం చేయడం మరో గొప్ప ఆర్ట్..! ఎలా ప్రపోజ్ చేస్తారో తెలుసుకుందాం.. ప్రేమించిన వారికి ఏ గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతారో అని ఆలోచిస్తూ నానాతంటాలు పడుతుంటారు చాలా మంది. ఇందుకోసం గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, గిఫ్ట్‌లు , పువ్వులు ఇలా రకారకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రేమికుల మోటో మాత్రం ఒక్కటే.. వీటిలో ఏదైనా వారికి సర్ప్రైజ్ అందించి మనసులో ఉన్న ప్రేమను చాటుకుంటారు. ఇందుకోసం ప్రేమించిన వారిని అనుసరించడం, వారి మిత్రులను కలవడం, వారి అభిరుచులు తెలుసుకోవడం వంటి చిన్నపాటి పోరాటాలు కూడా చేస్తారు. చివరికి వారికి నచ్చింది ఇచ్చి, ఆ కళ్లలో ఆనందం చూసి, వరల్డ్ కప్ గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ప్రపోజ్‌డేను కొత్తగా ప్రేమికులే కాకుండా , ఇప్పటికీ ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతులు ఈ రోజు ఒకరికొకరు ప్రత్యేక బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా చేయడం వల్ల వారి మధ్య బంధం మరింత దృఢపడుతుందని నమ్ముతారు. సాహసాలకు సిద్ధపడతారు.. మొదటిసారిగా ఇద్దరూ కలుసుకున్న చోటులో కొంత మంది ప్రేమికులు ప్రపోస్ చేస్తే, మరికొందరు టీ-షర్ట్‌మీద ఆక్సెప్ట్ మై లవ్ అని రాసుకొని ప్రేమికుల ఎదుట వాలిపోతారు. ఒక్కోసారి తమకు తామే ఒక బహుమతిగా మారిపోయి గిఫ్ట్ బాక్స్‌గా తమ వారి దగ్గరికి వెళతారు. తమదైన శైలిలో ప్రేమ విషయం చెప్పేందుకు మరికొందరు జూలియట్లు ప్రేమించిన వారి వివరాలు తెలుసుకునేందుకు సాహసాలకు సిద్ధపడతారు. ఆక్రమంలో చుట్టుపక్కల వారితోను, మిత్రులతోను చివాట్లు కూడా తింటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రేమికుల సమాచారం సేకరించి వారికి ఇష్టమైంది బహుమతిగా ఇవ్వడానికి ఆరాటపడతారు. -
8 ఏళ్లుగా డేటింగ్, పెళ్లి కావాలంటూ కోర్టుకు..
ప్రేమ కథలన్నీ పెళ్లి పీటలెక్కవు, కొందరి ప్రేమ మాత్రమే పెళ్లి బంధం వరకు రాగలుగుతుంది. ఓ అమ్మాయి కూడా తన ప్రేమ పెళ్లితో మరింత బలపడాలని కలలు కంది. ఇద్దరి గుర్తుగా ఓ బిడ్డను కూడా కంది. కానీ ఎనిమిదేళ్లవుతున్నా ప్రియుడి నోటి వెంట ఒక్కసారి కూడా పెళ్లి చేసుకుందాం అన్న మాట రాలేదు. దీంతో ఓపిక నశించిన ఆ యువతి పెళ్లంటే ముఖం చాటేస్తున్న బాయ్‌ఫ్రెండ్‌పై ఏకంగా కోర్టులో దావా వేసింది. ఈ ఘటన జాంబియా దేశంలో చోటు చేసుకుంది. గెర్టూడ్ నోమా(26), హెర్బర్ట్ సలాలికి(28) ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టింది. ఈ సందర్భంగా మహిళ తల్లిదండ్రులు అతడికి వరకట్నం ఇచ్చారు. ఎనిమిదేళ్ల అనుబంధంలో అతడు ఒక్కసారి కూడా పెళ్లి ఊసెత్తలేదు. (చదవండి: 2020లో మోత మోగిన పాపులర్ ట్వీట్స్ ఇవే!) దీంతో విసుగు చెందిన యువతి ఈ విషయాన్ని ఎలాగైనా తేల్చుకోవాలని కోర్టుకెక్కింది. "అతడు దేన్నీ సీరియస్‌గా తీసుకోవడం లేదు. గతంలో ఎప్పుడో నా వేలికి ఉంగరం తొడుగుతానని మాటిచ్చాడు. కానీ అది ఇంతవరకు జరగలేదు. ఇంతకాలం తన సమయాన్ని వృధా చేశాడు. చూస్తుంటే అతడు నన్ను మోసం చేస్తున్నాడేమోనన్న అనుమానం వస్తోంది. అందుకే నా భవిష్యత్తు ఏంటో తెలుసుకునేందుకు అతడిని కోర్టుకీడ్చాను" అని చెప్పుకొచ్చింది. ఆమె ప్రియుడు సలాలికి మాట్లాడుతూ ఆవిడే తనను సరిగా పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఇద్దరి మాటలు విన్న న్యాయమూర్తి ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇక్కడివరకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. దీన్ని కోర్టు బయటే పరిష్కరించుకొమ్మని సూచించారు. అయితే సదరు ప్రియుడికి కుటుంబాన్ని పోషించే స్థోమత లేనందువల్లే పెళ్లికి వెనకడుగు వేస్తున్నాడట. (చదవండి: ‘ఏలియన్స్ ఉన్నాయి.. నిరూపిస్తాను’) -
పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు
ప్రేమించడం చాలా సులువైన పనే కానీ.. ప్రేయసిని ఒప్పించేలా ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత సులువేమీ కాదు. ప్రియురాలిని మెప్పించడానికి అనేక పద్దతులను, వినూత్న ఆలోచనలను ప్రయోగిస్తూ ఉంటారు. ప్రేమను పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా తెలియజేయాలి అనుకుంటారు ప్రేమికులు. ఇటాలియన్‌కు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి దారిని ఎంచుకున్నాడు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలో తన ప్రేయసి ఎలీసాకి ప్రపోజ్ చేశాడు ఎంపీ డై మూరో. ఈ ఘటన గురువారం ఇటాలియన్ పార్లమెంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. డై మూరో ఇటాలియన్ ఎంపీ, తన ప్రేయసి ఎలీశా. గతకొంత కాలంగా ఆమెను ఇష్టపడుతున్నాడు. అయితే గురువారం పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా డై మూరో ప్రసంగం వినేందుకు ఎలీశా సభకు వచ్చారు. గ్యాలరీలో కూర్చోని ప్రసంగాన్ని వింటున్నారు. ఈ సమయంలో మూరో తన ప్రేమను వ్యక్త పరిచాడు. ‘విల్ యూ మ్యారీ మీ ఎలీశా’ అంటూ డైమెంట్ రింగ్‌ను చూపించాడు. వెంటనే పక్కనున్న సహచర సభ్యులంతా అతని చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాసేపటికే ఎలీశా తన ప్రపోజల్‌ను అంగీకరించిందని తోటి సభ్యులు తెలిపారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సభ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలోనే అతను ప్రపోజ్ చేయడం విశేషం. -
బంగారంపై మోదీ సర్కార్ షాకింగ్ నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్రం ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. తద్వారా ప్రపంచంలో బంగారం వినియోగంలో రెండవస్థానంలో ఉన్న దేశీయ వినియోగదారులకు షాకివ్వనుంది. వినియోగదారుల వద్ద లెక్కల్లోకి బంగారాన్ని వెలికి తీసేందుకు, నల్లధనాన్ని నిరోధించే లక్ష్యంతో మోదీ సర్కార్ భారీ ప్రణాళికలే రచిస్తోంది. వినియోగదారుల వద్ద బంగారాన్నిచట్టబద్ధం చేసే లక్ష్యంతో ఒక ప్రత్యేక పథకానికి శ్రీకారం చుడుతోందని ప్రధానమంత్రి కార్యాలయం, ఆర్థికమంత్రిత్వ శాఖ తుది మెరుగులు దిద్దుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గోల్డ్‌బోర్డు పేరుతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయనుంది. బంగారం నిల్వను ఒక నిర్దిష్ట పరిమితికి కట్టడి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీని ప్రకారం ఒక వ్యక్తి లేదా కుటుంబం బంగారం కలిగివుంటే పరిమితిని నిర్ణయిస్తారు. నిర్దేశించిన పరిమితికి మించి కలిగి ఉన్నవారికి భారీ జరిమానాలు విధిస్తారు. అయితే వివాహిత మహిళలను ఈ పథకం నుంచి మినహాయించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాదు ప్రభుత్వం త్వరలో బంగారం కోసం మాఫీ పథకాన్ని ప్రకటించవచ్చు. ఆదాయపు పన్నుమాఫీ పథకం మాదిరిగానే, ఈ బంగారంపై కూడా పన్ను మాఫీ పథకం ఒక నిర్దిష్ట కాలానికి అందుబాటులో ఉంటుంది. సరైన బిల్లులు లేకుండా బంగారంతో పట్టుబడిన వ్యక్తులు భారీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంపై పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి వుంది. గోల్డ్ బోర్డు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ప్రతినిధులతో ‘గోల్డ్ బోర్డ్’ ఏర్పాటు చేయనున్నారు. ఆర్థిక వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ సంయుక్తంగా తయారు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గోల్డ్ బోర్డు సిద్ధం కానుంది. కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా ఉండటానికి, బంగారు హోల్డింగ్స్‌ను ఆర్థిక ఆస్తిగా అభివృద్ధి చేయడానికి ప్రతి సంవత్సరం ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తారు. ఈ కొత్త ప్లాన్‌తో పాటు, ప్రస్తుత సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని కొనుగోలుదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పునరుద్ధరించనున్నారు. నిజానికి ఈనెల(అక్టోబర్) 2వ వారంలోనే దీనిపై కేబినెట్లో నిర్ణయం తీసుకోవాల్సి వుంది. అయితే మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కాగా రెండేళ్ల క్రితమే ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ ఈ మేరకు సూచించడం గమనార్హం. ప్రభుత్వ సావరిన్ బాండ్ పథకం కింద వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు నాలుగు కిలోల వరకు బంగారాన్ని డీమాట్ రూపంలో కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. అదే ట్రస్టులకయితే 20 కిలోల బంగారం కొనుగోలుకు అనుమతి ఉంది. దీనికి సంబంధించిన ఆరవ సిరీస్ అక్టోబర్ 25న ముగియగా, ఏడవ సిరీస్ డిసెంబర్ 2- 6 మధ్య ప్రారంభం కానుంది. -
మీ ప్రేమకు.. మా ప్రపోజ్
ప్రేమించడం అందరూ చేస్తారు.. కానీ ఆ ప్రేమను వ్యక్తపరిచేది మాత్రం కొందరే. ప్రేమించిన వ్యక్తితో మాట్లాడటానికి ఉండే సిగ్గు.. భయం.. మొహమాటం.. ఏమంటారో అనే సందేహం.. ఇలా ఏదైనా కావచ్చు.. కొన్ని ప్రేమలు చూపులతో ప్రారంభమై.. చూపులతోనే ఆగిపోతాయి. ఇలాంటి వారి కోసమే జపాన్‌లోని ‘కొకునావీ’ అనే కంపెనీ మేమున్నాం మీకోసం అంటోంది. మీ ప్రేమను మీ తరఫున మేము ప్రపోజ్ చేస్తామంటోంది. మీ ప్రేమ భావాలకు మరింత మెరుగులు దిద్ది.. కవితలుగా మార్చి మీరు ప్రేమించిన వారికి వ్యక్తపరుస్తామని చెబుతోంది. ఇదంతా చూస్తుంటే స్నేహితులకు ప్రేమ లేఖలు ఇచ్చి ప్రేయసి/ప్రియుడికి ఇవ్వమని పంపే విషయం గుర్తుకు వస్తుంది కదూ.. ఇది కూడా అలాంటిదే. కానీ ఇదంతా కొకునావీ ఊరికే ఏం చేయదు. కొంత చార్జ్ చేస్తుంది. ఇలా ప్రపోజ్ చేయడానికి 3 రకాల ప్యాకేజ్‌లు కూడా ఉన్నాయి వారి దగ్గర. తక్కువ ఖర్చుతో.. సింపుల్‌గా చెప్పాలనుకునే వారికి బేసిక్ ప్లాన్ సరిపోతుందట. ఇక ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు అనుకునేవారికి కొకునావీ సపోర్ట్ ప్లాన్ సరిగ్గా సూట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. మరో ప్యాకేజ్ కూడా ఉంది. మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని ఇష్టపడేలా చేసుకోవాలంటే ఈ ప్యాక్ తీసుకోవాల్సిందేనని చెబుతోంది. ఈ ప్యాక్‌లో భాగంగా ఎలా ప్రేమను ప్రపోజ్ చేస్తే ఇష్టపడతారు.. గతంలో లవ్ సక్సెస్ అయిన సందర్భాలు.. ప్రేమ లేఖలో ఎలాంటి కవితలు ఉండాలి.. తదితర విషయాలని డేటా ఎనాలసిస్ సాంకేతికతను ఉపయోగించి ఓ అందమైన ప్రపోజల్‌ను మీ ప్రేయసి/ప్రియుడి ముందు ఉంచుతారు. ఇప్పటికే కొకునావీ సహాయంతో చాలా మంది ఒక్కటయ్యారు. జపాన్‌లో ఈ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందడంతో కంపెనీకి బాగా పేరొచ్చింది. -
విమాన ప్రయాణీకులకు శుభవార్త
సాక్షి,న్యూఢిల్లీ: విమానయాన మంత్రిత్వ శాఖ విమాన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. వైమానిక ప్రమాదాలు, కాన్సిలేషన్ చార్జీపై కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. తాజా ప్రతిపాదనల ప్రకారం ఇకపై విమానాల్లో లగేజీ పోయినా, విమానాలు ఆలస్యం అయినా లేదా రద్దయినా విమానయాన సంస్థలు సదరు ప్రయాణికులకు భారీగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు టికెట్ రద్దు చేసుకున్నసందర్భంలో ఎయిర్‌లైన్స్ బాదుడుకు చెక్ పెట్టేలా చర్యలు చేపట్టనుంది. తద్వారా విమాన ప్రయాణీకులకు భారీ ఉపశమనం కల్గించనుంది. పాసెంజర్ చార్టర్లో మార్పులపై విమానయాన సంస్థలు, ఇతర పరిశ్రమ వర్గాలతో రెండు దఫాలుగా ప్రాథమిక చర్చలు జరిపామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా బుధవారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రూపొందించిన తొలి డ్రాఫ్ట్‌ను రాబోయే పదిహేను రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టనున్నామని బుధవారం ట్వీట్ చేశారు.విమానాలు ఆలస్యమైన లేదా రద్దయిన సమయంలో ప్రయాణికులకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని విమానయాన శాఖ ప్రతిపాదించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో పాటు విమానాల్లో పోయిన లగేజీకి కూడా ఎయిర్లైన్లు ప్రయాణికులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాలని ప్రతిపాదించిందన్నారు. ప్రస్తుతం దేశీయ విమానాల్లో లగేజీ పోయినా లేదా దెబ్బతిన్నా గరిష్ఠంగా రూ. 20వేల వరకు చెల్లిస్తున్నారు. అంతర్జాతీయ విమానాల్లో అయితే రూ. లక్ష వరకు పరిహారం కింద ఇస్తున్నారు. తాజాగా దీన్ని మరింత పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే ఈ పరిహారం భారీగా పెరగనుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో పోయిన లగేజీకి కేజీకి రూ. 3000 వరకు చెల్లించేలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీంతోపాటు ప్రస్తుతం కొన్ని నిర్దేశిత కారణాల వల్ల విమానాలు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు ఆ ఎయిర్లైన్లు పరిహారం చెల్లిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కూడా పెంచాలని విమానయాన శాఖ భావిస్తోంది. కాగా మంత్రిత్వశాఖ ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను ఇచ్చినట్లు ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. మరోఎయిర్‌లైన్స్ విస్తారా వ్యాఖ్యానించడానికితిరస్కరించగా ఇతర విమానయాన సంస్థలు ఇంకా స్పందించాల్సి ఉంది. Held discussions with aviation stakeholders to review a draft of the Passenger Charter. Public consultations on draft charter expected to begin in next fortnight. @MoCA_GoI @sureshpprabhu pic.twitter.com/jhjHmNsHCQ — Jayant Sinha (@jayantsinha) April 4, 2018 -
డేట్‌కి రావాలని ట్రంప్ ప్రపోజ్ చేశాడు..!
లాస్ఏంజెలిస్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో తనకూ ప్రపోజ్ చేశాడని ప్రముఖ హాలీవుడ్ నటి బ్రూక్ షీల్డ్స్ వెల్లడించారు. అయితే, ఆ ప్రతిపాదనను తాను తిరస్కరించానన్నారు. రెండో భార్య మార్లా మేపుల్స్‌తో విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్ తనకు ఫోన్ చేశాడని, అప్పుడు తాను ఒక సినిమా షూటింగ్లో ఉన్నానని తెలిపారు. ‘ రెండో భార్య నుంచి విడాకులు తీసుకున్న వెంటనే ట్రంప్ నాకు ఫోన్ చేశాడు. నువ్వు అమెరికన్ల హృదయసామ్రాజ్ఞివి.. నేను అమెరికాలోనే అత్యంత ధనవంతుడిని.. మనిద్దరం కలిస్తే అందరికీ సంతోషం అంటూ డేట్‌కి రావాలని ప్రపోజ్ చేశాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించాను’ అని బ్రూక్ తాజాగా వెల్లడించారు. ట్రంప్‌ను తిరస్కరించిన హాలీవుడ్ తారల జాబితాలో సల్మా హయక్, కేండిస్ బెర్జెన్, ఎమ్మా థాంప్సన్‌ల సరసన తాజాగా బ్రూక్ షీల్డ్స్ కూడా చేరారు. -
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్ రీవిజిట్ సార్! నా పేరు మూర్తి. నా వయసు 19. నాకు నా మరదలంటే చాలా ఇష్టం. తనకి ఆరు నెలల క్రితం ప్రపోజ్ చేశాను. కాని తను రిజెక్ట్ చేసింది. మంచి ఫ్రెండ్స్‌గా ఉందామని చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది. దానికి నేను ఒప్పుకోవడం లేదు. అయినా నాతో బాగానే మాట్లాడుతోంది. తనకి అసలు నా పైన ఎలాంటి అభిప్రాయం ఉందంటారు? – మూర్తి, ఈమెయిల్ ఇంత చిన్న వయసులో నీకెంత ప్రాబ్లమ్ వచ్చింది భయ్యా! నువ్వు అవునన్నా, అమ్మాయి కాదంది కదయ్యా. మాట్లాడడం మానేసి చెంప మీద పీకుంటే బాగుండేదనుకుంటున్నావ్ కదూ! నీ చెంప ఛెళ్లు మనేది, సమాజం ఘొల్లున నవ్వేది, నీ ప్రేమ చెల్లయ్యేది. దెబ్బకు దిమాక్ ఫ్రీ అయిపోయేది. చక్కగా చదువుకునే వాడివి, లేకపోతే ఇంకో అమ్మాయి దగ్గర చెంప ఛెళ్లుమనిపించుకోవడానికి రెడీ అయిపోయేవాడివి. ఇప్పుడా అమ్మాయి నవ్వుతూ మాట్లాడడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాబ్లమే. నాకు తెలుసు తను నీతో ఎందుకు చక్కగా మాట్లాడుతుందో. సంస్కారవంతురాలు. మంచి పెంపకంలో ఎదిగిన బంగారం. నీ ప్రేమను తిరస్కరించినా, నీ అభిమానాన్ని గౌరవించింది. నీ జీవితం కూడా చల్లగా ఉండాలని నువ్వు గొప్పవాడివి కావాలని ఆ మంచి మాటకీ, ఆ చిరునవ్వుకీ అర్థం. నీ మరదలు కాబట్టి నీ కంటే చిన్నదే అయి ఉంటుంది. అంత చిన్న వయసులో కూడా తను చూపిన బ్యాలెన్స్ నిజంగా గ్రేట్. తనని చూసి... ప్రేమించడానికి బదులు గౌరవించడం నేర్చుకో. నువ్వు రెండు విషయాల్లో చాలా అదృష్టవంతుడివి. మొదటి విషయం దేవుడు నీకు అంత మంచి శ్రేయోభిలాషిని ఇచ్చాడు. ఇక రెండవ విషయం ఏంటంటే కొంచెం సిగ్గేస్తోంది... ఇబ్బందిగా ఉంది...‘నువ్వు తప్పదు చెప్పాలి’ అంటేనే చెబుతున్నా. దేవుడు నీకు నా లాంటి లవ్ డాక్టర్ని ఇచ్చాడు. అంటూ నవ్వుతూ తలకాయ పైకెత్తాను. బల్లమీదున్న అరటిపండును నీలాంబరి వెనక్కు లాగింది. మర్చిపోయాను, మూడో విషయం. మా ఇద్దరికంటే సూపర్ బెటర్. నీలాంబరిని ఇచ్చాడు దేవుడు. నీలాంబరి నవ్వుతూ అరటిపండును మళ్లీ ముందుకు తోసింది. బై! అల్ ది బెస్ట్. ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com -
నన్నడగొద్దు ప్లీజ్
రామ్‌గారూ... నేను ఇంటర్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నా ఫ్రెండ్. తనతో అన్నీ షేర్ చేసుకునేవాడిని. ఫిబ్రవరి 14న ప్రపోజ్ చేశాను. తను రిజెక్ట్ చేసింది. బహుశా నేను సీరియస్ కాదు అనుకుందేమో. ప్రస్తుతం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ఇద్దరి మధ్య మాటలు లేవు. ఇప్పటికీ తనని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలని ఉంది. కాని ఎలా అప్రోచ్ అవ్వాలో అర్థం కావడం లేదు. నిజమైన ప్రేమను అమ్మాయిలెప్పటికీ అర్థం చేసుకోలేరా? మీ సమాధానంపైనే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. – రమేశ్, నెల్లూరు మనం ప్రేమించాం కాబట్టి మనని ప్రేమించాలనేది రూల్ కాదు. ప్రేమికుడివి కాబట్టి స్వచ్ఛమైన మనసుతో ఆ అమ్మాయికి ప్రపోజ్ చే శావు. నీ స్నేహం నచ్చినా నీ ప్రేమకు తను కమిట్ కావాలని అనుకోలేదు. అది తన తప్పెలా అవుతుంది? తను రిజెక్ట్ చేసిన తర్వాత కూడా తనే కావాలనే ప్రయాసపడ్డంలో, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. కాని ఆ ప్రయత్నంలో గెలవాలనుకోవడం మాత్రం తప్పే. నువ్వు కోరుకుంటే తను నిన్ను ప్రేమించదు. తను తలుచుకుంటే ప్రేమేంటి, పెళ్లేంటి, జీవితాన్నే రాసిస్తుంది. అంత ఉన్నతమైంది స్త్రీ. అనవసరంగా అమ్మాయిలకు ప్రేమను ఆదరించడం రాదని నిందించొద్దు. నీకే ఓ చెల్లెలు ఉందనుకో... సొంత చెల్లెలు కాకపోయినా ఓ కజిన్ సిస్టర్ అయితే ఉండే ఉంటుంది. తనని ఎవరో వెంటబడి ఆరేడేళ్లుగా ప్రేమించమని వేధిస్తుంటే నువ్వేం చేస్తావ్? నీ చెల్లెలిని ఒప్పిస్తావా? లేక ఆ ప్రేమికుడి దగ్గరికెళ్లి ‘నా చెల్లెలు నిన్ను ప్రేమించడం లేదు, అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దు, కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అని వార్నింగ్ ఇస్తావా? నాకు తెలిసి బాధ్యత గల అన్నయ్యగా నువ్వు రెండో ఆప్షనే ఎంచుకుంటావు. ఇంకొకరికి చెప్పగలిగిన నీతి మనకు వర్తించదా? నీ ప్రేమ గొప్పది కాదని నేను అనడం లేదు. గొప్పదని నువ్వు అనుకోవడంలో కూడా తప్పులేదు. కాని నీ ప్రేమ వల్ల ఇంకొక వ్యక్తికి కష్టం కలుగుతుందన్న విషయం అర్థం చేసుకోలేకపోవడం తప్పు. జీవితంలో ప్రయోజకుడిగా ఎదుగు. సమాజాన్ని ప్రేమించడం నేర్చుకో. ఒక్క హృదయంలో హీరోగా నిలబడే బదులు, వేలాది మనసుల్లో చెరగని ముద్ర వేసుకో. ప్రేమ సంతోషానికి విత్తనం కావాలి. కష్టాలకు బీజం కాకూడదు. ప్రేమను ఇవ్వు... కోరుకోవద్దు. అప్పుడు అదే వస్తుంది. ‘సార్... మీకివాళ అరటిపండు లేదు’ అంది నీలాంబరి. ‘ఏం’ అన్నాను. ‘ప్రేమ క్వశ్చన్‌కు తిక్క ఆన్సర్లు ఇస్తారనుకుంటే ఇంత భారీ డైలాగులు ఏంటి సార్? మీ ఆన్సర్ వారికి అరగదు. నా అరటి పండు మీకరగదు’ అని తేల్చేసింది నీలాంబరి. లవ్ డాక్టర్ రీవిజిట్ ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్ -
లవ్ చెప్పాలా? వద్దా?
జీవన గమనం నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. చిన్నప్పట్నుంచీ ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. కానీ ఆ విషయం ఎప్పుడూ తనకు చెప్పలేదు. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. తను కూడా నాతో చాలా బాగా మాట్లాడుతుంది. కానీ నేను తనని ప్రేమించినట్టుగా తను నన్ను ప్రేమిస్తుందో లేదో మాత్రం నాకు తెలీదు. పోనీ నేనే ప్రపోజ్ చేద్దామంటే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయమేస్తోంది. చేయొచ్చా లేదా అనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేక మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. దయచేసి మీరు సలహా ఇవ్వండి సర్. నేను ఆ అమ్మాయికి నా ప్రేమను తెలపవచ్చా? లేక లైఫ్‌లో సెటిల్ అయ్యాక చెప్పమంటారా? - జ్యోతిప్రకాశ్, మెయిల్ అజ్ఞాతవాసం ముగించి ధర్మరాజు తిరిగి తన రాజ్యానికి వెళ్లబోతున్న సమయంలో, ముందు రోజు, ఒక బిచ్చగాడు బిక్షం అడిగాడట. రేపు రా! అన్నాడట ధర్మజుడు. అది విని భీముడు ఒక డప్పు తీసుకొని కొండపై కెక్కి నాలుగు దిక్కులు వినపడేలా ‘సత్యవంతుడు నా అన్నయ్య తొలిసారి అబద్ధం చెప్పాడు’ అని గట్టిగా అరిచాడట. అతడి చాటింపు అర్థం కాని ధర్మరాజు వివరణ అడిగితే భీముడు ఇలా అన్నాడట. ‘‘అన్నా! రేపటి వరకూ ఆ బిచ్చగాడు బతికుంటాడో లేదో నీకు తెలియదు. నీవు ఉంటావో లేదో అతడికి తెలియదు. మనం వెళ్లాక రాజ్యం దక్కుతుందో లేదో మనకు తెలియదు. రాజ్యం వచ్చాక కూడా నీ మనసు ఇటువంటి దయాగుణంతో ఉంటుందో లేదో ఎవరికీ నమ్మకం లేదు. అయినా నువ్వు ఈ వాగ్దానం చేశావంటే, అది అనృతం కాక మరేమిటి?’’ ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే.. మీరు లైఫ్‌లో సెటిలయ్యే సరికి మీ మనసులో ఆ అమ్మాయి పట్ల ఇంకా అంత ప్రేమ ఉంటుందో లేదో మీకు తెలియదు. మీరు పూలదండ పట్టుకు వెళ్లేసరికి అప్పటికింకా ఆ అమ్మాయి అవివాహితగానే ఉంటుందో లేదో ఆమెకు తెలియదు. ఇంకో కుర్రాడి ప్రేమలో పడకుండా ఉంటుందో లేదో మనకు నమ్మకం లేదు. కాబట్టి, మీరు మీ ప్రేమ భావాన్ని వెంటనే వెళ్లి ఆ అమ్మాయికి చెప్పండి. అయితే దానికి ముందు మీరు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసుకోండి: మీ పెద్దలు, ఆమె పెద్దలు మీ వివాహానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోక పోయినా మీరు వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అలా చేసుకుంటే ఇంజినీరింగ్ చదివే మీకు, సంసారం నిలబెట్టేటంత ఆర్థిక స్తోమత ఉందా? లేక మీ కాళ్ల మీద నిలబడే వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడి తిని, ప్రేమ విషయం రహస్యంగా ఉంచి, ఆ తర్వాత వాళ్లు కాదంటే, ఎదిరించి వెళ్లి పోదామని అనుకుంటున్నారా? అది అన్నింటికన్నా నీచమైనది. నేను ఓ గవర్నమెంట్ స్కూల్లో టీచర్‌గా చేసి రిటైరయ్యాను. మావారు పోయారు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తున్నారు. మూడేళ్ల మనవడిని నేనే చూసుకోవాలి. అది నాకు ఆనందమే. కానీ పిల్లాడిని రోజంతా నేను చూస్తున్నాను కదా అని కోడలు తను వచ్చాకయినా వాడి బాధ్యత తీసుకోదు. పైగా పొద్దున్న నేనే వంట చేసి ఇద్దరికీ బాక్సులు పెట్టాలి. సాయంత్రం వచ్చేసరికి వంట చేసివుంచాలి. ఇదంతా చాలా కష్టంగా అనిపిస్తోంది. కొడుకుతో చెబుదామంటే చాడీలు చెబుతున్నాను అనుకుంటా డేమోనని భయం. నేనేం చేయాలి? - రాజ్యలక్ష్మి, సికింద్రాబాద్ ఇదే సమస్య మీ కోడలు ముందు ఉంచితే ఆమె ఏమని వాదిస్తుందో మీకు తెలుసా?.. ఆఫీసులో రెక్కలు ముక్కలు చేసుకొని వస్తాం, ఆవిడగారు ఇంట్లోనే ఉంటుంది కదా, పొద్దున్నే కాస్త బాక్సులు సర్దిచ్చి, సాయంత్రం వచ్చేసరికి వంట చేసి ఉంచితే అలిసిపోతుందా అంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో వచ్చే సమస్యలే ఇవి. ఒకరి బాధ్యతను మరొకరు వెసులుబాటుగా చూస్తారు. ఒకరి ఆనందాన్ని మరొకరు ‘కోల్పో తున్న హక్కు’ గా భావిస్తారు. మీరు మీ సమస్య గురించి మీ అబ్బాయితో చెబితే ‘చాడీలు చెబు తున్నారని’ అనుకోకపోవచ్చు, మీ బాధ అర్థం చేసుకోవచ్చు. మీరెలా ఫీల్ అవుతున్నారో తన భార్యతో చెప్పొచ్చు. కానీ దానికి ఆమె రియాక్షన్ మాత్రం తప్పకుండా నెగిటివ్‌గానే ఉంటుంది. ఒకవేళ మీరు ఆమెతోనే డెరైక్ట్‌గా మాట్లాడినా, ఫలితం పైన చెప్పిన విధంగానే ఉండొచ్చు. మీరు రెండు విషయాలు ముందు తేల్చుకోండి. మీకు వస్తున్న పెన్షన్ ఏం చేస్తున్నారు? మీ మనవడిని వదిలి మీరు కొంతకాలం ఉండ గలరా? తీర్థయాత్రల నెపంతోనో, బంధువుల దగ్గరికి వెళ్తున్నాననో కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండండి. బాధ పడుతూ ఒక ఇంట్లో ఉండటం కన్నా, దూరంగా ఉండటం మేలు కదా! అలా అని శాశ్వతంగా దూరంగా ఉండ మనటం లేదు. చిన్నవాళ్లకు వాళ్ల బాధ్యత తెలిసొచ్చేలా చేయమంటున్నాను. ఇంకొన్నాళ్లు పోతే మీ మనవడు కూడా స్కూల్‌కు వెళ్లడం మొదలు పెడతాడు. అప్పుడు మీకు మరింత తీరిక దొరకవచ్చు. ముందు మీరు మీ సమస్యని విశ్లేషించుకోండి. మీ సమస్య ఓపిక లేకపోవటమా? లేక ఇంట్లో చాకిరి అంతా నేనే చేస్తున్నానన్న ఫీలింగా? - యండమూరి వీరేంద్రనాథ్