ప్రేమించడం చాలా సులువైన పనే కానీ.. ప్రేయసిని ఒప్పించేలా ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత సులువేమీ కాదు. ప్రియురాలిని మెప్పించడానికి అనేక పద్దతులను, వినూత్న ఆలోచనలను ప్రయోగిస్తూ ఉంటారు. ప్రేమను పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా తెలియజేయాలి అనుకుంటారు ప్రేమికులు. ఇటాలియన్‌కు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి దారిని ఎంచుకున్నాడు. పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్న సమయంలో తన ప్రేయసి ఎలీసాకి ప్రపోజ్ చేశాడు ఎంపీ డై మూరో. ఈ ఘటన గురువారం ఇటాలియన్ పార్లమెంట్‌లో చోటుచేసుకుంది.
వివరాలు.. డై మూరో ఇటాలియన్ ఎంపీ, తన ప్రేయసి ఎలీశా. గతకొంత కాలంగా ఆమెను ఇష్టపడుతున్నాడు. అయితే గురువారం పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా డై మూరో ప్రసంగం వినేందుకు ఎలీశా సభకు వచ్చారు. గ్యాలరీలో కూర్చోని ప్రసంగాన్ని వింటున్నారు. ఈ సమయంలో మూరో తన ప్రేమను వ్యక్త పరిచాడు. ‘విల్ యూ మ్యారీ మీ ఎలీశా’ అంటూ డైమెంట్ రింగ్‌ను చూపించాడు. వెంటనే పక్కనున్న సహచర సభ్యులంతా అతని చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాసేపటికే ఎలీశా తన ప్రపోజల్‌ను అంగీకరించిందని తోటి సభ్యులు తెలిపారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సభ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలోనే అతను ప్రపోజ్ చేయడం విశేషం.
పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు
Published Fri, Nov 29 2019 2:50 PM | Last Updated on Fri, Nov 29 2019 3:16 PM
Comments
Please login to add a commentAdd a comment