breaking news
Vijay
-
దళపతి రేంజ్‌కు 'అల్లు అర్జున్'.. బిగ్ లైనప్‌తో ప్లాన్
అల్లు అర్జున్ పుష్పలో "ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా" అనే పాట తన నిజ జీవితానికి బాగా సెట్ అవుతుంది అని చెప్పొచ్చు. బన్నీ సినిమా విడుదలవుతుంది అంటే చాలు.. అందరికీ తెలిసిన ఒక వర్గం తనను కిందకు లాగేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే, బన్నీ కూడా అంతే రేంజ్లో "ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నను కాల్చితే కత్తి అవుతాను" అంటూ తనను ట్రోల్ చేసే వారి గుండెల్లో దడ పుట్టిస్తాడు. టాలీవుడ్లో తన ఫ్యాన్స్ బేస్ చాలా బలంగానే ఉంది. ఇప్పుడు తన చూపు ఇతర ఇండస్ట్రీల మీద ఉంది. ‘ఆర్య’ సినిమా తర్వాత మలయాళంలో మల్లు అర్జున్ అయ్యాడు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌కు తన మార్కెట్ సత్తా చూపాడు. ఇప్పుడు అట్లీ, లోకేశ్ కనగరాజ్ మూవీస్‌తో తమిళ పరిశ్రమపై కన్నేశాడు. తన ప్లాన్ వర్కౌట్ అయితే, తమిళ్లో బిగ్‌స్టార్‌గా పాతుకుపోతాడు. అందుకే ఇప్పుడు వరుసగా తమిళ టాప్ దర్శకులతో ప్రాజెక్ట్‌లు మొదలుపెట్టాడనిపిస్తుంది.దళపతి బాయ్స్‌తో అల్లు అర్జున్దళపతి విజయ్ బాయ్స్‌గా అట్లీ, లోకేశ్ కనగరాజ్‌లకు ఇమేజ్ ఉంది. బిగిల్, మెర్సిల్, తేరి చిత్రాలతో విజయ్‌కి అట్లీ హిట్స్ ఇస్తే.. లియో, మాస్టర్ మూవీస్‌తో లోకేశ్ తన మార్క్ చూపించాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి అల్లు అర్జున్‌తో వరుసగా సినిమాలు చేస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కన్ను అల్లు అర్జున్ మీద పడింది. లోకేశ్ తన నెక్ట్స్ మూవీ బన్నీతో అని చెప్పగానే విజయ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. విజయ్, అల్లు అర్జున్‌ల ఏఐ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు.చెన్నైలో జరిగిన పుష్ప-2 ఈవెంట్లో బన్నీ తమిళంలోనే మాట్లాడి వారి ప్రేమను పొందాడు. తమిళ ప్రజలకు కావాల్సింది కూడా అదే.. వారి భాషలో మాట్లాడే హీరోలను తప్పకుండా అక్కున చేర్చుకుంటారు. కన్నడకు చెందిన రజనీకాంత్‌కు తమిళనాట ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే బాటలో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.అల్లు అర్జున్‌కు తమిళనాడులో సానుకూలతప్రస్తుతం అల్లు అర్జున్ చూపు తమిళనాడుపై ఉంది. కోలీవుడ్‌లో దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల వైపు వెళ్తున్నారు. రజనీకాంత్ వయసు కారణంగా రాబోయే రోజుల్లో సినిమాలు చేసే ఛాన్స్ తక్కువగానే ఉండొచ్చు. ఆపై తమిళ మరో బిగ్ హీరో అజిత్ కూడా సినిమాలపై ఫోకస్ తగ్గించి.. కార్ రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఈ ముగ్గురి తర్వాత ఏర్పడుతున్న ఆ స్పేస్‌ను ఉపయోగించుకునేందుకు పక్కా వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. దళపతి విజయ్ మెచ్చిన దర్శకులతో బన్నీ సినిమాలు చేస్తున్నాడు కాబట్టి తన ప్లాన్ సక్సెస్ అవుతుందనే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కు టాప్ ఇమేజ్ ఉంది. ఇదే క్రమంలో తమిళనాడులో కూడా తన ప్లాన్ వర్కౌట్ అయితే సౌత్ ఇండియాలో బన్నీకి సినిమాలకు బిగ్గెస్ట్ మార్కెట్ ఏర్పడుతుంది.బిగ్ లైనప్ సినిమాలతో ప్లాన్అల్లు అర్జున్ చేతిలో రాబోయే సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో పాటు టాప్ దర్శకులతోనే ఉన్నాయి. అట్లీ, లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ ఇలా వరుసగా పేరున్న డైరెక్టర్స్‌తో లైనప్ ఉంది. ఆపై తను ఎంచుకున్న స్టోరీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. అట్లీ సినిమా హిట్ కొడితే చాలు.. సౌత్ ఇండియాలో తన మార్కెట్ పునాది బలంగా పడుతుంది. బాలీవుడ్లో ఎటూ ఖాన్ల మూవీస్‌కు పోటీగా బన్నీ మార్కెట్ ఉంది. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో బన్నీ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. ఆపై తన ఫ్యూచర్ సినిమాల లైనప్ మరింత బలంగా ఉంది కాబట్టి ఇండస్ట్రీలో తన మార్క్ ఏంటో అల్లు అర్జున్ చూపించబోతున్నాడని తెలిసిపోతుంది. -
విజయ్ కు షాక్.. జన నాయగన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
సుప్రీం కోర్టులో విజయ్ సినిమాకు భారీ ఎదురు దెబ్బ
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’(Jana nayagan) కి సుప్రీం కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెన్సార్ సర్టిఫికెట్ జారీకి స్టే విధించిన మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ సినిమా నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ వేసిన పిటిషన్‌ని విచారించకుండానే హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపింది. ఈ నెల 20వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని మద్రాసు హైకోర్టుకు సూచించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో ఆలస్యమైంది. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్‌సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు ఈ నెల 12న సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే, సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను ఎంటర్టైన్ చేయకుండా, హైకోర్టు డివిజన్ బెంచ్‌కు తిరిగి పంపింది. హైకోర్టు జనవరి 20లోపు ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
జన నాయగన్‌పై సుప్రీం విచారణ ఎప్పుడంటే..
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ నటించిన ‘జన నాయగన్’సినిమా విడుదల విషయంలో తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు ఈ నెల 19వ తేదీన విచారణ చేపట్టనుంది. సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) క్లియరెన్స్‌పై మద్రాస్ హైకోర్టు స్టే విధించడాన్ని నిర్మాత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే, కేసు విచారణ చేపట్టే సుప్రీం ధర్మాసనం ఖరారు కావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయాల్లో దిగేందుకు, విజయ్ నటించిన చిట్ట చివరి సినిమాగా జన నాయగన్‌ను భావిస్తున్నారు. ఈ మేరకు 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో, నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్‌ను ఇవ్వాల్సిందిగా 9వ తేదీన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం సీబీఎఫ్‌సీని ఆదేశించింది. అనంతరం, కొద్ది గంటల్లోనే సీబీఎఫ్సీ వినతిపై స్పందించిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పుపై మధ్యంతర స్టే విధించింది. సీబీఎఫ్‌సీకి వాదనను వినిపించుకునే అవకాశం ఏకసభ్య ధర్మాసనం ఇవ్వలేదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. కేంద్రమే అడ్డుకుంటోంది: రాహుల్టీవీకే చీఫ్ విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదలను కేంద్రమే అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిని ఆయన తమిళ సంస్కృతిపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. తమిళ వాణిని అణచివేయాలని చూస్తే ప్రధాని మోదీ ఎన్నటికీ విజయం సాధించలేరన్నారు. విజయ్ నటించిన జన నాయగన్ సినిమాపై వివాదం తలెత్తిన వేళ ఎక్స్‌లో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘జన నాయగన్ సినిమాను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అడ్డుకోజూడటం తమిళ సంస్కృతిపై దాడే. మిస్టర్ మోదీ, తమిళుల గొంతు నొక్కాలని చూస్తే ఎన్నటికీ విజయం సాధించలేరు’అని రాహుల్ పేర్కొన్నారు. -
విజయ్ ఫ్యాన్స్‌పై 'సుధా కొంగర' సంచలన కామెంట్స్
తమిళనాడులో శివకార్తికేయన్, విజయ్ దళపతి ఫ్యాన్స్ వార్ పెద్ద ఎత్తున జరుగుతుంది. తాజాగా విడుదలైన ‘పరాశక్తి’పై విజయ్ అభిమానులు దుష్ప్రచారం చేస్తున్నారని చిత్ర నిర్మాతల్లో ఒకరైన దేవ్ రామ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు బుక్ మై షోలో నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే కాకుండా మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొన్ని ఆధారాలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా చిత్ర దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ విజయ్ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు.రౌడీయిజంతో పోరాడుతున్నాంది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సుధా కొంగర ఇలా అన్నారు. 'ప్రస్తుత కాలంలో సినిమాను ప్రేక్షకులకు చేర్చడంలో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ మార్కెటింగ్ యుగంలో ఎన్నో సవాళ్లను దాటుకోవాలి. సినిమా బాగున్నా సరే తప్పుడు ప్రచారంలో ఇబ్బందులు తప్పవు. పొంగల్ వారాంతంలో మా సినిమా (పరాశక్తి) మరింత మందికి చేరువవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒక నటుడి అభిమానుల వల్ల మేము చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫేక్ ఐడీలతో మాపై చాలా దారుణమైన పోస్టులు చేస్తున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసు. విజయ్ ఫ్యాన్స్ పేరుతో కొన్ని ఖాతాల నుంచి షేర్ చేసిన పోస్టులు మరింత నీచంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఏంటి.. తమ హీరో సినిమా విడుదల కాలేదని ఆయన ఫ్యాన్స్ చేసే హెచ్చరికలు ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయి. మేము రౌడీయిజం, గూనిజంతో పోరాడుతున్నాం.' అంటూ ఆమె అన్నారు.జన నాయగన్, పరాశక్తి రెండు సినిమాలకు సెన్సార్ చిక్కులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పరాశక్తి మూవీకి 25 కట్స్ సూచించి విడుదలకు 4గంటల ముందు సెన్సార్ ఇచ్చారు. కానీ, జన నాయగన్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. పరాశక్తి సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా ఉదయ్‌నిధి స్టాలిన్ పంపిణీ చేశారు. దీంతో జన నాయగన్‌పై రాజకీయ కుట్ర జరిగిందని విజయ్ ఫ్యాన్స్ భావించారు. అందుకే పరాశక్తి సినిమా పట్ల వారు నెగటివ్ రివ్యూలు ప్రారంభించారని తెలుస్తోంది. -
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సినిమా కూడా వాయిదా..!
దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జన నాయగణ్. ఈ పొంగల్‌కు రిలీజ్ కావాల్సిన చిత్రం ఊహించని విధంగా వాయిదా పడింది. సెన్సార్ వివాదం కాస్తా కోర్టుకు చేరడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు చేస్తోన్న చివరి చిత్రం కావడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ అభిమానులకు నిరాశ తప్పలేదు.అయితే తాజాగా విజయ్ అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. ఈ సంక్రాంతి కానుకగా విజయ్ సూపర్ హిట్ మూవీ థేరీ రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ మూవీని కూడా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈనెల 14న థేరీ రీ రిలీజ్ కావడం లేదని ప్రకటించారు. జన నాయగణ్ మూవీ సెన్సార్ బోర్డు వివాదం రీ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. రాబోయే చిత్రాల నిర్మాతల అభ్యర్థన మేరకు థేరి విడుదలను వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నామనివి క్రియేషన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా.. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అమీ జాక్సన్ నటించారు.As per the request from the producers of upcoming releases, we have decided to postpone the release of "Theri".— Kalaippuli S Thanu (@theVcreations) January 13, 2026 -
విజయ్‌కు రాహుల్ మద్దతు..!
ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ నటించిన జన నాయకన్ సినిమాకు ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలపడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్‌లో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి వ్యూహాత్మకంగా రాహుల్ పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి,వ్యూహాత్మక ఎత్తుగడా.?రాహుల్ గాంధీ తాజా ట్వీట్‌తో కాంగ్రెస్ పార్టీ,.. డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక కూటమి కొనసాగుతుందా? లేక విజయ్ పార్టీ టీవీకేతో కలిసి కొత్త వ్యూహం రూపొందిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి.2017లో విజయ్ నటించిన మెర్సల్ సినిమా మీద కేంద్రం అభ్యంతరాలు తెలిపినప్పుడు కూడా రాహుల్ గాంధీ ఆయనకు మద్దతు ఇచ్చారు. ఒకవైప విజయ్.. తమిళ రాజకీయాల్లో బలంగా ఎదిగే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే టీవీకేతో పొత్తుకు రాహుల్ గాంధీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, దీనిలో భాగంగానే విజయ్‌కు మరోసారి మద్దతు పలికారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. The I&B Ministry’s attempt to block ‘Jana Nayagan’ is an attack on Tamil culture.Mr Modi, you will never succeed in suppressing the voice of the Tamil people.— Rahul Gandhi (@RahulGandhi) January 13, 2026 అయితే డీఎంకేతోనే పొత్తు కొనసాగించాలని అధిక శాతం మంది కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పుడూ ఒక పార్టీనే అధికారంలో ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి.. విజయ్‌కు ఈ రకంగా రాహుల్ మద్దతు ఇవ్వడం వ్యూహాత్మక ఎత్తుగడగా ఆ పార్టీకి చెందినే పలువురు నేతలు అంటున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కు ఉన్న ప్రజాదరణ, ఆయన సినిమాలపై కేంద్రం చూపుతున్న అడ్డంకులు, కాంగ్రెస్ పార్టీకి కొత్త అవకాశాలను తెచ్చేలా కనిపిస్తున్నాయి.గతంలో కూడా చర్చ..కొన్ని రోజుల క్రితం కూడా కాంగ్రెస్-టీవీకేల పొత్తు అంశానికి సంబంధించి చర్చ వచ్చింది. ఇరు పార్టీలు త్వరలో పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగాయి. అయితే అధికారంలో ఉన్న డీఎంకేతో బంధం తెంచుకోవడం మంచిది కాదని కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావిస్తోంది. దాంతోనే విజయ్ పార్టీతో పొత్తుపై అధిష్టానం కూడా ఎటువంటి ముందుకు సాగడం లేదు. కేవలం మద్దతు ఇస్తూ ట్వీట్లు పెట్టడం తప్పితే ఎటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోవడం లేదు. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోకాంగ్రెస్ కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం డీఎంకే పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉందనే అంశాన్ని అతి దగ్గరగా పర్యవేక్షిస్తోంది. -
విజయ్ ను సీబీఐ అడగబోయే ప్రశ్నలివే..!
-
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్రకోణం
-
అప్డేట్స్: కొనసాగుతున్న విజయ్ సీబీఐ విచారణ
అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ సీబీఐ విచారణ కొనసాగుతోంది. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ర్యాలీ అనుమతులు, టైమింగ్, విజయ్ హాజరైన టైం.. ఆ టైంలో ఏం జరిగింది?.. నిర్వహణలో లోపాలు తదితర అంశాలపై ఆయన నుంచి వివరాలు రాబడుతన్నట్లు సమాచారం. విజయ్ సీబీఐ విచారణ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆయన అరెస్ట్ కావొచ్చంటూ నిన్నటి నుంచి ప్రచారం నడుస్తోంది. అయితే విచారణకు విజయ్ పూర్తిగా సహకరిస్తారని.. అలాంటిదేం ఉండకపోవచ్చని టీవీకే కీలక నేతలు అంటున్నారు. మరోవైపు ఢిల్లీ సీబీఐ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో జరిగిన టీవీకే ర్యాలీలో 41 మంది మరణించిన సంగతి తెలిసిందే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన.. ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే పెను విషాదాన్ని మిగిల్చింది. అదే సమయంలో ర్యాలీ నిర్వహణలో టీవీకే విఫలం కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయ్ ఎన్నికల ర్యాలీ వాహనాన్ని సీబీఐ సీజ్ చేసింది. పలువురు నేతలను సైతం ప్రశ్నించింది. ఇక సీబీఐ విచారణను చెన్నైలో కాకుండా ఢిల్లీలో నిర్వహించడంపై రాజకీయ పరమైన చర్చ నడుస్తోంది. ప్రత్యేక విమానంలో ఈ ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లారాయన. ఆయన వెంట పార్టీ కీలక నేతలు కొందరు ఉన్నారు. సీబీఐ దర్యాప్తు దరిమిలా విజయ్ నల్ల దుస్తులతో రావడంతో.. నిరసనకు ప్రతీక అనే అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదీ చదవండి: అటు సెన్సార్‌బోర్డు.. ఇటు సీబీఐ! -
సీబీఐ ముందుకు టీవీకే విజయ్
అగ్రనటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇవాళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ముందు హాజరు కానున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ని దర్యాప్తు సంస్థ ప్రశ్నించనుంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే విచారణ వేళ.. ఆయన్ని అరెస్ట్ చేస్తారంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. తమిళనాడు చరిత్రలోనే కరూర్ తొక్కిసలాట ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే(Tamilaga Vettri Kazhagam) ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించారు. ఇరుకు సందులో ర్యాలీ నిర్వహించడం, ఆ ర్యాలీకి విజయ్ చాలా ఆలస్యంగా రావడం, అప్పటికే అక్కడికి జనం తండోప తండాలుగా చేరుకోవడం, ఎండలో తిండి, నీళ్ల లేకపోవడంతో సొమ్మసిల్లి పడిపోవడం.. వాళ్లకు సాయంగా విజయ్ వాటర్ బాటిళ్లు విసరడం.. ఆ గందరగోళంలోనే ఆంబులెన్స్ రాకతో జనం మధ్య తొక్కిసలాట జరిగిందని పోలీసుల దర్యాప్తులో ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అయితే.. ఈ ఘటనపై అధికార డీఎంకే, టీవీకే పరస్పరం నిందించుకున్నాయి. కరూర్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని స్టాలిన్ సర్కార్ మీద అనుమానాలు వ్యక్తం చేస్తోంది టీవీకే. దీని వెనుక కుట్ర దాగి ఉందని అంటోంది. అయితే విజయ్ నిర్లక్ష్య వైఖరి వల్లే ఘటన జరిగిందని డీఎంకే కౌంటర్ ఇస్తోంది కూడా. ఈ ఆరోపణ ప్రత్యారోపణల నడుమ.. దర్యాప్తు కూడా కీలక మలుపులు తిరిగింది. కరూర్ తొక్కిసలాటకు కారణాలు తేల్చాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే దీనిని టీవీకే సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో.. కేసు సీబీఐని చేరింది. అదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ను సైతం సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది. విజయ్ సీబీఐ విచారణకు హాజరవుతున్న వేళ.. అటు సెన్సార్బోర్డుతో మరో వివాదం నడుస్తోంది. పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో ఆయన చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న జన నాయగన్‌పై రాజకీయ దుమారం రేగింది. పొంగల్ బరిలో ఉన్న ఈ చిత్రం.. చివరి నిమిషంలో అనూహ్యంగా సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణకు గురై సినీ ప్రియులకు పెద్ద షాకే ఇచ్చింది. ఆపై ఈ పంచాయితీ న్యాయస్థానాలకు చేరి.. అక్కడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వెరసి.. సినిమా విడుదల తేదీగా సంగ్దిగ్దం నెలకొంది. అయితే ఈ అంశంపై ఇటు విజయ్‌గానీ, అటు టీవీకేగానీ ఎక్కడా అధికారికంగా స్పందించడం లేదు. మరో మూడు, నాలుగు నెలలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయబోతోంది. ఇప్పటికే డీఎంకేను తన రాజకీయ శత్రువు.. బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా విజయ్ ప్రకటించుకున్నారు. ఎవరితోనూ పొత్తులుండబోవని.. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ పంచ్ లైన్లు విసిరారు. అయితే.. అధికార డీఎంకేను ఓట్లను చీల్చగలిగే సత్తా అన్నాడీఎంకే కంటే విజయ్ టీవీకే పార్టీకే ఎక్కువగా ఉందని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కరూర్ ఘటన తర్వాత పోటాపోటీగా విజయ్‌కు సంఘీభావం ప్రకటించాయి. ఓవైపు హద్దులు దాటకుండా విజయ్‌పై విమర్శలు గప్పిస్తున్నాయి రెండు పార్టీలు. అదే సమయంలో రాహుల్ గాంధీకి విజయ్‌తో మంచి స్నేహం ఉందని కాంగ్రెస్, అమిత్ షాతోనూ విజయ్ టచ్‌లో ఉన్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ, టీవీకే మాత్రం పొత్తులు ఉండవ్ అని లైన్ మీదే ప్రస్తుతానికి నిలబడింది.ఈ క్రమంలో.. సెన్సార్‌బోర్డు, సీబీఐలను బూచిగా చూపించి విజయ్ను తమ వైపు లాక్కునే కుట్ర జరుగుతోందనే ప్రచారం ఊపందుకుంది. ఈ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ నేరుగానే విమర్శల గుప్పిస్తోంది. సీబీఐ, ఈడీ, ఐటీ తరహాలోనే సెన్సార్బోర్డును అడ్డుపెట్టుకుని కేంద్రం రాజకీయాలు నడుపుతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరోక్షంగా జన నాయగన్ వివాదంపై స్పందించడం కొసమెరుపు. అయితే.. బీజేపీ, తమిళనాడు మిత్రపక్షం అన్నాడీఎంకే ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి. తమిళనాడు బీజేపీ సీనియర్ నేత ఒకరు ఈ అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సీబీఐ, సెన్సార్‌బోర్డు రెండూ ప్రొఫెషనల్ సంస్థలు. ఆయన మా పార్టీతో పొత్తుకు రాడని తెలిశాక.. మేం ఆయనపై ఎందుకు దృష్టి పెడతాం?.. అది ఆయనకు ప్రచారం కల్పించడమే అవుతుంది కదా’’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకోవైపు.. ‘‘కరూర్ ఘటనలో మేం మొదటి నుంచి నిష్పపక్షపాత దర్యాప్తు డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు సీబీఐకి సహకరిస్తారు. నిజాన్ని ఈ దర్యాప్తు వెలికితీస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దర్యాప్తు సంస్థల నుంచి ఏదైనా ఒత్తిళ్లు ఎదురైనట్లు అనిపిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం’’ అని టీవీకే ముఖ్యనేత ఒకరు ఓ జాతీయ మీడియా సంస్థ వద్ద పేర్కొన్నారు. -
దళపతి విజయ్ అరెస్ట్..?
-
సడన్ సర్ప్రైజ్.. సంక్రాంతికి విజయ్ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఒక గుడ్‌న్యూస్, ఒక బ్యాడ్‌న్యూస్. ముందుగా బ్యాడ్‌న్యూస్ ఏంటంటే.. జన నాయగణ్ ఈ నెలలో రిలీజ్ అవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. గుడ్‌న్యూస్ ఏంటంటే.. సంక్రాంతికి జన నాయగణ్ లేకపోయినా విజయ్ బ్లాక్‌బస్టర్ మూవీ తేరి థియేటర్లలో రీరిలీజ్ అవుతోంది.పదేళ్ల సందర్భంగా..ఈ విషయాన్ని నిర్మాత ఎస్.కలైపులి థాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తేరి సినిమా వచ్చి ఈ ఏడాది ఏప్రిల్ 14కి పదేళ్లవుతుంది. ఈ క్రమంలో మళ్లీ అదే తారీఖున విజయ్ సినిమాను రీరిలీజ్ చేయాలని ఎప్పుడో ప్లాన్ చేశారు. కానీ విజయ్ చివరి మూవీ 'జననాయగణ్' సంక్రాంతికి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.తేరి రీరిలీజ్వారికి కాస్త ఊరటనిచ్చేందుకు తేరి రిలీజ్‌ను ముందుకు జరిపారు. ఈ సంక్రాంతికి అంటే జనవరి 15న మళ్లీ విడుదల చేస్తున్నారు. తేరి సినిమా విషయానికి వస్తే ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందించాడు. తేరీ తెలుగులో పోలీసుడు పేరిట డబ్ అయింది. ఈ సూపర్ హిట్ సినిమా పలు భాషల్లో రీమేక్ అయింది. గతేడాది హిందీలో బేబీ జాన్‌గా రీమేక్ అవగా బాలీవుడ్లో ఆకట్టుకోలేకపోయింది. ஜனவரி 15 முதல் அகிலமெங்கும்Thalapathy @actorvijay @Atlee_dir @gvprakash @Samanthaprabhu2 @iamAmyJackson #ThalapathyVijay #Theri #10YearsOfTheri pic.twitter.com/on3Pr30enp— Kalaippuli S Thanu (@theVcreations) January 10, 2026 చదవండి: బాలీవుడ్ ఎంట్రీ? స్పందించిన మలయాళ హీరోయిన్ -
'జన నాయగన్'కు కమల్ సపోర్ట్.. సెన్సార్ మారాలి
కోలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ విడుదలకు పలు ఇబ్బందులు రావడంతో ఆయన ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను సైతం తప్పుబడుతున్నారు. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ హీరోలతో పాటు రాజకీయ నేతలు కూడా విజయ్‌కు మద్ధతుగా నిలిచారు. అయితే, తాజాగా విజయ్ కోసం ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు కమల్‌హాసన్ ఒక ట్వీట్ చేశారు.కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతుగా అంటూ అధికారిక ప్రకటనను కమల్‌హాసన్ విడుదల చేశారు. కమల్ హాసన్ ప్రకటనలో పలు అంశాలను లేవనెత్తారు. 'భారతదేశ రాజ్యాంగం మనందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కానీ, దానిని నేడు కొందరు అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన విషయం కాదు.., కళాకారులకు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇచ్చే స్థానం గురించి కూడా ప్రతిబింబిస్తుంది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు.. ఇందులో రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, చిన్న వ్యాపారాలు కూడా భాగస్వామ్యంగా కలిసి నిర్మించే సమిష్టి శ్రమ. వీరి జీవనాధారం ఇందులో భాగమై ఉంటుంది.సమాజంలో ఇలాంటి అంశాల్లో స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటు పడుతుంది. ఆపై ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రభుత్వ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల నమ్మకం తగ్గుతుంది. తమిళనాడుతో పాటు భారతదేశం సినీ ప్రేమికులు కళల పట్ల ఎంతో ప్రేమను, పరిపక్వతను చూపుతారు. వారికి పారదర్శకతతో పాటు గౌరవం ఇవ్వండి. సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను మరోసారి పునఃపరిశీలించాలి. ఒక సినిమాకు ఇవ్వాల్సిన అనుమతులకు నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి. అందులో పారదర్శకంగా అధికారులు పనిచేయాలి. సినిమా నుంచి ఏదైనా సీన్‌కు అభ్యంతరం ఉంటే అందుకు సంబంధించిన మార్పులను వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమ మొత్తం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలతో చర్చించాల్సిన సమయం ఇదే. ' అని విజయ్‌కు మద్ధతుగా కమల్ ట్వీట్ చేశారు.For Art, For Artists, For the Constitution pic.twitter.com/sOrlOOLFtv— Kamal Haasan (@ikamalhaasan) January 10, 2026 -
దళపతి విజయ్.. గతంలోనూ ఇలాంటి అనుభవాలే
తమిళ స్టార్ హీరో విజయ్ 'జన నాయగణ్' వాయిదా పడింది. లెక్క ప్రకారం ఈరోజే థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ సెన్సార్ కారణాలతో ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతానికైతే కొత్త తేదీని ప్రకటించలేదు. 21వ తేదీన తర్వాత హియరింగ్ ఉంది. చూస్తుంటే ఈనెల రావడమే కష్టమే. దీని వెనక రాజకీయ కారణాలున్నాయని అభిమానులు, విజయ్ టీవీకే పార్టీ ఆరోపిస్తోంది. ఇదే కాదు గతంలోనూ విజయ్ చిత్రాలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి ఆ మూవీస్ ఏంటి?(ఇదీ చదవండి: వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చిన 28 సినిమాలు)2023లో రిలీజైన 'లియో'కు చాలానే సమస్యలు ఏర్పడ్డాయి. తమిళనాడు వ్యాప్తంగా మార్నింగ్ షోలు వేయనివ్వలేదు. రోజుకి ఇన్ని షోలు మాత్రమే వేయాలని కఠినంగా వ్యవహరించారు. టికెట్ రేట్లు పెంచుకునే అవకాశమివ్వలేదు. ఇలా పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ అద్భుతమైన ఓపెనింగ్స్ దక్కాయి. ఓవరాల్ రన్ ముగిసేసరికి ఆ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ మూవీగా నిలిచింది.2017లో రిలీజైన 'మెర్సల్'(అదిరింది).. రిలీజ్ తర్వాత రాజకీయ ఇబ్బందుల్లో ఎదుర్కొంది. జీఎస్టీ, నోట్ల రద్దు గురించి ఉన్న డైలాగ్స్ విమర్శలకు కారణమయ్యాయి. కొందరు నాయకులు.. ఏకంగా మూవీలో సీన్స్ తీసేయాలని డిమాండ్ చేశారు. అయినా సరే మేకర్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు నమోదు చేసింది.2021లో రిలీజైన 'మాస్టర్'కు కొవిడ్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి. అనుకున్న టైంకి విడుదల కాలేకపోయింది. థియేటర్ల కేటాయింపు, స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వకపోవడం లాంటివి ఇబ్బంది పెట్టాయి. అలానే ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతి ఇవ్వడంపై పలువురు పిటీషన్లు వేశారు. తర్వాత కోర్టు నుంచి ఆదేశాల వచ్చిన తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు నమోదు చేసింది. విజయ్ స్టామినా ఏంటనేది మరోసారి నిరూపించింది.(ఇదీ చదవండి: 'రాజాసాబ్' నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్టు.. పాత ధరలకే టికెట్స్)2018లో 'సర్కార్' విడుదలకు ముందే అడ్డంకులు ఎదుర్కొంది. ఓటింగ్ సరళి, రాజకీయ పార్టీ గుర్తులు ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. వాటిని మ్యూట్ లేదా పూర్తిగా తీసేయమనే డిమాండ్స్ వినిపించాయి. కానీ కొన్ని మార్పులు చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేశారు. ప్రారంభంలో బాగానే ఆడింది కానీ లాంగ్ రన్లో ఓకే ఓకే అనిపించుకుంది.2015లో రిలీజైన 'పులి'కి అయితే పైన చెప్పినట్లు కాకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. విడుదలయ్యే కొన్నిరోజుల ముందు వరకు సమస్యలు తప్పలేదు. కొన్నిచోట్ల షోలు రద్దయ్యాయి. ఇలా రకరకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఓపెనింగ్స్ బాగానే తెచ్చుకుంది. తర్వాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది.2012లో వచ్చిన 'తుపాకీ'కి అయితే విడుదలకు ముందే ఇబ్బందులు. టైటిల్, అలానే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాజకీయ, సామాజిక అంశాల దృష్ట్యా కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో చిన్న చిన్న మార్పులు చేసి పలు విషయాల్లో క్లారిటీ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. విజయ్ కెరీర్లోనే ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.2014లో వచ్చిన 'కత్తి' చిత్రానికి తిప్పలు తప్పలేదు. విడుదలకు ముందే నిర్మాతలపై విమర్శలు వచ్చాయి. శ్రీలంక తమిళ సెంటిమెంట్స్ అనుకూలంగా తీశారని రాజకీయ ఆరోపణలు చేశారు. బెదిరింపులు, చివరి నిమిషాల్లో హడావుడి వల్ల తమిళనాడు అంతటా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతటా క్లియరెన్స్ తెచ్చుకుని అనుకున్న తేదీనే థియేటర్లలోకి వచ్చింది. విమర్శలు, ఆరోపణలు తట్టుకుని నిలబడింది. కమర్షియల్ సక్సెస్ అందుకుని విజయ్ ఇమేజ్ మరింత పెంచింది.(ఇదీ చదవండి: విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!) -
విజయ్ 'జన నాయగణ్'కి షాక్.. ఈనెలలో రిలీజ్ కష్టమే!
దళపతి విజయ్ 'జన నాయగణ్' చిత్రాన్ని కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. లెక్క ప్రకారం ఈ రోజే (జనవరి 09) థియేటర్లలోకి రావాలి. కానీ సెన్సార్ సమస్యల వల్ల ఆలస్యమైంది. ఈ మేరకు మొన్ననే నిర్మాతలు.. వాయిదా ప్రకటన చేశారు. రెండు మూడు రోజుల్లో ఈ సమస్య పరిష్కారమైపోతుందిలే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పట్లో ఇది తీరేలా కనిపించట్లేదు. తాజాగా అప్డేట్ ఏంటంటే?సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న 'జన నాయగణ్' సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని ఈరోజు మద్రాసు హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు దాఖలు చేసిన అప్పీల్‌పై డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సెన్సార్ సర్టిఫికెట్ కోసం నిర్మాతలు కోర్టుపై ఒత్తిడి చేశారని డివిజన్ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు చిత్ర నిర్మాతలు, సోమవారం(జనవరి 11) నాడు సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. -
జన నాయగన్ 'బుక్ మై షో' రీఫండ్.. చరిత్రలో ఇదే తొలిసారి
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. సెన్సార్ బోర్డ్ నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే, ఇందులో రాజకీయ కోణం ఉన్నట్లు విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే 'బుక్ మై షో'(BookMyShow) ద్వారా లక్షల సంఖ్యలో టికెట్లు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్లో అయితే ఈ సంక్రాంతికి ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా 'జన నాయగన్'(Jana Nayagan) రికార్డ్ క్రియేట్ చేసింది.బుక్ మై షోలో రికార్డ్'జన నాయగన్' వాయిదా పడటంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నవారికి 'బుక్‌మైషో' రీఫండ్ చేస్తుంది. టికెట్‌కు సంబంధించిన డబ్బులను ఎలా రీఫండ్ చేసుకోవాలో కూడా మెయిల్ ద్వారా పంపింది. భారతీయ సినిమా చరిత్రలో ఇది అతిపెద్ద రీఫండ్ అని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ విషయంలో జన నాయగన్ కొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 5 లక్షలకు పైగా టిక్కెట్లను రీఫండ్ బుక్ మై షో చేస్తోంది. సుమారు రూ. 20 కోట్ల మేరకు ఆ సంస్ధ తిరిగి తన యూజర్స్‌కు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ కోసం 'కమల్‌హాసన్' మేనల్లుడుజన నాయగన్ సెన్సార్ విషయంలో కమిటీలోని నలుగురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ, కమిటీలోని ఒక సభ్యుడు భిన్నాభిప్రాయంతో ఉన్నట్లు CBFC ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ జారీ ఆగిపోయింది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను నిలిపివేయాలన్న సిబిఎఫ్‌సి నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే, విజయ్ సినిమా తరుఫున కమల్‌హాసన్ మేనల్లుడు సతీశ్ పరాశరణ్ వాదిస్తున్నారు. -
TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..
-
లేడీ సింగం ఇషా సింగ్‌పై బదిలీ వేటు
పుదుచ్చేరి ఐపీఎస్ అధికారిణి ఇషా సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆమెకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. యువలాయర్ టు ఐపీఎస్‌గా మారిన ఇషా సింగ్.. మొన్నీమధ్యే వార్తల్లో ప్రముఖంగా నిలిచిన సంగతి తెలిసిందే. పుదుచ్చేరి తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధినేత విజయ్ ఆ మధ్య నిర్వహించిన ర్యాలీలో ఇషా సింగ్ హైలైట్ అయ్యింది. జనసేకరణ చేయకుండా టీవీకే జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్‌ను అడ్డుకున్నారామె. ‘‘సభా ప్రాంగణంలో చాలా స్థలం ఉందని.. లోపలికి రావాలంటూ బయట ఎదురు చూస్తున్న కార్యకర్తలకు ఆయన మైక్ ద్వారా పిలుపు ఇచ్చారు. అయితే.. ‘‘ఎంతో మంది ప్రాణాలు తీశారు. ఇంక చాలదా?’’ అనే అర్థం వచ్చేలా కరూర్ తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇషా సింగ్ ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో లేడీ సింగంగా ఆమె పేరు ఒక్కసారిగా మారుమోగింది. అయితే.. ఆనాటి నుంచి ఇషా సింగ్‌కు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ ఎదురయ్యాయి. టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులే ఈ పని చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో హఠాత్తుగా ఆమె బదిలీ కావడం వెనుక టీవీకే ప్రమేయం కూడా ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. ఈ విషయంపై అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. అటు టీవీకే కూడా దీనిని ఖండించాల్సి ఉంది.1998 ముంబైలో జన్మించిన ఇషాసింగ్.. 2020లో యూపీఎస్సీ ఆల్ ఇండియా 191 ర్యాంకర్. ఆమె తండ్రి మాజీ ఐపీఎస్ వైపీ సింగ్(ముంబై పోలీస్ కమిషనర్‌గానూ పని చేశారు). తల్లి అభాసింగ్ లాయర్, సామాజిక కార్యకర్త. ఇషా సింగ్ నేషనల్ లా స్కూల్నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఐపీఎస్ కాకముందు.. లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. 2021 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఇషా సింగ్.. పుదుచ్చేరి పోలీస్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగానే నెట్టింట వైరల్ అయ్యారు. தவெக தொண்டர்களால் பாராட்டு பெற்ற Isha Singh IPS 🔥புதுச்சேரியில் விதித்த கட்டுப்பாடு தமிழ்நாட்டில் விதித்தால் உடனே தமிழ்நாடு அரசாங்கம் இடையூறு செய்கிறது என்று குற்றம் சொல்லுவான் தற்குறி விஜய்.🤦🏽♀️கரூர் சம்பவம் மூலம் விஜய் கூட்டத்தை எப்படி கெடுபிடிகள் செய்து நடத்தவேண்டும் என்று… pic.twitter.com/3DTUksgxqY— நந்தினி ❣️ (@Nandhini1360381) December 9, 2025 -
జన నాయగణ్ Vs పరాశక్తి.. విజయ్ రియాక్షన్ ఇదే..
