వాషింగ్టన్ : అమెరికాలోని డెట్రాయిట్‌లో ఓ వింత ఘటన జరిగింది. చనిపోయిందనుకున్న 20 ఏళ్ల మహిళ.. శ్మశానవాటికలో శ్వాస పీలుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహిళ మరణించినట్లు పారామెడిక్స్ తేల్చడంతో.. ఆమెను డెట్రాయిట్‌లోని జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అయితే అక్కడ అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించే సమయంలో ఆ మహిళ శ్వాస పీల్చుతున్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆమె పల్స్‌రేటు బాగుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి)
అసలు విషయానికి వస్తే... గత ఆదివారం గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్‌కు ఫోన్ చేసి ఒక ఇంట్లో మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపింది. మహిళ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ 20 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడకపోవడం, గత హెల్త్ రిపోర్ట్‌ల ఆధారంగా వారు ఆమె మరణించినట్లు నిర్ణయానికి వచ్చారు. అయితే జేమ్స్ కోల్ శ్మశానవాటికకు మహిళను తీసుకువెళ్లిన తర్వాత.. అక్కడ ఎంబాల్మింగ్ చేసే సమయంలో ఆమె శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు.
(చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది)
Comments
Please login to add a commentAdd a comment