కొత్తూరు: వివాహం చేసుకోవాలని కోరినందునే ప్రియురాలు గులిమి సుమతిని హతమార్చినట్లు భామిని మండలం ఘనసరకు చెందిన ఎరుకమజ్జి శంకరరావు స్థానిక సీఐ కాతం అశోక్‌కుమార్ వద్ద వెల్లడించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్య చేసిన శంకరరావు సంఘటన జరిగిన వెంటనే పరారయ్యాడు. చివరకు గ్రామానికి చెందిన వీఆర్వో వద్దకు గురువారం చేరుకొని తానే హత్య చేసినట్లు చెప్పి కొత్తూరు సీఐ వద్దకు వచ్చి లొంగిపోయాడు. ఈ మేరకు నిందితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నా యి... గ్రహణంమొర్రి వికలాంగురాలైన భామిని మండలం ఘనసరకు చెందిన గొలిమి సుమతి (21)తో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ కలాసీగా పనిచేస్తున్న ఎరుకుమజ్జి శంకరరావుతో రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైంది.
ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు కొనసాగుతున్నాయి. వివాహం చేసుకోవాలని సుమతి కోరగా, ఆమెను నమ్మించి రెండు నెలల నుంచి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ రాత్రి సుమతిని శారీరకంగా అనుభవించిన తరువాత, తనను వివాహం చేసుకోవాలని గట్టిగా ఒత్తిడి తేవడంతో ఆమె మెడకు గుడ్డ చుట్టి హత్య చేసినట్లు సీఐ ముందు శంకర్ తెలిపారు. నేరం అంగీకరించినందున శంకరరావును గురువారం అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌పై పాతపట్నం సబ్‌జైల్‌కు తరలించినట్లు తెలిపారు.
ప్రియుడే హంతకుడు!
Published Thu, Jan 7 2016 11:53 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement