detroit
-
Mystery: ఆ మాటలు వణుకు పుట్టించాయి! మత్స్యకారుల వలలో మృతదేహం! నేటికీ..
అది 2010 జనవరి 12, రాత్రి ఎనిమిది కావస్తోంది. పన్నెండు డిగ్రీల వాతావరణంలో మంచు.. వానలా కురిసే రోజులవి. అమెరికాలోని మిషిగన్‌లో సెయింట్ పాల్ కేథలిక్ చర్చ్‌కి, క్లెయిర్ సరస్సుకు మధ్యలో వన్–వే ఎగ్జిట్ డ్రైవ్‌వేలో పెట్రోలింగ్ చేస్తున్న లెఫ్టినెంట్ ఆండ్రూ దృష్టి.. ఆగి ఉన్న ఓ సిల్వర్ కలర్ కారు మీద పడింది. అది సరస్సుకు వంద అడుగుల దూరంలో ఉంది. దగ్గరకు వెళ్లిన ఆండ్రూ కారుని పరిశీలనగా చూశాడు. కారులో ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కలా ఎవరూ లేరు. ‘ఇన్ఫర్మేషన్ నెట్వర్క్’లో కారు నంబరు చెక్ చేసి, కారు మిషెల్ అనే అమ్మాయి పేరు మీద ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. కారుకి ఏదైనా సమస్య వచ్చి వదిలారనుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో గంట తర్వాత పెట్రోలింగ్‌లో ఉన్న పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ కీత్ దృష్టి కూడా ఆ కారు మీదే పడింది. కారు ముందు సీట్లో హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో అతడికి అనుమానం మొదలైంది. మంచునేలపై కొన్ని అడుగుల ఆనవాళ్లు.. కారు నుంచి సరస్సు వైపు దారిని చూపడంతో, కీత్ వాటినే అనుసరించాడు. సుమారు 75 అడుగుల తర్వాత రెండు విరిగిన దిమ్మలపై పేరుకున్న మంచు మరింత రక్తికట్టించే కథను చెప్పు కొచ్చింది. ఒక దిమ్మపై మనిషి కూర్చున్నట్లు, మరో దిమ్మపై మనిషి జారి సరస్సులో పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని గమనించిన కీత్, వెంటనే ఆండ్రూ సాయం కోరాడు. తక్షణమే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. కారు నంబర్ ఆధారంగా.. అడ్రెస్ పట్టుకుని.. తొమ్మిదిన్నర అయ్యేసరికి మిషెల్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. కాలింగ్ బెల్ కొట్టగానే.. ‘ఇంత ఆలస్యమా?’ అన్నట్లు మిషెల్ ఆత్రంగా తలుపు తీసింది. అప్పటి దాకా సరస్సులో పడింది మిషెల్ అనుకున్న పోలీసులు, తలుపు తీసింది స్వయంగా ఆమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వచ్చింది తన తల్లి జోవాన్ అనుకున్న మిషెల్.. పోలీసులను చూసి షాక్ అయ్యింది. కారు జోవాన్(50) తీసుకుని వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు, ‘మీరు ఆమెతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు మిషెల్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే తల్లి ఫోన్‌కి వరసగా డయల్ చేస్తూనే ఉంది. ‘దిస్ నంబర్ ఈజ్ అవుటాఫ్ స్టేషన్’ అనే మాటలు వణుకు పుట్టించాయి. రాత్రి పది దాటేసరికి మిషెల్, తన చెల్లెలు కెల్లీ, తమ్ముడు మైకేల్ ముగ్గురూ కలిసి బిక్కు బిక్కమంటూ పోలీసుల వెంట సరస్సు దగ్గరకు వెళ్లారు. కారు చుట్టూ ఉన్న క్రైమ్ సీన్ టేప్ వాళ్లని మరింత భయపెట్టింది. ఎటు చూసినా పోలీసులే! వారిలో ఒక పోలీస్ ‘జోవాన్ మీ మదరా? ఆవిడ ఈ లేక్‌లో పడిపోయారు’ అన్న మాటలు చుట్టూ చెలరేగే శబ్దాలను నిశబ్దం చేస్తూ ఒక్కసారిగా వారిని దుఃఖంలో ముంచెత్తాయి. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లలతో, లేక్ షోర్ డ్రైవ్‌లతో సరస్సు మొత్తం జల్లెడపడుతున్నాడు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు సర్చ్ ఆపేసి, కారును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. ఏదైనా సమాచారం అందితే చెబుతామంటూ మిషెల్ వాళ్లని ఇంటికి పంపించేశారు. జోవాన్ 1980లో డేవిడ్ రోమైన్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన ఇరవై ఐదేళ్లకి విడాకులు ఇచ్చి, తన ముగ్గురు పిల్లలతో కలిసి బతకడం మొదలుపెట్టింది. అయితే విడిపోయే వరకూ ఇద్దరి మధ్య చాలా గొడవలు నడిచాయి. జోవాన్‌కు స్నేహితులు ఎక్కువ. ఎప్పుడూ పార్టీలు, గెట్ టుగెదర్ అంటూ జీవితంలో తనకు తానే సంతోషాన్ని సృష్టించుకునేది. అలాంటి మనిషి అకస్మాత్తుగా కనిపించకపోవడం ఆమె పిల్లలకే కాదు, ఆమె సన్నిహితులకు కూడా మింగుడుపడలేదు. జోవాన్ తప్పకుండా తిరిగి వస్తుందనే వారంతా నమ్మారు. మర్నాడే కారు స్పేర్ కీతో హ్యాండ్ బ్యాగ్ బయటికి తీశారు పోలీసులు. అందులో 15 వందల డాలర్లు సురక్షితంగా ఉండటంతో, ఈ కేసు కుట్రపూరితం కాదని తేల్చేశారు. సరిగ్గా డబ్భై రోజులకు బోబ్లో దీవిలో డెట్రాయిట్ నదిలో మత్స్యకారుల వలలో ఓ మృతదేహం చిక్కింది. అది జోవాన్దేనని తేలింది. ఆ దీవి.. క్లెయిర్ సరస్సుకు 35 మైళ్ల దూరంలో ఉంది. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, ‘మా మామ్‌ని ఎవరో కావాలనే చంపేశారు. కేసు తారుమారు చేయడంలో పోలీసుల పాత్ర కూడా ఉంది, తను మిస్ అవ్వడానికి ముందురోజుల్లో తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడింది’ అంటూ కోర్టుకెక్కారు జోవాన్ పిల్లలు. ఆ రోజు కారు సమీపంలో, సరస్సు చుట్టు ప్రక్కల పాదముద్రలు కానీ, సరస్సులో పడిన ఆనవాళ్లు కానీ లేవని చీఫ్ జెన్సన్ తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులపై నమ్మకం లేని మిషెల్.. రాండాల్ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని నియమించుకుంది. అతడు చర్చిలో చాలామంది సాక్షులతో మాట్లాడాడు. ఆ రోజు చర్చి నుంచి బయటికి వచ్చే సమయంలో జోవాన్ కారు నుంచి అలారం మోగిందని, పొరబాటున టచ్ అయ్యి ఉంటుందనుకున్నామని కొందరు, సమీపంలో ఓ నల్లటి వ్యాన్ని, నల్ల కండువా ధరించిన మనిషిని చూశామని మరికొందరు చెప్పుకొచ్చారు. మరి జోవాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చర్చికి వెళ్లేముందు ఎందుకు కారులో గ్యాస్‌ని ఫుల్ ట్యాంక్ చేయించింది? గ్యాస్ట్స్టేషన్ మేనేజర్‌తో ఎందుకంత సంతోషంగా మాట్లాడింది? సరసులో గంటల తరబడి వెతికినా దొరకని మృతదేహం అంతదూరం నీటిలో ఎలా వెళ్లింది? వంటి ఎన్నో అనుమానాలను లేవనెత్తాడు రాండాల్. జోవాన్ శవపరీక్షలో పాల్గొన్న డాక్టర్ జెంట్జెన్.. మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె ఊపిరితిత్తులలో నీరు లేదని, అంటే నీటిలో పడకముందే ఆమె ప్రాణాలు పోయాయని ధ్రువీకరించాడు. అయితే అది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అనేది తేల్చలేకపోయాడు. మృతదేహం కోటు జేబులోనే అసలు కారు కీస్ దొరికాయి. జోవాన్ అదృశ్యం కావడానికి నెల్లాళ్ల ముందు.. కారుతో పాటు ఇంటి స్పేర్ కీస్ కూడా కనిపించడం లేదని కూతురు మిషెల్‌తో చెప్పింది. అయితే పోలీసులకు కారు స్పేర్ కీ ఎలా అందింది అనేది అనుమానాస్పదమే. మరోవైపు జోవాన్ మృతదేహాన్ని పరిశీలించిన మిషెల్, ‘మా మామ్ ఎప్పుడూ కోటును ఇలా గడ్డం వరకూ జిప్ చేసుకోదు. అలాగే తను ఎప్పుడూ హ్యాండ్ బ్యాగ్‌ని ఎడమ చేతికే వేసుకునేది. అదే చేతికి రెండు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్‌కి చిరుగులు ఉన్నాయి. పైగా అది పదిరోజుల క్రితం కొన్న కొత్త బ్యాగ్. బహుశా కిల్లర్‌కి, మామ్‌కి మధ్య జరిగిన పెనుగులాటలో ఆ డ్యామేజ్ జరిగి ఉంటుంది’ అని ఆరోపించింది. హత్యకు కారకులుగా.. తండ్రి డేవిడ్, మేనమామలు జాన్, బిల్లతో పాటు జోవాన్ కజిన్ టిమ్ మటౌక్లపై అనుమానం వ్యక్తం చేసింది మిషెల్. తన తల్లికి తండ్రితో ఉన్న వ్యక్తిగత తగాదాలతో పాటు మిగిలిన వారితో ఉన్న ఆర్థిక తగాదాలను కారణంగా చూపించింది. జోవాన్‌కి సంబంధించిన రోజరీ (మెడలో వేసుకునే శిలువ), సెల్‌ఫోన్ ఇప్పటికీ దొరకలేదు. స్కాట్ లూయీ అనే మరో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ సాయంతో.. మిషెల్ నేటికి ఆన్లైన్ పిటిషన్స్ వేస్తూ.. తల్లి కోసం న్యాయం పోరాటం చేస్తూనే ఉంది. సుమారు పన్నెండేళ్లుగా జోవాన్ మరణం మిస్టరీగానే మిగిలింది. -సంహిత నిమ్మన -
డెట్రాయిట్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు సమావేశం
డెట్రాయిడ్: వచ్చే ఏడాది న్యూజెర్సీలో జరగబోయే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) సమావేశాలను విజయవంతం చేసేందుకు సభ్యులందరూ కృషి చేయాలని టీటీఏ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి కోరారు. టీటీఏ బోర్డు సమావేశం ఆగష్టు 14l డెట్రాయిట్‌లోని మారియట్‌లో జరిగింది. అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, సమావేశాన్ని ప్రారంభించారు. టీటీఏ వ్యవస్థాపక సభ్యుడు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి మాట్లాడుతూ టీటీఏకు సంబంధించి ప్రతీ చాఫ్టర్‌ను బలోపేతం చేయాలన్నారు. ఇందుకు స్థానిక నాయకత్వం బాధ్యత తీసుకోవాలని సూచించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ 60కి పైగా కార్యక్రమాలను చేపట్టిన పాత కార్యవర్గాన్ని ప్రశంసించారు. 2022లో న్యూజెర్సీలో జరిగే టీటీఏ సమావేశాలను విజయవంతం చేయడానికి మరింత ఉత్సాహంతో పని చేయాలని సభ్యులకు సూచించారు. చదవండి: ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృతోత్సవ్ -
శ్మశానానికి తీసుకెళ్లగానే శ్వాస పీల్చింది!
వాషింగ్టన్ : అమెరికాలోని డెట్రాయిట్లో ఓ వింత ఘటన జరిగింది. చనిపోయిందనుకున్న 20 ఏళ్ల మహిళ.. శ్మశానవాటికలో శ్వాస పీలుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహిళ మరణించినట్లు పారామెడిక్స్ తేల్చడంతో.. ఆమెను డెట్రాయిట్‌లోని జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అయితే అక్కడ అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించే సమయంలో ఆ మహిళ శ్వాస పీల్చుతున్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆమె పల్స్‌రేటు బాగుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి) అసలు విషయానికి వస్తే... గత ఆదివారం గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్‌కు ఫోన్ చేసి ఒక ఇంట్లో మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపింది. మహిళ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ 20 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడకపోవడం, గత హెల్త్ రిపోర్ట్‌ల ఆధారంగా వారు ఆమె మరణించినట్లు నిర్ణయానికి వచ్చారు. అయితే జేమ్స్ కోల్ శ్మశానవాటికకు మహిళను తీసుకువెళ్లిన తర్వాత.. అక్కడ ఎంబాల్మింగ్ చేసే సమయంలో ఆమె శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) -
అందరికీ జాగ్రత్తలు చెప్పి.. చివరికి మహమ్మారికే..
-
‘అమెరికాలోని ప్రతీ ఒక్కరూ ఈ వీడియో చూడాలి’
డెట్రాయిట్: దగ్గినపుడు లేదా తుమ్మినపుడు నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి. అది అందుబాటులో లేనిపక్షంలో మోచేతిని మడిచి నీటి తుంపరలు గాల్లో ప్రవేశించకుండా జాగ్రత్తలు పాటించాలి.. ఇటువంటి మంచి అలవాట్ల గురించి ఎంతో మంది ఎన్నిసార్లు చెప్పినా.. ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరు ఇప్పుడు దీనిని విధిగా పాటిస్తున్నారు. ప్రాణం మీద తీపి ఉన్నవాళ్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు స్థానిక ప్రభుత్వాలు చేస్తున్న సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అయితే చాలా మంది ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉంది. మహమ్మారి ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా.. తమకేమీ పట్టనట్టు ఇష్టారీతిన వ్యవహరిస్తూ.. తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన కొంతమంది వ్యక్తుల కారణంగా అమెరికాలో ప్రజా రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ కన్నుమూశారు. కరోనాపై మంచి అలవాట్లతో పోరాడాలని చెబుతూ చివరకు ఆ మహమ్మారికే ఆయన బలయ్యారు.(కరోనా బారిన పడ్డ డాక్టర్ ఆత్మహత్య!) వివరాలు... డెట్రాయిట్కు చెందిన జాసన్ హార్గ్రోవ్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు మొదలైన తరుణంలో మార్చి 21 ఆయన ఫేస్బుక్లో ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ఆరోగ్య సంస్థలు, నిపుణులు మోచేతిని మడిచి దగ్గాలి. టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకుని తుమ్మాలి అని పదే పదే చెబుతున్నారు. అయితే కొంత మంది బస్సు ఎక్కేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నా బస్సు ఎక్కిన ఓ మహిళ నోటికి ఏమీ అడ్డుపెట్టుకోకుండానే తుమ్మడం, దగ్గడం గమనించాను. వెంటనే ఆమెను అప్రమత్తం చేశాను. మీతో పాటు ఇతరులకు కూడా మీ చెడుఅలవాట్లు హాని చేస్తాయని చెప్పాను. నిబంధనలు అల్లంఘించిన వారికి ఇలా చెప్పడంలో తప్పులేదని భావిస్తున్నా స్నేహితులారా’’అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.(కరోనా సంక్షోభం: ఐరిష్ ప్రధాని కీలక నిర్ణయం!) ఈ క్రమంలో వీడియో పోస్ట్ చేసిన పదకొండు రోజులకే కరోనా బారిన పడి జాసన్ న్నుమూశారు. ఆయన మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన డెట్రాయిట్ మేయర్.. ‘‘అమెరికాలోని ప్రతీ ఒక్కరు ఈ వీడియో చూడాలి’’ అని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మహమ్మారి బారి నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. కాగా అమెరికాలో కరోనా విలయతాండం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 10 వేలకు పైగా కరోనా మరణాలు సంభవించగా.. లక్షలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇక కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నా.. కొన్ని దేశాల్లో పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. (అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!2) -
విమానంలో లైంగిక దాడి : భారతీయుడికి జైలు శిక్ష
న్యూయార్క్ : విమానంలో నిద్రిస్తున్న మహిళను లైంగికంగా వేధించిన భారతీయుడికి గురువారం తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ ఏడాది జనవరిలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో లాస్‌వెగాస్ నుంచి డెట్రాయిట్ వెళుతున్న ప్రభు రామమూర్తి తన పక్కనున్న 23 ఏళ్ల యువతి నిద్రిస్తుండగా అసభ్యకరంగా వ్యవహరించాడు. తాను మెలుకవ వచ్చి చూడగా నిందితుడు తన దుస్తులు తొలగించి తనను తాకరాని చోట తాకుతూ అమర్యాదకరంగా ప్రవర్తించాడని బాధితురాలు వెల్లడించారు. నిందితుడు తీవ్ర తప్పిదానికి పాల్పడినందున 11 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరగా, అమెరికా జిల్లా జడ్జి టెరెన్స్ బెర్గ్ 9 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతరులు ఈ తరహా నేరాలకు పాల్పడకుండా ఇలాంటి శిక్షలు ఉపకరిస్తాయని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో న్యాయస్ధానం రామమూర్తిని దోషిగా తేల్చింది. జైలు శిక్ష పూర్తయిన అనంతరం రామమూర్తిని అమెరికా అధికారులు భారత్‌కు తరలిస్తారు. కాగా శిక్ష ఖరారు చేసే సమయంలో వృత్తిరీత్యా మోడల్ అయిన బాధితురాలు న్యాయస్ధానంలో మాట్లాడేందుకు నిరాకరించారు. ముందువరుసలో తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కూర్చుని తీర్పును వీక్షించారు. విచారణ సందర్భంగా ధైర్యంగా తనకు ఎదురైన లైంగిక వేధింపులను వివరించిన బాధితురాలిని అమెరికన్ అటార్నీ మ్యాథ్యూ స్కెండిర్ ప్రశంసించారు. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు సురక్షితంగా ఉండే హక్కు ప్రతిఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. 2015లో వర్క్ వీసాపై అమెరికా వచ్చిన రామమూర్తి తన భార్యతో కలిసి లాస్‌వెగాస్ విమానంలో డెట్రాయిట్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
డెట్రాయిట్లో ఆటా బోర్డు మీటింగ్
డెట్రాయిట్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) బోర్డు మీటింగ్ డెట్రాయిట్‌లోని సౌత్‌ఫీల్డ్ మారియట్ హోటల్లో జరిగింది. అమెరికన్ తెలుగు సంఘం అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆటా ట్రస్టీలు, అడ్వైజర్లు, రీజినల్ కో ఆర్డినేటర్లు, వివిధ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులతోపాటూ స్థానిక ఆటా సభ్యలు పాల్గొన్నారు. డెట్రాయిట్ ఆటా టీమ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రస్టీలు హరి లింగాల, మురళి బొమ్మనవేణి, అంతర్జాతీయ కో ఆర్డినేటర్ కోత కాశి, రీజినల్ అడ్వైజర్ సన్నీ రెడ్డి, సీఎమ్ఈ అధ్యక్షులు డా. అశోక్ కొండూరు, డా. హర్ష క్రిష్ణ, ఆర్సీలు చెంచురెడ్డి, సునీల్ మందుటి, ఎస్సీ అధ్యక్షులు వేణు సురపరాజులు ఆటా బోర్డు మీటింగ్ పనులను పర్యవేక్షించారు. త్వరలో రాబోయే ట్రస్టీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కమిటీ, ఎలక్షన్ కమిటీల నియామకాలను ఆటా నాయకులు చేపట్టారు. అమెరికాలోని తెలుగువారికి మరిన్ని సేవలు అందించడానికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. ఆటా వ్యవస్థాపక సభ్యులు, మాజీ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఆటా అధ్యక్షులు కరుణాకర్ ఆసిరెడ్డి, ఆటా ఎలక్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డిలు ఆటా వివాహ పరిచయవేదిక వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. మాట్రిమోనియల్ కమిటీ సభ్యులు శంకర్ బండి, రామ క్రిష్ణా రెడ్డి ఆళ్ల, అజయ్ రెడ్డి, అనిల్ బోడిరెడ్డి, అరుంధతి కోడూరులు చేసిన కృషిని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు డెట్రాయిల్ ఆటా టీమ్‌కు ఆటా బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. లాస్ వేగాస్‌లో 2019 జనవరిలో ఆటా మరుసటి బోర్టు మీటింగ్ జరగనుంది. -
‘రంగా సేవా నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం’
సాక్షి, డిట్రాయిట్: ప్రముఖ రాజకీయ నేత దివంగత వంగవీటి మోహన్ రంగా 29వ వర్ధంతి సందర్భంగా డిట్రాయిట్లో వైఎస్ఆర్సీపీ డిట్రాయిట్ కమిటీ, అభిమానులు సమావేశమై రంగాకి జోహార్ అంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశం దీపక్ గోపాలం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జితేంద్ర బొండాడ ప్రారంభోన్యాసం చేస్తూ రంగా సేవా నిరతి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలన్నారు. అంతేకాక దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రంగాల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేశారు. నేడు పేదల పెన్నిధిగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. మరి కొంతమంది రంగాతో వారి పరిచయానుభవాలను పంచుకున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరు రంగా అడుగుజాడలలో నడవాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో సునీల్ మందుటి, చెంచు రెడ్డి తాడి, దేవానాథ్ గోపిరెడ్డి, శ్రీకాంత్ గాయం, రవి నర్సింహారెడ్డి, లలిత్ కుమార్ వడ్లమూడి, ప్రసాద్ బేతంచెర్ల, వెంకట్ ఎనుముల, ధీరజ్ పులిగడ్డ, నరేష్ పూల, మురళి సుంకర, సుధీర్ బస్సు, సుధాకర్ తోట, పలువురు పాల్గొన్నారు. -
డెట్రాయిట్లో నాట్స్ ఫ్రీ ట్యాక్స్ సెమినార్
డెట్రాయిట్ : అమెరికాలో ఉంటున్న తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఫ్రీ ట్యాక్స్ సెమినార్, ఎస్టేట్ ప్లానింగ్ (ఫైనాన్సియల్ ప్లానింగ్) సెషన్ నిర్వహించింది. స్థానిక ఐలాండ్ లేక్స్ అఫ్ నోవి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సెమినార్‌కి మంచి స్పందన వచ్చింది. ప్రముఖ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్ నిపుణులు హస్ముఖ్ పటేల్ సెమినార్లో వివిధ అంశాలపైన అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా ఫెడరల్, స్టేట్ టాక్సులు, 1040 కి 1040-ఎన్ఆర్ కి మధ్య తేడా, ఎఫ్బీఏఆర్ దాఖలు, ఇతర పన్ను మినహాయింపులపై వచ్చిన ప్రశ్నలకి హస్ముఖ్ పటేల్ సమాధానాలు ఇచ్చారు. ట్యాక్స్ సెమినార్ తరువాత ఫైనాన్షియల్ ప్లానింగ్ సెషన్ జరిగింది. ఎస్టేట్ ప్లానింగ్ లో నిపుణుడైన ప్రముఖ న్యాయవాది గ్యారీ మ్యేర్స్, విల్ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ రిజిస్ట్రేషన్, ప్రొబేట్, లివింగ్ విల్స్, రియల్ ఎస్టేట్ తదితర అంశాలపైన సెమినార్‌కు హాజరైన వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. నాట్స్ డెట్రాయిట్ చాప్టర్ ప్రెసిడెంట్ కిశోర్ తమ్మినీడి, ప్రసాద్ గొంది, గౌతమ్ మార్నేని, శ్రీని కొడాలి, శివ అడుసుమిల్లి, దత్త సిరిగిరి, నాగ సతీష్ కంచర్ల, శ్రీధర్ అట్లూరి తదితర నాట్స్ నాయకుల సహకారంతో జరిగిన ఈ సెమినార్ని నాట్స్ నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ కృష్ణ కొత్తపల్లి ఈవెంట్‌ని ముందుండి ఆసక్తికరంగా నడిపించారు. హస్ముఖ్ పటేల్, గ్యారీ మ్యేర్స్ లను సామ్ బొల్లినేని, శైలజ కోడాలి సత్కరించారు. రవి నూతలపాటి, వేణు కొడాలి, చలపతి కోడూరి, శ్రీనివాస్ చిత్తలూరి, శ్రీనివాస్ పిన్నమనేని, మహీధర్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. నాట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 24 గంటల హెల్ప్ లైన్ సర్వీస్, స్కూళ్లను దత్తత తీసుకోవడం, దేశవ్యాప్తంగా నాట్స్ చేయబోయే వివిధ కార్యక్రమాలను కృష్ణ కొత్తపల్లి వివరించారు. నాట్స్ వైస్ ప్రెసిడెంట్ సూరపనేని బసవేంద్ర కార్యక్రమాన్ని వియజవంతంగా నిర్వహించిన డెట్రాయిట్ నాట్స్ నాయకులను అభినందించారు. నాట్స్ కు మద్దతుగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సెమినార్‌కి వచ్చినవారంతా అభినందించారు. పన్ను చెల్లింపులు, మినహాయింపులు, ఆర్థిక వ్యవహారాలపైన అవగాహన .. ఆర్థిక సందేహాల నివృత్తికి ఈ సెమినార్ ఎంతగానో దోహదపడిందన్నారు. -
డెట్రాయిట్లో ఎం అండ్ ఎం తొలి ప్లాంట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ అమెరికా ఇ-వెహికల్ మార్కెట్‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో అక్కడొక నిర్మాణ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.ప్రపంచ ఆటోమొబైల్ డెట్రాయిట్లో భారీ పెట్టుబడితో తొలి ఉద్పాదక ప్లాంట్‌ను తెరిచింది. తద్వారా 25 సంవత్సరాల్లో తొలి ఆటోమోటివ్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని నెలకొల్పింది. అంతేకాదు ఈ ప్లాంట్ద్వారా అక్కడ 250 ఉద్యోగాలను కూడా సంస్థ కల్పించనుంది. ఎం అండ్ఎం అమెరికా ఎలక్ట్రానిక్ వాహనాల మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డెట్రాయిట్లో 230 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక ప్లాంటును నిర్మించింది. అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అటానమస్ ట్రాక్టర్లు, కార్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని ఎం అండ్ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. వాహనాల అమ్మకాలను ప్రారంభించడానికి ఇదే సరైన సమమని ఛైర్మన్ తెలిపారు. 2020 నాటికి, కంపెనీ 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని, మరో 400 ఉద్యోగాలు సృష్టించాలని కంపెనీ భావిస్తున్నట్టు చెప్పారు. -
అటా ఆధ్వర్యంలో డెట్రాయిట్లో ఉచిత వైద్య సేవలు
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్లో అమెరికా తెలుగు సంఘం(అటా) డెంటల్, యోగా, మెడిటేషన్ సెషన్లను నిర్వహించింది. డెట్రాయిట్ అటా ట్రస్టీ హరి లింగాల, టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 130 హెల్త్ స్క్రీనింగ్‌లను చేశారు. వీటిలో ఈకేజీ 70 డెంటల్ స్క్రీనింగ్స్, 25 ఎక్స్‌రేలు ఉన్నాయి. మెడిటేషన్, యోగా కార్యక్రమాలకు కూడా కొందరు హాజరయ్యారు. మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 20 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. అశోక్ కొండూరు, సన్నీ రెడ్డిలకు కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
డల్లాస్, డెట్రాయిట్కు సర్వీసులు నడపండి
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డెట్రాయిట్, డల్లాస్‌లలో నివసిస్తు న్న తెలుగు ప్రజల సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఆయన ఒక లేఖ రాశారు. ఇటీవల నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కార్యక్రమాల్లో తాను పాల్గొన్న సందర్భంలో అక్కడ నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాలు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని తెలిపారు. -
అమెరికాలో తెలుగు బిడ్డల విషాదాంతం
కన్న బిడ్డను కాపాడబోయి.. ఈత కొలనులో మునిగి తండ్రీకుమారుడి మృతి పట్నంబజారు (గుంటూరు తూర్పు): స్విమ్మింగ్ పూల్‌లో పడిన కన్నబిడ్డను రక్షించబోయి తండ్రి కూడా దుర్మరణం పాలైన ఘటన అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో మూడు రోజుల క్రితం చోటుచేసుకుంది. గుంటూరులోని నెహ్రూనగర్ పదో లైన్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సూరేపల్లి నాగరాజు(33), ఆయన కుమారుడు అనంతసాయి(3) మృత్యువాత పడ్డారు. అనంతసాయి డెట్రాయిట్‌లోని తమ నివాసం వద్ద ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు తండ్రి నాగరాజు కూడా కొలనులోకి దూకినట్లు సమాచారం. ఆయన సైతం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. కేవలం ఐదడుగుల లోతు ఉండే స్విమ్మింగ్ పూల్‌లో పడి నాగరాజు ఎలా మరణించాడో అర్థం కావడం లేదని బంధువులు అంటున్నారు. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన సూరేపల్లి శివలింగయ్య ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. నాగరాజు కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచాడు. బీటెక్ చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. చెల్లెళ్ల వివాహాలు చేసి చేదోడువాదోడు అయ్యాడు. 2012లో ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హిమబిందును వివాహం చేసుకుని బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాడు. నాగరాజును ఇన్ఫోసిస్ యాజమాన్యం 2014 సెప్టెంబర్‌లో అమెరికాకు పంపించింది. కాగా ఈ నెల 6వ తేదీ నాటికి మృతదేహాలు గుంటూరుకు చేరే అవకాశాలు ఉన్నాయని బంధువులు తెలిపారు. -
డెట్రాయిట్లో మహానేత వర్థంతి
డెట్రాయిట్: మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏడవ వర్థంతి కార్యక్రమాన్ని అమెరికాలోని డెట్రాయిట్లో నిర్వహించారు. ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ కార్యక్రమానకి హాజరైన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్ సీపీ నేతలు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనితరసాధ్యమైన నాయకత్వాన్ని గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. పేదలు, మహిళలు, రైతులకోసం వైఎస్ఆర్ ఎంతగానో పాటుపడ్డారని.. తద్వారా కోట్లాదిమంది హృదయాల్లో ఆయన నిలిచిపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను హామీలతో మోసగించి అధికారం చేపట్టి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరాలంటే వైఎస్ జగన్‌ను అధికారంలోకి రావాలని, అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని వక్తలు వెల్లడించారు. -
'ఆటా'లో లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం
రాయికల్ : అమెరికా తెలంగాణ సంఘం (ఆటా) ఆధ్వర్యంలో డెట్రాయిట్ నగరంలో నిర్వహిస్తున్న ప్రథమ తెలంగాణ మహాసభలు సోమవారం ముగిశాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట నుంచి లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం కోసం అర్చకులను ప్రత్యేకంగా అమెరికాకు ఆహ్వానించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డితోపాటు అమెరికాలోని వివిధ స్టేట్లకు చెందిన సుమారు మూడు వేల మంది తెలంగాణ వాదులు సతీసమేతంగా హాజరైనట్లు నిర్వాహకులు సాక్షికి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కొండా రాంమోహన్, అయిత నాగేందర్, వినోద్, కుమార్, మాదవరం కరుణాకర్ పాల్గొన్నారు. -
రాష్ట్రాభివృద్ధికి అంబాసిడర్లుగా మారాలి: ఎంపీ కవిత
(డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి జి. శ్రీనాథ్): తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఎన్నారైలు అంబాసిడర్లుగా మారాలని నిజామాబాద్ ఎంపీ కవిత పిలుపునిచ్చారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ రెండు రోజు కార్యక్రమాల్లో ఎంపీ కవితతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్‌కు సీఎం కేసీఆర్ శుభాభినందనలు తెలుపుతూ సందేశాన్ని పంపారు. ఆ సందేశాన్ని ఆటా తెలంగాణ కన్వీనర్ వినోద్ కుకునూర్ చదివి వినిపించారు. కేసీఆర్ సందేశం క్లుప్తంగా.. 'అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ మొదటి ప్రపంచమహాసభల నిర్వహణను అభినందిస్తున్నాను, ఆ సంస్థ తెలంగాణ సంస్కృతి వ్యాప్తికి, పరిరక్షణకు ఎంతో కృషి చేస్తోంది. ఇటు తెలంగాణ, అటు అమెరికాలో తెలంగాణ సంస్కృతిక పరిరక్షణ, వ్యాప్తికే కాక చదువు, ఇతర రంగాలలో అదే స్ఫూర్తిని కొనసాగిస్తోంది. ఈ సంస్థ వారధిలా పనిచేస్తూ,తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షిస్తున్నాను'. రాష్ట్ర అభివృద్ధికి వెన్నంటే ఉంటామని అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ సంస్థ సభ్యులు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. భారత జాతీయగీతం, అమెరికన్ జాతీయ గీతాలను చిన్నారులు ఆలపించారు. సుద్దాల అశోక్ తేజ రాసిన తెలంగాణ పాటకు చిన్నారుల వేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రీచా గంగోపాధ్యాయ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ...నేను పుట్టి పెరిగింది డెట్రాయిట్లోనేనని చెప్పారు. అందుకే ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని.. అన్నీ కార్యక్రమాలు చాలా బాగున్నాయన్నారు. 2001 నుంచి ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...ఎన్నారైల నుంచి మంచి స్పందన వస్తోందని, వీటన్నింటినీ అనుసంధానం చేయడానికే పాన్ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరినీ కలిపి, ఏకత్వ భావనను కలిగించేదే సంస్కృతి అని చెప్పారు. మనది బ్రిలియంట్ కల్చర్ అని కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అక్కడి అనుకూల పరిస్థితులను అమెరికన్ ప్రభుత్వానికి తెలియజెప్పి రాష్ట్రాభివృద్ధికి సంధానకర్తలుగా పనిచేయాలన్నారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఆ స్ఫూర్తినే కనబరుస్తోందని కవిత చెప్పారు. కసిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి. ప్రకాష్ రాసిన పుస్తకాల ఆవిష్కరణతో పాటు తెలంగాణ జానపద కార్యక్రమాలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన పలు హాళ్లకు ప్రొఫెసర్ జయశంకర్, వైస్రాయ్ హాల్, దక్కన్ హాల్,లుంబినీ పార్క్, ప్రాణహిత వంటి పేర్లు పెట్టారు. తెలంగాణ పది జిల్లాలకు సంబంధించి జిల్లా చర్చ పేరుతో చర్చాకార్యక్రమం నిర్వహించారు. పొలిటికల్ ఫోరమ్ పేరుతో కూడా ఓ చర్చా కార్యక్రమం జరిగింది. దీంతో పాటు యూఎస్ పొలిటికల్ ఫారమ్ పేరుతో అమెరికా వర్తమాన రాజకీయాల మీదా చర్చ కొనసాగింది. తెలుగు సినిమాలో తెలంగాణ పాట, ఫిల్మ్ మేకింగ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ మీద సెమినార్, మిషన్ భగీరథ మీద మిషన్ తెలంగాణ పేరుతో చర్చ, సెమినార్లు, తెలంగాణలో ఉన్న ఎడ్యూకేషన్ ట్రెండ్స్, యోగా ఎడ్యూకేషన్, ఎన్ఆరై మీట్ వంటి సదస్సులూ జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖనేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ, నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా తెలంగాణ మహా సభలు షురూ
(డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి జి. శ్రీనాథ్): అమెరికా తెలంగాణ అసోసియేషన్ తొలి ప్రపంచ మహాసభలు తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ఉట్టిపడేలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం తొలి రోజు కార్యక్రమాల్లో ధూంధాం కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలో తెలంగాణ కళాకారులు సాంప్రదాయ రీతిలో చేసిన నృత్యాలు, పాడిన పాటలు ఆహుతలును అలరించాయి. తెలంగాణ ఉద్యమం సాగిన తీరు, ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన ఉద్యమ కారుల గురించి, అలాగే ఇప్పుడు బంగారు తెలంగాణ దిశగా చేస్తున్న ప్రయత్నాలను కళా ప్రదర్శనలతో చూపించారు. సాంస్కృతిక వారసత్వంలో తాము ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు ఎన్నారైల పిల్లలు. క్లాస్, మాస్ గీతాలకు అద్భుతంగా డాన్సులు చేశారు. అమెరికన్తెలంగాణ అసోసియేషన్ ఆవిర్భావ ఆవశ్యకత గురించి అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులలో ఒకరు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ వినోద్ కుకునూర్ వివరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమెరికా ఎన్నారైలు తెలంగాణ వచ్చాక కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు పాత్రపోషించాలనే ఉద్దేశంతోనే అమెరికన్ తెలంగాణ అసోసియేషనను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులకు ఈ కార్యక్రమం వారధిగా పనిచేస్తుందని చెప్పారు. అనంతరం డెట్రాయిట్లో ఉన్న తెలంగాణ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. రసమయి బాలకిషన్ గ్రూప్ ఆటపాటలతోఆకట్టుంది. డెట్రాయిట్‌లోని సబ్అర్బన్ కన్వెషన్ ప్లేస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే ఆవరణలో దుస్తులు, ఆభరణాలతోపాటూ రకరకాల వస్తువుల స్టాల్స్ కూడా ప్రారంభించారు. మూడు రోజులు పాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఎన్ఆర్ఐ పిల్లల చేసిన ఫ్యాషన్ షో ఈ కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచింది. తెలంగాణ భోజనాలకు అమెరికా అడ్డు..! తొలి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహిస్తుండడంతో భోజన ఏర్పాట్లు భారీగానే చేశారు. సాయంత్రం బాంకెట్ ఉండగా.. మధ్యాహ్నం కల్లా అన్ని వంటలు సిద్ధం చేశారు. అయితే అనుకోకుండా అమెరికా ఫుడ్ ఇన్ స్పెక్టర్లు చివరి క్షణంలో తనిఖీలు చేసి కొన్ని వంటకాలను అడ్డుకున్నారు. దీంతో ఆహుతులకు ఇబ్బందులు కలగకుండా.. అప్పటికప్పుడు మళ్లీ భోజనాలు సిద్ధం చేసారు. ఆటా తెలంగాణ తొలి ప్రపంచ మహాసభలను నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తెలంగాణకు ఈ సదస్సు ఉపయోగపడేలా ప్రయత్నిస్తున్నామని అమెరికా తెలంగాణ సంఘం అధ్యక్షుడు కొండా రామ్మోహన్ అన్నారు. అమెరికా తెలంగాణ సంఘం తరపున రైతు సదస్సులు నిర్వహించి తక్కువ ఖర్చులో వ్యవసాయం ఎలా చేయాలి, లాబసాటిగా దిగుబడి ఎలా రాబట్టాలి అన్న దానిపై అన్నదాతలకు అవగాహన కల్పిద్దామనుకుంటున్నామన్నారు. అలాగే ప్రీడిపోర్టేషన్ (అన్ని ఉన్నా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను పంపుతుండడంపైనా) ఒక శిక్షణ తరగతులు నిర్వహించాలకుంటున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అమెరికా తెలంగాణ అసోసియేషన్ తొలి ప్రపంచ మహాసభలుకు తెలంగాణ డిప్యూటీ సీం కడియం శ్రీహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్స్వామిగౌడ్, కరీంనగర్ జిల్లా మనాకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, గొరేటి వెంకన్న, ఎంపి జితేందర్‌రెడ్డి, యార్లలక్ష్మీ ప్రసాద్, ప్రముఖ పాటల రచయిత సుద్దాలఅశోక్ తేజ, కవి నందిని సిద్ధా రెడ్డి వంటి ప్రముఖుల సమక్షంలో కార్యక్రమం జ్యోతి ప్రజ్వలతో ప్రారంభమైంది. వి.ప్రకాష్, నారదాసు లక్ష్మణ్,ప్రముఖ కూచిపూడి కళారాణి పద్మజారెడ్డి, తెలుగు సినీ నేపథ్య సంగీతకారుడు అనూప్‌రూబెన్స్, నేపథ్యగయనీమణులు కౌసల్య, మాళవిక, గాయకుడు పార్థసారథి, ఇంకా కారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి, రజిత, ప్రియ వంటి బుల్లి తెరనటీనటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ఏటీఏ డెట్రాయిట్ సమావేశానికి ఏర్పాట్లు పూర్తి
డెట్రాయిట్: ప్రథమ ప్రపంచ తెలంగాణ మహా సభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికా తెలంగాణ సంఘం(ఏటీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ వేడుకలు శుక్రవారం నుంచి మూడు రోజులపాటూ(8,9,10 తేదీల్లో) జరుగనున్నాయి.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆటా, పాటలతో పాటూ పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఓల్డ్ సిటీ బోనాలను కూడా డెట్రాయిట్ లో నిర్వహిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి డెట్రాయిట్కు తీసుకువచ్చారు. -
జూలై 8 నుంచి ప్రపంచ తెలంగాణ మహాసభలు
పంజగుట్ట (హైదరాబాద్) : తెలంగాణ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియచెప్పేందుకు అమెరికన్ తెలంగాణ సంఘం(ఆటా) కృషి చేస్తుందని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఆటా ఆధ్వర్యంలో జులై 8 నుంచి 10వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ మహానగరంలో 'ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభలు' నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. సోమవారం లక్డీకాపూల్‌లోని హోటల్ సెంట్రల్ కోర్టులో మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ... అమెరికాలోని 25 ప్రాంతీయ తెలంగాణ సంఘాలు కలిసి నెల క్రితమే ఆటా ఏర్పడిందని, ఇంత తక్కువ సమయంలోనే ప్రపంచ మహాసభలు నిర్వహిస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నామన్నారు. ఈ సభలకు 25 దేశాల నుంచి తెలంగాణ, తెలుగువారు సుమారు 7 వేల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. కేవలం డెట్రాయిట్ నగరంలోనే 8 వేలు, అమెరికా మరికొన్ని రాష్ట్రాల్లో సుమారు 20 వేలమంది తెలంగాణ కుటుంబాలు ఉంటాయని తెలిపారు. ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై రెండేళ్లకోసారి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జ్యోతి రెడ్డి చింతలపాని, రమాదేవి నీలారపు, కె.పద్మజారెడ్డి, బి.రామచంద్రారెడ్డి, రావు నెరుసు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో దసరా, బతుకమ్మ సంబరాలు
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో దసరా, బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. ది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం లిథుయానియన్ కాథలిక్ చర్చిలో ఈ వేడుకలను నిర్వహించారు. డెట్రాయిట్లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణవాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి గౌరీమాత ఆశీస్సులు అందుకున్నారు. ఈ వేడుకల్లో 700 మందికి పైగా పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభమైన ఈ వేడుకల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు బతుకమ్మ నృత్యాలు చేశారు. 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..' అంటూ మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో షాలిని కోపల్లి, కాకులవరం లక్ష్మణరెడ్డి, లోహిత్, కౌస్తుభ్, ఆకులమాదం శెట్టి, లట్టుపల్లి సోదరీమణులు రియా-రేవా, నిధిరెడ్డి కాకులవరం, మహిమ పాల్వాయి, శ్రావ్య డుంబాల, ఆత్మకూరు సోదరీమణులు సనిక-మేఘన, వర్ణిక జక్కా, ప్రసీద చెల్లెమెల్ల, అదితి మల్లేపల్లి, శ్రీత నటాల, యశస్వి, శ్రేష్ట దుండిగళ్ల, తన్మయి తిప్పిరెడ్డి, హారిక, ఆద్య చింతపల్లి, అదితి ఎర్ల, అనన్య భూమిరెడ్డి, సంజన కేసిరెడ్డి, ధ్రుతి పదుకొనె, ప్రవర్థ్ వేణుకాదసుల, కార్తీక్ గంకిడి, అన్విత, గడ్డంబ్రదర్స్ అనిష్, సంజింత్, సొహన్ కోస్నా, దీప్తి వేణుకాదసుల, విద్య గంకిడి, స్వాతి ఈర్ల, కెయూరజలిగామ, శ్రుతి కానాల, మనస్విని ముప్పా, వర్షిణి తదితరులుపాల్గొన్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు రాజశేఖర్ గడ్డం, ప్రశాంత్ దుబ్బుడు, యాదగిర్ ఐలేని, కరుణాకర్ కందుకూరి, కృష్ణ చెల్లెమెల్ల, టీడీఎఫ్-యూఎస్ఏ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కసిరెడ్డి, స్టాండింగ్ కిమిటీ సభ్యులు సుమ కలవల, ఉమా పిషాటిలు.. కార్యక్రమ నిర్వహణలో సహకరించిన స్పాన్సర్లు, వాలంటీర్లను అభినందించారు. -
ఆపడం అసాధ్యం
ఒకదాన్ని కదిపితే చాలు లక్షలాది వస్తువులు వరసగా అలా పడుతూనే ఉండే ఏర్పాటును చూశారా? ఇది అదే. నిర్వాహకులు దీనికి పెట్టిన పేరు.. జీల్ క్రెడిట్ యూనియన్ ఇంక్రెడబుల్ సైన్స్ మెషీన్. అమెరికాలోని డెట్రాయిట్లో 16 మంది వారంపాటు కష్టపడి దీనిని తయారుచేశారు. వేర్వేరు రకాలైన 5,00,000 వస్తువులను పడేలా చేసి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుసగా పడేలా అమర్చితే... దానిని రూబీ గోల్డ్బెర్గ్ మెషీన్ అంటారు. -
లేని క్యాన్సర్లకు వైద్యం.. డాక్టర్‌కు 45 ఏళ్ల జైలు
డెట్రాయిట్: ఉన్న రోగాలకే సరిగా వైద్యం చేయలేకపోతున్న వైద్యులున్న నేటి రోజుల్లో అసలు లేని రోగాలను అంటగట్టి అవి ఉన్నాయని భ్రమల్లో నింపి చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడికి 45 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఫరీద్ ఫాటా(50) అనే వైద్యుడు డెట్రాయిట్లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తారు. అయితే, తనవద్దకు వచ్చే రోగులకు పలు పరీక్షలు నిర్వహించి వారికి క్యాన్సర్ లేకపోయినా ఉందని చెబుతూ లేని రోగానికి వైద్యం అందించడం మొదలు పెట్టారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదో ఎంతోమందికి ఆయన అబద్ధాలు చెప్పి క్యాన్సర్ రోగుల మాదిరిగా వైద్యం అందిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన డబ్బుకు ఆశపడే చేసినట్లు కోర్టు నిర్దారించింది. ఇది ఒక రకంగా మనీ లాండరింగ్‌కు పాల్పడటమేనని కూడా స్పష్టం చేసింది. దేశంలోనే ఆయనొక ఘరానా మోసగాడంటూ న్యాయవాదులు కోర్టులో ఆ వైద్యుడికి వ్యతిరేకంగా ఆధారాలు నిరూపించారు. దీంతో కోర్టు అతడికి 45 ఏళ్ల జైలు శిక్షను విధించింది. భారీ మొత్తంలో జరిమానా వేసింది. ఈ సందర్భంగా డాక్టర్ ఫరీద్ ఫాటా తన నేరాన్ని అంగీకరించాడు. తనపై రోగులకు ఉన్న నమ్మకాన్ని డబ్బుగా మార్చుకున్నానని చెప్పారు. తాను చేసింది ఓ సిగ్గుమాలిన పని అని, ముఖం చూపించేందుకు అనర్హుడినంటూ మీడియాకు తెలిపారు. ఎంతోమందికి కీమో థెరపీ వంటి చికిత్సను కూడా చేశానని, అమాయకులను చేసి వారిని మోసం చేసినందుకు తనను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నట్లు జైలుకు వెళ్లే ముందు ఫరీద్ ఫాటా చెప్పాడు. -
అట్టహాసంగా తానా వేడుకలు
డెట్రాయిట్ నుంచి సాక్షి ప్రతినిధి: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (తానా) మహాసభల వేడుకలు గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) ఘనంగా ప్రారంభమయ్యాయి. పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు వేడుకలకు హాజరయ్యారు. స్థానికంగా నూతన తానా భవనాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, ఆ రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొని వేడుకలను తిలకించారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నటులు వెంకటేశ్, అల్లరి నరేశ్, నవదీప్, నిఖిల్, తాప్సీ, రచయితలు సుద్దాల అశోక్‌తేజ, జొన్నవిత్తుల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, యలమంచిలి శివాజీ, అట్లూరి సుబ్బారావు తదితరులు వేడుకలకు హాజరయ్యారు. తానా సభల సమన్వయకర్త నాదెళ్ల గంగాధర్, అధ్యక్షుడు నన్నపనేని మోహన్ అతిథులకు స్వాగతం పలికారు. సుద్దాల అశోక్‌తేజ, డా.పొదిలి ప్రసాద్, డా.గోపీచంద్, డా.ఎన్.ఎస్.రెడ్డి, ఆర్.శ్రీహరి, డా.కాకిరాల ప్రసాద్, డా.గంగా చౌదరి, డా.శివాజీరావు అవార్డులు అందుకున్నారు. -
జస్టిస్ రమణకు డెట్రాయిట్లో ఆత్మీయ స్వాగతం
డెట్రాయిట్ : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణకు అమెరికాలోని డెట్రాయిట్లో ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. జులై 2,3,4 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 20వ మహాసభల్లో పాల్గొనేందుకు జస్టిస్ వెంకటరమణ మంగళవారం డెట్రాయిట్ చేరుకున్నారు. స్ధానిక విమానాశ్రయంలో ఆయనకు తానా ప్రాంతీయ ప్రతినిధి యార్లగడ్డ శివరాం నేతృత్వంలో ప్రవాస తెలుగువారు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీగా రమణను ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రమణ 2021లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టవచ్చునని తెలుగువారు ఆకాంక్షిస్తున్నారు. జస్టిస్ రమణ వెంట మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. స్వాగత కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, తానా తదుపరి అధ్యక్షుడు వేమన సతీష్, విడిది ఏర్పాట్ల కమిటీ అధ్యక్షుడు చల్లా దంతేశ్వరరావు, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసన్ గోనుగుంట్లలు పాల్గొని మహాసభలకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్ధానిక ప్రవాసులు మారుపూడి విజయ్, కారుమంచి వంశీ, దుగ్గిరాల కిరణ్, సురేష్ కకుమాను తదితరులను డెట్రాయిట్ ప్రాంతంలో చేస్తున్న సేవలకుగానూ జస్టిస్ రమణ అభినందించారు. -
అమెరికాలో టీడీఎఫ్ సమావేశం
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో తెలంగాణ అభివృద్ధి వేదిక (టీడీఎఫ్) సమావేశమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి పథకాలతో పాటుగా ఇతర విషయాల గురించి చర్చించారు. ఎన్నారై భవనంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి సంఘాలు, ఎన్నారై విభాగాన్ని ఆహ్వానించారు. ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తారు. టీడీఎఫ్ అమెరికా అధ్యక్షుడు కలవల విశ్వేశ్వర్.. పారదర్శకత కోసమే ఈ వేదికను నిర్వహిస్తామన్నారు. టీడీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో ఉందని, ఒక్క యూఎస్ఏలోనే 64 నగరాల్లో ఉందని విశ్వేశ్వర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో లైబ్రరీలు, విద్యాలయాలు, రోడ్ల అభివృద్ధికి 1,10,000 డాలర్లు కేటాయించినట్టు తెలిపారు. టీడీఎఫ్ ఉపాధ్యక్షుడు విజయ్ భాస్కర్ పిట్టా, ప్రధాన కార్యదర్శి కేసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, సహాయ కార్యదర్శి బొజ్జా అమరేందర్, రవీందర్ గడ్డంపల్లి బీఓటీ నాయకులు మురళి చింతలపాణి, శ్రీనాథ్ ముస్కుల, గుర్రాల రాధేశ్ రెడ్డి, విజయ్ సాధువు, సంతోష్ కాకులవరం, మహేష్ వెనుకదాసుల, వాసు దుండిగళ్ల, కృష్ణ ప్రసాద్ జలిగామ, రామ్ కోమందురి, రామ్ చావ్లా, సుమన్ ముప్పిడి, విశ్రాంత ఇంజనీర్ సత్యపాల్ రెడ్డి కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చక్కటి సంగీత కచేరి ఏర్పాటు చేశారు. గాయకులు దివ్య దవులూరి, పద్మజకనాలి, వెంకట కనకాల, శ్రుతికనాల, స్వాతితిప్పిరెడ్డి, శిల్పాదుండిగల, కృష్ణ జలిగామ భక్తి గీతాలతో అలరించారు. నృత్య విభాగంలో కృతి జలిగామ, వైష్ణవి దెనువకొండ, శ్రేష్ట దుండిగళ్ల, తిప్పిరెడ్డి తన్మయి, ఆత్మకూర్ సానిక, ధృతి పదుకునే, శ్రేష్ట గడ్డం, సోహన్ కోస్నా, అనిష్ గడ్డం, సంజిత్ గడ్డం, అతిథి ఈర్ల, అనన్య భూమిరెడ్డి, మనీష్ ఇలేని, వెనుకదాసుల ప్రవధ్, కార్తీక్ గంకిడి పాల్గొన్నారు. మిమిక్రీలో తనుజ్ గంగ చక్కటి ప్రతిభ కనబరిచారు.