
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాసిప్స్ బంద్ చేసి.. గవర్నరెన్స్‌పై రేవంత్ దృష్టి పెట్టాలన్నారు. కుటుంబాలు మాకు లేవా? అని ప్రశ్నించారు. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరి తయారైంది. రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారి.. తన పాలన అట్టర్ ప్లాప్ అని తానే చెప్పాడు. 71వేల కోట్లు రెవెన్యూ తీసుకురాలేమని రేవంత్ ఒప్పుకున్నాడు. 2014లో రేవంత్ లాంటి మూర్ఖుడు సీఎం అయి ఉంటే.. తెలంగాణ వెనక్కి పోతుందన్న సమైఖ్యాంధ్రనేతల మాటలు నిజం అయ్యేవి. పిచ్చి పనులకు చేస్తున్నాడు కాబట్టే.. సీఎంను ప్రజలు తిడుతున్నారు.. దానికి ఎవరు ఏం చేస్తారు?.
నిండు సభలో బట్టలు విప్పి కొడాతమని రేవంత్ బజారు భాష మాట్లాడారు. మెదటి ఏడాదిలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ ఒప్పుకున్నాడు. సంపద సృష్టించే జ్ఞానం, తెలివి రేవంత్ రెడ్డికి లేదు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే.. తెలంగాణ పెరుగుతుందా?. కేంద్రంతో సఖ్యతగా ఉండి.. నిధులు సాధిస్తానని ఎంత తెచ్చాడు. కేసీఆర్‌పై కోపంతో.. రైతులను గోస పెడుతున్నాడు. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడు. మల్లికార్జునఖర్గే, రాహుల్, ప్రియాంకాగాంధీ, కేసీ వేణుగోపాల్‌కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీగా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆందోళన అవుతుంటే.. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించటం లేదు?.
బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్‌ను ఎందుకు ఖండించటం లేదు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా?. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యవస్థ. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే.. ఎలా శిక్షిస్తారు? రేవంత్ చెప్పాలి.
గాసిప్స్ బంద్ చేసి.. రేవంత్ రెడ్డి గవర్నరెన్స్ పై దృష్టి పెట్టాలి. కుటుంబాలు మాకు లేవా?. పిల్లలు మాకు లేరా? రేవంత్‌కే ఉన్నారా?. నాకు అడ్డమైన వారితో లింకులు పెట్టిన నాడు.. మా కుటుంబాలు బాధ పడలేదా?. ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన రేఖలు బయట పెట్టాలా?. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ గోడలు దూకుతాడో మాకు తెలియదా?. సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపేవాడో కూడా తెలుసు. బీజేపీ నేతల బాగోతాలు కూడా నా దగ్గర ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న మాకు ఎవరు ఏంటో అన్నీ తెలుసు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు తీస్తాం’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment