circle office
-
అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ సర్కిల్ కార్యకలాపాలు
విజయవాడలో సర్కిల్ ప్రధాన కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు అన్నవరం : వచ్చే అక్టోబర్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ విజయవాడ కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల వినియోగదారులకు సేవలందించనుందని ఆ సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ దామోదర్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రెండు సర్కిళ్లుగా విడిపోయినా హైదరాబాద్‌లోని ఒకే కార్యాలయం నుంచి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఏపీ టెలికం సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి సిబ్బంది సుముఖంగా ఉన్నారా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎగ్జిక్యూటివ్ అధికారుల వరకూ ఇబ్బంది లేదన్నారు. వారికి బదిలీ పరిధి జిల్లా మాత్రమే అవడం వలన ఈ ఇబ్బంది ఉందన్నారు. అయితే నిబంధనలు మార్చి అయినా సిబ్బందిని విజయవాడ తరలించి వి««దlులు నిర్వహించేలా చేస్తామని తెలిపారు. త్రీజీ, ఫోర్జీ డేటా అప్‌గ్రేడ్ కోసం అవసరమైన చోట ‘హాట్‌స్పాట్’లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాట్‌స్పాట్‌కు వంద మీటర్ల రేడియస్‌లో సిగ్నల్స్ త్వరగా అందుతాయన్నారు. ఆయన వెంట టెలికాం జీఎం(విశాఖ) శ్రీనివాస్, డీఈ ఎస్వి రాజేంద్ర కుమార్, జేటీఓ వెంకటరమణ రాజు తదితరులు ఉన్నారు. -

సార్! టోపీ తీసుకెళ్లండి!
కుత్బుల్లాపూర్: భారమనుకున్నారో... బరువు అనుకున్నారో.... తలపై ఉన్న టోపీని తీసి పక్కన పెట్టిన ఓ పోలీసు అధికారి దానిని అక్కడే వదిలి వెళ్లాడు. 15 రోజులైనా దానిని తీసుకెళ్లకపోవడంతో.. తలపై ఉండాల్సిన టోపీపైనే ధ్యాస లేని ఆయన విధులపై ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడో అనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన పోలీసు అధికారి తన టోపీని మర్చిపోయారు. సదరు అధికారి వచ్చి తీసుకెళ్తాడనే ఉద్దేశంతో సర్కిల్ సిబ్బంది అందరికీ కనబడేలా ప్రధాన గేటు పక్కనే ఉన్న టేబుల్‌పై పెట్టారు. ఇప్పటి వరకూ ఆయన తీసుకెళ్లలేదు. బాధ్యత గల అధికారి అయితే తనను తీసుకెళ్తాడన్నట్టు ఆ టోపీ ఎదురు చూస్తోంది. -
ప్రియుడే హంతకుడు!
కొత్తూరు: వివాహం చేసుకోవాలని కోరినందునే ప్రియురాలు గులిమి సుమతిని హతమార్చినట్లు భామిని మండలం ఘనసరకు చెందిన ఎరుకమజ్జి శంకరరావు స్థానిక సీఐ కాతం అశోక్‌కుమార్ వద్ద వెల్లడించారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్య చేసిన శంకరరావు సంఘటన జరిగిన వెంటనే పరారయ్యాడు. చివరకు గ్రామానికి చెందిన వీఆర్వో వద్దకు గురువారం చేరుకొని తానే హత్య చేసినట్లు చెప్పి కొత్తూరు సీఐ వద్దకు వచ్చి లొంగిపోయాడు. ఈ మేరకు నిందితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నా యి... గ్రహణంమొర్రి వికలాంగురాలైన భామిని మండలం ఘనసరకు చెందిన గొలిమి సుమతి (21)తో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ కలాసీగా పనిచేస్తున్న ఎరుకుమజ్జి శంకరరావుతో రెండు నెలల క్రితం సెల్‌ఫోన్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు కొనసాగుతున్నాయి. వివాహం చేసుకోవాలని సుమతి కోరగా, ఆమెను నమ్మించి రెండు నెలల నుంచి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీ రాత్రి సుమతిని శారీరకంగా అనుభవించిన తరువాత, తనను వివాహం చేసుకోవాలని గట్టిగా ఒత్తిడి తేవడంతో ఆమె మెడకు గుడ్డ చుట్టి హత్య చేసినట్లు సీఐ ముందు శంకర్ తెలిపారు. నేరం అంగీకరించినందున శంకరరావును గురువారం అరెస్టు చేసి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌పై పాతపట్నం సబ్‌జైల్‌కు తరలించినట్లు తెలిపారు. -
ఎన్నెస్పీ సర్కిల్ కార్యాలయాలకు గ్రీన్‌సిగ్నల్!?
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడుమ కాల్వల నిర్మాణ సమయంలో నిర్మించిన కార్యాలయాలు శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాల నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర్ కాల్వల ఆధునికీకరణలో భాగంగా నూతన కార్యాలయాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నెస్పీ పరిధిలో నాలుగు సర్కిల్ కార్యాలయాల నిర్మాణానికి కృష్ణాజిల్లా లింగంగుంట్ల ఎస్ఈ కార్యాలయంలో నూతన తరహాలో డిజైన్లు రూపొందిస్తున్నారు. డిసెంబర్లో వీటి నిర్మాణానికి టెండర్లు నిర్వహించి ఏడాదిలోపు నూతన భవనాలు నిర్మించేందుకు శరవేగంగా కసరత్తు చేస్తున్నారు. ఈ నాలుగు సర్కిల్ కార్యాలయాల నిర్మాణానికి రూ. 35 కోట్లు వెచ్చించనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఖమ్మంలోని టేకులపల్లి సర్కిల్ కార్యాలయంతో పాటు నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం, లింగంగుంట్ల, ఒంగోలు సర్కిల్ కార్యాలయాలను నిర్మించనున్నారు. ఎస్ఈ కార్యాలయాలు నిర్మించే క్యాంపస్‌లోనే డివిజన్, సబ్ డివిజనల్ కార్యాలయాలు కూడా నిర్మించి, మౌలిక వసతులు కల్పిస్తారన్నారు. సాగర్ కాల్వల ఆధునికీకరణ కోసం ప్రపంచబ్యాంక్ నుంచి విడుదలైన 4,444 కోట్ల నిధుల్లో నుంచే కార్యాలయాల నిర్మాణానికి వెచ్చిస్తారు. కాల్వల ఆధునికీకరణలో భాగంగానే కార్యాలయాలను కూడా నిర్మించుకుంటామని అప్పట్లో ప్రపంచబ్యాంకుకు అంచనాలు పంపి అనుమతులు పొందామని సంబంధిత అధికారి తెలిపారు. ఖమ్మంలో ఎనిమిది ఎకరాల్లో కార్యాలయాల నిర్మాణం కాల్వల తవ్వకాల సమయంలో ఖమ్మంలోని టేకులపల్లి సర్కిల్ కార్యాలయాన్ని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్మించారు. ప్రస్తుతం ఆ భవన సముదాయం శిథిలావస్థకు చేరింది. అయితే ఈ భవన సముదాయాన్ని ఇల్లెందు క్రాస్‌రోడ్‌లోని డిగ్రీ కళాశాల మైదానంలో కాకుండా ఎన్నెస్పీ క్యాంప్‌లోని 8 ఎకరాల స్థలంలో నిర్మించేందుకు అనుమతులు కోరుతూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 94 ఎకరాల విస్తీర్ణం ఉన్న క్యాంప్ భూమిలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ అవసరాలకు 44 ఎకరాల వరకు కేటాయించారు. మిగిలిన 50 ఎకరాల స్థలంలో క్వార్టర్లు ఉన్నాయి. వీటిలో మంచిగా ఉన్న క్వార్టర్లను వదిలేసి శిథిలమైన క్వార్టర్ల స్థానంలో సర్కిల్ కార్యాలయాలను నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే క్యాంప్‌లో రెండుచోట్ల స్థలాలను పరిశీలించారు. మూడురోడ్ల కూడలిలోని స్థలాన్ని గుర్తించారు. టెండర్లు పూర్తవగానే పనులు ప్రారంభిస్తామని ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడు తెలిపారు.