సార్! టోపీ తీసుకెళ్లండి! | Sir! Bring hat! | Sakshi
Sakshi News home page

సార్! టోపీ తీసుకెళ్లండి!

Published Tue, Feb 9 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM

సార్! టోపీ తీసుకెళ్లండి!

సార్! టోపీ తీసుకెళ్లండి!

కుత్బుల్లాపూర్: భారమనుకున్నారో... బరువు అనుకున్నారో.... తలపై ఉన్న టోపీని తీసి పక్కన పెట్టిన ఓ పోలీసు అధికారి దానిని అక్కడే వదిలి వెళ్లాడు. 15 రోజులైనా దానిని తీసుకెళ్లకపోవడంతో.. తలపై ఉండాల్సిన టోపీపైనే ధ్యాస లేని ఆయన విధులపై ఎంత నిర్లక్ష్యంగా ఉంటాడో అనే విమర్శలు వస్తున్నాయి.  గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన పోలీసు అధికారి తన టోపీని మర్చిపోయారు.

సదరు అధికారి వచ్చి తీసుకెళ్తాడనే ఉద్దేశంతో సర్కిల్ సిబ్బంది అందరికీ కనబడేలా ప్రధాన గేటు పక్కనే ఉన్న టేబుల్‌పై పెట్టారు. ఇప్పటి వరకూ ఆయన తీసుకెళ్లలేదు. బాధ్యత గల అధికారి అయితే తనను తీసుకెళ్తాడన్నట్టు ఆ టోపీ ఎదురు చూస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement