
బీజేపీతో కలసి పనిచేయం: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో కలసి పనిచేయాల్సిన అవస రం తమకు లేదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో రేవంత్ సోమవారం భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ టీఆర్‌ఎస్, కేసీఆర్ పాలనను పొగుడుతున్నారన్నారు.
ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన బీజేపీకి చెందిన బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్‌కుమార్ మోదీ కేసీఆర్‌ను పొగిడారని గుర్తుచేశారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతల స్పందన ఏంటని ప్రశ్నించారు. అలాంటి బీజేపీతో పనిచేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సమస్యలపై అక్టోబర్ 2 నుంచి పాదయాత్ర చేస్తానన్నారు.