Shyam Singha Roy Movie Tara Song Lyrical Video Released - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Published Thu, Dec 23 2021 6:24 PM | Last Updated on Thu, Dec 23 2021 6:34 PM

Shyam Singha Roy Movie Tara Song Lyrical Video Released - Sakshi

Shyam Singha Roy Movie Tara Song Lyrical Video Released: నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో నటించిన సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయిలపల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు. మడోన్నా సెబాస్టియన్ మరో హీరోయిన్‌గా నటించింది. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన మూవీ టీం.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ని రిలీజ​ చేసింది.

"తెరపైన కదిలేలా కథలేవో మొదలే .. తార నింగిదిగి నేల .. కింద నడిచేలా .. వచ్చేనిలా " అంటూ ఈ పాట సాగుతుంది. నాని, కృతిశెట్టిలపై ఈ పాటను చిత్రీకరించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement