హిజాబ్‌ సర్క్యులర్‌పై సుప్రీం స్టే | Supreme Court on Friday stayed a Mumbai colleges directions that banned hijab, burqa, cap and naqab on the campus | Sakshi
Sakshi News home page

హిజాబ్‌ సర్క్యులర్‌పై సుప్రీం స్టే

Published Sat, Aug 10 2024 5:18 AM | Last Updated on Sat, Aug 10 2024 7:07 AM

Supreme Court on Friday stayed a Mumbai colleges directions that banned hijab, burqa, cap and naqab on the campus

న్యూఢిల్లీ: తాము ధరించే దుస్తులను ఎంచుకొనే స్వేచ్ఛ విద్యారి్థనులకు ఉండాలని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. ఎలాంటి దుస్తులు ధరించాలో వారు నిర్ణయించుకోవచ్చని ఉద్ఘాటించింది. తమ విద్యా సంస్థ ప్రాంగణంలో విద్యార్థినులు హిజాబ్, బుర్ఖా, టోపీ, నఖాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. 

కాలేజీ సర్క్యులర్‌ను సమరి్థస్తూ బాంబే హైకోర్టు జూన్‌ 26న ఇచి్చన తీర్పును సవాలు చేస్తూ జైనాబ్‌ అబ్దుల్‌ ఖయ్యూంతోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీని నిర్వహిస్తున్న చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషన్‌ సొసైటీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలేజీ క్యాంపస్‌లో బొట్టుబిళ్ల, తిలకం ధరించడం కూడా నిషేధిస్తారా? అని ప్రశ్నించింది. హిజాబ్, బుర్ఖా వంటివి ధరించకుండా ఆంక్షలు విధిస్తే విద్యారి్థనుల సాధికారత ఎలా సాధ్యమని నిలదీసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement