grama sabhalu
-
చంద్రబాబు, పవన్ గ్రామ సభలపై రవీంద్రనాథ్ రెడ్డి కామెంట్స్
-
‘పవన్ కల్యాణ్ గ్రామ సభలకు ప్రజల స్పందన శూన్యం’
వైఎస్సార్ కడప, సాక్షి: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభలకు ప్రజల నుంచి స్పందన శూన్యమని కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. పదవులు లేకపోయినా పచ్చ కండువాలు వేసుకుని గ్రామసభల్లో పెత్తనం చెలాయిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రూ. 13 వేల కోట్ల అప్పు చేశారు. ప్రతి మంగళవారం అప్పుల రోజుగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళ్లుతోంది. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదు. ఖరీఫ్ సీజన్ అయిపోతున్నా ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకున్నామా అని ప్రజలు బాధ పడుతున్నారు. .. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు పలికిన వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన గ్రామ సభకు కూడా ప్రజల నుండి స్పందన లేదు. సూపర్ సిక్స్ పథకాలను పక్కాగా అమలు చేయాలి. లేకుంటే ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటాలు చేసేందుకు సిద్ధం. చంద్రబాబు 2014లో మోసం చేశారు.. ఇప్పుడు కూడా ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు’’ అని అన్నారు. -
పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి
Live Updates.. ►అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్ఎస్ అనుకుంటోంది. తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుంది. ప్రతీ ఊరిలో కౌంటర్ ఉంటుంది. జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. గత పాలకుల మాదిరి మా పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనేది ఉండదు. ►నేటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. గ్రామాల్లో గ్రామసభలను ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ►ఇక, రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగనున్నాయి. గ్రామ సభలు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు. ►అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ►ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లను చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌కు గానూ 30 మంది స్పెషల్ ఆఫీసర్స్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నియమించారు. ప్రజా పాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్లకు ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇంఛార్జ్‌గా ప్రభుత్వం నియమించారు. ►జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో ఐదు వేల మంది సిబ్బంది ఉండనున్నారు. ఐదువేల మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక వార్డులో నాలుగు టీమ్స్, ప్రతి టీంలో ఏడుగురు సిబ్బంది ఉంటారు. ఈ నెల 31వ తేదీ, జనవరి ఒకటో తేదీ మినహా ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. -
పోలీస్ స్టేషన్ల పరిధి మార్పు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో పలు గ్రామాల పోలీసుస్టేషన్ల పరిధిని మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాల విభజన సందర్భంగా జీవో ఎంఎస్ నెంబర్ 93 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేసే క్రమంలో ప్రస్తుతం కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న ఇతర రెవెన్యూ మండలాల గ్రామాలను ఆయా రెవెన్యూ మండలాల పరిధిలోని పోలీసుస్టేషన్‌కు కింద మార్పు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు మార్పులకు గురైన గ్రామాలు ఏ పోలీసుస్టేషన్ పరిధిలో చేరాయనే దానిపై సంబంధిత గ్రామాల్లో పోలీసు అధికారులు గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ గ్రామాలు మార్చి 1వ తేదీ నుంచి సంబంధిత మండలానికి సంబంధించిన పోలీసుస్టేషన్ల పరిధిలోకి రానున్నాయి. మారిన గ్రామాలు ఇవే.. రాచర్ల రెవెన్యూ మండలానికి చెందిన యడవల్లి, రంగారెడ్డిపల్లి, అంకిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, వద్దులవాగుపల్లి, మేడంవారిపల్లి, గుడిమెట్ల, కొత్తపల్లి, రామాపురం, అచ్చంపల్లి గ్రామాలు రాచర్ల పోలీసుస్టేషన్ పరిధిలో చేరాయి. గిద్దలూరు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న కొమరోలు రెవెన్యూ మండలానికి చెందిన దద్దవాడ , నారాయణపల్లి, గుండ్రెడ్డిపల్లి, అలసందలపల్లి, గోవిందపల్లి, అక్కపల్లి, వెంకటంపల్లి, కంకరవారిపల్లి, పొట్టుపల్లి, తాటిచర్ల, హసనాపురం, నాగిరెడ్డిపల్లి, ముత్తరాసిపల్లి కొమరోలు పోలీసుస్టేషన్ పరిధిలోకి మారాయి. వేటపాలెం పీయస్ పరిధిలోని ఎన్జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన మట్టిగుంట (ఎన్జీపాడు పరిధిలోకి), ఇంకొల్లు పీయస్ పరిధిలో ఉన్న ఎన్జీపాడు రెవెన్యూ మండలానికి చెందిన తిమ్మసముద్రం, మద్దిరాల, ముప్పాల గ్రామాలు ఎన్జీపాడు పోలీసుస్టేషన్ పరిధిలోకి చేరాయి. చదవండి: (తిరుమల: టీటీడీ కీలక నిర్ణయం) కందుకూరు టౌన్ పీయస్ పరిధిలో ఉన్న మోపాడు, కంచరగుంట గ్రామాలు కందుకూరు రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి చేరాయి. కందుకూరు టౌన్ పీయస్ పరిధిలో ఉన్న వలేటివారిపాలెం రెవెన్యూ మండలానికి చెందిన కాకుటూరు, బడేవారిపాలెం, నేకునాంపురం (అత్తింటివారిపాలెం), నూకవరం, పోకూరు, సింగమనేనిపల్లి, కొండారెడ్డిపల్లి, నలదలపూర్ గ్రామాలు వలేటివారిపాలెం పోలీసుస్టేషన్ పరిధిలోకి మారాయి. గుడ్లూరు పీయస్ పరిధిలో ఉన్న లింగసముద్రం రెవెన్యూ మండలానికి చెందిన చిన్నపవని, పెద్ద పవని, ముత్యాలపాడు, ముత్తంవారిపల్లి, అంగిరేకులపాడు, మేదరమెట్లవారిపాలెం, అన్నెబోయినపల్లి గ్రామాలు లింగసముద్రం పీఎస్ పరిధిలోకి వచ్చాయి. -
పంచాయతీ పాలన అస్తవ్యస్తం..!
సాక్షి, కరీంనగర్: గ్రామ పంచాయతీల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆగస్టు 2తో సర్పంచ్ల పదవీకాలం ముగియండంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో పోలుపోలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో కార్యదర్శికి ఐదారు గ్రామ పంచాయతీలు అప్పగించడంతో ఏ పని చేయాలో తోచని పరిస్థితి వారిది. ఇటీవల నియమించిన ప్రత్యేక అధికారుల నియమాకం కూడా ముందునుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. నిధులున్నా.. వాడుకోలేని దుస్థితి. గ్రామాల్లోని పారిశుధ్యం, వీధిదీపాల ఏర్పాట్లు, మంచినీటి సమస్య, క్లోరినేషన్ వంటి పనులకు నిధులున్నా ఖర్చుచేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రత్యేక అధికారులు గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోక పోవడంతో పంచాయతీ పాలన గాడి తప్పుతోంది. గ్రామ కార్యదర్శుల కొరతతో గ్రామాల్లో గ్రామాభివృద్ధి కుంటుపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోపాటు గ్రామాల్లో జరిగే ఏ కార్యక్రమానికైనా కార్యదర్శి బాధ్యత కీలకం. ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు క్షేత్రస్థాయిలోని గ్రామాల్లో అర్హులెవరో, అనర్హులెవరో తేల్చాల్సింది గ్రామ కార్యదర్శులే. గ్రామ పంచాయతీలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అనే నానుడిని అధికార యంత్రాంగం విస్మరిస్తుండడంతో గ్రామపంచాయతీ పాలన గాడి తప్పుతోంది. జిల్లాలో పాతవి 276 గ్రామ పంచాయతీలు, కొత్తవి 54 గ్రామపంచాయతీలున్నాయి. మొత్తం 330 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 109 మంది కార్యదర్శులు పనిచేస్తుండగా.. 167 ఖాళీలున్నాయి. ఇదో లెక్క.. దీనికి మరో లెక్క కూడా ఉంది. ఇప్పటికే క్లస్టర్ గ్రామాల పేర ప్రభుత్వం కొన్నింటిని ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 136 క్లస్టర్‌గ్రామాలకు 27 కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి రెండుమూడు, ఒక్కొక్క చోట నాలుగేసి పంచాయతీలను కలిపి ఒక క్లస్టర్ గ్రామంగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఎందుకు జరిగిందో అధికారులు చెప్పలేని పరిస్థితి నెలకొంది. నేరుగా ప్రజలతో సంబంధం ఉండి ఆ గ్రామానికి సేవ చేసేందుకు పంచాయతీలు ఉపయోగపడుతుంటాయి. ఇలాంటి సమయంలో క్లస్టర్ల ఏర్పాటు ఎందుకు జరిగిందో.. ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో బయటపెట్టడం లేదు. ఈ క్రమంలో పరిపాలన పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్థిక కోణంలో పరిశీలిస్తే కార్యదర్శుల సంఖ్య తగ్గించేందుకే ఆ పని చేసినట్టు తెలు స్తోంది. ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శిని ఇవ్వడానికి బదులు రెండుమూడు పంచాయతీలను కలిపి క్లస్టర్ గ్రామంగా ఎంపిక చేయడం వెనుక ఒకే కార్యదర్శితో వెల్లదీసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవస్థ మరింత అధ్వానంగా ఉంది. క్లస్టర్ల పరంగా చూస్తే ఖాళీలు 27గానే కనబడుతున్నాయి. పంచాయతీల పరంగా 167 ఖాళీలున్నా యి. పనిచేస్తున్నవారు 109 మందే కావడంతో సగానికి పైగా ఖాళీలు దర్శనమిస్తున్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి అరడజన్ పంచాయతీలకు సైతం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న తీరు కొనసాగుతోంది. పంచాయతీలు సొంత ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా 90 శాతం పన్నులు వసూలు చేశాయి. పంచాయతీలకు రావాల్సిన 14 ఆర్థిక సంఘం నిధులు రెండు దశల్లో రూ.25 కోట్లు వచ్చాయి. అంగన్వాడీ భవనాల నిర్వహణ బాధ్యత కూడా పంచాయతీలకే అప్పగించారు. ఇప్పటికే వీధిదీపాలు, పారిశుధ్య పనులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి దశలో ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి చొప్పున కేటాయిస్తే అభివృద్ధి పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కొత్త పంచాయతీ డివిజన్లు ఏర్పాటు చేయకపోగా.. డివిజన్ పంచాయతీ అధికారి పోస్టులను ఎత్తేశారు. వారిని కొత్త జిల్లాలకు పంపారు. అన్ని బాధ్యతలను జిల్లా పంచాయతీ అధికారి మాత్రమే చూస్తున్నారు. దీంతో పనుల ఒత్తిడితో పంచాయతీ పాలన క్షేత్రస్థాయిలో ప్రజలదరికి చేరకపోవడంతో అనుకున్న మేరకు అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇకనైనా పంచాయతీ కార్యదర్శుల భర్తీని ప్రభుత్వం వేగవంతం చేసి గ్రామపంచాయతీలను పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పట్టించుకోని ప్రత్యేకాధికారులు పంచాయతీల పాలన వ్యవహారాలను చూడటానికి నియమించిన ప్రత్యేక అధికారులు రెవెన్యూ, వ్యవసాయ, ఇంజినీరింగ్, విద్య తదితర శాఖల అధికారులకు అప్పగించడంతో వారు రోజువారీ కార్యాలయాల పనులు పూర్తి చేయడంతోపాటు పల్లెల్లో పాలన వ్యవహారాలు చూడాల్సివస్తోంది. ఆయా శాఖల అధికారులు రైతుబీమా, రైతుబంధు, ఓటరు నమోదు, సర్వేలు, వంటి అనేక కార్యక్రమాల్లో తలమునకలై ఉండడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే రాజ్యమేలుతున్నాయి. బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై అయోమయం ఈనెల 17, 18 తేదీల్లో జరిగే బతుకమ్మ, దసరా ఏర్పాట్లపై గ్రామపంచాయతీల్లో నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం ముగియడం, కార్యదర్శుల కొరత, ప్రత్యేక అధికారుల లేమి దీనికితోడు శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉన్న అధికారులంతా బిజీగా ఉండడంతో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలు, బతుకమ్మ, దసరా ఏర్పాట్ల నిర్వహణపై ఎవరికి చెప్పుకోవాలో..? ఏం చేయాలో..? తోచని పరిస్థితి గ్రామప్రజల్లో నెలకొంది. కొన్ని గ్రామాల్లో తాజా మాజీ సర్పంచ్‌లు, ఔత్సాహిక యువకులు, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే వారు అక్కడక్కడ పండుగల ఏర్పాట్లపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప మెజార్టీ గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిస్తున్నాయి. కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో బతుకమ్మల నిమజ్జనానికి ఏర్పాటు చేస్తున్న ట్యాంక్ -
తెరపైకి సీరోలు మండలం
వద్దంటూ నాలుగు పంచాయతీల తీర్మానం అంగీకరించిన కాంపల్లి, సీరోలు గ్రామస్తులు డోర్నకల్/కురవి : నియోజకవర్గంలో కొత్త మండలం పేరు పైకి వచ్చింది. సీరోలును మండలంగా ఏర్పాటు కోసం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు గురువారం డోర్నకల్ మండలంలోని ఆరు, కురవి మండలంలోని ఆరు, మరిపెడ మండలంలో మూడు గ్రామాల్లో కలిపి 15 గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఇప్పటివరకు చిన్నగూడూరు, దంతాలపల్లి, ఎల్లంపేటను మండలాలుగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనలు చేపట్టగా, తాజాగా సీరోలు పేరు తెరపైకి వచ్చింది. సీరోలు మండలం ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం డోర్నకల్ మండలం పెరుమాళ్లసంకీస, మన్నెగూడెం, రాయిగూడెం, చిలుకొయ్యలపాడు, అందనాలపాడు, ముల్కలపల్లి, కురవి మండలం సీరోలు, కాంపల్లి, చింతపల్లి, కొత్తూరు (సి), ఉప్పరిగూడెం, తాళ్లసంకీస, మరిపెడ మండలంలోని ఎడ్జర్ల, తండధర్మారం, బాలిన ధర్మారంలో గ్రామసభలు నిర్వహించారు. గ్రామసభలపై ప్రచారం జరగకపోవడంతో ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాలేదు. మూడు నెలల క్రితం సీరోలును మండలంగా ఏర్పాటు చేస్తారని ప్రచారం జరిగి నా ఎవరూ నోరు విప్పలేదు. మాజీ ఎమ్మెల్సీ ఏ.వెంకట్‌రెడ్డి స్వగ్రామం సీరోలు కాగా, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ రాంచంద్రునాయక్ ఇదే గ్రామపంచాయ తీ పరిధిలోని రూప్లాతండా. సీరోలులో పోలీస్‌స్టేషన్, ఆంధ్రాబ్యాంక్, పీహెచ్సీ నిర్వహణకు సరిపడ ఆరోగ్య ఉపకేంద్ర భవనం, ఆర్టీసీ బస్టాండ్ ఉన్నాయి. వ్యతిరేకిస్తున్న ప్రజలు డోర్నకల్ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో సీరోలు కు సమీపంలో ఉన్న మన్నెగూడెం, అందనాలపాడు, చిలుకొయ్యలపాడు గ్రామస్తులు సీరోలు మండలంలో కలి పేందుకు అనుకూలంగా తీర్మానం చేయగా, ముల్కలపల్లి, పెరుమాళ్లసంకీస, రాయిగూడెం ప్రజలు తమ గ్రామాలను డోర్నకల్‌లోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. కురవి మండలంలోని సీరోలు, కాంపెల్లి గ్రామాలకు చెందిన వారు అనుకూలంగా తీర్మానం చేయగా, చింతపల్లి, కొత్తూరు (సి), ఉప్పరిగూడెం, తాళ్లసంకీస ప్రజలు కురవి మండలం లోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. మరిపెడ మండలంలోని ఎడ్జర్ల, తండధర్మారం, బాలినధర్మారం గ్రామాల వారు కూడా మరిపెడ మండలంలోనే కొనసాగించాలని తీర్మానం చేశారు. తహసీల్దార్ సంజీవ, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, డీటీ శేషగిరిస్వామి, ఆర్ఐ ఫిరోజ్, సర్పంచ్‌లు కాబు, మంగమ్మ, పద్మ, ఉమారాణి, కురాకుల రమణ, ఉపసర్పంచ్ కొంపెల్లి సతీష్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.