Guarantee Scheme
-
ఢిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రజల కోసం కాంగ్రెస్ గ్యారెంటీలను ప్రకటించింది. ఈ సందర్బంగా 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్, ఉచిత రేషన్ కిట్ గ్యారెంటీలను కాంగ్రెస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ మేరకు గ్యారంటీల పోస్టర్లను సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మేము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయల అప్పులు మాఫీ చేశాం. 21వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశాం. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. ఇది మా నిబద్దతను తెలియచేస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ తరహా హామీలు ఇస్తున్నాం. స్వాతంత్ర్యం వచ్చాక ఈ స్థాయిలో ఎవరూ రుణమాఫీ చేయలేదు. మోదీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది. ఉచిత బస్సు ప్రయాణం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాం. #WATCH | Delhi: If voted to power in #DelhiElections2025, Congress announces to provide LPG cylinders at Rs 500, free ration kits and 300 units of free electricity (Source: Congress) pic.twitter.com/SK4HsNnCAk— ANI (@ANI) January 16, 2025 దేశంలో నిరుద్యోగం సమస్యగా మారింది. మోదీ ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఇచ్చింది. అమలు చేసిందా?. 11 ఏళ్లుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చూడండి. 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. ఇచ్చారా?. 11 ఏళ్లలో మోదీ ఇచ్చింది కేవలం ఏడు లక్షల ఉద్యోగాలు మాత్రమే. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చాక 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ఢిల్లీలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు నాది బాధ్యత. కాలుష్యంతో ఢిల్లీ నివాసయోగ్యం కాకుండా చేశారు. ఢిల్లీ రావాలంటే భయపడాల్సి వస్తోంది. ఢిల్లీకి వస్తే జ్వరాలు వస్తున్నాయి. ఏ సమస్య వచ్చినా సెలవులు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కేజ్రీవాల్, మోదీ ఇద్దరు ఢిల్లీలో విఫలమయ్యారు. ఢిల్లీని నాశనం చేశారు. మళ్లీ కాంగ్రెస్ వస్తేనే ఢిల్లీ బాగుపడుతుంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో పార్టనర్ బీఆర్ఎస్ను తెలంగాణలో ఓడించాం. లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న ఆప్‌ను కూడా ఢిల్లీలో ఓడిస్తాం. దావోస్‌కు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం. పర్యటన ముగిసిన తర్వాత పెట్టుబడులు ఎంత వచ్చాయో చెబుతాం. అవినీతిని కట్టడి చేస్తే గ్యారంటీలు అమలు చేయవచ్చు. 16లక్షల కోట్ల రూపాయలు అప్పులను కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోదీ మాఫీ చేశారు. మోదీ, కేజ్రీవాల్ కుర్చీ కొట్లాట వల్ల ఢిల్లీ ప్రజల వల్ల నష్టపోతున్నారు. తెలంగాణలో ఒకటిన్నర శాతం ఓట్లు ఉన్న కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు తెచ్చాం. అధికారంలోకి వచ్చాం. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
‘పల్లె పండుగ’కు దండగ ఖర్చు..
సాక్షి, అమరావతి: పల్లె పండుగ కార్యక్రమాన్ని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్భాటంగా నిర్వహిస్తున్నప్పటికీ దాని నిర్వహణకు మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. అయినా.. ఇందుకు ఒక్కో గ్రామంలో కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వెచి్చస్తున్నట్లు సమాచారం. మంత్రులు పాల్గొనే చోట ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఈ ప్రభావం పనుల నాణ్యతపై తప్పనిసరిగా పడుతుందని అనుమానిస్తున్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధులతో గ్రామాల్లో కొత్తగా చేపట్టే పనులకు భూమిపూజ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి వారం రోజులపాటు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా.. నిజానికి.. ఉపాధి నిధులతో చేపట్టే పనులకు భూమిపూజ, శంకుస్థాపన అంటూ ఎలాంటి అర్భాటాలు ఉండవు. పైగా.. ఉపాధి పనుల్లో కాంట్రాక్టరు ప్రమేయమే ఉండదు. కానీ, ఇతర నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టరు తన మిగులు కోసం అంచనా విలువ పెంచేస్తారు. అదే ఉపాధి పనుల అంచనాల తయారీలో ఎలాంటి మిగులు నిధులకు ఆస్కారం లేకుండా అంచనాలు రూపొందిస్తారు. గత సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కో గ్రామంలో రూ.కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా శాశ్వత భవన నిర్మాణాలు చేపట్టినా.. ఎలాంటి హడావుడి లేకుండానే వాటిని పూర్తిచేసింది. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా పల్లెపండుగ అంటూ నానా హడావుడి చేస్తోంది. పల్లె పండుగ ఖర్చు టీడీపీ నేతలదే.. ఇక కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనుల వివరాలను గ్రామంలో ఒకచోట వాల్ పెయింట్ రాయడానికి రూ.3 వేల చొప్పున.. బ్యానర్ ఏర్పాటుకు మరో రూ.1,500 చొప్పున బిల్లులు పెట్టుకునే వెసులుబాటు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, అత్యధిక గ్రామాల్లో అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టరు ముసుగులో ఆయా పనుల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుని పల్లె పండుగ కార్యక్రమ ఖర్చు భరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల ఈ కార్యక్రమ నిర్వహణకు పెట్టే ఖర్చు మొత్తాన్ని అతను చేపట్టే పనుల నుంచి మిగుల్చుకోక తప్పదని.. చివరికి ఇది పనుల నాణ్యతపై ప్రభావం చూపుతుందన్న చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.తొలిరొజు 960 గ్రామాల్లో 1,600 పనులకు.. ఇదిలా ఉంటే.. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా తొలిరోజైన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 960 గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,600 కొత్త పనులకు భూమిపూజ జరిగినట్లు అధికారుల సమాచారం. ఇందులో 1,300 దాకా సిమెంట్ రోడ్ల పనులే ఉన్నాయి. మరోవైపు.. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్‌లను పక్కనపెట్టడంతో అధికార టీడీపీ నేతల పెత్తనం కొనసాగింది. -
ఉత్తుత్తి గ్రామసభలే!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో ఏమేమి చేయాలో ముందే నిర్ణయించుకుని, వాటికి అధికార ముద్ర కోసం ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం (నేడు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామంటూ ఆర్భాటం చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు తూట్లు పొడుస్తూ గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సచివాలయాల భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులన్నింటినీ పక్కనపెట్టి, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధులతో కొత్తగా గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు పనులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధుల నుంచి ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కొత్త పనులు గుర్తింపు ప్రక్రియ అంతా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. నిజానికి.. ఉపాధి పథకంలో చేపట్టే ఏ పనైనా నిబంధనల ప్రకారం ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలి.అందుకే కూటమి పెద్దలు తమ వాళ్లకి కట్టబెట్టే పనులకు ఆమోదం తెలపడానికి ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఎందుకీ హడావుడి పవన్.. ఈ ఉత్తుత్తి గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఎక్కడాలేని హడావుడి చేస్తుండడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని పక్షం రోజులుగా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం అన్ని జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు జరగడం కొత్త కాదని, ఏటా నాలుగు విడతలుగా (ఏప్రిల్ 24న, ఆగస్టు 15న, అక్టోబర్ 2న, జనవరిలో మరో విడత) గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.ఇప్పుడే ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 9.92 లక్షల పనులకు జనవరిలోనే ఆమోదం సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందు నుంచే.. పంచాయతీలో చేపట్టాల్సిన పనులు, పేదలకు పనిదినాల కల్పనకు ఉన్న అవకాశాలు గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టి ఫిబ్రవరిలో పూర్తి చేస్తారు. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి లేబర్ బడ్జెట్ రూపకల్పనతో గ్రామాల వారీగా పనుల గుర్తింపు, ఆ పనులకు గ్రామ సభలో ఆమోదం వంటి ప్రక్రియ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు కల్లా అధికారులు పూర్తి చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కల్పించే పనులతో పాటు మెటీరియల్ నిధులతో చేపట్టే ఇతర అభివృద్ధి పనులన్నీ కలిపి మొత్తం 9.92 లక్షల పనులకు ఈ ఏడాది జనవరిలోనే గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని, ఆ పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పుడే అందజేశారు. అందులో దాదాపు 8.53 లక్షల పనులు పురోగతి దశలో ఉన్నాయి. అయితే, తమ నాయకులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చే మట్టి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు కొత్తగా అనుమతులు తెలిపేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. -
పేదింట ఆర్థిక వెలుగుకు ఉపాధి హామీ జేగంట!
ఉపాధి హామీ పథకాన్ని రెండిందాలా ప్రయోజనకరంగా మలచిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది..అంతకుముందు టీడీపీ హయాంలో పథకాలను ఎంతగా భ్రషు్టపట్టించాలో అంతగానూ దిగజార్చిన దౌర్భాగ్యాన్ని ఈ రాష్ట్రం చూసింది...అందుకు ఉదాహరణ నీరు–చెట్టు వంటి పథకాలే.. తద్భిన్నంగా జగన్ ప్రభుత్వంలో ప్రజోపయోగమైన ప్రభుత్వ భవనాల నిర్మాణానికి పెద్ద పీట వేసింది..ఇప్పుడా భవనాలు ఊరూరికీ ప్రజాసేవలు అందిస్తున్నాయి.. ఇది నవ్యాంధ్రకు సరికొత్త అభ్యుదయ సంకేతంగా మారింది..ఉపాధి హామీ పథకాన్ని పేదలకు మరింతగా అక్కరకొచ్చేలా ఆ కుటుంబాలను సమున్నతంగా ఎదిగేలా చేసే నవ్యావిష్కరణకు ప్రభుత్వం ఆలోచన చేసింది... ఇకపై ఊరూరా మట్టి రోడ్ల నిర్మాణానికి, సన్న చిన్న కారు రైతులను పండ్లతోటల పెంపకానికి ప్రోత్సహించి, ఈ పథకం కింద వాటి సాగుకు గుంతల తవ్వకం వంటి పనులను పేదలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఉపాధిహామీ పథకాన్ని బలోపేతం చేయాలన్న ఉన్నత లక్ష్యం దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది...ఎన్నికల కోడ్ ముగియగానే ఈ ఆలోచనను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది... సాక్షి, అమరావతి: ఇకపై ఉపాధి హామీ పథకం కింద కూలీల ద్వారా చేపట్టే పనుల్లోనూ ఆయా పేద కుటుంబాల వ్యక్తిగత ఆస్తుల కల్పనకు వీలున్న పనులకే పెద్దపీట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఐదేళ్లల్లో.. ఉపాధి హమీ పథకం మెటీరియల్ కేటగిరీకి సంబంధించిన నిధులను, ఇతర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అనుసంధానం చేసి, దాదాపు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామ సచివాలయాల భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజీ హెల్త్ క్లినిక్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ భవనాలు వంటివి.. ఊరందరికీ శాశ్వతంగా ఉపయోగపడే ఉమ్మడి ఆస్తుల నిర్మాణాలు చేపట్టిన విషయం తెలిసిందే. కూలీల ద్వారా చేపటే పనుల్లోనూ ఆయా పేదలు ఒక పక్క పనులు చేసుకుంటూ, చేసిన పనికి రోజు వారీ కూలి డబ్బులు పొందుతున్నారు. ఇకపై ఆయా పనుల ద్వారా వారే వ్యక్తిగతంగా సొంత ఆస్తులు సైతం ఏర్పాటు చేసుకునే దిశగా ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకర చర్యలు చేపట్టింది. ప్రస్తుత ఎన్నికల కోడ్ ముగియగానే ఈ తరహాలో గ్రామాల్లో కొత్తగా పెద్ద ఎత్తున పనుల అనుమతులు తెలిపేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఓ కార్యాచరణను సిద్ధం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో సైతం రాష్ట్రంలో ఏటా 46 లక్షల నుంచి 48 లక్షల కుటుంబాలు ప్రభుత్వం కలి్పంచే ఉపాధి హామీ పథకం పనులను చేసుకుంటూ, ఏటా ఐదున్నర వేల కోట్ల రూపాయల నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు లబి్ధపొందుతున్నాయి. రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటి వరకు ఆయా కుటుంబాలు ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం పనులు చేసుకోవడం ద్వారా ప్రత్యక్షంగా దాదాపు రూ.27,000 కోట్ల మేర కూలి రూపంలో లబి్ధపొందాయి.ఇకపై ఆయా పనులు చేసుకునే కూలీలకు వ్యక్తిగత ఆస్తిని తయారు చేసే పనులే ఎక్కువగా ఉండేలా పనులు గుర్తించాలంటూ ప్రభుత్వం గత ఐదేళ్లుగా అనేకసార్లు ఎప్పటికప్పుడు జిల్లా, మండల, గ్రామ స్థాయి ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. చాలాచోట్ల ఇప్పటి దాకా ఎక్కువగా గ్రామాల్లో ఊరచెరువుల్లో పూడికతీత, లేదంటే రైతుల పొలాలకు సాగునీరు వెళ్లే కాల్వలకు పూడిక తీత ..వంటి పనులనే స్థానికంగా చేపడుతున్నారని... ఇక నుంచి ఈ తరహా పనులను వీలైనంత మేర తగ్గించి, పేదలకు రెండు రకాలా ప్రయోజనకరంగా ఉండే పనులను చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. మట్టి రోడ్ల నిర్మాణం, పండ్ల తోటల పెంపకానికి పెద్ద పీట.. గ్రామాల్లో పేదలు కూలి పనులు చేసుకుంటూ సొంతంగా ఆస్తుల కల్పనకు ఉపయోగపడేందుకు అవకాశమున్న పనులను గుర్తించే ప్రక్రియను గ్రామాల్లో ఐదు నెలల కిత్రమే అధికారులు చేపట్టారు. రోడ్డు వసతి లేని మారుమూల గిరిజన ప్రాంతాల్లో కేవలం కూలీల ద్వారా మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. దీంతో పాటు సన్న చిన్నకారు రైతులను వివిధ రకాల పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సహించి, వాటి సాగులో గుంతల తవ్వకం మొదలు, మొక్కలు నాటే పనులకు ఉపాధి హామీ పథకం ద్వారా ఆరి్థక సహాయం అందించడం వంటి పనులకు పెద్ద సంఖ్యలో అనుమతులివ్వడానికి కార్యాచరణను సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. దీనికితోడు గ్రామాల్లో కొత్తగా చేపల చెరువుల నిర్మాణ పనులకూ అనుమతులు తెలపనున్నట్టు వారు చెబుతున్నారు. -
గ్యారంటీలపై చర్చకు రాహుల్ సిద్ధమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని, వీటిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో బహిరంగ చర్చకు సిద్ధమ ని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందుకు రాహుల్ సిద్ధమేనా అని సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోను తుక్కు గూడలో విడుదల చేశామని, తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ రాహుల్ గాంధీ పేర్కొనడాన్ని కిషన్‌రెడ్డి తప్పుబట్టారు. హామీల్ని నిలబెట్టుకున్నామంటున్న రాహుల్ గాంధీకి దమ్ము, ధైర్యముంటే హామీలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు .‘తెలంగాణ ప్రజల తరఫున మేం వస్తాం. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాలి’ అని డిమాండ్ చేశారు. ఉట్టికెగరనోడు.. ఆకాశానికి ఎగురుతానన్నట్లు రాహుల్ తీరు ఉందని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలియని పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ఉన్నారని విమర్శించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ సభ ముగిశాక శనివారం బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక్కడ చేత కాలేదు కానీ దేశవ్యాప్తంగా చేస్తారా? తెలంగాణలో హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు కానీ దేశవ్యాప్తంగా దానిని అమలుచేస్తామంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేత కాక రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మీ ఇళ్లలో నోట్లు ముద్రించే యంత్రాలున్నాయా? కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఆ పార్టీ కార్యా లయాల్లో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో నోట్లు ముద్రించే యంత్రాలు పెట్టుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. చైనా బ్రాండ్ వస్తువులు బాగుంటాయంటున్న రాహుల్‌గాంధీ అవి ఇక్కడకు వస్తాయని అంటున్నారా.. సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చైనాను పొగుడు తున్న ఆయనకు కొద్దిగా కూడా బుద్ధి లేదని మండిపడ్డారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు గాంధీ పరివార్ కి మోదీ పరివారానికి మధ్య జరిగే పోరాటమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఈవీఎంల ద్వారానే గెలిచిన రేవంత్ రెడ్డి వాటిపైనే ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఫిరాయింపులపై ఉన్న దృష్టి పాలనపై ఏదీ? సీఎం రేవంత్‌రెడ్డికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న ధ్యాస పాలనపై కానీ, ఎన్నికల హామీల అమలుపై కానీ లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ 44వ సంస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం పార్టీ కార్య క్రమంలో పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో ఆట ఆడేది బీజేపీ మాత్రమేనని అన్నారు. -
‘మోదీ’ ప్రకటనలపై ఈసీకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ‘మోదీకీ పరివార్’, ‘మోదీ కీ గ్యారెంటీ’ ప్రకటనలను గుప్పిస్తోందని, వీటిని వెంటనే తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది. ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్‌ల కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం ఈసీని కలిసి ఎన్నికల కోడ్‌ను బీజేపీ ఎలా ఉల్లంఘించిందో వివరించింది. సుప్రీంకోర్టు గతంలోనే క్లీన్చిట్ ఇచ్చినా 2జీ స్ప్రెక్టమ్ కేసులో అభూత కల్పనలతో బీజేపీ తప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిందని ఈసీకి ఫిర్యాదుచేసింది. -
‘పాలమూరు’ పునర్నిర్మాణానికి రూ.10 వేల కోట్లతో ప్రణాళికలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘కాంగ్రెస్ ఎప్పు డైనా విధానాలకు కట్టుబడి, లక్ష్యసాధన కోసం పనిచేసే పార్టీ. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి మూడు నెలల్లోనే పాలమూరు పునర్నిర్మాణం కోసం రూ.10 వేల కోట్లకుపైగా వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నారాయణపేట–కొడంగల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, ప్రతిష్టా త్మక విద్య, వైద్య సంస్థల ఏర్పాటు, రోడ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణం ఇలా ప్రతి రంగంలోనూ అభివృద్ధి పనులతో పాటు పథకాల అమలులో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు’ అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ హస్తం అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధి ష్టానం వివిధ రాష్ట్రాలకు సంబంధించి శుక్రవారం తొలివిడతగా 39 మంది ఎంపీ అభ్యర్థుల జాబితా ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించినందుకు శనివారం కాంగ్రెస్ నాయకత్వానికి వంశీచంద్‌రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ.. మహబూబ్‌నగ ర్కు కాంగ్రెస్ గ్యారంటీ పేరిట లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ నక్కజిత్తులతో పాలమూ రు మోసపోయింది.. ఇదే కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెలంగాణనే కాదు, మహ బూబ్నగర్నూ పట్టించుకున్న సందర్భం లేదు. ఆ పదేళ్ల నష్టాన్ని పూడుస్తూ, భవిష్యత్ వైపు నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థమైన విధానంతో అడుగులు వేస్తోందని తెలిపారు. అందుకే అడుగడు గునా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నా రని చల్లా పేర్కొన్నారు. పాలమూరు న్యాయయా త్రలో జనం గుండె చప్పుడు విన్నానని.. కరువు లేని మహబూబ్‌నగర్ ఆకాంక్షకు అనుగుణంగా జనం కోసం.. జలం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు నిర్మించి, జలకళ తెచ్చి, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతానని, అందరూ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. -
TS: ఆరు గ్యారెంటీల అమలు ఎప్పుడు: కిషన్‌రెడ్డి
సాక్షి,మహబూబ్‌నగర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలు ఆరు గ్యారేజీలుగా మారాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. విజయ సంకల్ప్ యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీల అమలు కోసం నిధులు సమకూర్చడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రణాళిక లేదన్నారు. ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలన్నారు. కర్ణాటకలో కరెంటు సమస్యతో రైతులు రోడ్డున పడ్డారన్నారు. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడతాయనుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు నిర్లక్ష్యానికి గురవుతున్నారని మండిపడ్డారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా... ఓవైసీ ,కేసీఆర్, రాహుల్ గాంధీ ఎంతమంది దిగొచ్చిన మోదీని అడ్డుకోలేరన్నారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఉండదని మరోసారి స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో బీఆర్ఎస్, కేసీఆర్ ఆవశ్యకత లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్కు ఎజెండా లేదు. ఆ పార్టీ పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు. అధికార దుర్వినియోగం, అహంకారం, అవినీతి వల్లే ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటికీ తెలియదు. దేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయం. దేశంలో తొమ్మిదిన్నరేళ్లుగా ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారు. బీజేపీ విజయసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదీ చదవండి.. రాజకీయాలకు రైతులను బలి చేయొద్దు -
Ts: ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కులగణణ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కుల గణనపై కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇవ్వలేదని, అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. ‘మేం కులగణన తీర్మానానినికి మద్దతు ఇస్తున్నాం. దీనికి సంబంధించి న్యాయమైన అంశాలపై జాగ్రతగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్కు సహకరించాం. బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మాత్రం బీజేపీ బి - టీమ్ అంటున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ పనితీరుపై ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని, తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ -
ఆరు గ్యారెంటీలపై అయోమయం
-
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల అమలుకు లక్షా 25 వేల కోట్లు అవసరమైతే బడ్జెట్లో మాత్రం కేవంల రూ. 53వేల కోట్లు కేటాయించారని విమర్శించారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉంది. ప్రతి మీటరుకు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్గొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నాం’ అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి.. నల్గొండ దద్దరిల్లేలా కేసీఆర్ సభ -
TS: ప్రజాపాలన-అభయహస్తం.. భారీగా వచ్చిన దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-అభయహస్తం కార్యక్రమం ముగిసింది. ఇక, ఆరు గ్యారంటీల కోసం ప్రజలకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా కోటి 25లక్షల 84వేల 383వందల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. అయితే, డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్ మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఒక్కో మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, రూ.5 లక్షల యువ వికాసం, రూ.4 వేల పెన్షన్, రేషన్ కార్డులు, రైతు భరోసాలాంటి హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీని ప్రారంభించింది. ఆ తర్వాత ప్రజాపాలనలో భాగంగా ఐదు గ్యారెంటీలకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగా, గ్యారంటీలకుగానూ నిన్న ఒక్కరోజే 12లక్షల 53వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 24లక్షలు వచ్చినట్టు తెలిపారు. మహాలక్ష్మి, పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 650 కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ జనవరి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. -
‘ఆరు గ్యారంటీల అమలు సంగతేంటి?.. ఎన్నికల కోడ్ అంటారా?’
సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో జనానికి అనుమానాలు ఉన్నాయి. వంద రోజుల్లో అమలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, రేషన్‌కార్డుల అమలు విషయంలో గందరగోళం నెలకొందని కామెంట్స్ చేశారు. తాజాగా హరీష్‌రావు మీడియాతో చిట్‌చాట్‌లో భాగంగా మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. వంద రోజులు కచ్చితంగా ఓపిక పడతాం. కొంత మంది నేను జిల్లాలో తిరుగుతుంటే రైతు బంధు అని అడుగుతున్నారు. ఈ వంద రోజుల్లో దరఖాస్తులు తీసుకొని ఎంక్వైరీ చేసి నిదానంగా ఎన్నికల దాకా లాగుతారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయని చెప్పాలని కాంగ్రెస్ చూస్తోంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే పెట్టాలని చూస్తోంది. ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఇవ్వకుండా దాట వేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. గైడ్ లైన్స్ లేకుండా దరఖాస్తు చేసుకోవాలని చెప్పటం ఏంటో అర్థం కావటం లేదు. ఈ స్కీములు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పటం లేదు. రేషన్ కార్డు విషయంలో కూడా గందరగోళం నెలకొంది. అసలు ఇవి వస్తాయో రావో తెలియదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడితే వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు కావు. మొన్న విడుదల చేసింది శ్వేత పత్రాలు కావు, హామీల ఎగవేత పత్రాలు మాత్రమే. ఆన్ గోయింగ్ స్కీమ్ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయి. అలాంటి పరిస్తితి కనపడడం లేదు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం గైడ్ లైన్స్ ఎక్కడ? ఎవరెవరికి ఇస్తారు. ఇప్పటికే ఇల్లు ఉన్న, ఉద్యోగం ఉన్నా ఇస్తారా? లేదా? స్పష్టత లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేయటంలో జనానికి అనుమానాలు ఉన్నాయి. వంద రోజుల్లో అమలు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ల్యాండ్ కృజర్ల విషయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదు. బీపీ వెహికిల్స్ విజయవాడలోనే తయారు చేస్తారు కాబట్టి ప్రభుత్వం అక్కడికి వెళ్ళింది. ఎవరు సీఎంగా ఉన్నా ఆ వాహనాలు వాడాల్సిందే. నిజంగా ఆరు గ్యారంటీ అమలు చేయాలనే చిత్తశుద్ది ఉంటే వెంటనే జీవో విడుదల చేసి ఇవ్వొచ్చు. ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు ఎంత మందికి 10 లక్షలు ఇచ్చారు?. కాంగ్రెస్ కోత, ఎగవేత, దాటవేతలు చేయాలని చూస్తోంది. నిరుద్యోగ భృతి విషయంలో భట్టి విక్రమార్క మేము హామీ ఇవ్వలేదు అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ఇస్తామని చెప్పారు. బడ్జెట్ సరిపోతుందా అనేది ముందే అనుకొని హామీలు ఇచ్చారు కదా?. ఎన్నికల కోడ్‌లో ఇరికించకుండా ధాన్యానికి బోనస్ ఇవ్వాలి. అసలు వస్తాయా రావా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. మీకు చిత్తశుద్ది ఉంటే వెంటనే అమలు చేయాలి. మిగితా పథకాలు వంద రోజుల్లో అమలు చేస్తారు సరే వరి ధాన్యం బోనస్ ఎలా ఇస్తారు. ఇది ఆలస్యం చేస్తే ఇబ్బంది కదా? ఆన్ గోయింగ్ స్కీమ్ చేస్తేనే వంద రోజుల్లోగా ఈ హామీలు అమలు అవుతాయి. అలాంటి పరిస్థితి కనపడటం లేదు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరానికి 13 క్వింటాల్స్కు మాత్రమే 500 బోనస్ ఇస్తోంది.. మిగితా ధాన్యానికి ఇవ్వటం లేదు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఆలోచన చేస్తున్నట్లు ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు బంధు గతంలో రోజు వారీగా ఎంత ఇచ్చారు అనే లెక్కలను మేము చెప్పాం. కానీ, కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చాం అని చెప్తున్నారు కానీ.. ఎన్ని ఎకరాలకు ఎంత ఇచ్చారో కాంగ్రెస్ చెప్పటం లేదు. కరోనా సమయంలో అన్ని ఆపినా మేము రైతు బంధు ఆపలేదు. మేము ఈసీకి ఫిర్యాదు చేయం.. పథకాల అమలు కోరుకుంటున్నాం’ అని కామెంట్స్ చేశారు. -
ప్రజాపాలన దరఖాస్తు.. ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్‌హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్‌లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి -
పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి
Live Updates.. ►అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్.. ఇది దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్ఎస్ అనుకుంటోంది. తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుంది. ప్రతీ ఊరిలో కౌంటర్ ఉంటుంది. జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. గత పాలకుల మాదిరి మా పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనేది ఉండదు. ►నేటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం జరుగనుంది. గ్రామాల్లో గ్రామసభలను ఉదయం ఎనిమిది గంటలకే ప్రారంభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ►ఇక, రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగనున్నాయి. గ్రామ సభలు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు. ►అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ►ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లను చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్‌కు గానూ 30 మంది స్పెషల్ ఆఫీసర్స్‌ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నియమించారు. ప్రజా పాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్లకు ఆరు మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇంఛార్జ్‌గా ప్రభుత్వం నియమించారు. ►జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో ఐదు వేల మంది సిబ్బంది ఉండనున్నారు. ఐదువేల మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక వార్డులో నాలుగు టీమ్స్, ప్రతి టీంలో ఏడుగురు సిబ్బంది ఉంటారు. ఈ నెల 31వ తేదీ, జనవరి ఒకటో తేదీ మినహా ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. -
ఆరు గ్యారంటీలకు ‘రేషన్ కార్డు’ మస్ట్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో ప్రజావాణి చూస్తే అర్థమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి విడుదల చేశారాయన. ప్రజా పాలన పేరిట విడుదల చేసిన ఈ దరఖాస్తు ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుందని చెప్పారాయన. ఆరు గ్యారంటీల దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు. లోగోను కూడా ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగుటలేటి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తాం. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ప్రజలకు పదేళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదు. ప్రజావాణికి వస్తున్న స్పందనే ఆ విషయం చెబుతోంది. ప్రజావాణిలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు.. ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకెళ్లమే ప్రజా పాలన ఉద్దేశం. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తాం. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది అని ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ చెప్పారు. ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తాం. మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తాం. మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక గ్రూపునకు ఎండీఓ, మరో గ్రూప్‌నకు ఎంఆర్వో బాధ్యత వహిస్తారు. ఎవరి కోసం ఎదురు చూడకండి.. ఎవరి దగ్గరకు వెళ్లకండి. అన్ని గ్రామ పంచాయతీలలో అధికారులు అందుబాటులో ఉంటారు. జనవరి ఆరో తేదీ తర్వాత కూడా ఎంపీడీవో, ఎంఆర్వో ఆఫీసుల్లో అభయ హస్తం దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలోనే రేషన్‌కార్డులు ఇస్తాం. రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. పదేళ్ల గడీల నుంచి పాలన గ్రామాలకు తీసుకువస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ప్రజల దగ్గరకు పాలనను పంపిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ గ్యారంటీల అమలు.. వైట్ రేషన్ కార్డు కీలకం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలుకు తంబ్ రూల్‌గా వైట్‌రేషన్(తెల్లరేషన్) కార్డును తీసుకోనున్నట్టు సమాచారం. దీనిపై రెండు, మూడు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈనెల 28వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా ప్రజాపాలన సభలను నిర్వహించనుంది. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అయితే, ఈ పథకం లబ్ధి చేకూరలంటే రేషన్‌కార్డు తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వైట్ రేషన్ కార్డు లేకపోతే పథకం లబ్ధికి వారిని అనర్హుడిగా ప్రభుత్వం లెక్కలోకి తీసుకోనున్నట్టు సమాచారం. -
కరువు మండలాల్లో అదనపు ‘ఉపాధి’
సాక్షి, అమరావతి: కరువు మండలాల్లో కూలీల కుటుంబాలకు అదనపు పనులు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కుటుంబానికి అదనంగా 50 పనిదినాల పాటు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 103 కరువు మండలాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో పూర్తిగా నగర ప్రాంతంలో ఉండే కర్నూలు మినహాయించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మిగిలిన 102 మండలాల్లో అదనపు పనులు కల్పిస్తారు. ఈ మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కావాలని కోరే ఒక్కో కుటుంబం ఏడాదికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు పొందే వీలుంటుంది. దీంతో 2.42 లక్షల కుటుంబాలకు మేలు చేకూరుతుంది. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.13,660 వరకు అదనపు లబ్ధి కలుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సోమవారం కేంద్రానికి లేఖ రాశారు. కరువు మండలాల్లో అదనపు పని దినాలు.. సాధారణంగా ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి వంద పనిదినాల కల్పనకు అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో మాత్రం ఈ ఏడాది ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 150 పనిదినాల పాటు పనులు కల్పిస్తారు. 102 మండలాల పరిధిలో 5.68 లక్షల కుటుంబాలకు చెందిన దాదాపు 10 లక్షల మంది కూలీలు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకుంటుంటారు. 5.68 లక్షల కుటుంబాల్లో దాదాపు లక్ష కుటుంబాలు ఇప్పటికే వంద పనిదినాల గరిష్ట లక్ష్యాన్ని పూర్తి చేసుకుని ఉండడం లేదా గరిష్ట లక్ష్యానికి అతి దగ్గరగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ కుటుంబాలతోపాటు దాదాపు మరో లక్షన్నర కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో అదనపు పనులు కోరేందుకు అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 102 మండలాల పరిధిలో కనీసం 2,42,282 కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. -
ఇంటింటికీ ఆరు.. కాంగ్రెస్ జోరు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆరు గ్యారంటీ పథకాలపై ఇంటింటికీ ప్రచారం చేస్తోంది. సోమవారం సీడబ్ల్యూసీ నేతలు తమకు కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఆరు గ్యారంటీ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పక్కాగా ఆరు పథకాలను అమలు చేయనున్నామని చెప్పారు. ఏకంగా పథకాల కార్డులు అందజేసి రసీదులను సైతం తీసుకున్నారు. డివిజన్లవారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రతి రోజు ఇంటింటీకి వెళ్లి ఆరు పథకాలుపై విస్తృతంగా ప్రచారం చేయాలని అగ్రనేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల గడువుకు మిగిలిన వంద రోజులను సద్వినియోగం చేసుకుంటే అధికారం తమదేనన్న భరోసా కల్పించారు. నేతల ప్రచారం ఇలా.. ప్రచారంలో భాగంగా రాజస్తానన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ ఫైలట్ నాంపల్లిలోని యూసుఫియణ్ దర్గాలో ప్రార్థనలు, దేవీభాగ్‌లోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారీఖ్ అన్వర్ అంబర్‌పేటలోని గోల్నాక డివిజనన్ నెహ్రూ నగర్, సుందర్‌నగర్, కృష్ణానగర్‌లలో పర్యటించారు. ముషీరాబాద్‌లో మహారాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ప్రణితి షిండే చిరు వ్యాపారులను కలిసి ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. ఆమె వెంట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్‌లు ఉన్నారు. యాకుత్‌పురాలో నాగాలాండ్ పీసీసీ అధ్యక్షుడు ఎస్ఎస్ జమీర్, ఖైరతాబాద్‌లో మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వర్ష గైక్వాడ్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్‌రెడ్డితో కలిసి ప్రజలకు ఆరు పథకాలపై అవగాహన కల్పించారు. కూకట్‌పల్లిలో రాజ్యసభ మాజీ సభ్యుడు పీఎల్ పూనియా, మలక్‌పేటలో కేంద్ర మాజీ మంత్రి అజయ్ మాకెన్‌లు పర్యటించి ఆరు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. -
నర్సరీలతో ఉపాధి... ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షలు
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ ఏడాది కొత్తగా నర్సరీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు తోడ్పాటు కల్పిస్తున్నారు. అలాగే నిర్మాణాత్మక పనులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. దీంతోపాటు నీటి సంరక్షణ పనులకు కూడా ప్రభుత్వం ఉపాధి హామీలో నిధులు కేటాయిస్తోంది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తోంది. పూర్తి ఉచితంగా సన్న, చిన్నకారు రైతులు సాగు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 11 రకాల పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది కొత్తగా సన్న, చిన్నకారు రైతులు మరింత ఆర్థికాభివృద్ధి సాధించేందుకు ఉపాధి హామీ పథకానికి అవసరమైన మొక్కలను పెంచేందుకు నర్సరీల అవసరం ఏర్పడింది. ఈ నర్సరీలను పెంచేందుకు రైతులకే అవకాశం కల్పించారు. ఒక్కో నర్సరీకి రూ.6 లక్షలు నర్సరీ ఏర్పాటుకు ఏడాదికి రూ. 6 లక్షల నిధులు ఉపాధి హామీ పథకం నుంచి రైతులకు అందుతాయి. 50 వేల మొక్కలను సంబంధిత రైతు నర్సరీలో పెంచాల్సి ఉంటుంది. ఒక్కో మొక్కకు నెలకు రూపాయి చొప్పున కేటాయిస్తారు. దీంతో నెలకు రూ. 50 వేల ఆదాయం సమకూరుతుంది. అటవీ ఉత్పత్తులైన కానుగ, వేప, నీరుద్ది, నెమలినార, నిద్రగన్నేరు, నేరేడు, టేకు, ఎర్రచందనం, మునగ మొక్కలను పెంచాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ఇప్పటికే ఆరుచోట్ల నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిద్దవటం మండలం జేఎంజే కళాశాల ఎదురుగా ఉన్న మూలపల్లె గ్రామంలో, చెన్నూరు మండలం బయనపల్లె, కమలాపురం మండలం నసంతపురం, వీఎన్ పల్లె మండలం గోనుమాకులపల్లె గ్రామాల్లో నర్సరీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అలాగే చక్రక్రాయపేట మండలం గంగారపువాండ్లపల్లె, సుండుపల్లె ప్రాంతాల్లో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లాలో ఉపాధి హామీ పథకం అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో నర్సరీల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతులకు వరం సన్న, చిన్నకారు రైతులకు మరొక వరం లాంటి అవకాశం వచ్చింది. ఆసక్తిగల రైతులు నర్సరీలు పెంచేందుకు ముందుకు రావాలని ఉపాధి హామీ అధికారులు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన మొక్కలను సేకరించేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని రైతులకు ఇచ్చి నర్సరీల ద్వారా అటవీ జాతి మొక్కలను పెంచేందుకు అవకాశం కల్పించారు. పొలం ఉన్నా.. లేకున్నా.. సన్న, చిన్నకారు రైతులకు నర్సరీల ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. నీటి సౌకర్యం కలిగి ఉండాలి. అలాగే ఒకవేళ పొలం లేకున్నా స్థలం, నీటి సౌకర్యం ఉంటే నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆసక్తిగల రైతులు ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ఉపాధి సిబ్బందిని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు. మొక్కలు, సంబంధిత బ్యాగులు, పొలాన్ని చదును చేయడం, స్టంప్స్ (పెద్ద కర్రలు)తోపాటు పాటిమిక్చర్ (ఎరువు, ఇసుక, ఎర్రమట్టి)ను కూడా ఉపాధి హామీ పథకం కిందనే ఉచితంగా అందజేస్తారు. నర్సరీలతో మరింత ఉపాధి రైతులకు నర్సరీల ద్వారా మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది. ఒక్కో నర్సరీకి రూ. 6 లక్షల నిధులు అందుతాయి. నెలకు రూ. 50 వేలు ఆదాయం పొందవచ్చు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – యదుభూషణరెడ్డి, డ్వామా పీడీ, కడప -
ఉపాధి హామీ పాథకంలో ఆత్మలకు ఉపాధి
-
రద్దు నోట్ల నిల్వకు ‘హామీ పథకం’
బ్యాంకుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆర్బీఐ ముంబై: పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకులపై కరెన్సీ నిల్వల భారం తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ‘హామీ పథకం’ (గ్యారెంటీ స్కీమ్)ను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. దీని కింద బ్యాంకులు తమ వద్ద భారీగా పేరుకుపోరుున రూ.500, రూ.1000 నోట్ల కట్టలను సంబంధింత ఆర్బీఐ ఖజానాలో నేరుగా డిపాజిట్ చేయవచ్చు. ఇందుకు గాను బ్యాంకులకు సంబంధిత నిల్వ గది తాళం చెవి ఇస్తారు. బ్యాంకుల్లో సామర్థ్యానికి మించి రద్దయిన కరెన్సీ నిల్వల వల్ల డిపాజిట్లు ఆలస్యమవుతున్నాయి. దీంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద డిపాజిట్ చేసిన మొత్తానికి బ్యాంకుల కరెంట్ ఖాతాకు ఆర్బీఐ క్రెడిట్ ఇచ్చి, తర్వాత నోట్లు లెక్కిస్తుంది.