Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy, Viral Video - Sakshi
Sakshi News home page

Sai Pallavi : బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన సాయిపల్లవి.. వీడియో వైరల్‌

Published Thu, Dec 30 2021 10:02 AM | Last Updated on Thu, Dec 30 2021 12:52 PM

Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy - Sakshi

Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. నాని కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం​ మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే  తాజాగా ఆడియెన్స్‌ రెస్పాన్స్‌ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్‌ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్‌లో సందడి చేసింది.

బుధవారం హైదరాబాద్‌ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్‌ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కృతిశెట్టి మారో హీరోయిన్‌గా నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement