
Rise Of Shyam From Shyam Singha Roy: నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్యామ్‌సింగరాయ్’. ఇందులో సాయిపల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సినిమాలోని లిరికల్ వీడియోను ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో నవంబరు 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
‘‘శ్యామ్ క్యారెక్టరైజేషన్‌ను వివరిస్తూ ఈ పాట సాగుతుంది. కృతీ మహేశ్, యశ్ మాస్టర్స్ ఈ చిత్రానికి నృత్యదర్శకులుగా చేశారు. మిక్కీ జె. మేయర్ మంచి సంగీతం అందించారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం.
SHYAM will RISE :)
— Nani (@NameisNani) October 30, 2021
We are all set 🔥
A @MickeyJMeyer Musical#RiseOfShyam on November 6th.#ShyamSinghaRoy pic.twitter.com/wTwfefvsyY
Comments
Please login to add a commentAdd a comment