Live Updates..
►అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..
- ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం
- ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం.
- ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.
- అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు.
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్‌ఎస్ అనుకుంటోంది.
- తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.
- పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుంది.
- ప్రతీ ఊరిలో కౌంటర్ ఉంటుంది. జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
- గత పాలకుల మాదిరి మా పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనేది ఉండదు.
►నేటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. గ్రామాల్లో గ్రామసభలను ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు.
►ఇక, రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగనున్నాయి. గ్రామ సభలు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు.
►అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.
►ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లను చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌కు గానూ 30 మంది స్పెషల్ ఆఫీసర్స్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నియమించారు. ప్రజా పాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్‌లకు ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇంఛార్జ్‌గా ప్రభుత్వం నియమించారు.
►జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో ఐదు వేల మంది సిబ్బంది ఉండనున్నారు. ఐదువేల మంది వాలంటీర్లు ఉన్నారు.
ఒక వార్డులో నాలుగు టీమ్స్, ప్రతి టీంలో ఏడుగురు సిబ్బంది ఉంటారు. ఈ నెల 31వ తేదీ, జనవరి ఒకటో తేదీ మినహా ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment