Girlfriend
-
ఆమె నా అదృష్టం.. పెదవి విప్పిన బిల్ గేట్స్
అపర కోటీశ్వరుడు, తిరుగులేని విజయం సాధించిన కార్పొరేట్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ఇటీవల వార్తల్లో నిలిచారు. మెలిందా ఫ్రెంచ్ నుండి విడాకులు తీసుకున్న దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత, బిల్ గేట్స్ ఇటీవల ది టైమ్స్ ఆఫ్ లండన్‌తో మాట్లాడుతూ తన నిర్ణయం పట్ల చింతిస్తున్నానని చెప్పారు. అయితే గతం నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తున్నారు. దాతృత్వవేత్త పౌలా హర్డ్‌తో (Paula Hurd) ఆయన బంధంలో కొనసాగుతున్నారు. ఆమెతో ఉన్న సంబంధం గురించి మొదటిసారిగా బిల్ గేట్స్ పెదవి విప్పారు.తాజాగా ‘టుడే షో’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పౌలాతో ఉన్న సంబంధాన్ని బిల్‌గేట్స్ బయటపెట్టారు. "పౌలా వంటి సీరియస్ గర్ల్‌ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము సరదాగా గడుపుతున్నాం. ఒలింపిక్స్‌కు వెళ్తున్నాం. ఇంకా మరెన్నో" అంటూ పేర్కొన్నారు. బిల్ గేట్స్ పౌలా హర్డ్ గురించి బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి అయినప్పటికీ, ఈ జంట తరచుగా అనేక కార్యక్రమాలలో కలిసి కనిపించారు.ఎవరీ పౌలా హర్డ్?పౌలా హర్డ్ (62)ను పౌలా కలుపా అని కూడా పిలుస్తారు. ఇది ఈమె తొలి పేరు. పౌలా గతంలో ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ను వివాహం చేసుకోగా 2019లో ఆయన అకాల మరణం చెందారు. పౌలా, మార్క్ వివాహం జరిగి 30 సంవత్సరాలు అయింది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పౌలా హర్డ్ పరోపకారి. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో ప్రసిద్ధి చెందారు. కాగా బిల్ గేట్స్, మెలిందా ఫ్రెంచ్ వివాహం 27 సంవత్సరాల క్రితం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. 2021లో వారు విడాకులు తీసుకున్నారు.బిల్ గేట్స్ ఆత్మకథ బిల్ గేట్స్(70) స్వీయ చరిత్ర ‘సోర్స్ కోడ్–మై బిగినింగ్స్’ (Source Code: My Beginnings) తాజాగా అమెరికా మార్కెట్లోకి విడుదలైంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించి 50 ఏళ్లవుతోంది. అదేవిధంగా, తన తండ్రి శత జయంతి సంవత్సరం. ఈ సందర్భాన తన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులు, బాల్య స్నేహితుల గురించీ చెప్పాలనిపించినట్లు ఒక సందర్భంలో ఆయనే చెప్పారు.తన సమకాలికులతో పోలిస్తే బిల్ గేట్స్ ఎప్పుడూ కొన్ని దశాబ్దాలకు ముందు వెళ్లి ఆలోచిస్తారని చాలా మంది అంటుంటారు. అటువంటిది, ఆత్మ కథ కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లారు. ఒక మనిషి ఎదుగుదల లేదా పతనాలకు కుటుంబం ప్రభావం ఎలా ఉంటుందో గేట్స్ ఈ పుస్తకంలో వివరించారు. తన స్వీయ రేఖా చిత్రం తాలూకూ స్కెచ్ ఎంతో శ్రద్ధగా గీసి, దానికి అవసరమైన రంగులద్ది ఎంతో ప్రతిభావంతంగా రూపొందించిన పెయింటింగ్‌లా ఉంది ఈ స్వీయచరిత్ర. తన తండ్రి గేట్స్ సీనియర్ కుటుంబం, సమాజం అంటే ఎంతో నిబద్ధతతో ఉండేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. పిల్లలంటే ఎంతో దయతో ప్రేమతో వ్యవహరించేవారని చెప్పారు. ఆయనకు ఒకే ఒకసారి బాగా కోపం వచ్చిందట. అది కూడా తన లోపమేనంటారు బిల్ గేట్స్. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో విషయమై మూర్ఖంగా వాదించేసరికి ఉండబట్టలేక ఆయన గ్లాసులో ఉన్న నీటిని బిల్ గేట్స్‌పై ముఖంపై చిమ్మారట. వెంటనే ‘థాంక్స్ ఫర్ ది షవర్స్’అంటూ బిల్ అక్కడి నుంచి వెళ్లిపోయారట.ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ శాంతంగా ఉండే తన తండ్రి తన ప్రవర్తన ద్వారా సహనం కోల్పోయేలా చేశానని బిల్ రాశారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద వాళ్లతో చొరవగా మాట్లాడటం, వారిని ప్రశ్నలతో వేధించడం, సంతృప్తి కరమైన జవాబు వచ్చే వరకు ప్రశ్నల పరంపరను కొనసాగించడం అలవాటైందని, జీవితంలో ఎదుగుదలకు అది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పుకున్నారు. -
పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: వివాహానికి ఆమోదం తెలపక పోవడాన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా భావించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తన కుమారుడితో పెళ్లికి నిరాకరించడం వల్లే అతడి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ మహిళపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. ఐపీసీలోని సెక్షన్–306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా భావించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. పిటిషనర్ కుమారుడు, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న విభేదాలే ఆధారంగానే ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు వంటి నమోదైన ఆధారాలు సరైనవే అని భావించినా, పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా పిటిషనర్ చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా, పిటిషనర్, కుటుంబంతో కలిసి తన కుమారుడితో బంధం తెంచుకోవాలని మృతురాలిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపలేకపోయారని ధర్మాసం తెలిపింది. ప్రియురాలితో తన కుమారుడి వివాహానికి పిటిషనర్ నిరాకరించినా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది. వాస్తవానికి మృతురాలి కుటుంబానికే ఈ పెళ్లి ఇష్టం లేదన్నది నిజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా?’అంటూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐపీసీలోని సెక్షన్ 306ను అనుసరించి తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయానికి కారణమని చెప్పలేమంది. -
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడటంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేవాస్ పోలీసు అధికారి అమిత్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తాళాలు బద్దలుకొట్టి తలుపు తెరిచారు. లోపలున్న ఒక ఫ్రిజ్‌లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టివేసివున్నాయి. ఈ ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.పోలీసుల దర్యాప్తు(Police investigation)లో ఆ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ అని, ఆయన ఈ ఇంటిని 2023 జూలైలో సంజయ్ పాటిదార్‌కు అద్దెకు ఇచ్చారని తేలింది. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ ఒక ఫ్రిజ్‌తో సహా కొన్ని వస్తువులను ఒక గదిలోనే వదిలేశాడు. కాగా సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిభ వివాహం కోసం ఒత్తిడి తీసుకురావడంతో, ఆందోళనకు గురైన సంజయ్, తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడు. తరువాత ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్(Fridge)లో దాచిపెట్టాడు.ఈ కేసులో సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడు వినోద్ ఇప్పటికే రాజస్థాన్‌లోని ఒక జైలులో ఉన్నాడు. సంజయ్ వివాహితుడని, వ్యవసాయ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. కాగా దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన ఢిల్లీలోని శ్రద్ధా వాకర్(Shraddha Walker) హత్యను తలపించేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తన లివ్-ఇన్ పార్టనర్ శ్రద్ధను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. తరువాత ఆ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ సంఘటన స్థానికులను భయకంపితులను చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం -
గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం ఎంత పనిచేశాడు... భలే చిట్కా అంటున్న నెటిజన్లు!
విజ్ఞాన, వినోదాల మహాసాగరం సోషల్ మీడియా. ప్రతీ నిత్యం వేల కొద్దీ వీడియోలు ఇన్‌స్టా, ట్విటర్, ఫేస్బుక్ తదితర వేదికల్లో హల్ చల్ చేస్తూనే ఉంటాయి. కొన్ని విజ్ఞానదాయకంగా ఉంటాయి. మరికొన్ని కడుపుబ్బ నవ్విస్తాయి. ఇంకొన్ని వోర్నీ యేశాలో అనేలా ఉంటాయి. తాజాగా ఒక యువ జంట ముద్దుల వీడియో ఒకటి ‘అరే..ఏంటిరా ఇది’’ అని కుర్రకారు ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఈ వీడియో ఏకంగా 70 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది. గర్ల్ ఫ్రెండ్ ముద్దుల కోసం భలే ట్రిక్ వాడాడుగా అంటున్నారు నెటిజన్లు. అదేంటో మీరూ చూసేయండి!నోట్ : ప్రేమ అనేది వ్యక్తిగత అంశం. ఇది ఫన్నీ వీడియో అని మాత్రం గమనించగలరు. Bro unlocked new technique to get more kiss😭 pic.twitter.com/0CgkECwAsw— Bey (@beyya1202) December 11, 2024 -
రష్మిక 'గర్ల్‌ఫ్రెండ్'ని పరిచయం చేసిన దేవరకొండ
'పుష్ప 2'తో అందరి మనసుల్ని దోచేసిన రష్మిక.. ఇప్పుడు 'ద గర్ల్ ఫ్రెండ్'గా రాబోతుంది. ప్రముఖ నటుడు-దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తీస్తున్న ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీ. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ఈ టీజర్ సాగడం విశేషం.(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)'నీకని మనసుని రాసిచ్చేసా.. పడ్డానేమో ప్రేమలో బహుశా' అని విజయ్ దేవరకొండ చెబుతుంటే.. స్క్రీన్‌పై రష్మిక కనిపిస్తుంటే వీళ్లిద్దరి ఫ్యాన్స్‌కి కనులవిందుగా అనిపిస్తోంది. ఎందుకంటే చాన్నాళ్లుగా వీళ్ల రిలేషన్ గురించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్ టైంలో చూచాయిగా ప్రేమలో ఉన్నమన్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ టీజర్ చూస్తుంటే రష్మిక కోసం విజయ్ కవిత్వం చెబుతున్నాడేమో అనిపించింది.'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. హేసమ్ అబ్దుల్ సంగీతమందించగా.. 'దసరా' ఫేమ్ దీక్షిత్ శెట్టి.. రష్మికకు జోడిగా కనిపించబోతున్నాడు. టీజర్ మొత్తం రష్మిక క్లోజప్ షాట్స్ కనిపించాయి. ఇదంతా చూస్తుంటే ఈ మూవీలో రష్మిక యాక్టింగ్ అదరగొట్టేయబోతుందనిపిస్తోంది. బహుశా ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ ఉండొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) -
ప్రియుణ్ణి కిడ్నాప్ చేసిన ప్రియురాలు!
తిరుపతి క్రైమ్: ఓ ప్రియురాలు తన ప్రియుడినే కిడ్నాప్ చేసిన ఘటన గురువారం తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించింది. తిరుపతి ఈస్ట్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. ప్రస్తుతం తిరుపతిలోని పీకే లేఅవుట్లో లాడ్జి నిర్వహిస్తున్న నాని అనే వ్యక్తికి మదనపల్లికి చెందిన భాను పరిచయమైంది. ఈ క్రమంలో వారు గత ఎనిమిది నెలలుగా సన్నిహితంగా ఉంటున్నారు.అయితే మూడు నెలల నుంచి నాని భానును పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో భాను తన ప్రియుడిపై కోపం పెంచుకుంది. మరో నలుగురు సహాయంతో మదనపల్లి నుంచి వచ్చి పీకేలో లాడ్జిలో ఉన్న నానిని ఇన్నోవా కార్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. కిడ్నాప్ ఘటన సమాచారం పోలీసులకు అందడంతో.. వాయల్పాడు వద్ద వారిని అడ్డగించి నానిని సురక్షితంగా కాపాడారు. పోలీసులను చూసి కిడ్నాపర్లు పరార్ అయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు
నాగోల్: ప్రేమించిన యువతిని తనకు దూరం చేశారన్న కో పంతో అమ్మాయి తండ్రిపై ఓ యువకుడు కాల్పలకు తెగబడ్డా డు. ఈ దాడిలో అమ్మాయి తండ్రి కన్ను కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14లోని మల్లికారాణి అపార్ట్మెంట్లో పెరిశెట్టి రేణుక ఆనంద్ (57) నివాసం ఉంటున్నారు.ఆయనకు ఇద్దరు సంతానం. చిన్న కుమార్తె పాఠశాలల్లో చదివే సమయంలో తన క్లాస్మేట్ ఆయన గోగికర్ బల్వీర్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి బల్వీర్ ఆమెను ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ఆ యువతి దుండిగల్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరటంతో బల్వీర్ కూడా అక్కడే చేరాడు. అక్కడ కొంతకాలం వారు కలిసిమెలిసి తిరిగారు. ఈ విషయం ఇంట్లో తెలిసిన యువతి తండ్రి ఆనంద్ తన కూతురిని ఇబ్బందులకు గురిచేయవద్దని బల్వీర్‌ను హెచ్చరించాడు.పగ పెంచుకొని పక్కా ప్లాన్‌తో కాల్పులుఆరు నెలల క్రితం బల్వీర్ తన స్నేహితుడు గోపికి ఫోన్ చేసి తన ప్రేమకు అడ్డు వస్తున్న ఆనంద్‌ను చంపేస్తానని బెదిరించాడు. కొద్దిరోజుల క్రితం ఆనంద్ ఇంటివద్దకే వచ్చిన బల్వీర్.. ‘నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను’అని గొడవ చేసి ‘ఎన్ని రోజులున్నా నిన్ను చంపేస్తా అని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం బల్వీర్ తల్లిదండ్రులను పిలిపించిన ఆనందర్.. వారి సమక్షంలో బల్వీర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి పింపించారు. ఆనంద్ తన కూతురిని ఇటీవలే అమెరికాకు పంపించాడు.దీంతో పగ పెంచుకొన్న బల్వీర్ ఆనంద్‌ను హత్య చేయాలని పథకం వేశాడు. షూటింగ్ ప్రాక్టీస్ కోసం తెచ్చుకొన్న ఎయిర్‌గన్, షార్ట్ గన్‌తో ఆదివారం మధ్యాహ్నం ఆనంద్ ఇంటికి వచ్చి ఆయనతో గొడవ పడ్డాడు. వెంటనే ఎయిర్‌గన్‌తో లీగల్ పోలీస్, లీగల్ పోలీస్ అని గట్టిగా అరుస్తూ కాల్పులు జరిపాడు. బుల్లెట్ ఆనంద్ కుడికన్నుపై తగిలి తీవ్ర గాయమైంది.వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోయిన బల్వీర్.. పక్కనే ఉన్న అంబితా శ్రీనిలయం అపార్ట్మెంట్లో ఉన్న ఆనంద్ కారును ధ్వంసం చేసి తన బైక్‌పై పారిపోయాడు. గాయపడిన ఆనంద్‌ను స్థానికులు ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి బల్వీర్‌ను అరెస్టు చేసినట్లు సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి ఎయిర్‌గన్, షార్ట్‌గన్ (పిస్టల్), బైక్, సెల్‌ఫోన్ స్వా«దీనం చేసుకొన్నట్లు వెల్లడించారు. -
ప్రియుని హత్య... ప్రియురాలి ఆత్మహత్య
గోదావరిఖని: కట్టుకున్న భర్తను, కడుపున పుట్టిన పిల్లలను కాదని ఓ మహిళ ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఇది నచ్చని ఆమె అన్న, మాజీ భర్త కలిసి ప్రియుడిని హత్య చేశారు. దీంతో నిర్వేదానికి గురైన ఆమె ఉరివేసుకుని జీవితాన్ని చాలించింది. గోదావరిఖని హనుమాన్‌నగర్‌కు చెందిన అంజలి (25) భర్త, ఇద్దరు పిల్లలను కాదని యైటింక్లయిన్ కాలనీకి చెందిన ప్రియునితో కాపురం సాగిస్తోంది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రియుడితో ఉండేందుకే మొగ్గుచూపింది. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు చేసేదేమీ లేక ఇష్టపడిన ప్రియునితో పంపించేశారు. ఇలా 3 నెలలపాటు గడిచాయి. అయితే శుక్రవారం సద్దుల బతుకమ్మ రోజు చూ డాలంటూ అంజలికి అన్న ఫోన్ చేశాడు. నిజమని నమ్మిన ఆమె ప్రియుడిని ఎదురుగా పంపించింది. చెల్లిని ఇంట్లో బంధించి బయట గడియవేసి ప్రియుడు వినయ్‌కుమార్ (26)ను అన్న, మాజీ భర్త కలిసి హతమార్చారు. ఈ సంఘటన తర్వాత అంజలిని పోలీసులు అదేరోజు పెద్దపల్లిలోని సఖీ కేంద్రానికి పంపించారు. అనంతరం గుంటూరుకు వెళ్లి న అంజలి చిన్నమ్మ ఇంట్లో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖనికి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను డ్రైవ్‌కు తీసుకెళ్లేందుకు.. కొత్త కారును దొంగిలించి..
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి దొంగతనం చేసే వారిని చూశాం. అదీ కాదంటే లవర్‌కు నచ్చిన గిఫ్ట్‌ను, డ్రెస్‌ను కొనేందుకు తెలిసిన వాళ్ల క్రెడిట్ కార్డు వాడటం లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకునేవారిని కూడా చూశాం. కానీ ఓ ముగ్గురు యువకులు తమలోని ఒకరి ప్రియురాలి కోరికు తీర్చడానికి మాత్రం వెరైటీగా పెద్ద కారునే దొంగతనం చేయాలని ప్లాన్ వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో వెలుగుచచూసింది.ఇద్దరు యూనివర్సిటీ విద్యార్థులు తన స్నేహితుడి లవర్‌ను కొత్త కారులో లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లడంలో సాయం చేయాలనుకున్నారు. అయితే ఎవరి దగ్గర అప్పు చేయకుండా ఉండేందుకు కొత్త ప్లాన్ వేశారు. షోరూమ్ నుంచి కొత్త కారును దొంగిలించేందుకు మగ్గురు స్నేహితులు శ్రేయ్, అనికేత్ నగర్, దీపాంశు భాటీ కలిసి స్కెచ్ వేశారు.गर्लफ्रेंड को घूमने के लिए तीन स्टूडेंट ने लूट ली वेन्यू कारमामले में तीन आरोपियों को पुलिस ने किया गिरफ्तारपुलिस ने लूटी हुई गाड़ी को भी कर लिया है बरामद @noidapolice @CP_Noida #Greaternoida pic.twitter.com/4hT8TjjpFt— PRIYA RANA (@priyarana3101) October 11, 2024సెప్టెంబర్ 26న గ్రేటర్ నోయిడాలోని కార్ బజార్లో పార్క్ చేసిన హ్యుందాయ్ వెన్యూని టెస్ట్ డ్రైవ్ చేయమని ఇద్దరు అడిగారు. వారు హెల్మెట్లు ధరించి, ఎగ్జిట్ గేట్ పక్కన నిలబడి ఉండగా, డ్రైవింగ్ చేస్తున్న కారు డీలర్ పార్కింగ్ స్థలం నుంచి వాహనాన్ని తీయడంతో ఇద్దరూ కారులో ఎక్కారు. వారిలో ఒకరు డ్రైవర్ సీటు పక్కన కూర్చోగా, మరొకరు వెనుక కూర్చొని న్నారు.అనంతరం కారు డీలర్‌ను హ్యుందాయ్ వెన్యూ నుంచి బయటకు నెట్టివేసి వేగంగా వెళ్లిపోయారు.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100కి పైగా సీసీటీవీల నుంచి ఫుటేజీని పరిశీలించి,నిందితులను కనిపెట్టారు. అయితే ఈ ఘటన గత నెలలో జరిగిప్పటికీ.. కేసు విచారణలో దొంగతనానికి గల కారణం తాజాగా వెలుగుచూసింది. -
ప్రేయసిని పరిచయం చేసిన బిగ్‌బాస్ 8 నబీల్.. ఈమె ఎవరంటే? (వైరల్)
-
ట్రెయినీ ఆర్మీ అధికారులపై దాడి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దుండగులు దారుణానికి ఒడిగట్టారు. యువ సైనికాధికారులను తీవ్రంగా కొట్టి, వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇండోర్ సమీపంలోని మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ పొందుతున్న ఇద్దరు అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి బుధవారం మధ్యాహ్నం చోటీ జామ్ వద్ద ఫైరింగ్ రేంజ్ సమీపంలోని ప్రదేశానికి పిక్నిక్కు వెళ్లారు.తుపాకులు, కత్తులు, కర్రలతో వచ్చిన 8 మంది దుండగులు అకస్మాత్తుగా వారిని చుట్టుముట్టారు. నలుగురినీ చితకబాది వారివద్ద డబ్బు, విలువైన వస్తువులను దోచుకున్నారు. ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని బందీలుగా ఉంచుకున్న దుండగులు రూ.10 లక్షలు తెస్తేనే విడిచిపెడతామంటూ మరో అధికారి, అతడి స్నేహితురాలిని పంపించారు. బాధితుడు హుటాహుటిన తన యూనిట్‌కు వెళ్లి కమాండింగ్ అధికారికి సమాచారమిచ్చారు. ఈ మేరకు పోలీసులు, మిలటరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిని చూసి దుండగులు పారిపోయారు. నలుగురు బాధితులను పోలీసులు మోవ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరు అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దోపిడీ, అత్యాచారం, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు. మోవ్ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో శాంతి భద్రతలు మచ్చుకైనా కానరావడం లేదని దుయ్య బట్టారు. మహిళలపై జరుగుతున్న నేరాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆందోళనకర అంశమని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. -
ఐదు భాషల్లో డబ్బింగ్
‘నేను సూడలేదని ఓ పులుపెక్కి పోతాండవట కదా..’ అంటూ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా అదో రకం మాస్ స్టయిల్లో చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఈ కూర్గ్ బ్యూటీ ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ సినిమాలో తాను చేసిన శ్రీవల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ మధ్యకాలంలో సంచలన విజయం సాధించిన ‘యానిమల్’కి హిందీలోనూ, ఆ చిత్రం తెలుగు, కన్నడ అనువాదాలకూ తన పాత్రకు సొంత గొంతు వినిపించారు. ఇప్పుడు ఏకంగా ఐదు భాషలు మాట్లాడారు రష్మికా మందన్నా. తాను లీడ్ రోల్ చేస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రం టీజర్‌కి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పారు రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారి. ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్రదర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఈ నెల 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఐదు భాషల టీజర్ విడుదల కానుంది. మరి.. రష్మికతో టీజర్‌కి డబ్బింగ్ చెప్పించిన రాహుల్ పూర్తి పాత్రకు ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పిస్తారేమో చూడాలి. -
ప్రియురాలి నిర్వాకం.. ప్రియుడిపై కోపంతో సినిమా తరహా పక్కా స్కెచ్
సాక్షి, హైదరాబాద్: తనను దూరం పెడుతున్నాడనే కోపంతో మాజీ ప్రియుడిపై పగ తీర్చుకునేందుకు సినిమాను తలదన్నే రీతిలో స్కెచ్ వేసింది ప్రియురాలు. మాజీ ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించింది. స్నేహితుల సాయంతో మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టించిన యువతి.. పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేయించింది. జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేయగా యువతి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతితో పాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు. ఇదీ చదవండి: ‘నాన్నా.. వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి’ -
ఖండాంతరాలు దాటిన ప్రేమ
లక్నో: వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది.. ఖండంతరాలు దాటిన ఆ ప్రేమకు పెద్దల ఆంగీకారం తోడైంది.. ఇంకేముంది మూడు ముళ్ల బందంతో ఆ జంట ఒక్కటైంది. నెదర్లాండ్స్ అమ్మాయి, యూపీ అబ్బాయి ప్రేమపెళ్లి ఇరువురి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై కొత్తజంటను ఆశీర్వదించారు. హార్దిక్ వర్మ(32), ఉత్తరప్రదేశ్ ఫతేపూర్‌కు చెందిన వ్యక్తి. ఇటీవల ఆయన ఉద్యోగ రీత్యా నెదర్లాండ్స్ వెళ్లారు. అక్కడ ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే తన సహోద్యోగి గాబ్రిలాతో స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహంతో ఒక్కటవ్వాలనుకున్నారు. గత వారం గాబ్రిలాను వెంటబెట్టుకుని ఇండియా వచ్చిన హర్దిక్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు కూడా అంగీకరించడంతో నవంబర్ 29న హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 'మా కుటుంబీకులు అంతా గుజరాత్లో ఉంటారు. కానీ మా పూర్వికుల నుంచి ఇళ్లు ఇక్కడే ఉంది. అందుకే అందరం ఫతేపూర్‌కు వచ్చాం. హిందూ సాంప్రదాయం ప్రకారమే గాబ్రిలాను వివాహం చేసుకున్నా. డిసెంబర్ 25న నెదర్లాండ్స్ వెళ్లిపోతాం. అక్కడ క్రిస్టియన్ సాంప్రదాయ పద్దతుల్లో కూడా వివాహం చేసుకుంటాం.' అని హర్దిక్ తెలిపారు. ఇదీ చదవండి: బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు -
సార్.. ప్రేమలో పడ్డా కాస్త డబ్బు సర్దండి!
కోహిమా: రాజకీయ నాయకులకు తరచూ ఉద్యోగం, ఉపాధి, డబ్బు సాయం కావా లంటూ విజ్ఞాపనలు అందుతుండటం సహజంగా జరిగేదే. కానీ, ఓ యువకుడు మాత్రం తన కలల రాణితో ప్రేమ వ్యవ హారం సాగించేందుకు డబ్బు సర్దాలంటూ ప్రాధేయ పడ్డాడు. ఈ విడ్డూరం నాగాలాండ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన అరుదైన అనుభవాన్ని స్వయంగా ‘ఎక్స్’లో వివరించారు. ఆయనకు అరవింద పాండా అనే ఓ యువకుడు పంపిన మెయిల్లో ఇలా ఉంది.. ‘సర్, ఈ నెల 31వ తేదీన నా గర్ల్‌ఫ్రెండ్‌తో మొద టిసారిగా డేటింగ్‌కు వెళ్తున్నాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఉద్యోగం రాలేదు. దయవుంచి కొద్దిగా సాయం చేయండి. ఏదో ఒకటి చేయండి సార్’అని అందులో ఉంది. అందుకాయన, ‘ఎలాంటి సాయం కావాలో చెప్పండి’అంటూ బదులి చ్చారు. ‘ఎక్స్’లో అలోంగ్ పోస్టుకు నెటిజన్లు తమాషా వ్యాఖ్యలతో స్పందించారు. యువకు డితోపాటు డేటింగ్‌కు వెళ్లాలంటూ అలోంగ్‌కు ఒకరు సూచించగా, అతడికి డబ్బు సాయం చేయాలని మరొకరు కోరారు. లవర్ బోయ్ అరవింద పాండాకు ఎమ్మెల్యేగా అవకాశమి వ్వాలని, అతడికి ఉద్యోగమి వ్వాలని.. ఇలా రకరకాల సూచ నలు చేశారు. తల్లిదండ్రులు ఎంపిక చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని మరొకరు ఆ యువకుడికి తెలిపారు. ఆ యు వకుడు జీవితంలో కఠినమైన పాఠా లను నేర్చు కోవాల్సిన అవసరం ఉన్నందున ఆ వినతిని పట్టించుకోవద్దని కొందరు పేర్కొన్నారు. -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
పాకిస్థాన్‌పై ఇషాన్ సూపర్ ఇన్నింగ్స్.. గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ వైరల్!
టీమిండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ రేంజే వేరు. రెండు దేశాల్లోని అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌పైనే అందరిదృష్టి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. తాజాగా శ్రీలంకలో జరుగుతున్న ఆసియాకప్ మ్యాచ్‌లో ఇండియా-పాకిస్థాన్ తలపడ్డాయి. అయితే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా టాపార్డర్ పేకమేడలా కూలిపోయింది. కానీ ఆ తర్వాతే పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు మన యువకెరటం ఇషాన్ కిషన్. స్టార్స్ ఔటైన చోటే దూకుడు ప్రదర్శించాడు. 82 పరుగులతో అద్భుతంగా రాణించి అందరినీ దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పట్ల అభిమానం చాటుకుంది ఓ మోడల్. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్‌గా భావిస్తున్న అదితి హుండియా అతని ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో కిషన్ ఫోటో షేర్ చేస్తూ డ్రీమ్ ఇన్నింగ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు అదితి ఎవరు? కాగా.. అదితి హుండియా వృత్తిరీత్యా మోడల్ కాగా.. ఆమె ఇషాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇషాన్‌కు మద్దతుగా నిలిచింది. అంతేకాకుండా ఇషాన్, అదితి చాలా సార్లు కలిసి బయట కనిపించారు. వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే వారి రిలేషన్‌పై అదితి, ఇషాన్ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. -
యువతి కిరాతకం.. అడ్డుగా ఉన్నాడని 11 ఏళ్ల బాలుడిని..
న్యూఢిల్లీ: బాయ్‌ఫ్రెండ్ తనకు దూరమయ్యాడని కోపంతో అతడి ఆచూకీ తెలుసుకుని అక్కడికి వెళ్లగా ఆ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న అతడి కుమారుడిని హతమార్చిందో ఖిలాడి ప్రియురాలు. పోలీసులు స్థానికంగా ఉన్న 300 సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితురాలిని పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. పెళ్లయిందని తెలిసినా.. పూజ కుమారి(24) అనే ఓ యువతి 2019లో తనకు పరిచయమైన జితేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. జితేంద్రకి అప్పటికే పెళ్లి కాగా వారికి 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయినా కూడా వ్యక్తిగత కారణాల రీత్యా అతను భార్య నుంచి వేరై పూజతో కలిసి ఉండేవాడు. మూడేళ్ళ పాటు వీరిద్దరూ కలిసే జీవించారు. కానీ ఆ తరువాత జితేంద్ర తన భార్య కుమారుడి వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో అతడిపై కోపాన్ని పెంచుకుంది పూజ. జితేంద్ర స్నేహితుల్లో ఒకరి ద్వారా అతడు ప్రస్తుతముంటున్న ఇంటి అడ్రస్ తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 10న ఇందర్పూరిలోని జితేంద్ర నివాసానికి వెళ్లిన పూజ అక్కడ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. లోపలికి వెళ్లి చూస్తే దివ్యాంష్(11) ఒక్కడే ఒంటరిగా నిద్రిస్తున్నాడు. ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో పూజ అదే అదనుగా బాలుడిని చంపేసి అక్కడే ఉన్న ఒక పెట్టెలోంచి బట్టలు బయటకుతీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైందని తెలిపారు. ఇలా దొరికింది.. హత్య గురించి సమాచారం అందగానే వెంటనే రంగంలోకి దిగిన పశ్చిమ ఢిల్లీ పోలీసులు మొదట పూజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ఆమె అక్కడ ఉండటంలేదని తెలుసుకున్న తర్వాత ఇందర్పూరి పరిసర ప్రాంతాల్లో సుమారు 300 సీసీ కెమెరాల ఫుటేజీని నిశితంగా పరిశీలించి నిందితురాలిని జల్లెడ పట్టారు. ఎలాగోలా హత్య జరిగిన మూడు రోజులకు పూజను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. ఇది కూడా చదవండి: Nuh Violence : హర్యానా అల్లర్లలో బజరంగ్దళ్ కార్యకర్త అరెస్టు -
ఓరి.. దుర్మార్గుడా..! చలానాకు భయపడి..
Viral Video: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు ఎంత హితభోద చేసినా.. వాహనదారులు పెడచెవిన పెడుతుంటారు. తమ జీవితాలతో పాటు తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతుంటారు. ప్రయాణించే ముందే హెల్మెట్, సరైన ద్రువపత్రాలు వెంట తెచ్చుకుంటే ఏ సమస్య ఉండదు. కానీ అవేవీ లేకుండా రోడ్లపై వాహనాలను నడుపుతూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. చలానా తప్పించుకోవడానికి ఓ యువకుడు చేసిన పని తన లవర్ కిందపడిపోయేలా చేసింది. ఓ యువకుడు తన ప్రేమికురాలితో బండిపై ప్రయాణిస్తున్నాడు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది. యువకుడు బండిని నెమ్మదిగా స్లో చేశాడు. అంతలోనే అక్కడికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు. అతన్ని చూడగానే యువకుడు చాలానా వేస్తాడేమోననే భయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఒక్కసారిగా బండి స్పీడ్ పెంచేసి సిగ్నల్‌ను దాటేయబోయాడు. అంతే వెనక ఉన్న యువతి అమాంతం కిందపడిపోయింది. ఆమెను పట్టించుకోకుండానే ఆ యువకుడు తప్పించుకున్నాడు. लड़की को breakup में देर नहीं करनी चाहिए ऐसे बहुत आयेंगे जाएँगे यह लड़का गर्लफ़्रेंड के लिये एक चालान नहीं भर सका बीच सड़क बाइक से उतार दिया pic.twitter.com/BkUdzNq4Ls — Abhishek Anand Journalist 🇮🇳 (@TweetAbhishekA) August 14, 2023 అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ అమ్మాయిని పైకి లేపి ఆస్పత్రికి తరలించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఆనంద్ షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ట్రాఫిక్‌లో ఇలాంటి పిచ్చి చేష్టలు చేయకూడదని సూచనలు చేశారు. ఓరి దుర్మార్గుడా..! లవర్ కంటే చలానానే ఎక్కువై పోయిందా అంటూ ఫన్నీగా మరికొందరు కామెంట్ పెట్టారు. ఇదీ చదవండి: Indian Laws: ఆ వెసలుబాటు పురుషులకు లేదు.. అమ్మాయిల్ని దత్తత తీసుకోలేరు -
Viral Video: కూతురి గదిలోకి దూరిన బాయ్‌ఫ్రెండ్.. ఏం చేశారంటే?
Viral Video: బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేస్తుండగా తన తల్లిదండ్రులు ఒక్కసారిగా రావడంతో బిత్తరపోయిన ఓ యువతి ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగుతున్న ఆ ప్రియుడిని పట్టుకుని ఆమె తల్లి చీపురు తిరగేసి చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతొంది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ హల్చల్ చేస్తోంది. దొంగచాటుగా తన గర్ల్‌ఫ్రెండ్ గదిలోకి దూరిన ఓ యువకుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తన గర్ల్‌ఫ్రెండ్ మాత్రం తనని కాపాడేందుకు ప్రయత్నించి అతడి బట్టలను బాల్కనీ నుండి కిందకు విసిరేసింది. ఎలాగోలా తాడుని పట్టుకుని కిందకు జారుతున్న అతడిని కింది అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్ తల్లి ఒక చీపురు పట్టుకుని చితక్కొట్టేసింది. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. అప్లోడ్ చేసిన గంటల్లోనే మిలియన్ల వీక్షణలు వచ్చాయి. వీడియో చూస్తే ఎవ్వరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాపం ప్రియుడు ఏ మాత్రం పట్టు తప్పినా అతడు కింద పడే లోపే ప్రాణాలు గాల్లోకి పోవడం ఖాయం. Every pleasure in life has a price pic.twitter.com/rtHwfFNjtr — Enezator (@Enezator) August 10, 2023 ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
83 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు.. అప్పుడేమో డౌట్.. ఇప్పుడు ఏకంగా!
ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే దాదాపు 83 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు. అది కూడా తనకంటే వయసులో చిన్నదైన 29 ఏళ్ల నూర్ అల్పాల్లాతో ఓ బిడ్డకు స్వాగతం పలికారు. జూన్‌లో నూర్ అల్ఫాల్లా బిడ్డకు జన్మనివ్వగా.. రోమన్ పాసినో అని నామకరణం చేశారు. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. అల్ పాసినో అమెరికా కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలో తన గర్ల్ ఫ్రెండ్ నూర్ అల్ఫాల్లాతో కనిపించారు. ఈ జంట కారులో వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: అందమైన అనన్య.. 'తంత్ర' అంటూ భయపెట్టేస్తోంది!) ప్రెగ్నెన్సీ సమయంలో అనుమానాలు? అయితే గతంలో నూర్ ప్రెగ్నెన్సీ ఉన్నట్లు ప్రకటించగా.. నటుడు అల్ పాసినో అభ్యంతరం వ్యక్తం చేశారు. నూర్ ప్రెగ్నెన్సీ వార్తలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందిగా కోరాడని తెలిసింది. అంతేకాకుండా తనకు 83 ఏళ్ల వయసులో పిల్లలను కనడం ఇష్టం లేదని తెలిపాడు. అయితే నూర్ గర్భం ధరించిన విషయాన్ని చాలా రోజుల పాటు అల్ పాసినోకు తెలియకుండా దాచింది. మే 31న గర్భం ధరించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి చేసుకోకుండానే ముగ్గురితో సహజీవనం? అల్ పాసినోకు ఇప్పటివరకు పెళ్లి కాలేదు. అతనికి మొదట తన యాక్టింగ్ కోచ్ జాన్ టారెంట్ అనే మహిళతో సహజీవనం చేశారు. ఆ సమయంలో వీరికి ఓ కుమార్తె జన్మించింది. ఆ తర్వాత మరో నటి బెవర్లీ డి ఏంజెలోతో డేటింగ్ చేశారు. వీరికీ కవల పిల్లలు జన్మించారు. ఆ తర్వాత అల్, బెవర్లీ 2004లో విడిపోయారు. అప్పటి నుంచి వీరిద్దరు స్నేహితులుగానే ఉంటున్నారు. ఆ తర్వాత అల్ పాసినో, నూర్ అల్ఫాల్లా ఏప్రిల్ 2022లో లాస్ ఏంజిల్స్‌లో కలిసి డిన్నర్ చేస్తుండగా.. మొదటిసారి ఈ జంటపై డేటింగ్ రూమర్స్ వినిపించాయి. కొవిడ్ లాక్ డౌన్లో వీరిద్దరు డేటింగ్ ప్రారంభించారు. అల్ పాసినో తన తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్నా.. అల్ఫాల్లా అతని వయస్సు అంతరాన్ని పెద్దగా పట్టించుకోదు. (ఇది చదవండి: ఓటీటీకి వచ్చేసిన 'భాగ్ సాలే'.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?) + Al and his girlfriend, Noor Alfallah, after dinner in Santa Monica. pic.twitter.com/6kCrePMDuf — Pacino's World 👑 (@worldpacino) August 2, 2023 -
పెళ్ళికి ముందే ప్రియురాలితో చక్కర్లు కొడుతున్న బిల్ గేట్స్ - (ఫోటోలు)
-
ఆ హీరోతో 'లైగర్' బ్యూటీ షికార్లు.. ఆమె మాజీ బాయ్ ఫ్రెండేమో?
టాలీవుడ్లో తక్కువ గానీ బాలీవుడ్లో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ కల్చర్ చాలా ఎక్కువ. పార్టీలు, పబ్బులు అంటూ యంగ్ యాక్టర్స్ తెగ తిరిగేస్తుంటారు. ఇలా ఈ మధ్య 'లైగర్' భామ అనన్య పాండే వార్తల్లో నిలిచింది. హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో కలిసి ఈమె విదేశాల్లో ఉంది. ఈ ఫొటోలు బయటకు రావడంతో వీళ్ల విషయం లీక్ అయింది. ఇప్పుడు ఈమె మాజీ బాయ్ ఫ్రెండ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) హిందీ సినిమాలు అడపాదడపా చూసేవాళ్లకు ఇషాన్ కట్టర్ గురించి తెలిసే ఉంటుంది. 'బియాండ్ ద క్లౌడ్స్' మూవీతో హీరోగా పరిచయమైన ఇతడు.. 'దఢక్'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలీ పీలీ, ఫోన్ బూత్, ఫర్సాత్ చిత్రాలు చేశాడు గానీ సక్సెస్ అయితే అందుకోలేకపోయాడు. అయితే 'కాలీ పీలీ' షూటింగ్ టైంలో అందులో నటించిన ఇషాన్-అనన్య లవ్‌లో పడ్డారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కలిసి చాలాచోట్ల కనిపించారు. మరి ఏమైందో ఏమో గానీ వీళ్లిద్దరూ విడిపోయారు. పలు షోల్లో ఈ విషయం గురించి ఇద్దరు ఓపెన్‌గా చెప్పారు కూడా. మొన్నటివరకు సింగిల్‌గానే ఉన్న అనన్య.. కొన్నాళ్ల ముందు ఆదిత్య రాయ్ కపూర్ తో రిలేషన్ ఉందనే వార్తలొచ్చాయి. అవి నిజమే అన్నట్లు ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమెకు రివేంజ్ అన్నట్లు ఇషాన్ కట్టర్ ఓ అమ్మాయితో బైక్‌పై కనిపించాడు. దీంతో నెటిజన్స్ అనన్య ట్యాగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: రోడ్డు పక్కన గొడుగులు అమ్ముతున్న స్టార్ కమెడియన్) -
ఇచ్చట బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అద్దెకు లభించును!
టోక్యో: దేశంలో అత్యధికంగా ఉన్న ఒంటరి యువతీయువకులకు జపాన్ దేశం ఒక బంపర్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ని సొంతం చేసుకోవచ్చు. పెళ్లికాని యువతీయువకుల ఆవేదనని అర్ధం చేసుకుంది జపాన్ ప్రభుత్వం. జీవితంలో ఎవ్వరి తోడులేక మొడుబారిన ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువతీ యువకులు గంటల ప్రతిపాదికన సహచరులను ఎంపిక చేసుకునే బృహత్తర కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. దీంతో జపాన్ దేశంలో బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేనివారు ఎవరైనా అద్దెకు వారిని పొందవచ్చు. గంటకు రూ.3000 చెల్లించి బాయ్ ఫ్రెండ్ లేనివారు ప్రియుడిని గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో 1200 చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు సదరు ఆన్లైన్ పోర్టల్ నిర్వాహకులు. షిహో అనే ఒక ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుతూ ఈ సర్వీసును వినియోగించుకునే వారిలో అత్యధికులు వారి జీవితంలో ఎటువంటి తోడు లేనివారు, పెళ్లి కానీవారే. ఈ సేవలు వినియోగించుకునే వారు ఆన్లైన్ పార్ట్ నర్ కు ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వడానికి లేదు, డైరెక్టుగా మాట్లాడే అవకాశమూ లేదు. ఆన్లైన్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితోపాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సర్వీసు ఏదో బాగుంది కదూ. కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, జపాన్ దేశంలో కుటుంబ సభ్యులు కావాలన్నా కూడా అద్దెకు దొరుకుతారట. ఇది కూడా చదవండి: సంప్రదాయం పేరిట సముద్రంలో దారుణం.. -
ఇద్దరు యువతుల ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు.. -
మూడేళ్ల పరిచయానికి రూ.900 కోట్లు ఇచ్చేశాడు..!
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గార్ల్‌ఫ్రెండ్ మార్టా ఫాసినా(33)కి రూ.900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్‌కు మూడు సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం ఆరు బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. మార్టా ఫాసినాతో బెర్లుస్కోనికి 2020 నుంచి గత మూడేళ్లుగా పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఇరువురి మధ్య స్నేహం తర్వాత మరింత దగ్గరయ్యారు. అయితే.. బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53 శాతం కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మీలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి, జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మీలియన్ల యూరోలను ఇచ్చారు. ఉన్న ఆస్తిలో పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలకు సమాన భాగాలుగా పంచి ఇస్తున్నట్లు వీలునామా రాసిన బెర్లుస్కోనీ.. మిగిలిన ఆస్థిని ఐదుగురు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లుయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్లు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాలో మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యుకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్ 12న మరణించారు. వ్యాపార వేత్తగా, ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆరేళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు. ఇదీ చదవండి: దయా హృదయం-మహా ఖరీదు.. అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా! -
స్నేహా కాదు.. ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు రివీల్ చేసిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప పార్ట్-2లో నటిస్తున్నాడు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే బన్నీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. పొలిటికల్ లీడర్ కూతురు స్నేహరెడ్డిని అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడాడు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు. అల్లు అర్జున్ భార్య స్నేహరెడ్డి కూడా సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. ముఖ్యంగా పిల్లలతో బన్నీ సరదా మూమెంట్స్, వెకేషన్ ఇలా తనకి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంది. ఈ క్రమంలో స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్‌కు స్నేహా కంటే ముందు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో తన ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరును బన్నీ రివీల్ చేసేశాడు. ఆహాలో ప్రసారం అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 ఫైనల్స్‌కు అల్లు అర్జున్ గెస్టుగా విచ్చేశాడు. కంటెస్టెంట్లలో శ్రుతి అనే సింగర్ పాట పాడిన అనంతరం బన్నీ మాట్లాడుతూ.. 'నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వీడియో చూసి స్నేహా ఎలా రియాక్ట్ అవుతుందో..! -
ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్
న్యూఢిల్లీ: బిలియనీర్, 59 ఏళ్ల అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎప్పటినుంచో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని పేజ్ సిక్స్ నివేదించింది. ఈ వార్తలను వారు ధృవీకరించినట్లు కూడా పేర్కొంది. 500 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ యాచ్ ‘కోరు’లో ఆమెకు ప్రపోజ్ చేశాడు బెజోస్. ఖరీదైన డైమండ్ ఉంగరంతో ఉన్న లారెన్ ఫోటోలు వైరల్‌గా మారాయి . 20 క్యారెట్ల హార్ట్ షేప్‌లో ఉన్న ఈ డైమండ్ రింగ్ విలువ సుమారు 2.5 మిలియన్ డాలర్లని అంచనా. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) ఈ లవ్‌బర్డ్స్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. స్టార్-స్టడెడ్ పార్టీకి ఖరీదైన బోటులో కేన్స్‌కు చేరుకున్నారు. భార్యతో విడాకుల తర్వాత,గత కొంత కాలంగా తన గర్ల్ఫ్రెండ్నుపెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం సాగుతున్నసంగతి తెలిసిందే. మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ సాంచెజ్, బెజోస్ 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. కాగా 25ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య మెకెంజీ స్కాట్‌తో 2019లో బెజోస్ విడాకులు తీసుకున్నాడు. బెజో, మెకెంజీ నలుగురు పిల్లలున్నారు. అటు శాంచెజ్ కూడా తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకుంది. శాంచెజ్, వైట్ సెల్ జంటకు ఎల్లా , ఇవాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
‘మోసం చేసింది.. నా లవర్ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..
హనుమకొండ జిల్లా: భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో యువకుడు సాయి ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సెల్పీ వీడియో తీసుకుని ఇంట్లో ఉరి వేసుకున్నాడు. సెల్ఫీ వీడియోలో ప్రేమించిన అమ్మాయి, ఆమె స్నేహితుడు మానసికంగా హింసించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. యువతికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఆమె బర్త్ డే రోజున చనిపోతున్నానని సూసైడ్‌కు ముందు వీడియోలో తెలిపాడు. యువతి, ఆమె స్నేహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సెల్ఫీ వీడియో కలకలం సృష్టించడంతో తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో మసాజ్ సెంటర్.. గుట్టుచప్పుడు కాకుండా.. -
విశాఖలో షాకింగ్ ఘటన.. ప్రియురాలు వేరొకరిని ఇష్టపడుతుందని..
అల్లిపురం (విశాఖ దక్షిణం): తనతో కాకుండా మరొకరితో ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అక్కసుతో ప్రియురాలి ప్రాణం తీసిన హంతకుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన శనివారం విశాఖ మహారాణిపేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. నగర శాంతిభద్రతల డీసీపీ విద్యాసాగరనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా, కొత్తవలస, కుమ్మరవీధికి చెందిన కోడి శ్రావణి (27) గాజువాక దరి తుంగ్లాంలో నివాసం ఉండేది. తర్వాత ఉపాధి నిమిత్తం విజయనగరం జిల్లా కొత్తవలసకు మకాం మార్చింది. అనంతరం ఆమెకు పెళ్లి జరగ్గా భర్తతో మనస్పర్థల కారణంగా కొంతకాలంగా దూరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఒక గది అద్దెకు తీసుకుని జగదాంబ సమీపంలోని చెప్పుల దుకాణంలో పనిచేస్తోంది. ఆమె గతంలో తుంగ్లాంలో ఉన్నప్పుడు పరిచయమైన పెయింటర్ శ్రీపెరంబూరు గోపాలకృష్ణ అలియాస్ గోపాల్‌ను ప్రేమించింది. ఈ క్రమంలో గోపాలకృష్ణ అతని స్నేహితుడు వడ్లపూడికి చెందిన రాగిణి వెంకటేష్ అలియాస్ వెంకీని శ్రావణికి పరిచయం చేశాడు. ఆ పరిచయం కాస్త శ్రావణి, వెంకీ మధ్య ప్రేమగా మారింది. దీంతో తాను వెంకటేష్‌ను ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని గోపాలకృష్ణకు శ్రావణి చెప్పింది. వెంకటేష్‌ను శ్రావణి ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ.. వారిద్దరితో కలిసి శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో ఆర్కే బీచ్‌కు చేరుకున్నాడు. అక్కడ వారిద్దరితో మాట్లాడిన తర్వాత.. శ్రావణితో వ్యక్తిగతంగా మాట్లాడాలని వెంకటేష్‌ను గోకుల్‌పార్కులో కూర్చోమని చెప్పి.. శ్రావణిని తీరంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్దకు గోపాలకృష్ణ తీసుకెళ్లాడు. కొంత సేపటికి గోపాలకృష్ణ ఒక్కడే వచ్చి మంచి నీరు తీసుకొస్తానని చెప్పి బైక్‌పై వెళ్లిపోయాడు. అనంతరం గోపాలకృష్ణ ఎప్పటికీ రాకపోవడంతో వెంకటేష్ అతని కోసం చూస్తున్నాడు. ఇంతలో గాజువాక పోలీసుల నుంచి వెంకటేష్‌కు ఫోన్ వచ్చింది. మీ స్నేహితుడు గోపాలకృష్ణ బీచ్‌లో ఎవరినో పీక నులిమి చంపేశానని చెబుతున్నాడని.. బీచ్‌లోకి వెళ్లి చూసి చెప్పమని పోలీసులు చెప్పారు. చదవండి: యూట్యూబ్ చూసి దొంగనోట్ల ముద్రణ దీంతో తీరంలో వెతగ్గా ఒక చోట శ్రావణి చనిపోయి పడి ఉంది. విషయాన్ని వెంకటేష్ పోలీసులకు తెలియజేశాడు. దీంతో గాజువాక పోలీసులు మహారాణిపేట పోలీసులకు సమాచారం అందిచడంతో నైట్ రౌండ్స్‌లో ఉన్న క్రైం ఎస్ఐ నెమరంబాబు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు నిందితుడు గోపాలకృష్ణ, అతని స్నేహితుడు వెంకటేష్ నుంచి వాగ్మూలం తీసుకున్న అనంతరం, మృతురాలి తల్లి కోడి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈస్ట్ ఏసీపీ రమణమూర్తి, మహారాణిపేట సీఐ బి.రమణమూర్తి పాల్గొన్నారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అచ్చం తన లాంటి వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్ ను సృష్టించి నెలకు రూ. 41 కోట్ల వరకు సంపాదిస్తోంది ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్. స్నాప్‌చాట్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ప్రముఖ ఇన్ఫ్లుయన్సర్ కారిన్ మార్జోరీ.. ఫరెవర్ వాయిసెస్ అనే సంస్థ సహాయంతో కారిన్ ఏఐ (CarynAI) పేరుతో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెర్షన్‌ను రూపొందించింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు కారిన్ ఏఐ వాయిస్ ఆధారిత చాట్‌బాట్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది అచ్చం మార్జోరీ లాంటి వాయిస్, వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కస్టమర్లతో సన్నిహితంగా మాట్లాడుతుంది. వారి భావాలను పంచుకుంటుంది. మార్జోరీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏఐ వర్షన్ ఒంటరితనాన్ని నయం చేయగలదని, నెలకు 5 మిలియన్ డాలర్ల (రూ. 41 కోట్లు) వరకు సంపాదించగలదని చెప్పారు. టెస్టింగ్ లో భాగంగా టెలిగ్రామ్ యాప్‌లో మే నెలలో కారిన్ ఏఐని ప్రారంభించగా మార్జోరీ భాగస్వాముల నుంచి 71,610 డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. కారిన్ ఏఐ ఇప్పటికే దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఇది నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. 2013లో విడుదలైన హర్ అనే చిత్రాన్ని గుర్తుకుతెస్తోంది. కారిన్ ఏఐని సృష్టించడానికి యూట్యూబ్ లో సుమారు 2 వేల గంటల పాటు ఉన్న మార్జోరీ ప్రసంగాలను, హావభావాలను ఫరెవర్ వాయిసెస్ సంస్థ వినియోగించింది. ఈ ఇదివరకే సృష్టించిన స్టీవ్ జాబ్స్, టేలర్ స్విఫ్ట్, డొనాల్డ్ ట్రంప్ చాట్‌బాట్ వెర్షన్ల మాదిరిగా కాకుండా కారిన్ ఏఐ దాని కస్టమర్లతో నిజమైన భావోద్వేగ సంబంధాలను ఏర్పరుస్తుంది. ప్రతిరోజూ 250కి పైగా కంటెంట్లను స్నాప్‌చాట్‌లో పోస్ట్ చేసే మార్జోరీ.. తనకు, తన ప్రేక్షకులకు మధ్య ఉన్న అంతరాన్ని కారిన్ ఏఐ తొలగిస్తోందని చెబుతోంది. కారిన్ ఏఐ ఒంటరితనాన్ని దూరం చేయగలదాని, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక మంచి మార్గంగా నిలిచిందని పేర్కొంది. కారిన్ ఏఐ గురించి మార్జోరీ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. తన స్నాప్‌చాట్ ఫాలోవర్లలో కనీసం 20 వేల మంది కారిన్ ఏఐకి సబ్స్క్రైబర్లుగా మారతారని, దీని వల్ల నెలకు 5 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: డబ్బుల్లేకుండా రైల్వే టికెట్ బుకింగ్! ఎలాగో తెలుసా? -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు..క్రేజీ కపుల్
-
గర్లఫ్రెండ్‌ని టైంకి డ్రాప్ చేయాలన్న ఇంటెన్షన్ పోలీసులకు పట్టించి..చివరికి..
గర్లఫ్రెండ్ కోసం అరెస్టు అయ్యాడో ఓ వ్యక్తి. చివరికి అదే అతడి బండారం మొత్తం బయట పెట్టించి.. జైలు పాలయ్యేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్లోరిడాకు చెందిన జెవోన్ పియర్ జాక్సన్ అనే వ్యక్తి తన స్నేహితురాలికి ఇంటర్యూ ఉండటంతో తానే డ్రాప్ చేయాలని అనుకున్నాడు. ఆమెను కరెక్ట్ టైంకి తీసుకెళ్లి సాయం చేయాలనకున్నాడు జాక్సన్. ఐతే అప్పటికే అతని కారు వెనుక సీటులో తన ముగ్గురు పిల్లలు ఉన్నా..ఆమెను తన కారులో ఎక్కించుకున్నాడు. ఐతే అతను తన గర్లఫ్రెండ్‌కి సాయం చేసి ఇంప్రెస్ చేయాలన్న ఆతృతలో వేగంగా కారుని నడిపాడు. ఈ క్రమంలో రద్దీగా ఉండే ఫాల్స్ చర్చ్రోడ్ వద్ద స్పీడ్‌గా కారుని పోనిచ్చాడు. బ్లాక్ మెర్సిడేజ్ కారులో వేగంగ వెళ్లిపోతున్న జాక్సన్ పోలీసుల వాహనాన్ని సైతం పట్టించుకోకుండా క్రాస్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమై జాక్సన్ కారుని అడ్డుకున్నారు. అతను రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఒక తెల్లటి పికప్ కారుని ఢీ కొట్టయేబోతుండగా..త్రుటిలో ప్రమాదం తప్పినట్టు సమాచారం దీంతో పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని.. విచారించడం ప్రారంభించారు. అతడు గతంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. అదీగాక కారులో పిల్లలు ఉన్నా కూడా ఇంత ప్రమాదకరమైన వేగంతో నడిపినందుకుగానూ జాక్సన్‌పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తి 22 ఏళ్ల జాక్సన్‌ని బ్రెవార్డు కౌంటి జైలుకి తరలించారు. అతను ఈ కేసు విషయమై ఏప్రిల్ 18న కోర్టు ఎదుట హాజరుకావల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లలేని అరుదైన సమస్య! పగవాడికూడా వద్దంటూ విలపిస్తున్న మహిళ) -
నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా హరిహరకృష్ణ ప్రియురాలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్‌ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్‌కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్‌ను రిమాండ్‌కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు. ‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్ఫర్ చేసింది. నవీన్‌ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్‌కు పాల్పడింది. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. చదవండి: నవీన్‌ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ -
అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!
సాక్షి, మియాపూర్: బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు అందుకోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు పట్టుబడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచి్చంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సంజీవరావు, అంకమ్మ దంపతులు 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. సంజీవరావు స్థానికంగా సెంట్రింగ్ పనులు చేసేవాడు. అతని చిన్న కుమారుడు పవన్ బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పవన్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతడి తండ్రి సంజీవరావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో పవన్ తల్లి అంకమ్మకు గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసి మీ కుమారుడు పవన్ నా దగ్గరే ఉన్నాడని, రూ.50వేలు ఇచ్చి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముందుకెళ్లిన దర్యాప్తు బృందం ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పవన్‌తో పాటు గుర్తుతెలియని మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా అసలు విషయం వెల్లడించారు బస్టాప్‌లో పరిచయంతో.. మూడు నెలల క్రితం కూకట్‌పల్లికి చెందిన కలిబింది వరలక్ష్మితో కూకట్పల్లి బస్‌స్టాప్‌లో పవన్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిరువురు ప్రతిరోజూ కలుసుకునే వారు. బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన పవన్ పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వరలక్ష్మి వద్ద రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బులు తిరిగి ఇవ్వాలని వరలక్ష్మి అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇంట్లో డబ్బులు ఇవ్వరని భావించిన పవన్ ఆమెతో కలిసి కిడ్నాప్ డ్రామాకు పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పవన్ వరలక్ష్మీని కలిశాడు. ఇద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. పథకంలో భాగంగా వరలక్ష్మి పవన్ తల్లికి ఫోన్ చేసి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..) -
రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి.. ప్రియురాలు షాకింగ్ నిర్ణయం..
తిరువళ్లూరు(తమిళనాడు): రోడ్డు ప్రమాదంలో ప్రియుడు మృతి చెందాడనే ఆవేదనతో ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా ఆవడి సమీపంలో నెలకొంది. వివరాలు.. కోవిల్‌పతాగై ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ కుమార్తె వినోదిని(22). ఈమె అళగప్ప యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోంది. ముత్తాపుదుపేట సమీపంలోని కరిమేడు ప్రాంతానికి చెందిన వసంత్(23)ను మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 10వ తేదీన వసంత్ గుమ్మిడిపూండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వసంత్ మృతితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వినోదిని శనివారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని కైవసం చేసుకున్న ఇన్స్పెక్టర్ గోపీనాథ్ కీళ్పాక్కం వైద్యశాలకు మృతదేహాన్ని తరలించారు. చదవండి: ఎస్ఐ పాడుపని.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కాలేజీ అమ్మాయి -
ఫేస్బుక్ లవ్.. ప్రియురాలి ఇంటి ఎదుట షాకింగ్ ఘటన..
ఓజిలి(తిరుపతి జిల్లా): ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రియుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన మండలంలోని కురుగొండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల మేరకు, కోట మండలం చంద్రశేఖరపురం గ్రామానికి చెందిన శివతేజ(20) ఎన్బీకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాలలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో కురుగొండకు చెందిన యువతి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి తిరుగుతుండడంతో, ఇరువురి ఇళ్లలో తెలిసింది. ఇటీవల కోట పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ పెట్టారు. అయినా వీరి మధ్య ఫోన్ ద్వారా సంభాషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో యువతికి శనివారం కురుగొండ గ్రామంలో పెళ్లిచూపులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న శివతేజ ఆదివారం యువతి ఇంటికి వచ్చాడు. యువతి బంధువులు, శివతేజకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అనంతరం వెంటనే వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని గ్యాస్ లైటర్‌ను వెలిగించాడు. చదవండి: నాకెందుకు శాపం.. నేనేమి చేశాను పాపం! మంటలు వ్యాపించి, అంటుకుని ఒళ్లంతా కాలిపోయింది. స్థానికులు మంటలను అదుపుచేసి 108లో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దారం ఆదిలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాహాల్లో పనిచేస్తూ జీవనం... శివతేజ కాలేజీలో చదువుకుంటూ కోటలోని అరుణా థియేటర్లో ఆపరేటర్‌గా పనిచేస్తూ తల్లిని పోషిస్తున్నాడు. ఎన్సీసీలో చేరి రెండు రోజులు క్రితం నెల్లూరులో పరీక్ష రాశాడని శివతేజ తల్లి సంధ్య తెలిపింది. ఆరు నెలల క్రితం చెల్లెలికి వివాహం చేశాడు. ఈ క్రమంలో ప్రియురాలి నుంచి ఫోన్ రావడంతో ఎన్సీసీ పరీక్షకు వెళుతున్నానంటూ కురుగొండకు వచ్చినట్లు సంధ్య తెలిపింది. మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు శివతేజ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
నాపై భర్త, అతడి ప్రియురాలి హత్యాయత్నం.. ఆత్మహత్య చేసుకుంటా..
కాజులూరు(కాకినాడ జిల్లా): తనపై భర్త, అతడి ప్రియురాలు హత్యాయత్నానికి పాల్పడ్డారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు నెల రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారని.. ఇకనైనా న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ మహిళ వీడియో స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేయడం కలకలం రేపింది. మీడియాకు ఆమె మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు శివారు చాకిరేవు మెరకకు చెందిన అనసూరి లోవలక్ష్మికి పదేళ్ల కిందట కె.గంగవరం మండలం శివల గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహమైంది. అయితే అతడు గ్రామంలోని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీనిపై లోవలక్ష్మి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఒక రోజు అర్ధరాత్రి భర్త, అతడి ప్రియురాలు కలిసి లోవలక్ష్మిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న లోవలక్ష్మి కాజులూరులోని పుట్టింటికి వచ్చేసింది. తనపై హత్యాయత్నం జరిగిందని, తనకు న్యాయం చేయాలని గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్‌లో ఫిర్యాదు చేసింది. వారు పట్టించుకోకపోవడంతో కాకినాడ జిల్లా ఎస్పీ రవీద్రనాథ్‌బాబును కలిసి పరిస్థితి వివరించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గొల్లపాలెం పోలీసులు లోవలక్ష్మి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే ఎటువంటి కేసూ నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో తనను నెల రోజులుగా అర్ధరాత్రి వరకూ ముద్దాయి మాదిరిగా పోలీస్ స్ట్షేన్ చుట్టూ తిప్పుతున్నారని, ఇకనైనా తనకు న్యాయం చేయకపోతే గొల్లపాలెం పోలీస్ స్ట్షేన్ ఎదుట ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరో దారి లేదని లోవలక్ష్మి పేర్కొంది. ఆమె ఈవిధంగా మాట్లాడుతున్న వీడియో వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మంగళవారం హడావుడిగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: భార్య కళ్ల ముందే దారుణం.. నవ వరుడు.. కౌన్సెలింగ్ వల్లనే జాప్యం ఇది భార్యాభర్తలకు సంబంధించిన కేసు. ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. అందువల్లనే కేసు నమోదు ఆలస్యమైంది. రెండుసార్లు కౌన్సెలింగ్ చేసినా వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. – ఎం.తులసీరామ్, ఎస్సై, గొల్లపాలెం -
తనతో రాత్రి గడిపేందుకు ఒప్పుకోలేదని ప్రియురాలిని చంపిన ప్రియుడు
వయసుతో సంబంధం లేకుండా ప్రేమ, సహజీవనం పేరుతో పలువురు హద్దుమీరుతున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు ఇందుకు నిదర్శనంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం అనంతరం ఇలాంటి కోవకే చెందిన మరిన్ని ఘటనలు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా తనతో కలిసి రాత్రి హోటల్లో గడిపేందుకు నిరాకరించిందని ప్రియురాలిని హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ ఘోర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన రచన(44) ఓప్రైవేటు కంపెనీలో క్లర్క్‌గా పనిచేస్తోంది. భర్త రాజ్ కుమార్ కూలీ పనులు చేస్తుంటాడు. అయితే రచనకు గత కొన్ని నెలలుగా బిహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్‌కు చెందిన వ్యక్తితో(34) పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 23న మీరట్‌లో కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అక్కడే హోటల్లో రెండు రాత్రులు బస చేసిన తర్వాత ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ తన ప్రియుడు గౌతమ్ కలిసి హోటల్లో దిగారు. సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు గౌతమ్ హోటల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. హోటల్ హౌజ్ కీపింగ్ సిబ్బంది మధ్యాహ్నం గదిలోకి వెళ్లి చూడగా రచన విగత జీవిగా కనిపించింది. వెంటనే హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బృందం సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రచన మృతిపై భర్తకు సమాచారం ఇచ్చి.. ఘటనపై విచారణ ప్రారంభించారు. చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుడు గౌతమ్‌ను మురాద్‌నగర్‌లోని గంగ కెనాల్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. గత నాలుగు నెలలుగా రచనతో పరిచయం ఉందని అతడు వెల్లడించాడు. హోటల్లో తనతో కలిసి రాత్రి ఉండేందకు ఒప్పుకోలేదని, ఇంటికి వెళ్తానని పట్టుపట్టడంతో.. ఆవేశంతో గొంతు నులిమి చంపినట్లు గౌతమ్ అంగీకరించినట్లు న్నట్లు మురాదాబాద్ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రే రచనను హత్య చేసి ఆ రాత్రంతా అదే గదిలో గడిపినట్లు తేలింది. ఐపీసీ సెక్షన్ 302, 506 సెక్షన్ల ప్రకారం హంతకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి డిసెంబర్ 23న ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు రచన భర్త తెలిపారు. ‘అదే రోజు రాత్రి 8 గంటల వరకు రచన ఇంటికి రాకపోయే సరికి నేను కాల్ చేశాను. ఆఫీస్‌లో మీటింగ్ ఉంది ఆలస్యం అవుతుందని చెప్పింది. కానీ రాత్రి 11 గంటల వరకు కూడా ఆమె రాకపోవడంతో మళ్ల ఫోన్ చేయగా స్వీచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తన ఆఫీస్‌కు వెళ్లాను. తను ఆ రోజు అసలు ఆఫీస్‌కే రాలేదని అప్పుడే తెలిసింది. డిసెంబర్ 25న ఉదయం 5గంటలకు తనే కాల్ చేసి ఇంటికి వస్తున్నట్లు తెలిపింది. కానీ ఎక్కడుందో వెల్లడించలేదు. అదే రోజు రాత్రి 10 గంటలకు మళ్లీ ఫోన్ చేసి ఘజియాబాద్‌లోని హోటల్లో ఉన్నట్లు, తనను గౌతమ్ ఇంటికి రానివ్వడం లేదని చెప్పి సాయం చేయాలని కోరింది. ఆమె కోసం వెతుకుతుండగానే సోమవారం మధ్యాహ్నం పోలీసులు కాల్ చేసి రచన చనిపోయినట్లు తెలిపారు’ అని భర్త రాజ్ కుమార్ తెలిపాడు. -
ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి..
సాక్షి, చెన్నై(వేలూరు): ప్రియుడు మాట్లాడలేదని ఓ ప్రియురాలు విషం తాగుతూ వీడియో తీసి, ప్రియుడికి పంపి, ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసుల కథ నం మేరకు.. తిరుపత్తూ రు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని కరుణానిధి గ్రామానికి చెందిన తిరుమాల్ కుమార్తె శరణ్య(23) కృష్ణగిరిలోని ప్రైవేటు కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదిలాఉండగా ఈమె అదే గ్రామానికి చెందిన ఆర్మీ సిపాయి అరుణ్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మనస్పర్థల కారణంగా ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు. దీంతో మనోవేదనకు గురైన శరణ్య ఈనెల 11వ తేదీన శీతల పానీయంలో విషం కలిపి తాగి, ఆ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో రికార్డ్ చేసి ప్రియుడికి పంపింది. అపస్మారక స్థితికి చేరుకున్న శరణ్యను కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమం కావడంతో సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరణ్య శుక్రవారం ఉదయం మృతి చెందింది. ప్రియుడిని బెదిరించేందుకు విషం తాగిన శరణ్య చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ ప్రాంతంలోని వారిని కలిచి వేసింది. ఈ మేరకు నాట్రంబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Darshit: కన్నా..ఇక కనిపించవా..) -
యూపీలో మరో శ్రద్ధా వాకర్? నిందితునిపై పోలీసుల ఎన్కౌంటర్!
ప్రేమో, ఆకర్షణో! తెలిసీతెలియని వయసు ప్రభావమో! అమాయక ఆడపిల్లల జీవితమైతే అర్ధాంతరంగా ముగుస్తోంది. నమ్మినవారే నట్టేటముంచితే ఊపిరి అనంతవాయువుల్లో కలిసిపోతోంది. కన్నవారికి పుట్టెడు దుఃఖం మిగుల్చుతున్న దారుణ ఘటనలు దేశంలో తరచూ వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. శ్రద్ధా వాకర్ ఘటన మరువకముందే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలోనూ ఓ బాలిక ‘ప్రేమ’ మోసానికి బలైంది. మృతురాలు నిధి గుప్తా (17) తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ సూఫియాన్, నిధి ఏడాదికాలంగా రిలేషన్లో ఉన్నారు. ఇంట్లో అనుమానం రాకుండా ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన ఆ అమ్మాయి వ్యవహారం గత మంగళవారం బయటపడింది. దీంతో కోపోద్రిక్తులైన ఆమె కుటుంబ సభ్యులు వారు ఉంటున్న నాలుగో ఫ్లోర్‌లోని గదికి వెళ్లారు. అక్కడ సూఫియాన్, నిధి.. ఆమె కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో నిధి అక్కడ నుంచి అపార్ట్‌మెంట్‌పైకి పరుగెత్తుకెళ్లింది. ఆమె వెంటే ఆ యువకుడు కూడా వెళ్లాడు. ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనలో ఉన్న అమ్మాయి కుటుంబ సభ్యులకు కెవ్వుమని కేక వినిపించింది. అంతే, తమ బిడ్డ కిందపడి విగతజీవిగా మారిందని తెలుసుకోవడానికి వారికి ఎంతోసేపు పట్టలేదు. వేధించి, ప్రేమ పేరుతో.. అమాయకమైన తమ బిడ్డను సూఫియాన్ వేధింపులకు గురిచేశాడని ఆ తల్లిదండ్రులు ఆరోపించారు. లోకం తెలియని పిల్లకు మాయమాటలతో దగ్గరై ప్రేమ పేరుతో నమ్మించాడని తెలిపారు. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని గత కొన్ని రోజులుగా వేధించినట్టు తెలిసిందని చెప్తూ వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు మాట వినడం లేదని ప్రాణాలు తీశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారంటే.. ఘటన జరిగిన అనంతరం సూఫియాన్ తప్పించుకుపోయాడని లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్దియా తెలిపారు. మైనర్‌ను నిందితుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఓ మొబైల్ ఫోన్‌ను గిఫ్టుగా ఇచ్చాడని తెలిపారు. నిందితుని పట్టుకునేందుకు 9 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అతని తలపై రూ.25 వేల రివార్డును కూడా ప్రకటించామని తెలిపారు. ఎట్టకేలకు దొరికిన నిందితుడు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సూఫియాన్ దొరికాడని కమిషనర్ తెలిపాడు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో వారు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిందితుని కాలులో బుల్లెట్ దిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. అతనిపై మర్డ్‌ర్ కేసుతోపాటు.. బలవంతపు మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. -
ఢిల్లీ హత్య కేసు మరవకముందే.. మరో దారుణం.. ప్రియురాలిని చంపి
లక్నో: యావత్ దేశాన్ని షాక్ గురిచేసిన ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే ఉత్తర ప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది. భర్తను విడిచి వచ్చేందుకు నిరాకరించందని ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు ఓ ఉన్మాది. వివాహితను హత్య చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. ఈ ఘటన సిలిగురి ప్రాంతంలోని న్యూ జల్పైగురి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. హత్యకు గురైన యువతిని రియా బిస్వాప్, నిందితుడు కిరణ్ దేబ్‌నాథ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేళ్లుగా రిలేషన్ నదియా జిల్లాకు చెందిన రియా అనే మహిళ తన భర్త రోమియో బిస్వాస్‌తో కలిసి సిలిగురిలో నివసిస్తుంది. వీరికి ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే రెండేళ్లుగా కిరణ్ అనే యువకుడితో రియా రిలేషన్షిప్(వివాహేతర సంబంధం) కొనసాగిస్తుంది. భర్త లేని సమయాల్లో తరుచూగా రియాను అతడు కలిసేవాడు. గత అక్టోబర్ ఇద్దరు కలిసి ఇంటి నుంచి పారిపోయినట్లు తెలిసింది. అయితే తర్వాత రియా తన భర్త వద్దకు తిరిగి వచ్చింది. గొంతు కోసి దీంతో మళ్లీ భర్తను వదిలేసి రావాలని కిరణ్ వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి రియా అంగీకరించకపోవడంతో ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. పలుమార్లు దాడి చేశాడు. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయంలో ఆదివారం రాత్రి కిరణ్ రియా ఇంటికి వెళ్లాడు. వీరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆవేశం పట్టలేని కిరణ్ అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కొసి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం ఉదయం పిల్లవాడు ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూడగా రియా రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడూ ఆత్మహత్య ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివాహిత మృతదేహాన్ని బాత్రూమ్లో స్వాధీనం చేసుకున్నారు. శరీరంపై కొట్టిన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రియురాలిని హత్య చేసిన రోజు రాత్రి.. న్యూజల్పైగురి రైల్వే స్టేషన్‌కు వెళ్లిన కిరణ్.. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచాడు. చనిపోయే ముందు అతను ఫేస్బుక్ లైవ్ చేశాడు. నాకు మరో దారి లేదు ఇందులో ‘అవును నేను రియాను చంపాను. కానీ ఆమెను చంపకుండా ఉంటే ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. కానీ ఆమె నాకు మరో మార్గం లేకుండా చేసింది. నాకు భయంగా ఉంది. జీవించడానికి ఇంకేం లేదు. నేను బతికితే నా జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అందుకే చనిపోతున్నా’ అని వీడియోలో పేర్కొన్నాడు. -
వైరల్: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని.. ఏకంగా 70 కిలోలు తగ్గి
బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తిని అతని గర్ల్‌ఫ్రెండ్ వదిలేసి వెళ్లింది. ప్రియురాలు బ్రేకప్ చేప్పడంతో చాలా కుంగిపోయాడు. అయితే ఆమెకు తన మాటలతో కాకుండా చర్యలతో తగిన సమాధానం చెప్పాడు. ఉబకాయం నుంచి కండల వీరుడిగా తయారయ్యాడు. ఏకంగా 70 కిలోలు బరువు తగ్గి వావ్ అనిపించాడు. స్ఠూలకాయం నుంచి ఫిట్‌గా మారిన అతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆన్లైన్ స్టార్‌గా మారాడు. అధిక బరువుతో బాధపడుతున్న పువి అనే యువకుడిని అదే కారణంతో అతడి ప్రియురాలు విడిచిపెట్టింది. దీంతో తన శరీరాకృతిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీన్ని చాలెంజ్‌గా స్వీకరించాడు. అనుకున్నట్లుగానే జిమ్‌కు వెళ్లి వర్కౌట్ చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా అతని శరీరంలో మార్పును చూడటం ప్రారంభించాడు. ప్రియురాలు బ్రేకప్ చెప్పిన 139 కిలోల బరువు ఉన్న పువి.. 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ఎంతలా తగ్గాడంటే 70 కిలోల కొవ్వును కరిగించి 74 కిలోలకు చేరాడు. చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే.. View this post on Instagram A post shared by 🅿️uvi (gram_du_insta) (@npuvi96) గతంలో ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ నుంచి నుంచి ఇప్పుడు స్మాల్ సైజ్‌కు మారిపోయాడు. టిక్‌టాక్ యూజర్ పువి తన వర్కవుట్ వీడియోలను తరచూ షేర్ చేస్తుండే వాడు. దీంతో అతడి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కండలు తీరిన దేహంతో పువి ట్రాన్స్ఫర్మేషన్.. పలువురిలో స్పూర్తి నింపుతోంది. అతడి కృషి, పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by 🅿️uvi (gram_du_insta) (@npuvi96) View this post on Instagram A post shared by Bodybuilding.com (@bodybuildingcom) -
మహిళతో వివాహేతర సంబంధం.. పెళ్లికి ఒప్పుకోలేదని..
తిరువొత్తియూరు(తమిళనాడు): పెళ్లికి నిరాకరించిన ఓ ప్రియురాలు హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తిరుచి జిల్లా నొచ్చియం కొల్లడం నదిలో గత 11వ తేదీ 35 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న శ్రీరంగం పోలీసులు విచారణ చేపట్టి లాల్గుడి సమీపంలోని పుల్లంపాడికి చెందిన సెల్విగా గుర్తించారు. చదవండి: డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి.. ఈమె 7 నెలల క్రితం భర్త మృతి చెందడంతో ఆమె తన ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. సెల్వి సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేయగా, లాల్గుడికి చెందిన ఫ్యాన్సీ స్టోర్ యజమాని నాగరాజు (53) తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా సెల్వితో వివాహేతర సంబంధం ఉన్న విషయం బయటపడింది. పెళ్లి చేసుకుందామని సెల్విని కోరగా, అందుకు నిరాకరించిందని, దీంతో ఆమెను కొల్లిడం నది వద్దకు తీసుకెళ్లి ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసి, నదిలో పడేసి పారిపోయినట్లు నాగరాజు తెలిపాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
డ్రైవర్‌తో వివాహేతర సంబంధం: ప్రియురాలి భర్తను మాట్లాడాలని పిలిచి..
తిరువొత్తియూరు(తమిళనాడు): ఆంబూర్ సమీపంలో వివాహేతర ప్రియురాలి భర్తపై యాసిడ్ దాడి చేసిన జేసీబీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళ్లిపట్టు ఏరి కాలనీకి చెందిన రామన్ (45) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతని భార్య వేందామ్మాళ్ (40). వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య విభేదాల కారణంగా ఏడాది నుంచి వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. వేందామ్మాళ్ కంపెనీలో షూ కంపెనీలో పనిచేస్తోంది. రాణిపేటకు చెందిన జేసీబీ డ్రైవర్ శక్తివేలు (26)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రామన్, శక్తివేల్‌ను అడ్డుకున్నాడు. చదవండి: సహోద్యోగినిపై కన్నేశాడు.. లిఫ్ట్ పేరుతో కారులో ఎక్కించుకుని.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత తొమ్మిదో తేదీ శక్తివేలు, రామన్‌ను మాట్లాడాలంటూ పిలిచాడు. ఆంబూర్ సానాంకరై కన్నదాసన్ నగర సమీపంలోని శ్మశానం వద్దకు ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన శక్తివేల్ తాను తెచ్చుకున్న యాసిడ్‌ను రామన్ మీద పోశాడు. కేకలు విన్న స్థానికులు అతన్ని చికిత్స కోసం వాణియంబాడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి శక్తివేల్‌ను బుధవారం అరెస్టు చేశారు. -
ఆ వెబ్ సిరీస్ చూసి గర్ల్‌ఫ్రెండ్‌పై హృతిక్ రోషన్ వ్యాఖ్యలు..
Hrithik Roshan Praises Saba Azad Acting In Rocket Boys Web Series: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నెటిజన్స్‌ను అలరిస్తోన్న మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'రాకెట్ బాయ్స్'. సోనీ లివ్ ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్.. ప్రఖ్యాత భారతీయ సైంటిస్టులు హోమీ జె. బాబా, విక్రమ్ సారాబాయ్ జీవితాలకు సంబంధించిన కథగా తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను పొగుడ్తూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు హృతిక్ రోషన్. 'మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాను. దీని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొత్తం టీం వర్క్ ఎంతో అద్భుతంగా ఉంది. ఇండియాలోని మనవాళ్లే ఇది చేశారంటే గర్వంగా ఉంది.' అని రాసుకొచ్చాడు. చదవండి: నా కొడుకు హృతిక్ రోషన్‌లా ఉండాలి.. కానీ: స్టార్ హీరోయిన్ ఈ రాకెట్ బాయ్స్ వెబ్ సిరీస్‌లో హృతిక్ రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా ఆజాద్ నటించింది. తన నటనను మెచ్చుకుంటూ ప్రశంసించాడు హృతిక్. సబా ఆజాద్ గురించి 'నేను చూసిన అత్యుత్తమ నటులలో మీరు ఒకరు. మీరు నాకు స్ఫూర్తినిస్తున్నారు.' అంటూ కితాబిచ్చాడు ఈ బాలీవుడ్ గ్రీక్ గాడ్. అలాగే ఈ వెబ్ సిరీస్‌లో సౌత్ బ్యూటీ రెజీనా కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 4, 2022 నుంచి ప్రసారం అవుతోంది. చదవండి: రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్.. ఆమెతోనే ఏడడుగులు? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
అక్కన్నపేట(హుస్నాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన కాదాసు కీర్తన, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బత్తుల సతీశ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. గర్భం పోయేందుకు అబార్షన్ చేయించాడు. అనంతరం వారి ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని సతీశ్ ఒప్పకున్నాడు. అయితే పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతూ పెళ్లిని దాటవేస్తున్నాడు. 2020 సెప్టెంబర్ 12 తేదీన సతీశ్ తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో కొడుకుతో పెళ్లి చేస్తామని ఒప్పంద ప్రతం రాసి ఇచ్చారు. ఆ మేరకు రెండు నెలల క్రితం రుదంగ్రి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో వరపూజ జరిగింది. నెలలోపు పెళ్లి ఏర్పాటు చేస్తామని ప్రియుడు, అతడి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే వరకట్నంగా కారు, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని కీర్తన కన్నీటి పర్యతమైంది. ప్రియుడు, అతడి తల్లిదండ్రులు బత్తుల కొమురయ్య, ఎల్లవ్వ, వారిని ప్రోత్సహిస్తున్న మల్లేశ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కీర్తన హెచ్చరించింది. -
నచ్చిన యువతితో పెళ్లి చేయలేదని..
బేతంచెర్ల: నచ్చిన యువతితో కుటుంబీకులు పెళ్లి చేయలేదని ఓ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. బేతంచెర్ల పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వడ్డె సుబ్బరాయుడు, మల్లేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరిలో రెండవ కుమారుడు చిన్న నాగరాజు(22) ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం గౌండ పనితో పాటు కారు డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. మూడు నెలల క్రితం ఈ యువకుడికి ఓ పెళ్లి సంబంధం చూశారు. కాని కుటుంబ సభ్యులు ఆ సంబంధం వద్దని చెప్పారు. దీంతో నచ్చిన యువతితో పెళ్లి చేయడం లేదని మనస్తాపం చెందిన చిన్న నాగరాజు గురువారం అర్ధరాత్రి స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు నంద్యాల రైల్వే ఎస్ఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రష్యా అధ్యక్షుడికి మరో ఊహించని షాక్...!
Demanding Switzerland Hosts Putin lover Expel: ఉక్రెయిన్‌పై రష్యా గత 26 రోజులుగా భయంకరంగా దాడులు చేస్తునే ఉంది. ఆంక్షలను సైతం పక్కనపెట్టి తనదైన యుద్ధ వ్యూహంతో సాగిపోయింది. అంతర్జాతీయ న్యాయస్థాన ఆదేశాలను దిక్కరించి మరీ ఉక్రెయిన్‌పై భీకరంగా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని మూకుమ్మడిగా రష్యా ఆట కట్టించే దిశగా రంగం కూడా సిద్ధం చేసింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని లక్ష్యంగా చేసుకుని మరీ ఆన్లైన్ వేదికగా పుతిన్ అంటే గిట్టని కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు change.org అనే వెబ్సైట్లో ఆమెను బహిష్కరించాలంటూ పిటిషన్ వచ్చింది. అంతేకాదు పిటిషన్లో.. 38ఏళ్ల అలీనా కబయేవా మాజీ జిమ్నాస్ట్ అని స్విట్టర్లాండ్‌లో తన ముగ్గురు పిల్లలతో విలాసవంతమైన విల్లాలో ఉన్నారని ఆరోపణలు చేయమే కాక ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం పుతిన్ భాగస్వామిని ఆయనతో కలిపే సమయం ఆసన్నమైందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పైగా పుతిన్ ఆమె రహస్య ప్రేయసిని అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. ఈ యుద్ధ సమయంలో పుతిన్ రహస్య ప్రేయసికి స్విట్జర్లాండ్ ఆతిధ్యం ఇస్తూనే ఉందని పిటిషన్లో పేర్కొంది. పైగా ఆ పిటిషన్‌పై దాదాపు 50 వేలకు పైగా సంతకాలు చేశారు. అయితే ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న భీకరమైన యుద్ధం నేపథ్యంలోనే ఈ పిటిషిన్ రావడం గమనార్హం. రష్యన్ ఫెడరేషన్‌పై విధించిన ఆంక్షల పరిణామాల నేపథ్యంలో రష్యన్ అనుకూల రాజకీయ మీడియా డైరెక్టర్, మాజీ అథ్లెట్ అలీనా కబయేవాని మీ దేశంలో దాచిపెడుతున్నారని ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారని కూడా పిటిషన్లో వెల్లడించింది. అంతేకాదు ఆధునిక చరిత్రలో తొలిసారిగా స్విట్జర్లాండ్ తన తటస్థతను ఉల్లంఘించిందని పిటిషన్లో ఆరోపణలు గుప్పించింది. (చదవండి: 2 వేల మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా: ఉక్రెయిన్ విదేశాంగ శాఖ) -
గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్ అందుకున్న స్టార్ ఫుట్‌బాలర్
పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో తన గర్ల్‌ఫ్రెండ్ నుంచి ఖరీదైన గిఫ్ట్‌ను బహుమతిగా అందుకున్నాడు. ఫిబ్రవరి 5న రొనాల్డో పుట్టినరోజు పురస్కరించుకొని రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ రూ.1.2 కోట్ల విలువైన బ్లాక్ కాడిల్లాక్ ఎస్యూవీ మోడల్ కారును గిఫ్ట్‌గా అందించింది. గర్ల్‌ఫ్రెండ్ కారు ఇచ్చిన మరుక్షణమే రొనాల్డో అదే కారులో మాంచెస్టర్ యునైటెడ్ గ్రౌండ్‌కు వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోనూ జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. కార్లంటే పిచ్చి ఉన్న వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్‌ను ఇవ్వడం సంతోషం కలిగించింది. నాకు ఒక మంచి భర్తను.. పిల్లలకు మంచి తండ్రిని రొనాల్డో రూపంలో అందించినందుకు దేవుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. రొనాల్డోను మించిన పర్ఫెక్షనిస్ట్ మరొకరు లేరు. తనే నాకు ఆదర్శం అంటూ ఎమెషనల్‌గా రాసుకొచ్చింది. కాగా సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య 400 మిలియన్ల మార్క్‌ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి వ్యక్తిగా రొనాల్డో రికార్డులెక్కాడు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన ఘనత.. సోషల్ మీడియాను వదల్లేదు View this post on Instagram A post shared by Georgina Rodríguez (@georginagio) -
ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని.. ఎంత పనిచేశావ్ తరుణ్..
మదనపల్లె టౌన్(చిత్తూరు జిల్లా): ప్రేయసి ఫోన్ లిఫ్ట్ చేయలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో సోమవారం జరిగింది. సదుం మండలం, చెరుకువారిపల్లెకు చెందిన క్రిష్ణయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో అతని భార్య సుజాత, కుమారుడు తరుణ్ రెండేళ్ల క్రితం మదనపల్లె ఈస్ట్‌పేటలో ఉంటున్నారు. చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు తరుణ్ పట్టణంలో ఫుడ్ సరఫరా చేసే సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను ఏడాదిగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఆమె 2 నెలలుగా ఫోన్‌కు స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై యువకుడు ఇంట్లోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో సుజాత తల్లడిల్లిపోయింది. టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ అమ్మాయితో ప్రేమ.. కొద్ది రోజులుగా ఆమె మాట్లాడటం లేదని..
సాక్షి, కామారెడ్డి: ప్రేమించిన అమ్మాయి మాట్లాడటం లేదని ఓ యువకుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. గొంతు కోసుకున్న వ్యక్తి నరేష్‌గా గుర్తించారు. చదవండి: Mating Season: ఆడతోడు కోసం ఎందాకైనా..! స్థానికుల కథనం ప్రకారం.. దళితవాడకు చెందిన నడిపి నరేష్ కొంత కాలంగా హైదరాబాద్‌కి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కొద్దిరోజులుగా ఆ అమ్మాయి నరేష్‌తో మాట్లాడటం లేదని తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంటి వద్ద బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నరేష్‌ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని స్థానికులు తెలిపారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జాగింగ్కని వెళ్లి ప్రియురాలతో ఎంజాయ్.. భార్యను చూసి రన్నింగ్
‘‘ఏమోయ్ నేను ఈ మధ్య బాగా లావయ్యాను కదా.. బరువు తగ్గడం కోసం జాగింగ్‌కు వెళ్దామనుకుంటున్నాను.. ఏం అంటావ్’’ అని అమాయకంగా భార్యను అడిగాడు ఓ వ్యక్తి. భర్త ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమని భావించిన ఇల్లాలు సరే అంది. భర్త జాగింగ్ ప్రారంభించి నెల రోజుల పైనే అవుతుంది. అయినా ఒక్క గ్రాము బరువు కూడా తగ్గలేదు. దాంతో ఆ ఇల్లాలికి అనుమానం వచ్చింది. ఓ రోజు భర్తకు తెలియకుండా అతడి వెనకే ఫాలో అయ్యింది. ఇక పార్కులో కనిపించని దృశ్యం చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే భర్త అక్కడ తన ప్రియురాలితో ముచ్చట్లాడుతూ కనిపించాడు. భార్యను అక్కడ చూసిన భర్త.. వెంటనే పరుగందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. (చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి) ఈ సంఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు లేవు. జాగింగ్ పేరు చెప్పి.. ఓ వ్యక్తి ప్రతి రోజు పార్క్‌కు వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు. జాగింగ్ చేసినప్పటికి భర్త బరువు తగ్గకపోవడంతో అనుమానం వచ్చి.. ఓ రోజు అతడి వెనకే పార్క్‌కు వెళ్లింది భార్య. అక్కడ ప్రియురాలితో సరదాగా గడుపుతున్న భర్తను చూసి షాకయ్యింది. వారి వెనక నిల్చుని ‘‘ఓహో తమరు చేసే జాగింగ్ ఇదా’’ అని ప్రశ్నించింది. సడెన్‌గా పార్క్‌లో భార్య గొంతు వినిపించేసరికి.. అతగాడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ప్రియురాలితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇక భార్య దగ్గరకు రావడం చూసి నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత పరుగందుకున్నాడు. ఇక సదరు ఇల్లాలు.. ‘‘ఆగు.. నా మాట విను.. ఇలాగే పరిగెత్తావనుకో.. ఇంటికి వచ్చాక నీ పని చెప్తాను’’ అని హెచ్చరించింది. (చదవండి: Viral Video: కేంద్ర మంత్రి డ్యాన్స్.. ప్రధాని మోదీ స్పందన) ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియోని షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘బాగా అయ్యింది.. ఇంటికెళ్లాక నీకు ఉంది పో’’.. ‘‘బలే బుక్కయ్యావ్ కదా ఇక నీకు చుక్కలు చూపిస్తుంది నీ భార్య’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: పోలీసుల సలహా : 3 రోజులు భార్యతో.. 3 రోజులు ప్రేయసితో.. -
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..
రామగిరి(నల్లగొండ): ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం గడ్డికొండారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మేరెడ్డి శేఖర్‌రెడ్డి చిన్న కుమారుడు మేరెడ్డి వినయ్‌రెడ్డి(24) బీటెక్ పూర్తిచేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం చేసే సమయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన లహరితో పరిచయం పెంచుకున్నాడు. ఆ క్రమంలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వీరిద్దరు వివాహం చేసు కుందామనుకున్నారు. అయితే లహరి తల్లిదండ్రులు వేరే యువకుడితో ఆమెకు బలవంతం గా వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న కారణంతో లహరి ప్రియుడి వద్దకు వచ్చేసింది. వీరిద్దరూ కలసి బెంగళూరు వెళ్లిపోయారు. వీరి ఆచూకీ తెలుసుకున్న లహరి కుటుంబసభ్యులు వినయ్‌రెడ్డిపై దాడిచేసి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వినయ్‌రెడ్డి బుధవారం స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి దక్కలేదని మనస్తాపం చెందిన వినయ్ గురువారం గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని యువకుడి వీరంగం
బెంగళూరు: ప్రేమలో పడ్డ ప్రతి జంట పెళ్లి చేసుకుంటారన్న గ్యారంటీ లేదు. ప్రేమను పెళ్లితో మూడిపెట్టేవారు చాలా తక్కువ ఉంటారు. ఎంత గాఢంగా ప్రేమించుకున్న కొన్ని కొన్ని కారణాలతో మధ్యలోనే బ్రేకప్ చెప్పేసి ప్యాకప్ అయ్యేవారే ఎక్కువ ఉన్నారు. బ్రేకప్ తర్వాత గతానికి స్వస్తి పలికి వెంటనే కొత్త జీవితాన్ని ప్రారంభించేవారు కొందరైతే గతాన్నే తలుచుకొని కుమిలికుమిలి బాధపడేవారు మరికొందరు. అయితే ఈ రెండు కోవలకు చెందిన వారికంటే విరుద్ధంగా విడిపోయాక లవర్‌పై కోపంతో రీవెంజ్ తీసుకునేవారు కూడా ఉంటారు. తాజాగా లవర్ బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కర్ణాటకకు చెందిన సతీష్(26) అనే యువకుడు, ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే ఏమయ్యిందో తెలీదు కానీ ఇటీవల ఆమె సతీష్‌కు బ్రేకప్ చెప్పింది. లవర్ బ్రేకప్ చెప్పడాన్ని తట్టుకోలేకపోయిన అతడు ఆవేశంతో రగిలిపోయాడు. బెంగళూరులోని రోడ్లపై కనిపించిన ఏడు కార్లను ధ్వంసం చేశాడు. గురువారం అర్ధరాత్రి 1.30 -.45 మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్లను ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సుమారు ఇలాంటి ఘటనే గత ఫిబ్రవరిలోనూ చోటుచేసుకుంది. లవర్ బ్రేకప్ చెప్పిందని ఆమె టూవీలర్‌ను మంటల్లో తగలబెట్టాడు. అంతేగాక ఆమెను చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. -
ప్రియుడి చెంప చెల్లుమనిపించిన ప్రేయసి.. ఎందుకంటే?
లండన్: ప్రేమకు హద్దులుండవు. ప్రేమ అనేది ఓ అద్భుతమైన భావన. ప్రేమ గురించి ఎంతో మంది ఎన్నో విషయాలను చెబుతుంటారు. ఇక సమయ పరీక్షను తట్టుకుని నిలబడిన ఎన్నో ప్రేమ కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ ప్రేమికుడు తన ప్రేయసికి 10 కి 4 రేటింగ్ ఇవ్వడంతో ప్రియుడి చెంప చెల్లుమనిపించింది ప్రియురాలు . వివరాల్లోకి వెళితే.. లండన్‌కి చెందిన ఓ వ్యక్తిని టిక్‌టాక్ యూజర్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ సమయంలో తనకు గాల్ ఫ్రెండ్ ఉందని చెప్పడంతో.. రేటింగ్ అడిగాడు. అయితే 10 కి 4 మాత్రమే ఇవ్వడంతో.. అతడి వెనకాలే ఉన్న ప్రేయసి.. ప్రియుడి చెంప చెల్లుమనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 4 లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ప్రేయసికి 10\10 ఇవ్వాలి.. లేకుంటే ఇలాగే ఉంటుంది.’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ఈ వీడియో కావాలనే చేశారు.’’ అని రాసుకొచ్చారు. -
మైదానంలోనే ప్రేయసికి ప్రపోజ్ చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు
న్యూయార్క్: అమెరికన్ ఫుట్‌బాల్ ఆటగాడు హసాని డాట్సన్ స్టిఫెన్‌సన్ తన ప్రేయసికి గ్రౌండ్‌లోనే లవ్ ప్రపోజ్ చేశాడు. మేజర్ లీగ్ సాకర్ టోర్నీలో భాగంగా ఆదివారం మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్ జోస్ ఎర్త్‌క్వేక్స్ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. మ్యాచ్ డ్రాగా ముగియగానే స్టీఫెన్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ పెట్రా వుకోవిక్ దగ్గరికి వెళ్లి మొకాలిపై కూర్చొని ‘విల్ యు మ్యారీ మీ’ అంటూ ఉంగరంతో ప్రపోజ్ చేశారు. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సర్ప్రైజ్తో షాక్‌కు గురైన అతని లవర్ వెంటనే అతని ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. అనంతరం ఉంగరాన్ని ప్రేయసి చేతికి తొడగి, ఈ మధుర క్షణాలను జీవితాంతం గుర్తుండిపోయేలా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మైదానంలోని ప్రేక్షకులు గట్టిగా కేకలు వేయడంతో స్టేడియం హోరెత్తింది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా స్టీఫెన్సన్ ప్రపోజ్ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. నా ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరినందుకు నేనెంతో అదృష్టవంతురాలిని. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచడంలో సహయపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. View this post on Instagram A post shared by Petra Vučković (@croatianchick31) View this post on Instagram A post shared by Hassani Dotson Stephenson (@hassanidotson) -
‘గారాల పట్టి.. మేము ఎలా బతికేది తల్లీ’
‘ప్లేట్లు కడిగాను. సర్వర్‌గా పనిచేశాను. అదే హోటల్లో ప్రధాన చెఫ్‌గా చేరాను. పైసాపైసా కూడబెట్టి ఉన్నతంగా చదివించాను. కళ్లెదుటే ఎదుగుతున్న కూతురుని చూసి సంబరపడ్డాను. కుటుంబానికి తోడుగా.. జీవితంలో స్థిరపడే విధంగా దేవుడు దీవించాడని ఆనందించాను. వెంటబడుతున్న వాడి నుంచి కాపాడాలని పోలీస్‌స్టేషన్ మెట్లెక్కాను. కానీ ఆ భగవంతుడు కూడా కనికరించలేదు. నా గారాల పట్టి ప్రాణాలను ఆ రాక్షసుడు అతి కిరాతకంగా తీసుకెళ్లిపోయాడు. మేము ఎలా బతికేది తల్లీ’ అంటూ చిత్తూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన సుస్మిత తండ్రి వరదయ్య రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది. చిత్తూరు అర్బన్: నగరంలోని రిడ్స్పేటకు చెందిన వరదయ్య, లత దంపతులకు సుస్మిత, సునీల్ సంతానం. పెద్దగా చదువుకోని వరదయ్య పెళ్లయ్యి భార్య, పిల్లల్ని పోషించడానికి 25 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు. తొలినాళ్లలో పనులు దొరక్క ఓ హోటల్లో చేరి పిల్లలు ఇద్దరినీ ఇంగ్లిషు మీడియంలో చదివించాడు. సాంబయ్యకండ్రిగలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నాడు. భార్య లత అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కుమార్తె సుస్మితకు వేలూరు సీఎంసీ వైద్య కళాశాలలో సీటు రావడం.. కోర్సు పూర్తయ్యాక మూడు నెలల క్రితం ఆమెకు గుడిపాల సమీపంలోని చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం రావడం అదృష్టమనుకున్నాడు. నెలకు రూ.17 వేలు జీతం. నైట్‌డ్యూటీలతో కలిపి మూడు రోజుల క్రితం రూ.18 వేల జీతాన్ని చేతిలో పెట్టడంతో ఇక తన కష్టం తీరిపోయిందని అనుకున్నాడు. ప్రేమ పేరిట చదువు, ఉద్యోగం లేని చిన్నా వేధించడంతో ఈ ఏడాది జనవరి 9న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీలాపల్లె పోలీసులు ఐపీసీ 354–డీ సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు పెట్టి అతన్ని అరెస్టు చేశారు. తర్వాత బెయిల్‌పై వచ్చిన అతను తమపై పగ పెంచుకుంటాడేమోననుకుని మళ్లీ వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. భవిష్యత్‌లో ఎప్పుడూ సుస్మితతో వివాదం పెట్టుకోకూడదని పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపేయడంతో అతను మారాడని భావించాడు. తీరా సుస్మితను కిరాతకంగా కత్తితో పొడిచి హత్యచేసిన చిన్నా చివరకు తనూ తనువు చాలించాడు. కూతురి రక్తంతో ఆ ఇల్లంతా తడిసి ముద్దవడం చూసిన తండ్రి తట్టుకోలేక పోయాడు. గుండెలు బాదుకుంటూ చిట్టితల్లిని తీసుకెళ్లిపోయావా దేవుడా.. అంటూ రోదించడం చూపరులకు కన్నీళ్లు తెప్పించింది. చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రహస్యంగా నగ్న వీడియోలు తీసి.. ఎంత ముద్దుగా ఉన్నావు తల్లి.. అమ్మే అంతపని చేసిందా?! -
పోలీసుల సలహా : 3 రోజులు భార్యతో.. 3 రోజులు ప్రేయసితో..
రాంచీ: సీనియర్ హీరో, దివంగత నటుడు శోభన్ బాబు, వాణిశ్రీ, శారదల కాంబినేషన్లో వచ్చిన ‘ఎవండోయ్.. ఆవిడొచ్చింది’ మూవీ గుర్తుంది కదా. అందులో శోభన్ బాబు ఇద్దరి పెళ్లాల ముద్దులి మొగుడిగా నటించాడు. వారంలో మూడు రోజులు శారద దగ్గర, మరో మూడు రోజులు వాణిశ్రీ దగ్గర ఉంటాడు. ఇక ఏడవ రోజు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతాడు. అయితే ఇటీవల అచ్చం ఈ మూవీని తలపించే సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాంచీలో కోక్రతిరోల్ రోడ్డుకు చెందిన రాజేష్ మహోతో అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. అతడికి ఓ కూతురు కూడా పుట్టింది. ఈ క్రమంలో రాజేష్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడింది. ఇక ఆమె దగ్గర పెళ్లైన సంగతి దాచి సదరు యువతితో ప్రేమయాణం సాగించాడు. ఈ క్రమంలో యువతితో కలిసి నెలరోజుల క్రితం పారిపోయి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక భర్త కనిపించకుండ పోవడంతో రాజేష్ భార్య బట్వార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అలాగే సదరు యువతి తల్లిదండ్రులు సైతం రాజేష్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ కూతురిని అతడు కిడ్నాప్ చేశాడని, తమ కూతురిని వెతికి పెట్టాలని వారు బట్వార్ పోలీసులతో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదు మేరకు రాజేష్‌తో కేసు నమోదు చేసిన పోలీసులు అతడి పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం రాజేష్ ప్రియురాలితో సహా పోలీసులకు దొరికిపోయాడు. అయితే అప్పటికే సదరు యువతిని పెళ్లి చేసుకున్నట్లు రాజేష్ పోలీసులతో పేర్కొన్నాడు. దీంతో రాజేష్ భార్యను పలిపించి పోలీసులు జరిగిన విషయం చెప్పారు. ఇక అతడికి ఇదివరకే వివాహమైందని, ఓ కూతురు కూడా ఉందన్న నిజం తెలిసి సదరు యువతి అవాక్కైంది. రాజేష్‌కు ఇదివరకే పెళ్లైన విషయం దాచిపెట్టి తనకు దగ్గరైనట్లు సదరు యువతి పోలీసుల ఎదుట వాపోయింది. ఈ నేపథ్యంలో రాజేష్ భార్య, ప్రియురాలికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అతడు నా భర్త అంటే నా భర్త అంటూ ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో పోలీసులు వారిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఓ సలహా ఇచ్చారు. వారంలో మూడు రోజులు మొదటి భార్య దగ్గర ఉండాలని, మరో మూడు రోజులు ప్రియురాలి వద్ద ఉంటాడని, ఇక మిగిలిన ఒక్కరోజు అతడి ఇష్టమంటూ పోలీసులు ముగ్గురి మధ్య రాజీ కుదిర్చి బాండ్ పేపర్స్‌పై ముగ్గురి సంతకాలు తీసుకుని ఇంటికి పంపించారు. అయితే రాజేష్ మొదటి భార్య దగ్గరికి వెళ్లిపోవడంతో ప్రియురాలు పోలీసు స్టేషన్‌కు వెళ్లి అతడిపై ఫిర్యాదు చేసింది. రాజేష్ తనని మోసం చేశాడని, తన మొదటి వివాహ విషయం దాచి తనపై లైంగికదాడి చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఇక ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు మొదటి భార్య ఇంటికి వెళ్లారు. అప్పటికే రెండో భార్య తనపై కేసు పెట్టిన విషయం తెలుసుకుని రాజేష్ పరారయ్యాడు. దీంతో రాజేష్ పారిపోవడానికి మొదటి భార్యే సహాకరించిందంటూ ప్రియురాలు కోర్టుకు వెళ్లింది. కాగా ప్రస్తుతం పోలీసులు రాజేష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్య చేపట్టారు. (చదవండి: వైరల్ : పాలు అమ్మడానికి హెలికాప్టర్ కొనేశాడు) (జూనియర్ 'చిరు'ను పరిచయం చేసిన మేఘనా) -
దారుణం: వివాహితుడనని చెప్పకుండా..
మైసూరు: ప్రశాంతంగా ఉండే మైసూరులో ఘోరం చోటుచేసుకుంది. పెళ్లయిన వ్యక్తి ప్రియురాలిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మండ్య జిల్లాలోని హొంబాళె కొప్పలు గ్రామానికి చెందిన కాంట్రాక్టరు హెచ్,ఎం.లోకేష్ (30), నాగమంగలకు చెందిన అమూల్య (25)ను ప్రేమ పేరుతో మభ్యపెట్టాడు. లోకేష్‌కు ఇప్పటికే పెళ్లయి ఒక కుమార్తె కూడా ఉంది. మైసూరులో ఎమ్మెస్సీ చదివే అమూల్యతో తాను వివాహితుడనని చెప్పకుండా షికార్లకు తిరిగాడు. (చదవండి: పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. జవాను ఆత్మహత్య) ఆమె పెళ్లి చేసుకోవాలని కోరగా, మాట్లాడాలని చెప్పి బుధవారం సాయంత్రం మైసూరులోని ఒక హోటల్లో రూం తీసుకున్నారు. అక్కడ ఏం గొడవ జరిగిందో అతడు అమ్మాయిని గొంతు నులిమి చంపి తన స్నేహితునికి ఫోన్ చేసి చెప్పి తరువాత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు, పోలీసులు వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి కనిపించారు. హెబ్బాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.(చదవండి: దుపట్టాతో ఉరి.. తొడపై సూసైడ్ నోట్!) -
శారీరకంగా వాడుకొని మోసం చేశాడని..
సాక్షి, భీమరదేవరపల్లి(వరంగల్): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ సంఘటన వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపలతికి చెందిన సంకనేని సునంద.. చంటయపల్లికి చెందిన కొన్నె రమేష్ మద్య నాలుగేళ్ల క్రితం రాంగ్ కాల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. చదవండి: ఖమ్మం జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్య ఈ క్రమంలో రమేష్ ఆర్మీ జవాన్ కాగా సెలవుల్లో ఇంట్లికి వచ్చినపుడల్లా ఇరువురు కలుసుకునేవారు. అయితే తనను పెళ్లి చేసుకుంటాని నమ్మబలకడంతో దగ్గరయ్యానని బాధితురాలు తెలిపింది. ఇటీవల తన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రమేష్ ఇంటికికి వెళ్లగా వేరే అమ్మాయితే నిశ్చితార్థం జరిగినట్లు తెలిసిందని చెప్పింది. తనకు రమేష్‌తో వివాహం జరిపించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని మౌన పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న ముల్కనూర్ ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. యువతి మౌన పోరాటానికి మద్దతు తెలిపారు. చదవండి: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. -
కాబోయే భర్తతో కలిసి బాస్‌ను హత్యచేసిన మహిళ
సాక్షి, ఢిల్లీ: కాబోయే భర్తతో కలిసి ప్రియుడ్ని హత్యచేసిందో మహిళ. ఢిల్లీలో నీరజ్ గుప్తా అనే వ్యాపారవేత్త వాయువ్య ఢిల్లీలో ఆదర్శ్ నగర్లో ఉంటున్నాడు. అయితే అతను తప్పిపోయినట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా తన భర్త కనిపించడం లేదని, ఈ ఘటన వెనుక ఫైజల్ అనే మహిళ ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ కోణంలో విచారించగా గుప్తాను హత్య చేసినట్లు తేలింది. ఇందులో పైజల్ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో ఫైసల్ గుప్తా దగ్గర పనిచేసేదని, గత 10 సంవత్సరాలుగా అతనితో వివాహేతర సంబంధం కలిగి ఉందని వెల్లడైంది.చదవండి:(భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా) వివరాల్లోకి వెళితే.. పైజల్‌కు జుబేర్ అనే వ్యక్తితో నిశ్చితార్థం కాగా, ఆ విషయాన్ని నీరజ్ గుప్తాకు తెలిపింది. అయితే వివాహానికి గుప్తా అభ్యంతరం తెలపడంతో నవంబరు 13న ఆదర్శ్ నగర్ లో కేవాల్ పార్క్ ఎక్స్టెన్షన్లో పైజల్ అద్దె ఇంటికి వచ్చి తల్లి, జుబెర్, తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారి మధ్య వాగ్వాదం తీవ్ర కావడంతో ఫైజల్ కాబోయే భర్త గుప్తా తలపై ఇటుకతో కొట్టి , కడుపులో పొడిచిన తరువాత అతని గొంతును కోశారు. మృతదేహాన్ని తరలించడంలో పైజల్. ఫైజల్ తల్లి జుబెర్‌కు సహయాన్ని అందించారు.అతని మృతదేహాన్ని సూట్‌కేస్‌లో ఉంచి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తీసుకెళ్లారు. గుజరాత్ భరూచ్ సమీపంలో రైలు నుంచి బయటకు విసిరేశారు. హత్య చేసిన నిందితులు పైజల్ (29), ఆమె తల్లి షాహీన్ నాజ్ (45), కాబోయే భర్త జుబెర్ (28)ను అరెస్టు చేసినట్లు నార్త్‌వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ విజయంత ఆర్య తెలిపారు. -
అమ్మాయితో స్నేహం నచ్చక కొట్టి చంపారు
న్యూఢిల్లీ: ఒక యువతితో స్నేహం చేసినందుకు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ ఢిల్లీ ఆదర్శనగర్‌లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్‌పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్‌వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారు. అయిదు మంది కలిసి రాహుల్‌ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది. పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు. శనివారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. దోషుల్ని కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ప్రేయసి గురక భరించలేక ప్రియుడు..
గురక చాలా మందికి సాధారణ సమస్య. ఇది బాధితుడిని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా పక్కనున్న వారిని బాగా ఇబ్బంది పెట్టే సమస్యే. అలాంటిది మీ భాగస్వామే గురకతో మిమ్మల్ని ఇబ్బంది పెడితే.. ఆ సమస్య రోజూ ఎదురైతే పరిస్థితి ఏంటి..?. ఇలాంటి పరిస్థితే ఎదురైనా ఓ వ్యక్తి ఆ సమస్యకు ఓ గమ్మత్తయిన పరిష్కారాన్ని కనుగొన్నాడు. వివరాల్లోకెళ్తే.. 22 ఏళ్ల జాన్ అబ్రహం తన ప్రియురాలు షార్ని బ్రైట్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు నిద్రలో గురకపెట్టే సమస్య ఉంది. దీంతో జాసన్ అనేక నిద్రలేని రాత్రులు గడిపాడు. అయితే ప్రియురాలు గురక పెట్టకుండా.. ఆ సమయంలో తనను నిద్ర నుంచి లేపకుండా గురక తగ్గించడానికి అనేక ప్రయోగాలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఒక ప్రయోగం సూపర్ సక్సెస్ అయ్యింది. అదేంటంటే.. ప్రియురాలు గురక పెట్టే సమయంలో జాసన్ ఆమె ముఖాన్ని నాకేవాడు. దీంతో ఆమె గురకపెట్టడం ఆపేది. వారం రోజులపాటు ఇదే పద్ధతిని కొనసాగించాడు. దీంతో క్రమంగా ఆమె గురక తగ్గిపోవడంతో ఈ ప్రేమజంట ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తర్వాత ఒక సందర్భంలో తన ప్రియురాలికి తను పడుతున్న కష్టాల్ని తెలియజేయగా.. షార్ని బ్రైట్ షాకైంది. అయితే వెంటనే షార్ని బ్రైట్ తన ప్రియుడ్ని ఈ ప్రయోగం మళ్లీ చేస్తావా అని అంటే జాసన్ నో కామెంట్ అంటూ సమాధానమిస్తున్నాడు. (హైవేపై డ్రాగర్ చూపుతూ యువతి హల్చల్) -
గర్ల్‌ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదని..
చెన్నై: కరోనా వైరస్ ఆ ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచింది. లాక్డౌన్ ఆ దూరాన్ని మరింత అగాధంగా మార్చింది. వారు కలుసుకునే మార్గం లేకపోవడంతో కేవలం ఫోన్లలో మాట్లాడుకుంటూ, చాట్ చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత అమ్మాయి ఫోన్ ఎత్తడం కూడా మానేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కొరక్కుమ్లో నివసిస్తున్న 22 ఏళ్ల దురాయ్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. (చదవండి: ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచిందా?) కరోనా వైపరీత్యానికి ముందు వరకు ఆ ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే లాక్డౌన్ విధించిన నాటి నుంచి వీళ్లు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఫోన్లు మాట్లాడుకుంటూ, చాట్లు చేసుకునేవారు. ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లుగా ఆమె దురాయ్ను పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడు మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో గురువారం అతను నివసిస్తున్న భవనం మూడో అంతస్థు నుంచి దూకేశాడు. కాళ్లు విరిగి బాధతో గిలగిలా కొట్టుకుంటున్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే జీఎస్ఎమ్సీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఆర్కే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఆత్మహత్యకు ముందు వీడియో తీసి..) -
నాకో ప్రేయసి కావాలి...జపాన్ కుబేరుడు
టోక్యో : జపాన్ బిలియనీర్, ఆన్లైన్ ఫ్యాషన్ కంపెనీ జోజో చీఫ్ యుసాకు మేజావా(44) మళ్లీ సంచలన ప్రకటనతో మళ్లీ హల్ చల్ చేస్తున్నాడు. తనకొక ప్రేయసి కావాలంటూ ఆన్లైన్లో ప్రకటనల విడుదల చేసి మరోసారి వార్తలకెక్కాడు. మధ్య వయసులో ఒంటరితనంతో బాధపడుతున్న తనకు ఒక తోడు కావాలని, తద్వారా జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు 20 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అమ్మాయి తనతోపాటు స్పేస్ఎక్స్ రాకెట్లో చంద్రుని చుట్టూ తిరిగే బంపర్ ఆఫర్ కూడా కొట్టేయవచ్చని ప్రకటించాడు. ఇద్దరు మహిళలతో ఇప్పటికే ముగ్గురు పిల్లలున్న పారిశ్రామికవేత్త మేజావా, ఇటీవల మేజావా, ఇటీవల జపాన్ నటితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. తాను ఇప్పటివరకు తాను కోరుకున్నట్లే జీవించానని పేర్కొన్నాడు. ఒంటరితనంతో పాటు, జీవితంలో వెలితి తనను బాధిస్తోందని, అందుకే ఒక మహిళ తోడు కావాలని కోరుకుంటున్నట్టు తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని మేజావా తన ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేశాడు. "చంద్రుడిపైకి ప్రయాణించే 'మొదటి మహిళ' మీరే ఎందుకు కాకూడదు?" దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ జనవరి 17, 2020. మార్చి చివరి నాటికి తుది ఎంపిక వుంటుందని ట్వీట్ చేశాడు. కాగా ఇటీవల తన ట్విటర్ ఖాతాను ఫాలోఅయిన వారికి కోట్లాది రూపాయల కానుక యుసాకు మేజావా ప్రకటించాడు. జనవరి 1న తాను చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వారికి ఈ నగదును పంచిపెట్టాడు. అలాగే టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ చేపట్టిన స్పేస్ఎక్స్ ప్రాజెక్టులో సైన్ చేసి 2023లో చంద్రుడిని చుట్టి రానున్నమొదటి ప్రైవేట్ ప్రయాణీకుడిగానిలిచిన సంగతి తెలిసిందే. చదవండి : జపాన్ కుబేరుడు సంచలన నిర్ణయం -
పార్లమెంట్‌లోనే ప్రేయసికి ప్రపోజ్ చేశాడు
ప్రేమించడం చాలా సులువైన పనే కానీ.. ప్రేయసిని ఒప్పించేలా ఆ ప్రేమను వ్యక్తపరచడం అంత సులువేమీ కాదు. ప్రియురాలిని మెప్పించడానికి అనేక పద్దతులను, వినూత్న ఆలోచనలను ప్రయోగిస్తూ ఉంటారు. ప్రేమను పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా తెలియజేయాలి అనుకుంటారు ప్రేమికులు. ఇటాలియన్‌కు చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి దారిని ఎంచుకున్నాడు. పార్లమెంట్లో చర్చ జరుగుతున్న సమయంలో తన ప్రేయసి ఎలీసాకి ప్రపోజ్ చేశాడు ఎంపీ డై మూరో. ఈ ఘటన గురువారం ఇటాలియన్ పార్లమెంట్లో చోటుచేసుకుంది. వివరాలు.. డై మూరో ఇటాలియన్ ఎంపీ, తన ప్రేయసి ఎలీశా. గతకొంత కాలంగా ఆమెను ఇష్టపడుతున్నాడు. అయితే గురువారం పార్లమెంట్ సమావేశాలు సందర్భంగా డై మూరో ప్రసంగం వినేందుకు ఎలీశా సభకు వచ్చారు. గ్యాలరీలో కూర్చోని ప్రసంగాన్ని వింటున్నారు. ఈ సమయంలో మూరో తన ప్రేమను వ్యక్త పరిచాడు. ‘విల్ యూ మ్యారీ మీ ఎలీశా’ అంటూ డైమెంట్ రింగ్‌ను చూపించాడు. వెంటనే పక్కనున్న సహచర సభ్యులంతా అతని చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాసేపటికే ఎలీశా తన ప్రపోజల్‌ను అంగీకరించిందని తోటి సభ్యులు తెలిపారు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా సభ ప్రత్యక్ష ప్రసారం అవుతున్న సమయంలోనే అతను ప్రపోజ్ చేయడం విశేషం. -
ప్రియురాలి ఇంటి ఎదుటే ప్రాణాలు విడిచాడు..
లక్నో : ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి ఇంటి ఎదుటే ప్రేమికుడు సజీవ దహనమైన ఘటన మహరాజ్‌గంజ్‌లో వెలుగుచూసింది. ఆర్యచౌక్ ప్రాంతంలో బసంత్‌పూర్‌కు చెందిన 23 ఏళ్ల కిషన్ ఆర్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. కిషన్ తన ప్రియురాలు కలిసి ఉండేవారని, పదిరోజుల కిందట వీరిద్దరూ గొడవపడటంతో యువతి పట్టణంలోని ఫరెందా రోడ్డు సమీపంలోని తన పుట్టింటికి వచ్చిందని ఏఎస్పీ వెల్లడించారు. మరోవైపు యువతి కుటుంబ సభ్యులే కిషన్‌ను సజీవ దహనం చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కిషన్ తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారని ఎసీపీ చెప్పారు. కిషన్‌ను కాపాడే ప్రయత్నంలో యువతి తండ్రికి కూడా గాయాలయ్యాయి. జిల్లా ఆస్పత్రిలో గాయపడిన యువతి తండ్రిని చేర్పించామని పోలీసులు తెలిపారు. సజీవ దహనానికి పాల్పడిన కిషన్ యువతి ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నించాడని పోలీసులు చెబుతున్నారు. కాగా మృతదేహాన్ని గుర్తించని యువతి ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్పడం గమనార్హం. రెండేళ్ల కిందట తన గర్ల్‌ఫ్రెండ్ మైనర్‌గా ఉన్న సమయంలో ఆమెతో కలిసి పారిపోగా, ఆమె తండ్రి ఫిర్యాదుపై కిషన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మరోసారి అదే యువతితో వెళ్లిపోయాడు. -
ప్రేమ పేరుతో మోసం.. పోలీస్‌శ్టేషన్ వద్ద యువతి ధర్నా
-
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు పోరాటం
-
డాడీ లాంటి గర్ల్‌ఫ్రెండ్
డాడీని ప్రేమించినంతగా అమ్మాయిని ప్రేమించొచ్చు!ఇది అతిశయోక్తే! అమ్మాయిని ప్రేమించినంతగాడాడీని ప్రేమించొచ్చేమో!విదిలించుకుపోయిన కొడుకును.. వీధిపాలైన ప్రేమనుమళ్లీ గెలుచుకోవాలనినెట్‌లో ఓనమాలు తెలియనిఓ తండ్రి విసిరిన వలే ఈ కథ!కాని అబద్ధం దాగదుగా!అబద్ధం కొన్ని రోజులు అందంగా అనిపించినా..చివరకు డాడీలా కనపడితే! ఏమౌతుంది?! ‘‘నేనేం తప్పు చేశాను? మీ అమ్మ నాతో అబద్ధం ఆడితే నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తున్నావ్. అవును.. మీ అమ్మకు పెద్ద యాక్సిడెంటే అయింది. కానీ అప్పుడు నువ్వు ఫైనలియర్ ఎగ్జామ్స్ రాస్తున్నావ్. నిజం తెలిస్తే డిస్టర్బ్ అయిపోయి నీ చదువు పాడుచేసుకుంటావని.. మీ అమ్మ నాకు అబద్ధం చెప్పి అదే అబద్ధాన్ని నాతోనూ ఆడించింది. మీ అమ్మ సడెన్ డెత్తో నా గుండె పగిలింది. బిజినెస్‌లో లాస్.. ఇల్లు అమ్మక తప్పని పరిస్థితి.. ఒరేయ్.. ఓటమిని కొడుకుతో పంచుకునేంత ధైర్యం లేని తండ్రినిరా.. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు అమ్మేశా. తారా విషయంలో కూడా నేను చేసింది తప్పు కాదు. నీతో మాట్లాడేందుకు ట్రై..’’ అని అంటూండగానే ఆ తండ్రిని వాటేసుకున్నాడు కొడుకు ‘‘సారీ పాపా (నాన్న).. నన్ను క్షమించు’’ అంటూ. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘రాజ్మా చావల్’ అనే సినిమాలోని దృశ్యం. ఓల్డ్ ఢిల్లీలో ప్రాణం దాచుకున్న తండ్రికి, న్యూఢిల్లీలో ప్రాణం పోసుకున్న కొడుక్కి మధ్య భావోద్వేగాల ఘర్షణ, అభిప్రాయభేదాల సంఘర్షణ ఈ సినిమా. ఇంకా చెప్పాలంటే ఫాస్ట్‌ఫుడ్‌కి, సంప్రదాయ భోజనానికి, ఎదురెదురు సంభాషణకు, మెస్సెంజర్‌లో చాటింగ్కున్న వ్యత్యాసమే రాజ్మాచావల్. పైన చెప్పిన సీన్‌కి ముందూ, వెనక కథ.. తండ్రి పేరు రాజ్ మాథుర్(రిషీకపూర్). ఓల్డ్ ఢిల్లీలోని చాంద్నీచౌక్లోనే పుట్టి పెరుగుతాడు. ఆ ప్రాంతం.. బాల్య స్నేహితులంటే రాజ్మాథుర్కి చచ్చేంత ఇష్టం. ‘‘మన పిల్లలకు ఈ గజిబిజి వాతావరణం వద్దు. ప్రశాంతంగా ఉన్న లొకాలిటీకి మారుదాం’’ అని భార్య కోరితే కొత్త ఢిల్లీకి షిఫ్ట్ అవుతాడు. అక్కడే పుడ్తాడు కబీర్ మాథుర్ (అనిరు«ద్ తన్వార్). అమ్మ కూచీ. ఆధునిక తరానికి ప్రతినిధి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సంగీతం అంటే చెవికోసుకుంటాడు. గిటార్ ప్లేయర్. ఓ బ్యాండ్ పెట్టి మ్యూజిక్ పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలనుకుంటాడు. కబీర్ సీరియస్‌గా ఆ ట్రయల్స్‌లో ఉన్నప్పుడే అతని తండ్రి హఠాత్తుగా మకాంను చాంద్నీ చౌక్‌కి మార్చేస్తాడు. కనీసం కొడుకుతో మాటైనా చెప్పకుండా. అది కబీర్‌కు కోపం తెప్పిస్తుంది. అమ్మకు జరిగింది చిన్న యాక్సిడెంటే అని అబద్ధమాడి సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించలేదని, ఇప్పుడు ఆమె తిరిగిన ఆ ఇంటినీ అమ్మేసి అమ్మ జ్ఞాపకాలకు దూరంగా చాంద్‌నీచౌక్ తీసుకెళ్తున్నాడనీ.. డబ్బు తప్ప తండ్రికేదీ ముఖ్యం కాదనే అపార్థంతో తండ్రిని బాధపెడుతూ ఉంటాడు.. అతనితో మాట్లాడకుండా. చాంద్నీ చౌక్.. ఫేస్బుక్ తార తండ్రీకొడుకుల మధ్య మాటలు పెంచడానికి రాజ్‌మాథుర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక ఉపాయం ఆలోచిస్తారు. రాజ్ మాథుర్ చేత ఓ స్మార్ట్ ఫోన్ కొనిపిస్తారు. అతనిపేరుతో ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయించి కబీర్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పంపిస్తారు. కొడుకు రిజెక్ట్ చేయడమే కాక.. తండ్రిని బ్లాక్‌లిస్ట్‌లో పెడ్తాడు. చిన్నబుచ్చుకుంటాడు రాజ్‌మాథుర్. అప్పుడు రాజ్‌మాథుర్ స్నేహితుడి తల్లి... టెక్నోసావి అన్నమాట. ఆమె తన ఫెబీ అకౌంట్లోని ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్.. వాళ్ల ఫ్రెండ్స్ లిస్ట్నంతా జల్లెడ పట్టి.. ఒకమ్మాయి ఫోటో తీస్తుంది. దాన్ని ప్రొఫైల్‌పిక్‌గా పెట్టి తార (అమైరా దస్తూర్) అనే పేరుతో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేస్తుంది. రాజ్‌మాథుర్ కొడుకు కబీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. వెంటనే ఓకే చేస్తాడు కబీర్. ఆ అకౌంట్ నుంచి అమ్మాయిలాగే కొడుకుతో చాట్ చేయమని సలహా ఇస్తుంది ఆమె. తామిద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ పోవాలంటే ఇదొక్కటే మార్గమనుకొని చాటింగ్ మొదలుపెడ్తాడు తండ్రి. కబీరూ ఆసక్తిగా తన ఇష్టాయిష్టాలు పంచుకుంటూంటాడు. సందర్భం వచ్చినప్పుడల్లా తారగా చాట్ చేస్తున్న రాజ్‌మాథుర్ జీవితంలో తండ్రి రోల్ గురించి చెప్తుంటాడు. నిర్మొహమాటంగానే ఖండిస్తుంటాడు కబీర్. ఎదురెదురుగా కూర్చోని కూడా ఇద్దరూ సెల్‌ఫోన్ కీ బోర్డ్ ద్వారే మాటలు కదుపుతుంటారు. కబీర్‌కు తెలియదు అవతల చాట్ చేస్తోంది తండ్రేనని. మొత్తానికి పట్టువీడని రాజ్‌మాథుర్ చాటింగ్ ద్వారా తన కొడుకులో కొంత మార్పు తేగలుగుతాడు. తనతో ప్రత్యక్షంగా కొడుకు మాట్లాడేలా చేసుకోగలుగుతాడు. ఓ పబ్‌లో తను ఇస్తున్న మ్యూజిక్ షోకీ తన తండ్రిని ఆహ్వానించేంత దగ్గరవుతాడు కబీర్. ఆ రోజు.. ఆ పబ్‌కి తారగా ఎఫ్బీ ప్రొఫైల్ పిక్ ఉన్న అమ్మాయి కూడా వస్తుంది. స్టేజ్ మీదున్న కబీర్ ఆమెను చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతాడు. అది ఆమె తనకిచ్చిన సర్ప్రైజ్ అనుకుంటాడు. ఆ షోకి వచ్చిన రాజ్ మాథుర్ అండ్ ఫ్రెండ్స్ కంటా పడ్తుంది ఆ అమ్మాయి. అవాక్కవుతారంతా. ఈలోపే ఆ అమ్మాయి వెంట ఇంకో అబ్బాయి పడ్తుంటాడు. తప్పించుకుని వెళ్లబోతుంటే కబీర్ ఎదురొస్తాడు... తారా.. తారా.. అంటూ! బిత్తరపోతుంది అమ్మాయి. పొరపాటు పడ్తున్నాడేమో.. తన పేరు తార కాదని చెప్పబోయి ఆగిపోతుంది. వెంటపడ్తున్నవాడిని తప్పించుకోవడానికి తన ముందున్న వ్యక్తితో తారగానే నటించాలనుకుంటుంది. అతనితో అంతకుముందే పరిచయమున్నట్టు ముద్దు పెట్టుకుంటుంది. ఇదంతా చూస్తున్న రాజ్‌మాథుర్ అండ్ ఫ్రెండ్స్ అయోమయంలో పడిపోతారు. ఈ సంఘటన తర్వాత ఒకట్రెండుసార్లు కబీర్‌కు బయట తారసపడ్తుంది తార. కాని పట్టించుకోదు. ఎఫ్బీలో మాత్రం ఏమీ తెలియనట్టే చాట్చేస్తుంటే చిర్రెత్తుకొస్తుంది అతనికి. ఆ చిరాకులోనే తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోతాడు కబీర్. తర్వాత.. ఇదంతా తార మూలంగానేమో అని సందేహపడ్తాడు రాజ్‌మాథుర్. కొడుకుకి నిజం తెలిసేకంటే ముందే ఆ అమ్మాయిని పట్టుకొని అసలు విషయం చెప్పేయాలనుకుంటాడు. ఎఫ్బీ ప్రొఫైల్ పిక్‌ని జూమ్ చేస్తే ఆ ఫొటో వెనకాల మీరట్ అని కనిపిస్తుంది. మీరట్ వెళ్తాడు. ఆ అమ్మాయి తండ్రి హెడ్మాస్టర్. కూతురి మీద కోపంతో ‘‘ఆమె గురించి మాకేమీ తెలియదు.. దయచేసి వెళ్లిపోండి’’ అంటూ వీళ్ల మొహమ్మీదే తలుపేస్తాడు. ఆ అమ్మాయి తమ్ముడు చాటుగా వాళ్లక్క ఫోన్‌నంబర్ ఇస్తాడు. ఢిల్లీ తిరిగొచ్చి ఆ నంబర్‌కి ఫోన్ చేస్తాడు. కలుస్తాడు. విషయం చెప్తాడు. తన ఫోటోని వాడుకుంటున్నందుకు పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బెదిరిస్తుంది తార. అలా వాడుకోవాల్సిన గత్యంతరాన్ని వివరించి, ఎలాగైనా సరే కబీర్‌తో స్నేహం, ప్రేమ నటించి మళ్లీ అతను తన ఇంటికి వచ్చేలా చేయమని ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తాడు రాజ్ మాథుర్. చీట్ చేయలేనంటుంది. డబ్బు తీసి ముందు పెడ్తాడు రాజ్‌మాథుర్. అప్పుల్లో కూరుకుపోయిన ఆ అమ్మాయికి అదొక మంచి అవకాశంగా తోస్తుంది. ఆ టాస్క్‌కి ఓకే అంటుంది. కబీర్‌తో స్నేహం చేస్తుంది. కబీర్ ఆ అమ్మాయితో ప్రేమలో పడ్తాడు. అతను చూపే కన్సర్న్కి ఆమే అతణ్ణి ప్రేమిస్తూంటుంది. ఆ క్రమంలోనే తన గతం గురించి షేర్ చేసుకుంటుంది కబీర్‌తో. మీరట్‌లో ఒక అబ్బాయిని ప్రేమించానని, ప్రెగ్నెంట్ కూడా అయ్యానని, వాడు మొహం చాటేశాడని, అబార్షన్ చేయించుకున్నానని, పరువు నెపంతో తల్లిదండ్రులు ఇంటికిరానివ్వలేదని.. ఢిల్లీకి వచ్చి బ్యుటీషియన్‌గా ఉద్యోగం చేసుకుంటున్నానని చెప్తుంది. దాంతో ఆ అమ్మాయంటే మరింత ప్రేమకలుగుతుంది కబీర్‌కు. డ్రామా ఆపేయ్.. తార నిజంగానే తన కొడుకుతో ప్రేమలో పడిందని గ్రహించిన రాజ్‌మాథుర్ ఆమెను పిలిచి ఆ డ్రామా ఆపేయ్మంటాడు. ప్రేమ నిజమని.. డ్రామా కాదని చెప్తుంది తార తడి కళ్లతో. ‘‘సరే, ఆపడానికి ఎంత తీసుకుంటావ్?’’ అంటూ మళ్లీ డబ్బు తీస్తాడు రాజ్‌మాథుర్. ఆ చర్యతో హర్ట్ అయిన తార కబీర్‌ను దూరం పెడ్తూ్తంటుంది. దానికి కొనసాగింపుగా తారగా చాట్ చేస్తున్న రాజ్‌మాథుర్ కబీర్‌ను బ్లాక్ చేస్తాడు. తార ప్రవర్తన అర్థంకాక తల్లడిల్లిపోతాడు కబీర్. తండ్రితో సహా అందరూ తనను మోసం చేస్తున్నారని బాధపడ్తూంటాడు. తండ్రికి మరింత దూరమవుతాడు. కొడుకును తన దరికి రప్పించుకోవడానికి హార్ట్ ఎటాక్ డ్రామా ఆడ్తాడు రాజ్‌మాథుర్. ఆ సమయంలోనే రాజ్‌మాథుర్ తనకు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించడానికి వస్తుంది తార. ఆ సంగతి తెలిసీ... కూపీ లాగుతాడు కబీర్. తార పేరుతో తండ్రి ఆడిన నాటకమే కాదు హార్ట్ఎటాక్ కూడా డ్రామా బయటపడుతుంది. తార అసలు పేరు సెహెర్ అనీ తేలుతుంది. ఇన్ని అబద్ధాలా? తట్టుకోలేను అని తండ్రిని చీదరించుకుని మళ్లీ వెళ్లిపోతాడు కబీర్. ఆ గండం గట్టెక్కించేది తార ఉరఫ్ సెహెర్ అని, ఆమె మాటే కొడుకు వింటాడనీ ఆమె దగ్గరకు వెళ్లి బతిమాలి, ఒప్పించి కొడుకును వెదికే పనిలో పడ్తాడు రాజ్‌మాథుర్ అండ్ బృందం.ఎట్టకేలకు ఢిల్లీలోని ద్వారకా మెట్రోస్టేషన్లో కొడుకు కనిపిస్తాడు. అప్పటిదే ఆ పైన సీన్. కొడుకు అపార్థం తొలగిపోతుంది. తండ్రితో కలుస్తాడు. సెహెర్ మనసును రాజ్‌మాథుర్ అర్థం చేసుకుంటాడు. కొడుకుతో జత కలుపుతాడు. సెహెర్ను ఆమె తండ్రీ క్షమించి అక్కున చేర్చుకుంటాడు. ఇదీ లీనా యాదవ్ దర్వకత్వం వహించిన రాజ్మాచావల్ మూవీ. – సరస్వతి రమ -
వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిని పడేశాడు
చికాగో: ఈరోజుల్లో అమ్మాయిలను పడేయాలంటే చాలా కష్టం. అస్సలు వాళ్లను ఎలా పడేయాలో తెలియక కొందరు కుర్రాళ్లు పిచ్చోళ్లవుతున్నారు. ఏళ్ల తరబడి వారి ప్రేమ కోసం నిరీక్షణ చేస్తారు. అందుకే కొందరు యువకులు తమ బుర్రకు తట్టిన కొత్త ఆలోచనలు వినూత్నంగా ట్రై చేసి అమ్మాయిలను పడేస్తున్నారు. చికాగోకు చెందిన బాబ్ లెంపా వ్యక్తి ఇలా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ప్రపోజ్ చేయడానికి చికాగోలోని మ్యాగీ డాలే పార్క్‌ను ఎంచుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ పెగ్గీ బేకర్ డాలే పార్క్‌కు సమీపంలోని అపార్ట్మెంట్లో 37వ ఫ్లోర్లో ఉంటుంది. తనకు 37వ ఫ్లోర్ నుంచి చూసినా తన ప్రపోజల్ మెసేజ్ కనిపించాలని.. 45 అడుగుల పొడవు, 31 అడుగుల వెడల్పుతో 'మ్యారీ మీ' అనే మెసేజ్‌ను మంచులో తయారు చేశాడు. దాన్ని గీయడానికి అతనికి 6 గంటల సమయం పట్టింది. చాలామంది దాన్ని గమనించినా అంతగా పట్టించుకోలేదు. తొలుత ఆమె చూసి వామ్మో ఇంత పెద్దగా ఎవరు గీశారని అనుకుది. చివరికి ఆ ప్రపోజల్ తనకోసమే అని తెలిసి భావోద్వేగానికి గురైంది పెగ్గీ. అనంతరం తన బోయ్‌ఫ్రెండ్‌కు ఎస్ చెప్పేసింది. దీంతో వాళ్లిద్దరూ ఒక్కటయిపోయారు. ఇక.. ఈ ప్రపోజల్ మెసేజ్‌ను పార్క్ సిబ్బంది ఫోటో తీసి తమ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసి అతడి ప్రపోజల్, దానికి ఆ యువతి ఒప్పుకోవడం.. మీరెప్పుడైనా చికాగో పార్క్‌లో ప్రపోజ్ చేశారా? అంటూ వాళ్లు క్యాప్షన్ పెట్టడంతో.. ఆ ఫోటోతో పాటు... వాళ్ల స్టోరీ కూడా వైరల్‌గా మారింది. -
లవర్ తిట్టిందని ఆటోలోనే..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రియురాలితో ఫోన్లో గొడవపడి ప్రయాణిస్తున్న ఆటోలోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు ఓ 24 ఏళ్ల యువకుడు. అతనితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రసుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండగా, మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఆదివారం రాత్రి ఉత్తర ఢిల్లీలోని ఘాజియాబాద్‌కు చెందిన శివమ్(24), దగ్గరి బంధువైన అర్జున్‌తో కలిసి ఆటోలో తమ సోదరుడి ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో భగవాన్ సింగ్(60) అనే మరో వ్యక్తి ఆటో ఎక్కాడు. ఆటోలో ప్రయాణిస్తున్న శివమ్, కోల్‌కతాలో ఉన్న తన ప్రియురాలికి ఫోన్ చేశాడు. ఆమెతో మాట్లాడుతూ.. ఇద్దరు గొడవ పడ్డారు. మనస్థాపం చెందిన శివమ్ వెంటనే తన బ్యాగులో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసి ఒంటిపై పోసుకొని లైటర్‌తో నిప్పంటించుకున్నాడు. దీంతో ఆటోలో ఉన్న మరో ఇద్దరికి కూడా ఆ మంటలు తాకాయి. అప్రమత్తమైన ఆటో డ్రైవర్ ఆటో నిలిపి బయటకు దూకాడు. మంటలు ఆర్పి స్థానికుల సహాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగ శివమ్ శరీరం 70 శాతం మేర కాలిపోయిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. మిగతా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. శివమ్‌పై ఆత్మహత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి
గర్ల్‌ఫ్రెండ్‌ను బయటికి తీసుకెళ్లినప్పుడు, పరువు పోకుండా ఖర్చులన్నీ తామే పెట్టుకోవాలని భావిస్తూ ఉంటారు చాలామంది అబ్బాయిలు. ఈ కోవలోనే ఆలోచించాడు ఓ గూగుల్ ఉద్యోగి. కానీ తన జేబులో డబ్బులు లేకపోవడంతో, ఏం చేయాలో తెలియక దొంగతనానికి పాల్పడ్డాడు. గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం దొంగగా మారిని ఈ గూగుల్ ఉద్యోగి చిట్టచివరికి కటకటాల పాలయ్యాడు. గర్విత్ సాహ్ని అనే 24 ఏళ్ల ఇంజనీర్. అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్ దిగ్గజం గూగుల్‌లో పనిచేస్తున్నాడు. ఇతను హర్యానా అంబాలా జిల్లాకు చెందిన వాడు. సెప్టెంబర్ 11న ఐబీఎం మల్టినేషనల్ టెక్నాలజీ కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆ అనంతరం తాజ్ ప్యాలెస్‌లో మీడియాతో సమావేశమైంది. ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా దివ్యాని జైన్ అనే ఉద్యోగిని హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి రూ.10వేల దొంగలించబడ్డాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, హోటల్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను చెక్ చేశారు. ఆ కెమెరా ఫుటేజీల్లో, నిందితుడు క్యాబ్‌లో హోటల్ రూమ్‌కు వచ్చినట్టు తెలిసింది. దాని నెంబర్ ద్వారా క్యాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను, మొబైల్ నెంబర్‌ను గుర్తించారు. అయితే నిందితుడు అప్పటికే తన మొబైల్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. కానీ పోలీసులు అతని కొత్త మొబైల్ నెంబర్‌ను కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత అతని ఇంట్లోనే గర్విత్ సాహ్నిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ సందర్భంగా ఆర్థికంగా తాను చాలా నష్టాల్లో ఉన్నానని, గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం మనీ కూడా లేవని సాహ్ని చెప్పాడు. అతని నుంచి రూ.3000ను పోలీసులు రికవరీ చేసుకున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష
-
వైరల్ ఫోటోలు : గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేసినా ఆర్మీ ఆఫీసర్
చెన్నై : ప్రేమించడం అంటే అమ్మలా అక్కున చేర్చుకోవడం.. నాన్నలా బాధ్యతగా చూసుకోవడం.. సోదరునిలా తోడుగా నిలవడం.. మిత్రునిగా సుఖసంతోషాలు పంచుకోవడం.. కానీ నేడు చాలా మంది ప్రేమ అనే పేరుకు కనీసం అర్థం కూడా తెలియని వయసులో.. ప్రేమ పేరు చెప్పి వెర్రిమొర్రి వేషాలు వేస్తూ.. బరువు బాధ్యతలను మర్చిపోయి తిరుగుతున్నారు. ప్రేమ పేరుతో అడ్డు అదుపూ లేకుండా తిరగడం.. బాధ్యతలు మీద పడే సమయానికి నమ్ముకున్న వారిని నట్టేటముంచడం.. కొందరు మరో అడుగు ముందుకు వేసి ప్రేమించిన వ్యక్తి తనకు కాకుండా మరేవరికి దక్కకూడదనే ఆవేశంలో పైశాచికంగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా తీయడానికి వెనకడాకపోవడం.. ఇది నేటి కాలం ప్రేమ, ప్రేమికుల పరిస్థితి. అయితే అందరూ ఇలానే ఉంటారా అంటే ఉండరు. ప్రేమించిన వ్యక్తిని జీవితాంతం సంతోషంగా ఉంచాలి అనుకునే వారు ముందు అందుకు తగిన విధంగా తమ జీవితాన్ని మార్చుకుంటారు.. మలచుకుంటారు. ఈ కోవకు చెందిన వ్యక్తే చంద్రేష్ సింగ్. ప్రేమించిన స్నేహితురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికంటే ముందు జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. అందుకుగాను దాదాపు మూడేళ్లపాటు శ్రమించి కోరుకున్న చెలిని మాత్రమే కాక మనసుకు నచ్చిన ఉద్యగాన్ని కూడా సాధించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. వివారాలు.. ఠాకూర్ చంద్రేష్ సింగ్(25) డిగ్రీ చదవడం కోసం 2012లో బెంగళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్‌లో చేరాడు. అక్కడ అతనికి ధారా పరిచయమయ్యింది. ఈ క్రమంలో చంద్రేష్, ధారాను ప్రేమించాడు. తన మనసులోని మాటను ధారాకు చెప్పడానికి కంటే ముందు మరో ముఖ్యమైన బాధ్యత అతనికి గుర్తుకు వచ్చింది. ‘ప్రేమించడం తేలికే. కానీ ఆ ప్రేమను జీవితాంతం నిలబెట్టుకోవాలన్నా.. ధారా తల్లిదండ్రులు నా ప్రేమను అంగీకరించాలన్నా ముందు నేను జీవితంలో స్థిరపడాలి. నన్ను నేను నిరూపించుకోవాలి. అందుకోసం నాకిష్టమైన ఆర్మీలో చేరతాను. ఉద్యోగం సాధించిన తరువాతనే ధారాకు నా మనసులోని మాటను చెప్తాను’ అని నిశ్చయించుకున్నాడు. కానీ చంద్రేష్ ఆర్మీలో చేరడానికి ముందే ధారా గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పి వారి అనుమతి పొందాడు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో చేరాడు. దాదాపు మూడున్నరేళ్ల తర్వాత శిక్షణ చివరి రోజున తన తల్లిదండ్రులతో పాటు ధారాను, ఆమె తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాడు. శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్నందుకు గుర్తుగా చంద్రేష్ తల్లిదండ్రులు అతనికి స్టార్స్ అలంకిరంచారు. అనంతరం వారందరి సమక్షంలో చంద్రేష్, ధారాకు తన ప్రేమను తెలియజేసి ఆమెను వివాహం చేసుకుంటానంటూ కోరాడు. అందుకు ధారా కూడా సంతోషంగా ఒప్పుకుంది. అటూ ఇరుకుటుంబాల పెద్దలు కూడా వీరి ప్రేమను అంగీకరించడమే కాకా త్వరలోనే వివాహం చేస్తామని తెలిపారు. ఒకే రోజు ఇష్టమైన కొలువును.. మనసుకు నచ్చిన అమ్మాయిని పోందిని చంద్రేష్, ధారాల ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే ఈ ఫోటోలను కొన్ని వేల మంది వీక్షించడమే కాక చంద్రేష్ - ధారాలను అభినందనలతో ముంచేత్తుతూ మీ ప్రేమ ఎందరికో ఆదర్శం అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram Beautiful pictures from OTA Chennai ⚔️🇮🇳❤️ #indianarmy A post shared by SSBCrack™ (@ssbcrackofficial) on Sep 11, 2018 at 6:42am PDT -
అటక దిగిన నిజం
కొత్త నీరు వచ్చి పాత నీరును తరిమి కొడుతుంది. కొత్త ఎస్.ఐ. వచ్చి పాత కేసుల భరతం పడతాడు. ఇది ఆనవాయితీ! వరంగల్‌లోని పరకాల టౌన్.పోలీస్ స్టేషన్లో కొత్తగా చార్జ్ తీసుకున్న ఎస్.ఐ. మల్లేశ్‌కు వెంటనే హ్యాండిల్ చేయాల్సిన కేసులు కనిపించలేదు.‘పాత కేసుల ఫైల్స్ పట్రా’ అన్నాడు ఆ ఉదయం టీ చప్పరిస్తూ.హెడ్‌కు తెలుసు అలా జరుగుతుందని. అతడు తన సర్వీస్‌లో చాలామంది ఎస్.ఐ.లను చూశాడు. పరిచయాల తరువాత పాత ఫైల్స్ తీసుకువచ్చాడు హెడ్.టీ తాగుతూ పెండింగ్ ఫైల్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఎస్.ఐ. ఓ రాబరీ కేసు అతని దృష్టిని ఆకర్షించింది.‘ఇది అన్నల కేసు సార్. మూసేసి రెండేళ్లవుతోంది’ అన్నాడు హెడ్డు.కాని కేసు ఇంట్రస్టింగ్‌గా ఉంది. డీటెయిల్స్ అన్నీ చదివాడు.‘అసలేం జరిగింది’ అడిగాడు హెడ్‌ని.‘రెండున్నరేళ్ల క్రితం అన్నలమంటూ చెప్పుకున్న కొందరు వ్యక్తులు చేసిన దోపిడీ సార్’ అన్నాడు హెడ్డు.‘అంటే.. నిజంగా అన్నలు కాదా?’ ‘ఏమో సార్..! ఓసారి అన్నలంటారు. మరోసారి కాదంటారు. ఎవిడెన్స్ సరిగా లేకపోవడంతో కేసు అటకెక్కింది.’ ఎస్.ఐ. తల పంకించాడు.‘ఓసారి బాధితుడిని పిలిచి మాట్లాడదాం’ అన్నాడు ఎస్.ఐ. అతని వయసు యాభై ఉంటాయి. డబ్బు బాగా ఉన్నా బయటికి తెలియనివ్వని మనుషులు కొందరుంటారు. అతను కూడా అలాగే ఉన్నాడు. కూచుని ఎస్.ఐ.వైపు చూస్తున్నాడు.‘అంత డబ్బు పోగొట్టుకున్నారు. కేసు గురించి మీరు ఎందుకు ఫాలో అప్ చేయలేదు. కేసు మూసేసినా ఎందుకు పట్టించుకోలేదు’ అడిగాడు ఎస్.ఐ.‘పోయింది డబ్బే కదా సార్. ప్రాణాలు పోయి ఉంటే వచ్చి ఉండేవా? అసలే అన్నలతో వ్యవహారం. అందుకే వదిలేశాను. మీరూ వదిలేస్తే మంచిది’ అన్నాడతను.‘నాకెందుకో ఇది దొంగల పనే అనిపిస్తోంది’ అన్నాడు ఎస్.ఐ. ‘లేదు సార్. కచ్చితంగా చెప్పగలను. ఇది ముమ్మాటికీ అన్నల పనే’ అంటూ ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టాడతను.‘నా పేరు పట్టాభిరాం. మాది ధాన్యం బిజినెస్. చుట్టుపక్కల ఊళ్లలో ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు అమ్ముతుంటాను. ఆ రోజూ ఎప్పటిలాగే చీకటిపడుతుండగా డబ్బులున్న బ్యాగ్‌తో ఇంటికి వచ్చాను. అర్ధరాత్రి మా ఇంటి తలుపు చప్పుడైంది. ఎవరై ఉంటారా అనుకుంటూ వెళ్లి తీశాను. ముసుగులు వేసుకున్న నలుగురు వ్యక్తులు నన్ను తోసుకుంటూ ఇంట్లోకి చొరబడ్డారు. తాము అన్నలమని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారు. చితకబాది కుర్చీకి కట్టేశారు. మా ఇంట్లో వాళ్లందరినీ కొట్టి, నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో బంధించారు. డబ్బు, నగలు ఎక్కడున్నాయో నా చేతే చెప్పించి తీసుకున్నారు. వారు కొట్టిన దెబ్బలు మామూలుగా లేవు. నా రెండు చేతులూ విరిగాయి. అడుగు తీసి అడుగేసేందుకు వారం పట్టింది.ముందు నేను పోలీసులకు చెప్పలేదు. నా ఒంటిపై దెబ్బలు చూసిన డాక్టర్ కేసు ఫైల్ చెయ్యందే వైద్యం చేయలేమని తేల్చి చెప్పారు. గత్యంతరం లేక ఫిర్యాదు చేయాల్సి వచ్చింది’ అన్నాడతను. ‘నగలు, డబ్బుతో పాటు ఇంకేమన్నా తీసుకెళ్లారా’? ‘నా మొబైల్ ఫోన్ తీసుకెళ్లారు’ ‘ఇక మీరు వెళ్లొచ్చు’ అనడంతో వెళ్లిపోయాడు పట్టాభి. ‘నేను చెప్పాను కదా సార్. ఇది అన్నల పనే. అందుకే కనీసం వారిని గుర్తించలేకపోయాం. ఒకవేళ గుర్తించగలిగినా వారు తెలంగాణ బోర్డర్ దాటి ఎప్పుడో ఏ ఛత్తీస్ఘడ్లోకో లేదా ఒడిశా అడవుల్లోకో వెళ్లి ఉంటారు. వారిని పట్టుకోవడం దాదాపుగా అసాధ్యం’ అంటూ నిట్టూర్చాడు హెడ్.‘ఈ పనులు అన్నలు చేయలేదు’ అన్నాడు ఎస్.ఐ.‘అన్నలు చేసి ఉంటే తప్పక ఓన్ చేసుకుని ఉండేవారు. కారణం చెప్తూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవారు. సెల్‌ఫోన్ తీసుకెళితే ట్రేస్ అవుతారు కనుక సెల్ తీసుకెళ్లి ఉండేవారు కాదు. చిన్న బెదిరింపుకు వచ్చే డబ్బు కోసం అర్ధరాత్రి దాడి చేసి అంత తీవ్రంగా కొట్టాల్సిన పని కూడా లేదు. పైగా ఆడవాళ్లను కొట్టడం స్ట్రేంజ్. ఇవన్నీ క్లూస్‌గా పరిగణించలేదా?’ అన్నాడు ఎస్.ఐ.హెడ్ మౌనం దాల్చాడు.‘వాళ్లు తీసుకెళ్లిన మొబైల్ ఫోన్ ఐ.ఎమ్.ఇ.ఐ. ద్వారా లొకేట్ చేయడానికి ట్రై చేయలేదా’ అడిగాడు ఎస్.ఐ.‘చేశాం సార్. కానీ దొరకలేదు’ అన్నాడు నిరాశగా.‘ఆ ఫోన్‌ని మళ్లీ అబ్బర్వేషన్లో పెట్టండి’ క్యాప్ తలమీద పెట్టుకొని కుర్చీలోంచి లేస్తూ ఆర్డర్ వేశాడు ఎస్.ఐ. రెండు వారాలు గడిచాయి..ఓ రోజు హెడ్ పరిగెత్తుకుంటూ వచ్చి ఎస్.ఐ.కి ‘ఫోన్ ఆన్ అయింది సార్’ విషయం చెప్పాడు.‘లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది’? ‘పట్టాభి ఇంటి సమీపంలోనే’ సమాధానిమిచ్చాడు హెడ్.‘ట్రేస్ చేసి, ఆ ఫోన్ వాడుతున్నదెవరో పట్టుకురండి’ అన్నాడు.అరగంటలో ఆ సెల్ వాడుతున్న కుర్రాడిని పట్టుకొచ్చారు పోలీసులు.ఎంత ప్రశ్నించినా ఆ కుర్రాడు సెల్ తనదే అని చెబుతున్నాడు.దీంతో తమదైన శైలిలో ప్రశ్నించారు పోలీసులు.‘ఇది మా బావది. అటక మీద దొరికింది. నా ఫోన్ పగిలితే, ఇవాళే చార్జింగ్ పెట్టి నా సిమ్ వేశాను’ అసలు విషయం చెప్పాడు ఆ కుర్రాడు.ఎస్.ఐ. తలెత్తి చూడగానే హెడ్‌కి అర్థమై బయల్దేరాడు.సాయంత్రానికి ఆ కుర్రాడి బావను కూడా పట్టుకొచ్చారు. విచారణలో విషయం మొత్తం బయటికి వచ్చింది. వారు నలుగురు కుర్రాళ్లు. పేర్లు విక్రమ్, కాశీ, సుబ్బు, గణేష్‌లు. రెండున్నర ఏళ్ల క్రితం అంటే ఈ దోపిడీ జరిగిన నాటికి వాళ్లు చదువులు పూర్తిచేసి ఖాళీగా ఉండేవారు. వీధిలో పనీ పాటా లేకుండా పిట్టగోడ మీద కూర్చున్న వీరికి ఓ రోజు పట్టాభి కనిపించాడు. ఎప్పుడూ సాయంకాలం పూట డబ్బు బ్యాగ్‌తో ఇంటికి వెళ్లే పట్టాభిని గమనించడం మొదలెట్టారు.‘మీలో ఎవరికైనా నాతో బ్యాంకాక్ ట్రిప్‌కు రావాలని ఉందా?’ అని అడిగాడు విక్రమ్.మిగిలిన ముగ్గురూ ‘ఉంది’ అని జవాబు చెప్పారు ఉత్సాహంగా!‘అయితే నేను చెప్పినట్టుగా వినాలి. పట్టాభిని దోచుకోవాలి’ అన్నాడు. ముగ్గురికీ భయం వేసింది.‘దొరికిపోతాం’ అన్నాడొకడు.‘దొరకం. ఈ ఏరియాలో అన్నల ప్రభావం ఉంది కాబట్టి, దొంగతనం వారి పేరు మీద పోయేలా ప్లాన్ చేద్దాం’ అన్నాడు.అనుకున్న విధంగా ముసుగులు వేసుకొని పట్టాభి ఇంట్లో చొరబడ్డారు. ఇంటిల్లిపాదినీ కొట్టి, అన్నలమని బెదిరించి డబ్బు, నగలు దోచుకుపోయారు. పోలీసులకు ఫోన్ చేస్తాడేమోనని వస్తూ వస్తూ పట్టాభి వద్ద నుంచి ఫోన్‌ని కూడా తీసుకొచ్చారు. నలుగురు కలిసి డబ్బు, నగలు పంచుకున్నారు. ‘ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. ఊళ్లో కూడా ఉండొద్దు. అందరం ఉద్యోగాల పేరుతో వేరే ప్రాంతాలకు వెళ్లిపోదాం’ అన్నాడు విక్రమ్. అంతా అతను చెప్పింది తు.చా తప్పకుండా పాటించారు. బ్యాంకాక్ ట్రిప్‌కు కూడా వెళ్లొచ్చారు.పట్టాభి ఫోన్ తెచ్చిన కాశీ మొదట దాన్ని పగలగొట్టి ఎక్కడైనా విసిరేయాలని అనుకున్నాడు. వీలు కాకపోవడంతో స్విచ్ఛాఫ్ చేసిన అటక మీదకు విసిరేశాడు. ఆ తర్వాత రోజులు గడిచిపోయాయి. ఫోన్ విషయం మర్చిపోయాడు. బావమరిది కుర్రాడు దానిని బయటకు తీసి ఆన్ చేయడంతో బండారం బయటపడింది.’అది సార్ జరిగింది’ అన్నాడు కాశీ. ‘సో. మాస్టర్ మైండ్ విక్రమ్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు’? అడిగాడు ఎస్.ఐ.‘ఇప్పుడెక్కడున్నాడో తెలియదు సార్! దొంగతనం తరువాత ఇంతవరకూ ఎవరమూ కలుసుకోలేదు’ అన్నాడు కాశీ. హెడ్‌వైపు తిరిగి ‘విక్రమ్ ఎక్కడున్నాడో వెంటనే తెలుసుకోండి’ ఆర్డర్ వేశాడు ఎస్.ఐ. ‘వ్వాట్... విక్రమ్ దొరకలేదా? వాళ్ల ఇంట్లో ఎవర్నైనా పిలిపించండి’ అన్నాడు ఎస్.ఐ. కోపంగా. మాస్టర్ మైండ్ దొరికినట్టే దొరికి, తప్పించుకోవడంతో కోపం నషాళానికెక్కింది .మరికాసేపట్లో విక్రమ్ తండ్రి వచ్చాడు.‘సార్... మావాడు ముందు నుంచీ నా అదుపులో లేడు. ఆవారాగా తిరిగేవాడు. ఎన్నోసార్లు దండించాను. కాని దారిలోకి రాలేదు. సడన్‌గా హైదరాబాద్‌కు వెళ్లి జాబులో చేరాడు. చేరిన రెండు నెలలకే రిజైన్ చేసి లండన్ వెళ్లాడు. విక్రమ్ క్లాస్మేట్ కమ్ గర్ల్‌ఫ్రెండ్ లండన్‌లో ఉంది. అక్కడే ఉండొచ్చు’ చెప్పాడు విక్రమ్ తండ్రి.కాశీతో పాటు మిగతా ఇద్దరు స్నేహితులను పిలిపించారు పోలీసులు. ఆ ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. చోరీ సొత్తును రికవరీ చేసి బాధితుడికి అందించారు. లండన్‌లో ఉన్న విక్రమ్‌ని రప్పించే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. క్లోజ్ చేసిన పాత కేసును ఓపెన్ చేసి, ఛేదించడంతో ఎస్.ఐ మల్లేశ్, అతని టీమ్‌కు డిపార్ట్మెంట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి. – అనిల్ భాషబోయిన -
ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
టీ.నగర్: ప్రియుడు మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరువొత్తియూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నై తిరువొత్తియూరు, గోపినగర్‌కు చెందిన నటరాజన్ లారీ ట్రాన్స్‌పోర్టు నడుపుతున్నారు. ఇతని కుమార్తె అశ్విని (20) లా విద్యార్థిని. ఈమె కొన్నేళ్లుగా వేదారణ్యం శెట్టిపురానికి చెందిన తెన్నవన్‌ను ప్రేమిస్తోంది. గత మే 3వ తేదీ నటరాజన్ కుటుంబీకులు బంధువుల ఇంటి శుభకార్యంలో పాల్గొనేందుకు కేరళకు వెళ్లారు. వారితో అశ్విని వెళ్లకుండా ఇంట్లో ఒంటరిగా గడిపింది. ఆ సమయంలో తెన్నవన్ ఓ రోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తెన్నవన్‌కు గుండెపోటు రావడంతో మృతిచెందాడు. దీనిపై తిరువొత్తియూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రియుడు మృతిచెందడంతో అశ్విని మనస్తాపం చెందింది. ఈ క్రమంలో తిరువొత్తియూరు శివశక్తినగర్‌లోని పెదనాన్న ఇంట్లో మూడు నెలలుగా అశ్విని ఉంటోంది. శుక్రవారం రాత్రి అశ్విని పెదనాన్న, కుటుంబీకులు బయటికి వెళ్లిన సమయంలో అశ్విని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న సాతాన్‌గాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
పెళ్లి చేసుకుంటాననిచెప్పి ...
జయపురం: పెళ్లి చేసుకుంటాననిచెప్పి శారీరక సంబంధం ఏర్పరచుకుని తరువాత పరానైన మోసగాడిని పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటన నవరంగపూర్ జిల్లాలోని తెంతులికుంఠి సమితిలో జరిగింది. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన నవరంగపూర్ మా ఘొరో సంస్థ అధ్యక్షురాలు కాదంబరి త్రిపాఠి కలుగ జేసుకుని బాధితురాలి తరఫున పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నవరంగపూర్ జిల్లా తెంతులికుంఠి సమితిలో 12ఏళ్ల బాలికను అదే సమితిలోని అంవలాభట గ్రామానికి చెందిన ధర్మేంధ్ర పాత్రో(20)పెళ్లి చేసుకుంటానని ప్రలోభపెట్టి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అంతేకాకుండా తన ఇంటిలో ఆమెను ఉంచి భార్యాభర్తలుగా కొంతకాలం గడిపాడు. గ్రామ పెద్దలు కూడా వారి భార్యాభర్తల బంధాన్ని అంగీకరించారు. అందుకు ఉభయ కుటుంబాల వారు కూడా తమ అంగీకారం తెలిపారు. అందుచేత వారు భార్యార్యభర్తలుగా కాలం గడుపుతున్నారు. అయితే ఇటీవల భార్యను వరకట్నం తెమ్మని బాధిస్తూ లేకపోతే చంపుతానని బెదిరిస్తున్నట్లు çబాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనను విడిచి వెళ్లాలని ఆమెను వేధిస్తున్నాడని బాధితురాలి తరఫున మాఘోరొ సంస్థ, బాధితురాలి బంధువులు తెంతులి కుంఠి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుని పట్టుకుని బాధితురాలికి న్యాయం చేయాలని కాదంబరి త్రిపాఠి డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్సై అభిమన్యు దుర్గ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటుŠల్ సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఆమొ ఘొరొ సభ్యురాలు మాయా రాణి పాత్రో తదితరులున్నారు. -
ఇలాంటి ప్రేమికులు కూడా ఉంటారా..!
భోపాల్ : ప్రస్తుత రోజుల్లో ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే యువకులే ఎక్కువగా ఉన్నారు. ప్రేమించలేదంటూ యాసిడ్ దాడులు, ప్రాణాలు తీస్తున్న జనరేషన్ ఇది. కానీ ఇప్పటికీ నిజాయితీగా ప్రేమించేవారు ఉన్నారని నిరూపించాడు ఓ యువకుడు. తన స్వచ్ఛమైన ప్రేమను నిరూపించుకోవడానికి ప్రాణాలే త్యాగం చేశాడు. నిన్ను నీవు చంపుకొని నీ ప్రేమను నిరూపించుకో అని ప్రియురాలి తండ్రి అనడంతో తుపాకితో తన తలను కాల్చుకొని చనిపోయాడు భోపాల్ యువకుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోపాల్‌లోని అరోరా మండలానికి చెందిన అతుల్ లఖండే భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) మండల ఉపాధ్యాక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా గత కొంత కాలంగా అదే మండలానికి చెందిన బ్యాంక్ ఉద్యోగినితో ప్రేమలో ఉన్నాడు. వీరి పెళ్లికి అమ్మాయి తండ్రి నిరాకరించాడు. దీంతో అతుల్‌కి, ఆమె తండ్రికి మధ్య గొడవలు అయ్యాయి. ఒకానొక దశలో అతుల్ బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో అమ్మాయిని తీసుకొని ఎంపీనగర్‌కు షిప్ట్ అయ్యారు. కొద్ది రోజుల తర్వాత అతుల్ మళ్లీ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఉన్న ఆమె తండ్రి నీది ప్రేమ కాదని, అది మోజు అని ఆరోపించారు.‘ నీ ప్రేమ నిజమైతే నిన్ను నీవు కాల్చుకొని నిరూపించుకో. అప్పుడు బతికి ఉంటే నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తా. చనిపోతే వచ్చే జన్మలో నా కూతురిని పెళ్లి చేస్కొ’ అని యువతి తండ్రి అతుల్‌కి సవాల్ చేశాడు. దీంతో మంగళవారం రాత్రి 9.30గంటలకు ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతుల్ అందరూ చూస్తుండగానే తుపాకితో తలను కాల్చుకున్నాడు. అక్కడే ఉన్న అతుల్ బంధువు, అతని ప్రియురాలు కలిసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు డాకర్లు తెలిపారు. కాగా చనిపోవడానికి ఒక రోజు ముందు అతుల్ ఫేస్బుక్లో తన బాధను పంచుకున్నాడు. ‘ నా ప్రేయసి తండ్రి నా ప్రేమను నిరూపించుకునేందుకు ఒక టాస్క్ ఇచ్చాడు. నన్ను నేను కాల్చుకొని నా ప్రేమను నిరూపించుకుంటాను. ఆమె లేని జీవితం నాకు వద్దు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. దయచేసి ఆమెను ఎవరూ నిందించకండి. మళ్లి జన్మంటూ ఉంటే తనను పెళ్లి చేసుకోవాలని ఉంది’ అంటూ ప్రియురాలితో కలిసి దిగిన 40 ఫోటోలను పోస్ట్ చేశాడు. అతుల్ గత 13 సంవత్సరాలుగా ఆ యువతిని ప్రేమిస్తున్నాడని, వారి పెళ్లికి యువతి తండ్రి నిరాకరించాడని అతని స్నేహితులు పేర్కొన్నారు. యువతితో ఫోన్ కూడా మాట్లాడనీయకుండా చేశాడని ఆరోపించారు. కాగా ఇప్పటి వరకూ పోలీసులు ఎవరిపైనా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. -
ప్రియురాలిని రైల్లోంచి తోసేసిన ప్రియుడు
సాక్షి, బెంగళూరు: వివాహం చేసుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో ప్రేమికుడు తన ప్రేయసిని కదులుతున్న రైలు నుంచి తోసేసి చంపిన ఘటన బుధవారం కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన పూనమ్ (22) అనే యువతి జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. అదే ఆసుపత్రిలో వైద్యునిగా పని చేస్తున్న సునీల్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూనమ్‌ను లొంగదీసుకున్న సునీల్ వివాహ ప్రస్తావన తెచ్చే సరికి తప్పించుకోసాగాడు. ఆమె ఒత్తిడి తీవ్రతరం చేయడంతో పూనమ్‌ను అడ్డుతొలగించుకోవాలని తన తమ్ముడు సంజయ్‌తో కలసి కుట్రపన్నాడు. గోవా పర్యటనకు వెళదామంటూ మార్చ్15న పూనమ్‌ను తమ వెంట తీసుకెళ్లారు. మార్గమధ్యలోని బెళగావి జిల్లా అసోలి గ్రామం సమీపంలోని బ్రిడ్జి వద్దకు చేరుకోగానే సునీల్, సంజయ్‌తో కలసి పూనమ్‌ను రైలు నుంచి తోసేశాడు. బుధవారం నీళ్లలో తేలాడుతున్న యువతి మృతదేహం కనిపించడంతో ఖానాపుర పోలీసులు విచారణ జరిపి బుధవారం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. -
పబ్లిగ్గా ఆమెకు ప్రపోజ్ చేశాడు.. కానీ
ప్రేమికుల రోజు సందర్భంగా ఓ మహిళకు ఆమె ప్రేమికుడు పబ్లిక్‌గా ప్రపోజ్ చేశాడు. వేదికపై ఆమె ముందు మోకాలిపై కూర్చొని ప్రేమగా ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చాడు. ఆ బొకేను ఆమె తీసుకోగానే.. ఎంగెజ్మెంట్ రింగ్‌ను బయటకు తీసి ఆమెకు చూపించాడు. ఆమె షాక్ తిన్నది. విస్మయంగా చేతులను నోటికి అడ్డుపెట్టుకొని.. తల వద్దన్నట్టూ ఊపుతూ వేదిక నుంచి దిగిపోయింది. కంటతడి పెడుతూ ఆమె వెళ్లిపోయింది. ఆ ప్రేమికుడి గుండె పగిలిపోయింది. అతడు విభ్రమతో అలాగే మోకాళ్లపై కూర్చుని ఉండిపోయాడు. అతన్ని అక్కడి వారు ఓదార్చేందుకు ప్రయత్నించారు. మెక్సికోకు చెందిన నూవో లియోన్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో అతని ‘నో’... ‘హౌ బ్రూటల్’ (ఎంత దారుణ) అంటూ పేర్కొనడం వినొచ్చు. అయితే, ఈ వీడియోలోని జంట వివరాలు తెలియరాలేదు. -
ప్రేయసి ఫోన్ తియ్యలేదని యువకుడి ఆత్మహత్య
ఇరగవరం : ప్రేయసి ఫోన్లో మాట్లాడలేదని క్షణికావేశంలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం శివారు గొల్లమాలపల్లిలో మంగళవారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రుకు చెందిన వింజేటి తాతారావు చిన్న కుమారుడు నవీన్ (21), గొల్లమాలపల్లికి చెందిన యువతి కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. యువతి తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉంటోంది. యువతి నవీన్‌కు వరుసకు అక్క కూతురు కావడంతో పెద్దలు కూడా వీరికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇటీవల యువతి తల్లి సొంతంగా గ్రామంలో భవన నిర్మాణం చేపట్టడంతో ఆ పనులను నవీన్ దగ్గరుండి చేయిస్తున్నాడు. అయితే సోమవారం రాత్రి నవీన్ యువతికి ఫోన్ చేయగా ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ఉద్రేకంగా గొల్లమాలపల్లిలోని యువతి ఇంటికి వచ్చి ఫోన్ ఎందుకు ఎత్తలేదని నిలదీస్తూ తాను ఉరేసుకుంటానని బెదిరించాడు. భయంతో యువతి బంధువులను పిలుచుకొచ్చేసరికే నవీన్ చున్నీతో ఉరివేసుకుని మరణించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనపోరాటం
-
ప్రేమ బంగారంగానూ..!
సాక్షి ప్రతినిధి, చెన్నై : వృత్తిరీత్యా అతనో దొంగ.. అయితేనేం తనలోనూ ఓ ప్రేమికుడున్నాడని చూపించాడు. ప్రేమికురాలు వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాలను ఫొటో ఫ్రేంలో ‘బంగారం’లా పదిలం చేసుకున్నాడు. అయితే, ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని ప్రేమగాథను విన్న పోలీసులు అవాక్కయ్యారు. చెన్నై సైదాపేట ఉత్తర జోన్స్ రోడ్డులోని ఒక అపార్టుమెంటులో సెల్వ గణేష్, గుణసుందరి ఉంటున్నారు. ఈనెల 21న గుణసుందరి ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఒక అగంతకుడు ఆమె తలపై కొట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయాడు. ఆఫీసు నుంచి వచ్చిన భర్త రక్తపుమడుగులో పడి ఉన్న భార్యను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితుడ్ని పాత నేరస్తుడు జాన్సన్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని గొలుసు గురించి విచారించారు. నిందితుడు పోలీసులను తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ చైనును ఒక పెద్ద ఫొటో ఫ్రేంలో పెట్టి గోడకు తగలించి ఉండడాన్ని చూసి బిత్తరపోయారు. ఇలా తగిలించుకున్నావేమిటని పోలీసులు ప్రశ్నిస్తే తన ప్రేమగాథను చెప్పుకొచ్చాడు. ‘నేను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా ప్రేమించింది. అయితే, మరొకరిని పెళ్లి చేసుకోవడంతో ఆ బాధను భరించలేక మరో ప్రాంతానికి వెళ్లిపోయా. అయినా, ఆమెను మర్చిపోలేకపోతున్నా. ఈ మధ్యే ఒక ఇంట్లో ఆమెను చూసి కోపంతో కొట్టి బంగారు చైనును తెచ్చేశా. అందుకే దానిని అమ్మకుండా ఆమె గుర్తుగా ఫొటో ఫ్రేంలో పెట్టుకున్నా’నని వివరించాడు. దొంగ ప్రేమకథతో విస్తుపోయిన పోలీసులు ఆమె నీ ప్రేయసి కాదని చెప్పడంతో, చీకట్లో పొరపడ్డానని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని శుక్రవారం కటకటాల వెనక్కు నెట్టారు. -
కిమ్ ‘మిస్టిరియస్ ప్రియురాలిని’ చూసి.. షాక్!
ఉత్తర కొరియాలో ఆమె ఒక ‘మిస్టిరియస్ మహిళ’... ఆమె గురించి అనేక పుకార్లు ఉన్నాయి. దేశానికి నియంత పాలకుడిగా ఉన్న కిమ్ జాంగ్ ఉన్‌కు ఆమె ప్రియురాలు అని, విభేదాల కారణంగా ఆమెను గతంలోనే కిమ్ ఉరితీయించాడని వదంతులు కూడా వచ్చాయి. ఉత్తర కొరియాలో అందమైన భామగా, దేశానికి చెందిన ప్రముఖ యువతుల బ్యాండ్ సారథిగా ఆమె పాశ్చాత్య మీడియాలో పాపులర్ అయ్యారు. ఇలా అనేక వదంతులకు కేంద్ర బిందువుగా ఉన్న హ్యోన్ సాంగ్ వోల్ ఆదివారం ఒక్కసారిగా శత్రుదేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దర్శనమిచ్చారు. ద.కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఉ. కొరియా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆమె సియోల్ వచ్చింది. ఆమెను చూడగానే ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టి టకటకా ఫొటోలు తీసుకున్నారు. కానీ ఆమె మీడియాతో మాట్లాడలేదు. ఉ.కొరియా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షల కారణంగా కొరియా దేశాల నడుమ తీవ్ర శత్రుత్వం, ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ద.కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఉ.కొరియా వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఒప్పుకుంది. మిస్టిరియస్ మహిళ హ్యోన్ సాంగ్ వోల్ సియోల్‌లో అడుగుపెట్టగానే నిరసనలు హోరెత్తాయి. ఆమె సియోల్‌కు రాగానే కొందరు నిరసనకారులు కిమ్‌జాంగ్ ఉన్ ఫొటోలను తగులబెట్టి నిరసన తెలిపారు. సోమవారం సియోల్ రైల్వేస్టేషన్ వద్ద ఆమెకు ప్రత్యక్షంగా నిరసన సెగ తగిలింది. ఆమె ఎదురుగానే 150 నుంచి 200 మంది నిరసనకారులు కిమ్ ఫొటోను, ఉత్తర కొరియా జెండాను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ స్పందించలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. అయినా, ఆ తర్వాత నిరసనకారులు వాటిని తగలబెట్టి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. -
న్యాయ పోరాటానికి దిగిన ప్రియురాలు
-
డౌన్‌పేమెంట్ కట్టి ప్రేయసిని కొనుక్కున్నాడు!
పెరంబూరు (చెన్నై): ప్రేమించిన యువతికి వివాహమైనా ఆమె భర్తను ఒప్పించి ప్రేయసిని దక్కించుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన తమిళనాడులో ఆదివారం చోటు చేసుకుంది. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీప ప్రాంతానికి చెందిన దేవి (24) చదువుకునే రోజుల్లో ఓ యువకుడిని ప్రేమించింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు దేవికి మేనమామతో ఇష్టంలేని వివాహం జరిపించారు. అయితే మామతో జీవించలేని దేవి.. ప్రియుడితో రెండుమార్లు వెళ్లింది. తల్లిదండ్రులు దేవిని తిరిగి తీసుకువచ్చి భర్తతో కలిపారు. ఇటీవల మళ్లీ ప్రియుడి వద్దకు వెళ్లిన దేవిని తిరిగి తీసుకువచ్చిన మనప్పారై పోలీసులు.. ఆమెను విచారించారు. భర్తతో కాపురం చేయనని ఆమె తేల్చి చెప్పింది. వివాహం జరిగిన తర్వాత ఆమెను ఎంఈ చదివించినందుకు రూ.లక్ష ఖర్చు అయినట్టు భర్త తెలిపాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా మనప్పారై పోలీసుల నేతృత్వంలో జరిగిన చర్చల ఫలితంగా రూ.లక్షను దేవి భర్తకు విడతలవారీగా ఇవ్వడానికి ప్రియుడు ముందుకొచ్చాడు. తొలి విడతగా రూ.25 వేలు ఇచ్చి ఆదివారం దేవిని తనతో తీసుకెళ్లాడు. -
ప్రియురాలే దాడి సూత్రధారి
విశాఖపట్నం: ఎంవీపీ కాలనీ రోప్‌వే వద్ద పవన్‌కుమార్‌పై దాడి కేసు మిస్టరీ వీడిపోయింది. అతని మాజీ ప్రియురాలే సూత్రధారిగా కొందరు వ్యక్తులతో దాడి చేయించిందని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎంవీపీ పోలీసులు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా వున్నాయి. ఎంవీపీ కాలనీ దరి వాసవానిపాలెంకు చెందిన పల్లవి(24)కి కొద్ది సంవత్సరాల కిందట అశోక్‌కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు కూడా వున్నాడు. వివాహం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల పల్లవి భర్తకు దూరమయింది. అనంతరం 2014లో దుబాయ్ చేరుకుని ఓ ప్లే స్కూల్లో ఉద్యోగంలో చేరింది. సీతమ్మధార దరి ఎంఎంటీసీ కాలనీకి చెందిన పవన్‌కుమార్ (27) 2016లో దుబాయ్ చేరుకుని ఒక సెక్యూరిటీ కంపెనీలో సీసీ ఫుటేజీ ఆపరేటర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమంగా మారింది. అదే సమయంలో పవన్ వద్ద పల్లవి రూ.40వేలు అప్పుగా తీసుకుంది. అనంతరం పెళ్లి చేసుకోవాలని పవన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అందుకు పవన్‌కుమార్ నిరాకరించాడు. బాకీ తీరుస్తానని రమ్మని... ఈ నేపథ్యంలో వీసా కాలపరిమితి ముగియడంతో ఈ నెల 10వ తేదీన పవన్‌కుమార్ విశాఖ వచ్చాడు. విషయం తెలుసుకున్న పల్లవి కూడా దుబాయ్ నుంచి విశాఖ వచ్చింది. విశాఖ వచ్చిన పల్లవికి పవన్‌కుమార్ ఫోన్ చేసి రూ.40వేల బాకీ కోసం అడిగాడు. దీంతో ఈ నెల 14వ తేదీన పల్లవి ఎస్ఎంఎస్ చేసి రమ్మనడంతో నగదు కోసం పవన్‌కుమార్ అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో ఎంవీపీ కాలనీ రోప్‌వే వద్దకు చేరుకుని నిరీక్షిస్తుండగా... ఆ సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం తెలిసిందే. తనను బాకీ కోసం ఒత్తిడి చేస్తున్నాడన్న కారణంతో తన భర్త అశోక్‌కుమార్‌కి పల్లవి సొమ్ము ఇచ్చి పవన్‌కుమార్‌పై కొందరు వ్యక్తులతో దాడి చేయించింది. కేసు దర్యాప్తు చేసిన ఎంవీపీ పోలీసులు నిందితులను బుధవారం పెదవాల్తేర్ శ్మశానవాటిక సమీపంలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచడంతో న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. పల్లవి, ఆమె భర్త అశోక్‌కుమార్‌తో పాటు వి.సతీష్, పల్లా అనిల్, వై.సంతోష్‌కుమార్, భరణికాన రవిలను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు శివ, అజయ్ పరారీలో ఉన్నారని ఎంవీపీ ఎస్ఐ ఈ.ధర్మేంద్ర ‘సాక్షి’కి తెలిపారు. కాగా, వీరంతా ఆటోడ్రైవర్, ప్లంబింగ్, క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నారు. ప్రైవేట్ ఆస్ప్రత్రి నుంచి పవన్‌కుమార్ ఇటీవల డిశ్చార్జి అయ్యాడు. -
ప్రియురాలి మౌన పోరాటం
♦ ప్రేమించుకున్నారు.. పెళ్లాడాలనుకున్నారు. ♦ పెద్దలకు తెలిసింది.. అభ్యంతరం చెప్పలేదు. ♦ కలిసి తిరిగారు.. కలిసి ఉన్నారు. ♦ మోజు తీరిందేమో..ఆమెకు దూరమయ్యాడు.. ♦ మరొకామెకు దగ్గరయ్యాడు. ♦ మోసపోయిన ఆ ప్రియురాలు.. ♦ మౌన పోరాటానికి దిగింది. ఇల్లెందు: ‘‘ఒకటి కాదు.. రెండు కాదు. మాది 12 ఏళ్ల ప్రేమ. ఇన్నేళ్లపాటు కలిసి తిరిగాం. కాబోయే దంపతులమని నమ్మాను. దగ్గరయ్యాను. రెండుసార్లు గర్భవతినయ్యాను. అబార్షన్ చేయించాడు. ఇప్పుడు.. కాదు పొమ్మంటున్నాడు’’ – ఇది ఓ ప్రియురాలి ఆవేదన. ⇔ ఆమె పేరు సిలివేరు నాగమణి. ఇల్లెందు పట్టణంలోని గోవింద్ సెంటర్ నివాసి. అతడి పేరు శేషు. కారు డ్రైవర్. స్థానిక సాయిబాబా టెంపుల్ ఏరియా నివాసి. ⇔ 12 ఏళ్ల క్రితం సాయిబాబా టెంపుల్ సమీపంలో టైలరింగ్ సెంటర్లో ఆమె చేరింది. అదే ప్రాంతానికి చెందిన కార్ డ్రైవర్ శేషుతో పరిచయమేర్పడింది. అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ⇔ రెండు కుటుంబాల్లోని పెద్దలకు విషయం తెలిసింది. అభ్యంతరం చెప్పలేదు. అంగీకారం తెలిపారు. ⇔ అప్పటి నుంచి ఆ ప్రేమికులు ఖుషీ ఖుషీగా తిరిగారు. తనువులు దగ్గరయ్యాయి. ⇔ ఆమె రెండుసార్లు గర్భవతయింది. అతడు బలవంతంగా అబార్షన్ చేయించాడు. ⇔ వారు పెళ్లి చేసుకోలేదు. కానీ, ఆమెను తనను భార్యగా పేర్కొంటూ రేషన్ కార్డులో పేరును కూడా నమోదు చేయించాడు. ⇔ ఆమెపై మోజు తీరిందేమో! ఇటీవల మరో యువతితో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ప్రియురాలిని దూరం పెడుతున్నాడు. ⇔ ఆమె గ్రహించింది. నిలదీసింది. పెళ్లి చేసుకుందామని మరోమారు ఆమెను నమ్మించాడు. ⇔ పాపం.. ఆ అమాయకురాలు మరోసారి గుడ్డిగా నమ్మింది. ఆమె కుటుంబ పెద్దలు అతడి ఇంటికి వెళ్లి కట్నకానుకలు కూడా మాట్లాడుకున్నారు. అతడు మాత్రం ఆమెకు దూరం దూరంగా ఉంటున్నాడు. ఫోన్ చేస్తే.. ‘‘నువ్వెవరో నాకు తెలియదు’’ అన్నాడు. ⇔ తాను మోసపోయినట్టుగా తెలుసుకుంది. దిక్కుతోచలేదు. తన బస్తీ వాసులు కొందరి అండతో ప్రియుడి ఇంటి ముందు శుక్రవారం టెంట్ వేసుకుని, దాని కింద కూర్చుంది. మౌన పోరాటానికి దిగింది. న్యాయం కోసం మౌనంగా, దీనంగా రోదిస్తోంది. ఆ ఇంటిలో శేషు లేడు. ఎక్కడికో వెళ్లిపోయాడు. ⇔ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. దీక్షకు దిగిన ఆమె వద్దకు ఎస్ఐ కొమురెల్లి వెళ్లారు. అందరి నుంచి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. -
ప్రేయసి కోసం ఒకరు.. రేసింగ్ కోసం ఒకరు
సాక్షి, బెంగుళూరు: ప్రేయసి కోసం ఓ యువకుడు సరికొత్త పంధా ఎన్నుకున్నాడు. తాను ప్రేమించిన యువతిని లాంగ్‌రైడ్ తీసుకెళ్లడం కోసం వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇతనికి మరో యువకుడు వ్యక్తి జత అయ్యాడు. ఇంక ఏముంది హైఎండ్ బైకులు కనిపిస్తే చాలు మాటు వేయడం మాయం చేయడం అలవాటు చేసుకున్నారు. బైక్ చోరీల్లో పోలీసులకు చుక్కలు చూపించిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు. శరబండేపాల్యకు చెందిన వసీం అక్రం తన ప్రేయసిని తిప్పడానికి ఖరీదైన, హైఎండ్ బైకులను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవాడు. గత ఏడాది నుంచి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనకోసమే బైకులు చోరీ చేస్తున్నాడని అతని ప్రియురాలకి మాత్రం తెలియదు. తరచూ వేరు వేరు బైక్‌ల మీద వచ్చే అతను, బైక్ గురించి అడిగితే స్నేహితులది అని చెప్పేవాడు. తరచూ బైకులు పోతున్నాయనే సమాచారం తెలసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వసీం దగ్గర నుంచి 16 హైఎండ్ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బెంగుళూరు, రాజిగుడ్డకు చెందిన రంజిత్ ఇలాంగవన్ అలియాస్ వందేళ్ అతని స్నేహితుడు మరిముత్తు మునిస్వామి అలియాస్ బైక్రాజాలు 2015లో డిగ్రీ మానేశారు. గత రెండేళ్ల నుంచి నిందితులు 25 బైకులను చోరీ చేశారు. ఇటీవల జయనగర్‌లోని నాలుగవ బ్లాక్ వద్ద అనుమానాస్సదంగా తిరుగుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు ఖరీదైన బైకులు చోరీచేసిన అనంతరం రేసింగుల్లో పాల్గొని, తరువాత వాటిని ఎక్కడో చోట వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమించలేదని నిప్పంటించాడు..
-
ప్రేమించలేదని నిప్పంటించాడు..
విశాఖపట్టణం: ప్రేమ త్యాగం కోరుతుంది అంటారు. తాను ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా సుఖంగా ఉండాలనే ప్రేమికులు కోరుకుంటారు. కానీ విశాఖ జిల్లాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించలేదంటూ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. భీమిలి మండలం టీనగరం పాలెంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. నిందితుడు సంతోష్ గత ఆరునెలలుగా రూపను ప్రేమిస్తున్నానంటూ వేధించసాగాడు. అయితే రూప సంతోష్ ప్రేమను నిరాకరించింది. దీంతో రగిలిపోయిన సంతోష్ శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న రూపపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా కాలిన గాయాలతో రూప చనిపోగా అడ్డుకోబోయిన రూప సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని బంధువులు వెంటనే కేజీహెచ్ కు తరలించారు. కాగా, సంతోష్ విజయనగరం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు ఫోన్ సమాచారం అందింది. -
ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని..
► ప్రేమించి పెళ్లి వద్దన్నందుకు యువతి దారుణహత్య ► అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ► యువకుడి గుడిసెకు నిప్పు పెట్టిన గ్రామస్తులు తిరువణ్ణామలై(చెన్నై): ప్రేమించిన ప్రియురాలు పెళ్లికి అంగీకరించలేదని ఆగ్రహించిన ప్రియుడు ఆమెను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయి ఆత్మహత్యకు యత్నించాడు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా మలయంబట్టు కాలనీకి చెందిన మాజీ సైనికుడు మది అయగన్ కుమార్తె మోనిక(20) కాట్పాడిలోని అగ్జిలియం కళాశాల్లో బీఏ తృతీయ సంవత్సరం చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరణి సమీపం ఈచతాంగాంల్ చెరువులో రక్తపు మడుగులో యువతి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆరణి తాలుకా పోలీసులకు సమాచారం తెలిపారు. డీఎస్పీ జరీనాబేగం, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద యువతి కళాశాల గుర్తింపు కార్డు లభించింది. కళాశాల నిర్వాహకులను ఫోన్లో సంప్రదించగా మోనిక మంగళవారం కళాశాలకు రాలేదని తెలిసింది. దీంతో మోనిక స్నేహితుల వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఇదిలాఉండగా రాత్రి 10 గంటల సమయంలో ఆరణి తాలుకా పూంగాంబాడి గ్రామానికి చెందిన గోకుల్‌నాథ్ ఈ హత్య చేసినట్లు పోలూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. విచారణలో ఇతడు బెంగళూరులో కూలీ పనులు చేస్తున్నట్లు పాఠశాల సమయం నుంచే మోనికను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. తాము ఫోన్లో తరచూ మాట్లాడుకుంటున్నామని వివాహం చేసుకునేందుకు మోనిక తల్లి దండ్రుల వద్ద కోరగా వారు అంగీకరించలేదని తెలిపాడు. అనంతరం మోనిక గోకుల్‌నాథ్‌ను దూరం పెట్టడంతో మంగళవారం స్నేహితురాలి ద్వారా ఫోన్లో మాట్లాడి ఆమెను చెరువు వద్దకు రప్పించి పెళ్లికి అంగీకరించాలని కోరాడు. మోనిక పెళ్లికి తిరస్కరించడంతో ఆగ్రహించిన గోకుల్‌నాథ్ కత్తితో దారుణంగా హత్య చేసి పరారైనట్లు తెలిపాడు. పోలీస్‌స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం : అనంతరం పోలూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన గోకుల్‌నాథ్‌ను అరణి పోలీసులకు అప్పగించే సమయంలో తన వద్ద ఉన్న కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకుని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ఉదయం 6 గంటలకు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. యువకుడి గుడిసెకు నిప్పు: మోనికను హత్యచేసిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహించి గోకుల్‌నాథ్ ఇంటి ఆవరణలోని గుడిసెకు నిప్పు పెట్టారు. అనంతరం ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి బయట పడవేశారు. -
కొట్టేసిన ఉంగరంతో ప్రియురాలికి ప్రపోజ్ చేసి...
లండన్: ఓ వృద్ధురాలి నుంచి దోచుకున్న ఉంగరంతో ప్రియురాలికి ప్రపోజ్ చేశాడో వ్యక్తి. అయితే ఆ విషయం ప్రియురాలికి తెలియడంతో అతడిని పోలీసులకు పట్టించింది. ఈ ఘటన లండన్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో జరిగింది. స్టీవ్ రీడ్ అనే వ్యక్తి మరొకరితో కలిసి ఓ వృద్ధురాలి ఇంట్లో దొంగతనంగా జొరబడ్డారు. వృద్ధురాలిని బెదిరించి ఆమె నగలు, నగదును దోచుకున్నారు. అందులో ఒక ఉంగరం కూడా ఉంది. ఆ ఉంగరాన్ని తీసుకెళ్లి తన ప్రియురాలికి ఇచ్చి పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే, అంతకుమునుపే పోలీసులు దోపిడీ విషయమై ప్రసారమాధ్యమాల్లో పౌరులకు విజ్ఞప్తి చేశారు. వృద్ధురాలికి చెందిన నగల జాడ కనిపిస్తే తమకు సమాచారం అందివ్వాలని కోరారు. ఇది తెలుసుకున్న సదరు ప్రియురాలు ఉంగరం విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు స్టీవ్రీడ్తో పాటు అతడి స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన న్యాయస్థానం రీడ్‌కు నాలుగేళ్ల 9 నెలల జైలుశిక్ష విధించింది. అయితే, రీడ్ పెళ్లి ప్రతిపాదనను సదరు ప్రియురాలు అంగీకరించింది లేనిదీ పోలీసులు వెల్లడించలేదు. -
వెంకీ విత్ సల్మాన్ గాళ్‌ఫ్రెండ్
టాలీవుడ్ సీనియర్ హీరో , విక్టరీ వెంకటేష్ బాలీవుడ్ ప్రవేశంపై మరోసారి ఊహాగానాలు చెలరేగాయి. ఎప్పుడు గాసిప్స్‌కు దూరంగావుండే ఈ నటుడు, సల్మాన్ గాళ్‌ఫ్రెండ్ లులియా వాంటర్‌తో కలిసి ఒకే కారులో కనిపించడం టాక్ ఆప్ టౌన్ అయ్యింది. దీంతో ఆయన బాలీవుడ్ ఎంట్రీపై పుకార్లకు తెరలేచింది. ముంబైలో డిన్నర్‌కు వెళ్లిన సందర్భంగా వీరిద్దరూ ఇలా కెమెరాకు చిక్కారు. దీంతో బాలీవుడ్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన వెంకటేష్ పునః ప్రవేశం గురించి చర్చించడానికే వెళ్లారా? అనే పుకార్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయిన ఈ ఫోటోలతో వెంకటేష్ బాలీవుడ్లో తిరిగి నటించనున్నారనే వార్తలకు ఈ మరింత బలం వచ్చింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇటీవల ఓ పార్టీలో సల్మాన్, లులియాతో వెంకీ సమావేశమయ్యారని, దీనికి పార్టీలో పలువురు బాలీవుడ్ స్టార్లు కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే సమయం, సందర్భం ఏంటన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. అంతేకాదు మరో పుకారు కూడా షికారు చేస్తోంది. టాలీవుడ్ లోకి లూలియా వంతూర్ ప్రవేశం చేయనుందా అనేది ప్రజెంట్ టాక్ ఆఫ్‌ది టౌన్‌గా వుంది. అయితే ఇరువర్గాలనుంచి విశ్వసనీయ సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సల్మాన్ ఖాన్, వెంకటేష్ మధ్య సాన్నిహిత్యం తెలిసిన విషయమే. -
పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా శ్రీశైలం ప్రాజెక్టు: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి శుక్రవారం ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. సున్నిపెంట గ్రామంలోని చేపల మార్కెట్ ప్రాంతంలో నివసిస్తున్న తాను, ఊదర నిర్మల జయప్రకాశ్ ఐదేళ్ల నుంచి (23) ప్రేమించుకుంటున్నామని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆమె విలేకరులతో వాపోయింది. అతడితో తన పెళ్లి జరిపించాలని కోరారు. ఈ విషయమై టూటౌన్ ఎస్ఐ హెచ్ ఓబులేష్ మాట్లాడుతూ ప్రేమ వ్యవహారంపై తనకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందలేదని, విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపారు. -
గర్ల్‌ఫ్రెండ్ కోసం హైజాక్ మజాక్
► బెదిరింపు ఈ–మెయిల్ పంపింది హైదరాబాదీనే ► మధురానగర్ నెట్ కేఫ్ నుంచే ముంబై పోలీసు కమిషనర్‌కు పంపిన వైనం ► నిందితుడిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ► సెల్‌ఫోన్, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం సాక్షి, హైదరాబాద్: చేతిలో చిల్లిగవ్వ లేదు.. గర్ల్‌ఫ్రెండ్ ఏమో టూర్‌కు వెళదామంటూ పోరు పెడుతోంది.. ఏం చేయాలో తెలియని హైదరాబాదీ యువకుడు ఆమెకు తొలుత నకిలీ విమాన టికెట్లు పంపాడు.. అయితే ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వెళితే తన పరువుపోతుందని భావించి విమానం హైజాక్ అంటూ ఈ–మెయిల్ పంపి అధికారులను పరుగులు పెట్టించాడు. హైదరాబాద్‌తో పాటు చెన్నై, ముంబై విమానాశ్రయ భద్రతాధికారులను ఐదురోజులుగా పరుగులు పెట్టించిన హైజాక్ బెదిరింపు ఈ–మెయిల్ పంపింది హైదరాబాద్‌కు చెందిన వంశీకృష్ణగా తేలింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన గర్ల్‌ఫ్రెండ్ వేసిన టూర్ ప్లాన్‌ను తప్పించుకోవడానికి మధురానగర్‌లోని నెట్‌కేఫ్ నుంచి ముంబై పోలీసు కమిషనర్‌కు దీన్ని పంపించాడని సిటీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. ముంబై పోలీసులు ఇచ్చిన సమాచారం, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వంశీకృష్ణను అరెస్టు చేశారని తెలిపారు. వివాహితుడైనా పక్కదారులు.. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరుకు చెందిన మోటపర్తి వంశీకృష్ణ అలియాస్ వంశీ చౌదరి బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాడు. నగరానికి వలస వచ్చిన వంశీ కొంతకాలం బోరబండలో నివసించాడు. ప్రస్తుతం మియాపూర్‌లో ఉంటూ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. 2010లో బెదిరింపులు, 2013లో ఆన్లైన్ మోసం కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లాడు. వంశీకృష్ణకు 2007లోనే వివాహమైనప్పటికీ ఫేస్బుక్లో యువతులతో స్నేహం చేయడం, నిత్యం వారితో చాటింగ్ చేయడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇటీవల చెన్నై యువతి వంశీతో టూర్‌కు ప్లాన్ చేసింది. ఇద్దరం ముంబై, గోవా వెళ్లి రెండేసి రోజుల చొప్పున గడిపి వద్దామంటూ ప్రతిపాదించింది. తాను చెన్నై నుంచి విమానంలో ముంబై వస్తానని, వంశీని నేరుగా హైదరాబాద్ నుంచి రావాలని సూచిస్తూ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్పింది. ఆర్థికంగా ‘విమానాన్ని భరించే’ స్తోమత లేని వంశీ ఆ విషయం చెప్తే తన గర్ల్‌ఫ్రెండ్ దూరం అవుతుందని భావించాడు. మధురానగర్ నెట్ సెంటర్ నుంచి.. తాను తరచుగా వెళ్లే మధురానగర్‌లోని ‘ఈ నెట్ జోన్’నెట్ సెంటర్‌కు ఈ నెల 15న వంశీ వెళ్లాడు. అక్కడే (ununn0801@gmail.com) పేరుతో కొత్త ఈ–మెయిల్ ఐడీ సృష్టించాడు. నెట్ నుంచే ముంబై పోలీసు కమిషనర్ ఈ–మెయిల్ ఐడీ సేకరించాడు. వీటి ఆధారంగా కమిషనర్‌కు ఆ రోజు సాయంత్రం 4.47 గంటలకు బెదిరింపు ఈ–మెయిల్ పంపాడు. ఈ–మెయిల్లో వంశీ తనను హైదరాబాద్‌కు చెందిన యువతిగా పరిచయం చేసుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తాను ఓ రెస్టారెంట్లో భోజనం చేస్తున్నానని, ఆ సమయంలో దాదాపు 23 మంది యువకులు విమానాల హైజాక్ విషయం మాట్లాడుకోవడం తన చెవిన పడిందని పేర్కొన్నాడు. వీరంతా మూడు గ్రూపులుగా ఏర్పడి హైదరాబాద్, చెన్నై, ముంబై ఎయిర్‌పోర్ట్స్‌లో విమానాలు హైజాక్ చేయడానికి కుట్ర పన్నారని తెలిపాడు. దీన్ని అందుకున్న ముంబై పోలీసు కమిషనర్ తక్షణం సంబంధిత అధికారుల్ని అప్రమత్తం చేయడంతో ఈ మూడు విమానాశ్రయాల్లోనూ 15వ తేదీ సాయంత్రం నుంచి అప్రమత్తత కొనసాగింది. తనిఖీలు ముమ్మరం కావడంతో అనేక విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ–మెయిల్ హైదరాబాద్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ముంబై పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జునరెడ్డి, ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఎల్.భాస్కర్‌రెడ్డి, వి.కిషోర్ దర్యాప్తు చేపట్టారు. ఆ ఐపీ అడ్రస్ ‘ఈ నెట్ జోన్’కు చెందినదిగా గుర్తించారు. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు వంశీకృష్ణను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్, ఈ–మెయిల్ పంపిన కంప్యూటర్ హార్డ్‌డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. -
కోహ్లీ దగ్గర కారును కొని గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చి..
ముంబయి: గర్ల్‌ఫ్రెండ్‌కు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆడి కారు బహుమతిగా ఇచ్చిన ఓ వ్యక్తిని థానే పోలీసులు భారీ కుంభకోణం కేసులో అరెస్టు చేశారు. అతడు గిఫ్ట్‌గా ఇచ్చిన కారును స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం ముంబయిలో మకాం ఉంటున్న అతడిని కోట్ల విలువ చేసే కుంభకోణానికి పాల్పడినందుకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సాగర్ థక్కర్ అనే వ్యక్తి అలియాస్ షాగీ కలకలం సృష్టించిన కాల్ సెంటర్ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. ఇతడు పాల్పడిన కుంభకోణంలో బాధ్యులైన వారు ఎక్కువగా దక్షిణాసియా వాసులే ఉన్నారు. అది కూడా అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా వారినే ఎక్కువగా మోసం చేశాడు. అమెరికా అధికారుల సమాచారం మేరకు 300మిలియన్ల డాలర్లను కొల్లగొట్టాడు. 2013నుంచి అతడు ఈ కుంభకోణానికి తెరతీయగా థానేలోని మిరా రోడ్డులో గత ఏడాది(2016) అక్టోబర్ 4న పోలీసులు నిర్వహించిన దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు రెండు రోజుల్లోనే దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇటీవలె దుబాయ్ అతడిని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా అతడిని పోలీసులు ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. థక్కర్ ముంబయిలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇతడికి పెద్ద మొత్తంలో ప్రైవేటు సైన్యం కూడా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం ఇటీవల ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఆడి ఆర్8కారు రూ.2.5కోట్లకు కొనుగోలు చేసి తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చాడు. అయితే, కారు అమ్మిన కోహ్లీకి అతడు మోసగాడని తెలియదని, ఆయన అమాయకుడని థానే పోలీసు చీఫ్ తెలిపారు. -
ప్రేమలేఖకు 61 మార్కులు..
మాజీ గర్ల్‌ఫ్రెండ్ క్షమాపణలు చెబుతూ తన ప్రియుడికి ఓ లేఖ రాసింది. మామూలుగా అయితే దాన్ని చదివిన ప్రియుడి మనసు కరిగి ప్రియురాలి చెంతకు చేరాలి లేదా తనకు ఇష్టం లేదంటూ తిరుగు జవాబు రాయాలి. కానీ అమెరికాలోని స్టెట్సన్ యూనివర్సిటీ విద్యార్థి నిక్ ఒకరు ప్రియురాలి లేఖలో తప్పులన్నింటినీ ఎంచి, వాటిని ఎర్ర ఇంకుతో పక్కన రాసి, ఆ లేఖను ట్వీటర్లో పెట్టాడు. ట్వీటర్లో ప్రస్తుతం ఆ లేఖ వైరల్‌గా మారిపోయింది. తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వివరిస్తూ సదరు ప్రియురాలు ఓ సుదీర్ఘ లేఖ రాసింది. అందులో చాలా తప్పులు రాయడంతో ఆమె స్నేహితుడు నిక్.. వాటన్నింటినీ ఎర్ర ఇంకుతో మార్క్ చేశాడు. ‘‘మీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ క్షమాపణ లేఖ రాస్తే దానికి గ్రేడింగ్ ఇచ్చి, వెనక్కి తిప్పి పంపాలి’’ అని అంటూ నిక్ ఆ లేఖను ఫొటో తీసి ట్వీట్ చేశాడు. పరిచయం చాలా సుదీర్ఘంగా ఉందని, అందులో చాలా వాక్యాలు రిపీట్ అయ్యాయని నిక్ రాశాడు. నేను నిన్ను ఎప్పుడూ మోసం చేయలేదని ఆమె రాయగా.. దాన్ని రుజువు చేయడానికి నీ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని నిక్ పేర్కొన్నాడు. ఆమె రాసిన లేఖకు వందకు 61 మార్కులు ఇచ్చాడు. అతడి ట్వీట్‌ను లక్ష మందికి పైగా రీట్వీట్ చేయగా, 3 లక్షల లైకులు వచ్చాయి. అయితే మాజీ గర్ల్‌ఫ్రెండ్ రాసిన లేఖను ఇలా బహిర్గతం చేయడం సరికాదని ఎక్కువ మంది తిట్టిపోశారు. -
ప్రియురాలిపై వేట కొడవలితో దాడి
తెగిపోయిన ఎడమ అరచెయ్యి గుత్తి : అనంతపురం జిల్లా గుత్తిలో ప్రియురాలిపై ప్రియుడు వేటకొడవలితో విచక్షణారహితంగా దాడిచేశాడు. ఆమె ఎడమ అరచెయ్యి తెగిపడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లు రోడ్డులోని బ్రిడ్జి సమీపంలో నివాసముంటున్న శివకు వైఎస్సార్‌జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన మహిళతో మూడేళ్ల క్రితం వివాహమైంది. మనస్పర్ధలు రావడంతో ఏడాది కిందట విడిపోయారు. అనంతరం మంచాలు అల్లేందుకు బత్తలపల్లికి వెళ్లిన శివకు అక్కడ లక్ష్మి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోఒకరికొకరు దగ్గరయ్యారు. తొమ్మిది నెలల కిందట ఆమెను శివ గుత్తికి తీసుకొచ్చి సహజీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆమె ఇతరులతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటం, కొందరితో సన్నిహితంగా మెలుగుతుండటంతో సహించలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా ఆమెలో ఎటువంటి మార్పూ కనిపించలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక అపరిచిత వ్యక్తితో ఇంటి వద్ద మాట్లాడుతున్న సమయంలో శివ గమనించాడు. కోపంతో ఇంటిలోని వేట కొడవలి తీసుకుని ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. లక్ష్మి ఎడమ అరచెయ్యి తెగిపడింది. తలకు బలమైన గాయమై మెదడు బయటకు వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం కర్నూల్‌కు రెఫర్ చేశారు. ప్రియురాలిపై దాడి చేసిన అనంతరం ప్రియుడు శివ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధుసూదన్ గౌడ్ చెప్పారు. -
ప్రేమించిన అమ్మాయి మాట్లడలేదని..
-
దారి’తప్పి శవమయ్యాడు!
► ప్రియురాలి చేతిలో ఆటో డ్రైవర్ హతం? ►ఇద్దరి మధ్య చాలాకాలంగా వివాహేతర సంబంధం ►తన భర్తను ఆమే చంపిందంటూ భార్య ఫిర్యాదు ఒంగోలు క్రైం: కట్టుకున్న భార్య ఉన్నప్పటికీ ప్రియురాలి మోజులో పడిన ఆటోడ్రైవర్ ఆమె ఇంటివద్దే శవమై కనిపించాడు. ఒంగోలు నగరంలోని విజయనగర్ కాలనీలో గురువారం ఈ ఉదంతం వెలుగుచూసింది. స్థానిక కమ్మపాలెం మహంకాళి గుడి వద్ద నివాసం ఉంటున్న ఇందుర్తి వెంకటేశ్వర్లు(48) విజయనగర్ కాలనీలో హత్యకు గురయ్యాడు. విజయనగర్ కాలనీలోని ఏడో అడ్డరోడ్డులో నివాసం ఉంటున్న చర్లపల్లి ధనలక్ష్మితో వెంకటేశ్వర్లుకు వివాహేతర సంబంధం ఉంది. చీమకుర్తికి చెందిన ధనలక్ష్మి కొన్నేళ్ల క్రితం నుంచి ఇక్కడే నివాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్‌గా ఉపాధి పొందుతున్న అతనికి ధనలక్ష్మితో పరిచయం ఏర్పడింది. ఇదే విషయంలో గతంలో ధనలక్ష్మికి వెంకటేశ్వర్లు కుటుంబానికి వివాదాలు జరిగారుు. దీంతో అతను కొన్నేళ్లుగా తన ప్రియురాలికి వద్దకు రావటం లేదు. కానీ ఈ మధ్య తిరిగి ఆమెకు దగ్గరయ్యాడు. ఇలా గురువారం ఉదయం వెంకటేశ్వర్లు తన ప్రియురాలిని కలవడానికి వెళ్లాడు. అక్కడ జరిగిన ఘర్షణలో అతని తల వెనుక వైపు బలమైన గాయం కావటంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే చనిపోయాడు.సమాచారం తెలుసుకున్న ఒంగోలు వన్‌టౌన్ సీఐ ఎండ్లూరి రామారావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ధనలక్ష్మిని విచారించారు. కింద పడటం వల్ల తలకు గాయమై చనిపోయాడని సమాధానం ఇచ్చింది. వెంకటేశ్వర్లు భార్య ఇందుర్తి సంఘటనా స్థలానికి చేరుకుని.. ధనలక్ష్మి హత్యచేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేయసిపై ప్రబుద్ధుడి బిత్తిరి చర్య!
నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్ మీద రెండు పేద్ద కొండ చిలువలు తెచ్చి పడేశాడో బోయ్ ఫ్రెండ్. పైథాన్లు మీద పడేసరికి తన గర్ల్ ఫ్రెండ్ ఎలా స్పందించిందన్న దృశ్యాన్ని తన స్నేహితులతో కలిసి వీడియో తీసి ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పెట్టాడు డెరెక్ డెస్కో అనే ప్రబుద్ధుడు. ఇది తన ప్రాక్టికల్ జోక్ అని చెప్తున్నాడు. -
కామవాంఛ తీర్చుకొని.. ఆపై ఫేస్బుక్లో దృశ్యాలు
బెంగళూరు(బనశంకరి) : తను ప్రేమించిన యువతి మరొకరికి సొంతమవుతుండటాన్ని జీర్ణించుకోలేని యువకుడు ప్రియురాలిని లాడ్జికి తీసుకెళ్లి కామవాంఛ తీర్చుకున్నాడు. అనంతరం ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక వెబ్సైట్లలో ఉంచాడు. అయితే యువతి స్థానికంగా ఉన్న సంఘాల నాయకులను ఆశ్రయించింది. వారు గాలింపు చేపట్టి అతన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకాలో బుధవారం చోటు చేసుకుంది. కార్కళ తాలూకా శివపురకు చెందిన యువకుడు ప్రైవేటు బస్సుడ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ఇతడికి పరిచయమై ప్రేమగా మారింది. అనంతరం యువతికి ఇటీవల మణిపాల్ హోటల్లో క్యాషియర్‌గా ఉద్యోగం ఇప్పించాడు. కులాలు వేరు కావడంతో వివాహానికి కుటుంబసభ్యుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో యువతి కుటుంబసభ్యులు వేరే యువకుడితో వివాహం చేయడానికి నిశ్చయించారు. పసిగట్టిన ప్రియుడు యువతి పరువు తీయాలనే ఉద్దేశంతో ఉడుపిలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లి రాసలీలలు జరిపాడు. ఆ దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి వాట్సాప్, ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. యువతి ఈ విషయాన్ని హిందూ సంఘటనకార్యకర్తలకు తెలపడంతో వారు ఆ యువకుడిని పట్టుకుని హెబ్రి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇరు కుటుంబ సభ్యులను వివాహానికి ఒప్పించి నిరాడంబరంగా వీరి వివాహం జరిపించారు. -
4జీ, వాట్సాప్ కోసం బోయ్ ఫ్రెండ్‌ను ఉతికేసింది
ఆగ్రా: తాను కోరినట్లుగా వాట్సాప్ ఉన్న 4జీ ఫోన్ ఇవ్వనందుకు ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్ ఫ్రెండ్‌ను ఉతికి ఆరేసింది. నలుగురు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా నడిరోడ్డుపై అతడిపై విచక్షణ కోల్పోయి చేయి చేసుకొంది. ఆగ్రాలో చోటుచేసుకున్న ఈ ఘటన చూసి చుట్టుపక్కల వారు నోరెళ్లబెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఒకమ్మాయికి పాత నోకియా ఫోన్ ఉంది. ఆమెకు ఒక బోయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఈ మధ్య తనకు నైనిటాల్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం వచ్చిందని గర్ల్ ఫ్రెండ్ కు చెప్పాడు. వెంటనే ఆ అమ్మాయి తనకు వాట్సాప్ ఉన్న ఒక 4జీ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వాలని కోరింది. దీనికి కాస్తంత సంకోచించిన అతడు తాను నైనిటాల్ వెళ్లాక అక్కడి నుంచి పంపిస్తానని చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య నడిరోడ్డుపై వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే ఆ అమ్మాయి అతడిపై చేయిచేసుకుంది. కాలితో తన్నుతూ చొక్కాపట్టుకొని ఆ చెంపాఈ చెంపా వాయించి నానా రచ్చ చేసింది. చివరకు అక్కడ ఉన్నవారు వారి విషయంలో జోక్యం చేసుకొని సర్దుమణిగేలా చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. తల్లిదండ్రులను పిలిచి విషయం చెప్పారు. అనంతరం వారితో పంపించేశారు. -
ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని..
ప్రియుడు ఆత్మహత్య టేకులపల్లి : ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందనే మనస్థాపంతో ప్రియుడు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. టేకులపల్లి ఎస్ఐ ఎంఏ అజీజ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని సులానగర్ పంచాయతీ జండాలతండాకు చెందిన బానోతు అశోక్ (23), అదే గ్రామానికి చెందిన దారావత్ అనిత (ఇంటర్ విద్యార్థిని) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 19న బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం కొత్తగూడెంలో చికిత్స పొందుతోంది. అయితే బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో తీవ్ర మనస్థాపానికి గురైన అశోక్ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కటుంబ సభ్యులు ఆటోలో కొత్తగూడెంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేయసి ముందే రెండుసార్లు గుండెలో పొడుచుకొని..
లండన్: ప్రేయసి ముందే గుండెలో పొడుచుకొని ప్రాణాలు తీసుకున్నాడు ఓ ప్రేమికుడు. తాను ఇప్పుడు ఆ పనిచేయకుంటే తన బతుకుకే అర్థం లేదని గట్టిగా అరుస్తూ ప్రియురాలి ముందే కత్తితో రెండుసార్లు ఛాతీలో దించుకొని రక్తపుమడుగులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం అతడి ప్రేయసి కోర్టులో తెలిపింది. జరాద్ కార్కోవిక్ (23) అనే యువకుడు కైషా కార్నే అనే యువతితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. అతడు ఓ గ్యాస్ ఇంజినీర్. చిన్నవయసులోనే జీవితంలో స్థిరపడిన అతడు మంచి ఉద్యోగం, మనసుకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్‌తో చాలా చక్కగా జీవితాన్ని సాగిస్తున్నాడు. అయితే, అలా కొద్ది కాలం గడిచిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ చిరాకులో ప్రతి రోజు ఆగ్రహంతో ఊగిపోతుండేవాడు. ఆ కోపం ఎవరిపై చూపించలేక గోడలు తన్నడం సోపాలు విసిరేయడం, వస్తువులు పగలగొట్టడం వంటివి చేసేవాడు. అలాంటిది జనవరి 22న మరోసారి గర్ల్ ఫ్రెండ్ తో గొడవపడి జిమ్ కు వెళ్లాడు. అటు నుంచి నేరుగా గర్ల్ ప్రెండ్ ఇంటికి వచ్చాడు. అప్పటికే బయటకు వెళ్లొచ్చిన గర్ల్ ప్రెండ్ అతడిని తన ఇంట్లో చూసి షాక్ అయింది. మరోసారి వారిద్దరి మధ్య వాదనలు జరిగాయి. దీంతో అతడు తన తలను అక్కడి వార్డ్ రోబ్ కేసి బలంగా కొట్టాడు. అనంతరం అక్కడ కత్తిని తీసుకొని ఆమె కళ్లముందే వరుసగా రెండుసార్లు గుండెలో పొడుచుకున్నాడు. అక్కడ కుప్పకూలిపోతున్న తన బాయ్ ఫ్రెండ్‌ని చేతుల్లోకి తీసుకొని ఎందుకిలా చేశావ్ అని ప్రశ్నించగా.. తను ఇలా చేయకుంటే తన జీవితానికి అర్థం లేదని స్పృహకోల్పోయాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ గురించి కైషా కోర్టులో తెలిపింది. -
గర్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేశాడని ఫ్రెండ్ తల నరికి..
మిన్నెసోటా: జూన్ 24.. అర్థరాత్రి సమయం. అనుమానాస్పద లైసెన్స్ నెంబర్ ప్లేట్‌తో ఉన్న కారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆ కారు వద్దకు వెళ్లారు. ఈలోగా కారులో ఉన్నవారు వేగం పెంచారు. పోలీసులు వారిని అందుకునే ప్రయత్నం చేయగా గంటలకు వందమైళ్ల వేగంతో ఆ కారు దూసుకెళ్లింది. అలా కొద్ది దూరం వెళ్లాక రెండు చోట్ల బలంగా ఢీకొని ఆగిపోయింది. కారు డ్రైవర్ అందులో నుంచి పారిపోయి సమీపంలోని ఓ నివాసంలో దాచుకోగా.. అందులో ఉన్న జోసెఫ్ క్రిస్టెన్ థార్సెన్ అనే వ్యక్తికి పోలీసులు ఎట్టకేలకు సంకెళ్లు తగిలించారు. అక్కడే ఓ పాడుబడ్డ ఇంట్లో దాక్కున్న డ్రైవర్‌ను బయటకు లాక్కొచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన నిజం చూసి పోలీసులు ఖిన్నులయ్యారు. ఇంతకు ఏమిటా నిజం అనుకుంటున్నారా.. థార్సెన్ హత్య చేశాడు. అవును.. తన స్నేహితుడైన డేవిడ్ అలెగ్జాండర్ హైమన్ అనే వ్యక్తిని కిరాతకంగా పొడవడమే కాకుండా అతడి తల నరికేసి అడవుల్లో పారేశాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడనే కారణంతోనే అతడిని హత్య చేశాడు. వాస్తవానికి థార్సెన్ మత్తుపదార్ధాలకు అలవాటుపడిన వ్యక్తి. అతడిపై రెండు మూడు నేరాల కేసులతోపాటు జైలుకు పోయి వచ్చిన చరిత్ర కూడా కలదు. 35 ఏళ్ల థార్సెన్ కు హైమన్(21)కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. వారిద్దరు స్నేహితులయ్యారు. థార్సెన్‌కు ఒక గర్ల్ ప్రెండ్ కూడా ఉంది. ఒక రోజు థార్సెన్ గర్ల్ ప్రెండ్ వద్దకు వెళ్లిన హైమన్ ఆమెపై లైంగికదాడి చేశాడంట. అలా దాడి చేసినప్పుడే ఆమె కూడా అతడిపై తిరగబడి కొట్టింది కూడా. అయితే, డ్రగ్స్ బారిన పడిన ఈ ముగ్గురు మరో కారు డ్రైవర్‌తో కలిసి కారులో వెళుతూ మధ్యలో డ్రగ్స్ సేవించారు. అనంతరం కారు చెకింగ్ కోసం అని హైమన్ కిందికి దిగగా వెనుక నుంచి థార్సెన్ బలంగా బేస్ బాల్ బ్యాట్ తో దాడి చేశాడు. అనంతరం కత్తితో అతడిని పొడిచి కసిగా అతడి తల నరికేసి అడవిలో పారేశాడు. తర్వాత ఏం తెలియనట్లు నటించాడు. ఈ కథంతా విన్న పోలీసులు అవాక్కయ్యి థార్సన్ను అతడి గర్ల్ ఫ్రెండ్ ను మరో కారు డ్రైవర్ ను చివరకు అదుపులోకి తీసుకున్నాడు. -
కూతుర్ని కాపాడుకునేందుకు...
వేల్పూరు హత్య కేసులో ప్రియురాలే నిందితురాలు వినుకొండ టౌన్: వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితురాలిని మంగళవారం కోర్టుకు హాజరుపర్చారు. వినుకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన మొగిలి హనుమంతరావు, ఈపూరు మండలంలోని అంగలూరుకు చెందిన బొడ్డు రమణ నాలుగేళ్లుగా వినుకొండలో సహజీవనం చేస్తున్నారు. ఇరువురికీ అంతకుముందు వేర్వేరు వ్యక్తులతో వివాహమై, సంతానం కలిగి ఉన్నారు. ఇటీవల హనుమంతరావు రమణ పెద్ద కుమార్తెపై కన్నేసి తన కోరిక తీర్చమని వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే గత నెల 23న రమణ తన కుమార్తెను రక్షించుకునే నిమిత్తం చెల్లెలు ఇంటికి పంపించింది. అయితే చిత్తుగా తాగి వచ్చిన హనుమంతరావు ఊరికి ఎందుకు పం పించావు అని రమణతో గొడవకు దిగడంతో పాటు నిన్ను చంపి, నీ కూతురితో కోరిక తీర్చుకుంటానని బెదిరించడంతో ఎలాగైనా హనుమంతరావు పీడ వదిలించుకోవాలని రమణ తిరగబడింది. తోపులాటతో కిందపడిన హనుమంతరావును చీరతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా ఇంటి సమీపంలోని ఖాళీ జాగాలో శవాన్ని పాత దుస్తులు, రాళ్లు వేసి మాయం చేయడానికి ప్రయత్నించింది. అయితే దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పరిశీలించి శవం ఆచూకీని పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రమణ కోసం గాలిస్తుండగా తిమ్మాయిపాలెం వీఆర్వో సునీత ద్వారా పోలీసులకు లొంగిపోయింది. పోలీసులు రమణను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సమావేశంలో ఎస్ఐలు లక్ష్మీ నారాయణ రెడ్డి, నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పాపం...వీరికి దిక్కేది..? వినుకొండ టౌన్: విచ్చలవిడితనానికి అలవాటుపడ్డ తల్లి ప్రవర్తనతో చిన్నారులు రోడ్డున పడ్డారు. ఈపూరు మండలం అంగలూరుకు చెందిన బొడ్డు రమణ వ్యవసాయపనులకు కూలీలను మాట్లాడే మేస్త్రీగా పనిచేస్తుండేది. ఈ నేపథ్యంలో కూలీలను తరలించడానికి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న హనుమంతరావుకు రమణకు మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది అక్రమ సంబంధానికి దారితీయడంతో రమణ భర్త సుబ్బారావు భార్యను ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. భర్త మాటలు పెడచెవిన పెట్టిన రమణ గత నాలుగేళ్లుగా తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని హనుమంతరావుతో వినుకొండలో సహజీవనం చేస్తోంది. యుక్తవయసుకు వచ్చిన రమణ పెద్ద కుమార్తెపై హనుమంతరావు కన్ను పడింది. అది సహించలేని రమణ అతడిని మట్టుబెట్టి జైలుపాలయింది. పోలీసులు తల్లిని అరెస్టు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇప్పుడు పాపం... ఆ చిన్నారులిద్దరూ దిక్కూమొక్కూ లేని వారయ్యారు. రమణ భర్త నుంచి విడిపోవడం, రమణ పుట్టింటివారు చాలాకాలం క్రితమే మరణించడంతో ఈ పిల్లలు ఎవరిని ఆశ్రయించాలో తెలియక పోలీసుస్టేషన్ పంచలోనే దీనంగా రోదిస్తూ ఉండడం చూసిన వారి కడుపు తరుక్కుపోతోంది. -
అసభ్య దృశ్యాలు యూట్యూబ్‌లో పెట్టాడు...
పోలీసులను ఆశ్రయించిన వివాహిత బంజారాహిల్స్: ప్రియురాలు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని తనను దూరం పెట్టిందనే అక్కసుతో ఓ యువకుడు ఆమె కు తెలియకుండా తీసిన అసభ్యకర వీడియోను యూట్యూబ్‌లో పెట్టేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహి ల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన యువతి (23) 2012 నుంచి 2014 వరకు ఉద్యోగ శిక్షణా తరగతుల కోసం బేగంపేటకు వెళ్లేది. అక్కడ పనిచేస్తున్న శీలబోయిన అనిల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి 2014లో ఆమెను రహ్మత్‌నగర్‌లో ఉన్న తన గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెకు తెలియకుండా ఆ దృశ్యాలను వీడి యో తీశాడు. ఇటీవల ఆమెకు మరొకరితో పెళ్లి అయింది. ఇది జీర్ణించుకోలేని అనిల్ ఆమెతో ఉన్నప్పటి అసభ్యకర వీడియోను యూట్యూబ్‌లో పెట్టాడు. గతనెల 2న బాధితురాలి స్నేహితులు ఈ దృశ్యాలు చూసి ఆమెకు తెలియజేశారు. అంతేకాకుండా ఈ విషయం అత్తవారింట్లో కూడా తెలిసింది. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అనిల్‌పై ఐపీసీ సెక్షన్ 354(బి), 506, 509, 417, 420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మోడల్ ను పెళ్లాడిన సింగర్
బెంగళూరు: ప్రముఖ గాయకుడు, కంపోజర్ బెన్నీ దయాల్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు, మోడల్ కాథరిన్ థాంగమ్ ను బెంగళూర్ లో శనివారం వివాహం చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఏఆర్ రహమాన్, విశాల్ దయానీ లు హాజరయ్యారు. బెన్నీ వివాహ చిత్రాలను విశాల్ దయాని ట్వీటర్ లో పోస్టు చేశాడు. బెన్నీ స్టుడెంట్ ఆఫ్ ద ఇయర్, బాంగ్ బాంగ్, రేస్-2 చిత్రాలకు సంగీతం అందించాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషాల్లో అనేక పాటలు పాడారు. -
ప్రేయసి కోసం సాగర తీరంలో..
బీజింగ్: చైనాలో ఓ యువకుడు తన ప్రేయసికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక ఇచ్చాడు. చైనాలో మే 20 వ తేదీని అక్కడి యువత అనధికారికంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. 520 అనేది మాండరిన్లో 'ఐ లవ్ యూ' ను సూచిస్తుంది కాబట్టి వారికి ఆరోజు ప్రత్యేకమన్నమాట. ఆ రోజు తన ప్రేయసితో పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకున్న పేరు వెల్లడించని ఓ ప్రేమికుడు సముద్రతీరంలో ఆమె ఫోటోలతో పెద్ద హారం కట్టేశాడు. నాలుగేళ్ల క్రితం ఆమె తనకు పరిచయమైన దగ్గరి నుంచి తీసిన ఫోటోలు సుమారు వెయ్యికి పైగా ప్రింట్ వేయించి సముద్ర తీరంలో ప్రదర్శనలా ఉంచాడు. దీంతో అతగాడి ప్రేమకు ముగ్ధురాలైపోయింది సదరు ప్రియురాలు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచగా 'గొప్ప ప్రేమికుడే' అంటూ మెచ్చుకుంటున్నారు. -
ప్రపోజ్ చేద్దామని...
గర్ల్‌ఫ్రెండ్ ముందు మోకాళ్లపై కూర్చొని ‘విల్ యూ మ్యారీ మీ’ అంటూ ప్రపోజ్ చేయడం కామన్. అందరూ చేసేదే. అందులో థ్రిల్లు ఏముంటుంది? అని ఆలోచించాడు చైనాలోని యిచాంగ్ నగరానికి చెందిన ఓ యువకుడు. భిన్నంగా చేయాలని ఆలోచించి... నింగి నుంచి ప్యారాచూట్‌తో గర్ల్‌ఫ్రెండ్ ముందు దిగి సర్ప్రైజ్ ప్రపోజ్ చేయాలని డిసైడయ్యాడు. పైగా ప్యారాచూట్‌పై ఓవైపు ప్రేయసి పేరుతో పాటు ‘నన్ను పెళ్లి చేసుకోవా’ అని కూడా రాయించాడు. ప్రేయసిని పార్కుకు రమ్మని అద్దెకు తీసుకున్న విమానం నుంచి ప్యారాచూట్‌తో దూకేశాడు. అయితే మనోడి టైం బాగాలేక బలమైన గాలులు రావడంతో ఇదిగో ఇలా ఓ చెట్టుపై ల్యాండ్ అయ్యాడు. దెబ్బలేమీ తగలకపోయినా ఓ గంటపాటు పైనే ఉండిపోవాల్సి వచ్చింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి క్రేన్ సహాయంతో కిందకు దించారు. దిగిన వెంటనే మనోడు చేతిలో బొకే పట్టుకొని... ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. ఇంత సీన్ క్రియేట్ చేయడంతో అమ్మడుకి చిర్రెత్తుకొచ్చి... బదులివ్వకుండానే వెనుదిరిగి విసవిసా వెళ్లిపోయిందట. -
ప్రేయసి కాళ్లు పట్టుకుని...
ప్రేయసి ‘ఇక చాలు.. విడిపోదాం’ అని చెబితే కొంతమంది ఎగిరి గంతేస్తారు.. మరికొందరు దేవదాసులా మారిపోతారు. కానీ చైనాలో ఓ కుర్రాడు మాత్రం ‘ప్లీజ్ నన్ను వదలద్దు’ అంటూ అచ్చంగా ఆమె కాళ్లు పట్టుకుని నేలమీద పడి ఆమెను ప్రాధేయపడ్డాడు. ‘ఛీ.. పో.. నువ్వు నాకు వద్దు’ అంటూ ఆ అమ్మాయి అతగాడిని పలుమార్లు చెంపమీద కొట్టింది. అయినా అతడు మాత్రం వదల్లేదు. అతడు గట్టిగా ఆమె కాళ్లు పట్టుకుని ఉండటంతో ఆమెకు తప్పించుకుని పోవడానికి కూడా వీలు కుదర్లేదు. రోడ్డు మధ్యలో నేలమీద పడి.. ఆమె కాలు పట్టుకుని ప్రేమభిక్ష పెట్టమంటూ వేడుకున్నాడు. అయినా ఆమె మాత్రం అతడిని చీదరించుకుంటూ ‘సిగ్గు లేదా.. నన్ను వెళ్లనివ్వు, నీకు చికాకు అనిపించడం లేదా’ అని విసుక్కుంది. చివరకు కాళ్లతోను, చేతులతోను కొట్టడం మొదలుపెట్టింది. కానీ అతడు మాత్రం ‘దయచేసి.. నన్ను వదలొద్దు’ అంటూ ప్రాధేయపడుతూనే ఉన్నాడు. ఆమె మాత్రం ఇక ఇద్దరం కలిసుండే ప్రసక్తి లేనే లేదని చెబుతోంది. తూర్పు చైనాలోని జియాంగ్సు రాష్ర్టంలో గల హువియాన్ నగరంలో ఈ సంఘటన జరిగింది. చుట్టుపక్కల వెళ్లే వారంతా ఇది చూసి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. -
తండ్రి కాబోతున్న హాస్య నటుడు
లండన్: బ్రిటన్‌కు ఎందిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్(40) త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ లారా గల్లాచర్ (27) ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి. లారా ప్రసవానికి మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉండగానే వారు అప్పుడే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని బ్రిటన్ వార్తా సంస్థ ఒకటి తెలిపింది. 'ప్రపంచంలోని ఎంతోమంది అందమైన యువతులతో రస్సెల్ గడిపి ఉండొచ్చు. కానీ, ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్ లారా ద్వారా తండ్రిగా మారుతున్నారు' అని ఆ వార్తా సంస్థ తెలిపింది. గత ఆరు నెలల కిందటే రస్సెల్, లారాలు కలిసి జీవిస్తున్నారు. వారిద్దరి మధ్య అనుబంధం పెనవేసుకోవడంతో మరింత ముందుకు వెళ్లింది. ఇది ఒక రకంగా వారిద్దరి జీవితంలో ఓ చరిత్ర. ప్రతి క్షణాన్ని వారిద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే పుట్టబోయే బిడ్డకు పెట్టాల్సిన పేరు గురించి చర్చల్లో మునిగిపోయారు. -
ప్రియురాలితో భర్త పెళ్లి చేసిన భార్య
రాజవొమ్మంగి : వారు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వాస్తవం గ్రహించిన అతడి భార్య.. ప్రియురాలి తో దగ్గరుండి భర్త వివాహం జరిపించింది. ఇదేమీ సినిమా స్టోరీ కాదు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగి గ్రామానికి చెందిన భూముల అప్పారావుకు, అదే గ్రామానికి చెందిన భాను అనే యువతిని ఇచ్చి పెద్దలు స్థానిక శ్రీకోదండ రాముల వారి ఆలయంలో వివాహం జరిపించారు. గతేడాది అప్పారావు తప్పనిసరి పరిస్థితుల్లో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇలాఉండగా అప్పారావు, భాను ప్రేమ వ్యవహారం తెలిసిన అతడి భార్య వారి వివాహానికి అంగీకరించింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లిని పెద్దల సమక్షంలో దగ్గరుండి జరిపించింది. ముగ్గురు ఇష్టపడటంతో ఈ పెళ్లి జరిపించామని స్థానిక పెద్దలు చెప్పారు. -
ప్రేయసి ఇంటి ముందు యువకుడి మృతదేహం
► ప్రేయసి ఇంటి ముందు పునాదిలో యువకుడి మృతదేహం ► కుక్కలు తవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి.. ► పది రోజుల కిందట హతమార్చి పాతి పెట్టి ఉంటారన్న అనుమానాలు ► మృతుడు అనంతపురం మరవకొట్టాలకు చెందిన తిరుపాల్‌గా గుర్తింపు పెళ్లైన పదేళ్లకు పరస్త్రీ వ్యామోహంలో పడి న అతను భార్యను నిర్లక్ష్యం చేశాడు. అంతటితో ఆగక తనతో వివాహేతర సంబంధం కలిగిన మహిళతోనే ఏకంగా వేరుగా ఇల్లు తీసుకుని సహజీవనం సాగించాడు. పదిహేను రోజులుగా భర్త ఇంటికి రాకపోవడంతో కంగారు పడ్డ భార్య విషయాన్ని తన అత్తమామలకు తెలిపింది. వారు ఎలాగోలా తమ కుమారుడి జాడ కనుగొని బుద్ధి చెప్పారు. అంతే.. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో పది రోజులు తరువాత ప్రియురాలి నివాసం ముందు నిర్మించిన ఇంటి పునాదిలో అతని మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. - రాప్తాడు రాప్తాడు మండలం చిన్మయానగర్ సమీపంలోని కళాకారుల కాలనీలో కలకలం రేగింది. అనంతపురంలోని మరవకొట్టాలకు చెందిన లక్ష్మిదేవి, కొండయ్య దంపతుల కుమారుడు సాకే తిరుపాల్(30) మృతదేహం లభ్యం కావడం అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రియురాలి ఇంటి ముందే ఈ ఘటన వెలుగు చూడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధర్మవరం గీతానగర్‌కు చెందిన లక్ష్మీదేవి కుమార్తె దుర్గతో పదేళ్ల కిందట తిరుపాల్ వివాహమైంది. సజావుగా సాగిపోతున్న వారి కాపురంలోకి మరో మహిళ ప్రవేశంతో కలతలు మొదలయ్యాయి. అప్పటి నుంచి అతను చిన్మయానగర్‌లోని కళాకారుల కాలనీలో వేరు కాపురం పెట్టి ఏకంగా సహజీవనం చేయడం మొదలుపెట్టాడు. పది హేను రోజులుగా ఇంటికి వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన భార్య విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకెళ్లింది. వారు ఎలాగోలా తమ కుమారుడు వేరు కాపురం పెట్టిన ప్రదేశాన్ని కనుగొని ఇద్దరినీ మందలించారు. ఈ సంఘటన జరిగి పది రోజులు కావస్తోంది. వెలుగులోకి వచ్చింది ఇలా... తిరుపాల్ సహజీవనం చేసిన మహిళ ఉండే ఇంటి ముందే పునాది నుంచి గురువారం దుర్వాసన వచ్చింది. అంతలోనే కుక్కలన్నీ అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశాయి. దీంతో ఆ వాసనను అక్కడి పరిసర ప్రాంతాల జనం భరించలేకపోయారు. ఇరుగుపొరుగు వారు పునాది వద్దకు వెళ్లి చూడగా ఎముకలు, పుర్రె కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి పోలీసులు సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ తమ సిబ్బందితో కలసి హుటాహుటిన నేర స్థలికి చేరుకున్నారు. ఎముకలు, పుర్రె ఇతర భాగాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలిలో పడి ఉన్న దుస్తులు, చెప్పులు చూసి.. అనంతపురం మరవ కొట్టాలకు చెందిన తిరుపాల్‌గా గుర్తించారు. మృతుడి భార్య, తల్లిదండ్రులు, బంధువులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. ప్రియురాలిపైనే అనుమానాలు తనతో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకుని తిరుపాల్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ మందలించడాన్ని జీర్ణించుకోలేని ప్రియురాలే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. పది రోజుల నుంచి ఆమె స్థానికంగా లేకపోవడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చి..
న్యూఢిల్లీ: గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు ఓ విదేశీయుడు అక్రమంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డాడు. నిందితుడు ఢిల్లీ-ఫ్రాంక్ఫర్ట్ నకిలీ విమాన టికెట్‌తో టర్మినల్ 3 లోపలికి ప్రవేశించాడు. చివరకు అధికారులు గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. గత సోమవారం జరిగిన ఈ సంఘటన విమానాశ్రయంలో భద్రతాలోపాలను ఎత్తిచూపింది. నిందితుడిని మైకేల్ ఎలియాజ్ రోడ్రిగుజ్గా గుర్తించారు. అతడికి స్పెయిన్ పాస్‌పోర్టు ఉన్నట్టు అధికారులు చెప్పారు. ప్రవేశ ద్వారం వద్ద మైకేల్‌ను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని పేరు మీద టికెట్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడిపై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను చూసేందుకు వచ్చినట్టు అతడు చెప్పాడు. ఢిల్లీ విమానాశ్రయంలోకి భారత ప్రయాణికులతో పాటు విదేశీయులు భారీ సంఖ్యలో వస్తుంటారని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన అవసరముందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా జరిగాయని, అయితే ఇంతవరకు పరిష్కారం కనుగొనలేదని చెప్పారు. కొందరు నకిలీ టికెట్లతో విమానాశ్రయంలోకి వస్తున్నారని, ఇది భద్రతపరంగా ఆందోళన కలిగించే విషయమని పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. ఈ సమస్యను అధిగమించేందుకు హైదరాబాద్ విమానాశ్రయంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నకిలీ టికెట్లను గుర్తించేందుకు ప్రవేశ ద్వారాల వద్ద బార్ కోడ్ స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్రసెల్ బాంబు పేలుళ్ల ఘటన అనంతరం ముందుజాగ్రత్తగా విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. -
ప్రియురాలిని పంపించాల్సిందే
► మృతదేహంతో బంధువుల ఆందోళన ► ఆరిలోవ పోలీస్‌స్టేషన్ ఎదుట మూడు గంటలపాటు ఉద్రిక్తం ఆరిలోవ : ‘‘ప్రియురాలి చేతిలో మోసపోవడం వల్లే పార్థసారథి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి చివరి కోరిక మేరకు ప్రియురాలి సమక్షంలోనే దహన సంస్కారాలు నిర్వహిస్తాం. పోలీసుల అదుపులో ఉన్న యువతిని మా వెంట పంపించండి’’... అంటూ ఆరిలోవ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుని బంధువులు మంగళవారం సాయంత్రం ఆందోళన చేశారు. వందలాది మంది స్థానికులు స్టేషన్‌ను ముట్టడించడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టమైంది. చివరకు ఆరిలోవ పోలీసులతో పాటు తూర్పు ఏసీపీ రమణబాబు, పీఎం పాలెం, ఆనందపురం సీఐలు, ఎస్‌లు, సిబ్బంది రావాల్సి వచ్చింది. అయినప్పటికీ మూడు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే... పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోయిన ఆరిలోవ ప్రాంతం పాండురంగాపురానికి చెందిన యలమల పార్థసారథి(24) సోమవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. తన మృతికి ప్రేమ వైఫల్యమే కారణమని, ప్రేమించిన అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయించి రూ 1.50 లక్షలు తీసుకొని మోసం చేసిందని, దానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్లు సూసైడ్ లేఖలో రాశాడు. నా మృతదేహాన్ని ప్రేమించిన అమ్మాయి సమక్షంలో దహనం చేయాలని కోరుతూ ఆ లేఖలో రాశాడు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు మంగళవారం ఆ ఆమ్మాయిని అదుపులోకి తీసుకొని ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అదుపు చేయలేకపోయిన పోలీసులు : పోస్టుమార్టం అనంతరం మృతదే హాన్ని దహన సంస్కారాల కోసం మృతుడి బంధువులు, స్థానికులు ఆరిలోవ తీసుకొస్తూ పోలీస్ స్టేషన్ ముందు మృతదే హం ఉన్న వ్యాన్‌ను నిలిపేశారు. స్టేషన్లో ఉన్న ఆ అమ్మాయిని దహన సంస్కారాల వద్దకు తీసుకెళ్తామని, మాతో ఆ అమ్మాయిని పంపించాలని పోలీసులను కోరారు. పోలీసులు ససేమిరా అనడంతో ఆందోళనకు దిగారు. అధిక సంఖ్యలో మృతుడి బంధువులు రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారు. దీంతో సీఐ ధనుంజయనాయుడు ఇచ్చిన సమాచారంతో ఈస్ట్ ఏసీపీ రమణబాబు, పీఎంపాలెం, ఆనందపురం సీఐలు అప్పలరాజు, పార్థసార థి, ఎస్.ఐలు, కానిస్టేబుళ్లు సుమారు 100 మంది వరకు స్టేషన్‌కు చేరుకొన్నారు. అయినా స్టేషన్ నుంచి ఆందోళనకారులు వెళ్లలేదు. రాత్రి కావడంతో మృతదేహానికి దహన సంస్కారాలు జరపలేదు. బంధువులు మాట్లాడుతూ పార్థసారథిని ప్రేమించిన అమ్మాయిని పంపిస్తేనే మృతదేహానికి దహనసంస్కారాలు చేస్తామని భీష్మించారు. దీంతో ఏసీపీ రమణబాబు మృతుడి బంధువులను పిలిచి స్టేషన్ లోపల మాట్లాడారు. మృతుడికి తగిన న్యాయం చేస్తామని, ముందు దహన సంస్కారాలు జరిపించండని నచ్చజెప్పారు. శాంతించిన మృతుడి బంధువులు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి స్టేషన్ ముందు సాగిన ఈ డ్రామా సుమారు రాత్రి 9 గంటలకు సద్దుమనిగింది. మృతుడికి పుట్టినరోజు : ఇదిలా ఉండగా మృతుడు పార్థసారథికి మంగళవారం పుట్టిన రోజు కావడం విశేషం. మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు నిలిపి మృతుడి స్నేహితులు, బంధువులు కేక్ కట్‌చేశారు. స్టేషన్లో ఉన్న పార్థసారథి ప్రియురాలిని పోలీసులు బయటకు తీసుకురావాలని నినాదాలు చేశారు. ఎంతో సరదాగా పుట్టిన రోజు చేసుకోవాల్సిన రోజే అంత్యక్రియలు జరపాల్సి వస్తోందంటూ మృతుడి పిన్ని కనకదుర్గ స్టేషన్ వద్ద బోరున విలపించింది. -
ఆ విషయం భార్యకు చెప్తుందేమోనని...
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన జరిగింది. తమ మధ్య ఉన్న 'అఫైర్' గురించి ఎక్కడ భార్యకు చెబుతుందోనని భావించిన ఓ బ్యాంకు మేనేజర్ తన గర్ల్ ఫ్రెండ్‌ను దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవీన్ కుమార్(32) హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పెళ్లి కాలేదని నమ్మించి బ్యాంకులో సహోద్యోగిగా పనిచేస్తున్న పుణ్య సాగర్(28)తో గత కొంతకాలంగా అఫైర్ నడుపుతున్నాడు. అయితే నవీన్‌కు అప్పటికే పెళ్లయిపోయిందని, అతనికి పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకున్న పుణ్య సాగర్.. తమ అఫైర్ గురించి భార్యకు చెబుతానని బెదిరించింది. దీంతో హడలిపోయిన నవీన్ బయటకు తీసుకెళ్తానని నమ్మించి పుణ్య సాగర్‌ను కారులో నగర శివార్లకు తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. నవీన్ ఆమె తలను ఫుట్‌పాత్‌కు బలంగా కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు నవీన్ కుమార్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
గర్ల్ఫ్రెండేగా అని చెయ్యేస్తే..!
లండన్: ప్రియుడైనా.. ప్రియురాలైనా ఎవరి హద్దుల్లో వారు ఉండాలి. అలా ఉండకుంటే వారిద్దరికే మోసం. హద్దులు దాటడం అన్నిసార్లు మంచిది కాదు. అలాగని కొన్నిసార్లు దాటడం కూడా పద్దతి కాదు. అదే జరిగితే ఆ బంధం ఉండొచ్చు.. ఊడిపోవచ్చు. స్నేహం, ప్రేమవంటివన్నీ హద్దులు దాటితే పెటాకులు అవకతప్పదు. లండన్‌లో ఓ ప్రేమికుడికి ఇదే జరిగింది. తన గర్ల్‌ఫ్రెండే కదా అని అతి చేయబోయాడు. తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించబోయాడు. చివరకు జైలు పాలయ్యాడు. రైస్ వెదర్ బర్న్(20) అనే యువకుడు ప్రేమికుల రోజు సందర్బంగా లండన్‌లోని రిట్జ్ అనే ప్రతిష్టాత్మక హోటల్లో రాత్రి తన ప్రియురాలితో కలిసి రోమాన్స్ చేసేందుకు రూ.31,345 పెట్టి ఓ గది అద్దెకు తీసుకున్నాడు. అనంతరం ఇద్దరు కలిసి మందేశారు. లెక్కలేనన్ని కబుర్లు చెప్పుకున్నారు. ప్రేమికుల రోజును గుర్తు చేసుకుంటూ వారి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. ఆ తర్వాత అసలు పంచాయితీ మొదలైంది. మెల్లగా రైస్ తన ప్రియురాలిపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. లైంగికంగా దాడి చేసేందుకు తెగించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె గట్టిగా కేకలు వేసింది. రక్షించండి.. రక్షించండి అంటూ గోడలు బద్ధలయ్యేలా అరిచింది. వారి పక్క గదిలో ఉన్నవారు ఆ కేకలు విని హోటల్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో వారు వచ్చి రైస్ వెదర్‌ను మెడపట్టి బయటకు గెంటేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిని కోర్టు బోనులో నిలబెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరి కేసును వాదిస్తూ రైస్ తన ప్రియురాలి మధ్య దాదాపు ఏడాది బంధం ఉందని గుర్తు చేశారు. తాగిన మైకంలో అలా చేసేందుకు ప్రయత్నించి ఉండొచ్చని అన్నారు. అయితే, అతడిని హోటల్ సిబ్బంది బయటకు గెంటేసే సమయంలో అద్దాలు పగలగొట్టడం వంటి చర్యలకు దిగాడు. ఫలితంగా మార్చి 2 వరకు అతడికి జైలు శిక్ష విధించారు. -
ఆ టెక్నిక్స్ కోసం..!
ఈ మధ్య తమన్నాకు కొత్తగా ఓ విషయం మీద ఆసక్తి ఏర్పడింది. అది సినిమాలకు సంబంధించినది కాదు. వంటింట్లో ఓ ప్రయోగం చేయాలనుకున్నారు. కేక్ తయారు చేయాలని ఆశపడ్డారు. కానీ, బేక్ చేయడం తెలియదట. దాంతో తన ఫ్రెండ్స్‌ను కొంతమందిని ఇంటికి పిలిచారు. ముద్దుగుమ్మ లందరూ మెత్తని కప్ కేక్స్ తయారు చేయడం మొదలు పెట్టారు. ఒక స్నేహితురాలు బేక్ చేయడంలో స్పెషలిస్ట్. ఆవిడగారు కేక్ తయారు చేస్తుంటే తమన్నా కూడా ఓ చెయ్యేశారట. మొత్తానికి టేస్టీ టేస్టీ కేక్స్ తయారు చేశారు. దాంతో బేకింగ్ మీద తమన్నాకు మరింత ఆసక్తి ఏర్పడిపోయిందట. పసందుగా కేక్ బేక్ చేయడం కోసం కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవడానికి తమన్నా కుకరీ క్లాసెస్‌కి వెళ్లాలని డిసైడ్ అయిపోయారట. -
ప్రియురాలికి అలా ప్రపోజ్ చేశాడు..!
కొత్తగా ప్రపోజ్ చేయడం... ప్రియురాలిని ప్రసన్నం చేసుకోవడం ప్రేమలో ఇవన్నీ మామూలే. అలాగే ఆకాశంలో, నీటిలోపలి, పర్వత శిఖరాగ్రాన పెళ్లిళ్లు చేసుకోవడమూ చూశాం. అయితే ఓ పెలైట్‌కు కొత్త ఆలోచన వచ్చింది. ఓగోట్ అనే ఈ పెలైట్ ఓ రెండు సీట్ల విమానంలో ప్రియురాలిని తీసుకొని కాలిఫోర్నియాలోని కాథలినా ఐలండ్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో విమానంలో ఏదో సమస్య వచ్చిందని, అదుపు తప్పిందని ఎమర్జెన్సీ అంటూ ప్రకటించాడు. అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పే చార్ట్‌ను ఆమెకు అందించి బిగ్గరగా చదవమని చెప్పాడు. కాస్త ధైర్యంగానే ఉన్న ఆమె ఓగోట్ చెప్పినట్లే చార్ట్‌ను చదవడం మొదలుపెట్టింది. అలా చదువుతూ వెళుతుండగా... ‘డు యూ లవ్ ది పెలైట్?’ అని రాసుంది. దాన్ని కూడా చదివేసి... బిక్కమొహం వేసి ప్రియుడి వైపు చూసింది. అప్పుడతను తన జేబులో నుంచి ఎంగేజ్మెంట్ రింగ్ తీసి ఆమెకు ప్రపోజ్ చేశాడు. తర్వాత అసలు విషయం చెప్పాడు. విమానం భేషుగ్గా ఉందని... ప్రపోజ్ చేయడానికే తాను అబద్ధమాడానని చెప్పాడు. దాంతో ఆమె అతన్ని క్షమించేసి ఓకే చెప్పింది. దీన్ని ఓగోట్ వీడియో తీసి యూట్యూబ్‌లో ఆప్‌లోడ్ చేశాడు. అక్కడ ఇప్పుడిది ఓ హిట్టు. -
70 ఏళ్ల తర్వాత ప్రియురాలి చెంతకు..!
అడిలైడ్: ఆస్ట్రేలియాలో అపురూప సంఘటన జరగబోతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న ఓ పైలట్ 70 ఏళ్ల తర్వాత తన గర్ల్ ఫ్రెండ్‌ను కలుసుకోబోతున్నాడు. వచ్చే వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) ఇందుకు వేదిక కాబోతోంది. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన పైలట్ నోర్వూద్ థామస్ (93) రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన జాయ్సే మోరిస్ పరిచయమైంది. ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. అయితే యుద్ధానంతరం ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు థామస్ వయసు 93 ఏళ్లు కాగా, మోరిస్‌కు 88 ఏళ్లు. 70 ఏళ్ల విరామం తర్వాత థామస్‌కు మోరిస్‌ను చూడాలనిపించింది. ఆమె చిరునామా తెలుసుకుని ఇటీవల స్కైప్ ద్వారా మాట్లాడాడు. వీరిద్దరి లవ్ స్టోరీ ఆన్లైన్లో పాపులర్ అయింది. 300 మందికిపైగా నెటిజెన్లు స్పందించి ఈ జంటను కలిపేందుకు విరాళాలు పంపారు. దాదాపు 5 లక్షల రూపాయలు పోగయ్యాయి. ఇక థామస్, మోరిస్‌ను కలిపేందుకు ఎయిర్ న్యూజిలాండ్ ముందుకొచ్చింది. థామస్, ఆయన కొడుకును విమానంలో ఉచితంగా ఆస్ట్రేలియా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రేమికుల రోజున అలనాటి ఈ ప్రేమ జంట మళ్లీ కలుసుకోబోతోంది. -
బాలీవుడ్ నటుడు అదృశ్యం
ముంబై: టీవీ నటిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు విశాల్ థక్కర్ కనిపించకుండా పోయాడు. రేప్ కేస్ ముద్ర పడడంతో మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. 2016 నూతన సంవత్సర వేడుకలను గర్ల్ ఫ్రెండ్ తో ఘనంగా జరుపుకున్న కొన్ని క్షణాల తర్వాత అతడు అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలం రేపింది. రేప్ కేసు నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు విచారంలో మునిగిపోయారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ లో ప్రియురాలు రజనీ రాథోడ్ తో పార్టీ చేసుకుని ముంబైకి తిరిగి వస్తూ అతడు కనిపించకుండాపోయాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఎవరో ఫ్రెండ్ ను కలవడానికని వెళ్లి అదృశ్యమైనట్టుగా తెలుస్తోందని విచారణ అధికారి జయవంత్ పాడ్వి తెలిపారు. అయితే అత్యాచార ఆరోపణల నేపథ్యంలో అతనికి అవకాశాలు బాగా తగ్గి పోవడంతో డిప్రెషన్ కు లోనయ్యాడని ప్రియురాలు రజని చెప్పిందన్నారు. విశాల్ తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు అన్ని కోణాల్లో కేసులు దర్యాప్తు చేపట్టారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'టాంగో చార్లీ', 'చాందిని బార్' తదితర చిత్రాలతోపాటు, టీవీ సీరియల్స్ విశాల్ థక్కర్ నటించాడు. గత ఏడాది అక్టోబర్ లో సహనటిపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఎదుర్కొన్నాడు. సహజీవనం చేసి పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ ఆమె కేసు పెట్టింది. అనంతరం ఇద్దరూ రాజీపడడంతో ఆమె కేసు ఉపసంహరించుకుంది. -
ప్రియుడే హంతకుడు!
కొత్తూరు: వివాహం చేసుకోవాలని కోరినందునే ప్రియురాలు గులిమి సుమతిని హతమార్చినట్లు భామిని మండలం ఘనసరకు చెందిన ఎరుకమజ్జి శంకరరావు స్థానిక సీఐ కాతం అశోక్‌కుమార్ వద్ద వెల్లడించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్య చేసిన శంకరరావు సంఘటన జరిగిన వెంటనే పరారయ్యాడు. చివరకు గ్రామానికి చెందిన వీఆర్వో వద్దకు గురువారం చేరుకొని తానే హత్య చేసినట్లు చెప్పి కొత్తూరు సీఐ వద్దకు వచ్చి లొంగిపోయాడు. ఈ మేరకు నిందితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నా యి... గ్రహణంమొర్రి వికలాంగురాలైన భామిని మండలం ఘనసరకు చెందిన గొలిమి సుమతి (21)తో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ కలాసీగా పనిచేస్తున్న ఎరుకుమజ్జి శంకరరావుతో రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు కొనసాగుతున్నాయి. వివాహం చేసుకోవాలని సుమతి కోరగా, ఆమెను నమ్మించి రెండు నెలల నుంచి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ రాత్రి సుమతిని శారీరకంగా అనుభవించిన తరువాత, తనను వివాహం చేసుకోవాలని గట్టిగా ఒత్తిడి తేవడంతో ఆమె మెడకు గుడ్డ చుట్టి హత్య చేసినట్లు సీఐ ముందు శంకర్ తెలిపారు. నేరం అంగీకరించినందున శంకరరావును గురువారం అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌పై పాతపట్నం సబ్‌జైల్‌కు తరలించినట్లు తెలిపారు. -
ప్రేమికుడి కోసం యువతి కిడ్నీ దానం!
