డైరెక్టర్‌ నాని | Nani Director role in Shyam Singha Roy | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ నాని

Published Sat, Nov 7 2020 6:23 AM | Last Updated on Sat, Nov 7 2020 6:23 AM

Nani Director role in Shyam Singha Roy - Sakshi

డైరెక్టర్‌ అవుదాం అనుకుని యాక్టర్‌ అయ్యారు నాని. ఇప్పుడు డైరెక్టర్‌గా మారబోతున్నారాయన. అయితే సినిమాకు డైరెక్టర్‌గా కాదు. సినిమాలో డైరెక్టర్‌. ‘టాక్సీవాలా’ ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాని. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతీ శెట్టి కథానాయికలు. వెంకట్‌ బోయిన్‌పల్లి నిర్మిస్తున్నారు. ఇందులో నాని దర్శకుడిగా కనిపిస్తారని టాక్‌. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. ముందుగా కోల్‌కత్తాలో ఈ సినిమాను చిత్రీకరించాలనుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే సెట్స్‌ ద్వారా కోల్‌కత్తా వాతావరణాన్ని సృష్టించాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement