Burkha
-
హిజాబ్ సర్క్యులర్‌పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: తాము ధరించే దుస్తులను ఎంచుకొనే స్వేచ్ఛ విద్యారి్థనులకు ఉండాలని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. ఎలాంటి దుస్తులు ధరించాలో వారు నిర్ణయించుకోవచ్చని ఉద్ఘాటించింది. తమ విద్యా సంస్థ ప్రాంగణంలో విద్యార్థినులు హిజాబ్, బుర్ఖా, టోపీ, నఖాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ముంబైలోని ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీ జారీ చేసిన సర్క్యులర్‌పై న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. కాలేజీ సర్క్యులర్‌ను సమరి్థస్తూ బాంబే హైకోర్టు జూన్ 26న ఇచి్చన తీర్పును సవాలు చేస్తూ జైనాబ్ అబ్దుల్ ఖయ్యూంతోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఎన్జీ ఆచార్య, డీకే మరాఠీ కాలేజీని నిర్వహిస్తున్న చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కాలేజీ క్యాంపస్‌లో బొట్టుబిళ్ల, తిలకం ధరించడం కూడా నిషేధిస్తారా? అని ప్రశ్నించింది. హిజాబ్, బుర్ఖా వంటివి ధరించకుండా ఆంక్షలు విధిస్తే విద్యారి్థనుల సాధికారత ఎలా సాధ్యమని నిలదీసింది. -
హవ్వా! మహిళలకు ఉచిత ప్రయాణం అనగానే.. బుర్ఖా ధరించి..
బెంగుళూరు: కర్ణాటకలో ప్రభుత్వం ఇటీవల మహిళలకు శక్తి యోజన కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసం ఒక హిందూ వ్యక్తి వేషం మార్చి బుర్ఖా ధరించి పట్టుబడ్డాడు. శక్తి యోజన పథకంలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటును కల్పించింది. అయితే దీన్ని అవకాశంగా చేసుకుని ధార్వాడ్ జిల్లాలో మత్తపాటి వీరభద్రయ్య అనే వ్యక్తి కొంచెం అటు ఇటుగా కటౌట్ మార్చుకుని బుర్ఖా ధరించి సాహసానికి తెగించాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బస్ స్టాప్ లోకి వచ్చి కూర్చున్నాడు. అతడిని చూడగానే అక్కడి వారికి అనుమానం రావడంతో ప్రశ్నలు మీద ప్రశ్నలు సంధించారు. వారడిగిన ఏ ప్రశ్నకీ అతని వద్ద సమాధానం లేదు. బిక్షాటన చేసుకునేందుకే బుర్ఖా ధరించానని వీరభద్రయ్య చెప్పినా కూడా ఆ సమాధానానికి అక్కడివారు సంతృప్తి చెందలేదు. దీంతో బలవంతంగా ముసుగు తీశాక అసలు బాగోతం బయటపడింది. పైగా అతడి వద్ద మహిళ పేరుతో ఒక ఆధార్ కార్డు కూడా ఉండడం విశేషం. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: మణిపూర్ అల్లర్లు: పాఠశాల ఎదుటే మహిళ దారుణ హత్య -
వైరల్ వీడియో : బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
-
బురఖా ధరించి సినిమా వీక్షించిన సాయిపల్లవి
-
బుర్ఖాలో సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన హీరోయిన్
Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే తాజాగా ఆడియెన్స్ రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్లో సందడి చేసింది. బుధవారం హైదరాబాద్ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కృతిశెట్టి మారో హీరోయిన్గా నటించింది. -
బురఖా బ్యాన్పై సేన డిమాండ్ : కేంద్ర మంత్రి నో..
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బురఖాను నిషేధించాలన్న శివసేన డిమాండ్‌ను కేంద్ర మంత్రి రాందాస్ అథవలే తోసిపుచ్చారు. బురఖా ధరించే మహిళలంతా ఉగ్రవాదులు కారని, వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ బురఖా ధరించే హక్కు వారికుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వారిలో ఎవరినైనా ఉగ్రవాదులుగా గుర్తిస్తే వారి బురఖాలను తొలగించాలని వ్యాఖ్యానించారు. కాగా దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీలంక తరహాలో బహిరంగ ప్రదేశాల్లో బురఖా వాడకాన్ని నిషేధించాలని శివసేన పత్రిక సామ్నా డిమాండ్ చేసింది. గతంలో బీజేపీ మొగ్గుచూపిన ప్రతిపాదనను రావణ రాజ్యం (శ్రీలంక)లో అమలు చేస్తున్నారని దీన్ని అయోధ్య (భారత్)లో ఎప్పుడు అమలు చేస్తారని తాము ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నామని సామ్నాలో శివసేన పేర్కొంది. భద్రతా దళాలు ఎవరినైనా గుర్తించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిగమించేందుకు బురఖాలను తొలగించడం అనివార్యమని సూచించింది. ముఖానికి మాస్కులు, బురఖాలు వేసుకోవడం దేశ భద్రతకు పెను ముప్పని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మరోవైపు శివసేన డిమాండ్‌ను షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వాసిం రజ్వీ సైతం వ్యతిరేకించారు. ఇది బాధ్యతారాహిత్య, రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్ అని అభివర్ణించారు. బురఖా ధరించాలా లేదా అనేది ముస్లిం మహిళల నిర్ణయానికే వదిలివేయాలని అన్నారు. -
శ్రీలంక సంచలన నిర్ణయం; వాళ్లూ మనుషులే!
కొలంబో : శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో బుర్ఖాలతో సహా ముఖాన్ని కవర్ చేసుకునేందుకు ఉపయోగించే దుస్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఈమేరకు ఆదేశాలు జారీచేయగా.. సోమవారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సంప్రదాయవాదులు ఈ విషయాన్ని తప్పుపడుతుండగా...బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ మాత్రం స్వాగతించారు. ఈ మేరకు... ‘ బాంబు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలకం బుర్ఖాలను నిషేధించింది. చాలా మంచి నిర్ణయం. దీని ద్వారా మహిళలు తాము కూడా మనుషులమేనని భావిస్తారు. మొబైల్ ప్రిజన్(ముసుగులో ఉన్న కారణంగా ఎక్కడ ఉన్నా జైలు ఉన్నట్లుగా అనే ఉద్దేశంలో) నుంచి బయపడేందుకు వారు’ అర్హులు అంటూ తస్లిమా ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ‘ మొబైల్ ప్రిజన్ అనే ఒకే ఒక్కమాటతో ఈ విషయాన్ని అత్యద్భుతంగా వర్ణించారు అని కొందరు కామెంట్ చేస్తూ.. భారత్‌తో పాటు పలు ముస్లిం దేశాలలో ఇలాంటి నిబంధన రావాలని కోరుకుంటుండగా.. మరికొందరు మాత్రం.. ‘అందరూ మీ లాగే బుర్ఖాను జైలులా భావించారు. దయచేసి మీ అభిప్రాయాన్ని ముస్లిం మహిళలందరికీ ఆపాదించకండి. కేవలం ముస్లిం కమ్యూనిటీలోనే కాదు హిందూ మతంలో కూడా రాజస్తాన్ వంటి చోట్ల పర్దా పద్ధతి ఉంది’ అంటూ తస్లిమాను ట్రోల్ చేస్తున్నారు. Sri Lanka banned burqas for 'public protection' after bomb attacks. Good decision. It will help women feel like human beings. They deserve to have the right to not live in a mobile prison. — taslima nasreen (@taslimanasreen) April 29, 2019 -
అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి..!
లైంగిక వివక్షపై ఒక యువతి నెట్లో విసిరిన వ్యంగ్యాస్త్రం నవ్వుల పువ్వుల్ని పూయించడమే కాదు.. సమాజంలోని అసమానతలపై ఆలోచననూ రేకెత్తిస్తోంది. ‘‘అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి! పెళ్లయిన కొత్తలోనే భర్తను కొంగుకు ముడేసుకుందే. ఓ ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. అయ్యో అయ్యో భర్తకే ముసుగేస్తుందా! పాకిస్తాన్లో ఉండి కూడా పితృస్వామ్య వ్యవస్థ గురించి ఇలాంటి వెటకారాలు చేస్తుందా. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాల్సిందే’’.. అంటూ కొంతమంది సంప్రదాయ వాదులు బుగ్గలు నొక్కుకున్నా పర్లేదు నా తీరు మార్చుకోను అంటున్నారు ఈ ఫొటోలో కన్పిస్తున్న ఈ వివాహిత! పైగా ‘‘మీలాంటి వాళ్ల కోసమే.. ఇలాంటి పోస్టు పెట్టాను. ఇప్పటికైనా ఆడ, మగ అంతా సమానమని గుర్తిస్తే ఇలాంటి సన్నాయినొక్కులు నొక్కాల్సిన అవసరం రాదంటూ’’ ఘాటుగా కౌంటర్ కూడా ఇచ్చారు. విమర్శలు లెక్కచేయక తన కొత్త జీవితానికి సంబంధించిన విశేషాలను జోడిస్తూ ‘న్యూలీవెడ్స్’ అనే ఇన్‌స్టా అకౌంట్లో తన భర్తతో కలిసి దిగిన ఈ ఫొటోను పోస్ట్ చేసి అనాదిగా కొనసాగుతున్న లింగ వివక్షను ఇన్‌డైరెక్టుగా ఎత్తిచూపారు. ‘‘ఈయనే అందమైన నా శ్రీవారు. కానీ మా ఆయన అందమైన ముఖాన్ని మీరు చూడలేరు. నా కోసం ఆయన తన అందాన్ని ఇలా దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందం, సాధించిన విజయాలు, కలలు ఇలా ఒక్కటేమిటి తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి నేనే హక్కుదారును కదా. తనకు దిష్టి తగలకూడదనే ఈ పాడు ప్రపంచానికి దూరంగా.. తననెప్పుడూ ఇంట్లోనే ఉండమంటాను. అయితే నాతో పాటు అప్పుడప్పుడూ బయటికి తీసుకువెళ్తా. నిన్న రాత్రి తనను డిన్నర్‌కు తీసుకువెళ్లాను. అక్కడ స్టెరాయిడ్ ఫ్రీ చికెన్ మాత్రమే ఆర్డర్ చేశాం. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉంది. ఒకవేళ ఇలాంటి ఆహారం తినడం వల్ల సంతాన భాగ్యానికి భంగం కలిగితే ఎలా? అసలు ఆయన ఉన్నదే నన్ను తల్లిని చేయడానికి. పిల్లల్ని కనివ్వడానికి. అందుకే ఏం తినాలో ఏం తినకూడదో నేనే నిర్ణయిస్తా. తనను బయటికి తీసుకువెళ్లినపుడు ఇలా దాచేస్తా (ముసుగు వెనుక). ఒకవేళ ఆయన అందానికి ముగ్ధులై ఎవరైనా వేధిస్తే? వేధించారే అనుకోండి అప్పుడు వాళ్లను ఎవరో శిక్షిస్తారని సరిపెట్టుకుంటా’ అంటూ ఓ పాకిస్తానీ వివాహిత ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన భర్తకు బుర్ఖా వేసి.. అతడితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేసిన ఈ మహిళ లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతా నా ఇష్టం ‘‘వేరే వాళ్లకే నేను నియమాలు విధిస్తా. నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఎలాంటి దుస్తులైనా సరే వేసుకుని తిరుగుతా. ఎందుకుంటే నేను ఆడదాన్ని. ఇతర ఆడవాళ్ల గురించి పట్టించుకోను. ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా, ఏమైనా అన్నా తిరిగి మాట్లాడను. అలా చేస్తే నేను పిరికిదాన్నని ఈ లోకం భావిస్తుంది. ఆడవాళ్లు బలహీనంగా ఉండకూడదు కదా. నేను మరీ అంత లింగ వివక్ష చూపనులెండి. మా ఆయన డ్రైవింగ్ చేసేందుకు అనుమతిస్తా. ఉద్యోగానికి పంపిస్తా. అయితే అక్కడ ఆయన ఎవరితోనైనా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. నా భర్తను కాపాడుకోవాలంటే కేవలం ఇలా చేస్తే చాలు’’ అంటూ సదరు వివాహిత పితృస్వామ్య వ్యవస్థ తీరును ఎండగట్టారు. సెటైర్లు.. సెల్యూట్లు ‘‘మీ భర్త ఉద్యోగం చేయడానికి అనుమతించకండి. ఇలా చెప్పడం వెనుక ఏ లాజిక్ లేదు. కానీ మీరు మగవారిని అలా ఒంటరిగా బయటకు పంపకండి. ఇంకో విషయం మీ భర్త ముఖం ముసుగులోంచి నుంచి కూడా కనిపిస్తోంది. సరిగ్గా కవర్ చేసుకోమని చెప్పండి’ అంటూ కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా మరికొంత మంది నెటిజన్లు మాత్రం ‘ఇదేం విడ్డూరం’ అంటూ వెటకారపు కామెంట్లు చేస్తున్నారు. ‘అయినా ఒక భర్త తన భార్యను ఏవిధంగా ‘ఉండాలని’ భావిస్తాడో అదే విధంగా భార్య కూడా భావించడంలో తప్పేం ఉంది. ఆడ, మగ ఇద్దరూ మనుషులే కదా. మీరు చెప్పింది 100 శాతం నిజం. సెల్యూట్ మేడమ్’ అని అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్ డెస్క్ -
ముద్దు ఎంత పని చేసింది...
చెన్నై : ప్రియురాలు సవాల్ విసిరింది. అలాంటి ఇలాంటి ఛాలెంజ్ కాదు. తాను చెప్పినట్లు వస్తే ముద్దు ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంకేముంది... ప్రేయసి ముద్దు కోసం ప్రియుడు సై అన్నాడు. అమ్మడు చెప్పినట్లే సిద్ధమై అతగాడు ఆశగా ముద్దు కోసం వచ్చాడు. తీరా అయ్యగారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్లు... ఆ యువకుడు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపెట్టాడు. ఈ సందర్భంగా చెన్నైలోని రాయపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని పట్టాభిరామ్ తండురై గ్రామం పల్లవీధికి చెందిన శక్తివేల్ (22) అన్నాసాలైలోని ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ట్రస్ట్ తరఫున ఉద్యోగ శిక్షణలో ఉండగా అక్కడే ఉన్న ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆమెను ప్రేమికుల రోజున ముద్దు ఇవ్వమని అడగగా అందుకు అంగీకరించలేదు. ముద్దు కావాలంటే బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్ వరకు రావాలని పందెం కాసింది. అలా చేస్తే ముద్దు ఇస్తానని చెప్పడంతో శక్తివేల్ బురఖా వేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చిన అతడు.. ఆ తర్వాత ఆమెతో మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అయితే శక్తివేలు నడకతో పాటు, కాళ్లకు మగవాళ్ల ధరించే స్లిప్పర్స్, వీటితో పాటు అయ్యగారు వ్యవహారం తేడాగా ఉండటంతో... అనుమానం వచ్చిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. పోలీసులు శక్తివేల్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. -
బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి...అరెస్ట్
పనాజీ : బురఖా ధరించి మహిళల టాయ్లెట్లోకి వెళ్లిన ఓ వ్యక్తి అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ సంఘటన పనాజీ సెంట్రల్ బస్టాండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... విర్గిల్ ఫెర్నాండేజ్ (35) ముస్లిం మహిళలు ధరించే బురఖాతో లేడీస్ టాయ్లెట్లోకి వెళ్లాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతగాడిపై సెక్షన్ 419 కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ఈ చర్యకు ఎందుకు పాల్పడాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.