డల్లాస్, డెట్రాయిట్‌కు సర్వీసులు నడపండి | provide Flight service to Dallas, Detroit | Sakshi
Sakshi News home page

డల్లాస్, డెట్రాయిట్‌కు సర్వీసులు నడపండి

Published Thu, Jul 13 2017 1:05 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

డల్లాస్, డెట్రాయిట్‌కు సర్వీసులు నడపండి - Sakshi

డల్లాస్, డెట్రాయిట్‌కు సర్వీసులు నడపండి

టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డెట్రాయిట్, డల్లాస్‌లలో నివసిస్తు న్న తెలుగు ప్రజల సౌకర్యం కోసం హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపాలని టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కోరారు.

ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుకు ఆయన ఒక లేఖ రాశారు. ఇటీవల నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కార్యక్రమాల్లో తాను పాల్గొన్న సందర్భంలో అక్కడ నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాలు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement