హైదరాబాద్, సాక్షి: సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపు కోసం మరోసారి గ్రామ సభలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). అయితే ఈ పరిణామాలు చాలా చోట్ల గందరగోళానికి దారి తీసింది. అర్హత ఉన్నవాళ్లు సైతం ఇబ్బంది పడుతున్నామంటూ వాపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు.
మోసకారి కాంగ్రెస్ సర్కారు(Congress Government)పై ప్రజాతిరుగుబాటు మొదలైంది అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన. గ్యారెంటీల గారడీపై జనగర్జన షురూ అయింది. అసమర్థ ముఖ్యమంత్రి అసలు స్వరూపం బట్టబయలైంది. ఇక కాలయాపనతో కాలం సాగదు. అటెన్షన్ డైవర్షన్ ఏమాత్రం చెల్లదు. ఈ దరఖాస్తుల దందా నడవదు. ఈ ఆగ్రహ జ్వాల ఇక ఆగదు..
నమ్మించి చేసిన నయవంచనకు నాలుగుకోట్ల సమాజం ఊరుకోదు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అట్టుడికిన గ్రామసభల(Grama Sabha) సాక్షిగా. గ్రామసభలా...ఖాకీల క్యాంప్ లా!?. సంక్షేమ పథకాల కోసమా.. కాంగ్రెస్ కార్యకర్తల నిర్ధారణ కోసమా!?. ఖాకీల దౌర్జన్యాలు.. కాంగ్రెస్ నేతల బెదిరింపులతో గ్రామసభలు!.
పోలీసు పహారాలో గ్రామలను నింపేసి గ్రామసభలా? ప్రశ్నించిన ప్రజలపై ఖాకీల జులుమే సమాధానమా?. ఇదా.. మీరు చెప్పిన ప్రజా పాలనా?. ఇదా.. మీరు చెప్పిన ఇందిరమ్మ పాలనా?. పోలీసుల నడుమ.. అంక్షల నడుమ పథకాలకు అర్హుల గుర్తింపట!. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గేంటి అన్నట్లు కాంగ్రెస్ పాలన! అంటూ ట్వీట్ చేశారాయన.
ఇదీ చదవండి: సారూ.. మా పేర్లు ఎందుకు లేవు?
Comments
Please login to add a commentAdd a comment