మాన్చెస్టర్: నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే కావొచ్చు. గత ఏడాది వేసవిలో గోల్ఫ్ కోర్సులో తొలిసారి కలుసుకున్నప్పుడు జాక్ సిమర్డ్ (49), మిషెల్లి లాబ్రాంషె తమ మధ్య ఇన్ని సారూప్యతలు ఉన్నాయని గుర్తించి ఉండరు. కానీ క్రమంగా ఒకరంటే ఒకరికీ అభిమానం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడిపోయారు. న్యూ హ్యాంప్‌షైర్ లోని స్టోన్ బ్రిడ్జ్ కంట్రీ క్లబ్లో ఇద్దరు కలిసి తరచూ గోల్ఫ్ ఆడేవారు. అయితే, మాంచెస్టర్‌కు చెందిన సిమర్డ్ రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో గత కొంతకాలంగా ఆయన కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయం తెలియడంతో మిషెల్లి రహస్యంగా వెళ్లి తన కిడ్నీ ఆయనకు సరిపోతుందో లేదో పరీక్షలు చేయించుకుంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అయ్యాయి. వీరి ప్రేమకు చిహ్నంగా వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) నాడు మిషెల్లి సిమర్డ్కు కిడ్నీ దానం చేయనుంది. సిమర్డ్ 19 ఏళ్ల కిందట తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అప్పట్లో అతని సోదరి కిడ్నీ దానం చేసింది. ఇప్పుడు తన ప్రియురాలు ఇందుకోసం ముందుకొచ్చింది. తన భవిష్యత్ జీవితమంతా సిమర్డ్యేనని, ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మిషెల్లి తెలిపింది. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
-
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా
మెదక్: ‘ప్రేమించాను..పెళ్లి చేసుకుంటానని వెంట పడితే బావే కదా అని నమ్మాను.. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేశాడు’ అంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. నంగునూరు మండలం మగ్దుంపూర్‌లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గీతను భాస్కర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. అతడు వరుసకు బావ కావడంతో సంవత్సరం పాటు కలిసి తిరిగారు. తనను పెళ్లి చేసుకోవాలని గీత కోరడంతో భాస్కర్ నిరాకరించాడు. దీంతో జులైలో భాస్కర్‌తో పాటు అతని తల్లిదండ్రులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని రిమాండ్‌కు తరలించారు. ఇటీవలే బెయిల్‌పై వచ్చిన భాస్కర్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కాగా తనకు న్యాయం చేయాలంటూ గీత ఆదివారం ప్రియుని ఇంటి ముందు ఆందోళనకు దిగింది. భాస్కర్ ఇంట్లో కుటుంబసభ్యులు ఎవ్వరు లేకపోవడంతో ఆదివారం సాయంత్రం ఆమె వెనుదిరిగింది. -
ప్రస్తుతానికి నా గర్ల్‌ఫ్రెండ్ ఆయనే!
న్యూ జనరేషన్ హీరోల్లో నిఖిల్‌ది సెపరేట్ స్టయిల్. ఒకసారి చేసిన కాన్సెప్ట్ ఇంకోసారి టచ్ చేయడు. ఎప్పటికప్పుడు తనకంటూ ఓ పంథా ఏర్పరచుకున్న నిఖిల్ ఈ శుక్రవారం ‘శంకరాభరణం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా నిఖిల్ మీడియాతో చెప్పిన ముచ్చట్లు... * ఓ రోజు సడన్‌గా కోన వెంకట్ గారి నుంచి ఫోన్ వచ్చింది. కథ వినడానికి రమ్మన్నారు. విని ఇంప్రెస్ అయిపోయా. ఫుల్ నెరేషన్ కావాలని అడిగినా ఆయన ఫీల్ కాలేదు. ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసి, నాకు వినిపించారు. * ‘శంకరాభరణం’ టైటిల్ పెడుతున్నామని చెప్పగానే నేను షాకైపోయా. రిస్కు అవుతుందేమోనని చెప్పా. ఆ టైటిల్ తో మనం బూతు సినిమా సినిమా తీస్తే తప్పుగానీ మంచి కంటెంట్ అందిస్తే ఏం ఫరవాలేదని కోన గారు నాకు భరోసా ఇచ్చారు. * ఈ టైటిల్ పెట్టడం వల్ల ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ అయ్యిందని నా అభిప్రాయం. * గతంలో నేను నటించిన ‘డిస్కో’ సినిమా చూస్తూ ఓ కుర్రాడు మధ్యలో హాలులో నుంచి వెళ్లిపోతూ, ‘భయ్యా... ఇక ఈ సినిమా చూడలేను’ అని కామెంట్ చేశాడు. నేను చాలా బాధపడ్డాను. ఇకపై అలాంటి సినిమాలు చేయకూడదని డిసైడై, ట్రెండ్ మార్చాను. అప్పటి నుంచి కొత్త తరహా కథలు ఎంచుకోవడం మొదలుపెట్టా. అలా ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘శంకరాభరణం’ నాకు దక్కాయి. * సినిమా తర్వాత సినిమా చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమా అనేది ఖరీదైన వ్యవహారం. క్వాలిటీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే ప్రమోషన్‌కు కూడా సమయం కేటాయించాలి. * ‘టైగర్’ చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఫ్యాంటసీ నేపథ్యంలో సినిమా చేయనున్నా. అలాగే చందు మొండేటి ద ర్శకత్వంలో ‘కార్తికేయ-2’ చేస్తాను. దానికి ఇప్పటికే కథ రెడీ చేసేశాం. ‘కార్తికేయ’కు ఇది పర్ఫెక్ట్ సీక్వెల్. * నేనింతవరకూ ప్రేమలో పడలేదు. చాలా ఏళ్లుగా ఐ యామ్ సింగిల్. ఇంటర్, ఇంజనీ రింగ్ ఎడ్యుకేషన్ టైమ్‌లో క్రషెస్ ఎవరికైనా కామన్ కదా. ఇప్పుడైతే నాకంత టైమ్ దొరకడం లేదు. సినిమాలతోనే గడిచిపోతోంది. ఇప్పుడు కోన గారే నా గర్ల్‌ఫ్రెండ్. * మా ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు. ఇంకో రెండు సినిమాలు హిట్టయితే పెళ్లి చేసుకుంటానని వాయిదా వేసుకుంటూ వస్తున్నా. అయితే పెద్దలు కుదిర్చిన అమ్మాయినే చేసుకుంటా. * ఆ మధ్య న్యూయార్క్‌లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేశా. అది టైమ్‌పాస్ కోసమే. అంతేగానీ ఏదో డెరైక్షన్ చేసేద్దామని మాత్రం కాదు. నా దృష్టి ఎప్పుడూ యాక్టింగ్ మీదే. -
పంటితో అమ్మాయిని పడగొట్టాడు
సాధారణంగా ఏ అబ్బాయైనా తను ప్రేమించిన అమ్మాయికి గోల్డ్ రింగ్ తోనో.. ప్రేమతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఉంటే డైమండ్ రింగ్ తోనో ప్రపోజ్ చేస్తాడు. అందుకు భిన్నంగా ఓ యువకుడు తన పంటితో ప్రపోజ్ చేసి ఆమెను ఆశ్చర్యపరిచాడు. పంటితోనా! ఎలాగెలాగా అంటారా.. ఉంగరంలో ఏ రత్నమో, పగడమో, వజ్రమో ఉంగాల్సిన చోట తన జ్ఞానదంతాన్ని పొదిగాడు కాలిఫోర్నియాకు చెందిన ఆ వినూత్న ప్రేమికుడు. లూకాస్ ఉంగర్ అనే ఆ యువకుడికి కార్లీ లిఫ్కెస్ అనే చిన్నది ఈ ఏడాది ప్రారంభంలో కెనడాలోని ఓ మ్యూజిక్ ఫెస్టివల్లో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా చిగురించి.. ఆపై ప్రేమగా విరబూసింది. దాంతో పెద్దలు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. అదే రోజు కార్లీ కుటుంబ సభ్యులందరు చూస్తుండగా ఆమె ఎదురుగా మోకాలిపై కూర్చొని 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అంటూ జ్ఞానదంతం అమర్చిన రింగ్ తొడిగి లూకాస్ ప్రపోజ్ చేశాడు. నవ్వుతూ ఒప్పేసుకుంది క్లారీ. నా ఆప్త మిత్రుడిని వివాహం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కార్లీ ఫేస్ బుక్ పేజీలో పేర్కొంది. అతని జ్ఞానదంతంతో చేసి ఇచ్చిన ఉంగరం డైమండ్ రింగ్ కన్నా విలువైందని చెబుతోంది. వీరిద్దరూ నవంబర్ 21న లాస్‌వెగాస్‌లో పెళ్లి చేసుకుంటారు. -
గర్ల్‌ఫ్రెండ్స్ కోసం గతి తప్పారు
కరీంనగర్ క్రైం : వాళ్లంతా ఇరవయ్యేళ్లలోపువారే. చిల్లరగా తిరిగే ఆ ముగ్గురు ఒక్కటయ్యారు. గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలకు దిగారు. ఇందుకు అవసరమైన డబ్బులకోసం చోరీల బాట పడ్డారు. బైక్‌లు దొంగలిస్తూ, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ సొమ్ము చేసుకునేవారు. చివరకు వీరి ఆట కట్టుబడి పోలీసులకు చిక్కారు. వీరినుంచి పోలీ సులు రూ.20 లక్షల విలువైన 50 తులాల బంగారం, 11 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను ఎస్పీ జోయల్ డేవిస్ సోమవారం హెడ్‌క్వార్టర్స్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన నేదునూరి శ్రావణ్‌కుమార్, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల హమాలివాడకు చెందిన తొంగరి రాము, పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బొకరి సునీల్‌రాజ్ మిత్రులు. శ్రావణ్, రాము పెద్దపల్లిలో, సునీల్‌రాజ్ కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌లో నివాసముం టున్నారు. వీరికి గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నచిన్న పనులతో వచ్చే డబ్బులతో గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి జల్సాలు చేయడం ఇబ్బంది అవడంతో చోరీలు మొదలెట్టారు. ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్‌గా వారి మెడల్లోని చైన్లు లాక్కుని పారిపోయేవారు. వీరు పెద్దపల్లిలో ఉంటూ బస్సుల్లో కరీంనగర్ వచ్చి రాత్రివేళ నంబర్‌లేని బైక్‌లను గుర్తించి చోరీ చేసేవారు. మరునాడు వేకువజామున ముగ్గురూ కలిసి రెక్కీ నిర్వహించి ప్లాన్ అమలు చేసేవారు. ఒక్కోసారి ఒక్కరే... మరో చోట ఇద్దరు.. ఇంకోచోట ముగ్గురు ఇలా మూడు ముఠాలు చోరీ చేస్తున్నట్లుగా సృష్టించేవారు. అనంతరం వారు బైక్‌ను ఎక్కడన్నా వదిలేసి వెళ్లిపోయేవారు. కొన్ని నెలలుగా జిల్లాకేంద్రంతోపాటు సుల్తానాబాద్, మంచిర్యాల ప్రాంతా ల్లో చోరీలకు పాల్పడ్డారు. వచ్చిన డబ్బులు జల్సాలకు ఖర్చుచేసేవారు. అవసరమైతే బైక్‌లు అమ్మేవారు. వీరిపై 30 కేసులు వీరిపై 30 కేసులు నమోదయ్యాయి. వీరిని పట్టుకునేం దుకు కరీంనగర్ టౌన్లోనే 15 బృందాలు ఏర్పాటు చేశా రు. 4న నగరంలోని విద్యానగర్‌లో చైన్‌స్నాచింగ్ చేసి పారిపోతున్న వీరిని టూటౌన్ పోలీసులు వెంటపడి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒకరు పారిపోగా సోమవా రం గణేశ్‌నగర్‌లో పట్టుకున్నారు. వీరిని విచారించగా కరీంనగర్లో టూటౌన్ పరిధిలో 11 నేరాలు, 9 చైన్‌స్నాచింగ్‌లు, 6 బైక్‌లు, త్రీటౌన్ పరిధిలో 6 చైన్ స్నాచింగ్ లు, వన్‌టౌన్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, సుల్తానాబాద్ పీఎస్ పరిధిలో 2 చైన్‌స్నాచింగ్‌లు, 1 బైక్, మంచిర్యాల పీఎస్ పరిధిలో 1 చైన్‌స్నాచింగ్, 1 బైక్ చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. మరో మూడు వాహనాలను వీరు గుర్తిం చలేకపోయారు. వీరి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, రూ.5 లక్షల విలువైన 11 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న డీఎస్పీ రామారావు, టూటౌన్ సీఐ హరిప్రసాద్, ఎస్సై దామోదర్‌రెడ్డి, కానిస్టేబుల్ షౌకత్ ఆలీ, వెంకటరమణ, రమేశ్‌ను, హోంగార్డ్ మల్లేశంను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. జిల్లాలో 85 శాతం రికవరీ జిల్లాలో ఇప్పటివరకు 86 చైన్‌స్నాచింగ్ కేసులు నమోదు కాగా వీటిలో 85 శాతం వరకూ రికవరీ చేశామని ఎస్పీ జోయల్ డేవిస్ తెలిపారు. మిగతా కేసులను కూడా త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. -
తల్లా? ప్రియురాలా?...
బీజింగ్ : తల్లా? ప్రియురాలా? ఇదేదో సినిమా టైటిల్ కాదు. న్యాయవిద్య పరీక్షలు రాస్తున్న చైనీయులకు వింత ప్రశ్న ఎదురయింది. ఎప్పుడైనా అగ్నిప్రమాదం సంభవించి అందులో మీ తల్లి, ప్రియురాలు ఇరుక్కుంటే ఎవరిని రక్షిస్తారనే ప్రశ్న రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. విద్యార్థి న్యాయ నిపుణుడిగా పనికి వచ్చేదీ లేనిదీ నిర్థారించడానికి జాతీయ న్యాయ పరీక్షలో ఈ ప్రశ్న చేర్చామని అధికారులు వివరణ ఇచ్చారు. 'ప్రమాద సమయంలో ఒక వ్యక్తి తన తల్లిని రక్షించగలిగే సామర్థ్యం ఉండి కూడా ప్రియురాలిని రక్షించాడు. ఇది నేరం అవుతుందా?' అంటూ ప్రశ్న సాగింది. దీనికి రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చి జవాబు ఎంపిక చేయాలని సూచించారు. తాజాగా ఆ పరీక్షల జవాబులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అలాంటి సందర్భాల్లో తల్లిని మాత్రమే రక్షించాలని, ప్రియురాలిని రక్షిస్తే తప్పే అవుతుందని వివరణ ఇచ్చింది. కాగా ఈ ప్రశ్నపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. చైనా ప్రభుత్వ వాదనతో కొందరు ఏకీభవించగా, మరికొందరు విభేదించారు. మరికొందరు ముందుగా తల్లినే కాపాడతానని, అయితే తన ప్రియురాలు యంగ్‌గా ఉండటం వల్ల ఆమె ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మరికొందరు ...చట్టం, న్యాయం ముందు అందరూ సమానమే అని, ఇరువురు వ్యక్తులను వేర్వేరుగా చూడటం సరికాదని, తల్లిని రక్షిస్తే న్యాయం... అదే ప్రియురాలిని రక్షిస్తే అన్యాయమా? అని ప్రశ్నించారు. -
ప్రేమ పేరుతో నయవంచన
రాజమండ్రి క్రైమ్: ఓ కామాంధుడు బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వంచనకు పాల్పడ్డాడు. అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత వ్యభిచార గృహానికి విక్రయించబోయాడు. దీనిపై బాధిత బాలిక రాజమండ్రి త్రీటౌన్ పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం ఫిర్యాదు చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు... రాజమండ్రిలోని సీటీఆర్ఐ ప్రాంతానికి చెందిన బాలికకు ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై... అత్యాచారం చేసి వ్యభిచార కేంద్రానికి విక్రయించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకో లేదంటే జైలుకెళ్లు
హ్యూస్టన్: అమెరికాలో ఓ న్యాయమూర్తి అరుదైన తీర్పును ఇచ్చాడు. ముప్పై రోజుల్లో గర్ల్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకో లేదంటే.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించు అని తీర్పు చెప్పాడు. ఇంతకీ ఆ అబ్బాయి చేసిన నేరమేమిటో తెలుసా తన గర్ల్ ఫ్రెండ్ మాజీ బాయ్ ప్రెండ్ ను కొట్టడమే. జోస్టెన్ బండీ అనే టెక్సాస్‌కు చెందిన ఓ యువకుడు ఎలిజబెత్ జేన్స్ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. ఏదో కారణంతో ఆ అమ్మాయి మాజీ ప్రేమికుడితో గొడవపడి గాయాలపాలు చేశాడు. ఈ ఘటన గత ఫిబ్రవరిలో చోటుచేసుకుంది. దీంతో జేన్స్ కు కొంత కలతను కలిగింది. జోస్టెన్ పై కోపం తెప్పించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారిస్తున్న జడ్జి గత జూలైలో రెండు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చాడు. ఆ వెంటనే మరో అవకాశం ఇచ్చి అమ్మాయికి ఇష్టం అయితే 30 రోజుల్లో పెళ్లి చేసుకోవాలని ఆదేశించాడు. కాగా, ఇద్దరు అవగాహన లేని యువతీ యువకుల అభిప్రాయాలను అడిగి అనవసరంగా వారికి ముడిపెట్టారని ఆ న్యాయమూర్తిపై అమ్మాయి తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. గత నెల 30నే వారి వివాహం అయింది. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి నిరసన
- పెళ్లి చేసుకుంటానని చెప్పి పరారీ - కేసు నమోదు చేసిన పోలీసులు కురుపాం : నాలుగేళ్లగా ప్రేమించుకున్నారు. రెండేళ్లపాటు సహజీవనం కూడా చేశారు. పెళ్లి చేసుకుంటానన్న ప్రియుడు పత్తా లేకుండా పరారయ్యాడు. దీంతో ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందే నిరసన చేపట్టింది. పోలీసుల కథనం ప్రకారం పి.లేవిడి గ్రామానికి చెందిన పెద్దింటి లిజి (22), గుమ్మ గ్రామానికి చెందిన నిమ్మక చంద్రకాంత్ (23) నాలుగేళ్లగా ప్రేమిం చుకున్నారు. పార్వతీపురంలో వీళ్లిద్దరూ రెండేళ్ల పాటు సహ జీవనం కూడా చేశారు. డీఎస్సీ పరీక్షల అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన చంద్రకాంత్ మే నెలలో డీఎస్సీ పరీక్షకు వెళ్తున్నట్టు చెప్పి పరారైయ్యాడు. లిజి పలుమార్లు ఆయన జాడ కోసం తెలుసుకొనేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో నిమ్మక చంద్రకాంత్ స్వగ్రామం గుమ్మకు వెళ్లింది. ఆచూకీ తెలిపాలని అతని తల్లిదండ్రులు ప్రసాద్, శాంతిలను వేడుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఇంటిముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న ఎల్విన్ పేట సీఐ జి.వేణుగోపాల్ రెండు గ్రామాల పెద్దలను, నిరసన చేపట్టిన యువతిని పిలిపించి ఎల్విన్‌పేట ఎస్ఐ డి.సుధాకర్, నీలకంఠాపురం ఎస్ఐ ఫక్రుద్ధీన్లతో కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరికి ప్రియుడే కావాలని పెద్దింటి లిజి ఫిర్యాదు మేరకు నీలకంఠాపురం ఎస్ఐ షేక్ ఫక్రుద్రీన్ కేసు నమోదు చేశారు. -
కిసుక్కు
వ్రతం... ఆండాళు: పంతులుగారూ! ఇంట్లో సుఖశాంతుల కోసం ఏ వ్రతం చేయాలంటారు..? పంతులు: మౌనవ్రతం చేయి.. చాలు! అన్నీ మానేయ్! రోగి: డాక్టర్ గారూ! మందు, సిగరెట్లు, అమ్మాయిలతో తిరగడం మానేస్తే నేను ఎక్కువకాలం బతుకుతా నంటారా? డాక్టర్: అదేం కాదు, అన్నీ మానేస్తే ఎక్కువకాలం బతికినట్లు నీకనిపిస్తుందంతే! ఆనందం... వెంగళ్రావు: సార్ మా ఆవిడ కనిపించకుండా పోయింది.. పోస్ట్‌మాస్టర్: ఏమయ్యా! కళ్లు కనిపించడం లేదా? ఇది పోస్టాఫీసు.. పోయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చెయ్యి. వెంగళ్రావు: సారీ సార్..! ఆనందం తట్టుకోలేక ఏది పోస్టాఫీసో, ఏది పోలీస్స్టేషనో తెలుసుకోలేకపోయా... మా ఇంట్లోనే... డోసుబాబు తూలుకుంటూ వెళుతుంటే, పోలీసు అటకాయించాడు.. పోలీసు: ఎక్కడికెళ్తున్నావు? డోసుబాబు: తాగుడు వల్ల తలెత్తే అనర్థాల గురించి ఉపన్యాసం వినడానికి వెళ్తున్నా.. పోలీసు: ఇంత అర్ధరాత్రి వేళ ఉపన్యాసం ఇచ్చేదెవరు? డోసుబాబు: ఇంట్లో మా ఆవిడ! చాక్లెట్ ఇస్తే... లెక్కల టీచర్: చింటూ..! నీ దగ్గర 12 చాక్లెట్లు ఉన్నాయనుకో.. వాటిలో 5 ప్రియాకి, 3 అనితకి, 2 కవితకి ఇచ్చావనుకో.. ఇంకా నీకేం ఉంటాయి..? చింటూ: ముగ్గురు కొత్త గర్ల్‌ఫ్రెండ్స్ టీచర్..! -
దాక్కున్న ప్రియుడు... ప్రేయసి ధర్నా
గుంటూరు(తాడేపల్లి): 9 ఏళ్ల నుంచి ప్రేమపేరుతో తిరిగిన వ్యక్తి తీరా పెళ్లికి నిరాకరించడంతో ప్రేయసి ధర్నాకి దిగింది. తాడేపల్లికి చెందిన గడ్డిపోగు అనిల్ అదే గ్రామానికి చెందిన కుమారి 9 ఏళ్లు గా ప్రేమించుకుంటున్నారు. అయితే తీరా పెళ్లి అనే సరికి అనిల్ విముఖత వ్యక్తం చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిన అనిల్ పోలీసులకు దొరకకుండా తన అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఇది తెలిసిన యువతి తన కుటుంబ సభ్యులతో కలసి ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. -
ప్రేయసి ఆలస్యానికి కూతురు హత్య
ముంబై: ప్రేయసిపై కోపంతో కూతురును హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. అయితే, చంపబడిన పాప వారిద్దరికి జన్మించినమ్మాయే. విపుల్ మెహతా(39), నగ్మా షేక్(24) అనే ఇద్దరు కొన్నేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్నారు. వీరిద్దరికి పియా(5) అనే ఓ పాప జన్మించింది. గత కొంతకాలంగా నగ్మా షేక్ ఇంటికి ఆలస్యంగా వస్తోందని విపుల్ మెహతా గొడవపడుతున్నాడు. విపుల్ హెచ్చరించినప్పటికీ బుధవారం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిన నగ్మా గురువారం తెల్లవారే వరకు కూడా రాలేదు. అతడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తిరిగి సమాధానం ఇవ్వలేదు. దీంతో మధ్యపానం సేవించిన విపుల్ ఇంట్లో ఉన్న పాప పియా గొంతునులిమేశాడు. ఈ సమయంలో పాప గట్టిగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పారు. ఈలోపే విపుల్ కూడా పురుగుల మందు తాగాడు. నగ్మా వచ్చి పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయింది. విపుల్ ఆస్పత్రిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. -
గర్ల్‌ఫ్రెండ్‌తో వస్తే...గలాటా చేస్తావా?
ఇంజినీరింగ్ విద్యార్ధుల మధ్య గొడవ తాడేపల్లి రూరల్ (గుంటూరు): గర్ల్‌ఫ్రెండ్‌తో కాలేజికి వస్తే, గలాటా చేస్తావా..? అప్పటి నుంచి నీ కోసం వెదుకుతున్న ఇన్నాళ్లకు దొరికావురా.. అంటు శివ సినిమా తరహాలో చేతికి ఉన్న ఇనుప కడియంతో సహా విధ్యార్థిపై, మరో ఇంజినీరింగ్ విద్యార్థిపై దాడికి పాల్పడిన సంఘటన బుధవారం జరిగింది. తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం కోనేరు లక్ష్మయ్య విశ్వవిధ్యాలయంలో ఫరధీన్ బీటెక్ సెకెండీయర్ చదువుతుండగా, వంశీ థర్డ్ ఇయర్ బిటెక్ చదువుతున్నాడు.. ఈ మధ్య యూనివర్సిటిలో జరిగిన సంయక్ - 2015 కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంటుకు వంశీ ఫ్రోగ్రామ్ ఇన్ఛార్జీ అయితే, సంయక్ - 2015 లో పాల్గోనడానికి ఫర ధ్ధీన్, వేరే కాలేజికి చెందిన తన గర్ల్‌ప్రెండ్‌తో వచ్చాడు. ఇతరులు ఎవరికి ప్రవేశం లేదంటు ఫరీధ్ధీన్తో వచ్చిన అమ్మాయిని లోనికి రావద్దంటు వంశీ అడ్డుకుని, అనుమతి తీసుకురావాలని కోరాడు. ఇంతలో వంశీ స్నేహితులు ఆ అమ్మాయిని లోనికి అనుమతిచ్చారు. అయితే, తన గర్ల్‌ఫ్రెండ్‌ని అడ్డుకోవడం అవమానంగా గురైన ఫరధ్ధీన్ బుధవారం యూనివర్సిటికి వచ్చి, ఒంటరిగా ఉన్న వంశీ పై దాడి చేశాడు. గాయాలపాలైన బాధితుడు తాడేపల్లి పోలిస్స్టేషనులో ఫిర్యాధు చేశాడు. -
ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలి శవం ...
నల్గొండ: ప్రేమించిన అమ్మాయిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనతో ఆగ్రహంతో ఉన్న వారు ప్రేమికుడి ఇంటి ముందే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ సంఘటన శనివారం నల్గొండ జిల్లా చౌచటుప్పల్ మండలం తాళ్ల సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికల కథనం ప్రకారం.... తాళ్ల సింగారం గ్రామానికి చెందిన నల్ల వసంత(21), ఎర్రగాని రమేష్ (24)లు ఓ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇంటిలో తెలియడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఇరువురి కుటుంబాలు వీరి వివాహం చేసేందుకు అంగీకరించారు. అయితే ప్రేమికుడు రమేష్‌కు అన్న ఉన్నాడు. దాంతో అతడికి వివాహాం చేసిన తర్వాతే రమేష్ వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. కాగా శుక్రవారం వసంత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు రమేష్ వేధింపులు భరించలేకే చనిపోయిందని ఆరోపించారు. అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని శనివారం రమేష్ ఇంటి ముందే పూడ్చిపెట్టారు. -
యువతి పై కత్తితో దాడి
-
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ విషాదాంతం
⇒ పొన్నలూరులో పదో తరగతి విద్యార్థి హత్య కేసును పది రోజుల్లోపే ఛేదించిన పోలీసులు ⇒ ప్రియురాలి విషయంలోనే బాలుడిని అంతమొందించిన హంతకులు ⇒ పోలీసుల ఎదుట నేరం అంగీకరించిన యువకులు.. అరెస్టు ⇒ కేసు వివరాలు వెల్లడించిన కందుకూరు డీఎస్పీ శంకర్ కందుకూరు: ప్రేమ.. పెళ్లి.. అంటే సరిగ్గా అర్థం కూడా తెలియని వయసులో ఉన్న విద్యార్థి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ విషాదాంతమైంది. ప్రియురాలి ప్రేమను పొందేందుకు ఇద్దరి యువకుల మధ్య జరిగిన గొడవ చివరికి ఒకరి హత్యతో ముగిసిపోయింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒకరు మృత్యువాత పడితే.. మరోకరు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితులను బుధవారం అరెస్టు చేశారు. డీఎస్పీ శంకర్ కథనం ప్రకారం.. మంగపతివారిపాలేనికి చెందిన సాధు కేశవ్‌కుమార్(16) తల్లిదండ్రులు బెంగళూరులో బేల్దారి పనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేశవ్‌కుమార్ నాయనమ్మ, తాతల వద్ద ఉంటూ పొన్నలూరు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చవుతున్నాడు. పొన్నలూరుకే చెందిన సహ విద్యార్థినిని కేశవకుమార్ ప్రేమించాడు. వీరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పొన్నలూరులోనే ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న ఎస్కే అల్లాబకాష్ అనే యువకుడు కూడా అదే విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. అల్లాబకాష్ ప్రేమను బాలిక తిర స్కరించింది. విద్యార్థిని తనను ప్రేమించకపోవడానికి కేశవ్కుమారే కారణమని అల్లాబకాష్ పలుమార్లు బాలుడిని హెచ్చరించాడు. కేశవ్‌కుమార్ హత్యకు కుట్ర పన్నిన అల్లాబకాష్ స్నేహితుల సాయం కోరాడు. గత 15వ తేదీన ఇంటి నుంచి స్నేహితునితో కలిసి కేశవ్‌కుమార్ పాఠశాలకు బయల్దేరాడు. పాఠశాలకు వెళ్లకుండా అదే రోజు కొండపిలో జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఒంటరిగా వెళ్లాడు. తిరిగి బహిరంగసభ నుంచి సాయంత్రం పొన్నలూరు చేరుకున్నాడు. అక్కడి నుంచి మంగపతివారిపాలేనికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుతుండగా అల్లాబకాష్తో పాటు ఆయన స్నేహితులు ఎస్కే మస్తాన్‌వలి, నాలి బాలకృష్ణలు ఆటోలో కేశవ్కుమార్ను వెంబడించారు. నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయిని వదిలేయాలని మళ్లీ బెదిరించారు. చివరకు ముగ్గురు కలిసి తీవ్రంగా కొట్టారు. కేశవ్‌కుమార్ గట్టిగా అరవడంతో ఎవరైనా వస్తారేమోననే అనుమానంతో నోటిలో గుడ్డలు పెట్టి మరింత బలంగా కొట్టారు. స్పృహ తప్పడంతో మోసుకుంటూ సమీపంలో ఉన్న గొరిసలేరులో ఉన్న నీటి కుంట వద్దకు తీసుకెళ్లారు. అనంతరం అక్కడే హత్య చేసి మృతదేహానికి రాళ్లు కట్టి కుంటలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి.. 15వ తేదీ నుంచి కేశవ్‌కుమార్ కనిపించకపోవడంతో బెంగళూరు నుంచి వచ్చిన తల్లిదండ్రులు పలుచోట్ల విచారించారు. చివ రకు 19వ తేదీన పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు కేసుతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగుచూసింది. హంతకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో కేశవ్కుమార్ని తామే హత్య చేసినట్లు అంగీకరించినట్లు డీఎస్పీ శంకర్ తెలిపారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేశామని, అలాగే మృతుడు దళితుడు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామన్నారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ చెప్పారు. కేసును నాలుగు రోజుల్లో ఛేదించిన సీఐ ఎం.లక్ష్మణ్, కందుకూరు పట్టణ, పొన్నలూరు ఎస్సైలు వైవీ రమణయ్య, కె.ఆరోగ్యరాజ్, కానిస్టేబుళ్లు మహ్మద్, మాధవ, కిశోర్, నాగార్జున, మల్లీ, హోంగార్డులు చెన్నయ్య, అంజయ్యలను డీఎస్పీ అభినంధించారు. వీరికి రివార్డు కోసం ఎస్పీకి నివేదిక పంపనున్నట్లు వివరించారు. -
చెంప ఛెళ్..!
చూస్తుంటే ముందు వివాదం పుట్టి... తరువాత రాఖీసావంత్ పుట్టినట్టుంది. ఎందుకంటే ఈ అమ్మడికి ఎప్పుడూ ఎవరో ఒకరితో పేచీనే. లేటెస్ట్గా ఈ తార స్నేహితురాలు మనీషా కుమారి... దర్శకుడు సచీంద్ర శర్మను స్టేజిపైనే చెంప ఛెళ్లుమనిపించింది. దీనికి రియాక్షన్‌గా సచీంద్ర కూడా ఆమె గూబ గుయ్యిమనిపించాడు. ఈ ఎపిసోడ్లో స్టేజీపైనే ఉన్న రాఖీ మాత్రం మిత్రురాలినే వెనకేసుకొచ్చింది. మనీషా ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్లో సచీంద్రపై ఫిర్యాదు చేసింది. తన సినిమాలో చాన్స్ కావాలంటే కాంప్రమైజ్ కమ్మంటున్నాడనేది ఫిర్యాదు సారాంశం. సచీంద్ర సతీమణి కూడా ఎదురు కంప్లయింట్ చేసింది. మొత్తానికి రాఖీ మరోసారి వివాదానికి కేరాఫ్ అయిందన్నమాట! -
ప్రేమ విఫలమై.. జీవితంపై విరక్తి చెంది..
- రైలు కిందపడి ప్రేమికుడి ఆత్మహత్య - విషయం తెలిసి విషం మింగిన ప్రియురాలు - బాధితురాలి పరిస్థితి విషమం జనగామ రూరల్ :జీవితంపై విరక్తి చెందిన ఓ ప్రేమ జంట ఘోరానికి ఒడిగట్టింది. ప్రేమికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోగా... ప్రేమికురాలు విషగుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన జనగామ పట్టణంలో మంగళవారం జరిగింది. జనగామ పట్టణంలోని గుండ్లగడ్డకు చెందిన ఎల్లస్వామి, లలిత దంపతుల కుమారుడు మామిడిపల్లి సాగర్ (25) స్థానిక కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. సాగర్‌తోపాటు బీటెక్ పూర్తి చేసిన ధర్మకంచకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి వరకు వచ్చిన క్రమంలో మంగళవారం ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్థం విషయమై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంలో తలెత్తిన విభేదాల కారణంగా సాగర్ జనగామ-యశ్వాంతపూర్ మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. అయితే మృతుడు సాగర్ వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీనిపై రైల్వే ఎస్సై సీహెచ్.ఎల్లయ్యను సంప్రదించగా... సూసైడ్ నోట్లో ప్రేమ మాట నిజమేనని..పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికురాలు విషగుళికలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
నగర శివార్లలో ఉన్మాది ఘాతుకం
-
ప్రియురాలిపై యువకుడి యాసిడ్ దాడి
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో ఓ ప్రేమికుడు తన ప్రియురాలిపై యాసిడ్ దాడి చేశాడు. పెళ్లి చేసుకుందామని ప్రియుడు ప్రతిపాదించడం, ఆమె పదే పదే జాప్యం చేస్తుండటంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన హంస అనే అమ్మాయికి.. కడెం మండలానికి చెందిన మునీర్ అనే యువకుడితో 2009 సంవత్సరం నుంచి పరిచయం ఉంది. అతడు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మునీర్ నిర్మల్ పట్టణానికి వచ్చాడు. హంసను బస్టాండు సమీపానికి పిలిచాడు. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో ఆగ్రహానికి గురైన మునీర్.. తన బ్యాగులో పెట్టుకుని తెచ్చిన యాసిడ్ సీసా తీసి ఆమెపై పోశాడు. తీవ్రగాయాలకు గురైన హంసను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. -
టు బి ఆర్ నాట్ టు బీ
నిరుద్యోగి, పైగా గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ వీటన్నింటి నేపథ్యంలో ఆత్మహత్యకు సిద్ధమవుతాడో వ్యక్తి. అయితే విషం తాగి చనిపోవాలో లేక ఉరివేసుకుని చనిపోవాలో తెలియక సతమతమవడమే కాక సరైన ప్లేస్ దొరకకపోవడం, అనేక అడ్డంకులు ఎదుర్కోవడం నాటకాభిమానులకు సరదాను పంచాయి. ఉడాన్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సమర్పించిన హిందీ హాస్య నాటిక ‘టు బి ఆర్ నాట్ టు బీ’ లోని సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి. డాక్టర్ వసంత్ సబ్నవీస్ మరాఠీలో రచించిన మాతృకకు హిందీ భాషలోకి అనువదించిన అమృత ఘరీపూరికర్...సందర్భోచిత చతురోక్తులతో ‘ప్లే’ను రక్తికట్టించారు. సంజిత్రావు, వినాయక రైఖేల్కర్, సురేష్‌కుమార్, పూనమ్ చంద న్ గోలెచా, సుహాస్ బార్వె, ఏక్తా పి రాచందాని, సిద్ధేష్, ప్రణవ అశిష్... నటించారు. సౌరభ్ ఘరీపూరికర్ దర్శకత్వం వహించారు.