
ఒకే ఒక్క సినిమాతో ఎక్కడలేని క్రేజీ సంపాదించుకుంది ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకులకు తక్కువ సమయంలోనే ఎక్కువ దగ్గరైంది. తొలి సినిమానే సూపర్, డూపర్ హిట్ అవ్వడంతో ఈ ‘బేబమ్మ’కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే నాని శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’,నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో పాటు లింగుస్వామి, రామ్ పోతినేని కాంబోలో రాబోతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే నాగార్జున ‘బంగార్రాజు’లో చైతన్యకు జోడిగా అలరించబోతుంది. నేడు ఈ బేబమ్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల నుంచి పోస్టర్లు విడుదల చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు మేకర్స్.
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ సినిమా టీమ్ కూడా కృతికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుధీర్ ప్రేమించిన అమ్మాయిగా నటిస్తోంది కృతి శెట్టి .
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. నేడు కృతి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
నితిన్, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం స్క్రిప్టు పనులను చేసుకుంటున్న చిత్రబృందం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. . నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ సంస్థపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment