Revant Reddy
-
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
తెలంగాణకు కాలిఫోర్నియా పెట్టుబడులు: సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ & కాలిఫోర్నియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర గొప్పదని మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డి ప్రశంసించారు. కాలిఫోర్నియా, ఫ్రీమాంట్‌లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ రిసెప్షన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రొక్లమేషన్ కూడా అందించారు.ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి , మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు కమిషనర్ రఘు రెడ్డి హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన రఘురెడ్డి శాంటా క్లారా కౌంటీ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన రఘురెడ్డి అక్కడ మొదటి తెలుగు కమిషనర్ కావడం విశేషం. ఈయన వచ్చే ఏడాది సిటీ మేయర్ పదవిని చేపట్టాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సేవల రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన ‘చార్లెస్ స్క్వాబ్’ హైదరాబాద్‌లో నూతన సాంకేతిక అభివృద్ధి కేంద్రం (టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. చార్లెస్ స్క్వాబ్ భారత్ లో ఏర్పాటు చేసే తొలి డెవలప్మెంట్ సెంటర్ ఇదే కావడం గమనార్హం. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ప్రతి నిధి బృందంతో చార్లెస్ స్క్వాబ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు హోవార్డ్, రామ బొక్కా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో చర్చల సందర్భంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ డెవల ప్మెంట్ సెంటర్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. చార్లెస్ స్క్వాబ్‌కు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన తుది అను మతుల కోసం చార్లెస్ స్క్వాబ్ వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపనున్నట్లు తెలిపింది. ఈ సెంటర్ ఏర్పా టు ద్వారా ఆర్థిక సేవల రంగంలో ఉద్యోగ అవకాశాల కల్ప నకు వీలవుతుందని, ఈ రంగంలో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు.‘కామ్‌కాస్ట్’ ప్రతినిధులతో శ్రీధర్బాబుఅంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ కంపెనీ ‘కామ్‌కాస్ట్’కు చెందిన సీనియర్ ప్రతినిధి బృందం.. మంత్రి శ్రీధర్‌బాబు తో భేటీ అయింది. తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపా ధి కల్పన లక్ష్యంగా అనేక సంస్థలతో వ్యూహాత్మక, భాగస్వా మ్య ఒప్పందాలు చేసుకుంటున్నట్లు శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ భేటీలో కామ్‌కాస్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెల్ పెన్నా, సీటీఓ రిక్ రియోబొలి, సీఐఓ మైక్ క్రిసాఫుల్లి పాల్గొన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే..సీఎం బృందం అమెరికా పర్యటనలో భాగంగా పెట్టుబడుల కోసం వివిధ సంస్థలతో చేసుకుంటున్న ఒప్పందాలపై విమ ర్శలు వస్తున్నాయి. దీంతో ప్రతినిధి బృందంలోని అధికారు లు వివరణ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే దిశలోనే వివిధ సంస్థలతో చర్చలు ఒప్పందాలు జరుగుతు న్నట్లు వెల్లడించారు. ‘పెట్టుబడులను ఆకర్షించేందుకు అనేక రోడ్ షోలు, వివిధ సంస్థలతో సంప్రదింపులు జరుగుతు న్నాయి. సీఎం కూడా అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు, వాణిజ్య పారిశ్రామిక రంగాలకు చెందిన వారితో భేటీ అవుతున్నారు. భవిష్యత్తు సమావేశా ల్లోనూ రాష్ట్రానికి మేలు జరిగేలా చూస్తాం..’ అని ఐటీ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి‘ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం జరిపిన భేటీ ఆసక్తికరంగా, ఫలప్రదంగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పనిచేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆసక్తి చూపించింది. పట్టణీకరణ, కాలుష్య రహిత నగరాలకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఆసక్తి చూపింది. పట్టణీకరణ ద్వారా ఎదురయ్యే మురుగునీరు, తాగునీటి సమస్యల పరిష్కా రానికి రాష్ట్రంతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది..’ అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరించారు.కాలిఫోర్నియా చేరుకున్న సీఎం బృందం రేవంత్‌రెడ్డి బృందం గురువారం కాలిఫోర్నియాకు చేరుకుంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, డాలస్, టెక్సా స్లో పర్యటన అనంతరం ఇక్కడికి వచ్చిన బృందానికి ఘన స్వాగతం లభించింది. కాలిఫోర్నియాలో దిగ్గజ కంపెనీల సీఈఓలతో ఈ బృందం భేటీ అవుతుంది. -
13 నిమిషాలు యథాతథం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖకవి అందెశ్రీ రచించిన ’జయజయహే తెలంగా ణ’ ను యథాతథంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివి గల ఆ పాట సాహిత్యం, ప్రతి చరణం అలాగే కొనసాగించాలని స్పష్టం చేశారు. ’జయజయహే తెలంగాణ గేయానికి బాణీలు, సంగీతకూర్పుపై ఆదివారం ఓ స్టూడియోలో గేయ రచయిత అందెశ్రీ, సంగీత ద ర్శకుడు కీరవాణి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి బోరెడ్డి అయోధ్యరెడ్డిలతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ భేటీలో అందెశ్రీ, కీరవాణిలకు ఆయ న పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మార్పుల అనంతరం మరోమారు సమావేశమై గేయానికి తుది రూపం ఇవ్వాలని నిర్ణయించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 13 నిమిషాలు గేయం ఆలపించడం అతిథులకు ఇబ్బంది కలిగిస్తుందేమో ననే అభిప్రాయంతో షార్ట్ వర్షన్ రూపొందించాలనే అభిప్రాయం చర్చకు వచి్చందని, ఈ షార్ట్ వర్షన్ బాధ్యత అందెశ్రీకి అప్పగించారని తెలుస్తోంది. -
ముఖ్యమంత్రా.. చెడ్డీగ్యాంగ్ లీడరా?
పటాన్‌చెరుటౌన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటతీరు చూస్తుంటే ముఖ్యమంత్రా..? లేక చడ్డీగ్యాంగ్ లీడరా అనే అనుమానం కలుగుతోందని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో గణేశ్‌గడ్డ దేవస్థానం వద్ద ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారరథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శిస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరితే.. ‘చడ్డీ విప్పుతా.. డ్రాయర్ విప్పుతా’ అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని ఇదేం భాషో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ భాషను ప్రజలు గమనిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫేక్ వార్తలు, లీక్ వార్తలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, కానీ, ఆ ఆటలు సాగవని..మెదక్ గడ్డ బీఆర్ఎస్కు అడ్డా అని చెప్పారు. -
7న పాతబస్తీలో మెట్రోరైలు పనులకు సీఎం శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో మెట్రో రైలు పను లకు ఈ నెల 7న ఫలక్‌నుమాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. దేశంలో ముస్లింలతో పాటు దళిత సామాజిక వర్గాలను టార్గెట్ చేసి నల్లచ ట్టాలను ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఏఐఎంఐఎం కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం మైదా నంలో శనివారం జరిగిన పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ముస్లిం, దళితులపై ఉక్కుపాదం మోపుతుందని, సీఏఏ చట్టం ఏన్పీఆర్, ఎన్ఆర్సీలో ఇమిడి ఉందని పేర్కొ న్నారు. మరోమారు బీజేపీ గద్దెనెక్కకుండా అడ్డుకో వాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ పదేళ్ల పాల నలో నిరుద్యోగం పెరిగి పోయిందని. హిందూత్వ ఎజెండా తప్ప అభివృద్ధి లేదన్నారు. దేశంలో మత చిచ్చుతో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్ని స్తోదని దుయ్యబట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌లో బీజేపీ పాగావేయాలన్నది ఆ పార్టీ పగటి కలేనని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి దమ్ముంటే ఇక్కడి నుంచి పోటీ చేయాలని మోదీకి సవాల్ విసిరారు. సభలో పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీతోపాటు పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న అసదుద్దీన్ -
హైదరాబాద్ మెట్రో విస్తరణ: ఏయే రూట్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని నివారించడంతోపాటు భవిష్యత్ రవాణా అవసరాలను, ఎయిర్‌పోర్టు కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకొని మెట్రోరైలు రెండో దశ ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు 70 కిలోమీటర్ల పొడవుతో రూపొందించిన ఫేజ్–2 మెట్రో రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. రెండో కారిడార్ పొడిగింపుతోపాటు నాలుగు కొత్త కారిడార్లు కలిపి కొత్త రూట్‌మ్యాప్‌ను రూపొందించారు. దీనికి ప్రభుత్వపరంగా ఆమోదముద్ర పడితే తదుపరి ప్రక్రియ మొదలవుతుందని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం రూపొందించిన విస్తరణ ప్రణాళికలను పక్కనబెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి మెట్రో కనెక్టివిటీ రీచ్ అయ్యేలా కొత్త రూట్‌ను డిజైన్ చేశారు. హైదరాబాద్ పాత నగరంతోపాటు కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ ఉండేలా రూపొందించడం విశేషం. రెండోదశ మెట్రో రూట్ మ్యాప్ ఇదీ... హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కి.మీ. మేర అందుబాటులో ఉంది. మియాపూర్ టు ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ టు రాయదుర్గం వరకు కనెక్టివిటీ ఉంది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించి, అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కి.మీ. పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు. కారిడార్ 4: నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు, అక్కణ్నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (మొత్తం 29 కి.మీ.), అలాగే మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు (4 కి.మీ.) ఉంటుంది. కారిడార్ 5: రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ (ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్) వరకు (8 కి.మీ.) కారిడార్ 6: మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు (14 కి.మీ.) కారిడార్ 7: ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు (8 కి.మీ.) -
సెట్స్‌పై స్పష్టత దిశ గా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిధిలోని ఉమ్మడి ప్రవేశ పరీ క్షల (సెట్స్)పై త్వరలోనే స్పష్ట త రానుంది. ఇప్పటికే విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతాధికారులు స మీక్ష చేపట్టి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఓ నివేదిక రూపొందించారు. సెట్స్‌కు కన్వీనర్లను నియమించే అంశాన్ని, ఏ పరీక్ష ఏ యూనివర్శిటీకి ఇవ్వాలనే దానిపై ప్రాథమిక అవగాహనకు వచ్చారు. వాస్తవానికి డిసెంబర్ చివరి నాటికే ఉమ్మడి ప్రవేశ పరీ క్షలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఉన్నత విద్యా మండలి చైర్మన్, వైస్ చైర్మ న్ను ప్రభుత్వం తొలగించడం, ఇంకా కొత్తవారి నియామకం జరగకపోవడంతో విశ్వవిద్యాల యాల అధికారులు సెట్స్‌పై తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి: ఉన్నత విద్య పరిధిలో ఎంసెట్ ప్రధానమైంది. ఆ తర్వాత ఎడ్‌సెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్ ఇలా అనేక ప్రవేశ పరీక్షలుంటాయి. ఎంసెట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఎంసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన తర్వాత యూనివర్శిటీలు కాలేజీల అనుబంధ గుర్తింపుపై దృష్టి పెడతాయి. కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ వంటి అంశాలను పరిశీలిస్తాయి. గతంలో ఈ ప్రక్రియ ఆలస్యమవ్వడం వల్ల కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇది అనేక ఇబ్బందులకు దారి తీస్తోంది. జేఈఈ కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే ఆఖరి దశ కౌన్సెలింగ్ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. వీలైనంత వరకూ మే మొదటి వారంలోనూ ఎంసెట్ నిర్వహణ పూర్తి చేయాలని, సరిగ్గా 15 రోజుల్లో ఫలితాలు వెల్లడించాలనే యోచనలో ఉన్నారు. ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలోనే... ఉన్నత విద్యా మండలి చైర్మన్, సభ్యుల నియామకానికి మరికొంత సమయం పట్టే అవకాశం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్, ఇతర సెట్స్‌పై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చాయి. పరీక్షల నాటికి నియామకాలు జరుగుతాయనీ, అప్పటి వరకూ నిర్ణయాలన్నీ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో ఉంటాయని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. కాగా, త్వరలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించే వీలుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అధికారులు శాఖాపరమైన పూర్తి సమాచారంతో సిద్ధమయ్యారు. సీఎం సమీక్షా సమావేశంలో సెట్స్‌పై స్పష్టత వస్తుందనీ, వచ్చే వారంలో సెట్స్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం!
సాక్షి, తెలంగాణ: 'కాంగ్రెస్ అంటే గందరగోళం. పార్టీలో నేతల ఇష్టారాజ్యం. ఇక ఎన్నికలొస్తే.. తెలంగాణ కాంగ్రెస్‌లో కనిపించే దృశ్యాలు అసాధారణంగా ఉంటాయి. టిక్కెట్స్ ఆరు నెలల ముందే ప్రకటిస్తామని చెప్పినా.. ఎప్పటిలాగే నామినేషన్ల చివరి రోజు వరకు ప్రహసనం సాగింది. కొన్ని చోట్ల సీనియర్లకే పార్టీ హైకమాండ్ ఝలక్ ఇచ్చింది. 20 మందికి పైగా అప్పటికప్పుడు కాంగ్రెస్‌లోకి వచ్చి టిక్కెట్లు తీసేసుకున్నారు. ఇలా ఉంటది కాంగ్రెస్‌తోని.. సీట్ల గందరగోళం ఎలా ఉందో ఓసారి చూద్దాం.' ఆశావహుల్లో టెన్షన్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్‌లో అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ రావడానికి చాలా మందే అభ్యర్థులను ఖరారు చేసేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఎప్పుడూ చేసే విధంగానే చివరి నిమిషం వరకు ఆశావహుల్లో టెన్షన్ పెంచింది. నల్గొండ జిల్లా మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మెదక్ నియోజకవర్గాల్లో మైనంపల్లి హనుమంతరావు, ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో వివేక్ వెంకటస్వామి వంటి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక అతి విచిత్రంగా జరిగింది. వీరంతా అప్పటికప్పుడు పార్టీలో చేరి అభ్యర్థులైపోయారు. ఇలాంటి నాయకులు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. పార్టీ అధికారంలో లేనపుడు బయటకు వెళ్ళిపోయి.. ఇప్పుడు అధికారం వస్తుందన్న ఆశతో మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడిన నేతలు ఇటువంటి వారిని చూసి హతావులవుతున్నారు. మొత్తానికి నాలుగు విడతలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. జాబితాల ప్రకటించడానికి ముందు పదుల సంఖ్యలో ఎన్నికల కమిటీ సమావేశాలు జరిగాయి. ఆశావాహుల నుంచి వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అర్దం అవుతోంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత టీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ గాంధీభవన్‌లో మూడు సార్లు కూర్చోని ఆశావహుల జాబితాను ఫిల్టర్ చేసింది. ఇక ఆ తర్వాత కథ అంతా ఢిల్లీలోనే నడిచింది. టిక్కెట్లు ఆశించిన నేతలు ఢిల్లీలో పడిగాపులు పడ్డారు. టిక్కెట్ దక్కినవారు సంబరాలు చేసుకుంటూ తిరిగివచ్చారు. ఆశాభంగం పొందినవారు నిరాశతో వెనుదిరిగారు. హైదరాబాద్ చేరాక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. కొత్తగా వారికే ఎక్కువగా అవకాశం.. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చాలా మంది సీనియర్లకు ఆ జాబితాలో చోటు ఇవ్వలేదు. ఇక రెండో జాబితా ప్రకటించాక మాత్రం టిక్కెట్ రాని నేతలు నానా యాగీ చేసారు. చాలా మంది నేతలు గాంధీ భవన్ ముందే తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. చివరికి గాంధీ భవన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థుల ఎంపికలో సునీల్ కనుగోలు ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల పేర్లను సునీల్ సిఫార్సు చేసారట. దీంతో చాలా సెగ్మెంట్లలో నేతల మధ్య గొడవలకు దారితీసాయని చెబుతున్నారు. దీంతో పాటు అసలు దరఖాస్తు చేయని నేతలకు టిక్కెట్ ఇవ్వడం పట్ల పార్టీ నేతల్లో వ్యతిరేకత వచ్చింది. చాలా మంది కొత్తగా వచ్చిన వారికి వెంటనే టిక్కెట్లు ఇవ్వడం పార్టీలో అశాంతికి కారణం అయింది. పార్టీలో టిక్కెట్లు అమ్ముకున్నారనే తీవ్ర ఆరోపణలు, దానిపై చర్చకు అప్పటికప్పుడు వచ్చినవారికి సీట్లు ఇవ్వడమే కారణం కావచ్చు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ..! ఇక అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చడంతో పెద్ద దుమారమే రేపింది. వనపర్తి, బోధ్, పటాన్చెరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి చివరి నిమిషంలో మార్చారు. ఇలా మార్చడానికి సునీల్ కనుగోలు ఒక కారణం అయితే.. నేతల ఒత్తిడి మరో కారణం అంటున్నారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో మూడు స్థానాల అభ్యర్థులను చివరి రోజు వరకు సాగదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. సూర్యాపేట విషయంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించడంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌ను కాదని మందుల సామ్యూల్కి టిక్కెట్ దక్కేలా చేయడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే అన్ని జిల్లాల్లో మెజారిటీ స్థానాలు తన మనుషులకు ఇప్పించుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. నల్లగొండలో మాత్రం ఫెయిలయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఇక యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూ ఐ, ఓబీసీ, ఎస్టి సెల్‌లకు టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. 119 సీట్లలో కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించగా మిగిలిన 118 సీట్ల లో 22 స్థానాలు బీసీలకు, 31 స్థానలు ఎస్సీ, ఎస్టిలకు, 65 స్థానాలు ఓసిలకు ఇచ్చారు. బీసీలకు 30 కి పైగా ఇవ్వాలని కాంగ్రెస్ మొదట భావించినప్పటికీ టిక్కెట్ల కేటాయింపులో అది సాధ్యం కాలేదు. -
TS Election 2023: బీఆర్ఎస్లో వన్ మేన్ షో ! మరో పార్టీ నో..!
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త బుయ్యని మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరడం వెనుక మర్మమేమిటనేది రాజకీయ వర్గాల్లో అంతుచిక్కని ప్రశ్నలా మారింది. బీఆర్ఎస్లో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వర్గంలో కీలక నేతగా ఉండటంతోపాటు మంత్రి కేటీఆర్‌తో సాన్నిహిత సంబంధాలున్నాయి. అలాంటి నేత పార్టీ వీడేందుకు సిద్ధమైతే బీఆర్ఎస్లో ఏ ఒక్క నేత ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే బుయ్యని మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఢిల్లీలో లేదా గాంధీభవన్‌లో పార్టీ కండువా వేసుకోవాలి. కాని చిన్నపాటి కార్యకర్తలా తాండూరులో చేరడం వెనుక కాంగ్రెస్‌లో ఆగ్రహజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోనే వ్యాపారవేత్తగా ఖ్యాతిగాంచిన బుయ్యని మనోహర్‌రెడ్డి నాటకీయ పరిణామాల నడుమ కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ హోదాలో కొనసాగుతున్నారు. మనోహర్‌రెడ్డి పరిగిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. మరోవైపు తన సొంత నియోజవకర్గంలో పర్యటించాలని అధికార పార్టీ నేతలు ఆంక్షలు విధించారంటూ ఆందోళనకు గురయ్యారు. బీఆర్ఎస్లో వన్‌మెన్ షో కొనసాగుతుందంటూ ఇక పార్టీలో కొనసాగడం కష్టమంటూ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరిన మనోహర్‌రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన పరిగిలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి టికెట్ ఖాయమని తెలుస్తోంది. దీంతో రామ్మోహన్‌రెడ్డి చొరవతో తాండూరు అసెంబ్లీ స్థానాన్ని మనోహర్‌రెడ్డికి కేటాయిస్తే ఇటు పరిగి నియోజకవర్గంలోని మనోహర్‌రెడ్డి అనుచరగణమంతా కాంగ్రెస్‌కి మద్దతు పలకడంతో పార్టీ గెలుపు అవకాశాలు అధికమయ్యాయంటూ పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో దశాబ్దానికి పైగా బుయ్యని సోదరులు రైస్ మిల్లుతో పాటు ఆర్బీఎల్ పరిశ్రమ ద్వారా తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టికెట్ కోసం సర్వే.. కాంగ్రెస్ అధిష్టానం అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ముగ్గురు కాంగ్రెస్ నాయకులకు సంబంధించి తాండూరు నియోజకవర్గంలో సర్వేలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తవుతుంది. మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థి అంటూ ప్రజల్లోకి.. తాండూరు అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ అభ్యర్థిగా వస్తారంటు ఇప్పటికే నియోజవకర్గంలోని మారుమూల గ్రామ ప్రజల వరకు వెళ్లింది. నెల రోజుల క్రితమే నియోజవకర్గంలో వాల్‌పోస్టర్లను అంటించారు. కేఎల్ఆర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ సభ్యులు, తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి రమేశ్ మహరాజ్ సైతం మద్దతు పలికారు. అయితే మనోహర్‌రెడ్డి తాండూరు పట్టణంలో పార్టీలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో తాండూరు అసెంబ్లీకి చేతి గుర్తు ఎవరిని వరిస్తోందనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న ఇద్దరు నేతలు.. తాండూరు అసెంబ్లీకి కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ఢిల్లీ స్థాయిలో లాభియింగ్ చేస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఢిల్లీలో మకాం వేశారు. అయితే ఇటీవల పార్టీలో చేరిన డీసీసీబీ మాజీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై భారం వేశారు. దీంతో మనోహర్‌రెడ్డికి టికెట్ ఇప్పించే బాధ్యత రేవంత్‌రెడ్డి భుజస్కంధాలపై వేసుకొన్నారు. తన నియోజకవర్గం ఆనుకొని ఉన్న తాండూరు సీటు విషయంలో రేవంత్‌రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. -
రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి లేదు
జయశంకర్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్‌కు లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోముఖ్య నాయకులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో ఏనాడూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని, అధికారంలోకి వచ్చాక రైతులకు రుణ మాఫీ చేస్తానన్న సీఎం కేసీఆర్, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, జిల్లా నాయకులు అంబాల శ్రీనివాస్, కాగితోజు రమణాచారి, గజవెల్లి అర్జున్, వెంకీ యా దవ్, మాచర్ల సంతోష్, ఫాజిల్, నారాయణ, పుల్ల మహేష్, తోట రంజిత్, నగునూరి రజినీకాంత్ గౌ డ్, చుంచుల మహేష్, బేతి పృథ్వి పాల్గొన్నారు. -కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దేవన్ -
రేవంత్‌రెడ్డి చంద్రబాబు శిష్యుడే !
వికారాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నారా చంద్రబాబునాయుడి శిష్యుడేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బీమా, రైతు బంధు పథకాలను ఎత్తేయడం ఖాయమని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చన్గోముల్లో చేవెళ్ల ఆరోగ్య రథాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రథాన్ని ప్రారంభించామన్నారు. ఆరోగ్య రథ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేవంత్‌రెడ్డి రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్‌లో ఉచిత విద్యుత్తు ప్రస్తావన లేదన్నారు. మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలా.... మూడు పంటల బీఆర్ఎస్ కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో రైతుల అవసరాల మేరకే విద్యుత్తు కొంటున్నామని అన్నారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించే వ్యక్తి ఎంపీ రంజిత్‌రెడ్డి అని అన్నారు. సొంత డబ్బులతో ఆరోగ్య రథాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లిక, ఎంపీపీ మల్లేశం, జెడ్పీటీసీ మేఘమాల, మార్కెట్‌కమిటీ చైర్మన్ అజారుద్దీన్, పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రహీస్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం!
ఆదిలాబాద్‌రూరల్: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మా వల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా ట్రాక్టర్లతో చేపట్టిన భారీలో పాల్గొన్నారు. అనంత రం ఆయన మాట్లాడారు. రైతు బాగుపడితే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో రైతు ల సమస్యలు పరిష్కరించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమయిందన్నారు. మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ అన్నదాతపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, జెడ్పీటీసీ వనిత రాజేశ్వర్, సర్పంచ్ ప్రమీల రాజేశ్వర్, ఎంపీపీ సంగీత, నాయకులు ప్రహ్లాద్, నారాయణ పాల్గొన్నారు. రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడం సిగ్గుచేటు జైనథ్: సాగుకు కేవలం మూడు గంటల విద్యుత్ మా త్రమే చాలంటూ రైతాంగాన్ని కించపర్చిన రేవంత్ రెడ్డి ఇంకా రైతులకు క్షమాపణలు చెప్పకపోవడం సి గ్గుచేటని ఎమ్మెల్యే రామన్న అన్నారు. మండలంలోని సిర్సన్న గ్రామంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, నాయకులు వెంకట్‌రెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తర తెలంగాణలోని 20 అసెంబ్లీ సీట్లపై కాంగ్రెస్ ఫోకస్
-
నేనే వార్ రూమ్ ఇన్చార్జిని: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘వార్ రూమ్’కు తానే ఇన్చార్జినని ఆ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల కోసం ఈ వార్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ జరిగే ప్రతీ రాజకీయ వ్యవహారం తన పర్యవేక్షణలోనే జరుగుతుందని పేర్కొంటూ.. తెలంగాణ గళం ఫేస్బుక్ పేజీతో ముడిపడి ఉన్న వార్ రూమ్ కేసుకు సంబంధించి ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లేఖ రాశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ కేసులో తన వాంగ్మూలం నమోదు చేయడానికి బదులు సంబంధం లేని వ్యక్తులను విచారణకు పిలుస్తున్నారని పేర్కొన్నారు. తమ వార్ రూమ్‌లో పని చేస్తున్న ముగ్గురు యువకులను అకారణంగా నిర్బంధించారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు పిటిషన్ వేస్తాం: ఎమ్మెల్యేలకు ఎర కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ కేసు విషయంలో న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని కూడా సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతామని, ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని మల్లు రవి వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలు సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్, బెల్లయ్య నాయక్, పున్నా కైలాశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైన ఘటనలు ఉన్నాయి కానీ ఒక పార్టీ శాసనసభాపక్షం మరో పార్టీలో విలీనం అయినట్టు చరిత్రలో లేదని అన్నారు. హస్తం గుర్తు మీద గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలకు లబ్ధి చేకూర్చి, పదవులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ మేరకు సీబీఐ, ఈడీ, ఏసీబీలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరి లబ్ధి పొందిన విషయంలో అన్ని ఆధారాలను సేకరించామని, ఈ ఆధారాలతో కోర్టుకు వెళతామని మల్లురవి వెల్లడించారు. -
రేవంత్ రెడ్డిపై ఏఐసీసీ ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ అసహనం
-
‘బీజేపీవి వేషాలు.. టీఆర్ఎస్ది అతి తెలివి’
సాక్షి, హైదరాబాద్: నిజాం సంస్థానం భారత యూనియన్‌లో కలిసిన రోజును విలీనమని టీఆర్ఎస్, విమోచనమని బీజేపీలు మాట్లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు అసలు తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజున మనుగడలోనే లేవని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. ముస్లింలపై హిందువులు గెలిచినట్టు బీజేపీ వేషాలు వేస్తుంటే.. హిందూ, ముస్లింలను మచ్చిక చేసుకోవాలనే ఆలోచనతో టీఆర్ఎస్ అతి తెలివి తేటలు ప్రదర్శిస్తోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే ఉన్న పేటెంట్ హక్కును దొంగిలించి రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీలు మల్లురవి, అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో కలిసిన రోజున తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని, అది జరిగి 75 ఏళ్లవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏడాది పాటు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రగతిభవన్‌లో సోదాలు జరపాలి.. లిక్కర్ స్కాంలో సోదాలంటూ బీజేపీ చేస్తున్న డ్రామాలను నమ్మేందుకు రాష్ట్రంలో వెర్రి వెంగళప్పలు ఎవరూ లేరని రేవంత్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కుమార్తె కవిత లేదా ఇతరుల పాత్ర ఉంటే ప్రగతిభవన్‌లో సోదాలు జరిపి, సీఎం కేసీఆర్‌ను విచారిస్తే ఆధారాలు లభిస్తాయని చెప్పారు. సీబీఐ విచారణ జరిపించాలి.. వేరే పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరినందుకు వారికి ముట్టిన డబ్బులు, లభించిన కాంట్రాక్టులు, జరిగిన భూముల రెగ్యులరైజేషన్లపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తానన్న నమ్మకం సీఎం కేసీఆర్‌కు లేదని అన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ 25 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాన్ని ఆరు నిమిషాల్లోనే వాయిదా వేయడంపై స్పందిస్తూ.. కేసీఆర్ అరాచక చక్రవర్తి అన్నారు. అక్టోబర్ 24 నుంచి తెలంగాణలో జరగనున్న భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలన్నా రు. అంతకుముందు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ రూపొందించిన భారత్ జోడో యాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఇదీ చదవండి: దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామాలు: బండి సంజయ్ -
మునుగోడు ప్రచారానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బైబై! సోనియాకు లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య వివాదం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం పార్టీ మారతారనే ఊహాగానాల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏఐసీసీ నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాకపోవటంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ‘రేవంత్ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమయ్యింది. ఆయనతో వేదిక పంచుకోలేకనే.. సమావేశానికి హాజరుకాలేదు. అనుచరులతో రేవంత్ అవమానకరంగా మాట్లాడిస్తున్నారు. మాకు ప్రాధాన్యత లేదు.. అందుకే మునుగోడు ప్రచారానికి వెళ్లను. మాణిక్కం ఠాగూర్‌ను తెలంగాణ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించాలి. ఆయన స్థానంలో కమల్‌నాథ్ లాంటి వాళ్లకు ఇన్‌ఛార్జ్‌గా ఇవ్వాలి. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.’ అని లేఖలో సోనియాకు ఫిర్యాదు చేశారు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి. ఇదీ చదవండి: పొలిటికల్ హీట్..హాట్ సీట్‌గా ఖమ్మం.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్? -
హస్తినలో తేలని ‘కోమటిరెడ్డి’ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీ మారకుండా ఆయన్ను బుజ్జగించేందుకు జరిపిన చర్చలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించాకే అంతిమంగా ఒక నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. చర్చల సారాంశంపై సోనియాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివేదిక సమర్పించాక ఆమె నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ అమలుకానుందన్నారు. మరోవైపు సోమవారం రాత్రి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం మరోసారి జరిగింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఇందులో మునుగోడు వ్యవహారంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం రేవంత్, వెంకట్‌రెడ్డి, జానా, ఉత్తమ్లతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. మునుగోడులో రాజకీయ పరిణామాలు సహా పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించామని, 2–3 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను మీడియాకు వివరిస్తామన్నారు. చదవండి: ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు -
Hyderabad: గులాబీకి కూర్పు, కాంగ్రెస్‌కు మార్పు.. బీజేపీ కట్టడిలో రెండూ విఫలం
సాక్షి, సిటీబ్యూరో: గులాబీకి సారథి ఉన్నా.. కార్యవర్గ కూర్పు జరగలేదు. ఇక కాంగ్రెస్ సేనాని అస్త్రసన్యాసం చేసి ఏడాదిన్నరైనా కొత్త బాస్‌ను ఎంపిక చేయలేదు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నా.. అధికార, విపక్ష పార్టీలు మాత్రం నగరంలోని పార్టీలను గాడిలో పెట్టేదిశగా అడుగులు వేయడం లేదు. నాలుగేళ్ల క్రితం జిల్లా కమిటీల వ్యవస్థను రద్దు చేసిన టీఆర్ఎస్ దళపతి.. ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యకలాపాలు సాగించారు. పార్టీని సమన్వయపరచడంలో ఇబ్బందులు తలెత్తడంతో మరోసారి పాత పద్ధతిలో కమిటీలను పునరుద్ధరించారు. ఆ మేరకు జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన టీఆర్ఎస్ బాస్.. హైదరాబాద్ జిల్లా పగ్గాలను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు అప్పగించారు. బాధ్యతలు అప్పగించి ఆరు నెలలైనా.. ఇప్పటివరకు కార్యవర్గాన్ని ప్రకటించలేదు. అనుబంధ కమిటీల ఊసేలేదు. కేవలం అధ్యక్ష పదవితోనే సరిపెట్టారు. దీంతో జిల్లా అధ్యక్షులు కేవలం ఉత్సాహ విగ్రహాలుగానే మారారు. పార్టీ పదవులు ఆశించిన ద్వితీయ శ్రేణి నేతలు ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఆశలు వదులుకున్నారు. బీజేపీ కట్టడిలో రెండు పార్టీలూ విఫలం గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు సాధించిన భారతీయ జనతాపార్టీ... హైదరాబాద్‌పై పట్టు బిగించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణతో మరింత దూకుడు పెంచింది. జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్ రేప్, డ్రగ్స్ తదితర అంశాలపై ఉద్యమాలు సాగించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలపడే విధంగా పావులు కదుపుతోంది. ఇదే సమయంలో బీజేపీ దూకుడును అడ్డుకోవడంలో గులాబీ నగర నాయకత్వం చేతులెత్తేసింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మినహా స్వతహాగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంలేదు. కనీసం అసెంబ్లీ స్థాయిలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలను కూడా నిర్వహించలేకపోతోంది. ప్లీనరీ వేళ మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకొంది. ఎమ్మెల్యేగా, అధ్యక్షుడిగా జోడు పదవులు ఉండడంతో పార్టీకి సరైన న్యాయం చేయడం లేదనే విమర్శలున్నాయి. హస్తవాసి మారేనా? పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలని భావించిన పీసీసీ నాయకత్వం.. హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా విభజించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం సంస్థాగతంగా మంచిదే అయినా.. రెండేళ్లుగా జిల్లా కాంగ్రెస్ కమిటీని నియమించలేదని అధిష్టానం.. ఈ మూడింటికి సారథులను ఎక్కడి నుంచి తెస్తుందనే అనుమానం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. 15 అసెంబ్లీ సెగ్మెంట్లను అయిదేసీ నియోజకవర్గాల చొప్పున హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జిల్లాలుగా కాంగ్రెస్ కమిటీలు వేయాలని పీసీసీ ప్రతిపాదించింది. దీనికి ఏఐసీసీ కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ డీసీసీ పరిధిలో సికింద్రాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, కంటోన్మెంట్.. హైదరాబాద్ డీసీసీ పరిధిలో చార్మినార్, బహుదూర్‌పుర, మలక్‌పేట్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట.. ఖైరతాబాద్ డీసీసీ పరిధిలో ఖైరతాబాద్, అంబర్పేట్, గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలు ఉండనున్నాయి. హైదరాబాద్‌పై కాంగ్రెస్ అధిష్టానం మొదటి నుంచి అంతగా దృష్టి సారించలేదు. రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉన్న రాజధానిపై నాయకత్వానికి కనీస వ్యూహం కూడా లేదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా నగరాన్ని మూడు డీసీసీలుగా విభజించిందనే ప్రచారం జరుగుతోంది. అంజన్ నిష్క్రమణతో.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ మాజీ ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఏఐసీసీ కట్టబెట్టింది. దీంతో అప్పటి నుంచి హైదరాబాద్ నగర కాంగ్రెస్‌కు సారథి లేకుండా పోయారు. సరైన సారథ్యం, మార్గనిర్దేశం లేకపోవడంతో నగరంలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడింది. ఆఖరికి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలోనూ చతికిలపడింది. సభ్యత్వ నమోదుపై కనీసం సమీక్షించేవారు లేకపోవడంతో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నగర ప్రజల సమస్యలపై పోరాటంలోనూ ఆ పార్టీ వెనుకబడింది. బీజేపీ ఒకవైపు దూకుడుగా ముందుకెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం సారథి, కార్యవర్గం లేకపోవడమే. తాజాగా మూడు డీసీసీలను నియమించాలని పీసీసీ నిర్ణయించిన నేపథ్యంలో కొత్త కెప్టెన్లయినా పార్టీని గాడిలో పెడతారో లేదో వేచిచూడాల్సిందే! చదవండి: దమ్ముంటే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చెయ్ -
పీసీసీ: కలకలం రేపిన రేవంత్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడి నియామకం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ’పట్టు‘విడుపులు లేని నాయకుల పంతాలతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలలో ఎవరో ఒకరిని ఈ పదవి వరిస్తుందనే చర్చ నిన్నటి వరకు జరగ్గా, ఇప్పుడు అనూహ్యంగా మరికొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ ఇద్దరూ కాకుండా మధ్యేమార్గంగా రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు టి.జీవన్‌రెడ్డి, కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డిల పేర్లు ముందు వరుసలోకి వచ్చాయి. ఒకదశలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న ప్రచారం కూడా జరి గింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడొచ్చంటూ మంగళవారమంతా హడావుడి జరిగింది. కానీ, సాయంత్రానికి అలాంటిదేమీ లేదని అధిష్టానం తేల్చడంతో కాంగ్రెస్ శ్రేణులు నిట్టూర్చాయి. సామాజిక సమీకరణలు, పంతాలు, పట్టింపులు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, త్వరలో జరగబోయే ఎన్నికలు లాంటి అంశాల నేపథ్యంలో అసలు టీపీసీసీకి ఎవరిని ఎంపిక చేయాలన్నది పార్టీ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి నాటికల్లా వ్యవహారాన్ని తేల్చాలా... నాగార్జునసాగర్ ఉపఎన్నిక వరకు వేచి ఉండాలా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలతో...! వాస్తవానికి సోమవారం వరకు టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తానే టీపీసీసీ అధ్యక్షుడిననే ధీమాతో ఉన్న రేవంత్ ఉన్నట్టుండి తనకు అధ్యక్ష పదవే ముఖ్యం కాదని, ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఎలాంటి ఇబ్బంది లేదంటూ చేసిన వ్యాఖ్యలతో అసలు పార్టీలో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే జీవన్‌రెడ్డి అధ్యక్షుడిగా, రేవంత్ ప్రచార కమిటీ చైర్మన్‌గా మంగళవారం అధికారిక ప్రకటన వెలువడుతుందనే ప్రచారం జరిగింది. అసలేం జరిగింది? టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇచ్చినా ఫర్వాలేదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వర్గాలు పలురకాలుగా విశ్లేషించాయి. పీసీసీ అధ్యక్ష పదవే కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అధిష్టానానికి ఆయన వెసులుబాటు కల్పించారని, ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తాననే సంకేతాలు ఇచ్చారనే చర్చ జరిగింది. మరోవైపు అధిష్టానం నుంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే రేవంత్ అలా మాట్లాడారని, ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఖరారైందనే ప్రచారం సాగింది. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుని ఎంపికపై గురువారం నుంచి కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనున్న నేపథ్యంలో... ఈలోపే తెలంగాణ పీసీసీని తేల్చేస్తుందనే అంచనాతో ఈ ఊహాగానాలు సాగాయి. ఈ నేపథ్యంలో జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్లకు ఫలానా పదవులంటూ రాష్ట్రంలో చర్చ జరిగిందని ఏఐసీసీ వర్గాలు చెపుతున్నాయి. సామాజిక సమీకరణాల మాటేమిటి? ఒకవేళ టీపీసీసీ అధ్యక్షునిగా జీవన్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ఖరారు చేసిన పక్షంలో రెండు కీలక పదవులూ ఒకే సామాజిక వర్గానికి దక్కుతాయని, అది చాలా నష్టానికి కారణమవుతుందనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితుల ప్రకారం పీసీసీ అధ్యక్షుడు లేదా ప్రచార కమిటీ చైర్మన్ పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి తప్పకుండా కేటాయించాలని, అయితే రెండో పదవిని మాత్రం బీసీ లేదా ఎస్సీలకు కేటాయించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. నిన్నటి వరకు టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేస్తారన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయనకు సీడబ్ల్యూసీలో ఆహ్వానితుడిగా అవకాశం ఇస్తారనే ప్రచారం ఉన్నా... ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కాదని ఆయనకు కేటాయించే పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవేళ కోమటిరెడ్డికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇస్తే టీపీసీసీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులన్నీ ఒకే సామాజిక వర్గానికి కేటాయించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీలోని ఇతర సామాజిక వర్గ నేతలను ఎక్కడ సర్దుబాటు చేయాలన్నది అధిష్టానానికి రిస్క్ ఫ్యాక్టర్‌గా మారిందని టీపీసీసీలో కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో బీజేపీ దూసుకువస్తోంది. ఆ పార్టీకి బీసీ అధ్యక్షుడు ఉన్నారు. టీఆర్ఎస్ కూడా బీసీలకు అనేక సమయాల్లో ప్రాధాన్యం ఇచ్చింది. మేం బీసీ, ఎస్సీలను విస్మరిస్తే నష్టమే జరుగుతుంది. తేడా వస్తే పునాదులే కదులుతాయి.. ఆచితూచి అడుగేయాలి’అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సాగర్ ‘గుబులు’ మరోవైపు టీపీసీసీ అధ్యక్ష ఎన్నిక వ్యవహారాన్ని తేల్చకపోవడానికి నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా కారణమని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అసంతృప్తులు, అలకలతో పార్టీ నేతలు సహకరించకపోతే... పార్టీకి నష్టం జరుగుతుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత జరుగనున్న సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవకపోతే రాష్ట్రంలో ఇక ఆ పార్టీ పరిస్థితి అంతేననే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో సాగర్ ఎన్నిక పూర్తయ్యేవరకు టీపీసీసీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానాన్ని అడిగినట్టు గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి. ముఖ్యంగా తన జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఈ ఎన్నికల్లో తనకు అవసరమని, ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని జానా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఉపఎన్నిక జరుగుతుందన్న అంచనా మేరకు అప్పటివరకు ఈ తలనొప్పి వ్యవహారాన్ని వాయిదా వేద్దామా..? లేక ముందుగా అనుకున్నట్టు సంక్రాంతి లోపు తేల్చేద్దామా? అనే తర్జనభర్జనలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవన్‌రెడ్డికి అభినందనల వెల్లువ కాగా టీపీసీసీ అధ్యక్షుడిగా జీవన్‌రెడ్డి పేరు ఖరారైందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. మంగళవారం ఆయన పుట్టినరోజు కూడా కావడంతో జగిత్యాలలోని జీవన్‌రెడ్డి నివాసానికి అభిమానులు బారులు తీరారు. అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడి విషయంలో ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాల్సిందేనని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష వ్యవహారంలో ఇంకా ఏమీ తేలలేదని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ ‘సాక్షి’కి వెల్లడించారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. మహానాడు వేదికగా కుట్ర... టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్‌కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రేవంత్ అనుచరుడు ఉదయ్‌సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్‌రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్‌రెడ్డి ఉదయ్‌సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు. -
దుబ్బాక నిధులు సిద్దిపేటకు తరలించారు
సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దగుండవెళ్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చింతమడకలో చదువుకున్న అని చెప్పుకునే కెసిఆర్..చింతమడక తరహా పది లక్షలు పెద్దగుండవెళ్లిలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దుబ్బాకకు సిద్దిపేట నుంచి 40 సంవత్సరాల నుండి దాయాదుల పోరు ఉందని, దుబ్బాకకు వచ్చిన అనేక నిధులు సిద్దిపేటకు తరలించారని ఆరోపణలు గుప్పించారు. మూడు నియోజకవర్గాల మద్య ఉన్న దుబ్బాక ఎందుకు అభివృద్ధి చెందలేదు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిపిస్తే రామలింగారెడ్డి మీ చేతిలో చిప్ప పెట్టిండు. హరీష్ రావు సిద్దిపేట నుండి వచ్చి ఏ మోహం పెట్టుకొని ఓట్లడుగుతుండు. నాలుగు సార్లు గెలిపిస్తే చేయని అభివృద్ధిని మళ్లీ చేస్తాడంటే నమ్ముతమా. దుబ్బాక అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ ను 100 అడుగుల లోతుకు పాతిపెట్టాలి అంటూ రేవంత్ విమర్శనస్ర్తాలు సంధించారు. (దుబ్బాక ఉప ఎన్నిక: ఎవరి ధీమా వారిదే) కల్వకుంట్ల మాటలు నమ్మి మోసపోయారు నవంబర్3న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కోరారు. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలు కల్వకుంట్ల మాటలు నమ్మి అనేకసార్లు మోసపోయారని, మరోసారి అలా జరగకూడదన్నారు. ముత్యంరెడ్డి , రామలింగారెడ్డి ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో పోల్చి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్వయానా రామలింగారెడ్డి అసెంబ్లీలో నేనేమి చేయలేకపోతున్న అన్నారని, మరి ఆయన సతీమణితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలిస్తే టిఆర్ఎస్లోకి పోతాడని, రఘునందన్, హరీష్ రావు బంధువులని పేర్కొన్నారు. బిజెపికి ఓటేస్తే వృధా అవుతుందని, దుబ్బాక దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం దిగిరావాలన్నారు. -
పీసీసీ చీఫ్ ఉత్తమ్, రేవంత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ హత్యాచార ఘటనకు నిరసనగా ట్యాంక్‌బండ్‌పై కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను పోలీసులు అడ్డగించారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై యూపీ పోలీసుల దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి తెలంగాణ బీజేపీ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతల రాకపై సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేత అనిల్ యాదవ్‌పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ ర్యాలీ నిర్వహించగా, ఆ పార్టీ కార్యకర్తలు గాంధీభవన్ వైపు దూసుకెళ్లారు. రాహుల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. పోటాపోటీ ప్రదర్శనలతో గాంధీభవన్, బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని హథ్రాస్‌లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న రాహుల్ గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. చదవండి : నిరంతరం ప్రజల్లో ఉండాలి -
ఉత్తమ్‌కు మంత్రి జగదీష్ సవాల్..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు తోడు దొంగలుని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తమ్ పద్మావతికి హుజూర్నగర్ టికెట్ ఇవ్వొద్దన్న రేవంత్‌ను ప్రచారానికి దింపి, ఉత్తమ్ తన దివాళా కోరుతనాన్ని చాటుకున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఓటుకు నోటు కేసులో యాభై లక్షల రూపాయాలతో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడితే.. ఉత్తమ్ కారులో మూడు కోట్ల రూపాయలు అగ్నికి ఆహుతయ్యాయని గుర్తు చేశారు. ఈ ఇద్దరు దొంగలు కలసి హుజూర్నగర్ నియోజకవర్గంపై దాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కు సవాల్ విసిరిన మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఉత్తమ్‌కు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. సమయం, స్థలం తాను చెప్పినా లేదా.. తనని చెప్పమన్నా సరే సిద్ధమన్నారు. అది హుజూర్నగర్ సెంటరా.. సూర్యాపేట సెంటరా అన్నది తేల్చుకోవాల్సింది ఉత్తమ్‌కుమార్ రెడ్డినే అని వ్యాఖ్యానించారు. శాసన సభ్యుడిగా తన ఐదేళ్ల కాలంలో సూర్యపేటలో జరిగిన అభివృద్ధి గురించి ఉత్తమ్ తెలుసుకోవాలన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి 20 ఏళ్లు శాసన సభ్యుడిగా, మంత్రిగా అధికారంలో ఉండి చేసిందేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు. హుజూర్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతికి అభివృద్ధి చేయడం ఎలానో తెలియదనే.. కోదాడ ప్రజలు ఇంటికి పంపారని ఘాటుగా విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు జ్ఞాపకశక్తి ఎక్కువ అని, ఉత్తమ్, రేవంత్‌రెడ్డి అరాచకాలను ఎప్పటికీ మరచిపోరన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.