Dead Body Found In Thalapathy Vijay Party Office At Chennai, Details Inside - Sakshi
Sakshi News home page

Thalapathy Vijay: స్టార్‌ హీరో విజయ్‌ పార్టీ ఆఫీసులో మృతదేహం కలకలం, ఏం జరిగింది?

Jun 20 2022 5:54 PM | Updated on Jun 20 2022 9:31 PM

Dead Body Found in Thalapathy Vijay Party Office At Chennai - Sakshi

Dead Body Found in Vijay Party Office: తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌కి సంబంధించిన ఓ కార్యాలయంలో మృతదేహం లభ్యమైంది. మృతుడు కాంట్రాక్ట్‌ ఉద్యోగి ప్రభాకరన్‌గా పోలీసులు గుర్తించారు. కాగా విజయ్‌ రాజకీయాల్లోకి రాకపోయిన ఆయనకు విజయ్‌ మక్కల్‌ ఇయక్కం పేరుతో పార్టీ ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆఫీసు చెన్నై పనైయార్‌ శివార్లలో ఉంది. అయితే ఆ పార్టీ ఆఫీసుతో విజయ్‌కి నేరుగా ఎలాంటి సంబంధం లేకపోయిన అతడి ఫ్యాన్స్‌ ఆఫీసు వ్యవహరాలను చూసుకుంటున్నారు. 

చదవండి: ‘విక్రమ్‌’ మూవీలో విలన్స్‌తో ఫైట్‌ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?

అయితే ఈ పార్టీ ఆఫీసుల ద్వారానే విజయ్‌ పలు సేవ కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈ నేపథ్యంలో గత శుక్రవారం ఉదయం కార్యాలయంలో పెయింటర్‌ ప్రభాకరన్‌ శవమై తేలడం కలకలం రేపుతోంది. ఇటీవల ఈ పార్టీ ఆఫీసును ఆధునికరించేందుకు ప్రభాకరన్‌ అనే పెయింటర్‌ను నియమించారు. అయితే ఇటీవల సొంతూరు వెళ్లొచ్చిన ప్రభాకరన్‌.. పనిలో భాగంగా గురువారం రాత్రి పార్టీ ఆఫీసుకు వచ్చాడు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: సాయి పల్లవికి చీర పెట్టిన సరళ కుటుంబ సభ్యులు

ఈ క్రమంలో ఆకలిగా ఉందని పార్టీ ఆఫీసు సుపర్‌ వైజర్‌ను రూ. 100 అడిగాడట. ఆ డబ్బుతో ప్రభాకరన్‌ పరోటా తీసుకుని వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ శుక్రవారం ఉదయం అతడు శవమై కనిపించాడు. అంతే కాకుండా తన చేతిలో, నోటిలో పరోటా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆకలితో ఉన్న ప్రభాకరన్.. వేగంగా పరోటాను తినడంతో ఊపిరాడక చనిపోయి ఉండోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement