
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.
అయితే రజినీకాంత్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తమిళ అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ మొదటి రోజే ఫస్ట్ షో చూడాలనే ఆతృత అభిమానులకు ఉంటుంది. కానీ ఒక స్టార్ హీరో మూవీ ఫస్ట్ షో చూడడం చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. ఇవాళ అలాంటి అరుదైన సంఘటనే చోటు చేసుకుంది.
ఇటీవల ది గోట్ మూవీ అభిమానులను మెప్పంచిన విజయ్.. రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ ఫస్ట్ షోను వీక్షించారు. ఆయనతో పాటు ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్.. రజనీకాంత్‌కు అభిమాని కావడంతో మొదటి ఆటను చెన్నైలో ఓ థియేటర్లో చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
வேட்டையன் படம் பார்த்த விஜய்... தலைவருக்காக வந்த தளபதி..!#Chennai #ThalapathyVijay #Vijay #Vettaiyan #VettaiyyanMovie #VettaiyanFDFS #VettaiyanReviews #Rajinikanth #DeviTheatre #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/csFT8A3FUB
— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 10, 2024
Comments
Please login to add a commentAdd a comment