సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కులగణణ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కుల గణనపై కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇవ్వలేదని, అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు.
‘మేం కులగణన తీర్మానానినికి మద్దతు ఇస్తున్నాం. దీనికి సంబంధించి న్యాయమైన అంశాలపై జాగ్రతగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్‌కు సహకరించాం. బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మాత్రం బీజేపీ బి - టీమ్ అంటున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ పనితీరుపై ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని, తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్
Comments
Please login to add a commentAdd a comment