Nani Starrer Shyam Singha Roy Movie Stream on April 03 at Gemini TV - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy Movie: బుల్లితెరపై సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'..

Published Fri, Apr 1 2022 4:01 PM | Last Updated on Thu, Dec 8 2022 12:46 PM

Nani Starrer Shyam Singha Roy Movie Will Showing On Television - Sakshi

నేచురల్​ స్టార్​ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్​ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్​ సింగరాయ్​'. రాహుల్​ సాంకృత్యాన్​ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 26న థియేటర్లలో విడుదలై మంచి టాక్​ సంపాదించుకుంది. తర్వాత కొద్ది రోజులకు ఓటీటీ దిగ్గజం నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతూ అనూహ్యమైన రెస్పాన్స్​ తెచ్చుకుంది. నెట్​ఫ్లిక్స్​ గ్లోబల్​ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురింపించారు. 

తాజాగా ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక సినిమాను టీవీ ఆడియెన్స్‌ వీక్షించనున్నారు. ఏప్రిల్‌ 3న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో 'శ్యామ్ సింగరాయ్‌' ప్రసారం కానుంది. అంటే థియేటర్‌, ఓటీటీలో చూడని వీక్షకులు టీవీ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు. సుమారు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదలైంది. పూర్వజన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కృతి శెట్టి, మడోన్నాసెబాస్టియన్‌లు హీరోయిన్లుగా అలరించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement