akbaruddin owaisi
-
కాంగ్రెస్ కి అక్బరుద్దీన్ కౌంటర్..
-
కనీసం వెయ్యి కోట్లయినా ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.5,020 కోట్ల మేర పేరుకు పోయాయని, అందులో కనీసం రూ.1,000 కోట్లయినా విడుదల చేయాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు. 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలల నిర్వహణ కష్టంగా మారిందని మంగళవారం జీరో అవర్ సందర్భంగా ఆయన అసెంబ్లీ దృష్టికి తెచ్చారు. విదేశీ విద్యానిధి పథకం కింద విద్యార్థికి రూ.20 లక్షలు మంజూరు చేసేందుకు రూ.5 లక్షలు కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారని.. ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారని గుర్తుచేశారు. ఉస్మానియా తరలింపు ఆపండి: రాజాసింగ్ ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించే ప్రతిపాదనను రద్దు చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. గోషామహల్లో ఆస్పత్రి కడితే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ఉస్మానియా వెనుకవైపు ఉన్న విశాలమైన స్థలంలో కొత్త నిర్మాణం జరపాలని సూచించారు. సింగరేణిలో పనిచేస్తున్న 30 వేల మంది కాంట్రాక్టు కారి్మకులకు కనీస వేతనాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ కోరారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను కలిపి కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. దళితబంధు పథకం కింద హుజూరాబాద్‌లో 5 వేల కుటుంబాలకు ఇవ్వాల్సిన రెండోవిడత ఆర్థిక సాయాన్ని విడుదల చేయాలని కోరారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యూల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తదితరులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. -
హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే: కమిషనర్ రంగనాథ్
సాక్షి,హైదరాబాద్ : నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ‘హైడ్రా’ నేలమట్టం చేస్తోంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తోంది. ఈ చర్యలను కొన్ని వర్గాలు అభినందిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.ఆ విమర్శలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ‘ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా మాకు సంబంధం లేదు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వాళ్లకు సమయం ఇస్తాం. అన్నీ పార్టీల నేతల అక్రమ నిర్మాణలను కూల్చేస్తున్నాం’ అని అన్నారు.ఎఫ్టీఎల్ అనేది ముఖ్యమైన అంశం.ధర్మసత్రమైన ఎఫ్టీఎల్లో ఉంటే కూల్చేస్తాం. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. -
నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి కాలేజీని కూల్చొద్దు - అక్బరుద్దీన్
-
హైడ్రాపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ‘హైడ్రా’కూల్చివేత అంశం హాట్ టాపిగ్గా మారింది. కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడతున్నారు. తాజాగా హైడ్రాపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చేస్తారన్న వార్తలపై అక్బరుద్దీన్ స్పందించారు. నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ నేను పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని’ అక్బరుద్దీన్ కోరారు. -
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీపై అక్బరుద్దీన్ రియాక్షన్
-
డ్రగ్స్, గంజాయి బంద్ చేయాలంటే ఒక్కరోజు చాలు: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాలంటే ఒక్కరోజు చాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘హైదరాబాద్‌కు డ్రగ్స్, గంజాయి ఎక్కడ్నుంచి వస్తుందో పోలీసులకు అంతా తెలుసు. నిర్మూలించాలనే ఉద్దేశం ఉంటే పోలీసులకు ఒక్కరోజు చాలు. నేరాలు చేసేవారిని, అత్యాచారాలు చేసే వారిని పట్టుకోకుండా..సామాన్యుల ఇళ్లలోకి చొరబడి విచారించడం, వారిని కొట్టడం లాంటి ఘటనలు పాతబస్తీలో ఎక్కువయ్యాయి.విధులు ముగించుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చేవారిని, అత్యవసర పరిస్థితిలో బయటకు పోయేవారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు మామూళ్లు అందుతున్నాయి. నిలోఫర్ కేఫ్ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచే ఉంటుంది. కమిషనర్‌కు చాయ్, బిస్కట్ అక్కడ్నుంచి తీసుకెళతారు కాబోలు అందుకే దాన్ని మూసివేయరు. మిగతా పేదలు, సామాన్యుల దుకాణాలను మాత్రం లాఠీలు చూపించి మూసేస్తారు.బీసీ సంక్షేమశాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఏడేళ్లలో భారీగా నిధులు కేటాయించినట్టు చూపించిన గత ప్రభుత్వం..ఖర్చు మాత్రం అత్యంత తక్కువగా చేసింది. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యాశాఖను నిరీ్వర్యం చేసింది. ఫలితంగా 16 లక్షల మంది పిల్లలు వివిధ కేటగిరీల్లో డ్రాపౌట్లు అయ్యారు. ఇలాంటి తప్పిదాల వల్లే ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో కూర్చొంది.ప్రస్తుత ప్రభుత్వం కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకు నిధులు ఇవ్వకుంటే..వారికోసం ఎంఐఎం కొట్లాడుతుంది. బీసీలు, దళితులు, మైనారీ్టల హక్కుల సాధనలో ఎంఐఎం ముందుంటుంది. అన్ని వర్గాలకు సరైన కేటాయింపులు జరిపిన ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన హయాంలో నేను ఎన్నిసార్లు నిధులు డిమాండ్ చేసినా.. అవసరానికి తగినట్టు మంజూరు చేశారు’అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. సర్కారీ కరెంట్ బిల్లుల బకాయిలు రూ. 28 వేల కోట్లు ∙వాటి వసూళ్ల బాధ్యతను అదానీకి అప్పగించాలి ∙పాతబస్తీ వెంట పడటం సరికాదు ∙అసెంబ్లీలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల నుంచి రూ.28వేల కోట్ల విద్యుత్ బిల్లుల మొండి బకాయిలు వసూలు కావడం లేదని, వాటి వసూలు బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. పాతబస్తీలో 100% విద్యుత్ బిల్లులు వసూలు అవుతున్నాయని, తప్పుడు ప్రచారంతో దాని వెంటపడ్డారని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ...మొత్తం రాష్ట్రంలో 20% విద్యుత్ నష్టాలున్నాయని, ఒక్క పాతబస్తీలోనే లేవన్నారు.అక్కడకాలం చెల్లిన సరఫరా వ్యవస్థ ఉండటంతోనే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో అధికారులు తనతో చెప్పారన్నారు. టీజీఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ పాతబస్తీలో తన ఇంటి వరకు కవర్డ్ కండక్టర్లతో నిరంతర సరఫరా కోసం ప్రత్యేక లైన్ వేసుకున్నారని, పాతబస్తీలో మాత్రం పనులు చేయలేదని వివరించారు. సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఏరియా అభివృద్ధి సంస్థకు రూ.120 కోట్లను కేటాయించారని, మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వెల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఎలాంటి కేటాయింపులు చేయలేదని తప్పుబట్టారు. -
TG: అసెంబ్లీలో వైఎస్ఆర్ను పొగిడిన అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ పొగిడారు. బడ్జెట్లో సోమవారం(జులై 29) బడ్జెట్‌పై మాట్లాడిన సందర్భంగా ఒవైసీ వైఎస్ఆర్ను గుర్తుచేసుకున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ విషయంలో వైఎస్ఆర్ న్యాయం చేశారని కొనియాడారు.ఐదు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీల మదిలో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. వైఎస్ఆర్ లేకపోతే రిజర్వేషన్ల అంశంలో తమకు అన్యాయం జరిగేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ మైనారిటీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో సాయం చేశారని గుర్తుచేశారు. ఎవరు న్యాయం చేసినా వాళ్ల గురించి మొహమాటం లేకుండా చెప్తానన్నారు. -
కాంగ్రెస్ లోకిరా.. నిన్ను డిప్యూటీ సీఎం చేస్తా..?
-
మీ ఆరోపణల్లో నిజం లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని రాష్ట్రానికి పెద్దన్న లాంటి వారని, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు, అనుమతుల విషయంలో సహకరించాలని కోరుతూ తాను మోదీని అన్నయ్య (బడే భాయ్)గా సంబోధించానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి పోతే 47 పైసలే తిరిగి వస్తున్నాయన్నారు. గుజరాత్, యూపీకి నిధులు ఇచి్చనట్లే తెలంగాణకు సైతం ఇవ్వాలని కోరానని గుర్తుచేశారు.ప్రధాని, ముఖ్యమంత్రి మధ్య సఖ్యత ఉండాలనే అలా చెప్పినట్టు స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దుపై శనివారం చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ అమిత్ షాపై కేసు ఎత్తివేత గురించి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తోసిపుచ్చుతూ ఆయన వివరణ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చిన్నారులను వినియోగించిన కేసులో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్‌రెడ్డి పాత్ర లేదని, నిర్వాహకులే దానికి బాధ్యులని తేలడంతో హైదరాబాద్ పోలీసులు వారిపై కేసు ఉపసంహరించుకున్నారని రేవంత్ పేర్కొన్నారు.టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదుతోనే వారిపై అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదైందన్నారు. కానీ ఆ కేసును ఎత్తేయడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించిందని చెప్పారు. మోదీని ఎంత పొగిడినా తనకు బీజేపీ వార్డు సభ్యుడి టికెట్ కూడా ఇవ్వదని.. కాంగ్రెస్ పారీ్టయే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అక్బరుద్దీన్‌పై ఉన్న కేసు వివరాలను తెలుసుకుంటానని చెప్పారు. ఏ జైలో తేల్చుకోవాలని ఎల్అండ్టీకి స్పష్టం చేశా ఎంఐఎం గత పదేళ్లు బీఆర్ఎస్తో చేసిన తప్పుడు దోస్తీతో పాతబస్తీకి చాలా నష్టం జరిగిందని, ఇప్పు డు సరైన దోస్తును గుర్తించారని సీఎం రేవంత్ ఛలోక్తి విసిరారు. రేవంత్ తన బాల్య స్నేహితుడని, సీఎం కుర్చీలో ఆయన్ను చూడటం సంతోషకరమ ని అక్బరుద్దీన్ అనడంతో ఈ మేరకు సీఎం స్పందించారు. పాతబస్తీలో మెట్రో ప్రాజెక్టు నిర్మించలేమని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేతులెత్తేసిందని.. ప్రాజెక్టును నిర్మించకపోతే చంచల్‌గూడ జైలుకెళ్తారో లేక చర్లపల్లి జైలుకెళ్తారో తేల్చుకోవాలని ఆ కంపెనీకి తాను స్పష్టం చేసినట్లు సీఎం వెల్లడించారు.తమకు కావాల్సిన వారి భూము ల ధరలను పెంచుకోవడానికి గత ప్రభుత్వం అవసరం లేకున్నా హైటెక్ సిటీ నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోలైన్ నిర్మాణానికి టెండర్లు సైతం పిలిచిందని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేశామన్నారు. నాటి సీఎం వైఎస్సార్‌తోపాటు నాటి కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సమ ష్టి కృషితో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సాకారమైందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మెట్రో రెండో దశ ప్రాజెక్టు చేపట్టనున్నామని, కేంద్రం 15%, రాష్ట్రం 35%,45% రుణం,5% పీపీపీ విధానంలో నిధులను సమకూరుస్తామని చెప్పారు. కేంద్రం వాటా నిధులు ఇవ్వకున్నా రుణా లు తెచ్చి పూర్తిచేస్తామని అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్న కు బదులిచ్చారు. కేంద్ర బడ్జెట్లో మోదీ సవతి సోదరుడి ప్రేమ చూపారంటూ రేవంత్‌ను ఉద్దేశించి అక్బరుద్దీన్ అనడంతో సీఎం స్పందించారు. అక్బరుద్దీన్ కొడంగల్‌లో పోటీ చేస్తే గెలిపిస్తాతెలంగాణ వచ్చాక గౌలిగూడ బస్టాప్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో కారిడార్‌ను నిర్మించకుండా గత ప్రభుత్వం పాతబస్తీకి దగా చేసింద ని సీఎం రేవంత్ ఆరోపించారు. గౌలిగూడ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో లైన్ పూర్తిచేస్తామ న్నారు. రెండో విడత ప్రాజెక్టులో భాగంగా ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్‌పోర్టు వరకు కారిడార్ నిర్మిస్తామని ప్రకటించారు. వచ్చే ఎన్నికలకు ముందే పనులు పూర్తి చేసి చాంద్రాయణగుట్ట (అక్బరుద్దీన్ సొంత నియోజకవర్గం)కు మెట్రోలోనే వచ్చి అక్కడి కాంగ్రెస్ అభ్యరి్థకి ఓటేయాలని కోరతానన్నారు. ఆయన గెలుపునకు సహకరించాలని అక్బరుద్దీన్‌ను కోరారు. తనను సైతం సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి గెలిపించాలని అక్బరుద్దీన్ బదులివ్వగా సభలో కొద్దిసేపు ఆసక్తికర చర్చ జరిగింది. కాంగ్రెస్ బీ–ఫారంపై కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తే తాను దగ్గరుండి గెలిపిస్తానని రేవంత్ ఆఫర్ ఇచ్చారు. చాంద్రాయణగుట్ట నుంచి ఎంఐఎం టికెట్‌పై పోటీ చేస్తామంటే తాము సైతం గెలిపించడానికి సిద్ధమేనని అక్బరుద్దీన్ బదులిచ్చారు. -
అమిత్ షాపై కేసు ఎత్తేశారు.. నాపై కేసు మూయలేదు
సాక్షి, హైదరాబాద్: ‘మీ అన్నయ్య (ప్రధాని మోదీ) సోదరుడి (అమిత్ షా)పై పెట్టిన కేసును ఎత్తేసి ఈ పేద సోదరుడి (గరీబ్ భాయ్)పై తప్పుడు కేసును మాత్రం మూసివేయలేదు’ అంటూ సీఎం రేవంత్‌పై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనకు అన్నయ్య (బడే భాయ్) అని.. గతంలో ప్రధాని పాల్గొన్న ఓ బహిరంగ సభలో రేవంత్ అనడాన్ని పరోక్షంగా గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారంలో బాలలను వినియో గించారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నమోదైన కేసును ఎత్తేసిన హైదరా బాద్ పోలీసులు.. తనపై నమోదు చేసిన తప్పు డు కేసును మాత్రం ఎత్తేయడానికి నిరాకరించారని అక్బరుద్దీన్ ఆరోపించారు. బడ్జెట్ పద్దుపై శనివారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన రెండు గంటలపాటు ప్రసంగించారు. ‘రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉండగా 9:50 గంటలకే ఓ పోలీసు అధికారి సభా వేదిక పైకెక్కి ప్రచారాన్ని ఆపేయాలని కోరారు.దీనిపై నేను అభ్యంతరం తెలపడంతో కేసు పెట్టారు. అయితే విచారణలో పోలీసులదే తప్పిదమని తేలిందని.. కేసును ఎత్తేస్తామంటూ నాటి పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన కొత్త సీపీ.. కేసును ఎత్తేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. నేను ముస్లిం కావడమే దీనికి కారణం’ అని అక్బరుద్దీన్ ఆరోపించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడబోనన్నారు.పోలీసుల సహకారంతోనే డ్రగ్స్ సరఫరాభాగ్యనగరంలో పోలీసుల సహకారంతోనే గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో శాంతిభద్రతలు గాడితప్పాయని, హత్యలు, అత్యాచారాలు ఆగ డం లేదన్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వక్ఫ్ భూముల కబ్జాలపై సీఐడీ విచారణకు ఆదే శించిందని, పురోగతిపై సమీక్షించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిచిన అసెంబ్లీ స్థానాల పరిధిలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక ఓట్లు రావడంపై ఆలోచించా లని సీఎంను కోరారు. బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయంబీసీలకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యా యం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యా యం చేస్తోందని అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమె త్తారు. వారికి న్యాయం జరగాలంటే తమతో కలిసి పోరాడాలన్నారు. శనివారం బడ్జెట్‌పై చర్చ లో ఆయన మాట్లాడుతూ ‘బీసీల సంక్షేమం పేరు తో ఎన్నో హామీలిచ్చి నిధులివ్వకపోవడంతో బీసీ లు బీఆర్ఎస్ను ఓడించారు. వారిప్పుడు ప్రతి పక్ష సీట్లలో కూర్చున్నారు. గతంలో బీసీల కోసం పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య నుంచి స్ఫూర్తి పొందే నేను మైనారిటీల కోసం గొంతెత్తడం ప్రారంభించా’ అని ఆయన పేర్కొన్నారు. -
అది ఇస్తాం..ఇది ఇస్తాం ఆ హామీలు ఇప్పుడేమయ్యాయి
-
రేవంత్ అక్బర్ మధ్య నవ్వులే నవ్వులు
-
TG: కేటీఆర్‌పై అక్బరుద్దీన్ సెటైర్లు
సాక్షి,హైదరాబాద్: గతంలో నోట్ల రద్దు జరిగినపుడు క్యూలైన్లు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ ఆరు పథకాల కోసం ప్రజలు అలానే క్యూలైన్లను నిలబడుతున్నారని ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. శనివారం(జులై 27)అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరిగిన సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టారు ఓకే.. కానీ ఆటో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చాలి. హైదరాబాద్ పట్టణానికి మెట్రో రావడానికి నేను కృషి చేశాను. ఆనాడు దివంగత నేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సహాయంతో హైదరాబాద్‌కు మెట్రో రైలు తీసుకువచ్చాం. కానీ ఓల్డ్ సిటీకి మాత్రం మెట్రో ఇప్పటికీ రావడం లేదు. అక్బర్‌సాబ్ త్వరలో చుక్‌చుక్ రైలు పాతబస్తీకి వస్తుంది అని కేటీఆర్ మాటలు చెప్పారు. అవేవీ జరగలేదని అక్బరుద్దీన్ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. -
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే చేసి చూపించండి ‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
Ts: ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయండి: అక్బరుద్దీన్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కులగణణ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కుల గణనపై కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇవ్వలేదని, అయినా సభలో తీర్మానం చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తొలుత తీర్మానం చేయాలని సూచించారు. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. ‘మేం కులగణన తీర్మానానినికి మద్దతు ఇస్తున్నాం. దీనికి సంబంధించి న్యాయమైన అంశాలపై జాగ్రతగా ఉండాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్కు సహకరించాం. బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మాత్రం బీజేపీ బి - టీమ్ అంటున్నారు’ అని ఒవైసీ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ పనితీరుపై ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బిజినెస్ ఏముంటుందో ముందుగా తెలియడం లేదన్నారు. 13వ తేదీ వరకు మాత్రమే బీఏసీ సమావేశాల్లో చర్చించారని, తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో సమాచారం లేదని ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టచ్‌లో ఉన్నారు: బండి సంజయ్ -
ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ పథకాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలు అమలు చేయడం అభినందనీయమేనన్నారు. మిగతా నాలుగు పథకాలు వందరోజుల్లో అమలు చేయాలని చెప్పారు. ఈ ఆరు పథకాలకు బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయించారు..రాష్ట్ర ఆర్థిక రాబడి రూ. 2,74,185.7 కోట్లు, ఖర్చు 2,75,890.69 కోట్లుగా బడ్జెట్లో అంచనా వేశారు. రాష్ట్ర రాబడులు, అప్పులకు చెల్లించే వడ్డీలు, నెలవారీ చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 300 హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీపీఎల్ కుటుంబాలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.26,990 కోట్లు కావాలని, గ్యాస్ సిలిండర్‌కు రూ.2,699.70 కోట్లు, ఉచిత బస్సు పథకానికి రూ.3,600 కోట్లు, కౌలు రైతులకు రూ. 23,160.8 కోట్లు, మన్రేగా కింద 32 లక్షల వ్యవసాయ కూలీలు ఉంటారని, వీరికి ఏడాది రూ.3,840 కోట్లు, వరికి రూ. 500 చొప్పున బోనస్ ఇస్తే ఏడాదికి రూ.7500 కోట్లు, పంటరుణాలకు రూ.36 వేల కోట్లు కావాలని చెప్పారు. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఏడాదికి రూ.4800 కోట్లు, అంబేడ్కర్ ఆర్థికచేయూత పథకానికి నిధులెన్నో చెప్పలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక చేయూతకు రూ.25 వేల కోట్లు, యువభరోసా, విద్యాభరోసా కార్డు అమలుకు రూ.38,894.22 కోట్లు, విద్యాజ్యోతి పథకానికి రూ.6,476 కోట్లు.. ఇంకా పింఛన్ల పెంపు ఇతర హామీలకు ఇలా కలిపి మొత్తం రూ.2,15,568.54 కోట్లు కావాలని, ఈ నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ డబ్బులు పెండింగ్‌లో ఉంచారని, దీనివల్ల కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ధరణి స్థానంలో భూమాత తెచ్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుందో చెప్పాలన్నారు. బడ్జెట్లో మైనార్టీలకు కేటాయింపులు నిరాశ పరిచాయని, ముస్లిం మైనార్టీ సంస్థలకు మంజూరైన నిధులు దారి మళ్లడంపై విచారణ జరిపించాలని, రాష్ట్రానికే ఆదాయం తెచ్చి పెడుతున్న హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేసవి తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయని, గోదావరి, కృష్ణా జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదముందని, రంజాన్ మాసం సమీపిస్తున్నందున పాతబస్తీలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బాలూనాయక్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సాగు,తాగునీటి ఇబ్బంది కలిగించినందుకు మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూనాయక్ డిమాండ్ చేశారు. అన్ని విభాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించదని, దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. ఎన్నికల ముందే కేసీఆర్‌కు దళితులు గుర్తుకొస్తారని, అంబేడ్కర్‌కు కనీసం నివాళులు అర్పించని సీఎంగా కేసీఆరే మిగిలిపోతారన్నారు. -
తప్పుడు లెక్కలు
-
రేవంత్ X అక్బర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగ శ్వేతపత్రంపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలాయి. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా మొదలైన ఈ రగడ గంటకుపైగా కొనసాగింది. దీంతో సభలోని కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ సభ్యులు వాదోపవాదాలకు దిగారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒకానొక సందర్భంలో స్పీకర్ పోడియం వద్దకు అక్బరుద్దీన్ సహా ఎంఐఎం సభ్యులు దూసుకెళ్లారు. ఎంఐఎం సభ్యులతోపాటు బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు పోడియం వద్దకు వెళ్లి సభాపతితో వాదనకు దిగారు. దీంతో సభ అదుపుతప్పింది. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలతో వాదన మొదలు.. : విద్యుత్ రంగ శ్వేతపత్రంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ‘గత ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో రూ. 25 వేల కోట్ల అభివృద్ధి జరిగింది. 2014తో పోలిస్తే విద్యుదుత్పత్తి భారీగా పెరిగింది. బీఆర్ఎస్ హయాంలో జెన్కో ఆస్తులు రూ. 12,783 కోట్ల నుంచి రూ. 40,454 కోట్లకు పెరిగాయి. పాతబస్తీలో ఇంకా 5 వేల స్తంభాలు, కొత్త కండక్టర్ (తీగ), ట్రాన్స్పార్మర్ల ఏర్పాటుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’అని కోరారు. దీనిపై మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ అక్బరుద్దీన్ గత పదేళ్ల కాలంలో ఆ పనులేవీ చేయించుకోలేకపోగా ఇప్పుడు ప్రశ్నించడం ఏమిటంటూ నిలదీశారు. దీనిపై అక్బరుద్దీన్ ఘాటుగా ప్రతిస్పందించారు. సీనియర్‌ను అయిన తనను మొదటిసారి సభకు వచ్చిన సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారని... పెద్దలు మాట్లాడుకుంటుండగా చిన్న పిల్లాడిలా మాట్లాడొద్దని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి జోక్యం... అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. ‘అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. సభలో ప్రస్తుతం 57 మంది కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ దళితుడు. ఆయన మాట్లాడితే ఆగ్రహం వ్యక్తం చేయాలా? అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం నేత మాత్రమే. ఆయన్ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిందువులు కూడా ఆయనకు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడాలేదు. బీఆర్ఎస్ దుర్మార్గాలు మిత్రపక్షమైన ఎంఐఎంకు కనిపించలేదా? గత ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతుంటే వినేందుకు మేం సిద్ధంగా లేము. తెలంగాణ ప్రజలు మీ మిత్రపక్షం బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. బీఆర్ఎస్ తరఫున ఎంఐఎం ఎందుకు వకాల్తా పుచ్చుకుంటోంది? మైనారిటీల విషయంలో కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు‘అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మా ముస్లిం నేతలను ఓడించారు.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ కలసి పనిచేశాయి. నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీర్ అలీని, జూబ్లీహిల్స్‌లో అజాహరుద్దీన్‌ను ఓడించేందుకు కేసీఆర్‌తో కలసి మజ్లిస్ పనిచేసింది. అదే మజ్లిస్ పార్టీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో ఎందుకు పోటీ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసింది. మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్బరుద్దీన్.. కేసీఆర్‌కు మిత్రుడు కావొచ్చు. మోదీకి మద్దతివ్వవచ్చు.. అది వాళ్లిష్టం. మజ్లిస్, బీఆర్ఎస్ మిత్రపక్షాలు అని కేసీఆర్ పలుమార్లు చెప్పారు. మజ్లిస్ పార్టీ కేసీఆర్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. అక్బరుద్దీన్ ముస్లింలందరికీ నాయకుడు కాదు. మజ్లిస్ పార్టీకి మాత్రమే నాయకుడు’అని రేవంత్ వ్యాఖ్యానించారు. విద్యుత్ బకాయిలు రాబడతారా? ‘విద్యుత్ మొండి బకాయిల్లో సిద్దిపేట 61.37 శాతం, గజ్వేల్ 50.29 శాతం, హైదరాబాద్ సౌత్ 43 శాతంతో టాప్‌లో ఉన్నాయి. కేసీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్ బాధ్యత తీసుకొని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా?’అని రేవంత్ ప్రశ్నించారు. ఈ బిల్లులు వసూలు చేస్తే బకాయిల నుంచి బయటపడతామన్నారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిల చెల్లింపులు జరిపే బాధ్యత తనదని అక్బరుద్దీన్ చెప్పడం లేదని రేవంత్ విమర్శలు గుప్పించారు. రేవంత్ మాట్లాడుతుండగా మజ్లిస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైఎస్సాఆర్ వల్లే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు... రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ తీవ్రంగా స్పందించారు. ‘మేము ఎవరికీ భయపడం. కిరణ్‌కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్, ఎంఐఎం కలసి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాయి. వైఎస్సార్ నిజమైన జెంటిల్మాన్... గొప్ప నాయకుడు. కాంగ్రెస్‌కు చెందిన అప్పటి ఢిల్లీ నేతలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన మా నాన్నను కలిశారు. ఆ తర్వాతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చారు. కాంగ్రెస్, ఎంఐఎం కలసే అప్పడు ఎన్నికలను ఎదుర్కొన్నాయి’అని పేర్కొన్నారు. సీఎంకు చాలెంజ్.. షబ్బీర్ అలీని ఓడించేందుకు ప్రయత్నించామని రేవంత్ ఆరోపించారు. మేము నిజామాబాద్ అర్బన్‌లో పోటీ చేయలేదు. షబ్బీర్ అలీ ఓటమితో మాకేం సంబంధం? జూబ్లీహిల్స్‌లో మాకు కార్పొరేటర్ ఉన్నారు. బలమైన అభ్యర్థిని నిలిపాం. అంబేడ్కర్ వంటి మహానేతను కూడా ఓడించిన ఘనత కాంగ్రెస్‌దే. మమ్మల్ని బీజేపీ బీ–టీం అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలసి పనిచేయం. సీఎం రేవంత్‌కు చాలెంజ్’అంటూ కామెంట్స్ చేశారు. ఏబీవీపీ, బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారని... అన్నిచోట్లా సీఎంకు అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ సభానాయకుడిని కించపర్చేలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. స్పీకర్ కూడా జోక్యం చేసుకొని సభానాయకుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరూ మధ్యలో మాట్లాడవద్దన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ‘నాదెండ్ల భాస్కర్‌రావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ హయాం వరకు ఎంఐఎం ఎవరెవరితో దోస్తీ చేసిందో అందరికీ తెలుసు. ఆ అంశంపై చర్చించాలంటే మరోసారి చర్చిద్దాం’అని పేర్కొన్నారు. దీనికి అక్బరుద్దీన్ బదులిస్తూ ‘మేము ఎవరితో కలసి పనిచేసినా రాష్ట్ర అభివృద్ధి కోసమే. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపక్వతగా మాట్లాడటం లేదు’అని అన్నారు. -
ఆరు రోజులు.. రెండు స్వల్పకాలిక చర్చలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంధన రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ప్రకటించారు. డిసెంబర్ ఏడో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు కొత్తగా ఎన్నికైనవారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 11న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్, 13న నామినేషన్ల స్వీకరణ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 14న నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 15న శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు 16న శాసనసభ, మండలి వేర్వేరుగా సమావేశమై చర్చ అనంతరం ఆమోదం తెలిపాయి. ధన్యవాద తీర్మాన ఆమోదం అనంతరం శాసనమండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాస నసభను మాత్రం 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 20న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, 21న ఇంధన రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదం నడుమ సాగింది. 26 గంటల 33 నిమిషాలు ఆరురోజుల్లో శాసనసభ మొత్తంగా 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. 19 మంది సభ్యు లు చర్చలో పాల్గొనగా, రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా మిగతా 118 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఎంఐఎం ఏం చేసింది..!
-
TS Assembly: సీఎం రేవంత్ Vs అక్బరుద్దీన్.. మాటల యుద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి వాడీవేడి చర్చ నడుస్తోంది. విద్యుత్ అప్పులపై అసెంబ్లీ చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. అలాగే, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘గత పదేళ్లుగా బీఆర్ఎస్, ఎంఐఎం కలిసే ఉన్నాయి. అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాల్లో ఎంఐఎం పాత్ర ఉంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం పని చేసింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌ను, నిజామాబాద్ అర్బన్‌లో షబ్బీఆర్ అలీకి వ్యతిరేకంగా ఎంఐఎం పనిచేసింది. కవ్వంపల్లి వంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదు. అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే. ముస్లింలందరికీ నాయకుడు కాదు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే.. అన్ని విషయాలను సభ ముందు పెడితే అక్బరుద్దీన్‌ను అభినందిస్తాం. బీఆర్ఎస్, మజ్లిస్ మిత్రులమని కేసీఆర్ చెప్పారు. ఎంఐఎంకు కేసీఆర్ మిత్రుడు కావచ్చు. మోదీకి కూడా మద్దతు ఇవ్వొచ్చు. అది వాళ్ల ఇష్టం. అక్బరుద్దీన్ ఎంతసేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు. అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం. అక్బర్ అన్ని విషయాలు చెబుతున్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయి తొమ్మిది మంది చనిపోయారు. ఆ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయింది. ఫాతిమా చనిపోతే ఎంఐఎం ఎందుకు మాట్లాడలేదు. మైనార్టీలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్ పార్టీనే’ అని అన్నారు. పవర్ పంచ్.. మరోవైపు విద్యుత్ అంశంపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. విద్యుత్ మొండి బకాయిల్లో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, హైదరాబాద్ సౌత్ టాప్‌లో ఉంది. సూర్యాపేట జిల్లాలోనూ రైతులు కరెంట్ కోసం ఆందోళన చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఎంఐఎం బాధ్యత తీసుకుని విద్యుత్ బకాయిలను క్లియర్ చేస్తారా? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ సీరియస్.. ఇదే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోంది. మేం ఎవరికీ భయపడం. మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు. నిజామాబాద్‌లో ఎంఐఎం పోటీ చేసిందా అని ప్రశ్నించారు. ఎంఐఎం ఎప్పుడు ఎక్కడా ఎలా పోటీ చేయాలో మా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారు. మమ్మల్ని బీజేపీ బీ టీమ్ అంటున్నారు. మేము బతికి ఉన్నంత వరకు బీజేపీతో కలిసి పనిచేయం. సీఎం రేవంత్‌కు ఛాలెంజ్ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అక్బరుద్దీన్ మాట్లాడుతుండగా గందరగోళం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. భట్టి విక్రమార్క్ ఫైర్.. అనంతరం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సభానాయకుడిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు. నేను ఏం చెబుతున్నానో వినకుండా మాట్లాకండి. కొత్తవాళ్లు ఏదైనా మాట్లాడితే పెద్ద మనసుతో అర్థంచేసుకోవాలి. అక్బరుద్దీన్ అఖల్ ఉందా అని మాట్లాడటం సరికాదు. -
తెలంగాణ లాభదాయక రాష్ట్రమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తక్కువ చేసి చూపుతూ తెలంగాణ పరువు తీసే ప్రయత్నం చేయొద్దని ఎంఐఎం సభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల తడక లెక్కలు చూపించిందని విమర్శించారు. శ్వేతపత్రంపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణను అవమానించే విధంగా వ్యవహరించవద్దని హితవు చెప్పారు. తెలంగాణ ముమ్మాటికీ లాభదాయక రాష్ట్రమేనని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విభజన తరువాత బడ్జెట్‌కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిన వ్యయాలపై శ్వేతపత్రంలో చూపిన లెక్కల్లో తేడాలను ఉదహరించారు. శ్వేతపత్రంలో ఉన్న లెక్కలకు, ఆర్బీఐ, కాగ్ నివేదికల్లో పొందుపరిచిన లెక్కలకు పొంతనే లేదన్నారు. అలాగైతే కర్ణాటకలో కూడా పొంతనలేదు రాష్ట్ర బడ్జెట్ లెక్కలతో పాటు కర్ణాటక బడ్జెట్ లెక్కల్లో కూడా శ్వేతపత్రంలోని లెక్కలకు, కాగ్ నివేదిక లెక్కలకు కూడా పొంతన లేదని అక్బరుద్దీన్ విమర్శించారు. తెలంగాణ వచ్చాక విద్యుత్, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందాయని వివరించారు. అప్పులు పెరిగినా.. గణనీయంగా అభివృద్ధి జరిగిందన్నారు. చివరికి ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు సంబంధించి కూడా శ్వేతపత్రానికి, కాగ్ నివేదికకు చాలా తేడా ఉందన్నారు. ఈ రెండింటితో పాటు ఆర్బీఐ నివేదికల్లో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలని ప్రశ్నించారు. బ్యూరోక్రాట్లు అధికార పార్టీ మన్ననల కోసం తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై విచారణ జరిపి, అధికారులపై చర్యలు చేపట్టాలన్నారు. ఆడిట్ పూర్తయితేనే కాగ్ రిపోర్టులో సరైన లెక్కలు ఉంటాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పగా పదేళ్ల క్రితం నాటి ఆదాయ వ్యయాల ఆడిట్ కూడా పూర్తి కాలేదా అని అక్బరుద్దీన్ నిలదీశారు. కేంద్రం కూడా అప్పులు చేసిందన్న అక్బరుద్దీన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఏకంగా 244 శాతం పెరిగాయని అక్బరుద్దీన్ వివ రించారు. పదేళ్ల క్రితం రూ. 44,25,347 కోట్లు ఉన్న అప్పులు రూ. 1,52, 53,915 కోట్లకు పెరిగాయని చెప్పారు. దీన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారని, అలాంటి పరిస్థితు ల్లో కూడా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఆగలేదన్నారు. ఈ సందర్భంగా వార్షిక వృద్ధి రేటు ను, ఆర్థిక వృద్ధి రేటును వివరించారు. -
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం శాసనసభ సమావేశం కాగానే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ప్రసాద్‌కుమార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తదితరులు స్పీకర్‌ను గౌరవ పూర్వకంగా తోడ్కొని వెళ్లి ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ వద్దకు వచ్చి ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. మంచి సాంప్రదాయానికి అందరి మద్దతు: సీఎం స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. మంచి సాంప్రదాయానికి అందరూ మద్దతు తెలిపారని, భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గొప్ప వ్యక్తి స్పీకర్ అయ్యారని కొనియాడారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారన్నారు. ప్రసాద్‌కుమార్ తన సొంత జిల్లా నేత అని గుర్తు చేశారు. వికారాబాద్ అభివృద్ధిలో ప్రసాద్కుమార్ది చెరగని ముద్ర అని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఆయనకు బాగా తెలుసన్నారు. ఆయనకు 8 మంది సోదరీమణులు ఉన్నారని, చిన్న వయస్సులోనే తండ్రి చనిపోవడంతో వారందరి బాధ్యత తానే తీసుకున్నారన్నారు. ఈ అసెంబ్లీ కూడా ఒక కుటుంబమేనని, ఆ కుటుంబంలో మనమంతా సభ్యులమని పేర్కొన్నారు. ప్రతిపక్ష, పాలకపక్షం అందరూ కుటుంబ సభ్యులేనన్నారు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరని, సభలో అందరి హక్కులను కాపాడగలరని, ఆదర్శవంతమైన అసెంబ్లీగా దీన్ని తీర్చిదిద్దుతారనే పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. సమాజంలో ఎన్నో రుగ్మతలకు ప్రసాద్‌కుమార్ పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆయన పేదల సమస్యలు తెలిసిన వ్యక్తి అని అన్నారు. రాష్ట్రంలోని సమస్యలను పెద్ద ఎత్తున చర్చించేందుకు సభ్యులకు ఎక్కువ సమయం ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సంపూర్ణ మద్దతుకు కేసీఆర్ ఆదేశం: కేటీఆర్ స్పీకర్ ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు అడగగానే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. స్పీకర్ ఎన్నికకు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్రెడ్డిలాగే సభా హక్కులను కాపాడాలని కోరుతున్నానన్నారు. సామాన్య ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చూడాలన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..ప్రసాద్‌కుమార్ అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజు స్పీకర్‌గా ఎన్నికయ్యారంటూ అభినందనలు తెలిపారు. తన తండ్రి శ్రీపాదరావు ఇదే శాసనసభలో చైర్‌కు ఔన్నత్యాన్ని తీసుకొచ్చారని గుర్తుచేశారు. స్పీకర్‌కు మద్దతు తెలిపినందుకు విపక్ష పా ర్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్‌కుమార్ ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి కాదని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. పిల్లలకు తండ్రి లాంటి పాత్ర ఆయన సభలో పోషించాలని ఆకాక్షించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పద్మావతి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, కడియం శ్రీహరి, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడారు. బీజేపీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు మొదటి రోజు అసెంబ్లీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారానికి సైతం దూరంగా ఉన్న వారు గురువారం అసెంబ్లీకి హాజరయ్యారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, పాయల్ శంకర్, పవార్ రామారావు పాటిల్, టి.రాజాసింగ్ వీరిలో ఉన్నారు. పార్టీల బలాలను బట్టి సమయం: స్పీకర్ తనను స్పీకర్‌గా ఎంపిక చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రసాద్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఏకగీవ్రంగా ఎన్నుకున్నందుకు అన్ని పా ర్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. 57 మంది కొత్త సభ్యులు ఉన్నారంటూ..పా ర్టీల బలాలను బట్టి సమయం కేటాయిస్తానని చెప్పారు. స్పీకర్ స్థానం ఉన్నతమైనదే కాదు సంక్లిష్టమైనదని పేర్కొన్నారు. అంతకుముందు సభ మొదలైన వెంటనే గతంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయని వారి చేత ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిలో ఉన్నారు. -
సీఎం సహా చాలామంది దైవ సాక్షిగా ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 119 మందిలో శనివారం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్‌తో కలిసి 101 మంది ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులు లాస్య నందిత, పద్మావతి రెడ్డి, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, బండారి లక్ష్మారెడ్డి, గడ్డం వినోద్, మధుసూదన్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, ముఠా గోపాల్, మైనంపల్లి రోహిత్, తెల్లం వెంకట్రావ్, గడ్డం వివేక్ ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఐఎం నుంచి గెలుపొందిన జాఫర్ హుస్సేన్, కౌసర్ మొయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ఉర్దూలో ప్రమాణం చేశారు. ♦ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సహా అధిక సంఖ్యలో సభ్యులు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ♦ మంత్రి సీతక్క, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు సహా పలువురు సభ్యులు పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేశారు. వారిలో ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, అరికపూడి గాం«దీ, చిక్కుడు వంశీకృష్ణ, దొంతి మాధవరెడ్డి, గూడం మహిపాల్ రెడ్డి, కె. శంకరయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, మాగంటి గోపినాథ్, మక్కాన్‌సింగ్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వేముల వీరేశం ఉన్నారు. ‘‘దేశ సార్వభౌమాధికారాన్ని’’పలకడంలో ఇక్కడా ఇబ్బందే ప్రమాణ స్వీకారంలో భాగంగా ‘సభా నియమాలకు కట్టుబడి ఉంటానని’ చేసే ప్రతిజ్ఞ సందర్భంగా సభ్యులు చాలా మంది ‘సభా నియామకాలకు కట్టుబడిఉంటానని’ చదివారు. ‘భారత దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని...’అనే వాక్యాన్ని పలుకడానికి సహజంగానే చాలా మంది సభ్యులు ఇబ్బంది పడ్డారు. బీఆర్ఎస్ సభ్యులకు సీఎం అభివాదం.. రాజగోపాల్‌రెడ్డికి ఆలింగనం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 11.05 గంటలకు సభలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, లాస్య నందిత , కోవాలక్ష్మి తదితరుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆలింగనం చేసుకున్నారు.అనంతరం ఎంఐఎం సభ్యులను ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ♦ ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు కుటుంబసభ్యులు కూడా సభకు వచ్చారు. ♦ అన్ని పార్టీల శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసినవెంటనే ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ వద్దకు వెళ్లి అభివాదం చేశారు. అనంతరం కాంగ్రెస్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దకు వెళ్లి అభివాదం చేసి, ఫొటోలు దిగారు. ♦ కొత్త ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నియమావళి, ఇతర మెటీరియల్‌తో కూడిన కిట్‌ను ప్రమాణం చేసిన ప్రతి ఎమ్మెల్యేకు అందజేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా తరలి వచ్చారు. ♦ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ సింగరేణి కార్మికుడి దుస్తుల్లో అసెంబ్లీకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శాసనసభలో మక్కాన్సింగ్నురేవంత్ ప్రత్యేకంగాఅభినందించడం కనిపించింది. ♦ మంత్రి సీతక్క ప్రమాణం చేసిన తరువాత బీఆర్ఎస్ మహిళా సభ్యులు కోవాలక్ష్మి, లాస్య నందిత, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వద్దకు వెళ్లి కలిశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి కలవడం కనిపించింది. -
బీజేపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని రాష్ట్ర ప్రభుత్వం నియమించడాన్ని తప్పుబడుతూ అసెంబ్లీలో తొలిరోజు జరిగిన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్ ఎదుట తాము ప్రమాణం చేయబోమని స్పష్టంచేశారు. శనివారం అసెంబ్లీ గేటు ఎదుట రాజాసింగ్ మినహా మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అరగంటపాటు రోడ్డుపైనే బైఠాయించి నినాదాలు చేశారు. వారి వద్దకు వచ్చిన అసెంబ్లీ చీఫ్ మార్షల్ సర్దిచెప్పేందుకు ప్రయత్నిం చినా బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కు తగ్గలేదు. అంతకుముందు ఈ అంశంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసేందుకు రాజ్‌భవన్‌కు వారు వెళ్ల గా ఆ సమయానికి గవర్నర్ అందుబాటులో లేరు. దీంతో గవర్నర్ కార్యదర్శి సురేంద్రమోహన్‌కు వినతిపత్రం ఇచ్చి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యేలు వినతిపత్రంలో పేర్కొన్నారు. కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని.. దీన్ని బీజేపీ రాష్ట్రశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలియజేశారు. ప్రొటెం స్పీకర్ నామినేషన్‌ను తిరస్కరించడంతోపాటు పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను నిలిపేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, రామారావు పటేల్, ధన్పాల్ సూర్యనారాయణ, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకారానికి వెళ్లాలా వద్దా అనే విషయమై అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అంతకుముందు ఈ అంశంపై బీజేఎల్పీ సమావేశంలో వాడీవేడి చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానానికి చెప్పకుండానే ఎమ్మెల్యే రాజాసింగ్ ఏకపక్షంగా అసెంబ్లీని బహిష్కరిస్తామని సోషల్ మీడి యా ద్వారా పేర్కొనడాన్ని నేతలు తప్పుబట్టినట్లు తెలియవచ్చింది. ఈ భేటీ అనంతరం కిషన్‌రెడ్డితో కలసి ఏడుగురు ఎమ్మెల్యేలు చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు నిర్వహించగా రాజాసింగ్ మాత్రం విడిగా బయటకు వెళ్లిపోయారు. ఆలయా నికి కూడా ఆయన వెళ్లలేదు. ఆ తర్వాత ఢిల్లీలోని జాతీయ నాయకత్వాన్ని ఫోన్లో కిషన్‌రెడ్డి సంప్రదించగా ప్రమాణస్వీకారాన్ని బహిష్కరించాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలు వ్యవహరించారు. అయితే ఈ నిర్ణయాన్ని రాజాసింగ్‌కు తెలియజేసేందుకు ప్రయత్నిం చగా ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చిందని... అందుకే మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడు, అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపినప్పుడు ఆయన పాల్గొనలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు స్పీకర్ ఎన్నిక జరిగాక ఆయన ఎదుటే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. -
కొలువుదీరిన మూడో శాసనసభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుదీరింది. ఉదయం 11.00 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు ప్రమాణం చేశారు. అనంతరం మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసిన తరువాత అక్షర క్రమంలో సభలోని సభ్యులతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 61 మంది, బీఆర్ఎస్ నుంచి 32 మంది, ఎంఐఎం నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ బీజేపీకి చెందిన 8 మంది సభ్యులు సభకు హాజరు కాలేదు. కాలు జారి పడిన కారణంగా శస్త్ర చికిత్స చేయించుకొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనకు సహాయకారిగా ఉన్న మాజీ మంత్రి కె. తారక రామారావు సహా ఏడుగురు బీఆర్ఎస్ సభ్యులు, వ్యక్తిగత కారణాలతో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ప్రమాణం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీరే.. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, సీతక్క, దామోదర రాజ నర్సింహ, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, చిట్టెం పర్ణికా రెడ్డి, మట్టా రాగమయి, పద్మావతి రెడ్డి, యశస్విని రెడ్డి, ఆది శ్రీనివాస్, ఆదినారాయణ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అనిరుధ్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలు నాయక్ నేనావత్, చిక్కుడు వంశీకృష్ణ, చింతకుంట విజయ రమణారావు, దొంతి మాధవరెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ రావు, జి. మధుసూదన్‌రెడ్డి, బీర్ల ఐలయ్య, రామ్‌చందర్ నాయక్, కేఆర్ నాగరాజు, కే శంకరయ్య, కసిరెడ్డి నారాయణరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోరం కనకయ్య, కె.రాజేశ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కె. మదన్ మోహన్ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రంగారెడ్డి, మందుల సామ్యేల్, మేడిపల్లి సత్యం, తుడి మేఘారెడ్డి, మురళీ నాయక్ భుక్యా, మైనంపల్లి రోహిత్, నాయిని రాజేందర్‌రెడ్డి, పి. సుదర్శన్‌రెడ్డి, పటోళ్ల సంజీవ్ రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ మాలోత్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం, గడ్డం వివేక్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి 32 మంది కోవా లక్ష్మి, లాస్య నందిత, పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, అరికెపూడి గాంధీ, బండారి లక్ష్మారెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, చింతా ప్రభాకర్, దానం నాగేందర్, దేవిరెడ్డి సు«దీర్ రెడ్డి, గంగుల కమలాకర్, గూడెం మహిపాల్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కేపీ వివేకానంద, కాలే యాదయ్య, కాలేరు వెంకటేశ్, కల్వకుంట్ల సంజయ్, మాణిక్ రావు, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, వేముల ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, తెల్లం వెంకట్రావ్, హరీశ్‌రావు, విజయుడు. ఎంఐఎం నుంచి అందరూ ఎంఐఎం నుంచి అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మెయినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, మహ్మద్ మాజీద్ హుస్సేన్, మహ్మద్ మోబిన్ ప్రమాణం చేయగా, ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన అక్బరుద్దీన్ ఒవైసీ అంతకు ముందే గవర్నర్ సమక్షంలో ప్రమాణం చేశారు. సీఐపీ నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గైర్హాజరైన సభ్యులు ఎవరంటే కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, కడియం శ్రీహరి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మారావు గౌడ్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ , ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీశ్‌బాబు, కె. వెంకట రమణా రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పవార్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గైర్హాజరయ్యారు. -
ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసి
-
తెలంగాణ 3వ శాసన సభకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ
-
తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా
Live Updates.. తెలంగాణ శాసనసభ వచ్చే గురువారానికి వాయిదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని ఇద్దరు మంత్రులు ప్రమాణం చేయని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వారిద్దరూ ఎంపీలుగానే ఉన్నారు. ఇంకా ఎంపీ పదవులకు రాజీనామా చేయని కారణంగా నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. రాజ్‌భవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు ఫిర్యాదు. గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్‌భవన్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లు కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను కావాలనే ప్రొటెం స్పీకర్ చేశారని ఫిర్యాదు. శాసనసభ సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం. నేడు రెండు పథకాలకు శ్రీకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత. కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం. నేడే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం. 👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. 👉 రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు. ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం!… pic.twitter.com/stqOjkF10T — Telangana Congress (@INCTelangana) December 9, 2023 అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: కిషన్‌రెడ్డి శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించింది. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసి కోరుతాం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ కామెంట్స్.. భుజాలు కాయలు కాసేలాగా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు కార్యకర్తల వల్లే మేం సీట్లలో కూర్చున్నాం ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు లక్షలాది తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి డిసెంబర్ ఏడో తేదీన సోనియా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యే క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను డిసెంబర్ 9, 2017న గాంధీ భవన్లో అడుగుపెట్టాను డిసెంబర్ 9, 2023న ప్రభుత్వం ఏర్పాటు అయింది పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను పది సంవత్సరాలు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కున్నారు కార్యకర్తలకు మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కార్యకర్తలది సోనియా గాంధీ 100 సంవత్సరాలు సంతోషంగా జీవించాలి శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలి ►సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు. ►అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాని కేసీఆర్, కేటీఆర్ ►సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది గైర్హాజరు ►మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం.. ►ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు ►అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►రేవంత్‌కు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ ►అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు. ►అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ►భట్టి తో పాటు అసెంబ్లీకి వచ్చిన పొంగులేటి, తుమ్మల గన్‌పార్క్ వద్ద కోలాహలం గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుపడిన రెండు పార్టీల నేతలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్న మంత్రులు కొత్త మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ గాంధీ భవన్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు.. గాంధీభవన్‌లో సోనియ బర్త్ డే సెలబ్రేషన్స్.. 78 కిలోల కేట్ కట్ చేసి శుభాకాంక్షలు చెపుకున్న కాంగ్రెస్ నేతలు సోనియా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వీహెచ్, మాణిక్‌రావ్ ఠాక్రే ఇతర నేతలు డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుమ్మల, సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్, హాజరైన పార్టీ నేతలు. భట్టి కామెంట్స్.. గాంధీభవన్ ఆశయాలను నెరవేరుస్తాం సోనియా గాంధీ కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాం. ప్రజలు మెచ్చేలా పాలన ఉంటుంది రాష్ట్ర సంపద ప్రజలకు పంచుతాం. తెలంగాణభవన్‌లో ముగిసిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణభవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు అసెంబ్లీకి హాజరుకానున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరును ప్రతిపాదించిన పోచారం.. బలపరచిన తలసాని, కడియం శ్రీహరి శాసనభాపక్ష మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగింత. బీజేపీ నేతల కీలక నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయవద్దని డిసైడ్ అయిన కమలం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు ససేమీరా అన్న బీజేపీ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం 10:30 గంటకు మీడియాతో మాట్లాడనున్న కిషన్ రెడ్డి ►అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రులకు శాఖల కేటాయింపు ►శాఖల కేటాయింపుపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ►ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ►అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై #WATCH | AIMIM MLA Akbaruddin Owaisi takes oath as Pro-tem Speaker of Telangana Legislative Assembly, in Raj Bhawan, Hyderabad pic.twitter.com/PpMoZhOvjy — ANI (@ANI) December 9, 2023 ►ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ దూరం ►బీఆర్ఎస్ నుంచి హాజరైన పోచారం శ్రీనివాస్, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ►రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ►కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, మంత్రులు ►తెలంగాణ మూడో శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ►చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ►రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం. ►అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ►నేడు ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరం. ►తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ►తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది ►అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం ►తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ►సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ►తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బీఆర్ఎస్కు విపక్ష హోదా ►శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ►బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ►ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. ►బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. ►కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ►శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. ►కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. -
నేను ప్రమాణ స్వీకారం చెయ్యను.. ఎమ్మెల్యే రాజాసింగ్
-
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్‌గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు. ఇక రేపు(శనివారం) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అందులో భాగంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అయితే దీనికి ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ వ్యవహరించునున్న నేపథ్యంలో రాజా సింగ్ చేసీ తాను ఎమ్మెల్యేగా ప్రమాణ చేయనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయం బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే సమావేశం కానున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అంతకంటే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డితో సమావేశం అయిన తర్వాత తదుపరి కార్యచరణ వెల్లడించనున్నారు. -
చాంద్రాయణగుట్ట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అక్బరుద్దీన్ ముందంజ
-
అక్బరుద్దీన్ ఒవైసీ మెజారిటీపై సర్వత్రా ఆసక్తి
చాంద్రాయణగుట్ట: వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. డబుల్ హ్యాట్రిక్ కొట్టేందుకు ఆరోసారి బరిలోకి దిగిన చాంద్రాయణగుట్ట ఎంఐఎం పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత మెజార్టీతో గెలుస్తారన్న విషయం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. గత ఎన్నికల సమయంలో అక్బరుద్దీన్ ఒవైసీ 95,339 ఓట్లు రాబట్టి బీజేపీ అభ్యర్థి సయ్యద్ షహజాదిపై 80,264 ఓట్ల మెజార్టీ సాధించారు. ద్వితీయ స్థానంలో సయ్యద్ షహజాదీ 15,075, తర్వాతి స్థానాలలో బీఆర్ఎస్ అభ్యర్థి ముప్పిడి సీతారాంరెడ్డి 14,224, కాంగ్రెస్ అభ్యర్థి ఇసా బిన్ ఒబేద్ మిశ్రీ 11,309ల ఓట్లు మాత్రమే రాబట్ట గలిగారు. గతంతో పోలిస్తే ఈసారి 12 వేల ఓట్లు అధికంగా పోలవ్వడం.. ప్రధాన పారీ్టల అభ్యర్థులు హిందువులు కావడంతో ముస్లిం ఓట్లు తమకు గంపగుత్తగా పడి లక్ష మెజార్టీ వస్తుందని మజ్లిస్ శ్రేణులు అంచనాలు వేసుకుంటున్నాయి. వారి అంచనాలు ఎంత వరకు నిజం అవుతాయన్నది ఆదివారం వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi)పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని దూషించారనే అభియోగాలను అక్బరుద్దీన్‌పై బుధవారం కేసు నమోదు చేశారు సంతోష్ నగర్ పోలీసులు. ఈ మేరకు ఓ వీడియో వైరల్ కావడం కూడా తెలిసిందే. లలితాబాగ్‌లో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. సమయం అయిపోతుందని, ప్రచారం ముగించాలని స్థానికంగా విధులు నిర్వస్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్‌ను కోరారు. ఆ సమయంలో పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరతానని, తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, తన ఒంట్లో బుల్లెట్లు దిగినా.. కత్తిగాయాలు అయినా ధైర్యం ఇంకా మిగిలే ఉందని, ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయంగానూ విమర్శలకు తావిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 353(విధుల్ని అడ్డుకోవడం)తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు. #WATCH | Telangana: AIMIM leader Akbaruddin Owaisi threatened a police inspector who was on duty and asked him to leave the spot while he was addressing a campaign in Lalitabagh, Hyderabad yesterday. The police inspector asked him to conclude the meeting on time as per the Model… pic.twitter.com/rf2tJAOk3b — ANI (@ANI) November 22, 2023 బీజేపీ స్పందన.. దశాబ్దాలుగా, కాంగ్రెస్ & బీఆర్ఎస్ మద్దతుతో, ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని, ఇది పాత నగరాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపింది. అలాగే నేరాల బారిన పడకుండా చేసిందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన ఈ గజిబిజిని శుభ్రం చేయడానికి ఇది సమయం అని తెలిపింది. బిజెపి ప్రభుత్వంలో, అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ ప్రతిచర్య ఉంటుందని బీజేపీ తెలంగాణ ట్వీట్ చేసింది. -
సంతోష్ నగర్ సీఐపై MIM నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
-
చాంద్రాయణగుట్టకు 45 ఏళ్లుగా ఇద్దరే..
సాక్షి, హైదరాబాద్: అక్కడ ఇప్పటివరకు ఇద్దరంటే ఇద్దరే ఎమ్మెల్యేలుగా గెలిచారు.. అలా అని అదేం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమేమీ కాదు.. ఏకంగా పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కొక్కరు వరుసగా అయిదుసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. అదెక్కడో కాదు..పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో. ఒకరేమో అమానుల్లాఖాన్ కాగా మరొకరు అక్బరుద్దీన్ ఒవైసీ. అమానుల్లాఖాన్ ప్రస్థానం ఇలా ♦ 1978 ఎన్నికలకు ముందు చాంద్రాయణగుట్ట నియోజక వర్గం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అమానుల్లాఖాన్ కాంగ్రెస్ అభ్యర్థి బాలయ్యపై 1,333 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ♦ 1983లో ఎ.నరేంద్ర(బీజేపీ)పై 3,581 ఓట్లతో, 1985లో 3,009 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ♦ 1989 ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 28,147 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ♦1994 ఎన్నికల నాటికి సలావుద్దీన్ ఒవైసీతో విభేదించి మజ్లిస్‌కు పోటీగా అమానుల్లాఖాన్ ఎంబీటీ పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎంబీటీ తరఫున పోటీచేసి ఎంఐఎం అభ్యర్థిపై 35,210 ఓట్లతో గెలిచారు. అక్బరుద్దీన్ ఒవైసీ ఎంట్రీతో... ♦ అమానుల్లాఖాన్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసేలా సలావుద్దీన్ ఒవైసీ తన చిన్న కుమారుడు అక్బరుద్దీన్ ఒవైసీని 1999 ఎన్నికల్లో పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో 11,920 ఓట్ల మెజారిటీతో అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు. ♦ 2004 ఎన్నికల్లో 11,949 ఓట్ల మెజా రిటీతో గెలిచారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో 15,177 ఓట్లతో, 2014లో 59,279 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోగించారు. 2018 ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీ భాజపా అభ్యర్థి షెహాజాదీ సయ్యద్‌పై 80,264 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. వరుసగా అయిదు సార్లు గెలిచి అమానుల్లాఖాన్ రికార్డును సమం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా అక్బర్ చాంద్రాయణగుట్ల నుంచే పోటీ చేస్తున్నారు. -
మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు
హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీలో ‘చార్మినార్ అసెంబ్లీ సీటు’ చిచ్చు రాజేస్తోంది. మరోమారు పార్టీ అంతర్గత సంక్షోభం పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలను వయోభారం దృష్ట్యా ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పించి కొత్తగా యువతకు అవకాశం కల్పించాలన్న నిర్ణయం మజ్లిస్‌కు తలనొప్పిగా తయారైంది. అధిష్టానం ప్రతిపాదనల మేరకు ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీకి రిటైర్మెంట్ ప్రకటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అందులో ఒకరు మాత్రం తన కుమారుడికి టికెట్ ఇవ్వాలన్న మెలిక పెట్టడం పార్టీని చిక్కుల్లో పడేసినట్లయింది. అవకాశం ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో దిగడం ఖాయమన్న అల్టిమేటం తిరుగుబాటు సంకేతాన్ని సూచించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మూడు దశాబ్దాల క్రితం మజ్లిస్ అధినేత సలావుద్దీన్ ఒవైసీతో ఏర్పడిన విభేదాలతో సీనియర్ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్ ఏకంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ బయటకు వచ్చి మజ్లిస్ బచావో తెహరిక్ను స్థాపించారు. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ను ఓడించి కేవలం చార్మినార్ అసెంబ్లీ సీటుకే పరిమితం చేసి ముచ్చెమటలు పట్టించారు. అప్పటి అమానుల్లాఖాన్ సహచరుడైన సీనియర్ ఎమ్మెల్యే తాజాగా చార్మినార్కి అల్టిమేటం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సంప్రదింపుల్లో కాంగ్రెస్ .. మజ్లిస్ పార్టీని పాతబస్తీలో దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్.. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మజ్లిస్ తమను ప్రధాన శత్రువు పక్షంగా పరిగణించి వ్యతిరేక ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు మింగుడు పడని అంశంగా తయారైంది. ఇప్పటికే చార్మినార్ నుంచి బలమైన ముస్లిం అఅభ్యర్థని రంగంలోని దింపేందుకు అలీ మస్కతీ పేరును పరిశీలిస్తోంది. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో సంప్రదింపుల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని రంగంలోకి దింపినట్లు సమాచారం. కాంగ్రెస్ పక్షాన చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ వరకు వేచి చూడాలనే యోచనలో ముంతాజ్ ఖాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమెరుగని ముంతాజ్ ఖాన్‌కు చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉంది. దానిని అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదీ పరిస్థితి.. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిట్టింగ్ స్థానాల అభ్యర్థుల మార్పు, వయోభారం దృష్ట్యా సీనియర్ ఎమ్మెల్యేను పోటీ నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న మజ్లిస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లో చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, యాకుత్‌పురా స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీలకు బదులుగా కొత్తవారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి స్థానంలో రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాన్ని ఈసారి యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చు చేసి, నాంపల్లి నుంచి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. చార్మినార్ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ లేదా కూతురు ఫాతిమాను రాజకీయ అరంగ్రేటం చేయించాలని మజ్లిస్ భావిస్తోంది. రంగంలోకి అక్బరుద్దీన్ ► అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు సీనియర్ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగారు. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీ ప్రతిపాదనలపై వారితో చర్చించారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో అక్బరుద్దీన్ ఓవైసీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చలు జరిపినా ఫలప్రదం కానట్లు తెలుస్తోంది. ►వయోభారం దృష్ట్యా యువతకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అక్బరుద్దీన్ సూచించగా, స్వచ్ఛందంగానే తప్పుకునేందుకు ముంతాజ్ ఖాన్ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే గత ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్‌కు అవకాశం కల్పించాలని విజ్ఙప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఎంబీటీ నుంచి ఎంఐఎంలోకి తిరిగి వచ్చేందుకు ‘జీవితకాలం సీటు ఖాయం’ అన్న అప్పటి పార్టీ అధినేత సలావుద్దీన్ ఒవైసీ ఇచ్చిన నోటి మాట కూడా ఈ సందర్భంగా ముంతాజ్ అహ్మద్ ఖాన్.. అక్బరుద్దీన్ ఒవైసీకి గుర్తు చేసినట్లు సమాచారం. ఒకవేళ కుమారుడికి సీటు ఇవ్వకుంటే చార్మినార్, యాకుత్పురాల నుంచి ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని ముంతాజ్ అహ్మద్ ఖాన్ అల్టిమేటం ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా తయారైంది. -
రంగంలోకి నూరుద్దీన్..
పాత బస్తీని శాసిస్తున్న ఎంఐఎం పార్టీ కొత్త తరం నుంచి ఒకరిని ఈసారి రంగంలో దింపనున్నట్లు తెలుస్తోంది. ఒవైసీల కుటుంబంలో నాలుగోతరం రాజకీయ వారసునిగా అక్బరుద్దీన్ తనయుడు డాక్టర్ నూరుద్దీన్ ఒవైసీని చార్మినార్ నియోజకవర్గం నుంచి బరిలో దింపే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఎంఐఎం పార్టీని అబ్దుల్ వాహెద్ ఒవైసీ స్థాపించగా, తర్వాత ఆయన కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ, అనంతరం ఆయన కుమారులు అసదుద్దీన్, అక్బరుద్దీన్లు రాజకీయాల్లోకి రావడం తెలిసిందే. నూరుద్దీన్ రాజకీయాల్లోకి వస్తే నాలుగో తరానికి ప్రాతినిధ్యం వహించే అవకాశముంది. -
బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆర్ మళ్లీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. తమ ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై అక్బరుద్దీన్ ఒవైసీ లఘుచర్చను ప్రారంభించారు. జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇందుకు రాష్ట్ర సర్కారుకు, కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని వారి ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి పథకాలు చేపట్టారని వెల్లడించారు. రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని చెప్పారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. -
చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు?
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం శాసనసభలో మజ్లిస్ పక్ష నేత, మజ్లిస్ పార్టీ అదినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి ఐదోసారి గెలిచారు. ఆయన ఈ నియోజకవర్గం నుంచి వరసగా 1999 నుంచి గెలుస్తున్నారు. ఈసారి కూడా ఆయన తన సమీప బిజెపి ప్రత్యర్ది సయ్యద్ షాహీజాదిపై 80263 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. అక్బరుద్దీన్ ఒవైసీకి 95311 ఓట్లు రాగా, సయ్యద్‌కు కేవలం 15075 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఎమ్.సీతారామిరెడ్డికి పద్నాలుగు వేల ఓట్లకు పైగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానానికి పరిమితం అయింది. అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లిం నేత. 2014లో అక్బరుద్దీన్ 59279 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. అక్బరుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఆరుసార్లు లోక్ సభకు, ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఈయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ రెండుసార్లు శాసనసభ, నాలుగు సార్లుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. చాంద్రాయణగుట్టలో ఇంతకు ముందు ఐదుసార్లు అమానుల్లాఖాన్ గెలిచారు. ఈయన మూడుసార్లు ఇండిపెండెంటుగా, మరోసారి మజ్లిస్ అభ్యర్ధిగా, ఇంకోసారి సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఎమ్.బి.టి పార్టీ తరుపున గెలిచారు. అయితే 1999లో అమానుల్లాఖాన్‌ను అక్బరుద్దీన్ ఓవైసీ ఓడిరచారు. చాంద్రాయణగుట్టలో మజ్లిస్ మళ్లీ గెలిచింది. అలాగే ఇక్కడ అన్నిసార్లు ముస్లింలే గెలిచారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నన్ను చంపేందుకు ప్రయత్నించిన వారిని క్షమిస్తున్నా : అక్బరుద్దీన్
-
జూబ్లీహిల్స్‌లో విషాదం.. తుపాకీతో కాల్చుకుని డాక్టర్ ఆత్మహత్య..
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీఖాన్ (60) తన లైసెన్స్డ్ పిస్టల్‌తో కాల్చుకొని సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఆయన ఇంట్లోనే ఈ ఉదంతం జరిగింది. ఆర్థిక, కుటుంబ వివాదాలే కారణమని అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మజారుద్దీన్ ప్రస్తుతం ఒవైసీ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ విభాగం డీన్‌గా పనిచేస్తుండగా.. ఆయన కుమారుడు అబేద్ అలీఖాన్ అదే హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జన్‌గా ఉన్నారు. అబేద్‌కు అసదుద్దీన్ ఒవైసీ కుమార్తె యాస్మిన్ ఒవైసీతో 2020 సెప్టెంబర్ 22న వివాహమైంది. మజారుద్దీన్ ఇంట్లో భార్య అఫియా రషీద్ అలీఖాన్, అబేద్, యాస్మిన్ ఉంటుండగా.. మజారుద్దీన్ కుమార్తె జైనా అలీఖాన్ అమెరికాలో నివసిస్తున్నారు. ఆర్థిక, కుటుంబ వివాదాల నేపథ్యంలో కొన్నాళ్లుగా మజారుద్దీన్, అఫియా మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో వారు ఒకే ఇంట్లోనే వేర్వేరుగా ఉంటున్నారు. రెండు రోజులుగా వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం తన గదిలోకి వెళ్లిన మజారుద్దీన్ తలుపులు గడియపెట్టుకున్నారు. ఆపై తన వద్ద ఉన్న .32 క్యాలిబర్ లైసెన్స్డ్ పిస్టల్‌తో కుడివైపు చెవి పైభాగంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గది పూర్తిగా మూసి ఉండటంతో శబ్దం ఎవరికీ వినిపించలేదు. మజారుద్దీన్ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్పత్రికి రాకపోవడంతో అబేద్ ఆయనకు ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తకపోవడంతో తాజుద్దీన్‌కు ఫోన్ చేసి విషయం ఆరా తీయాలని సూచించారు. దాదాపు ఒంటి గంట ప్రాంతంలో తాజుద్దీన్ వెళ్లి మజారుద్దీన్ గది తలుపు తట్టినా ఎంతకీ తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా మజారుద్దీన్ మంచంపై రక్తపు మడుగులో పడి ఉండటం గమనించాడు. వెంటనే మజారుద్దీన్ భార్య, పనిమనిషుల సాయంతో తలుపులు తీసి మజారుద్దీన్‌ను కారులో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. తూటా మజారుద్దీన్ తల నుంచి బయటకు దూసుకెళ్లి గోడకు తలిగినట్లు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి తూటా, ఖాళీ క్యాట్రిడ్జ్‌ను క్లూస్ టీమ్ స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అందజేశారు. ప్రాథమికంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని వెస్ట్‌జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. డాక్టర్ మజహర్ అలీ మృతదేహనికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
అక్బర్ పోటీ చేస్తామన్న 50 స్థానాల్లో కరీంనగర్.. అసెంబ్లీ జంగ్లో పతంగ్!
సాక్షి, కరీంనగర్: ‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అంటూ హైదరాబాద్ పాతబస్తీలో మొదలైన ముస్లిం ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రస్థానం క్రమంగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. గతవారం అసెంబ్లీలో మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రవ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మజ్లిస్ పాతబస్తీ పార్టీగానే అందరికీ తెలుసు. పాత హైదరాబాద్‌లోని గుల్బర్గా (కర్ణాటక), మరాఠ్వాడా (మహారాష్ట్ర) తెలంగాణ లోకల్ బాడీస్కే పరిమితమైంది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో పోటీ చేసింది. అయితే, సొంతరాష్ట్రంలో మాత్రం పార్టీని విస్తరించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ దాటికి బయటికి రావాలని మజ్లిస్ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరీంనగర్లో 60 వేల ఓట్లు..! ప్రస్తుతం కరీంనగర్ ఓటర్ల సంఖ్య 3.30 లక్షల పైమాటే. అందులో 59,270 వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మజ్లిస్ ప్రకటన ఆకస్మికంగా చేసింది కాదు. దీని వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు తమకు బ లం ఉన్న 50 స్థానాల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచి్చంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉన్నాయని సమాచారం. ఇందుకోసం కరీంనగరంలోని ఓటర్ల సమాచారం మొత్తం సేకరించారు. దారుస్సలాం ఆదేశాల మేరకు.. ప్రత్యేక యాప్‌లో మొత్తం ఓటర్ల సమాచారం నిక్షిప్తం చేశారు. మొత్తం దాదాపు 390 పోలింగ్ బూత్‌ల వారీగా.. హిందూ, ముస్లింలు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పురుషులుగా విభజించారు. కరీంనగర్లో 30 వేలకుపైగా ఉన్న ఎస్సీలు తమతో కలిసి వస్తారన్న ధీమాతో మజ్లిస్ ఉంది. కొత్త ఓట్ల నమోదుకే డివిజన్ల పర్యటన.. కరీంనగర్లో 60 వేలకుపైగా ఓటర్ల బలం ఉన్న నేపథ్యంలో పోటీ చేసే పరిస్థితి వచ్చినా.. మద్దతిచ్చే నిర్ణయం తీసుకున్నా.. దేనికైనా సిద్ధంగా ఉండాలని దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. అందుకే.. ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వారం రోజులుగా డివిజన్ల పర్యటనకు ఎంఐఎం శ్రీకారం చుట్టింది. తమ ఓటర్లు ఉన్న 35 డివిజన్లలో కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నది దీని వెనక అసలు ఉద్దేశం. ఇప్పుడున్న ఓటర్లకు కనీసం నాలుగైదు వేలు యువ ఓటర్లు ఉంటారని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం వెంట ఎస్సీలు నడుస్తారా? మొత్తం కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను మజ్లిస్ కులం, మతం అనే అంశాల ఆధారంగా డేటా వర్గీకరించింది. 81.5% హిందూ జనాభా, 18.5% ముస్లిం జనాభా అని రెండు రకాలుగా విభజించింది. అందులో హిందువుల్లో 81.5% మందిలో మరో 14.5% వరకు అంటే దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు ఎస్సీలు కూడా ఉన్నారని.. మొత్తం తమకు 80 వేలమంది మద్దతు దొరుకుతుందని ఎంఐఎం ధీమాగా ఉంది. అదే సమయంలో నగరంలో ఉన్న ముస్లింలలో ఎందరు ఎంఐఎం వెంట నిలుస్తారు? రూ.10 లక్షల ఆర్థిక సాయంతో దళితబంధులాంటి భారీ సంక్షేమ పథకాలు అమలువుతున్న నేపథ్యంలో ఎస్సీలు మజ్లిస్‌కు మద్దతిస్తారా? అన్న సవాళ్లు మజ్లిస్‌ను వేధిసూ్తనే ఉన్నాయి. అందుకే.. అసలు మజ్లిస్ కరీంనగర్లో పోటీ చేస్తుందా? లేక మిత్రపక్షం బీఆర్ఎస్తోనే కలిసి నడుస్తుందా? అన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది. -
'హైదరాబాద్‌లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది.. రూ.కోట్లలో వ్యాపారం'
హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నగరంలో కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందన్నారు. వీటిని అరికట్టడంలో నార్కోటిక్స్ పూర్తిగా విఫలమైందన్నారు. నగరంలో యువత మత్తుపదార్థాలతో పెడదారి పడుతోందని, మత్తుకు అలవాటు పడటం సీరియస్ అంశమని అన్నారు. ఫార్మసీ స్టోర్లలో డాక్టర్ చిట్టీ లేకుండా డ్రగ్స్ ఇవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కాగ్ నివేదికను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహించాల్సిందని అన్నారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే 2018 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 67 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. చదవండి: తెలంగాణ: ‘కోటి కుటుంబాలు ఉంటే.. కోటి 53 లక్షల వాహనాలు’ -
ట్రాఫిక్ చలాన్లతో పోలీసులు వేధిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పోలీసులు వాహనదారులను ట్రాఫిక్ చలాన్లతో వేధిస్తున్నారని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో ఆరోపించారు. శనివారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీసులు ఎక్కడో చాటుగా ఉండి ఫొటోలు తీసి, చలాన్లు వేస్తున్నారని తెలిపారు. కృష్ణానదీ జలాల పంపిణీ సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. వర్షాలొస్తే కుంటలు ఉప్పొంగి పాత బస్తీలో చాలా ప్రాంతాలు జలమయమతున్నాయని, ఈ నేపథ్యంలో జలాశయాలకు మరమ్మతులు చేయాలని కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు వివిధ బోర్డుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డులను కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించడం లేదని, ఈ పథకం కింద చికిత్సలకు నిధులు పెంచాలని కోరారు. వివి ధ కారణాలతో తొలగించిన హోంగార్డులను మానవీయకోణంలో తిరిగితీసుకోవాలన్నారు. -
చప్రాసీని పెట్టండి.. సమస్యలు చెప్పుకుంటాం
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంజూరైన పనులు పూర్తి కావడం లేదు. పాతబస్తీ అభివృద్ధి పనుల గురించి ప్రత్యేక సమావేశం పెడతానని పురపాలక శాఖ మంత్రి చెప్పి ఏడాది గడిచింది. అయినా ఇప్పటికీ సమావేశం జరగలేదు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో తప్ప మిగతా అన్ని దిక్కులా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. కానీ వారెవరూ అందుబాటులో ఉండరు. బీఏసీ సమావేశానికి సభా నాయకుడు రారు. మరి మేం ఎవరిని అడగాలి? తెలంగాణ కోసం.. పాతబస్తీ అభివృద్ధి కోసం మీ చప్రాసిని కలవాలని చెబితే వారినైనా కలుస్తాం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఏఐఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని అధికారపక్ష సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన అక్బరుద్దీన్ ఒవైసీ... గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి గవర్నర్ చెప్పిన తీరును మెచ్చుకుంటూనే... కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా, రాష్ట్రంలో రెండో అధికార భాషగా ఉర్దూ అమలు వంటి అంశాలతోపాటు పాతబస్తీ అభివృద్ధిపట్ల నిర్లక్ష్యంపై సర్కారుకు వరుస ప్రశ్నలు సంధించారు. నాలుగున్నరేళ్లలో అసెంబ్లీ 64 రోజులే నడిచిందని, అధికార పార్టీ సభ్యులంతా అసెంబ్లీలోకన్నా టీవీ చర్చల్లో ఎక్కువ సేపు కూర్చుంటారని విమర్శించారు. గొంతు చించుకుంటే గొప్పోళ్లు కారు...: కేటీఆర్ అక్బరుద్దీన్ ప్రసంగం మధ్యలోనే జోక్యం చేసుకున్న మంత్రి కె. తారక రామారావు ఆయన విమర్శలను తిప్పికొట్టారు. ‘సభలో 105 మంది సభ్యులున్న బీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యులు గంట సేపు మాట్లాడితే ఏడుగురు సభ్యులున్న పార్టీకి గంట సమయం ఇస్తే ఎలా ? ఆయన (అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి) బీఏసీకే రారు. వచ్చి ఏదైనా చెప్పినా, విజ్ఞప్తి చేసినా మంత్రులు వింటారు. అక్కడికి రాకపోగా ఈ టర్మ్‌లో అసెంబ్లీనే జరగలేదన్నట్లు మాట్లాడుతున్నారు. ఈ టర్మ్‌లో రెండేళ్లు కోవిడ్కే పోయింది. ఆవేశంగా గొంతు చించుకున్నంత మాత్రాన ఏంరాదు. గొప్పవాళ్లు అయిపోరు. సభా నాయకుడు సభకు రారని మాట్లాడుతున్నారు. సభా నాయకుడితో ఏం సంబంధం? బీఏసీలో నలుగురు మంత్రులు ఉన్నారు. గవర్నర్ ప్రసంగంపై స్పందించకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలా? సమయపాలన పాటించాలి’ అని చురలంటించారు. నేనేం కొత్త సభ్యుడిని కాను: అక్బరుద్దీన్ కేటీఆర్ వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ స్పందిస్తూ ‘నేను కొత్త సభ్యుడిని కాదు. చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యా. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు.. రాజ్యంగబద్ధంగా చర్చ జరగాలి. గతంలో ఏపీ శాసనసభలో కూడా గంటలసేపు మాట్లాడాను. రోశయ్య వంటి వారు ప్రశంసించారు. ఎవరూ, ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. 105 మంది సభ్యులు ఉంటే ఎంత సేపైనా టైం తీసుకోండి. వినడానికి కూడా ఓపిక ఉండాలి. వారికి ఓపిక నశించింది’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే కల్పించుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. గవర్నర్ ప్రసంగంపైనే అక్బరుద్దీన్ మాట్లాడితే బాగుంటుందని సూచించారు. గతంలో బాగానే మాట్లాడారని, ఇప్పుడే అక్బర్‌కు సహనం తగ్గి, కోపం వస్తోందని వ్యాఖ్యానించారు. అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ తాను బీఏసీ సమావేశానికి వెళ్లకపోయినా, ఎంఐఎం తరఫున తమ ప్రతిపాదనలను పంపించినట్లు చెప్పారు. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చలేదేం? గవర్నర్ ప్రసంగంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును కూడా వివరించి ఉంటే బాగుండేదని అంతకుముందు అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ‘కేంద్రం 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదని గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. గవర్నర్ ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ముద్రించడం వల్ల కేంద్రం రాష్ట్రానికి చేసే అన్యాయాన్ని ప్రస్తావించడం మర్చిపోయారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో పోతున్నదెంత? అక్కడి నుంచి వస్తున్నదెంత? వంటి వివరాలు గవర్నర్ ప్రసంగంలో లేవు. గవర్నర్ ప్రసంగంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారా’ అనిప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ కేబినెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడామనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజలకు చెబుతామని వ్యాఖ్యానించారు. చార్మినార్, లాడ్‌బజార్ అభివృద్ధి ఊసేదీ? అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి సహకారం లభించడంలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి కేంద్ర బడ్జెట్లో ఊసేలేదని విమర్శించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, లాడ్‌బజార్ అభివృద్ధి, ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణం, సచివాలయంలో మసీదు నిర్మాణం, పాతబస్తీలో మెట్రోరైలు ప్రాజెక్టు, ఎస్ఆర్డీపీ ప్రాజెక్టు, రోడ్ల విస్తరణ వంటి అంశాల్లో ప్రభుత్వ తీరును విమర్శించారు. -
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో సభకు వస్తామని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభలో తాము ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నామనే ప్రస్తావన, ఇతరులు ఎత్తిచూపడం కొంత బాధ కలిగిస్తోందన్నారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి సభలో గంట సమయం ఎందుకు కేటాయించాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అందువల్ల ఈ విషయమై ఎంఐఎం అధ్యక్షుడితో చర్చిస్తామని, కనీసం 50 సీట్లలో పోటీచేసి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము రాజకీయంగా బీఆర్ఎస్తోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగంలో తనను ఉద్దేశించి ప్రతిపక్ష నేత అని సంబోధించడంపై సభాపతి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేత అనేది లేదని ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. 12% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలి.. గతంలో హామీ ఇచ్చిన విధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పన దిశగా చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త రిక్రూట్మెంట్లో 4 శాతం రిజర్వేషన్లు పాటించడం లేదని, రోస్టర్ ప్రకారం 3 శాతమే వర్తింపజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు డీఏ 6.8 శాతం చెల్లింపుతోపాటు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అక్బరుద్దీన్ సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత అని ప్రస్తావించానే తప్ప తనకు అంత కచ్చితంగా తెలియదన్నారు. పాతబస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సోమవారం (6న) అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏను ఇటీవల ప్రకటించిందని, పీఆర్సీ ఏర్పాటు విషయం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్ -
టీఎస్ అసెంబ్లీ: అక్బరుద్దీన్ Vs కేసీఆర్ సర్కార్.. హీటెక్కిన సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శాసనసభ వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా? అని ప్రశ్నించారు. కాగా, అక్బరుద్దీన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటూ ఎందుకు నిలదీయలేదు?. గవర్నర్ ఏమైనా మార్పులు, చేర్పులు సూచించారా?. గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించిందా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్‌గా ఉంది అని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఆరోపణలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. కేబినెట్లో జరిగిన ప్రతీ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పాతబస్తీని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు ఇస్తారు.. అమలు చేయరు. చర్చ సమయంలో సభా నాయకుడు కనిపించడం లేదు. సీఎం కేసీఆర్, మంత్రులు ఎవరినీ కలవరు. పాతబస్తీకి మెట్రో రైలు ఏమైంది?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటి?. మీరు చెప్రాసిని చూపిస్తే వారినైనా కలుస్తాము. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టీవీ డిబెట్లకు వెళ్లే టైముంది.. కానీ, సభకు వచ్చే సమయం లేదా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక, అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు?. అక్బరుద్దీన్ సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతున్నారు. సభా నాయకుడితో ఒవైసీకి ఏం సంబంధం?. ఏవైనా సమస్యలు ఉంటే బడ్జెట్ సెషన్లో చెప్పుకోవాలి. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావు అంటూ కౌంటర్ ఇచ్చారు. -
కోర్టు తీర్పుపై స్పందించిన ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.. ఆయనపై ఉన్న రెండు కేసులను బుధవారం కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. కోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలతో అక్బరుద్దీన్ ఒవైసీపై రెండు క్రిమినల్ కేసుల్లో ఎంపీ/ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. మా కోసం ప్రార్థనలు, మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. తమ విలువైన సహాయాన్ని అందించిన న్యాయవాది అబ్దుల్ అజీమ్ ఎస్బీ, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని అసదుద్దీన్ ట్విట్ చేశారు. Alhamdulilah Akbaruddin Owaisi has been acquitted by MP/MLA Special Court in two criminal cases against him for alleged hate speeches. Grateful to all for their prayers & support. Special thanks to Advocate Abdul Azeem sb & senior lawyers who provided their valuable assistance — Asaduddin Owaisi (@asadowaisi) April 13, 2022 -
నాంపల్లి కోర్టులో అక్బరుద్దీన్‌కు ఊరట
-
వివాదాస్పద వ్యాఖ్యల కేసు: అక్బరుద్దీన్‌కు భారీ ఊరట
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పును వెల్లడించింది. అక్బరుద్దీన్‌పై నమోదు అయిన రెండు కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. తొమ్మిదేళ్ల కిత్రం నిజామాబాద్, నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైంది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. బుధవారం ఈ మేరకు తీర్పు వెల్లడించిన నాంపల్లి కోర్టు.. కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని, అలాంటి వ్యాఖ్యలు దేశ సమగ్రతకు మంచిదికాదని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే కేసు కొట్టివేసినంత మాత్రానా సంబురాలు చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో.. పాతబస్తీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
10 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించనున్న నాంపల్లి కోర్టు
-
అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో నేడు తుది తీర్పు
-
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు కోర్టు తీర్పు
-
‘సంక్షేమం’లో తెలంగాణ భేష్: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమపథకాలను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ముస్లింల సంక్షేమానికి ఇక్కడ తీసుకున్నన్ని చర్యలు మరేరాష్ట్రంలో లేవని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి అన్నారు. ఈ సంక్షేమ పథకాల అమలు వెనక మజ్లిస్‌పార్టీ కూడా ఉందని, తాము చేసిన ఎన్నో సూచనలు, సలహాలను స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వెరసి టీఆర్ఎస్– మజ్లిస్ పార్టీల సంయుక్త ఆలోచనలతో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. షాదీముబారక్ పథకం రూపకల్పనలో కూడా తన సూచనలున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో సంక్షేమపథకాల అమలు అంశంపై శుక్రవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే కాదు, తమ హయాంలో కూడా సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశామని కాంగ్రెస్‌పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క చెప్పుకొంటున్నారని, అదే నిజమైతే వరసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎందుకు నిలవలేదని ప్రశ్నిం చారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించటంలో మాత్రం వెనకకుపోనని లోపాలున్నా నిలదీస్తానని స్పష్టం చేశారు. తాను చేసే విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నారాజ్ కారని, తాను చేసే ఆరోపణలను ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేసేవేనని ఆయనకు తెలుసునన్నారు. -
మొక్కల కన్నా ముస్లింలు హీనమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హరితహారం కోసం ఖర్చు చేస్తున్నన్ని నిధులు కూడా మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేయడం లేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శిం చారు. ‘ఏడేళ్లలో మైనార్టీల సంక్షేమంపై ప్రభుత్వం రూ.6.199 కోట్లు ఖర్చు చేసింది. అదే హరితహారంపై ఇంతవరకు రూ.6,555 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఏడాదే రూ.548 కోట్లు వ్యయం చేశారు. మొక్కలు, చెట్లకన్నా మైనార్టీలు హీనమై పోయారా? ముస్లింలకు హరితహారం కన్నా తక్కువ నిధులు ఖర్చు చేస్తారా..?’ అని నిల దీశారు. సోమవారం శాసనసభలో మైనారిటీ సంక్షే మం, పాతబస్తీ అభివృద్ధిపై చర్చను అక్బరుద్దీన్ ప్రారంభించారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించి ఒక్కోసారి ఒక్కోరకమైన లెక్కలు ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తప్పుడు లెక్కల మాదిరే మైనార్టీల ప్రగతి కూడా ఉందన్నారు. కొనసాగుతున్న వివక్ష రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో వివక్ష కొనసాగుతోందని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అం దుతున్న ఫలాలు మైనారిటీలకు దక్కడం లేదంటూ గణాంకాలతో సహా వివరించారు. మైనారిటీ పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఓవర్సీస్ స్కాలర్ షిప్పులు అందజేసే విషయంలో కూడా ప్రభుత్వ యంత్రాంగం చిన్నచూపు చూస్తోంద న్నారు. 2019 ఎన్నికల తర్వాత మైనార్టీల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని చెప్పారు. 2014–15 నుంచి ఇంతవరకు మసీదుల అభివృధ్ధికి, దర్గాల పనులు, ఖబరిస్థాన్ల కోసం మొత్తంగా రూ.210 కోట్లతో 800ల జీవోలు విడుదల చేసినా ఒక్క రూపాయిని కూడా ప్రభు త్వం ఇంతవరకు విడుదల చేయలేదని విమర్శిం చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి 56,653 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల గుర్తింపు విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కుటుంబ వార్షికాదాయ పరిమితి రూ. 8 లక్షలు ఉంటే, మైనారిటీలకు రూ.2 లక్షలకే పరిమితం చేశారని, దీనిని మార్చాలని అక్బరుద్దీన్ కోరారు. పాతబస్తీపై నిర్లక్ష్యం హైదరాబాద్ పాత నగరాన్ని అభివృద్ధి చేయడంలో వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కలుగు తోందని అక్బరుద్దీన్ చెప్పారు. ఫ్లై ఓవర్ల నిర్మాణం, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ), కుతుబ్షాహి టూంబ్స్ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, మెట్రో రైలు నిర్మాణం, మోనోట్రైన్ తీసుకురావడం వంటి అంశాల్లో పాతబస్తీని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మెట్రో మూసీ దాటలేదని చెప్పారు. నాలాల నిర్మాణం, దర్గాలు, పహాడీల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని అధునాతనంగా నిర్మించాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని అక్బరుద్దీన్ కొనియాడారు. హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధికి వైఎస్సార్ ఆనాడే రూ.2 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని తెలిపారు. 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి: భట్టి విక్రమార్క మైనారిటీ ముస్లింలకు రాష్ట్రంలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ (వైఎస్) ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని చెప్పిన టీఆర్ఎస్ అందుకు కట్టుబడి ఉండాలని కోరారు. రాజకీయ కారణాలతోనే పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. కబ్జాలకు ఓల్డ్‌సిటీ అడ్డాగా మారిందని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. -
అసదుద్దీన్ ఒవైసీ విమర్శలపై విజయశాంతి ఫైర్
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఇస్లాం వ్యతిరేకత లేదని, భయం లేకుండా ఉండాలని ముస్లింలను ఉద్దేశించి ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ సందేశం ఇచ్చిన విషయం తెలిసిందే. దానిని తప్పుబడుతూ ఒవైసీ నిన్న ట్వీట్లు చేశాడు. ఈ మేరకు ఆమె తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. హైదరాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. ‘‘భారతదేశ సమగ్రతను, సమైక్యతను చాటిచెప్పే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు చూస్తుంటే... రామ అనే పదం కూడా కొంతమంది అవకాశవాదులకు బూతుగా వినిపిస్తుందనే సామెత నిజమయ్యిందేమో అన్న అనుమానం కలుగుతోంది. దేశంలో ముస్లింలతో పాటు మైనార్టీ వర్గాల ప్రజలపై కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులను ఖండించడంతోపాటు... ఈ రకమైన దాడులకు పాల్పడేవారు హిందూత్వ సిద్ధాంతాలకు వ్యతిరేకమని మోహన్ భగవత్ సదుద్దేశంతో వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని కూడా అర్థం చేసుకోలేని స్థితిలో అసదుద్దీన్ ఓవైసీ ఉండటం చాలా విడ్డూరం. sounding synonymous to the claims that flares up religious hatred. It would be no surprise if the tolerant statements of Mohan Bhagavath ji sound criminal for a person like mr Asaduddin who is horribly habituated to delight upon hearing... — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 మొదట్లో భారతీయులుగా ఉన్నవారే మారుతున్న పరిస్థితుల కారణంగా ముస్లింలు గాను, ఇతర మైనార్టీ వర్గాల వారీగా రూపాంతరం చెందారని... ఎవరు ఏ మతంలో ఉన్నా, అందరూ భారతీయులమని మోహన్ భగవత్ దేశ సమైక్యతను చాటి చెప్పారు. కానీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మాటలు అసదుద్దీన్ గారి దృష్టిలో నేరస్తులు చేసే వ్యాఖ్యలుగా కనిపించాయి. తరచూ హిందూ, ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎంఐఎం నేతల ప్రసంగాలను విని, ఆనందిస్తూ, అలవాటు పడిపోయిన అసదుద్దీన్ గారికి.. భగవత్ గారి అభిప్రాయం క్రిమినల్ ఆలోచన గానే కనిపిస్తుంది. Why Mr. Asaduddin maintained complacence when Akbar said that if the police close their eyes and refrain themselves from their duties, he would definitely witness the end of Hindus. — VijayashanthiOfficial (@vijayashanthi_m) July 5, 2021 అయితే భగవత్ వ్యాఖ్యలను తప్పు పడుతున్న ఓవైసీ, గతంలో తన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులను ఉద్దేశించి చేసిన కామెంట్లను గుర్తు చేసుకోవాలి. అక్బరుద్దీన్ గతంలో ఓ సభలో మాట్లాడుతూ, ఐదు నిమిషాలు పోలీసులు గనుక విధులు నిర్వహించకుండా కళ్లు మూసుకుంటే, హిందువుల అంతు చూస్తానని, తన తడాఖా చూపిస్తానని విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగం చేసినప్పుడు అసదుద్దీన్ ఎందుకు నోరు మెదపలేదు? ఇప్పుడు మోహన్ భగవత్ మీద వచ్చిన పౌరుషం ఆరోజు ఏమైందో చెప్తే బాగుంటుంది'' అని విజయశాంతి వరుస ట్వీట్లలో ఒవైసీని నిలదీశారు. -
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
-
బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ, ఎంఐఎం నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై సుమోటో కింద పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది. ఎర్రగడ్డ డివిజన్లో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై ఐపీసీ 505 కింద కేసు ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దారుసలాం, పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చివేత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ... ‘ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. (పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్ చేస్తాం: సంజయ్) -
అదే జరిగితే.. దారుసలాంని కూల్చుతాం
సాక్షి, హైదరాబాద్ : పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలు కౌంటర్‌కి ఎన్కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దిన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు అంటూ బండి సంజయ్ తీవ్రగా హెచ్చరించారు. దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో రీసౌండ్ వస్తుందని.. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పాలన ఉందని అన్నారు. కనుక ఓటేసే ముందు అది ఏ పార్టీకి చేరుతుందో ప్రజలు గమనించాలని బండి సంజయ్ సూచించారు. (చదవండి: అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్) మాది ఢిల్లీ పార్టీయే అయినా గల్లీ గల్లీకి మా ప్రధాన మంత్రి పథకాలు ప్రజలకు అందుతున్నాయి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది అని కేసీఆర్ అంటున్నారు, అలా అయితే కేంద్ర నిధుల లేకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులకు పేర్లు, ఫోటోలు మార్చి తన పథకాలుగా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ,ఈ విషయాన్నిదుబ్బాక ప్రజలు గ్రహించారు కాబట్టే టీఆర్ఎస్ కు అక్కడ బుద్ది చెప్పారన్నారు బండి సంజయ్. -
అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోరులో పార్టీలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో ప్రచారానికి తెర పడనున్న తరుణంలో టీఆర్ఎస్, ఎంఐఎం ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్పై ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ట్విటర్లో మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. (మీ తోక ఎలా తొక్కాలో తెలుసు: అక్బరుద్దీన్) ఈ ఇద్దరు నాయకులూ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులనీ, ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనీ బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారపర్వం వాడివేడిగా కొనసాగుతోంది. అటు ఇప్పటివరకు మిత్ర పక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, మజ్లీస్ మధ్య తాజా దుమారం మరింత సెగలు రేపుతోంది. కాగా తాము తలచుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో కూల్చేయగలమని ఎంఐఎంఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ వ్యాఖ్యలు ఇప్పటికే అగ్గి రాజేశాయి. దీనికితోడు తాజాగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అంశంపై టీఆర్ఎస్పై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే హుస్సేన్ సాగర్ వద్దున్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావు ఘాట్లను కూల్చేయాలని సవాల్ విసిరారు. ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన తమకు ఎవరి కింద బతకాల్సిన దుస్థితి లేదంటూ ఆగ్రహించారు. అంతేకాదు అసెంబ్లీలో తోకను తొక్కి టీఆర్ఎస్ను ఎలా నిలబెట్టాలో, ఎలా కూర్చోబెట్టాలో తమకు తెలుసంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను. 1/2 — KTR (@KTRTRS) November 25, 2020 ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు. 2/2 — KTR (@KTRTRS) November 25, 2020 -
మీ తోక ఎలా తొక్కాలో తెలుసు: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఎంఐఎం, బీజేపీ నేతలు సై అంటే సై అంటూ మాటలు తూటాలు వదులుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..‘అక్రమ కట్టడాలు, పేదల ఇళ్లు కూల్చేస్తామని చెప్తున్నారు కదా. 4,700 ఎకరాల హుస్సేన్‌సాగర్ ఈరోజు 700 ఎకరాలు కూడా లేదు. హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు తెలుసు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదే. మైనారిటీల అభివృద్ధికి వైఎస్సార్ కృషి చేశారు’ అని ప్రశంసించారు.(చదవండి: గ్రేటర్లో హీట్.. ఫైట్.. మాటల తూటాలు) దమ్ముంటే వాటిని కూల్చండి: బండి సంజయ్ మరోవైపు అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్‌కు దమ్ముంటే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ సవాల్ విసిరారు. ‘హిందువుల ఆరాధ్య దైవం అయిన పీవీ, ప్రజా నాయకుడు ఎన్టీఆర్ సమాధులు కూల్చేస్తారా? దమ్ముంటే కూల్చండి. మీరు కూల్చిన రెండు గంటల్లోనే దారుసలంని బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు. దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో ఎందుకు రీసౌండ్ వస్తుంది. టీఆర్ఎస్ స్క్రిప్ట్‌ని దారుసలాంలో చదువుతున్నారు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే నల్ల జెండాలు పట్టుకున్న వారిపై సర్జికల్ స్ట్రైక్ ఎందుకు చేయకూడదు?’ అని బండి సంజయ్ ప్రశ్నించారు. (అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్) -
ఓల్డ్ సిటీ సంగతేంటి?: అక్బరుద్దీన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ అద్భుతంగా పురోగమిస్తోందని, హైటెక్ సిటీ ప్రాంతం గత 20 ఏళ్లలో ఎంతో పురోగమించి ఇప్పుడు భారతదేశ న్యూయార్క్‌గా గుర్తింపు పొందిందని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్న పాతనగరం అదే దుస్థితిలో ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిం చాల్సి ఉందని, పాత నగరానికి ఐటీ సెంటర్ రావాలని డిమాండ్ చేశారు. పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌గా ఉండగా, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పాతనగరంలో పార్కింగ్ టవర్లను పూర్తి చేయాలని కోరారు. నవ యవ్వనంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నువ్వు జుట్టు నెరిసి వృద్ధుడివి అవుతున్నావు తప్ప పాతబస్తీ అభివృద్ధి చెందటం లేదని ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్ చేసి చెప్తానని పేర్కొన్నారు. నా మాటల్లో తప్పుందని తేలితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. పీజేఆర్ మోనో రైల్ కోసం, తాను మెట్రో కోసం పోటీ పడగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఢిల్లీకి పంపి మెట్రో రైలు ప్రాజెక్టు పరిశీలించి రమ్మన్నారని, ఆ తర్వాతనే నగరానికి మెట్రో వచ్చిందని, కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీకి మాత్రం మెట్రో యోగం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా ఫేజ్–2 పాతనగరం కోసం ఏర్పాటైందని, కానీ కొత్త నగరంలో అమలవుతున్నట్టు పాతనగరానికి రోజువిడిచి రోజు నీళ్లు రావటం లేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టుగానే, నీటి విషయంలో పాతబస్తీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాలుగు వేల ఎకరాల వైశాల్యంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను ఇప్పుడు వేయి ఎకరాలకే పరిమితం చేశారని, లుంబినీపార్కు, నెక్లెస్‌రోడ్డు, ఫుడ్‌కోర్టులకు ఎవరు అనుమతిచ్చారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. -
‘నోటరీ ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి ’
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్, భవనాల క్రమబద్ధీకరణ పథకాల్లో ప్రభు త్వం మరికొన్ని మార్పులు చేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇళ్లు, ప్లాట్లు నోటరీల ద్వా రా క్రయవిక్రయాలు జరిగాయని, ఇది వరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినప్పటికీ చాలామంది దర ఖాస్తు చేసుకోలేకపోయారని అన్నా రు. కొందరికి తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఇదే పద్ధతిలో ఉన్నాయని, ప్రస్తుతం క్రమబద్ధీకరణ విషయంలో నోటరీ ఆస్తులపై విధానపరమైన నిర్ణయం తీసుకొని చివరి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ బిల్లుకు ఎంఐఎం పూర్తి మద్ద తు ఇస్తుందని, కానీ కొన్ని రకాల మా ర్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వీటిపై ప్రభు త్వం మరింత పక్కాగా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఇకపై వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులను బా ధ్యులుగా చేయాలన్నారు. హైదరాబా ద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభు త్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని అక్బరుద్దీన్ అన్నారు. రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో కేటీఆర్ కీలక పా త్ర పోషించారన్నారు. ఇటీవల తాను ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అభివృద్ధిని చూసి షాక్ అయ్యానన్నారు. -
ఒవైసీకి కేసీఆర్ శాపం పెడతారా?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన శాపం గురించి ఎంఐఎం శాసనసభ సభ్యుడు అక్బరుద్దీ ఒవైసీకి తెలియకపోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అన్నారు. కేసీఆర్ పెట్టిన శాపం గురించి తెలియకే గాంధీ ఆస్పత్రిపై ఒవైసీ విమర్శలు చేసివుంటారని పేర్కొన్నారు. కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి ఫేస్బుక్లో వ్యంగ్యంగా స్పందించారు. ‘కరోనా మహమ్మారిపై పోరులో అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలవాలని సీఎం కేసీఆర్ ఇటీవల విలేకరుల సమావేశంలో కోరారు. అంతటితో ఆగకుండా గాంధీ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేవని రాసిన మీడియా యజమానికి కరోనా వైరస్ సోకాలని శాపం పెట్టారు. వైద్య సదుపాయాలు లేవు అన్నందుకే కరోనా రావాలన్న కేసీఆర్.. మరి గాంధీ ఆసుపత్రి జైలు మాదిరిగా ఉందని విమర్శించిన అక్బరుద్దీన్‌కు ఎలాంటి శాపనార్థాలు పెడతారోనని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారు. బహుశా కేసీఆర్ పెట్టిన శాపం గురించి ఓవైసీకి తెలిసి ఉండకపోవచ్చు. లేదా కేసీఆర్, తాము ఒకటే కనుక ఈ శాపాలు తనకు వర్తించవని అక్బరుద్దీన్ ధీమాగా ఉండి ఉండొచ్చు. లేదా తమకు ఈ శాపాలు తగలవని... తాము అన్నిటికీ అతీతమని అక్బరుద్దీన్ భావించి ఉండొచ్చు. మరి రాబోయే రోజుల్లో అక్బరుద్దీన్‌కు కేసీఆర్ శాపం పెడతారా? లేక చూసీ చూడకుండా సర్దుకుపోతారా అనే విషయాన్ని వేచి చూడాలి’ అంటూ విజయశాంతి ఫేస్బుక్లో రాసుకొచ్చారు. ఆకలితో ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేయండి -
సీఏఏతో విద్వేషపు గోడలు
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) దేశాన్ని విభజిస్తోందని, బలహీనం చేస్తోందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చేలా, రాజ్యాంగ వ్యతిరేకంగా సీఏఏను కేంద్రం తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ సీఏఏ కేవలం ముస్లింలకే కాకుండా అణగారిన వర్గాలు, పేదలు, మహిళలందరికీ వ్యతిరేకంగా ఉందన్నారు. సీఏఏపై కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఈ పోరాటంలో ఎవరికీ భయపడబోమన్నారు. అలాగే రాష్ట్రంలో వచ్చే నెల ఒకటి నుంచి మొదలుకానున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) ప్రక్రియను వెంటనే నిలుపుదల చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేరళ తరహాలో ఎన్పీఆర్ను నిలిపేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని విన్నవించారు. తన ప్రసంగంలో అక్బరుద్దీన్ ఇంకా ఏమన్నారంటే... దేశం కోసం తల నరుక్కుంటా... పౌరసత్వ సవరణ చట్టం దేశ పౌరులను విదేశీయులుగా, విదేశీయులను దేశ పౌరులుగా మారుస్తోంది. సీఏఏ ముస్లిం వ్యతిరేకమని, ముస్లింలు ఈ చట్టానికి వ్యతిరేకమని చూడాల్సిన అవసరం లేదు. ఈ చట్టం పేదలకు వ్యతిరేకం. పెద్దగా చదువు రాని భారతీయులకు వ్యతిరేకం. దేశ మహిళలకు వ్యతిరేకం. ఎస్సీ, ఎస్టీలు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు వ్యతిరేకం. ఈ చట్టం పేద హిందూ సోదరులకు వ్యతిరేకం. నేను ముస్లిం కావడంపట్ల, భారతీయుడిని కావడంపట్ల గర్వపడుతున్నా. అయితే నన్ను కేవలం ముస్లింగానే చూస్తున్నారు. అలా కాకుండా నన్ను భారతీయ ముస్లింగా చూడాలి. కానీ కొందరు దేశద్రోహి అని, పాకిస్తాన్ వెళ్లాలని అంటున్నారు. నేను ఈ దేశవాసిని. దేశం కోసం అవసరమైతే ప్రాణం అర్పిస్తా... తల నరుక్కుంటా. దేశం కోసం హిందూ, ముస్లిం, సిక్కులంతా ప్రాణాలు అర్పించారు. ఈ దేశం ప్రతి ఒక్కరిది. ఏ మతాన్నీ ఆచరించని వారిది కూడా. అయితే ప్రస్తుత చట్టం దేశాన్ని విభజిస్తోంది. దేశాన్ని ఏకం చేసే చట్టాలు కావాలి... దేశాన్ని ఏకం చేసే చట్టాలు, ఆలోచనలు మనకు కావాలి తప్ప విద్వేషాలు కాదు. విరిగిన హృదయాలు, దూరమైన ఇద్దరు సోదరులను దగ్గరికి తెచ్చేలా చట్టాలు ఉండాలి తప్ప దూరం పెంచేవిగా కాదు. సీఏఏ వంటి చట్టాలతో ప్రజల మధ్య దూరం పెరిగింది. మనం ఈ దేశంలో సోదరభావంతో కలసిమెలసి బతికామని వేల ఏళ్ల మన చరిత్ర చెబుతోంది. కానీ ఇలాంటి చట్టంతో దేశాన్ని విభజించడంతోపాటు బలహీనపరుస్తున్నారు. దేశంలో విద్వేషపు గోడలు నిర్మిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను చూసి గర్విస్తున్నా... దేశంలో విద్వేషాలు పెరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ శాసనసభలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టి చేసిన ప్రసంగం యావత్ దేశానికి వెళ్తున్న ఆశాకిరణంలా ఉంది. దేశంలోని హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవులను సమ దృష్టితో చూసే వ్యక్తులు ఉన్నారని కేసీఆర్ నిరూపించారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్దామనే సీఎం మాకు ఉన్నారని నా మనసు గర్వంతో ఉప్పొంగుతోంది. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేసిన 8వ రాష్ట్రం తెలంగాణ అయినా వాటిపై సమగ్ర వివరాలతో తీర్మానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. అందరినీ సమ దృష్టితో చూస్తుందనే టీఆర్ఎస్కు మజ్లిస్ దగ్గరగా ఉంది. అందుకే మున్ముందూ టీఆర్ఎస్ చేయి వదలం. టీఆర్ఎస్ చేపట్టే కార్యక్రమాలకు చేదోడుగా ఉంటాం. తీర్మానం చేసినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఎన్నార్సీ అక్రమం... 2019 వరకు దేశ పౌరుడిగా ఉన్న నా ఓటు తీసుకొని ప్రధాని కుర్చీలో కూర్చొన్న వ్యక్తి.. దేశ ప్రజల పౌరసత్వంపై వేలెత్తి చూపుతున్నారు. ఎన్నార్సీ అమలు చేస్తే నాకు పౌరసత్వం ఉంటుందో లేదో అనుమానమే. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి సభలో ఉంటానో లేదో కూడా తెలియదు. ఈ చట్టం ఎలా ఉందంటే అక్రమ కొడుకు పుట్టిన ఏడాది తర్వాత తండ్రి పుట్టినట్టు ఉంది. ఎన్నార్సీ ప్రక్రియ పూర్తిగా అక్రమం. దీనికి చట్టబద్ధత లేదు. దేశ ప్రజల గోప్యతకు ఇది భంగం కలిగించేలా ఉన్నందునే దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సందేహాత్మక పౌరులు ఎక్కడికెళ్లాలి? ఎవరినైనా సందేహాత్మక పౌరులుగా ప్రకటించే అధికారాన్ని ఎన్నార్సీ కల్పిస్తోందని, ఇది అనేక సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అస్సాంలో తండ్రికి పౌరసత్వం లభిస్తే తల్లికి లభించలేదు. తల్లిదండ్రులకు దొరికితే పిల్లలకు దొరకలేదు. భార్యకు దొరికితే భర్తకు దొరకలేదు. కుటుంబంలోని ప్రతి వ్యక్తిపైనా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంచడం సరికాదు. ఒకవేళ గత రికార్డులతో పోలిక కుదరకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌తో పోల్చి సందేహాత్మక పౌరుడిగా ప్రకటిస్తారు. దీనిపై విదేశీయులు.. విదేశీయుల ట్రిబ్యునల్‌కు వెళ్తారు. మరి సందేహాత్మక పౌరులు ఎక్కడికి వెళ్తారు? వారిని డిటెన్షన్ కేంద్రాలకు తరలించాలి. ఒక్కో డిటెన్షన్ కేంద్రంలో 3 వేలకు మించి ఉండరాదు. ఒక్కో డిటెన్షన్ కేంద్రానికి రూ. 45 కోట్లు కావాలి. ఒకవేళ 10 కోట్ల మంది సందేహాత్మక పౌరులుంటే 33 వేల డిటెన్షన్ కేంద్రాలు కావాలి. దీనికితోడు ఏ వ్యక్తి అయినా మరో వ్యక్తి పౌరసత్వంపై సందేహాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే బాధితుడు తన జాతీయత నిరుపించుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇది బ్లాక్ మెయిలింగ్‌కు దారితీస్తుంది. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ప్రశ్నలు... ఎన్పీఆర్లో అడుగుతున్న వివరాలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. చాలా దుఃఖంగా, బాధతో, సిగ్గుతో చెబుతున్నా. మహిళలు ఒకవేళ వారి వయసు చెప్పలేని స్థితిలో ఉంటే అధికారులు వారిని చూసి వయసును బేరీజు వేయాలని, పెళ్లైన తర్వాత శోభనం (కంజ్యూమేషన్ ఆఫ్ మ్యారేజీ) నాటికి మహిళలకు ఉండే వయసును బేరీజు వేయాలని ఎన్పీఆర్ మ్యాన్యువల్‌లో నిబంధనలు పెట్టడం మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే. మన అమ్మ, అక్క, చెల్లెళ్ల ఆత్మగౌరవంతో కేంద్రం ఆటలాడుతోంది. చదవండి: దేశ ప్రతిష్ట గంగలో కలుస్తోంది పౌరసత్వ సవరణ చట్టం దళితులకే వరం సజల.. సుజల.. సస్యశ్యామల తెలంగాణ -
వక్ఫ్‌బోర్డును రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: ‘ముస్లింలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు. వారి అభ్యున్నతికి కావాల్సినంత మొత్తం భరించేంత ఆస్తి వక్ఫ్ వద్దే ఉంది. కానీ ఆ వక్ఫ్ సంపదను కొందరు దోచుకుంటున్నా పట్టించుకోవట్లేదు. వక్ఫ్ బోర్డును కొనసాగించాలంటే నిజాయితీ ఉన్న వారిని బాధ్యులుగా పెట్టండి.. లేదంటే వక్ఫ్ బోర్డునే రద్దు చేయండి’అని శుక్రవారం అసెంబ్లీలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ‘ముస్లింలకు రంజాన్ వేళ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ పేరుతో ఖర్చు చేసే మొత్తాన్ని మైనారిటీల్లోని అనాథల సంక్షేమం కోసం ఖర్చు చేయండి. దాన్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఇవ్వండి’అని చెప్పారు. మైనారిటీల అభ్యున్నతికి మరే రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే మజ్లిస్ పార్టీ ఆయనకు మద్దతు తెలుపుతోందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో మైనారిటీలకు మేలు జరుగుతున్న 54 అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూనే, అవసరమైన విషయాల్లో నిలదీసేందుకూ వెనకాడబోమని తేల్చిచెప్పారు. వక్ఫ్‌బోర్డులో జరుగుతున్న లోపాలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కనీస అర్హతలు కూడా లేనివారికి పదోన్నతులు కల్పిస్తూ భారీ ఎత్తున జీతాల రూపంలో ప్రజా ధనాన్ని చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పదో తరగతి చదివిన వారిని ఏకంగా సహాయ కార్యదర్శి పోస్టులో కూర్చోబెట్టారని, వారికి రూ.లక్ష చొప్పున జీతాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. మూడో తరగతి మాత్రమే చదివిన ఓ వ్యక్తిని ఆఫీస్ సబార్డినేట్‌గా నియమించారని, ఆయనకు రూ.54 వేల జీతం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సీబీఐతో లేదా సీఐడీతో లేదా హైకోర్టు విశ్రా>ంత జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 1999లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వక్ఫ్ అక్రమాల గురించి గొంతెత్తుతున్నా పట్టించుకోవట్లేదని, తన జుట్టు నెరుస్తున్నా మార్పు లేదని అసహనం వ్యక్తం చేశారు. వక్ఫ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. -
ఇది వాస్తవిక బడ్జెట్ : అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : దేశం ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోన్న దశలో సొంత ఆదాయ వనరులపై ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని, ఇది వాస్తవిక బడ్జెట్ అని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంత సహకారం అందడం లేదని, అందుకే రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతోందని ఆయన విమర్శించారు. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 8న ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చను బుధవారం అక్బరుద్దీన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలు ఆశించినంతగా నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిరాశ కలిగించే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు స్పెషల్ గ్రాంటు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినా కేంద్రం ఇవ్వలేదని, కాళేశ్వరం నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరినా పట్టించుకోలేదన్నారు. కేంద్ర పన్నుల వాటా, గ్రాంటులు కలిపి రాష్ట్రానికి పెరిగింది రూ.513 కోట్లేనన్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పలేదని, ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గృహ వినియోగదారులపై చార్జీల పెంపు ప్రభావం ఉంటుందా లేదా అన్న దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. మోటారు వాహనాల రంగం సంక్షోభంలో ఉన్న దశలో మోటారు వాహనాల పన్ను పెంచుకుంటా మని ఎలా ప్రతిపాదించారో అర్థం కావట్లే దన్నారు. భూముల విక్రయాల ద్వారా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాలేదన్నారు. గత ఐదేళ్లలో దీనిపై రూ.3,987 కోట్లు మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. వడ్డీలు రెండున్నర రెట్లు పెరిగాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రూ.2.29 లక్షల కోట్లకు చేరాయని, అప్పులు ఎఫ్ఆర్బీఎం చట్టానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ వడ్డీ చెల్లింపులు రెండున్నర రెట్లు పెరిగాయని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో రూ.2 వేల కోట్లు పాతబస్తీ అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. ఏటా ఇచ్చే రూ.10 వేల కోట్లను ఎలా ఖర్చు చేయాలనే దానిపై నగరానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులతో మున్సిపల్ మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని కోరారు. గతంలో వైఎస్సార్ అధి కారంలో ఉన్నప్పుడు పాతబస్తీకి ప్రత్యేకంగా రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించారని, ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉర్దూ లేకుండా పోతోందని, ఖాళీలు భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. ఐటీని ఓల్డ్ సిటీ వైపు విస్తరించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లను మైనారిటీలకు కూడా కేటాయించాలని కోరారు. రేషన్ కార్డులు ఇవ్వాలని, పీఆర్సీ అమలు చేయాలని, వక్ఫ్ బోర్డు బలోపేతానికి చర్యలు చేపట్టాలని కోరారు. -
సీఏఏ అంటే రాజ్యాంగంపై దాడే
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొ చ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పూర్తిగా రాజ్యాంగం మీద చేసిన దాడిగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లు ముస్లింలకే కాదు.. దేశంలోని మొత్తం పేద ప్రజలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించింది. జాతీయ వృద్ధి రేటు పడిపోతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. జీఎస్టీ బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటిపై కేంద్రానికి చీమ కుట్టినట్లయినా లేదు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లనే పట్టుకొని వేలాడుతోంది’అని ఒవైసీ దుయ్యబట్టారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. తమ హక్కుల కోసం కొట్లాతూనే ఉంటామని, హక్కుల సాధనలో ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. సీఏఏను తిప్పికొట్టే పోరాటానికి సీఎం కేసీఆర్ నాయకత్వం వహించాలని కోరారు. దేశంలో లౌకికత్వాన్ని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు తాము సహకరిస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఏఏతో పాటు, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ఈ సమావేశాల్లోనే తీర్మానం చేయాలని సూచించారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన అభినందించారు. అయితే వాటి అమలులో వేగం పెంచాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. -
అక్బరుద్ధీన్‌పై దాడి కేసు: పహిల్వాన్ మృతి
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీపై దాడి చేసిన మహమ్మద్ పహిల్వాన్ మంగళవారం మృతి చెందారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎనిమిదేళ్ల క్రితం అక్బరుద్ధీన్‌పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన పహిల్వాన్ బెయిల్‌పై బయట ఉంటున్న విషయం తెలిసిందే. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఆ దాడిలో అక్బరుద్ధీన్ శరీరంలోకి రెండు బుల్లెట్లు దిగాయి. పలు కత్తిపోట్లకు గురయ్యారు. ఆ సమయంలో అక్బరుద్దిన్ శరీరంలో నుంచి డాక్టర్లు కేవలం ఒకే బుల్లెట్ తీశారు. దీంతో ఆయన శరీరంలో ఉన్న మరో బుల్లెట్ కారణంగా ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. అక్బరుద్ధీన్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి విదితమే. -
అక్బరుద్దీన్ అంతగా మారిపోయాడా?
హైదరాబాద్: పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత తస్లీమా నస్రీన్ కూడా అక్బరుద్దీన్‌పై విమర్శలు సంధించారు. 'గతంలో హిందువుల పట్ల చులకనగా మాట్లాడటమే కాక 15 నిమిషాలు పోలీసులు కళ్లు మూసుకుంటే హిందూ, ముస్లిం జనాభాను సమానం చేస్తానన్న ఆయన ఇంత మంచి మనిషిగా ఎప్పుడు మారిపోయారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్బరుద్దీన్ ఇప్పుడు మహంకాళి ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరుతున్నాడు. అతడు ముఖానికి మాస్క్ తగిలించుకున్నాడా? లేకపోతే మంచిమనిషిగా మారాడా?' అంటూ ఆమె ట్వీట్ చేశారు. తనకు స్వేచ్ఛ కలిగితే దేశంలో హిందూ ముస్లింల జనాభాను సమానం చేస్తానని అక్బరుద్దీన్ ఇదివరకు పలుమార్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేసులు కూడా నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్ హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం శ్రీ కేసీఆర్ ను కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందచేశారు. pic.twitter.com/EyaORdJxUH — Telangana CMO (@TelanganaCMO) February 9, 2020 Akbaruddin Owaisi who wanted to kill Hindus if police is removed for 15 minutes, now want Rs 10 crore for the development of Mahankali temple! Is he wearing a mask? Or he has become a better man! — taslima nasreen (@taslimanasreen) February 10, 2020 -
మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా: హీరోయిన్
హైదరాబాద్: ఆదివారం రోజున పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళీ అమ్మవారి ఆలయం అభివృద్ధికి నిధులను కోరుతూ.. చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. 'మార్పు మొదలైంది. మోదీ గారు ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపితమయ్యింది. అయ్య బాబోయ్ మొన్న జాతీయ జెండాలు పట్టుకున్నారు. నిన్న జనగణమన పాడేరు. నేడు దేవాలయాలు బాగుచేయాలంటున్నారు. మోదీ నువ్వు సామాన్యుడివి కాదయ్యా. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభాపక్ష నాయకుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్, సీఎం కేసీఆర్‌ని కోరారు' అని అన్నారు. (చచ్చిపోతానంటూ చేసిన పోస్ట్‌పై వివరణ ఇచ్చిన నటి) -
మహంకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయండి
-
అక్బరుద్దీన్ ఒవైసీ వినతి.. కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ప్రగతిభవన్‌లో ఆదివారం ముఖ్యమంత్రిని కలసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో నిర్వహించే బోనాలు దేశవ్యాప్తంగా లాల్‌దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నా చాలినంత స్థలం లేకపోవడం వల్ల ఆలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోవట్లేదని.. దీనివల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. ‘లాల్ దర్వాజ మహంకాళి ఆలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలం ఉండటం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతోంది. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశముంది. వారికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ అధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని కోరుతూ స్వయంగా (ముఖ్యమంత్రి) మీరు బంగారు బోనం సమర్పించారు. ఆలయ విస్తరణకు ఆ సమయంలోనే ప్రకటన కూడా చేశారు. ఇక పాతబస్తీలోని అఫ్జల్‌గంజ్ మసీద్ మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయండి. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారు. మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతోంది..’అని అక్బరుద్దీన్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. -
సీఎం కేసీఆర్‌ను కలిసిన అక్బరుద్దీన్
-
సీఎం కేసీఆర్‌ను కలిసిన అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రగతిభవన్‌లో కలిశారు. పాతబస్తీ లాల్ దర్వాజ్ బోనాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిందని.. స్థలాభావం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆలయాన్ని విస్తరించాలని కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. రూ.10 కోట్ల వ్యయంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాలని వినతించారు. అఫ్జల్‌గంజ్ మసీదు మరమ్మతుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేయాలని సీఎం ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. మసీదు, ఆలయ అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు -
కారు టైర్లు ఊడిపోతాయ్
తాండూరు : ‘కేంద్రంలోని చాయ్‌వాలానే వదలలేదు.. మమ్మల్ని విమర్శిస్తే కారు టైర్లు ఊడిపోతాయ్’ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ను ఉద్దేశించి హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంఐఎం కేవలం ముస్లింల పార్టీయే కాదన్నారు. అన్ని వర్గాల కోసం తమ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. సీఏఏ అమలుతో ముస్లింలకే కాకుండా హిందువులు, సిక్కులు, క్రైస్తవులకూ ఇబ్బందులు తప్పవని తెలిపారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా తాము తొలి నుంచి పోరాటం చేస్తున్నామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని అక్బరుద్దీన్ విమర్శించారు. ఎంఐఎంను పాతబస్తీ పార్టీ అంటూ విమర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి తన కొడుకును గెలిపించుకోలేని అసమర్థుడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ హాదీ షహేరీ తదితరులు పాల్గొన్నారు. -
బుల్లెట్ మ్యాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజా గాయకుడు గద్దర్... కానిస్టేబుల్ దాసరి రాజేంద్ర ప్రసాద్... ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..కాంగ్రెస్ నేత విక్రమ్ గౌడ్... జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మా బేగం... ఈ ఐదుగురిలో ఉన్న సారూప్యత శరీరంలో బుల్లెట్స్ ఉండడం. ఆస్మా బేగం సుదీర్ఘ కాలం తన శరీరంలో బుల్లెట్‌తోనే బతికినా... వెన్నుపూస ఉదరకోశ భాగం మధ్యలో ఉన్న దాన్ని నిమ్స్ వైద్యులు ఆదివారం శస్త్ర చికిత్స చేసి తీసేశారు. మిగిలిన నలుగురూ మాత్రం ఇప్పటికీ ‘బుల్లెట్ మ్యాన్స్’గానే కొనసాగుతున్నారు. సాధారణంగా ప్రాణహాని కలిగించే తూటాను వీరంతా తమ శరీరంలో భాగంగా ఉంచుకోవాల్సి వచ్చింది. ప్రజాగాయకుడు గుమ్మడి విఠల్‌రావ్ అలియాస్ గద్దర్‌పై 1997లో కాల్పులు జరిగాయి. ఆల్వాల్ వెంకటాపురంలోని ఆయన ఇంటి వద్దే జరిగిన ఈ ఉదంతంలో ఆయన శరీరంలోకి ఐదు తూటాలు దూసుకుపోయాయి. నాలుగింటిని ఆపరేషన్ ద్వారా తొలగించిన వైద్యులు ఆయన వెన్నెముక సమీపంలో ‘స్థిరపడిపోయిన’ ఐదో దాన్ని మాత్రం తీస్తే ప్రమాదమని వదిలేశారు. నగర పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న దాసరి రాజేంద్రప్రసాద్‌పై 2009లో కాల్పులు జరిగాయి. మక్కా మసీదు వద్ద జరిగిన పోలీసు కాల్పులకు ప్రతీకారంగా అంటూ తెహరీక్ గుల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఉగ్రవాదబాట పట్టిన వికారుద్దీన్ అహ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పాతబస్తీలోని ఫలక్‌నుమ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న నాలుల్చింత వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపై వికార్ కాల్పులు జరిపాడు. హోంగార్డు బాలస్వామి అక్కడిక్కడే చనిపోగా... పక్కనే ఉన్న కానిస్టేబుల్ రాజేంద్ర తలలోకి తూటా దూసుకుపోయింది. మెదడుకు సమీపంలో ఉన్న దీన్ని తొలగించే ప్రయత్నం చేసినా, తొలగించినా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని చెప్పిన వైద్యులు అలానే ఉంచేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేతగా ఉన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై 2011లో హత్యాయత్నం జరిగింది. పాతబస్తీలోని బార్కస్ ప్రాంతంలో పహిల్వాన్ అండ్ గ్యాంగ్ ఆయనపై విరుచుకుపడింది. కత్తులు, తుపాకులతో దాడికి తెగపడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉన్న ఆయనకు పలు శస్త్రచికిత్సలు జరిగాయి. శరీరంలో ఉన్న ఇతర బుల్లెట్స్ తొలగించినా మూత్రపిండం, వెన్నెముక సమీపంలో ఉన్న తూటా జోలికి మాత్రం వైద్యులు పోలేదు. దీన్ని తీసే ప్రయత్నం చేస్తే అక్బర్ కాళ్ళు చచ్చుబడిపోయే ప్రమాదం ఉందని అలానే ఉంచేశారు. ఈ ముగ్గురి పైనా గుర్తుతెలియని వ్యక్తులు, ఉగ్రవాదులు, ప్రత్యర్థులు విరుచుకు పడటంతో వారు ‘బుల్లెట్ మ్యాన్స్’గా మారారు. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ కథ వేరు. తనపై దాడికి తానే వేసుకున్న సెల్ఫ్ స్కెచ్‌లో బుల్లెట్ మ్యాన్‌గా మారాడు. 2017లో బంజారాహిల్స్‌లోని ఇతడి ఇంట్లో హైడ్రామా చోటు చేసుకుంది. తాను ఏర్పాటు చేసుకున్న మనుషులతో తనపైనే కాల్పులు చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ తూటా ఆయన వెన్నుముక సమీపంలోకి వెళ్లి ఆగింది. దీన్ని కదిలించినా ప్రమాదమే కావడంతో వైద్యులు అలానే ఉంచేశారు. తుపాకులు నాటువైతే ఎగ్జిట్ కావు: నిపుణులు ఓ వ్యక్తిపై జరిగిన కాల్పుల ఉదంతంలో రెండు రకాలైన గాయాలు ఉంటాయి. తూటా లోపలకు దూసుకుపోయిన దాన్ని ఎంట్రీ ఊండ్ అని... శరీరం ద్వారా బయటకు దూసుకువచ్చిన దాన్ని ఎగ్జిట్ ఊండ్ అని అంటారు. నాటు తుపాకుల నుంచి వెలువడిన తూటాలు శరీరంలోకి దూసుకుపోతాయి తప్ప రెండో వైపు నుంచి బయటకు దూసుకురావు. గద్దర్, రాజేంద్ర ప్రసాద్, అక్బరుద్దీన్, విక్రమ్గౌడ్లపై కాల్పులకు వాడింది నాటు తుపాకులు కావడంతో తూటాలు ఎగ్జిట్ కాలేదు. దీనికి తోడు ఇవన్నీ పాయింట్–32 క్యాలిబర్ బుల్లెట్స్ కావడమూ ఓ కారణమే. కంపెనీ మేడ్‌గా ఉండే లైసెన్డ్స్ ఆయుధాలు లేదా పోలీసులు వినియోగించే సర్వీస్ రివాల్వర్స్లో కాల్పులు జరిపితే తూటా శరీరంలోకి వెళ్ళడంతో పాటు రెండో వైపు నుంచి దూసుకుని బయటకు వచ్చేస్తుంది. ఇవి అత్యంత ప్రమాదకర ఆయుధాలు. బుల్లెట్స్ అన్నిలెడ్తోనే తయారీ తుపాకుల్లో వాడే తూటాలను లెడ్తో తయారు చేస్తారు. కొన్ని పూర్తిగా లెడ్తోనే ఉండగా... మరికొన్న రకాలైన బుల్లెట్స్‌కు పైన కాపర్ లేదా బ్రాస్‌తో చేసిన జాకెట్ ఉంటుంది. శరీరంలోని దిగిన బుల్లెట్స్లో కొన్నింటిని వైద్యులు అలానే ఉంచేస్తారు. వీటివల్ల తొలినాళ్ళల్లో ఇబ్బంది ఉన్నా... ఆపై టిష్యూ సర్దుకుపోయి తూటాను తనలో ఇముడ్చుకుంటుంది. ఎముకలు విరిగినప్పుడు ఐరన్ ప్లేట్స్ వేస్తుంటారు. వీటినీ టిష్యూ తనలో ఇముడ్చుకున్న మాదిరిగానే తూటాలకూ ఎడ్జెస్ట్ అవుతుంది. శరీరంలోని కొన్ని సున్నిత ప్రాంతాల్లో తూటాలు ఉండిపోతే మాత్రం జీవితకాలం వైద్యుల సలహాసూచనల మేరకు ఔషధాలు వాడాల్సి ఉంటుంది. – డాక్టర్ వెంకన్న, హైదరాబాద్ క్లూస్ ఇన్చార్జ్ -
అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు
సాక్షి,హైదరాబాద్: బెయిల్ షరతులను ఉల్లంఘించారనే ఆరోపణల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లోని ఓ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన హైకోర్టు నుంచి గతంలో బెయిల్ పొందారు. బెయిల్ షరతులకు విరుద్ధంగా అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలని హిందూ సంఘటన్ అధ్యక్షుడు, న్యాయవాది కరుణ సాగర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను కింది కోర్టు కొట్టేయడంతో హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. -
అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2012లో నిజామాబాద్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సెషన్ కోర్టులో హిందూ సంఘటన్ అధ్యక్షులు, న్యాయవాది కరుణాసాగర్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్బరుద్దీన్ ఇదే తరహాలో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఒవైసీ బెయిల్ పిటిషన్‌లోని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇవాళ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు సీబీసీఐడీ పోలీసులుకు నోటీసులు ఇచ్చింది. -
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ
-
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, నిర్మల్: గతంలో హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు. నిర్మల్‌లోని ఓ సభలో మాట్లాడుతూ హిందూ దేవతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నిర్మల్‌లో కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన అక్బర్.. కేసును హైదరాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నిర్మల్ కోర్టుకు అక్బర్ రావడంతో ఎంఐఎం కార్యకర్తలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో నిర్మల్ కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
అక్బరుద్దీన్‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేయాలని సైదాబాద్ పోలీసులను నాంపల్లి కోర్టు గురువారం ఆదేశించింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 153బీ, 506 కింద కేసు నమోదు చేయాలని పేర్కొంది. సీఆర్పీసీ కింద విచారణ జరిపి డిసెంబర్ 23న జరిగే తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించాలని నాంపల్లిలోని 14వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశించారు. -
పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.13 మంది చొప్పున సభ్యులుండే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ), పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ), పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ (పీయూసీ)ల సభ్యుల వివరాలను వెల్లడించారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ఏఐఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు. అంచనాల కమిటీ చైర్మన్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వ్యవహరిస్తారు. గత శాసనసభలోనూ అంచనాల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన రామలింగారెడ్డి వరుసగా రెండో పర్యాయం అదే పదవిని చేపట్టనున్నారు. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా టీఆర్ఎస్ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎన్నికయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ యూజర్స్ కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ నామినేట్ అయ్యారు. వివిధ కమిటీల్లోని సభ్యుల వివరాలు పీఏసీ.. చైర్మన్: అక్బరుద్దీన్ ఒవైసీ (చాంద్రాయణగుట్ట), సభ్యులు: జైపాల్‌యాదవ్ (కల్వకుర్తి), రవీంద్రకుమార్ నాయక్ (దేవరకొండ), బిగాల గణేశ్‌గుప్తా (నిజామాబాద్ అర్బన్), గ్యాదరి కిషోర్ (తుంగతుర్తి), విఠల్‌రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి (నర్సంపేట), శ్రీధర్‌బాబు (మంథని), సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి), ఎమ్మెల్సీలు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, సయ్యద్ జాఫ్రీ, డి.రాజేశ్వర్‌రావు. పీఈసీ.. చైర్మన్: సోలిపేట రామలింగారెడ్డి (దుబ్బాక), సభ్యులు: కోనేరు కోనప్ప (సిర్పూర్ కాగజ్‌నగర్), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (జనగామ), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (సంగారెడ్డి), రాజాసింగ్ (గోషామహల్), ఎమ్మెల్సీలు: మీర్జా ఉల్ హసన్ ఎఫెండీ, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఆకుల లలిత. పీయూసీ.. చైర్మన్: ఆశన్నగారి జీవన్‌రెడ్డి (ఆర్మూరు), సభ్యులు: కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు (కోరుట్ల), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), అబ్రహాం (ఆలంపూర్), శంకర్‌నాయక్ (మహబూబాబాద్), దాసరి మనోహర్ రెడ్డి (పెద్దపల్లి), నల్లమోతు భాస్కర్‌రావు (మిర్యాలగూడ), అహ్మద్ పాషా ఖాద్రి (యాకుత్‌పురా), కోరుకంటి చందర్ (రామగుండం), ఎమ్మెల్సీలు: నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్, జీవన్‌రెడ్డి, ఫారూక్ హుస్సేన్. -
పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ప్రజా పద్దులు (పీఏసీ) కమిటీ పదవి ఎంఐఎం పార్టీని వరించింది. ఆ పార్టీ శాసనసభ పక్షం నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కింది. అలాగే అంచనాల కమిటీ చైర్మన్‌గా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నియమితులయ్యారు. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. కాగా పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది సంప్రదాయం. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దీంతో ఏడుగురు సభ్యులు ఉన్న మజ్లిస్ పార్టీ... తమకు పీఏసీ పదవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. -
బడ్జెట్ కుదింపునకు కేంద్రమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో కోత పడేందుకు కేంద్రం విధానాలే కారణమని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సహా కేంద్రం తీసుకున్న పలు విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని, దాని ప్రభావం రాష్ట్రంపై పడిందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు ఏమాత్రం లేద ని తేల్చి చెప్పారు. శనివారం బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన మొత్తాలను కేంద్రం కోత పెట్టినప్పుడు చేసేదేముంటుందని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సవాళ్లున్నాయని, వాటి నుంచి ఇబ్బంది లేకుండా బయటపడుతుందనే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పేరుకుపోయిన బకాయిలను చెల్లించిన తర్వాతనే కొత్త ప్రాజెక్టులు చేపడతామని ఇటీవల బడ్జెట్లో సీఎం పేర్కొన్న విషయాన్ని ప్రస్తుతించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న వారు, కేంద్రంలోని తమ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత ఉందని పరోక్షంగా బీజేపీని ప్రశ్నించారు. జాతి నిర్మాణంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన భూమికను పోషించబోతోందని, కానీ దాని గొప్పదనాన్ని జాతీయ మీడియా చూపించటం లేదన్నారు. అన్ని విషయాల్లో ఎంఐఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అం డగా ఉంటుందని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మైనారిటీలకు రూ.6,518 కోట్లు ప్రకటిస్తే వాస్తవం గా ఖర్చు చేసింది రూ.3,899 కోట్లేనని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తామన్న మాటలు నిజం కాలేదని ఆరోపించారు. నల్లమలలో యురేనియం వెలికితీత ప్రతిపాదనను తాము వ్యతిరేకమన్నారు. -
వివాదస్పద వ్యాఖ్యలు,ఒవైసీపై కేసు నమోదు
-
‘మున్సిపల్’లో టీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు
సాక్షి, తూప్రాన్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం తూప్రాన్ పట్టణ పరిధిలోని తాతపాపన్‌పల్లిలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురు యువకులను బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో నాలుగు స్థానాలను కైవసం చేసుకోవడం టీఆర్ఎస్కు మింగుడుపడటంలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకోనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. కాగా ఎంఐఎంనేత అక్బరుద్దీన్ ఒవైసీ కరీంనగర్లో చేసిన ప్రసంగం పై క్లీన్చిట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదిలా ఉంటే సీఎం సొంత నియోజకవర్గంలోని తూప్రాన్ పట్టణం అభివృద్ధిలో వెనుకంజలో ఉందన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌లో చేసిన అభివృద్ధి తూప్రాన్‌లో ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. తూప్రాన్ జాతీయ రహదారికి అనుకొని ఉందని, ఇక్కడ గతంలోనే పరిశ్రమలు వచ్చాయని కాని అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. డీగ్రి కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో గట్టు అమర్‌గుప్త, నర్సింహారెడ్డి, సాయిబాబాగౌడ్, ప్రవీణ్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
అక్బర్ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కరీంనగర్లో ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చి నట్టు నగర పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్లో జరిగిన సభలో అక్బర్ పాల్గొన్నారు. ఈ సభలో ఒక వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ అయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా తానెలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేయలేదని వివరణ ఇచ్చారు. ‘ముందు జాగ్రత్త చర్యగా అక్బరుద్దీన్ ప్రసంగాన్ని రికార్డు చేయించాం. ఆ వీడియోను అనువాద నిపుణుల సహాయంతో ట్రాన్స్‌లేట్ చేయించి, వీడియో రికార్డింగును, అనువాద ప్రతిని న్యాయ నిపుణుల సలహా కోసం పంపించాం. అయితే.. ఆ వీడియో ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే పదాలు గానీ లేవని , ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పారు’’అని సీపీ తెలిపారు. ఈ మేరకు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదని స్పష్టం చేశారు. -
‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు’
హైదరాబాద్ : కరీంనగర్లో తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఎవరినీ రెచ్చగొట్టేలా చేసినవి కాదని ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి చట్టవిరుద్ధ ప్రకటన చేయలేదని, ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడలేదని చెప్పారు. అక్బరుద్దీన్ బుధవారం కరీంనగర్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్ ప్రసంగించారు. దేశంలోని ముస్లింలను ఆర్ఎస్ఎస్ హతమారుస్తోందని ఆరోపించారు. 2013లో తాను చేసిన ‘15 నిమిషాల’ ప్రసంగంపై ఆర్ఎస్ఎస్ ఇంకా ఉలిక్కిపడుతోందని వ్యాఖ్యానించారు. 2013లో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు 15 నిమిషాల పాటు పక్కకు తప్పుకుంటే ముస్లింలు 100 కోట్ల మంది హిందువులను మట్టుబెడతారని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాగా కరీంనగర్లో అక్బరుద్దీన్ ప్రసంగంపై బీజేపీ, సీపీఐ సహా పలు రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు అక్బరుద్దీన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. -
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, ఆరెస్సెస్‌లపై మజ్లిస్ పార్టీ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు ఎంతకైనా దిగజారుతాయని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో హిందూ గాళ్ల రాజ్యం నడుస్తోందని, బొందు గాళ్ల రాజ్యం కాదన్నారు. హిందువుల యాత్రలపైన ఎంఐఎం కార్యకర్తలు దాడులకు పాల్పడేవారని, క్రికెట్లో టీమిండియా గెలిస్తే నల్లజెండా ఎగర వేసేవారని బండి సంజయ్ విమర్శించారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు లోపాయకారి ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తా అన్న పార్టీతో టీఆర్ఎస్ దోస్తీ కట్టిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాషాయ జెండా మాత్రమే ఎగరబోతోందని జోస్యం చెప్పారు. ఎంఐఎం ముస్లిం మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటే వారి బాగు కోసం ప్రధాని నరేంద్ర మోదీ ట్రిపుల్ తలాక్‌ని చట్ట బద్దం చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. దురదృష్టవశాత్తు మిమ్మల్ని ఎన్నుకున్నారు కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఎంఐఎం నేతలను ఎన్నుకున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ 20 మీ ఇలాఖలో ఏం జరిగిందో గుర్తుకు లేదా అక్బరుద్దీన్? మీ వాళ్లు నీపై హత్యాయత్నం చేసి కిడ్నీలు, అవయవాలు అన్నీ డీలా అయ్యేలాగా చేసిన విషయం గుర్తుకు రాలేదా? మా హిందువులను ఏం చేస్తావ్. నీ బొంద చేస్తావ్. ముస్లిం పేరుతో మీ అన్నదమ్ములు ఇద్దరు పబ్బం గడుపుతున్నారు. ఎంఐఎం మత రాజకీయాలకు తెర తీస్తోంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండు.. లేదంటే నీ చికిత్స ఫెయిలై ఉన్న జీవితం పోగొట్టుకుంటావ్’అంటూ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటుచేసిన ఎంఐఎం సభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్ ప్రసంగించారు. -
హెరిటేజ్ ఓ జోక్‌లా మారింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హెరిటేజ్ (వారసత్వం) ఓ జోక్‌గా తయారైందని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతంలో ఏది పడితే దాన్ని వారసత్వ సంపద జాబితాలో చేర్చారని తప్పుబట్టారు. కేవలం హైదరాబాద్ నగరంలోని కొందరు ప్రైవేటు వ్యక్తుల ఇళ్లు, దిల్కుషా గెస్ట్ హౌజ్‌తో సహా ప్రైవేటు గెస్ట్ హౌజ్‌లు, వారసత్వ సంపద జాబితాలో చేర్చారన్నారు. దిల్కుషా గెస్ట్‌హౌజ్ వారసత్వ సంపదా? అని సీఎం ప్రశ్నించారు. నగరం బయట ఉన్న ఎన్నో అద్భుతమైన కోటలను విస్మరించారన్నారు. చివరకు గాండ్ల బాలయ్యతో సహా నలుగురు ప్రైవేటు వ్యక్తుల ఇండ్లను వారసత్వ సంపద జాబితాలో చేర్చారని, గాండ్ల బాలయ్య పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. వైద్య కళాశాలల బోధన సిబ్బంది పదవీవిరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ బిల్లుపై గురువారం శాసనసభలో చర్చ సందర్భంగా వారసత్వ కట్టడాలపై వచ్చిన ప్రస్థావనకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. మన వారసత్వ సంపద, సంస్కృతిని గౌరవిస్తూనే అధునాతన సమాజ నిర్మాణానికి కూడా కొన్ని పనులు జరగాలన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలోని చరిత్రాత్మకమైన కట్టడాలు, కోటల పరిరక్షణ కోసం సమగ్రమైన వారసత్వ సంపద చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. అది జీవో కాదని, ఒక చట్టమని స్పష్టతనిచ్చారు. జీవో అనుకొని కోర్టుల్లో కొందరు వాదనలు చేస్తున్నారన్నారు. ఈ చట్టంపై నిపుణుల కమిటీ వేశామన్నారు. కమిటీ సిఫారసుల మేరకు ఏ కట్టడాలు జాబితాలో ఉండాలి, వేటిని తొలగించాలనేది నిర్ణయిస్తామన్నారు. అప్రాధాన్య కట్టడాలను జాబితాలోనుంచి తీసేస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రికి ఘనమైన చరిత్ర ఉందని, వారసత్వ సంపద అన్నారు. అదే స్థానంలో కొత్త ఆస్పత్రి నిర్మించాలని డిమాండ్ ఉందన్నారు. అయితే వారసత్వ సంపద నిబంధనలు అడ్డువస్తున్నాయన్నారు. ఈ అంశం హైకోర్టు పరిశీలనలో ఉందన్నారు. సరైన నిర్వహణ లేక చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఆందోళన వ్యక్తం చేయగా సీఎం కేసీఆర్ ఈ మేరకు బదులిచ్చారు. నగర వారసత్వ సంపదను పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇదేం కొత్త కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరిందని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నా చోద్యం చూస్తున్నారన్నారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణం నుంచి ఒక్కో వైద్య విభాగాన్ని నగరంలోని ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తున్నారని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ఘన చరిత్రను, సౌందర్యాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉస్మానియాను పరిరక్షించడానికి రూ.25 కోట్లను కేటాయించామని సీఎం కేసీఆర్ బదులిచ్చారు. తక్షణమే వైద్య సిబ్బంది నియామకాలు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,379 బోధన సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేసేందుకు ఆస్కారం లేదని సీఎం పేర్కొన్నారు. సీనియర్ బోధన సిబ్బందిని రెడీమేడ్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోలేమన్నారు. వైద్య కళాశాలల బోధన సిబ్బంది పోస్టులను సీనియారిటీ ప్రకారం పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేయాల్సిన 801 బోధన సిబ్బంది పోస్టులను సత్వరంగా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, దంత వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీవిరమణ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లును గురువారం శాసనసభలో కేసీఆర్ ప్రవేశపెట్టారు. పదవీ విరమణ వయస్సు పెంచినా యువ వైద్య బోధన సిబ్బందికి పదోన్నతుల్లో నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బోధన సిబ్బంది లేరని రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లకు ఎంసీఐ కోత పెడుతోందన్నారు. ఏటా 50 మంది బోధన సిబ్బంది రిటైర్ అవుతున్నారన్నారు. పీజీ సీట్ల కోసం మన విద్యార్థులు బయటకు వెళ్లి కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందనే వయోపరిమితి పెంచామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు, వైద్య కళాశాలల భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమై సమస్యలను తెలుసుకుంటారని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీలు మద్దతు తెలపడంతో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. -
ఏపీ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన అక్బరుద్దీన్ ఓవైసీ
-
ప్రజాసేవే నా జీవిత ఆశయం: అక్బరుద్దీన్
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం ఆయన చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్‌నగర్ జమాల్కాలనీలో నిర్మించనున్న ఒవైసీ జూనియర్ కాలేజీ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. మరోసారి చావు దగ్గరకు వెళ్లిన తనను ప్రజల ఆశీస్సులే బతికించాయన్నారు. ప్రజలకు సేవే జీవిత లక్ష్యమని, అందుకే తాను తిరిగి వచ్చానన్నారు. మళ్లీ పునర్జన్మ ప్రసాదించడమంటే ప్రజలకు తాను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్న మాట అని పేర్కొన్నారు.తాను చనిపోయానంటూ కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపి ఆనందపడ్డారని, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు అలాంటివారి ఆశలు నెరవేరబోవన్నారు. వెయ్యిమందికి ఉచితవిద్య ఏదో ఒకరోజు చావడం ఖాయమని, అప్పటివరకు ప్రజల నడుమ ఉంటూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవడమే తన కర్తవ్యమని అక్బరుద్దీన్ అన్నారు. ఇప్పటికే వెయ్యిమంది విద్యార్థులకు ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉచితంగా విద్యను అందిస్తున్నామని, ఇంటర్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. విద్యతోనే మనకు అన్ని రకాల గుర్తింపు లభిస్తుందని, ప్రతి కుటుంబంలోని పిల్లలందరూ ఉన్నత చదువులు చదవాలన్నారు. నియోజకవర్గంలో మరి న్ని ఎడ్యుకేషనల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. తన కుమార్తెను లండన్‌లో లా చదివి స్తున్నానని, ఆ యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచిందని చెప్పారు. తాను ఉన్నా లేకున్నా ఈ విద్యాసంస్థలను తన కుమారుడు, కుమార్తె చూసుకుంటారని తెలిపారు. -
హైదరాబాద్‌కు చేరుకున్న అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: అనారోగ్యం కారణంగా లండన్‌లో చికిత్స పొందిన మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు నెలల క్రితం సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం ఆయన తన కుటుంబసభ్యులతో కలసి వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురికావడంతో రెగ్యులర్ చెకప్‌ల నిమిత్తం వెళ్లే లండన్‌లోని ఓ ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. వైద్య పరీక్షలు చేయించుకొని కుటుంబసభ్యులతో కలసి అక్కడే విశ్రాంతి తీసుకుంటూ రంజాన్ పండుగ కూడా జరుపుకున్నారు. ఇరవై రోజుల క్రితం అక్బరుద్దీన్ తీవ్రమైన కడుపునొప్పికి గురై వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలో జరిగిన దాడి నుంచి ఆయన త్రుటిలో ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాల కారణంగా తరచూ కడుపునొప్పికి గురవుతున్నారు. మెరుగైన వైద్యం కోసం 3 నెలలకోసారి లండన్ ఆసుప్రతికి వెళ్లి చికిత్స చేయించుకొని వస్తున్నారు. ఈ క్రమంలో అక్బర్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని రంజాన్ సందర్భంగా దారుస్సలాంలో జరిగిన కార్యక్రమంలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేయడంతో కార్యకర్తలు, అభిమానుల్లో కలకలం చెలరేగింది. అక్బరుద్దీన్ ఆరోగ్యం కోసం కార్యకర్తలు పెద్దఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎట్టకేలకు ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. ఆయన రాక విషయం తెలుసుకొని మజ్లిస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని ఘనస్వాగతం పలికారు. -
అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. Praying for the speedy recovery and good health of Akbaruddin Owaisiji. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 11, 2019 -
అక్బరుద్దీన్ ఒవైసీకి తీవ్ర అనారోగ్యం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అనారోగ్యానికి గురై లండన్‌లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. ఆయనకు రెగ్యులర్‌గా వైద్య సేవలు అందించే వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. గత పక్షం రోజులక్రితం రంజాన్ పర్వమాసం సందర్భంగా సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా ప్రార్థనల కోసం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. ఉమ్రా ప్రార్థనల అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం సమయంలో అనారోగ్యానికి గురికావడంతో రెగ్యులర్ చెకప్‌కోసం వెళ్ళే లండన్‌లోని ఆసుపత్రికి ప్రయాణమయ్యారు. అక్కడి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని కొద్దిరోజులుగా కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటున్నారు. రంజాన్ కూడా అక్కడే జరుపుకున్నారు. కాగా, గత రెండు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం చాంద్రాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తీవ్ర గాయాలకు గురికావడంతో ఇప్పటికీ అక్బరుద్దీన్ కడుపు నొప్పితో బాధ పడుతూ ఉంటారు. మెరుగైన వైద్యం కోసం ప్రతి మూడు మాసాలకు ఒకసారి లండన్‌లోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని వస్తుంటారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తీవ్ర అనారోగ్యానికి గురై స్థానికంగా చికిత్స పొంది తిరిగి కోలుకున్నారు. తాజాగా తిరిగి అనారోగ్యానికి గురయ్యారు. కాగా, దారుస్సలేంలో జరిగిన ఈద్–మిలాప్ సందర్భంగా తన సోదరుడు అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దీంతో అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యంపై ఆందోళన చెలరేగింది. అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యంకోసం పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం సీనియర్ నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. గతంలో చందాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను లండన్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సోదరుడు అక్బర్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు. -
‘మీ భార్యకు ఏ హక్కులు కల్పించారు’
సాక్షి, హైద్రాబాద్ : ట్రిపుల్ తలాక్ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఇతర మహిళల గురించి తర్వాత మాట్లడవచ్చు గానీ.. మోదీ తన భార్యకు ఏ హక్కులు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘ మోదీ.. మీరు ముస్లిం సోదరీమణులు, కూతుళ్ల విడాకుల గురించి నిజంగా చాలా బాధపడుతున్నారు. కానీ మీ భార్యకు అసలు ఒక్క హక్కునైనా కల్పించారా’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. డీఆర్డీఓ ఇక్కడే ఉంది.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పర్యటనలో భాగంగా హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. హైద్రాబాద్ అభవృద్ధికి మజ్లిస్ అడ్డుపడుతోందంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ..‘ ఈరోజు చాయ్వాలాలు, చౌకీదార్లు మజ్లిస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్లకి చాయ్ చేయడం తప్ప ఇంకో విషయం తెలియదు. మిషన్ శక్తి విజయవంతం కావడానికి కారణమైన డీఆర్డీఓ హైద్రాబాద్‌లోనే ఉందన్న విషయం మోదీ గుర్తుపెట్టుకుంటే మంచిది’ అని హితవు పలికారు. -
ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఘాటు విమర్శలు
హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో ప్రచార అస్త్రంగా బీజేపీ ఎత్తుకున్న చౌకీదార్ క్యాంపెయిన్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటుగా విమర్శించారు. భారత దేశం ఓ ప్రధానిని కోరుకుంటుందని, చౌకీదార్లు, పకోడీవాలాలను కాదని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రచార సభలో అక్భరుద్దీన్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీపై ధ్వజమెత్తారు. ‘నేను ట్విటర్లో చౌకీదార్ నరేంద్రమోదీ అని చూశాను. ఆయన తన ఆధార్, పాస్‌పోర్ట్‌లో కూడా ఆ పేరు పెట్టుకోవాలి. ఆయనకు చౌకీదార్‌గా ఉండాలనే ఇష్టం ఉంటే.. నా దగ్గరకు రమ్మనండి. నేను ఆయనకు చౌకీదార్ క్యాప్, ఓ విజిల్ ఇస్తాను’ అని అక్బరుద్దీన్ ఎద్దేవా చేశారు. చౌకీదార్ కథ ఇది.. నరేంద్రమోదీ తనను తాను ‘చౌకీదార్’గా దేశానికి కాపలాదారుగా అభివర్ణించుకోగా.. రఫేల్ స్కాంలో మోదీ అవినీతికి పాల్పడ్డారని, ఆయన చౌకీదార్ కాదు.. చోర్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు కౌంటర్‌గా ‘మై భీ చౌకీదార్’ (నేనూ కాపలాదారుడినే) నంటూ మోదీ సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఈ ప్రచారంలో భాగంగా మోదీ తన ట్విటర్ ఖాతాలో పేరుకు ముందు చౌకీదార్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. మోదీకి సంఘీభావంగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ ట్విటర్ అకౌంట్ల పేర్లకు ముందు మే భీ చౌకీదార్ ట్యాగ్‌ను చేర్చారు. చౌకీదార్ నినాదంతో బీజేపీ తన ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తుండగా.. ‘మీ పిల్లలను డాక్టర్లను చేస్తారా లేక కాపలాదారులను చేస్తారా’ అని ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. -
ఎమ్మెల్యేగా అక్బరుద్దీన్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ఒవైసీ శనివారం ఎమ్మెల్యేగా ప్రమా ణం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో అక్బరుద్దీన్ ఉర్దూలో దైవసాక్షిగా ప్రమా ణం చేశారు. డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది డిసెంబర్ 11న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఆయన విదేశాల్లో ఉండడంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. -
ఆస్పత్రిలో చేరిన అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లోని ఓవైసీ ఆసుపత్రిలోని ప్రత్యేక గదిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విందుకు హాజరైన సమయంలో అక్బరుద్దీన్‌కు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో.. ఆయన్ను ఓవైసీ ఆసుపత్రిలో చేర్పించారు. సోదరుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటూ బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఆయనను పరామర్శించి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మినహా మిగతా ఎవరినీ ఆసుపత్రి లోపలికి అనుమతించడంలేదు. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అక్బరుద్దీన్ చాంద్రాయణ గుట్ట నుంచి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సమయంలో ఓ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. గత కొన్నాళ్లుగా తన ఆరోగ్యం బాగా లేదని చెప్పారు. కిడ్నీల సమీపంలో బుల్లెట్ ముక్కలు ఉన్నాయని తెలిపారు. డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారని అన్నారు. అక్బర్ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబసభ్యులతో పాటు ఆయన అభిమానులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
హంగ్ రాలేదు.. ఎంఐఎం స్థానాలూ మారలేదు!
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో తమను ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం ఏ పార్టీకి లేవనీ, అందరు సీఎంలు తమకు సలాం కొట్టినవారేనని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఎన్నికలకు ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో హంగ్ వస్తే ఎంఐఎందే కీలక పాత్ర అని కూడా ఆయన వెల్లడించారు. కానీ, ఆయన ఆశలు నెరవేరలేదు. తెలంగాణలో హంగ్ రాలేదు. అలాగనీ ఎంఐఎం గెలిచిన స్థానాల్లో కూడా పెద్దగా మార్పు లేదు. ఎప్పటిలాగే తన కంచుకోట హైదరాబాద్ పాతబస్తీలో ఎంఐఎం తన ఏడు స్థానాలను నిలబెట్టుకుంది. ఈసారి నగర శివారు నియోజకవర్గమైన రాజేంద్రనగర్‌లో పోటీ చేసి.. ఉత్కంఠ రేపినప్పటికీ.. అక్కడ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరోసారి విజయం సాధించారు. కానీ, ఇక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఎంఐఎం రెండోస్థానంలో నిలువడం గమనార్హం. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏకపక్షంగా టీఆర్స్కే పట్టం కట్టడంతో.. ఎంఐఎంకు ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లభించే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. టీర్ఎస్కే తమ పూర్తి మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఇదివరకే ప్రకటించారు. అయితే, హంగ్ అసెంబ్లీ ఏర్పడితే కాంగ్రెస్ ఆహ్వానంపై ఆలోచించిస్తానని కూడా ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కేసీఆర్‌ను కలిసిన ఆయన తమ పార్టీ టీఆర్ఎస్కే అనుకూలమని విస్పష్ట సంకేతాలు పంపారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం.. తమ పనులు చేయించుకోవడం ఆది నుంచి ఎంఐఎం అనవాయితీగా పెట్టుకుంది. గత హయాంలో కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించిన ఎంఐఎం ఈసారి కూడా అలాగే వ్యవహరించే అవకాశముంది. ఎంఐఎం గెలుపొందిన స్థానాలు.. మలక్‌పేట: అహ్మద్ బలాల, నాంపల్లి: జాఫర్ హుస్సేన్ మెరాజ్, చార్మినార్: ముంతాజ్ అహ్మద్ ఖాన్, చాంద్రాయణగుట్ట: అక్బరుద్దీన్ ఓవైసీ, యాకుత్ పురా: అహ్మద్ పాషా ఖాద్రి, బహదుర్‌పుర : మహ్మద్ మౌజంఖాన్, కార్వాన్: కౌసర్ మొహినుద్దీన్ స్థానాల్లో విజయం సాధించగా.. రాజేంద్రనగర్‌లో గట్టిపోటినిచ్చి ఓటమి పాలైంది. టీఆర్ఎస్ అభ్యర్థి తలకంటి ప్రకాశ్‌గౌడ్ చేతిలో మీర్జా రహమత్ బైగ్ పరాజయం పాలయ్యారు. -
ఆ కుక్క ఎల్బీ స్టేడియంకు రాగలదా?: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: పదిహేను నిమిషాలు పోలీసులను పక్కన పెట్టమన్న కుక్క ఇప్పుడు ఎల్బీ స్టేడియంకు రాగలదా అంటూ గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ప్రశ్నించారు. సోమవారం స్థానిక ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన బహిరంగ సభలో రాజాసింగ్ మాట్లాడారు. హైదరాబాద్‌కు మోదీ వస్తే ఆయన సంగతి చూస్తానన్న దేశ ద్రోహి ఇప్పుడు ఎక్కడా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి టీఆర్ఎస్కు అవకాశమిస్తే ఎలాంటి అభివృధ్ది జరగలేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రావాలని కోరుకునే వాళ్లు.. సెల్‌ఫోన్ లైట్స్ వేయాలని కోరడంతో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. -
కేసీఆర్‌కి ధైర్యముంటే అక్బర్ వ్యాఖ్యలను ఖండించాలి
సాక్షి, నిజామాబాద్: ‘ఎవరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నా ముందు మోకరిల్లాల్సిందే’ నంటూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసి అహంకారపూరితంగా మాట్లాడారని, సీఎం కేసీఆర్‌కు ధైర్యముంటే అక్బర్ వ్యాఖ్యలను ఖండించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అక్బర్ కాళ్ళ ముందు తాకట్టు పెట్టే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేసి.. నాలుగైదు రోజులైనా కేసీఆర్ స్పందించలేదు కాబట్టి.. అక్బర్ మాటలే నిజమని నమ్మాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ స్పందించకపోయినా.. కనీసం కేటీఆర్ కూడా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. -
మసీదుల మీదున్న ప్రేమ ఆలయాలపై లేదా?
సాక్షి, ఆదిలాబాద్ : కేసీఆర్, రాహుల్ గాంధీ, ఇతర పార్టీల నేతలు రజాకార్ల వారసులైన మజ్లీస్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించగలరా అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేట్‌వే లాంటి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చాను.. ఇక జీజేపీ ప్రవేశం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివాసి వీరుడు కుమ్రంభీమ్‌ను స్మరించుకుంటున్నానని తెలిపారు. కుమ్రంభీం లేకపోతే నేడు ఇక్కడకు రావాడానికి తను పాస్‌పోర్ట్ తీసుకోవాల్సి వచ్చేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తామని హామి ఇచ్చారు. గత ఎన్నికల్లో చెప్పిన ఎయిర్ పోర్ట్, సిమెంట్ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఏమైనాయి... డబుల్ బెడ్రూం ఇళ్లు ఎక్కడ అంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు. కేంద్ర నుంచి వచ్చిన రూ. 80 వేల కోట్లకు లెక్కలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. కేసీఆర్ కారణంగా.. మోదీ పథకాలు తెలంగాణలో అమలు కావటం లేదని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక్కరికి కూడా ఇళ్లు నిర్మించలేదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదీవాసీలకు ఆయుశ్మాన్ భారత్ కింద సంత్సరానికి రూ. 5 లక్షలు అందిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల ముందు దళితుణ్ణి సీఎం చేస్తా అన్న కేసీఆర్.. మాట తప్పి తానే పీఠమెక్కాడని విమర్శించారు. విదేశీ చోరబాటుదారులకు మద్దతు పలుకుతున్నారు.. రాహుల్ బాబా ఈ విషయంలో అందరికంటే ముందున్నాడంటూ కాంగ్రెస్‌పైన కూడా అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. మైనార్టీ సంతుష్టీకరణ విషయంలో కేసీఆర్ పోటీ పడ్తున్నారు.. సాధ్యాసాధ్యాలతో నిమత్తం లేకుండా మైనార్టిలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ అబద్ధాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టిలకు విద్య, వైద్యం, ఉపాధి, మసీద్ ఇలా అన్ని విషయాల్లో ఊతమంటూ.. ఆలయాల విషయంలో మాత్రం నోరు మెదపడం లేదంటూ ధ్వజమెత్తారు. అభివృద్ధి అనేది అందరి కోసం ఉండాలిగాని మతాధారంగా కాదంటూ వ్యాఖ్యానించారు. సీఎం ఎవరైనా మా కాళ్ల దగ్గర కూర్చోవాల్సిందే అంటూ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రగల్భాలు పలుకుతున్నారని మండి పడ్డారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే.. ఇలాంటి దుష్టశక్తుల పీచమణుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావ్ భౌతిక కాయాన్ని ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదని ఆరోపించారు. ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్ధిని గెలిపిస్తే.. సిమెంట్ ఫ్యాక్టరీని రీఓపెనింగ్ చేస్తాం.. పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ పత్తి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.. దీంతో దక్షిణ భారతం మొత్తానికి వస్త్రాలందించొచ్చని తెలిపారు. -
‘అధికారంలోకి వస్తాం.. అక్బరుద్దీన్ మెడలు వంచుతాం’
సాక్షి, మెదక్ : తెలంగాణలో 70 సీట్లు గెల్చి.. మెదక్‌లో అక్బరుద్దీన్ మెడలు వంచేది తమ పార్టీయే అని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళలు మోదీ దగ్గరకు వచ్చి ట్రిపుల్ తలాక్‌పై నిర్ణయం తీసుకోమని కోరారని తెలిపారు. అప్పుడు మోదీ తలాక్‌ను తీసి వేయించి.. ముస్లిం మహిళలు తల ఎత్తుకునేలా చేసి.. అక్బరుద్దీన్ ఓవైసీకి ఝలక్ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అక్బరుద్దీన్ ఓవైసీనీ హైదరాబాద్‌లో తల దించుకుని తిరిగే రోజులోస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదవారికి రూ. 5 లక్షల రూపాలయతో వైద్యం, రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. సింగూరు మెదక్ ప్రజల హక్కని కానీ.. దాదాపు 15 టీఎంసీల నీటిని ఆక్రమంగా తరలించుకుపోయారని పరిపూర్ణానందా ఆరోపించారు. ఈ నీటిని పూర్తిగా మెదక్ ప్రజల తాగు, సాగు నీటి అవసరాల కోసం అందిస్తామన్నారు. కుంభకర్ణుడు కూడా 6 నెలలే పడుకుంటాడు.. కానీ కేసీఆర్ మాత్రం ఎప్పటికి నిద్ర పోతూనే ఉంటాడని ఎద్దేవా చేశారు. రామయం పేటను డివిజన్ కేంద్రంగా మారుస్తామనే మాట మరిచిపోయారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ఇక్కడ పీజీ కాలేజీ, పాలిటెక్నికల్ కాలేజ్‌లు తీసుకోస్తామని పరిపూర్ణానందా హామీ ఇచ్చారు. ఆడపడుచుల కళ్లల్లో కన్నీరు చూడొద్దనే ఉద్దేశంతోనే.. ఉజ్వల పథకం ద్వారా మోదీ ఇంటింటికి గ్యాస్ పొయ్యి అందించారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత బీజేపీదని పరిపూర్ణానంద తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో 1,60,000 డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. మోదీ ఇచ్చే 800 రూపాయలకు, రూ. 200 కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిందని.. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చేది రూ. 200 రూపాయలే అంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మూసివేసిన ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు పది మంది పొట్టగొట్టే పార్టీలని ఆయన విమర్శించారు. -
హైదరా 'బాద్ షా' అక్బరుద్దీన్
ఆ నోటి వెంట ఒక ప్రవాహంలా వెలువడే మాటలు. అందుకు అనుగుణంగా గాంభీర్యం. హావభావాలు... సందర్భోచితంగా సామెతలు, ఉదాహరణలు... అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడు సభ దృష్టంతా ఆయనమీదే. ఘాటైన పదజాలంతో సూటిగా విమర్శలు ఎక్కుపెట్టగలరు. అంతే స్థాయిలో మాటల వివాదాల్లోకి వెళ్లగలరు. రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద అంశాలు అక్బరుద్దీన్ ప్రత్యేకత. వివాదాల్లో కూడా సందర్భోచితంగానే తలదూర్చుతారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్న తరుణంగా "రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరున్నా మాముందు తలవంచాల్సిందే... '' అంటూ కేడర్ ను రెచ్చగొచ్చగలరు. వివాదాస్పద కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే అక్బరుద్దీన్ ఓవైసీ... 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ తరపున చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో ఎంబీబీఎస్ రెండవ సంవత్సరంలోనే ఆపేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన సోదరుడు అసదుద్దీన్ ఓవైసీతో కలసి ఎంఐఎం పార్టీని నడిపిస్తున్నారు. డిసెంబర్ 22, 2012న అదిలాబాద్‌లో జరిగిన ఓ సభలో హిందూ దేవుళ్లు, దేవతల మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్సదమయ్యాయి. తమను పోలీసులు అడ్డుకోకుండా కేవలం 15 నిమిషాల సమయమిస్తే బిలియన్ హిందువులకు తమ పవర్ ఏంటో చూపిస్తానంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తర్వాత వాటిపైన కేసులను ఎదుర్కొనడం సాధారణంగా మారింది. ఒకానొక కేసులో సమన్లకు సమాధానం ఇవ్వడంలో అక్బరుద్దీన్ విఫలం కావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. 40 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. వివాదాస్పద వ్యాఖ్యలు పక్కనపెడితే... అసెంబ్లీలో చేసే వాడివేడి ప్రసంగాలతో అక్భర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి ఒక సందర్భంగా అక్బర్ చెప్పిన పిట్టకథ నవ్వులు పూయించడమే కాకుండా సోషల్ మీడియాలో ఇప్పటికీ చెక్కర్లుకొడుతోంది. ""దర్బారులో ఒక గాయకుడు తన పాటలతో నవాబును ఆనందింపజేస్తాడు. పాటను మెచ్చిన నవాబ్ వాహ్వా... అతడికి ముత్యాలు ఇవ్వండి. అన్నాడు. దాంతో ఆనందపడిన గాయకుడు మరో పాట పాడడంతో సంతోషపడిన నవాబు అతనికి ఈసారి మణులు మాణిక్యాలు ఇవ్వండి అని అంటాడు. ఆ గాయకుడు ఇంకా సంతోషంగా ఇంకో పాట పాడగా... వజ్ర వైడుర్యాలు... భూములు.... నగలు... నజరానాగా ఇవ్వండని చెబుతాడు. ఆ గాయకుడు చాల సంతోషపడి, ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పుకున్నాడు. అయితే ఎన్ని రోజులైనా నవాబు ప్రకటించిన బహుమతులు రాకపోవడంతో అతడు నవాబ్ దగ్గరకు వెళ్లి " జహాపనా ! మీరు ఇస్తామన్న ముత్యాలు, మణులు, మాణిక్యాలు, భూములు వగైరా ఏవీ కూడా నాకింతవరకు అందలేదని విన్నవించుకుంటాడు. అందుకు నవాబ్ ఇందులో ఇచ్చిపుచ్చుకోవడం ఏముంది. పాటలు పాడి మమ్మల్ని ఆనందింపజేశావు... అందుకు ప్రతిగా బహుమతులను ప్రకటించి నేను మిమ్మల్ని ఆనందింపజేశాను'' అని నవాబు నుంచి సమాధానం రావడంతో బిత్తరపోవడం గాయకుడు వంతవుతుంది. కేసీఆర్ ప్రకటించిన హామీల గురించి ప్రస్తావిస్తూ అక్బరుద్దీన్ చెప్పిన ఈ పిట్టకథ అప్పట్లో సభలో నవ్వులు పూయించింది. నేపథ్యం : జననం : జూన్ 14, 1970 పుట్టిన స్థలం : హైదరాబాద్ తల్లిదండ్రులు : సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ, నజీమా బేగం భార్య : సబీనా ఫర్జానా (1995 నుంచి) చదువు : పదవ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెయింట్ మేరీస్ కళాశాలలో ఇంటర్మీడియట్, గుల్బర్గాలో ఎమ్‌బీబిఎస్ రెండవ సంవత్సరంలో మానేశారు. వృత్తి : రాజకీయం, ఓవైసీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పార్టీ : ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తిహాద్ అల్ ముస్లిమిన్ కుటుంబీకులు : అసదుద్దీన్ ఓవైసీ (సోదరుడు), బుర్హనుద్దీన్ ఓవైసీ (సోదరుడు) ప్రస్తుత పదవి : ఎమ్మెల్యే పి. సృజన్ రావ్ -
ఏ సీఎం ఐనా నా చెప్పుచేతల్లోనే : అక్బర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏ సీఎం అయినా తన చెప్పుచేతల్లోనే ఉంటారని చాంద్రాయణగుట్ట ఎం ఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ వివాదస్పద వ్యాఖ్య లు చేశారు. అక్బరుద్దీన్ శుక్రవారం రాత్రి పాతబస్తీలోని రియాసత్‌నగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాజీ సీఎంలపై వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. మజ్లిస్ పార్టీ రాబోయే ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ అని అభివర్ణించుకున్నారు. ఏ పార్టీ సీఎం అయినా తమ ముందు వంగి సలాం కొట్టినవారేనని ఆరోపించారు. దివంగత సీఎం వైఎ స్సార్, ఏపీ సీఎం చంద్రబాబు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు, ప్రస్తుతం కేసీఆర్ అందరూ తమ మాటలను విన్నారనీ కాదు.. వినాల్సిందే అని అన్నారు. అందరినీ బ్యాలెన్స్ చేసే శక్తి తమ వద్ద ఉంద నీ, అది తమకు బాగా తెలుసన్నా రు. తాను కింగ్ మేకర్‌ననీ, ఎవరిని సింహాసనంపై కూర్చోబెట్టాలో ఎవరిని దించాలో తెలుసనీ ఆ సత్తా తమకు ఉందన్నారు. రాబోయే ప్రభుత్వం తమ ద్వారానే అధికారంలోకి వస్తుందని, డిసెంబర్ 11 ఎన్నికల తరువాత సీఎంను నిర్ణయించే క్రమంలో తమ పార్టీ కీలకంగా మారనుందన్నారు. రాజకీయం పిల్లల ఆట కాదనీ, అది నేర్చుకోవడానికి సమయం పడుతుందన్నారు. పాతబస్తీలో తమకు ప్రత్యామ్నాయం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం హిందువు, హిందూత్వం, హైందవ రాజ్యం దానిపైనే దృష్టి కేంద్రీకరించారని.. కానీ మజ్లిస్ పార్టీ మొత్తం భారతదేశాన్ని పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీల పేరు వాడుకొని రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు. అక్బర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మైనార్టీ నేతల ఆగ్రహం.. గతంలో కూడా అసదుద్దీన్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. కారు ఇటు రావద్దని, ఆ స్టీరింగ్ తన చేతిలో ఉందని ఎటు తిప్పాలో అటు తిప్పుతామని విమర్శించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలో అక్బర్ కాంగ్రెస్, టీడీపీలతోపాటు మిత్రపక్షమైన టీఆర్ఎస్ పైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో టీఆర్ఎస్కి చెందిన మైనార్టీ నేతలతో పాటు ఇతర నేతలు మజ్లిస్ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు అసెంబ్లీ ‘సాక్షి’గా అక్బరుద్దీన్ కేసీఆర్‌ను ముస్లింల ఆపద్బాంధవునిగా అభివర్ణించారని గుర్తు చేస్తున్నారు. -
ఎంఐఎంకు దీటైన పోటీ.. అక్బర్‌పై పహిల్వాన్ సై..!
సాక్షి, హైదరాబాద్ : పాతబస్తీలో మంచి పట్టున్న మజ్లిస్ పార్టీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఎంఐఎంను ఎదుర్కొనేందుకు ఎంబీటీ (మజ్లిస్ బచావో తెహ్రీక్) పార్టీని కాంగ్రెస్ రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఎంఐఎంకు గట్టి పోటీ ఇచ్చి.. ఓల్డ్ సిటీలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని ఏడు సీట్ల విషయమై భక్తచరణ్ దాస్ కమిటీతో కాంగ్రెస్ ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ స్థానాల్లో ఎంఐఎంకు పోటీగా కాంగ్రెస్, ఎంబీటీ ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇరుపార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. పొత్తులో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీపై మహమ్మద్ పహిల్వాన్ లేదా ఆయన కుటుంబసభ్యులను బరిలోకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహమ్మద్ పహిల్వాన్ కొడుకు గురువారమే భక్తచరణ్ దాస్ కమిటీని కలిసినట్టు తెలుస్తోంది. ఈ పొత్తులో భాగంగా ఓల్డ్‌సిటీ భారాన్ని ఎంబీటీ పార్టీకే వదిలేయాని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఫక్రుద్దీన్‌కు షాక్ కాంగ్రెస్ మైనారిటీ నేత ఫక్రుద్దీన్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. టీపీసీసీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఫక్రుద్దీన్‌ను తొలగించి.. ఆయన స్థానంలో షేక్ అబ్దుల్లా సోహైల్‌ను అధిష్టానం నియమించింది. -
అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
కుమారస్వామి సీఎం కాగా... మేం కాలేమా?
సాక్షి, హైదరాబాద్: ‘కుమారస్వామి సీఎం కాగా లేంది... మేం కాలేమా?’అని ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కన ఉన్న కర్ణాటకలో జేడీఎస్ పార్టీ నుంచి కుమారస్వామి సీఎం కాగా లేంది.. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థి సీఎం ఎందుకు కాలేరని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నట్లు స్పష్టం చేశారు. నవంబర్‌లో ఎన్నికలు.. డిసెంబర్లో తానే సీఎం అని కేసీఆర్ ప్రకటించడంపై ఆయన ఇలా స్పందించారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధి స్తుందని, డిసెంబర్లో ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ కీలకంగా మారనుందన్నారు. ఆ సమయంలో తమకు మద్దతుగా నిలిచిన వారితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. -
కేంద్ర నిధుల రాబడిలో భారీ లోటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే ఆదా యాన్ని అమాంతంగా పెంచి చూపారని, వాస్తవానికి వాటిలో సగం నిధులూ రావడం లేదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై ఆయన మాట్లాడారు. 2014–15 నుంచి 2017–18 వరకు కేంద్రం నుంచి రూ.75,535 కోట్లు వస్తా యని అంచనా వేయగా.. రూ.33,125 కోట్లే వచ్చాయని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. జనంపై ఏటేటా పన్నుల భారం పెరుగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలకు కేటాయింపులు పెంచుతూ.. విడుదల చేస్తున్న నిధులు తగ్గిస్తున్నార న్నారు. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే 72% నిధులు వస్తున్నాయని, బడ్జెట్లో నగరానికి పెద్దపీట వేయాలని కోరారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘డబుల్’ఇళ్ల హామీతోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంలు విజయం సాధించాయని.. సత్వరం ఆ ఇళ్లు పూర్తి చేయాలని కోరారు. మిగులుంటే ఖర్చు చేయడం లేదేం?: కిషన్‌రెడ్డి బడ్జెట్లో రూ.5,525 కోట్లను మిగులుగా చూపారని.. మిగులు ఉంటే ప్రతి నెలా చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతోందని బీజేపీపక్ష నేత జి.కిషన్‌రెడ్డి నిలదీశారు. ఫీజులు, స్కాలర్షిప్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, పరిశ్రమలకు రాయితీల బకా యిలు వంటివి సకాలంలో ఎందుకు చెల్లించడం లేదన్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీని నెరవేర్చడం లేదేమని ప్రశ్నించారు. ప్రభుత్వం నామమాత్రంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తోందని సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. -
ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవట్లేదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటివరకు వరకు కేటాయిం పులు, ఖర్చుల విషయంలో ఇదే పరిస్థితి ఉందన్నారు. బడ్జెట్ పై చర్చ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ చేసిన ప్రసంగంలోని అంశాలపై స్పష్టత కోరారు. మైనారిటీ సంక్షేమంలో భాగంగా షాదీముబారక్, విదేశీ చదువులు, వడ్డీ మాఫీ, ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, మక్కా మసీదు అభివృద్ధి, స్టడీ సర్కిళ్ల అభివృద్ధి తదితర అంశాలపై చేసిన ఖర్చు లెక్కలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ అధ్వానంగా ఉందని, పట్టించుకోవట్లేదని విమర్శించారు. 12వ తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును అమలు చేయడం బాగానే ఉన్నా.. ఇతర భాషలు చదివేవారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘మావో’ల సమస్య పెరుగుతోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య పెరుగుతోందని, దీని కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మావోయిస్టుల చర్యల మీద దృష్టి సారించాలన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. మావోయిస్టులు విస్తరిస్తే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఇటీవల తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సందర్భంలో మావోయిస్టుల ప్రాబల్యం దృష్ట్యా తమ వాహనాలను మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారని గుర్తుచేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌కు ఆర్థిక సాయం పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
రూ. 4,100 కోట్లు కేటాయించండి: అక్బర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి రూ.4,100 కోట్లు కేటాయిం చాలని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈ ఆర్థిక ఏడాది ముగిసే లోపు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలతో సమంగా మైనార్టీలకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం అభినందనీయమన్నారు. మైనార్టీలకు కేటాయించిన నిధుల విడుదల, వ్యయంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–15 నుంచి 2017–18 వరకు రూ. 4,613.85 కోట్లు కేటాయించగా రూ.2,330 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు. షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116 కు పెంచాలని ప్రతిపాదించారు. -
ముస్లింల దోస్త్ సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే అక్బర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముస్లింలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయనను ముస్లిం దోస్త్, ఉర్దూ దోస్త్‌గా వారు పరిగణిస్తారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో మైనారిటీల రిజర్వేషన్ అంశంపై స్వల్పకాలిక చర్చ నేపథ్యంలో ముస్లింలకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించిన అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయనకు ముఖ్యమంత్రి పోస్టు చాలా చిన్నదన్నారు. భవిష్యత్తులో ఎందరు ముఖ్యమంత్రులు మారినా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. పనిలోపనిగా నిజాం ఆభరణాలను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తెప్పించాలని, నిజాం వారసులు వాటి సంరక్షణ కోసం కింగ్‌కోఠి ప్యాలెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీనికి సీఎం స్పందిస్తూ, సమైక్య రాష్ట్రంలో నిజాం వారసులకు అవమానం జరిగిందన్నారు. నిజాం నగలను హైదరాబాద్‌కు శాశ్వతంగా రప్పించేలా గట్టిగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జెరూసలేం వెళ్లే భక్తులకూ చేయూత కాగా, హజ్ యాత్రికుల తరహాలో జెరూసలేం వెళ్లే భక్తులకు చేయూతనివ్వాలన్న టీఆర్ఎస్ సభ్యుడు బాబూమోహన్ వినతికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఖర్చులో కొంతమొత్తం ప్రభుత్వం భరించేలా, కుదిరితే ఈ క్రిస్మస్ నుంచే అమలుకు యత్నిస్తామని హామీ ఇచ్చారు. పాస్టర్లతో ట్రస్ట్ ఏర్పడితే వారి వేతనాల చెల్లింపు అంశాన్ని కూడా పరిశీలిస్తానని అన్నారు. -
మైనారిటీలకు రిజర్వేషన్లు ఇచ్చింది వైఎస్ఆర్
-
అక్బరుద్దీన్ ఆగ్రహం.. కాంగ్రెస్ వాకౌట్!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నడుస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని, సభ్యులు గొడవ చేస్తున్నా.. సభను నడపటం సరికాదని ఆయన అన్నారు. సభ్యులు ఆందోళన చేస్తూ.. గందరగోళం సృష్టిస్తున్న పట్టించుకోవడం లేదని, సభ ఆర్డర్లేని సమయంలో సభను వాయిదా వేయాలని, కానీ చూస్తూ ఊరుకోవడం సరికాదని ఆయన అన్నారు. ఇలాటి సభలో తాము ఉండమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని స్పీకర్ కాపాడాలని ఆయన కోరారు. బీజేపీని చూసి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. మరోవైపు రైతుల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. మద్దతు ధర అడిగితే చేతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్దేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్ స్పందిస్తూ పత్తిరైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. మద్దతు ధర కల్పించేందుకు రైతు సమన్వయ సమితులు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. గతంలో కంటే ఈసారి కచ్చితంగా పత్తికి మంచి ధర వస్తుందని ఆయన అన్నారు. -
సభ ఎన్నాళ్లు?: ఎమ్మెల్యే అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఈ సభ ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరికీ తెలియదు. 15రోజులా.. 20 రోజులా లేక 25 రోజులా? ఎన్నిరోజులో తెలియకుండానే సభ నిర్వహ ణేంటి? బిల్లులు ఎప్పుడు ప్రవేశపెడతారు?’’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ నిలదీశారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ఒక చిన్న ప్రశ్నకు అధికార పక్షం సుదీర్ఘంగా మాట్లాడుతూపోతే ప్రశ్నలు ఇచ్చిన తాము ఏం కావాలని ప్రశ్నించారు. సభలో ప్రతిపక్షాలకు ఒక రూలు, అధికార పక్షానికి మరో రూలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రభుత్వ వ్యూహమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సభ నిర్వహణపై బీఏసీని పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు సమ్మతించిన సభాపతి బీఏసీని పిలుస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని రోజులైనా చర్చకు సిద్ధం: ఈటల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ సభలో ఎన్ని రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమైన ప్రశ్నలుండగా సమయం మించిపోతే ‘డీమ్డ్ టు బీ ఆన్సర్డ్’అంటూ వదిలేయడం తగదని, వాటిని వాయిదా వేసి తర్వాత అవకాశం కల్పించాలన్నారు. మేడారం జాతరను కుంభమేళ తరహాలో కేంద్రం జాతీయ పండుగగా గుర్తించేలా సిఫార్సు చేయాలంటూ పలువురు సభ్యులు చేసిన సూచనపై ఈటల స్పందిస్తూ మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. గిరిజన దేవాలయాలకు పూజారులుగా పనిచేసే వారికి వేతనాలు ఇవ్వాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి కోరగా ఈ అంశం సీఎం దృష్టిలో ఉందన్నారు. -
నిత్యావసరాల ధరలు తగ్గించండి: అక్బర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. గత నెలలో కూరగాయల ధరలతో పోలిస్తే ఈ నెల ధరలు రెట్టింపయ్యాయన్నారు. సామాన్య, మధ్య తరగతిపై నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోందన్నారు. ధరల పెరుగుతున్నా పౌర సరఫరాల శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి ఈటల రాజేందర్ ప్రతిస్పందిస్తూ, ధరల తగ్గింపు చర్యలు తీసుకుంటామన్నారు. సర్దార్ పటేల్ జయంతి నిర్వహణకు అడ్డుపడిందెవరు? ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని దేశమంతా జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. నిజాం నియంతృత్వ పాలన నుంచి విముక్తి కల్పించిన పటేల్‌ను ఎందుకు విస్మరించారు. పటేల్‌కు నివాళులు అర్పించడంలో ప్రభుత్వానికి అడ్డుపడుతున్న అదృశ్య శక్తి ఎవరు?. ఆ శక్తి కారణంగానే పటేల్ జయంతిని ప్రభుత్వం జరపలేదు.’ – జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పక్ష నేత నారాయణ, శ్రీచైతన్య ఆత్మహత్యలపై చర్యలు తీసుకోండి ‘నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా ఫీజులు పెంచడంతో భారం భరించలేక చనిపోతున్నారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి.’ – ఆర్. కృష్ణయ్య, టీడీపీ సఫాయి కార్మికులకు వేతనాలివ్వాలి ‘గ్రామాల్లో పని చేస్తున్న సఫాయి కార్మికులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి. అత్యంత దుర్భర పరిస్థితుల్లో పనిచేస్తున్న వారికి భరోసానిచ్చే చర్యలు చేపట్టాలి’. – రసమయి బాలకిషన్, టీఆర్ఎస్ ఉస్మానియా క్యాంపుల్లో సమస్యలు పరిష్కరించండి ‘ఉస్మానియా యూనివర్సిటీపరిధిలోని క్యాంపుల్లో మొహర్రం, దీపావళి, దసరా పండగ సమయాల్లో విద్యుత్ నిలిపివేశారు. ఇతర అనేక సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలి.’ –ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ -
జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు
-
'జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో మంగళవారం ఉదయం కాంగ్రెస్ వాయిదా తీర్మానంపై చర్చించాలని జానారెడ్డి చేసిన డిమాండ్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు.. సీనియర్ సభ్యుడైన జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఓవైసీ పేర్కొన్నారు. జానారెడ్డి వాకౌట్ చేస్తే మిగతా కాంగ్రెస్ సభ్యులు సభలో ఉంటున్నారని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. కాంగ్రెస్, టీడీపీ హయాంలో కొశ్చన్ అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలను ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రులు చెప్పిన విషయాన్ని ఓవైసీ గుర్తు చేశారు. వాయిదా తీర్మానాలు పెట్టేందుకు ఓ పద్ధతి ఉంటుందన్నారు. వాయిదా తీర్మానాలపై కాంగ్రెస్, బీజేపీ వైఖరి సరికాదన్నారు. ఈ మూడున్నరేండ్లలో ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని కాంగ్రెస్ ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా డిమాండ్ చేయడమేంటని ఓవైసీ ప్రశ్నించారు. -
బీజేపీతో కలసి పనిచేయం: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో కలసి పనిచేయాల్సిన అవస రం తమకు లేదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో రేవంత్ సోమవారం భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ టీఆర్ఎస్, కేసీఆర్ పాలనను పొగుడుతున్నారన్నారు. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన బీజేపీకి చెందిన బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ కేసీఆర్‌ను పొగిడారని గుర్తుచేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతల స్పందన ఏంటని ప్రశ్నించారు. అలాంటి బీజేపీతో పనిచేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలపై అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తానన్నారు. -
‘అక్బరుద్దీన్’ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనçసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యా యత్నం కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్ సహా 10 మందిని నిర్ధోషులుగా ప్రకటిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇటీవల వెలువరించిన తీర్పును హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. అదే విధంగా ఈ కేసులో హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లను దోషులుగా నిర్ధారించి సెషన్స్ కోర్టు విధించిన శిక్షను సైతం పెంచాలని హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ పిటిషన్లు ప్రభుత్వం దాఖలు చేసింది. ఈ కేసు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై న్యాయపరమైన అంశాలన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ పిటిషన్లు దాఖలు చేసింది. -
అక్బరుద్దీన్ కేసులో అప్పీళ్లకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ బిన్ ఒమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్‌తో సహా 10 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే దోషులుగా ప్రకటించిన హసన్, అబ్దుల్లా, వాహిద్, వహ్లాన్‌లకు కింది కోర్టు తక్కువ శిక్ష విధించిందని, శిక్ష పెంపు కోసం కూడా అప్పీల్ దాఖలు చేయనుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి సలహా మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. హైకోర్టులో ఈ అప్పీళ్లు దాఖలు చేసేందుకు సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. -
తిరిగి రండి...కలసి పనిచేద్దాం!
కుర్చీ అప్పగించేందుకు సిద్ధం.. పార్టీ వీడిన వారికి ఒవైసీ పిలుపు సాక్షి, హైదరాబాద్: పాత తప్పిదాలను మరచి కలసి పనిచేద్దామని.. పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. తానంటే గిట్టకుంటే వారికి కుర్చీ అప్పగించి సేవ చేసేందుకు సిద్ధమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం రాత్రి పాతబస్తీలోని ఖిల్వత్ మైదానంలో జరిగిన మజ్లిస్ పార్టీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ముస్లింల ఐక్యతే తమ లక్ష్యమని దీనికి వారంతా కలసి రావాలని పిలుపునిచ్చారు. హిందుత్వ శక్తులు ముస్లిం ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ముస్లిం మనోభావాలను దెబ్బతీసేవిధంగా చట్టాలు రూపొందుతున్నాయన్నారు. ముస్లింలంతా ఏకమైతే 50 పార్లమెంట్ స్థానాల్లో విజయం తప్పదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారని అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ సభలో ఎమ్మెల్సీలు రజ్వీ, జాఫ్రీ, ఎమ్మెల్యేలు మౌజమ్ ఖాన్, ముంతాజ్ ఖాన్, అహ్మద్ బలాల, కౌసర్ మొహియిద్దీన్, జాఫర్ హుస్సేన్, అహ్మద్ పాషా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు. -
అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో తుదితీర్పు
హైదరాబాద్ : మజ్లిస్ పార్టీ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం కేసులో కోర్టు గురువారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నలుగురిని (సలీం బిన్, అబ్దుల్లా, అవద్, హసన్ బిన్) నాంపల్లిలోని 7వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. వీరికి న్యాయస్థానం శుక్రవారం శిక్షలు ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పహిల్వాన్‌పై న్యాయస్థానం కేసు కొట్టివేసింది. పహిల్వాన్ సహా పదిమంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. 2011 ఏప్రిల్ 30న చాంద్రాయణగుట్ట కేశవగిరిలోని బార్కస్-బాలాపూర్ రోడ్డులో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌కు తీవ్రగాయాలు కాగా... ఆయన గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో ఇబ్రాహిం అనే యువకుడు మరణించాడు. ఈ కేసులో 13మంది నిందుతులపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 19మంది సాక్షులను విచారించింది నాంపల్లి కోర్టు. అక్బరుద్దీన్ స్టేట్ మెంట్‌ను కూడా రికార్డు చేశారు. ఆరేళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఇవాళ తుది తీర్పు నేపథ్యంలో... అటు పహిల్వాన్ గ్యాంగ్, ఇటు ఎంఐఎం పార్టీ కార్యకర్తలు కోర్టుకు వచ్చారు. దీంతో పోలీసులు పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ముందస్తుగా భద్రతను కట్టుదిట్టం చేశారు. -
హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా: అక్బర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో డ్రగ్ మాఫియా పెరిగిపోయిందని, యువత పక్కదారి పడుతున్నారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తంచేశారు. పబ్‌లలో డ్రగ్ క్యాప్సిల్స్, ఇంజెక్షన్లు విచ్చలవిడిగా ఉపయోగి స్తున్నారని, దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరారు. కాగ్ రిపోర్టులను ద్రవ్య వినిమియ బిల్లు రోజే ఇవ్వడం వల్ల దాన్ని అధ్యయనం చేయడానికి సమయం ఉండటం లేదని తెలిపారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమల్లోకి తెచ్చేలా ఇప్పుడే చర్యలు చేపట్టాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య పేర్కొ న్నారు. బెల్ట్ షాపులతో లిక్కర్‌ను ఎక్కుగా ప్రోత్సహించడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. కల్లును ప్రోత్సహించాలని కోరారు. -
అసీమానంద బెయిల్‌ను రద్దు చేయించాలి: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల నిందితుడు స్వామి అసీమానందకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం శాసనసభ జీరోఅవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మక్కా మసీదు పేలుళ్ల ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అసీమానందను దోషిగా తేల్చిం దని గుర్తు చేశారు. ఈ కేసులో న్యాయ విచారణ చేసిన భాస్కర్‌రావు కమిషన్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మక్కా మసీదు అల్లర్లలో కొందరు ముస్లిం ల మరణానికి కారణమైన అధికారే చిత్తూరు ఎస్పీగా ఉండి ఎన్కౌంటర్లకు పాల్పడ్డా రని, ఆయనపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి స్పందిస్తూ, అసిమానంద బెయిల్ రద్దు చేసేలా చర్య లు తీసుకుంటామన్నారు. అమలుకు నోచుకోని హామీలు: సంపత్‌కుమార్, కాంగ్రెస్ జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తన నియోజ కవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొన్ని కీలక హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదన్నారు. జోగుళాంబ గుడికి మరమ్మతులు, తుమ్మిళ్ల ఎత్తి పోతల, ఫైర్ స్టేషన్ ఏర్పాటుపై ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదన్నారు. -
అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్.
-
చేపలు, కోతులకు ఇచ్చిన ప్రాధాన్యం వారికి ఇవ్వరా?
హైదరాబాద్: సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఎమ్ఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఈ విషయంపై స్పీకర్‌ను కలిసి తమ నిరసన తెలిపినట్లు ఆయన వెల్లడించారు. 'అర్హత ఉన్న లక్షలాది మందికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం లేదు, బకాయిలు చెల్లించడం లేదు' అని అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జరిగిన చర్చపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. చేపలు, కోతులకు ఇచ్చిన ప్రాధాన్యం విద్యార్థుల సమస్యలకు ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు. -
రోడ్లు కావవి.. నరక కూపాలు!
హైదరాబాద్ నగర రోడ్లపై అసెంబ్లీలో బీజేపీ మండిపాటు - అవినీతి పెచ్చరిల్లుతోందని ఆరోపణ - రాత్రికి రాత్రే విశ్వనగరంగా మారదన్న మంత్రి కేటీఆర్ - వచ్చే ఏడాదికి 5,400 పాఠశాలల్లో డిజిట్ పాఠాలు: కడియం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర రోడ్లన్నీ నరక కూపాలుగా మారాయని, వీటి పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వ ప్రణాళికలన్నీ పనికి రాకుండా పోయాయని ప్రభుత్వాన్ని బీజేపీ ఆరోపించింది. నగరం నిండా చెత్త పేరుకుపోయిందని, వాటికి పరిష్కారం చూపకుండా విశ్వ నగరం చేస్తామంటే నమ్మశక్యంగా లేదని విమర్శించింది. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ పక్ష నేత జి.కిషన్‌రెడ్డి, సభ్యులు కె.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. నగరంలో కాల్వలు పూడుకుపోయాయని, వాటి పూడిక తీయకపోవడంతో కొద్దిపాటి వర్షాలకే నగరం మునిగిపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఎక్కడా టాయిలెట్లు పని చేయడం లేదని, స్వయంగా మంత్రి వెళ్లి పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి పేరుకుపోయిందని, భవనాలకు అడ్డగోలుగా అనుమతులిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం చెప్పిన వంద రోజుల ప్రణాళిక ఏమైందో చెప్పాలని నిలదీశారు. ఒక్క రాత్రిలో విశ్వనగరం కాదు: మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర రోడ్ల అభివృద్ధికి గతంలో కంటే ఎక్కువగానే ఖర్చు చేశామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘2014–15 ముందు వరకు నగర రోడ్లపై ఏటా రూ.250 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. కానీ తెలంగాణ ఏర్పాటు అనంతరం 2014–15లో రూ.451 కోట్లు, 15–16లో రూ.455 కోట్లు ఖర్చు చేశాం. నగరంలో సీవరేజీ వ్యవస్థ మెరుగ్గా లేనందున రోడ్లపై నీటి నిల్వ చేరుతోంది. నాలాల ఆక్రమణలు కూడా మరో కారణం. వీటిని దృష్టిలో పెట్టుకొని వైట్ ట్యాపింగ్ రోడ్లు వేస్తున్నాం. ఐటీ కారిడార్‌లో రూ.200 కోట్లతో వైట్ ట్యాపింగ్ రోడ్లకు టెండర్లు పిలిచాం. విశ్వనగరాలు ఒక్క రాత్రిలో ఏర్పడవు. సమస్యలను పరిష్కరించుకుంటూ కొత్త మార్గంలో ముందుకెళ్తున్నాం. అక్రమ భవనాల కట్టడికి బిల్డింగ్ ట్రిబ్యునల్ బిల్లు తెస్తున్నాం’ అని వివరించారు. ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఆగ్రహం.. ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఎంత కోరినా స్పీకర్ మధుసూదనాచారి అంగీకరించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అక్బరుద్దీన్ ‘మీ ఇష్టారీతిన సభను నడుపుకోండి’ అని ఆవేశంగా అన్నారు. అక్బరుద్దీన్‌కు మద్దతుగా బీజేపీ సభ్యులు లేవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ స్పందిస్తూ ‘ఒక్క ప్రశ్నతోనే సభను నడిపిద్దామంటే అలానే చేద్దాం’ అన్నారు. అయినా వెనక్కి తగ్గని అక్బరుద్దీన్ మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండంటూ కూర్చున్నారు. నగర వ్యవస్థపై లఘుచర్చకు అనుమతిస్తామని చెప్పడంతో అంతా శాంతించారు. ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు ‘రాష్ట్రంలో ఈ ఏడాది 3,472 ఉన్నత, మోడల్ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు ఆరంభించాం. వచ్చే ఏడాది నుంచి 5,400 ఉన్నత పాఠశాలల్లోనూ ఆరంభిస్తాం. ఇప్పటికే అవసరమైన సామగ్రిని సరఫరా చేశాం’ అని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. సభ్యులు గాదరి కిశోర్, సండ్ర వెంకట వీరయ్య, అక్బరుద్దీన్ అడిగిన ప్రశ్నలకు కడియం సమాధానమిచ్చారు. పాఠశాలల్లో మెరుగైన బోధనకు ఇప్పటికే 9 వేల మంది విద్యా వలంటీర్లను నియమించామని, జిల్లాల విభజన నేపథ్యంలో డీఎస్సీ ప్రకటన ఆలస్యమైందని, త్వరలోనే డీఎస్సీ నిర్వహించి పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. బలవంతపు భూసేకరణ ఫార్మా సిటీ పేరిట ప్రభుత్వం రైతుల నుంచి బల వం తంగా భూసేకరణ చేస్తోం దని కాంగ్రెస్ సభ్యుడు వం శీచంద్రెడ్డి విమర్శించారు. పట్టా, అసైన్డ్ భూ ములకు ఒకే ధర చెల్లించాల్సి ఉన్నా అలా చేయడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం భక్షక పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు. ఫార్మా సిటీతో 3 లక్షల ఉద్యోగాలు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి మచ్చర్లలో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీతో 3 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉగ్యోగ అవకాశాలు దక్కుతాయని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 5,646 ఎకరాల మేర భూసేకరణ చేశామని, మరింత చేయాల్సి ఉందని తెలిపారు. రైతులు ముందుకొచ్చిన చోట జీవో 123 మేరకు, కోరితే 2013 చట్టం మేరకు భూసేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు. సేకరణ ప్రాథమిక దశలో ఉండగానే 8,500 ఎకరాలకు పలు సంస్థల నుంచి డిమాండ్లు వచ్చాయని వివరించారు. 2018 చివరికల్లా మొదటి దశ ఆరంభిస్తామని సభ్యులు వంశీచంద్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. -
ఢిల్లీ తరహా కాలుష్యం.. జర భద్రం!
హైదరాబాద్ పరిస్థితిపై అక్బరుద్దీన్ హెచ్చరిక - కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామన్న కేటీఆర్ - 1,545 పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలించనున్నామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో కాలుష్య ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా మేల్కొనకపోతే న్యూఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. ప్రస్తుతం హైదరాబాద్ కాలు ష్యంలో ఆసియా ఖండంలోనే 24వ స్థానంలో ఉందని.. అందువల్ల త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో హైదరాబాద్ కాలుష్యంపై అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో ప్రతిరోజూ కొత్తగా 6వేల వాహనాలు రోడ్డుపైకి వస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో వాహనాల సరాసరి వేగం గంటకు 60 కిలోమీటర్ల దాకా ఉండగా.. హైదరాబాద్‌లో మాత్రం కేవలం 20 కిలో మీటర్లే ఉంది. దీంతో కాలుష్యం 2 నుంచి 8 శాతం పెరుగుతోంది. నగరం మధ్యలో ఉన్న పరిశ్రమలతోనూ కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరం ఆస్తమా కేసుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. వెంటనే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ ప్రజాప్రతినిధులతో దీనిపై సమావేశం ఏర్పాటు చేయాలి..’’ అని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ హైదరాబాద్‌లో పెరుగుతున్న కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆగ్రా, ఔరంగాబాద్, ఢిల్లీ వంటి నగరాలకన్నా హైదరాబాద్ మెరుగ్గానే ఉన్నా.. కాలుష్యం నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,545 పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్డు అవతలికి తరలించేలా చర్యలు తీసుకుం టున్నామని తెలిపారు. డీఎస్సీ నిర్వహించేదెప్పుడు?: అరుణ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల ప్రవేశాలు తగ్గుతున్నాయని, డీఎస్సీ ఎప్పుడు నిర్వహి స్తారని కాంగ్రెస్ సభ్యురాలు డీకే అరుణ ప్రశ్నిం చారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిస్తూ.. ఈఏడాది 4,872 పాఠశా లల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడం ద్వారా గతేడాదితో పోలిస్తే 12,012 మంది విద్యార్థులు పెరిగారన్నారు. త్వరలో 100 మినీ ఏసీ బస్సులు ఇంటి వద్దకే సర్వీసు అనే ఉద్దేశంతో రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల మధ్య సర్వీసులు నడిపేందుకు 21 సీట్ల సామర్థ్యం గల 100 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోం దని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. వీటిని మొదటగా హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామాబాద్ రూట్లలో ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. పంచాయతీలకు రాష్ట్ర నిధులేవీ?: కిషన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం 13, 14వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందిస్తున్న నిధులే తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా వాటికి ఇవ్వడం లేదని బీజేపీపక్ష నేత కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్ల అధికారాలు, పంచా య తీలకు నిధుల విడుదలపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన నిలదీశారు. ‘సర్పంచ్‌లకు బాధ్యతలే తప్ప నిధుల్లేవు. గ్రామజ్యోతి, మన ఊరు–మన ప్రణాళిక పేరుతో కార్యక్రమాలు మొదలుపెట్టినా వాటి ప్రణాళికే కనబడడం లేదు. ఆర్థిక సంఘం నిధులను సర్పంచ్ల నుంచి బలవంతంగా లాక్కొని విద్యుత్, నీటి బిల్లులు కట్టించుకుంటున్నారు. కేవలం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారు..’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఇదే నిజమైతే సభ నుంచి నిష్క్రమిస్తా: ఈటల కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ.. గ్రామాభివృధ్ధి విషయంలో కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులను వేరు చేసి చూడాల్సిన అవసరం లేదని సూచించారు. గతంలో గ్రామాలకు రూ.10 లక్షలు ఇస్తే గొప్పగా ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఇస్తోందని చెప్పారు. అధికార పార్టీ, విపక్ష పార్టీ అనే తేడా లేకుండా ప్రజాప్రతినిధులందరినీ సమదృష్టితో చూస్తున్నామన్నారు. అధికార పార్టీ నేతలకే నిధులి చ్చామని నిరూపిస్తే సభ నుంచి నిష్క్రమిస్తానని ఈటల సవాలు చేశారు. ఇక సర్పంచ్ల అధికారాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోవడం లేదని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిల్లో 30 శాతమైనా కట్టాలని మాత్రమే కోరామన్నారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని కిషన్‌రెడ్డి నిరసన తెలిపారు. -
బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నారా?
• ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అక్బరుద్దీన్ మండిపాటు • కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గుడ్డిగా సమర్థించొద్దని హితవు • రాజకీయ పార్టీల విరాళాలు ఆపేయాలని కేంద్రానికి సూచన సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీజేపీకి వకాల్తా పుచ్చుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కేంద్రాన్ని గుడ్డిగా సమర్థించొద్దని.. రాష్ట్రానికి అపార నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ‘మీరు రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలను మెచ్చుకుంటున్నాం.. మీకు అండగా ఉంటున్నాం.. మీరేమో బీజేపీకి అండగా నిలబడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుపై అసెంబ్లీలో చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నల్లధనం, ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు తీసుకునే చర్యలను వ్యతిరేకించే వారెవరూ ఉండబోరన్నారు. దేశంలో బీజేపీ ఏది చెబితే అది జాతీయవాదం.. బీజేపీని వ్యతిరేకిస్తే దేశ ద్రోహం అన్న ధోరణి కొనసాగుతోందని విమర్శిం చారు. కుప్పకూలుతున్న బ్యాంకింగ్ వ్యవస్థను, కొన్ని కార్పొరేట్ శక్తులను కాపాడేందుకు కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని, ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. నల్లధనం రూపు మాపేందుకు చేపట్టిన చర్యగా ప్రభుత్వం చెబుతున్న లక్ష్యం పక్కదారి పట్టిందని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దేశంలో ఇప్పటికే రూ.17.70 లక్షల కోట్ల నగదు బ్యాంకులకు చేరిందని, ప్రభుత్వం అంచనాకు మించినంత డబ్బు బ్యాంకుల్లో జమ అవుతుందని, ఇక నల్లధనం మిగిలిందెక్కడ అని ప్రశ్నించారు. చేతనైతే రాజకీయ పార్టీలు వసూలు చేసే విరాళాలను ఆపేయాలని కేంద్రానికి సూచిం చారు. 2005 నుంచి 2015 వరకు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కలసి రూ.5,450 కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు డెమోక్రటిక్ రిఫారŠమ్స్ ఆఫ్ ఇండియా ప్రస్తావించిన లెక్కలను ఉటంకించారు. రాజకీయ పార్టీల వసూళ్లు అవినీతి కిందకు రాదా అని ప్రశ్నిం చారు. రాజకీయ పార్టీల వసూళ్లకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అసెంబ్లీకి సూచించారు. తెలంగాణలో 9వేల గ్రామాలు ఏటీఎంలకు దూరంగా ఉన్నాయని, బ్యాంకులు, 4 వేలకు పైగా తపాలా కార్యాలయాలు లేని గ్రామాలు ఉన్నాయని చెప్పారు. నగదు రహిత లావాదేవీలు ఎంతవరకు సురక్షితమో సమీక్షించు కోవాల్సిన అవసరముందని, సైబర్ నేరాల నియం త్రణకు ఒక చట్టం కూడా ఇప్పటివరకు లేదని పేర్కొన్నారు. నోట్ల రద్దుతో హైదరాబాద్ తీవ్రంగా నష్టపోయిందని, నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహితంగా చేసేందుకు 4 వేలకు పైగా స్వైపింగ్ మెషీన్లు, 22 వేల మంది బ్యాంకు ఉద్యోగులు కావా లని ఇటీవలే మంత్రి హరీశ్‌రావు ఓ ఇంటర్వూ్యలో పేర్కొన్నారని, ఆ లెక్కన రాష్ట్రమంతటా దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించటం సాధ్యమవు తుందా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. -
'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్'
-
'ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయ్'
హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే ముందుగా ఎన్నికల ఖర్చును తగ్గించుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాయని, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దుతో టెర్రరిజం అదుపులోకి వస్తుందని చెప్పారని అయితే అలాంటిదేమీ జరగలేదని ఆక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 'ఇప్పటికే బ్యాంకుల్లో 13 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఆయా బ్యాంకుల వద్ద రూ. 4 లక్షల కోట్ల పైచిలుకు కరెన్సీ ఉంది. రూ. 17 లక్షల కోట్లు లెక్క తేలాక ఇక బ్లాక్ మనీ ఎక్కడుంది' అని ఆయన ప్రశ్నించారు. -
కాల్చారు.. పొడిచారు: అక్బరుద్దీన్
- కోర్టులో వాంగ్మూలం - దాడిలో ఎడమ చేయి పూర్తిగా దెబ్బతింది - అందుకే పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయా - ఇప్పటికీ తొడభాగంలో ఓ బుల్లెట్ ఉంది సాక్షి, హైదరాబాద్: బార్కాస్ ప్రాంతంలో 2011 ఏప్రిల్ 30న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా పహిల్వాన్ గ్యాంగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి తుపాకులతో కాల్చారని, కత్తులతో పొడిచారని నాంప ల్లి కోర్టుకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నివేదించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయానన్నారు. ఇప్పటికీ తొడలో ఓ బుల్లెట్ ఉందన్నారు. అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నాంపల్లి ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కళ్యాణ చక్రవర్తి మంగళవారం ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టు రోజువారీ పద్ధతిలో కేసును విచారిస్తోంది. యాక్టివాను అడ్డుగా పడేసి దాడి చేశారు ‘‘30న బంజారాహిల్స్ నుంచి ఉదయం 8.15 గంటలకు డ్రైవర్ హబీబ్ ఉస్మాన్ (నాలుగవ సాక్షి)తో కలసి జిప్సీ వాహనంలో బార్కస్‌కు బయలుదేరా. బడాబజార్‌లో ఎమ్మెల్యే అహ్మద్బిన్ అబ్దుల్లా బలాలా నాతో కలిశారు. పలు ప్రాంతాల్లో పర్యటించాక బార్కాస్‌లోని ఎంఐఎం కార్యాలయంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. 11 గంటలకు దారుస్సలాంలోని కార్యాలయానికి బయలుదేరగా ఆ సమయంలో నా వాహనం ముందు యాక్టివాను పడేయడంతో వాహనాన్ని నిలిపేశాం. యాక్టివా మీద వచ్చిన హసన్ యాఫై అనే వ్యక్తి కత్తితో నా ఎడమ చేయితోపాటు అనేక ప్రాంతాల్లో పొడిచాడు. తర్వాత అబ్దుల్లాబిన్ యూనుస్ యాఫై తుపాకీతో కాల్పులు జరిపాడు. పహిల్వాన్ బంధువు, పహిల్వాన్ కూడా రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమం లో ఈసాబిన్ యూనస్ యాఫై, మరో ఐదుగురు నా చుట్టూ చేరి కత్తులతో పొడిచారు. అవద్‌బిన్ యూనస్ యాఫై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడటంతో పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయా’’ అని కోర్టుకు అక్బరుద్దీన్ వివరించారు. కాగా, బుధవారం కూడా అక్బరుద్దీన్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది. భారీ బందోబస్తు కోర్టుకు అక్బరుద్దీన్ హాజరవుతున్న నేపథ్యంలో.. ఎంఐఎం కార్యకర్తలు, పహిల్వాన్ అనుచరులూ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున నాంపల్లి కోర్టు ఆవరణలో టాస్క్‌ఫోర్స్, సివిల్, గ్రేహౌండ్స్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. మొదట మీడియా ప్రతినిధులు సహా ఎవ్వరినీ కోర్టు హాల్లోకి అనుమతించకపోయినా తర్వాత మీడియాను అనుమతించారు. -
అక్బరుద్దీన్‌పై కేసుల్లో దర్యాప్తు పూర్తి చేశాం
హైకోర్టుకు పోలీసుల నివేదన సాక్షి, హైదరాబాద్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఎంఐఎం పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై నిజామాబాద్, నిర్మల్‌ల్లో నమోదయిన కేసుల్లో సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిని రికార్డ్ చేసుకున్న హైకోర్టు ఈ వ్యాజ్యంపై ఇక తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అక్బరుద్దీన్‌పై నమోదు చేసిన కేసులో ఎటువంటి పురోగతి లేదని, పోలీసులు దర్యాప్తును పక్కన పెట్టేశారని ఆరోపిస్తూ నగరానికి చెందిన సయ్యద్ తరాక్ ఖాద్రీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా హోంశాఖ తరఫు న్యాయవాది పి.వేణుగోపాల్ స్పందిస్తూ, అక్బరుద్దీన్ కేసుల్లో సత్వరమే దర్యాప్తును పూర్తి చేసి సంబంధిత కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేశామని కోర్టుకు నివేదించారు. -
పోలీసులా.. సంఘ్ శక్తులా?
హెచ్‌సీయూలో విద్యార్థులను చితకబాదింది ఎవరు?: అక్బరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: ‘వీసీ అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ ఈనెల 22న హెచ్‌సీయూలో విద్యార్థులు నిర్వహించిన నిరసనపై పోలీసుల దుశ్చర్యలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. విద్యార్థులను అరెస్టు చేసిన తీరు గర్హనీయం. విద్యార్థులు, అధ్యాపక సిబ్బందిని అరెస్టు చేసి చితకబాదింది అసలు పోలీసులా? వర్సిటీ భద్రతా సిబ్బందా? లేక ఖాకీ దుస్తులు వేసుకున్న సంఘ్ పరివార్ శక్తులా? విద్యార్థినులపై పోలీసుల లైంగిక హింస, రేప్ బెదిరింపులపై విచారణ జరపాలి’ అని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై శనివారం హోంమంత్రి నాయిని ప్రకటన తర్వాత జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులను కొట్టి, లైంగికంగా వేధించిన పోలీసులు వారిని జుట్టుపట్టి లాగి వాహనాల్లో ఎక్కించా రు.విద్యార్థులను వ్యాన్లలో తోసేసి తీవ్రంగా కొ డుతూ పోలీసు స్టేషన్లకు తిప్పారు. అఖిలపక్ష నేతలతో చర్లపల్లి జైలుకు వెళ్లి విద్యార్థులను కలిస్తే నేను చెప్పేది వాస్తవమా కాదా? అన్నది తెలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం ఇదేనా? వీసీ కార్యాలయం నుంచి బయటకు లాగిన పోలీసులు తనను వ్యభిచారిణిలాగా వ్యవహరించవద్దనే అర్థంలో బూతులు తిట్టారని, రేప్ చేస్తామని బెదిరించారని అక్షిత అనే విద్యార్థిని అమ్నెస్టీకి తెలియజేసినట్లు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. భరతమాతకు, ఆడబిడ్డలకు, దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో తీవ్రగాయాల పాలైన విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మాదిగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉదయ్‌భాను చెవిలో రక్తం గడ్డ కట్టిందన్నారు. వర్సిటీలో ఆహారం, నీళ్లు, విద్యుత్, నిత్యావసరాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలోకి మీడియాకు అనుమతి ఉన్నా హెచ్‌సీయూలో ఎందుకు లేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పట్ల సీఎం చిత్తశుద్ధిపై తమకు విశ్వాసం ఉందంటూనే.. పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌సీయూలో ఉద్రిక్తతలకు కారణమైన వీసీ అప్పారావును అరెస్ట్ చేయాలన్నారు. హెచ్‌సీయూపై కేంద్రం, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుని చెడ్డపేరు తేవడానికి యత్నిస్తు న్నాయని, వారి కుట్రలకు చిక్కవద్దని సీఎంకు సూచించారు. కన్హయ్య హైదరాబాద్ వచ్చేం దుకు అనుమతించినందుకు ప్రభుత్వా న్ని అభినందిస్తున్నానన్నారు. వీసీని రీకాల్ చేయాలని తీర్మానించి కేంద్రానికి పంపాలన్నారు. -
విపక్షాల ఆందోళనతో దద్దరిల్లిన సభ
♦ ఓయూ, హెచ్‌సీయూ ఘటనలపై విపక్షాల ఫైర్ ♦ చర్చకు పట్టుబట్టి పోడియం వద్దకు దూసుకొచ్చిన కాంగ్రెస్, ఎంఐఎం ♦ నిరాకరించిన ప్రభుత్వం.. ఆందోళనకు దిగిన విపక్షాలు ♦ రెండు గంటల్లో మూడుసార్లు వాయిదా పడ్డ సభ ♦ మీకు కావాల్సింది చర్చా.. రచ్చా..?: మంత్రి హరీశ్ ఆగ్రహం ♦ వాయిదా తీర్మానం అనుమతించకపోవడం దళితులకు అన్యాయం, అవమానం: అక్బర్ ♦ ప్రభుత్వం బీజేపీకి ఆయుధంగా మారిందంటూ విమర్శలు ♦ అక్బర్ మాటలను తప్పుబట్టిన సీఎం కేసీఆర్ ♦ ఏది మాట్లాడితే అది ఒప్పుకోబోమని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ, ఉస్మానియా యూనివ ర్సిటీల్లో పరిణామాలపై అసెంబ్లీ అట్టుడికింది. కాంగ్రెస్, ఎంఐఎం ఆందోళనల తో దద్దరిల్లింది. యూనివర్సిటీల్లో ఘటనలపై చర్చకు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని అనుమతించాలంటూ సభ ప్రారంభం కాగానే ఆ పార్టీలు పట్టుబట్టాయి. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడేం దుకు అవకాశం కల్పిస్తామని అధికార పక్షం చేసిన సూచనను కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్దిచెప్పినా వెనక్కి తగ్గకుండా స్పీకర్ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో రెండు గంటల్లో సభ మూడు సార్లు వాయిదా పడింది. సభ మొదలైన పది నిమిషాలకే.. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన కాంగ్రెస్ సభ్యులు.. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి తమ వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. ఎంఐఎం సభ్యులు సైతం కొద్ది దూరంలో నిలబడి నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేయవద్దని బీఏసీ సమావేశంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి స్వయంగా చెప్పారని, మరో విధంగా చర్చకు సిద్ధమని శాసనసభ వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు సమాధానమిచ్చారు. అయినా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో చర్చ చేయాలనుకుంటున్నారా? రచ్చ చేయాలనుకుంటున్నారా..? అని హరీశ్ వారిపై అగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీయూ, ఓయూలో చోటుచేసుకున్న ఘటనల తీవ్రత దృష్ట్యా ప్రశ్నోత్తరాలను రద్దు చేసి వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని జానారెడ్డి కోరారు. ఇందుకు హోంశాఖ పద్దులపై చర్చలో వర్సిటీలపై మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని, సమాధానాలిస్తామని హరీశ్ బదులిచ్చా రు. ఇది అప్రజాస్వామికం అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అహమ్మద్ పాషా ఖాద్రీ నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ స్పీకర్ పొడియం వద్ద దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దళిత, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో 10 నిమిషాలకే సభ వాయిదా పడింది. మారని పరిస్థితి.. హరీశ్ ఆగ్రహం సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్న కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. ప్రభుత్వం అనుమతించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు మరోసారి స్పీకర్ పొడియం వద్దకొచ్చి నినాదాలు చేశారు. దీంతో సభ రెండోసారి వాయిదా పడింది. అనంతరం సభ మళ్లీ ప్రారంభం కాగానే మిగిలిన ప్రశ్నలను వాయిదా వేసినట్లు తెలిపిన డిప్యూటీ స్పీకర్... బడ్జెట్ పద్దులపై చర్చ జరుగుతుందని వెల్లడించారు. వర్సిటీలతో పాటు ఇతర అంశాలపై కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్లీ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి హరీశ్.. ‘ప్రశ్నోత్తరాల సమయాన్ని ఊడగొట్టారు.. గంట సభా సమయాన్ని వృథా చేశారు..’ అని ఆగ్రహించారు. ప్రశ్నోత్తరాల తర్వాత అవకాశం కల్పిస్తామ మాట మార్చడం తగదని జానారెడ్డి నిరసన తెలి పారు. ముఖ్యమైన అంశం ఉంటే ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాన్ని అనుమతిస్తామని బీఏసీలో సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎవరి గొంతూ నొక్కడం లేదు: కేసీఆర్ ప్రభుత్వం ఎవరి గొంతూ నొక్కడం లేదని, హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాము కూడా చర్చను కోరుకుంటున్నామన్నారు. ఆయా ఘటనల్లో బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఓయూలో కాంగ్రెస్ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్ కారుపై జరిగిన దాడితోపాటు హెచ్‌సీయూలో విద్యార్థి మృతి సంఘటనలు బాధాకరమన్నారు. హోంశాఖ పద్దులపై జరిగే చర్చలో ఈ అంశాలపై అవకాశం కల్పిస్తామని చెప్పారు. సీఎం వివరణతో సంతృప్తి చెందని జానారెడ్డి మైక్ ఇచ్చినా మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. హెచ్‌సీయూ ఘటన దురదృష్టకరమని, చర్చకు సిద్ధమని బీజేపీ పక్ష నేత కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉగ్రవాది యాకుబ్ మెమెన్‌కు విద్యార్థులు మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. అయితే ఇది హోంశాఖకు సంబంధించిన అంశం కాదని, సామాజిక అన్యాయానికి సంబంధించిందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్‌కుమార్, జానారెడ్డి అభ్యంతరం తెలిపారు. దళిత, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ కాంగ్రెస్ సభ్యులు మరోమారు స్పీకర్ పొడియం వద్ద ఆందోళనకు దిగారు. ‘‘ఇది పద్ధతి కాదు.. సభ్యులు తమ సీట్ల వద్దకు వెళ్లాలి.. నినాదాలు చేసినంత మాత్రాన గొప్పవాళ్లు కాలేరు. దళిత వ్యతిరేక ప్రభుత్వం అని నినాదాలు చేస్తున్న సంపత్‌కుమార్ ఇంత వరకు ఫిర్యాదు చేయలేదు.’’ అని కేసీఆర్ అన్నారు. . విపక్షాలు పద్ధతి మార్చుకోకపోతే తమ పద్ధతిలో తాము వెళ్తామని హెచ్చరించారు. కేసీఆర్ x అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య సభలో మాటల యుద్ధం చోటుచేసుకుంది. వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడాన్ని అక్బరుద్దీన్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నా ఆయనే తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఇరుకున పడింది. సభలో మిగిలిన కార్యక్రమాలను వాయిదా వేసి ముఖ్యమైన అంశంపై చర్చ జరపడమే వాయిదా తీర్మానం ఉద్దేశమని అక్బర్ గుర్తుచేశారు. వాయిదా తీర్మానాన్ని, బడ్జెట్ పద్దులపై చర్చను కలపొద్దన్నారు. వాయిదా తీర్మానాన్ని అనుమతించకపోవడం దళితులకు అన్యాయం, అగౌరవం, అమానవీయం అని తీవ్ర స్వరంతో అన్నారు. ఈ సమయంలో మైక్ కట్ అవడంతో మరింత ఆగ్రహానికి లోనయ్యారు. తమ పార్టీ సభ్యులను స్పీకర్ పొడియం వద్దకు పంపి నిరసన తెలిపారు. ‘నా మైక్ కట్ చేశారు మంచిదే.. కానీ దళితుల గొంతు నొక్కలేరు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు బీజేపీకి ఆయుధం(టూల్)గా మారారు’ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో మైక్ కట్ చేయడం సరైందేనని సీఎం కేసీఆర్ సమర్థించుకున్నారు. ‘మైక్ ఇస్తాం కానీ, ఏది అంటే అది మాట్లాడితే ఒప్పుకోం’ అని స్పష్టంచేశారు. దళితులకు అన్యాయం, అగౌరవం అన్న మాటలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. తర్వాత అవకాశమిచ్చినా అక్బరుద్దీన్ మాట్లాకుండా మిన్నకుండిపోయారు. స్పీకర్ పోడియం వద్ద ఎంఐఎం సభ్యులకు తోడు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల సభ్యులు సైతం ఆందోళనకు దిగడంతో సభ మూడోసారి వాయిదా పడింది. -
హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ చేస్తాం
19,122 కోట్లతో రహదారుల అభివృద్ధి: కేటీఆర్ ♦ పాతబస్తీ రహదారుల అభివృద్ధికి రూ.8,866 కోట్లు ♦ 54 జంక్షన్ల అభివృద్ధి.. 18 జంక్షన్లకు టెండర్లు పూర్తి ♦ రూ.1,834 కోట్లతో యాదాద్రి అభివృద్ధి పనులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఎస్ఆర్డీపీ కింద 19,122 కోట్లతో దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు తెలి పారు. అసెంబ్లీలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సభ్యుడు మహిపాల్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. నాలుగు దశల్లో ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఎలివేటెడ్ కారి డార్లు, మల్టీ లెవల్ గ్రేడ్ సెపరేటర్లు, జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూసీ నది కారిడార్ అభివృద్ధిలో భాగంగా స్కైవే కనెక్టివిటీ నిర్మాణానికి రూ.5,916 కోట్లు కేటాయిం చినట్లు చెప్పారు. పాతబస్తీ రహదారుల అభివృద్ధికి రూ.8,866 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. ఈ నెల 15న మౌలిక వసతుల రంగంలోని ప్రముఖ కంపెనీలతో సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. రూ.82 వేల కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు దేశంలోని పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 54 జంక్షన్ల అభివృద్ధికిగాను 18 జంక్షన్లకు టెండర్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కాగా పాతబస్తీలోని రోడ్లు, ఇతర అభివృద్ధి పనులన్నీ చివరి దశలో చేర్చారని అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలపగా... వాటిని ప్రాధాన్యత క్రమంలో ముందుకు తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. రూ.1,325 కోట్లతో యాదాద్రి టెంపుల్‌సిటీ యాదాద్రిని శాస్త్రోక్తంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆలోచన అని మంత్రి కేటీఆర్ చెప్పారు. రూ.509 కోట్లతో దేవాలయాన్ని, రూ.1,325 కోట్లతో టెంపుల్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గాదరి కిషోర్, పైళ్ల శేఖర్‌రెడ్డి, సునీత అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు తెలిపారు. గుట్టపై 14 ఎకరాల భూమి విస్తీర్ణం కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, మొదటి దశలో 2.33 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తామని, ఈ ప్రతిపాదనలు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. యాదాద్రి అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూ.93.38 కోట్లను వెచ్చించి 1,900 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలిపారు. రాయగిరి నుంచి యాదగిరి వరకు 4 వరుసల రోడ్డు, గుట్టకు వెళ్లే రోడ్ల వెడల్పు, 252 ఎకరాల్లో కాటేజీల నిర్మాణం, నాలుగు సరస్సుల అభివృద్ధి, నీటి సరఫరా చర్యలు, అభయారణ్యం అభివృద్ధి, టీటీడీ తరహాలో వేద పాఠశాల ఏర్పాటు, శిల్పకళా సంస్థ నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. గుట్టకు వెళ్లే హైదరాబాద్ భక్తుల కోసం ఎంఎంటీఎస్ రైలు నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత, ప్రస్తుత బడ్జెట్లో వంద కోట్ల చొప్పున నిధులు కేటాయించినట్లు వివరించారు. దేవాలయం అభివృద్ధి పనుల్లో భాగంగా వచ్చేనెల 16న ఆగమ శాస్త్రం ప్రకారం బాలాలయాన్ని ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వివరించారు. -
పుస్తకాలు అందకుండానే పద్దులపై చర్చా?
శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఆగ్రహం ♦ అధికార పక్షంలో ఎవరైనా ‘జీనియస్’ ఉంటే మాట్లాడొచ్చు.. ♦ చర్చ కొనసాగిస్తే నిరసన తెలుపుతాన ని హెచ్చరిక ♦ అక్బరుద్దీన్‌కు మద్దతుగా నిలిచిన విపక్షాలు ♦ మిగతా వారికి తర్వాత సమయం ఇస్తామని స్పీకర్ వివరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఆదివారం పద్దులపై చర్చను ప్రారంభించడంపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. పద్దుల పుస్తకాలు అందించకుండానే చర్చను ఎలా మొదలు పెడతారని విపక్షాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ పుస్తకాలు ఇచ్చినా... ఒకరోజు గడువు కూడా ఇవ్వకుండా చర్చ సబబు కాదని స్పష్టం చేశారు. అందువల్ల పద్దులపై చర్చను వాయిదా వేయాలని కోరారు. ఆదివా రం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక స్పీకర్ మధుసూదనాచారి పద్దులపై చర్చను మొదలుపెడుతున్నట్లు ప్రకటించారు. దీనిపై ఎంఐ ఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలిపారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి పద్దులపై చర్చిస్తామన్నారు. వాటికి సంబంధించిన పద్దుల పుస్తకాలు కొద్దిసేపటి కిందే ఇచ్చారు. మిగతావి అందనే లేదు. డిమాండ్లపై కనీసం ఒకరోజు అయినా సమ యం ఇవ్వకుండా చర్చ ఎలా చేపడతారు..’’ అని ప్రశ్నించారు. పద్దుల పుస్తకాలు లేకుండా మాట్లాడేంత ‘జీనియస్’లు తమ పార్టీలో అ యితే లేరని, అధికార పక్షంలో అలా ఎవరైనా ఉంటే తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానిం చారు. ఈ సమయంలో బీజేఎల్పీ నేత లక్ష్మణ్, టీడీ ఎల్పీ నేత రేవంత్‌రెడ్డి, సీపీఎం సున్నం రాజయ్య, సీపీఐ రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ నేత పాయం వెంకటేశ్వర్లు తదితరులకు మాట్లాడే అవకాశం ఇచ్చినా... వారంతా అక్బరుద్దీన్‌ను సమర్థించారు. పద్దుల పుస్తకాలు అం దకుండా చర్చ కొనసాగించరాదని కోరారు. అయితే దీనిపై స్పందించిన స్పీకర్... విపక్షాల కు తర్వాత సమయం కేటాయిస్తామని, అధికా ర పక్షం నుంచి ఎవరైనా మాట్లాడితే చర్చ కొనసాగిద్దామంటూ గువ్వల బాలరాజుకు అవకాశమిచ్చారు. కానీ, అక్బరుద్దీన్ మరోమారు అభ్యంతరం తెలిపారు. ‘‘డిమాండ్ పుస్తకాలు ఇవ్వకుండా చర్చ మొదలుపెట్టడం దురదృష్టక రం. అలా ఎవరైనా మాట్లాడితే నిజంగా జీని యస్లే..’’ అని పేర్కొన్నారు. దీంతో మంత్రి కేటీఆర్ కల్పించుకుంటూ... డిమాండ్ పుస్తకా లు సిద్ధంకాలేదని, మరోసారి ఇలా జరగకుం డా చూస్తామని చెప్పారు. కావాలనుకుంటే విప క్ష సభ్యులు తర్వాతి రోజు మాట్లాడవచ్చని, ఇతరులకు అవకాశమిస్తే అభ్యం తర పెట్టొద్దని సూచించారు. అయినా అక్బరుద్దీన్ వెనక్కి తగ్గలేదు. నిబంధనలకు విరుద్ధంగా చర్చ కొనసాగిస్తామంటే సభ నుంచి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు. సకాలంలో పద్దుల పుస్తకాలు అందించని అధికారులపై చ ర్యలు తీసుకోవాలని కోరారు. పుస్తకాలు అం దించడంలో మరోసారి ఆలస్యం కాకుండా చూస్తామని ప్రకటిస్తూ స్పీకర్ సభకు టీ విరా మం ప్రకటించారు. అనంతరం పద్దులపై గువ్వల బాలరాజు చర్చను ప్రారంభించారు. గిరిజన శాఖ పద్దు పుస్తకాలపై గందరగోళం సాక్షి, హైదరాబాద్: పద్దులకు సంబంధించి అసెంబ్లీకి సమర్పించే పుస్తకాల విషయంలో నెలకొ న్న గందరగోళ పరిస్థితులు ఆఖరికి గిరిజన సంక్షేమ శాఖపై చర్చను వాయిదా వేసేందుకు కారణమయ్యాయి. పద్దులకు సంబంధించి శాఖల వారీగా అధికారులు పుస్తకాలను ముద్రించి సభ ముందుంచుతారు. బడ్జెట్ సమయంలో ఆర్థిక శాఖకు సంబంధించి ప్రకటనలు, కేటాయింపులతో కూడిన వివరాలను ఒక పుస్తకంగా, బడ్జెట్లో కేటాయించిన నిధులు, సవరణ బడ్జెట్ వివరాలు మరో పుస్తకంలో ముద్రించడం ఆనవాయితీ. రెండు పుస్తకాలు ముద్రించడం వల్ల ఖర్చు పెరుగుతోందని పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక శాఖ ఓ సూచన చేసింది. అన్ని వివరాలను ఒకే పుస్తకంగా ముద్రించాలని సూచించింది. దీన్ని చాలా శాఖలు పట్టించుకోలేదు. కానీ, గిరిజన సంక్షేమ శాఖ మాత్రం ఒకే పుస్తకంగా ముద్రించింది. ఆదివారం అన్ని శాఖల పద్దుల పుస్తకాల ను సభ ముందుంచారు. మిగిలిన శాఖల పుస్తకాలు రెండుగా ఉంటే, గిరిజన సంక్షేమ శాఖ పుస్తకం ఒకటే ఉంది. దీంతో రెండో పుస్తకం అందలేదంటూ ఎమ్మెల్యేలు గగ్గోలు పెట్టారు. సమాచారమంతా ఒకే పుస్తకంలో ఉందని విషయం అధికారుల నుంచి అందకపోవడంతో పొరపాటు జరిగిందన్న ఉద్దేశంతో ఆ శాఖపై చర్చను సోమవారానికి వాయిదావేశారు. విషయం తెలిసిన తర్వాత కూడా రెండో పుస్తకం కావాల్సిందేనని పట్టుపట్టారు. -
అప్పుల రాష్ట్రం చేస్తారా?
♦ బడ్జెటేతర నిధులు తిరిగెలా చెల్లిస్తారు: అక్బరుద్దీన్ ♦ అప్పుల శాతం తక్కువగానే ఉందన్న ఈటల సాక్షి, హైదరాబాద్: ‘రాష్టాన్ని అప్పుల పాలు చేస్తారా? తెలంగాణ ఏర్పడినప్పుడు రూ.60 వేల కోట్లున్న అప్పు.. ఈ బడ్జెట్లో రూ.1.23 లక్షల కోట్లకు చేరుకోవటం ఆందోళన కలిగిస్తోంది’ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. మిషన్ భగీ రథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బడ్జెటేతర వనరులను సమకూర్చటం సందేహాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం పూచీకత్తుగా ఉండే ప్రతి రుణాన్నీ బడ్జెట్లో పొందుపరచాల్సి ఉంటుందని.. లేకుంటే తిరిగి చెల్లింపులెలా చేస్తారని ప్రశ్నించారు. ఏ కాలేజీకి వెళ్లి చూసినా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు జరగలేదని, దాదాపు రూ.254 కోట్ల బకాయిలున్నాయని అన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు మంత్రి ఈటల సమాధానం అనంతరం అక్బరుద్దీన్ ఈ అంశాలను లేవనెత్తారు. స్పందించిన ఈటల.. అప్పుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 16.1 శాతం అప్పులే ఉన్నాయని, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నామన్నారు. ఏపీలో 20.8 శాతం, బిహార్‌లో 23.8 శాతం, గోవాలో 30.5 శాతం, కేరళలో 17.3 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 14.3 శాతం అప్పులున్నాయన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సంబంధిత విభాగాలకు విడుదల చేశామని, అక్కణ్నుంచి చెల్లింపులు జరగకపోతే వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత సీట్ల బాధ్యత ప్రభుత్వానిదే: జీవన్‌రెడ్డి కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు ఇప్పట్లో కాదని చెబుతున్న ప్రభుత్వం అప్పటివరకు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పేదలకు 25 శాతం ఉచిత సీట్లను కేటాయించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలన్నారు. పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా కాకుండా రైతులు, సర్వే నంబర్ల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలన్నా రు. అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచిన ప్రభుత్వం ఆశ వర్కర్ల జీతాలెందుకు పెంచడం లేదన్నారు. ఉద్యమం సమయంలో గుర్తున్న పార్ట్ టైం స్వీపర్ల క్రమబద్ధీకరణ ఇప్పుడెందుకు గుర్తుకు రావటం లేదన్నారు. 2004 నుంచి 2014 వరకు లాభాల బాట పట్టిన ఆర్టీసీని నిర్వీర్యం చేసిందెవరని ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నించాలన్నారు. అడ్వైజరీ కౌన్సిల్ ఏమైంది? రేవంత్ రెడ్డి నిజాం చక్కెర ఫ్యాక్టరీ, సిర్పూర్ పేపర్ మిల్లును తెరిపించాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కోరారు. మానవతా దృ క్పథంతో ఆలోచించి డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏమైందన్నారు. ఉర్దూ స్కూళ్లు, కాలేజీల్లో టీచర్లు, లెక్చరర్లను నియమించాలన్నారు. ప్రతి మండలానికో కాలేజీని, నియోజకవర్గానికి ఐటీఐని, ప్రతి జిల్లాకో ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచేయి:కె.లక్ష్మణ్ బడ్జెట్ కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశలను ప్రభుత్వం నీరుగార్చిందని బీజేపీ శాసనసభా పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. అయిదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కేటాయింపుల్లో మోసం చేసిందన్నారు. ఉద్యోగాలను కల్పించలేకపోతున్న ప్రభుత్వం ఇంజనీరింగ్, బీఈడీ కాలేజీలను మూసివేసే సంకేతాలిస్తుందా అని ప్రశ్నించారు. గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలని, పరీక్షను మరో మూడు నెలలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1,4, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల ఖాళీలన్నీ భర్తీ చేస్తే ఉద్యోగ సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఎస్ఐ పరీక్షలకు ఇంగ్లిష్ పాటవాన్ని పరీక్షించటం అనుచితంగా ఉందని, గ్రామీణ విద్యార్థులు నష్టపోతారన్నారు. జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన హెల్త్ కార్డులు చెల్లుబాటు కావటం లేదన్నారు. మైనారిటీ శాఖను అగ్రస్థానంలో నిలుపుతాం సాక్షి, హైదరాబాద్: మైనారిటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించినా మైనారిటీ సంక్షేమ శాఖ ఖర్చు చేయలేకపోయిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందిని నియమించకుండా గత పాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్ల మైనారిటీ శాఖ నిర్వీర్యమైందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కొత్త పోస్టులు మంజూరు చేశామని, ఆ శాఖను అగ్రస్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2014-15లో మైనారిటీల సంక్షేమానికి 32 శాతం నిధులు మాత్రమే వెచ్చించడంపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు శనివారం శాసనసభలో ఆయన వివరణ ఇచ్చారు. -
చార్జీలు, పన్నుల పెంపుపై పునరాలోచించాలి
బడ్జెట్‌పై చర్చలో అక్బరుద్దీన్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: నల్లా బిల్లులు, విద్యుత్, బస్సు చార్జీలు, ఆస్తి పన్నులు పెంచే ఆలోచనలను విరమించుకోవాలని.. ప్రజలపై భారం వేయబోమని హామీ ఇవ్వాలని శాసనసభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. లేనిపక్షంలో జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మంలో టీఆర్ఎస్ను గెలిపించినందుకు ప్రజలు బాధపడాల్సి వస్తుందని చురకలు అంటించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో అక్బరుద్దీన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన అప్పులు ఎన్ని, వడ్డీ రేటు ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త శాసనసభ, సచివాలయం, ఐఏఎస్‌ల నివాసాలకు కొత్త భవనాలు అవసరమేనని... అయితే అవి ఇప్పుడే నిర్మించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తవి నిర్మించేందుకయ్యే ఖర్చును ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మళ్లిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. సూచనలుగా తీసుకోండి.. తాను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని భావించవద్దని.. సూచనలు, సలహాలుగా తీసుకోవాలని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ హామీలపై నమ్మకంతోనే మిత్రపక్షంగా ఉన్నామని చెప్పారు. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కనీసం 50 శాతం నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కేవలం 32 శాతం ఖర్చు చేయడం దారుణమన్నారు. బడ్జెట్ నిండా భ్రమలు: రాజయ్య బడ్జెట్ నిండా అవాస్తవికతే ఉందని.. ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలను మరింత పెంచేలా ఉందని సీపీఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య విమర్శించారు. జనాభాలో 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, వికలాంగులను విస్మరించారని మండిపడ్డారు. బీసీ, మైనారిటీలకు ఉప ప్రణాళిక రూపొందించాలని, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, జిల్లాకో ఐటీడీఏ, గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీని రూపొందించాలని కోరారు. ఇంతమంది పేదలా?: రవీంద్రకుమార్ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చూపెట్టినా ఇంత మంది పేదలెందుకు ఉన్నారని సీపీఐ నేత రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. రైతులకు ఒకేసారి రుణ మాఫీ చేయాలన్నారు. విద్యుత్‌పై ఆరోపణలు తగవు: గాదరి జెన్కోలో ఉత్పత్తిని తగ్గించి ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విపక్ష నేత కె.జానారెడ్డి ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. గ్యాస్ కేటాయింపులు లేక విద్యుదుత్పత్తి చేయని ప్రైవేటు కంపెనీలకు 17 ఏళ్లుగా డబ్బులు చెల్లిస్తున్నారని, అది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదమేనని పేర్కొన్నారు. సామాన్యుల పక్షంగా లేదు:కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి దళితులు, బలహీనవర్గాల సంక్షేమానికి కేటాయింపులు లేని తాజా బడ్జెట్.. సామాన్యుల పక్షంగా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ స్వభావానికి విరుద్ధంగా, కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేదిగా ఉందన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై మాట్లాడుతూ, కులవృత్తులు చేసుకొనే పేదలకు, ఎస్సీల కోసం 60లక్షల ఎకరాల భూముల కొనుగోలుకు బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినందున ప్రాణహిత ప్రాజెకును పూర్తిచేయడానికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలని కోరారు. కల్యాణలక్ష్మి కింద 1.16కోట్లు ఇవ్వండి ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 1 కోటి 16 లక్షలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 13 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 18వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిం దన్నారు. వేసవిలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో ఒంటిపూట బడులను, పాత విద్యా కేలండర్నే కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ ధన్యవాదాలు తెలిపారు. -
మెట్రో రైలు పెద్ద స్కాం
అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపణ ♦ ఎల్అండ్టీ సంస్థకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని ధ్వజం ♦ 12 వేల కోట్ల పెట్టుబడికి 37 ఏళ్లలో రూ.1,18,892 కోట్ల ఆదాయం ♦ ఈ ఒప్పందంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి ♦ పాతబస్తీలో అలైన్మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ ♦ ప్రభుత్వ జాప్యం వల్లే ప్రాజెక్టు వ్యయం పెరిగింది: కాంగ్రెస్ ♦ మేం వచ్చాకే పనులు వేగం పుంజుకున్నాయి: మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పెద్ద కుంభకోణమని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై రూ.12,654 కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ 37 ఏళ్ల ఒప్పంద కాలంలో వివిధ మార్గాల ద్వారా రూ.1,18,892 కోట్ల ఆదాయాన్ని కొల్లగొడుతుందన్నారు. మెట్రో స్టేషన్లో వాణిజ్య కార్యకలాపాలు, ప్రకటనలు, ప్రయాణ చార్జీలు, పార్కింగ్ తదితర మార్గాల్లో వచ్చే ఆదాయంతో ఎల్అండ్టీ సంస్థ భారీ లాభాలను గడి స్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఒప్పందంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ప్రభుత్వం, విపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మెట్రో రైలు నిర్మాణం కోసం 180.50 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందని, చదరపు అడుగుకు కనీసం రూ.20 చొప్పున ప్రతినెలా రూ.38.10 కోట్ల అద్దె ప్రభుత్వానికి రావాల్సి ఉంటుందన్నారు. 35 ఏళ్లలో స్థలాలపై అద్దె రూపంలోనే ప్రభుత్వానికి రూ.16,002 కోట్లు రావాల్సి ఉంటుందని, ఈ అద్దెను ఎవరు వసూలు చేస్తారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు కింద సేకరిస్తున్న భూముల్లో 60 శాతం పాతబస్తీలోనే ఉన్నాయని చెప్పారు. పాతబస్తీలో ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వల్లే జాప్యం: కాంగ్రెస్ అలైన్మెంట్ మార్పు పేరుతో మెట్రో పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంతో ప్రాజెక్టు వ్యయం రూ.3 వేల నుంచి రూ.6 వేల కోట్ల వరకు పెరిగిందని, ఈ భారాన్ని ప్రయాణికులపై వేసే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. అలైన్మెంట్ మార్పు సాధ్యం కాదని అఖిలపక్ష సమావేశంలో చెప్పినా సీఎం పట్టించుకోలేదన్నారు. ఏడాదిన్నర జాప్యం తర్వాత ఇప్పుడు మళ్లీ పాత అలైన్‌మెంట్‌తోనే పనులు ప్రారంభించడంతో నిర్మాణ వ్యయం పెరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రికార్డు సమయంలో పనులు చేశాం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మెట్రో రైలు నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. అతి తక్కువ సమయంలో 1,992 పిల్లర్లు, 2,780 సెగ్మెంట్లు, 43 కి.మీ.ల వయాడక్లను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించామన్నారు. ఇప్పటివరకు దాదాపు 74 శాతం ప్రాజెక్టు పూర్తై దన్నారు. ‘‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకోసారి ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నాం. అలైన్మెంట్ మార్పు అంశాన్ని ప్రభుత్వం పరిశీలించిన మాట వాస్తవమే. అయితే ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో అసెంబ్లీ, సుల్తాన్‌బజార్ మార్గంలో అలైన్మెం ట్ మార్పు ఆలోచనను విరమించుకున్నాం. పాతబస్తీ మార్గంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనిపై నగర ఎంపీ, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తాం’’ అని వివరించారు. అవకతవకలకు ఆస్కారం లేదు: కేటీఆర్ గ్లోబల్ బిడ్ ద్వారా గత ప్రభుత్వం మెట్రో ఒప్పందం చేసుకుందని, ఇందులో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఒప్పందాలు మార్చడం సాధ్యంకాదన్నారు. రూ.14,132 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,458 కోట్ల నిధులను సమకూర్చిందని, మిగిలిన రూ.12,654 కోట్లను ఎల్అండ్టీ భరిస్తోందన్నారు. భూసేకరణ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం రూ.3 వేల కోట్లను అదనంగా ఖర్చు చేస్తోందన్నారు. పీపీపీ పద్ధతిలో 35 ఏళ్ల కాలానికి ఈ ఒప్పందం జరిగిందని మరో 25 ఏళ్లకు పెంచే అవకాశం ఉందన్నారు. చార్జీల రూపంలో 50 శాతం, వాణిజ్య కార్యకలాపాల ద్వారా 45 శాతం, ప్రకటనల ద్వారా 5 శాతం ఆదాయాన్ని మెట్రో రైల్ సంస్థ ఆర్జించనుందన్నారు. వాణిజ్య అవసరాల కోసం 212 ఎకరాల ప్రభుత్వ, 57 ఎకరాల ప్రైవేటు స్థలాలను కేటాయించామన్నారు. శ్లాబుల రూపంలో ప్రయాణ చార్జీలు రూ.8-రూ.19 లోపు ఉండాలని 2010లో నిర్ణయించారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ చార్జీలను రూ.13-25 మధ్య ఉండేలా నిర్ణయించినట్లు తెలిపారు. -
గవర్నర్ ప్రసంగంపై విపక్షాల వాణి...
పాతబస్తీలోనూ హైటెక్ సిటీ ‘‘తెలంగాణకు నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఏపీతో పోల్చినా తక్కువ వచ్చాయి. గవర్నర్ ప్రసంగంలో కరువు, మంచినీటి ఎద్దడి, పశుగ్రాసం కొరతలను ప్రస్తావించలేదు.ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల సాధనకు చర్యలు తీసుకోవాలి. ఆస్తి పన్ను, కరెంటు, నీటి చార్జీల వంటివి పెంచి ప్రజలపై భారం మోపొద్దు. హైటెక్ సిటీ మాదిరిగా హైదరాబాద్ పాతబస్తీలోనూ చిన్న హైటెక్ సిటీ సెంటర్ పెట్టాలి. అక్కడ రోడ్ల విస్తరణ తదితర అభివృద్ధి పనులు చేపట్టాలి. ప్రభుత్వ అభివృద్ధి పనులకు మజ్లిస్ మద్దతుంటుంది’’ - అక్బరుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ ఆదాయ, ఆనంద సూచీలు కావాలి ‘‘అభివృద్ధి సూచీకి బదులు ఆదాయ, ఆనంద సూచీలను రూపొందించాలి. వ్యవసాయ రంగ వృద్ధి 0.7 శాతానికే పరిమితం కావడం ఆందోళనకరం. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను ఎప్పటికప్పుడే చెల్లించడంతో ఎంతోమంది పెద్ద చదువులు చదవగలిగారు. రూ.3,700 కోట్ల ఫీజు బకాయిలను తక్షణం విడుదల చేయాలి. వైఎస్ మాదిరిగానే గిరిజనుల పోడు భూములకు పట్టాలివ్వాలి’’ - పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ చేతలు గడప దాటడం లేదు ‘‘గవర్నర్ ప్రసంగం టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలా, కరపత్రంలా ఉంది. రైతు ఆత్మహత్యల నివారణ, వారిని ఆదుకునే చర్యల ప్రస్తావనే లేదు. రుణ మాఫీని ఏకమొత్తంలో చేయాలి. డబుల్ బెడ్రూం ఇళ్లపై పేదల ఆశలను రాజకీయంగా సొమ్ము చేసుకుంటున్నారు. కేజీ టు పీజీ మొదలే కాలేదు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నియంత్రించే చర్యల్లేవు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’’ -కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యేల కొనుగోళ్లే స్థిరత్వమా? ‘‘విపక్ష ఎమ్మెల్యేలను కొనడమే ప్రభుత్వ ధృడత్వం, స్థిరత్వమా? గవర్నర్ అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పారు. అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయడంలో అధికార టీఆర్ఎస్ విఫలమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తనతో అనైతిక పనులు చేయిస్తున్నందుకే గవర్నర్ తరచూ గుళ్ల చుట్టూ తిరిగి పొర్లుదండాలు పెడుతున్నట్లున్నారు! రోహిత్ ఆత్మహత్య కేసులో కేంద్ర మంత్రి దత్తాత్రేయను అరెస్ట్ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించారని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డే చెప్పారు. మరాయన్ను ఇంకా అరెస్టు చేయలేదేం? నా నియోజకవర్గంలోనే అత్యధిక సంఖ్యలో దళితులు, పేదలుంటే వారిలో కేవలం నలుగురికి 12 ఎకరాలు పంపిణీ చేశారు. ఇదీ దళితులకు భూ పంపిణీ తాలూకు వాస్తవ దుస్థితి!’’ - సంపత్‌కుమార్, కాంగ్రెస్ తూతూమంత్రంగా చదివేశారు ‘‘ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ మూసగా, తూతూమంత్రంగా చదివారు. రైతులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలనూ సూచించలేదు. తగిన గిట్టుబాటు ధరలు కల్పించాలి. మారె ్కటింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలి. కేజీ టు పీజీ చదువుపై ఏమీ జరగలేదు. వర్సిటీలకు వీసీల్లేరు. సీఎం ఆశయాలు బాగున్నా ఆచరణ లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలను అనుమతించొద్దు. వాటర్‌గ్రిడ్‌కు బడ్జెట్లో రూ.40 వేల కోట్లు కేటాయించారు గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే చెల్లించలేదు. పథకంలో లోపాలుంటే సవరించాల్సిందే. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి, బిల్లు పెట్టేలా కేసీఆర్ చొరవ తీసుకోవాలి’’ - ఆర్.కృష్ణయ్య, టీడీపీ ప్రాజెక్టులు చేపట్టాలి ‘‘పుణ్యకాలం గడవకముందే ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో చేపట్టి పూర్తి చేయాలి. ఇప్పటికే చేపట్టిన వాటిని తక్షణం పూర్తి చేయాలి. నల్లగొండ జిల్లాలోని వరదకాలువ, డిండి ప్రాజెక్టులను వెంటనే చేపట్టాలి. రీ డిజైనింగ్ అంటూ రెండేళ్లుగా జాప్యం చేస్తున్నారు. కరువు తీవ్రంగా ఉన్నా కేంద్రం సాయం రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. కరువు నివారణ, సహాయం, వ్యవసాయ కూలీలను ఆదుకోవడం వంటివాటి ప్రస్తావనే గవర్నర్ ప్రసంగంలో లేదు. గిరిజనులకు జనాభా మేరకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ - రవీంద్రకుమార్, సీపీఐ కరువు ప్రస్తావనేదీ? ‘‘గవర్నర్ ప్రసంగంలో అసలు కరువు ప్రస్తావనే లేదు. రైతుల రుణాలను 50 శాతం ఒకేసారి మాఫీ చేయాలి. బీసీ, మైనారిటీ, వికలాంగులకు విడిగా సబ్ప్లాన్లుపెట్టాలి. ప్రభుత్వ పాఠశాలల పటిష్టానికి చర్యలు తీసుకోవాలి. హాస్టళ్లలో, ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పించాలి. పోడు రైతులకు పట్టాలివ్వాలి’’ - సున్నం రాజయ్య, సీపీఎం