Shyam Singha Roy
-
సాయి పల్లవి సినిమాలకు దూరం కావడానికి కారణం ఇదే
-
ఆస్కార్ బరిలో నాని సినిమా.. మూడు క్యాటగిరిల్లో పోటీ
నాని, సాయిపల్లవి, కృతీ శెట్టి కాంబినేషన్లో రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్’ ఆస్కార్ పోటీకి వెళ్లింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామా గత ఏడాది డిసెంబర్లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇందులో శ్యామ్ సింగరాయ్ అనే అభ్యుదయ భావాలున్న బెంగాలీ రచయితగా, ఫిల్మ్ మేకర్‌గా రెండు పాత్రల్లో నాని నటన ప్రేక్షకులను మెప్పించింది. చదవండి: అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్ దేవదాసీగా సాయిపల్లవి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం మూడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్‌కి పోటీ పడుతోంది. పీరియాడిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారతీయ సంప్రదాయ క్లాసిక్ విభాగాల జాబితాలో నామినేషన్ పరిశీలనకు పంపారు. వచ్చే ఏడాది మార్చిలో 95వ ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. నామినేషన్ జాబితాని జనవరిలో ప్రకటించే అవకాశం ఉంది. మరి.. ‘శ్యామ్ సింగరాయ్’కి మూడు విభాగాల్లోనూ నామినేషన్ దక్కుతుందా? కాని పక్షంలో ఏదో ఒక విభాగంలో అయినా దక్కించుకుంటుందా? అనేది చూడాలి. -
సాయి పల్లవి ఖాతాలో మరో అరుదైన ఘనత, మూడోసారి గోల్డ్ మెడల్
Sai Pallavi Won Gold Medal For Shyam Singha Roy Movie: హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అంతేకాదు తన డ్యాన్స్‌తో ఎంతోమందిని మెస్మరైజ్ చేస్తోంది ఈ నాచులర్ బ్యూటీ. ఫిదా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. చివరిగా శ్యామ్ సింగరాయ్ చిత్రంతో అలరించిన ఆమెకు తాజాగా అరుదైన అవార్డు దక్కింది. చదవండి: ఓటీటీకి శివకార్తికేయన్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘డాన్’, ఆ తేదీ నుంచే స్ట్రీమింగ్ ఈ సినిమాలో ఆమె పోషించిన దేవదాసి పాత్రకు గానూ గోల్డ్ మెడల్ అందుకొనుంది. ఈ ఏడాది బిహైండ్ వుడ్స్ అవార్డ్స్ వేడుకలో సాయి పల్లవి బంగారు పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే సాయి పల్లవి రెండు గోల్డ్ మెడల్స్ అందుకుంది. 2017లో ఆమె నటించిన కాళి సినిమాకు గానూ తొలిసారి గోల్డ్ మెడల్ అందుకోగా 2019లో మలయాళంలో ఫహాద్ ఫాజిల్ చేసిన అథిరిన్ సినిమాకి గానూ రెండోసారి గోల్డ్ మెడల్ తీసుకుంది. ఇప్పుడు తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీకి మూడోసారి గోల్డ్ మెడల్ తీసుకొవడం విశేషం. కాగా సాయి పల్లవి ఇటీవల తెలుగులో రానా సరసన నటించిన విరాట పర్వం జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. చదవండి: SSMB28: మహేశ్ సినిమాలో విలన్‌గా నందమూరి హీరో? ట్వీట్‌తో క్లారిటీ! -
టీవీల్లో సందడి చేయనున్న 'శ్యామ్ సింగరాయ్'.. ఆరోజే ప్రసారం
నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 26న థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత కొద్ది రోజులకు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్యమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురింపించారు. తాజాగా ఈ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక సినిమాను టీవీ ఆడియెన్స్ వీక్షించనున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో 'శ్యామ్ సింగరాయ్' ప్రసారం కానుంది. అంటే థియేటర్, ఓటీటీలో చూడని వీక్షకులు టీవీ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు. సుమారు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదలైంది. పూర్వజన్మ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయి పల్లవితోపాటు కృతి శెట్టి, మడోన్నాసెబాస్టియన్లు హీరోయిన్లుగా అలరించారు. Story of Aspiring film maker haunted hy his past Shyam Singha Roy | April 3 | 6 PM#GeminiTV#UgadiwithShyamSinghaRoy #KrithiShetty @IamKrithiShetty@Sai_Pallavi92@NameisNani pic.twitter.com/DVeuYy0a4J — Gemini TV (@GeminiTV) April 1, 2022 -
సాయిపల్లవి ఇప్పుడు ఎక్కడ ఉంది? నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై నో అప్డేట్?
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సహజమైన నటన, అద్భుతమైన డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తోంది ఆమె. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఎక్కడా గ్లామర్ పాత్రల జోలికి పోకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సినిమా సినిమాకు తన నటనను మెరుగు పరుచుకుంటూ దూసుకుపోతోందీ చిన్నది. పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఇక ఇటీవలె శ్యామ్ సింగరాయ్‌లో దేవదాసి పాత్రలో నటించి ఆకట్టుకుంది. కొద్ది రోజుల క్రితం 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. అయితే ఆ తర్వాత బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఏం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో విరాటపర్వం మినహా మరే సినిమా లేదు. దీంతో అసలు సాయిపల్లవి ఇప్పుడేం చేస్తుంది అన్న సందేహం మొదలైంది. శ్యామ్ సింగరాయ్ తర్వాత ఆమె సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంత ఫ్యాన్ బేస్ ఉన్న హీరోయిన్ హఠాత్తుగా కనిపించకపోవడం, సినిమా అప్డేట్స్ ఏవీ ఇవ్వకపోవడంతో అసలు ఏం జరిగిందనే అనుమానం మొదలైంది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పాత్ర నచ్చకపోతే సినిమాకు నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ కారణంగానే సినిమాలు చేయట్లేదేమో అంటూ నెటిజన్లు భావిస్తున్నారు. -
బాలీవుడ్ నుంచి బేబమ్మకి పిలుపు.. ఆ స్టార్ హీరోతో ఛాన్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కృతీ శెట్టికి బాలీవుడ్ నుంచి కబురొచ్చిందనే టాక్ వినిపిస్తోంది. నాని హీరోగా, కృతీ శెట్టి, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబరు 24న విడుదలై మంచి విజయం సాధించింది. కాగా ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందని బాలీవుడ్ టాక్. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించనున్నారట. ఒరిజినల్లో కృతీ శెట్టి చేసిన పాత్రనే హిందీ రీమేక్‌లోనూ చేయాలని షాహిద్ అండ్ కో ఆమెను సంప్రదించారట. హిట్మూవీకి రీమేక్ కావడం, పైగా షాహిద్ వంటి స్టార్‌తో బాలీవుడ్ ఎంట్రీ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కృతి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని భోగట్టా. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ఆ తెలుగు మూవీ రీమేక్ కోసం పోటీ పడుతున్న బాలీవుడ్ అగ్ర హీరోలు
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఓటీటీలో సైతం రికార్డు వ్యూస్‌ను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Prabhas-Pooja Hegde: ఎడమొహం పెడమొహంగా ప్రభాస్-పూజా? అయితే ఈ రీమేక్ ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ రీమేక్ హక్కును తీసుకునే ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అగ్ర హీరో అజయ్ దేవగన్ సైతం శ్యామ్ సింగరాయ్ రీమేక్‌కు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒకే దర్శకుడిని రీమేక్ కోసం వీరిద్దరు సంప్రదించినట్లు బి-టౌన్లో వినికిడి. మరి ఇందులో ఎవరి ప్రయత్నాలు ఫలించి శ్యామ్ సింగరాయ్ హక్కులను పొందుతారో చూడాలి. -
శ్యామ్ సింగరాయ్‌పై మధుబాల వీడియో.. సాయిపల్లవి రిప్లై
నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. జనవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మూవీలో దేవదాసి పాత్రకు ప్రాణం పోసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా సీనియర్ నటి మధుబాల శ్యామ్ సింగరాయ్ సినిమా చూడటమే కాక దీనిపై రివ్యూ ఇచ్చింది. 'శ్యామ్ సింగరాయ్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సాయిపల్లవి సహజ నటన, అందం, అంతకుమించిన డ్యాన్స్ అన్నీ బాగున్నాయి. నేను ఆమెకు పెద్ద అభిమానిని. నాని ఫెంటాస్టిక్‌గా నటించాడు' అని పేర్కొంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. దీనికి సాయిపల్లవి స్పందిస్తూ.. 'మీ ప్రశంసలకు ధన్యవాదాలు మేడమ్. మీ పొగడ్తలకు నేను ఉప్పొంగిపోతున్నాను' అని ట్వీట్ చేసింది. I feel like I received a warm hug, I’m so overwhelmed🥺🙈 Thank you so much for the kind words, ma’am ♥️ lots of love to you ♥️🙏🏻 https://t.co/fjK1joF7P9 — Sai Pallavi (@Sai_Pallavi92) January 29, 2022 -
ఆన్లైన్ క్లాస్‌లో 'శ్యామ్ సింగరాయ్'.. తమను కలపాలని లెక్చరర్‌కు వినతి
Students Makes Fun With Lecturer On Shyam Singha Roy Name: నేచురల్ స్టార్ నాని, మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయిపల్లవిల అద్భుతనటనగల ప్రేమ కావ్యం 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది థియేటర్లలో విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. తర్వాత ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ మూవీస్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఏకైక భారతీయ సినిమాగా గుర్తింపు కూడా పొందింది. ఈ సినిమా ప్రేమకథా అనేక ప్రేక్షక జనానికి ఎంతో నచ్చి ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో పూర్వజన్మ నేపథ్యంతో ప్రేమకథ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కొంతమంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఒక లెక్చరర్‌తో సరదాగా ఆడుకున్నారు. స్టూడెంట్ తన పేరు శ్యామ్ సింగరాయ్ అని తన భార్య పేరు రోజీ సింగరాయ్ అని చెప్పాడు. వాళ్లిద్దరిని ఎలాగైనా కలపాలని లెక్చరర్‌ను కోరి ఇబ్బంది పెట్టాడు. ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన ఓ విద్యార్థి తన ఐడీని శ్యామ్ సింగరాయ్‌గా మార్చుకున్నాడు. అది నిజంగా తన పేరా ? లేదా సినిమా పేరును ఐడీగా పెట్టుకున్నారా ? అని లెక్చరర్ అడగ్గా అది తన పేరేనని, తన భార్య రోజీ సింగరాయ్ కూడా క్లాస్‌లోనే ఉందని, తాను పునర్జన్మ ఎత్తానంటూ చెప్పుకొచ్చాడు. ఇదంతా విన్న లెక్చరర్ క్లాస్ అయ్యాక పర్సనల్‌గా మాట్లాడదామని తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను ఓ నెటిజన్ శ్యామ్ సింగరాయ్ చిత్రబృందానికి ట్యాగ్ చేశాడు. దానికి ఆన్లైన్ క్లాస్‌లో శ్యామ్ సింగరాయ్ అంటూ ట్వీట్ చేశాడు. ఇది చూసిన మూవీ డైరెక్టర్ రాహుల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే ఈ ఆడియోను కావాలని సరదాగా క్రియేట్ చేశారో, నిజంగానే జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్‌గా మారింది. Shyam Singh Roy in Online Class🔥🥳😂😂😂@NameisNani @Sai_Pallavi92 @NiharikaEnt #ShyamSinghaRoy #ShyamSinghaRoyonnetflix pic.twitter.com/5Ga5l4Y0aK — RRRisky Venù (@RevuriVenu) January 28, 2022 -
అరుదైన రికార్డు నెలకొల్పిన శ్యామ్ సింగరాయ్
నేచురల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రిభినయనం చేసి విజయం సాధించిన సినిమా శ్యామ్ సింగరాయ్. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది క్మిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ సంపాదించుకుంది. థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ జనవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్యామ్ సింగరాయ్ అరుదైన ఘనతను సాధించాడు. అత్యధికంగా వ్యూయింగ్ అవర్స్‌ను దక్కించుకుని ఇప్పటివరకూ ఏ భారతీయ చిత్రానికి దక్కని రికార్డును సొంతం చేసుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన మొదటి 3 రోజుల్లోనే సుమారు 3,590,000 వ్యూయింగ్ అవర్స్‌ను దక్కించుకుంది ఈ చిత్రం. ఆ వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో ఉండి టాప్ 10 ప్లేస్‌లో ఒకటిగా నిలిచింది. భారతీయ సినిమానే కాకుండా ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమా కూడా ఇలా మెప్పించలేకపోయింది. (చదవండి: థియేటర్ ముందు నాని 63 అడుగుల భారీ కటౌట్.. ఫొటోలు వైరల్) Seems like the whole world has been swayed by Shyam and Rosie's story. #ShyamSinghaRoy is at number 3 in our Top 10 Non-English Global Films ranking!🎉@NameisNani @Sai_Pallavi92 pic.twitter.com/fSuQQYPToQ — Netflix India South (@Netflix_INSouth) January 27, 2022 -
ఆ సాంగ్ కోసం సాయి పల్లవి ఇంత కష్టపడిందా?.. రిహార్సల్స్ వీడియో వైరల్
Sai Pallavi Dance Rehearsal Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డ్యాన్స్ చేస్తుంటే.. నెమలి ఆడినట్టే ఉంటుంది. అందుకే ఆమె చేసిన సాంగ్స్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తాయి. ‘రౌడీ బేబీ’ (మారి 2), ‘మెల్ల మెల్లగ వచ్చిండే’, (ఫిదా), ‘ఏవండోయ్ నాని గారు’ (ఎంసీఏ) పాటలతో పాటు మొన్నటి లవ్స్టోరీలోని ‘ఏవో ఏవో కలలే’ వరకు ప్రతి పాటలో తనదైన స్టెప్పులతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ మలయాళ కుట్టి. ఇక ఇటీవల విడుదలైన నాని ‘శ్యామ్ సింగరాయ్’లో దేవదాసీ పాత్ర పోషించి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఆ మూవీలోని ‘ప్రణవాలయ’పాటకు అద్భుతమైన న్యత్యం చేసి ఔరా అనిపించింది. ఆ పాట సిల్వర్ స్క్రీన్‌పైన విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. అయితే ఆ పాట కోసం సాయి పల్లవి చాలా కష్టపడింది. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) తాజాగా ఆ పాట రిహార్సల్స్ వీడియోని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ..‘ప్రణవాలయ పాటకు డ్యాన్స్ చేస్తుంటే.. నాకు కలిగిన అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పర్ఫామెన్స్ల్లో ఇది ముందుంటుంది.. రూపాలి కంథారియా, కుష్బూ వాకానిలకు ఈ క్రెడిట్స్ దక్కాలి’ అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) -
తవాయిఫ్‌ల నుంచి దేవదాసీల వరకు
స్త్రీని తన లైంగిక బానిస చేసుకోవడానికి పురుషుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బలవంతపు పడుపువృత్తి లేదా ఆచారాల ముసుగులో నిర్బంధ లొంగుబాటు కొనసాగించాడు. దక్షిణభారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశంలో తవాయిఫ్‌లు గొప్ప నాట్యకత్తెలుగా సంగీతకారిణిలుగా గుర్తింపు పొందినా వీరి లైంగిక అస్తిత్వం వీరిని సమాజంలో అథమ స్థానానికి నెట్టింది. సినిమా ఈ పాత్రలను తరచూ ప్రస్తావించింది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా దేవదాసీ వ్యవస్థ దురాచారాన్ని గట్టిగా చర్చించింది. అలాంటి పాత్రలపై ఒక అవలోకన. ‘శ్యాం సింగరాయ్’ సినిమాలో బెంగాల్లో 1970 నాటి సాంఘిక దురన్యాయాల మీద తిరగబడతాడు హీరో నాని. ఆ కాలంలో హరిజనులపై అగ్రకులాలు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తాడు. అది కొంత వరకు కుటుంబం సహిస్తుంది. కాని ఎప్పుడైతే అతడు ‘దేవదాసి’ వ్యవస్థలో మగ్గుతున్న సాయి పల్లవిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోయి ఆమెకు విముక్తి ప్రసాదించి వివాహం చేసుకుంటాడో ఆ కుటుంబం రగిలిపోతుంది. తమ పరువును బజారున పడేస్తున్నాడని ఏకంగా అతణ్ణి హత్య చేసి శవం మాయం చేస్తుంది. ‘స్త్రీ శరీరానికి’, ‘పాతివ్రత్యానికి’, దాని చుట్టూ ఉండే ‘సామాజిక విలువ’కు ఈ హత్య ఒక తీవ్ర సూచిక. తమ ఇంటి యువకుడు స్త్రీలను పేదరికంలో నుంచి బయటకు తెస్తే ఆమోదం ఉంటుందేమో కాని, తక్కువ కులం నుంచి వివాహం చేసుకుంటే ఆమోదం ఉంటుందేమో కాని, ‘శీల పతనం’లో ఉండే స్త్రీకి గౌరవం తేవడానికి ప్రయత్నిస్తే మాత్రం కుటుంబం కాని, సమాజం కాని సహించదు. పురుషుడి శీల పతనానికి మించి స్త్రీల శీల పతనానికి ఎక్కువ విలువ, తీవ్రత ఆపాదిస్తుంది సమాజం. నిజానికి పురుషుడు తన స్వార్థం, సుఖం కోసం కల్పించిన వ్యవస్థ ‘దేవదాసీ’ వ్యవస్థ. దేవుణ్ణి అడ్డం పెట్టి పై వర్గాల వారు కింద వర్గాల స్త్రీలను లైంగిక దోపిడికి వాడుకోవడమే ఈ వ్యవస్థ పరమ ఉద్దేశం. పురుషుడు తాను తయారు చేసిన ఈ వ్యవస్థను గౌరవించడు సరి కదా ఈసడిస్తాడు. ఈ వర్గంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్న స్త్రీలు కళల్లో తయారైనా వారంతా ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ భావజాలాన్ని భారతీయ/ తెలుగు సినిమా అప్పుడప్పుడు చర్చిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చర్చించింది. ‘ధర్మపత్ని’తో మొదలయ్యి... 1941లో బి.శాంతకుమారి, భానుమతి నటించిన ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ‘దేవదాసీ’ వ్యవస్థ ప్రస్తావన మన సినిమాల్లో వస్తూనే ఉంది. ‘ధర్మపత్ని’లో హీరోయిన్ శాంతకుమారి పెంపుడు తల్లి ఒకప్పుడు దేవదాసి అని తెలియడంతో హీరోకు కష్టాలు మొదలవుతాయి. దేవదాసి పెంచిన కూతురిని కోడలిగా ఆమోదించడం అసాధ్యమని హీరో వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది. చివరకు శాంతకుమారి హీరోను పెళ్లి చేసుకోలేకపోతుంది. ‘దేవదాసు’లో ప్రేమ విఫలమైన అక్కినేని దేవదాసి అయిన చంద్రముఖి (లలిత–ట్రావెన్కోర్ సిస్టర్స్) పంచన చేరుతాడు. ఆ పాత్ర ఎంత ఉదాత్తంగా ఉన్నా ఆమె స్థాయి ఇలాంటి పతితులకు ఆశ్రయం కల్పించేదే తప్ప ఇల్లాలు అయ్యే స్థాయి మాత్రం కాదు. ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రి అంతటివాడు ‘ఆటపాటలే వృత్తి’గా చేయబడిన కుటుంబం నుంచి వచ్చిన మంజుభార్గవి చేతికి తంబూర ఇస్తేనే సహించలేకపోతుంది పాడులోకం. మంజుభార్గవి సంగతి సరే ఏకంగా శంకరశాస్త్రినే నిరాకరిస్తుంది. స్త్రీలు మోయాల్సిన పాతివ్రత్యపు బరువు పట్ల దానికుండే పట్టింపు అది. మరి ఆ స్త్రీలను ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ‘మేఘ సందేశం’లో ఇంటి ఇల్లాలి నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందలేని అక్కినేని కళావంతురాలైన జయప్రదను అభిమానిస్తే ఆరాధిస్తే వారిరువురికి కూడా ఏకాంత వాసమే దక్కుతుంది. స్త్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద పూర్తి హక్కు లేదని సమాజం పదే పదే చెప్పడం ఇది. అనార్కలికి దక్కని ప్రేమ... దక్షణాదిలో దేవదాసీ వ్యవస్థ ఉన్నట్టే ఉత్తరాదిలో తవాయిఫ్‌ల వ్యవస్థ ఉంది. తవాయిఫ్‌లు వినోద నాట్యకత్తెలు. గాయనీమణులు. దర్బారుల్లో ఆడిపాడటం వీరి పని. అంతిమంగా ఎవరో ఒకరి పంచన వీరు చేరక తప్పదు. వైవాహిక జీవితం వీరికి ఉండే అవకాశం లేదు. అందుకే ‘మొఘల్–ఏ–ఆజమ్’లో దిలీప్ కుమార్‌ను ప్రేమించిన మధుబాలకు ఆ ప్రేమ దక్కదు. ఆమెకు ప్రాణాలతో బొందపెట్టే శిక్ష దక్కుతుంది. ఆమె ఏ చిన్న నవాబు కూతురో అయినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తండ్రి ఎవరో తెలియని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ పుట్టిన సంతానాన్ని తిరిగి అదే కూపంలో ఉంచే అమానవీయమైన వ్యవస్థ ప్రతిఫలం ఇది. దీనిని స్త్రీలే అనుభవించాలి. పురుషుడు కాదు. ‘గైడ్’ సినిమాలో దేవదాసీ అయిన వహిదా రహెమాన్‌ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాననుకుంటాడు ఆమె భర్త. కాని అతడి లోలోపల ఆమె మీద అనుమానం, చిన్నచూపు. ఆ పెళ్లి నుంచి ఆమె బయటపడి దేవానంద్లో ప్రేమ వెతుక్కున్నా ఆ పరుషుడు కూడా అంతే దారుణంగా ఆమెతో వ్యవహరిస్తాడు. చివరకు ఆమె జీవితకాల విరక్తిని పొందుతుంది. ఇక రేఖ చేసిన ‘ఉమ్రావ్‌జాన్’ తవాయిఫ్‌ల జీవన విషాద వీచిక. ఎన్నో ప్రశ్నలు.. పాత్రలు మత దురాచారాల వల్ల కాని, కొన్ని సమూహాల వెనుకబాటుతనం వల్ల గాని, సామాజిక దోపిడి వల్ల గాని స్త్రీలు లైంగిక వ్యాపారాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీలు తిరిగి గౌరవం పొందడానికి యుగాల కొలదీ పోరాటం చేయవలసి వస్తోంది. వారికి ఉండవలసిన సమాన హక్కుల గురించి, సమాన మర్యాద గురించి మారవలసిన భావజాల దృష్టి చాలా ఉంది. ‘పవిత్రత’, ‘శీలం’ అనే మాటలకు సర్వకాల సర్వావస్థల్లో ఒకే ప్రమాణం ఉండదని, స్థలకాలాలను బట్టి వాటికి అర్థాన్ని ఆపాదించాల్సిన పద్ధతి మారుతుండాలని, ముఖ్యంగా ఇవి స్త్రీలు మాత్రమే మోయాల్సిన పదాలు కావని పురుషులు కూడా సమాన హక్కుదారులే అని మళ్లీ మళ్లీ చర్చించాల్సిన సినిమాలు పాత్రలు రావాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం. -
వీడియో :పెళ్లి చేసుకొమని అడిగిన వేశ్యకి నాని ఏం చెప్పారంటే..
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన శ్యామ్ సింగరాయ్.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళ్తుంది. నిన్నటి(జనవరి 21)నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (చదవండి: నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఫోటో వైరల్) ఇదిలా ఉంటే.. శనివారం ఈ సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్‌ని విడుదల చేసింది చిత్రబృందం. అందులో నాని.. వేశ్యల దగ్గరకు వెళ్లి.. వారి వృత్తి గురించి తాను రాసిన లైన్స్‌ను చెప్పగా... ఇంత తెలిసినవాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?' అని ఓ వేశ్య అడుగుతుంది. దానికి నాని 'ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు' అని బదులిస్తాడు. ప్రస్తుతం ఈ డిలీటెడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నానితో కలిసి మీసం మెలేసిన చిరంజీవి.. ఫోటో వైరల్
Chiranjeevi appreciates Nani for SSR: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రం గతేడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలై.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ముఖ్యంగా నాని, సాయి పల్లవి నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి వీక్షించారు. అనంతరం ‘శ్యామ్ సింగరాయ్’చిత్ర బృందాన్ని అభినందించారు. దీనికి సంబంధించిన ఫోటోని నాని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తొలుత ఈ ‘శ్యామ్’ ఎవరికి నచ్చాడో కనిపెట్టండి? అంటూ ట్వీట్ చేసిన నాని... ఆతర్వాత కొద్ది సేపటికే మెగాస్టార్ తో కలిసి దిగిన ఫొటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు .ఇందులో మెగాస్టార్, నేచురల్ స్టార్ ఇద్దరూ మీసం మెలేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన శ్యామ్ సింగరాయ్.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీకి ఇచ్చాడు. నేటి(జనవరి 21)నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ♥️ @KChiruTweets https://t.co/mB3uh2aJoC pic.twitter.com/xNjm7Rzyfc — Nani (@NameisNani) January 20, 2022 -
'శ్యామ్ సింగరాయ్'.. ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాని సరసన కృతిశెట్టి, సాయిపల్లవి జంటగా నటించారు. దేవదాసి పాత్రలో సాయి పల్లవి నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మడోన్నా సెబాస్టియన్ కీలక పాత్రలో నటించింది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రేపటి నుంచే(జనవరి21)నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో శ్యామ్ సింగరాయ్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాల్సి ఉంది. -
థియేటర్లలో సిన్న సిత్రాలు.. ఓటీటీల్లో హిట్ సినిమాలు
గతేడాది థియేటర్లలో అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో ఇక బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందండి ఫుల్‌గా ఉంటుందని భావించాయి సినీ వర్గాలు. కానీ ఎప్పటిలాగే కరోనా కోరలు చాచి ఆ సందడిని మాయం చేసింది. ప్రతీ రోజు పెరుగుతున్న కొవిడ్ కేసులతో సినిమా షెడ్యూల్స్ తారుమారు అయ్యాయి. ఏడాది ప్రారంభంలో వచ్చే అతి పెద్ద పండుగ సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా వేసుకున్నాయి. కానీ అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రాన్ని మాత్రం ధైర్యంగా థియేటర్లలో విడుదల చేశారు మేకర్స్. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ త్రోబ్యాక్ వీడియో.. పూరీ జగన్నాథ్ షాక్ పెద్ద సినిమాలన్నీ వాయిదా పడటంతో చిన్న సినిమాలకు వరంగా మారింది. దీంతో ప్రస్తుతం చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అలరిస్తున్నాయి. థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ సందడి చేసేందుకు సిన్న సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా ! థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు: 1. వర్మ: వీడు తేడా, జనవరి 21న విడుదల 2. వధుకట్నం, జనవరి 21న విడుదల 3. ఉనికి, జనవరి 26న విడుదల ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు: 1. అఖండ- జనవరి 21, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2. శ్యామ్ సింగరాయ్- జనవరి 21, నెట్‌ఫ్లిక్స్ 3. లూజర్ 2- జనవరి 21, జీ5 ఇదీ చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు.. -
మరో క్రేజీ దర్శకుడికి ఓకే చెప్పిన రామ్ చరణ్
RRR Hero to join hands with Shyam Singha Roy Director: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాల విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఒక పక్కన దర్శకుడు శంకర్ సినిమా చేస్తూనే తన తదుపరి చిత్రాన్ని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నాడు చెర్రి. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ఏంటంటే ఆ రెండు చిత్రాల అనంతరం 'శ్యామ్ సింగరాయ్’తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంక్రిట్యన్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నట్టు సమాచారం. రీసెంట్గా 'శ్యామ్ సింగరాయ్’ చూసి రామ్ చరణ్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే మంచి కథ ఉంటే రాహుల్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే వీళ్ల కాంబినేషన్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఓటీటీలోకి 'శ్యామ్ సింగరాయ్'.. ఎప్పుడు ? ఎక్కడా ?
Shyam Singha Roy Movie OTT Release Date Out: పక్కింటి కుర్రాడి నుంచి నేచురల్ స్టార్‌గా ఎదిగిన నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదలై మంచి విజయం అందుకుంది. ఇందులో వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు పోషించిన నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ బాగుందనే టాక్ వచ్చింది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమాకు తర్వాత కలెక్షన్లు కాస్త తగ్గాయి. తెలంగాణలో పర్వాలేదనిపించిన శ్యామ్ సింగరాయ్ ఏపీలో కొంత వెనుకపడ్డాడు. అయితే థియేటర్ల ద్వారా ఆశించిన ఫలితం రాని శ్యామ్ సింగరాయ్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెడుతున్నాడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 21న రిలీజ్ కానుంది ఈ సినిమా. శ్యామ్ సింగరాయ్‌ని భారీ ధరకు కొనుగోలు చేశారని సమాచారం. థియేటర్ల ద్వారా ఇప్పటివరకు రూ. 24.80 కోట్లు షేర్ వసూలు చేయగా రూ. 22.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇదీ చదవండి: థియేటర్ ముందు నాని 63 అడుగుల భారీ కటౌట్.. ఫొటోలు వైరల్ -
ఆశించిన బిజినెస్ చేయలేకపోయిన శ్యామ్‌సింగరాయ్, మొత్తం షేర్ ఎంతంటే..
Nani Shyam Singha Roy 13 Days Business Shares Details Inside: నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై మంచి విజయం అందుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే రెస్పాన్స్ వచ్చింది. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కాస్తా స్లో అయింది. శ్యామ్ సింగరాయ్ కలెక్షన్స్ ఆశించినంత రాబట్టేలేకపోయాయి. చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్.. తెలంగాణలో ఈ మూవీ బాగానే ఆడినా.. ఏపీలో కొన్ని థియేటర్లు మూత పడటంతో అక్కడ కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అక్కడ శ్యామ్ సింగరాయ్ తక్కువే బిజినెస్ చేసిందని చెప్పాలి. అయితే ప్రారంభంలో ఈ మూవీకి ఆశించిన వసూళ్లు రావడంతో శ్యామ్ సింగరాయ్ సేఫ్ జోన్‌కు వచ్చేసింది. ఇప్పటివరకు 24.80 కోట్ల షేర్ వసూలు చేయగా.. రూ. 22.50 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ కృష్ణవంశీ ఇక సినిమా వసూళ్లను ఓ సారి చూద్దాం. నైజాం : 9.10 కోట్లు సీడెడ్ : 2.53 కోట్లు ఉత్తరాంధ్ర : 2.17 కోట్లు ఈస్ట్ : 1.00 కోట్లు వెస్ట్ : 0.88 కోట్లు గుంటూరు : 1.21 కోట్లు కృష్ణా : 0.96 కోట్లు నెల్లూరు : 0.61 కోట్లు AP-TG 5 డేస్ కలెక్షన్స్: రూ. 18.72 కోట్లు (రూ.31.77 కోట్లు గ్రాస్) కర్ణాకట+ROI: రూ. 2.86 కోట్లు ఓవర్సీస్: రూ. 3.54 కోట్లు టోటల్ 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్: రూ.25.12 కోట్లు (రూ. 44 కోట్లు గ్రాస్) షేర్ బిజినెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. -
నాకింకా 29 మాత్రమే, 30 తర్వాత ఆలోచిస్తా: సాయి పల్లవి
నెచురల్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినిమా అంటే చాలు అది బ్లాక్‌బస్టర్ అనేంతగా సాయి పల్లవి పరిశ్రమలో గుర్తింపు పొందింది. గ్లామర్‌కు పాత్రలకు నో చెబుతూ తన సహజమైన నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తుంది ఈ బ్యూటీ. ఇక ఏ విషయంపై కూడా ముక్కుసూటిగా స్పందించే సాయి పల్లవి తన పెళ్లిపై కూడా అదే తీరుతో వ్యవహరించింది. చదవండి: Sanjjanaa Galrani: విడాకులపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ప్రస్తుతం సాయి పల్లవి తన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్స్, మీడియా ఇంటర్య్వూలతో శ్యామ్ సింగరాయ్ టీం బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సాయి పల్లవికి తన పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది. దీనిపై ఎలాంటి బిడియం చూపించకుండా ‘నాకు అప్పుడే పెళ్లి ఎంటండి బాబు.. నాకు ఇంకా 29 ఏళ్లు మాత్రమే. 30 ఏళ్లు వచ్చాక అప్పుడు పెళ్లి గురించి ఆలోస్తా’ అంటూ తనదైన శైలిలో ఆసక్తిగా సమాధానం ఇచ్చింది. కాగా సాయి పల్లవి నటించిన మరో చిత్రం విరాట పర్యం విడుదల కావాల్సి ఉండగా.. తమిళంలో ఓ మూవీకి చేస్తోంది. చదవండి: వారిని అలా చూస్తుంటే అసూయ కలుగుతోంది: స్టార్ హీరో -
‘శ్యామ్ సింగరాయ్’ రెమ్యునరేషన్‌ను నాని తిరిగి ఇచ్చేశాడా?
నెచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నాని, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్ కూడా తెచ్చుకుంది. ఇదిలా ఉంటే నాని గతంలో నటించిన వీ, టక్ జగదీశ్‌లు కరోనా కారణంగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో నిరాశలో ఉన్న నాని శ్యామ్ సింగరాయ్‌ని థియేటర్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూశాడు. చదవండి: హీరోయిన్‌తో ప్రేమలో మునిగితేలుతున్న యంగ్ క్రికెటర్!, ఇదిగో ఫ్రూఫ్ అందుకే ఎన్ని ఆటంకాలు వచ్చిన శ్యామ్ సింగరాయ్ థియేటర్లోనే విడుదలయ్యేలా కృషి చేశాడు. నిర్మాత వెంకట్ బోయినపల్లి నిర్మాత అయినప్పటికి నానినే వెనకుండి అంతా నడిపించినట్టు ప్రచారం జరిగింది. అంతేగాక శ్యామ్ సింగరాయ్ థియేట్రికల్ రిలీజ్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం స్పెషల్ కేర్ తీసుకున్నాడట. నైజాం డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే చేశాడని టాక్. దీంతో ఇక్కడ ఇప్పటి వరకు 8 కోట్లకుపైగా వసూళు చేసినట్లు సమాచారం. ఇదంతా బాగానే ఉన్న ఏపీలో మాత్రం ఈ మూవీ కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచింది. అక్కడ టికెట్ రేట్స్‌తో పాటు ఇంకా చాలా సమస్యలు నాని సినిమాపై ప్రభావం చూపాయి. చదవండి: న్యూ ఇయర్‌ను భావోద్వేగంతో స్వాగతించిన సామ్, ఇలా సాగాలంటూ పోస్ట్ దానికి తోడు మూవీ విడుదలకు ముందు నాని చేసిన కామెంట్స్ తీవ్ర రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో నాని కామెంట్స్, ఏపీ టికెట్స్ రేట్స్ తక్కువగా ఉండటం శ్యామ్ సింగరాయ్ మూవీని కలెక్షన్స్ పరంగా దెబ్బతీశాయి. అందుకే ఈ మూవీ కోసం తీసుకున్న రెమ్యునరేషన్లో 60 శాతం పారితోషికాన్ని నాని తిరిగి నిర్మాతలకు ఇచ్చేసినట్టు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్‌కి నాని 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా అందులో రూ. 5 కోట్లు వెనక్కి ఇచ్చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంతవరకు నాని కానీ, మూవీ టీం కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. -
శ్యామ్ సింగరాయ్.. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్
Shyam Singha Roy Movie Blockbuster Success Meet: నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది. తమ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన ‘శ్యామ్ సింగరాయ్’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో నాని, వెంకట్ బోయినపల్లి చిత్రయూనిట్‌కి షీల్డ్స్‌ను ప్రదానం చేశారు. -
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోన్న శ్యామ్ సింగరాయ్!, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. రాహుల్ సంకృత్యాన్ కలకత్తా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన మూవీ హిట్‌టాక్ తెచ్చుకుంది. అంతేగాక కమర్షియల్‌గా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. చదవండి: మారక తప్పదంటూ దీప్తి పోస్ట్, షణ్నూతో బ్రేకప్ తప్పదా? కాగా గతంలో నాని నటించిన ‘వీ, టక్’ జగదీశ్‌లో నేరుగా ఓటీటీలో విడుదల కావడంతో ఈ మూవీపై ఆయన ఎన్నో అంచనాలను పెట్టుకున్నాడు. నాని ఆశించినట్టుగానే శ్యామ్ సింగరాయ్ థియేటర్లో విడుదలై మంచి హిట్‌టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు శ్యామ్ సింగరాయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్యామ్ సింగరాయ్‌ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి భారీ ఆఫర్ వచ్చిందని, అయినా థియేటర్లోనే విడుదల చేసేందుకు.. చదవండి: వైరల్ అవుతున్న యాంకర్ ప్రదీప్ ట్వీట్, మాచిరాజుపై నెటిజన్ల ప్రశంసలు మేకర్స్ ఆసక్తి చూపినట్లు నాని ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ ఈవెంట్లో చెప్పకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా థియేటర్లో రిలీజ్ అయిన ఈమూవీని భారీ మొత్తానికి ఓటీటీ రిలీజ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ విడుదలైన నాలుగు వారాలకు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. వచ్చే ఏడాది 2022 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో శ్యామ్ సింగరాయ్ స్ట్రీమింగ్ కానుందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందని సమాచారం. -
బురఖా ధరించి సినిమా వీక్షించిన సాయిపల్లవి
-
Krithi Shetty: పంజాబీ డ్రెస్‌లో ‘బేబమ్మ’హోయలు.. ఫోటోస్ వైరల్
టాలీవుడ్లో ‘ఉప్పెన’లా దూసుకెళ్తున్న హీరోయిన్ కృతిశెట్టి. చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈ కన్నడ భామ.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ‘ఉప్పెన’తర్వాత ఈ భామకి వరుస ఆఫర్స్ వచ్చాయి. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’లో నానికి జోడిగా నటించి మెప్పించింది. కేవలం అందతోనే కాకుండా.. అభినయంతో కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. తాజాగా ఈ భామకు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. అందులో ఆమె లుక్, డ్రెస్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. ‘శ్యామ్ సింగరాయ్' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కృతిశెట్టి ధరించిన దుస్తులు అందర్ని ఆకట్టుకున్నాయి. కృతిశెట్టి కేవలం పక్కింటి అమ్మాయిగానే కాకుండా మోడరన్ గర్ల్‌గా తనదైన శైలిలో ఆకట్టుకొంటున్నది. నాగార్జున హీరోగా ‘బంగార్రాజు’ సీక్వెల్ లో నాగ చైతన్యకు జోడిగా నటిస్తోంది కృతి. తాజాగా నాగ లక్ష్మిగా విడుదల చేసిన కృతి శెట్టి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలోనూ కృతిశెట్టియే హీరోయిన్. సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్. రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. -
బుర్ఖాలో సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన హీరోయిన్
Sai Pallavi Secret Visit To Sriramulu Theatre For Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్యామ్ సింగరాయ్’హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. నాని కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే తాజాగా ఆడియెన్స్ రెస్పాన్స్ ప్రత్యక్షంగా చూసేందుకు హీరోయిన్ సాయి పల్లవి బుర్ఖా వేసుకొని థియేటర్లో సందడి చేసింది. బుధవారం హైదరాబాద్ ముసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు డైరెక్టర్ రాహుల్‌తో కలిసి థియేటర్‌కు వెళ్లింది. బుర్ఖా ధరించిన ప్రేక్షకుల మధ్య ఉండి సినిమా చూసింది. బుర్ఖా ఉండటంతో ప్రేక్షకులు ఎవరూ గుర్తుపట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రంలో కృతిశెట్టి మారో హీరోయిన్గా నటించింది. -
ప్రభాస్, బన్నీలపై ఆర్ నారాయణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు
పీపుల్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలే ఆయనకు ప్రపంచం. డబ్బుల కోసం కాకుండా సమాజం కోసం మంచి సందేశాత్మక సినిమాలు తీస్తూ దర్శకుడిగా.. నిర్మాతగా.. నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. టాలీవుడ్‌కి చెందిన హీరోలు కానీ, దర్శకులు కానీ మంచి స్థాయిలో రాణిస్తే.. ఆయన మురిసిపోతాడు. బహిరంగంగానే వారిని అభినందిస్తాడు. తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్లపై ఆర్ .నారాయణ మూర్తి ప్రశంసల వర్షం కురిపించాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ డిసెంబర్ 24న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్.నారాయణ మూర్తి.. ప్రభాస్, బన్నీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ అని కొనియాడాడు. ‘మంచి సినిమాలు వస్తే కరోనాను సైతం లెక్కచేయకుండా థియేటర్స్‌కి వస్తామని తెలుగు ప్రేక్షకులు ‘అఖండ’తో మరోసారి నిరూపించారు. కరోనా టైం లో కూడా ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగ రాయ్’ తో థియేటర్స్ కళ కళ లాడాయి. యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ, సెల్యూట్ గర్వించదగిన విషయం. గత రోజుల్లో తమిళనాడు నుంచి కానీ, ముంబై నుంచి కానీ దర్శకులు, హీరోలు వస్తుంటే ఇక్కడ తెలుగు మీడియా బాగా కవర్ చేసేది. ఆ దశ మన తెలుగు వారికి ఎప్పుడు వస్తుందో అనుకునేవాడిని. కానీ ఇప్పుడు యావత్ యావత్ భారత దేశంలో నంబర్ వన్ సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. తెలుగు రచయితలు, తెలుగు దర్శకుడు, హీరోలు ప్రపంచాన్ని ఏలుతున్నారు. మనవాళ్లు ఎక్కడికి వెళ్లిన మీడియా వస్తుంది. కే విశ్వనాథ్ శంకరాభరణం తీసి ప్రపంచ సినీ చిత్రపటం మీద తెలుగు చిత్ర పరిశ్రమ గొప్పతనం చెప్పాడు. తర్వాత ఒక బాహుబలి తీసి మన రాజమౌళి తెలుగువారి సత్తా చాడాడు. ఆల్ ఓవర్ ఇండియాలో మన తెలుగు హీరోలెవరూ స్టాండ్ కాలేదు. ఇంతకుముందు ఒకరు అయ్యారు. దటీజ్ పైడి జయరాజ్. బాలీవుడ్లో తన సత్తాను చాటుకోవడమే కాకుండా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకొన్నారు. ఆ తర్వాత రేఖ, వైజయంతి మాలా, శ్రీదేవి లాంటి వాళ్లు హీరోయిన్లు సక్సెస్ అయ్యారు. కానీ హీరోలు ఎవరూ అక్కడ జెండా ఎగురవేయలేకపోయారు. కానీ బాహుబలి దెబ్బకు ప్రభాస్ దుమ్ముదులుపుతున్నాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయికి వచ్చినందుకు ప్రభాస్‌కు మనంతమంతా సపోర్ట్ ఇవ్వాలి అల్లు అర్జున్‌కి మలయాళంలో ఎంతో క్రేజ్ వుంది. ఇటీవల కేరళకు వెళ్లి చాలా చిన్న హోటల్ దిగాను. అప్పుడు ఇక్కడ టాప్ హీరోలు ఎవరు అని అడిగితే.. మోహన్ లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్ అని చెప్పారు. మలయాళంలో మన తెలుగువాడి సత్తా ఇది. ఒకప్పుడు షోలో, జంజీర్, భాషా సినిమాల్లో అమితాబ్, రజనీకాంత్ డైలాగ్స్ చెప్పుకొనే వారు. కానీ పుష్ప తర్వాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లా’ అనే మాటని ప్రపంచం అనుకరిస్తూ ఉంది. అది మన తెలుగు హీరోల ఘనత’ అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు. -
గరం గరం ముచ్చట్లు :నాని మరియు సాయి పల్లవి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
ఆ సీన్ కోసం మూడు రోజులు ప్రాక్టీస్ చేశా.. చేతులు వణికిపోయాయి: కృతిశెట్టి
‘ఉప్పెన, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలను చూశాను. ట్రెడిషన్, కల్చర్ గురించి తెలియాలి. విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఇంగ్లీష్ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించాను’అన్నారు కృతిశెట్టి. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో శనివారం కృతిశెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. నా పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటా నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేసుకుంటాను. ఆ కారెక్టర్ ఎలా ఉంటుంది.. ఆమె అలవాట్లు ఏంటి? ఆమె ఎలాంటి పాటలు వింటుంది అని నేనే సపరేట్గా రాసుకుంటాను. శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కీర్తి పాత్రకు తల్లి ఉండదు. తండ్రి పెంపకంలోనే పెరుగుతుంది. అప్పుడు కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని దర్శకుడికి చెప్పాను. అందుకే చేతికి మగాళ్ల వాచ్ ధరించింది.. కాస్త మాస్‌గా ఉంటాను. మూడు రోజులు ప్రాక్టీస్ చేశా.. చేతులు వణికిపోయాయి నాకు స్మోకింగ్ అంటే నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం అదే చాలెంజింగ్‌గా అనిపించింది. ఆ సీన్స్ తీసేయోచ్చా? అని దర్శకుడిని కోరాను. అది కీర్తి, నువ్ కృతి. తేడా ఉండాలి కదా? అని దర్శకుడు అన్నారు. ఆరోగ్య సేతు సిగరేట్లను తీసుకొచ్చారు. దాంట్లో ఓన్లీ మిల్క్ టేస్ట్ ఉంటుంది. సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. మొదటి రోజు ఫోటో షూట్ చేసేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. నానితో చాలా కంఫర్ట్ నాని గారితో నటించడం అంటే మొదట్లో నాకు భయం వేసింది. కానీ ఆయన సెట్లొ ఎంతో ప్రోత్సహించేవారు. ఆయన వరకు మాత్రమే కాకుండా ప్రతీ ఒక్కరి పర్ఫామెన్స్ చూస్తారు. బాగుందని అంటారు. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అంత కంఫర్ట్‌గా నటించగలిగాను. అవసరం అనిపిస్తే అలాంటి సీన్స్ చేస్తా బోల్డ్ సీన్స్ అంటే అంతా బ్యాడ్ అని అనుకుంటారు. ఏం చేసినా కూడా వృత్తి పరంగానే మేం చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంత కష్టపడతారో అన్ని సీన్లకు అలానే కష్టపడతారు. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాను. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తాను. లేదంటే నేను చేయను. శ్యామ్ సింగ రాయ్‌లో వాటితో కథ ముడి పడి ఉంది. నాన్న మెచ్చుకున్నారు నా ఫ్యామిలీ అంతా ఒక్కో చోట ఉంటారు. వారంతా ‘శ్యామ్ సింగరాయ్’సినిమా చూశారు. మా నాన్న సినిమాను చూసి నన్ను మెచ్చుకున్నారు. బాగా చేశావ్ అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు. విభిన్న పాత్రల్లో నటించాలి ఉప్పెన సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. కానీ ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే చాన్స్ వచ్చింది. ఉప్పెన తరువాత నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. కానీ మళ్లీ మళ్లీ అలాంటి పాత్రనే ప్రేక్షకులకు ఎందుకు చూపించాలి. కొత్తగా ఉంటుందనే ఈ పాత్రను ఎంచుకున్నాను. భిన్న పాత్రలను చేయాలని నాకు ఉంటుంది. పాత్ర నచ్చితే చాలు.. స్టోరీ గురించి ఆలోచించను స్టోరీ కంటే నా పాత్ర ఇంపార్టెన్స్ గురించి ఆలోచిస్తాను. ఇంటర్వెల్ వరకు ఉంటుందా? తరువాత ఉండదా? అని ఆలోచించను. నా పాత్రకు ప్రాముఖ్యత ఉందా? లేదా? అని అనుకుంటాను. రకరకాల పాత్రలను చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలను చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే విభిన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నాను. డబ్బింగ్ చెప్పాలని ఉంది నా పాత్రకు డబ్బింగ్ చెబుదామని అనుకున్నాను. కానీ కారెక్టర్ లుక్‌కి, నా వాయిస్‌కి మ్యాచ్ అవ్వలేదు. ఆ పాత్రకు బేస్ వాయిస్ కావాలని అన్నారు. కానీ నా వాయిస్ అలా ఉండదు. అందుకే డబ్బింగ్ చెప్పలేదు. సాయి పల్లవి పాత్ర చాలా నచ్చింది శ్యామ్ సింగరాయ్‌లో సాయి పల్లవి పాత్ర నాకు చాలా నచ్చింది. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. ఆమె స్క్రీన్ మీద చాలా బాగా చేశారనిపించింది. నేను సెట్లో సాయి పల్లవిని కలవలేదు. ఓ సారి సెట్‌కు వెళ్లాను గానీ ఆ రోజు సాయి పల్లవి షూటింగ్ లేదు. వాసు అంటే ఇష్టం నానిని అందరూ నాచురల్ స్టార్ అంటారు. ఆయన ఏ పాత్రను చేసినా ఆ పాత్రలోకి వెళ్లిపోతారు. ఆ కారెక్టర్‌ను అంత న్యాచురల్‌గా చేస్తారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లోని రెండు పాత్రల్లోనూ వేరియేషన్ ఉంటుంది. నాకు వాసు అంటేనే ఇష్టం. మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం. యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది నాకు యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉంది. అలాంటి ఆఫర్లు వస్తే యాక్షన్స్ సీక్వెన్స్‌ల్లో శిక్షణ తీసుకుంటాను. నేను ఇంత వరకు డ్యాన్స్‌లే చేశాను. అలాంటి యాక్షన్ సినిమాల్లో చేస్తే చాలెంజింగ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. ఓటీటీ ఆఫర్లు వస్తే కచ్చితంగా చేస్తాను. అమ్మతో కలిసి కథలు వింటా ఉప్పెన విడుదల కాక ముందే ఆఫర్లు వచ్చాయి. నా మీద నమ్మకం పెట్టుకుని ఆఫర్లు ఇస్తున్నారని ఆనందంగా అనిపించింది. నెరేషన్ ఇచ్చేటప్పుడు ఆడియెన్స్ కోణంలోనే వింటాను. నేను మా అమ్మ కలిసే కథను వింటాం. ఓకే చేస్తాం. నాకు ఆ పాత్ర సెట్ అవుతుందని అనిపిస్తేనే ఓకే చెబుతాను. కొత్త సినిమాలు కబుర్లు బంగార్రాజు షూటింగ్ నిన్ననే పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఫిబ్రవరిలో వస్తుందేమో. మాచర్ల నియోజకవర్గం ఏప్రిలోలో వస్తుంది. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు ఆ ఆలోచన కూడా లేదు. నాకు ఇక్కడే ఇంత ప్రేమ దొరుకుతోంది. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. -
‘శ్యామ్ సింగరాయ్’మూవీ రివ్యూ
టైటిల్ : శ్యామ్ సింగరాయ్ నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్ర,జిస్సు సేన్ గుప్తా, అభినవ్ గౌతమ్,మురళీశర్మ తదితరులు నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత : వెంకట్ బోయనపల్లి రచన : జంగా సత్యదేవ్ దర్శకత్వం : రాహుల్ సాంకృత్యన్ సంగీతం : మిక్కీ జే మేయర్ సినిమాటోగ్రఫీ : సను జాన్ వర్గేసే ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : డిసెంబర్ 24,2021 సినిమా ఫలితాలను పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేస్తూన్నాడు నేచురల్ స్టార్ నాని. అయితే గత రెండేళ్లేగా నానికి సరైన హిట్ మాత్రం దక్కలేదు. ఇటీవల విడుదలైన ‘టక్ జగదీష్’కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ‘శ్యామ్ సింగరాయ్’గా దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్ సింగరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. ‘శ్యామ్ సింగరాయ్’కథేంటంటే వాసు అలియాస్ వాసుదేవ్(నాని)కి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుగా ఓ షార్ట్ ఫిలీం తీయాలని డిసైడ్ అవుతాడు. దాంట్లో నటించేందుకు కీర్తి(కృతిశెట్టి)ని ఒప్పిస్తాడు. అనుకున్నట్లే తాను తీసిన షార్ట్ ఫిలీం ఓ ప్రొడ్యూసర్‌కి నచ్చడం...వెంటనే సినిమా ఆఫర్ ఇవ్వడం.. అది కూడా సూపర్ హిట్ కొట్టడంతో వాసు దశ మారిపోతుంది. తాను తీసిన తొలి సినిమానే హిందీలో రీమేక్ చేసే చాన్స్ వస్తుంది. ఓ నిర్మాణ సంస్థ అతనితో కొత్త సినిమా ఒప్పందం కుదుర్చుకొని, మీడియా సమావేశం పెడుతుంది. ఇదే సమయంలో కాపీ రైట్స్ కేసు కింద వాసు అరెస్ట్ అవుతాడు. ఈ కేసును ఎదుర్కొనే క్రమంలో వాసుకి శ్యామ్ సింగరాయ్, దేవదాసి మైత్రి(సాయి పల్లవి) గురించి తెలుస్తోంది. అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు? వాసుకి, శ్యామ్ సింగరాయ్‌కి సంబంధం ఏంటి? వాసుపై కాపీరైట్స్ కేసు ఎవరు, ఎందుకు వేశారు? మైత్రి, శ్యామ్ సింగరాయ్ల ప్రేమ వ్యవహారం ఎక్కడికి దారి తీసింది? ఈ లీగల్ సమస్యల్లోనుంచి వాసు ఎలా బయటపడ్డాడు?అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. వాసు అనే అప్‌కమింగ్ డైరక్టర్ పాత్రతో పాటు విప్లవ రచయిన శ్యామ్ సింగరాయ్ అనే పాత్రలోనూ ఒదగిపోయాడు. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలను అవలీలగా పోషించాడు. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ అనే బరువైన పాత్రలో అద్భుతంగా నటించి.. మరోసారి నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాలో నాని తర్వాత బాగా పండిన పాత్ర సాయిపల్లవిది. దేవదాసి మైత్రి అలియాస్ రోజీ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. తెరపై సరికొత్తలో లుక్‌లో కనిపించింది. సినిమా ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా.. తెరపై సాయి పల్లవి కనిపించదు.. కేవలం దేవదాసి మైత్రి మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. వాసు ప్రేయసి కీర్తి పాత్రలో కృతిశెట్టి మెప్పించింది. నాని, కృతిశెట్టిల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ బాగా పండింది. లాయర్ పద్మావతిగా మడొన్నా సెబాస్టియన్ పర్యాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. 1969 బ్యాక్ డ్రాప్ కథని నేటికి ముడిపెట్టి చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. ఫస్టాఫ్ అంతా నానీ శైలీలో సరదాగా సాగేలా పాత్రలను తీర్చిదిద్దిన దర్శకుడు.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించాడు. టైటిల్ జస్టిఫికేషన్ ప్రకారం చెప్పాలంటే.. సెకండాఫ్ నుంచే ‘శ్యామ్ సింగరాయ్’సినిమా మొదలవుతుంది. సినిమా కథంతా ‘శ్యామ్ సింగరాయ్’చుట్టే తిరుగుతుంది. విప్లవ రచయితగా శ్యామ్ సింగరాయ్ పోరాటం.. దేవదాసి మైత్రితో ప్రేమాయణం, దేవదాసిల వ్యవస్థలోని లోపాలను అద్బుతంగా తెరకెక్కించాడు. జంగా సత్యదేవ్ రాసిన కథని ఎక్కడా డీవియేట్ కాకుండా తెరపై చక్కగా చూపించాడు. ‘ఒక తూటా ఒక్కరికే ...ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది’అనే ఒకే ఒక డైలాగ్‌తో శ్యామ్ సింగరాయ్ వ్యక్తిత్వం ఏంటి? అతని లక్ష్యం ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాడు. అయితే కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం, ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం సినిమాకి మైనస్. ద్విపాత్రాభినయం సినిమాలలో ఫస్టాఫ్ అంతా సింపుల్‌గా నడిపించడం.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించడం కామన్. ఈ మూవీ కూడా అలాగే సాగుతుంది. ఇంటర్వెల్ వరకు శ్యామ్ సింగరాయ్ పాత్రని చూపించొద్దు కాబట్టి.. కథంతా వాసు, కీర్తిల చుట్టూ తిప్పారు. దర్శకుడిగా అతను పడే కష్టాలు.. కీర్తితో ప్రేమ.. ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్‌ని ముగించాడు. ఇక సెకండాఫ్‌లో పూర్తిగా శ్యామ్ సింగరాయ్ గురించే ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా అంతంత మాత్రంగా ఉంది. అయితే శ్యామ్ సింగరాయ్ గురించే తెలుసుకోవాలని సినిమా స్టార్టింగ్ నుంచి మనకి అనిపిస్తుంది కాబటి... స్క్రీన్‌ప్లే పెద్దగా ఇబ్బంది అనిపించదు. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా ఉంటుంది. ఇక సాంకేతిక విషయానికొస్తే.. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. సిరివెన్నెల రాసిన ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే పాట మరోసారి సిరివెన్నెలను స్మరించుకునేలా చేస్తుంది. మిగతా పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా హైలెట్. నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘శ్యామ్ సింగరాయ్’ ట్విటర్ రివ్యూ
నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ మూవీలోనాని.. వాసు, శ్యామ్ సింగరాయ్ అనే రెండు విభిన్న పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్ సింగరాయ్’పై హైప్ క్రియేట్ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి వస్తున్న నాని సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. శ్యామ్ సింగరాయ్‌గా నాని ఏమేరకు ఆకట్టుకున్నాయి? మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #ShyamSinghRoy Movie mottam bagundhi okka aah court lo argument tappa .. Adhokkati antha effective anipinchaledhu — Chaitanya (@chaitutarak9999) December 24, 2021 రెండు విభిన్న పాత్రలో నాని ఒదిగిపోయాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.మిక్కీజెమేయర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయిందట. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని, క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. రెండేళ్ల తర్వాత థియేటర్లోకి వచ్చిన నాని.. హిట్ కొట్టాడని ఎక్కువ మంది కామెంట్ చేశారు. Review: #ShyamSinghRoy Positives: 1. Nani 2. 2nd Half 3. Climax 4. Music Negatives: 1. Slow 1st half 2. Climax Reason why I put climax in both positives and negatives is that not all might like it!! I personally feel the climax is very poetic!!! Rating: 3/5 — AJ890 (@AJ89010) December 24, 2021 #ShyamSinghRoy A Must Watch Film 🔥 @Nani #Nani Performance 👏💥@MickeyJMeyer Bgm 🔥@Rahul_Sankrityn Completely justified This hype 👏🔥@Sai_Pallavi92 #SaiPallavi Brilliant performance👏 ❤ — Yakhub mohd (@mohd_yakhub) December 24, 2021 Jayam manadhera favor la undi cinema #ShyamSinghRoy — HappyGaVundu (@endakalam) December 24, 2021 First half: Decent first half with good introduction of CHARECTERS. Flash back scenes of #ShyamSinghRoy with #mickyjmayer BGM IS AWSOME. JUST going to main theme.@NameisNani awesome always.@IamKrithiShetty has decent role. @madonasbastuan good @rahulsankrity17 bro awesome you 👌 pic.twitter.com/rrqGYl4R5f — Praveen Chowdary Kasindala (@PKasindala) December 23, 2021 #ShyamSinghaRoy 1st 20 min slightly slow then story pickups pre interval scenes are to good 2nd half Nani is at his best Temple flight and dailouge 👌👌 story 👌👌 Direction - avg 2nd half songs 👌 Sai pallavi okok Overall Nani best performance 3/5 hit depends on mass audience https://t.co/NJ3C37ItzI — mithun chowdary (@mithunc39061254) December 23, 2021 #ShyamSinghaRoy - Another Disappointing film from #Nani after Tuck Jagadish. Second half is a total let down😑 Full Review Soon! — Viswa (@Vish_Rish) December 23, 2021 Sai pallavi Sai pallavi saipllavi Chalu @Sai_Pallavi92 🥰 Intha kanna hard core fan emi kavali #ShyamSinghaRoy Reviews 👌👌👌 Happy for Nani 😍 pic.twitter.com/Nl25LEdEuD — Kings (@Observe99945) December 23, 2021 Powerful intro of #SaiPallavi with that NATYAM 👌👌 Her expressions, postures, dance movements are just killing..killing 🔥🔥 That song & visuals are too good on screen.. this gave a good start for 2nd half#ShyamSinghaRoyPremiers #ShyamSinghRoy #Nani #ShyamSinghaRoyOnDec24th pic.twitter.com/TDaaTCIMRg — So Called Cinema (@socalledcinemaa) December 23, 2021 So hit kottesadu nani ayithe 👏🏻 this movie I vl remember as sirivennela gaari chivari sahityam 🙏🏻🙌🏻❤️ #ShyamSinghRoy — Haripriya❤️🔔 (@Priyaa_tweet) December 24, 2021 Show over for #ShyamSinghaRoy. overall a decent movie, only climax was weak. It feels like there is no payoff. 3/5 stars from me. #Nani #SSR #mickeyjmeyer #saipallavi — x0’s Reviews (@ripscrew2nite) December 23, 2021 #ShyamSinghaRoy falls flat in 2nd half😥. Nani was Natural as usual 😎💯. Average watch🙄. 1st half was interesting but second half could have been better. An average outing😅😢. Expected more😭. @MickeyJMeyer must songs & BGM main asset fr sure👌😥. @NameisNani @IamKrithiShetty pic.twitter.com/kRL09ASkVr — Shyam (Love All. Serve All. Help Ever. Hurt Never) (@SaiShyamManohar) December 23, 2021 -
'శ్యామ్ సింగ రాయ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
Shyam Singha Roy Movie Tara Song Lyrical Video Released: నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. సాయిలపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. మడోన్నా సెబాస్టియన్ మరో హీరోయిన్గా నటించింది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ టీం.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్‌ని రిలీజ చేసింది. "తెరపైన కదిలేలా కథలేవో మొదలే .. తార నింగిదిగి నేల .. కింద నడిచేలా .. వచ్చేనిలా " అంటూ ఈ పాట సాగుతుంది. నాని, కృతిశెట్టిలపై ఈ పాటను చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
శ్యామ్ సింగ రాయ్ చిట్‌చాట్ ఫొటోలు
-
బాలకృష్ణ విషయంలో అవేవీ నిజం కావు: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారంనాడు నాని మీడియాతో ముచ్చటించారు. ► నేను మామూలుగానే థియేటర్లో సినిమా చూసేందుకు ఇష్టపడతాను. నేను సత్యం థియేటర్ గురించి ఎక్కువ మాట్లాడతానని అందరికీ తెలుసు. థియేటర్లో వెనకాల నిల్చుని సినిమా చూస్తుంటాను. రెండేళ్ల తరువాత ఇలా శ్యామ్ సింగ రాయ్‌తో వస్తున్నందుకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది. ► కథలో చాలా దమ్ముంటేనే పీరియడ్ సినిమాలు తీయాలి. శ్యామ్ సింగ రాయ్‌కి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు, మంచి టెక్నీషియన్స్ కూడా దొరికారు. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. ఇలా ప్రొడక్ట్ మొత్తం పూర్తయిన తరువాత చూసుకుంటే మళ్లీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సినిమా పట్లా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ► కమల్ హాసన్ సినిమా నాయకుడుకి, ఈ మూవీకి సంబంధం ఉండదు. కానీ కమల్ గారి అభిమానిని అవ్వడంతో ఎక్కడో చోట ఆయన ప్రభావం ఉంటుంది. కానీ కథ పరంగా ఎక్కడా పోలిక ఉండదు. శ్యామ్ సింగ రాయ్ కోసం ప్రత్యేకంగా వెయిట్ పెరగడం వంటివి ఏం చేయలేదు. కానీ మీకు అలా అనిపిస్తుంది. నడిచే విధానం, మాట్లాడే తీరును బట్టి ఆ తేడాను మనం చూపించొచ్చు. ► క్యాస్ట్యూమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. జూనియర్ ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా ఎంతో శ్రద్ద తీసుకున్నారు. ప్రతీ రోజూ రెండొందల మంది ఉండేవారు. వారికి కూడా స్పెషల్ క్యాస్టూమ్స్ డిజైన్ చేశారు. ► ఇందులో డైరెక్టర్‌గా పని చేశాను. నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. కానీ వాసుకి చాలా కంఫర్ట్స్ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాలను మాత్రం ఇందులో చూపించలేదు. ఎంటర్టైనింగ్ గానే చూపించాం. ► శ్యామ్ సింగ రాయ్‌లో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. వాటిని ఎపిసోడ్స్‌లా చూడటం నాకు నచ్చదు. కానీ అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయి. వాటిని ఈ కథలో మలిచిన తీరు అద్భుతంగా ఉంటాయి. అవి స్టోరీ మీద ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. ► జెర్సీ డైరెక్టర్ గౌతమ్‌లోని క్వాలిటీస్..శ్యామ్ సింగ రాయ్ దర్శకుడు రాహుల్‌లో చూశాను. చిన్న చిన్న వాటికి చాలా ఎగ్జైట్ అవుతారు. ఆ వయసులో ఆ మెచ్యూరిటీ అరుదుగా ఉంటుంది. చాలా సెటిల్డ్‌గా ఉంటారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాహుల్‌ను అలా చూసి షాక్ అయ్యాను. అంతలా ఎప్పుడూ మాట్లాడలేదు. సెటిల్డ్‌గా ఉండే వారంతా కూడా వారి ఎనర్జీని అలా దాచుకుంటారేమో. ఆయనకు ఎంతో క్లారిటీ ఉంటుంది. ప్రతీది డీటైల్డ్‌గా చెప్పి మరీ చేయించుకుంటారు. తనకు లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే ఇంకెంత డీటైల్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ► ఎంసీఏ సినిమాకు టక్ జగదీష్ సినిమాకంటే తక్కువగా రివ్యూలు వచ్చాయి. కానీ నా కెరీర్లో ఎంసీఏ బ్లాక్ బస్టర్ హిట్. అయితే వీ, టక్ జగదీష్ సినిమాల పట్ల నిర్మాతలు, అమెజాన్ కూడా హ్యాపీగా ఉంది. హయ్యస్ట్ వ్యూస్, సబ్ స్క్రిప్షన్స్ పెరిగాయని అన్నారు. కానీ ఇక్కడ మీకు ఎంసీఏకు చూపించినట్టుగా లెక్కలు చూపెట్టలేకపోతోన్నాం. ప్రేక్షకులంతా సినిమాలు చూడాలని అనుకున్నామంతే. ► నేను థియేటర్ కోసం సినిమాను దాచాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా సినిమాలు చేయాలి. ఏ రోజైతే థియేటర్లు స్టార్ట్ అవుతాయో ఆ రోజు ఇలాంటి ఓ సినిమాను రెడీగా పెడతాను అని నాకు తెలుసు. ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమైనా అవుతుందా? అనే భయాలేవి నాకు లేవు. జెర్సీ తరువాత నాకు ఎంతో సంతృప్తినిచ్చింది శ్యామ్ సింగ రాయ్. అప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ఇప్పుడు అలాంటి ఫీలింగ్ ఉంది. ► సిరివెన్నెల గారు మాకు పాట రాయడం ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఇది చివరి పాట అవుతుందేమో అని సిరివెన్నెల గారు అన్నట్టుగా రాహుల్ నాతో చెప్పాడు. కానీ అలా అవుతుందని మేం అనుకోలేదు. ఆ పాటలోనే సినిమా మొత్తం చెప్పేశారు. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అలాంటి రచయిత ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇలాంటి ఓ పాట రాయాలంటే ఇప్పుడు ఎవరున్నారు. ఎవరు లేరు. ఎండ్ ఆఫ్ ది ఎరా. అలాంటి పాట ఆయన శ్యామ్ సింగ రాయ్‌కు రాయడం అనేది వరం. ఆయన్ను సెలెబ్రేట్ చేసుకునే బాధ్యత మా మీద పెట్టినట్టు అయింది. ఇది మాకు ఎమోషనల్ ఎలిమెంట్ అయింది. ఆయనకు నివాళిగా ఈ సినిమా మొదలవుతుంది. ఆయన రాసేందుకు సరిపడా సినిమాను ఇచ్చామన్న సంతృప్తి మాకు వచ్చింది. ► దసరా సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ యాసను తెలంగాణ వారి కంటే స్పష్టంగా పలుకుతాను. ప్రస్తుతం నా చేతిలో అంటే సుందరానికీ, దసరా సినిమాలున్నాయి. బాలకృష్ణ గారి గురించి బయట ఎన్నెన్నో వింటాం. కానీ అవేవీ నిజం కావు. ఆయనది చిన్న పిల్లాడి మనస్తత్వం. అందరితోనూ ఒకేలా ఉంటారు. ► నా తదుపరి చిత్రాలు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తాం. హిందీకి సరిపడా కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. జెర్సీ సినిమా పాన్ ఇండియాగా చేయాల్సింది. కానీ అప్పుడు ఆ ఆలోచన రాలేదు. నేను చేయలేదు కాబట్టి షాహిద్ కపూర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా? (నవ్వులు) ► ఈగ సినిమాతో సౌత్ అంతా కూడా బాగా పాపులర్ అయ్యాను. నాని అంటే మా హీరో అన్నంతగా మారిపోయాను. చెన్నై, బెంగళూరు వంటి చోట్లకు వెళ్తే జనాలు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. -
బయటికొచ్చిన శ్యామ్ సింగరాయ్ స్టోరీ!, ఆసక్తి పెంచుతున్న స్క్రిప్ట్
Nani Shyam Singha Roy Movie Story Goes Viral In Social Media: ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించించిన నాని ‘వి, టక్ జగదీష్’ చిత్రాలు ఓటీటీలో విడుదల అవ్వడం, అవి నిరాశపరచడంతో ఈ సారి శ్యామ్ సింగరాయ్ మూవీతో హిట్ కొట్టాలి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు నాని. ఇటీవల షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్దమైంది. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలై ట్రైలర్ చూసి ఈ మూవీ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నారు. చదవండి: చిరు చేతుల మీదుగా అరుణా రెడ్డికి కియా కారు కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ కథను వివరిస్తూ పోస్టులు దర్శనమిస్తున్నాయి. సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తాడు నాని. అప్పటికే షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించి.. కథ కోసం కోల్‌కతా వెళతాడు. అక్కడ ఒకప్పటి రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుంది. అతడి గురించి ఎక్కువగా స్టడీ చేస్తే తరుణంలో ఆ పాత్రలో తనని ఊహించుకుంటాడు నాని. చదవండి: సెట్లో సుకుమార్‌ను ‘నిన్ను తగలేయా’ అని తిట్టుకునే వాడిని: బన్నీ తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. కాకపోతే ఇంటర్వెల్ ముందు వరకు దీన్ని రివీల్ చేయకుండా స్క్రీన్ ప్లేతో రాహుల్ మ్యాజిక్ చేశాడని తెలుస్తోంది. చంద్రముఖి సినిమాలో జ్యోతికలా ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని ప్రవర్తన ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కథ చాలా ఆసక్తికగా ఉందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
Sai Pallavi Special Story: నిజంగానే సింగిల్ పీస్!!
సాక్షి, హైదరాబాద్: హీరోయిన్ ఫార్మాట్ నే మార్చి పారేసిన టాలెంటెడ్ యాక్ట్రెస్..నాట్య మయూరి సాయి పల్లవి. అద్భుతమైన నటన. అంతకుమించిన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్గా సాయి పల్లవి తన ప్రత్యేకను చాటుకుంటోంది. యాక్టింగ్, డాన్సింగ్ కలగలిసిన నటి ఆమె. డాన్స్‌కి తనదైన క్లాసికల్ టచ్..అసలు ఆ పేరు వింటేనే అదో జోష్. అదొక మాగ్నటిక్ పవర్. హీరోయిన్ అంటే ఇలానే ఉండాలన్నంత అభిమానం.. ప్రేమ. తన కోసమే ఆడియెన్స్‌ను థియేటర్లను రప్పించుకొనేంత పాపులారిటీ. తాజాగా శ్యామ సింగరాయ్ సినిమాతో మ్యాజిక్ మరోసారి రిపీట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆమెతో డాన్స్ చేయాలనే కోరికను వ్యక్తం చేయడం విశేషం. ఫిదా మూవీలో స్వయంగా స్టార్ హీరోయిన్ సాయిపల్లవి చెప్పినట్టు నిజంగానే ఆమె సింగిల్ పీస్. మిగతా హీరోయిన్లతో పోలిస్తే చాలా డిఫరెంట్. సినిమాల ఎంపికలోనే కాదు ఆకట్టుకునే అందం..అంతకుమించిన అద్భుతమైన నటన వీటన్నింటికీ మించి సూపర్ డాన్స్‌తో అందరిని ఫిదా చేస్తుంది. కేరెక్టర్ ఏదైనా ఆ పాత్ర తప్ప, సాయి పల్లవి కనిపించదు ప్రేక్షకులకు. పెర్ఫామెన్స్ ఓరియంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పకుంటూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తనకు నచ్చని కథలను రిజెక్ట్ చేయడమే కాదు కోట్లాది రూపాయలు కుమ్మరించే యాడ్స్ వైపు కన్నెత్తి కూడా చూడని మనస్తత్తం ఆమెది. గొప్ప బ్రాండ్స్‌గా భావించే కంపెనీల కమర్షియల్ యాడ్స్‌ను తిరస్కరించి విమర్శకులను సైతం ఫిదా చేసింది సాయి పల్లవి. చిన్నప్పటినుంచీ మంచి డ్యాన్సర్ కావడంతో సాయి పల్లవికి నాట్యం నేర్పించారు ఆమె తల్లిదండ్రులు. అలా మలయాళంలో వచ్చిన ‘ప్రేమమ్'లో తనదైన స్టెప్పులతో ప్రేక్షక జనాన్ని తనవైపు తిప్పుకుంది. ఇక తెలుగులో ‘ఫిదా' మూవీతో భారీ హిట్‌ను సాధిచింది. ఆమె కరియర్లో ప్రతీ సినిమా దేనికదే ప్రత్యేకం. దాదాపు అన్ని సూపర్ డూపర్ హిట్స్. మరికొన్ని బాక్సాఫీసు వద్ద రికార్డులను క్రియేట్ చేశాయి. ఫిదాలోని అన్ని పాటలు హిటే. అలాగే తమిళ స్టార్‌హీరోతో ధనుష్‌తో నటించిన ‘మారి 2'లో రౌడీ బేబీ పాట రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి నటించిన హిట్మూవీ లవ్‌స్టోరీ . ఈ మూవీలోని సారంగధరియా సృష్టించిన హంగామా గురించ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమేలేదు. కేవలం సాయి పల్లవి డ్యాన్స్కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారంటే అతిశయోక్తికాదు. ఆమె డ్యాన్స్‌కు ఫిదా కాని వారు ఉంటారా అసలు. ఈ నేపథ్యంలోనే సినీ దర్శక నిర్మాతలు కూడా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన సాంగ్ ఉండేలా జాగ్రత్త పడతారు. ముఖ్యంగా తాజాగా శామ్ సింగరాయ్ ఈ సినిమాలోని ఒక పాట క్లాసికల్ డ్యాన్స్ కోసం పగలు ప్రాక్టీసు, రాత్రి షూటింగ్ ఇలా ఏడు రోజులపాటు చాలా కష్టపడిందట అంతేకాదు పడి పడి లేచే మనసు వసూళ్ల విషయంలో నిరాశపర్చడంతో.. తన రెమ్యూనరేషన్‌ను వెనక్కి ఇచ్చేసిందని ఇండస్ట్రీ టాక్. దటీజ్ సాయి పల్లవి. తెలుగులో ‘ఎంసీఏ', ‘పడి పడి లేచే మనసు' ‘కణం' సూర్యా 36, మూవీలతో ఆకట్టుకుంది. అలాగే ‘అనుకోని అతిథి’ మూవీలో మానసిక సమస్యతో బాధపడే క్యారెక్టర్లో సాయి పల్లవి యాక్టింగ్ నభూతో నభవిష్యతి. వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్‌తో పోటీపడి మరీ నటించింది. విలక్షణ నటుడు రానాతో విరాటపర్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామంలొ పుట్టిన సాయి పల్లవి దక్షిణాదిన వరస విజయాలతో దూసుకుపోతోంది. -
అభిమానుల నుంచి నానికి అదిరిపోయే గిఫ్ట్.. థియేటర్ ముందు భారీ కటౌట్
Natural Star Nani 63 Feet Huge Cutout In Hyderabad: సినిమా హీరోలను అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. ఎవరిమీద చూపినంచా ప్రేమ ఒలకబోస్తారు. తమ ఫేవరెట్ హీరోలను 'అన్న' అని పిలుస్తూ ఇంట్లో మనిషిలా భావిస్తారు. అలాంటిది వారి అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే ఊగిపోతారు. అది పెద్ద పండగలా జరుపుకుంటారు. కటౌట్లు, పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుతారు. తాజాగా నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ తమ అభిమానాన్ని భారీ కటౌట్ రూపంలో ప్రదర్శించారు. నాని ద్విపాత్రాభినయం చేసిన తాజా సినిమా 'శ్యామ్ సింగరాయ్'. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాని హార్ట్‌కోర్ ఫ్యాన్స్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని ఓ థియేటర్ ముందు నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. 63 అడుగులతో 'శ్యామ్ సింగరాయ్' పాత్రలో ఉన్న నాని కటౌట్‌ను పెట్టి తమ అభిమానాన్ని అంత ఎత్తులో చూపించారు. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి బడా హీరోల అభిమానులు మాత్రమే ఇలా కటౌట్లు ఏర్పాటు చేసేవారు. తాజాగా చిన్న స్థాయి నుంచి ఎదిగిన నాని భారీ కటౌట్‌ను ఫ్యాన్స్ ఏర్పాటు చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పునర్జన్మ నేపథ్యంలో రూపొందించారు. సాయి పల్లవి దేవదాసిగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్వకత్వం వహించగా జంగా సత్యదేవ్ కథను అందించారు. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ తమిళ వెర్షన్‌కు నాని సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. The Celebrations Kick Starts in Advance for #ShyamSinghaRoy 🔱 Here are few Delightful Glimpses✨ from the ROYAL CUT OUT unveiling by Natural 🌟 @NameisNani Fans 😎#SSRonDEC24th🔥@Sai_Pallavi92 @IamKrithiShetty @vboyanapalli @Rahul_Sankrityn @MickeyJMeyer @NiharikaEnt pic.twitter.com/XVCgxdOaBe — Shyam Singha Roy 🔱 (@ShyamSinghaRoy) December 22, 2021 ఇదీ చదవండి: పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ? -
కథ విన్న వెంటనే నాని ఓకే చేశారు: శ్యామ్ సింగరాయ్ రచయిత
Writer Satyadev Janga About Shyam Singha Roy Movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జంగా సత్యదేవ్ కథను అందించారు. వినూత్నమైన కథాంశంతో రానున్న ఈ సినిమా రచయితగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని సత్యదేవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే నాని ఓకే చేశారు. ఈ చిత్రంలో ఆయన పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. త్వరలో హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను.నేను రెడీ చేసిన ఒక ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీని ప్రముఖ బ్యానర్ ఓకే చేసింది.త్వరలో వాటి వివరాలు సత్యదేవ్ జంగా అధికారికంగా ప్రకటించనున్నారు అని పేర్కొన్నారు. ఈ కథను అద్భుతంగా చిత్రీకరించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్, హీరో నాని, నిర్మాత బోయనపల్లికి ధన్యవాదాలు తెలిపారు. -
పెళ్లి కూతురిలా సాయిపల్లవి.. ఫోటోలు వైరల్
Sai Pallavi Real Marriage Photos Viral: హీరోయిన్ సాయిపల్లవి ఓ ప్రముఖ హీరోను పెళ్లిచేసుకుంది. వేద పండితులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సాయపల్లవి చేసుకుంది రియల్ పెళ్లి కాదు..రీల్ పెళ్లి మాత్రమే. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను పునర్జన్మ నేపథ్యంలో రూపొందించారు. ఇందులో నాని డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో మూవీ ప్రమోషన్లలో టీం ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే సాయిపల్లవిని కోల్‌కతా సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఫోటోలను నాని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
అందుకే ఎమోషనల్ అయ్యా : సాయి పల్లవి
‘శ్యామ్ సింగ రాయ్ ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు కృతజ్ఞతతో వచ్చాయి. అక్కడ అనురాగ్ కులకర్ణి పాట పాడారు. కొంతమంది డాన్స్ చేశారు. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో కళ ఉంది. మనకు ఏమీ రాకున్నా ఆ కళలను చూసి ఎంజాయ్ చేయగలుగుతున్నాం. అదే ఆ దేవుడు మనకు ఇచ్చిన పెద్ద ఆశీర్వాదం. అవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఎమోషనల్ అయిపోయా. మనం చేసే పని చుట్టూ ఉన్న వాళ్లకి సంతోషానిస్తే.. అంతకంటే అదృష్టం ఏముంటుంది. నాకు ఆ అవకాశాన్ని ఇచ్చిన దర్శకులు, నిర్మాతలకు రుణపడి ఉంటాను’అన్నారు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. అందుకే దేవదాసి క్యారెక్టర్ చేశా ప్రతి మూవీ నాకు నమ్మకం కలిగాకే చేస్తాను. అలాగే స్క్రిప్ట్ చదివేటప్పుడు 'సినిమా ఇలా ఉంటుంది, నా పాత్ర అలా చేయొచ్చు' అని ఒక ఐడియా వస్తుంది. చిన్నప్పుడు మనం చరిత్ర చదువుతున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని ఊహించుకుని ఉంటాం. శ్యామ్ సింగరాయ్‌లో స్క్రిప్ట్ చదివేటప్పుడు దేవదాసి క్యారెక్టర్ ఎలా చేయాలి అనేదాని కంటే వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుంది అని చెప్పడం నచ్చింది. వేరే సినిమాలతో పోలిస్తే ఈ సినిమాను సైకాలజీ పరంగా చేశాను. ఎంత కావాలో అంతే చూపించాం దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ప్రారంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నారు. తర్వాత తర్వాత దాని అర్థమే మార్చేశారు. వాళ్ల గురించి ఈ సినిమాలో పూర్తిగా చూపించలేదు.. ఎంత కావాలో అంతే తీసుకున్నాం. 'శ్యామ్ సింగ రాయ్' పాత్రతో పాటు దేవదాసి పాత్ర ఎంత చూపించాలో, అంతే చూపించారు. ఇది పూర్తిగా దేవదాసి వ్యవస్థపై తీసిన సినిమా కాదు. క్లాసికల్ డాన్స్ రాదు నేను డాన్స్ ఎక్కువ చేసింది 'లవ్ స్టోరీ'లోనే అనుకుంటా..ఈ సినిమాలో డాన్స్ ఎంత కావాలో... అంతే పెట్టారు. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. ఇప్పటి వరకు నేర్చుకోలేదు. నేను చేయగలుగుతానని రాహుల్ నమ్మారు. నాతో పాటు పాటలో క్లాసికల్ డాన్స్ చేసిన వారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు. ఈ మూవీలో ఓ పాటకు డాన్స్ చేసేటప్పుడు చాలా భయపడ్డాను. వాళ్లతో ఒకేలా చేశానని అంటే అదే పెద్ద సక్సెస్ అనుకున్నాను. మామూలు సాయి పల్లవినే నా బ్రెయిన్ లో నేను ఎప్పుడూ మామూలు సాయి పల్లవినే అనుకుంటా. అయితే...నేను చేసే సినిమాలు చాలామందికి సంతోషం ఇస్తుందంటే ఎమోషనల్ అయ్యాను. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలకు... ప్రేక్షకులు అందరికీ రుణపడి ఉంటాను సాయి పల్లవి కనిపించదు అన్ని మూవీస్‌కి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయితేనే స్క్రీన్ మీద యాక్టింగ్ బావుంటుంది అనిపిస్తుంది. లేదంటే డిఫరెన్స్ తెలుస్తుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి కనిపించదు..దేవదాసి పాత్రే కనపడుతుంది. అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్ 'ఎంసీఏ` టైమ్‌లో నాకు, నానిగారికి సన్నివేశాలు తక్కువ. సినిమాలో 20-30 పర్సెంట్ మాత్రమే ఉంటాయి. అందుకని నేను ఎలా ఉంటానో...అందులో అలాగే ఉన్నాను. నానిగారు కూడా అంతే! డిఫరెంట్‌గా ఏమీ ట్రై చేయలేదు. 'శ్యామ్ సింగ రాయ్'లో మా క్యారెక్టర్స్ వేరేలా ఉన్నాయి. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఇంకా కొంచెం డీప్‌గా ఉన్నాయి. అప్పుడూ, ఇప్పుడూ సేమ్ కంఫర్ట్. ఈ క్యారెక్టర్స్ కోసం మా మధ్య ఎక్కువ డిస్కషన్స్ ఉన్నాయి. మెడిటేషన్ చేయాలని ఉంది నాకు ఎందులో ప్యాషన్ ఉంది అంటే నాకు నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. యాక్టింగ్, డాన్స్, మెడిసిన్ కాకుండా మెడిటేషన్ చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే... నా గురించి, పరిస్థితుల గురించి లోతుగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి అనుకుంటున్నా. రాహుల్‌ని ఫోలో అయ్యాం అంతే.. రాహుల్ చాలా క్లారిటీతో సినిమా తీశారు. ఈ కథకి ఏం కావాలి ఏం వద్దు అనేది ఆయనకు పూర్తిగా తెలుసు. నాని, నేను షూటింగ్ చేసిన ఫస్ట్ సీన్... సినిమాలో మా ఇద్దరి క్యారెక్టర్స్ మధ్య లాస్ట్ సీన్. ఎలా చేయాలో మాకు తెలియలేదు. తను ఇలా చేయండి అని చెప్పారు మేం ఆయన్ని ఫాలో అయ్యాం అంతే... నచ్చితే వెబ్ సిరీస్ చేస్తా 'విరాట పర్వం` షూటింగ్ పూర్తయ్యింది.. నా పాత్ర డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. తమిళంలో ఓ సినిమా చేశా. అది కూడా త్వరలో విడుదల అవుతుంది. ప్రస్తుతం వెబ్ కంటెంట్ చదువుతున్నా...నచ్చితే తప్పకుండా చేస్తా (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
సాయిపల్లవి అందుకోసం ఏడురోజులు కష్టపడింది
Shyam Singha Roy Movie Director Rahul Sankrityan: నేచురల్ స్టార్ నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగ రాయ్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ► సత్యదేవ్ జంగా గారు ఈ కథ బెంగాల్లో జరుగుతుందని చెప్పగానే చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ కథ మీద వర్క్ చేయడానికి స్కోప్ ఉందనిపించింది. క్యారెక్టర్స్ చాలా బాగా కుదిరాయి. దాన్ని ఇంకా ఎంత బెటర్‌గా చేయొచ్చు అనే దానిపై వర్క్ చేశాను. లాక్డౌన్లో దొరికిన టైమ్‌ను బాగా ఉపయోగించుకున్నాను. లక్కీగా ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్‌కు తగ్గ ఆర్టిస్టులు దొరికారు. ► కథ పూర్తిగా డెవలప్ చేశాక నేరుగా నానిగారి దగ్గరకే వెళ్లి నరేషన్ ఇచ్చాను. మరో ఆప్షన్ కూడా అనుకోలేదు ..ఆ పాత్రలో నానిగారు తప్ప మరెవ్వరూ కనపడలేదు. ► ఎడిటర్ నవీన్ నూలి జర్సీకి పని చేశారు కాబట్టి ఆయన్నే తీసుకున్నాం. సినిమాటోగ్రాఫర్‌గా ముందు రవివర్మన్ అనుకున్నాం. కానీ అప్పుడు ఆయన పొన్నియన్ సెల్వమ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. మ్యూజిక్ రెహమాన్ అనుకున్నాం కుదరకపోవడంతో మిక్కీ జే మేయర్‌ను సజెస్ట్ చేశాను. సాను జాన్ వర్గీస్‌ను నాని సజెస్ట్ చేశారు. హీరోయిన్గా సాయి పల్లవి ఫస్ట్ ఆప్షన్. నానికి ఈ విషయం చెప్పగానే తను చేస్తే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుందని ఎగ్జయిట్ అయ్యారు. ► దేవదాసి వ్యవస్థ అనే పాయింట్ కథ ప్రకారం పశ్చిమ బెంగాల్లో స్టార్ అయిన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ప్యాన్ ఇండియా స్థాయిలో దానిని చర్చిస్తాం. ఈ సినిమాలో దేవదాసి వ్యవస్థ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాదు. కథలో క్యారెక్టర్‌కి భాగంగా తీసుకున్నదే.. దానికి వ్యతిరేకంగా లీడ్ క్యారెక్టర్ పోరాడుతాడు. సమాజానికి మంచి సందేశం ఇస్తాడు. ► నాని గారితో గతంలో ఒక సబ్జెక్ట్ గురించి చర్చించాను. అది కుదరలేదు. కాని ఆయన ఎలాంటి కథల మీద ఇంట్రెస్ట్‌గా ఉంటారని ఒక ఐడియా ఉంది. ఈ సబ్జెక్ట్ చెప్పగానే ఫస్ట్ సిట్టింగ్‌లోనే ఒకే చేశారు. అప్పటి నుంచే నన్ను నమ్మడం మొదలైంది. ఈ రోజు వరకూ ఆ నమ్మకం పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడా తగ్గలేదు. ఆయన సపోర్ట్ వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయగలిగాను. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ కూడా అనుకున్నాం. ► క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ చాలా చాలెంజింగ్ అనిపించింది. రెండు రోజులు షూటింగ్ చేశాం. అది ఎందుకు అనేది సినిమా విడుదలయ్యాక చెప్తాను. ► సాయి పల్లవి మంచి డ్యాన్సర్..ఈ సినిమా కోసం క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. పగలంతా రిహార్సల్ చేయడం రాత్రి పెర్ఫామ్ చేయడం అలా ఏడు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ కంటిన్యూగా చేసింది. ప్రస్తుతం టైమ్ ట్రావెల్ జోనర్లో ఒక కథ రెడీగా ఉంది. అది మరో డిఫరెంట్ జోనర్.. ఈ సినిమా తర్వాత దాని గురించి ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చాడు రాహుల్. 'శ్యామ్ సింగరాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు చూసేయండి -
పునర్జన్మపై నమ్మకం ఉందన్న సాయి పల్లవి.. అదెలా అంటే ?
Sai Pallavi Believes In Reincarnation And Here Is How: సాయి పల్లవి. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 'వచ్చిండే మెల మెల్లగా వచ్చిండే', 'దాని కుడి భుజం మీద కడవ' పాటలకు సాయి పల్లవి చేసిన డ్యాన్స్‌తో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తన నాట్యం, హావాభావాలతో ఆ పాటలకు మరింత పేరు వచ్చింది. దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా సాయి పల్లవి కొనసాగుతోంది. ప్రస్తుతం నానికి జంటగా సాయి పల్లవి నటించిన సినిమా 'శ్యామ్ సింగరాయ్'. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి, మడొన్నా సెబాస్టియన్లు కూడా ఉన్నారు. అయితే ఈ చిత్రం పునర్జన్మ, బెంగాల్ నేపథ్యంతో తెరకెక్కింది. ఇదీ చదవండి: ఇప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది.. చెల్లిపై సాయి పల్లవి ఎమోషనల్ పోస్ట్ శ్యామ్ సింగరాయ్ సినిమా గురించి సాయి పల్లవి 'నానితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. మేము మా పాత్రల గురించి, వాటిని ఇంకా బాగా ఎలా పోషించాలి అనే మాట్లాడుకునేవాళ్లం. ఎడిట్ చేసిన తర్వాత కూడా సీన్లను పరిశీలించి నోట్స్ షేర్ చేసుకునేవాళ్లం.' అని చెప్పింది. అలాగే పునర్జన్మను నమ్ముతారా అని సాయి పల్లవిని అడిగినప్పుడు ఆమె ఆసక్తికర విషయాలు చెప్పింది. 'అప్పుడప్పడు నేను ఒక యువరాణిని అనే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను ఆరు, ఏడు తరగతుల్లో ఉన్నప్పుడు ఈజిప్ట్ యువరాణులు, క్వీన్ నెఫెర్టిటి గురించి ఎక్కువగా చదివాను. నా గత జన్మలో నేను కచ్చితంగా యువరాణి అయి ఉంటా అని అనిపించింది నాకు. నేను పునర్జన్మను నమ్ముతాను.' అని మనసులోని మాటను బయటపెట్టింది సాయి పల్లవి. ఇదీ చదవండి: స్టేజ్ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. కారణం ఏంటంటే శ్యామ్ సింగరాయ్ సినిమా కథ రెండు విభిన్న కాలక్రమాల్లో జరుగుతుందని సమాచారం. ఒకటి కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటే మరొకటి హైదరాబాద్‌లో ఉంటుంది. 'నేను 1960 కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథలో దేవదాసి పాత్రను పోషించాను. వ్యక్తిగతంగా ఇలాంటి మిస్టీరియస్ టైమ్ జోన్ చిత్రాల్లో నటించాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఆ కాలం నాటి సెట్స్‌లో ఉండటం, ఆనాటి కాస్ట్యూమ్స్ వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను చాలా మంది బాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అందులో నాకు మొదటగా గుర్తు వచ్చేది సంజయ్ లీలా బన్సాలీ. ఆయన సినిమాలు చూశాను. బాలీవుడ్ నటులతో కలిసి పనిచేయడం ఎలా ఉంటుందో నాకు తెలియదు. స్క్రిప్ట్‌కు తగినట్లుగా ఉంటేనే సినిమా ఒప్పుకుంటాను.' అని సాయి పల్లవి తెలిపింది. -
లయన్లాగా ఉన్నావ్ నాన్న.. నాని కొడుకు క్యూట్ వీడియో వైరల్
Hero Nani Son Arjun Ghanta Played With Father And Of Lion: నేచురల్ స్టార్ నాని హీరోగా ఎంత బిజీగా ఉన్న ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. ఈ క్రమంలో తన కుమారుడు అర్జున్‌తో సరదగా ఆడుకుంటున్న ఫొటోలను నాని తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా తనయుడుతో నాని ఆడుకుంటున్న క్యూట్ వీడియోను ట్విటర్లో షేర్ చేశాడు. నాని బెడ్‌పై పడుకుని ఉండగా.. అర్జున్ తండ్రిపై కుర్చుని మీసంతో ఆడుకుంటున్నాడు. చదవండి: బేబీ బంప్‌తో స్టార్ హీరోయిన్.. పట్టేసిన నెటిజన్లు, ఫొటోలు వైరల్ తండ్రి(నాని) పెద్ద పెద్ద మీసాలను పట్టుకుని అర్జున్ నిమిరుతూ ఉంటే నాని ‘నాపేరు ఎంటో తెలుసా?’ అని కొడుకుని అడుగుతాడు. ఇందుకు అర్జున్ తెలుసు అంటూ శ్యామ్ సింగరాయ్ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లయన్(సింహం) లాగా ఉన్నావు నాన్న. అంటూ మీసాలను నిమిడుతూ ఉంటాడు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తండ్రి కొడుకులు ఇలా సరదాగా ఆడుకోవడం చూసి నాని ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. చదవండి: 5 సీజన్ల బిగ్‌బాస్ విన్నర్లు, వారి ప్రైజ్‌మనీ, పారితోషికం ఎంతంటే కాగా నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో నాని మూవీ ప్రమోషన్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో డబుల్ రోల్లో పోషిస్తున్న నాని ఓ పాత్రలో శ్యామ్ సింగరాయ్‌గా పెద్ద మీసంతో సరికొత్తగా అలరించబోతున్నాడు. ఈ మూవీ నానికి జోడిగా సాయి పల్లవి, కృతిశెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. Lion la vunnavu Nanna 😉#ShyamSinghaRoy pic.twitter.com/OwKZFzJXcL — Nani (@NameisNani) December 20, 2021 -
'శ్యామ్ సింగరాయ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
స్టేజ్ మీద సాయి పల్లవి కన్నీళ్లు.. ఓదార్చిన నాని
నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతీశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయింది. తనను ఎంతగానే ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. ‘పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఈరోజు మీ అందరూ నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నాను. ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా భావోద్వేగంతో మాటలు రావడం లేదు. ‘యాక్టర్, డ్యాన్సర్ కావాలని చాలామందికి ఉంటుంది.. కానీ అందరికీ అవకాశాలు రావు. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఆస్కార్ లేదా జాతీయస్థాయి అవార్డు వచ్చినప్పుడు నేను ఎమోషనల్ అవుతానేమోనని అనుకున్నాను. కానీ ఓ యాక్టర్‌గా ఈ ఆర్ట్ ఫామ్‌లో ఉండటమే నాకు పెద్ద అవార్డు. స్టేజ్ మీద ఉంటే.. ఫైర్, బేబమ్మ, భానుమతి, ఫిదా అంటూ ప్రేక్షకులు అరుస్తున్నారు. ఇలాంటి ప్రశంసలు అందుకోవడం చాలా ఎమోషనల్‌గా ఉంది. ఇలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి, నా తల్లి దండ్రులకు థ్యాంక్స్ చెబుతున్నా’అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న నాని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. సాయి పల్లవి కన్నీరు పెట్టుకోవడం చూసి ప్రేక్షకులూ భావోద్వేగానికి లోనయ్యారు. -
‘శ్యామ్ సింగరాయ్’ ప్రీ-రిలీజ్ వేడుక ఫోటోలు
-
'శ్యామ్ సింగరాయ్' సినిమాతో అర్హత వచ్చింది: నాని
Nani Speech At Shyam Singha Roy Pre Release Event: ‘‘సినిమా ఫంక్షన్స్‌లో ఎప్పుడూ వైట్ డ్రెసెస్లోనే కనిపిస్తుంటానని నా అభిమానులు కొందరు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. దీంతో నా భార్య నా కోసం పది సూట్స్ కొనిపెట్టింది. వాటిని ఎప్పుడు వేసుకోవాలనుకున్నా ‘నేను ఏం చేశానని వేసుకోవాలి?’ అనుకునేవాణ్ణి. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చేసి, చూసుకుని సూట్ వేసుకుని ఇక్కడికి ధైర్యంగా వచ్చాను. ఈ సినిమాతో సూట్ వేసుకునే అర్హత వచ్చిందనుకున్నాను’’ అని నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ– ‘‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంపై పూర్తి నమ్మకంతోనే ఉన్నాం. సాయిపల్లవి మాట్లాడుతూ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారో సినిమా చూస్తే తెలుస్తుంది. రాహుల్ నుంచి ‘శ్యామ్ సింగరాయ్’ రూపంలో మంచి సర్ప్రైజ్ ఉంది. వెంకట్‌గారితో కలిసి ఇలాంటి సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘నాలోని పిరికితనాన్ని పాతరేసి నాకు ధైర్యం చెప్పిన గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అంటూ పాట రాసిన నాకు భయపడే హక్కు లేదు. ‘శ్యామ్ సింగరాయ్’ అంటూ ఓ క్యారెక్టర్‌ను ప్రపంచానికి చెబుతున్న నీకు భయపడే అవసరం లేదు.. గుర్తు పెట్టుకో’ అని సీతారామశాస్త్రిగారు అన్నారు. వందకోట్ల బడ్జెట్ ఇవ్వలేని నమ్మకం నానిగారు ఇచ్చారు’’అన్నారు రాహుల్ సంకృత్యాన్. ‘‘యాక్టర్, డ్యాన్సర్ కావాలని చాలామందికి ఉంటుంది.. కానీ అందరికీ అవకాశాలు రావు. నన్ను నమ్మి నాకు అవకాశాలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఆస్కార్ లేదా జాతీయస్థాయి అవార్డు వచ్చినప్పుడు నేను ఎమోషనల్ అవుతానేమోనని అనుకున్నాను. కానీ ఓ యాక్టర్‌గా ఈ ఆర్ట్ ఫామ్‌లో ఉండటమే నాకు పెద్ద అవార్డు’’అంటూ భావోద్వేగానికి లోనయ్యారు సాయి పల్లవి. ‘‘నేను చేసిన కీర్తి పాత్ర యూత్‌కు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కృతీశెట్టి. ‘‘శ్యామ్ సింగరాయ్’ టీమ్‌తో వర్క్ చేయడం నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్’’ అన్నారు మడోనా. ‘‘శ్యామ్ సింగరాయ్’ సినిమా అందరికీ నచ్చుతుంది.. తప్పకుండా థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఫొటోలు
-
Shyam Singha Roy: ఆరు ఎకరాల్లో సెట్.. మూన్నెళ్లు..300 మంది శ్రమించారు
శ్యామ్ సింగరాయ్ మూవీలో రెండు కథలు ఉంటాయి. ఒకటి ప్రజెంట్‌గా సాగుతుంది. మరోకటి 70వ దశకంలో జరుగుతుంది. బెంగాల్లో అప్పటి పరిస్థితులను చూపించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. ఈ సినిమా కోసం వేసిన టెంపుల్ సెట్ హైలెట్‌గా నిలుస్తుంది’అని అన్నారు ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల. న్యాచులర్ స్టార్ నాని హీరోగా, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ►ఈ సినిమాలో రెండు కథలుంటాయి. ఒకటి ప్రజెంట్‌గా జరుగుతుంది. ఇంకోటి 70వ దశకంలో బెంగాల్లో జరుగుతుంది. అప్పటి పరిస్థితులను చూపించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు మూడేళ్ల పాటు రీసెర్చ్ చేశాం. గత ఏడాది లాక్డౌన్ సమయంలో బెంగాల్లోనే ఉండిపోయాను. సౌత్, నార్త్ ఒకరకమైతే..బెంగాల్లో మరోలా ఉంటుంది. అక్కడి ఆర్కిటెక్చర్, టెంపుల్స్ అన్నింటిపై పరిశోధించాను. ► అన్ని సెట్స్ హైద్రాబాద్‌లోనే వేశాం. ట్రైలర్లో చూసి ఉంటే ఓ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది. దాని కోసం చాలా కష్టపడ్డాం. అప్పుడు వాడిన పేపర్, టెక్స్ట్ ఇలా అన్నింటి గురించి తెలుసుకున్నాం. ఆ సమయంలో ఉన్న వాటిని తెలుసుకుని, కొన్నింటిని రీక్రియేట్ చేశాం. ఈ సినిమాకు సంబంధించిన అతి పెద్ద సెట్ టెంపుల్ సెట్. అందులో మేజర్ సీన్స్ తెరకెక్కించారు. టెంపుల్ సెటప్ మేజర్ హైలెట్ అవుతుంది. ఆ సెట్‌ను హైద్రాబాద్‌లోనే వేశాం. ఆరు ఎకరాల్లో వేసిన ఆ సెట్ కోసం మూడు నెలల పాటు, రోజూ మూడొందల మంది శ్రమించారు. ► కోల్‌కతా నేపథ్యంలో సినిమా రాబోతోందనే విషయమే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కోల్‌కతా కల్చర్ ఇండియాలో ఎక్కడా కనిపించదు. దేవదాసిలకు సంబంధించిన టెంపుల్ అంటే ఎలా ఉంటుంది అనేది మనం కేవలం ఊహించగలం. కథకు తగ్గట్టు ఊహించుకుని ఆ సెట్ వేశాను. ►ఈ సినిమా కోసం సత్యజిత్ రే చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకున్నాను. కానీ అవన్ని బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉన్నాయి. దాని వల్ల అంతగా ఉపయోగం ఏమీ లేదు. ►కరోనా వల్ల చాలా రోజు సెట్స్ పనులు ఆగిపోయాయి. మధ్యలో వర్షాలు, తుఫాను వల్ల ఇబ్బంది ఏర్పడింది. కానీ మళ్లీ షూటింగ్ మొదలయ్యే సరికి సెట్స్‌ను రెడీ చేశాం. ►టెంపుల్ సెట్‌ను ఇండస్ట్రీలో చాలా మంది చూశారు. ఇంత డీటైలింగ్‌గా ఎందుకు వేశారు.. దర్శకుడు చెప్పారని ఇలా వేశారా? మీరు వేశారని డైరెక్టర్ తీస్తారా? అనే అనుమానాలు అందరికీ వచ్చాయి. ►నిర్మాత గారు నన్ను ఏనాడూ ఏ ప్రశ్న వేయలేదు. ఎంత ఖర్చు పెడుతున్నారు.. ఎందుకు ఖర్చు పెడుతున్నారు అని అడగలేదు. ఇలాంటి సినిమాలకు అలాంటి నిర్మాతలే ఉండాలి. అలాంటప్పుడే కాంప్రమైజ్ కాకుండా మంచి అవుట్ పుట్ తీసుకురాగలం. ►శ్రీమంతుడు సినిమాకు అప్రెంటిస్‌గా పని చేశాను. ఆ తరువాత నాని గారి కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాకు మొదటిసారి ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఆయనతో జెర్సీ కూడా చేశాను. ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్. ఆ తరువాత దసరా కూడా చేస్తున్నాను. ►ఆర్ట్ వర్క్‌తో పాటు కెమెరా పనితనం కూడా చాలా ముఖ్యం. కొన్ని సార్లు ఆర్ట్ వర్క్‌కు గుర్తింపు వస్తుంది. కొన్ని సార్లు రావు. జెర్సీ సినిమాకు పేరు వచ్చింది. కానీ ఆర్ట్ డైరెక్షన్‌కు పేరు రాలేదు. అందులో వేసినవి సెట్స్ అని ఎవరికీ తెలియవు. ► నాని గారి దసరా సినిమా చేస్తున్నాను. రవితేజ గారితో టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రాన్ని చేస్తున్నాను. సెట్స్ వర్క్ ఆల్రెడీ మొదలయ్యాయి. ►నా టీం పనిదనం వల్లే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. మొదటి నుంచి ఇప్పటి వరకు అదే టీంతో పని చేస్తున్నాం. ఎవ్వరూ మారలేదు. -
ఆ సీన్లో సాయి పల్లవిని చూసి నటించడం మర్చిపోయా: నాని
నాని తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్ మూవీ రాయల్ ఈవెంట్ మంగళవారం వరంగల్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో వేదికగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వేడుకు హీరో నాని, హీరోయిన్స్ సాయి పల్లవి, కృతిశెట్టిలతో ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన సుమపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టేజ్‌పై నాని మాట్లాడుతూ.. ‘డైరెక్టర్లు, నిర్మాతలు హీరోల కాల్షిట్ కోసం ఎదురు చూస్తారు. కానీ హీరోలు మాత్రం ఒకరి డేట్స్ కోసం చూస్తారు. ఆవిడే సుమగారు. ప్రీరిలీజ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు ఏ మూవీ ఈవెంట్ అయిన సుమ డేట్స్ చూసుకుని ప్లాన్ చేస్తాం’ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపించాడు నాని. దీంతో సుమ నవ్వుతూ నానికి దండం పెడుతూ థ్యాంక్స్ చేప్పింది. అలాగే హీరోయిన్ సాయి పల్లవి గురించి చెబుతూ.. ‘ఈ సినిమాలోని ఓ సీన్లో పల్లవి డాన్స్ చేస్తుంటే.. నేను జనంలో నుంచి ఆశ్చర్యంగా చూస్తుండాలి. ఆమె డాన్స్ చూస్తూ నటించడం మరిచిపోయాను.. నటించవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే నిజంగానే తన డ్యాన్స్ చూసి అంతగా ఆశ్చర్యపోయి చూస్తుండిపోయాను’ అంఊట చెప్పుకొచ్చాడు. -
కల్లు ఇష్టం.. వరంగల్లు అంటే ఇంకా ఇష్టం : నాని
‘శ్యామ్ సింగరాయ్’ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. ఇలాంటి ఓ మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది’ అని నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా వెంకట్ బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్. ఈ నెల 24న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన వేడుకలో నాని మాట్లాడుతూ– ‘నాకు కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. మీరంటే ఇంకా ఇష్టం. ఇక్కడికి వస్తున్నామని చెప్పడంతో మంత్రి దయాకర్ గారు అంతా చూసుకున్నారు. ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్లోకి వస్తున్నా.. ఈ సారి మాత్రం మిస్ అయ్యే చాన్సే లేదు. ఒక మంచి సినిమా చేశాక మనసులో ఓ గర్వం ఉంటుంది. మాకు ఇంచు కూడా భయం లేదు. శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్‌లో టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. వెంకట్‌గారితో ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. సాయిపల్లవి డ్యాన్స్‌తో ప్రేమలో పడిపోతారు. కృతీశెట్టి భవిష్యత్‌లో మంచి స్థాయికి చేరుకుంటుంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి చివరి పాటలతో ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ఇంకా స్పెషల్‌గా మారింది. ఆయన ఆశీర్వాదాలు మాకు ఉంటాయి’ అన్నారు. ‘‘ఏ సినిమా అయినా వరంగల్ నుంచే మొదలుపెట్టండి.. హిట్ అవుతుంది’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ‘‘ఈ చిత్ర దర్శక– నిర్మాతలు కొత్తవారైనా సినిమాను నాని తన భుజాలపై మోశారు’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘శ్యామ్ సింగ రాయ్ ఓ విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ రెండు ప్రపంచాలను చూపించారు. వాసు, శ్యామ్ సింగ రాయ్ రెండు ప్రపంచాలని అద్బుతంగా చూపించారు. కెమెరామెన్, క్యాస్టూమ్ డిజైనర్ పడ్డ కష్టాన్ని ప్రేక్షకులు థియేటర్లో చూడాల్సిందే. అన్ని సినిమాలను థియేటర్లోనే చూడండి. శ్యామ్ సింగ రాయ్ సినిమా నాని ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఇది వరకు ఎన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు.. సినిమాను థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత గారు అనుకున్నారు’ అని అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరి పర్ఫామెన్స్, విజువల్స్ ఇలా ప్రతీ ఒక్కటి అద్భుతంగా ఉంటాయి. మీరు కొత్త అనుభూతికి లోనవుతారు. థియేటర్లోనే సినిమాను చూడండి. అందరూ మాస్కులు ధరించండి. సురక్షితంగా ఉండండి. నాని గారంటే నాకు, నా ఫ్యామిలీకి చాలా ఇష్టం. నా రెండో సినిమానే ఆయనతో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. నిర్మాత వెంకట్ గారు ఎంతో స్వీట్ పర్సన్. రాహుల్ గారిది ఇదో రెండో సినిమా అని అనిపించలేదు. ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించారు’ అని అన్నారు. -
Shyam Singha Roy Trailer launch: వరంగల్‌లో శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ లాంచ్
-
ఆకట్టుకుంటున్న నాని శ్యామ్ సింగరాయ్ మూవీ ట్రైలర్
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలై టీజర్, ఫస్ట్‌లుక్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో మూవీ టీం బిజీగా ఉంది. చదవండి: హీరోగా ‘కట్టప్ప’కొడుకు.. ‘మాయోన్' ఫస్ట్ సింగిల్‌కి అనూహ్య స్పందన ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ రోజు(డిసెంబర్ 14) వరంగల్‌లో ట్రైలర్ లాంచ్ రాయల్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో తాజాగా శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ మూవీ 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. -
సిరివెన్నెలతో పనిచేయడం నా అదృష్టం
నేచులర్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిసెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఇంటర్వ్యూ... ► శ్యామ్ సింగరాయ్ కథ రెండు టైమ్ పీరియడ్స్‌కు సంబంధించింది. గతం, వర్తమానం అంటూ రెండు భాగాల్లో ఈ కథ జరుగుతుంది. గతంలో 70వ దశకంలోని వాతావరణాన్ని ఇందులో చూపించనున్నారు. దానికి తగ్గట్టే సంగీతం, నేపథ్య సంగీతం అందించాను. నాకు ఇండియన్ ఇన్స్ట్రుమెంట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఆ కాలంలో ఉపయోగించిన వాయిద్యాలనే ఇందులో ఎక్కువగా ఉపయోగించాం. తబల, సితార్, సంతూర్ వంటి వాటిని వాడి సంగీతాన్ని అందించాను. ► శ్యామ్ సింగరాయ్ సినిమాలో నార్త్, సౌత్ ఫ్లేవర్ కలిసి ఒక కొత్త ఫ్లేవర్ ఉంటుంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్ కాబట్టి బెంగాల్ సంగీతాన్ని కూడా ఇందులో జోడించాం. కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ చేశాను. టాలీవుడ్లో ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా ఇదే అవుతుంది. ► దర్శకుడు రాహుల్ ఈ కథ చెప్పగానే చాలా ఎగ్జయిట్ ఫీలయ్యా...ఎందుకంటే ఈ సినిమాకు మంచి సంగీతం అందించే స్కోప్ ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా చెయ్యొచ్చు అనిపించింది. ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా రిలీజయ్యాక పాటలకు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు మరింత మంచి స్పందన వస్తుందని నమ్ముతున్నాను. ► సిరివెన్నెలగారి లాంటి లెజెండ్‌తో పనిచేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో గడిపిన ప్రతి మూమెంట్ ఒక మెమోరబుల్. శ్యామ్ సింగ రాయ్ సినిమా కోసం ఆయన రెండు పాటలు రాశారు. అందులో సిరివెన్నెల పాట ఆల్రెడీ విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఆయన రాసిన ఇంకో పాట త్వరలో విడుదల కాబోతుంది. ఆ పాటలో సిరివెన్నెలగారి సాహిత్యం అద్బుతంగా ఉంటుంది. ఆ పాటను కంపోజ్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది. ► పాట ఏ సింగర్ తో పాడించాలి అనే విషయంలో హీరో, దర్శకుల నుంచి నేను సలహాలు తీసుకుంటాను. కానీ తుది నిర్ణయం మాత్రం నాదే. ఎందుకంటే ఆ పాట ట్యూన్ చేసేటప్పుడే అది ఎవరు పాడితే బాగుంటుంది అనేది నిర్ణయించుకుంటాను. ఈ సినిమా మ్యూజిక్, ఆర్ఆర్ ప్రేక్షకుల్ని ఎక్కడా డీవియేట్ కానివ్వదు. ► ప్రస్తుతం నేను నందినీ రెడ్డి స్వప్నా దత్ కాంబినేషన్లో ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాను, అలాగే శ్రీవాస్ గోపీచంద్ కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, దిల్ రాజుగారి బ్యానర్లో మరో సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాను. వీటితో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నాను అని మిక్కీ జే మేయర్ చెప్పుకొచ్చాడు. -
Shyam Singha Roy: భారీ సెట్స్ దెబ్బతిన్నాయి.. బడ్జెట్ పెరిగింది..నానిపై నమ్మకం ఉంది
‘మంచి సినిమా తీయాలనే కోరిక నిర్మాతలందరికీ ఉంటుంది. నాకు కూడా నానితో ఓ గొప్ప మూవీ తీయాలని ఉండేది. ఆయన మీద ఉన్న నమ్మకంతో బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. నేను ఆయన్ను నేను నమ్మాను. శ్యామ్ సింగరాయ్ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం తొలి రోజు నుంచి మాకు ఉంది’అన్నారు నిర్మాత వెంకట్ బోయనపల్లి. న్యాచులర్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ బోయనపల్లి మీడియాతో ముచ్చటించారు. ►శ్యామ్ సింగ రాయ్ ఒక అద్భుతమైన ప్రేమ కథ. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్ 24న మీ ముందుకు రాబోతుంది. ►నేను 12 ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాను. ఎన్నో సినిమాలకు బ్యాకెండ్ పని చేశాను. శ్యామ్ సింగ రాయ్ మేకింగ్ విషయంలో మాత్రం ఏనాడూ ఒత్తిడికి గురి కాలేదు. దానికి కారణం హీరో నాని. ఆయన ఈ కథను నమ్మాడు. ముందు నేను వేరే సినిమా చేయాల్సింది. కానీ నాని గారే నన్ను ఈ సినిమా చేయమన్నారు. మొదటి రోజు నుంచి కూడా ఈ సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం. గొప్ప సినిమా చేయాలని అందరూ అనుకుంటారు. నానికి జర్సీ ఎలాగో నాకు శ్యామ్ సింగరాయ్ అలాంటి చిత్రం. ►కరోనా వల్ల కాస్త బడ్జెట్ పెరిగింది. ఆ విషయం మాకు ముందే తెలుసు. కొన్ని సెట్స్ దెబ్బతిన్నాయి. అందుకే బడ్జెట్ పెరిగింది. ► థియేటర్స్ కౌంట్ తెలీదు కానీ మాకు కావాల్సినన్నీ థియేటర్లు ఇచ్చారు. దిల్ రాజు లాంటి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ►సినిమా చూస్తే కచ్చితంగా 1970 కలకత్తాకు వెళ్తాం. అక్కడి కల్చర్ తెలుస్తుంది. మనం కచ్చితంగా 70వ దశకంలోకి వెళ్లినట్టు ఫీలవుతాం. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాం. ►కలకత్తా బ్యాక్ డ్రాప్‌ను చూపించేందుకు భారీ సెట్స్ వేశాం. అంతేకాకుండా కలకత్తాకు 400 కి.మీ దూరంలో ఉన్న ఊర్లో షూట్ చేశాం. ►ఇది యూనివర్సల్ మూవీ. తెలుగు వాళ్లకే నచ్చే సినిమా ఏమీ కాదు. బెంగాలీలో రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. దక్షిణాది భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం. ఇది హిందీలో రీమేక్ అవుతుందని నమ్మకం ఉంది. అందుకే హిందీలో విడుదల చేయడం లేదు. ఈ కథకు అందరూ కనెక్ట్ అవుతారు. ►ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా ఉన్నాను. ఏడాది క్రితం నిర్మాతగా మారాను. ఓ మూడేళ్ల నుంచి నాని గారితో సినిమా చేయాలని ఎదురుచూస్తూ వచ్చాను. అలా నాకు ఓ స్పెషల్ మూవీ ఆయనతో చేసే అవకాశం వచ్చింది. మళ్లీ శ్యామ్ సింగ రాయ్ లాంటి సినిమాను చేస్తానో కూడా తెలీదు. ►నాని గారితో సినిమా చేస్తే ఒత్తిడి అనేది ఉండదు. కృష్ణార్జున యుద్దం సినిమాలో నేను భాగస్వామిని. చేస్తే ఇలాంటి హీరోతో సినిమా చేయాలని అనుకున్నాను. ►మొదటగా నిర్మాత అవ్వాలనే ఆలోచన లేదు. కానీ కృష్ణార్జున యుద్దం చేసే సమయంలో సొంత ప్రొడక్షన్ పెట్టాలని అనుకున్నాను. అది కూడా నాని గారి సినిమాతోనే ప్రారంభించాలని రెండున్నరేళ్లుగా ఎదురుచూశాను. ► మంచి సినిమా తీయాలనే కోరిక నిర్మాతలందరికీ ఉంటుంది. నేను నాని గారితో మంచి సినిమా తీయాలని అనుకున్నాను. ఈ సినిమా నేను తీసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. రేపు సినిమా విడుదలైతే అందరూ బాగుందని అంటారు. నిహారిక అంటే శ్యామ్ సింగ రాయ్ అని అంటారు. ► నాని గారి మీదున్న నమ్మకంతోనే బడ్జెట్ గురించి ఆలోచించలేదు. ఆయన కథను నమ్మారు. ఆయన్ను నేను నమ్మాను. నాని గారు డైరెక్టర్‌ను నమ్మారు.. ► నా దృష్టిలో నిర్మాతకు హీరో, దర్శకులంటే ప్రేమ ఉండాలి. వారిపై నమ్మకం ఉండాలి. అలాంటప్పుడే మంచి సినిమా వస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ మేకింగ్ థియేటర్ లో ప్రేక్షకులను తప్పకుండా థ్రిల్ చేస్తుంది. -
సిరివెన్నెల చివరి పాటపై సాయి పల్లవి భావోద్వేగం
Sai Pallavi Emotional On Sirivennela Seetharama Sastry Last Song: ప్రముఖ సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. హీరో నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాట అని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. నేడు ఈ పాటను విడుదల చేశారు శ్యామ్ సింగరాయ్ మూవీ యూనిట్. ఈ నేపథ్యంలో సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటపై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సాయి పల్లవి. చదవండి: పుష్ప ట్రైలర్‌పై వర్మ షాకింగ్ కామెంట్స్ Sirivennela Seetharama Sastry Garu, Every word that you’ve ever written carries your soul and You’ll forever live in our hearts♥️#Sirivennela Lyrical Song from #ShyamSinghaRoy https://t.co/0RAM2tShHH@NameisNani @MickeyJMeyer @anuragkulkarni_ @Rahul_Sankrityn @NiharikaEnt — Sai Pallavi (@Sai_Pallavi92) December 7, 2021 ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్’ అంటూ సాయి పల్లవి ఎమోషనల్ అయ్యింది. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా థియేయటర్లోకి రానుంది. ‘నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. తేనెలో తీయదనం సహజంగా ఉన్నట్టే, సిరివెన్నెల సాహిత్యంలో హాయిదనం ఉంటుందని ఈ పాట మరోసారి నిరూపించింది. చదవండి: విడాకులపై సమంత కామెంట్స్, వైరల్ అవుతోన్న చై-సామ్ ఓల్డ్ ఫోన్ కాల్ -
గుండెలను హత్తుకుంటున్న ‘సిరివెన్నెల’చివరి పాట
ప్రఖ్యాత గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్ సింగరాయ్’తో ముగిసింది. నేచురల్ స్టార్ నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాటని చిత్ర బృందం వెల్లడించింది. ‘సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే ఈ పాట సిరివెన్నెలను మరోసారి స్మరించుకునేలా చేసింది. ఈ అద్భుత మెలోడీకి మిక్కీ జె. మేయర్ స్వరాలు అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. -
సిరివెన్నెల తన మరణాన్ని ముందుగానే ఊహించారు: డైరెక్టర్
Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల సీతారామశాస్త్రి.. తెలుగు పాటకు అందాన్నే కాక గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు సినీ పాటకు విశ్వ ఖ్యాతిని తెచ్చిన సిరివెన్నెల అస్తమయాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మనమధ్య లేకపోయినా ఆయన రాసిన పాటలు మాత్రం అందరి హృదయాల్లో సజీవంగా మిగిలిపోనున్నాయి. ఆయన రాసిన పలు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. అందులో శ్యామ్ సింగరాయ్ సినిమాలో రాసిన రెండు పాటలు కూడా ఉన్నాయి. అయితే ఆ పాటలు రాస్తున్న క్రమంలోనే తన మరణాన్ని ఊహించినట్లున్నారు సిరివెన్నెల. ఇదే నా చివరి పాట అని రాహుల్‌తో అన్నారట! తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు రాహుల్ ప్రేక్షకులతో పంచుకున్నాడు. 'నవంబర్ 3వ తేదీన రాత్రి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఫోన్ చేసి తన ఆరోగ్యం సహకరించక ఈ పాటను పూర్తి చేయలేకపోతున్నాను.. ఇంకెవరితోనైనా రాయిద్దాం అన్నారు. పర్లేదు సర్ అన్నాను. ఆ తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు ఫోన్ చేసి నన్ను నిద్ర లేపారు. ఆరోజు దీపావళి. ఆయన ఫోన్ చేసి పల్లవి అయిపోయింది చెప్తాను రాస్కో అన్నారు. నేను వెంటనే పక్కనున్న మహాభారతం పుస్తకంలో పల్లవి రాశాను. అందులో మొదటి వాక్యంలో సిరివెన్నెల తన పేరు రాశారు. ఎందుకుసార్ ఈ పాటకు సంతకమిచ్చారని అడిగితే.. బహుశా ఇదే నా ఆఖరి పాట అవచ్చు అని గట్టిగా నవ్వారు... ఈ పాట రికార్డింగ్ మొదలు పెట్టిన రోజునే ఆయన అంత్యక్రియలు జరిగాయి. పాట చాలా బాగా వచ్చింది, అందుకే ఈ సాంగ్‌కు ఆయన పేరే పెట్టాం' అని చెప్పుకొచ్చాడు. హీరో నాని మాట్లాడుతూ.. శ్యామ్ సింగరాయ్ సినిమాను సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. -
శ్యామ్ సింగరాయ్ నుంచి సాంగ్ రిలీజ్
Edo Edo Lyrical Song From Shyam Singha Roy: సుమారు రెండేళ్ల గ్యాప్ తరువాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు నాని. దీనికంటే ముందు నాని నటించిన వి, టక్ జగదీష్ చిత్రాలు రెండూ నేరుగా ఓటీటీలోనే రిలీజయ్యాయి. దీంతో చాలాకాలం తర్వాత నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మళ్లీ థియేటర్లలో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా నుంచి తాజాగా ఏదో ఏదో తెలియని లోకమా.. లిరికల్ సాంగ్ రిలీజైంది. చెవులకు వినసొంపుగా ఉన్న ఈ పాటను చైత్ర ఆలపించగా మిక్కీ మేయర్ సంగీతం సమకూర్చారు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించారు. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా ముగ్గురు హీరోయిన్లు జత కడుతున్న విషయం తెలిసిందే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. గతంలో క్రిస్మస్ రోజే రిలీజైన ఎమ్సీఏ పెద్ద హిట్టవడంతో శ్యామ్ సింగరాయ్ కూడా సూపర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నాడు నాని! -
క్రిస్మస్ సిత్రాలు.. థియేటర్లలో సందడికి సిద్ధంగా..
Upcoming Movies In Theaters On This Christmas Festival: సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు ఎంతో కష్టపడుతుంటారు. పండగ వేళ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి అనేక కసరత్తులు చేస్తారు. పర్వదినాల్లో సినిమాలను ప్రదర్శించేందుకు ఆసక్తిగా సిద్ధమవుతుంటారు మేకర్స్. ఈ సవంత్సరం దసరా, దీపావళి సందడి ముగిసింది. దీపావళికి థియేటర్లలో రిలీజై హిట్ సాధించిన బాలీవుడ్ చిత్రం 'సూర్యవంశీ'. ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ పండుగ. గతేడాది క్రిస్మస్కు కొవిడ్ కారణంగా ఏ చిత్రం థియేటర్లతో విడుదల కాలేదు. కరోనాతో దెబ్బతిన్న థియేటర్లకు మళ్లీ పాతవైభవాన్ని తీసుకురానున్నాయి పలు చిత్రాలు. 1. గని గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్‌తేజ్ నుంచి వస్తోన్న చిత్రం ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. 2. శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న రిలీజ్ కానున్న నాని చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రంపై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు వచ్చిన టక్ జగదీష్, వీ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాగా, చాలా కాలం తర్వాత నాని సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బెంగాల్ నేపథ్యం ఉన్న ఈ సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ‘టాక్సీవాలా’తో విజయం అందుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 3. '83' బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘83’. భారత క్రికెట్ జట్టు 1983లో సాధించిన ప్రపంచ కప్పు విజయం నేపథ్యంలో సాగే చిత్రమిది. రణ్వీర్ కెప్టెన్ కపిల్‌దేవ్‌గా ఆయన భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్ తెరకెక్కించిన ఈ సినిమా 2019 జూన్‌లో మొదలైంది. 2020 ఏప్రిల్ 10న విడుదల అనుకున్నా కరోనా కారణంగా ఆ ఏడాది డిసెంబరు 25కి మారింది. అప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది జూన్ 4న విడుదల అని ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉండటంతో మళ్లీ వాయిదా వేసి డిసెంబరు 24 అని ఖరారు చేశారు. ఈ తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మారే అవకాశం లేదని చిత్రబృందం చెబుతోంది. ‘83’ విజయంపై బాలీవుడ్ వ్యాపార వర్గాలు చాలా నమ్మకంగా ఉన్నాయి. 4. జెర్సీ (హిందీ) తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ చిత్రం అదే పేరుతో హిందీలోనూ రూపొందింది. ఆయనే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. షాహిద్‌కపూర్ కథానాయకుడిగా నటించారు. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’గా మెప్పించిన షాహిద్ ఈ చిత్రంపైనా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 31న విడుదల కానుంది. చదవండి: కిక్కెక్కించే ఐదు కొరియన్ వెబ్ సిరీస్ ఇవే.. -
హాట్ టాపిక్‌గా మారిన కృతిశెట్టి లిప్‌లాక్ సీన్
Nani And Krithi Shetty Lip Lock Scene Goes Viral: రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. ఈ సినిమాలో కృతిశెట్టి, సాయిపల్లవి, మడోన్నాసెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. నిన్న(గురువారం) తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లోనే ఈ టీజర్ 6.3 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక టీజర్లో నాని, కృతిశెట్టి మధ్య వచ్చే లిప్‌లాక్ సీన్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. టీజర్ మొత్తంలో కృతి శెట్టి ఎక్కడ కనపడలేదు కానీ.. చివర్లో నానికి లిప్‌లాక్ సీన్లో మాత్రమే కనిపించింది. ఇక తొలి సినిమా ఉప్పెనతో యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ వరుస ప్రాజెక్టులతో యమ జోరు మీదుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో బంగార్రాజు, రామ్-లింగుస్వామి కాంబినేషన్లో తమిళ సినిమా, సుధీర్ బాబుతో ఓ సినిమాకు కూడా సైన్ చేసిన సంగతి తెలిసిందే. -
ఇక కొత్త నానీనే చూస్తారు
‘‘నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో నేనెప్పుడూ కొత్త, పాత అని చూడను. కంటెంట్ మాత్రమే చూస్తాను. ఇప్పటినుంచి ప్రతి సినిమాలో ఇది వరకు చూడని కొత్త నానీనే చూస్తారు’’ అని హీరో నాని అన్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని హీరోగా, సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల తర్వాత థియేటర్‌కు వస్తున్నాను.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి కరెక్ట్ సినిమాతో వస్తున్నాను. మంచి టీమ్ కుదిరినప్పుడు ఎలాంటి సినిమా వస్తుందో చెప్పడానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. క్రిస్మస్ అనేది నాకు స్పెషల్. ‘ఎంసీఏ’తో హిట్ సాధించాను.. ‘శ్యామ్ సింగరాయ్’కి ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది. ఇది ప్రేమ కథ. టీజర్ కంటే సినిమా వంద రెట్లు ఉంటుంది’’ అన్నారు. ‘‘నేను కూడా నాని అభిమానినే. మీ ఎదురు చూపులకు తగ్గట్టుగానే మా సినిమా ఉంటుంది’’ అని రాహుల్ సంకృత్యాన్ అన్నారు. ‘‘నాని ఎంతో సపోర్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీకి వెంకట్గారిలాంటి నిర్మాతలు అవసరం ’’ అన్నారు నటుడు రాహుల్ రవీంద్రన్. కథా రచయిత సత్యదేవ్ జంగా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట్ రత్నం (వెంకట్). -
శ్యామ్ సింగరాయ్ టీజర్.. ఆకట్టుకుంటున్న సాయి పల్లవి స్టిల్స్, నాని లుక్స్
-
Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ టీజర్ వచ్చేసింది
Shyam Singha Roy Teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’.రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘స్త్రీ ఎవ్వరికీ దాసి కాదు. ఆఖరికి దేవుడికి కూడా. ఖబడ్దార్’అంటూ శ్యామ్‌సింగారాయ్ పాత్రలో నాని చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నానికి అల్లు అర్జున్ బిగ్ షాక్.. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్!
డిసెంబర్ 24న శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నేచురల్ స్టార్ సోలోగా బరిలోకి దిగుతున్నాడని అందరూ అనుకుంటున్నారు. కాని నానికి బిగ్ ట్విస్ట్ ఇచ్చేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడని సమాచారం.ఇదే రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.డిసెంబర్ 17న రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేసుకుని పుష్పను ప్రమోట్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాని ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ 25న విడుదల చేయాలనుకుంటున్నాడట. నిజానికి మొదట డిసెంబర్ చివరి వారంలోనే పుష్ప ను రిలీజ్ చేయాలనుకున్నారు. కాని అల్లు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూవారం ముందుగానే ఈ ప్యాన్ ఇండియా మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు.ఇఫ్పుడు రిలీజ్ డేట్ పై యూనిట్ మరోసారి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడమే అట. అదే నిజమైతే సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న శ్యామ్ సింగ రాయ్ కు, పుష్ప బిగ్ షాక్ ఇచ్చినట్లు అవుతుంది. -
Rise Of Shyam: రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ సాంగ్ వచ్చేసింది
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. 1970ల కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. రిలీజ్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇప్పటికే విడుదలైన ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ సాంగ్ ప్రోమో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా శనివారం ఉదయం ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు.‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. -
నాని ‘శ్యామ్ సింగరాయ్’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో..
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1970లో కలకత్తా నేపథ్యంలో నడుస్తుంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాలో నాని కొత్త లుక్‌తో కనిపించనున్నాడు. ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ‘‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’’ అంటూ ఈ సినిమాలో నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. మిక్కీ జే మేయర్ స్వారాలు అందించిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. విశాల్ దద్లాని, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ నెల 6వ తేదీన ఈ పాటను ఫస్ట్ సింగిల్ పేరుతో బయటకు వదలనున్నారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నాలు హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు. -
‘శ్యామ్‌సింగరాయ్’ నుంచి అదిరిపోయే అప్డేట్
Rise Of Shyam From Shyam Singha Roy: నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. ఇందులో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సినిమాలోని లిరికల్ వీడియోను ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘‘శ్యామ్ క్యారెక్టరైజేషన్‌ను వివరిస్తూ ఈ పాట సాగుతుంది. కృతీ మహేశ్, యశ్ మాస్టర్స్ ఈ చిత్రానికి నృత్యదర్శకులుగా చేశారు. మిక్కీ జె. మేయర్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం. SHYAM will RISE :) We are all set 🔥 A @MickeyJMeyer Musical#RiseOfShyam on November 6th.#ShyamSinghaRoy pic.twitter.com/wTwfefvsyY — Nani (@NameisNani) October 30, 2021 -
ఆ సినిమాలో సాయి పల్లవిపై స్పెషల్ సాంగ్, ఈసారి క్లాసికల్ టచ్‌తో..!
సాయిపల్లవి.. ఈ పేరు వింటే చాలు అందరిలో ఒక జోష్ వస్తోంది. తన సినిమా అంటే వెంటనే మనసులో మెదిలేది ఒక్కటే. అదే తనపై ఉండే స్పెషల్ సాంగ్. ప్రతి సినిమాలోనూ సాయి పల్లవిపై ప్రత్యేకమైన పాటను పెట్టి తమ సినిమాపై అందరి దృష్టి పడేలా చూసుకుంటారు దర్శకులు. అంతేగాక ఆ పాటలు సినిమాకే హైలెట్‌గా నిలవడం విశేషం. ఆమె సాంగ్స్ విడుదలయ్యాయంటే చాలు యుట్యూబ్ చానళ్లకు పండగే. రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సంచనాలు సృష్టిస్తాయి. దీనికి గతంలో ఆమె నటించి ఫిదా చిత్రంలోని ‘వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే’, ఇటీవల వచ్చిన ‘లవ్‌స్టోరీ’లోని సారంగధరియా పాటలే ఉదహరణ. చదవండి: మహేశ్ బాబును లాభాల బాట పట్టించిన ‘లవ్‌స్టోరీ’ ఈ పాటలు జనాల్లోకి, యుట్యూబ్ చానళ్లో ఎంతగా దూసుకుపోయాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి నాని సరసన ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా సాయి పల్లవిపై ఓ స్పషల్ సాంగ్ ఉండబోతుందట. కలకత్తాలో జరిగే దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో సాగే ఈ పాటలో సాయి పల్లవి మరోసారి తన డ్యాన్స్ స్కిల్స్‌తో అదరగొట్టబోతుందట. ఈ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలవడం ఖాయం అంటున్నారు. కాగా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న ఈ మూవీ విడుదల కానుంది. చదవండి: 'శ్యామ్ సింగరాయ్' నుంచి బిగ్ అప్డేట్ -
బెంగాలీ కుర్రాడి ప్రేమ కథే ‘శ్యామ్ సింగరాయ్’
నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట బోయనపల్లి నిర్మించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ఇందులో సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. కోల్కత్తా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బెంగాలీ కుర్రాడు వాసు పాత్రలో కనిపిస్తారు నాని. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. ‘‘నాని, సాయి పల్లవిల మధ్య అద్భుతమైన ప్రేమకథను ఈ సినిమాలో చూస్తారు’’ అని చిత్రబృందం పేర్కొంది. చదవండి: అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్ ప్రియుడిని పెళ్లాడిన సీరియల్ నటి.. ఫోటోలు వైరల్ -
'శ్యామ్ సింగరాయ్' నుంచి బిగ్ అప్డేట్
Shyam Singha Roy : రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రంలో సాయి పల్లవి,కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు నాని, సాయిపల్లవి కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. This Christmas Shyam will arrive where he belongs :) To the big screen and to your hearts 🤍 TELUGU,TAMIL,MALAYALAM,KANNADA DECEMBER 24th 🔥#ShyamSinghaRoy @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @vboyanapalli@NiharikaEnt pic.twitter.com/pbMojsNhs8 — Nani (@NameisNani) October 18, 2021 -
Happy Birthday Krithi Shetty: ‘బేబమ్మ’ బర్త్‌డే స్పెషల్ పోస్టర్స్ చూశారా?
ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’,నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే నాగార్జున ‘బంగార్రాజు’లో చైతన్యకు జోడిగా అలరించబోతుంది. నేడు ఈ బేబమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి పోస్టర్లు విడుదల చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్. నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమా టీమ్ కూడా కృతికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ని విడుదల చేసింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ ప్రేమించిన అమ్మాయిగా నటిస్తోంది కృతి శెట్టి . రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. నేడు కృతి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నితిన్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. . నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. -
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలివే..
-
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలివే..
విక్టోరియా మెమోరియల్, హౌరా బ్రిడ్జ్, మదర్ హౌస్, బిర్లా ప్లానిటోరియం, కాళీ మాత టెంపుల్, పార్క్ స్ట్రీట్, ఎకో టూరిజం పార్క్... ఏంటీ కోల్‌కతాలోని ఫేమస్ ప్లేసెస్‌ను వరుసగా చెబుతున్నాం అనుకుంటున్నారా! ఇప్పటికే పలు చిత్రాల్లో వీటన్నింటినీ చూసి ఉంటారు. మరోసారి చూపించడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూసేయండి.. -
'శ్యామ్ సింగరాయ్'కు గుమ్మడికాయ కొట్టిన నాని
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోనా సెబాస్టియన్ కథానాయికలు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రనిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ – ‘‘విభిన్న కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఔట్పుట్ పట్ల నేను, మా టీమ్ హ్యాపీ’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). Manaki vachindhi okkate. CINEMA❤️ On to a new journey :) pic.twitter.com/fOcsGBLEkY — Nani (@NameisNani) July 26, 2021 Shoot done 🙌 With a great team comes the great outcome🔥 Post production begins :)#ShyamSinghaRoy pic.twitter.com/SvgUdfqmVZ — Nani (@NameisNani) July 26, 2021 -
సరికొత్త పాత్రలో సాయి పల్లవి.. స్పెషల్ వీడియో
పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం సాయి పల్లవి ప్రత్యేకత. చెసింది కొద్ది సినిమాలే అయినా.. తనదైన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ నేచురల్ బ్యూటీ. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళ్తున్న సాయి పల్లవి తాజాగా మరో ప్రయోగానికి సిద్దమైంది. తొలిసారి నెగెటివ్ రోల్లో నటించనుందట. చదవండి: హీరోయిన్ కాజల్ ఆస్తుల విలువ ఎంతంటే... -
సెట్.. రీసెట్!
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లు. కోల్కత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల పాటు కోల్‌కత్తాలో జరిగింది. అక్కడ ఎన్నికల నేపథ్యంలో షూటింగ్‌కు అంతరాయం కలగడంతో హైదరాబాద్ వచ్చేసింది యూనిట్. పైగా లాక్‌డౌన్‌తో కోల్కత్తా వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా ప్రత్యేకంగా ఆరున్నర కోట్లతో కోల్‌కత్తాలోని కాళీ మాత గుడితో సహా కొన్ని వీధులతో సెట్ నిర్మించారు. లాక్డౌన్ ముందు వరకూ ఈ సెట్లో కొద్ది రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఈ సెట్ దెబ్బతింది. ఇప్పుడు సెట్‌ని పునర్నిర్మించాలంటే దాదాపు రెండు కోట్ల ఖర్చు అవుతుందట. ఇంకొన్ని రోజుల పాటు ఈ సెట్లో చిత్రీకరణ జరగాల్సిన నేపథ్యంలో వేరే దారిలేక సెట్‌ని రీసెట్ చేయాలనుకుంటున్నారు. -
డ్యామెజ్ అయిన ‘శ్యామ్ సింగరాయ్’ సెట్!.. కోట్లలో నష్టం
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుండగా, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా కోసమే హైదరాబాద్‌లో కోల్‌కత్తాని సృష్టించి భారీ సెట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల కోల్‌కత్తాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో సృష్టించారు. ఆరున్నర కోట్లతో పదెకరాల్లో ఈ సెట్‌ను నిర్మించారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా లాక్డౌన్ కారణంగా షూట్ నిలిచిపోయింది. అయితే హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 'శ్యామ్ సింగ రాయ్' కోసం నిర్మించిన సెట్ డామేజ్ అయినట్లు సమాచారం. దీని వల్ల దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. దీంతో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలకు అదనపు భారం పడనుందని టాక్ వినిపిస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి : ఆ కారణంతోనే బాలీవుడ్ సినిమా చేయలేకపోతున్నా: నాని హీరో సుధీర్‌బాబు భార్య పద్మిణి గురించి ఈ విషయాలు తెలుసా? -
కాళికాదేవి అవతారమెత్తిన సాయి పల్లవి.. ఫోటో వైరల్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి 29వ పుట్టిన రోజు నేడు(మే 09). ఈ సందర్భంగా ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రం నుంచి సాయి పల్లవి లుక్ విడుదల చేసింది చిత్ర బృందం. కాళికాదేవి అవతారంలో ఉగ్రరూపం దాల్చినట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. పోస్టర్ అదిరిపోయిందంటూ సాయి పల్లవి అభిమానులను కొనియాడుతున్నారు. ‘టాక్సీవాలా’ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ తెరకెక్కుతుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్. బోయనపల్లి నిర్మిస్తున్నారు. కోల్కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక సాయి పల్లవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు హీరో నాని. శ్యామ్ సింగరాయ్ పోస్టర్ని ట్వీటర్లో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే చిన్ని గారు’ అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన ’లవ్ స్టోరీ‘, ’విరాట పర్వం‘ సినిమాలు ఇప్పటికే విడుదల కవాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ సినిమాల విడుదల వాయిదా పడింది. His ❤️#ShyamSinghaRoy Happy birthday Chinni gaaru @Sai_Pallavi92 🤗 pic.twitter.com/kW0UBVIugb — Nani (@NameisNani) May 9, 2021