dead body
-
TG: కారులోమహిళ డెడ్ బాడీతో పారిపోయేందుకు యత్నం!
నిజామాబాద్: కారులో డెడ్ బాడీని తీసుకెళ్తున్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ లో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో ఓ కారు ఆపకుండా ముందుకు వెళ్లిపోయింది. అది కూడా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ పోలీసులను దాటేసిందా కారు. అయితే అసలు కారును ఆపకుండా వెళ్లిపోవడంపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ కారును ఛేజ్ చేశారు. కారును వెంబడించి దాస్ నగర్ శివారులో నిజాం సాగర్ కెనాల్ పద్ద పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని అనుమానించి ఆరా తీశారు. ఎంతకీ పెదవి విప్పకపోవడంతో కారు డిక్కీని ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. డిక్కీలో మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని రాజేష్ గా గుర్తించిన పోలీసులు.. మృతురాలు కమలగా గుర్తించారు. -
భార్యను కాల్చి చంపిన భర్త
సేలం: తెన్కాశి సమీపంలో మదునాదపేరి కుళం ప్రాంతంలో ముళ్ల పొదలో ఓ మహిళ కాల్చి చంపిన స్థితిలో మృతదేహంగా కనిపించింది. ఘటనా స్థలంలో అనేక మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రత్యేక బృందం పోలీసులు సీసీటీవీ వీడియోల ఆధారంగా విచారణ జరిపారు. అందులో.. ముందు రోజు రాత్రి 9.30 గంటలకు సందేహాస్పదంగా ఒక కారు వెళ్లినట్లు తెలిసింది. ఆ కారు నెంబర్ ఆధారంగా జరిపిన విచారణలో... ఆ కారు శివకాశికి చెందిన ఒకరికి సొంతమైనది అని తెలిసింది. పోలీసుల విచారణలో శివకాశి భారతి నగర్‌కు చెందిన జాన్‌కిల్‌బర్ట్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద జరిపిన విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను తన భార్యను కాల్చి చంపినట్టు తెలిసింది. వివరాలు.. జాన్‌కిల్‌బర్ట్ అదే ప్రాంతానికి చెందిన కమలి (30) ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు వేరు వేరు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రులను వ్యతిరేకించి జాన్‌కిల్‌బర్డ్ తన ప్రియురాలు కమలినినిపెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఈ స్థితిలో భార్య, భర్త మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈనెల 10వ తేదీ జరిగిన గొడవలో తీవ్ర ఆవేశానికి గురైన జాన్‌కిల్‌బర్డ్ తన భార్య కమలిపై ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. తర్వాత తన సోదరుడి సహకారంతో ఆమె మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని శంకరన్‌కోవిల్, తిరువెంగడం మార్గంగా తెన్కాశికి తీసుకువచ్చి 110 కిలో మీటర్ల దూరం కారులో కమలి మృతదేహాన్నీ తీసుకువచ్చి ఇలదూర్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ముల్ల పొదల్లో కాల్చినట్టు తెలిసింది. అనంతరం పోలీసులు జాన్కిల్బర్డ్తో పాటూ అతనికి సహకరించిన సోదరుడు తంగతిరుపతిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం రిమాండ్‌కు తరలించారు. -
9 రోజులు తల్లి మృతదేహంతోనే ఇద్దరు కూతుళ్లు
బౌద్ధనగర్: బాధ్యతలు చూసుకోవాల్సిన తండ్రి కుటుంబాన్ని వదిలి వెళ్లిపోయాడు... అప్పటి నుంచి తల్లి వారికి అన్ని విధాలా అండగా ఉంటూ ఆదరించింది. ఇప్పుడు ఆ తల్లి అనారోగ్యంతో మరణించింది. కంటికి రెప్పలా చూసుకున్న తల్లి (45) కన్నుమూయడంతో ఇద్దరు కూతుళ్లు తామూ చనిపోవాలని భావించారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తల్లి శవం పక్కనే పెట్టుకుని తొమ్మిది రోజులపాటు రోజువారీ కార్యకలాపాలు చేసుకున్నారు.సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, వారాసీగూడ ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం... ఉస్మానియా వర్సిటీలో ఉద్యోగం చేసే రాజు, లలిత దంపతులు. వీరికి రవళిక (25), అశ్విత (22) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. రాజు 2020 లోనే భార్య, పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు. రెండు నెలలుగా లలిత ఇద్దరు కూతుళ్లతో కలిసి బౌద్ధనగర్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలోని 4వ ఫ్లోర్లో ఉంటోంది. రవళిక ఓ బట్టల షాపులో పనిచేస్తుండగా.. అశి్వత ఈవెంట్స్ నిర్వాహకుల వద్ద చేస్తోంది.కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లలిత ఈ నెల 23న ఇంట్లోనే కన్నుమూసింది. తల్లి కన్నుమూయడంతో ఆ ఇద్దరు పిల్లలకు ఏంచేయాలో పాలుపోక తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. దహన సంస్కారాలకు డబ్బులు లేక, ఎవరి సహాయం తీసుకోవాలో తెలియక వారు కూడా చనిపోవాలని నిశ్చయించుకున్నారు. కానీ మళ్లీ ధైర్యం రాక, ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో 9 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని అలాగే ఉండిపోయారు. శుక్రవారానికి కొద్దిగా తేరుకున్న వాళ్లు తల్లి చనిపోయిన విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియచేయాలనే ఉద్దేశంతో సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే పద్మారావు కార్యాలయానికి వచ్చి చెప్పారు.సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు వారి బంధువుల గురించి ఆరాతీసి వారికి సమాచారం అందించారు. చనిపోయి 9 రోజులు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం నెలకొంది. విషయం తెలిసి ఈ భవనంలో ఉండే వాళ్లంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చుట్టుపక్కల నివసించే వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
తల్లి మృతదేహంతో నాలుగు రోజులు ఇంట్లోనే..
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ వారసిగూడలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలతో నాలుగురోజుల క్రితం లలిత అనే గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమార్తెలు సైతం తల్లితోపాటు ఆత్మహత్యకు ప్రయత్నించగా ధైర్యం సరిపోక విరమించుకున్నారు. దీంతో తల్లి మృతదేహంతో కుమార్తెలిద్దరూ నాలుగురోజుల పాటు ఇంట్లోనే ఉంపోయారు. దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ప్రశ్నించగా విషయం బయటపడింది.తల్లి దహన సంస్కారాలకు డబ్బులు లేవని కుమార్తెలు చెప్పడంతో విషయం పోలీసులకు చేరంది. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు -
తల్లి ఊపిరి ఆగిందని తెలియక..
సేలం(తమిళనాడు): తల్లి మరణించిందని తెలియని మానసిక రోగి అయిన కుమారుడు ఆస్పత్రి నుంచి ఆమెను సైకిల్‌పై తన నడుముకు కట్టుకుని 15 కిలోమీటర్లు పయనించాడు. ఈ ఘటన తమిళనాడులోని నెల్లై జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లై జిల్లా నాంగునేరి సమీపంలో వడక్కు మీన్వన్కుళం, మాతాకోవిల్ వీధికి చెందిన బాలన్ (38) మానసిక రోగి. ఇతని తల్లి శివగామి అమ్మాల్ (60) కూడా మానసిక రోగి. వీరు నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్య విభాగంలో చికిత్స పొందుతూ వచ్చారు. ఈ స్థితిలో వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను నాంగునేరి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి బాలన్ వైద్యం చేయిస్తూ వచ్చాడు. అకస్మాత్తుగా శివకామి అమ్మాల్ కింద పడి తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. దీంతో ఆమెను నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో బాలన్ చేర్చాడు. ఈ స్థితిలో గురువారం నెల్లై ఆస్పత్రిలో ఉన్న తల్లిని బాలన్ బయటకు తీసుకొచ్చాడు. తర్వాత తన సైకిల్‌పై కూర్చోబెట్టుకున్నాడు. కిందకు వాలిపోతున్న ఆమెను తాడుతో తన నడుముకు కట్టుకుని సైకిల్‌పై బయలుదేరాడు. అక్కడి నుంచి 15 కిలో మీటర్ల దూరం నెల్లై–కన్యాకుమారి జాతీయ రహదారిపై వెళ్లాడు. రాత్రి మూండ్రైపాళయం వద్ద బాలన్ సైకిల్‌పై నిలిచి ఉండగా, అక్కడ ఉన్న వారు బాలన్ వెనుక కూర్చుని ఉన్న తల్లి మృతిచెందినట్టు గుర్తించారు. తర్వాత మానసిక రుగ్మతతో ఉన్న కుమారుడు తల్లి మరణించిన విషయం కూడా తెలియకుండా సైకిల్‌పై వచ్చిన విషయాన్ని తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న కీల్కడంలో ఉన్న బాలన్ సోదరుడు సవరిముత్తు (43)ను రప్పించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. video credit to : Dinamalar -
ప్రియురాలి మృతదేహాన్ని 9 నెలలుగా ఫ్రిడ్జ్‌లో దాచి..
దేశంలోని పలు ప్రాంతాల్లో హృదయవిదారక దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. బృందావన్ ధామ్‌లోని ఒక ఇంట్లో ఫ్రిజ్‌లో ఒక మహిళ మృతదేహం బయటపడటంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది.ఒక ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దేవాస్ పోలీసు అధికారి అమిత్ సోలంకి తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తాళాలు బద్దలుకొట్టి తలుపు తెరిచారు. లోపలున్న ఒక ఫ్రిజ్‌లో పోలీసులకు ఒక మహిళ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టివేసివున్నాయి. ఈ ఉదంతం వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారు.పోలీసుల దర్యాప్తు(Police investigation)లో ఆ ఇంటి యజమాని ధీరేంద్ర శ్రీవాస్తవ అని, ఆయన ఈ ఇంటిని 2023 జూలైలో సంజయ్ పాటిదార్‌కు అద్దెకు ఇచ్చారని తేలింది. సంజయ్ జూన్ 2024లో ఇల్లు ఖాళీ చేశాడు. కానీ ఒక ఫ్రిజ్‌తో సహా కొన్ని వస్తువులను ఒక గదిలోనే వదిలేశాడు. కాగా సంజయ్ పాటిదార్ గత ఐదు సంవత్సరాలుగా ప్రతిభా అలియాస్ పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రతిభ వివాహం కోసం ఒత్తిడి తీసుకురావడంతో, ఆందోళనకు గురైన సంజయ్, తన స్నేహితుడు వినోద్ దేవ్‌తో కలిసి 2024 మార్చిలో ఆమెను గొంతు కోసి చంపాడు. తరువాత ఆ మృతదేహానికి చేతులు, కాళ్లు కట్టేసి ఫ్రిజ్(Fridge)లో దాచిపెట్టాడు.ఈ కేసులో సంజయ్ పాటిదార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని స్నేహితుడు వినోద్ ఇప్పటికే రాజస్థాన్‌లోని ఒక జైలులో ఉన్నాడు. సంజయ్ వివాహితుడని, వ్యవసాయ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. కాగా దేవాస్‌లో జరిగిన ఈ సంఘటన ఢిల్లీలోని శ్రద్ధా వాకర్(Shraddha Walker) హత్యను తలపించేలా ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా తన లివ్-ఇన్ పార్టనర్ శ్రద్ధను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో ఉంచాడు. తరువాత ఆ ముక్కలను ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ సంఘటన స్థానికులను భయకంపితులను చేసింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇది కూడా చదవండి: ట్రంప్‌ను ఓడించేవాడిని: బైడెన్ పశ్చాత్తాపం -
ప.గో.: పార్శిల్ మృతదేహాం కేసులో వీడిన మిస్టరీ!
పశ్చిమ గోదావరి: ఉండి మండలం యండగండి గ్రామంలో మృతదేహం పార్శిల్ కేసు మిస్టరీ దాదాపుగా వీడినట్లే కనిపిస్తోంది. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అలాగే ఆస్తి తగాదాల కోణంలోనూ ఈ కేసును విచారణ జరుపుతున్నారు.మృతదేహాన్ని కాళ్ల మండలం గాంధీనగర్‌కు బర్ల పర్లయ్యదిగా గుర్తించారు. అలాగే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సిద్ధార్థ్ వర్మ కోసం గాలింపు ముమ్మరం చేశారు.సాగి తులసి అనే మహిళకు ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది.. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె దరఖాస్తు చేసుకుంది. మొదటి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా.. పార్శిల్లో విద్యుత్ సామగ్రికి బదులు మృతదేహం వచ్చింది. పార్శిల్లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు.ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించగా.. అందులో హత్య జరిగిందని తేలింది. దీంతో.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. విచారణలో కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన సిద్థార్థ వర్మపైకి అనుమానం మళ్లింది.మూడు పేర్లు.. ముగ్గురు భార్యలుఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్నవ్యక్తికి ఏకంగా మూడు పేర్లు.. ముగ్గురు భార్యలు ఉన్నట్టు తెలిసింది. కృష్ణాజిల్లా మల్లంపూడి గ్రామానికి చెందిన తిరుమాని సుధీర్ వర్మకు ముందుగా కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీ ఇస్కులంక గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. సుధీర్ వర్మ తన పేరును శ్రీధర్ వర్మగా మార్చుకుని యండగండికి చెందిన రేవతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం సిద్ధార్థవర్మగా పేరు మార్చుకుని మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పదేళ్ల వయసున్న కుమార్తె ఉంది.ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న శ్రీధర్‌వర్మకి రెండో భార్య రేవతికి అక్క అయిన సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెకు మృతదేహాన్ని పంపించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. బర్ల పర్లయ్య ఎందుకు చంపాడు?.. ఎలా చంపాడు? ఆ మృతదేహాన్ని తులసికి ఎందుకు పంపాడనే విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
విస్తుగొలిపే ఘటన: పార్శిల్లో మృతదేహం
ఉండి: పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్‌గా రావడం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్‌ను తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించింది. దీంతో గుండె జారినంత పనైన సదరు మహిళ.. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించింది.ఉండి మండలం యండగండికి చెందిన తులసి సాగి అనే మహిళకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసింది. అయితే ఆ ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయంలో భాగంగా రాజమండ్రి(రాజమహేంద్రవరం) క్షత్రియ సేవా సమితికి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు ఇంటి నిర్మాణానికి అవసరమైన వస్తువుల్ని పార్శిల్ ద్వారి ఆ సంస్థ పంపిస్తోంది. దీనిలో భాగంగా తొలి విడతో టైల్స్ పంపించగా, రెండో విడతలో విద్యుత్ సామాగ్రి పంపిస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడే ట్విస్ట్ చోటు చేసుకుంది. రెండో విడతలో రావాల్సిన విద్యుత్ సామాగ్రి స్థానంలో ఒక మృతదేహం పార్శిల్‌గా వచ్చింది.ఒక ఆటో డ్రైవర్ తీసుకొచ్చిన ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసి చూడగా అందులో గుర్తు తెలియని మృతదేహం కనిపించింది. దాంతో పాటు కోటి రూపాయలకు పైగా తమకు చెల్లించాలనే లెటర్ కూడా ఆ పార్శిల్లో ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్శిల్ ప్యాకింగ్ దగ్గర్నుంచి పార్శిల్ తీసుకొచ్చిన వ్యక్తి వరకూ అందర్నీ పిలిచి ఆరా తీస్తున్నారు. -
ఐదు రోజులుగా భర్త అంత్యక్రియలను నిర్వహించని భార్య
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): ఆస్తి వివాదంతో జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని యువకు డు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందేనని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఐదు రోజుల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఈ ఘటన సదాశివపేట మండల పరిధిలోని తంగడపల్లి గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలు గులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సిరిపురం మణయ్య, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నవీన్, రాములు, కుమార్తె రజిత ఉన్నారు. గతేడాది చిన్న కుమారుడు నవీన్ మృతి చెందాడు. అతడి భార్యకు భూమి ఇవాల్సి వస్తుందని మణయ్య, మణెమ్మ దంపతులు తమ మూడెకరాల భూమిని అల్లుడు హోంగార్డ్ మల్లేశం పేరుపై సెల్ డీడ్ చేశారు. ఈ విషయం తెలిసి భూమిలో సగం వాటా తనకు ఇవ్వాలని పెద్దకుమారుడు రాములు(32) అడిగాడు. వారు ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై 18న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అదే రోజు రాత్రి సదాశివపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్తిలో తమకు వాటా ఇవ్వాలని మృతుడి భార్య, బంధువులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మృతదేహం ఐదురోజులుగా ఆస్పత్రిలోనే ఉంది. మంగళవారం సమస్య సద్దుమణగడంతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. -
గాజాలో మృతదేహాలను పిక్కుతింటున్న వీధికుక్కలు
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతుంది. హమాస్‌ను అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ యుద్ధంతో ఏడాదికాలంగా నలుగుతున్న గాజాలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడుతుండటంతో పాలస్తీనియన్లు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన మృతదేహాలను వీధికుక్కలు పిక్కుతుంటున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. ఆకలితో ఉన్న వీధికుక్కలు ఈ మృతదేహాలను తింటున్నాయని, దీని ద్వారా మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారుతోందని గాజాలోని ఉత్తర భాగంలో అత్యవసర సేవల అధిపతి ఫేర్స్ అఫానా వెల్లడించారు. ఉత్తర గాజా, జబాలియా ప్రాంతంలో హమాస్ సభ్యులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ జరుగుపతున్న వైమానిక, భూతల దాడులను ప్రస్తావిస్తూ. ఇజ్రాయెల్ దళాలు పాలస్తీనియన్ల జీవితాలను సూచించే ప్రతిదాన్ని నాశనం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి మరింత దిగజారుతోందని, తమ పనులు సవ్యంగా చేయలేకపోతున్నామని తెలిపారు. ఉత్తర గాజాలో జరుగుతున్నది నిజమైన మారణహోమమని ఆయన అన్నారు.కాగా గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ మెరుపు దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లారు. Oఇజ్రాయెల్‌లోకి చొచ్చుకుపోయిన హమాస్ ఉగ్రవాదులు అక్కడ 1200 మందిని బలితీసుకున్నారు. ఈ ఘటన తర్వాత గాజాలో ఇజ్రాయెల్ సైనిక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా స్ట్రిప్‌లో ఇప్పటి వరకు 42,409 మంది మరణించారు. వీరిలో అత్యధికంగా పౌరులే ఉన్నారు. మరో 99,153 మంది గాయపడ్డారు.గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైనిక దాడుల్లో 65 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. పాలస్తీనా శరణార్థుల కోసం యూఎన్ ఏజెన్సీ నిర్వహిస్తున్న గిడ్డంగి సహాయ కేంద్రంలో ఆహారం కోసం వెతుకుతున్న ఆకలితో ఉన్న నివాసితులపై సోమవారం ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
బుడమేరు వరదలో పడి మరో మహిళ మృతి
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద ముంపులో వ్యక్తులు మృతి చెందిన ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీన వరద ముంపులో కొట్టుకుపోయిన విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన వ్యక్తి 15 రోజుల తర్వాత మరణించి కనిపించారు. ఇప్పుడు తాజాగా అదే తరహాలో సింగ్‌నగర్ ఇందిరానాయక్నగర్లోని ఐదో రోడ్డులో బుడమేరు వెంబడి ఉన్న ముళ్ల చెట్ల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని అజిత్ సింగ్‌నగర్ పోలీసులు గుర్తించారు.తీవ్ర దుర్వాసనఇందిరానాయక్నగర్ ఐదో రోడ్డులో ఉన్న బుడమేరు వెంబడి ప్రాంతం నుంచి రెండు రోజులుగా తీవ్ర దుర్వాసన వస్తోంది. స్థానికులు దీనిపై సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమివ్వగా వారు సోమవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళ మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించి ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించారు. చనిపోయి సుమారు 20 రోజుల పైనే కావడంతో ఆమె రెండు చేతుల ఎముకలు బయటకు వచ్చేశాయి. తల భాగం పురుగులు తినివేయడంతో గుర్తు పట్టలేనంత దారుణంగా తయారైంది. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువతిని 30 ముక్కలుగా నరికి..
దొడ్డబళ్లాపురం: ఓ యువతిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన భయానక ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. వయ్యాలికావల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లేశ్వరంలోని ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో శనివారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి సోదా చేయగా ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ శరీర భాగాలు 30కి పైగా బయటపడ్డాయి. వారం క్రితం ఈ దారుణం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మి (29)అనే బాధితురాలు కర్ణాటకలో కొంతకాలంగా ఉంటున్నారని ఏసీపీ సతీశ్ కుమార్ చెప్పారు. సింగిల్ బెడ్ రూం ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నారని తెలిపారు. ఆమె వివరాలను సేకరించామని, అయితే ఇప్పుడే వాటిని బయటపెట్టలేమని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. పరిచయమున్న వారే దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలున్నాయి. ఇలా ఉండగా, మహాలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిన ఆమె భర్త కూడా అక్కడికి చేరుకున్నాడు. మహాలక్ష్మి మాల్లో పని చేస్తుండగా, అతడు బెంగళూరుకు సమీపంలోని ఆశ్రమంలో ఉద్యోగి అని సమాచారం. -
ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం అప్పగింత
న్యూఢిల్లీ: వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థీవదేహం ఎయిమ్స్‌కు చేరుకుంది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం.. అంతిమ యాత్ర సాగింది. ఆయన కోరిక మేరకే భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు.ఈ ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం.. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ.. ఏచూరి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయన సతీమణిని ఓదార్చారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ సీఎం పినరయి విజయన్.. ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి కూడా దివంగత కామ్రేడ్‌కు నివాళులర్పించారు.సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి తొలుత జేఎన్‌యూ(JNU)కు తరలించి అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉంచగా.. వందల మంది విద్యార్థులు ‘‘లాల్‌సలాం’’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. VIDEO | Veteran CPI(M) leader Sitaram Yechury’s mortal remains brought to AIIMS, Delhi. The CPI(M) general secretary died on Thursday, August 12, in Delhi after battling a lung infection. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/7eTYgwssEG— Press Trust of India (@PTI_News) September 14, 2024క్లిక్ చేయండి: వామపక్ష దిగ్గజ నేత జీవితంలో ప్రత్యేక క్షణాలు -
ఏచూరి పార్థివదేహానికి విజయసాయిరెడ్డి నివాళులు (ఫొటోలు)
-
ఆస్పత్రి దరిచేర్చని రోడ్డు.. లోకం చూడకుండానే కన్నుమూసిన పసిగుడ్డు
కాగజ్‌నగర్ రూరల్/పెంచికల్పేట్: రోడ్డంతా బురద.. అడుగుతీసి అడుగు వేయలేని దారిలో సకాలంలో ఆస్పత్రికి చేరుకోలేని పరిస్థితుల్లో లోకం చూడకుండానే ఓ పసిగుడ్డు తల్లి గర్భంలో కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన సోమవారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామ పంచాయతీ పరిధి మేరగూడ గ్రామానికి చెందిన దుర్గం పోచన్న భార్య పంచపూల నిండు గర్భిణి. సోమవారం వేకువజామున ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యులు 108కు సమాచారమిచ్చారు. మేరగూడకు వెళ్లే దారి పూర్తిగా బురదగా మారడంతో సిబ్బంది ఎల్లూర్ వరకు రావాలని సూచించారు. దీంతో తెల్లవారుజామున 4 గంటలకు కుటుంబసభ్యులు పంచపూలను ఎడ్లబండిలో ఎక్కించారు. మేరగూడ నుంచి ఎల్లూర్ వరకు ఐదుకిలోమీటర్ల దూరం వెళ్లడానికి ఆ బురద మార్గంలో రెండు గంటలకుపైగా పట్టింది. అక్కడి నుంచి గర్భిణిని 108లో కాగజ్‌నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో గర్భంలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆపరేషన్ చేసి ఆడ మృతశిశువును బయటకు తీశారు. ప్రస్తుతం పంచపూలకు చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. తమ గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడం వల్లే బిడ్డ మృతిచెందిందని పోచన్న కన్నీటిపర్యంతమయ్యాడు. -
8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం
తెనాలిరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రవితేజ భౌతికకాయాన్ని అంబులెన్స్ ద్వారా తెనాలి తీసుకు వచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి రవితేజ మృతి చెందిన విజయం తెలిసిందే. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి కొడుకుకు మంచి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఓవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడపెట్టుకున్న రవితేజ ఎంఎస్ కోసం గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. అక్కడ టెక్సాస్‌లో ట్రైన్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు ఎనిమిది రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతికకాయం తెనాలి చేరుకుంది. తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతికకాయాన్ని ఐతానగర్‌లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజక చెరువు సెంటర్ నుంచి లింగారావు సెంటర్ మీదుగా రవితేజ నివాసానికి రాత్రికి భౌతికకాయం చేరుకుంది. రవితేజ భౌతిక భౌతికకాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి, సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెల విసేలా రోదించారు. శనివారం ఉదయం రవితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
ఎంపీడీవో అదృశ్యం విషాదాంతం
పెనమలూరు/నరసాపురం/కోనేరుసెంటర్(మచిలీపట్నం)/సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు అదృశ్యం ఘటన చివరికి విషాదాంతమైంది. ఆయన మృతదేహాన్ని విజయవాడలోని మధురానగర్ వద్ద ఏలూరు కాలువలో మంగళవారం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుర్తించాయి. ఈ నెల 15వ తేదీన ఎంపీడీవో అదృశ్యం కాగా... ఆయన సెల్‌ఫోన్ చివరి లొకేషన్ సిగ్నల్ ఆధారంగా మధురానగర్ వంతెన వద్ద నుంచి ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అంచనా వేశారు.ఈ మేరకు గాలింపు చర్యలు చేపట్టగా, ఆ వంతెనకు 200 మీటర్ల దూరంలో పిచ్చిమొక్కల అడుగుభాగాన కుళ్లిపోయిన దశలో వెంకటరమణారావు మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా పెనమలూరులోని కానూరులో వెంకటరమణారావు అంత్యక్రియలు నిర్వహించారు.పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. కాగా, ఒత్తిళ్ల వల్లే వెంకటరమణారావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు శవపంచనామా సందర్భంగా తెలిపారు. మాధవాయిపాలెం ఫెర్రీ సొమ్ము రూ.55లక్షల బకాయి కారణంగా మనస్తాపం చెందాడని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరసాపురం ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తాం: పవన్ నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణారావు మరణం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచి్చన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని తెలిపారు.అన్నోన్ నంబర్ల నుంచి ఫోన్లు.. సంబంధం లేని ఖాతాలకు డబ్బులు బదిలీ!కుటుంబసభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఎంపీడీవో వెంకటరమణారావు ఆచూకీ తెలియకపోవడంతో ఆయన ఫోన్ కాల్‌డేటాను పరిశీలించారు. అన్ నోన్ నంబర్ల నుంచి వెంకటరమణారావుకు ఫోన్లు వచి్చనట్లు గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరికి, హైదరాబాద్‌కు చెందిన ఒకరికి, మరికొన్ని గుర్తుతెలియని ఖాతాలకు ఆన్లైన్లో ఎంపీడీవో డబ్బులు బదిలీ చేసినట్లు వెలుగుచూసింది.అయితే, మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో రూ.55 లక్షలు బకాయి ఉండగా, తీవ్ర ఒత్తిడికి గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు తెలిపారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వెంకటరమణ కొంత నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లలో జమ చేశారని చెప్పారు. -
22 ఏళ్ల క్రితం అదృశ్యం.. చెక్కుచెదరని స్థితిలో మృతదేహం!
22 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఓ పర్వతారోహకుడి మృతదేహాం పెరూ దేశంలో తాజాగా బయటపడింది. మృతుడిని అమెరికాకు చెందిన విలియం స్టాంప్ఫ్ల్గా గుర్తించారు. జూన్ 2002లో ఆయన ఆదృశ్యమవ్వగా అప్పుడు అతని వయసు 59 ఏళ్లు. పెరూలోని హుస్కరన్ అనే పర్వతాన్ని అధిరోహిస్తూ మిస్ అయ్యారు. ఆ పర్వతం ఎత్తు 6,700 మీటర్లు(22,000 అడుగులు). ఆ సమయంలో విలియం కోసం రెస్క్యూ బృందాలు ఎంత గాలించిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో పర్వతారోహకుడి కుటుంబం అతడిపై ఆశలు వదులుకుంది. వాతావరణ మార్పుల వల్ల ఆండీస్‌లోని కార్డిల్లెరా బ్లాంకా శ్రేణిలో మంచు కరిగిపోవడంతో 22ఏళ్ల క్రితం అదృశ్యమైన విలియం మృతదేహం బయటపడినట్లు పెరూవియన్ పోలీసులు పేర్కొన్నారు.అయితే ఇన్నేళ్ల అతని మృతదేహం దొరికినప్పటికీ.. అది చెక్కుచెదరని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పర్వతారోహకుడి శరీరంపై మంచు దట్టంగా పేరుకుపోవడంతో అతడి శరీరం మునుపటిలానే ఉందని, ఒంటిపై ఉన్న బట్టలు, బూట్లు మంచులో అలాగే భద్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అతని జేబులో లభించిన పాస్‌పోర్టు ఆధారంగా మృతుడిని గుర్తించామని, వారి కుటుంబసభ్యులను సంప్రదించి మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈశాన్య పెరూలోని హుస్కరన్, కాషాన్ వంటి పర్వతాలను దేశ, విదేశీ పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. కాగా గత మేలో ఇజ్రాయెల్, ఇటలీకి చెందిన ఇద్దరు పర్వతారోహకులు హుస్కరన్ పర్వతాన్ని అధిరోహిస్తూ మృతి చెందారు. -
‘నవాల్నీ’ మృతదేహం అతని తల్లికి అప్పగింత
మాస్కో: ఇటీవల రష్యాలోని ఆర్కిటిక్ పీనల్ కాలనీ జైలులో వివాదస్పద స్థితిలో మృతి చెందన రష్యా ప్రతిపక్షనేత, అధ్యక్షుడు పుతిన్ రాజకీయ ప్రత్యర్థి అలెక్సీ నావల్ని మృత దేహాన్ని ఎట్టకేలకు అతని తల్లికి అప్పగించారు. అలెక్సీ నావల్ని మరణించిన వారం రోజులకు ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించారు. ‘అలెక్సీ మృతదేహాన్ని అతని తల్లికి అప్పగించారు. ఆయన మృతదేహాన్ని తన తల్లికి అప్పగించాలని కోరిన మీ అందరికీ చాలా ధన్యవాదాలు’ అని నవల్నీ ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు. Alexey's body was handed over to his mother. Many thanks to all those who demanded this with us. Lyudmila Ivanovna is still in Salekhard. The funeral is still pending. We do not know if the authorities will interfere to carry it out as the family wants and as Alexey deserves. We… — Кира Ярмыш (@Kira_Yarmysh) February 24, 2024 ఇటీవల.. నావల్ని మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని, ఎలాంటి అంతిమయాత్ర నిర్వహించడానికి వీలు లేదని తమపై రష్యా ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చిందని నావల్ని తల్లి లియుడ్మిలా ఆవేదన వ్యక్తం చేశారు. పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష నేతగా పేరున్న జైలులో ఉన్న రష్యా ప్రతిపక్ష పార్టీ నేత అలెక్సీ నావల్నీ(47) జైలులోనే మృతి చెందారు. ఈ విషయాన్ని యమాలో నెనెట్స్ ప్రాంత జైలు సర్వీసు డిపార్ట్మెంట్ వెల్లడించింది. నావల్నీ పలు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో దోషిగా తేలడంతో 2021 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. చదవండి: నవాల్నీ మృతదేహం అప్పగింత కోసం తల్లి ఆవేదన -
కనీసం చివరిచూపు చూసుకోనివ్వండి
మాస్కో: రష్యా మారుమూల జైలులో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విపక్ష నేత, హక్కుల ఉద్యమకారుడు అలెక్సీ నవాల్నీ పార్థివదేహాన్ని వెంటనే అప్పగించాలని ఆయన తల్లి ఆవేదనతో ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. చనిపోయాక మృతదేహాన్ని వేరే చోటుకు తరలించామంటూ తల్లి, నవాల్నీ న్యాయవాదులను అటూ ఇటూ తిప్పుతూ అధికారులు తిప్పలు పెడుతున్నారు. మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలు చేయిస్తేగానీ విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలియని పరిస్థితి. అందుకే కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించట్లేరనే వాదన వినిపిస్తోంది. మాస్కోకు 1,900 కిలోమీటర్ల దూరంలోని ఆర్కిటిక్ ధృవ సమీపంలో మంచుమయ మారుమూల కారాగారంలో శుక్రవారం నవాల్నీ మరణించిన విషయం తెల్సిందే. విషయం తెల్సి నవాల్నీ తల్లితో కలిసి న్యాయవాది కిరా యామిష్క్ ఆ జైలుకెళ్లారు. అక్కడ మృతదేహం లేదు. దర్యాప్తులో భాగంగా సలేఖర్డ్ సిటీకి తరలించామని అధికారులు చెప్పారు. తీరా అక్కడి సిటీ మార్చురీకి వెళ్తే మూసేసి ఉంది. ఇక్కడికి తీసుకురాలేదని అక్కడి అధికారులు చెప్పారు. ‘మరణానికి కారణాన్ని రష్యా ప్రభుత్వం ఇంతవరకు వెల్లడించలేదు. మృతదేహాన్ని అయినా అప్పగించాలి’ అని లాయర్ డిమాండ్‌చేశారు. -
మణికొండలో కలకలం.. కారులో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: మణికొండలో కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మారుతి వ్యాన్‌లో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ సీటు వెనుక లో మృతదేహం లభ్యం కావడంతో హత్యా? ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
మృతుడిని గుర్తించి, నిందితులను పట్టించి.. ఏఐ మరో అద్భుతం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఉత్తర ఢిల్లీ పోలీసులు హత్య కేసును చేధించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు, హత్య కేసుతో ప్రమేయం ఉన్న నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులకు ఏఐ సహకరించింది. సాధారణంగా హత్య కేసులలో మృతుని గుర్తింపునకు పోలీసులు ఆ మృతుల ఛాయాచిత్రాలను వార్తాపత్రికలలో ప్రచురింపజేస్తుంటారు. ఇటువంటి సందర్భంలో మృతుల ముఖాలు స్పష్టంగా కనిపించవు. అయితే ఉత్తర ఢిల్లీ పోలీసులు తొలిసారిగా ఏఐ సాయంతో మృతుని ముఖం స్పష్టంగా కనిపించేలా ఫొటోను తీయడంలో విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే జనవరి 10న గీతా కాలనీ ఫ్లై ఓవర్ కింద ఓ యువకుని మృతదేహాన్ని ఢిల్లీ పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం అనంతరం వచిన నివేదికలో.. గొంతు నులిమి ఆ యువకుడిని హత్య చేసినట్లు వెల్లడయ్యింది. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులకు ఎటువంటి గుర్తింపు కార్డు లభించలేదు. దీంతో మృతుడిని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపధ్యంలో ఉత్తర ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నారు. కొద్దిపాటి కసరత్తు తర్వాత మృతునికి సంబంధించిన స్పష్టమైన ఫొటో వెలికివచ్చింది. కళ్లు తెరచి ఉన్నప్పుడు మృతుని ముఖం ఎలా ఉంటుందనేది గుర్తిస్తూ, ఫొటో రూపొందించారు. దీనితో పోస్టర్లు వేయించిన పోలీసులు వాటిని వివిధ ప్రాంతాల్లోని గోడలపై అతికించారు. అలాగే వివిధ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో పోలీసుల కృషి ఫలించింది. ఢిల్లీ పోలీసులకు వచ్చిన ఒక కాల్లో.. ఆ మృతదేహం తన అన్నయ్య హితేంద్ర ఫోటోనేనని ఒక వ్యక్తి తెలిపాడు. ఈ నేపధ్యంలో పోలీసులు హితేంద్ర ప్రొఫైల్‌ను పరిశీలించారు. అతని సన్నిహితులను విచారించి, కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో హితేంద్ర.. ముగ్గురు యువకులతో ఏదో విషయమై గొడవ పడ్డాడని, వారు హితేంద్ర గొంతుకోసి ఆ మృతదేహాన్ని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద పారవేశారని తేలింది. ఆధారాలు దాచిపెట్టడంలో ఓ మహిళ కూడా వీరికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులతోపాటు ఆ మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
HYD : ఓఆర్ఆర్ వద్ద మూటలో మృతదేహం కలకలం
హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డు వద్ద మూటలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల పరిధి బ్రహ్మణపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు పడేశారు. గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Suchana Seth: బ్యాగులో మద్యం బాటిళ్లున్నాయ్!
బెంగళూరు: గోవాలో నాలుగేళ్ల కొడుకు చంపి, మృతదేహం ఉంచిన సూట్ కేసును బెంగళూరుకు తీసుకువచ్చిన సీఈవో సూచనా సేథ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 12 గంటలపాటు కొడుకు మృతదేహంతో కారులో ప్రయాణించిన సమయంలో ఆమె ఎలా ప్రవర్తించిందనే విషయాన్ని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వెల్లడించాడు. ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నట్లు డిసౌజా తెలిపాడు. జనవరి 7వ తేదీన అర్ధరాత్రి 12.30 సమయంలో గోవాలోని కండోలిమ్‌లో ఉన్న ‘సోల్ బన్యాన్ గ్రాండ్’అనే సర్వీస్ అపార్టుమెంట్ నుంచి డిసౌజాకు కాల్ వచ్చింది. ఒక మహిళను అర్జంటుగా బెంగళూరుకు తీసుకెళ్లాల్సి ఉందనేది కాల్ సారాంశం. వెంటనే డిసౌజా కారుతో అక్కడికి వెళ్లాడు. ఒంటి గంటకు సూచనా సేథ్ బయటకు వచ్చింది. డిసౌజా ఆమెను రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నాడు. ఆమెతోపాటు ఉన్న నల్ల రంగు బ్యాగు చాలా బరువుగా ఉంది. బ్యాగు గురించి ఆ సమయంలో డిసౌజాకు ఎటువంటి అనుమానం రాలేదు. ‘మద్యం బాటిళ్లు గానీ ఉన్నాయా మేడం, బ్యాగు బరువుగా ఉంది’అని అడిగా. అందుకామె, అవును, మద్యం బాటిళ్లున్నాయి అని సమాధానమిచ్చిందని డిసౌజా తెలిపాడు. ప్రయాణం మొత్తమ్మీద దాదాపుగా వాళ్లిద్దరూ మాట్లాడుకోలేదు. గోవా–కర్ణాటక సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో 4 గంటలు లేటయింది. అయినా కూడా సూచన ఎటువంటి అసహనం కానీ, భయపడ్డట్లుగానీ కనిపించలేదని డిసౌజా చెప్పాడు. ‘ఆమె ఎవరికీ ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఫోన్ కాల్స్ రాలేదు’అని తెలిపాడు. ‘ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యేందుకు ఆలస్యమవుతుంది మేడం. అర్జంటు అన్నారు కదా, యూ–టర్న్ తీసుకుని ఎయిర్ పోర్టుకు పోనివ్వమంటారా? అని అడిగా. అయితే, ఆమె ఎయిర్‌పోర్టుకు వద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యాకే వెళ్దామని బదులిచ్చింది. అర్జంటుగా వెళ్లాలంటూనే, ట్రాఫిక్ సమస్య ఉన్నా సమస్య లేదనడం వింతగా అన్పించింది. కర్ణాటక సరిహద్దులు దాటగానే గోవా పోలీసుల నుంచి ఫోనొచ్చింది. కారులో ఉన్న మహిళతోపాటు బాబు ఉన్నాడా అని అడిగారు. ఆమె ఇచ్చిన అడ్రస్, ఇతర వివరాలన్నీ ఫేక్ అని చెప్పారు. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాలని సూచించారు. నేరుగా పోలీస్ స్టేషన్లావరణలో కారును ఆపడంతో, సూచన ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అని అడిగింది. పోలీసులు మీతో మాట్లాడుతామన్నారు’అని ఆమెకు చెప్పినట్లు వివరించాడు. ‘పోలీసులు కారు సోదా చేసి, బ్యాగులో చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు’అని డిసౌజా చెప్పాడు. -
వారం రోజులుగా ఇంట్లో శవం పెట్టుకొని...
హైదరాబాద్: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్లో చనిపోయిన మహిళ మృతదేహం వారం రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు మృతదేహంకి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి వారం రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
వాట్సాప్ స్టేటస్‌గా గర్ల్ ఫ్రెండ్ డెడ్‌బాడీ ఫొటో!
చెన్నై: గర్ల్ ఫ్రెండ్‌ను గొంతు పిసికి చంపేసిన ఓ యువకుడు, ఆమె మృతదేహం ఫొటోను తీసి వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. మృతురాలి స్నేహితులు గుర్తు పట్టి, పోలీసులను అప్రమత్తం చేయడంతో అతగాడు దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. కేరళలోని కొల్లంకు చెందిన ఫౌసియా(20) చైన్నైలోని ఓ హాస్టల్లో ఉంటూ క్రోంపేట్‌లోని కాలేజీలో నర్సింగ్ చదువుతోంది. ఆషిక్(20)అనే యువకుడితో అయిదేళ్లుగా సన్నిహితంగా ఉంటోంది. మైనర్‌గా ఉన్నప్పుడే ఫౌసియా గర్భవతి అయింది. ఆషిక్‌పై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకు వెళ్లాడు. ఫౌసియా పుట్టిన బిడ్డను దత్తతకిచ్చింది. జైలు నుంచి విడుదలయ్యాక ఆషిక్, ఫౌసియా సంబంధం తిరిగి కొనసాగుతోంది. శుక్రవారం చెన్నై వచ్చిన ఆషిక్ హోటల్లో రూం బుక్ చేసి, ఫౌసియాను వెంట తీసుకెళ్లాడు. అదే రోజు సాయంత్రం, మృతదేహం ఫొటోను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. ఫౌసియా స్నేహితులు ఆ ఫొటోను గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే వెళ్లి హోటల్ రూంలో చూడగా ఫౌసియా మృతదేహం కనిపించింది. పరారీలో ఉన్న ఆషిక్‌ను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నారు. తనకు మరో యువతితో సంబంధముందని అనుమానిస్తూ మాట్లాడటంతో కోపం పట్టలేక ఫౌసియాను టీ షర్టుతో గొంతుకు బిగించి, చంపేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. -
చంపితే ఎలా ఉంటుందో చూసేందుకు... నిజంగానే మర్డర్ చేసింది!
ఆమె పేరు జుంగ్ యూ జుంగ్. వయసు 23 ఏళ్లు. ఉండేది దక్షిణ కొరియాలోని బుసాన్‌లో. నేరాలు, ఘోరాలంటే మహా పిచ్చి. ఎంతగా అంటే, టీవీల్లో రియల్ క్రైమ్ స్టోరీలను విపరీతంగా చూసేది. క్రైం నవలలు కూడా తెగ చదివేది. వాటి స్ఫూర్తితో, హత్య చేస్తే ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి నిజంగానే ఘోరానికి తెగబడింది. హత్య ఎలా చేయాలో, శవాన్ని ఎలా మాయం చేయాలో తెలుసుకునేందుకు ఇంటర్నెట్లో నెలల పాటు సెర్చ్ చేసి మరీ రంగంలోకి దిగింది. ముక్కూ మొహం తెలియని ఓ అమాయక టీచర్‌ను విచక్షణారహితంగా పదేపదే పొడిచి పొట్టన పెట్టుకుంది! చివరికి శవా న్ని మాయం చేసే క్రమంలో అద్దెకు తీసుకున్న ట్యాక్సీ డ్రైవర్ పోలీసులకు ఉప్పందించడంతో కటకటాల పాలైంది! నేరాల సంఖ్య తక్కువగా ఉండే దక్షిణ కొరియా లో ఈ ఉదంతం సంచలనం సృష్టించింది... విద్యార్థి తల్లిగా నమ్మించి... జుంగ్ ఓ నిరుద్యోగి. తాతతో కలిసి నివసించేది. చేసేందుకు పనేమీ లేకపోవడంతో క్రైం ప్రోగ్రాంలు, సంబంధిత రియాల్టీ షోలకు, క్రైం నవలలకు బానిసగా మారింది. హత్యానుభవం ఎలా ఉంటుందో చూడాలని నిర్ణయించుకున్నాక సంబంధిత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెదికింది. అనంతరం తగిన వ్యక్తి కోసం ట్యూటరింగ్ యాప్‌ల్లో నెలల పాటు వేట సాగించింది. హోం ట్యూషన్లు చెబుతారా అంటూ కనీసం 50 మందిని సంప్రదించింది. చివరికి గత మే నెలలో ఒక 26 ఏళ్ల మహిళను ఎంచుకుంది. తనను తాను ఓ హైస్కూలు స్టూడెంట్ తల్లిగా పరిచయం చేసుకుంది. తన బిడ్డకు ఇంగ్లిష్ పాఠాలు చెప్పాలంటూ నమ్మించింది. అందుకామె సమ్మతించాక ఆన్లైన్లో ఆర్డర్ చేసి స్కూల్ యూనిఫాం కూడా తెప్పించుకుంది! అది వేసుకుని ట్యూటర్ ఇంటికి వెళ్లింది. ఆమె తలుపు తీసి లోనికి రానివ్వడమే ఆలస్యం, వెంట తీసుకెళ్లిన కత్తితో పదేపదే దాడికి దిగింది. ఏకంగా 100 సార్లకు పైగా పొడిచింది! చనిపోయిన తర్వాత కూడా దాడి ఆపలేదట! ఆ తర్వాత తాపీగా మృతదేహాన్ని ముక్కలుగా నరికింది. వాటిని సూట్‌కేస్‌లో కుక్కి, ఓ ట్యాక్సీలో తీసుకెళ్లి దూరంలో నది దగ్గర పడేసి చేతులు దులుపుకుంది. రక్తమోడుతున్న సూట్‌కేసును ఓ అమ్మాయి అడవిలో పడేసిందంటూ ట్యాక్సీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. జుంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని..
ఉత్తరప్రదేశ్‌లో హృదయాలను కలచివేసే ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఔరయ్య జిల్లాలో ఆరోగ్య సేవల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందనేది మరోమారు వెల్లడయ్యింది. నవీన్ బస్తీ వెస్ట్‌లో నివాసం ఉంటున్న ప్రబల్ ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి (20) పొరపాటున వేడి నీటితో నిండిన బకెట్‌లోని వాటర్ హీటర్‌ను ముట్టుకుని విద్యుదాఘానికి గురై, అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు అంజలి చనిపోయిందని నిర్ధారించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అందుబాటులో ఎలాంటి వాహనం లేదు. దీంతో మృతురాలి సోదరుడు సాహసం చేశాడు. ఆ మృతదేహాన్ని బైక్‌పై ఉంచి, దానిని చున్నీతో తన నడుముకు కట్టుకుని, వెనుకగా మరో సోదరిని కూర్చోబెట్టుకుని బైక్‌ను ఇంటివైపు నడిపాడు. ఇందుకు 15 నిముషాల సమయం పట్టింది. దీనిని గమనించి కూడా ఆసుపత్రి సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ ఉదంతం గురించి సీహెచ్‌సీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహనం కావాలని తమను అడిగితే, ఏర్పాటు చేసేవారమని తెలిపారు. కాగా జిల్లాలో రెండు అంబులెన్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఔరయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునేందుకు రెండున్నర గంటలు పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: హిమాలయాలు క్యాన్సిల్.. ప్రచారం షురూ: ఉమాభారతి యూటర్న్! -
కూతురు సాయంతో భర్తను చంపేసింది
సిరిసిల్ల క్రైం: మద్యానికి బానిసైన ఇంటిపెద్ద, వివాహేతర సంబంధాలకు అలవాటుపడి.. ఇంట్లోవారిని కొట్టడం, దుర్భాషలాడటంతో భరించలేకపోయిన భార్య, కూతురు కలిసి అతన్ని పాశవికంగా హత్య చేశారు. సిరిసిల్లలో వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్‌కు చెందిన లేచర్ల ప్రకాశ్‌రావు (44) జల్సాలకు అలవాటు పడటంతోపాటు, ఇంట్లో వారిపై తరచూ భౌతిక దాడులకు దిగేవాడు. వేధింపులు తాళలేని భార్య స్వప్న, కుమార్తె ఉషశ్రీ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని, ఇందుకు చంపడమే మార్గమని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం ఈ నెల 1న రాత్రి ప్రకాశ్‌రావు మెడపై కూరగాయలు కోసే కత్తితో భార్య దాడి చేయగా, కూతురు తండ్రి ముఖం మీద దిండుతో ఒత్తిపట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నం విఫలంకావడంతో మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలన్న ఆలోచనతో ఇంట్లోనే గుంత తవ్వి పాతిపెడదామనుకున్నారు. కానీ అలా చేస్తే శవం నుంచి వాసన వచ్చి బయటకు విషయం తెలుస్తుందని భావించారు. తదుపరి పెట్రోలు పోసి కాల్చేసే ప్రయత్నం చేసినా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న ఈనెల 3న తన తమ్ముడితో మరింత పెట్రోలు తెప్పించి శవానికి నిప్పటించారు. మంటలు ఎగిసిపడడంతో బయటకు తెలుస్తుందని నీళ్లు, దుప్పట్లతో మంటలు ఆరి్పవేశారు. ఇలా కుదరదని నిర్ణయించుకుని ఎట్టకేలకు హత్యను కాస్తా ఆకస్మిక మృతిగా చిత్రించి దహన సంస్కారాలు చేయాలని ప్రణాళిక చేశారు. దీనిలో భాగంగా ఈనెల 4న నిందితురాలు తన చిన్నాన్నను వేకువజామున పిలిపించుకుని జరిగిన విషయాన్ని వివరించింది. ఈక్రమంలో ప్రకాశ్‌రావు నిద్రలో చనిపోయినట్లు కథ సృష్టించి దహనసంస్కారాలు చేసేందుకు దగ్గరి బంధువులకు సమాచారం అందించారు. చివరిచూపునకు కొద్ది మంది బంధువులు రాగానే హుటాహుటిన విద్యానగర్‌లోని వైకుంఠధామంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఇలా వెలుగులోకి.. ప్రకాశ్‌రావు నిద్రలో మృతిచెందాడని బంధువులకు సమాచారం ఇచ్చిన నిందితులు, బంధువులందరూ వచ్చే వరకు ఎదురుచూడకుండా దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వచ్చింది. ఈక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మృతుడి ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోంచి దుర్వాసన వచ్చింది. దీంతో ప్రకాశ్‌రావు మృతిపై అనుమానం ఉందని సిరిసిల్ల టౌన్పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన టౌన్ సీఐ ఉపేందర్ హత్య ఉదంతాన్ని ఛేదించారు. నిందితులు స్వప్న, ఉషశ్రీని రిమాండ్‌కు తరలించగా, హత్యకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు. ప్రకాశ్‌రావు (ఫైల్) -
స్వగ్రామానికి తెలుగు విద్యార్థి మృతదేహం
జి.కొండూరు: కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన తెలుగు విద్యార్థి బేతపూడి సుధీర్‌కుమార్ మృతదేహం స్వగ్రామమైన ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరుకు సోమవారం ఉదయం చేరింది. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ కృషి, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో బాధిత తల్లిదండ్రులకు కుమారుడి చివరిచూపు దక్కింది. జి.కొండూరుకు చెందిన బేతపూడి దేవదాసు కుమారుడు సుదీర్‌కుమార్ అలియాస్ జోషీ (34) ఎంఎస్ చదివేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అనేక కారణాలతో ఎంఎస్ పూర్తి చేయలేకపోయాడు. అక్కడే ఉంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. గతనెల 15వ తేదీన తన స్నేహితురాలైన తోటి విద్యార్థి జెస్సికా జన్మదిన వేడుకల నిమిత్తం కొలంబియా వెళ్లాడు. 19వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మృతుడి తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసు తమ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ కుమారుడి ఆఖరి చూపు క ల్పించాలని వారు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ద్వారా కొలంబియాలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి, జి.కొండూరు తరలించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. బంధువులు, కుటుంబ సభ్యుల చివరిచూపు అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. తమ కుమారుడి చివరిచూపును కల్పించిన ఎమ్మెల్యేకు, రాష్ట్ర ప్రభుత్వానికి తామెప్పుడూ రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
రహస్యంగా మృతదేహం పూడ్చివేత
నల్లగొండ క్రైం : దుండగులు అర్ధరాత్రి ఓ మృతదేహానికి రహస్యంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన నీలగిరి మున్సిపాలిటీ పరిధి చందనపల్లి శివారు చెత్త డంపింగ్ యార్డు సమీపంలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో జరిగింది. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు వివరాలు ఇలా.. గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి 11:30 గంటలకు కారులో నలుగురు, మూడు బైక్‌లపై మరో ఆరుగురు వ్యక్తులు చందనపల్లి చెత్తడంపింగ్ యార్డు సమీపంలోని పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ ఎగువ ప్రాంతానికి వచ్చారు. వాహనాలను అక్కడే నిలిపి తమ వెంట తెచ్చుకున్న పలుగు, పారలతో సుమారు 4 నుంచి 5 ఫీట్ల పొడవులో గొయ్యి తీశారు. ప్యాకెట్లలో తీసుకొచ్చిన ఉప్పు గొయ్యిలో పోశారు. అనంతరం బ్యాగులో కుక్కి కారులో తీసుకొచ్చిన మృతదేహాన్ని బయటికి తీశారు. ఇద్దరు వ్యక్తులు సదరు మృతదేహం కాళ్లు ఒకరు, చేతులు మరొకరు పట్టుకుని గోతిలో పెట్టి పూడ్చిపెట్టారు. ఈ క్రమంలో వెంట వచ్చిన ఒకరు పెద్ద పెట్టున రోదించగా మిగతా వారు అతడిని వారించారు. అంతిమ సంస్కారాలు ముగిసిన తర్వాత అందరూ ఆయా వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిసింది. ఆ.. మృతదేహం ఎవరిది? గుర్తుతెలియని వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేసిన మృతదేహం ఎవరిదనేది చందనపల్లి గ్రామంలో చర్చ జరుగుతోంది. గొయ్యి పొడవు 4 నుంచి 5 ఫీట్ల లోపే ఉండడంతో ఆ మృతదేహం 6 నుంచి ఏడేళ్ల లోపు వారిదే ఉంటుందని తెలుస్తోంది. మృతదేహం ఆడ, మగ అనేది స్పష్టత లేదని అర్ధరాత్రి చాటుగా గమనించిన వారు పేర్కొంటున్నారు. ఏదైనా అనారోగ్యంతో మృతిచెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేస్తారు. మహిళలు ఎవరు లేకుండా, అర్ధరాత్రి బ్యాగులో మృతదేహాన్ని తీసుకొచ్చి ఖననం చేయడంతో ఎక్కడో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శనివారం అష్టమి కావడంతో నరబలి ఇచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి పూడ్చిపెట్టారనే అనుమానాలు లేకపోలేదు. అర్ధరాత్రి అంతిమ సంస్కారాల తంతును గమనించిన కొందరు చందనపల్లి గ్రామస్తులకు విషయం తెలపడంతో చర్చనీయాంశంగా మారింది. -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్‌యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్‌యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్‌కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్‌తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్‌ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్‌లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
ఎవరైనా అంతరిక్షంలో మరణిస్తే!.శరీరం ఏమవుతుంది? ఏం చేస్తారు?
అంతరిక్ష పరిశోధనలు 60 ఏళ్ల కిత్రం నుంచే ప్రారంభమయ్యాయి. ఆ పరిశోధనల్లో భాగంగా అంతరిక్షయానం చేసిన ఎంతోమంది వ్యోమగాములు ప్రాణాలతో తిరిగి వచ్చే సమయంలో రాకెట్లో సాంకేతిక లోపం కారణంగానో మరేదైన కారణం వల్లనే చనిపోవడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చెప్పాలంటే 1986 నుంచి 2003 వరకు నాసా స్పేస్‌కి సంబంధించి 14 మంది అంటే..1971లో సోయజ్ 11 మిషన్‌లో ముగ్గురు, 1976లో అపోలా1 లాంచ్ ప్యాడ్ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు చొప్పున చనిపోయారు. దీనిని బట్టి చూస్తే అంతరిక్షయానం ఎంత క్లిష్టంగా ఉంటుందో తెలుస్తోంది. అయినప్పటికి 2025 కల్లా చంద్రుడిపైకి, వచ్చే దశాబ్దం కల్లా అంగారకుడిపైకి వ్యోమగాములను పంపే సాహసం చేస్తుండటం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే వాణిజ్యపరమైన అంతరిక్షయానం నిత్యకృత్యంగా మారింది. ఈ దృష్ట్యా అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒకవేళ అంతిరిక్షంలోకి వెళ్లాక చనిపోతే ఏమవుతుంది?.. ఆ టైంలో మిగతా సిబ్బంది ఏం చేయాలి?.శరీరం ఏమవుతుంది. ఎలా ఖననం చేస్తారు వంటివి ఎదురవుతాయి. చంద్రుడు లేదా మార్స్‌పై మరణం సంభవిస్తే.. నిజానికి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లేముందే స్పేస్ మెడికల్ వైద్యులు అన్నిరకాల పరీక్షలు నిర్వహిస్తారు. వాళ్లు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారని నిర్థారించాకే స్పేస్‌లోకి వెళ్లేందుకు అనుమతిస్తారు. తీరా అక్కడకి వెళ్లే సమయంలో భూమి కక్ష్య మిషన్‌లో ఎవరైన మరణిస్తే..కొన్ని గంట వ్యవధిలో క్యాప్సూల్(రాకెట్లో విడిపోగల భాగం) నుంచి భూమిపైకి తిరిగి పంపించవచ్చు. ఇలాంటిదే చంద్రుని పైకి వెళ్లే క్రమంలో జరిగితే సిబ్బంది కొద్దిరోజుల వ్యవధిలో మృతదేహంతో భూమికి తిరిగి రాగాలరు. ఇక్కడ సమస్య చనిపోవడం, ఆ మృతదేహాన్ని సంరక్షించటం అనేవి ప్రధాన సమస్య కావంటోంది నాసా. అదే సమయంలో అక్కడ ఉన్న ఇతర సిబ్బందికి సురక్షితంగా భూమిపైకి తిరిగి రావడం అనేదే ప్రధాన సవాలు అని చెబుతోంది నాసా. అంగారక గ్రహానికి 300 మిలియన్ మైళ్ల ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే గనుక తిరిగి వెళ్లడం కుదరని పని ఎందుకంటే..రాకెట్ మిషన్ ట్రిప్ ముగిసే వరకు ఆగాల్సిందే. తిరిగి రావడానికి కొన్ని ఏళ్ల సమయం పడుతుందని పేర్కొంది. ఇలాగో సిబ్బంది మృతదేహాన్ని ప్రత్యేక గదిలో లేదా ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపరచాలి. అలాగే అంతరిక్ష వాహనం లోపల స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ మృతదేహాన్ని రక్షించడానికి ఉపకరిస్తుంది కూడా. ఇవన్నీ కేవలం అంతరిక్ష కేంద్రం లేదా అంతరిక్షంలోకి వెళ్లే క్రమంలో ఏర్పడిన ఒత్తిడి కారణంగా చనిపోతే మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయని నొక్కి చెబుతోంది నాసా. ఎవ్వరూ కూడా స్పేస్‌సూట్ రక్షణ లేకుండా అంతరిక్షంలోకి అడుగుపెట్టడం అనేది అసాధ్యం. ఆ వ్యక్తి తక్షణమే చనిపోతాడని చెబుతున్నారు స్పేస్ వైద్యులు. ఎందుకంటే పీడనం తక్కువగా ఉండటం, శ్వాస తీసుకోవడం కుదరక, రక్తం ఇతర ద్రవాలు ఆవిరైపోతాయని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఉండదు దీంతో రక్తం ఉడికిపోవడం మొదలవుతుందట. ఇదంతా కాదు సరిగ్గా అంతరిక్షంలోకి ల్యాండ్ అయ్యాక మరణిస్తే.. ఇలాంటి విపత్కర సమయంలో మిగతా సిబ్బంది ఆ పరిస్థితిని తట్టుకునే మానసిక స్థితితో రెడీగా ఉండాలి. మృతదేహాన్ని భూమిపైకి తెచ్చేంతవరకు ప్రత్యేకమైన బాడీ బ్యాగ్‌లో భద్రపర్చి.. స్పేస్ సెంటర్‌కి తెలిపే తక్షణ ప్రోటోకాల్ అవసరం అని పేర్కొంది. బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకుని వారికి సహాయ సహాకారాలు అందించాల్సిన బాధ్యతను స్పేస్ సెంటర్లు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది నాసా. (చదవండి: అతనో రాజవంశస్తుడు..గే కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
మొదటి భార్య ఫిర్యాదు ఏఆర్ ఎస్సై మృతదేహం వెలికితీత
నెల్లూరు: తిరుపతి జిల్లాలో ఏఆర్ ఎస్సైగా పనిచేస్తున్న త్రిపురాంతకం మోహన్ (56) ఈనెల 13వ తేదీన మృతిచెందగా రెండో భార్య కుటుంబసభ్యులు పూడ్చిపెట్టారు. అయితే మొదటి భార్య ఫిర్యాదు మేరకు మంగళవారం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీయించినట్లు ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు చెప్పారు. అందిన వివరాల మేరకు.. నెల్లూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న మోహన్ తిరుపతి జిల్లాలో ఏఆర్ ఎస్సైగా పని చేస్తున్నాడు. మోహన్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. నెల్లూరులో మొదటి భార్య, లింగసముద్రం మండలం వీఆర్ కోట గ్రామంలో రెండో భార్య నివాసం ఉంటున్నారు. ఈనెల 9న మోహన్ తన రెండో భార్య కందుకూరి పద్మావతి ఇంటికి వచ్చాడు. 13న ఆయన మృతిచెందగా మొదటి భార్య మాధవికి తెలియకుండా మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. భర్త ఇంటికి రాకపోవడం.. ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియక పోవడంతో ఆరా తీయగా వీఆర్ కోటలో రెండో భార్య వద్ద మృతి చెందినట్లు తెలుసుకున్నారు. ఈ విషయమై లింగసముద్రం పోలీస్‌స్టేషన్‌లో మొదటి భార్య కుమారుడు రిత్విక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. వీఆర్కోటలో తహసీల్దార్ మీరావలీ, నెల్లూరు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సమక్షంలో మంగళవారం పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించినట్లు ఎస్సై వివరించారు. -
భర్త దూరం.. యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూసి..
నెల్లూరు(క్రైమ్): గోనెసంచిలో మృతదేహం కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. స్నేహితుడు తనతోనే ఉండాలని, అతడి భార్య జైలుకు వెళ్లాలనే కుట్రతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం నగర డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి స్థానిక ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్యతో కలిసి వివరాలు వెల్లడించారు. పొదలకూరురోడ్డుకు చెందిన జహీర్ బాషా డైకస్‌రోడ్డులో మందుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో ఎ.కావ్య అలియాస్ షేక్ సమీరా పనిచేస్తోంది. ఆమెకు అప్పటికే వివాహమై భర్త నుంచి దూరంగా ఉంటోంది. కాగా జహీర్, కావ్య సన్నిహితంగా ఉండేవారు. జహీర్‌కు అప్పటికే అస్మా అనే యువతితో వివాహమైంది. ఎలాగైనా స్నేహితుడు తనతోనే ఉండాలని భావించిన కావ్య ఈ విషయాన్ని తన స్నేహితురాలైన వెంగళరావ్‌నగర్‌కు చెందిన కృష్ణవేణికి తెలియజేసింది. ఆమె ద్వారా యూట్యూబ్‌లో వశీకరణ పూజలు చేస్తామని వీడియోలు చేసిన ఏలూరు జిల్లా కలిదిండి గ్రామానికి చెందిన మణికంఠ (33) గురించి తెలుసుకుంది. గతేడాది ఇద్దరూ కలిసి అతడిని సంప్రదించారు. దీంతో మణికంఠ నెల్లూరుకు రాగా కావ్య, కృష్ణవేణి కలిశారు. హత్య చేసి.. జహీర్ తనతోనే ఉండిపోయేలా వశీకరణ చేయాలని కావ్య మణికంఠను కోరగా మందు చేసి ఇచ్చాడు. అది పనిచేయలేదని మహిళలు భావించారు. దీంతో మణికంఠను హత్య చేసి ఆ నేరాన్ని జహీర్ భార్యపై నెట్టేస్తే అతను తనతోనే ఉండిపోతాడని కావ్య పథకం రచించింది. ఈ విషయాన్ని కృష్ణవేణి, తన కుమార్తె సాయిప్రియకు తెలియజేసింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో మణికంఠకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. అప్పటికి అతను చనిపోకపోవడంతో గొంతునులిమి హత్య చేశారు. కావ్య తన కుమార్తె చేత అస్మాపై అనుమానం వచ్చేలా సూసైడ్ నోట్ రాయించి మృతుడి జేబులో పెట్టారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి స్కూటీపై తీసుకెళ్లి గౌతమ్‌నగర్ రెండో వీధిలో పడేసింది. దర్గామిట్ట ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి జేబులో లభ్యమైన లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదికలో మణికంఠది హత్యేనని తేలడంతో కేసును మార్చి విభిన్న కోణాల్లో దర్యాపు చేపట్టారు. నగదు డ్రా చేసి.. మణికంఠ హత్య అనంతరం కావ్య మృతుడి ఏటీఎం కార్డు ద్వారా రూ.3.50 లక్షలను విడతల వారీగా నగదు డ్రా చేసింది. అందులో రూ.లక్ష నగదు స్నేహితురాలికి ఇచ్చి మిగిలిన నగదుతో బంగారం కొనుగోలు చేసింది. సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మణికంఠను హత్య చేసింది కావ్య అని గుర్తించారు. ఆమెకు సాయిప్రియ, కృష్ణవేణి సహకరించారని గుర్తించి శనివారం రాత్రి వారందరినీ అరెస్ట్ చేశారు. 25 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ఏటీఎం కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన పోలీసు« అధికారులను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై రమే‹Ùబాబు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భర్త వస్తాడనుకుంటే మృతదేహం రావడంతో.. సొమ్మసిల్లిన నిండుగర్భిణి!
ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్ నుంచి బాందాకు వస్తున్న 25 ఏళ్ల యువకుడు రైలులో మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలియని అతని భార్య, కుటుంబసభ్యులు.. ఇక కొద్ది సేపటిలో అతను వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఇంతలో వారికి అసలు విషయం తెలిసింది. దీంతో వారి ఇల్లు శోకసంద్రంగా మారిపోయింది. భర్త ఇక రాడనే సంగతి తెలుసుకున్న భార్య సొమ్మసిల్లి పడిపోయింది. ఈ ఉదంతం గురించి బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కుమారుడు రైలులో విషప్రయోగానికి బలైపోయాడని ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని, తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కమాసిన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సుజర్ భాన్ అనే యువకుడు అహ్మదాబాద్‌లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నాడు. అతని కుటుంబం బాందాలో ఉంటోంది. ఆదివారం బరౌనీ-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి ఇంటికి బయలుదేరాడు. రక్తంతో కూడిన వాంతులు.. మహోబా స్టేషన్ సమీపంలోకి రైలు చేరుకోగానే ఉన్నట్టుండి అతనికి రక్తంతో కూడిన వాంతులు రావడం మొదలయ్యింది. దీనిని గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే ఈ విషయాన్ని సీఆర్పీ పోలీసులతో పాటు రైల్వే అధికారులకు తెలియజేశారు. ఇంతలోనే అతని ఆరోగ్యం విషమించింది. వెంటనే జీఆర్పీ పోలీసులు బాధితుడిని రైల్వే వైద్యుల దగ్గకు తీసుకువెళ్లారు. వారు బాధితుడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు మృతుని జేబులో అహ్మదాబాద్ నుంచి బాందాకు రైల్ టిక్కెట్ లభ్యమయ్యింది. డాక్యుమెంట్ల ఆధారంగా మృతుడు బాందాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారు మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే మృతుని కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. వారు తెలిపిన వివరాల ప్రకారం సూరజ్ భాన్‌కు ఇద్దరు పిల్లలు ఉంటేవారు. వారు మృతిచెందారు. ప్రస్తుతం అతని భార్య నిండుగర్భంతో ఉంది. కొద్దిరోజుల్లో ఆమెకు డెలివరీ జరగనుంది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
చివరికి.. తోపుడు బండిపై చిన్నారి మృతదేహం తరలింపు!
ఆ ఏడేళ్ల కుర్రాడు పాము కాటుకు గురయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలుడు మృతి చెందాడు. కుమారుడు మరణించాడన్న బాధలో ఉన్న అతని తండ్రికి ఊహించని విధంగా మరో సమస్య ఎదురయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లో మానవత్వం మంటగలిసే ఉదంతం చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ అందుబాటులో లేదు. మరోమార్గం లేక మృతుని కుటుంబ సభ్యులు ఆ మృతదేహాన్ని తోపుడు బండిపై పెట్టి, రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఈ సమయంలో పెద్దసంఖ్యలో జనం ఆ తోపుడుబండిని అనుసరిస్తూ వచ్చారు. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినా అధికారులు ఈ ఉదంతంపై స్పందించక పోవడం విచారకరం. సాహిల్ శరీరంలో కదలిక? విజయ్‌పూర్‌కు చెందిన ఏడేళ్ల సాహిల్ ఖాన్‌ను పాము కాటువేసింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించాగా, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రాత్రంతా పోస్టుమార్టం హౌస్‌లో ఉంచారు. మర్నాడు సాహిల్ కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. వారికి సాహిల్ శరీరంలో కదలిక కనిపించింది. దీంతో వారు వైద్యులకు ఈ విషయాన్ని చెప్పారు. వారు పరీక్షించి, బాలుడు మృతిచెందాడని నిర్థారించారు. తరువాత వైద్యులు ఆ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని కుటుంబ సభ్యులు అంబులెన్స్ కోసం చాలాసేపు ఎదురు చూశారు. సంబంధిత అధికారులకు ఈ విషయం గురించి చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేదేమీలేక నాలుగు చక్రాల తోపుడు బండిపై బాలుని మృతదేహాన్ని ఉంచి, ఇంటికి తరలించారు. ఈ పరిస్థితిని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు. తరువాత మృతునికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: భర్త చంకలో పిల్లాడు.. భార్య చేతిలో సైకిల్.. డెలివరీబాయ్ ఫ్యామిలీ వీడియో వైరల్! -
కలకలం రేపిన ‘ గోనెసంచి మూట’
నిజామాబాద్: మండల కేంద్రం శివారులోని చెరువు సమీపంలో గోనె సంచి మూట బుధవారం కలకలం రేపింది. మూటలో మృతదేహం ఉందని అనుమానించిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ రాజారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘటన స్థలానికి హుటాహూటిన చేరుకున్నారు. గోనె సంచి మూటను తెరువగా అందులో కుక్క మృతదేహం కనిపించింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలనే ఇలా చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్
కర్ణాటక: సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాలు.. కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు. మృతదేహాన్ని దహనం చేసేముందు అఘోర శవంపై కూర్చొని పూజలు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్‌ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
ఆమె చనిపోయి నాలుగేళ్లైంది..ఐనా మృతదేహం కించెత్తు పాడవ్వకుండా..
ఎవ్వరైన చనిపోతే వారివారి మత ఆచారాలను బట్టి అంత్యక్రియలు జరుగుతుంటాయి. ఖననం చేస్తే కొన్ని నెలల్లోనే కుళ్లిపోయి కేవలం అస్థిపంజరాలు మాత్రమే ఉంటాయి. అది అందరికీ తెలిసిందే. ఐతే ఇక్కడోక ఆఫ్రికన్ మహిళ చనిపోయి నాలుగేళ్లైంది. కొన్ని కారణాల రీత్యా ఆమె శవపేటికను వెలికి తీయగా..ఆ మహిళ మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు కుటుంబసభ్యులు, బంధువులు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...సదరు మహిళ సిస్టర్ విల్హెల్మినా లాంకాస్టర్ ఆఫ్రికన్ అమెరికన్. ఆమె అమెరికాలో బెన్డిక్ట్ ఇన్ సిస్టర్స్ ఆఫ్ మేరి(నన్స్ ఆశ్రమం) వ్యవస్థాపకురాలు. అక్కడ ఆమె నన్‌గా ఎంతో సామాజిక సేవ చేసింది. అయితే ఆమె 2019లో చనిపోయింది. అక్కడే ఆ ఆశ్రమం సమీపంలో ఖననం చేశారు. ఐతే ఆ ఆశ్రమంలోని కొందరూ ఆమె సమాధి పాడవ్వడంతో ఆమె అవశేషాలను వేరోచేటికి తరలించి సమాధి కట్టించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఆమె శవపేటికను వేలికి తీశారు. అందులో ఆమె మృతదేహం చూసి ఒక్కసారిగా అవాక్యయ్యారు అక్కడున్నవారంతా. కనీసం ఎలాంటి దుర్వాసన గానీ రాకుండా తాజా మృతదేహంలా అలా చెక్కు చెదరకుండా ఉంది. వాస్తవానికి తాము ఎముకలు మాత్రమే ఉంటాయని భావించామని చెబుతున్నారు ఆమె సంబంధికులు, స్నేహితులు. కనీసం ఆమె మృతదేహం పాడవ్వకుండా ఎలాంటి లేపనాలు పూయకుండా సాధారణ మనిషి మాదిరే ఖననం చేశామని చెబుతున్నారు. పగిలిన శవపేటికలో ఓ తేలికిపాటి మెత్తని పొరలాంటి గుడ్డలో చుట్టబడి, పాడవ్వకుండా ఉన్నా ఆమె మృతదేహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దీంతో సదరు ప్రాంతంలోని ప్రజలు ఆమె మృతదేహాన్ని చూసేందుకు ఆ బెనెడిక్టైన్ ఆశ్రమానికి తండోపతండోలుగా తరలి వచ్చారు. ఆమె నెక్కు ధరించే బెల్ట్ మాదిరి క్లాత్, తలకు ధరించిన క్లాత్ మాత్రమే పాడైయినట్లు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. నెలల తరబడి ఆమె శరీరీం పాక్షికంగా పాడైన చెక్క శవ పేటికలో ఉండి.. సూర్యరశ్మీ, వర్షాలకు ఎక్స్పోజ్ అయినా ఏ మాత్రం కుళ్లకుండా అలా ఉండటం అత్యంత విచిత్రం అంటున్నారు బంధువులు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మరోక చోటికి తరలించి సమాధి చేయనున్నట్లు తెలిపారు ఆమె తల్లి సిసిలియా. ఇది దేవుడి పట్ల ఆమెకి ఉన్న భక్తి విశ్వాసం, నిస్వార్థపూరిత సేవకు భగవంతుడిచ్చిన వరం కాబోలు అని ఆ నన్తో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు మృతురాలి తల్లి, బంధువులు. (చదవండి: US: మితిమీరిన స్వేచ్ఛ+ పతనమైన కుటుంబ వ్యవస్థ = మానసిక ఉన్మాదులు) -
కర్నూలులో దారుణం.. ఇంట్లో అట్టపెట్టెలతో భర్త మృతదేహాన్ని తగలబెట్టింది!
సాక్షి, పత్తికొండ రూరల్ (కర్నూలు): అనారోగ్యంతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఉదంతమిది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని తేరు బజారులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న హరికృష్ణప్రసాద్ (63)కు భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కన్నబిడ్డలకు ఎలాంటి లోటులేకుండా పెంచిపెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు. పెద్ద కుమారుడు దినేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే భార్యతో కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు ముఖేష్ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట హరికృష్ణ ప్రసాద్‌కు పార్కిన్సస్ ప్లస్ వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు పక్షవాతంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న అతనికి భార్య లలితమ్మ సపర్యలు చేస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మూడేళ్ల నుంచి కర్నూలులో కుమారుడు దినేష్ వద్దే దంపతులిద్దరూ ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరూ పత్తికొండకు చేరుకున్నారు. కాగితాలు.. చీరలు వేసి నిప్పు కాగా, సోమవారం వేకువజామున భర్త హరికృష్ణప్రసాద్‌కు భార్య లలితమ్మ కాలకృత్యాలు తీర్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండె పగిలేలా రోదించింది. ఆ తరువాత తేరుకుని టెంకాయ కొట్టి.. మృతదేహంపై ఇంట్లోని పుస్తకాలు చింపి కాగితాలు, చీరలు వేసి నిప్పు పెట్టింది. ఆ తరువాత పెద్దకుమారుడు దినేష్‌కు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది. ఆ ఇంట్లోంచి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. లలితమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని సీఐ తెలిపారు. ఇంట్లోనే మృతదేహం కాల్చిన ఘటన దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఇన్నేళ్లు సపర్యలు చేసిన ఆమె భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాలి్చవేసిందంటే నమ్మలేకపోయారు. లలితమ్మ నిత్యం దైవారాధనలో ఎక్కువగా గడిపేదని కాలనీవాసులు తెలిపారు. నోట మాట రాలేదు అమ్మ ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసింది. ‘నాన్న చనిపోయాడు. ఇంట్లోనే దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. మీరేం రాకండి’ అని చెప్పింది. ఆ మాట విని షాక్‌కు గురయ్యాను. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి పత్తికొండ చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లగా కాలిన నాన్న మృతదేహం చూసి నా నోట మాట రాలేదు. అమ్మ పూర్తిగా డిప్రెషన్‌కు గురైంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఓదార్చాను. కెనడాలో ఉన్న తమ్ముడు ముఖేష్‌కు ఫోన్ చేశాను. వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పాడు. – దినేష్, పెద్ద కుమారుడు చదవండి: Delhi: గాళ్‌ఫ్రెండ్‌తో గొడవ.. అందరూ చూస్తుండగానే..! -
రేబిస్‌తో ఉన్మాదిగా మారి చంపి తిన్నాడు!
జైపూర్: రాజస్తాన్‌లో ఒళ్లు జలదరించే ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఉన్మాదిగా మారిన ఓ వ్యక్తి వృద్ధురాలిని చంపి, ఆమె మాంసం తిన్నాడు. ముంబైలో ఉండే సురేంద్ర ఠాకూర్(24) ఇటీవలే తన సొంత పాలి జిల్లా సెండ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరధనా గ్రామానికి వచ్చాడు. పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న అతడు శుక్రవారం పొలంలో పశువులు మేపుకుంటూ ఉన్న శాంతిదేవి(65)ని బండరాయితో మోది చంపేశాడు. అనంతరం ఆమె మాంసం తిన్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని అతికష్టమ్మీద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హత్య, నరమాంసభక్షణ నేరం కింద పోలీసులు కేసు పెట్టారు. ఠాకూర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. రేబిస్ వ్యాధి(హైడ్రోఫోబియా) బాధితుల్లో వ్యాధి ముదిరితే చివరి దశలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. -
హృదయ విదారకం.. అంబులెన్సుకు డబ్బుల్లేక కుమారుడి శవంతో 200 కిమీ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. అంబులెన్సుకు చెల్లించేందుకు డబ్బులు లేక ఓ వ్యక్తి తన కుమారుడి శవంతో 200 కిలోమీటర్లు ప్రయాణించాడు. శనివారం జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. బెంగాల్లో ఆరోగ్య సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లా కలియగంజ్ ప్రాంతం డంగిపారా గ్రామానికి చెందిన ఈ వ్యక్తి పేరు ఆసిం దేవశర్మ. ఐదు నెలల క్రితమే కవలలకు తండ్రయ్యాడు. అయితే ఇటీవలే వారి ఆరోగ్యం క్షీణించింది. దీంతో చికిత్స కోసం ఇద్దరు పిల్లలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి వైద్యులు రాయ్‌గంజ్ మెడికల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే వీరు మాత్రం సిలీగుడిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ పిల్లల ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఇంకా క్షీణించింది. దీంతో కవలల్లో ఒకరిని తీసుకుని తల్లి ఇంటికి వెళ్లిపోయింది. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. తన కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్సు ఏర్పాటు చేయాలని ఆస్పత్రి నిర్వాహకులను అడిగాడు దేవశర్మ. అయితే రూ.8,000 ఇవ్వాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. అంబులెన్సు రోగులను తరలించేందుకే ఉచితమని, శవాలను తరలించేందుకు కాదని బదులిచ్చాడు. అనుమానం రాకుండా.. కుమారుల చికిత్స కోసం ఆరు రోజుల పాటు రూ.16,000 ఖర్చు చేయడంతో దేవశర్మ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయింది. ఇక గత్యంతరం కుమారుడి మృతదేహంతోనే సిలీగుడిలో ఓ ప్రైవేటు బస్సు ఎక్కాడు. రాయ్గంజ్లో దిగాడు. అక్కడినుంచి కలియగంజ్ వెళ్లేందుకు మరో బస్సు ఎక్కాడు. మొత్తం రూ.200 కిలోమీటర్లు ప్రయాణించాడు. చిన్నారి చనిపోయాడని తెలిస్తే బస్సు నుంచి దింపేస్తారని భయంతో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డాడు. కలియగంజ్ చేరుకున్నాక తెలిసిన వ్యక్తి ఒకరు అంబులెన్సు ఏర్పాటు చేయడంతో దేవశర్మ అందులోనే ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించాడు. తనకు జరిగిన విషయాన్ని మీడియాకు వెల్లడించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. This poor person has to carry the dead body of his child in the bag. He didn’t find any Ambulence. This is the condition of the health facility in West Bengal. This case is from Uttar Dinajpur district . Sad but this is the reality across all districts in West Bengal. pic.twitter.com/gOziExkCVF — Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) May 14, 2023 రాజకీయ దుమారం.. ఈ ఘటనపై స్పందిస్తూ ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనమని ధ్వజమెత్తింది. టీఎంసీ నేతలు ఈ విమర్శలను తిప్పికొట్టారు. చిన్నారి మరణం దురదృష్టకరమని , దీన్ని కూడా బీజేపీ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. చదవండి: రెజిమెంటల్ బజార్ అగ్నిప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్..రూ.1.65 కోట్ల నగదు స్వాధీనం -
Hyderabad: హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో తేలియాడుతున్న ఓ గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని రాంగోపాల్‌పేట్ పోలీసులు వెలికితీశారు. సోమవారం పెట్రోలింగ్లోఉ న్న లేక్ పోలీసులకు సాగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఆర్ఎఫ్ బృందాల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి 25నుంచి 30 ఏళ్ల వయస్సు ఉంటుందని ఒంటిపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంటు ధరించి ఉందని పోలీసులు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 040-27853595 9948031574 నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. చదవండి: HYD: జలమండలి వద్ద ఉద్రిక్తత.. -
ప్లాస్టిక్ బ్యాగ్‌లో చిధ్రమైన స్థితిలో తల్లి మృతదేహం..కూతురు అరెస్టు
ముంబైలోని ఇంట్లో ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆమె 23 ఏళ్ల కూతురుని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..వీణా జైన్ అనే మహిళ తన ఇంట్లోనే ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో శవమై కనపించింది. ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. అలాగే ట్యాంక్‌లోని స్టీల్ బాక్స్‌లో మాంసం, ఎముకల ముక్కలు కనిపించాయని పోలీసుల తెలిపారు. నెలల తరబడి బ్యాగ్‌లో ఉండటంతో మృతదేహం కుళ్లిన స్థితిలో ఛిద్రమై ఉందని తెలిపారు. పోలీసులు అనుమానంతో మృతురాలి తోపాటు ఉంటున్న ఆమె కూతుర్ని సైతం పోలీసుల విచారించారు. ఐతే పోలీసులు ఆమే హత్య చేసి ఉండొచ్చన్న అనుమానంతో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, సదరు మహిళ వీణా జైన్ చివరిసారిగా నవంబర్ 26న చూశామంటూ మృతురాలి సోదరుడు, మేనల్లుడు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆమె కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు..చివరగా అనుమానంతో ఆమె అపార్ట్‌మెంట్‌ని సోదాలు చేయడం ప్రారంభించారు. అక్కడ ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో చిధ్రమై ఉన్న ఆమె మృతదేహ్నాన్ని గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఐతే ఆమె గతేడాది డిసెంబర్లో మెట్లపై నుంచి పడిపోయిందని చెబుతున్నారు పోలీసులు. ఐతే ఆమె ఎలా చనిపోయిందనేది అనేది తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. కాగా, ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ని ఆమె ప్రియుడే కిరాతకంగా చంపిన ఘటన మరువుక మునేపే అదేతరహాలో వరుస ఘటనలు చోటు చేసుకోవడం బాధకరం. (చదవండి: స్పీకర్ కార్యాలయం వద్ద గందరగోళం..ఎమ్మెల్యేలను నెట్టేసిన సిబ్బంది) -
భార్యను చంపి 5 ముక్కలుగా నరికి..
బిలాస్పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిలాస్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలుగా నరికి, ఇంట్లోని ఖాళీ నీళ్ల ట్యాంకులో పడేశాడు. సక్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలాస్‌పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లను ముద్రిస్తున్నాడనే అనుమానంతో ఓ ఇంట్లో సోదాలు జరిపారు. బాత్రూం మూలన ఉన్న ట్యాంకులో టేప్ వేసి పాలిధీన్ కవర్లో చుట్టిన శరీర భాగాలు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను జనవరి 6న గొంతు పిసికి చంపినట్లు విచారణలో అతడు వెల్లడించాడు. అనంతరం కట్టర్‌తో మృతదేహాన్ని ఐదు ముక్కలు కోసి, కొనుక్కొచ్చిన ట్యాంకులో పడేసినట్లు తెలిపాడు. ఇంట్లో నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నిజామాబాద్: గుండెపోటుతోనే కెనడాలో కన్నుమూత
సాక్షి, నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిందని భావించిన నిజామాబాద్ యువతి పూజితారెడ్డి మృతికి కారణం తెలిసింది. విద్యార్థిని మృతదేహాన్ని సోదరుడు స్వగ్రామానికి తీసుకురాగా.. సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే.. ఆమె గుండెపోటుతోనే కన్నుమూసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ గ్రామం పూజితారెడ్డిది. ఆమె తండ్రి మల్కాపూర్ ఉపసర్పంచ్ వెంకటరెడ్డి. పెద్ద కొడుకు కెనడాలో స్థిరపడ్డారు. పూజితారెడ్డి(24) ఖమ్మంలోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో బీడీఎస్ పూర్తి చేసింది. పీజీ కోసం ఈ ఏడాది జనవరి 26న కెనడా వెళ్లింది. అన్నయ్య ఇంట్లో వారం ఉండి, అనంతరం స్నేహితులతో కలిసి యూనివర్సిటీ హాస్టల్లో చేరింది పూజిత. అయితే.. పది రోజుల కిందట గుండెపోటుకు గురై ఆకస్మాత్తుగా హాస్టల్ గదిలోనే కుప్పకూలింది. స్నేహితులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. తమ మధ్య పెరిగి.. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. గుండెపోటుతో చిన్నవయసులోనే హఠాన్మరణం చెంది.. విగతజీవిగా తిరిగి వచ్చిన పూజితను చూసి ఊరంతా కంటతడి పెట్టింది. -
చర్చలు సఫలం.. గాంధీ ఆస్పత్రికి ప్రీతి మృతదేహం తరలింపు
వైద్య విద్యార్థిని ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఆదివారం కన్నుమూసింది. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థినికి హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ప్రీతి మృతికి గల కారణాలను వెల్లడించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. దీంతో నిమ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రీతి మరణానికి గల కారణాలు వివరించాలని.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ప్రీతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రులు వారితో చర్చలు జరిపారు. చివరికి బాధిత కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో అయితే ఎట్టకేలకు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు అంగీకరించారు. గాంధీ ఆస్పత్రిలో ప్రీతి డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేయనున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రీతి తల్లిదండ్రులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసును విచారణ చేపడతామని తెలిపింది. -
అనాథ శవాలకు ఆత్మ బంధువులు
సాక్షి, నెల్లూరు/బారకాసు: నెల్లూరు నగర పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఛిద్రమైన తల.. కాళ్లు, చేతులు వేర్వేరుగా పడి ఉన్నాయి. చుట్టూ ఈగలు ముసురుతుండగా.. ఆ శవం దుర్వాసన వెదజల్లుతోంది. పోలీసులు సైతం ముక్కుమూసుకుని నిలబడగా.. పెద్దోడు, చిన్నోడు అనే వ్యక్తులు చకచకా వచ్చి శరీర భాగాలను సేకరించారు. వాటన్నిటినీ ఓ దుప్పట్లో కట్టుకుని వాహనంలోకి ఎక్కించారు. అక్కడి నుంచి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత ఛిద్రమైన శవ భాగాలను శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు జరిపారు. కట్టె కాలుతుండగా ఎగిసిపడే చితి మంటలు.. వారి ఔదార్యానికి సలాం చేస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వేలాది మృతదేహాలకు పెద్దోడు, చిన్నోడు అసామాన్య సేవలందిస్తున్నారు. రైలు బోగీలకు మంటలంటుకున్న వేళ 2011లో నెల్లూరు రైల్వేస్టేషన్లో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ బోగీల్లో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం జరిగింది. చాలామంది ప్రయాణికులు అగ్నికీలల్లో చిక్కుకుని గుర్తు పట్టలేనంతగా కాలిపోయారు. ఆ సమయంలో చిన్నోడు, పెద్దో డు కృషి అంతా ఇంతా కాదు. వీరిద్దరి సహకారంతోనే మంటల్లో కాలిపోయిన వారి మృతదే హాలను బోగీల్లోంచి వెలికితీసి రక్త సంబంధీకు లకు అప్పగించారు. కరోనా విజృంభించిన సమ యంలోనూ పెద్దోడు, చిన్నోడు ప్రాణాలకు తెగించి మృతదేహాలకు అంత్యక్రియలు చేయించారు. ఇదీ పెద్దోడు కథ.. విశాఖపట్టణానికి చెందిన బత్తిన గురుమూర్తి (పెద్దోడు) 30 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా సొంతూరిని వదిలేసి నెల్లూరు చేరుకున్నాడు. ప్రధాన రైల్వేస్టేషన్లో ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకుని కడుపు నింపుకునేందుకు చేతనైన పనిచేస్తూ జీవనం సాగిస్తుండగా.. ఓ రోజు రాత్రి రైలు పట్టాలపై శవం ఉందన్న సమాచారం రైల్వే పోలీసులకు అందింది. అర్ధరాత్రి వేళ శవాన్ని ఎవరు తీస్తారని ఎదురుచూస్తున్న సమయంలో వారికి గురుమూర్తి కనిపించాడు. అతడిని నిద్రలేపిన పోలీసులు శవాన్ని తీసుకొచ్చేందుకు రావాలని కోరారు. పెద్దోడు కాదనకుండా శవం ఉన్న ప్రాంతానికి వెళ్లి.. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహం భాగాలను ఓ సంచిలో వేసుకుని చెక్కబండిపై నెట్టుకుంటూ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. దీంతో పోలీసులు గురుమూర్తికి రూ.300 ఇచ్చారు. ఆ నగదుతో 4 రోజులపాటు కడుపునింపుకున్న పెద్దోడు మరోసారి కూడా అదే తరహాలో అనాథ మృతదేహాన్ని తరలించాడు. ఇలా మొదలైన ఆయన జీవన ప్రయాణం 30 ఏళ్లుగా అనాథ శవాలకు ఆత్మబంధువుగా.. పోలీసులకు సహాయకారిగా మారాడు. నెల్లూరు నగర పరిసరాల్లో ఎక్కడ ప్రమాదవశాత్తు లేదా ఇతరత్రా కారణాలతో ఎవరైనా మృతి చెందితే పోలీసుల నుంచి ఫోన్‌కాల్ వచ్చేది పెద్దోడికే. చిన్నోడు ఎవరంటే.. నెల్లూరులోని కొత్తూరుకు చెందిన సురేష్‌కుమార్ (చిన్నోడు) కుటుంబ సభ్యులతో గొడవపడి ఇంటి నుంచి వచ్చేశాడు. ప్రధాన రైల్వేస్టేషన్ ఎదుట ఫుట్‌పాత్‌నే నివాసంగా మార్చుకున్నాడు. యాచిస్తూ కడుపు నింపుకునే సురేష్‌కు గురుమూర్తితో స్నేహం ఏర్పడింది. అప్పటినుంచి ఎక్కడ మృతదేహం ఉన్నా పోలీసుల నుంచి పిలుపు రాగానే ఇద్దరూ కలసి వెళ్తున్నారు. అలా చేయడంలోనే తృప్తి అది మంచో చెడో మాకు తెలియదు. శవాలు కనిపిస్తే సాయం చేయాలనిపిస్తుంది. పోలీసులిచ్చే డబ్బు కోసం కాదు. మాకు అందులోనే తృప్తి ఉంటోంది కాబట్టే ఆ పనికి ఒప్పుకుని చేస్తున్నాం. – గురుమూర్తి (పెద్దోడు) అప్పుడప్పుడూ బాధేస్తుంది ఏదైనా ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వారి పరిస్థితిని చూసి బాధ కలుగుతుంది. వారి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పడి ఉంటాయి. కొన్నిసార్లు కుక్కలు సైతం పీక్కు తింటుంటాయి. కుళ్లి పోయిన శవాలనూ చూస్తుంటాం. ఇలాంటప్పుడు మాకు బాధ కలుగుతుంది. – సురేష్‌కుమార్ (చిన్నోడు) -
రెండేళ్లుగా ఫ్రిజ్లోనే తల్లి శవం..కన్న కూతురికి కూడా తెలియకుండా..
యూఎస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోయినా.. బయటకు పొక్కనీకుండా కూతురు అత్యంత రహస్యంగా ఉంచింది. దీంతో పోలీసులు ఆమె అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటన అమెరికాలోని చికాగోలో ఇల్లినాయిస్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం..ఎవా బ్రాచర్ అనే 60 ఏళ్ల మహిళ తన 96 ఏళ్ల తల్లి రెజీనా మిచాల్స్కీ రెండేళ్ల క్రితమే చనిపోయింది. అయితే ఆ విషయం బయటకు పొక్కనీయకుండా అత్యంత జాగ్రత్తపడింది. ఆమె ఇల్లినాయిస్లోని రెండు అంతస్తుల అపార్ట్మెంట్ భవనం సెల్లార్‌లోని డీప్ ప్రీజ్‌లో ఆమె తల్లి మృతదేహాన్ని కనుగోన్నారు చికాగో పోలీసులు. ఈ మేరకు పోలీసు కేసు నమోదు చేసి బ్రాచర్‌ని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో ఆమె తల్లి పేరుతో తప్పుడు ఐడీని కలిగి ఉన్నట్లు కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ మైఖేల్ పెకారా చెప్పారు. అంతేగాదు బ్రాచర్ తన తల్లి చనిపోవడానికి రెండు సంవత్సరాల క్రితమే డీప్ ఫ్రీజర్‌ని కోనుగోలు చేసినట్లు ఉన్న రసీదును కూడా ఆమె నివాసం వద్ద కనుగొన్నట్లు తెలిపారు. అసలు ఎందుకలా ఆమె తన తల్లి మరణం గురించి ఎవరికీ తెలియకుండా దాచి ఉంచిందన్న విషయంపై విచారించడం ప్రారంభించారు పోలీసులు. ఒకవేళ తన తల్లి మరణం దాచడం ద్వారా ఎవా బ్రాచర్ పొందే సామాజిక భద్రతా ప్రయోజనం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. బ్రాచర్ కూతురు సబ్రినా వాట్సన్ తన తల్లికి ఎవరీ పట్ల ప్రేమ ఉండదని, ఆఖిరికీ తనమీద కూడా ఉండదంటూ కన్నీటి పర్యతమయ్యింది. కనీసం ఆమెకు మానవత్వం కూడా లేదంటూ.. అమ్మమ్మ మిచాల్స్కీ తలుచుకుంటూ విలపించింది. (చదవండి: ఓరి దేవుడా! అది బస్సా! ఇంకేదైననా? ఆ స్థితిలో కూడా ఏం రేంజ్లో వెళ్తోంది) -
ప్లాస్టిక్ డ్రమ్ములో యువతి శవం
బెంగళూరు: యువతిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి పైన క్లాత్‌తో మూత బిగించి రైల్వే స్టేషన్లో దుండగులు వదిలివెళ్లిన దారుణమైన ఘటన ఐటీ సిటీ బెంగళూరులోని యశవంతపుర రైల్వే స్టేషన్లో బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే... గూడ్స్ రైలు ప్లాట్ ఫాం వద్ద ఒక నీలి డ్రమ్ము, దాని మూత చుట్టూ బట్ట కట్టి ఉంది. మూడు రోజులుగా నిలిచి ఉన్న గూడ్స్ వెళ్లిపోవడంతో డ్రమ్ము బయటకు కనిపించింది. అందులో నుంచి దుర్వాసన వస్తుండడంతో స్వీపర్ జయమ్మ రైల్వే పోలీసులకు తెలియజేసింది. వారు వచ్చి పరిశీలించగా యువతి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. మృతదేహం గొంతుకు తెల్లటి దుపట్టా చుట్టి ఉంది. ముఖమంతా గుర్తుపట్టలేకుండా ఉంది. మూడు నాలుగు రోజుల కిందటే ఆమెను చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె వయసు 23 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. యువతి రూపురేఖలను బట్టి విద్యావంతురాలై ఉంటుందని, ఎక్కడో చంపి, డ్రమ్ములో పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైల్వేస్టేషన్లో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పడ్డారు. న్యూ ఇయర్ సంబరాల్లో ఎవరైనా దుండగులు ఆమెను అపహరించి హత్య చేసి ఉంటారనే సందేహాలూ వినిపిస్తున్నాయి. చదవండి: (అయోధ్య రామ మందిరం నిర్మాణంపై అమిత్ షా కీలక ప్రకటన) -
దారుణం: డబ్బులు తీసుకుని.. శవాన్ని ఇచ్చారు
సాక్షి, మహారాణిపేట(విశాఖ దక్షిణ): డబ్బులు తీసుకుని పసి పిల్లాడి శవాన్ని ఇచ్చారని ఆరోపిస్తూ బాధితులు శనివారం రాత్రి రామ్‌నగర్ ఒమ్ని ఆర్.కె.ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాలివీ.. పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన సాలాపు మహారాజు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న తన రెండేళ్ల కుమారుడు ధాన్విక్‌ను గురువారం రాత్రి ఒమ్ని ఆర్.కె.ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం, శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. బాబుకు డయాలసిస్ చేయడంతోపాటు వెంటిలేటర్ మీద చికిత్స అందుతోందని.. బాబు పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు చెప్పినట్లు చిన్నారి మేనమామ సన్యాసిరావు తెలిపారు. రూ.3.14లక్షల ఆస్పత్రి ఖర్చులు చెల్లించి కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారన్నారు. అప్పులు చేసి ఆ మొత్తం బిల్లు చెల్లించామని, బాబును కేజీహెచ్‌కు తీసుకెళ్లేందుకు 108 వాహనం కూడా సిద్ధం చేశామన్నారు. ఇంతలో వైద్యులు వచ్చి బాబు చనిపోయాడని చెప్పడంతో అంతా షాక్‌కు గురయ్యామన్నారు. డబ్బులు తీసుకుని తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. చికిత్స సమయంలో ఏం జరిగిందో తమకు తెలియనివ్వలేదన్నారు. త్రీ టౌన్ సీఐ కోరాడ రామారావు ఆస్పత్రి వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా.. న్యూమోనియా, కార్డియా క్ అరెస్ట్‌తో బాధపడుతున్న బాలుడిని ఆస్పత్రిలో చేర్చారని, చికిత్స అందించడంలో ఎటువంటి లోటుపాట్లు జరగలేదని ఆస్పత్రి యాజమాన్య ప్రతినిధులు రాధాకృష్ణ, విశ్వతేజ తెలిపారు. -
షాకింగ్ ఘటన: విమాన చక్రంలో మనిషి మృతదేహం
గాంబియా నుంచి బ్రిటన్‌కు వెళ్లిన జెట్ విమానంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం వీల్ బేలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. టీయూఐ ఎయిర్వేస్ నడుపుతున్న జెట్ విమానంలో గుర్తు తెలియని ఒక నల్లజాతీయుడు మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. డిసెంబర్5, 2022న గాంబియా రాజధాని బంజుల్ నుంచి లండన్‌లోని గాట్విక్ మిమానాశ్రయానికి విమానం బయలుదేరింది. సరిగ్గా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయినప్పుడే ఈ దిగ్బ్రాంతికర ఘటనను గుర్తించారు అధికారులు. ఈ మేరకు బ్రిటన్ మెట్రో పోలీసులు గాంబియా ప్రభుత్వానికి ఈ సమాచారం అందించారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకుండా ఒక అపరిచిత వ్యక్తి విమానం వీల్ బేలో మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. ఈ మృతదేహాన్ని విమానం నుంచి తొలగించి వర్థింగ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. గాంబియన్ అధికారులు బ్రిటన్ పోలీసులకు సహకరించడమే కాకుండా మృతదేహానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు యూకే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు మొదటిసారి కాదు. 2019లో ఆమ్స్టర్డామ్లోని పోలీసులు కెన్యా నుండి వచ్చిన కార్గో విమానం ముక్కు చక్రంలో ఒక వ్యక్తి అక్రమంగా ప్రవేశించి మరణించాడు. (చదవండి: కారుతో ఢీకొట్టి చంపినందుకు.. రూ 90 లక్షలు జరిమానా) -
మహిళ మృతదేహానికి రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం
గన్నవరం: రెండేళ్ల క్రితం అనుమానానాస్పద స్థితిలో మృతి చెందిన ఓ వివాహిత మృతదేహానికి మంగళవారం స్థానిక ముస్లిం శ్మశానవాటికలో పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం...స్థానిక ఇస్లాంపేటకు చెందిన సఫియాబేగంకు 2015లో విజయవాడకు చెందిన సలిముల్లా షరీఫ్‌తో వివాహం జరిగింది. వివాహం అనంతరం గుంటూరులోని ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న సఫియాబేగం 2020 సెప్టెంబర్ 6 న ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురై మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని గన్నవరం తీసుకువచ్చి ఖననం చేశారు. కొన్ని రోజుల తర్వాత సఫియాబేగం మృతిపై అనుమానాలు రావడంతో సెప్టెంబర్ 19న ఆమె తల్లిదండ్రులు గుంటూరు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. సఫియాబేగం మృతికి ఆమె భర్త సలిముల్లా షరీఫ్‌తో పాటు అత్తమామలు కారణమంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో పురోగతి లేకపోవడంతో పాటు ఆరేళ్ల కుమారుడిని పట్టించుకోకుండా షరీఫ్ మరో పెళ్లి చేసుకోవడంతో ఇటీవల మృతురాలి తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ ఉత్తర్వుల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం తహసీల్దారు సీహెచ్ నరసింహారావు సమక్షంలో పట్టాభిపురం సీఐ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో మృతదేహాన్ని వెలికితీయించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంలోని పలు అవశేషాలను సేకరించి పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించనున్నట్లు సీఐ తెలిపారు. -
శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధాను చంపిన 15, 20 రోజుల్లోనే అప్తాబ్ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి యువతుకలు గాలం వేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో అదే డేటింగ్ యాప్‌లో శ్రద్ధాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇలా మరో యువతితో పరిచయం పెంచుకొని.. ప్రియురాలి శవం ఫ్రిజ్‌లో ఉండగానే జూన్, జూలై నెలలో ఆమెను ఇంటికి పిలిపించినట్లు తెలిసింది. అయితే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. శ్రద్ధా శరీర భాగాలను అల్మారాకు తరలించేవాడని తెలిపారు. అంతేగాక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పలువురు మహిళలను అతడు ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్, శ్రద్ధా శరీరాన్ని ముక్కలుగా చేసే ముందు రక్తపు మరకలు ఎలా శుభ్రం చేయాలో గూగుల్ చూసి నేర్చుకున్నట్లు, శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యుమన్ అనాటమీని చదివినట్లు పేర్కొన్నారు. క్రైం థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు చూసే అలవాటున్న అఫ్తాబ్.. అమెరికన్ వెబ్ సిరీస్ ‘డెక్సటర్’ ద్వారా ప్రేరణ పొంది శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు అగర్బత్తీలు వెలిగించడం, ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసుకునేవాడు. త్వరగా చెడిపోతున్న శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా…ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర! శ్రద్ధా హత్య తెలియకుండా ఉండేందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ ఉపయోగించేవాడు. దాని నుంచి తన స్నేహితులకు మెసెజ్ చూస్తూ ఉండేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించేవాడు. అయితే రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ఆరు నెలలకు ఈ ఉదంతం బయటకు రావడం గమనార్హం. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నారు. కాగా 24 ఏళ్ల శ్రద్ధాకు అఫ్తాబ్‌తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లు కలిసి జీవించారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ ఢిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి తీసుకురావడంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మే 18న మరోసారి ఇద్దిరి మధ్య గొడవ జరగడంతో శ్రద్ధను అత్యంత అమానుషంగా గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా కట్ చేసి పాడవకుండా ఉండేందుకు భారీ ఫ్రిజ్‌లో అమర్చాడు. తరువాత వాటిని ఒక్కొక్కొటిగా ఢిల్లీ నగరమంతా పారేశాడు. -
శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర!
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్య చేసిన ఓ ప్రియుడి ఉదంతం.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రియురాలిని చంపి 35 ముక్కలుగా చేసి.. నగరంలో అక్కడక్కడ పడేశాడు దుండగుడు. దేశరాజధాని నుంచి వెలుగు చూసిన ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ కేసులో దుండగుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా(28)ను పటిష్టమైన భద్రత నడుమ ఉంచారు పోలీసులు. సౌత్ ఢిల్లీలోకి మెహ్రౌలీ పోలీస్ స్టేషన్లో మరో ఖైదీతో పాటు ఉంచారు. నేలపై దుప్పటి కప్పుకుని అతని ప్రశాంతంగా నిద్రించడం చూడొచ్చు. ఇక సెల్‌ను కవర్ చేసేలా సీసీటీవీ ఫుటేజీని ఉంచిన పోలీసులు.. ఆ సెల్ బయట ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలా ఉంచారు. అంతేకాదు.. అధికారులు సైతం అతని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక లోపల ఉన్న మరో ఖైదీ బిక్కుబిక్కుమంటూ కనిపించడం వీడియోలో ఉంది. తనను సెల్ మార్చాలని ఆ ఖైదీ వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలకమైన కేసు కావడం, పైగా అప్తాబ్ మానసిక స్థితిపై అనుమానాల నేపథ్యంలోనే ఇలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అతన్ని అలాగే చూసుకోవాల్సి ఉంటుంది. #Delhi : Shraddha Walker murder केस में आरोपी Aftab Amin Poonawalla का जेल वाला Video आया सामने.#shraddhawalker #ShraddhaWalkermurder #AftabAminPoonawalla #DelhiMurder pic.twitter.com/nhqAvRCZ6N — Eyenews (@eyenewsup) November 15, 2022 శ్రద్ధా వాల్కర్ అనే యువతితో సహజీవనం చేసిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా.. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నో చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే 18వ తేదీన ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ పెద్ద ఫ్రీజర్‌లో భద్రపరిచాడు. పద్దెనిమిది రోజులపాటు రోజూ అర్ధరాత్రి పూట బయటకు వెళ్లి.. ఆమె విడిభాగాల్ని నగరంలో అక్కడక్కడ పడేసి వచ్చాడు. రెండు నెలలుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లు యాక్టివ్‌గా లేకపోవడం, ఫోన్ సైతం లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు.. తండ్రికి విషయం చెప్పాడు. ఆయన నవంబర్‌లో కూతురు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. ముంబైలో ఓ ఎంఎన్సీ కాల్సెంటర్లో పని చేసే శ్రద్ధకు.. డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్‌తో పరిచయం అయ్యింది. ఇంట్లో వాళ్లు వాళ్ల రిలేషన్‌షిప్‌కు ఒప్పుకోకపోవడంతో.. ముంబైని విడిచి ఢిల్లీకి వచ్చారు. పెళ్లి చేసుకోమని కోరడంతో అతను ఒప్పుకోలేదు. మరికొందరు అమ్మాయిలతో అతను సంబంధం కొనసాగించినట్లు శ్రద్ధకు తెలిసింది. దీంతో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతోనే దారుణంగా హతమార్చాడు. విచారణలో తొలుత పొంతన లేకుండా సమాధానాలు చెప్పిన అఫ్తాబ్.. చివరకు నేరం అంగీకరించాడు. అతని ఫోన్ హిస్టరీలో నేరానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. ఆంగ్ల క్రైమ్ సిరీస్ డెక్స్టర్ ప్రేరణతోనే తాను ఈ హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు అప్తాబ్. సంబంధిత కథనం: 300 లీటర్ల ఫ్రిడ్జి కొని.. అగరబత్తులతో.. -
తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం.. రోదించిన ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు(బనశంకరి): దావణగెరె జిల్లా హొన్నాళి నియోజకవర్గ ఎమ్మెల్యే రేణుకాచార్య సోదరుడి కుమారుడు చంద్రశేఖర్ (24) అదృశ్యమైన ఘటన గురువారం విషాదాంతమైంది. చంద్రశేఖర్ కారు తుంగా ప్రధాన కాలువలో లభ్యమైంది. అందులో చంద్రశేఖర్ మృతదేహం బయటకు తీశారు. ఐదురోజులు క్రితం అదృశ్యమైన అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కడదగట్టి గ్రామం వద్ద కారు ఆనవాళ్లు దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా కడదగట్టి గ్రామం తుంగా కాలువ వద్ద చంద్రశేఖర్ కారు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాలువ వద్దకు చేరుకున్న పోలీసులు కారుతో పాటు అందులో ఉన్న చంద్రశేఖర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే ఘటనస్థలంలో ఉన్న ఎమ్మెల్యే రేణుకాచార్య తీవ్రంగా రోదించారు. సోదరుడి కుమారుడు అదృశ్యమై ఐదు రోజులు గడిచినప్పటికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. చంద్రశేఖర్ మొబైల్ స్విచ్చాఫ్ వచ్చింది. చంద్రశేఖర్ మృతి కేసులో ట్విస్ట్.. కారులో ఉన్న ఆ ఇద్దరు ఎవరూ ? ఈ సంఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఇద్దరు ఉన్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. న్యామతి వద్ద చంద్రశేఖర్ కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్న దృశ్యాలు రికార్డు అయింది. చంద్రశేఖర్ పక్కన మరొకరు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. అదే కారులో చంద్రశేఖర్ మృతదేహం లభ్యమైంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. హొన్నాళి నుంచి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న తుంగా కాలువలో చంద్రశేఖర్ మృతదేహం లభించింది. ఇది హత్య, ఆత్మహత్య అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
క్షుద్ర పూజల కలకలం.. కూకట్‌పల్లిలో సగం కాలిపోయిన స్థితిలో మృతదేహం
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీకాలనీ: శ్మశాన వాటికలో సగం కాలిన స్థితిలో కనిపించిన మృతదేహం స్థానికంగా సంచలనం రేపింది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ఒంటిపై డీజిల్ పోసి దహనం చేసి ఉంటారని భావిస్తున్న ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. ఆనవాళ్లు గుర్తించలేని విధంగా దగ్ధమైన మృతదేహం ఎవరిదనే సీఐ కిషన్ కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం హైదర్‌నగర్‌లోని అలీతలాబ్ పక్కన ఉన్న హిందూ శ్మశాన వాటికలో సగం కాలిన మృత దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి 20 మీటర్ల దూరంలో చెప్పులు, ఓ బ్యాగ్, అందులో రగ్గు(బెడ్ షీట్) స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా బ్యాటరీ, సిమ్ కార్డు లేని ఓ సెల్ ఫోన్‌ను కూడా గుర్తించారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండవచ్చునని అతడిని హత్య చేసి దహనం చేసి ఉండవచ్చునని అనుమాన్యం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలను ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సైబరాబాద్ క్లూస్ టీంతో పాటు పోలీస్ ప్రత్యేక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అన్నీ అనుమానాలే... శ్మశాన వాటికలో మృతదేహం లభించిన తీరు మొదలు అక్కడి ఆనవాళ్లు అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహానికి కొద్ది దూరంలో బియ్యం పిండి వంటివి కనిపించడంతో క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చునని అనుమానాలు వస్తున్నా పోలీసులు నిర్ధారించడం లేదు. మృతదేహాన్ని శనివారం దహనం చేసి ఉంటారని స్థానికులు పేర్కొంటుండగా పోలీసులు మాత్రం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత దహనం చేసి ఉండవచ్చునని పేర్కొంటున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే వాస్తవాలు తెలుస్తాయని సీఐ పేర్కొన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహంతో..!
భోపాల్: కనీస మౌలిక సదుపాయలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక సంఘటనలు దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై, తోపుడు బండిపై, భుజాలపై మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన సంఘటనలు కలిచివేస్తున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని రద్దీ రోడ్డులో ఓ వ్యక్తి తన భుజాలపై మోసుకుటూ బస్టాప్‌కు వెళ్లారు. అందరితో పాటే బస్సులో మృతదేహాన్ని స్వగ్రామం చేర్చారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగేళ్ల చిన్నారి స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, మృతదేహాన్ని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆసుపత్రిలో వాహనం లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దుఃఖంలో ఉన్న ఆమె మేనమామ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్టాప్ వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. రద్దీగా ఉన్న బస్‌లోనే మృతదేహంతో ఎక్కాడు. అయితే, ఆయన వద్ద బస్సు టికెట్ కొనేందుకు సైతం డబ్బులు లేకపోవటం అందరిని కలచివేసింది. మరో ప్రయాణికుడు టికెట్ కొనిచ్చాడు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తరలించేందుకు పట్టణాభివృద్ధి విభాగం ఏర్పాట్లు చేయాలని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ తెలిపారు. ఇలాంటి వాటిలోకి ఆసుపత్రి, వైద్యులను లాగొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం సైతం ఛతార్పుర్ జిల్లాలో ఇలాగే నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. దీంతో జిల్లాలో సదుపాయలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుధవారమే సింగ్రౌలి జిల్లాలో శిశువును బైక్ సైడ్ బాక్సులో తీసుకెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl's body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT — Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022 ఇదీ చదవండి: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్ -
18 నెలలుగా ఇంట్లోనే మృతదేహం.. గంగా జలం చల్లుతూ..!
తిరువనంతపురం: కోమాలోకి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో వైద్యులు సైతం చెప్పలేరు. అందుకు రోజుల నుంచి సంవత్సరాలు పడుతుంది. అలా.. ఓ వ్యక్తి మరణించినప్పటికీ కోమాలో ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి స్పృహలోకి వస్తాడని నమ్మిన ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసింది. దాదాపు 18 నెలలుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేసి.. ప్రతిరోజు గంగా జలం చల్లుతున్న ఈ సంఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో జరిగింది. ఏం జరిగింది? ఆదాయ పన్ను విభాగంలో పని చేస్తోన్న విమలేశ్ దీక్షిత్ అనే వ్యక్తి గత ఏడాది ఏప్రిల్‌లో గుండె పోటుతో మరణించాడు. కానీ, అతడు కోమాలో ఉన్నాడని భావించిన కుటుంబం అంత్యక్రియలను నిర్వహించేందుకు అంగీకరించలేదు. ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచేశారు. ఈ క్రమంలోనే కుటుంబానికి అందాల్సిన పింఛన్ దస్త్రాలు ముందుకు కదలటం లేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీంతో పోలీసులతో కలిసి ఆరోగ్య విభాగం అధికారులు రావత్‌పుర్‌లోని దీక్షిత్ ఇంటికి శుక్రవారం వెళ్లారు. ఆయన కోమాలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సుదీర్ఘ చర్చల తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో దీక్షిత్ బాడీని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. మృతి చెందినట్లు నిర్ధరించారు. మరోవైపు.. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త మరణంతో మానసిక రోగిగా మారిన అతడి భార్య.. ప్రతిరోజు ఉదయం మృతదేహంపై గంగాజలం చల్లుతున్నట్లు చెప్పారు. కోమా నుంచి బయటపడేందుకు గంగా జలం దోహదపడుతుందని ఆమె నమ్ముతున్నారని తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రి జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ప్రకారం.. గుండె పోటుతో 2021, ఏప్రిల్ 22న దీక్షిత్ మరణించాడని వెల్లడించారు. చుట్టుపక్కల వారికి సైతం దీక్షిత్ కోమాలోనే ఉన్నాడని చెప్పేవారని, కొన్ని సార్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లటం గమనించినట్లు స్థానికులు తెలిపినట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: రిసార్టులో 19 ఏళ్ల యువతి హత్య.. బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
పార్టీ ఆఫీసులో మహిళ మృతదేహం
-
నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్‌కేస్‌లో కుక్కి..
హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను కూడా గుర్తించడం కష్టమవుతోంది. అలాంటి సందర్భాల్లో కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కేసును పరిష్కరించాలి అనే దిశగా ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ బృదం ఒక సరికొత్త అధ్యయనానికి సిద్ధమైంది. అందుకోసం ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో సూట్‌కేసుల్లో దాదాపు 70 మృతదేహాలను కుళ్లిపోయేలా వదిలేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అవి డికంపోజ్ అవుతాయి. మరణించిన ఎన్ని రోజులకు శరీరం కుళ్లిపోతూ మార్పులు మొదలవుతుంది, అనేదాన్ని బట్టి ఎన్ని రోజలు ఇలా పడి ఉందని అనేది అంచనా వేయడం వంటివి కనుగొంటారు. అంతేగాక నేరస్తులు హత్య చేసి తాము దొరక్కుండా ఉండేందుకు మృతేదేహాన్ని దాచి ఉంచడం లేదా నాశనం చేసేందుకు వారి చేసే ప్రయోగాల్లో మృతదేహం స్థితిని అధ్యయనం చేయడం వంటివి చేస్తారు. పైగా హత్య చేసినప్పటి నుంచి తరలించే సమయంలో సెకండరీ క్రైమ్‌ని అంచన వేయగలుగుతారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఏయే ప్రాంతాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు వంటివి కూడా కనుగొంటారు. ఈ పరిశోధన నేరస్తుడిని ట్రేస్ చేసి మరింత సమాచారాన్ని అధికారులకు అందించేందుకు ఉపకరిస్తుంది. అందుకోసమే పరిశోధకులు సూట్‌కేసులలో వివిధ జంతువుల కళేభరాలను ఉంచి వాటిలో వస్తున్న మార్పులను అంచనా వేస్తున్నారు. నేర పరిశోధకులకు ఈ అతి పెద్ద ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు. MU’s resident bug whisperer @doc_magni has provided a fascinating look inside suitcases used to hide murder victims, and the role played by the insects trapped within. Read about her first-of-its kind experiment in @ConversationEDU ➡️ https://t.co/U93ZD7g1x4#forensics #CSI pic.twitter.com/dgAmeFElHe — Murdoch University (@MurdochUni) August 31, 2022 (చదవండి: ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి) -
అమృత మరణం.. ఉప్పుపాతరతో ఊపిరి తిరిగొస్తుందా?
చిక్కబళ్లాపురం: ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించినవారిని ఉప్పు పాతరేస్తే ప్రాణాలు తిరిగొస్తాయనే మూఢ నమ్మకం కన్నడనాట నేటికీ కొనసాగుతోంది. ఇటీవల బళ్లారిలో ఓ బాలుడి మృతదేహాన్ని ఉప్పు పాతరేయడం మరచిపోకముందే... చిక్కబళ్లాపుర జిల్లాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. శిడ్లఘట్ట తాలూకాలోని గాజులవారిపల్లెకు చెందిన ఎంఏ విద్యార్థిని అమృత (22) గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద సరదాగా రీల్స్ చేస్తున్న సమయంలో తీసుకుంటూ జారిపడి నీటిలో మునిగిపోయింది. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నవారు వచ్చి అమృతను ఒడ్డుకు తీసుకురాగా, అప్పటికే ఆమె చనిపోయింది. అయితే.. అయినప్పటికీ బంధువులు ఉప్పు పాతర వేస్తే బతుకుతుందనే నమ్మకంతో అమృత మృతదేహాన్ని ఉప్పులో పెట్టారు. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పుపాతర) -
తల్లి రుణం తీర్చుకోవడానికి.. ఓ తనయుడి కష్టాలు
సాక్షి, చెన్నై: అనారోగ్యంతో తల్లి మరణించింది.. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. కానీ నవమాసాలు మోసి కని పెంచిన తల్లి గనుక పుట్టెడు దుఃఖంలోనూ ఎలాగైన చివరి మజిలీ పూర్తి చేయాలన్న సంకల్పం అతన్ని శ్మశానం వరకు తీసుకెళ్లిగలిగింది. నాలుగేళ్లుగా ఆ తల్లి కోసం తెచ్చిన వీల్‌చైర్ అతనికి దిక్కయింది. తల్లి మృతదేహాన్ని అందులో కూర్చోబెట్టుకుని శ్మశానానికి తరలించాడు. ఆదరించే వాళ్లు ఎవరూ లేకపోవడం, ఆర్థిక కష్టాలు పెరగడంతో వీల్‌చైర్‌నే పాడెగా మార్చుకోవాల్సి వచ్చిందని ఆ తనయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తిరుచ్చి జిల్లా మనప్పారై భారతీయార్ నగర్‌కు చెందిన మురుగానందం ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. తన తల్లి రాజేశ్వరి(74) అంటే మురుగానందంకు ఎంతో ప్రేమ. నాలుగేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో వీల్‌చైర్‌కు పరిమితం కావడంతో అన్నీ తానై సేవలు చేశాడు. ఇటీవల ఆమె శరీరంపై దద్దుర్లు రావడంతో ఆప్తులు, ఇరుగు పొరుగు వారు ఆ ఇంటి వైపు రావడం మానేశారు. దురదతో కూడిన ఈ పుండ్లు అంటువ్యాధి అని ప్రచారం జరగడంతో ఆమెకు సేవలు అందిస్తున్న మురుగానందంను కూడా దూరం పెట్టేశారు. ఆర్థిక కష్టాలతో.. తల్లిని ఇంట్లోనే ఉంచి కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చిన మురుగానందకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. రానురాను ఆదరించే వాళ్లు, ఆదుకునే వాళ్లు ఎవరూ లేకపోవడంతో తల్లికి వైద్యం అందించడం భారంగా మారింది. పనికి వెళ్లలేక ఇంటి పట్టునే ఉండి తల్లిని చూసుకునేవాడు. ఈ పరిస్థితుల్లో గురువారం వేకువజామున రాజేశ్వరి కన్నుమూసింది. ఆమె ఒంటిపై అధికంగా పుండ్లు ఉండడంతో అంత్యక్రియలకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారని తెలిసి, ఆర్థిక ఇబ్బందులతో పాడె కట్టడానికి కూడా డబ్బుల్లేక మృతదేహాన్ని ఇన్ని రోజులు తన తల్లి కోసం వినియోగించిన వీల్‌చైర్‌నే పాడెగా మార్చేశాడు. అందులో మృతదేహాన్ని ఉంచి పడిపోకుండా, ఆమె చీర సాయంతో కట్టేశాడు. ఎవరి కంట పడకుండా 2.5 కి.మీ దూరం వీల్‌చైర్‌లోనే శవాన్ని మనప్పారై నగరపాలక సంస్థ ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకొచ్చాడు. వీల్‌చైర్‌తో వస్తున్న వ్యక్తిని చూసి అక్కడి సిబ్బంది ప్రశ్నించారు. తన దీన పరిస్థితిని వారికి మురుగానందం విన్నవించాడు. అక్కడ పని చేస్తున్న సిబ్బంది శ్రీధరన్‌తో పాటు మరికొందరు మురుగానందం పరిస్థితిని అర్థం చేసుకుని తమవంతుగా అంత్యక్రియలకు అవసరమయ్యే వస్తువులను కొనుగోలు చేసి, సాంప్రదాయబద్ధంగా లాంఛనాలను పూర్తి చేయించారు. అలాగే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మురుగానందంకు మానసికంగా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. చదవండి: దేశాలు దాటిన ప్రేమ..తల్లిదండ్రుల అనుమతితో -
బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర
సాక్షి, బళ్లారి: నీట మునిగి మరణించిన బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర వేస్తే మళ్లీ బతుకుతాడన్న నమ్మకంతో తల్లిదండ్రులు ఉప్పు పాతర వేశారు. ఈ ఘటన కర్ణాటకలో బళ్లారి తాలూకాలోని సిరివార గ్రామంలో జరిగింది. శేఖర్, గంగమ్మ దంపతుల చిన్న కుమారుడు భాస్కర్(10) సోమవారం ఈతకు వెళ్లి నీటి గుంతలో పడి మృతి చెందాడు. అయితే నీటిలో పడి మరణించిన వారిని రెండు గంటల్లోగా ఉప్పులో కప్పి పెడితే బతుకుతారనే మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు సుమారు 4–5 బస్తాల ఉప్పును తెచ్చి మృతదేహంపై కుప్పగా పోశారు. బాలు డు బతికి వస్తాడని దాదాపు 8 గంటల పాటు ఎదురు చూశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: (పెళ్లి పేరుతో నర్సుపై పలుమార్లు లైంగికదాడి.. పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షం) -
మోదీ జీ సాయం చేయండి అంటూ... మహిళ లేఖ
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్పూర్ జిల్లాలోని సంగీత శర్మ అనే మహిళ భర్త కోసం ప్రధాని మోదీని, విదేశాంగ మంత్రిని సాయం చేయమని అభ్యర్థించింది. ఆమె తన భర్త అనారోగ్యంతో దక్షిణాఫ్రికాలో మృతి చెందాడని, ఆయన మృతదేహాన్ని భారత్‌కి రప్పించేందుకు సాయం చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సంగీతా శర్మ ఉత్తరప్రదేశ్‌లోని భాయ్లా గ్రామ నివాసి. ఆమె తన భర్త మనోజ్ కుమార్ మృతదేహాన్ని తిరిగి రప్పించేందుకు తన వద్ద తగినంత డబ్బులేదంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసిందని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సూరజ్ రాయ్ తెలిపారు. మనోజ్ కుమార్ దక్షిణాఫ్రికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నడని, ఆగస్టు 27న అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పారు. అంతేకాదు జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ సబ్ డివిజనల్ దేవబంద్ దీపక్ కుమార్‌ను ఆ మహిళకు సాయం చేయాలని ఆదేశించారని తెలిపారు. ఐతే సంగీతశర్మ అంగన్ వాడి కార్యకర్త అని ఆమె పిల్లలు కూడా చాలా చిన్నవాళ్లని పోలీస్ అధికారి చెప్పుకొచ్చారు. (చదవండి: విధిరాత అంటే ఇదేనేమో! టైంకి ఆస్పత్రికి తరలించిన...ఓపెన్ కానీ అంబులెన్స్ డోర్లు) -
బ్యాగ్‌లో 15 ఏళ్ల బాలిక మృతదేహం
ముంబై: మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో 15 ఏళ్ల బాలిక మృతదేహంతో కూడిన బ్యాగ్‌ని గుర్తించారు పోలీసులు. ఆ బ్యాగ్ ముంబై అహ్మదాబాద్ హైవే పక్కనే ఉన్న నైగావ్ బ్రిడ్జి సమీపంలో శుక్రవారం సాయంత్రం రెండు గంటలన సమయంలో కనుగొన్నారు. ఒక బాటసారి ఈ బ్యాగ్‌ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వాలివ్ పోలిస్టేషన్ బృందం సంఘటన స్థలానికి చేరుకుంది. ఐతే మృతదేహం పై పలు చోట్ల కత్తిపోట్టు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితురాలు ముంబైలోని అంధేరి ప్రాంతాని చెందిన వాసిగా పేర్కొన్నారు. అదీగాక అంధేరి పోలీస్టేషన్లో ఒక కిడ్నాప్ కేసు నమోదైనట్లు గుర్తించామని చెప్పారు. దీంతో తాము ఈ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బాధితురాలి కుటుంబికులు కూడా ఆమె స్కూల్‌కి వెళ్లిందని పొద్దుపోయినా ఇంటికి చేరుకోకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు తాము ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసుతెలిపారు. (చదవండి: 12 ఏళ్లలో 339 చోరీలు.. పోలీసులకు ఏమాత్రం డౌట్ రాకుండా.. ఆ ఆలు మగలు ఎలా చిక్కారంటే!) -
ఎంత కష్టమొచ్చింది.. రబ్బర్ ట్యూబ్‌కు మృతదేహం కట్టి నదిలో..!
భోపాల్: భారీ వర్షాల కారణంగా నది ఉప్పొంగి గ్రామానికి దారి లేకుండా మారింది. ఊళ్లోకి వెళ్లాలంటే వరద దాటుకునే వెళ్లాలి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తి మృతదేహాన్ని గ్రామానికి చేర్చేందుకు రబ్బర్ ట్యూబే వారికి ఆసరాగా మారింది. ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నది దాటించారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అనుప్పుర్ జిల్లాలోని తాడ్‌పతారా గ్రామానికి చెందిన 55 ఏళ్ల విశ్మాట్ నందా అనే వ్యక్తి పక్క జిల్లా డిండోరాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని పతర్‌కుచాకు తీసుకొచ్చారు. నర్మదా నది వరదలతో ఉప్పొంగటం వల్ల పతర్‌కుచా నుంచి తాడ్‌పతరాకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. అక్కడ ఎలాంటి వంతెన లేదు. దీంతో రబ్బర్ ట్యూబ్‌కు మృతదేహాన్ని కట్టి నదిని దాటించారు గ్రామస్థులు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అభిషేక్ చౌదరి తెలిపారు. डिंडोरी में मृतक के परिजनों से आज़ादी के #अमृतमहोत्सव की अहमियत समझिये गर हिम्मत हो तो! शव को ट्यूब पर रखकर गांव लाये तब अंतिम संस्कार हुआ क्योंकि सरकार या तो पुल बनाती नहीं,बनाती है तो नींव में भ्रष्टाचार डलता है सीमेंट नहीं! @ndtv @ndtvindia pic.twitter.com/ton0fVuLnr — Anurag Dwary (@Anurag_Dwary) August 16, 2022 ఇదీ చదవండి: భారత జాతీయ గీతం ‘జనగణమన’ వినిపించి పాక్ మ్యుజీషియన్ కానుక! -
పాతిపెట్టిన మహిళా మృతదేహం మాయం.. అసలేం జరిగింది?
యాడికి(అనంతపురం జిల్లా): గత ఏడాది శ్మశానంలో పాతిపెట్టిన మృతదేహం కోసం రెవెన్యూ, పోలీసు అధికారులు అన్వేషణ చేపట్టారు. వివరాలు... యాడికి మండలం తూట్రాళ్లపల్లికి చెందిన లింగాల మల్లన్న, ఓబులమ్మ దంపతుల కుమారుడు గుర్రప్పకు యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన సుంకులమ్మ రెండో కుమార్తె గంగాదేవితో 2009లో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న గుర్రప్ప.. తన కుటుంబంతో కలిసి తాడిపత్రిలో నివాసముండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 15న ఉదయం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. చదవండి: విషాదం: అన్నయ్యల ఆశీర్వాదం తీసుకోకుండానే.. అనంతరం గుర్రప్ప విధులకు వెళ్లిపోయాడు. అదే రోజు సాయంత్రం గుర్రప్పకు గంగాదేవి ఫోన్ చేసి తాను విషపూరిత ద్రావకం తాగినట్లు తెలిపింది. దీంతో హడావుడిగా ఇంటికి చేరుకున్న గుర్రప్ప వెంటనే బంధువుల సాయంతో భార్యను తాడిప్రతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అదే రోజు రాత్రి అనంతపురానికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. దీంతో గంగాదేవి మృతదేహాన్ని తూట్రాళ్లపల్లికి తీసుకెళ్లి, ఇరువైపులా కుటుంబసభ్యుల సమక్షంలో ఖననం చేశారు. ఐదు నెలల క్రితం మరో మహిళతో గుర్రప్పకు వివాహమైంది. ఆ సమయంలో తన కుమార్తె గంగాదేవికి ఇచ్చిన కట్నకానుకల విషయంగా గుర్రప్పను సుంకులమ్మ నిలదీసింది. అనంతరం తన కుమార్తె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రెవెన్యూ, పోలీసు అధికారులను ఆమె ఆశ్రయించింది. దీంతో గురువారం ఉదయం యాడికి తహసీల్దార్ అలెగ్జాండర్, అనంతపురం వైద్యకళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శంకర్, వైద్యులు భార్గవ్రాజు, సాయి రవితేజ, తాడిపత్రి పోలీసులు తూట్రాళ్లపల్లి శ్మశానికి చేరుకుని గంగాదేవిని ఖననం చేసిన ప్రాంతంలో తవ్వి చూశారు. మృతదేహం ఆచూకీ లభ్యం కాకపోవడంతో సాయంత్రం వరకూ అన్వేషించారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో మృతదేహం వెలికి తీత కార్యక్రమాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
కలిచివేసే ఘటన: తమ్ముడి మృతదేహాంతో ఎనిమిదేళ్ల చిన్నారి...
పేదవాళ్ల కోసం ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన ఇంకా చాలా చోట్ల వారు దారుణమైన నిస్సహాయ స్థితిలోనే ఉంటున్నారు. కనీసం సాటి మనుషులుగా వారికి సాయం చేసేవాళ్లు కూడా ముందుకు రాకపోవడం అత్యంత బాధకరం. కన్న బిడ్డ చనిపోయిన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేని దుస్థితిలో చాలామంది పేదవాళ్లు ఉన్నారు. గత్యంతరం లేని స్థితిలో వారిని అనాథ శవాలుగా వదిలి వెళ్లిపోతున్న ఘటనలు కోకొల్లలు. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లో అంబాహ్‌లోని బద్ ఫ్రా గ్రామ నివాసి పూజారామ్ జాతవ్ తన రెండేళ్ల రాజా అనే కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో స్థానిక ఆస్పత్రికి తీసుకువచ్చాడు. ఐతే ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం భోపాల్‌లోని మోరెనా జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో పూజారామ్ స్థానిక ఆస్పత్రి ఇచ్చిన అంబులెన్స్ సాయంతో తన కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆ చిన్నారి రక్తహీనత, అసిటిస్‌తో బాధపడుతూ చికిత్స సమయంలోనే మరణించాడు. దీంతో పూజరామ్ జాతవ్ తన కొడుకు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వాహనం ఏర్పాటు చేయాలని ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని వేడుకున్నాడు. ఆస్పత్రిలో వాహనం లేదని బయట వాహనం మాట్లాడుకుని వెళ్లమంటూ ఉచిత సలహ ఇచ్చి పంపేశారు. దీంతో చేసేదేమీ లేక తన పెద్ద కొడుకు గుల్షన్ ఒడిలో తన కొడుకు మృతదేహాన్ని ఉంచి వాహనం తీసుకువస్తాని చెప్పి వారిని మోరీనా నెహ్రూ పార్క్ వద్ద ఉంచి వెళ్లాడు. ఐతే పూజారామ్‌కి ఎంత ప్రయత్నించిన ఏ వాహనం దొరకలేదు. దీంతో అతను తన పెద్ద కుమారుడు గుల్షన్‌ని చనిపోయిన రాజాని అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. పాపం ఆ చిన్నారి చనిపోయిన తన తమ్ముడు తలను ఒళ్లో పెట్టుకుని తండ్రి కోసం నిరీక్షిస్తున్నాడు. ఒక పక్క ఈగలు వాలుతూ ఉంటే వాటిని కొడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు ఆ చిన్నారి. ఐతే స్థానిక జనం అధికారులుకు సమాచారం ఇవ్వడంతో...పోలీస్ అధికారి యోగేంద్ర సింగ్ అసలు విషయం తెలుసుకని పూజారామ్‌కి సదరు స్థానిక ఆస్పత్రి నుంచే అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించారు. (చదవండి: రెస్టారెంట్‌పై దాడులకు తెగబడ్డ మహిళలు...వీడియో వైరల్) -
స్టార్ హీరో విజయ్ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది?
Dead Body Found in Vijay Party Office: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి సంబంధించిన ఓ కార్యాలయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు కాంట్రాక్ట్ ఉద్యోగి ప్రభాకరన్‌గా పోలీసులు గుర్తించారు. కాగా విజయ్ రాజకీయాల్లోకి రాకపోయిన ఆయనకు విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీసు చెన్నై పనైయార్ శివార్లలో ఉంది. అయితే ఆ పార్టీ ఆఫీసుతో విజయ్‌కి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయిన అతడి ఫ్యాన్స్ ఆఫీసు వ్యవహరాలను చూసుకుంటున్నారు. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? అయితే ఈ పార్టీ ఆఫీసుల ద్వారానే విజయ్ పలు సేవ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఉదయం కార్యాలయంలో పెయింటర్ ప్రభాకరన్ శవమై తేలడం కలకలం రేపుతోంది. ఇటీవల ఈ పార్టీ ఆఫీసును ఆధునికరించేందుకు ప్రభాకరన్ అనే పెయింటర్‌ను నియమించారు. అయితే ఇటీవల సొంతూరు వెళ్లొచ్చిన ప్రభాకరన్.. పనిలో భాగంగా గురువారం రాత్రి పార్టీ ఆఫీసుకు వచ్చాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు ఈ క్రమంలో ఆకలిగా ఉందని పార్టీ ఆఫీసు సుపర్ వైజర్‌ను రూ. 100 అడిగాడట. ఆ డబ్బుతో ప్రభాకరన్ పరోటా తీసుకుని వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ శుక్రవారం ఉదయం అతడు శవమై కనిపించాడు. అంతే కాకుండా తన చేతిలో, నోటిలో పరోటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆకలితో ఉన్న ప్రభాకరన్.. వేగంగా పరోటాను తినడంతో ఊపిరాడక చనిపోయి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉస్మానియాలో దారుణం...రూ.వెయ్యి ఇస్తేనే మార్చురీలోకి మృతదేహం
అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.1000 ఇస్తేనే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్సులో భద్ర పరుస్తానంటూ మార్చురీ సిబ్బంది మృతుడి బంధువులను డిమాండ్ చేశారు. బాధితులు ఈ విషయాన్ని సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించడంతో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. మలక్‌పేట ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజీబ్ అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు కుటుంబీకులతో కలిసి మృతదేహాన్ని సోమవారం రాత్రి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మార్చురీ వద్ద మద్యం మత్తులో విధుల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి రాజు మృతదేహాన్ని భద్ర పరచాలంటే రూ.1000 ఇవ్వాల్సిందేనని భీష్మించాడు. ఎందుకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఎదురు తిరగడంతో ఇరువురి మద్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రాజు పోలీసులను సైతం తోసివేస్తూ మార్చురీ గదిని మూసివేస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. మృతుడి కుటుంబీకులు మంగళవారం ఉదయం అతడిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగిపై ప్రాథమిక విచారణ చేపట్టిన అనంతరం అతడిని విధుల్లోంచి తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.నాగేందర్ మాట్లాడుతూ.... ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లు, వార్డులు సెక్యూరిటీ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, మార్చురీ, రోగ నిర్ధారణ కేంద్రాల్లోని సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తే ఎంత టి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ఆసుపత్రి గ్రేవియన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఔట్‌పేషెంట్ బ్లాకు, ఆర్ఎంఓ రూమ్ దగ్గర ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేశామని సలహాలు, సూచనలతో పాటు తమ ఫిర్యాదులను ఆ బాక్సులో వేస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. (చదవండి: టార్చర్ ఫ్రమ్ హోమ్!) -
భార్యను హత మార్చిన 'సాఫ్ట్వేర్' భర్త
-
తిరుపతి: భార్యను హత్యచేసి చెరువులో పడేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
-
వైరల్ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్ బెల్ట్‌పై మృతదేహం?
London Airport Viral Video: ఎయిర్‌పోర్టులో తమ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణికులు ఓ వస్తువును చూసి తీవ్ర భయాందోళన చెందారు. కన్వేయర్ బెల్ట్‌పై పార్సిల్లో చుట్టబడిన మృతదేహం ఉండటంతో షాక్‌కు గురయ్యారు. చివరకు అసలు విషయం తెలుసుకొని హమ్మయ్యా అనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. 2017కు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి నెట్టింట్లోచక్కర్లు కొడుతోంది. ఈ వీడియో లండన్ ఎయిర్‌పోర్టులో జరిగిన సంఘటనకు సంబంధించినది. ఇందులో విమానం దిగిన ప్యాంసిజర్లు తమ సామాన్ల కోసం కన్వేయర్ బెల్ట్ వద్ద వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వింత పార్సిల్ బెల్ట్ మీద రావడం గమనించారు. అది అచ్చం మనిషి శవాన్ని ప్యాక్ చేసిన ఆకారంలో కనిపిస్తోంది. దీంతో ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఇది నిజంగా మృదేహమా, లేక వస్తువా అనే ఆలోచనలో పడ్డారు. అయితే తరువాత అది ఓ బొమ్మ ల్యాంప్ అని నిజం తెలుసుకొని నవ్వుకున్నారు. ఈ వీడియోను వైరల్‌హాగ్ అనే ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేశారు.‘ స్కాట్లాండ్లో నేను బొమ్మ దీపం (mannequin lamp) కొనుగోలు చేశాను. అక్కడి నుంచి తిరిగి వస్తూ దీనిని తీసుకొచ్చాను. కన్వేయర్ బెల్ట్ నుంచి దీనిని తీసుకుంటుండగా అక్కడ ఉన్న వారి ఎక్స్‌ప్రేషన్స్ చూసి చాలా నవ్వొచ్చింది. ’ అంటూ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 42 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by ViralHog (@viralhog) -
హైదరాబాద్ కుల్సుంపురలో దారుణం.. 12 ఏళ్ల బాబు మృతదేహన్ని పిక్కుతిన్న వీధికుక్కలు
-
చేనేత కార్మికుడి మృతి.. ఇంటి యజమాని అమానుషం
జనగామ: అనారోగ్యంతో మరణించిన చేనేత కార్మికుడి మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేందుకు యజమాని నిరాకరించిన విషాద ఘటన గురువారం జనగామ జిల్లా కేంద్రం వీవర్స్ కాలనీలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన మండల శంకర్(60) నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత వృత్తిని నమ్ముకుని అద్దింట్లో ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండేళ్ల పాటు కరోనాతో నమ్ముకున్న వృత్తి నట్టేట ముంచేయగా, ప్రస్తుతం పెరిగిన నూలు ధరలతో పట్టుచీర వ్యాపారం అట్టడుగు స్థాయికి పడిపోయింది. చీరల తయారీ, అమ్మకాలు మందగించడంతో కొన్ని నెలలుగా కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో మానసికంగా కుంగిపోయిన శంకర్ అనారోగ్యం పాలై ఇంటి వద్దనే మృతిచెందాడు. కార్మికుడు మృతి చెందడంతో అద్దె ఇంటి యజమాని మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న బంధువుల ఖాళీ స్థలంలో చివరి మజిలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మానవత్వంతో బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మినాగరాజు విజ్ఞప్తి చేశారు. మృతునికి భార్మ నిర్మల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘ఎంజీఎం’ బాధితుడి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించని ఓనర్
హసన్‌పర్తి: నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడి బాధితుడు కడార్ల శ్రీనివాస్ (37) మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లేందుకు యజమాని నిరాకరించాడు. హనుమకొండలోని కుమార్‌పల్లిలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకురాగా యజమాని అభ్యంతరం చెప్పాడు. తన ఇంట్లోకి తీసుకు రావద్దని చెప్పడంతో భీమారంలోని ఆయన సోదరుడి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. హనుమకొండ ఆర్డీఓ వాసుచంద్ర, శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అంత్యక్రియల కోసం కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీనివాస్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. ఈ అంశంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడినట్లు చెప్పారు. -
నవీన్ మృతదేహం బెంగళూరుకి చేరనుంది: కర్ణాటక సీఎం
సాక్షి బెంగళూరు: ఉక్రెయిన్‌లో మృతి చెందిన భారతీయ విద్యార్థి మృతదేహం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని కర్ణాటక సీఎం ట్విట్టర్లో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో ఆఖరి సంవత్సరం వైద్య విద్యార్థి నవీన్ జ్ఞానగౌడర్ మార్చి 1న షెల్ దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. నవీన్ కుటుంబ సభ్యులు అతడి డెడ్ బాడీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కొడుకును కడసారి చూడాలని పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు కూడా. ఈ మేరకు నవీన్ తండ్రి కుమారుడి మృతదేహాన్నిఇంటికి తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా ప్రధాని మోదీని, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని అభ్యర్థించారు కూడా . ప్రభుత్వ కూడా వారికి హామీ ఇచ్చింది. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో షెల్లింగ్‌లో మరణించిన భారతీయ వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ భౌతికకాయం ఆదివారం బెంగళూరుకు చేరుకుంటుందని శుక్రవారం తెలిపారు. నవీన్ మృతదేహానికి ఎంబామ్ చేసి ఉక్రెయిన్‌లోని మార్చురీలో ఉంచినట్లు బొమ్మై గతంలోనే తెలియజేశారు. (చదవండి: బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది మూకుమ్మడి దాడి) -
తల్లి నిద్రపోతుందని మృతదేహంతోనే ఉన్న బాలుడు
-
తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. మూడు రోజులుగా భర్త మృతదేహంతోనే..
హుబ్లీ (కర్ణాటక): వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం మూడు రోజుల తర్వాత స్థానికుల చొరవతో వెలుగు చూసింది. ఈ ఘటన హుబ్లీ నవనగర ఎల్ఐజీ వద్ద చోటు చేసుకుంది. ధార్వాడలోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె(30) తొమ్మిదేళ్ల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎల్ఐజీ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఇంటినుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఏపీఎంసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి పరిశీలించగా మంజునాథ విగతజీవిగా కనిపించాడు. ఇతను మూడు రోజుల క్రితమే మృతి చెందాడని, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నా మృతి విషయాన్ని బయటకు చెప్పలేదని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంజునాథ మృతిపై తమకు అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (ప్రేయసితో పెళ్లికి భార్య అంగీకరించలేదని...) -
అమానుషం.. ఆస్పత్రి మరుగుదొడ్డిలో ఆడ శిశువు మృతదేహం
సాక్షి, బెంగళూరు: తుమకూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. తల్లిగర్భం నుంచి బయటపడిన ఆడబిడ్డ మరుగుదొడ్డి పాలై విగతజీవిగా కనిపించింది. తుమకూరు జిల్లా కొరటగెరెలోని ప్రభుత్వ అస్పత్రిలో గురువారం ఉదయం ఒక మహిళా రోగి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్డిలోకి వెళ్లగా శిశువు మృతదేహం కనిపించింది. ఆస్పత్రి వైద్యాధికారిణి పుష్పలత వచ్చి పరిశీలించగా ఒక రోజు వయసున్న ఆడశిశువుగా గుర్తించారు ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టింది ఆడబిడ్డ అని మరుగుదొడ్డి పాలు చేశారా? మృత శిశువుగా జన్మించగా ఇలా పారేశారా అనేది తెలియడం లేదు. మంగళ, బుధవారం ఆస్పత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ఎంతమంది బాలింతలు డిశార్జ్ అయ్యారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హిజాబ్ సెగ: సిక్కు బాలికకు చేదు అనుభవం.. ఎక్కడికి దారితీస్తుంది..? -
కరగని ‘గుండె’
సిరిసిల్ల: కొందరి కష్టాలు చూస్తే పగవారికైనా రావద్దనిపిస్తుంది. సొంత ఇల్లు లేదు.. భార్య ఏనాడో కన్నుమూసింది. కొడుకుతో కలసి సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ నేత కార్మికుడి గుండె ఆగిపోయింది. అయితే ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట టెంట్ వేసుకుని శవాన్ని ఉంచాల్సి వచ్చింది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్‌నగర్‌లో నివసించే దీకొండ దేవదాస్ (66) నేతకార్మికుడు. దేవదాస్ భార్య కళావతి చాలా రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు అరుణ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, దేవదాస్ అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో శవాన్ని ఇంటికి తేవద్దని యజమాని చెప్పాడు. దీంతో కొడుకు అరుణ్‌కు ఎటు పోవాలో తెలియక శుక్రవారం రాజీవ్‌నగర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో టెంట్ వేసి తండ్రి శవాన్ని ఉంచాడు. ఓ కూతురు భివండిలో ఉండడంతో ఆమె వచ్చేంత వరకు కుటుంబ సభ్యులు అక్కడే నిరీక్షించారు. అరుణ్ చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బంధువులు ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. పేదవాడైన అరుణ్‌ను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ముంబై శివాజీ పార్కుకు లతా మంగేష్కర్ పార్థివదేహం తరలింపు
-
ఎవరు చంపారో? ఎందుకు చంపారో?
నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామ శివారు లో శనివారం పంట పొలాల మధ్య రక్తపు మ డుగులో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలుడు మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెర సురేష్ (12)గా గుర్తించారు. అక్కంపల్లిలోని ఒడ్డెర రాములు, సాయవ్వ దంపతులకు ముగ్గురు కుమారులుండగా పెద్దవాడైన సురేష్ ఆరో తరగతి చదువుతున్నాడు. సురేష్‌తో పాటు మరో కుమారుడిని ఇంటివద్ద తల్లి పోచవ్వతో ఉంచి రాములు, సాయవ్వ మరో కుమారునితో బతుకు దెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్రెడ్డితోపాటు నాగిరెడ్డిపేట ఎస్ఐ ఆంజనేయులు పరిశీలించారు. శనివారం రాత్రి వరకు బాలుని మృతిపై స్పష్టత రాలేదు. -
షాకింగ్ ఘటన: మృతదేహం చుట్టూ 125 పాములు
అమెరికాలో ఒళ్లు గగుర్పుడిచే ఘటన చోటుచేసుకుంది. అత్యంత విషమైన 125 పాములు మధ్య ఓ వ్యక్తి విగత జీవిగా పడిఉండటం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మేరీలాండ్‌లోని చార్లెస్ కౌంటీ ప్రాంతంలో నివసించే 49 ఏళ్ల వ్యక్తి కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఇంట్లో వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ కనిపించాయి. అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. అయితే ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అతడి మరణానికి ఇంకా కారణాలు తెలియలేదు. అయితే పాములే కాటు వేశాయా.. లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: లావుగా ఉన్నాడని ఉద్యోగంలోంచి తీసేశారు! -
చెల్లి శవంతో నాలుగు రోజులుగా సహవాసం చేసిన అక్క
-
చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో..
పెద్దపల్లి: వారిద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరు శ్వేత, మరొకరు స్వాతి. గతంలోనే తల్లితోపాటు నాయనమ్మ కూడా మృతిచెందారు. వీరిద్దరిని వదిలి తండ్రి ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్దిరోజులుగా శ్వేత కనిపించట్లేదు. ఇదే విషయాన్ని స్థానికులు స్వాతిని ఆరా తీస్తే సమాధానం చెప్పలేదు. సోమవారం సాయంత్రం వీరి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించగా శ్వేత శవమై కుళ్లిపోయినస్థితిలో ఉండగా.. అక్క స్వాతి ఆ శవం వద్దే కూర్చుని ఉంది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది. రేషన్ బియ్యం తెచ్చుకొని తింటూ.. జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్‌కు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు స్వాతి, శ్వేత. 2016లో వీరి తల్లితో పాటు నాయనమ్మ చనిపోయారు. తల్లి చనిపోయినప్పుడు పిల్లలు సుమారు రెండురోజుల పాటు శవంతోనే ఉన్నట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆమె శవాన్ని ఇంట్లోనే ఖననం చేసినట్లు అప్పట్లో చర్చనీయాంశమైంది. అదే సమయంలో తండ్రి వీరిని వదిలి వెళ్లిపోయాడు. ప్రగతినగర్ పెద్దపల్లికి శివారులో ఉండడంతో వీరు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారుకాదు. పైగా ఇద్దరికీ మానసిక పరిస్థితి సరిగా ఉండేదికాదు. రేషన్ బియ్యం తెచ్చుకుని తింటూ ఇంట్లోనే ఉండేవారు. శ్వేత శవంతోనే 4 రోజులుగా.. శ్వేత కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో స్థానికులు స్వాతిని ఆరా తీశారు. అయినా ఆమె బదులు చెప్పలేదు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా శ్వేత (24) శవం కుళ్లిపోయి ఉంది. ఆమె 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అంత దుర్వాసనలోనూ స్వాతి ఎలా ఉందోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎస్సైలు రాజేశ్, రాజవర్ధన్ ఆధ్వర్యంలో శ్వేత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. స్వాతి వద్ద డబ్బులు లేకపోవడంతో పోలీసులే దహన సంస్కారాలు పూర్తిచేయించారు. స్వాతి మానసిక స్థితి సరిగా లేదని ఎస్సై తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. -
‘వాటర్ ట్యాంకులో శవం’.. కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): రాంనగర్‌లోని రిసాలగడ్డ జలమండలి వాటర్ ఓవర్‌హెడ్ ట్యాంకులో లభ్యమైన కుళ్లిన శవం మిస్టరీ వీడింది. మృతుడు రాంనగర్ అంబేడ్కర్ నగర్ బస్తీకి చెందిన కిషోర్(26)గా పోలీసులు నిర్ధారించారు. పోస్టు మార్టం నిర్వహించి బుధవారం కుటంబసభ్యులకు శవాన్ని అప్పగించారు. పోలీసులు తెల్పిన వివరాల మేరకు అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పుష్పకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమారైలు. వీరిలో పెద్ద కుమారుడు కిషోర్ గతంలో పెయింటింగ్ పనులు చేసేవాడు. కొద్దికాలంగా ఆటో నడుపుతూ.. గంజాయి, మద్యానికి బానిసగా మారాడు. అక్టోబర్ 19న మద్యం అతిగా తాగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై అక్టోబర్ 23న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అదృశ్యమైన కిషోర్ మంగళవారం చిలకలగూడ జలమండలి వాటర్ ట్యాంకులో శవమై కన్పించాడు. ముషీరాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కిషోర్ స్నేహితుడు మధును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. -
3 నెలలుగా తండ్రి శవంతోనే జీవనం .. కారణం తెలిసి కంగుతిన్న పోలీసులు
కోల్‌కతా: చనిపోయిన వారి మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకుని.. వాటితో కలిసి జీవించే దృశ్యాలను ఎక్కువంగా సినిమాలో చూసుంటాం. కానీ ఇటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు నెలలుగా దానితో కలిసి జీవిస్తున్నాడు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కేపీరాయ్ లేన్‌లో సంగ్రామ్ డే (70) బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో మాజీ ఉద్యోగి. గత కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు సంగ్రామాన్ని చూడలేదు. అతని కొడుకు కౌశిక్ డే కూడా చుట్టు పక్కల వారితో పెద్దగా మాట్లాడడు కాబట్టి వారికి మొదట్లో అనుమానం రాలేదు. అయితే ఇటీవల కౌశిక్ ప్రవర్తన కాస్త వింతగ ఉండడం, అతని తండ్రి కనపడకపోవడంతో స్థానికులు గార్ఫా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వెళ్లగా కౌశిక్ తలుపులు కూడా బలవంతంగా తెరిచాడు. ఇంటిలోకి వెళ్లి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో మంచంపై పడి ఉన్న సంగ్రామ్ మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతని భార్య అరుణా డే పక్షవాతం కారణంగా మంచాన పడింది. మూడు నెలల క్రితం తన తండ్రి చనిపోయాడని, అయితే సంగ్రామ్ మళ్లీ మేల్కొంటాడని భావించానని కౌశిక్ పోలీసులకు చెప్పాడు. కౌశిక్ సమాధానాలు విన్న పోలీసులు అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందిని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’ -
దళితుల ఆవేదన.. మృతదేహంతో కలెక్టరేట్‌కు
సాక్షి, మండ్య(కర్ణాటక): అణగారిన వర్గాలు తనువు చాలిస్తే అంత్యక్రియలకు శ్మశానం లేదనే ఆక్రోశంతో మండ్య తాలూకాలోని హుళ్ళెనహళ్ళి గ్రామస్తులు సోమవారం మృతదేహంతో ధర్నా చేశారు. గ్రామవాసి సిద్దాచార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేయడానికి శ్మశానం లేకపోయింది. దీంతో బంధువులు, గ్రామస్తులు కలిసి శవాన్ని మండ్యకు తీసుకొచ్చి ఏకంగా కలెక్టరేట్ ముందు పెట్టుకొని ధర్నా నిర్వహించారు. తమ గ్రామంలో దళితుల చనిపోతే అంత్యక్రియలు చేయడానికి రుద్రభూమి లేదని వినతిపత్రం అందజేశారు. దీంతో కలెక్టర్ ఎస్.అశ్వతి, తహసీల్దార్‌తో కలిసి గ్రామానికి వెళ్ళి స్మశానస్థలి కోసం పరిశీలించారు. దాంతో గ్రామస్తులు శాంతించి శవాన్ని తీసుకొని వెళ్లారు. -
‘ఇక్కడ ఏ వాహనం లేదు’. బైక్‌పైనే మృతదేహం తరలింపు
సాక్షి, భువనేశ్వర్/కటక్: ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా మృతి చెందిన దివ్యాంగ యువకుని మృతదేహం మోటార్ సైకిల్‌పై తరలించారు. ఈ ఘటన కటక్ జిల్లాలోని బంకిడొంపొడా సమితిలో గురువారం చోటుచేసుకుంది. ఢంసర్ గ్రామానికి చెందిన సరోజ్ లెంకా(19) ఆరోగ్యం క్షీణించడంతో బంకిడొంపొడా సబ్‌డివిజనల్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స జరుగుతుండగా ఉదయం కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. చదవండి: బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్ అయితే ఇటువంటి మృతదేహాల తరలింపు కోసం ప్రభుత్వం మహా ప్రయాణం పేరిట వాహనాలను ఏర్పాటు చేసింది. కానీ యువకుని శవం స్వగ్రామం తరలించేందుకు అటువంటి వాహనం ఇక్కడ లేదని ఆస్పత్రి వర్గాలు బదులివ్వడంతో గత్యంతరం లేక బాధిత బంధువులు ఇలా మోటార్‌బైక్‌పై తరలించడం గమనార్హం చదవండి: రెండెళ్ల ప్రేమ.. పాయిజన్ తాగిన యువకుడు.. -
33 లక్షల లాటరీ టికెట్‌తో కొట్టుకొచ్చిన మృతదేహం
ఒట్టావా: సాధారణంగా లాటరీ గెలిస్తే ఎవరి సంతోషానికైనా హద్దులుండవు. కానీ, ఓ వ్యక్తి లాటరీ గెలిచినా ఆనందం పొందలేక పోయాడు. ఆనందం విషయం పక్కనపెడితే.. ఆయన సజీవంగా లేకపోవటం కలకలం సృష్టింస్తోంది. ఈ ఘటన కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. 57 ఏళ్ల గ్రెగొరీ జార్విస్ అనే వ్యక్తి గత శుక్రవారం కెనడాలోని ఓ బీచ్‌లో విగతజీవిగా కనించాడు. స్థానికుల సమాచారంతో బీచ్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: US Govt Says : వడ్రంగి పిట్టలు ఇక కనుమరుగైనట్టేనా! అతని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులకు విలువైన లాటరీ లభ్యమైంది. సుమారు రూ.33 లక్షల లాటరీని అతను గెలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సముద్రంలో బోట్ అదుపు తప్పటం వల్ల మృతి చెందాడని, తర్వాత అతని మృతదేహం బీచ్‌కు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. ఇక అతని మృతదేహం వద్ద లభించిన లాటరీ టికెట్ సెప్టెంబర్ నెల ప్రారంభంలో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. అతను అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం
సాక్షి, అంబర్‌పేట: మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. అంబర్‌పేట ముసారాంబాగ్ బ్రిడ్జి సమీపంలో వరద ఉధృతిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. ప్రవాహంలో మృతదేహం కొట్టుకుపోతున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉధృతిలో మృతదేహం కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. ఘట్కేసర్ వైపు మృతదేహం కొట్టుకుపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
తాలిబన్ల వికృత చర్య.. ఈ సారి ఒళ్లు గగుర్పొడిచేలా..
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మునుపటిలానే వారి కిరాతక చర్యలను కొనసాగిస్తున్నారు. హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో క్రేన్‌కు ఒక మృతదేహాన్ని వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. అయితే అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మొదట.. తమ పాలన గతంలో మాదిరి ఉండదని, మారిపోయానట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల గతంలోని పాలన మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి తెలిపాడు. హెరాత్ ప్రాంతంలో ఫార్మసీ నడుపుతున్న ఓ వ్యక్తి మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం.. తాలబన్లు నాలుగు మృతదేహాలను ప్రధాన కూడలికి తీసుకువచ్చి ఒక మృతదేహాన్ని వేలాడిదీసారని, మిగిలిన మూడు మృతదేహాలను మరో కూడళ్లలో వద్ద ఈరకంగానే వేలాడ దీసేందుకు తీసుకెళ్లారని తెలిపాడు. అయితే ఆ నలుగురు కిడ్నాప్ యత్నించడంతో పోలీసుల చేతిలో హతమయ్యారని తాలిబాన్లు ఆ కూడలి వద్ద ప్రకటించారని చెప్పాడు. ఆగష్టు 15 న తాలిబాన్లు ఆప్గన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజలు చీకటి పాలన మళ్లీ మొదలుకానుందని భయభ్రాంతులకు గురవుతున్నారు. చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. -
అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని..
హయత్‌నగర్: దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా దుప్పట్లో చుట్టి బయట పడేసే ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శక్రవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. హయత్‌నగర్ పాత గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో డేగ శ్రీను, లక్ష్మీ దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చదవండి: ఫారెన్ వెళ్లలేకపోతున్నా.. మనస్తాపంతో యువతి శ్రీను మేస్త్రీ పని చేస్తుండగా, లక్ష్మి(35) కూలి పని చేసేది. ఆమె అనారోగ్యంతో ఇంట్లోనే ఉండగా శ్రీను పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. తల్లికి కూతురు భవాని మంచి నీళ్ళు ఇవ్వగా కొద్దిసేపటికి లక్ష్మీ మృతి చెందింది. అయితే దహన సంస్కారాలకు డబ్బులు లేవని రాత్రి 11 గంటల సమయంలో అతని స్నేహితుడు వినోద్ సహాయంతో బార్య మృత దేహాన్ని భజంపై వేసుకుని సమీపంలో ఉప్ప బాతుల చెరువు అలుగు వద్ద పడేసేందుకు వెళుతున్నాడు. చదవండి: మృతదేహాన్ని అడ్డగింత.. చితి పైకెక్కి ఆందోళన ఇది గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని నిలదీశారు. చంపి శవాన్ని పడేసేందుకు వచ్చారనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లక్ష్మీ మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించి శ్రీను, వినోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే వాస్తవాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. -
రంగారెడ్డి: హయత్‌నగర్‌లో మహిళ మృతదేహం కలకలం
-
హయత్‌నగర్: దుప్పటిలో మహిళ మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. వారిని అప్పగించారు. హయత్‌నగర్‌లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. బ్లాంకెట్‌లో ఏమిటని ప్రశ్నించగా.. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్లో ఒక వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని.. బ్లాంకెట్‌లో ఉన్నది తన భార్య మృతదేహం అని.. తమది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. ఆమె ఎలా చనిపోయిందని అని అడిగితే.. శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేదు. (చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్) దీంతో అనుమానంతో పోలీసులకు వారిని పట్టించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక మహిళ ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతురాలిని డేగ లక్ష్మీగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన డేగ లక్ష్మి, నెల్లూరుకి చెందిన శ్రీనివాస్‌కు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహంమైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చాడు. తాపీమేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని.. ఈక్రమంలోనే ఆమె మృతి చెందినట్లు శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం. (చదవండి: పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి) డబ్బులు లేక స్నేహితుడి సహాయంతో ఎక్కడన్నా దహన సంస్కారాలు చేద్దామని తీసుకువెళ్తున్నట్లు శ్రీనివాస్ పోలీసుల విచారణలో తెలిపాడు. పోస్ట్మామార్టం రిపోర్ట్ వచ్చాకే లక్ష్మి మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ప్రస్తుతం లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం -
శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్
సాక్షి, శ్రీకాళహస్తి: ఓ మృతదేహం పెద్ద ఉపద్రవమే తెచ్చింది. ఇద్దరు ఆలయ ఉద్యోగులపై వేటు పడేలా చేసింది. మరో ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపునకు కారణమైంది. ఆ మృతదేహం కథేమిటో తెలుసుకోవాలంటే.. ముక్కంటి ఆలయ అనుబంధ భరద్వాజ తీర్థంలోని భరద్వాజేశ్వరాలయ సమీపంలో సోమవారం రాత్రి అధికారుల అనుమతి లేకుండా 7 గంటల సమయంలో ఓ మృతదేహాన్ని ఖననం చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం దిరశనమాల గ్రామానికి చెందిన అనిల్ (34) మృతదేహమది. స్థానికంగా ముక్కంటీశుని ఆలయం వద్ద ఓ కుంకుమ దుకాణంలో అతడు పనిచేసేవాడు. అనారోగ్యం బారినపడి చనిపోయాడు. ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకొచ్చి భరద్వాజ తీర్థంలో ఆలయం పక్కన ఖననం చేశారు. ఇక్కడ అవధూతగా ఉంటూ వచ్చిన కోట్లమ్మ శిష్యుడు అనిల్ అని, అందుకే ఆయన్ను ఇక్కడ ఖననం చేశామని ఖననం చేసిన వారు ప్రచారం చేశారు. అయితే మృతునికి భార్య, ఓ పాప కూడా ఉండడంతో అతడిని ఎలా అవధూతగా చెబుతారని కొందరు ప్రశ్నించినా సమాధానం కరువైంది. ఇది కాస్తా చర్చనీయాంశమై ఆలయ ఈఓ పెద్ది రాజు దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. మృతదేహాన్ని ఖననం చేస్తున్నట్లు ఉద్యోగుల దృష్టికి వచ్చినా అడ్డుకోకపోవడంపై ఆగ్రహించారు. దీనికి బాధ్యులను చేస్తూ భద్రతాధికారిగా ఉన్న ఏఈఓ శ్రీనివాసరెడ్డిని, భరద్వాజేశ్వరాలయం అర్చకుడు అనిల్‌కుమార్ స్వామిని సస్పెండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ సెక్యూరిటీ సూపర్వైజర్ శ్రీనివాసులు, సెక్యూరిటీ గార్డు శేఖర్‌ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలకుగాను దేవదాయ కమిషనర్‌కు నివేదించారు. అలాగే, ఒకటవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భరద్వాజేశ్వరాలయ ప్రాంతంలోని సీసీ కెమెరాలు ఇప్పటివరకు పనిచేయకపోవడం..ఆ సమయంలోనే మృతదేహాన్ని ఖననం చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి
వియాన్న: తల్లి చనిపోయింది. కానీ ఆమె మరణించింది అని తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ డబ్బులు రాకుండా ఆగిపోతాయి. అలా జరిగితే తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లి మృతదేహాన్ని మమ్మీగా మార్చాడు. అలా ఏడాది పాటు డెడ్‌బాడీని ఇంట్లోనే పెట్టుకుని కాలం వెళ్లదీయసాగాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి(66)తో కలిసి టైరోల్ ప్రాంతంలోని ఇన్స్బ్రక్ సమీపంలో నివసిస్తుండేది. వృద్ధురాలికి ప్రతి నెల పెన్షన్ వస్తుండేది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. (చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు?) ఆ తర్వాత తల్లి మృతదేహానికి బ్యాండేజ్‌లు చుట్టి.. రసాయనాలలో ఉంచాడు. బ్యాండేజ్‌లు ఆ ద్రవాలను పీల్చుకుని.. మృతదేహాన్ని మమ్మీలా మార్చాయి. ఆ తర్వాత మమ్మీగా మార్చిన మృతదేహాన్ని ఇంటిలోపల దాచాడు. ఇక అతడి సోదరుడు తరచుగా ఇంటికి వచ్చి తల్లి గురించి ప్రశ్నించేవాడు. దానికి నిందితుడు.. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాను అని తెలిపేవాడు. ఇలా ఏడాదిగా తల్లి మరణాన్ని దాచి ఆమె పేరు మీద వస్తోన్న పెన్షన్ డబ్బులను తీసుకున్నాడు. అలా ఇప్పటి వరకు 60 వేల డాలర్ల(44,05,743 రూపాయలు) పెన్షన్ సొమ్మును తీసుకున్నాడు. (చదవండి: వృద్ధ గోవులకు పింఛను) ఎలా బయటిపడిందంటే.. ఏడాదిపాటుగా సాగుతున్న ఈ వ్యవహారం కొత్త పోస్ట్‌మ్యాన్ రాకతో బయటపడింది. పెన్షన్ సొమ్ము ఇవ్వడానికి ఇంటికి వచ్చిన కొత్త పోస్ట్‌మ్యాన్ తాను లబ్ధిదారుని చూశాకే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అందుకు నిందితుడు అంగీకరించలేదు. దాంతో పోస్ట్‌మ్యాన్ ఈ వ్యవహారం తేడాగా ఉందని భావించి.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు నిందితుడి ఇంటికి వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసుత్తం నిందితుడిని అరెస్ట్ చేసి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది -
మూడు రోజులుగా మృతదేహంతో ఆందోళన
ఇల్లందకుంట (హుజూరాబాద్): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో మూడు రోజులక్రితం మృతిచెందిన శ్రీరాములపల్లికి చెందిన గారంపల్లి సాంబశివరావు మృతదేహంతో గ్రామస్తులు మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అతని మృతికి కారణమైన సోదరుడు శ్రీకాంత్ నుంచి బాధిత కుటుంబానికి రావాల్సిన భూమిని ఇప్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇల్లందకుంట రోడ్డుపై దాదాపు మూడు గంటలపాటు బైఠాయించి, నిరసన తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని, ఆందోళన విరమించాలని సీఐ సురేశ్ చెప్పడంతో, తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీయబోమని, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని మృతుడి కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. శ్రీరాములపల్లిలో మూడు రోజులుగా సాంబశివరావు మృతదేహం వద్దే గ్రామస్తులు వంటావార్పు నిర్వహిస్తున్నారు. -
జగిత్యాలలో కలకలం: శవాన్ని బతికిస్తామని క్షుద్రపూజలు
జగిత్యాల క్రైం: ఓ వైపు శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతుంటే.. మరోవైపు మూఢనమ్మకాలు ప్రజల్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిని బతికిస్తామంటూ దంపతులు ముందుకు రావడం.. మృతుని కుటుంబ సభ్యులు వారి మాటలు నమ్మడమే ఇందుకు నిదర్శనం. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్షుద్రపూజలు చేస్తే చనిపోయిన వ్యక్తి బతుకుతాడని, ఇందుకు పోలీసులు అడ్డుపడడం తగదని ఆగ్రహిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి మరీ నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామానగర్‌కు చెందిన ఒర్సు రమేశ్, అనిత భార్యాభర్తలు. కూలిపని చేసుకుంటూ బతుకుతున్నారు. 15 రోజుల క్రితం వారు తమ ఇంటి సమీపంలోని కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర దంపతులతో గొడవపడ్డారు. అంతు చూస్తానంటూ రాజు ఆ సమయంలో రమేశ్‌ను బెదిరించాడు. కొద్దిరోజుల తర్వాత రమేశ్ ఇంట్లో దుర్గమ్మ పండుగ చేసుకున్నారు. మరుసటిరోజున రమేశ్ పిలవకుండానే అతని ఇంటికి పుల్లేశ్ భోజనం కోసం వెళ్లాడు. అప్పటికే భోజనం అయిపోగా.. కాసేపు ఆగితే వండిపెడతామని రమేశ్ చెప్పాడు. అయితే పుల్లేశ్ ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రోజు రమేశ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో గురువారం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందాడు. చేతబడి చేశారని ఆరోపిస్తూ.. కొమ్మరాజు పుల్లేశ్, సుభద్ర చేతబడి చేయడంతోనే రమేశ్ చనిపోయాడని మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు ఆ దంపతులను కట్టేసి కొట్టారు. దెబ్బలు భరించలేక తానే చేతబడి చేశానని.., సగం చంపానని, క్షుద్రపూజ చేసి బతికిస్తానని రాజు చెప్పాడు. దాంతో మృతుడి కుటుంబ సభ్యులు పూజాసామగ్రి తీసుకొచ్చారు. పూజ చేసేందుకు పుల్లేశ్ దంపతులు సిద్ధపడుతున్న నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు రాజు, సుభద్రలను అదుపులోకి తీసుకున్నారు. అయితే రమేశ్ సగం ప్రాణంతో ఉన్నాడని, అతని మృతదేహాన్ని తరలించవద్దని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి శవాన్ని తరలించి పరీక్షించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు.. పుల్లేశ్ మంత్రం వేస్తే రమేశ్ బతికి వస్తాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కరీంనగర్–జగిత్యాల రహదారిపై ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులతో మాట్లాడి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. కానీ రాత్రి 7 గంటల వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయలేదు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం
తాడేపల్లి రూరల్ (గుంటూరు జిల్లా): సంచలనం రేపిన సీతానగరం అత్యాచారం ఘటనకు ముందు హత్యకు గురైన ఆనంద్ మృతదేహం కోసం తాడేపల్లి పోలీసులు కృష్ణానదిలో అన్వేషణ ప్రారంభించారు. అత్యాచారంతో పాటు ఓ వ్యక్తిని హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించారు. అత్యాచారానికి గురైన యువతి, ఆమె స్నేహితుడి సెల్ఫోన్లతో పాటు హత్యకు గురైన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడికి చెందిన ఆనంద్ సెల్‌ఫోన్ కూడా నిందితులు షేర్ కృష్ణ, షేక్ హబీబ్ వద్ద లభించాయి. జూన్ 22వ తేదీ ఆనంద్ భార్య మృదుల తన భర్త కనిపించడం లేదని, చివరిసారిగా కృష్ణానది రైల్వే బ్రిడ్జి మీద ఉంచి ఫోన్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై పోలీసులు జూన్ 23వ తేదీ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో హత్యకు గురైంది మిస్సింగ్ కేసులో ఆనంద్ అని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు మంగళవారం ఆనంద్ మృతదేహం కోసం కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. షేర్ కృష్ణ, ప్రసన్నరెడ్డి అలియాస్ వెంకటరెడ్డి, షేక్ హబీబ్ ముగ్గురూ కలిసి అత్యాచారం చేసేముందు దొంగతనం చేయడం, దానిని ఆనంద్ చూడటం, ఆనంద్ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుని అతడ్ని కొట్టి, హత్యచేసి ఆ మృతదేహాన్ని ఓ ఐరన్ గిడ్డర్‌కు కట్టి కృష్ణానదిలో పడవేశారు. షేర్ కృష్ణ, హబీబ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, విచారణలో మృతదేహాన్ని ఎక్కడ పడవేశాడో నిందితులు పోలీసులకు చూపించారు. దీంతో మృతదేహం కోసం పోలీసులు ఆ ప్రాంతంలో గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు నిర్వహించారు. ఆరుగురు గజ ఈతగాళ్లు ఐదు గంటల పాటు ఆనంద్ మృతదేహం కోసం విస్తృతంగా నీటిలో గాలించినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. జూన్ 19వ తేదీ ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి కృష్ణా నదిలోకి రెండుసార్లు 5 లక్షల క్యూసెక్కులపైన వరద నీరు రావడం, ఆ నీటితో పాటు ఇసుక కూడా కొట్టుకువచ్చిందని, మృతదేహం ఎక్కడో ఇసుకలో కూరుకుపోయి ఉంటుందని గజ ఈతగాళ్లు చెబుతున్నారు. కృష్ణానదిలో పూర్తిగా నీళ్లు తగ్గితేనే కూరుకుపోయిన మృతదేహాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని గజ ఈతగాళ్లు పేర్కొన్నారు. పోలీసులు గజ ఈతగాళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఆనంద్ మృతదేహం కోసం గా>లించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఇంట్లో నుంచి దుర్వాసన.. తలుపు తెరిచి చూస్తే..
హొళగుంద: ఇంట్లో మూడు రోజులుగా మృతదేహం ఉన్నా చుట్టుపక్కల వారికి తెలియలేదు. ఆదివారం ఒకటో తేదీ పింఛన్ ఇచ్చేందుకు వలంటీర్ ఆ ఇంటికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా హొళగుందలోని ఈబీసీ కాలనీలో టి.రాజేశ్వరి (55) ఉంటున్నారు. ఆమె భర్త హరినారాయణ పదేళ్ల కిందట మృతి చెందారు. కుమార్తె మంజుభార్గవికి వివాహం కావడంతో విజయవాడలో ఉంటున్నారు. ప్రస్తుతం రాజేశ్వరి ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున పింఛన్ ఇచ్చేందుకు వలంటీరు అనిల్ ఇంటికెళ్లి తలుపుతట్టగా ఉలుకు పలుకు లేదు. దుర్వాసన వస్తుండడంతో మరొకరి సహాయంతో తలుపులు తీయగా.. రాజేశ్వరి విగతజీవిగా కనిపించారు. వలంటీరు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అనారోగ్యంతో మృతిచెందారా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని పోలీసులు పరిశీలిస్తున్నారు. -
జూబ్లీహిల్స్: చంపేసి.. హోర్డింగ్ వెనుక దాచేసి..
సాక్షి, బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్యచేసిన దుండగులు మృతదేహాన్ని ఓ హోర్డింగ్ వెనుక దాచేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన విజిలేష్ కుమార్(30) రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. కాచిగూడలోని లియో సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 7లోని ఫోర్ వీల్స్ ట్రావెల్స్‌కు చెందిన పార్కింగ్ స్థలంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. సమీపంలో ఖాళీ స్థలంలో దుర్వాసనలు వస్తున్నాయని స్థానికులు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా నిర్మాణంలో ఉన్న భవనం ప్రహారీని ఆనుకొని ఓ హోర్డింగ్ కనిపించింది. హోర్డింగ్ వెనుకాల కుళ్ళిపోయిన స్థితిలో విజిలేష్ మృతదేహం కనిపించింది. అతడిని హత్య చేసిన దుండగులు ఎవరికీ కనిపించకుండా హోర్డింగ్ వెనుకాల మృతదేహాన్ని దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇదిలా ఉండగా ఈ నెల 13 నుంచి విజిలేష్ ఉద్యోగానికి వెళ్ళడం లేదని తెలుస్తోంది. -
వైరల్ వీడియో: చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలు!
కాన్బెర్రా: ఈ చరాచరా సృష్టిలో మనిషి అత్యంత బలహీనుడు. కానీ, అతడి మేధా శక్తితో ఇతర జీవులను శాసిస్తున్నాడు. ఇక పాడైపోయిన చెప్పులనైనా ఇంట్లో ఉంచుకుంటారు. కానీ మనిషి చచ్చిన మరుక్షణమే కాటికి పంపంచే కార్యక్రమం మొదలవుతుంది. అయితే మెల్బోర్న్కి చెందిన జాక్కి విలియమ్స్(29) అనే మహిళ చనిపోయిన వ్యక్తుల అవశేషాలతో ఆభరణాలను తయారు చేస్తోంది. గ్రేవ్ మెటాలమ్ జ్యువెలరీలో చనిపోయిన వ్యక్తుల దంతాలు, వెంట్రుకలతో వారి కుటుంబాలకు ఉంగరాలు, కంఠహారాలు తయారు చేస్తోంది. దీని పై విలియమ్స్ మాట్లాడుతూ..‘‘ తనని తాను కాల్చుకుని చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబ కోసం ఐయూడీని ఉపయోగించి ఓ ఆభరణాన్ని తయారు చేసి ఇచ్చాను. ఆ విధంగా ఈ వ్యాపారం మొదలైంది. ఈ ఆభరణాలను తయారు చేయడానికి ఎనిమిది వారాలు పడుతుంది. వీటి ధర 350 నుంచి 10,000 డాలర్ల వరకు ఉంటుంది. మరణం పై ఉన్న భయాలను పోగొట్టాలనే ఆశయంతో ఈ పని చేస్తున్నాను. గ్రేవ్ మెటాలమ్ అనే వెబ్సైట్లో వీటిని విక్రయానికి పెట్టాను.’’ అని జాక్కి విలియమ్స్ పేర్కొంది. -
శ్మశాన వాటికలో చిన్నారి మృతదేహం మాయం
సాక్షి, హైదరాబాద్: పహాడీషరీఫ్ శ్మశాన వాటికలో ఓ చిన్నారి మృతదేహం మాయమైన ఘటన కలకలం రేపుతోంది. శ్మశానవాటిలో పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మృతదేహం మాయంపై చిన్నారి బంధవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరు ఎత్తుకెళ్లారు? ఎందుకు ఎత్తుకెళ్లారనే విషయం మిస్టరీగా మారింది. మృతదేహం మాయం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
లంచం డిమాండ్; 75 రోజుల తర్వాత అంత్యక్రియలు
లక్నో: కరోనాతో మరణించిన ఒక వ్యక్తి మృతదేహానికి రెండున్నర నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన భర్త మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 లంచం డిమాండ్ చేశారని భార్య ఆరోపించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. 28 ఏళ్ల నరేశ్‌కు ఏప్రిల్ 10న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు తొలుత హాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం నరేశ్‌ను మీరట్‌లోని లాలా లాజ్‌పత్ రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఏప్రిల్ 15న చనిపోయాడు.అయితే ఆయన భార్య గుడియాకు మృతదేహాన్ని అప్పగించేందుకు వైద్యులు రూ.15,000 డిమాండ్ చేసినట్లు తేలింది. డబ్బులు ఇవ్వని పక్షంలో మృతదేహానికి తామే అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు చెప్పారు. దీంతో డబ్బులు లేక గుడియా తిరిగి ఊరికి వెళ్లిపోయింది. ఆ తర్వాత బంధువులు సాయంతో విషయాన్ని పోలీసులకు వివరించింది. పోలీసులు ఇటీవల మృతుడి భార్య గుడియాతో ఫోన్లో మాట్లాడి ఆమెను హాపూర్‌కు రప్పించినట్లు తెలిపారు. అనంతరం హాపూర్ మున్సిపల్ సిబ్బంది ఈ నెల 2న భార్య సమక్షంలో నరేశ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని వెల్లడించారు. కాగా గుడియా ఆరోపణల్లో నిజానిజాలు ఎంత అనేది తెలుసుకోవడానికి మీర్ట్ జిల్లా కలెక్టర్ బాలాజీ దర్యాప్తుకు ఆదేశించారు. -
4 రోజుల్లో పెళ్లి.. రోడ్డు పక్కన పెళ్లి కూతురు శవం
లక్నో: అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కుమార్తెకు పెళ్లి కుదిరింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. తండ్రి బంధువులకు పెళ్లి కార్డులు పంచడానికి వెళ్లాడు. బయటకు వెళ్లే ముందు ఇంట్లో తనకు నవ్వుతూ కనిపించిన కుమార్తె.. గంటల వ్యవధిలోనే రోడ్డు పక్కన శవంగా కనిపించడంతో ఆ తండ్రి గుండె పగిలింది. ఆయనను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాలేదు. ప్రేమించి.. పెళ్లాడబోతున్న వాడే ఈ గర్భశోకాన్ని మిగల్చడం విషాదకరం. హృదాయవిదారక సంఘటన ఉత్తరప్రదేశ్ బరేలీలో చోటు చేసుకుంది. ఆ వివారలు.. బరేలీకి చెందిన మదన్‌పాల్ సింగ్ కుమార్తె మీనాక్షికి జితన్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమయ్యింది. మరో విశేషం ఏంటంటే వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నెల 20న వివాహం.. మదన్‌పాల్ కుటుంబం ఆ పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పెళ్లి కార్డులు పంచడానికి బయలుదేరాడు మదన్‌పాల్. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వస్తుండగా.. మొరాదాబాద్ కుర్ద్వారా ప్రాంతంలో ఓ చోట రోడ్డు మీద జనం గుమికూడి ఉండటం గమనించాడు. ఏం జరిగిందో తెలుసుకుందామని అక్కడకు వెళ్లాడు. ఇక అక్కడ కనిపించిన దృశ్యం చూసి కుప్పకూలిపోయాడు మదన్‌పాల్. తల్లి మీనాక్షి అంటూ బిగ్గరగా ఏడ్వసాగాడు. ఉదయం ఇంటి నుంచి బయలుదేరేముందు చిరునవ్వుతో తనకు బాయ్ చెప్పిన కుమార్తె మధ్యాహ్నానికి శవంగా కనిపించడంతో ఆ తండ్రి పిచ్చివాడయ్యాడు. గుండలవిసేలా ఏడ్చాడు. మదన్పాల్ను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాలేదు. అసలేం జరిగింది... మదన్‌పాల్ ఇంటి నుంచి వెళ్లాక జితిన్ మీనాక్షికి కాల్ చేశాడు. షాపింగ్‌కు వెళ్దాం బయటకు రమ్మని కోరాడు. బయటకు వచ్చాక ఆమెను హత్య చేశాడు. కారణం ఏంటంటే అతడికి మీనాక్షిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దానిగురించి మాట్లాడటానికి మీనాక్షిని బయటకు పిలచాడు. ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు.. వివాహాన్ని ఆపాలని కోరాడు. అందుకు మీనాక్షి అంగీకరించకలేదు. దాంతో ఆగ్రహించిన జితిన్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి జితిన్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు -
10 రోజుల కష్టంతో తండ్రి శవం సాధించిన బాలుడు
లక్నో: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో విషాద.. అమానవీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా కథలు ఎన్ని చెప్పిన తక్కువే. తాజాగా ఓ ఆస్పత్రి అధికారులు కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అప్పగించకుండా పది రోజులుగా మార్చురీలోనే పడేశారు. మృతుడికి సంబంధించిన బంధువులు రాలేదంట.. వచ్చిన అతడి కుమారుడు మైనర్ బాలుడు కావడంతో అతడికి మృతదేహం అప్పగించడం కుదరదని అధికారులు చెప్పారు. దీంతో ఆ పిల్లాడు కాళ్లరిగేలా తండ్రి మృతదేహం తీవ్రంగా కష్టపడ్డాడు. చివరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కలగజేసుకోవడంతో ఎట్టకేలకు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఉన్న దీన్‌దయాల్ ఆస్పత్రికి రోజువారీ కూలీ రాజు ఏప్రిల్ 21వ తేదీన వచ్చాడు. ఆరోగ్యం విషమించడంతో ఏప్రిల్ 23వ తేదీన మృతి చెందాడు. దీంతో కొడుకు తన తండ్రి మృతదేహం అప్పగించాలని అధికారులను కోరాడు. అయితే పిల్లాడు మైనర్ కావడంతో అధికారులు శవం అప్పగించడానికి నిరాకరించారు. ఎవరైనా పెద్దవారిని తీసుకురా అని చెప్పాడు. అయితే ఆ బాలుడికి తండ్రి తప్ప నా అనేవారు ఎవరూ లేరు. బంధువులను బతిమిలాడాడు. అయితే కరోనా భయంతో మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వారు నిరాకరించారు. దీంతో పది రోజులుగా రాజు మృతదేహం ఆస్పత్రి మార్చురీలోనే ఉండిపోయింది. చివరకు స్థానికుడు మహేశ్ స్పందించి ఎమ్మెల్యే అనిల్ పరషార్, ఎమ్మెల్సీ మాన్వేంద్ర ప్రతాప్ సింగ్ సహాయంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని పది రోజుల అనంతరం బయటకు తీసుకువచ్చారు. అయితే తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు బాలుడి వద్ద డబ్బు కూడా లేకపోవడంతో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి అంత్యక్రియలను జరిపించారు. ఈ విధంగా తండ్రి మృతదేహం కోసం ఆ బాలుడు తీవ్రంగా కష్టపడి చివరకు అతికష్టమ్మీద తన తండ్రికి పున్నామ నరకం నుంచి తప్పించాడు. అయితే ఆస్పత్రి అధికారులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలుడి తండ్రి మృతదేహం అప్పగించడంలో నిబంధనల పేరిట ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే -
ఉన్మాదం: కరోనా రోగి మృతదేహాన్ని పీక్కుతిన్న వ్యక్తి
ముంబై: కరోనా వైరస్ బారినపడిన వ్యక్తితో సన్నిహితంగా ఉంటే వైరస్ సోకే అవకాశం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే కోవిడ్‌తో మరణించినవారి దగ్గరికి ఎవరూ వెళ్లటం లేదు. అదీకాక కోవిడ్ బారినపడిన వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా కలవడానికి జంకుతున్నారు. ఇటువంటి సమయంలో ఓ యువడుకు ఏకంగా కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పీక్కుతిన్నాడు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల కిందట ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఫల్టాన్ మున్సిపల్ పరిధిలోని ఓ శ్మశానవాటికలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత బుధవారం ఉదయం సతారా జిల్లాలోని కోలకి గ్రాయ పంచాయతీ శ్మశాన వాటికలో ఓ మతి స్థిమితం లేని యువకుడు కనిపించాడు. శ్మశాన వాటికలో తిరుగుతూ సగం కాలిన కరోనా మృతదేహం అవయవాలను తినడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఫల్టాన్ మున్సిపల్ అధికారులు అక్కడకు చేరుకునేసరికి సదరు వ్యక్తి పరారయ్యాడు. సాయంత్రం వరకు అధికారులు అతడిని వెతికి పట్టుకున్నారు. అతని ప్రవర్తనను బట్టి మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతడు హిందీ భాషలో మాట్లాడుతున్నాడని.. పేరు, ఊరు వివరాలు చెప్పడం లేదని అధికారులు పేర్కొన్నారు. ఆ యువకున్ని మానసిక వైద్యుడి వద్దకు చికిత్స కోసం తరలించామని తెలిపారు. అదేవిధంగా అతనికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు వచ్చిన అనంతరం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. చదవండి: తమిళనాడు: ఆక్సిజన్ అందక 11 మంది మృతి -
దారుణం: రూ.6.50 లక్షలు డబ్బు కట్టు.. శవాన్ని తీసుకెళ్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి శవాన్ని రూ.6.5 లక్షలు కడితేనే అప్పగిస్తామన్న ఆస్పత్రి యాజమాన్యం.. మూడురోజుల పాటు మృతదేహాన్ని ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన దారుణ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. హైదరాబాద్ నాగోలు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ సైనిక్‌పురికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి (41) కరోనా లక్షణాలతో ఈ నెల 17వ తేదీన నాగోలు ప్రధాన రహదారిపై ఉన్న ఒక ఆస్పత్రిలో చేరాడు. చేరే సమయంలో రూ.1.40 లక్షలు, ఆ తర్వాత పరీక్షలంటూ రూ.53,800, మందుల పేరిట అదనంగా వసూలు చేశారు. ఇంతజేసినా ఫలితం దక్కలేదు. ఈ నెల 25వ తేదీన అతను మరణించినట్లు కుటుంబసభ్యులకు ఆస్పత్రి యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్ళేందుకు రాగా, తమకు ఇంకా రావాల్సిన రూ.6.5 లక్షలు కడితే కానీ మృతదేహం అప్పగించబోమని తేల్చిచెప్పింది. తమ వద్ద ఇప్పుడు అంత డబ్బులు లేవని, మృతదేహాన్ని ఇస్తే రెండురోజుల్లో సర్దుబాటు చేస్తామని ఆ ఉద్యోగి కుటుంబసభ్యులు చెప్పారు. అయినా ఆస్పత్రి యాజమాన్యం వినిపించుకోలేదు. డబ్బులు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని స్పష్టం చేసింది. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు ఆస్పత్రి నుంచి వెళ్లిపోగా ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని బాక్సులో పెట్టి హాస్పిటల్ సెల్లార్లో ఉంచారు. డబ్బుల కోసం ప్రయత్నించినా.. తెలిసిన వారి దగ్గర డబ్బుల కోసం విఫల ప్రయత్నం చేసిన కుటుంబసభ్యులు మంగళవారం ఆస్పత్రి వద్దకు చేరుకుని తాము చేసిన ప్రయత్నాలు వివరించారు. మృతదేహాన్ని ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. ఆస్పత్రి యాజమాన్యం కనికరించకపోవడంతో బంధువులతో పాటు ఆందోళనకు దిగారు. ఎల్బీనగర్ పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న వారికి సర్ది చెప్పారు. హాస్పిటల్ నిర్వాహకులతో మాట్లాడి మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పచెప్పారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు హాస్పిటల్ వర్గాలు నిరాకరించాయి. మానవత్వం మరిచిపోయారు మృతదేహాన్ని మూడురోజులు ఆస్పత్రి సెల్లార్లో ఉంచిన యాజమాన్యం మానవత్వం మరిచి వ్యవహరించిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి యజమానిని కోల్పోయిన తాము, మృతదేహాన్ని ఇవ్వకపోవడంతో మరింత మనోవేదనకు గురయ్యామని వాపోయారు. రోగులను ఆదుకోవాల్సిన హాస్పిటల్ నిర్వాహకులు కేవలం డబ్బుల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఐసీయూలో పది మంది కరోనా పేషెంట్లకు ఒకే నర్స్ చికిత్స చేస్తోందని తెలిపారు. సరైన చికిత్స చేయకపోగా, రోగుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. చదవండి: పిట్టల్లా కాల్చేసిన గ్యాంగ్‌స్టర్: రెండు ప్రాణాలు బలి చదవండి: మదనపల్లె హత్య: నిందితులకు బెయిల్ -
దారుణం: అంబులెన్స్ నుంచి ఎగిరిపడిన కరోనా మృతదేహం
భోపాల్: కరోనా రెండో దశ సునామీలో ముంచుకొస్తుంది. నిత్యం మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నయి. అదే విధంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఓవైపు కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతుంటే.. మరోవైపు కోవిడ్ బాధితుల మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు సరైన స్థలం దొరక్కపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రతి చోట కరోనా మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. శవాలను మోసుకొచ్చి, శ్మశాన వాటికలు ఖాళీగా లేకపోవడంతో తమ వంతుకోసం అంబులెన్సులు వరసగా నిలుచుంటున్నాయి. తాజాగా కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. విదిషా జిల్లాలో ఓ ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తరలిస్తున్న అంబులెన్స్ నుంచి ఓ కరోనా మృతదేహం కిందపడిపోయింది. ఈ సంఘటన శుక్రవారం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్ అధిక వేగంతో వాహనాన్ని మలుపు తిప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ గేట్ ఒకటి విరిగింది. దీంతో మృతదేహం ఎగిరి రోడ్డుపై పడింది. దీన్ని గమనించిన కోవిడ్ -19 రోగుల బంధువులు ఆసుపత్రి బయటకి వచ్చి హాస్పిటల్ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. అంతేగాక ఆసుపత్రి యాజమాన్యం తమ కుంటుంబీకుల మృతదేహాలను సకాలంలో అప్పగించడం లేదని కొంతమది ఆరోపించారు. అంతేగాక అసలు మరణ వార్త గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పడం లేదని విమర్శస్తున్నారు. ఇక ఇటీవల విధిశా జిల్లాలో కోవిడ్ మరణాలు అధికమయ్యాయి. ప్రతిరోజూ సుమారు 20 నుంచి 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలూ ఉన్నాయి. చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు! -
అంబులెన్స్ నుంచి ఎగిరి పడిన డెడ్ బాడీ
-
కొడుకు శవం కోసం 8 నెలలుగా తవ్వకాలు..
శ్రీనగర్: ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులను వదిలించుకునే సంతానం కోకొల్లలు.. బిడ్డలను వదిలేసే తల్లిదండ్రులు మాత్రం ఇంకా తయారు కాలేదు. తమ చివరి క్షణం వరకు బిడ్డల బాగోగుల గురించే ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఈ క్రమంలో హత్యకు గురైన తన కొడుకు మృతదేహం కోసం ఓ తండ్రి గత ఎనిమిది నెలలుగా ప్రతి రోజు తవ్వకాలు జరుపుతూ గాలిస్తూనే ఉన్నాడు. ఈ తండ్రి కన్నీటి వ్యథ ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆ వివరాలు.. షకీర్ మంజూర్(25) అనే వ్యక్తి ప్రాదేశిక సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టు 2న అతడిని కొందరు ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారం రోజులకు రక్తంలో తడిసిన షకీర్ దుస్తులు లభించాయి. దాంతో అతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు నిర్థరాణకు వచ్చారు. బిడ్డను పొగొట్టుకున్నారు.. కనీసం తనని కడసారిగా చూసుకుని.. ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలి అని షకీర్ తల్లిదండ్రులు భావించారు. కానీ నేటికి కూడా అతడి మృతదేహం వారికి లభించలేదు. ఈ సందర్భంగా షకీర్ తండ్రి మంజూర్ అహ్మద్ వాగే మాట్లాడుతూ.. ‘‘ఆగస్ట్ 2న ఈద్ సందర్భంగా నా కుమారుడు మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంటకు మాకు కాల్ చేశాడు. ‘‘నేను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాను. నా గురించి ఆర్మీ అధికారులు అడిగితే ఏం చెప్పకండి’’ అన్నాడు. అదే తన చివరి కాల్. అప్పటికే తను కిడ్నాప్ అయ్యాడని.. ఉగ్రవాదులే తనతో అలా మాట్లాడించారని ఆ తర్వాత మాకు అర్థం అయ్యింది’’ అన్నాడు వాగే. ‘‘మరుసటి రోజు షకీర్ వాడే వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. వారం రోజుల తర్వాత మాకు మా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాధురా ప్రాంతంలో రక్తంలో తడిసిన తన దుస్తులు లభించాయి. తన మృతదేహం కోసం వెదికాం.. కానీ దొరకలేదు. ఈ క్రమంలో ఓ రోజు మా బంధువుల అమ్మాయి రాత్రి తన కలలో షకీర్ కనిపించాడని.. అతడి బట్టలు దొరికన చోటే తనని పాతి పెట్టారని.. వెలికి తీయాల్సిందిగా కోరినట్లు మాకు తెలిపింది. దాంతో మరి కొందరితో కలిసి నేను ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాను. కానీ ఫలితం శూన్యం’’ అన్నాడు వాగే. ‘‘అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ఇలా తవ్వకాలు జరుపుతూనే ఉన్నాను. ఏదో ఓ రోజు షకీర్ మృతదేహం దొరుకుతుందనే ఆశతో జీవిస్తున్నాను. ఈ విషయంలో గ్రామస్తులు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఎందుకంటే వారందరికి తనంటే ఎంతో ప్రేమ. ఇక నా కొడుకును కిడ్నాప్ చేసిన నలుగురు ఉగ్రవాదులు ఎవరో కూడా నాకు తెలుసు. కొన్ని రోజుల క్రితం వారిలో ఒక వ్యక్తి ఇక్కడి అధికారుల నుంచి ఏకే47 రైఫిల్స్ ఎత్తుకెళ్లి చిన్నపాటి గ్రూపును రన్ చేస్తున్నాడు. నా కుమారిడి శవాన్ని అప్పగించాల్సిందిగా మేం అన్ని మిలిటెంట్ సంస్థలను సంప్రదించాం. కానీ వారు తమకు ఏం తెలియదన్నారు’’ అన్నాడు వాగే. పోలీసు రికార్డుల్లో కిడ్నాప్‌గానే నమోదు... పోలీసు రికార్డుల్లో షకీర్ కిడ్నాప్ అయినట్లు నమోదు చేశారు. మరణించినట్లు ధ్రువీకరించలేదు. ఇక షకీర్‌ని ఎక్కడ సమాధి చేశారనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. స్థానిక పోలీసులు షకీర్ మృతదేహాం కోసం తీవ్రంగా గాలించారు. కానీ లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా వాగే ‘‘చెట్టంత ఎదిగిన కొడుకును దూరం చేసుకున్నాను. కడసారి చూపుకు నోచుకోలేదు.. తనకు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కూడా లేకపోయింది. పగ వాడికి కూడా ఇలాంటి పరిస్థితి వద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అతడి మాటలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఇక 2020 నుంచి ఉన్నతాధికారులు మిలిటెంట్ల దాడిలో మరణించిన సైనికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. కరోనా వల్లనే ఇలా చేయాల్సి వచ్చింది అంటున్నారు అధికారులు. అధికారులపై వాగే ఆగ్రహం.. తన కొడుకును అమరవీరుడిగా ప్రకటించకపోవడం పట్ల వాగే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. "నా బిడ్డ ఒక సైనికుడు, భారతదేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు. అధికారులు మొదట తన ప్రాణాలను కాపాడడంలో విఫలమయ్యారు. తరువాత అతని మృతదేహాన్ని కనుగొనడంలో విఫలమయ్యారు. అతన్ని అమరవీరుడిగా ప్రకటించాలని ప్రభుత్వానికి నా విజ్ఞప్తి. నా కొడుకును కిడ్నాప్ చేసి చంపారు. నా బిడ్డ వారి చేతిలో చిత్ర హింసలు భరించాడు.. కాని దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అలాంటి వ్యక్తిని అమరవీరుడిగా ప్రకటించకపోవడం నాకు మరింత ఆగ్రహం తెప్పిస్తుంది’’ అన్నాడు. కశ్మీర్లో, గత మూడు దశాబ్దాలలో సుమారు 8,000 మంది తప్పిపోయారు. వారిని భద్రతా దళాలు తీసుకుని వెళ్లారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. అయితే ఒక సైనికుడు అదృశ్యం కావడం మాత్రం ఇదే ప్రథమం. చదవండి: నర్సింగ్ విద్యార్థిని కిడ్నాప్: రూ. 2 కోట్లిస్తే వదిలేస్తాం అజిత్ దోవల్ నివాసం వద్ద ఉగ్రవాదుల రెక్కీ -
మృతదేహాన్ని 3 కి.మీ మోసుకొచ్చిన పోలీసులు
రాంబిల్లి: కుళ్లి పోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల దూరం మోసి విశాఖ జిల్లా రాంబిల్లి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. సీతపాలెం తీరానికి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కొట్టుకొచి్చంది. ఎస్ఐ అరుణ్‌కిరణ్ కేసు నమోదు చేసి పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే శనివారం దాకా మృతదేహం కోసం ఎవరూ రాలేదు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. మృతదేహం తరలింపునకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్ఐ వి.అరుణ్‌కిరణ్ స్పందించారు. ఏఎస్ఐ దొర, హెచ్‌సీ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డు కొండబాబు కర్రల సాయంతో తీరం నుంచి మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాహనంలో యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు చూపిన మానవత్వాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. డీజీపీ అభినందనలు: పోలీసుశాఖ ప్రతిష్టను దేశవ్యాప్తంగా చాటుతున్న సిబ్బందికి సలాం చేస్తున్నానని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. సమాజ సేవలోనూ ముందుంటామని చాటిన రాంబిల్లి పోలీసులను అభినందించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని మూడు కిలోమీటర్ల మేర భుజాలపై మోసి రాంబిల్లి పోలీసులు మానవత్వం చాటారు అని చెప్పారు. రాంబిల్లి పోలీసులకు యావత్ భారతం ప్రశంసలతో ముంచెత్తుతోందని తెలిపారు. అదే విధంగా రాంబిల్లి ఎస్ఐ, సిబ్బందికి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. చదవండి: చిట్టితల్లికి కష్టమొచ్చింది -
భర్త మృతదేహం కోసం న్యాయపోరాటం
మోర్తాడ్(బాల్కొండ): తెలంగాణలోని గల్ఫ్ ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఓ మహిళకు అండగా నిలబడింది. ఫోరం కార్యకర్తల చొరవతో సౌదీ అరేబియాలో పూడ్చిపెట్టిన తన భర్త మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించాలని అంజూశర్మ అనే మహిళ న్యాయపోరాటం చేపట్టింది. వివరాలిలా ఉన్నాయి.. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన సంజీవ్‌కుమార్ (49) 23 సంవత్సరాల నుంచి సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అయితే గుండెపోటు రావడంతో ఆయన జనవరి 24న సౌదీలోని భీష్ జనరల్ ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ విషయాన్ని సంజీవ్‌కుమార్ పనిచేస్తున్న కంపెనీ ప్రతినిధులు అతని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, తన భర్త మృతదేహాన్ని ఇంటికి పంపించాలని అంజూశర్మ వేడుకుంది. అయితే జెద్దాలోని భారత కాన్సులేట్ కార్యాలయంలోని ట్రాన్స్‌లేటర్ చేసిన తప్పిదం వల్ల సంజీవ్‌కుమార్‌ను ముస్లింగా భావించి ఆ మత సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 18న పూడ్చిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని సంజీవ్‌కుమార్ భార్య అంజూశర్మకు జెద్దాలోని మన విదేశాంగ శాఖ కార్యాలయం తెలియజేసింది. అంతేకాక తమ ట్రాన్స్‌లేటర్ పొరపాటుకు విదేశాంగ శాఖ అధికారులు క్షమాపణలు కోరారు. సంజీవ్‌కుమార్ అంత్యక్రియలు పూర్తయ్యాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా సంజీవ్‌కుమార్‌కు సన్నిహితుడైన నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్‌కు చెందిన ఎనుగందుల గణేశ్ ఈ విషయాన్ని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం చైర్మన్ మంద భీంరెడ్డికి వివరించారు. దీనికి స్పందించిన భీంరెడ్డి, అంజూశర్మను సంప్రదించారు. ఆమె తన భర్త మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని భీంరెడ్డిని వేడుకుంది. ఈ క్రమంలో భీంరెడ్డి చొరవతో ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఎలా అంత్యక్రియలను నిర్వహిస్తారని ప్రశ్నించిన ప్రధాన న్యాయమూర్తి, గురువారం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని విదేశాంగ శాఖ అధికారులకు నోటీసులు జారీ చేశారు. అలాగే జెద్దాలోని మన విదేశాంగ శాఖకు కూడా నోటీసులు పంపించారు. ఈ విషయంలో ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం చొరవను కార్మిక సంఘాలు అభినందిస్తున్నాయి. -
మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్లిన మహిళా ఎస్సై
సాక్షి, శ్రీకాకుళం: ‘దైవం మనుష్య రూపేణా’.. అనే నానుడిని ఓ మహిళ పోలీస్ అధికారిణి అక్షరాలా రుజువు చేసింది. ముక్కు, ముఖం తెలియని ఓ మృతదేహాన్ని తన భుజాల మీద మోసి పలువురికి ఆదర్శంగా నిలిచింది. పోలీసు అధికారిణి చేసిన పని.. ఏ ఆపద వచ్చినా పోలీసులు ముందుంటారనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆవిష్కృతమైంది. వివరాలు.. పలాసలోని కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైంది. అయితే మృతదేహాన్ని మోసేందుకు స్థానికులు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న కాశీబుగ్గ మహిళా ఎస్సై శిరీష.. తానే స్వయంగా మృతదేహాన్ని మోసుకుని లలితా చారిటబుల్ ట్రస్ట్‌కు ఆప్పజెప్పారు. కాగా శిరీషా చూపిన తెగువను పోలీసు అధికారులు అభినందిస్తున్నారు. చదవండి: మా మంచి సారు.. నరేంద్ర..! -
తండ్రి మృతదేహాన్ని బైక్‌పై తరలించిన కుమారులు
పర్లాకిమిడి: ఖొజురిపద ప్రభుత్వ ఆస్పత్రిలో 65 ఏళ్ల వృద్ధుడు శుక్రవారం చనిపోయాడు. అయితే ఈ వ్యక్తి మృతదేహం తరలించేందుకు ఆ ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మృతుడి కొడుకులిద్దరూ మోటార్‌బైక్‌పై తమ గ్రామానికి తమ తండ్రి మృతదేహం తీసుకువెళ్లి, అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తం కాగా అన్ని ఆస్పత్రులకు మహా ప్రయాణం వాహనం ఇచ్చామని అయితే ఇక్కడ అటువంటి వాహనం లేకపోవడం విచారకరమని జిల్లా ముఖ్య వైద్యాధికారి ప్రదీప్‌కుమార్ పాత్రో తెలిపారు. తమ తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆస్పత్రి వర్గాలు చోద్యం చూశాయని బాధిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాగుకోసం, ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని డబ్బా కొట్టుకునే నాయకులు, ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలన సాగించాలని హితవు పలికారు. (చదవండి: పంటపొలాల్లో శవమై కనిపించిన బాలిక) -
కోడలిపై అనుమానం.. స్నేహితులతో కలిసి
ముంబై: ముంబైలోని అక్షా బీచ్‌లో గోనె సంచిలో వారం రోజుల క్రితం ఓ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. గోనె సంచిలోని మృతదేహం ఈస్ట్ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందినిగా గుర్తించిన పోలీసులు మిస్టరీ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నందిని మామగా పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ కాందివ్లీకి చెందిన పంకజ్‌ని మూడు సంవత్సరాల క్రితం నందిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పంకజ్ వాళ్ల తండ్రి కమల్ రాజ్‌కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేగాక ఆమె క్యారెక్టర్‌పై అనుమానం పెంచుకున్నాడు. చదవండి: గోనె సంచిలో మహిళ శవం.. ఎవరిదో తెలిసింది ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పని నిమిత్తం పంకజ్ వేరే ఊరికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మామ కమల్ రాజ్ కోడలిని ఎలా అయినా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. దీంతో డిసెంబర్ 9న కమల్.. ఇద్దరు స్నేహితులతో కలసి నందిని నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతులు కాళ్లు కట్టేసి దిండుతో నొక్కి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ప్యాక్ చేసి దానిని కండివిల్లి ప్రాంతంలోని నాలాలో విసిరేశారు. డిసెంబర్ 24న మృతదేహం కలిగిన గోనె సంచి ఆక్షా బీచ్‌కు చేరుకుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసులో మామతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
శవాన్ని బూటుకాళ్లతో తొక్కిన పోలీస్
బయ్యారం : ప్రాణం పోయి విగతజీవిగా పడి ఉన్న యువకుడి శవాన్ని ఓ పోలీస్ తన బూటుకాళ్లతో తొక్కిన అమానవీయ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకుంది. బయ్యారం బస్టాండ్ సెంటర్లో ప్రమాదవశాత్తు గోడకూలి రోహిత్ అనే యువకుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు కానిస్టేబుల్ ఏకంగా బూటుకాళ్లను వినియోగించటం స్థానికంగా విస్మయానికి గురి చేసింది. యువకుడి అకాల మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విలపిస్తుంటే కనీసం జాలి లేకుండా ఆ కానిస్టేబుల్ చేసిన చర్యను చూసి అందరూ ఆవేదన చెందారు. -
మరికాసేపట్లో బేగంపేటకు మహేష్ పార్థివ దేహం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రమూకల కాల్పుల్లో అమరుడైన షహీద్ మహేష్ పార్థివ దేహం మరికాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొనుంది. మహేష్ పార్థివ దేహాన్ని స్వస్థలమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి తరలిచించేందుకు మంగళవారం ఆర్మీ అధికారులు ప్రత్యేక అంబులెన్స్ సిద్దం చేశారు. ఈ సందర్భంగా మహేష్ సోదరుడు మల్లేష్, మామయ్య జీటీ నాయుడు మీడియాతో మాట్లాడారు. మహేష్ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తోందన్నారు. అనునిత్యం దేశ సేవకై పరితపించే మహేష్ భరతమాత కోసం ప్రాణత్యాగం చేసినందుకు గర్వపడుతున్నామన్నారు. ప్రతీ ఒక్క యువకుడు కూడా ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని చెబుతూ యువకులకు ఆదర్శంగా నిలిచేవాడని పేర్కొన్నారు. (చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం) ఏడాది క్రితమే మహేష్ వివాహం జరిగిందని అంతలోనే మహేష్ మృతి తమ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జమ్మూ కశ్మీర్లో మచిల్ సెక్టార్లో ఆదివారం రోజున ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లోవీరమరణం పొందిన ముగ్గురిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష మృతి వార్త తెలియగానే మహేష్ కటుంబ సభ్యులు, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
2 నెలలకు మృతదేహానికి పోస్టుమార్టం
కొండగావ్: సామూహిక అత్యాచారానికి గురై రెండు నెలల క్రితం ఆత్మహత్మకు పాల్పడిన ఓ యువతి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడంతో మృతురాలి తండ్రి (మంగళవారం) ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు యువతి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. వివరాల్లో వెళితే.. కొండగావ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువతి జులైలో ఓ వివాహవేడుకు నిమిత్తం బంధువులు ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను ఇద్దరు వ్యక్తులు సమీపంలోని అటవీ ప్రాంతంలోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు ఇంటికి వెళ్లిన బాధితురాలు ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలో ఖననం చేశారు. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసుల తీరుపై మనస్తాపంతో యువతి తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. కాగా ఈ సంఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేసి, అయిదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. (చదవండి: కట్టుకథ; ఆడియో రికార్డులు బయటపెట్టండి!) -
కరోనా: బాధితుడి మృతదేహం తారుమారు
-
కరోనా బాధితుడి మృతదేహం తారుమారు
సాక్షి, నిజామాబాద్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కరోనాతో మృతి చెందిన బాధితుని మృతదేహం తారుమారు కావడంతో నిజామబాద్ జిల్లాలో కలకలం రేగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి బదులు మరో మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆసుపత్రి నిర్వాకంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన అంకం హనుమంతు(58) కరోనా బారిన పడి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. (చదవండి: అలర్ట్ : హైదరాబాద్‌లో కుండపోత వర్షం) అంత్యక్రియల కోసం మృతదేహాన్ని ఆయన స్వ గ్రామానికి ఆస్పత్రి సిబ్బంది తీసుకొచ్చారు. అంతిమ సంస్కారానికి కొన్ని క్షణాల ముందు మృతదేహాలు తారుమారు అయినట్లు ఆసుపత్రి వర్గాలు గుర్తించడంతో.. వెంటనే అంత్యక్రియలు నిలిపివేయాలని అంబులెన్స్ డ్రైవర్‌కు సమాచారం అందించారు. దీంతో అంత్యక్రియలు నిలిచిపోవడంతో అయోమయానికి గురైన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమంతు మృతదేహాన్ని తీసుకొచ్చి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లాలని బంధువుల పట్టు బట్టారు. -
11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఘోరంగా కుళ్లిపోయి, దయనీయ స్థితిలో మృతదేహం పడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మహారాజా యశ్వంతరావు ఆసుపత్రి మార్చురీలోని స్ట్రెచర్ మీద దాదాపు అస్థిపంజరంలా మారిన డెడ్ బాడీ అక్కడి వారిని షాక్ కు గురిచేసింది. వివరాలను పరిశీలిస్తే..గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గత 11 రోజులుగా అక్కడ పడి ఉంది. కుళ్లి కంపుకొడుతున్నాసిబ్బంది పట్టించుకోలేదు. చివరికి అస్థిపంజరంలా మారి భయం గొల్పుతూ ఉండటంతో ఆసుపత్రిలోని ఇతరులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంచిన ఫోటో వైరల్ అయింది. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఏదైనా ఎన్జీవో, లేదా ఇండోర్‌కు చెందిన పౌర సంస్థ కోసం వస్తుందని ఎదురుచూస్తున్నామని అందుకే అలా స్ట్రెచర్ మీదే ఉంచినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని, బాధ్యులైన వారికి నోటీసులు ఇవ్వనున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీఎస్ ఠాకూర్ తెలిపారు. రోజూ సుమారు 16-17మృతదేహాలు వస్తాయనీ, జిల్లాలో కరోనాతో ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. దీంతో మార్చురీపై భారం పెరిగిందనీ, ఫ్రీజర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న ఇప్పటికే కోరామని ఆయన చెప్పారు. కాగా ఒకదానికి బదులుగా మరో మృతదేహాన్ని అప్పగించిన వైనం ఇటీవల కలకలం రేపింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యంతో తమ కుమారుడి బదులుగా వేరే బాడీని అప్పగించిందంటూ ఆ కుటుంబం ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది. -
శ్మశానానికి తీసుకెళ్లగానే శ్వాస పీల్చింది!
వాషింగ్టన్ : అమెరికాలోని డెట్రాయిట్లో ఓ వింత ఘటన జరిగింది. చనిపోయిందనుకున్న 20 ఏళ్ల మహిళ.. శ్మశానవాటికలో శ్వాస పీలుస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మహిళ మరణించినట్లు పారామెడిక్స్ తేల్చడంతో.. ఆమెను డెట్రాయిట్‌లోని జేమ్స్ కోల్ శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. అయితే అక్కడ అంత్యక్రియల ప్రక్రియ నిర్వహించే సమయంలో ఆ మహిళ శ్వాస పీల్చుతున్నట్లు గుర్తించారు. దీంతో మళ్లీ ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆ మహిళ పేరును మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఆసుపత్రి సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఆమె పల్స్‌రేటు బాగుందని, ఆక్సిజన్ లెవల్స్ కూడా బాగానే ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. (చదవండి : బాక్స్ ఓపెన్ చేస్తే.. అనుకోని అతిథి) అసలు విషయానికి వస్తే... గత ఆదివారం గుర్తు తెలియని మహిళ పారామెడిక్స్‌కు ఫోన్ చేసి ఒక ఇంట్లో మహిళ అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిపింది. మహిళ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పారామెడిక్స్ 20 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. దాదాపు 30 నిమిషాల పాటు సీపీఆర్, ఇతర ప్రక్రియలను నిర్వహించారు. శ్వాస ఆడకపోవడం, గత హెల్త్ రిపోర్ట్‌ల ఆధారంగా వారు ఆమె మరణించినట్లు నిర్ణయానికి వచ్చారు. అయితే జేమ్స్ కోల్ శ్మశానవాటికకు మహిళను తీసుకువెళ్లిన తర్వాత.. అక్కడ ఎంబాల్మింగ్ చేసే సమయంలో ఆమె శ్వాస ఆడుతున్నట్లు గుర్తించారు. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) -
రోజంతా అంబులెన్స్‌లోనే మృతదేహం
భామిని: కరోనా అనుమానిత లక్షణాలతో బత్తిలి గ్రామానికి చెందిన వ్యక్తి(39) శుక్రవారం మృతి చెందడంతో రోజంతా హైడ్రామా నెలకొంది. అంత్యక్రియలకు గ్రామస్తులు అడ్డుకోవడంతో అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని ఉంచి రోజంతా తిప్పాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గ్రామంలోని నాలుగు శ్మశానవాటికలకు తీసుకెళ్లినా అడ్డుకున్నారు. అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఎంపీడీవో నిమ్మల మాసన్, తహసీల్దార్ బోడిసింగి సురేష్, కార్యదర్శి ఆర్ఎన్ భట్టు, అశోక్‌సాహూ గ్రామస్తులను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. చివరికి మృతుడి వ్యవసాయ పొలంలోనే ఖననం చేయాల్సి వచ్చింది. శుక్రవారం వేకువజామున తీవ్ర అస్వస్థతకు గురైన అతడిని కొత్తూరు సీహెచ్‌ఎన్‌సీకి తరలించగా వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. ఉన్నతాధికారులు అనుమతితో మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా గుర్తించారు. కొద్ది రోజులుగా టైఫాయిడ్‌తో బాధపడుతూ ప్రైవేటు వైద్యం పొందుతుండగా కరోనా సోకినట్లు భావిస్తున్నారు. మృతుడి అక్కాబావ రెడ్‌జోన్ నుంచి వచ్చి బాధితుడిని కలవడం వల్ల వారికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
ఇంట్లోనే 16 గంటల పాటు మృతదేహం
‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు’ సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై ఓ రచయిత వేదన.. ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందినట్లు భావించి శవాన్ని దహన సంస్కారాలు చేసేందుకు బంధువులు కూడా ముందుకురాని ఘటన నాగాయలంకలో గురువారం చోటుచేసుకుంది. నాగాయలంక(అవనిగడ్డ): నాగాయలంకలో తొలి కరోనా మృతి గురువారం ఉదయం సంభవించింది. స్థానిక వెలుగు కార్యాలయం సమీపంలో కరకట్ట వద్ద నివాసం ఉండే 42 ఏళ్ళ యువకుడు గురువారం తెల్లవారు జామున మృతి చెందాడు. కరోనాతో మృతి చెంది ఉంటాడనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఎవరూ మృతదేహం వద్దకు రాలేదు. తెల్లవారుజామున 2గంటల సమయంలో మరణించి ఉంటాడని భావిస్తున్నారు. వస్త్ర దుకాణాలకు ఇతర ప్రాంతాల నుంచి సరుకు తీసుకొస్తుంటాడు. వస్త్ర దుకాణాలలో పనిచేసే వారికి చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు మూడు రోజుల కిందట నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు. కాని ఇంత వరకు నివేదిక రాలేదని బంధువులు చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నడని తెలిసిన వెంటనే అద్దె ఇంటి యజమాని ఖాళీ చేయించాడు. దీంతో కట్ట మీద అతడి తల్లి నివసించే ఇంట్లో అతడితో పాటు భార్య, కుమార్తె కలసి ఉంటున్నారు. తెల్లవారుజామున చనిపోవడంతో బంధువులు అటువైపు రాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ఘటనా ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. (మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు) విజయవాడ నుంచి ప్రత్యేక సిబ్బంది రాకతో.. ఎమ్మెల్యే బంధువులకు నచ్చజెప్పినా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విజయవాడ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. అక్కడ నుంచి ఇద్దరు సిబ్బందితో పాటు సామాజిక కార్యకర్తలు తలశిల రఘుశేఖర్, కనిగంటి వెంకట నారాయణ, ఎస్ఐ చల్లా కృష్ణ, డీటీ బీ సుబ్బారావు ప్రత్యేక పీపీటీ దుస్తులతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి వాహనంలో శ్మశాన వాటికకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా భయం వలన చనిపోయిన వ్యక్తిని 16 గంటల పాటు ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక దృశ్యం పలువురిని కలచి వేసింది. ఎమ్మెల్యే చొరవతో ఎట్టకేలకు గురువారం సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మృతుడి భార్యకు ర్యాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్‌గా వచ్చింది. ఘటనతో పరిసర ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్ చల్లించారు. తహసీల్దార్ విమలకుమారి, అవనిగడ్డ సీఐ బి.భీమేశ్వర రవికుమార్, డాక్టర్ జయసుధ, ఈఓపీఆర్డీ శైలజాకుమారి ఉన్నారు. -
మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు
అల్లిపురం (విశాఖ దక్షిణం): ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’.. అన్నాడు కవి అందెశ్రీ. కరోనా సోకి కుప్పకూలిన ఓ వృద్ధుడి శవాన్ని నడిరోడ్డుపై నాలుగ్గంటల పాటు ఎవరూ పట్టించుకోని అమానవీయ సంఘటన ఈ గీతాన్ని గుర్తుకు తెస్తోంది. అల్లిపురంలో యల్లపువారి వీధికి చెందిన వృద్ధునికి (75) కరోనా పాజిటివ్ అని బుధవారం నిర్థారణయింది. ఆయనను క్వారంటైన్‌కు తీసుకెళ్లేందుకు గురువారం సాయంత్రం 3.30 గంటలకు అంబులెన్స్ నేరెళ్ళకోనేరు జంక్షన్‌కు చేరుకుంది. అంబులెన్స్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న వృద్ధుడు నడిచే శక్తిలేక దారిలో కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో చుట్టుపక్కల వారు ఎవరూ అతని దగ్గరకు చేరలేదు. మృతునికి కుమార్తె, కోడలు, మనుమలు, మనుమరాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం వృద్ధుడు ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. మృతదేహం నాలుగు గంటల పాటు నడిరోడ్డుపైనే ఉన్నా ఎవరూ స్పందించలేదు. ఎట్టకేలకు రాత్రి 7.30 గంటల సమయంలో స్థానిక సామాజికవేత్త యల్లపు శ్రీనివాసరావు చొరవతో కేజీహెచ్ నుంచి మహాప్రస్థానం అంబులెన్స్ అక్కడికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
గాంధీ ఆసుపత్రిలో దారుణం..కరోనా వార్డులో
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకి మంగళవారం ఉదయం శ్రీనివాస్ అనే రోగి చనిపోయాడు. అయితే 8 గంటలు కావస్తున్నా సిబ్బంది పట్టించుకోకపోవడంతో మృతదేహం బెడ్‌మీదే పడి ఉంది. తీవ్ర దుర్వాసనతో కరోనా వార్డు కంపు కొడుతుండటంతో మిగతా కరోనా రోగులు వార్డు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనేకసార్లు అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఒక్క రోజు సమ్మె చేపట్టడంతో మృతదేహాన్ని తరలించే నాదులే కరువయ్యారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ పరిశుబ్రంగా ఉంచాల్సిన కరోనా వార్డు కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోని వైనం మరోసారి గాంధీ నిర్లక్ష్యానికి దర్శనమిస్తోంది. -
పాడె మోసేందుకూ ముందుకు రాలేదు
సాక్షి, శాలిగౌరారం: ‘కరోనా’అనుమానం మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని మంటగలిపింది. అనారోగ్యంతో మృతిచెందిన ఓ వ్యక్తి దహన సంస్కారాలకు ఒక్కరూ ముందుకు రాలేదు. పాడె మోసేందుకు కూడా బంధువులు ముందుకు రాకపోవడంతో.. ఎడ్లబండే ఆ కుటుంబానికి ఆధారంగా మారింది. అయితే ఆ బండిని లాగేందుకు ఎడ్లు కూడా లేకపోవడంతో మృతుడి ఇద్దరు బావలే ఎడ్లుగా మారారు.. తమ్ముడు వెనకాల ఎడ్లబండిని నెట్టాడు. హృదయ విదారక పరిస్థితుల్లో వారు దహన సంస్కారాలు నిర్వహించారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని ఆకారం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచి్చంది. వివరాలిలా ఉన్నాయి.. ఆకారం గ్రామానికి చెందిన మర్రిపల్లి నర్సయ్య, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు జానయ్య (32) కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురైన జానయ్యను ‘కరోనా’అనుమానంతో ఈనెల 9న నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. జానయ్య నుంచి నమూనాలను సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. 10న రాత్రి జానయ్య మృతి చెందాడు. వైద్య పరీక్షల నివేదికలు రానప్పటికీ మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చి ఆస్పత్రి వైద్య సిబ్బంది జానయ్య మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయతి్నంచగా కరోనా అనుమానంతో బంధువులు, గ్రామస్తులు దహన సంస్కారాలకు వచ్చేందుకు నిరాకరించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో మృతుడి కుటుంబీకులే మృతదేహన్ని ఖననం చేసేందుకు గుంత తీసుకున్నారు. ఎడ్లబండిపై జానయ్య మృతదేహాన్ని పెట్టుకుని వెళ్లి అంతిమ సంస్కారం నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎడ్లబండికి మృతుడి ఇద్దరు బావలే ఎడ్లుగా మారగా తమ్ముడు బండిని వెనకనుంచి నెట్టుతూ తీసుకెళ్లారు. చివరకు మృతుని పొలం వద్ద అంత్యక్రియలను పూర్తిచేశారు. -
నిర్లక్ష్యంపై బిగుసుకుంటున్న ఉచ్చు!
సాక్షి, నిజామాబాద్: జిల్లా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉచ్చు బిగుసుకుంటోంది. కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆటోలో తరలించిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. నిజామబాద్ ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే నలుగురు వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్యశాఖ తాజాగా మార్చురీ సిబ్బందికి మెమోలు జారీ చేసింది. కాగా, కోవిడ్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఆటోలో తరలించిన దారుణ ఘటన నిజామాబాద్‌లో శనివారం చోటు చేసుకుంది. నిబంధనలు ప్రకారం కరోనా వైరస్ ద్వారా మృతిచెందిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్ లేదా ఎస్కార్ట్ వాహనంలో సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి జాగ్రత్తగా తరలించాల్సి ఉంటుంది. ఇక ఆటో డ్రైవర్‌తో పాటు అందులులో ఉన్న మరో వ్యక్తి కూడా ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకేసారి ముగ్గురు కరోనా రోగులు మరణించడంతో ఒక్కటే అంబులెన్స్ అందుబాటులో ఉందని, అందువల్ల ఆటోలో తరలించామని ప్రభుత్వాసుపత్రి వర్గాలు తమ చర్యను సమర్థించుకున్నాయి. (కరోనా రోగి పట్ల అమానుష ప్రవర్తన) -
దారుణం: ఆటోలో కరోనా రోగి మృతదేహం
-
మృతదేహం మీరే ఉంచుకోండి
రాంగోపాల్‌పేట్: కరోనాతో సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ యువకుడు మరణించాడు. చికిత్సకు సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం రూ.11.50 లక్షల బిల్లు వేసింది. ఇంకా తమకు చెల్లించాల్సిన రూ.5 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ఒకానొక సమయంలో మృతదేహం అప్పగించకపోతే అంత్యక్రియలు మీరే చేసుకోండని బాధితులు కరాఖండీగా చెప్పడంతో ఆస్పత్రి వర్గాలు దిగి వచ్చాయి. యాదగిరిగుట్టకు చెందిన నవీన్‌కుమార్ (28) అనారోగ్యంతో గత నెల 23వ తేదీన సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాడు. ఆస్పత్రి వర్గాలు 24వ తేదీన కరోనా పరీక్షలు చేయగా అతనికి నెగెటివ్‌గా వచ్చింది. 26వ తేదీ మరోమారు చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. అయితే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం నవీన్‌కుమార్ మరణించాడు. అప్పటికే కుటుంబ సభ్యులు రూ.6.50 లక్షల రూపాయలు చెల్లించగా, మరో రూ.5 లక్షల పెండింగ్ బిల్లు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. ఊర్లో ఉన్న పొలం అమ్మి డబ్బు చెల్లించామని, ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వకూడా లేదని బాధితులు చెప్పారు. డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించేది లేదని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో మృతదేహం మీరే ఉంచుకోండని బాధితులు ఆస్పత్రి వర్గాలతో చెప్పడంతో మరో రూ.20 వేలు కట్టించుకుని మృతదేహాన్ని పంపించారు. ఎర్రగడ్డలోని స్మశాన వాటికలో అధికారుల పర్యవేక్షణలో మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు. బ్రతికున్నాడో లేదో చెప్పడం లేదు రూ.15 లక్షల బిల్లు వేశారు: బంధువుల ఆరోపణ కాగా, మరో కేసులోనూ ప్రైవేట్ ఆసుపత్రి దారుణం వెలుగుచూసింది. సికింద్రాబాద్ గాస్మండికి చెందిన 55 సంవత్సరాల వ్యక్తి మోండా మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా లక్షణాలతో ప్యారడైజ్ ప్రాంతంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో గత నెల 13వ తేదీన చేరాడు. అతనికి చేసిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ రాగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆ రోజు నుంచి నేటివరకు రూ.13 లక్షల బిల్లు కాగా ఇన్సూరెన్స్, నగదు కలిపి రూ.5 లక్షలు చెల్లించారు. అయితే ఆస్పత్రి వర్గాలు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయనీ, రోగి బ్రతికి ఉన్నాడో లేదో కూడా చూపించడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. రూ.8 లక్షలు చెల్లిస్తేనే రోగిని చూపిస్తామని అంటున్నారని వారు ఆరోపించారు. మూడు అందుబాటులోకి రాలేదు: ఆస్పత్రి వర్గాలు ఆరోపణలపై ఆస్పతి వర్గాలు స్పందిస్తూ, ‘ఇంతవరకు రోగికి అందించిన చికిత్సకు రూ. 16 లక్షలు బిల్లు అయింది.. మూడు లక్షల ఇన్సూరెన్స్, రూ.2 లక్షలు క్యాష్ రూపంగా చెల్లించారు. మిగతాది చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల క్రితం రూ. 3 లక్షలు బిల్లు కడతానని చెప్పిన రోగి అటెండెంట్ ఇప్పటివరకు మళ్లీ అందుబాటులోకి రాలేదు. అంతకు ముందు పేషెంట్ కూతురు వస్తే పీపీఈ కిట్లు వేసి రోగిని చూపించాం. ఎప్పటికప్పుడు రోగి కండీషన్ ఫోన్ ద్వారా తెలియ చేస్తున్నాము. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం ఆయన పరిస్థితి విషమంగా ఉంది’ అని వెల్లడించాయి. -
కరోనా భయం.. మానవత్వాన్ని చంపేసింది
సాక్షి, చెన్నై : కరోనా భయం మానవత్వాన్ని దూరం చేసింది. కళ్ల ముందే ఓ వృద్ధ శవం గంటల తరపడి రోడ్డుపై ఉన్నా ఎవరు పట్టించుకోలేదు. మృతదేహాన్ని చూసుకుంటూ వెళ్లారే కానీ ఒక్కరు కూడా దగ్గరకి వచ్చి ముట్టుకోలేదు. చివరకు పోలీసులే వచ్చి ఓ రిక్షాలో మృతదేహాన్ని తరలించారు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకి చెందిన ఓ వృద్ధుడు ఉండటానికి నివాసం లేకపోవడంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో గల ఈవీఆర్ పెరియార్ సలై రోడ్డు పుట్‌పాత్‌పై భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు. అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ భయంతో స్థానికులు ఎవరూ మృతదేహాన్ని టచ్ చేయలేదు. పోలీసులకి సమాచారం అందడంతో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని తరలించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో రిక్షాలో మృతదేహాన్ని తరలించామని పోలీసులు తెలిపారు. కాగా, దాదాపు 4 గంటల పాటు మృతదేహం రోడ్డుపైనే ఉందని స్థానికులు చెబుతున్నారు. (చదవండి : కరోనా లేదని మొత్తుకున్నా వినలేదు, చివరికి!) ఇలాంటి ఘటనే మరొకటి ఈ నెల 12న మహారాష్ట్రలోని జల్గావ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఓ వృద్ధ మహిళ(82).. ప్రమాదవశాత్తు బాత్రూంలో పడి మృతి చెందింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని టాయిలెట్లో నుంచి బయటకు తీశారు. ఆస్పత్రిలోని రోగులంతా మృతదేహాన్ని చూసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. చివరకి దుర్వాసన భరించలేక కరోనా పేషెంట్లు ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. -
గాంధీలో మళ్లీ అదే సీన్
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి మార్చురీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా వైరస్ బారిన పడి మూ డ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో మరణించిన బేగంపేటకు చెందిన వ్యక్తి (48) మృతదేహం తారుమారైన ఘటన మరకముందే తాజాగా గురువారం మరో వ్యక్తి (37) మృతదేహం కనిపించకుండా పోవ డం వివాదాస్పదంగా మారింది. తీరా కు టుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఒకరికి ఇవ్వాల్సిన మృతదేహాన్ని మరొకరికి ఇచ్చినట్లు తేలింది. అయితే ఈ అంశాన్ని గాంధీ వైద్యులు కానీ.. పోలీసులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. అసలేమైందంటే..? మెహిదీపట్నానికి చెందిన రషీద్‌ఖాన్ (37) దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం ఈ నెల ఏడో తేదీన నగరంలోని మెడిసిటీ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 8న ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తర లించారు. తొమ్మిదో తేదీ రాత్రి ఆయన మృతిచెందాడు. ఇదే సమయంలో.. గాం ధీలో కరోనాతో ప çహాడీషరీఫ్కు చెంది న మహమూద్ (40) మరణించాడు. ఇరువురి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు చేరవేశారు. దీంతో బుధవారం (10వ తేదీన) ఉదయం పçహాడీషరీఫ్ మృతునికి సంబంధించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఒక మృతదేహాన్ని చూసి, ఇది తమదేనని చెప్పి వెంట తీసుకెళ్లి అం త్యక్రియలు పూర్తి చేశారు. ఇటు మరణించిన మెహిదీపట్నం వ్యక్తికి సంబంధించిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించగా, వాటిలో రషీద్‌ఖాన్ మృతదే హం కన్పించకపోవడంతో వారు అధికారులను నిలదీశారు. వార్డులన్నీ తిరిగి.. చివరికి మారిపోయి నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి సహా, స్థానిక డీసీపీ కల్మేశ్వర్‌లు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఒకవేళ రషీద్ చనిపోయి ఉండకపోతే ఆస్పత్రిలోనే ఉండి ఉంటారని భావించి, ఆ మేరకు కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రిలోని ఐసీయూ, ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులందరినీ పరిశీలించారు. వారిలో సదరు వ్యక్తి కన్పించకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అంతా కలసి చివరకు మళ్లీ మార్చురీకి చేరుకున్నారు. ఈ నెల 10న మార్చురీకి చేరుకున్న వారి మృతదేహాలతో పాటు మార్చురీ నుంచి మృతదేహాలను తీసుకెళ్లిన వారి వివరాల ను ఆరా తీశారు. మెహిదీపట్నంకు చెందిన రషీద్ మృతదేహాన్ని పహాడీషరీఫ్‌కు చెందిన మహమూద్‌గా భావించి సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ మేరకు వారిని ఆస్పత్రికి పిలిపించారు. మహమూద్ మృతదేహం గాంధీ మార్చురీలోనే ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఇరువురు కుటుంబసభ్యులతో చర్చించి సమస్యను సద్దుమణిగేలా చేశారు. కాగా, మహమూద్ మృతదేహాన్ని కూడా అంత్యక్రియల కోసం జీహెచ్ఎంసీ సిబ్బందికే అప్పగించడం కొసమెరుపు. అధ్వానంగా రికార్డుల నిర్వహణ.. మార్చురీకి వచ్చే మృతదేహాలను భద్రపరిచే విషయంలోనే కాదు వాటికి సంబంధించిన కేసు షీట్లు, రికార్డుల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను పూర్తిగా కవర్ కట్టిపెట్టడం, వాటికి రికార్డ్ ట్యాగ్లు లేకపోవడం, గుర్తింపు కోసం వచ్చిన బంధువులు కూడా ఎక్కడ తమకు వైరస్ సోకుతుందో అనే భయంతో దూరం నుంచే వాటిని చూడాల్సి రావడం, మృతదేహాల ముఖం పూర్తిగా కన్పించకపోవడం, అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ పూర్తిగా తెరిచి చూపించకపోవడం సమస్యకు కారణమవుతోంది. ఇకపై మృతదేహాల గుర్తింపు పక్కాగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహానికి మృతుని పేరు, వయసు, చిరునామాతో కూడిన ట్యాగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గుర్తింపు కోసం వచ్చే బంధువులను కూడా ఫొటో, వీడియో రూపంలో రికార్డు చేయాలని నిర్ణయించారు. -
గాంధీలో మృతదేహం మిస్సింగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహం అదృశ్యమవడం కలకలం రేపింది. మెహదీపట్నంకు చెందిన రషీద్ అలీ అనే వ్యక్తికు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 8న గాంధీ ఆస్పత్రిలో చేరాడు. 10న ఉదయం అతడు మృతిచెందడంతో ఆస్పత్రి వర్గాలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అయితే మృతదేహం కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి రాగా మార్చురీలో మృతదేహం కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఆస్పత్రికి చేరుకొని విచారణ చేపట్టగా రషీద్ మృతదేహాన్ని మరొకరికి అప్పగించినట్లు గుర్తించారు. దీంతో అక్కడికి వెళ్లి రషీద్ మృతదేహాన్ని తీసుకొచ్చి వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా రషీద్ మృతదేహం కోసం 12 గంటల పాటు ఆస్పత్రి వద్ద ఆందోళనలు చేశారు. చివరికి మృతదేహాన్ని అప్పగించడంతో వైద్యసిబ్బంది సహాయంతో అంత్యక్రియలకు తీసుకెళ్లారు. అయితే కరోనా రోగి మృతదేహం పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనేకమార్లు మృతదేహాలు తారుమారైన విషయం తెలిసిందే. -
గాంధీ ఆస్పత్రిలో మృతదేహం మిస్సింగ్ కలకలం
-
కరోనా మృతదేహం తారుమారు
సనత్‌నగర్/గాంధీ ఆస్పత్రి: కరోనాతో మరణించిన బాధితుని మృతదేహం తారుమారు కావడంతో కలకలం చెలరేగింది. మృతదేహాన్ని తరలించిన వైద్యసిబ్బంది, మృతుని కుటుంబసభ్యుల మధ్య శ్మశానంలో వాగ్వాదం జరిగింది. బేగంపేట పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తి (45)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈనెల 7వ తేదీన కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుని బావమరిది గాంధీ మార్చురీకి వచ్చి దూరం నుంచి చూసి తన బావ మృతదేహమేనని నిర్ధారించాడు. వైద్య సిబ్బంది మృతదేహాన్ని బేగంపేటలోని శ్మశానవాటికకు తరలించారు. కడసారి చూపు కోసం వచ్చిన మృతుని భార్య మృతదేహం తన భర్తది కాదని స్పష్టం చేసింది. దీంతో మృతుని కుటుంబసభ్యులు, వైద్యసిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. బేగంపేట పోలీసులు రంగంలోకిదిగి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మార్చురీలో ఉన్న గురుమూర్తినగర్‌కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని తిరిగి అప్పగించారు. -
బస్టాండ్‌లో కరోనా రోగి మృతదేహం
అహ్మదాబాద్ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఛగన్ మక్వానా (67) అనూహ్యంగా బస్టాండ్‌లో విగతజీవిగా పడిఉన్న ఘటన కలకలం రేపింది. మే 10 నుంచి కరోనా వ్యాధితో బాధపడుతూ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మక్వానా మృతదేహం నగరంలోని బీఆర్టీఎస్ బస్టాండ్ వద్ద పోలీసులు కనుగొన్నారు. మృతుడి జేబులో లభించిన లేఖ, మొబైల్ పోన్ ద్వారా ఆయనను ఛగన్ మక్వానాగా గుర్తించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన శాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మక్వానాను సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంతలోనే మక్వానా మరణవార్తతో ఆయన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోగానే సమాచారం అందిస్తామని ఆస్పత్రి వైద్యులు తమకు తెలిపారని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రెండు వారాలుగా తాము హోం క్వారంటైన్లో ఉన్నామని వారు చెప్పుకొచ్చారు. కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి నుంచి మక్వానాను బయటకు ఎందుకు పంపారో తెలపాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ విచారణకు ఆదేశించారు. చదవండి : లాక్డౌన్ 4.0 : కేంద్రం కీలక నిర్ణయం -
భర్త శవంతో మూడు రోజులు..
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మతిస్థిమితం లేని మహిళ.. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన తన భర్త శవంతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ ఉద్యోగి లింబారెడ్డి(64), శకుంతల దంపతులు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో, కుమార్తె లండన్‌లో ఉంటున్నారు. బుధవారం ఇంటికి పాలు పోసేందుకు వచ్చిన వ్యక్తికి దుర్వాసన రావడంతో ఇంట్లోకి వెళ్లలి చూడటంతో రక్తపు మడుగులో లింబారెడ్డి శవం కనిపించింది. (మిర్యాలగూడలో దంత వైద్యురాలి ఆత్మహత్య) దీంతో స్థానికులకు, పక్కన ఉన్న నిజామాబాద్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. లింబారెడ్డి మూడు రోజుల క్రితం చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుని భార్య శకుంతకు మతిస్థిమితం లేదని స్థానికులు తెలిపారు. ఈ దంపతులు స్థానికులతో సరిగ్గా మాట్లాడేవారు కాదన్నారు. అయితే లింబారెడ్డి శవం రక్తపు మడుగులో ఉండటంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఘటనా విషయాన్ని అతని కుమారుడు, కుమార్తెకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (కౌలు డబ్బుల కోసం కన్నతల్లికి నిప్పు) -
పూడ్చిన శవానికి పోస్టుమార్టం
సాక్షి, కామారెడ్డి : అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వివాహిత రెండ్రోజుల క్రితం మృతి చెందగా, కుటుంబ సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, తన కూ తుర్ని భర్తే కొట్టి చంపాడని తండ్రి ఫిర్యాదు చేయడంతో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికితీసి బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి (కే)లో చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిమి భూపాల్‌కు, మేన మరదళ్లు శ్రీలత, మౌనిక(25)తో 2017లో వివాహం జరిగింది. దివ్యాంగురాలైన (మూగ) శ్రీలతకు ఇద్దరు పిల్లలు కాగా, అందరూ కలిసే ఉంటున్నారు. అయితే, ఇటీవల కుటుంబ కలహాలు మొదలమయ్యాయి. ఈ క్రమంలో అనారోగ్యమని ఈ నెల 15న మౌనికను కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. మూడు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా, మౌనిక 20వ తేదీన మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. (మాస్కులు తయారు చేసిన భారత ప్రథమ మహిళ ) తన కూతురు అనారోగ్యంతో మృతి చెందలేదని, అల్లుడు తీవ్రంగా కొట్టడంతోనే చనిపోయిందని మృతురాలి తండ్రి సాయిలు దేవునిపల్లి ఠాణాలో మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో అసిస్టెంట్ కలెక్టర్ నందలాల్ పవార్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, తహసీల్దార్ అమీన్‌సింగ్, రూరల్ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం కుటుంబ సభ్యులను విచారించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని బ యటకు తీయించి పోస్టుమార్టం చేయించారు. మృతురాలి భర్త భూపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. పూడ్చి్టన శవాన్ని తీయించి పోస్టుమార్టం నిర్వహించడం చర్చనీయాంశమైంది. (ఆ ఎడిటర్‌ను పెళ్లి చేసుకోవాలని ఉంది: వర్మ ) -
9 నెలలకు స్వగ్రామానికి మృతదేహం
సాక్షి, అదిలాబాద్: రెక్కాడితేగాని డొక్కడాని పరిస్థితి, ఉన్న ఊళ్ళో వ్యవసాయ కూలీగా జీవనం, దినదినం పెరిగిన కుటుంబ ఖర్చులు వెరసి ఆ యువకుడికి అందరిలాగే బయటి దేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పిల్లలను బాగా సాకుదామన్న కలసాకారం కాకుండానే ఆ యువడిని విధి వక్రీకరించి. ఏడాది తిరగకక మునుపే తొమ్మిది నెలల కిందట విద్యుత్ షాక్‌తో సౌదీలో మృత్యువాత పడ్డాడు. మండలంలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన కదిలి చందు(26) తొమ్మిది నెలల కిందట సౌదీలో తాను పనిచేస్తున్న చోట విద్యుత్ షాక్‌తో మృత్యువాత పడ్డాడు. 9నెలలుగా ఆ కుటుంబ పడ్డ వేదన వర్ణనాతీతం. నిత్యం రోదన సౌదీలో ఉంటున్న స్థానికులకు వేడుకోలుతో అక్కడి కూలీలుగా పనిచేస్తున్న తెలంగాణ యువకులు చందాలు చేసి మృతదేహాన్ని తరలించేందకు శ్రమించారు. మృతి చెందిన వెంటనే అక్కడి అధికారులు అన్ని లాంచనాలు పూర్తి చేసినా మృతదేహాన్ని తరలించడంతో తీవ్ర జాప్యం చేశారు. ఆదివారం ఉదయం చందు మృతదేహం స్వగ్రామమైన సిర్గాపూర్‌కు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు పలువురుని కంటతడి పెట్టించాయి. ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. మృతునికి భార్య హేమలత, కుమారుడు విష్ణువర్థన్, కూతులు వైష్ణవిలు ఉన్నారు. సౌదీలో చందాలు వసూలు చేస్తున్న వలస కూలీలు స్పందించిన గల్ఫ్ కార్మికులు మృతదేహం కోసం ఎంత వేచిచూసినా ఫలితం లేకపోవడంతో చివరకు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సభ్యులు బడుగు లక్ష్మన్, మోహన్, గోవింద్, గణేష్, గంగన్న, శ్రీకాంత్‌లు తోటి కార్మికుల సహాయంతో మృతదేహాన్ని స్వగ్రామమైన సిర్గాపూర్‌కు తరలించడంలో తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి చందాలు వేసుకుని చందు మృతదేహాన్ని ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై పాలసీని అమలు పరిచి గల్ఫ్‌లో మృతి చెందిన వారికి రూ. పదిలక్షల ఎక్స్‌గ్రేసియా అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
పూడ్చిపెట్టిన శవానికి గుండుగీశారు
సాక్షి, పటాన్చెరు టౌన్: పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటికి తీసి గుండు గీసిన సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పటాన్చెరు మండలం పోచారం గ్రామపరిధిలోని గణపతిగూడెంకు చెందిన ఓ వృద్ధురాలు (65) ఆదివారం మృతి చెందింది. కుటుంబ సభ్యులు సోమవారం ఆమెను క్రైస్తవ సంప్రదాయం ప్రకారం సమాధి చేశారు. మంగళవారం మూడోరోజు కావడంతో కుటుంబ సభ్యులు సమాధి దగ్గరికి వెళ్లగా.. మృతురాలి తల వెంట్రుకలు బయట ఉన్నాయి. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బయటకు తీసి చూడగా శవానికి గుండు గీసి ఉంది. దీంతో పటాన్చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాపం.. బతికుండగానే ఆయనకు శార్థం!
బతికున్న వ్యక్తి చనిపోయాడనుకొని కుటుంబ సభ్యులు ఏకంగా చిన్నకర్మ కూడా చేశారు. ఆ అభాగ్యురాలు చనిపోయిన వ్యక్తి తన భర్త కాదంటున్నా ఎవరూ వినిపించుకోలేదు. నీటిలో కొట్టుకొచ్చిన మృతదేహం అదృశ్యమైన నీ భర్తదేనంటూ గ్రామస్తులతో పాటు పోలీసులు సైతం బలవంతంగా ఆమెకు నచ్చజెప్పి అంత్యక్రియలు చేయించారు. చనిపోయాడనుకుంటున్న వ్యక్తి నేరుగా ఇంటికి చేరడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. తొలుత కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు లోనయ్యారు. నిదానంగా తమ భయాన్ని వీడి ఆశ్చర్యం నుంచి తేరుకుని లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన కురిచేడు మండలం పొట్లపాడులో వెలుగు చూసింది. సాక్షి, ప్రకాశం: కురిచేడు రైల్వేస్టేషన్ సమీపంలోని వాగులో ఈ నెల 22వ తేదీ బుధవారం ఉదయం ఒక వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. రైల్వే లైను కట్ట కింద వాగులో ఉన్న మృతదేహాన్ని తొలుత ఎస్ఐ జి.రామిరెడ్డి తన సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దొనకొండ రైల్వే పోలీసులు తమ పరిధి కాదని బాధ్యతారహితంగా చేతులెత్తేశారు. ఎస్ఐ రామిరెడ్డి కేసు నమోదు చేశారు. మృతుడు మండలంలోని పొట్లపాడుకు చెందిన పోలెబోయిన వెంకట్రావై ఉండొచ్చని భావించి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకట్రావు ఈ నెల 17వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య అంజనీదేవి, బంధువులు పొట్లపాడు నుంచి సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. బంధువుల్లో కొందరు మృతదేహం వెంకట్రావుదిగా తేల్చారు. భార్య అంజనాదేవి మాత్రం మృతుడు తన భర్త కాదన్నా ఎవరూ వినిపించుకోలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్శి ప్రభుత్వాస్పత్రిలో 23వ తేదీన పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని పొట్లపాడులో ఖననం చేయించారు. వలస వెళ్లడం వెంకట్రావుకు అలవాటు తాపీపని చేస్తూ జీవనం సాగించే వెంకట్రావు తరుచూ ఇంటి నుంచి బయటకు వెళ్లటం అలవాటు. చెప్పా పెట్టకుండా వెళ్లి కొన్ని రోజుల పాటు బయట ప్రాంతాల్లో జల్సా చేయడం అతని నైజం. అలాగే ఈ నెల 17న ఇంటి నుంచి వెళ్లి విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో తిరిగి శనివారం రాత్రి రాయవరం రైల్వేస్టేషనుకు చేరుకున్నాడు. అక్కడ జరుగుతున్న తిరునాళ్లలో ఉన్నాడు. పొట్లపాడు గ్రామానికి చెందిన గుడిమెట్ల ఏసుబాబు.. వెంకట్రావును గుర్తించి జరిగిన విషయం చెప్పాడు. వెంకట్రావు కనిపించిన విషయం ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వెంటనే గ్రామస్తులు వెళ్లి వెంకట్రావును ఇంటికి తీసుకొచ్చారు. అభాగ్యుడికి అంత్యక్రియలు మృతుడు తన భర్త కాదని తాను మొదట నుంచి సందేహిస్తూనే ఉన్నానని వెంకట్రావు భార్య అంజనాదేవి చెప్పింది. ఇంటి నుంచి వెళ్లిన తన భర్త ఆచూకీ లేకపోవటం, ఫోను పనిచేయకపోవటంతో తాను బంధువుల ఒత్తిడికి తట్టుకోలేక పోయానని చెబుతోంది. తన భర్త నడుముకు ప్లాస్టిక్ ధారాలతో అల్లిన మొలతాడును పాత్రికేయులకు చూపించింది. కానీ మృతదేహాం నడుముకు నల్లని తాడు ఉండటంతో తాను బంధువులతో విభేదించానని తెలిపింది. తన భర్తగా భావించి ఎవరో అభాగ్యుడికి అంత్యక్రియలు చేశానని పేర్కొంటోంది. వెంకట్రావుకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న కర్మ ఆదివారం చేశారు. మరో వారంలో పెద్ద కర్మ నిర్వహించాల్సి ఉంది. అంజనాదేవికి పుట్టింటి వారు, బంధువులు పసుపు కుంకుమ, బట్టలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో వెంకట్రావు ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ.. మృతుడు ఎవరు? స్థానిక రైల్వేస్టేషన్ వద్ద వాగులో పడి ఉన్న మృతదేహం ఎవరిది? పోలీసులు కేసు నమోదు చేసిన విధంగా మృతుడు వెంకట్రావు కాదని తేలింది. అయితే వాగులో లభ్యమైన మృతదేహం ఎవరిది. ఏ ప్రాంతానికి చెందినది. పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
లేచిన శవం.. జనం పరుగోపరుగు
కరాచీ: మనిషి చనిపోయిన తర్వాత శరీరంలో కదలికలు ఏర్పడినట్లు వార్తలు రావడం సహజం. అనేకసార్లు ఈ తరహా వార్తలు మనం వింటూ వచ్చాం. డాక్టర్లు సరిగ్గా పరీక్షించకుండా రోగి మృతిచెందినట్లు ద్రువీకరించడమే ఇలాంటి వార్తలకు కారణంగా మనం భావించవచ్చు. తాజాగా ఇలాంటి సంఘటనే పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను అబ్బాసీ షాహిద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఎన్నివిధాలుగా వైద్యులు చికిత్సనందించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రషీదా మృతిచెందినట్లు ఆమె కుటుంబసభ్యులకు మరణ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. తదనంతరం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి శవాల గదిలో స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా రషీదా లేచి నిలబడింది. దీంతో స్నానం చేయిస్తున్న మహిళ, ఆ గదిలో ఉన్నవారు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. వారు జరిగిన విషయాన్ని రషీదా కుటుంబసభ్యులకు చెప్పడంతో అంతా షాకయ్యారు. డాక్టర్లు వచ్చి ఆమె పల్స్ చెక్ చేసి ఇంకా శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంత్యక్రియల సమయంలో శవం లేచి నిలబడిందనే వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
ముషారఫ్ శవాన్నైనా మూడ్రోజులు వేలాడదీయండి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే మరణిస్తే అతడి శరీరాన్ని అయినా మూడ్రోజులు ఉరికి వేలాడదీయాల్సిందేనని ఆ దేశ ప్రత్యేక కోర్టు గురువారం స్పష్టంచేసింది. దేశద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన 167 పేజీల తీర్పు కాపీలో ‘అతడు చేసిన ప్రతి దానికి ఉరికి వేలాడాల్సిందే. ఒకవేళ ఉరికి ముందే మరణించినా వేలాడదీయాల్సిందే’ అంటూ జస్టిస్ వఖార్ అహ్మద్ సేథ్ తీర్పు రాశారు. అధ్యక్షుడు, ప్రధాని, పార్లమెంటుతో పాటు ఇతర ప్రభుత్వ భవనాలకు దగ్గరగా ఉండే డీ–చౌక్ (డెమోక్రసీ చౌక్) వద్ద అతడి మృతదేహం మూడు రోజుల పాటు వేలాడాలని చెప్పారు. ప్రస్తుతం ముషారఫ్ దుబాయ్‌లో ఉన్నారు. -
పోస్ట్‌మార్టం వద్దంటూ బైక్‌పై మృతదేహంతో పరార్