
ఆపడం అసాధ్యం
ఒకదాన్ని కదిపితే చాలు లక్షలాది వస్తువులు వరసగా అలా పడుతూనే ఉండే ఏర్పాటును చూశారా? ఇది అదే. నిర్వాహకులు దీనికి పెట్టిన పేరు.. జీల్ క్రెడిట్ యూనియన్ ఇంక్రెడబుల్ సైన్స్ మెషీన్. అమెరికాలోని డెట్రాయిట్‌లో 16 మంది వారంపాటు కష్టపడి దీనిని తయారుచేశారు. వేర్వేరు రకాలైన 5,00,000 వస్తువులను పడేలా చేసి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వరుసగా పడేలా అమర్చితే... దానిని రూబీ గోల్డ్‌బెర్గ్ మెషీన్ అంటారు.