శివకార్తికేయన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాశ్ నిర్మించిన ఈ మూవీలో రవిమోహన్, అధర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 10న రిలీజవుతోంది. అయితే దీనికంటే ఒకరోజు ముందు జనవరి 9న విజయ్ కథానాయకుడిగా నటించిన జననాయకన్ మూవీ విడుదలవుతోంది.పొంగల్‌కు సినిమా లేకపోవడంతో..దీని గురించి శివకార్తికేయన్ స్పందించాడు. శనివారం సాయంత్రం చెన్నైలో పరాశక్తి మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సినిమాను 2025 అక్టోబర్‌లో లేదా దీపావళికి విడుదల చేద్దామని నిర్మాత ఆకాశ్, నేను మాట్లాడుకున్నాం. అయితే విజయ్ మూవీ అక్టోబర్‌లో తెరపైకి రానుందని.. దీంతో పొంగల్‌కు వేరే సినిమా లేదని ప్రచారం జరగడంతో మనం పొంగల్‌కు వద్దామని ఆకాశ్ చెప్పారు.తీరా అదే సమయంలోఅయితే కొన్ని రోజుల తర్వాత విజయ్ నటిస్తున్న జన నాయగణ్ మూవీ పొంగల్‌కు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెంటనే నిర్మాత ఆకాశ్‌కు ఫోన్ చేసి మనం రిలీజ్ పోస్ట్‌పోన్ చేద్దామా అని అడిగాను. కానీ, అప్పటికే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో అది కష్టమన్నాడు. తర్వాత నేను విజయ్ మేనేజర్ జగదీష్‌కు ఫోన్ చేసి.. జననాయగణ్ రిలీజ్‌ను సంక్రాంతికి మార్చారా? అని అడిగాను. అందుకాయన.. అవును, మార్చాం. అయినా ఏం పర్లేదు, రెండు సినిమాలు విజయం సాధిస్తాయి. మీ సినిమా రిలీజ్ చేయండి అన్నారు. విజయ్‌తో మాట్లాడా..అప్పటికీ నాకు మనసు కుదుటపడక విజయ్‌తో అన్ని విషయాలు మాట్లాడాను. పొంగల్‌కు పదిరోజులు సెలవులు వస్తున్నాయి. కాబట్టి రెండు సినిమాలు విడుదల చేయొచ్చని చెప్పారు. దీనివల్ల ఎవరి సినిమా ప్రభావితం కాదన్నారు. నాకు, విజయ్‌కు మధ్య మంచి స్నేహం ఉంది. ఎవరేమనుకున్నా ఈ పొంగల్ అన్నాతమ్ముళ్లది. జనవరి 9న జన నాయగణ్ మూవీ చూడండి. 33 ఏళ్లుగా మనల్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి చివరి సినిమాను ఆదరించండి. ఆ తర్వాతి రోజు విడుదలవుతున్న పరాశక్తిని సైతం ఆదరించండి అని పేర్కొన్నాడు. -
హీరో విజయ్ సీఎం అవుతాడు: సుమన్
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనబోతున్నాడు. ఈ ఏడాది జరగబోయే ఎలక్షన్స్‌లో తను స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' తరపున పోటీ చేయనున్నాడు. అయితే ఈసారి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటున్నాడు సీనియర్ నటుడు సుమన్.జనాల్లో అనుమానాలుతాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జనాలు సెలబ్రిటీలను చాలారకాలుగా పరిశీలిస్తారు. ఈ హీరో నిజంగానే పొడుగ్గా ఉన్నాడా? ఎర్రగా ఉన్నాడా? ఆయన జుట్టు ఒరిజినలేనా? గొంతు తనదేనా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి హీరో సభకు వస్తుంటారు. మొదటిసారి వచ్చినంతమంది జనాలు రెండోసారి రారు. అయినా రెండోసారి, మూడోసారి కూడా పెద్ద మొత్తంలో జనాలు వస్తున్నారంటే అది భయంకరమైన ఫాలోయింగ్ అని అర్థం.సినిమా వదిలేయాల్సిందే!ఏదేమైనా ఆయన అదృష్టం, జాతకాన్ని బట్టి రాజకీయాల్లో ఫలితం ఉంటుంది. సినిమావాళ్లు రాజకీయాల్లోకి వచ్చి గెల్చారంటే మాత్రం మూవీస్ వదిలేయాల్సిందే! ఎందుకంటే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టి గెలిపించారంటే ఎక్కడా ఏ తప్పూ జరగకుండా చూసుకోవాలి! సినిమా షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఎక్కడైనా తప్పు జరిగిందనుకోండి.. ఆ నింద హీరోపైనే వేస్తారు.రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేంఅందుకే గెలిచేవరకు ఆగండి. గెలిచిన తర్వాత మాత్రం తప్పనిసరిగా సినీ జీవితాన్ని పక్కనపెట్టండి. సినిమాల్లోకి ఎప్పుడైనా రావొచ్చు.. కానీ రాజకీయాల్లోకి మళ్లీ వెళ్లలేం.. ప్రజలకు సేవ చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం.. ఇలా ఏమేం చేయాలో అన్నీ చేయండి.. ఆల్రెడీ సగంలో ఉన్న సినిమాలను పూర్తి చేసి ప్రజాసేవకు అంకితం కండి. ప్రజలకు అనేక సమస్యలున్నాయి. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్మీరు షూటింగ్‌కు వెళ్తే ఏమంటారంటే.. ఆయన షూటింగ్‌కు వెళ్లకుంటే ఈ పని పూర్తి చేయొచ్చు అని పెదవి విరుస్తారు. ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చాక ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాను పూర్తి చేశారు తప్ప మళ్లీ సినిమాల్లోకి వెళ్లలేదు. విజయ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటు వేయడానికి ఒకటీరెండు రోజుల ముందు ఏదైనా ఒక సంఘటన జరిగితే అంతా మారిపోతుంది. లేదు, ఆయనకు అదృష్టం ఉంటే కచ్చితంగా విజయ్ సీఎం అవుతాడు అని సుమన్ చెప్పుకొచ్చాడు.చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. గూండా అని పేరెంట్స్ తిట్టారు -
అరె.. ఏంట్రా ఇది! జన నాయగణ్ ట్రైలర్లో ఏఐ!
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ ఈ సంక్రాంతితో సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనున్నాడు. ఆయన నటించిన చివరి చిత్రం 'జన నాయగణ్'. తెలుగులో 'జన నాయకుడు' పేరిట రిలీజవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. నిన్న రిలీజైన ట్రైలర్‌తో ఇది నిజమేనని రుజువైంది.తెలుగు మూవీ రీమేక్భగవంత్ కేసరి సినిమాను, పాత్రలను ఇక్కడ మక్కీకి మక్కీ దింపినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే కొన్ని సీన్ల కోసం ఏఐని వాడారంటూ ప్రచారం మొదలైంది. ట్రైలర్లో ఓ చోట గూగుల్ జెమిని ఏఐ మార్క్ కనిపించగా దానికి సంబంధించిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సినిమావిజయ్ చిట్టచివరి సినిమాలో కూడా ఏఐని ఉపయోగించడం ఏంట్రా బాబూ.. పైగా రీమేక్ సినిమాకు ఏఐ అవసరం ఏమొచ్చింది? రూ.400 కోట్ల బడ్జెట్.. ఈ చిన్న మిస్టేక్ కూడా గమనించుకోకపోతే ఎలా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. జన నాయగణ్ విషయానికి వస్తే.. ఇందులో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం జనవరి 9న విడుదలవుతోంది. They used AI Gemini shot and didn't bother to remove the watermark 😭#JanaNayagan pic.twitter.com/voi66tbLg0— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) January 3, 2026 చదవండి: అమ్మాయి చున్నీ లాగే సీన్.. అమ్మానాన్నల చేతిలో చీవాట్లు -
'జన నాయకుడు' ట్రైలర్ రిలీజ్.. రీమేక్‌పై క్లారిటీ
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. తెలుగులో దీన్ని 'జన నాయకుడు' పేరుతో ఈ నెల 9వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇది బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రానికి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. మొన్నీమధ్య డైరెక్టర్ హెచ్.వినోద్ మాట్లాడుతూ ఇది దళపతి మూవీ అని చెప్పాడు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు ట్రైలర్‌తో క్లారిటీ వచ్చేసింది.అంతా అనుకుంటున్నట్లు ఇది 'భగవంత్ కేసరి' రీమేకే. మెయిన్ పాయింట్‌ని ఉన్నది ఉన్నట్లు దింపేశారు. శ్రీలీల పాత్ర పేరునే ఇక్కడ మమిత బైజు పాత్రకు కూడా పెట్టేశారు. ట్రైలర్ అయితే సాలిడ్‌గా ఉంది. కాకపోతే చాలా పోలికలు కనిపిస్తున్నాయి. అలానే విజయ్ రాజకీయ ఎంట్రీకి పనికొచ్చేలా కూడా ఈ మూవీ ఉండబోతుందని.. ట్రైలర్లో డైలాగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాని చూసేశారు. మరి ఇప్పుడు రాబోతున్న 'జన నాయకుడు' తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి ఎలాంటి ఆదరణ దక్కనుందో చూడాలి? ఇదే రోజున ప్రభాస్ 'రాజాసాబ్' కూడా థియేటర్లలోకి రానుంది. -
పొత్తుపై విజయ్ పార్టీ సంచలన ప్రకటన
సాక్షి చెన్నై:తమిళనాట పొలిటికల్ హీట్ వేడెక్కింది. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలన్నీ గెలుపుకోసం ప్రణాళికలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ స్టార్ విజయ్ స్థాపించిన విజయ్ తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పొత్తులపై ఆపార్టీ అధికార ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ "సెక్యులరిజం భావజాలంలో కాంగ్రెస్, టీవీకే సహజంగానే మిత్రులు, మతతత్వానికి రెండు పార్టీలు వ్యతిరేకులు, ఆ విషయాలలో రెండు పార్టీలు సహజంగానే భాగస్వామ్యులు అంతేకాకుండా రాహుల్ గాంధీ, విజయ్ ఇద్దరు మంచి మిత్రులు ఈ విధంగా చూస్తే కాంగ్రెస్, టీవీకే రెండు పార్టీలు పొత్తుపెట్టుకోవడానికి చాలా అవకాశాలున్నాయి". అని ఆయన అన్నారు. కానీ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల అక్కడి కాంగ్రెస్ నేతలు పొత్తుకు అంగీకరించకపోవచ్చు అని తెలిపారు.ఒకవేళ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగితే మైనార్టీల ఓట్లతో పాటు బీజేపీ వ్యతిరేఖ ఓట్లను చీల్చకుండా ఒకే పార్టీ పొందవచ్చు అన్నారు. అయితే ఈ పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుల గురించి మాట్లాడడం ఇప్పుడు సరైన పద్ధతి కాదని అన్నారు. అయితే కాంగ్రెస్-టీవీకే మధ్య ఇది వరకే మంచి సయోధ్య కుదిరిందని గతేడాది డిసెంబర్ 25న నిర్వహించిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నేతలు హజరయ్యారని ఆయన తెలిపారు.అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్యా ఈ పొత్తు దాదాపు అసాధ్యం ఎందుకంటే ప్రస్తుతం ఇండియా కూటమిలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రధాన భాగస్వామి అంతేకాకుండా రాహుల్ గాంధీకి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మంచి సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకేతో కాంగ్రెస్ జతకట్టే అవకాశాలు చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు.తమిళనాడులో యాక్టర్ విజయ్‌కు చాలా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ ఫాలోయింగ్‌ని క్యాచ్ చేయడానికి 2024లో తమిళిగ వెట్రి కజగం (టీవీకే) అనే పార్టీని స్థాపించారు. స్టార్డమ్కు అనుగుణంగానే లక్షల మందితో సభలు నిర్వహించి అందరిదృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందారు. ఈ తొక్కిసలాట ఘటన అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. -
హీరో విజయ్ పక్కన కచ్చితంగా నటిస్తా: హీరోయిన్
హీరో విజయ్‌కు జంటగా కచ్చితంగా నటిస్తానంటోంది హీరోయిన్, నిర్మాత సింథియా లూర్డే. సింథియా ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఈమె నిర్మించి, కథానాయికగా నటించిన చిత్రం అణలి. దినేశ్ దీన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డైరెక్టర్ పి.వాసు వారసుడు శక్తి వాసు ప్రతినాయకుడిగా నటించగా, బాలీవుడ్ నటుడు కబీన్ దుహాన్ సింగ్ మరో విలన్‌గా యాక్ట్ చేశాడు.జనవరి 2న రిలీజ్అభిషేక్, ఇళంగో కమరవెల్, నటి ఇనయ, జై సూర్య, మాథ్యూ వర్గీస్, అశోక్ పాండియన్, జాన్సన్ దివాకర్, వినోద్ సాగర్, బేబి శిమాలి, శివ ఇతర పాత్రల్లో నటించారు. రామలింగం చాయాగ్రహణం, దీపన్ చక్రవర్తి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 2న తెరపైకి రానుంది.హీరో లేడుసోమవారం సాయంత్రం చెన్నైలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ సింథియా లూర్డే మాట్లాడుతూ.. వర్ణాశ్రమమ్, దినసరి చిత్రాల తర్వాత తాను నిర్మించిన మూడో సినిమాయే అణాలి అని పేర్కొంది. ఇందులో తనే హీరోయిన్ అని.. హీరో ఎవరూ లేరంది. హీరోలు కూడా నటించేందుకు సంకోచించే యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా తానే రిస్క్ తీసుకుని నటించానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి..ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో కథే ఉండటం లేదని, అయితే దినేష్ దీన చెప్పిక కథలో బలం ఉండటంతో ఈ సినిమా ఒప్పుకున్నానంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా పదివేల కంటైనర్లు కలిగిన యార్డ్‌లో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులపాటు అక్కడే షూటింగ్ నిర్వహించినట్లు చెప్పింది. విజయ్ సరసన నటిస్తావిజయశాంతి తర్వాత పూర్తి యాక్షన్ హీరోయిన్గా నటించింది తానేనని పేర్కొంది. ఈ సినిమా రిలీజ్ హక్కులను రెడ్ జాయింట్ మూవీస్ సంస్థ పొందిందని తెలిపింది. జనవరి రెండున విడుదల చేస్తున్నామంది. హీరో విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పారంటున్నారని.. కానీ ఆయన మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. విజయ్ సరసన త్వరలోనే కచ్చితంగా నటిస్తానని సింథియా (Cynthia Lourde) బల్లగుద్ది చెప్పింది. -
దళపతి విజయ్ 'వీడ్కోలు'.. ఆ హీరోల్లా చేయడుగా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. నటనకు వీడ్కోలు పలికేశాడు. ఇతడి చివరి సినిమా 'జన నాయగణ్'.. జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా మలేసియాలో ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే విజయ్ మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మరి మాటపై కచ్చితంగా నిలబడతాడా? అసలు విజయ్ ప్లాన్ ఏంటి?నటీనటులకు రాజకీయాలు కొత్తేం కాదు. టాలీవుడ్లో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్.. ఇలా చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు చేశారు. చిరంజీవి పూర్తిగా రాజకీయాలు అని అన్నారు గానీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి మేకప్ వేసుకున్నారు. పవన్ కూడా మధ్యలో పాలిటిక్స్ అని కొన్నాళ్లు నటనకు గ్యాప్ ఇచ్చారు. మళ్లీ సినిమాలు చేశారు. పూర్తిగా రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన అయితే ఈయనకు లేదు. పలు సందర్భాల్లో ఆయన మాటలతోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు రాజకీయాలు అన్నారు గానీ తర్వాత వచ్చి మళ్లీ సినిమాలు చేసుకున్నారు. అయితే తమిళంలో ఎమ్జీఆర్, జయలలిత మాత్రం యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి మరీ రాజకీయాల్లోకి వెళ్లారు. సక్సెస్ అయ్యారు కూడా. మరి దళపతి విజయ్ తన మాట మీద నిలబడి పూర్తిగా సినిమాలకు దూరమైపోతాడా లేదా అనేది చూడాలి?ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ 'టీవీకే' పార్టీ కూడా బరిలో ఉంది. ఇందులో గెలిచేసి విజయ్ ముఖ్యమంత్రి అయిపోతాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఈ హీరోకి కూడా అంత పెద్ద కోరికలేం లేవు. ఒకవేళ సీఎం అయితే సినిమాల్ని పూర్తిగా పక్కనబెట్టేయొచ్చు. కొన్ని స్థానాలు గెలుచుకుంటే మాత్రం అప్పటి పరిస్థితులు బట్టి విజయ్ ఆలోచన మారే అవకాశముంటుంది.విజయ్ ఫ్యాన్స్ అయితే తమ హీరో కచ్చితంగా మాటమీద నిలబడతానని బల్లగుద్ది చెబుతున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే కచ్చితంగా తిరిగి సినిమాలు చేస్తాడని కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి రెండేళ్లు ఆగితే ఈ విషయంపై కచ్చితంగా క్లారిటీ వచ్చేస్తుంది. ప్రస్తుతం తమిళంలో స్టార్ హీరోల్లో విజయ్ టాప్‌లో ఉంటాడు. రజనీ, కమల్ దాదాపు రిటైర్మెంట్ దశకు వచ్చేశారు. అజిత్ కూడా చాలా ఆలస్యంగా సినిమాలు చేస్తున్నాడు. సూర్య, విక్రమ్ లాంటి హీరోలున్నా వాళ్లు హిట్స్ అందుకోలేకపోతున్నారు. శివకార్తికేయన్, కార్తీ లాంటి హీరోలు స్టార్ రేంజ్‌కి చేరుకోవడానికి ఇంకా టైముంది. మరి విజయ్ స్థానాన్ని భర్తీ చేసే ఆ తమిళ హీరో ఎవరో? -
దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
ఫ్యాన్స్ అత్యుత్సాహం.. కిందపడ్డ హీరో విజయ్
తమిళ స్టార్ హీరో విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన చివరి సినిమా "జన నాయగణ్" మూవీ ఆడియోలాంచ్ ఈవెంట్ మలేషియాలో ఘనంగా నిర్వహించారు. భారీ స్టేజ్ సెటప్, లైటింగ్, సౌండ్ డిజైన్ ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌కు లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారు. వారి కోసం విజయ్ స్టేజీపై స్టెప్పులేశాడు.కిందపడ్డ విజయ్మలేషియాలో అంతా అనుకున్నట్లుగానే ఈవెంట్ విజయవంతంగా జరిగింది. అయితే భారత్‌కు తిరిగొచ్చిన విజయ్‌కు చెన్నైలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. చెన్నై ఎయిర్‌పోర్టులో హీరోను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అత్సుత్సాహంతో ఎగబడ్డారు. దీంతో తోపులాట కారణంగా విజయ్ కారు ఎక్కే సమయంలో తడబడి కిందపడిపోయాడు. వెంటనే సిబ్బంది ఆయన్ను పైకి లేపి క్షేమంగా కారు ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సినిమావిజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగణ్. ఇదే విషయాన్ని ఆయన తాజాగా మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్లోనూ స్పష్టం చేశాడు. ఈ మూవీ విషయానికి వస్తే.. హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మమితా బైజు కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నాడు. తెలుగులో వచ్చిన నేలకొండ భగవంత్ కేసరి సినిమానే కొన్ని మార్పులు చేర్పులు చేసి జననాయగణ్గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇక తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. రాజకీయాల కోసం ఆయన సినిమాలకు గుడ్‌బై చెప్పాడు.மலேசியாவில் இருந்து சென்னை திரும்பிய விஜய்க்கு உற்சாக வரவேற்பு அளித்த ரசிகர்கள்..! #Vijay #JanaNayaganAudioLaunch #PoojaHegde #Rollsroyce #NAnand #ThalapathyThiruvizha #ThalapathyKacheri #JanaNayagan #AudioLaunch #Malaysia #TamilNews #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/F1TIpaGjXR— KAVI (@tamiltechstar) December 29, 2025చదవండి: ఆస్పత్రిలో దర్శకుడు భారతీరాజా -
సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్
-
'ఇదే నా చివరి సినిమా'.. అఫీషియల్‌గా ప్రకటించిన విజయ్
కోలీవుడ్ స్టార్ దళపతి తన కెరీర్లో నటిస్తోన్న చివరి సినిమా జన నాయగణ్. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు ఈ విషయాన్ని ప్రకటించారు. తన కెరీర్లో ఇదే చివరి సినిమా కానుందని వెల్లడించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.తాజాగా మలేసియా నిర్వహించిన ఆడియో లాంఛ్ ఈవెంట్లో విజయ్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే తనకిదే చివరి సినిమా మరోసారి స్పష్టం చేశారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈవెంట్లో అఫీషియల్‌గా ప్రకటించారు. వేలాదిమంది అభిమానుల మధ్య తన నిర్ణయాన్ని వెల్లడించారు. విజయ్ మాట్లాడుతూ..'నా ఫ్యాన్స్, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్లో ఇంత మద్దతుగా నిలిచిన వారి కోసం నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్ బై చెబుతున్నా' అని అన్నారు. -
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్.వినోద్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జననాయకన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. విజయ్ సతీమణి పాల్గొంటారా? జననాయకన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్ భార్య సంగీత, కొడుకు జెసన్ సంజయ్ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది. -
'జన నాయగణ్'.. విజయ్ పాడిన మరో పాట రిలీజ్
తమిళ హీరో దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగణ్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రెండు పాటలు రాగా తాజాగా మూడో పాటని విడుదల చేశారు. 'చెల్ల మగళే' అంటూ సాగే ఈ క్యూట్ గీతాన్ని విజయ్ పాడటం విశేషం. 'దళపతి కచేరీ' అంటూ సాగిన తొలి పాటలోని ఓ పోర్షన్ని విజయ్ గాత్రమందించాడు. ఈ పాట మాత్రం మొత్తంగా విజయ్ ఆలపించాడు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్)ఈ సినిమా.. తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని చాన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ పాట చూస్తే అదే అనిపించింది. ఒరిజినల్ మూవీలోనూ హీరో బాలకృష్ణ-పాప శ్రీలీల మధ్య ఓ సాంగ్ ఉంటుంది. అది ఇది ఒకటేలా అనిపిస్తున్నాయి. తెలుగులోనూ ఈ మూవీ 'జన నాయకుడు' పేరుతో విడుదల చేస్తున్నారు.విజయ్.. తనకు ఇది చివరి సినిమా అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించాడు. వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో ఇతడి పార్టీ పోటీపడనుంది. అందులో విజయ్ ఏ మేరకు విజయాన్ని అందుకుంటాడో చూడాలి? ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. మమిత బైజు కూడా కీలక పాత్ర చేసింది. హెచ్.వినోద్ దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించాడు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు) -
స్టార్ హీరో సినిమా వేడుక.. మలేషియాకు ఫ్యాన్స్ క్యూ
చెన్నై ఎయిర్పోర్ట్ కిటకటిలాడుతుంది. మలేషియాకు వెళ్లే విమానాలు ఫుల్ అయిపోయాయి. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా..? విజయ్ 'జన నాయగన్' కోసం. తమిళ టాప్ హీరో విజయ్ నటించిన ఈ మూవీ 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్ స్టేడియం (Bukit Jalil Stadium)లో డిసెంబరు 27న జన నాయగన్ మూవీ వేడుక నిర్వహించనున్నారు. దీంతో తమిళనాడు నుంచి ఆయన ఫ్యాన్స్ భారీగా మలేషియాకు ప్రయాణం అయ్యారు. దీంతో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ కోసం భారీగా క్యూ కట్టేశారు.మలేషియాలో తమిళ సినిమాలకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా విజయ్‌కు, విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఆడియో వేడుకను అక్కడ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఆకర్షించవచ్చని మేకర్స్ ప్లాన్ చేశారు. బుకిట్ జలీల్ స్టేడియం దక్షిణాసియాలోని అతిపెద్ద స్టేడియంలలో ఒకటి. ఇందులో 90వేల మందికి పైగా సీటింగ్ సామర్థ్యం ఉంది. ఈ కార్యక్రమంలో విజయ్‌తో పాటు చిత్ర యూనిట్, సంగీత దర్శకుడు అనిరుధ్ పాల్గొననున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు పూర్తిగా అమ్ముడైపోయాయి. ఈ వేడుకను పూర్తిగా సినిమా, సంగీతానికే పరిమితం చేయాలని మలేషియా పోలీసులు ఇప్పటికే స్పష్టమైన నియమాలు పెట్టారు. రాజకీయ ప్రసంగాలు, చిహ్నాలు అక్కడ కనిపించకూడదని నిషేధించారు. Crowd at Chennai Airport Immigration 🤯 — Only for #JanaNayagan Audio Launch 🔥 pic.twitter.com/dtW5hlsvgO— VCD (@VCDtweets) December 26, 2025 -
జన నాయగణ్ భారీ ఈవెంట్.. మలేసియా పోలీసుల షాక్.!
పాలిటిక్స్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయ అరంగేట్రానికి ముందు ఇదే నా చివరి సినిమా అవుతుందని ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హెగ్డే కనిపించనుంది. ఈ సినిమా పొంగల్ బరిలో నిలిచింది.ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్స్‌తో బిజీ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే గ్రాండ్ ఆడియా లాంఛ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళులు ఎక్కువగా ఉండే మలేసియాలో ఈ భారీ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమందికి పైగా ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 27న జరగనున్న ఈవెంట్ ద్వారా గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.అయితే ఈ భారీ ఈవెంట్ నేపథ్యంలో మలేసియా పోలీసులు అలర్ట్ అయ్యారు. కౌలాలంపూర్‌లో జరగనున్న ఈ బిగ్ ఈవెంట్‌పై ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరించారు. టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రసంగాలు చేయవద్దని మలేసియా పోలీసులు సూచించారు. రాజకీయ ప్రసంగాలు, నినాదాలు చేయడం, బ్యానర్ల వినియోగంపై నిషేధం విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ బుకిట్ జలీల్ స్టేడియంలో జరగనుంది.కాగా.. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
‘విజయ్‌తో రాహుల్’.. సీక్రెట్ వెల్లడించిన టీవీకే నేత
చెన్నై: తమిళనాడు రాజకీయ రంగస్థలంపై సరికొత్త సమీకరణలు మొదలయ్యాయి. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పార్టీతో ప్రజల్లోకి దూసుకుపోతుంటే, జాతీయ నేత రాహుల్ గాంధీ ఆయనకు సంఘీభావం తెలపడం సంచలనంగా మారింది. ఆమధ్య కరూర్‌లో జరిగిన విషాదకర ఘటన తర్వాత విజయ్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో, రాహుల్ ఆయనకు స్వయంగా ఫోన్ చేసి, మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఆ ఫోన్ కాల్ వెనుక అసలు కథ.. తాజాగా కన్యాకుమారిలో జరిగిన ఒక కార్యక్రమంలో టీవీకే నేత ఆధవ్ అర్జున ఒక ఫోన్ కాల్ రహస్యాన్ని బయటపెట్టారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ మానసిక వేదనలో ఉన్నప్పుడు, ఆయనకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు. ‘బ్రదర్.. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను, దేనికీ చింతించకు’ అంటూ ఫోన్లో రాహుల్ అన్నారని ఆధవ్ అర్జున తెలిపారు. ఈ భరోసా వెనుక ఉన్నది కేవలం వారి వ్యక్తిగత స్నేహం మాత్రమే కాదని, లోతైన రాజకీయ వ్యూహం ఉందనే చర్చ సర్వత్రా మొదలైంది. అయితే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఇలా నేరుగా విజయ్‌కు మద్దతు పలకడం అధికార పక్షానికి మింగుడు పడటం లేదు.డీఎంకేకు ఇది ‘ప్లాన్ బి’ హెచ్చరికా? తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే నీడలో జూనియర్ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్, ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తోందా? అన్న అనుమానాలు ఇప్పుడు విశ్లేషకుల్లో మొదలయ్యాయి. అయితే రాహుల్ గాంధీ, విజయ్ మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. 2009లోనే విజయ్‌కు యూత్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ భావించారు. ఇప్పుడు విజయ్ సొంత పార్టీ పెట్టడంతో, రాహుల్ ఆయనకు అండగా నిలవడం ద్వారా డీఎంకేపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది భవిష్యత్తులో డీఎంకేకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.బహిర్గతమైన అసహనం విజయ్ పార్టీ కార్యక్రమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి డీఎంకే ఇప్పటికే అప్రమత్తమైంది. అరుమనైలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వెనుక డీఎంకే ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు కూడా విజయ్ వైపు మొగ్గు చూపుతుండటం విశేషం. 55 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న సెంగుట్టయ్యన్ వంటి వారు విజయ్‌కు మద్దతుగా నిలవడం చూస్తుంటే భవిష్యత్తులో టీవీకే ఒక బలమైన శక్తిగా ఎదగబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి.2026 సమరానికి నాంది 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాహుల్-విజయ్ దోస్తీ తమిళనాడులో కొత్త కూటములకు బాటలు వేసేలా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును విజయ్ వైపు మళ్లిస్తే, రాష్ట్రంలో దశాబ్దాల రాజకీయ చరిత్ర మారిపోతుంది. 1967లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి సాధించాలనే కాంగ్రెస్ ఆశలకు విజయ్ ఒక వేదికగా మారతారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: కెనడాలో భారత యువతి హత్య.. కీలక వివరాలు వెల్లడి -
విజయ్ ‘మైనారిటీ’ వ్యూహం.. స్టాలిన్ సర్కార్ వణుకు
తమిళనాడు రాజకీయాల్లో ఆ పార్టీ పేరు మార్మోగుతోంది.. అదే ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే). దశాబ్దాలుగా డీఎంకే (డీఎంకే)కి కంచుకోటగా ఉన్న మైనారిటీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని టీవీకే అధినేత, నటుడు విజయ్ వేస్తున్న అడుగులు ఇప్పుడు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ రచిస్తున్న ‘మైనారిటీ’ వ్యూహం, స్టాలిన్ సర్కార్‌ను కలవరపెడుతోంది. తమిళనాడులో మైనారిటీ ఓట్లు ఎప్పుడూ నిర్ణయాత్మక శక్తిగా ఉంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ముస్లిం, క్రైస్తవ ఓటర్లు డీఎంకే వెన్నంటే ఉంటూ, ఆ పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ రూపంలో ఒక బలమైన ప్రత్యామ్నాయం రావడంతో ఈ ఓటు బ్యాంకులో చీలిక వస్తుందనే ఆందోళన డీఎంకే క్యాంపులో మొదలైంది.మారిన సమీకరణలుతమిళ సినీ రంగంలో అగ్రనటునిగా వెలుగొందుతున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. క్రైస్తవ మత నేపథ్యం ఉండటం విజయ్‌కు ఒక అదనపు బలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాంప్రదాయకంగా డీఎంకే వెన్నంటి ఉండే క్రైస్తవ, ముస్లిం ఓటర్లలో ఒక వర్గం విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండటంతో, అధికార పార్టీలో కలవరం మొదలైంది. యువతలో ఉన్న క్రేజ్‌కు తోడు మైనారిటీల మద్దతు కూడా తోడైతే విజయ్ బలమైన శక్తిగా ఎదుగుతారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.చెన్నై నుంచి తిరునల్వేలికి..డీఎంకే పార్టీ తన వార్షిక క్రిస్మస్ వేడుకలను సాధారణంగా రాజధాని చెన్నైలో వైభవంగా నిర్వహిస్తుంటుంది. అయితే ఈసారి అనూహ్యంగా ఆ వేదికను దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలికి మార్చింది. ఈ మార్పు వెనుక బలమైన రాజకీయ కారణం ఉంది. దక్షిణ జిల్లాల్లో క్రైస్తవ జనాభా ప్రభావం చాలా ఎక్కువ. విజయ్ ప్రభావం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న డీఎంకే, ముందస్తుగా మైనారిటీలను ఆకట్టుకునేందుకు నెల్లైను వేదికగా ఎంచుకుని తన బలాన్ని ప్రదర్శించింది.నేతలతో స్టాలిన్ ఆత్మీయ భేటీతిరునల్వేలిలో జరిగిన 'క్రిస్తువ నల్లెన్న ఇయక్కం' సమ్మేళనం కేవలం పండుగ వేడుకలా కాకుండా ఒక రాజకీయ సభలా సాగింది. ఈ కార్యక్రమంలో వివిధ చర్చిల ఆర్చ్ బిషప్‌లు, సీనియర్ సువార్తికులు పాల్గొని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు తమ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కృషిని వారు కొనియాడారు. చర్చి పెద్దల సమక్షంలో స్టాలిన్ ప్రార్థనలు చేయడం ద్వారా మైనారిటీ సమాజంతో తనకున్న అనుబంధాన్ని మరోమారు గుర్తుచేశారు.ముఖ్యమంత్రి వరాల జల్లుసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ క్రైస్తవ వర్గాల దీర్ఘకాలిక డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వ సహాయక విద్యాసంస్థల నియామక ప్రక్రియలో విశ్వవిద్యాలయ నామినీ పాత్రను తొలగించడం ద్వారా ఆయా సంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. పురాతన చర్చిల పునరుద్ధరణకు గ్రాంట్లు పెంపు, తీర్థయాత్రలకు సబ్సిడీలు, స్మశానవాటికలకు భూమి కేటాయింపు వంటి వరాలను ప్రకటించడం ద్వారా మైనారిటీ ఓటర్ల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు.లోలోపల అసంతృప్తి సెగలుపైన పటారం లోన లోటారం అన్నట్లుగా, డీఎంకే ప్రభుత్వపై మైనారిటీ వర్గాల్లో కొంత అసంతృప్తి కూడా గూడుకట్టుకుని ఉంది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని చర్చి యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే విద్యా వ్యవస్థలో పెరుగుతున్న రాజకీయ జోక్యం పట్ల కూడా విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ఇలాంటి సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తే, డీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది.బీజేపీపై విమర్శలుమరోవైపు బీజేపీని లక్ష్యంగా చేసుకుని స్టాలిన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దేశంలో మైనారిటీలకు రక్షణ లేదని, రాజ్యాంగంలోని లౌకికవాద స్ఫూర్తిని బీజేపీ దెబ్బతీస్తోందని ఆయన విమర్శించారు. ఒకే మతం, ఒకే భాష పేరుతో వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ఏఐఏడీఎంకేను కూడా మైనారిటీ వ్యతిరేక పార్టీగా చిత్రించే ప్రయత్నం చేశారు. మైనారిటీల రక్షణ కేవలం డీఎంకేతోనే సాధ్యమనే భరోసా ఇచ్చారు.ప్రతిపక్షాల ఎదురుదాడిస్టాలిన్ విమర్శలపై బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా స్పందించారు. కేవలం ఓట్ల రాజకీయాల కోసం ముఖ్యమంత్రి సమాజంలో విభజన తెస్తున్నారని, మతాల మధ్య విషం చిమ్ముతున్నారని ఆమె ధ్వజమెత్తారు. డీఎంకే వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. ఇదంతా చూస్తుంటే.. మైనారిటీ ఓట్ల కోసం జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.విజయ్ క్రిస్మస్ ప్లాన్ఈ రాజకీయ పోరులో విజయ్ అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి. త్వరలో విజయ్ కూడా క్రిస్మస్ వేడుకలను నిర్వహించబోతున్నారని సమాచారం. ఒక నటుడిగా కాకుండా ఒక రాజకీయ నేతగా ఆయన ఇచ్చే సందేశం మైనారిటీలను ఎంతవరకు ప్రభావితం చేస్తుందనేది కీలకంగా మారింది. ఒకవేళ విజయ్ మైనారిటీ ఓట్లను చీల్చగలిగితే, అది 2026లో డీఎంకే విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుంది. మొత్తానికి తమిళనాడులో ఇప్పుడు ‘మైనారిటీ ఓటు’ గెలుపు గుర్రాన్ని నిర్ణయించే కీలక అస్త్రంగా మారింది.ఇది కూడా చదవండి: రష్యా సైన్యంలో భారత విద్యార్థి బందీ.. డ్రగ్స్ కేసుతో బ్లాక్మెయిల్ -
విజయ్‌కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్‌ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్‌కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్‌నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్‌కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్‌నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్‌పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్‌నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
చతికిలపడుతున్న తమిళ సీనియర్ హీరోలు..
సినిమా అనే ప్రపంచంలో ఎప్పుడూ రేసు కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరు ఎలాంటి కథలతో చిత్రాలు చేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే. తద్వారా ఆర్థికపరమైన లాభాలు ప్రధానాంశంగా మారతాయి. సినిమా శతాబ్ది వేడుకను జరుపుకున్నా ఇప్పటికీ ఈ ఫార్ములాలో ఎలాంటి మార్పులేదు. ఉండదు కూడా. వైవిధ్యం అనేది దర్శకుడి సృజనాత్మకతపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రేక్షకులు మోనాటమిని అసలు ఇష్టపడడం లేదు. అది ఏ సూపర్‌స్టార్ హీరోగా నటించినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు గడ్డుకాలం ఏర్పడింది.ఇందుకు చిన్న ఉదాహరణ ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన వేట్టయన్, కూలీ మూవీతో పాటు కమలహాసన్ నటించిన థగ్ లైఫ్, విజయ్ నటించిన లియో, గోట్, అజిత్ నటించిన విడాముయర్చి , సూర్య నటించిన రెట్రో, కంగువ వంటి చిత్రాలే. అదేవిధంగా జయాపజయాలు ఎవరి చేతిలోనూ ఉండవన్నది జగమెరిగిన సత్యం. సినిమా, జయాపజయాలు అన్నవి నిరంత ప్రక్రియ. అయితే, ప్రస్తుతం కోలీవుడ్ సీనియర్లు చతికిలపడుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో తమిళ ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోలు, కొత్త దర్శకులు దూకుడు చూపుతున్నారు. వారు చేసిన చిన్న చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఆదరణ లభిస్తుంది. పెద్ద హీరోల సినిమాలకు ప్రచారం ఎక్కువ. కానీ, కలెక్షన్స్ మాత్రం ఆ రేంజ్లో ఉండటం లేదు.సినియర్ నటి సిమ్రాన్ కుడా ప్రస్తుతం సినిమాల విషయంలో జరుగుతున్న ఫాల్స్ ప్రచారాన్ని ఎండగట్టారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ, డ్రాగన్, 3బీహెచ్‌కే వంటి చిత్రాలు మంచి ప్రశంసలు అందుకొవడంతో పాటు , రెండు వారాలు దాటిన తరువాత కూడా థియేటర్లకు వెళ్లినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. అయితే పెద్ద పెద్ద స్టార్స్ నటించిన చిత్రాలే పలు కోట్ల రూపాయలు వసూళ్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాల మోత మోగుతోందన్నారు. అయితే అలాంటి చిత్రాలు విడుదలైన వారం తరువాత వెళితే థియేటర్లలో ప్రేక్షకులే ఉండడం లేదన్నారు. అయినప్పటికీ అంత వసూలు, ఇంత వసూలు అని ఎందుకు ప్రచారం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదని సిమ్రాన్ పేర్కొన్నారు. -
తమిళ ప్రజలను కృతజ్ఞతలు చెప్పిన విజయ్
-
రెండు ప్రమాదాల్లో నలుగురి మృతి
ఆత్మకూరు/అచ్యుతాపురం రూరల్: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, అనకాపల్లి జిల్లాలో శనివారం రాత్రి మోటారు సైకిల్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన చవల మాధవ (38), మనోజ (35) దంపతులు. వీరి కుమార్తె ఆత్మకూరులోని ఏపీ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం పేరెంట్ మీట్ ఉండడంతో వీరు వెళ్లారు. ఇంటివద్ద నుంచి భోజనం తీసుకెళ్లి కుమార్తెకు తినిపించారు. అక్కడి నుంచి బైక్ మీద ఇంటికి వెళుతుండగా.. నెల్లూరు–ముంబై రహదారిలో ఇంజినీరింగ్ కళాశాల సమీపంలోకి వచ్చేసరికి బద్వేల్ నుంచి నెల్లూరు వెళుతున్న ఇన్నోవా కారు రాంగ్రూట్లో వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మంచులో దారి సరిగా కనిపించక.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో శనివారం రాత్రి మోటారు సైకిల్ కరెంటు స్తంభాన్ని ఢీకొనడంతో మునగపాక మండలం గణపర్తి గ్రామానికి చెందన ధనువిజయ్ (19), చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూలి దుర్గ (20) మరణించారు. ఎస్ఐలు సుధాకర్, వెంకటరావు తెలిపిన మేరకు.. తండ్రి చనిపోవడంతో దూలి దుర్గ అచ్యుతాపురం మండలం చోడపల్లిలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. గణపర్తికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ధనువిజయ్ లైటింగ్ పనులకు సహాయకుడిగా వెళుతున్నాడు. వీరికి జగన్నాథపురానికి చెందిన ఇంటి జగన్ స్నేహితుడు. గణపర్తిలో శనివారం జరిగిన పండుగలో వీరు ఉత్సాహంగా గడిపారు. తరువాత దుర్గను చోడపల్లిలో డ్రాప్ చేయడానికి బైక్‌పై ముగ్గురూ బయలుదేరారు. జగన్నాథపురంలో జగన్ దిగిపోయి, తన బైక్‌ను దుర్గకు ఇచ్చాడు. రాత్రి 11.30 గంటల సమయంలో దుర్గ, ధనవిజయ చోడపల్లి వెళుతుండగా మంచు విపరీతంగా కురవడంతో దారి సరిగా కనిపించక జగన్నాథపురం సమీపంలో రోడ్డుపక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108 వాహనంలో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందారని వైద్యులు తెలిపారు. -
స్టాలిన్‌కు గుణపాఠం తప్పదు.. దద్దరిల్లిన విజయ్ సభ
పుదుచ్చేరి: తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు డీఎంకేకి తగిన గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. గతంలో కరూర్‌లో విజయ్ బహిరంగ సభ జరగగా, తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నేడు (మంగళవారం) పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో విజయ్ మాట్లాడుతూ.. ‘2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుండి డీఎంకే పాలకులు 100 శాతం గుణంపాఠం నేర్చుకుంటారు. మా ప్రజలు దానిని నిర్ధారిస్తారు’ అని అన్నారు. పోలీసుల ఆంక్షలు ఉన్నప్పటికీ విజయ్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.డీఎంకే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు కొనసాగిస్తూ.. పుదుచ్చేరి సీఎం రంగసామి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. పుదుచ్చేరి ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని, ప్రత్యర్థి పార్టీ ర్యాలీకి సైతం భద్రత కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ‘సీఎం రంగసామి నేతృత్వంలోని పుదుచ్చేరి ప్రభుత్వం తమిళనాడు డీఎంకే పాలన లాంటిది కాదు’ అని వ్యాఖ్యానించారు. తమిళనాడు డీఎంకే పాలకులు పుదుచ్చేరి ప్రభుత్వం నుండి నేర్చుకుంటే మంచిది, అయితే, వారు ఇప్పుడు నేర్చుకోరు' అని వ్యంగ్యంగా అన్నారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన కర్తవ్యమని టీవీకే చీఫ్ ప్రకటించారు. #WATCH | Puducherry | Security arrangements in place as a large number of people start arriving for TVK Chief Actor Vijay's political rally in Uppalam Expo Ground. For the first time since the stampede during his rally in Karur that killed 41 people, actor-politician Vijay is… pic.twitter.com/NGMFCNIeeT— ANI (@ANI) December 9, 2025ఈ సందర్భంగా విజయ్.. పుదుచ్చేరికి రాష్ట్ర హోదాపై ఉన్న డిమాండ్‌ను మరోమారు లేవనెత్తారు. కేంద్రం అభివృద్ధి విషయంలో పుదుచ్చేరికి మద్దతు ఇవ్వలేదనిఅని విమర్శించారు. అయితే, కేంద్రం విభజించి చూసినా.. తమిళనాడు, పుదుచ్చేరి ప్రజలు కలిసి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గత సెప్టెంబర్ 27న కరూర్‌లో టీవీకే నేత విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 110 మంది గాయపడ్డారు. "DMK regime will 100 per cent learn their lesson from 2026 TN Assembly election. Our people will ensure it," TVK chief #Vijay said at the party's first public rally at Puducherry since #KarurStampede. https://t.co/NMgDbEXbHH— The New Indian Express (@NewIndianXpress) December 9, 2025 -
విజయ్ ర్యాలీపై పోలీసుల ఆంక్షలు.. క్యూఆర్ కోడ్ గుర్తింపుతో..
సాక్షి, చెన్నై: టీవీకే నేత విజయ్ తన కేడర్‌కు 11 రకాల ఆంక్షలను విధించారు. కరూర్ విషాద ఘటన నేపథ్యంలో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలలో నిమగ్నమయ్యారు. బుధవారం పుదుచ్చేరిలో జరగనున్న పర్యటనను దృష్టిలో ఉంచుకుని ముందుగా కేడర్‌కు 11 రకాల ఆంక్షలను వినయ పూర్వకంగా విజయ్ సోమవారం ప్రకటించారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు పుదుచ్చేరి ఉప్పలంలో సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు విస్తృతం చేశారు. ఈసభకు హాజరయ్యే వారికి క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ నేతృత్వంలో అందజేస్తూ వస్తున్నారు. పార్టీ ఆవిర్భావంతో పుదుచ్చేరిలో జరగనున్న తొలి సభను పోలీసులకు అనేక ఆంక్షలు,సూచనలు, షరుతుల నడుమ విజయవంతం చేసుకునేందుకు టీవీకే వర్గాలు పరుగులు తీస్తున్నాయి. అదే సమయంలో ఈ సభ విజయవంతానికి సహకరించాలని కోరుతూ కేడర్‌కు విజయ్ లేఖరాశారు. దయ చేసి ఈ సభకు తమిళనాడు నుంచి ఎవ్వరూ రావద్దని విన్నవించారు. తన వాహనాన్ని ద్విచక్ర వాహనాలు, కార్లలో వెంబడించ వద్దని వేడుకున్నారు. గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులు, బాల బాలికలు దయ చేసిన రావొద్దని విన్నవించారు. శాంతిభద్రతల పరిరక్షణకు.. పోలీసుల సూచనలను తప్పని సరిగా అనుసరించాలని, ట్రాఫిక్ జాం పరిస్థితులు కలి్పంచ వద్దు అని, శాంతి భద్రతల పరిరక్షణలో గానీయండి, క్రమశిక్షణలో గానీయండి హుందాగా వ్యవహరించాలని విన్నవించారు. హైకోర్టు ఆదేశాలను అనుసరించాలని, సభా ప్రాంగణ పరిసరాలలో చెట్లు ఎక్కడం, గోడలపైకి ఎక్కడం, విద్యుత్ స్తంభాలపై నిలబడటం వంటి చర్యలకు ఎవ్వరూ పాల్పడ కూడదని కోరారు. అంబులెన్స్‌లకు, మహిళలకు, పిల్లలకు ఇబ్బందులు ఎదురు కాకుండా ఆ పరిసరాలలో వ్యవహరించాలని, బహిరంగ సభ ముగిసిన అనంతరం శాంతియుతంగా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది, సమస్య అన్నది సృష్టించకుండా వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. కాగా, సోమవారం ఏర్పాట్లను పరిశీలించిన భుస్సీ ఆనంద్ చేసిన వ్యాఖ్య హాట్‌టాపిగా పుదుచ్చేరిలో మారింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పొత్తు విషయంగా విజయ్ సమాచారం ఇస్తారని పేర్కొనడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఇక పార్టీ వర్కింగ్ కమిటీ సమన్వయ కర్త సెంగొట్టయ్యన్ పేర్కొంటూ, టీవీకే ఎన్నికల చిహ్నం చూసి దేశమే ఆశ్యర్య పోబోతందని స్పందించడంతో ఎలాంటి గుర్తు దక్కబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఈరోడ్‌లో విజయ్ ర్యాలీకి పోలీసులు నో -
మనస్సాక్షి లేదా? ప్రజలంటే అంత చులకనా?
ఈ ఏడాది జరిగిన అత్యంత విషాదకర ఘటనల్లో కరూర్ తొక్కిసలాట ఒకటి. హీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. ఈ విషాదంపై సినీనటులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విజయ్‌తో కలిసి జిల్లా మూవీలో యాక్ట్ చేసిన వినోదిని.. విజయ్‌కు నటుడిగా సపోర్ట్ చేస్తానని, కానీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని ప్రశ్నించింది.జనాలను పట్టించుకోవడం దండగఈమధ్య ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. జనాలను పట్టించుకోవడం దండగ అని ఈ మధ్యే అర్థమైంది. వాళ్లకోసం మాట్లాడి ఉపయోగం లేదు. వాళ్లతో మాట్లాడినప్పుడు ఆ విషయం నాకు మరోసారి స్పష్టంగా అర్థమైంది. ఉదాహరణకు కరూర్ తొక్కిసలాటనే తీసుకోండి.. 41 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వాళ్ల కుటుంబాలు కూడా అదంతా మర్చిపోయి మామూలుగా ఉన్నారు. అలాంటివారి కోసం నేనెందుకు నిలబడాలి? అని మాట్లాడింది. నటి ఆగ్రహంఈ వ్యాఖ్యలపై బిగ్‌బాస్ బ్యూటీ, నటి సనం శెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల బాధను ఎందుకని అవమానిస్తున్నారు? మీకు మనస్సాక్షి అనేదే లేదా? మీరేమైనా కరూర్ బాధితులను నేరుగా కలిశారా? మాట్లాడారా? వాళ్ల సమస్యలేంటో అడిగి తెలుసుకున్నారా? సమస్యను అర్థం చేసుకోవడం పక్కనపెట్టి విజయ్ సర్‌ను అరెస్ట్ చేయలేదని ఎక్కువ ఫీలవుతున్నట్లున్నారు.బీపీ వచ్చిందిజయలలిత లాంటి నాయకురాలు రాజకీయాల్లో మళ్లీ కనిపించరా? అని అడుగుతుంటారు కదా! ఇదే దానికి సమాధానం. ప్రజలకు విలువ ఇవ్వని నాయకులు ఎక్కడ ఎదుగుతారు? ఆమె మాటలు విన్నాక నాకు బీపీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నేను కరూర్ బాధితులను నేరుగా కలిశాను. నేను మీలా రాజకీయ నాయకురాలిని కాదు. ఏ పార్టీని సపోర్ట్ చేయను. అయినా వారి బాధ నేను అర్థం చేసుకోగలను. జనం పనికిరానివాళ్లా?వాళ్లకోసం నేను పెద్దగా ఏమీ చేయకపోవచ్చేమో! కానీ, అండగా నిలబడటం నా బాధ్యత. జరిగినదాంట్లో విజయ్ సర్ తప్పు లేదని బాధితులే స్వయంగా చెప్పారు. కానీ, మీరు మాత్రం దాన్ని ఒప్పుకోరు. పైగా అలా అన్నందుకు మీ దృష్టిలో ఆ అమాయక జనం పనికిరానివాళ్లుగా మారిపోయారు. మీరు పార్టీకి రాజీనామా చేసి మంచి పని చేశారు. మీరు ఇంట్లో ఉంటేనే మంచిది. మీ సేవలు మాకు అక్కర్లేదు అని మండిపడింది. కాగా వినోదిని.. మక్కల్ నీది మయ్యం పార్టీకి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసింది. తమిళ బిగ్‌బాస్ నాలుగో సీజన్లో పాల్గొన్న సనం శెట్టి.. తెలుగులో శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాల్లో నటించింది.చదవండి: తనూజకు క్లాస్ పీకిన నాగ్.. ఆ ముగ్గురికే ట్రోఫీ గెలిచే అర్హత -
కేథరిన్ థ్రెసాతో స్టార్ హీరో వారసుడు స్టెప్పులు
నటుడు విజయ్ వారసుడు జేసన్ సంజయ్ తండ్రి బాటలోనే పయనిస్తారని అందరూ భావించారు. జేసన్ సంజయ్ సౌత్ కాలిఫోర్నియాలో నటన, దర్శకత్వం శాఖల్లో శిక్షణ పొందారు. దీంతో ఈయన నటనపై కాకుండా దర్శకత్వంపై మొగ్గు చూపారు. అలా జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం సిగ్మా. ఇందులో నటుడు సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా ప్రియా అబ్దుల్లా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో సిగ్మా చిత్రంపై ఆసక్తి నెలకొంటోంది. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒక ప్రత్యేక పాట చోటు చేసుకుంటుందని, దీన్ని ఇటీవల చిత్రీకరించినట్లు సమాచారం. ఈ పాటలో మెడ్రాస్ చిత్రం ఫేమ్ కేథరిన్ థ్రెసా(Catherine Tresa ) నటించినట్లు తెలిసింది. అంతే కాకుండా ఆమెతోపాటు దర్శకుడు జేసన్ సంజయ్ కూడా స్టెప్స్ వేసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఆ పాటలో ఈ వర్ధమాన దర్శకుడు ఇలా వచ్చి అలా కనిపించి వెళ్తారా లేక పూర్తిగా ఆ పాటలో కేథరిన్ థ్రెసాతో కలిసి నటించారా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంపై చిత్ర వర్గాల నుంచి క్లారిటీ వచ్చే వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా ఈ చిత్రంలో ఒక్క పాటలో మెరిసే జేసన్ సంజయ్ ఆ తరువాత హీరోగా నటించే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. -
విజయ్‌కు సలహాలివ్వను: కమల్ హాసన్
హీరో విజయ్‌కు తాను సలహాలిచ్చే స్థితిలో లేనంటున్నారు హీరో, మక్కల్ నీది మయ్యం వ్యవస్థాపకుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్. అనుభవమే అన్నీ నేర్పుతుందంటున్నారు. కేరళలో జరిగిన హార్టస్ ఆర్ట్ అండ్ లిటరేటర్ ఫెస్టివల్‌కు కమల్ హాసన్, మంజువారియర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమ్లకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అదే నా శత్రువుతమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన విజయ్.. అధికార డీఎమ్‌కే పార్టీయే తమ రాజకీయ ప్రత్యర్థి అన్నారు. మరి మీరు ఎవర్ని ప్రత్యర్థి/ శత్రువుగా భావిస్తున్నారు? అని అడిగారు. అందుకు కమల్.. నాకు పార్టీల కన్నా పెద్ద శత్రువు కులతత్వం. దాన్ని అంతమొందించడమే నా ప్రధాన లక్ష్యం. కులమే నాకు పెద్ద శత్రువు అని బదులిచ్చారు.అదే గొప్ప గురువు2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్ (Vijay)కు ఏమైనా సలహాలిస్తారా? అన్న ప్రశ్నకు నేను సలహాలిచ్చే స్థాయిలో లేను. నా సోదరుడు విజయ్‌కు సలహాలిచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు. అనుభవమే అన్నింటికంటే గొప్ప గురువు. మనుషులు పక్షపాతంగా ఉంటారేమో కానీ అనుభవానికి అటువంటి హద్దులు ఉండవు. సినిమాఅనుభవమే అన్ని పాఠాలు నేర్పిస్తుంది అన్నారు. మొత్తానికి విజయ్‌తో శత్రుత్వం లేదని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ (Kamal Haasan) చివరగా మణిరత్నం థగ్ లైఫ్ సినిమాలో కనిపించారు. విజయ్ విషయానికి వస్తే ఆయన గతేడాది గోట్ మూవీతో పలకరించారు. తర్వాత అతడు ప్రధాన పాత్రలో నటించిన జన నాయగన్ 2026 సంక్రాంతికి విడుదలవుతోంది.చదవండి: నేడు సమంత పెళ్లి? బరి తెగించారంటూ ఆమె పోస్ట్ -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
టీవీకేలో చేరిన సెంగొట్టయన్
చెన్నై: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత సెంగొట్టయన్.. సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కజగం(టీవీకే) పార్టీలో చేశారు. బుధవారం శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, గురువారం టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ఆ పార్టీలో చేరారు. ఆయనతో ఓ మాజీ ఎంపీతోపాటు, అతని మద్దతు దారులు కూడా చేరారు. పసుపు–ఎరుపు మిశ్రమంతో రంగులతో ఉన్న టీవీకే శాలువాను విజయ్ ఆయనకు కప్పారు. సెంగొట్టయన్‌కు పార్టీ ఆర్గనైజింగ్ చీఫ్ బాధ్యతలు అప్పగించారు. తరువాత విలేకరులతో మాట్లాడిన సెంగొట్టయన్ తాను రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలనను తీసుకురావడానికే టీవీకేలో చేరానని చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య ఎలాంటి తేడా లేదని, ప్రజలు పారదర్శకమైన పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. మంచి పాలన అందించే నాయకుడిని కోరుకుంటున్నారని, అందుకు విజయ్ సరైన వ్యక్తని సెంగొట్టయన్ అన్నారు. ఆ సమయంలోనూ ఆయన జేబులో ఏఐఏడీఎంకే వ్యవస్థాపకురాలు జయలలిత ఫొటో ఉంది. ఫొటోపై మీడియా ప్రశ్నించగా.. ‘నేను అన్నా డీఎంకేకు విధేయుడిగా ఉన్నాను. 50 ఏళ్లపాటు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశాను. చివరకు నాకు లభించిన బహుమతి పార్టీ నుంచి తొలగించటం. పార్టీని బలోపేతం చేద్దామన్న నా ఆలోచననను సమరి్థంచిన నా మద్దతుదారులు కూడా బహిష్కరణకు గురయ్యారు’అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అత్యంత సీనియరైన ఆయన చేరికతో టీవీకే పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆయన స్వస్థలం ఈరోడ్ జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం అవుతుందని టీవీకే వర్గాలు భావిస్తున్నాయి. -
అన్నాడీఎంకేకు షాక్.. టీవీకే విజయ్‌తో ఆ ఎమ్మెల్యే భేటీ
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకేకు షాక్ తగిలింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్‌తో ఎమ్మెల్యే సెంగొట్టయన్ భేటీ అయ్యారు. కొంతకాలంగా పళనిస్వామితో సెంగొట్టయన్‌కు విభేదాలు నేపథ్యంలో పార్టీ నుంచి ఎమ్మెల్యేని పళనిస్వామి సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెంగొట్టయన్ త్వరలోనే టీవీకేలోకి చేరతారన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి.జయలలిత మృతి తర్వాత వరుసగా మూడు ఎన్నికల్లో ఓటమి పాలైన ఏఐఏడీఎంకే తిరిగి బలపడాలంటే శశికళ, పన్నీర్ సెల్వం, టి.టి.వి. దినకరన్‌లను తిరిగి పార్టీలోకి తీసుకోవాలంటూ ఇటీవల సెంగొట్టయ్యన్ బహిరంగంగానే తన వాదనలను వినిపించారు. ఎంజీఆర్ పార్టీని స్థాపించినప్పటి నుంచి ఏఐఏడీఎంకేలో ఉన్న సెంగొట్టయ్యన్.. పార్టీ ప్రచార రూపకల్పన చేసిన కీలక వ్యూహకర్తగా గుర్తింపు పొందారు.జయలిత పర్యటనలు, సభలు, సమావేశాలు, కేడర్ మొబిలైజేషన్ వంటి అంశాలను సమన్వయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. టీవీకేలోకి చేరబోతున్నారా? అంటూ మీడియా వేసిన ప్రశ్నకు ‘ఒక రోజు వేచి చూడండి’ అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. 2026 ఎన్నికలకు ముందు పార్టీని బలపర్చేందుకు విజయ్, సెంగొట్టయ్యన్‌కు కీలక పదవి ఇవ్వవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.సెంగొట్టయన్ ఇటీవల.. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలి శశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి ఆదేశించారు.అన్నాడీఎంకేలో ఏకాధిపత్యం సాగుతుందని సెంగొట్టయన్ ఇటీవల తీవ్ర విమర్శలు చేశారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు.అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని, అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అంటూ సెంగొట్టయన్ ధ్వజమెత్తారు. -
చిరు కంటే ఆయనే బెస్ట్ డ్యాన్సర్.. కీర్తి సురేశ్ క్లారిటీ.!
కీర్తి సురేశ్ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. కీర్తి సురేశ్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం రివాల్వర్ రీటా. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు హాజరైన కీర్తి సురేశ్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించింది.ఈ ఈవెంట్లో కీర్తి సురేశ్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు చిరంజీవి కంటే విజయ్ బాగా డ్యాన్స్ చేస్తారని అన్నారు.. అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అలా మీరు ఎందుకు అనాల్సి వచ్చిందని ఆమెను ప్రశ్నించారు. దీనికి కీర్తి సురేశ్ స్పందించింది.కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. 'నా మాటలు మిమ్మల్ని బాధపెడితే క్షమించండి. కానీ నేను దళపతి విజయ్ సర్‌కు వీరాభిమానిని. చిరంజీవి సార్‌కు కూడా ఈ విషయం గురించి తెలుసు. నేను, మెగాస్టార్ గతంలో సెట్స్‌లో దీనిపై సరదాగా మాట్లాడుకున్నాం. ఆయన దానిని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. చిరంజీవి సర్‌పై నాకు చాలా గౌరవం ఉంది. అందుకే నాకు అనిపించింది చెప్పాను. కొన్నిసార్లు నాకు ఏమి అనిపిస్తుందో చెప్పలేనప్పుడు చాలా బాధగా ఉంటుంది.' అని అన్నారు.Here is the video of the interview. pic.twitter.com/X0ZbUTNXEa— MK (@MK_VOXX) November 26, 2025 -
జన నాయగణ్ భారీ ఈవెంట్.. ఒక్క టికెట్ అన్ని లక్షలా?
పొలిటికల్ ఎంట్రీ తర్వాత దళపతి విజయ్ నటిస్తోన్న చిత్రం జన నాయగన్. రాజకీయాల్లోకి వచ్చేముందు ఈ మూవీనే తన కెరీర్లో చివరి సినిమా అని ప్రకటించారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ యాక్షన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించనుంది.అయితే ఈ మూవీ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను ఏకంగా విదేశాల్లో నిర్వహిస్తున్నారు. మలేసియాలో ఈ బిగ్ ఈవెంట్ జరగనుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి దాదాపు లక్షమంది ఫ్యాన్స్ హాజరవుతారని అంచనా. ఈ భారీ ఈవెంట్లో గిన్నిస్ రికార్డ్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లిడించారు.తమ అభిమాన హీరో బిగ్ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఈవెంట్‌కు భారీ డిమాండ్ ఉండడంతో టిక్కెట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.2 లక్షల నుంచి రూ.6.5 లక్షల వరకు ఉండనుందని సమాచారం. ఈ టికెట్ బుకింగ్స్ నవంబర్ 28 నుంచి ప్రారంభమవుతాయని ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మలేషియాలోని బుకిట్ జలీల్ స్టేడియంలో డిసెంబర్ 27న ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగనుంది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్స్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో సైంధవి, టిప్పు, అనురాధ శ్రీరామ్, ఆండ్రియా జెరెమా ఎస్.పి.బి. చరణ్, హరిచరణ్, హరీష్ రాఘవేంద్ర, యోగి బి, విజయ్ యేసుదాస్ పాల్గొంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ చిత్రంలో మమిత బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. -
వచ్చే ఎన్నికల్లో డీఎంకే చిత్తుగా ఓడిపోవడం ఖాయం: విజయ్ విమర్శలు
చెన్నై: కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటన తర్వాత కొన్ని నెలలు సుదీర్ఘ విరామం తీసుకున్న టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు విజయ్.. తన రాజకీయ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. నేడు(ఆదివారం, నవంబర్ 23 వ తేదీ) కాంచీపురం జిల్లాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇండోర్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దానికోసం కాంచీపురంలోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో సదస్సు ఏర్పాటు చేశారు.కేవలం 2000 మందికి మాత్రమే QR కోడ్ పాస్‌లతో కూడిన అనుమతి ఇచ్చారు. అనుమతి లేని వారికి ప్రవేశం లేకుండా పకడ్బందీ ప్లానింగ్ చేశారు. ప్రచార పునఃప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార డీఎంకే, కేంద్ర బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశంలో మాట్లాడిన విజయ్.. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే ర్యాడికల్స్‌కు అడ్డాగా మారిపోయిందని ఆరోపించారు. ఆ పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలతో పాటు దోపిడీ భావజాలం డీఎంకే స్వభావమని ఆయన మండిపడ్డారు. టీవీకే పార్టీ సమానత్వం కోసం స్పష్టమైన విధానాలను ముందుకు తీసుకొస్తోందని విజయ్ స్పష్టం చేశారు.ఇటీవల ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ పారదర్శకంగా లేదని, ఆ ప్రక్రియ ప్రజలకు నష్టం కలిగించే అవకాశం ఉందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు తెలిపారు.తమిళనాడులో అధికార డీఎంకేతో పాటు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవట్లేదని విజయ్ విమర్శించారు. రెండు పార్టీల విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవని అన్నారు.విజయ్ ఒకేసారి డీఎంకే, బీజేపీలపై దాడి చేయడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. టీవీకే పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతుందో అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
తమిళనాడు ఎన్నికలు.. మళ్ళీ ప్రజల్లోకి విజయ్
సాక్షి చెన్నై: కరూర్‌లో జరిగిన విషాద ఘటనతో తను చేస్తున్న అన్ని ప్రజా కార్యక్రమాలను నిలిపివేసిన సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ కొంతకాలం విరామం తర్వాత తిరిగి తన ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. ప్రచార యాత్ర పునఃప్రారంభానికి సంబంధించి నిర్వహించనున్న తొలి పెద్ద సభ కాంచీపురంలో జరగనుందని టీవీకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. పార్టీ బలోపేతం, స్థానిక నాయకుల సమావేశం, ప్రజలతో మళ్లీ ప్రత్యక్షంగా అనుసంధానమవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలు. తొలి సభను కాంచీపురంలో నిర్వహించడానికి విజయ్ టీమ్ నిర్ణయం తీసుకుంది. దాంతో కాంచీపురానికి ప్రాధాన్యం సంతరించుకుంది. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో విజయ్ వెంటనే అన్ని ప్రజా ఈవెంట్లను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాల పట్ల గౌరవ సూచికగా చేపట్టిన ఈ నిర్ణయాన్ని అప్పట్లో విస్తృతంగా ఆయన అభిమానులు అభినందించారు. ఆ సమయంలో బీజేపీ పార్టీ విజయ్‌కు మద్దతుగా నిలిచింది. అయితే కొంతకాలం విరామం తరువాత విజయ్ తిరిగి ప్రచార యాత్రను ప్రారంభించడంతో తాజా రాజకీయ పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసిన అధికారులుకరూర్ ఘటనను దృష్టిలో పెట్టుకుని సభా ప్రాంగణంలో అదనపు భద్రతను ఏర్పాటు చేయనున్నారు. జనసంచారం నియంత్రణతో పాటు అత్యవసర సేవలు సిద్ధంగా ఉండేలా స్థానిక అధికారులు, పార్టీ నిర్వాహకులు కలిసి పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల అనుమతి తిసుకుని కేవలం రెండువేల మందితో మాత్రమే సభను నిర్వహించాలని టీవీకే పార్టీ వర్గాలు నిర్ణయించాయి.కాగా కాంచీపురం సభ అనంతరం, తమిళనాడులోని పలు కీలకమైన ప్రాంతాలలో విజయ్ ప్రచార షెడ్యూల్‌ను ఏర్పాటు చేసేందుకు పార్టీ ఇప్పటికే తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. -
మహిళపై ప్రియుడు హత్యాయత్నం
తెనాలి రూరల్: మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న కారణంతో సహ జీవనం చేస్తున్న మహిళపై ప్రియుడు హత్యాయత్నం చేశాడు. చాకుతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తెనాలికి చెందిన 45 ఏళ్ల కందుకూరు ఉష కొన్నేళ్ల కిందట విభేదాల వల్ల భర్త నుంచి విడిపోయింది. కూరగాయల వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన విజయ్ తెనాలిలోని హోటళ్లలో టీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనితో ఉషకు పరిచయమైంది. ఇద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని విజయ్‌కు తెలిసింది. దీంతో కొద్ది రోజులుగా ఉషతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి చాకుతో ఉషపై విజయ్ విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ నేరాన్ని సన్నిహితంగా ఉంటున్న వ్యక్తే చేశాడని పోలీసులకు చెబితేనే.. ఆస్పత్రికి తీసుకెళ్తానని ఆమెను విజయ్ బెదిరించాడు. ఇందుకు ఆమె అంగీకరించడంతో.. వెంటనే తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు గుంటూరుకు పంపించారు. ఈ సమాచారం అందుకున్న డీఎస్పీ బి.జనార్ధనరావు, వన్ టౌన్ సీఐ వి.మల్లికార్జునరావు శనివారం ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను విచారించగా అసలు విషయం బయటపడింది. వీరిద్దరూ గతంలో ఎనీ్టఆర్ జిల్లా నందిగామలో ఉండగా.. అక్కడ కూడా ఉషతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కారణంతో ఓ వ్యక్తిని విజయ్ హత్య చేశాడని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం ఉష పరిస్థితి నిలకడగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
తొక్కిసలాట తర్వాత ప్రజల ముందుకు విజయ్
టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ రేపు తమిళనాడు కాంచీపురం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఓ ప్రైవేట్ కాలేజ్ కు చెందిన గ్రౌండ్ లో కేవలం రెండు వేల మంది పార్టీ ప్రతినిధులతో సభ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన ప్రమాదం తర్వాత విజయ్ ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి.సినీహీరో విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరో రాజకీయంగా సైతం తమిళనాట తన సత్తా చూపించాలని తమిళిగ వెట్రి కజగం ( టీవీకే) పార్టీ స్థాపించారు. తన మార్కుకు అనుగుణంగానే లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ ని సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన ప్రమాదం అపఖ్యాతి పాలు చేసింది. ఇరుకైన ప్రదేశంలో ర్యాలీ నిర్వహించడంతో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రజలు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడునే కాకుండా యావద్దేశాన్ని కలిచివేసింది.ఈ నేపథ్యంలో తమిళ స్టార్ విజయ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. కాంచిపురం జిల్లాలో రెండు వేల మంది పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ భద్రతకు సంబంధించి ఇదివరకే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా లోపలికి వెళ్లే వ్యక్తులకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక పాస్ లు మంజూరు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ లో విజయ్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న ర్యాలీ అనుమతి కోసం టీవీకే ప్రయత్నించగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీవీకే పార్టీ ఈ మీటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారంతమిళనాడులో ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తోంది. ర్యాలీలకు, భారీ సభలకు పోలీసుల అనుమతికి సమయం పడుతున్న నేపథ్యంలో వీలైనన్ని ఇండోర్ మీటింగ్ లు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని టీవీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
విజయ్ కచేరి సాంగ్.. ఫేక్ వ్యూస్‌పై స్పందించిన యూట్యూబ్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ'జన నాయగణ్'. పొలిటిక్స్‌లో అడుగుపెట్టిన తర్వాత విజయ్ కెరీర్లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇటీవలే 'దళపతి కచేరీ' అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అయితే ఈ పాట విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించింది. యూట్యూబ్‌లో ఏకంగా 44 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. దీంతో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బాట్స్ ద్వారా ఈ వ్యూస్ వచ్చాయని కొందరు నెటిజన్స్ ఆరోపించారు. రిలీజైన గంటలోనే ఏకంగా 3 మిలియన్స్ వ్యూస్ అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఇది చూసిన కొందరు వ్యూస్ పెంచుకునేందుకు బాట్స్ ఉపయోగపడ్డాయా అంటూ ట్రోల్ చేశారు.కచేరీ సాంగ్‌పై వస్తున్న ఆరోపణలపై యూట్యూబ్ కూడా స్పందించింది. ఇలాంటి వాటిని గుర్తించడానికి(లైక్‌లు, వ్యూస్) తమ వద్ద ప్రత్యేక వ్యవస్థ ఉందని యూట్యూబ్ తెలిపింది. అవీ ఒరిజినల్ లేదా ఫేక్ అని ధృవీకరించడానికి ప్రత్యేకమైన టెక్నాలజీ కూడా ఉందని పేర్కొంది. కాగా.. దళపతి కచేరి' పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించగా.. అనిరుధ్, అరివు, విజయ్ ఆలపించారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. To maintain a fair & positive experience across YouTube, we have systems that verify if views are valid & should be counted! more on that here: https://t.co/7ia2e2f2VE— TeamYouTube (@TeamYouTube) November 12, 2025 -
కామెడీ ఎంటర్టైనర్
ప్రముఖ తమిళ హీరో విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ‘సిగ్మా’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రోడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్‌పోస్టర్ విడుదల చేశారు. బంగారం, నోట్ల కట్టల మధ్య కూర్చొని చేతికి బ్యాండేజ్ కడుతున్నట్లు కనిపించారు సందీప్. జాసన్ సంజయ్ మాట్లాడుతూ–‘‘యాక్షన్, అడ్వెంచర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘సిగ్మా’. ఈ టైటిల్, కాన్సెప్ట్ ‘సిగ్మా’ అనే స్వతంత్ర, ధైర్యవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ట్రెజర్ హంట్, హీస్ట్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. ఒక పాట చిత్రీకరణ మిగిలి ఉంది. త్వరలోనే పోస్ట్‌ప్రోడక్షన్ ప్రారంభించి వేసవి ప్రారంభంలో సినిమా విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. ‘‘తొలి సినిమా దర్శకునిగా జేసన్ సంజయ్ 65 రోజుల్లో 95శాతం షూటింగ్ పూర్తి చేయడమంటే అసాధారణ విజయమే’’ అన్నారు లైకాప్రోడక్షన్స్ సీఈఓ తమిళ్ కుమారన్. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
తండ్రి చివరి సినిమా.. కొడుకు మొదటి మూవీ అప్డేట్
తమిళ స్టార్ హీరో తళపతి విజయ్.. తన చివరి సినిమా బిజీలో ఉన్నాడు. 'జన నాయగణ్' పేరుతో తీస్తున్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్గా తొలి పాటని రిలీజ్ చేశారు. లాస్ట్ డ్యాన్స్ పేరుతో 'తళపతి కచేరీ' సాగే ఈ గీతం అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇదలా ఉండగానే ఇప్పుడు విజయ్ కొడుకు తొలి మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు ఇకపై అదీ భరించాల్సిందే.. నిర్మాతల మండలి)తళపతి విజయ్‌కి జేసన్ సంజయ్ అని కొడుకు ఉన్నాడు. తండ్రిలా ఇతడు కూడా హీరో అవుతాడని అభిమానులు అనుకున్నారు. కానీ దర్శకుడిగా తొలి మూవీ చేస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం అందరికీ షాకిచ్చాడు. టాలీవుడ్‌కి చెందిన సందీప్ కిషన్.. ఈ ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా దీని నుంచి అప్డేట్ వచ్చింది. మూవీకి 'సిగ్మా' అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్లో డబ్బు, బంగారం లాంటివి చాలా చూపించారు. అలానే సిగ్మా అనే పదాన్ని ఎక్కువగా యాటిట్యూడ్ చూపించే కుర్రాళ్లు, మగాళ్ల గురించి ఉపయోగిస్తారు. చూస్తుంటే ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. తమన్ సంగీత దర్శకుడు కాగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది. తండ్రి విజయ్ చివరి సినిమా చేస్తున్నప్పుడే కొడుకు.. దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వస్తుండటం ఆసక్తికరంగా మారింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 21 సినిమాలు)Presenting the Title of #JSJ01 - #SIGMA⚡The quest begins. 🎯@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @sundeepkishan @MusicThaman @Cinemainmygenes @krishnanvasant @Dir_sanjeev #BenjaminM @hariharalorven @ananth_designer @SureshChandraa @UrsVamsiShekar… pic.twitter.com/Dggm6zx3Il— Lyca Productions (@LycaProductions) November 10, 2025 -
విజయ్ చివరి సినిమా.. 'తళపతి కచేరీ' సాంగ్ రిలీజ్
తమిళ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. దీంతో తన చివరిదైన 'జన నాయగణ్' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ చేసిన తొలి పాటతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. 'తళపతి కచేరీ' అంటూ సాగే మూవీలోని తొలి పాటని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)అనిరుధ్ ఎప్పటిలానే మరో మాస్ బీట్తో అలరించాడు. దానికి విజయ్, జనాలతో కలిసి వేసిన సింపుల్ స్టెప్పులు.. ఆయన అభిమానులకు కనువిందు చేసేలా ఉన్నాయి. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తెలుగులో హిట్ అయిన 'భగవంత్ కేసరి' రీమేక్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. (ఇదీ చదవండి: Dies Irae: సౌండ్‌తో భయపెట్టారు.. 'డీయస్ ఈరే' తెలుగు రివ్యూ) -
కరూర్ ఘటన.. తప్పు 'విజయ్'ది మాత్రమే కాదు: అజిత్
తమిళనాడులో జరిగిన కరూర్ తొక్కిసలాటపై తొలిసారి నటుడు అజిత్ స్పందించారు. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. ఈ అంశంలో విజయ్‌తో పాటు అందరూ బాధ్యులేనని ఆయన అన్నారు. అభిమానులు, మీడియాతో సహా అన్ని వర్గాలకు చెందిన వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని అజిత్ సూచించారు.అజిత్ తాజాగా ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరూర్ ఘటన గురించి ఇలా మాట్లాడారు. ' కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలను పూర్తిగా నివారించాలి. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. పలాన వ్యక్తి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని నేను ఎవరినీ వేలెత్తి చూపించడం లేదు.ఆ రోజు జరిగిన సంఘటన తమిళనాడులో అన్నింటినీ మార్చివేసింది. ఇది ఆ ఒక్క వ్యక్తి (విజయ్) తప్పు కాదు. కానీ, అందులో మన తప్పు కూడా ఉంది. దానికి మనమందరం బాధ్యులమే. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు చాలామంది వెళ్తారు. కానీ, వారందరూ కూడా చాలా సురక్షితంగానే తిరిగొస్తారు. అయితే, సినీతారలకు సంబంధించిన సభల్లోనే కరూర్ లాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీడియా వీటిపై మరింత అవగాహన కలిగిస్తే మేలు జరుగుతుంది. సినిమా థియేటర్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఉంది. కేవలం ఇండస్ట్రీ చుట్టే ఇలా జరగడంతో పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది.' అని అజిత్ పేర్కొన్నారు. -
కరూర్ బాధితులకు విజయ్ ఓదార్పు
సాక్షి, చెన్నై: కరూర్ బాధిత కుటుంబాలను తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఓదార్చారు. ఆ కుటుంబాలను చెన్నై శివారులోని మహాబలిపురంలో ఉన్న ఓ రిసార్ట్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రాణనష్టంపై ఆయన కంటతడి పెట్టారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 20 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి తలా రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. గత నెల 27న కరూర్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 41 మంది మరణించారు.160 మంది గాయపడ్డారు.ఈ కుటుంబాలను కరూర్‌కు వెళ్లి పరామర్శించేందుకు తొలుత విజయ్ నిర్ణయించారు. అయితే, అనుమతుల మంజూరు, స్థల ఎంపిక సమస్యలు నెలకొనడంతో చివరకు బాధిత కుటుంబాలను చెన్నైకు పిలిపించి ఒకే చోట పరామర్శించేందుకు చర్యలు తీసుకున్నారు. వివిధ కారణాలతో 8 కుటుంబాలు గైర్హాజరైనా మిగిలిన కుటుంబాలన్నీ చెన్నైకు వచ్చేందుకు సమ్మతించాయి. వీరందర్నీ ప్రత్యేక బస్సుల్లో చెన్నైకు తీసుకొచ్చారు. మహాబలిపురంలోని రిసార్ట్‌లో బస ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒక్కో కుటుంబాన్ని విజయ్ వేర్వేరుగా పరామర్శించారు.15 నుంచి 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరిస్తూ ఓదార్చారు. ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబాల్లోని పిల్లల చదవులకు అండగా ఉంటానని, ఖర్చులు భరిస్తానని విజయ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొన్ని కుటుంబాల్లోని వారికి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కల్పనకు కూడా హామీ ఇచ్చారని తెలిసింది. -
కరూర్ బాధిత కుటుంబాలకు విజయ్ ఓదార్పు
తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఎట్టకేలకు కరూర్ బాధిత కుటుంబాలను కలుసుకున్నారు. సోమవారం మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వాళ్లను పరామర్శించి.. ఓదార్చి.. పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంతో ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కరూర్ తొక్కిసలాటకు నేటితో సరిగ్గా నెల రోజులు పూర్తైంది. సెప్టెంబర్ 27వ తేదీన టీవీకే ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఈ ఘటన తీవ్ర విచారం వ్యక్తం చేసిన విజయ్.. బాధిత కుటుంబాలకు టీవీకే తరఫున పరిహారం కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కరూర్ వెళ్లేందుకు ఆయనకు పోలీసుల నుంచి అనుమతి లభించడం లేదు. దీంతో.. దీంతో బాధిత కుటుంబాలనే మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు రప్పించారు. బాధిత కుటుంబాల కోసం రిసార్ట్‌లో టీవీకే పార్టీ 50 గదులను బుక్ చేసింది. వాళ్లందరినీ విడివిడిగా కలిసి విజయ్ పరిహారం అందిస్తున్నారు. కరూర్‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది (Karur Stampede). ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటనలో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ.. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీన్ని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అటుపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణ కమిటీ ఆ దర్యాప్తును ఎప్పటికప్పుడు సమీక్షించనుంది. ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు (SOP) రూపొందించేవరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతివ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. -
'డ్యూడ్' హీరోయిన్ మమితా బైజుకు బిగ్ ఛాన్స్
ధనుష్‌తో నటి మమితా బైజుకు(Mamitha Baiju) జత కుదిరింది. రీసెంట్గా డ్యూడ్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. మొదట మలయాళం మూవీతో తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ తమిళం, తెలుగు అంటూ చుట్టేస్తోంది. ప్రేమలుతో దక్షిణాది చిత్ర పరిశ్రమనే తన వైపు తిప్పుకున్న ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రం రెబెల్ నిరాశపరచడంతో అక్కడ ఈ భామ పప్పులు ఉడకవు అనే విమర్శలను ఎదుర్కొంది. బాలా దర్శకత్వంలో వణంగాన్ చిత్రంలో కొన్ని రోజులు నటించి వైదొలగింది. దీంతో కోలీవుడ్‌లో చిన్న గ్యాప్ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టిన ద్విభాషా ( తమిళం, తెలుగు) చిత్రం డ్యూడ్ దీపావళి సందర్భంగా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన జననాయకన్ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా కీలక పాత్రను పోషించింది. ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 9న తెరపైకి రానుంది. తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రంలో కథానాయికిగా నటిస్తోంది. అదేవిధంగా ఇరెండు వారమ్ అనే మరో చిత్రంలో నటించిన మమితబైజు మలయాళంలోనూ ఒక చిత్రంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. ధనుష్ సరసన నటించడానికి మలయాళీ బ్యూటీ రెడీ అవుతోంది. నటుడు ధనుష్ ప్రస్తుతం తేరే ఇష్క్మేన్ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈయన నటించే 54వ చిత్రం అవుతుంది. దీనికి పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు. దీనికి జీవీ.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. దీని గురించిన అధికారిక పోస్టర్‌ను నిర్మాతల వర్గం విడుదల చేసింది. వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో మమితబైజు నాయకిగా నటించనుందని సినీ వర్గాల సమాచారం. -
కరూర్ ఘటన తర్వాత ప్రజల్లోకి విజయ్.. వేదిక ఫిక్స్
తమిళనాడులోని కరూర్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్ణయించారు. సుమారు 30 రోజుల తర్వాత విజయ్ బాహ్యప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 27న చెన్నై కరూర్‌లో టీవీకే నేత విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెను విషాదం గురించి తెలిసిందే. మరణించిన 41 మంది బాధిత కుటుంబాలు, గాయపడ్డ 160 మందిని పరామర్శించేందుకు విజయ్ నిర్ణయించారు. బాధిత ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ. 20 లక్షలు విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులందరినీ ఒకే వేదికపై తీసుకొచ్చి పరామర్శించడమే కాకుండా, నష్ట పరిహారంతో పాటు వారిని దత్తత తీసుకునే విధంగా విజయ్ కసరత్తులలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. కరూర్‌లో విజయ్ పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, భద్రత చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీవీకే వర్గాలు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అయితే, టీవీకే వర్గాలు ఎంపిక చేసిన వేదిక చిన్నదిగా ఉండడంతో ఏదేని కళాశాల మైదానాలను ఎంపిక చేసుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర వివరాలను సమర్పించాలని సూచించారు. దీంతో పరామర్శలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు కరూర్‌లో అతి పెద్ద మైదానం, ఆడిటోరియంలేని దృష్ట్యా, బాధితులను చెన్నైకు తీసుకొచ్చి పరామర్శ ఏర్పాట్లు చేయడానికి టీవీకే వర్గాలు చర్యలు చేపట్టారు. ఇందుకోసం మహబలిపురం వద్ద అతి పెద్ద వేదికను ఎంపిక చేశారు. ఇక్కడకు బాధితులను తీసుకొచ్చి , వారికి అన్ని రకాల బస తదితర ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేపట్టారు. ఈమేరకు (27వ తేదీ)సోమవారం బాధితులను విజయ్ పరామర్శించి, నష్ట పరిహారం అందించనున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
తమిళ రాజకీయం.. టీవీకే విజయ్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్
సాక్షి, చైన్నె: తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు(టీవీకే), సినీ నటుడు విజయ్‌కు(TVK Vijay) ప్రజల నుంచి మద్దతు పెరిగినట్టు ఓ సర్వేలో వెలుగు చూసింది. ఆయనకు తాజాగా 23 శాతం మంది ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు తేలింది. విజయ్ రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, కరూర్‌లో(Karur Stampade) ప్రచార సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆ పార్టీ(Tamil nadu) వర్గాలను కాస్త డీలా పడేలా చేసింది. విజయ్ సైతం తీవ్ర మనోవేదనలో పడ్డారు.తాజాగా ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఇచ్చిన సీబీఐ విచారణ ఉత్తర్వుల నేపథ్యంలో మళ్లీ పార్టీ పరంగా కార్యక్రమాల విస్తృతంపై విజయ్ కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన పార్టీ జిల్లాల కార్యదర్శులతో సంప్రదింపులలో ఉన్నారు. ఎక్కువ శాతం జిల్లాల కార్యదర్శులు పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్‌కు వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్నట్టు సమాచారం వెలువడింది. ఈ సమావేశాలు, సంప్రదింపులు తదుపరి పార్టీ పరంగా విజయ్ కొన్ని మార్పు, చేర్పుల ప్రక్రియతో ప్రక్షాళన చేయబోతున్నట్టు చర్చ ఊపందుకుంది.ఈ పరిస్థితులలో విజయ్‌కు మరింత ఉత్సాహం తెప్పించే రీతిలో తాజాగా ఓ సర్వే వెలుగు చూసింది. ఇటీవల ముంబైకు చెందిన ఓ సంస్థ సర్వే జరపగా 2026 ఎన్నికలలో విజయ్ పార్టీకి 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న సమాచారాలు వెలువడ్డాయి. తాజాగా జరిపిన సర్వేలో కరూర్ ఘటనతో విజయ్‌కు ప్రజాదరణ మరింతగా పెరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ప్రజలలో ఆయనపై ఆదరణ అన్నది తగ్గలేదని, అదే సమయంలో తాజాగా 23 శాతం మద్దతు ఆయనకు పెరిగినట్టుగా పేర్కొంటూ వెలువడ్డ సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్‌కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
‘ఖబడ్దార్..’ విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
చెన్నై: తమిళ అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్ ఇంటికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో నీలగిరిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయగా.. కాల్ చేసిన ఆగంతకుడ్ని గుర్తించే పనిలో ఉన్నారు. చెన్నై పోలీసులకు కాల్ చేసిన సదరు వ్యక్తి.. భవిష్యత్తులో విజయ్ గనుక పబ్లిక్ ర్యాలీలు నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇంటిని బాంబుతో పేల్చేస్తానని హెచ్చరించినట్లు సమాచారం. ఆ కాల్ కోయంబత్తూరు నుంచి వచ్చినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన టీవీకే ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. ఘటన తర్వాత విజయ్ కనీసం బాధితులను పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆపై దాడులు జరిగే అవకాశం ఉండడంతో.. విజయ్ ఇంటికి పోలీసు భద్రతను పెంచారు.ఈ ఘటనపై నమోదైన కేసులో టీవీకే నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేయగా, మద్రాస్ హైకోర్టు సిట్ ఏర్పాటునకు ఆదేశించింది. అయితే టీవీకే మాత్రం ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించాలని డిమాండ్ చేస్తోంది. ఇక.. కరూర్ ఘటన నేపథ్యంలో రాజకీయ సభలకు, ర్యాలీలకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో తమిళనాడు ప్రభుత్వం ఉంది. ఆ మార్గదర్శకాలను జారీ చేసే దాకా.. తమిళనాడులో ఏ పార్టీకి ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వబోమని ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు స్పష్టం చేసింది కూడా. ఇదిలా ఉంటే.. తమిళనాడు (Tamil Nadu)లో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. గతకొంతకాలంగా సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ తారలు త్రిష, నయనతార నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరిపి.. ఆ బెదిరింపులు ఉత్తవేనని తేల్చాయి. ఇదీ చదవండి: కరూర్ బాధితులకు విజయ్ పరామర్శ -
కరూర్ విషాద ఘటన.. విజయ్ మరో కీలక నిర్ణయం
సాక్షి, చైన్నె: తమిళనాడులో(Tamil Nadu) కరూర్ తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన నుంచి బాధితులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. మరవైపు.. టీవీకే అధినేత విజయ్(TVK Vijay).. పలువురు బాధితులను పరామర్శించినట్టు సమాచారం. వీడియోలో వారిని పలకరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధితులను కలిసేందుకు విజయ్ రెడీ అవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.వివరాల ప్రకారం.. కరూర్(Karur Stampade) బాధితులల్లోని పలువురికి టీవీకే నేత విజయ్ వీడియో కాల్ ద్వారా పరామర్శించినట్టు తెలిసింది. త్వరలో నేరుగా వచ్చి కలుస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీకి సంబంధిత స్థానిక నేతల ద్వారా సేకరించిన నెంబర్ల ఆధారంగా బాధితులకు విజయ్ వీడియో కాల్ చేసి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరూర్ బాధితులను కలిసేందుకు విజయ్.. రాష్ట్ర డీజీపీ(Tamil Nadu DGP) కోరినట్టు సమాచారం. ఈ మేరకు తమిళనాడు డీజీపీకి విజయ్ ఈమెయిల్ పంపినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, విజయ్ మెయిల్‌కు డీజీపీ ఎలాంటి సమాచారం ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత నెల 27వ తేదీన కరూర్‌లో టీవీకే విజయ్ ప్రచార సమయంలో చోటు చేసుకున్న పెనువిషాద ఘటనలో 41 మంది మరణించారు. వీరికి విజయ్ పార్టీ తరపున తలా 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. స్థానికంగా ఉన్న కొందరు నాయకులు బాధితులను కలుస్తూ తమ సానుభూతి తెలియజేసే పనిలో పడ్డారు. ముఖ్య నేతలందరూ కేసులకు భయపడి అజ్ఞాతంలో ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విజయ్ కరూర్ నుంచి చైన్నెకు వచ్చేయడం చర్చకు దారి తీసింది. ఇందుకు ఆయన వీడియో రూపంలో వివరణ కూడా ఇచ్చారు. కరూర్‌కు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టును సైతం విజయ్ ఆశ్రయించి ఉన్నారు.అదే సమయంలో ఐజీ అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ సైతం ఈ కేసుపై విచారణను వేగవంతం చేసింది. మూడో రోజుగా ఈ బృందం తాంథోని మలైలోని అతిథి గృహంలో తిష్ట వేసి, పోలీసులు సమర్పించిన నివేదిక, లభించిన సీసీ ఫుటేజీలతో పాటూ బాధితుల నుంచి సేకరించిన సమాచారాలను సమగ్రంగా పరిశీలించే పనిలో నిమగ్నమైంది. -
కరూర్ తొక్కిసలాట.. బాధిత కుటుంబాలకు విజయ్ పరామర్శ
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలను విజయ్ ఇవాళ (మంగళవారం అక్టోబర్ 7) వీడియో కాల్లో పరామర్శించారు. వారిని ఓదార్చిన విజయ్.. త్వరలో కరూర్‌లో పర్యటిస్తానని తెలిపారు."నేను మీతో ఉన్నాను, మీకు అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అయితే, వీడియో కాల్ సమయంలో ఫోటోలు తీసుకోవద్దని.. రికార్డ్ చేయవద్దని ఆయన బృందం కోరింది. ప్రతి వీడియో కాల్ సుమారు 20 నిమిషాల పాటు సాగిందని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో కరూర్ తొక్కిసలాట తమిళనాడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.విజయ్ ర్యాలీలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీకి చెందిన కొందరు నేతలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, మొదట వ్యతిరేకించిన కోర్టు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. కాగా, టీవీకే పార్టీకి 10 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 30 వేల మందికి పైగా హాజరయ్యారు. భారీగా జనం హాజరవుతారని అధికారులు ముందుగా అంచనా వేయలేకపోయారు. -
కరూర్ తొక్కిసలాట బాధితులకు టీవీకే అధినేత విజయ్ వీడియో కాల్
-
సినీ హీరోలను తలపై పెట్టుకొని ఊరేగకండి: సత్యరాజ్
తమిళనాడులో సినిమాలను, రాజకీయాలను వేరుచేసి చూడలేం. ఈ రెండింటి మధ్య అంత అవినాభావ సంబంధం ఉంది. ప్రఖ్యాత దివంగత రాజకీయ నాయకులు కామరాజర్, అన్నాదురై నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ వరకు సినిమాలతో చాలా దగ్గర సంబంధం ఉన్న వాళ్లే. ఇప్పుడు కూడా చాలా మంది నటీనటుల దృష్టి రాజకీయాలపైనే ఉందని చెప్పవచ్చు. తాజాగా విజయ్ రాజకీయ రంగప్రవేశం ప్రకంపనలు పుట్టిస్తోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన ప్రచారంలో జరిగిన దురదృష్టకర సంఘటన అనేక చర్చలకు దారి తీస్తోంది. సినీ రంగంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తోంది. ఉదాహరణకు సత్యరాజ్(Satyaraj ), విజయ్ను విమర్శించే విధంగా తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ చేశారు. అందులో నటులను తలపై పెట్టుకొని ఊరేగకండి.., వాళ్లకు చాలా తెలుసని మీరు భావించకండి, నటించడం మాత్రమే తెలుసు. ఈ సమాజంలో జరుగుతున్న పెద్ద తప్పు నటులను ఐన్ స్టిన్ రేంజ్లో భావిస్తుండడమే. మమ్మల్ని నెత్తినెక్కించుకోకండి. మేము జస్ట్ పాటిస్తాం అంతే. మేము పెరియార్, అంబేడ్కర్ కాదని గుర్తుంచుకోవాలంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్‌పై దర్శకుడు పేరరసు తీవ్రంగా స్పందించారు. ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటులకు ఏమీ తెలియదు. ఒట్టి మట్టే అంటే ఎలా.. మీరూ నటుడే కదా.. మీరెందుకు సందేశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఎంజీఆర్ ఉన్నప్పుడు మీకు ఇలా అనే ధైర్యం ఉండేదా ? కమలహాసన్‌కు ఎంపీ పదవి ఇచ్చారని, మీరు డీఎంకేను అడగాల్సింది. పార్టీ కోసం శ్రమించిన వాళ్లు ఎందరో ఉండగా వారి కూతుళ్లకు పదవి ఇవ్వకుండా సత్యరాజ్ కూతురికి పదవి ఎందుకు ఇచ్చారని మీరు డీఎంకే పార్టీని అడగాలి. నటన అనేది ఒక వృత్తే. అందులోనూ ప్రపంచ జ్ఞానం కలవారు ఎందరో ఉన్నారు. వారిని అరకొర తెలిసిన వాళ్లు అని కించపరచరాదు అని దర్శకుడు పేరరసు సత్యరాజ్‌పై ఫైర్ అయ్యారు. -
కరూర్ ఘటన: విజయ్ టీవీకేపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
కరూర్ తొక్కిసలాట ఘటనలో తమిళగ వెట్రి కళగం పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను కొట్టిపారేసింది. దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉన్నందున అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.‘‘ప్రారంభ దశలోనే సీబీఐకి బదిలీ చేయాలని కోరితే ఎలా?. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుతో సంతృప్తి కలగనప్పుడు కోర్టును ఆశ్రయించండి. అసలు పార్టీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు తాగు నీరు, ఆహారం సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోయారు?.. దయచేసి న్యాయస్థానాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు.. రాజకీయ ర్యాలీలు, సభల విషయంలో అనుమతులు ఎలా జారీ చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రభుత్వ లాయర్.. ఈ విషయమై అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్పష్టమైన నియమాలు ప్రభుత్వం రూపొందిస్తుందని, అప్పటిదాకా ఎలాంటి రాజకీయ ర్యాలీలకు అనుమతి ఇవ్వబోదని తెలిపారు. అలాగే.. రోడ్డుపై సభకు ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులను హైకోర్టు నిలదీసింది. దీంతో వివరణకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో అంగీకరించింది. మరోవైపు.. బాధితులకు పరిహారం పెంపు పిటిషన్‌కు రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కుట్ర కోణం ఉందని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని టీవీకే ఓ పిటిషన్ వేసింది. అలాగే తమ కార్యదర్శులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ వేసింది. ఈ రెండింటితో పాటు కరూర్‌కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్, మరో నాలుగు వేర్వేరు పిటిషన్లు.. మొత్తం ఏడింటిని కలిపి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ చేపట్టింది. -
తమిళ రాజకీయాల తొక్కిసలాట
తమిళనాట కరూర్‌లోని వేలుసామిపురంలో హీరో విజయ్ రాజకీయ ర్యాలీలో విషాద ఘటన జరిగి నాలుగు రోజులు గడిచాయి కానీ, దానిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రం సమీప భవిష్యత్తులో సమసిపోయేలా లేవు. విజయ్ కొత్త రాజ కీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నేతలపై వరుస ఎఫ్.ఐ.ఆర్.లు, రకరకాల కోర్టు కేసులు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన జ్యుడిషియల్ కమిషన్, బాధితులకు అండ పేరిట వివిధ రాజకీయ పార్టీల సందర్శనలు, కేంద్రంలోని పాలక ఎన్డీఏ కూటమి పక్షాన నటి హేమమాలిని సారథ్యంలో 8 మంది ఎంపీల బృందం క్షేత్రస్థాయి పర్యటన... ఇలా ఆగకుండా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విజయ్‌పై చెప్పులు విసరడం దగ్గర నుంచి ర్యాలీ వేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం దాకా అనేక అంశాలు, కుట్ర ఉందనే అభియోగాలు ఒక్కొక్కటిగా వస్తు న్నాయి. దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలని విజయ్ కోరు తుంటే, సుప్రీంకోర్ట్ సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ కావాలని ఎన్డీఏ డిమాండ్ చేస్తోంది.మామూలుగా సినీ స్టార్ వస్తున్నారంటేనే భారీ జన సందోహం ఉంటుంది. ఇప్పుడు విజయ్ ఓ రాజకీయ నేత కూడా! త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజకీయపార్టీ, దాని అధినేత సభలు పెట్టడం సహజం. దానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, దాని చెప్పు చేతల్లోని పోలీసు యంత్రాంగానిది. అందులోనూ వారాంతంలో రోడ్ షో అంటే, అభిమాన నాయకుణ్ణి చూసేందుకు పిల్లా పాపలతో సహా జనం మరింతగా తరలి వస్తారు. అంత పెద్దయెత్తున జనం వస్తుంటే, కచ్చితంగా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు అవసరం. క్రేజున్న విజయ్ సభలకు మద్రాసు హైకోర్ట్ అందుకు కొన్ని నిబంధనలు పెట్టింది. అవన్నీ తు.చ. తప్పక పాటించాల్సిందే! అదే సమయంలో కరూర్ ఘటనలో ప్రభుత్వ, పాలనా యంత్రాంగాల ఘోర వైఫల్యాలను విస్మరించలేం. అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి అత్యవసర రక్షణ వరకు అన్నీ చూసుకోవాల్సిన పోలీసు, ప్రభుత్వ యంత్రాంగాలు ఆ బాధ్యతల నుంచి తప్పించుకొని, సభ పెట్టిన వారిదే తప్పంటూ నెపం నెట్టివేయాలని చూస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కుట్ర ఉందనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. అదే నిజమైతే, అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు. నిజానికి, మరో సినీ హీరో స్వర్గీయ విజయ్‌కాంత్ ఆ మధ్య కొన్నేళ్ళ క్రితం తన డీఎండీకె పార్టీతో మెరుపులు మెరిపించి నప్పటికీ, తమిళనాట రాజకీయాలంటే ప్రధానంగా రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకె, అన్నా డీఎంకెల మధ్యనే నడుస్తుంటాయి. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలది సహాయ పాత్రే. సీమాన్ నేతృత్వంలోని ఎన్టీకే, అలాగే పీఎంకే లాంటి ఇతర పార్టీలది మరీ చిన్న పాత్ర. అలాంటì ద్రవిడ రాజకీయాల తమిళనాట ‘ఇళయ దళపతి’ (యువ దళపతి) విజయ్ పార్టీ పెట్టడం కుదుపు తెచ్చింది. రాజకీయ రంగప్రవేశంపై సుదీర్ఘ కాలం దోబూచులాడిన సూపర్‌స్టార్ రజనీకాంత్ మిడిల్డ్రాప్తో ఖాళీగా ఉన్న స్థానంలోకి దూసుకువచ్చారీ ఇళయ దళపతి.విజయ్ ఇప్పటికే తమిళనాట రెండు రాష్ట్ర స్థాయి మహా సభలు పెట్టారు. రెండు వీకెండ్ రోడ్ షోలూ చేశారు. ఎక్కడకు వెళ్ళినా జనసందోహమే! గతంలో అన్నా డీఎంకె సంస్థాపకుడైన సినీ హీరో ఎమ్జీఆర్ కాలంలో లాగా ఇప్పుడు విజయ్ సభలకు అభిమాన గణం వెల్లువెత్తుతున్నారు. ప్రధానంగా పాతికేళ్ళ లోపు యువతీ యువకులు తమ అభిమాన హీరోను దగ్గర నుంచి చూడాలని ఉరకలెత్తుతున్నారు. ఫలితంగా, విజయ్ ఇటు పాలక డీఎంకెను కలవరపరచడమే కాక, అటు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో గద్దెనెక్కాలని ఆశలు పెట్టుకున్న ప్రతిపక్షం అన్నాడీఎంకె వ్యూహానికీ పెను సవాలయ్యారు. అలాంటి వేళ సెప్టెంబర్ 27న కరూర్‌లో వీకెండ్ రోడ్ షోలో జరిగిన తొక్కిసలాట అనూహ్యంగా బ్రేకులు వేసింది. కుంభమేళా తొక్కిసలాట ఘటన లాంటివన్నీ ఇటీవలి చేదు జ్ఞాపకాలే. అయితే, 41 మంది దుర్మరణానికీ, పదులసంఖ్యలో క్షతగాత్రులకూ కారణమైన కరూర్ ఘటన తమిళ రాజకీయ సభలలో కనీవినీ ఎరుగనిది. ఆ దుర్ఘటనతో మ్రాన్పడిపోయిన విజయ్ తక్షణమే 2 ఎయిర్‌పోర్టుల వద్దా మీడియాతో మాట్లా డకున్నా, తర్వాత సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు రూ. 20 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 2 లక్షల వంతున నష్టపరిహారం చెల్లించారు. పరామర్శకు ఆయన వెళ్ళాలను కున్నా, పరిస్థితి సద్దుమణగకుండా రావద్దన్న ప్రభుత్వసూచనను మన్నించక తప్పలేదు. రెండు వారాల పాటు రోడ్ షోలనూ వాయిదా వేసుకున్నారు. ర్యాలీ నిర్వహించిన రాజకీయ పార్టీ నైతిక బాధ్యతను ఎవరూ కాదనలేరు. కానీ, కరూర్ ఘటన మొత్తానికీ విజయ్‌నే దోషిని చేస్తూ, కొందరు ప్రత్యక్షంగానూ, మరికొందరు పరోక్షంగానూ వ్యాఖ్యలు చేయడమే విడ్డూరం. ఒకవేళ సభా నిర్వాహకులు నియమాలను పాటించడం లేదనుకుంటే, స్పష్టమైన రుజువులు చూపి, వారిని వారించాలి. అంతే కానీ, జరగకూడనిది జరిగాక తప్పంతా వాళ్ళదే అంటే ఒప్పదు. ‘‘పోలీసులు పూర్తిస్థాయిలో భద్రత కల్పించి ఉంటే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు చోటు చేసుకుని ఉండేవి కావు. ఇకనైనా పోలీసులు అధికార పక్షానికి ఓ న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్టు వ్యవహరించకుండా ఉంటే మంచిది’’ అని ప్రధాన ప్రతిపక్షమే వ్యాఖ్యానించడం గమనార్హం. రాజకీయ ఆరోపణలు చేయాలే తప్ప తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే క్రేజున్న విజయ్ను ప్రత్యక్షంగా బాధ్యుణ్ణి చేస్తే, ఆయ నను వేధిస్తున్నారన్న భావన జనంలో కలిగి అది తమకే ఎదురు కొడుతుందన్న ఎరుక పాలక పక్షానికీ లేకపోలేదు. అందుకే, పార్టీలన్నీ తమ స్వార్థప్రయోజనాలకు తగ్గ ప్రకటనలిస్తూ, ప్రజల్లో మార్కులు కొట్టేసే పనిలో తలమునకలయ్యాయి. ఏమైనా, రాజ కీయ ర్యాలీలలో భద్రతా ప్రమాణాలు కీలకమనీ, జవాబుదారీ తనం అత్యవసరమనీ కరూర్ దుర్ఘటన మరోసారి గుర్తు చేసింది. అందుకు, పాలకులే ప్రధాన బాధ్యత తీసుకోక తప్పదు. – ఆర్. పర్వతవర్ధని ‘ కోయంబత్తూరు -
టీవీకే అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం
-
కక్ష సాధించాలంటే.. నన్ను ఏమైనా చేసుకోండి
సాక్షి, చెన్నై: కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలంటే తనను ఏమైనా చేసుకోవాలని, తన కేడర్‌ను విడిచి పెట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ విజ్ఞప్తి చేశారు. కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై మూడు రోజుల తర్వాత విజయ్ ఒక వీడియో విడుదల చేశారు. తన జీవితంలో ఇంత వేదన ఎన్నడూ అనుభవించలేదని తెలిపారు. ప్రజలు చూపుతున్న ఆదరాభిమానాలకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. జరగకూడనిది జరిగిందని, ఘటన జరిగిన రోజున తాను అక్కడే ఉంటే, పరిస్థితిని మరింత సమస్యాత్మకంగా మార్చేస్తారేమోనని చెన్నైకి వచ్చేసినట్టు వివరించారు. సీఎం సార్ .. విజయ్ వీడియోలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ‘ఐదు జిల్లాలకు ప్రచారానికి వెళ్లాను. కరూర్‌లో మాత్రమే ఎందుకు జరిగింది.. ఎలా జరిగింది.. ఏం జరిగింది.. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. ప్రజలు అన్నింటిని చూస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ‘కరూర్ ప్రజలు బయటకు వచ్చి వాస్తవాలు చెబుతున్నప్పుడు దేవుడే తన ముందుకు వచ్చి చెబుతున్నట్టుగా అనిపించింది. కేటాయించిన స్థలానికి వెళ్లి నిలబడి ప్రసంగించారు. ఏ తప్పు చేయలేదు. అయితే, నా పార్టీ వర్గాలను కేసుల పేరిట వేధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు.సీఎం సార్.. కక్షసాధింపు చర్య ఏదైనా ఉంటే .. నన్ను ఏమైనా చేసుకోండి. నా వాళ్లను వదలేయండి. ఇంట్లో లేదా ఆఫీసులో ఉంటాను.. నా వాళ్లను వదిలేయండి..’ అని అన్నారు. అలాగే కేడర్‌కు భరోసా ఇస్తూ, రాజకీయ ప్రయాణం మరింత బలంగా, ధైర్యంగా కొనసాగిస్తాం.. అని ముగించారు. టీవీకే వర్గాలపై కేసులు, అరెస్టుల ప్రక్రియ సాగుతుండటంతో ఆయన ఈ వీడియోను విడుదల చేసినట్టుందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో ఆయన కక్షసాధింపు అంటూ సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడం మరింత చర్చకు దారితీసింది.ఇద్దరు నేతలకు రిమాండ్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, కరూర్ నగర్ ఇన్చార్జ్ మాశి పొన్‌రాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళవారం కరూర్ కోర్టులో న్యాయాధికారి భరత్‌కుమార్ ఎదుట హాజరుపరిచారు. అక్టోబర్ 14వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.బీజేపీ బృందం అనుమానాలు తొక్కిసలాటకు సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో ఎనిమిదిమంది ఎంపీలున్న బీజేపీ నిజనిర్ధారణ కమిటీ మంగళవారం కరూర్‌లో పర్యటించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారసభ కోసం సరైన స్థలం కేటాయించలేదని చెప్పారు. ఇరుకైన రోడ్డులో అనుమతి ఇవ్వడం, విద్యుత్ సరఫరా ఆగడం, చెప్పులు విసరడం వంటి అంశాలను పరిశీలిస్తే ఈ ఘటన యాదృచ్ఛికంగా జరిగినట్టు కనిపించడం లేదని అనుమానాలు వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా తమిళనాడు ప్రభుత్వం తరఫున అధికార ప్రతినిధులుగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అముదా నేతృత్వంలో ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదం, ఇతర అధికారుల బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తొక్కిసలాటకు కారణాలు, రద్దీపెరగడం వంటి అనేక అంశాలను వీడియో ఆధారాలతోసహా విడుదల చేసిన అధికారులు మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. -
చేటు తెచ్చిన అనుభవ రాహిత్యం
తమిళనాడులోని కరూర్ పట్టణంలో ఓ కూడలి వద్ద సెప్టెంబర్ 27 రాత్రి సంభవించిన తొక్కిసలాటలో 41 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో గాయ పడిన జనం పదుల సంఖ్యలో ఆసు పత్రిలో చికిత్స పొందుతున్నారు. సినీరంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన హీరో, ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ అధ్యక్షుడు అయిన విజయ్ ర్యాలీకి 27,000 మందికి పైగా హాజరైనపుడు ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆయన రాక ఏడు గంటలు ఆలస్యమై, సభ రాత్రి 7.30 గంటలకు మొదలైంది. అప్పటి వరకు విజయ్ కోసం ఉత్సుకతతో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా తోసుకోవడంతో తొక్కిసలాటలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నామక్కల్‌లో సభ ముగించుకుని కరూర్ వచ్చేందుకు విజయ్‌కి అన్ని గంటల సమయం ఎందుకు పట్టిందని కొందరు అంటున్నారు.పోలీసులు కేటాయించిన స్థలమే!విజయ్ కరూర్ సభకు ఎంతమంది తరలిరాగలరో అంచనా వేయడంలో పోలీసులు విఫలమయ్యారా... అన్నది సహజంగానే ఇక్కడ తలెత్తే ప్రశ్న. రాజకీయంగా తనను ఎదగనీయకుండా చేసేందుకు పోలీసులు అవరోధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విజయ్ చేస్తున్న ఆరోపణలతో తమిళనాడు పోలీసులు గత కొద్ది నెలలుగా ఆత్మరక్షణ ధోరణిని అనుసరిస్తున్నారు. కొన్ని వారాల క్రితం తిరుచిరాపల్లిలో విజయ్ రోడ్ షో నిర్వహించినపుడు పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో సభా నిర్వహణ కోసం కరూర్‌లో విజయ్ ఎంచుకున్న రెండు ప్రదేశాలకు పోలీసులు అను మతి నిరాకరించారు. అవి జన సమ్మర్ధంతో కిటకిటలాడే వాణిజ్య స్థలాలు కావడమే అందుకు కారణం. అందుకే ఆ రెండూ కాకుండా, కొద్ది రోజుల క్రితం అన్నా డి.ఎం.కె నాయకుడు ఎళప్పాడి పళని స్వామి సభ నిర్వహించిన కరూర్‌లోని మరో ప్రదేశాన్ని పోలీసులు విజయ్ సభకు కేటాయించారు. టీవీకే మొదట ఎంచుకున్న ఆ సభా ప్రాంతాలు రెండింటికీ ఇది కూడా దగ్గరలోదే కావడంతో పార్టీ అందుకు వెంటనే అంగీకరించింది. ఏర్పాట్లలో తడబడుతున్న టీవీకేకాగా, తాజా ఘటన రాజకీయంగా, సంస్థాగతంగా టీవీకేకు కొరవడిన సామర్థ్యాన్ని బహిర్గతం చేసింది. పుదుచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఎన్. ఆనంద్ ఒక్కరే టీవీకేలో రాజకీయంగా అనుభవం ఉన్న నాయకుడు. ఆయన గతంలో వివిధ కాంగ్రెస్ చీలిక వర్గాలలో పనిచేశారు. ఇటువంటి విషయాల్లో ఏ రాజకీయ పార్టీలోనైనా జిల్లా కార్యదర్శులు ముఖ్యపాత్ర వహిస్తారు. వారు సాధారణంగా అట్ట డుగు స్థాయి సంబంధాలు కలిగినవారై ఉంటారు. అయితే టీవీకేలో విజయ్ అభిమాన సంఘాలలోని ప్రీతిపాత్రులే ఆ భూమిక నిర్వ హిస్తున్నారు. సభలకు తగిన ఏర్పాట్లు చేయడంలో వారు తడబడు తున్నారు. తమ సభలకు సుమారు పది వేల మంది హాజరు కావచ్చని అంచనా వేస్తున్నట్లు వారు పోలీసులకు చెబుతున్న సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఇలాంటి సభలప్పుడు సాధారణంగా పార్టీలు కొద్దిమంది కార్యకర్తలకు డబ్బు పంపిణీ చేసి ఆహారం, నీరు సమకూర్చే ఏర్పాట్లు చేస్తూంటాయి. కాగా, సభలకు హాజరైన జనాన్ని అదుపులో ఉంచి, నియంత్రించవలసిన అవస రాన్ని ఇప్పటికే అనేక తమిళ పార్టీలు గుర్తించాయి కూడా! రాజీవ్ గాంధీ హత్యోదంతంతో తమిళనాడు ఈ చేదు పాఠాన్ని నేర్చు కోవాల్సి వచ్చింది. టీవీకే తన తరహాలో నిర్వహిస్తున్న రోడ్ షోల లాంటివి మాత్రం తమిళనాడు రాజకీయాలకు కొత్త. అప్పటి ‘సినీ–నాయకులు’ వేరు!గతంలో జయలలిత, కరుణానిధి కూడా వాహనాలలో రాష్ట్ర హైవేలలో ప్రయాణించినా ముందుగా నిర్ణయించిన చోట్ల మాత్రమే వారు వాహనాలను ఆపి ప్రసంగించేవారు. కొద్ది వేల మందిని ఉద్దే శించి ప్రసంగించి మరో చోటుకు బయలుదేరేవారు. పైగా, వారు జనాలు వేచి చూసేటట్లు చేసేవారు కాదు. నిర్హేతుకమైన జాప్యాలకు అవకాశమిచ్చేవారు కాదు. మొన్నటి ఘటనలో అంబులెన్సుల రాకకు సంబంధించిన శబ్దాలు వినిపిస్తున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించడం కూడా ఆయన రాజకీయ అనుభవ రాహి త్యాన్ని సూచించింది. ఏం జరుగుతోందో ఎవరూ ఆయన చెవిన వేసినట్లు లేదు. పరిస్థితి తీవ్రతను గమనించిన వెంటనే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరుచిరాపల్లిలో ప్రైవేటు విమానం ఎక్కి, రెండు గంటల్లోపల చెన్నైకి చేరుకున్నారు. ఆయనతో పాటే టీవీకే సభ్యులు కూడా సభా ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్కు ఎక్కిన కొందరు పరారీలో ఉన్నారు. ‘‘కక్ష ఉంటే నాపై తీర్చుకోండి!’’ఈ అవకాశాన్ని అధికార డి.ఎం.కె పార్టీ సద్వినియోగం చేసుకు న్నట్లే కనిపిస్తోంది. కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన సెంథిల్ బాలాజీ ఆ సమయంలో నియోజకవర్గంలోనే ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చింది. అయితే సెంథిల్ బాలాజీ ఆస్పత్రికి చేరుకోక ముందే, కరూర్ మాజీ ఎమ్మెల్యే అన్నా డి.ఎం.కె నాయకుడు ఎం.ఆర్. విజయ్ భాస్కర్ బాధితులను పరామర్శించటం ప్రారంభించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా శనివారం అర్ధరాత్రికల్లా కరూర్ చేరు కున్నారు. స్టాలిన్ కుమారుడు, ఆయన వారసత్వాన్ని అందుకుంటాడని భావిస్తున్న ఉదయనిధి కూడా ఆదివారం ఉదయానికల్లా కరూర్‌లో వాలారు. అయితే విజయ్‌కి మాత్రం ఈ ఘటనపై క్షమా పణ కోరుతూ బహిరంగ ప్రకటన చేయడానికి 12 గంటలకు పైగా పట్టింది. ఇక, తాజాగా నిన్న (సెప్టెంబరు 30) విడుదల చేసిన ఒక వీడియోలో, ‘‘నా జీవితంలో ఇంతటి బాధాకరమైన రోజు వస్తుందని ఊహించ లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది. నా గుండె ముక్కలైపోయింది. మాటలు రావటం లేదు. కరూర్ తొక్కిసలాట ఘటనలో నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. నాపై కక్ష ఉంటే తీర్చుకోండి. నా అభిమా నులపై కాదు’’ అని కూడా విజయ్ ఆ వీడియోలో అన్నారు. వచ్చే ఏడాది (2026) ఎన్నికలకు సమాయత్తమవుతున్న విజయ్‌కి ఈ సంఘటన పెను విఘాతమేనని చెప్పాలి. ఘటనపై ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో ఏకసభ్య విచారణ సంఘాన్ని నియమించ డాన్ని టీవీకే, అన్నా డి.ఎం.కెలు తోసిపుచ్చాయి. సి.బి.ఐతో దర్యాప్తు జరిపించాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.హీరో... నాయకుడిగా మారాలిఎం.జి. రామచంద్రన్, జయలలితలు కూడా సినీ రంగం నుంచి వచ్చినవారే అయినా, ఎమ్జీఆర్‌కు ద్రవిడ ఉద్యమ నేపథ్యం ఉంది. జయలలిత చాలా ఆటుపోట్లను తట్టుకుని ఎంజీఆర్ చెంత రాజకీయంగా సుశిక్షితురాలిగా మారారు. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ తనను తాను పూర్తిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయనకు లక్షల మంది అభిమానులున్నమాట నిజమే. అయితే ప్రజలు ఓటు వేయాలని కోరుకునే రాజకీయ నాయకునిగా ఆయన రూపాంతరం చెందాల్సి ఉంది. ఇక ఆయన రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి తిరిగి ఎప్పుడు బయలుదేరుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. భవిష్యత్ పరిణామాలు వెండితెరపై కాక, రాజకీయ యవనికపైనే ఆవిష్కృతం కానున్నాయి. నిరుపమా సుబ్రమణియన్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
తమిళనాట పట్టుకోసం బీజేపీ ఎత్తులు
దేశంలో ఇంతపెద్ద రాష్ట్రాన్ని అయినా జయిస్తున్న భారతీయజనతా పార్టీకి దక్షిణాది మాత్రం కోరుకుడుపడడం లేదు.. ఇటువైపున్న ద్రావిడ రాష్ట్రాలు తమిళనాడు.. కర్ణాటక.. కేరళ.. ఏపీ.. తెలంగాణ.. పాండిచ్చేరి.. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి అంతంతమాత్రమే.. ఏదో నానా యాతనా పడి..ఏదోలా కర్ణాటకలో ఏదోలా అధికారం దక్కించుకున్నా అది మూన్నాళ్ళ ముచ్చటే అవుతోంది తప్ప మళ్ళా అక్కడ అధికారాన్ని నిలుపుకోవడం బీజేపీకి సాధ్యం కావడం లేదు. ఇక ప్రాంతీయపార్టీలు ఆలవాలమైన తమినాడులో అయితే దశాబ్దాలుగా పోరుతున్నా బీజేపీ అడుగుకూడా పెట్టేందుకు వీలు చిక్కడంలేదు. అక్కడ ఉంటే అన్నాడీఎంకే.. కూడా డీఎంకే.. ఇక మిగతావన్నీ చిన్నా చితకాపార్టీలు మాత్రమే.. దేశాన్ని 75 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ కూడా తమిళనాట నాడు కరుణానిధి.. నేడు స్టాలిన్ చాటున మనుగడసాగించడమే తప్ప సొంతంగా అక్కడ సాధించిందేమీ లేదు.. ఇక బీజేపీ మాత్రం ఇప్పుడు ఎలాగైనా అక్కడ పాగా వేయాలని తీవ్రంగా తాపత్రయపడుతోంది. ఆ రాష్ట్ర శాసన సభలో 234 సీట్లుండగా అక్కడ 2026 ఏప్రిల్.. మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. ప్రస్తుతానికి 46 శాతం ఓట్లు సాధించిన స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే 159 సీట్లు సాధించి అధికారంలో ఉంది.. తరువాత 74 సీట్లతో పాళనిస్వామి సారథ్యంలోనే అన్నా డీఎంకే ప్రతిపక్ష పాత్రలో ఉంది.. ఇక ఇక్కడ బీజేపీకి స్థానం తక్కువే.. కానీ ఆశ చావని బీజేపీ నేతలు దింపుడుకల్లం ఆశతో తమిళనాడువైపు చూస్తూనే ఉన్నారు..ఇదిలా ఉండగానే మొన్న సినిమా నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ రాజకీయ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించగా వందమందికి పైగా గాయపడ్డారు.. ఇది రాజకీయ సభలకు సంబంచింది దేశంలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెబుతున్నారు.. అయితే ఈ ప్రమాద సంఘటన తరువాత బీజేపీ జాతీయ నాయకత్వం ఎంపీ హేమామాలిని సారధ్యంలోని ఎనిమిది మంది ఎంపీలతో ఒక కమిటీని వేసింది. తెలుగుదేశం.. శివ సేన వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకూ ఈ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ అక్కడి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది. ఇదిలా ఉండగా విజయ్ సభలో జరిగిన ప్రమాదాన్ని సైతం రాజకీయంగా ఎలా వాడుకోవాలన్నదానిగురించి బీజేపీ యోచన చేస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 2. 62 శాతం ఓట్లు తెచ్చుకుని కేవలం నాలుగు స్థానాల్లోనే గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీకి అన్నా డీఎంకేతో వెళ్లడం మినహా మరో మార్గం లేకుండా పోయింది.. ఈ విజయ్ సభ ప్రమాదాన్ని సైతం బీజేపీ రాజకీయంగా వినియోగించుకునే అవకాశాన్ని అన్వేషిస్తోంది. ప్రాంతీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా వాడుకుని లబ్ధిపొందుతారుతప్ప వారి యోగ క్షేమాలు.. భద్రతా ఏమాత్రం పట్టించుకోవు అనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లే అంశాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఈ ప్రమాదాన్ని సామాజిక అంశంగా మార్చుకుని రాజకీయంగా లబ్ధిపొందడానికి ఉన్న అన్ని అవకాశాలను బీజేపీ వెతుకుతోంది.. ఇకనైనా రాష్ట్రంలో అన్నా డీఎంకేతో కలిసి అధికారంలోకి వస్తుందా చూడాలి.. సిమ్మాదిరప్పన్నఇదీ చదవండి: అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు -
అల్లర్ల భూమిగా మార్చేశారు.. విజయ్‌పై సినీ నటి కామెంట్స్
కరూర్ ఘటన తర్వాత సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్‌పై తీవ్రమైన వ్యతిరేఖత కనిపిస్తుంది. తమిళనాడులో తన ఉణికి కూడా ప్రమాదంలో పడింది. ప్రమాదం జరిగిన తర్వాత ఆయన ఇప్పటికీ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కనీసం ఒక వీడియో రూపంలో కూడా స్పందించ లేదు. కేవలం సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే షేర్ చేశారు. దీంతో నెటిజన్లు నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తుంది.ఇప్పటికే విజయ్‌ని అరెస్ట్ చేయాలంటూ సినీ నటి ఓవియా సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ పంచుకుంది. అయితే, తాజాగా ఆమె మరోసారి ఇలా రియాక్ట్ అయింది. కరూర్ సంఘటన తర్వాత, రజనీకాంత్ సర్, అజిత్ సర్, సూర్య సర్ అభిమానుల మీద నాకు గౌరవం పెరిగింది. వారిలో చాలామంది సరైన మార్గంలో వెళ్తున్నారు. కానీ, విజయ్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు. టీవీకే ప్రచార ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున చాలా ప్రమాదకరమైన ట్వీట్లు చేస్తూ.. హింసను సృష్టిస్తున్నాడు. అతను తమిళనాడును అల్లర్ల భూమిగా మారుస్తున్నాడు.' అంటూ ఆమె పేర్కొన్నారువిజయ్ అభిమానులపై కూడా తమిళనాడులో విమర్శలు వస్తున్నాయి. విజయ్‌కు వ్యతిరేఖంగా ఎవరైనా మాట్లాడితే వారు బూతులతో ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. సోషల్‌మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇప్పటికే ఓవియాను టార్గెట్ చేస్తూ విజయ్ ఫ్యాన్స్ భారీగా పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. After #Karur incident, my respect for Rajini sir, Ajith sir, and Suriya sir has grown as their fans walk on the right path.But Vijay is misleading youngsters, making people like Adhav Arjuna post harmful tweets and create violence.He is turning Tamil Nadu into a land of riots. pic.twitter.com/XccxjsfAYG— Oviya (@oviya__offll) September 30, 2025 -
అలాంటి పని విజయ్ ఏనాడూ చేయబోరు
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో.. రెండు మానాడులు, సామాజిక యాత్రలో భాగంగా ర్యాలీలు నిర్వహించినా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం చూసుకోలేకపోయారంటూ తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా ఆ పార్టీ నేత ఒకరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతోంది.శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జీ నిరసనలు ప్రభుత్వాల్ని గద్దె దించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో.. తమిళ యువత కూడా డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రంగంలోకి దిగాలంటూ విజయ్ పేరిట ఓ ప్రచారం నడుస్తోంది. అయితే కరూర్ ఘటన జరిగిన కొన్ని గంటలకే ఇది తెరపైకి రావడంతో.. ఇటు రాజకీయ ప్రత్యర్థులు, అటు నెటిజన్లు విజయ్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. టీవీకే(TVK) అధికారికంగా స్పందించింది. ఆ ప్రకటనతో విజయ్కిగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ కూడా ఈ సిద్ధాంతానికే కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన టీవీకే సీనియర్ నేత ఆధవ్ అర్జున చేయడం చేసిన సోషల్ మీడియా పోస్టుతో వైరల్ అయ్యింది. కరూర్ ఘటన జరిగి 48 గంటలు గడవక ముందే యువతను రెచ్చగొట్టేలా ఆధవ్ అర్జున(TVK Aadhav Arjuna) పోస్ట్ చేశారంటూ అధికార డీఎంకే మండిపడింది. 41 మందిని బలిగొన్న కూడా ఆ పార్టీ ఇంకా బాధ్యతారాహిత్యంగానే వ్యవహరిస్తోంది. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదు అని డీఎంకే ఎంపీ కనిమొళి(Kanimozhi) హెచ్చరించారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆయన ఆ ట్వీట్ డిలీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ తాలుకా స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. దీని ఆధారంగా డీఎంకే ఫిర్యాదునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్న ఆధవ్ అర్జున.. కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఘటనపై దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ కోర్టును కోరారాయన. అలాగే బాధిత కుటుంబాలను విజయ్ పరామర్శించేందుకు అనుమతించాలంటూ రిక్వెస్ట్ చేశారు కూడా. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిటీ కూడా వేసింది.ఇదీ చదవండి: కరూర్ ఘటన 21 మందిపై కేసు.. తొలి అరెస్ట్ -
విజయ్‌కు సపోర్ట్‌గా మన్సూర్ సంచలన కామెంట్స్
తమిళనాడు కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందని సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పేర్కొన్నారు. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరగడంతో 41 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో విజయ్ తన క్రెడిబులిటీ కోల్పోయాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి కారణం విజయ్ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు అండగా మన్సూర్ అలీ ఖాన్ పలు వ్యాఖ్యలు చేశారు.కరూర్ ఘటన ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిన భారీ కుట్ర అంటూ మన్సూర్ అలీఖాన్ అభిప్రాయపడ్డారు. రాబోవు ఆరు నెలల్లో ఈ ఘటనకు కారణమైన వారికి తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. విజయ్‌ని అరెస్ట్ చేసినా సరే అతను బయపడడంటూ మన్సూర్ చెప్పుకొచ్చాడు. ఇదంతా ఆయన్ను రాజకీయంగా సమాధి చేసేందుకు వేసిన ప్లాన్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.'తమిళనాడులోని కరూర్ సంఘటన హృదయ విదారకం. నా స్వస్థలం కరూర్. ఈ ఘటన తర్వాత నాకు గత రెండురోజులుగా నిద్ర కూడా పట్టడం లేదు. నేను ఎలా నిద్రపోగలను..? ఆ తొక్కిసలాటలో మరణించిన వారందరూ ఎలాంటి బాధను అనుభవించారో తలుచుకుంటేనే కన్నీళ్లు వస్తున్నాయి. మన దేశంలో ఇలా జరగడం చాలా సిగ్గుచేటు. కరూర్ సంఘటనను తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆయుధంగా ఉపయోగించనున్నారు. మీకు విజయ్ ఎదుగుదల నచ్చకుంటే నేరుగా ఆయన్ను ఎదుర్కొండి. విజయ్ నినాదం తప్పు అయితే మీరు కూడా సమావేశాలు నిర్వహించి ఎండగట్టండి. అలా చేయడం చేతకాక ఇలాంటి మార్గాన్ని ఎంచుకుంటారా..? ఇది నీతిలేని రాజకీయమని అనిపించడం లేదా..? మీ రాష్ట్ర ప్రజలనే ఇలా చంపుకుంటారా.. వాళ్లను రక్షించుకోవాల్సిన బాధ్యత మీది కాదా.. తమిళనాడులో గెలుపు ఎవరిది అనేది రాబోయే ఆరు నెలల్లో ప్రజలు నిర్ణయిస్తారు. కొంతమంది తిమింగలంలా మింగేసేందుకు రెడీగా ఉన్నారు. విజయ్ ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయంలో నేను విజయ్‌కు మద్దతు ఇస్తున్నాను. నా తమ్ముడు విజయ్‌ని నేనే పెంచాను. అరుణ జగతీశన్ నేతృత్వంలో జరిగే దర్యాప్తుతో ఏమీ ఒరిగేది లేదు. వారు సరైన పోలీసు రక్షణ కల్పించలేదు. ఏ పార్టీ అయినా ఇన్ని షరతులు విధించిందా..? అంత కఠినత ఉందా..? విజయ్‌ని ఇబ్బంది పెట్టే వారికి ఆరు నెలల్లో శిక్ష పడుతుంది. 41 మంది మరణానికి విజయ్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని మీరు అంటున్నారు. కానీ, అతన్ని అక్కడే ఉండనివ్వకుండా పంపించేశారు. కనీసం మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర. విజయ్ గొప్ప వ్యక్తి. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. తరువాత ఏమి చేయాలో అతనికి తెలుసు' అని నటుడు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. -
కరూర్ తొక్కిసలాటలో 41కి చేరిన మరణాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుగుణ అనే మహిళ సోమవారం మృతి చెందింది. చికిత్స పొందుతున్న వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు కోలుకుంటున్నారు. బాధిత కుటుంబాలను కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సమాచార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ సోమవారం పరామర్శించారు. ఘటనపై విచారణ అధికారిగా ఉన్న డీఎస్పీ సెల్వరాజ్‌ను తప్పించి ఆయన స్థానంలో ఏడీఎస్పీ ప్రేమానంద్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. సోమవారం ఎఫ్ఐఆర్లో విజయ్ ఆలస్యంగా రావడం, పోలీసులు విధించిన నిబంధనల్ని తుంగలో తొక్కడం, సభకు వచి్చన జనం నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల నీరసించిపోతున్నారని, రద్దీ మరింత పెరిగితే ఊపిరి ఆడకపోవచ్చని తాము పదేపదే హెచ్చరించినా నిర్వాహకులు ఖాతరు చేయకపోవడంతోనే ఇంత పెద్ద ఘోరం జరిగినట్టు పేర్కొనడం గమనార్హం. ఇదిలావుండగా.. కరూర్ ఘటన గురించి సీఎం స్టాలిన్ వీడియో విడుదల చేస్తూ, జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా రాజకీయ పార్టీలు, సంస్థలు, సంఘాల సమావేశాలకు కొత్త మార్గదర్శకాలను రూపకల్పన చేసి ప్రజల ప్రాణ రక్షణ దిశగా నిబంధనలు కఠినం చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు. హైకోర్టును ఆశ్రయించిన నటుడు విజయ్ తొక్కిసలాట ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని సోమవారం ఆశ్రయించారు. ఆయన తరపున టీవీకే ఉప ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున తరపున న్యాయవాదులు సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేశారని, రాళ్లు రువ్వారని, పోలీసులు లాఠీచార్జి చేశారని పేర్కొంటూ స్థానిక డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీపై సైతం అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు అంశాలను పిటిషన్లో ప్రస్తావించారు. కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని కోరారు. బాధితులను పరా>మర్శించడానికి విజయ్‌కు అనుమతి ఇవ్వాలని, గట్టి భద్రతకు ఆదేశించాలని కోరారు. అత్యవసరంగా విచారించాలని కోరినా.. అక్టోబరు 3వ తేదీన విచారించేందుకు ధర్మాసనం నిర్ణయించింది. తాజా ఘటన నేపథ్యంలో విజయ్ పార్టీ గుర్తింపు రద్దుకు ఆదేశించాలని కోరుతూ మధురైకు చెందిన న్యాయవాది సెల్వకుమార్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలావుండగా.. చెన్నై శివారులోని పనయూరు నివాసంలో ఉండే విజయ్ సోమవారం హఠాత్తుగా నగరం నడ్డిబొడ్డున ఉన్న పట్టినంబాక్కం నివాసానికి మకాం మార్చారు. కరూర్ ఘటనపై విజయ్‌తో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఫోన్లో మాట్లాడారు. కాగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గురుమూర్తిని టీవీకే సంయుక్త కార్యదర్శి నిర్మల్‌కుమార్ నేతృత్వంలోని బృందం చెన్నైలో కలిసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీ హేమమాలిని నేతృత్వంలో కరూర్ ఘటనపై విచారణకు బీజేపీ అధిష్టానం కమిటీని నియమించినట్టు తెలిసింది. ఉరేసుకున్న టీవీకే పార్టీ నేత కరూర్‌లో తమ పార్టీ నేత ప్రచారం సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురైన విల్లుపురం జిల్లా వీరపట్టుకు చెందిన టీవీకే పార్టీ నాయకుడు అయ్యప్ప (26) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు రాసిపెట్టిన లేఖ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
కన్నీటి మడుగైన కరూర్
ఇరుకిరుకు రోడ్లు... లక్షలాదిమంది యువత ఆరాధించే తెరవేల్పు ఆగమనం... అంచనాలకు మించి వేలాదిగా తరలివచ్చిన జనం–ఒక హృదయవిదారక ఘటన చోటు చేసు కోవటానికి ఇంతకన్నా ఏం కావాలి? చరిత్ర ప్రసిద్ధిచెందిన నగరం మాత్రమే కాదు... వర్తమానంలో వేలాది కుటుంబాలకు జీవికనిస్తున్న పరిశ్రమలకు నిలయంగా కూడా ఉన్న తమిళనాడులోని కరూర్ నగరం శనివారం జరిగిన తొక్కిసలాట ఉదంతం తర్వాత పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది. ఇంతవరకూ 41 మంది చనిపోగా, దాదాపు 80 మంది వరకూ గాయాలపాలయ్యారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. తల్లులు, బిడ్డలు, త్వరలో వివాహం కావలసిన రెండు జంటలు కూడా ఈ మృతుల్లో ఉండటం కలచివేసే విషయం. కొత్తగా ఏర్పాటైన తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పదివేలమంది వస్తారంటే అనుమతినిచ్చామని, కానీ అది మూడురెట్లకు పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. జనాకర్షణ గల విజయ్ వంటి నటుడి ర్యాలీకి వచ్చే జనంపై తగిన అంచనాలు లేకపోవటం సరికాదు. మతపరమైన ఉత్సవాలు, క్రీడా సంరంభాలు, రాజకీయ పక్షాల ర్యాలీలు వగైరాల్లో అసంఖ్యాకంగా జనం పాల్గొనటం ఇటీవలికాలంలో తరచు కనబడుతోంది. ఈ ఏడాదిలో ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో మొదలై దేశవ్యాప్తంగా ఇంతవరకూ కనీసం అయిదారు విషాద ఉదంతాలు చోటు చేసు కున్నాయి. కానీ నిర్వాహకులు, ప్రభుత్వాలు, పోలీసులు వీటి నుంచి గుణపాఠం తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఉత్పాదక నగరమైన కరూర్‌లో ప్రతి శనివారం వందల సంఖ్యలో వచ్చే ట్రక్కుల ద్వారా దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు సరుకు బట్వాడా అవుతుంటుంది. ఇవన్నీ ఆ ఇరుకు సందుల్లో ఆగకతప్పదు. వారాంతం గనుక కార్మికులకు వేతనాలిచ్చే రోజు కూడా అదే. అందుకోసం చేనేత, దోమతెరల పరిశ్రమల్లో, బస్సు నిర్మాణాల సంస్థల్లో పని చేసేవారు దాదాపు 50,000 మంది వస్తారు. ఇంతకుమించి జనం ఏమాత్రం పెరిగినా ఆ నగరం కిక్కిరిసిపోతుంది. టీవీకే పార్టీ స్థానిక నేతలకు దీనిపై అవగాహన ఉండకపోదు. అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసులు సరేసరి. వారికి ఇది పూర్తిగా తెలిసి ఉండాలి. విజయ్ ప్రతి శని, ఆదివారాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు గనుక కరూర్‌కు ఆదివారం వస్తే మంచిదని సలహా ఇచ్చి ఉండాల్సింది. పైగా తమ అభిమాన నటుణ్ణి దగ్గర నుంచి చూడటం కోసం చుట్టుపక్కల నుంచి కూడా భారీయెత్తున ప్రజలు తరలి వచ్చారని చెబుతున్నారు. తొక్కిసలాటల ఉదంతాలు మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. 2022లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో హ్యాలోవీన్ ఫెస్టివల్లో జరిగిన తొక్కిసలాటలో 159 మంది కన్నుమూశారు. జర్మనీలోని డోజ్బర్గ్లో 2010నాటి లవ్ పెరేడ్ ఉత్సవంలో తొక్కిసలాట కారణంగా 21మంది చనిపోయారు. అయితే ఆ ఉదంతాలను లోతుగా అధ్యయనం చేసి, ఏ లోటుపాట్ల వల్ల ఆ ఘటనలు జరిగాయో నిర్ధారించుకుని వాటిని నివారించే, నియంత్రించే వ్యవస్థల్ని రూపొందించుకుంటారు. అందువల్లే అవి పునరావృతం అయ్యే అవకాశాలు తగ్గుతాయి. కానీ మన దేశంలో ఇందుకు విరుద్ధం. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట ఉదంతాలు ఎందుకు చోటుచేసుకుంటాయన్న అంశంపై జర్మనీకి చెందిన విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అనా సీబెన్ చేసిన పరిశోధన అనేక ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఒక స్థాయి వరకూ గుంపులోని వారు వ్యక్తులుగాసంభాషణల అవసరం లేకుండానే ఇతరుల్ని అనుసరిస్తూ పోతారు. జనసమ్మర్దం పెరి గితే, అనుకోని ఘటన సంభవించేసరికల్లా భావోద్వేగాలపాలు అధికమై విచక్షణాజ్ఞానం నశిస్తుందని, తొక్కి సలాటల్లో జరిగేది ఇదేనని ప్రొఫెసర్ అనా సీబెన్ అంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నటుడు విజయ్ కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఆప్తుల్ని కోల్పోయి విషాదంలో మునిగిన కుటుంబాలను ఇవేవీ ఊరడించలేకపోవచ్చు. ప్రభుత్వం పూనుకొని మృతుల కుటుంబాల్లో ఇంటికొకరికైనా శాశ్వత ఉపాధి కల్పించాలి. చిన్న చిన్న ముందస్తు జాగ్రత్తలతో ఈ మాదిరి విషాద ఘటనలను నివారించవచ్చు. ప్రభుత్వాలు ఆలోచించాలి. -
కరూర్ ఘటనపై 'ఛీ' అంటూ సత్యరాజ్ విమర్శలు
తమిళనాడు కరూర్‌లో సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 40 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురించి నటులు రజనీకాంత్, కమల్‌హాసన్ వంటి స్టార్స్ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా నటుడు సత్యరాజ్ రియాక్ట్ అయ్యారు. విజయ్‌పై ఆయన విమర్శలు చేశారు.కరూర్ ఘటన గురించి సత్యరాజ్ ఇలా అన్నారు.. " ఒక్కోసారి తప్పులు అనేవి మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. కానీ, తెలిసి ఎవరైనా తప్పు చేస్తే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. అది చిన్న తప్పు అయితే, దాన్ని సరిచేసుకోవాలి. ఒకవేళ అది అనుకోకుండా పెద్దదైతే మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఛీ!" అంటూ సత్యరాజ్ పోస్ట్ చేశారు.విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన సభల్లో 8మంది మరణించారు. తను ప్రయాణించే వాహనం కింద బైకర్స్ పడిపోయి కొందరు తీవ్రంగానే గాయపడ్డారు. ఇలా తరుచుగా విజయ సభల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతను కట్టడి చేయడం తమిళనాడు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఇదే విషయం కోర్టుకు కూడా తెలిపారు. ఇప్పుడు సినీ నటుడు సత్యరాజ్ కూడా దానిని పరోక్షంగా చెప్పారు. తను పాల్గొంటున్న ర్యాలీలో ప్రమాదాలు జరుగుతున్నాయనే విషయం విజయ్‌కు తెలుసు. అయినప్పటికీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని సత్యరాజ్ పరోక్షంగా చెప్పారు. -
టీవీకే విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు.. తమిళనాడులో కలకలం
చెన్నై: తమిళనాడులో(tamil Nadu) కరూర్(karur Incident) ఘటన తీవ్ర విషాదం నింపింది. అయితే, ఈ ఘటన అనంతరం.. టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కి(Vijay) బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. అర్ధరాత్రి హుటాహుటినా విజయ్ ఇంటి వద్ద తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. తమిళగ వెట్రి కజగం (టీవీకే)Tamilaga Vettri Kazhagam (TVK) చీఫ్, నటుడు విజయ్ నివాసం నీలంకరైలోని ఈసీఆర్ వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు సోమవారం తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విజయ్ నివాసం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇళ్లంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం, బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ ఇంటి వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.Tamil Nadu | Chennai police received a phone call earlier today claiming that a bomb had been planted at the ECR, Neelankarai residence of Tamilaga Vettri Kazhagam (TVK) Chief and actor Vijay. Following the alert, police personnel rushed to the actor’s residence, and a bomb… pic.twitter.com/Fs7xceZWlI— ANI (@ANI) September 28, 2025ఇదిలా ఉండగా.. కరూర్ ఘటన నేపథ్యంలో విజయ్ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్ నివాసం వద్ద కేంద్ర సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి.ఇక, కరూర్ ఘటనతో తీవ్ర మనోవేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రతీ ఒక్కరికీ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటి వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు. -
ప్రమాదమా.. కుట్రా?
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రికళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ ప్రచార కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ప్రమాదమా.. లేక ఏదైనా కుట్ర జరిగిందా? అనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్ విచారణ కోరుతూ ఆ పార్టీ న్యాయవాద విభాగం మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైంది. తొక్కిసలాట ఘటనతో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు మంత్రులు రాత్రికి రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏడీజీపీ డేవిడ్సన్ దేవాశీర్వాదంతో పాటు ఐదుగురు ఐజీలు, డీజీఐలు ఘటనా స్థలంలో విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనలో మొత్తం 40 మంది మరణించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 14 మంది పురుషులు, 17 మంది మహిళలు, 9 మంది చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మరో వంద మందికి పైగా చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రతిపక్ష నేత పళణిస్వామితో పాటు డీఎండీకే, బీజేపీ, తదితర పార్టీ ల నేతలంతా కరూర్‌కు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఈ ఘటన ప్రభుత్వ భద్రతా వైఫ్యలమే కారణమని పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం పెద్దఎత్తున తరలి వస్తున్నారన్న విషయాన్ని గ్రహించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విజయ్ సైతం ముందస్తు ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేసుకుని ఉండాల్సిందని హితవు పలికారు. కాగా.. ఈ ఘటనపై 24 గంటల్లో నివేదిక సమర్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి డీఎంకే ప్రభుత్వాన్ని ఆదేశించారు. సీబీఐ దర్యాప్తునకు టీవీకే డిమాండ్ కరూర్‌లో బాధితుల సమాచారం, మరికొందరు వైరల్ చేస్తున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన ప్రమాదమా? లేక కుట్ర జరిగిందా..? అన్న అనుమానాలకు దారితీసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టీవీకే న్యాయవాది విభాగం బృందం చెన్నైలో న్యాయమూర్తి దండపాణిని కలిసి సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ప్రచారంలో రాళ్లు విసిరినట్టు, లాఠీచార్జ్ జరిగినట్టు వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఈ ఘటన పథకం ప్రకారం జరిగిన కుట్రగా న్యాయమూర్తికి వివరించారు. కేసును సీబీఐ లేదా సిట్ ద్వారా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిషన్ దాఖలు చేస్తే సోమవారం మధ్యాహ్నం విచారణకు స్వీకరిస్తామని న్యాయమూర్తి సూచించగా.. ఆ దిశగా మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలుకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాల వారికి రూ.20 లక్షల చొప్పున విజయ్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తాను సైతం కరూర్ వెళ్లేందుకు సిద్ధమైనా, పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కాగా.. విజయ్ ఇంటివైపు కొన్ని విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఆ పరిసరాలన్నీ సీఆర్పీఎఫ్ భద్రతా వలయంలోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయ్ ప్రచారాలపై నిషేధం విధించాలని కోరుతూ సెంథిల్ కన్నన్ అనే బాధితుడు హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇదిలావుండగా కరూర్ ఘటనకు బాధ్యులుగా టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మది అళగన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్, సీనియర్ నేత నిర్మల్‌కుమార్‌తో పాటు ఇతరులు అని పేర్కొంటూ మొత్తం నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనపై జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. వేలుస్వామిపురంలో పరిశీలన, విచారణ జరిగింది. ఘటన సమయంలో విద్యుత్ సరఫరా ఆపేశారంటూ కొందరు, ఒక్కసారిగా జనం తోసుకొచ్చారంటూ మరికొందరు, అంబులెన్స్‌లు వరుసగా రావడంతో వాటికి దారి ఇచ్చే సమయంలో తోపులాట జరిగిదంటూ మరికొందరు తెలిపారు. -
పేదల బతుకుల్లో విషాదం.. విజయ్ను అరెస్ట్ చేయాలి: హీరోయిన్
గుండెనిండా దాగిన అభిమానం ఆ గుండె ఆగిపోయేలా చేసింది. అభిమాన నటుడు, నేతను దగ్గరి నుంచి చూడాలని వెళ్లిన వారంతా కళ్లనిండా విజయ్ (Actor Vijay) రూపాన్ని నింపుకుని అక్కడే ఆయువు వదిలారు. కొండంత భవిష్యత్తును ఛిద్రం చేస్తూ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, హీరో విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన 'మీట్ ది పీపుల్' ప్రచారంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు.. 60 మందికి పైగా గాయపడ్డారు.విజయ్ను అరెస్ట్ చేయాలిఇంతటి విషాదానికి కారణమైన విజయ్ను అరెస్ట్ చేయాలంటూ హీరోయిన్ ఓవియా (Oviya) డిమాండ్ చేసింది. ఈ మేరకు 'అరెస్ట్ విజయ్' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. దీనిపై విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోయిన్ను బండ బూతులు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆమె తన పోస్ట్‌ను గంటల వ్యవధిలోనే డిలీట్ చేసింది. తనను తిడుతూ పెట్టిన కామెంట్ల స్క్రీన్షాట్లను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. 'జీవితం జ్ఞానవంతులకు కలలాంటిది, మూర్ఖులకు ఆట, ధనవంతులకు కామెడీ, అదే పేదలకు మాత్రం విషాదం' అని రాసుకొచ్చింది.బిగ్‌బాస్, సినిమాకేరళ కుట్టి ఓవియా 2007లో నటిగా ఎంట్రీ ఇచ్చింది. కంగారు అనే మలయాళ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇది నా లవ్ స్టోరీ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. కాంచన 3లోనూ యాక్ట్ చేసింది. 90 ఎంఎల్ అనే వివాదాస్పద సినిమాతో సెన్సేషన్ అయింది. ఈ సినిమాలో ఓవియా మహిళలను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. తమిళ బిగ్‌బాస్ మొదటి సీజన్లో చనిపోవడానికి ప్రయత్నించడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. గతేడాది ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో లీకవగా.. చూసి ఆనందించండి అంటూ బోల్డ్‌గా రియాక్టైంది.చదవండి: నా గుండె వణికిపోయింది.. కరూర్ ఘటనపై 'కమల్, రజనీ' -
'ఆ ట్విటర్ ఖాతా అంతా ఫేక్'.. కరూర్ ఘటనపై డ్రాగన్ హీరోయిన్ క్లారిటీ
తన పేరుతో వస్తోన్న ట్విటర్ అంతా నకిలీ అని.. దయచేసి అలాంటివీ నమ్మవద్దని డ్రాగన్ హీరోయిన్ అభిమానులకు విజ్ఞప్తి చేిసంది. ఈ మేరకు ట్విటర్లో తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టిందని.. అయితే తన పేరుతో ఉన్న నకిలీ ఖాతా పోస్టులను నమ్మవద్దని హితవు పలికింది.కాయాదు తన ట్వీట్లో రాస్తూ..' నా పేరుతో పోస్ట్‌లు సర్క్యులేట్ చేస్తున్న ట్విట్టర్ ఖాతా నకిలీది. నాకు దానితో ఎటువంటి సంబంధం లేదు . ఆ అకౌంట్ నుంచి చేసిన ప్రకటనలు నావి కావు. కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే, కరూర్‌లో నాకు వ్యక్తిగత స్నేహితులు ఎవరూ లేరని.. నా పేరుతో వ్యాప్తి చెందుతున్న కథనం అబద్ధమని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు.. ప్రచారం చేయవద్దు. మరోసారి ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ పోస్ట్ చేసింది.కాగా.. తమిళనాడు జరిగిన విషాదంపై డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ పేరుతో ట్వీట్ వైరలైంది. . కాగా.. నిన్న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంపై పలువురు సినీతారలు స్పందించారు. రజీనీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. ఈ ఘటనతో తన గుండె పగిలిందని ట్వీట్ చేశారు. వారిని ఓదార్చేందుకు కూడా మాటలు రావడం లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున రూ.20 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.The Twitter account circulating posts under my name is fake. I have no connection with it, and the statements made there are not mine.I am deeply saddened by the tragic incident at the Karur rally, and my heartfelt condolences go out to the families who have lost their loved…— Kayadu Lohar (@11Lohar) September 28, 2025My deepest condolences to the families of those who lost their lives 💔 Lost one of my closest friends in the Karur rally. All for TVK’s selfish politics. Vijay, people are not props for your stardom. How many more lives for your hunger? #Karur #Stampede #TVKvijay pic.twitter.com/jW3qlxvPbO— Kayadu Lohar (@Kayadu__Lohar) September 27, 2025 -
కరూర్ మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్ధిక సాయం
-
రాళ్లు రువ్వారు.. లాఠీఛార్జి చేశారు.. అందుకే తొక్కిసలాట జరిగింది
కరూర్ ఘటనపై తమిళగ వెట్రి కగళం(TVK) సంచలన ఆరోపణలకు దిగింది. ర్యాలీపై రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీఛార్జి చేయడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుందని ఆరోపించింది. ఈ మేరకు కుట్ర కోణంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ మద్రాస్ హైకోర్టును ఆదివారం ఆశ్రయించింది. కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఉదయం తన నివాసంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న టీవీకే విజ్ఞప్తికి జస్టిస్ దండపాణి అంగీకారం తెలిపారు. కోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ.. రేపు(సోమవారం) మధురై బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం కనిపిస్తోంది.ఈ ఘటనపై ఇప్పటికే టీవీకే కేడర్‌పై(విజయ్ మినహా) కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీ వేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు కూడా. అయితే.. కుట్ర కోణం ఉందన్న నేపథ్యంలో హైకోర్టే సుమోటోగా దర్యాప్తు చేపట్టాలని, లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థచే విచారణకు ఆదేశించాలని పిటిషన్లో టీవీకే విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. కరెంట్ పోవడం, విజయ్‌పైకి గుర్తు తెలియని ఆగంతకులు చెప్పులు విసరడం, అదే సమయంలో తొక్కిసటాల జరగడం లాంటి అంశాలన్నింటినీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తమ సభలకు అనుమతుల విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ప్రస్తావించింది కూడా. అయితే.. టీవీకే ఆరోపణలను ఇప్పటికే ఆ రాష్ట్ర డీజీపీ వెంకట్రామన్ ఖండించారు. అనుమతిచ్చిన దానికంటే జనం అత్యధికంగా వచ్చారని, విజయ్ ర్యాలీకి ఆలస్యంగా వచ్చారని, ఆ సమయంలో పోలీసులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారని, ఇప్పుడేమో పోలీసులపైకి నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఇదిలా ఉంటే.. కరూర్ ర్యాలీలో విజయ్ పది రూపాయల మంత్రి అంటూ పరోక్షంగా సెంథిల్ బాలాజీని ఉద్దేశించి పాట అందుకున్నారు. ఆపై జోష్‌తో అక్కడున్నవాళ్లంతా ఆయన దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాతే పరిస్థితి ఒక్కసారిగా దిగజారిపోయింది.ఇదిలా ఉంటే.. 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలు జరుపుతున్నారు. వారాంతాల్లో కీలక నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కరూర్ జిల్లా వెలుచామైపురం వద్ద జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో మరొకరు మరణించడంతో ఆ సంఖ్య 40కి చేరింది. ర్యాలీకి చాలా ఆలస్యంగా విజయ్ రాగా.. అప్పటికే తిండి, నీరు లేక నీరసించి పోయిన జనం సొమ్మసిల్లిపోవడంతో అలజడి రేగింది. ఆపై ఆంబులెన్స్ వచ్చే క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు ఎంత అదుపు చేసే ప్రయత్నం చేసినా.. పరిస్థితి చేజారిపోయింది. ఈ పరిణామంతో ర్యాలీ మధ్య నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు విజయ్. బాధితులను పరామర్శించుకుండా, మీడియాతో మాట్లాడకుండా విజయ్ వెళ్లిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో చెన్నైలోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు విజయ్ మద్దతుదారులు.. మరోవైపు ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నిరసనలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.వచ్చేవారం పర్యటన రద్దుతొక్కిసలాట ఘటన నేపథ్యంలో వచ్చేవారం నిర్వహించాల్సిన టీవీకే ర్యాలీని విజయ్ రద్దు చేసుకున్నారు. కరూర్ బాధితులను పరామర్శించేందుకు అనుమతించాలంటూ ఆయన పోలీసులకు లేఖ రాశారు. దీనిపై బదులు రావాల్సి ఉంది.ఇదీ చదవండి: జనాలు చస్తుంటే విజయ్ పారిపోయాడు! -
‘కరూర్ తొక్కిసలాట’ ఘటనపై స్పందించిన చిరంజీవి!
తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకోవడం చాలా విషాదకరం, ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ భరించలేని నష్టాన్ని అనుభవిస్తున్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ అని చిరంజీవి ట్వీట్ చేశాడు.కాగా,తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు హీరో విజయ్(Vijay ) నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 39 మంది మరణించారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10 మంది వరకు చిన్నపిల్లలు, 16 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.Deeply saddened by the tragic stampede at the rally in Karur, Tamil Nadu. My sincere condolences to the families who are living through this unbearable loss. I wish them strength in this difficult time and pray for the speedy recovery of those injured.Om Shanti 🙏— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025 -
కోర్టు మొట్టికాయలేసినా.. కరూర్ విషాదం!
కరూర్ వెలుచామైపురం తొక్కిసలాట ఘటన ఇప్పటికే 39 మంది మరణించగా.. 95 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. అయితే 51 మంది ఐసీయూలో చికిత్స పొందుతుండగా.. అందులో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. ఈ ఘటనకు బాధ్యుడైన టీవీకే అధినేత విజయ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ అన్ని పార్టీల వైపు నుంచి బలంగా వినిపిస్తోంది. ఈ దరిమిలా.. రాజకీయ పార్టీల బహిరంగ సభలపై ఈ మధ్యే తమిళనాడు ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి.2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకే లక్ష్యంగా.. తమిళగ వెట్రి కగళం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన ప్రచార సభలను సెప్టెంబర్ 13, 2025న తిరుచ్చిలో ప్రారంభించారు. అయితే తమ సభలకు, ర్యాలీలకు డీఎంకే ప్రభుత్వం అడ్డం పడుతోందని ఆరోపిస్తూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ పిటిషన్‌పై సెప్టెంబర్ 18వ తేదీన మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి.‘‘తిరుచ్చిలో మా పార్టీ ప్రచార సభ అనుమతి కోరుతూ సీపీ ఆనంద్‌కు మా పార్టీ జనరల్ సెక్రటరీ బస్సీ ఆనంద్ రిక్వెస్ట్ చేశారు. అయితే అనుమతులు ఇచ్చినప్పటికీ.. 23 కఠిన నిబంధనలు విధించారు. గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు సభకు రాకూడదని చెబుతూ అందులో పేర్కొన్నారు. దీనిని అమలు చేయడం కష్టం. ఇది అన్యాయం. ఇతర పార్టీలకు సులభంగా ఇస్తున్న పోలీసులు.. టీవీకే విషయంలోనే పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారు’’ అని టీవీకే వాదించింది. దీంతో కోర్టు చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర హోం కార్యదర్శిని విచారణలో భాగంగా పిలిపించుకుంది. అయితే.. టీవీకే సభలకు అనుమతికి మించి జనాలు వస్తున్నారని, తిరుచ్చి ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆస్తికి నష్టం కలిగించారంటూ పోలీసులు ఫొటో ఆధారాలను సమర్పించారు. దీంతో జస్టిస్ సతీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల భద్రతకు, ప్రజా ఆస్తులకు పార్టీలే బాధ్యత వహించాలి, గర్భిణులు, వికలాంగులు, వృద్ధులు సభలకు రాకుండా నేతలే సూచించాలి. ఇక నుంచి తమిళనాడులో ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు నిర్వహించాలంటే ఒక నిర్దిష్ట మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. సభల సమయంలో ప్రజా/ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగితే, ఆ డిపాజిట్‌ను పరిహారంగా ఉపయోగించాలి. అలాగే.. పోలీసు యంత్రాగం కూడా అన్ని రాజకీయ పార్టీలకు ఒకే విధమైన, చట్టబద్ధమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలి. సభలకు అనుమతులు ఇవ్వడంలో వివక్ష ఉండకూడదు’’ అని ఇటు ప్రభుత్వానికి, అటు టీవీకేకు మొట్టికాయలు మద్రాస్ హైకోర్టు వేసింది. ఈ క్రమంలో టీవీకేకు స్వల్ప ఊరట ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కోర్టు సూచన మేరకు సెప్టెంబర్ 24వ తేదీనే తమిళనాడు ప్రభుత్వం పొలిటికల్ ర్యాలీల మార్గదర్శకాలను సమర్పించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ గడువు కోరడంతో తదుపరి విచారణ వాయిదా పడింది. మధ్రాస్ హైకోర్టు రాజకీయ పార్టీల సభలపై ఆందోళనలు వ్యక్తం చేసిన కొన్ని రోజులకే కరూర్ విషాదం చోటు చేసుకోవడం గమనార్హం.ఇదీ చదవండి: ప్రాణాలు పోతుంటే.. పారిపోయావా విజయ్? -
నా హృదయం ముక్కలైంది.. కరూర్ ఘటనపై విజయ్ పోస్ట్
-
ఎటు చూసినా రోదనలే.. ప్రాణాలు తీసిన విజయ్ సభ (చిత్రాలు)
-
కరూర్ ఘటన.. టీవీకే సంచలన ఆరోపణలు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో.. సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా ఘోర విషాద ఘటన సంభవించింది. తొక్కిసలాట కారణంగా 39 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో విషాద ఘటనపై టీవీకే స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు డీఎంకే ప్రభుత్వమే కారణమంటూ విమర్శించింది.కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే స్పందిస్తూ..‘తొక్కిసలాట ఘటనకు కారణంగా స్టాలిన్ ప్రభుత్వమే. మేము అడిగిన ప్రాంతంలో కాకుండా.. చిన్నపాటి రోడ్డులో సభకు అనుమతి ఇచ్చారు. సభ జరుగుతున్న సమయంలో అంబులెన్స్‌లు అటుగా వచ్చేలా డీఎంకే ప్లాన్ చేసింది. ఈ క్రమంలో అంబులెన్స్ కోసం దారి ఇవ్వాలని విజయ్ కోరడంతో తొక్కిసలా జరిగింది. పోలీసులతో కలిసి డీఎంకే ప్రభుత్వం విజయ్‌పై కుట్ర చేసింది అని ఆరోపించింది. మరోవైపు.. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం అంటూ టీవీకే పార్టీ నేతలు సైతం ఆరోపిస్తున్నారు.He shamelessly ignored people literally dying around him and continued with this nonsense on mic.There are times when you have to stop and think what kind of demons and narcissistic animals are made Gods by us...💔#Karur #KarurStampede pic.twitter.com/10lngolUI8— Namita Balyan (@NamitaBalyan) September 27, 2025డీజీపీ కీలక వ్యాఖ్యలు..ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై తమిళనాడు లా అండ్ ఆర్డర్ డీజీపీ వెంకట్రామన్ అర్ధరాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..‘టీవీకే పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. కరూర్‌లో జరిగినది చాలా విషాదకరమైన ఘటన. వీరిలో 13 మంది పురుషులు, 16 మంది మహిళలు, ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ డేవిడ్సన్ నాయకత్వంలో ముగ్గురు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలతో సహా 2000 మంది పోలీసులు భద్రతలో పాల్గొన్నారు.விஜயிடம் பேசிய போலீஸ் குறிப்பிட்ட நேரத்திற்கு செல்லாத விஜய்க்கு காவல்துறையினர் தொடர்புகொண்டு பேசியிருக்கின்றனர்.கூட்டம் அதிக அளவில் இருக்கிறது என்பதையும் தெரியப்படுத்தி,ஒத்துழைப்பு தருமாறு அறிவுறுத்தியுள்ளனர்.அதனால்தான் விஜய் காவல்துறைக்கு நன்றி சொல்லி பேசினார். #karur pic.twitter.com/6BbXGxc2Jp— Gokula Kannan R 👑 (@rg_kannan_dmk61) September 27, 2025తమిళనాడు టీవీకే పార్టీ గతంలో నిర్వహించిన సమావేశాలు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండటంతో, వారి అభ్యర్థన మేరకు ఇప్పుడు కరూర్‌లో పెద్ద స్థలాన్ని కేటాయించారు. రాష్ట్ర స్థాయిలో అదే స్థలంలో ఒక పెద్ద పార్టీ ప్రచారం చేసింది. పది వేల మంది వస్తారని భావించినప్పటికీ, 27 వేల మంది గుమిగూడారు. విజయ్ ప్రచారం చేసిన ప్రదేశంలో 500 మంది పోలీసు సిబ్బంది కాపలాగా ఉన్నారు. గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి కోరారు. కానీ, ఉదయం 11 గంటల నుండి గుమిగూడిన జనసమూహం రాత్రి 7:40 గంటలకు వస్తూనే ఉన్నారు. విజయ్ వస్తున్నారనే వార్తతో ఎక్కువ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 27వేల మందికిపైగా ఉన్న సమూహాన్ని పోలీసులు కంట్రోల్ చేశారు. సభ జరుగుతున్న సమయంలో పోలీసులకు విజయ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం లేదు. కానీ, దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. దీనికి సంబంధించి కారణాల కోసం ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసిన నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఏమీ మాట్లాడలేం. అయితే, ఈ ఘటనకు పోలీసులే కారణమా? అని మీడియా ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇవ్వలేదు.ఏకసభ్య కమిషన్ ఏర్పాటు.. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ స్పందించారు. కరూర్ జిల్లా కలెక్టరుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను ఆదివారం ముఖ్యమంత్రి పరామర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు, ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు సీఎం స్టాలిన్ ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. -
TVK Vijay: మొన్న మధురై.. నిన్న కరూర్
తమిళనాడు కరూర్ తొక్కిసలాట(Karur Stampede) ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభకు హాజరై.. 39 మంది మృతి చెందడం, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడడం.. ఇటు రాజకీయంగానూ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీనికి తోడు తొక్కిసలాట జరిగిన తర్వాత వెంటనే విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోవడం మరింత ఆగ్రహావేశాలకు కారణమౌతోంది.. కరూర్‌లో విజయ్ బహిరంగ సభకు(Vijay Meeting) కేవలం 10 వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతించారు. అయితే.. అంతకు రెండు రెట్లు పైనే జనాలు వచ్చారు. దీనికి తోడు అనుకున్న సమయం కంటే ఆరు గంటలు ఆలస్యంగా విజయ్ సభకు వచ్చారు. దీంతో ఆ రద్దీ మరింత ఎక్కువైంది. అప్పటికే అక్కడ గుమిగూడిన జనాల్లో చాలామంది నీరు, తిండి లేకపోవడంతో నీరసంగానే ఎదురు చూస్తూ ఉండసాగారు. ఈలోపు సాయంత్రం 7.30-7.45 సమయంలో విజయ్ ప్రచార రథం రావడం.. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడంతో.. ఆ వాహనానికి దారి ఇచ్చే క్రమంలో జనాలు వెనక్కి పోవడం, జనాల్లో కొందరు ఆయన్ని దగ్గరి నుంచి చూడాలనే కుతూహలంతో తోసుకున్నారు. ఈ తోపులాటలో బారికేడ్లు విరిగిపోయి తొక్కిసలాటకు దారి తీసింది. ఆ అలజడిని గమనించిన విజయ్.. ‘‘పోలీస్.. ప్లీజ్ హెల్ప్, ఆంబులెన్స్’’ అంటూనే వాహనంపై ఉన్న వాటర్ బాటిళ్లను జనాల్లోకి విసిరారు. అయితే తొక్కిసలాట జరుగుతున్న గందరగోళ పరిస్థితుల నడుమే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అక్కడ టీవీకే వలంటీర్లు తక్కువగా ఉండడం, ఆంబులెన్స్‌లకు దారి లేకపోవడంతో సకాలంలో ప్రాణాలు కాపాడలేకపోయారని తెలుస్తోంది. த. வெ. க கூட்டத்தில் போலீசார் தடியடி.. இது தான் கூட்ட நெரிசல் ஏற்பட காரணம்? #KarurStampede #Karur pic.twitter.com/2LSYLaVqdu— Karthik M (@karthikwtp) September 27, 2025కరూర్ తొక్కిసలాట ఘటనను.. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనగా అభివర్ణిస్తున్నారు. 39 మంది మృతుల్లో.. పది మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం గమనార్హం. 95 మందిని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవాళ్లలో 58 మంది ఇంకా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై రాష్ట్రపతి, దేశ ప్రధాని.. ఇతర రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మీడియాకు నో అనుమతిఇదిలా ఉంటే.. విజయ్ ఆలస్యంగా రావడమే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఘటన తర్వాత సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలోనే విజయ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. త్రిచీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి, అక్కడి నుంచి చెన్నైకి బయలుదేరారు. దీంతో బాధితులను పరామర్శించకుండా, మీడియాను ఎదుర్కొనకుండా.. బాధ్యతల నుంచి విజయ్ తప్పించుకున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు. திடீரென மயங்கிய தொண்டர்”என்ன ஆச்சு..என்ன ஆச்சு” பதறி BOTTLE-ஐ எறிந்த விஜய் #vijayspeech #tvk #vijay #karur #mkstalin #abpnadu pic.twitter.com/0BRXYch0LM— ABP Nadu (@abpnadu) September 27, 2025#WATCH | Karur, Tamil Nadu | Visuals from the spot where a stampede occurred yesterday, during a public event of TVK (Tamilaga Vettri Kazhagam) chief and actor Vijay. As per CM MK Stalin, so far, 39 people have lost their lives in the incident. pic.twitter.com/hswWaa9ljq— TIMES NOW (@TimesNow) September 28, 2025మరోవైపు చెన్నైలోని విజయ్ ఇంటి వద్ద కూడా మీడియాను అనుమతించడం లేదు. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దళపతి మద్దతుదారులు అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హల్ చల్ చేస్తున్నారు. ఇటు గుండె బద్దలైందంటూ.. క్షతగాత్రులు కోవాలంటూ కేవలం ట్వీట్‌తో విజయ్ సరిపెట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. టీవీకే పార్టీ ప్రతినిధి రంజనా నాచియార్ మాట్లాడుతూ.. విజయ్ ఆస్పత్రికి వెళ్లి ఉంటే అక్కడా పరిస్థితి మరింత గందరగోళంగా తయారయ్యేదని, అందుకే వెళ్లలేకపోయారని అన్నారు. తప్పంతా తమిళనాడు ప్రభుత్వం, పోలీసులదేనని ఆ పార్టీ అంటోంది.మధురై మానాడులోనూ..విజయ్ మొన్నీమధ్యే మధురైలో నిర్వహించిన టీవీకే రెండో మానాడులోనూ దాదాపు తొక్కిసలాట జరిగినంత పనైంది. ఆగస్టు 21న మధురై-తూత్తుకుడి హైవే వద్ద జరిగిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండవ రాష్ట్ర బహిరంగ సభ జరగ్గా.. సుమారు 4,00,000 పైగా జనం హాజరయ్యారు. సభకు భారీగా జనాలు రావడం, మంచి నీళ్లు లేక అవస్థలు పడడం, ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుని కింద పడిపోయారు. ఈ ఘటనలో సుమారు 400 మంది ఊపిరాడక అస్వస్థతకు గురైనట్లు ఆ సమయంలో పోలీసులు వెల్లడించారు. అంతకు ముందు ఈ మానాడు ఏర్పాట్ల సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు కూడా. అయితే ఈ అనుభవాల నుంచి కూడా టీవీకే కరూర్‌లో క్రౌడ్మేనేజ్మెంట్ను సరిగ్గా చేసుకోలేకపోయిందన్న విమర్శ వినిపిస్తోంది. VIDEO | Karur: Tamil Nadu CM M K Stalin paid tributes to the victims of the Karur stampede and visited the hospital to meet those injured.Thirty-nine people, including eight children, lost their lives in the incident.#Karur #TamilNadu #MKStalin(Full video available on PTI… pic.twitter.com/Z0jdrliuTz— Press Trust of India (@PTI_News) September 28, 2025విజయ్ను అరెస్ట్ చేయాల్సిందే!క్షతగాత్రుల్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎక్స్‌లోనూ ఈ విషయాన్ని ట్వీట్ చేశారాయన. మరోవైపు.. ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఘటనపై నివేదిక ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని హోం మంత్రి అమిత్ షా కోరారు. కరూర్ టీవీకే కార్యదర్శిపై ఇప్పటికే కేసు నమోదు అయ్యింది. రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యూడీషియల్ కమిటీ వేశామని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని సీఎం స్టాలిన్ తెలిపారు. విజయ్ను అరెస్ట్ చేయాలంటూ డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే టీవీకే మాత్రం ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అంటోంది. -
తమిళనాడులో ఘోరం, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ప్రచారంలో తొక్కిసలాట... 36 మంది మృతి, 25 మంది పరిస్థితి విషమం
-
తమిళనాడులో ఘోరం.. 38మంది మృతి
సాక్షి, చెన్నై: తమిళనాడులో కనీవిని ఎరుగని ఘోరం చేటు చేసుకుంది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ శనివారం రాత్రి తమిళనాడులోని కరూర్‌లో నిర్వ హించిన ‘మీట్ ది పీపుల్’ ప్రచారంలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పో యారు. 25 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మహిళలు ఉన్నారు. వీరు కాకుండా 45 మందికి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పోలీసుల భద్ర తా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్ష త గాత్రులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో వైద్య బృందాలను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రుల కు లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఘటనపై విచార ణకు రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ ఏకసభ్య కమిషన్ ఏర్పా టు చేస్తూ స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సచివాల యంలో సమీక్ష అనంతరం పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించడానికి అర్ధరాత్రి ఘటనా స్థలికి సీఎం స్టాలిన్ బయలుదేరా రు. ఈ దుర్ఘటనపై 24 గంటల్లో నివేదికను సమ ర్పించాలని రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. సభాస్థలికి ఏడు గంటల ఆలస్యంగా..సినీ నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పేరిట గత ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా ప్రజలలోకి చొచ్చుకు వెళ్లేందుకు ఈ నెల 13వ తేదీ నుంచి మీట్ ది పీపుల్ పేరుతో ప్రచార సభ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతి శనివారం రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని ఆయన పర్యటన చేస్తున్నారు. ఇందులో అధికార డీఎంకేను తీవ్రంగా విజయ్ టార్గెట్ చేస్తున్నా రు. అలాగే బీజేపీని ఫాసిస్టులు అంటూ తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా శనివారం ఉదయం నామక్కల్‌లో ఆయన పర్యటించారు. ఇక్కడి కేఎస్ థియేటర్ వద్ద ఉదయం తొమ్మిది గంటలకు జరగాల్సిన ప్రచార సభ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగింది. నామక్కల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, జనసమూహం నడుమ రాత్రి ఏడుగంటలకు కరూర్ నగరంలోని వేలు స్వా మి పురం సభాస్థలికి చేరుకున్నారు. దాదాపు ఏడు గంటల పాటు వేచివున్న వేలాది మంది జనం... విజయ్ను చూడాలని ఒక్కసారిగా ఎగబడడంతో తొలుత చిన్న స్థాయి తోపులాట చోటు చేసుకుంది. పలువురు అస్వస్థతకు గురయ్యే పరిస్థితి నెలకొనడంతో తన వాహనం నుంచి పదుల సంఖ్యలో వాటర్ బాటిళ్లను విజయ్ వారికి అందజేశారు. త్వరితగతిన ప్రచారం ముగించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. విజయ్ వెళ్లిన కొదిసేపటికే...విజయ్ వెళ్లిన కాసేపట్లోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇరుకైన రోడ్లతో కూడిన ప్రాంతం, పరిసరాలు కావడంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో జనం తల్లడిల్లారు. జనం రద్దీ ఒక్క సారిగా పెరగడంతో తోపులాట, తొక్కిస లాటతో అక్కడి వాతావరణం తీవ్ర ఉత్కంఠ భరితంగా మారింది. ఊపిరి ఆడక పోవడంతో సొమ్మ సిల్లే వారి సంఖ్య పెరిగింది. క్షణాలలో పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు అక్క డికి చేరుకున్నాయి. అస్వస్థతకు గురైన వారందర్నీ ఆస్ప త్రులకు తరలించారు. పదుల సంఖ్యలో అంబులెన్స్‌లు నిమి షాల వ్యవధిలో బాధితులతో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకు న్నాయి. ఒక్కో అంబులెన్స్‌లో ఇద్దరు, ముగ్గుర్ని తీసు కొచ్చారు. ఒకే స్ట్రక్చర్‌లో ఇద్దరి లోనికి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి కొందరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మాత్రం 45 మంది చికిత్సలో ఉండగా, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలో ఉన్న వారి వివరాలను సేకరిస్తున్నారు. మిన్నంటిన రోదనలుప్రచార సభకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకీ తెలియకపోవడంతో పలు కుటుంబాలు తీవ్రంగా రోదిస్తూ ఆస్పత్రులకు పరుగులు తీశాయి. ఆస్పత్రి మార్చురీ పరిసరాలు ఆప్తులను కోల్పోయిన వారి రోదనలు మిన్నంటాయి. పరిస్థితి దారుణంగా మారడంతో నామక్కల్, తిరుచ్చి జిల్లాల నుంచి వైద్య బృందాలు హుటా హుటిన కరూర్‌కు చేరుకున్నాయి. కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్, ఎమ్మెల్యే , మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని బాధితులను తక్షణ చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ పరిస్థితి తక్షణ సమీక్షకు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్, ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్‌ను కరూర్‌కు పంపించారు. ప్రైవేటు ఆసుపత్రులలో ఉన్న వారందరికీ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ప్రకటించారు. ఇక, సీఎం స్టాలిన్ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సచివాలయానికి చేరుకుని కరూర్ పరిస్థితిపై సమీక్షించారు. అటు తర్వాత అర్ధరాత్రి ఘటనా స్థలికి బయలుదేరారు. అంబులెన్స్‌తో గందరగోళం..కాగా సభా సమయంలో విజయ్ పార్టీ వర్గాలు అటుగా వచ్చిన ఒక అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా, డ్రైవర్ పైదాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో పోలీసులు లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి చేజారినట్లు సమాచారం. పోలీసుల ముందస్తు భద్రతా చర్యలలో వైపల్యాలపై విమర్శలు నెలకొన్నాయి. కాగా, ఈ ప్రమాద ఘటనపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషణ్ణ వదనంతో వెళ్లిపోయిన విజయ్..కాగా, ఈ ప్రమాద ఘటనపై తిరుచ్చి విమానాశ్రయంలో విజయ్ను మీడియా ప్రశ్నించడంతో, ఆయన మౌనంగా విషణ్ణ వదనంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. పోలీసులు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే.. తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సభలకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. పోలీసులు వీటికి తగినంత భద్రత కల్పించాల్సి ఉంది. అప్పుడే తొక్కిసలాటలను నివారించొచ్చు. కానీ పోలీసులు విజయ్ సభకు తగినంత భద్రత కల్పించకపోవడం వల్లే తాజా దుర్ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. విజయ్ అభిమానులు సైతం ఈ విషయంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని, పోలీసులను తప్పుపడుతున్నారు. తగినంత మంది పోలీసులను కేటాయించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదని అంటున్నారు. విజయ్ ప్రచార సభ కోసం కరూర్‌లో సభాస్థలిని పోలీసులే ఎంపిక చేసినట్లు వెలుగులోకి వచ్చింది. విజయ్‌పార్టీ వర్గాలు మరో ప్రదేశాన్ని కోరితే, చివరకు పోలీసులు ఇక్కడ అనుమతి ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. ఇరుకైన రోడ్లతో కూడిన ఈ ప్రాంతంలో వేలాది మంది చేరడమే ఘటనకు దారితీసినట్లు విమర్శలు వస్తున్నాయి. -
తొక్కిసలాట ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించిన విజయ్
తమిళనాడు: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు.నా హృదయం ముక్కలైంది; చెప్పలేని భరించలేని, వర్ణించలేని బాధ, దుఃఖంలో నేను విలవిలలాడుతున్నాను. కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను అంటూ విజయ్ తన ట్వీట్‌ను ముగించారు. -
విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
విజయ్ సభలో తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్న మోదీ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. The unfortunate incident during a political rally in Karur, Tamil Nadu, is deeply saddening. My thoughts are with the families who have lost their loved ones. Wishing strength to them in this difficult time. Praying for a swift recovery to all those injured.— Narendra Modi (@narendramodi) September 27, 2025 తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్‌తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారు. కాగా, విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్న విజయ్ సభకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. -
టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. 38 మంది మృతి
కరూర్(తమిళనాడు): కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాట ఘటనతో విజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.విజయ్ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో నిర్వహించిన విజయ్ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. 10 వేల మందితో ర్యాలీకి విజయ్ అనుమతి తీసుకున్నారు. ర్యాలీకి ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. ఒక్కసారిగా జనం ఎగబడటంతో తోపులాట జరిగింది. పరిమితికి మించి జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. గతంలో మధురై తొలి సభలోనూ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్ ఆదేశించారు. ఘటనపై కరూర్ కలెక్టర్‌తో సీఎం స్టాలిన్ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్ పరామర్శించనున్నారుకాగా, మీట్ ది పీపుల్ నినాదంతో విజయ్ చేపట్టిన ప్రచార యాత్ర గురించి తెలిసిందే. ప్రతి శనివారం ఆయన రెండు జిల్లాలను ఎంపిక చేసుకుని పర్యటిస్తున్నారు. ఇవాళ (శనివారం, సెప్టెంబర్ 27) నామక్కల్, కరూర్‌లలో పర్యటించేందుకు నిర్ణయించారు. అయితే, విజయ్ ప్రచార సభకు స్థల ఎంపిక, అనుమతి వ్యవహారం వివాదానికి దారి తీసింది. పోలీసులు సూచించిన ప్రదేశాన్ని విజయ్ వర్గీయులు, ఆయన వర్గీయులు ఎంపిక చేసిన ప్రదేశాన్ని పోలీసులు నిరాకరిస్తూ వచ్చారు. దీంతో పర్యటన సాగేనా? అన్న చర్చ జరిగింది. ఎట్టకేలకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పర్యటన ఖరారైంది. కరూర్‌లో వేలుస్వామి పురంలో ప్రచార బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.విజయ్ సభలో తొక్కిసలాటపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతితాడేపల్లి: కోలీవుడ్ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ విషాదకర సంఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఊహించలేని దుఃఖంలో మునిగిపోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు. -
పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చిన విజయ్
-
తమిళ పాలిటిక్స్.. విజయ్‌పై ఉదయనిధి సెటైర్లు
చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న నేపథ్యంలో పొలిటికల్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీవీకే అధినేత విజయ్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. విజయ్ను టార్గెట్ చేసిన ఉదయనిధి.. తాను వీకెండ్ పొలిటీషియన్ కాదంటూ ఘాటు విమర్శలు చేశారు.తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొత్తగా ఏర్పడిన కొన్ని పార్టీలకు సిద్ధాంతం ఏమిటో తెలియదు. వారికి సిద్ధాంతం గురించి అవగాహన లేదని కనిపిస్తోంది. డీఎంకే ఎన్నికల కోసం మాత్రమే పుట్టిన పార్టీ కాదు, ప్రజల హక్కుల కోసం ఏర్పడిన పార్టీ. సీఎం ఎంకే స్టాలిన్‌కు సుమారు 60 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. అనేక పోరాటాలతో ఆయన ప్రజా జీవితం నిండి ఉంది. మన సిద్ధాంతాన్ని యువతలోకి తీసుకెళ్లాలి. విద్యార్థులు, యువతతో మాట్లాడాలన్నారు.ఇదే సమయంలో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, నటుడు విజయ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి మాట్లాడుతూ.. ‘నేను వారంలో 4-5 రోజులు అధికారిక పర్యటనలతో బిజీగా ఉంటాను. ఆదివారాల్లో కూడా పర్యటిస్తాను. కేవలం ప్రతీ శనివారం మాత్రమే బయటకు రాను. రాబోయే రోజుల్లో కొన్ని ఆదివారాలను కూడా ప్రచార కార్యక్రమానికి చేర్చుకోవాలని భావిస్తున్నా. నేను వారంలో ఏ రోజు అని చూడకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తా. కార్యకర్తలు మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉండాలి' అని చెప్పుకొచ్చారు.అలాగే, ఏఐఏడీఎంకే అధినేత పళనిస్వామిని ఉద్దేశించి.. ఆయనకు ఎప్పుడు బీజేపీ నేత, హోంశాఖ మంత్రి అమిత్ షానే ముఖ్యమని అన్నారు. తన సొంత పార్టీ అధినేత ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)ను కూడా మరచిపోయారని ఎద్దేవా చేశారు. ఇక, టీవీకే విజయ్.. ప్రతి శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శనివారం రోజునే పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో స్టాలిన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. -
25 ఏళ్ల తర్వాత విజయ్, జ్యోతికల హిట్ సినిమా రీరిలీజ్
కోలీవుడ్ నటుడు విజయ్, జ్యోతిక జంటగా నటించిన చిత్రం ఖుషి. నటి శిల్పాశెట్టి, ముంతాజ్ వేరువేరుగా 2 ప్రత్యేక పాటల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మించారు. ఎస్జే. సూర్య కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఖుషీ చిత్రానికి దేవా సంగీతాన్ని, జీవా చాయాగ్రహణం అందించారు. చిన్న ఈగో ప్రధాన అంశంగా రూపొందిన ఈ యూత్‌ఫుల్ లవ్ కథా చిత్రం 2000 సంవత్సరంలో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. 25 ఏళ్ల తర్వాత ఖుషి చిత్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, డిజిటల్ ఫార్మెట్లో రూపొంది ఈనెల 25న రీ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని శక్తి ఫిలిమ్స్ అధినేత శక్తివేల్ తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. శనివారం సాయంత్రం చెన్నైలోని ప్రసాదరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ విజయ్ మాస్ హీరోగా ఎదుగుతున్న సమయంలో రూపొందించిన క్లాసికల్ ప్రేమకథా చిత్రం ఖుషి అని చెప్పారు. తాను ఇంతకు ముందు విజయ్ హీరోగా నిర్మించిన గిల్లి చిత్రం రీ రిలీజ్ అయి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందన్నారు. అదేవిధంగా ఖుషీ చిత్రం కూడా రికార్డ్ కలెక్షన్లను సాధిస్తుందనే నమ్మకం ఉందని ఏఎం రత్నం అన్నారు. అదేవిధంగా ఖుషీకి సీక్వెల్ చేయాలన్న ఆలోచన కూడా కలుగుతోందని ఆయన చెప్పారు. అయితే ఎస్జే. సూర్య మాట్లాడుతూ ఖుషీకి సీక్వెల్ అనేది కాలమే నిర్ణయిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలుగులో పవన్ రీమేక్ఖుషి సినిమా 2000 సంవత్సరంలో మొదట తమిళ్లో విడుదలైంది. అక్కడ భారీ విజయం అందుకున్న తర్వాత తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేశారు. అయితే, కథ బాగుండటంతో దర్శకుడు ఎస్. జె. సూర్య హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ వర్షన్లను ఒకేసారి ప్లాన్ చేశారని సమాచారం. అయితే, మొదట తమిళ్ వర్షన్ విడుదల అయింది. 2001లో తెలుగులో ఖుషి విడుదలైన విషయం తెలిసిందే. -
TVK: విజయ్ సంచలన వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఎల్టీటీఐ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌పై తీవ్రస్థాయిలో ప్రశంసలు గుప్పించారాయన. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యలో ప్రభాకరన్ మాస్టర్ మైండ్ అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా విజయ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో శనివారం నాగపట్టణంలో జరిగిన టీవీకే ప్రచార సభలో విజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘ఈళం తమిళులు మన సంతతి వాళ్లు. వాళ్లు శ్రీలంకలో ఉన్నా.. ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే.. తమ నాయకుడ్ని కోల్పోయిన బాధలో ఉండి ఉంటారు. ఆయన(ప్రభాకరన్‌ను ఉద్దేశించి..) వాళ్లకు తల్లి లాంటి ప్రేమను పంచారు. శ్రీలంక తమిళుల కోసం మనం గొంతెత్తడం మన బాధ్యత’’ అని ప్రసంగించారు.నాగపట్టణం శ్రీలంక సమీపంలో ఉండడం.. ఈళం తమిళుల సమస్య కారణంగా మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా ప్రభావితం కావడం వల్ల విజయ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో మత్స్యకారుల సమస్యలపైనా ఆయన మాట్లాడారు. ‘‘మేం డీఎంకేలా ప్రభుత్వంలా సుదీర్ఘమైన లేఖలు రాసి.. ఆపై మౌనంగా ఉండిపోం. మత్య్సకారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ఇది టీవీకే ప్రధాన అజెండా కూడా అని అన్నారు. మత్య్సకారుల జీవితాలు ఎంత ముఖ్యమో.. ఈలమ్ తమిళుల జీవితాలు కూడా మాకు అంతే ముఖ్యం అని అన్నారాయన. అయితే శ్రీలంక తమిళులకు విజయ్ మద్దతు ప్రకటించడం ఇదేం తొలిసారి కాదు. శ్రీలంక అంతర్యుద్ధ (2008 చివరి నుంచి 2009 మే వరకు) సమయంలో ఉత్తర శ్రీలంకలోని ముల్లివాయ్క్కాల్ ప్రాంతంలో సైన్యం చేతిలో తమిళులు ఊచకోతకు గురికావడం తీవ్ర దుమారం రేపింది. దీనికి నిరసగా చెన్నైలో జరిగిన నిరాహార దీక్ష కార్యక్రమంలో విజయ్ పాల్గొని శ్రీలంక తమిళులకు సంఘీభావం ప్రకటించారు. అయితే ఆ సమయంలో శ్రీలంక తమిళులకు మద్దతు ఇవ్వడం అంటే ఎల్టీటీఈకి మద్దతు ఇచ్చినట్లు కాదని ఆయన స్పష్టం చేశారు. కానీ.. గతంలో కరుణానిధి సహా తమిళనాడుకు చెందిన ఏ రాజకీయ నేత కూడా నేరుగా ప్రభాకరన్‌పై ఈ స్థాయిలో ప్రశంసలు గుప్పించిన దాఖలాలు లేవు. ప్రభాకరన్‌ను తాను ఉగ్రవాదిగా చూడడని.. అయితే ఈళం తమిళుల కోసం ఎల్టీటీఈ లక్ష్యాలు గొప్పవే అయినా.. ఆచరించే పద్దతులు సరికావంటూ కరుణానిధి బహిరంగంగానే చెబుతుండేవారు. అలాంటి విజయ్ ఇప్పుడు బహిరంగంగా ప్రభాకరన్‌పై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రియాక్షన్విజయ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ స్పందిస్తూ.. ప్రభాకరన్ LTTE అధినేతగా, భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి అనే విషయం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తిని పొగడటం భారత ప్రజల భావోద్వేగాలను దెబ్బతీయడమే. పైగా ఎల్టీటీఈపై భారత ప్రభుత్వ నిషేధం ఉంది. అలాంటప్పుడు ఆ గ్రూప్ అధినేతను పొగడడం చట్టపరంగా, నైతికంగా అనుచితం అని మాణికం ఠాగూర్ అన్నారు.ఎల్టీటీఈ ప్రస్థానంLTTE (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం) అనేది 1976లో స్థాపితమైన ఒక సాయుధ సంస్థ. శ్రీలంకలో స్వతంత్ర తమిళ ఈళం ప్రాంతం కోసం దశాబ్దాల పాటు పోరాటం చేసింది. ఫలితంగా ఆ సంస్థకు, సైన్యానికి మధ్య జరిగిన అంతర్యుద్ధంలో వేలాది శరణార్థులుగా భారత్‌కు వచ్చారు. అయితే.. ఆ సమయంలో భారత ప్రధానిగా ఉన్న రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (IPKF) పేరిట సైన్యాన్ని శ్రీలంకకు పంపించారు. మూడేళ్లపాటు అది ఆ సాయుధ సంస్థతో యుద్ధం చేసి 1990లో భారత్‌కు తిరిగి వచ్చేసింది. అయితే.. ఈ చర్యను ద్రోహంగా భావించిన ఎల్టీటీఐ ప్రతీకారం కోసం ఎదురు చూసింది. 1991లో శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన రాజీవ్ గాంధీ.. మానవ బాంబు జరిపిన ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఈ ఘటన తర్వాత అప్పటి భారత ప్రభుత్వం ఎల్టీటీఈని నిషేధించింది. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు LTTE అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మరియు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పొట్టు అమ్మన్ కలిసి కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. రాజీవ్ గాంధీని తామే హతమార్చినట్లు ఎల్టీటీఈ ఏనాడూ అధికారికంగా ఒప్పుకోలేదు. అలాగని ఖండించనూ లేదు. చివరకు 2009లో శ్రీలంక సైన్యం చేతిలో ఎల్టీటీఈ ఓడిపోవడమే కాకుండా.. ఆ గ్రూప్ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ హతమయ్యారు. అప్పటితో LTTE అంతరించిపోయింది. -
విజయ్ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడు
చెన్నై: కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇంట్లోకి అగంతకుడు చొరబడడం కలకలం రేపుతోంది. ఈస్ట్ కోస్ట్ రోడ్‌లోని నీలంకరైలో విజయ్ ఇంటి అగంతకుడు టెర్రస్‌పై తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది ఆయన నివాసంలో బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టింది. ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అయితే, 24 ఏళ్ల మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. ఈ ఘటనను సంబంధించి ఓ పోలీసు సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని మానసిక ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గట్టి భద్రతా ఏర్పాట్లను దాటి ఆ వ్యక్తి విజయ్ ఇంట్లోకి ఎలా ప్రవేశించగలిగాడన్న దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.విజయ్‌కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ Y-కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో ఆయనకు రక్షణ కల్పిస్తున్నారు. విజయ్.. గత శనివారం తిరుచ్చిలో రాష్ట్రవ్యాప్తంగా తన రాజకీయ పర్యటనను ప్రారంభించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడంతో ఆయన భదత్రా విషయంలో అభిమానులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. -
సరికొత్త ఆయుధంతో అరవ రాజకీయాల్లో యుద్ధం!
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. అరవ రాజకీయాలు ఇప్పటి నుంచే వేడెక్కుతున్నాయి. ద్రవిడ ఉద్యమ పితామహుడిగా పేరున్న పెరియార్ జయంతి సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఓ ఏఐ వీడియోను రిలీజ్ చేయడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఇది డీఎంకేకు ప్రచారంగానే కాకుండా.. అటు ప్రత్యర్థి విజయ్ టీవీకే పార్టీకి కౌంటర్‌గానూ ఉందన్న చర్చ నడుస్తోందక్కడ. తమిళనాడు రాజకీయాలు కొత్త పుంతలు తొక్కాయి. ట్రెండ్‌కు తగ్గట్లే రాజకీయ పార్టీలు టెక్నాలజీని పుణికిపుచ్చుకున్నాయి. పార్టీల ఐటీ విభాగాల క్రియేటివిటీతో ‘పొలిటికల్ డిజిటల్ వార్’ ఇప్పుడక్కడ హాట్ టాపిక్‌గా మారింది. మైకుల్లో మాటలు, సోషల్ మీడియాలో పోస్టులకు అదనంగా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు. పైగా ప్రత్యర్థులను నేరుగా విమర్శించాల్సిన అవసరం లేకుండానే ఆ సెల్ఫ్ ప్రమోషన్ వీడియోలు భలేగా ఉపయోగపడుతున్నాయి పార్టీలకు. తాజాగా.. విజయ్ తమిళగ వెట్రి కళగం (TVK) ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను రిలీజ్ చేసింది. 32 సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియోలో డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు తొలి ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై విజయ్‌పై ప్రశంసలు గుప్పించినట్లు ఉంది. అదే సమయంలో తన సొంత పార్టీ డీఎంకే విధానాలను విమర్శించినట్లుగా ఉంది. ఈ వీడియో తమిళనాట నిన్నంతా ట్రెండింగ్‌లో కొనసాగింది. அண்ணாவின் வழியில்... தம்பி விஜய் ஆட்சி! என்று எல்லோரும் சொல்லட்டும்."தமிழக வெற்றிக்கழகம் வெல்லட்டும்" pic.twitter.com/jyh4SoxTrz— TVK IT Wing Official (@TVKHQITWingOffl) September 15, 2025ఈ పరిణామంపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. డీప్‌ఫేక్ వీడియోలతో విజయ్ టీవీకే పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆ పార్టీ ప్రతినిధి శరవణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి కోసం ఉపయోగించాల్సిన సాంకేతికతను ఇలా.. ప్రజాస్వామ్య విలువలను దిగజారుస్తూ ఉపయోగించడం బాధాకరమని అన్నారాయన. ఈ క్రమంలో బీజేపీతో డీఎంకే రహస్య బంధంలో ఉందంటూ విజయ్ చేస్తున్న ఆరోపణలనూ శరవణన్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగానే.. విజయ్ టీవీకే పార్టీ పెరియార్ సిద్ధాంతాలను పూర్తిగా స్వీకరించలేదు. కానీ ఆయన భావజాలం నుంచి సామాజిక న్యాయం, మహిళా సాధికారత, హేతువాదం వంటి అంశాలను మాత్రం తీసుకుంటానని విజయ్ బహిరంగంగానే చెప్పాడు. ఈ క్రమంలో పెరియార్ ఫొటో దీంతో తాజా ఏఐ జనరేటెడ్ వీడియోతోతద్వారా స్టాలిన్ రాజకీయ నేరేటివ్‌ను తిరిగి తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. పోనుపోను ఈ డిజిటల్ క్యాంపెయిన్ వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకునే అవకాశం లేకపోలేదు!.தந்தை பெரியார் - இனப்பகையைச் சுட்டெரிக்கும் பெருநெருப்பு! தமிழினத்தின் எழுச்சிக்கான பகுத்தறிவுப் பேரொளி!தந்தை பெரியார் என்றும் - எங்கும் நிலைத்திருப்பார்!#PeriyarForever #Periyar #SocialJusticeDay pic.twitter.com/B4RvgXCgzH— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) September 17, 2025 -
విజయ్ ఎన్నికల బస్సుకు అదే నంబర్.. గుండెను కదిలించే స్టోరీ తెలుసా?
కోలీవుడ్ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత విజయ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. మరో 6 నెలల్లో తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తిరుచ్చి నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. అందుకు ప్రత్యేకమైన ఒక బస్సును కొనుగోలు చేశారు. ఆ వాహనానికి తీసుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ వైరల్‌గా మారింది. తన జీవితంలో ఎంతో సెంటిమెంట్‌గా మిగిలిపోయిన సంఘటన ఈ నంబర్‌ను సూచిస్తుంది.విజయ్ కొనుగోలు చేసే కారు ధర ఎంత ఉన్నా సరే నంబర్ మాత్రం మారదు.. తన వద్ద ఉన్న ప్రతి వాహనానికి 0277 అనే నంబర్ ఉంటుంది. TN 14 అనేది సాధారణం. దాని తర్వాత వచ్చే ఇంగ్లీష్ అక్షరాలు మాత్రమే మారుతుంటాయి. ప్రస్తుతం అతని ప్రచార వాహనం నంబర్ ప్లేట్ కూడా TN 14 AS 0277 ఉండటం విశేషం. అతని వాహనాలపై 14-02-77 రూపంలో ఒక తేదీని ఎల్లప్పుడూ సూచిస్తుంది.ఈ నంబర్ వెనుక విజయ్ సెంటిమెంట్ స్టోరీ ఉంది. విజయ్ చెల్లెలు విద్య అదే 14-02-1977లో జన్మించింది. అయితే, 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే ఆమె మరణించింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. విజయ్ వద్ద ఇప్పటికే TN 14 AH 0277, TN 14 AL 0277, TN 14 AM 0277, TN 14 AS 0277 నంబర్ ప్లేట్లతో వాహానాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Nithin Barath SR (@theactorvijayteamoff) -
‘‘రజినీ సర్.. ఆయన మీలా ప్యాకేజీ స్టార్ కాదు’’
తమిళనాడు రాజకీయాల్లో మామూలుగా హీటెక్కలేదు. వచ్చే ఎన్నికల్లోనూ స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఘన విజయం సాధిస్తుందంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్ చేసిన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. ఇవి మరో అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ అభిమానులకు సాధారణంగానే మంట పుట్టించాయి.స్టార్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్.. ఎంకే స్టాలిన్‌పై రజినీ కురిపించిన ప్రశంస ఇది. ‘‘స్టాలిన్ తమిళనాట మాత్రమే కాదు భారతీయ రాజకీయాల్లో ఓ ధృవతార. కేంద్రంలోని ప్రభుత్వానికి మాత్రమే కాదు.. పాత, కొత్త ప్రత్యర్థులకు ఇప్పుడు ఆయన ఓ సవాల్‌గా మారారు. నా స్నేహితుడు తన మార్క్ చిరునవ్వుతోనే రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్నారు’’ అంటూ ఓ ఈవెంట్లో రజినీకాంత్ వ్యాఖ్యానించారు. అయితే..అన్నింటికీ మించి.. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. ఎలాంటి తుఫానునైనా తట్టుకునే శక్తి ఉంది ఓ బలమైన కామెంట్ చేశారు. ఈ ఎఫెక్ట్‌తో సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు ఊగిపోతున్నారు. అందుకు కారణం.. రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఒక్కరోజు ముందు విజయ్ తన రాజకీయ పార్టీకి కీలకమైన ప్రస్థానం ప్రారంభించారు. తిరుచిరాపల్లి నుంచి ప్రజా యాత్ర (మీట్ ది పీపుల్) ప్రారంభించారు. ఆ సభలో అలవి కాని హామీలిచ్చారంటూ డీఎంకేపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తాజా రజినీకాంత్ కామెంట్లు విజయ్ను ఉద్దేశించి చేసినవేనన్న చర్చ ప్రముఖంగా నడుస్తోందక్కడ.దళపతినే అంటారా?.. రజినీ కామెంట్లతో అరవ రాజకీయంలో స్టార్ వార్ మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కామెంట్లు చేసిన టైంలో మరో సీనియర్ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ కూడా అక్కడే నవ్వుతూ కనిపించారు. కమల్ ఇప్పటికే డీఎంకే కూటమికి మద్దతు అనే సంగతి తెలిసిందే. దీంతో.. రాజకీయంగా అడుగులు వేయలేని వాళ్లు, సొంతగా పార్టీని నడిపించుకోలేని వాళ్లు.. ఒంటరిపోరుకు సిద్ధమైన విజయ్ను విమర్శించడమా? అంటూ అభిమానులు మండిపడుతున్నారు. దీనికి తోడు..మొన్నటిదాకా బీజేపీకి సపోర్ట్‌గా మాట్లాడిన రజినీకాంత్.. ఇప్పుడు అనూహ్యంగా డీఎంకేకు అనుకూలంగా మాట్లాడడం ఆయన డబుల్ స్టాండర్డ్‌కు నిదర్శనమని, రీల్లో సూపర్‌స్టార్ అయినప్పటికీ రియల్ లైఫ్‌లో రజినీకాంత్ ప్యాకేజీ స్టార్ అని, విజయ్ అలా ప్యాకేజీ స్టార్ ఏనాటికి కాబోరని తిట్టిపోస్తున్నారు.సూపర్ స్టార్ ట్యాగ్‌తో మొదలై..స్టార్డమ్ పెరిగిపోయే క్రమంలో.. రజనీకాంత్ అభిమానులతో విజయ్ అభిమానుల వైరం మొదలైంది. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో అది మరింత ముదురుతూ వస్తోంది. గతంలో సినిమా ఈవెంట్లలోనూ స్టేజ్ మీద రజినీకాంత్ ‘‘కుక్క, కాకి’’ అంటూ ఏవో పిట్టకథలతో తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఆ సమయంలో విజయ్ అభిమానులు ఆయన్ని టార్గెట్ చేసేవారు. అంతేకాదు స్వయంగా విజయ్ కూడా అంతే సెటైరిక్‌గా తన సినిమా ఈవెంట్లలో ఆ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి.ఈ క్రమంలో.. కిందటి ఏడాది విల్లుపురంలో జరిగిన టీవీకే తొలి మహానాడు తర్వాత రజినీకాంత్ విజయ్ను ప్రశంసించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే ఈలోపే.. రాజకీయాల్లో తన ప్రధాన ప్రత్యర్థిగా విజయ్ ప్రకటించిన డీఎంకే, స్టాలిన్‌ను రజినీకాంత్ పొగడ్తలతో ముంచెత్తడంతో పరిస్థితి మళ్లీ మునుపటికి వచ్చింది.రజినీ వెనకడుగులు.. 1995–1996.. రజినీకాంత్ హవా కొనసాగుతున్న రోజులు. ఆ సమయంలోనే రాజకీయాలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. అప్పటి జయలలిత ప్రభుత్వంపై అవినీతి విమర్శలు గుప్పిస్తూ.. డీఎంకేకు మద్దతు ప్రకటించారాయన. ఆ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయంలో ఆయన మద్దతూ కీలకంగా మారింది. అయితే..2000 నుంచి దశాబ్దం పాటు ఆయన రాజకీయాలపై మౌనం పాటించారు. బాబా సినిమా టైంలోనూ ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం విస్తృతంగా నడిచినప్పటికీ.. ఆయన కేవలం సామాజిక అంశాలపై మాత్రమే స్పందిస్తూ వచ్చారు. దీంతో రజినీ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. చివరకు..అయితే పాతికేళ్ల అభిమానుల నిరీక్షణకు తెర దించుతూ.. 2017 డిసెంబర్ 31వ తేదీన రజినీకాంత్ నుంచి రాజకీయ పార్టీ స్థాపన ప్రకటన వెలువడింది. దీంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. 2020 టైంలో ఆ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆ సమయంలో తమిళనాట కోలాహాలం నడిచింది. అదే సమయంలో.. ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడడం, మరోపక్క కరోనా విజృంభణతో ఆయన వెనకడుగు వేశారు. తన ఆరోగ్య కారణాల రిత్యా రాజకీయ ప్రయత్నాలు విరమించుకుంటున్నట్లు స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో ఆయన అభిమానులు చల్లబడ్డారు.అయితే.. అప్పటి నుంచి రాజకీయంగా మాత్రం ఆయన తన అభిప్రాయాలను స్వేచ్ఛగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో కొన్నాళ్ల కిందట ఓ ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.విజయ్ సూటిగా.. తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (Thalapathy Vijay).. గత దశాబ్ద కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు, స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతు వంటి చర్యల ద్వారా రాజకీయంగా చురుకుగా ఉన్నారు. అవినీతి, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా తమిళనాడుకు మౌలిక మార్పు అవసరం అని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారాయన. ఈ క్రమంలో ఆయన ఏనాడూ.. ఏ పార్టీకి మద్దతు ప్రకటించింది లేదు. అయితే.. ఆయన అభిమాన సంఘాలు(Vijay Makkal Iyakkam) మాత్రం 2011, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో.. నోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలపై ఆయన తన సినిమాల్లో సెటైర్లు ఉండేలా చూడడంతో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకమనే చర్చ నడిచింది. అయితే.. డీఎంకేను రాజకీయ విరోధిగా, బీజేపీని సైద్ధాంతిక విరోధిగా పేర్కొంటూ 2024లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళగ వెట్రి కళగం (TVK) అనే పార్టీని స్థాపించారు.తాము ఏ కూటమికి చెందిన వాళ్లం కాదని.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం సింహం సింగిల్‌గానే వస్తుందని.. అధికారం కోసం జరుగుతున్న పోరులో పొత్తు కోసం కలిసొచ్చే పార్టీలకు ఆహ్వానమంటూ బహిరంగంగా చిన్నపార్టీలను ఆహ్వానించారాయన. ఏమిటీ ప్యాకేజీ గోల?!అధికార డీఎంకే కుటుంబానికి చెందిన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గతకొన్నేళ్లుగా అక్కడి అగ్ర హీరోలతో బిగ్‌డీల్(కళ్లు చెదిరే రెమ్యునరేషన్లు, బోనస్‌గా కాస్ట్లీ గిఫ్ట్‌లు కూడా) కుదుర్చుకుని వరుస ప్రాజెక్టులు చేస్తూ వస్తోంది. ఈ లిస్ట్‌లో రజినీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ఉండడం గమనార్హం. రాజకీయంగా తమ ఎదుగుదలకు ఆటంకంగా మారకూడదనే ఉద్దేశంతో వాళ్లను ఇలా బుజ్జగిస్తోందని ముమ్మర ప్రచారం నడిచింది. తమిళనాట తమకు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బీజేపీ మధ్యే ఎన్నికలు జరగాలని డీఎంకే తొలి నుంచి భావిస్తోంది. రజినీకాంత్ కంటే విజయ్‌కు తమిళనాట ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. దీంతో సొంత పార్టీ ప్రకటన కంటే ముందే ఆయన్ను తమ వైపునకు తిప్పే ప్రయత్నమూ డీఎంకే చేసింది. కానీ రాజకీయ అడుగులు వేయాలని బలంగా ఫిక్స్ అయిన విజయ్ ఆ ప్యాకేజీకి ఒప్పుకోలేదని.. అందుకే ఇప్పుడు ఆయన టార్గెట్ అయ్యారన్నది ఆ ప్రచార సారాంశం(దీనిని విజయ్ ఫ్యాన్సే నడిపించారనే టాక్ కూడా ఉంది). ఇక.. ఏడాదిన్నర కాలంగా డీఎంకే ప్రభుత్వంపై విజయ్ తరచూ విమర్శలు గుప్పించడం.. తాజా మధురై మానాడులో అంకుల్ అని స్టాలిన్‌ను సంబోధిస్తూ విజయ్ విమర్శలు చేయడాన్ని డీఎంకే సీరియస్‌గా భావించింది. ఈ క్రమంలోనే కేసులతో ఇబ్బంది పెడుతోందన్న విమర్శ బలంగా వినిపిస్తోందక్కడ. అయితే.. ఇంత సీరియస్ ఆరోపణలపై ఇటు రాజకీయంగా గానీ, అటు సినిమాలపరంగానూ ఏ ఒక్కరూ స్పందించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్! -
డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!
విమర్శలు, వ్యంగ్యాస్త్రాలను(ట్రోల్స్+మీమ్స్) పట్టించుకోకుండా తమిళ రాజకీయాల్లో సరికొత్త సంచలనం దిశగా సినీ హీరో విజయ్ అడుగులేస్తున్నారు. మీట్ ది పీపుల్ పేరిట ఈ శనివారం నుంచి రాష్ట్ర పర్యటనలు చేపట్టనున్నారు. అయితే జనాల్లోకి వెళ్లే క్రమంలో.. తమిళనాడు డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. తన పర్యటనల రిత్యా అవసరమైన భద్రత కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకే దిగారాయన. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK)కు బలమైన పునాది వేయడం మాత్రమే కాదు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో అధికార కైవసమే లక్ష్యంగా విజయ్ అడుగులేయబోతున్నారు. సెప్టెంబర్ 13వ తేదీన తిరుచ్చి నుంచి ప్రత్యేక ప్రచార రథం బయల్దేరనుంది. అలా మొత్తం 38 జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజలతో మమేకం అయ్యేలా కార్యక్రమాలతో (సభలు, సమావేశాలు, ర్యాలీలు, ముఖాముఖి, రౌండ్ టేబుల్ మీటింగ్స్) నిర్వహిస్తుంది. డిసెంబర్ 20వ తేదీన మధురైలో సభ ద్వారా టీవీకే విజయ్ మీట్ ది పీపుల్ పర్యటన ముగియనుంది. అయితే.. టీవీకే చర్యలతో అధికార డీఎంకే నేతలకు నిద్రలేకుండా పోతోందని విజయ్ అంటున్నారు. టీవీకే కేడర్‌పై వరుసగా కేసులు పెట్టడాన్ని ఖండిస్తూ ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారాయన. ఆ పార్టీ కార్యదర్శి ఆనంద్‌తో పాటు తిరుచ్చి పార్టీ విభాగం నేతలపైనా తాజాగా కేసు నమోదు అయ్యింది. అయితే.. ఈ పరిణామంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీకేకు అధికారంలో ఉన్నపార్టీ భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. డీఎంకే ఇప్పుడు టీవీకే గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. 24 గంటలూ అదే ఆలోచనతో ఉంటోంది. ఆ పార్టీ నేతలకు నిద్ర కరువైంది. ఈ క్రమంలోనే పోలీసులపై ఒత్తిడి చేస్తూ కేసులు పెట్టిస్తోంది. కొంపదీసి.. టీవీకేకు డీఎంకే భయపడుతోందా? అని ప్రశ్నించారాయన. తమిళనాడు రాజకీయాల్లో తారలకు ప్రజలు అధికారం కట్టబెట్టడం కొత్తేం కాదు. శివాజీ గణేషన్, విజయ్‌కాంత్, శరత్‌కుమార్, కమల్‌హాసన్.. ఇలా ఎందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రజినీకాంత్ లాంటి భారీ ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉన్న తార ఆ దిశగా అడుగు వేసినట్లే వేసి.. వెనక్కి వెళ్లిపోయారు. అయితే.. ఎంజీఆర్, జయలలిత ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్లందరితో పోల్చుకుంటే.. విజయ్‌కు ఇప్పుడున్న మాస్ ఫాలోయింగ్ చాలాచాలా ఎక్కువే. ఆ అభిమానాన్నే ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని విజయ్ ఉవ్విళ్లూరుతున్నారు.తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, విజయ్ చేపట్టిన “మీట్ ది పీపుల్” పర్యటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విజయ్ గత ఏడాది రాజకీయాల్లోకి అడుగుపెట్టి, రెండు మానాడు(మహానాడు)లను విజయవంతంగా నిర్వహించారు. మదురైలో జరిగిన రెండో మహానాడులో ప్రజల మధ్యకి వస్తున్నట్టు ప్రకటించి.. రాజకీయ ప్రత్యర్థి డీఎంకే, సైద్ధాంతిక విరోధి బీజేపీ లతోనే తమ పోరాటం అని కుండబద్దలు కొట్టారు. తాను, తన టీవీకే ఏ కూటమిలో భాగం కాబోమని.. కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం గనుక దక్కితే వాటా ఇస్తామని చెప్పారు. విజయ్ ఈ ప్రకటన అక్కడి రాజకీయాల్లో అలజడి రేపింది. పలు పార్టీలోని సీనియర్ నేతలు విజయ్ ఆఫర్‌కు టెంప్ట్ అవుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో అసంతృప్త నేతలతో పాటు ఓట్ షేరింగ్ ఉన్న పార్టీలు, కుల ఓట్లను రాబట్టే పార్టీలు సైతం విజయ్ టీవీకేతో కూటమిగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాయి. ప్రజల సమస్యలపై నేరుగా స్పందించేందుకు, వారి అభిప్రాయాలను స్వీకరించేందుకు ఈ పర్యటనను ప్రజా ఉద్యమంగా మార్చాలని విజయ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ మీట్ ది పీపుల్‌పై అధికార డీఎంకే ఓ కన్నేసింది. విజయ్ పర్యటనను నిశితంగా పరిశీలించాలని, ప్రత్యర్థి వ్యూహానికి చెక్ పెట్టేలా పునరాలోచనలు చేయాలని ఆ పార్టీ అధినేత, సీఎం స్టాలిన్ సీనియర్లకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే టీవీకే కేడర్‌పై ఈ సమయంలోనే కేసులు నమోదు అవుతుండడంతో డీఎంకేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయ్ మాత్రం ఇలాంటివాటికి వెనకడుగు వేయబోనని అంటున్నారు. 1967లో అన్నాదురై కాంగ్రెస్ ఆధిపత్యానికి గండికొట్టినట్లు.. 1977 అన్నాడీఎంకేతో ఎంజీఆర్ డీఎంకేను గద్దె దించినట్లు.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిపోరుతో అధికారం కైవసం చేసుకుని తానూ చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారు. జనంలోకి వెళ్తున్న విజయ్.. రెండు నెలలపాటు నాన్‌స్టాప్ పర్యటనలు చేపట్టబోతున్నారు. మొదటి విడతలో 10 జిల్లాల్లో పర్యటించేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. శనివారం కీలక కార్యక్రమాలు జరుగుతాయి. ఆదివారం ఒకే ఒక్క కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యలో సెప్టెంబర్ 27, అక్టోబర్ 25వ తేదీన చెన్నైకి విజయ్ చేరుకుంటారు. పార్టీ ప్రకటన నుంచి మానాడు విజయవంతం దాకా.. విజయ్ వెంట నడిచింది యువతే. కాబట్టి యువత మద్దతుతోనే తన పర్యటనలను విజయవంతం చేసుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: విజయ్ టీవీకే.. ఆ పార్టీకే ఫ్లస్ -
ఆకతాయిల నుంచి హీరోయిన్ను కాపాడిన స్టార్ హీరో ఫ్యాన్స్
ఒక్కో సారి చిత్ర యూనిట్‌కు కష్టాలు ఎదురవుతుంటాయి. అలాంటి కష్టాన్నే కన్నడ నటి 'నీమా రే' ఎదుర్కున్నారు. తమిళ్లో మహేంద్ర ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై మహేంద్రన్ నిర్మిస్తున్న కొత్త చిత్రం ఇరవిన్ విళిగళ్.. ఈ చిత్రాన్ని సిక్కల్ రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేంద్ర కథానాయకుడిగా నటిస్తుండగా.. 'నీమా రే' హరోయిన్‌గా నటిస్తుంది. ఈమె కన్నడ చిత్రం బింగారాలో నటనకు జాతీయ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. తమిళ్, కన్నడ చిత్ర పరిశ్రమలో ఆమెకు మంచి పాపులారిటీనే ఉంది. దీంతో ఆమె ఎక్కడికి వెళ్లిన అభిమానులు భారీగానే చేరిపోతారు.అయితే, తను నటిస్టున్న కొత్త చిత్రం సామాజిక మాధ్యమాల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానుంది. ఈ మూవీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని దర్శకుడు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను తమిళనాడులోని వెళ్లిమలై ప్రాంతంలో నిర్వహిస్తుండగా అక్కడకు వచ్చిన కొందరు యువకులు హద్దు మీరి హీరోయిన్ 'నీమా రే' చేయి పట్టుకుని లాగుతూ గొడవ చేశారన్నారు. తాము ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదన్నారు. అప్పుడు అక్కడకు వచ్చిన నటుడు విజయ్ దళపతి అభిమానులు కొందరు కల్పించుకుని షూటింగ్‌కు కోసం తెచ్చిన కొరడాతో వారిని తరిమి తరిమి కొట్టారని దర్శకుడు చెప్పారు. ఈ సంఘటనతో నటి 'నిమా రే' చాలా భయపడిపోయారని చెప్పారు. ఇరవిన్ విళిగల్ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందనీ,త్వరలోనే చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. నటి నీమా రే.. వైద్య విద్యను పూర్తి చేశారు. ఆపై ఎయిర్ హోస్టెస్ కోర్స్ కూడా పూర్తి చేశారు. ఆమె తమిళం, కన్నడ, తులు భాషల చిత్రాలలో నటించారు. -
హీరో విజయ్‌పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు!
నటి త్రిష.. తొలుత తమిళంలో జోడి అనే చిత్రంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన నటించిన సామి చిత్రం త్రిషను స్టార్ హీరోయిన్ చేసింది. అంతే ఆ తరువాత కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవలసిన ఈ బ్యూటీకి కలగలేదు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అంటూ అన్ని భాషలలో నటిస్తూ అగ్ర కథానాయకిగా మారారు. ఈ 42 ఏళ్ల చెన్నై సుందరి ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కావడం గమనార్హం. అదేవిధంగా కథానాయకిగా 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే త్రిష కెరీర్లోను చాలా ఎత్తు పల్లాలు చోటుచేసుకున్నాయి. అలా పడి లేస్తూ తన కెరీర్‌ను పదిల పరుచుకుంటూ వస్తున్న త్రిష ఇప్పుడు మళ్లీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈమె సూర్యకు జంటగా నటిస్తున్న కరుప్పు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని దీపావళి సందర్భంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదే విధంగా తెలుగులో చిరంజీవికి జంటగా నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్లో బరిలోకి దిగడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రస్తుతం ఈమె చేతిలో కొత్త చిత్రాలు ఏమీ లేవు. ఇదిలా ఉంటే త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటుడు విజయ్ త్రిషకు మంచి మిత్రుడు. అయితే స్నేహబంధం కొందరు వేరే విధంగా కూడా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 2026లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో 25 ఏళ్ల సినీ కెరియర్ గాను నటి త్రిషకు స్పెషల్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తాను నటించిన ఒక్కో హీరో గురించి త్రిష మాట్లాడారు. నటుడు విజయ్ గురించి ఆమె మాట్లాడుతూ ఆయన నూతన పయనానికి గుడ్ లక్ అని పేర్కొన్నారు అదేవిధంగా విజయ్ కి ఎలాంటి కల ఉన్నా అది నెరవేరాలని, అందుకు ఆయన అర్హుడని, ఆయనకు తన శుభాకాంక్షలు అని అన్నారు. త్రిష చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
ఎన్డీయేకు మరో షాక్.. విజయ్‌తో మక్కల్ సెల్వర్ జట్టు!
అసెంబ్లీ ఎన్నికల ముందర తమిళనాడులో ఎన్డీయే కూటమికి మరో షాక్ తగిలింది. అమ్మా మక్కల్ మున్నేట్ర కగళం(AMMK) కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మొన్నీమధ్యే అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీర్ సెల్వం(ఓపీఎస్).. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీవీవీ దినకరన్ కూడా తన మద్దతును ఉపసంహరించుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందర.. ఎన్టీయే కూటమితో చేతులు కలిపారు దినకరన్. అయితే అన్నాడీఎంకేతో బీజేపీ అంటకాగడం మొదలైనప్పటి నుంచి ఆయన్ని దూరం పెడుతూ వస్తోంది. అయినప్పటికీ జయలలిత అనుచరులతో సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ఓపికగా భరిస్తూ వచ్చారు. ఈ తరుణంలో.. అనూహ్యంగా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు దినకరన్ ప్రకటించడం గమనార్హం. ‘‘ఎన్డీయే కూటమి నుంచి మేం వైదొలిగాం. డిసెంబర్లో మా తదుపరి నిర్ణయం ఏంటన్నది ప్రకటిస్తాం. అమ్మ అనుచరులు మాకు దగ్గరవుతారని ఎదురుచూశాం. కానీ, అందుకు అవకాశం లేదని తెలిసిపోయింది. అందుకే 2026 ఎన్నికల కోసం మా దారి మేం చూసుకుంటున్నాం’’ అని దినకరన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఎన్డీయే కార్యక్రమాలకు దినకరన్ కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో కూటమి నుంచి వైదొలగవచ్చనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ దిగ్గజ నేత మూపనార్ వర్ధంతి వేడుకలకు బీజేపీ అగ్రనేత.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హాజరయ్యారు. ఆ సమయంలోనే 2026 ఎన్డీయే సీఎం అభ్యర్థి పళనిస్వామినినే అని బీజేపీ మాజీ రాష్ట్ర చీఫ్ అన్నామలై ప్రకటించారు కూడా. అయితే.. బీజేపీతో పొత్తు ఉండాలంటే పళనిస్వామి, దినకరన్‌లను దూరం పెట్టాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి డిమాండ్ చేసినట్లు ఓ ప్రచారం జోరుగా నడిచింది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో మార్నింగ్ వాక్ చేసిన పన్నీర్ సెల్వం.. కాసేపటికే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ తమిళనాడు రాజకీయాలపై చర్చిస్తున్న వేళలలోనే..దినకరన్ నిష్క్రమణ ప్రకటన చేశారు. ఇప్పుడు ఇదిలా ఉంటే.. థేవర్ కమ్యూనిటీ నుంచి ఇద్దరూ బలమైన నేతలు దూరం కావడంతో దక్షిణ తమిళనాడులో ఎన్డీయే కూటమి ఓట్లపై ప్రభావం పడొచ్చనే విశ్లేషణ నడుస్తోంది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే రాజకీయంగా కుదేలునకు లోనవుతూ వస్తోంది. మాజీ సీఎంలు ఈపీఎస్, ఓపీఎస్‌ల వర్గపోరుతో పార్టీ పరువు రోడ్డు మీద పడింది. అటుపై ఈపీఎస్ వర్గానికి అధికారిక గుర్తింపు దక్కడం, ఓపీఎస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం తెలిసిందే. అయినప్పటికీ ప్రతిపక్షంగా నిలబడింది. ఇంకోవైపు.. తమిళనాడులో గ్రాఫు పెంచుకుంటోందిగానీ సీట్ల సంఖ్యను మాత్రం బీజేపీ పెంచుకోలేకపోతోంది. దీంతో ఆ పార్టీతోనే జట్టుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ బలంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.టీవీవీ.. టీవీకే వైపు.. ?టీవీవీ దినకరన్.. జయలలిత నిచ్చెలి వీకే శశికళ మేనల్లుడు. గతంలో అన్నాడీఎంకే ట్రెజరర్‌గా, ఉప ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2017లో ఆర్.కే.నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2018లో అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (AMMK) అనే కొత్త పార్టీని స్థాపించారు. తమిళనాట రాజకీయాల్లో ఆయన్ని మక్కల్ సెల్వర్గా పిలుస్తుంటారు. అయితే.. ఆయన రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ జోరందుకుంది. ప్రస్తుతానికి దినకరన్ డిసెంబర్ దాకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే.. గతకొంతకాలంగా ఆయన నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ను పొగుడుతూ వస్తున్నారు. గతంలో విజయ్‌కాంత్ రాజకీయాల్లో ఒక ఊపు ఎలా ఊపారో.. విజయ్ కూడా అదే తరహాలో ఊపేస్తున్నారంటూ దినకరన్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. తాను ఏ కూటమిలో చేరబోనని, వచ్చే ఎన్నికల్లో డీఎంకేతోనే తమ పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు. అయితే కలిసొచ్చే పార్టీలకు రేపు అధికారం దక్కితే వాటా ఇస్తానని మాత్రం స్పష్టత చెప్పారు. దీంతో.. దినకరన్ విజయ్ పార్టీతో పొత్తుకు వెళ్లవచ్చనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే పీఎంకే, వీసీకే, డీఎండీకే లాంటి పార్టీలు టీవీకేతో పొత్తుపై ఉవ్విళ్లూరుతున్నాయి. పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడం లేదంటే విజయ్ టీవీకేతోపాటు పొత్తు.. అదీ కుదరకుంటే అధికార డీఎంకేతో జట్టులాంటి ఆప్షన్స్‌ను పరిశీలిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 5వ తేదీన జరగాల్సిన మధురై సభను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. -
విజయ్ కనిపిస్తే.. ముఖం బద్దలు కొడతా: నటుడు
నటుడు, బీజేపీకి చెందిన రంజిత్ శనివారం తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై విమర్శల దాడి చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మధురైలో జరిగిన మహానాడు సదస్సులో తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రిని మిస్టర్ అని సంబోధించడంతో పాటూ చిటికెలు వేస్తూ మాట్లాడారు. దీంతో విజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈనేపథ్యంలో కోయంబత్తూర్, తుడియలూర్ ప్రాంతంలో జరిగిన వినాయక చతుర్థి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న రంజిత్ విజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశ ప్రధానమంత్రినే చిటికెలు వేస్తూ విమర్శలు చేస్తావా?, తాను విజయన్ను నేరుగా కలిస్తే ముఖం బద్దలు కొడతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆదివారం ఉదయం తమిళగ వెట్రి కళగం పార్టీ నిర్వాహకులు తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, నటుడు రంజిత్ పై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.రంజిత్ తమిళ సినీ పరిశ్రమలో నటుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఆయన నటనతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి, తనదైన శైలిని చూపించాడు. అయితే, తెలుగులో చిరంజీవి స్నేహంకోసం చిత్రంలో రంజిత్ కీలక పాత్రలో కనిపించారు. -
షాకింగ్ సర్వే.. ఆ పార్టీ నెత్తిన పాలు పోసే పనిలో విజయ్!!
ఏ పార్టీతో పొత్తు ఉండదు. సింహం ఎప్పటికీ సింహమే!. సింగిల్‌గానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతాం అంటూ తమిళగ వెట్రి కళగం (Tamilaga Vetri Kazhagam) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధురైలో జరిగిన టీవీకే మానాడు సూపర్ సక్సెస్ కావడంతో విజయ్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను ప్రముఖ పార్టీలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తమిళనాడులో జరిగిన ఓ సర్వే వెల్లడించిన విషయాలు టీవీకే సహా అక్కడి రాజకీయ పక్షాలకు ఝలక్ ఇచ్చాయి. తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే.. డీఎంకే అత్యధిక సీట్లు కైవసనం చేసుకుంటుందని తెలిపింది. ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 3 సీట్లు దక్కవచ్చని, అదే సమయంలో విజయ్ టీవీకేకు జీరో ఎదురుకావొచ్చని ఆ సర్వే పేర్కొంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి తమిళనాడులో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 39 స్థానాలను కూటమిలోనే పార్టీలోనే కైవసం చేసుకున్నాయి. అయితే ఇప్పటికిప్పడు జరిగితే మాత్రం 36 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. సంక్షేమ పథకాలతో పాటు హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, నీట్ పోరాటాలు డీఎంకే గెలుపును ప్రభావితం చేసే అంశాలుగా పేర్కొంది.ఇక.. బీజేపీ అన్నాడీఎంకే ఎన్డీయే కూటమికి మూడు స్థానాలు మాత్రమే దక్కవచ్చని పేర్కొంది. అయితే.. ఓటు శాతం మాత్రం 18% నుంచి 37%కి పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 2024లో ఈ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇక తమిళనాడులో రాబోయే కాలంలో జరిగే ఎన్నికలకు విజయ్ టీవీకే పార్టీ అదనపు ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పార్టీ ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. అయితే ఇప్పటికప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఏ స్థానం దక్కకపోవచ్చని(0 సీట్లు) ఆ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ పెట్టి ఏడాది పైనే అవుతోంది. అయితే అందులో ముఖాలేవీ జనాలకు పెద్దగా తెలిసినవి కావు. జనాలకు తెలిసిన ముఖాలు టీవీకేలో చేరేందుకు ప్రయత్నిస్తున్నా.. విజయ్ అందుకు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు జనాల్లోకి ఇంకా బలంగా ఆ పార్టీ చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. అయితే డీఎంకే వ్యతిరేకతను టీవీకే ఓట్ల రూపంలో మార్చుకోవాలని విజయ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే.. టీవీకే పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా డీఎంకేకే లాభం కలగించవచ్చని సర్వే పేర్కొంది. తద్వారా.. టీవీకేతో ఎన్డీయే కూటమికే భారీ నష్టం కలగవచ్చని స్పష్టం చేసింది. ఇండియా టుడే సీవోటర్ Mood of the Nation ఆగస్టు 2025 పేరిట నిర్వహించిన ఈ సర్వే నిర్వహించింది. జూలై 1 నుండి ఆగస్టు 14, 2025 మధ్య 2 లక్షల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించి రూపొందించబడింది. సర్వే లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో జరిగినప్పటికీ మరో ఏడేనిమిది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకూ సమీకరణాలు ఇలాగే కొనసాగితే మాత్రం.. డీఎంకే నెత్తిన విజయ్ టీవీకే పాలు పోసినట్లే అవుతుందన్న చర్చ జోరుగా నడుస్తోందక్కడ. -
అది ఓట్ల రాజకీయం.. మేం పట్టించుకోం
అగ్రనటుడు, తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత విజయ్ మధురై మహనాడులో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో కచ్చతీవు ద్వీపం అంశం తెరపైకి తెచ్చారాయన. అయితే తాజాగా విజయ్ డిమాండ్‌పై శ్రీలంక(Sri Lanka Reacts Actor Vijay) స్పందించింది. కచ్చతీవును తిరిగి భారత్‌లో చేర్చాలంటూ విజయ్ మధురై టీవీకే సభలో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారంటూ శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత హెరాత్ అభిప్రాయపడ్డారు. విజయ్ వ్యాఖ్యలను ఓ మీడియా ప్రతినిధి ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘కచ్చతీవు ముమ్మాటికీ శ్రీలంకదే. ఇలాంటి వ్యాఖ్యలు ఓట్ల కోసం చేసే రాజకీయ ప్రకటనలు మాత్రమే. దక్షిణ భారతదేశంలో ఎన్నికల కాలంలో రాజకీయ ప్రయోజనాల ఇలాంటివెన్నో చెబుతుంటారు. భారత కేంద్ర ప్రభుత్వమో, దౌత్యాధికారులో ఈ అంశంపై ఎలాంటి అధికారిక వ్యాఖ్యలు చేయలేదు. అందువల్ల శ్రీలంక సార్వభౌమత్వం కొనసాగుతుంది. ఇలాంటి ప్రకటనలతో మేం ప్రభావితం కాబోం. శ్రీలంకకు చెందిన కచ్చతీవు విషయంలో దౌత్యస్థాయిలో జరిగే చర్చలే ముఖ్యం’’ అని అన్నారాయన. ఆగస్టు 21న మదురైలో జరిగిన సభలో విజయ్ మాట్లాడుతూ.. మత్స్యకారుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలమైందని విమర్శలు గుప్పించారు. శ్రీలంక నౌకాదళం దాడుల వల్ల 800 మంది తమిళనాడు మత్స్యకారులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. ‘‘మీరు పెద్దగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. చిన్న పని చేయండి. కచ్చతీవును తిరిగి పొందండి, అది మా మత్స్యకారుల భద్రతకు సరిపోతుంది’’ అని విజయ్ ప్రధాని మోదీని ఉద్దేశించి అన్నారు.Popular actor Thalapathi Vijay who left the Silver Screen to mount the political platform, challenges @PMOIndia to take back the Katchchateevu island to protect Tamilnadu fishermen from Sri Lanka navy attacks. pic.twitter.com/btpiP6Z0AI— LankaFiles (@lankafiles) August 26, 2025కచ్చతీవు ఒక చిన్న ద్వీపం. తమిళనాడు రామేశ్వరంకు సమీపంలో.. భారత్-శ్రీలంక మధ్య పాక్ జలసంధిలో ఉంది. ద్వీపంలో సెయింట్ ఆంటోనీ ప్రార్థన మందిరంలో ఏటా జరిగే ఉత్సవాలకు తమిళనాడు నుంచి ప్రజలు హాజరవుతుంటారు. 1974లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని అప్పటి భారత ప్రభుత్వం కచ్చతీవు భూభాగాన్ని శ్రీలంకకు అప్పగించింది. అయితే రాజ్యాంగ సవరణ లేకుండా అప్పగించడంపై వివాదం నడుస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఇది రామనాథపురం జమీందారిలో భాగంగా ఉండేది. అందుకే ఇది భారత్‌దే అని వాదనలు తొలినాళ్ల నుంచే ఉన్నాయి. తమిళ మత్స్యకారులు ఈ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే సమయంలో శ్రీలంక నౌకాదళం దాడులు, అరెస్టులు చేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ప్రతి ఎన్నికల సమయంలో కచ్చతీవు అంశం చర్చకు వస్తోంది. కానీ శాశ్వత పరిష్కారం మాతరం దొరకడం లేదు. -
దళపతి విజయ్‌పై కేసు పెట్టిన ఫ్యాన్
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కగళం(TVK) అధినేత విజయ్‌కు ఓ అభిమాని షాకిచ్చాడు. మధురై మహనాడులో తనపై విజయ్ బౌన్సర్లు తనపై దాడి చేశారంటూ ఆయన అభిమానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వ్యక్తిగత సిబ్బందితోపాటు విజయ్‌పైనా కేసు నమోదు అయ్యింది.ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ (Actor Vijay)పై కేసు నమోదైంది. ఆగస్టు 21వ తేదీన మదురై పరపతిలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని శరత్‌కుమార్ అనే అభిమాని ఫిర్యాదు చేశారు. సభ ప్రారంభ సమయంలో వేదికపై విజయ్ వేదిక మీద నడుచుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగాడు. ఆ సమయంలో.. కొందరు యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విజయ్ నడుస్తున్న వేదికపైకి ఎక్కి హల్చల్ చేశారు. ఈ క్రమంలో.. విజయ్‌కు దగ్గరగా వచ్చిన ఆ వ్యక్తిని బౌన్సర్లు ఎత్తి స్టేజ్ అవతల పారవేసే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తూ అతను కింద పడలేదు. ఆ సమయంలో విజయ్ సైతం తన బౌన్సర్లను కాస్త తగ్గమంటూ సైగ చేసి చూపించాడు. అయితే.. ఆ యువకుడు వేదికకు ఉన్న పైప్‌ను పట్టుకుని వేలాడి కిందకి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ రూపేణా విపరీతంగా వైరల్ అయ్యింది. த.வெ.க மாநாட்டில் தொண்டரை தூக்கி வீசிய பாதுகாவலர்கள்.. நடவடிக்கை எடுக்கக்கோரி கண்காணிப்பாளரிடம் புகார்.. த.வெ.க தொண்டர் வேதனை பேட்டி#TVKManaadu | #Vijay | #Police | #Complaint | #Bouncers pic.twitter.com/AKgg1vdrM3— Polimer News (@polimernews) August 27, 2025 TVK Vijay Manaadu Issue | Perambalur | "பவுன்சர்கள் என்ன தூக்கி கெடாசிட்டாங்க"இளைஞர் பரபரப்பு புகார்#tvkvijay | #Vijay | #tvk | #perambalur | #thanthitv pic.twitter.com/t7WAXyQshW— Thanthi TV (@ThanthiTV) August 27, 2025 దీంతో మనస్తాపం చెందిన శరత్.. నటుడిని కలిసేందుకు వెళ్తుండగా అడ్డుకొన్న బౌన్సర్లు తనపై దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆరోపించారు. దీంతో పోలీసులు విజయ్, ఆయన బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ‘‘నేను ఆయన్ని చూసేందుకు వచ్చా. కానీ, ర్యాంప్ నుంచి నన్ను కిందకు తోసేశారు. నాకు గాయాలయ్యాయి. ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాను’’ అని శరత్ తన తల్లితో సహా మీడియాతో మాట్లాడాడు. ఫిర్యాదు ఆధారంగా విజయ్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: స్టాలిన్ అంకుల్.. వెరీ వెరీ రాంగ్ అంకుల్! -
విజయ్‌తో సినిమా.. ఆస్తులన్నీ అమ్ముకున్నా: నిర్మాత
దళపతి విజయ్(Vijay)పై ఆయన మాజీ మేనేజర్, ‘పులి’ నిర్మాత పీటీ సెల్వకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పులి’ సినిమాతో తాను భారీగా నష్టపోతే.. ఆయన రెమ్యునరేషన్ మాత్రం డబుల్ అయిందన్నారు. సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్న తనకు.. ఈ రోజు వరకు విజయ్ నుంచి ఓదార్పు మాట రాలేదన్నారు. విజయ్ హీరోగా చింబు దేవన్ దర్శకత్వంలో 2015లో పులి అనే సినిమాను వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ కే టీ స్టూడియోస్ బ్యానర్ పై శిబు తమీన్స్, పీటీ సెల్వకుమార్ నిర్మించారు. అప్పటి వరకు వచ్చిన తమిళ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. విజయ్ తో పాటు కిచ్చా సుదీప్, అతిలోక సుందరి శ్రీదేవి, హన్సిక వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై..తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. దీంతో నిర్మాలతకు, బయ్యర్లుకు భారీ నష్టాలు వచ్చాయి. అయితే చాలా కాలం తర్వాత నిర్మాత సెల్వకుమార్ ఈ సినిమాపై స్పందించారు.రిలీజ్‌కి ముందే కుట్ర..ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని సినిమాను విడుదల చేశాం. రిలీజ్‌కి ఒక్క రోజు ముందు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేశారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. నా పక్కన ఉన్నవారే కుట్ర చేశారు. సినిమా విడుదల కాదనే వార్తలను వ్యాప్తి చేశారు. ఆ సమయంలో నేను ఎదుర్కొన్న అవమానం, ఒత్తిడి వర్ణనాతీతం. నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం ఈ ఒక్క సినిమా కోసమే ఖర్చు చేశా. నా కలలతో ముందుకు సాగాలని కోరుకున్నాను. కానీ ఆ కష్టార్జితం నాశనమైంది.మధ్యలో బయటకు వచ్చేశారుఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమాను థియేటర్స్‌కి తీసుకొచ్చాం. తొలి రోజు నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. స్టోరీ, గ్రాఫిక్స్ వర్క్‌పై ఫ్యాన్స్ సైతం ఫైర్ అయ్యారు. తీవ్ర ఆందోళనకు గురయ్యాను. ప్రేక్షకులు మధ్యలోనే థియేటర్స్ నుంచి బయటకు వెళ్లడం కళ్లారా చూశాను. అప్పుడు నా స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఆత్మహత్య చేసుకునే వాళ్లు.విజయ్ దూరం పెట్టాడు.. సినిమా అపజయం చెందడంతో విజయ్ నన్ను దూరం పెట్టేశాడు. సినిమా రిలీజ్ తర్వాత ఐదారు రోజుల పాటు విజయ్‌తో మాట్లాడే అవకాశం రాలేదు. ఈ అపజయం విజయ్ కెరీర్‌పై కొంచెం కూడా పడలేదు. ఇంకా చెప్పాలంటే ఆయన పారితోషికం డబుల్ అయింది. పులి చిత్రానికి రూ. 25 కోట్లు తీసుకున్న విజయ్.. ఆ తర్వాత చిత్రానికి రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడు. కానీ వాళ్లు మాత్రం నన్ను దేశ ద్రోహిగా, వైఫల్యం చెందిన వ్యక్తిగానే చూశారు. కొన్ని విషయాలను బయటపెట్టలేను కానీ.. పులి సినిమాతో నా 27 ఏళ్ల కల, కృషి నాశనం అయ్యాయి’ అని ఓ ఈవెంట్లో సెల్వకుమార్ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు. -
అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే: శివ కార్తికేయన్
కోలీవుడ్‌లో దళపతి విజయ్(Thalapathy Vijay) పేరు ఒక సంచలనం.. కోట్లాది అభిమానులను సంపాధించుకున్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. భవిష్యత్‌లో సినిమాలు చేయనని కూడా తేల్చేశారు. అయితే, కోలీవుడ్ తదుపరి దళపతి ఎవరంటూ కొద్దిరోజులుగా అక్కడి సోషల్‌మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శివ కార్తికేయన్(Sivakarthikeyan) పేరు తెరపైకి వచ్చింది. ఫ్యూచర్ దళపతి, కుట్టి దళపతి వంటి హ్యాష్‌ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. విజయ్ ఫ్యాన్స్ కూడా మద్ధతు ఇచ్చారు. దీంతో శివ కార్తికేయన్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. విజయ్ ఫ్యాన్స్‌ను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వాటిపై తాజాగా శివ కార్తికేయన్ రియాక్ట్ అయ్యారు.దళపతి ట్యాగ్‌లైన్‌పై శివ కార్తికేయన్ ఇలా అన్నారు.. 'అన్న (విజయ్) ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. విజయ్ లెగసీని కొనసాగించడం చాలా కష్టం. అది అన్నకు మాత్రమే సాధ్యం. మరొకరి ఫ్యాన్స్‌ను గెలవాలని ఏ హీరో అనుకోరు. నేను ఇక్కడ 15 ఏళ్లుగా చాలా కష్టపడుతూ సినిమాలు చేస్తున్నాను. కొందరి అభిమానాన్ని పొందాను అది చాలు. నాపై వచ్చే విమర్శలకు మీరు (అభిమానులు) స్పందించాల్సిన పనిలేదు. సచిన్, ధోనీ వంటి వారినే కొందరు విమర్శిస్తుంటారు. వారితో పోలిస్తే నేను ఎంత..? ట్రోల్స్‌పై ఎలాంటి ఆవేశాలు వద్దు. సరదాగా, సంతోషంగా నచ్చితే సినిమాలు చూడండి.' అంటూ ఫ్యాన్స్‌కు శివ కార్తికేయన్ సూచించారు. ఆయన నటించిన కొత్త సినిమా మదరాసి సెప్టెంబర్ 5న విడుదల కానుంది.విజయ్ నటించిన 'ది గోట్' సినిమాలో శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపించాడు. ఆ సినిమాలో ఒక సన్నివేశం ద్వారా విజయ్ తన బాధ్యతను శివకు అప్పగించినట్లు చూపించడంతో, కొంతమంది అభిమానులు శివ కార్తికేయన్ విజయ్ వారసుడిగా భావించడం మొదలుపెట్టారు. కానీ శివ కార్తికేయన్ మాత్రం ‘‘విజయ్ లెగసీ ఆయనదే. దాన్ని ఎవరూ తీసుకోలేరు’’ అని స్పష్టంగా చెప్పారు. విజయ్‌కి శివ కార్తికేయన్ మీద కూడా చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా విజయ్, రజనీకాంత్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుంది. ఇప్పుడు విజయ్ రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో ఆ స్థానాన్ని భర్తి చేసేందుకు వారు శివ కార్తికేయన్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. -
Tamil Nadu: విజయ్‌కు ప్రత్యర్థిగా అజిత్? జయలలిత ఇదే కోరుకున్నారా?
చెన్నై: తమిళనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. 2026లో రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే దీనికి ప్రధాన కారణం. తమిళ అగ్ర నటుడు విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తమిళగా వెట్రి కజగం (టీవీకే) పోటీ చేస్తుందని ప్రకటించిన దరిమిలా తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో విజయ్ ప్రత్యర్థిగా భావిస్తున్న మరో తమిళ హీరో అజిత్ కుమార్ రాజకీయ ప్రవేశంపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయి.అజిత్ రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన ఊహాగానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2016లో మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత మరణించాక అజిత్ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన పలు వార్తలు వినిపించాయి. నాడు జయలలిత తన పార్టీ ఏఐడీఎంకేలోకి అజిత్ తన వారసునిగా రావాలని కోరుకుంటున్నారనే వార్తలు వ్యాపించాయి. దీనికి సంబంధించి, స్పష్టమైన ఆధారాలు లేకపోయినా, అజిత్ ఈ విషయమై ఎప్పుడూ ఏమీ మాట్లాడకపోయినప్పటికీ ఈ ఊహాగానాలు నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి.దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత నాడు ఒక నటునిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ, ఒక జర్నలిస్టు ముందు మాట్లాడిన మాటలు వైరల్‌గా మారాయి. ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అవే వాదనలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే అజిత్ తనకు రాజకీయరంగంపై ఆసక్తి ఉన్నట్లు ఏనాడూ ప్రకటించలేదు. కాగా జర్నలిస్టు, జయలలిత సన్నిహితుడు అయిన కాలచక్రం నరసింహ నాడు జయలలితతో సాగించిన సంభాషణకు సంబంధించిన వీడియో ఈ చర్చను తిరగతోడుతోంది.ఆ వీడియోలో నరసింహ.. ‘ఆమె(జయలిత) తమిళ సినిమాకు చెందిన ఒక నటుడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. అతని హుందా ప్రవర్తన, నిజాయితీ, ప్రజలతో కలిసిపోయే తీరు గురించి ప్రస్తావించారు. అయితే ఆ నటుడు రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కలిగి ఉన్నాడో లేదో ఆమెకు ఖచ్చితంగా తెలియకపోయినా, తమ పార్టీలో చేరేందుకు ఆయన సరైన వ్యక్తి అని ఆమె చెప్పారు. వారసత్వం అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆమె అజిత్ పేరును నేరుగా పేర్కొన లేదు. అయితే అభిమానులు ఆ నటుడు అజయ్ అని స్పష్టంగా చెబుతుంటారు.ఈ అంశంపై అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తావిస్తుంటారు. ఒక అభిమాని ‘అజిత్ సర్ 2029 లేదా 2030లో రాజకీయాల్లోకి వస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు.. నా మాటలు నిజం అవుతాయి’ అని పేర్కొనగా, మరొకరు, ‘రాజకీయాలను దగ్గరగా చూస్తే.. ఎవరికైనా ఇది నిజం అని అనిపిస్తుంది’ అని రాశారు. ఇంకొకరు ‘అతను ఏఐడీఎంకేను నడిపించేందుకు సరైన వ్యక్తి అయ్యేవాడు’ అని అభిప్రాయపడ్డారు. అయితే అజిత్ ఇప్పటివరకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం అజిత్ నటనతో పాటు, తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. తమిళనాడులో రాజకీయాలు సినీరంగంలో ముడిపడి కనిపిస్తాయి. సిఎన్ అన్నాదురై నుండి ఎం.జి. రామచంద్రన్, జయలలిత వరకు.. అందరూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కమల్ హాసన్ కూడా ‘మక్కల్ నీది మయ్యమ్’ తో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. -
దళపతి చివరి సినిమాలో ముగ్గురు స్టార్ దర్శకులు?
తమిళ స్టార్ దళపతి విజయ్.. రీసెంట్‌గానే మధురైలో భారీ బహిరంగ సభ పెడితే ఏకంగా లక్షలాది మంది అభిమానులు వచ్చారు. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్న విజయ్.. మరోవైపు తన చివరి చిత్రాన్ని పూర్తి చేసే పనిలోనూ ఉన్నాడు. అయితే ఈ మూవీ గురించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే నటి పెళ్లి.. ఏడాది తిరిగేలోపు కూతురు)విజయ్ 'జన నాయగన్'... తెలుగు చిత్రం 'భగవంత్ కేసరి' రీమేక్ అని ప్రచారం అయితే ఉంది కానీ నిజమేంటి అనేది మూవీ రిలీజైతే తప్ప తెలియదు. అయితే ఇది విజయ్ చివరి చిత్రమని ప్రచారం నడుస్తోంది కాబట్టి ఇందులో పలు సర్ప్రైజులు ఉండబోతున్నాయట. తమిళ స్టార్ డైరెక్టర్స్ అట్లీ, నెల్సన్, లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారట. సోషల్ మీడియాలో ఈ రూమర్ గట్టిగానే వినిపిస్తుంది.ఈ ముగ్గురు దర్శకులు కూడా విజయ్‌తో సినిమాలు తీశారు. అట్లీ, లోకేశ్ తలో రెండేసి చిత్రాలు చేయగా.. నెల్సన్ ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. అలా విజయ్‌పై అభిమానం దృష్ట్యా.. ఇతడి చివరి చిత్రమైన 'జన నాయగన్'లో జర్నలిస్టులుగా చిన్న పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇకపోతే ఈ మూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. 'ప్రేమలు' మమిత బైజు కీలక పాత్ర చేస్తోంది. హెచ్. వినోద్ దర్శకుడు కాగా అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా) -
విజయ్ విమర్శలకు శరత్‌కుమార్ కౌంటర్
మహానాడు వేదికగా తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రచ్చకెక్కాయి. తాను సింగిల్‌గానే 2026లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన బీజేపీ, అన్నాడీఎంకే, డీఎంకే కూటమి వర్గాలపై విమర్శలు చేశారు. దీంతో అక్కడి అన్ని పొలిటికల్ పార్టీలు విజయ్‌పై ముప్పెట్ట దాడి చేసేందుకు దిగాయి.విజయ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, నటుడు శరత్‌కుమార్ రియాక్ట్ అయ్యారు. సిద్ధాంత పరంగా విజయ్ వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మిస్టర్ పీఎం అంటూ ప్రధాని నరేంద్ర మోదీని సంబోధించే స్థాయికి ఇంకా ఎదగలేదన్నారు. ముందుగా పాసిజం అంటే ఏమిటో తెలుసుకుని రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ఆపై అన్నాడీఎంకే నేతలు కూడా ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో అందరూ ఎంజీఆర్, జయలలితలు కాలేరని ఎద్దేవాచేశారు.దివంగత నటుడు విజయకాంత్ ఆశీస్సులు విజయ్‌కి ఉంటాయని ఆయన సతీమణి ప్రేమలత అన్నారు. విజయ్ తమ ఇంటి బిడ్డ అని ఆమె అన్నారు. విజయ్ వ్యాఖ్యలు కూడా విజయకాంత్‌ను గుర్తుచేస్తున్నాయని డీఎండీకే నేత ప్రేమలత అన్నారు. ప్రస్తుతం విజయ్‌కి సపోర్ట్‌గా విజయకాంత్ సతీమణి రావడం అభిమానులు సంతోషిస్తున్నారు. -
ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
దళపతి విజయ్.. తమిళనాడులో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓ హీరో. ఓవైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. సొంతంగా టీవీకే అనే పార్టీ పెట్టి, వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడనున్నాడు. తాజాగా మధురైలో పార్టీ మీటింగ్ పెడితే లక్షలాది జనం తరలివచ్చారు. ఇలా విజయ్ గురించి చాలానే తెలుసు. కానీ ఈ హీరో ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఓ సినిమా చూసి ఇతడిని, భార్య సంగీత పెళ్లి చేసుకుందనే విషయం మీలో ఎంతమందికి తెలుసు?దళపతి విజయ్ భార్య పేరు సంగీత సోమలింగం. భర్త ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఈమె ఎందుకనో మీడియా అట్రాక్షన్ కోరుకోలేదు. ఈమె గురించి మీడియాలో, సోషల్ మీడియాలోనూ పెద్దగా ప్రస్తావన ఉండదు. సంగీత విషయానికొస్తే.. ఈమె ఓ శ్రీలంకన్ తమిళియన్. తండ్రి యూకేకి వలస వెళ్లి బిజినెస్‌మ్యాన్ అయిపోయాడు. అలా యూకేలో తండ్రితో కలిసి నివసిస్తున్నప్పుడు అనుకోకుండా విజయ్ 'పూవే ఉనక్కాగ' సినిమా చూసిన సంగీత.. అతడితో వన్ సైడ్ ప్రేమలో పడిపోయింది. నేరుగా చెన్నైలో వాలిపోయింది.(ఇదీ చదవండి: బాగా చూసుకుంటా.. కిరణ్ అబ్బవరం గురించి భార్య పోస్ట్)ఓసారి షూటింగ్లో విజయ్‌ని కలిసిన సంగీత.. కొన్ని గంటలపాటు మాట్లాడింది. కాసేపు మాట్లాడుకున్నది కాస్త డిన్నర్ డేట్ వరకు వెళ్లింది. తర్వాత దాదాపు మూడేళ్ల పాటు విజయ్-సంగీత డేటింగ్ చేసుకున్నారు. అలా కొన్నాళ్ల తర్వాత సంగీత తల్లిదండ్రులని విజయ్ కలవడం, వాళ్లకు ఇతడు నచ్చడంతో పెళ్లికి అంగీకారం తెలిపారు. అలా 1999లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక జరిగింది. తర్వాత జేసన్, దివ్య అని ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.హీరోగా విజయ్.. ఇన్నేళ్ల పాటు తన క్రేజ్ అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకుంటున్నాడు. మరోవైపు సంగీత కూడా రూ.400 కోట్లకు ఆస్తిపరురాలని కొన్ని ఆర్టికల్స్‌లో ప్రస్తావించారు. అలా భర్త ఎంత సెలబ్రిటీ అయినా సరే మీడియా అటెన్షన్ పడకుండా లో-ప్రొఫైల్ మెంటైన్ చేయడం అంటే విచిత్రమనే చెప్పాలి.(ఇదీ చదవండి: చిరంజీవి లుక్‌లో VFX లేదు.. 95% ఒరిజినల్: అనిల్ రావిపూడి) -
సింహం ఎప్పుడూ సింహమే
సాక్షి, చెన్నై: సింహం ఎప్పటికీ సింహంగానే ఉంటుందని నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ, డీఎంకేలతో ఎన్నికల పొత్తు పెట్టుకోబోమని, ఆ రెండు పార్టీలు తమకు బద్ధ శత్రువులని విమర్శించారు. ఆత్మగౌరవంతోనే ముందుకు సాగుతామన్నారు. తమిళనాడులోని మదురైలో గురువారం జరిగిన పార్టీ రెండో మహాసభకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మద్దతు కూడగట్టుకోవడమే లక్ష్యంగా ఏర్పాటైన ఈ సభలో ఆయన ప్రసంగించారు. తమ రాజకీయ శత్రువు డీఎంకే కాగా, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని పేర్కొన్నారు. టీవీకే ఎవరికీ భయపడదు, మాఫియా వ్యాపారాలు చేయదు అని వ్యాఖ్యానించారు. తమిళనాడు బలం మొత్తం మనతోనే ఉంది. ఫాసిస్ట్ బీజేపీ, విషపూరిత డీఎంకేకి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘సింహం ఎప్పుడూ ప్రత్యేకమే. దాని గర్జన 8 కిలోమీటర్ల మేర ప్రతిధ్వనిస్తుంది. వేటకు మాత్రమే బయటకు వస్తుంది. అడవిలో నక్కలు చాలానే ఉంటాయి. సింహం మాత్రం ఒక్కటే. అదే అడవికి రాజు. ఇదే మా స్పష్టమైన ప్రకటన’అని విజయ్ పేర్కొన్నారు.మిస్టర్ పీఎం మోదీజీ.. సీఎం స్టాలిన్ అంకుల్!మిస్టర్ నరేంద్ర దామోదర దాస్ మోదీ జీ అంటూ అని సంబోధించిన విజయ్..తమిళనాడు ప్రజల ఆకాంక్షలను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. అరెస్టయిన తమిళ జాలర్లను విడిపించాలి..కచ్ఛతీవును తిరిగి స్వాధీనం చేసుకోవాలి, నీట్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్లు వినిపించారు. బీజేపీది బానిసల కూటమి అని విమర్శలు ఎక్కుబెట్టారు. ఆర్ఎస్ఎస్కు బీజేపీ బానిస అని, బీజేపీకి అనేక రాష్ట్ర పార్టీలు బానిసలుగా మారి మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఆ బానిసలలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ టీవీకే ఉండబోదని స్పష్టం చేశారు. అదేవిధంగా, మైడియర్ అంకుల్ అంటూ సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి విమర్శలను ఎక్కుపెట్టారు. మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇస్తే సరిపోతుందా? వాళ్ల రోదనలు వినిపించడం లేదా? పరంధుర్ ఎయిర్‌పోర్టుతో భూములు కోల్పోయిన రైతులు, మత్స్యకారుల ఆవేదన ఆలకించారా? మనస్సాక్షి ఉంటే సమాధానం ఇవ్వండని సవాల్ విసిరారు. మైడియర్ అంకుల్ వినిపిస్తుందా ప్రజా గళం? త్వరలో ప్రజల్లోకి వెళ్తున్నా. మనస్సు విప్పి మాట్లాడుతా..ఇక తమరికి నిద్ర కరువైనట్టే అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలలో తానే అభ్యర్థి అని, తనను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
రెండేళ్లల్లో ఆరు సినిమాలు
‘భలే మంచిరోజు’ (2015) చిత్రంతో 70ఎంఎం ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ ఆరంభించి, తొలి చిత్రంతోనే అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. ఆ తర్వాత ‘ఆనందో బ్రహ్మ’ (2017), ‘యాత్ర’ (2019), ‘శ్రీదేవి సోడా సెంటర్’ (2021) వంటి చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు ఒకేసారి ఆరు చిత్రాలకు శ్రీకారం చుట్టారు.ఆదివారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ – ‘‘మేం ఎప్పుడూ క్వాలిటీ కంటెంట్‌కే ప్రాధాన్యం ఇస్తాం. ఈ ఆరు సినిమాలకూ అదే ఫాలో అవుతున్నాం. వేరువేరు జానర్స్‌లో ఈ సినిమాలు ఉంటాయి. వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా రూపొందించి, విడుదల చేస్తాం. ఇతర వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
దులీప్ ట్రోఫీకి విజయ్ ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: టెక్కలికి చెందిన క్రికెటర్ త్రిపురాన విజయ్ మరో మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీలో మెరవనున్నాడు. ఈ పోటీలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. జిల్లా నుంచి దులీప్ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి జిల్లా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌత్‌జోన్ జట్టుకు ఆంధ్రా నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపిక కాగా.. అందులో విశాఖకు చెందిన రిక్కీబుయ్ ఒకరు కాగా.. మరొకరు త్రిపురాన విజయ్ కావడం గమనార్హం.2023–24 సీజన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో 26 వికెట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రంజీ మ్యాచ్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దులీప్ ట్రోఫీకి ఎంపికై నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్ తాజాగా ఏపీఎల్ నాల్గో సీజన్లో రికార్డు స్థాయిలో రూ. 7.55 లక్షలు దక్కించుకున్నాడు. రైటార్మ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్, మిడిలార్డర్ బ్యాటింగ్‌తోపాటు బెస్ట్ ఫీల్డర్‌గా రాణిస్తున్నాడు. విజయ్ తల్లిదండ్రులు వెంకటకృష్ణరాజు, లావణ్య టెక్కలిలోని అయ్యప్పనగర్ కాలనీలో నివాసం ఉంటారు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. విజయ్ ప్రస్తుతం టెక్కలిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.చాలా సంతోషంగా ఉందిదులీప్ ట్రోఫీకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నిలకడగా రాణించి జట్టు విజయాల్లో భాగస్వామ్యం అవుతాను. త్వరలో జరగనున్న ఏపీఎల్‌లో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, కోచ్‌లు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు.– త్రిపురాన విజయ్, క్రికెటర్ -
మార్నింగ్ వాక్.. మధ్యాహ్నానికి ఎన్టీయేతో కటీఫ్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ(జులై 31, 2025) కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం (OPS) ఎన్డీయే కూటమికి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కలిసిన ఫొటో ఒకటి వైరల్ అయిన కాసేపటికే ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. ఈ ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మార్నింగ్ వాక్‌లో కనిపించిన ఓపీఎస్.. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కాసేపటికే ఆయన వర్గం నుంచి కీలక ప్రకటన వెలువడింది. తమ వర్గం ఎన్డీయే కూటమి నుంచి తెగదెంపులు చేసుకుందని, ఇక ఆ కూటమితో కలిసి నడిచేది లేదని మాజీ మంత్రి, ఓపీఎస్ నమ్మిన బంటు పానుర్తి రామచంద్రన్ గురువారం మధ్యాహ్నాం ప్రకటించారు. ఆ సమయంలో ఓపీఎస్ పక్కనే ఉండడం గమనార్హం. అయితే.. భవిష్యత్తులో ఏ పార్టీతో కలిసి నడుస్తారనేదానిపై ఆయన వర్గం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి ఏ పార్టీతోనూ పొత్తు అనుకోవడం లేదు.ఎన్నికలు సమీపించే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం అని ప్రకటించారాయన.అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న పన్నీర్ సెల్వం.. ఎడప్పాడి కె పళని స్వామితో పొరపచ్చాలతో సొంత వర్గం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తమదే అసలైన అన్నాడీఎంకే వర్గంగా ప్రకటించుకున్న పళనిస్వామి.. ఓపీఎస్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో బహిష్కృత నేతగానే ఓపీఎస్ రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో 2026 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన వర్గాన్ని సైతం బీజేపీ దగ్గరకు తీసుకుంది. అయితే.. ఈ మధ్య జరిగిన పరిణామాలతో నొచ్చుకున్న ఆయన ఎన్టీయేకు కటీఫ్ చెప్పారు.కారణం అదే..గంగైకొండ చోళపురం పర్యటనలో ప్రధాని మోదీతో ప్రత్యేక భేటీకి ఓపీఎస్ ప్రయత్నించారు. అయితే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. తనకు ఆ మాత్రం ప్రాధాన్యం లేదా? రగిలిపోయారాయన. ఆ వెంటనే.. సర్వ శిక్షా అభియాన్ నిధుల జాప్యంపై ఆయన కేంద్రంపై విమర్శలు గుప్పించారు కూడా. ఇలా వరుస పరిణామాల తర్వాతే ఆయన ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు ఆయన మద్ధతు ఇస్తారంటూ గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈలోపే ఆయన డీఎంకే అధినేతతో కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది ఇప్పుడు. విజయ్ పార్టీనా? స్టాలిన్ డీఎంకేనా? అనే ఛాయిస్‌ను బట్టి ఓపీఎస్‌ను అన్నాడీఎంకే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.బలం పెంచుకునే యోచనలో ఓపీఎస్ ఓపీఎస్ వర్గంలో దక్షిణ తమిళనాడు ప్రాంతానికి చెందిన బలమైన నేతలే ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆ వర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. వీళ్లలో వీసీ ఆరుకుట్టి ఇప్పటికే పళనిస్వామి వర్గం వైపుళ్లిపోయారు. ఓపీఎస్ కొడుకు రవీంద్రనాథ్ కూడా విజయ్ టీవీకేతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన మరికొందరిని ఆ పార్టీలోకి తీసుకెళ్తారని ఊహాగానాలు వినవస్తున్నాయి. అదే సమయంలో.. మాజీ సీఎం జయలలితకు సన్నిహితురాలైన శశికళతో పాటు టీటీవీ దినకరన్‌ను తన వర్గంలోకి చేర్చుకోవాలని ఓపీఎస్ ఉవ్విళ్లూరుతున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన మదురైలో మహానాడు నిర్వహించి తన బలం నిరూపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో.. సొంత పార్టీ ప్రకటన చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
తమిళగ వెట్రి కళగం నేత, సినీ నటుడు విజయ్ నివాసంతో పాటు సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపై చెన్నై విమానాశ్రయంలో కూడా బాంబులు ఉన్నట్టుగా బెదిరింపుల కాల్స్ వచ్చాయి. దీంతో తమిళనాడు పోలీసులు పరుగులు తీశారు. సీఎం స్టాలిన్, విజయ్ నివాసాలతో పాటు విమానశ్రయం వద్ద సెక్యూరిటీ పెంచారు. భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. అయితే, వారికి వచ్చింది తప్పుడు సమాచారం అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.విజయ్ నివాసం పరిసరాలలో, సీఎం నివాసం పరిసరాలలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. విమానాశ్రయంలో సోదాల అనంతరం భద్రతను పెంచారు. ఇప్పటికే విమానాశ్రయానికి పలుమార్లు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం మరింత నిఘాతో వ్యవహరిస్తున్నారు. హీరో విజయ్‌కు ఇప్పటికే రెండుసార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అజిత్, రజనీకాంత్ వంటి స్టార్స్ కూడా గతంలో ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు. ప్రస్తుత నేపంథ్యంలో వచ్చిన సమాచారంపై తమిళనాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
కమిషనర్ రాకపోతే.. డీజీపీని రప్పిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: ‘విచారణకు పోలీసు కమిషనర్ కదా హాజరు కావాల్సింది? ఏసీపీ గారూ మీరెందుకు వచ్చారు? అధికారులకు ఈమాత్రం తెలియదా?’అని సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. 15 రోజుల్లో సైబరాబాద్ పోలీసు కమిషనర్ విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఒకవేళ ఆయన హాజరు కాకపోతే తదుపరి విచారణ తేదీకి రాష్ట్ర డీజీపీని రప్పిస్తామని హెచ్చరించింది. సినీ నటుడు విజయ్ దేవరకొండ గిరిజనులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై విచారణ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఈ హెచ్చరిక చేశారు. ఏప్రిల్ 26న రెట్రో సినిమా వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. భారత్, పాక్ మధ్య సమస్యను ప్రస్తావించే క్రమంలో గిరిజనులను కించపర్చే అర్థం వచ్చేలా పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అశోక్ కుమార్ రాథోడ్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయటంతో కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ బుధవారం విచారణ చేపట్టారు. విచారణకు పోలీస్ కమిషనర్ కాకుండా మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ హాజరు కావటంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లక్షల మందిని ప్రభావితం చేసే ఒక నటుడు ఒక వర్గాన్ని కించపర్చేలా ఎలా మాట్లాడతారు? ఆయన వ్యాఖ్యలపై మీరు కేసు నమోదు చేశారు బాగానే ఉంది. ఈ రోజు (బుధవారం) విచారణకు పోలీసు కమిషనర్ హాజరు కావాలని మేం నోటీసులు ఇచ్చాం కదా? ఆయన కదా హాజరు కావాల్సింది? మీరెందుకు వచ్చారు?’అని నిలదీశారు. మరో 15 రోజుల్లో విచారణకు కమిషనర్ హాజరై హీరో విజయ్ దేవరకొండపై తీసుకున్న చర్యలను వివరించాలని ఆదేశించారు. ఆ రోజు కమిషనర్ రాకపోతే డీజీపీని రప్పిస్తామని హెచ్చరించారు. -
రాజకీయాల్లోకి కీర్తి సురేష్.. ఆ పార్టీలో చేరనుందా?
సినీ కథానాయికలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో చెప్పడం సాధ్యం కాదు. నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. బాలనటిగా రంగప్రవేశం చేసిన ఈమె ఒక సమయంలో ఫ్యాషన్ డిజైనర్ కావాలని ఆశ పడ్డారట. ఓ భేటీలో తన ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయితే కథానాయికిగా రంగ ప్రవేశం చేసి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఇదు ఎన్నమాయం చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ తొలి చిత్రం ఆశించిన విజయాన్ని అందించింది. ఆ తరువాత నటించిన చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్‌కు చేరుకున్నారు. అలాగే తెలుగులో మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ ప్రేక్షకులను బేబీ జాన్ చిత్రంతో పలకరించారు. అలాగే తన 15 ఏళ్ల స్నేహితుడిని గత ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఇల్లాలుగా మారారు. ఆ కారణం చేతనో, వరుస అపజయాల కారణంగానో కీర్తి సురేష్‌కు అవకాశాలు తగ్గాయి. వివాహానంతరం ఈ బ్యూటీ కొత్త చిత్రం ఏదీ చేయలేదు. అంతకు ముందు నటించిన ఉప్పు కారం అనే చిత్రం ఇటీవలే ఓటీటీలో విడుదల అయ్యింది.సినిమా అవకాశాలు తగ్గినా కమర్షియల్‌గా నటిస్తూ బిజీగానే ఉన్నారు. కాగా ఇటీవల ఈమె మదురైలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ ఆమెను చూడగానే కొందరు అభిమానులు టీవీకే..టీవీకే అంటూ నటుడు విజయ్ పార్టీ పేరు చెబుతూ కేకలు పెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. కీర్తిసురేష్ నటుడు విజయ్‌కు జంటగా రెండు చిత్రాల్లో నటించారు. దీంతో కీర్తి సురేష్ నటుడు విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీలో చేయబోతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అయ్యింది. దీనిపై కీర్తి సురేష్ స్పందించలేదు. దీంతో ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, విజయ్ పార్టీలో చేరడానికి సిద్ధం అవుతున్నారని ప్రచారం జోరందుకుంది. అందుకే విజయ్ అభిమానులు ఆమెను చూడగానే టీవీకే అంటూ కేకలు పెట్టారు. మరి నటి కీర్తి సురేష్ నిర్ణయం ఏమిటో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. -
కోలీవుడ్ స్టార్ విజయ్ను చూసి మన తెలుగు హీరోలు నేర్చుకోవాలి
తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay)ను చూసి మన తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju). విజయ్ను ఇక్కడి హీరోలు ఫాలో అయిపోతే నిర్మాతలకు చాలా ఖర్చు తగ్గుతుందని చెప్తున్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. విజయ్‌గారు చాలా స్ట్రయిట్ ఫార్వర్డ్. తను పక్కాగా కొన్ని డేట్స్ ఇచ్చి.. అందులోనే సినిమా పూర్తి చేయాలని చెప్తాడు. షూటింగ్ ఎప్పుడు మొదలుపెడుతున్నారు? ఎప్పటివరకు పూర్తి చేస్తారు? అని ముందే అడిగి తెలుసుకుంటాడు.ప్రతి హీరో పాటిస్తే..నెలలో 20 రోజులు షూటింగ్‌కు కేటాయించేవాడు. అలా ఆరు నెలలపాటు డేట్స్ ఇచ్చాడు. వారసుడు సినిమాకుగానూ నాకు 120 రోజులు డేట్స్ ఇచ్చాడు. అందులోనే సినిమా కంప్లీట్ చేశాం. ఈ రూల్ ప్రతి హీరో పాటిస్తే నిర్మాతకు అది సువర్ణావకాశం అవుతుంది. ప్రతి హీరో ఆరునెలల్లో ఎన్ని రోజులు డేట్స్ ఇస్తారో ముందే నిర్ణయించుకుని, అందులోనే మూవీ పూర్తి చేసుకోవాలని చెప్పేస్తే అందరిపై ఒత్తిడి ఉంటుంది. సమయానికి సినిమా అయిపోవాలని నిర్మాత, టెక్నీషియన్స్, దర్శకుడు.. ఇలా అందరూ ఎక్కువ కష్టపడతారు. ప్రీ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం తీసుకుని ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తారు. కానీ, ఈ విధానం మన దగ్గర పూర్తిగా కనుమరుగైపోయింది.ఖర్చులు తడిసిమోపెడుఆ సిస్టమ్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను. నాతో కలిసి వర్క్ చేయబోయే హీరోలను కూర్చోబెట్టుకుని డేట్స్ కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోమంటున్నాను. ప్రతి నెలలో 20 రోజులు నాకు ఇచ్చేయమని చెప్తున్నాను. విజయ్, నితిన్‌లకు అదే చెప్పాను. లేదంటే ఏడాదిలో తీయాల్సిన మూవీ రెండేళ్లలో పూర్తయ్యేసరికి ఖర్చులు రెట్టింపవుతున్నాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు, ప్రొడక్షన్ టీమ్‌కు ఇచ్చే జీతాలు.. ఇలా అన్నీ తడిసిమోపెడవుతున్నాయి. ఈ పద్ధతి మారాలంటే అది హీరోల చేతిలోనే ఉంది. వారు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలి అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.చదవండి: తెలుగువాళ్లు అస్సలు తగ్గేదేలే.. పుష్ప డైలాగ్స్‌తో అదరగొట్టిన బన్నీ -
టీవీకే సీఎం అభ్యర్థిగా నటుడు విజయ్
తమిళగ వెట్రి కళగం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్(Joseph Vijay Chandrasekhar) పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం ఉదయం చెన్నైలోని పార్టీ ప్రధానకార్యాలయంలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో విజయ్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకుంది టీవీకే కార్యవర్గం. అలాగే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అంతేకాదు పలు కీలక తీర్మానాలను ఆమోదించారు. ‘‘బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ విష రాజకీయాలు తమిళనాడులో చెల్లవు. ఈ ఎన్నికల్లో వేర్పాటువాదులతో పొత్తు ఉండదు’’:::విజయ్ వచ్చే నెలలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని, అటుపై ఎన్నికల దాకా గ్రామగ్రామాన బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. విజయ్ను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు అవసరమయ్యే కార్యాచరణను సిద్ధం చేయడానికి, దానిని అమలు చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీవీకే భావిస్తోంది.అంతేకాదు.. తాజాగా అమిత్ షా చేసిన ఆంగ్ల భాష కామెంట్లు.. తమిళనాడుపై నేరుగా చేసిన దాడిగా టీవీకే పేర్కొంటూ ఖండించింది. బలవంతంగా హిందీని, సంస్కృత భాషను తమిళనాడులో ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తీర్మానంలో టీవీకే స్పష్టం చేసింది. అలాగే.. ఎలక్టోరల్ రివిజన్ చేపట్టాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీవీకే తప్పుబట్టింది. ఇది బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ప్రయత్నమేనని, రాష్ట్రంలో మైనారిటీల ఓట్లను తగ్గించే ప్రయత్నమేనని ఆరోపించింది. భారత సినీ పరిశ్రమలో అగ్రహీరోగా కొనసాగుతున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళనాట మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా.. 2024 ఫిబ్రవరి 2వ తేదీన సెక్యులర్ సోషియల్ జస్టిస్ అనే సిద్దాంతంతో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని విజయ్ ప్రకటించారు. అదే ఏడాది అక్టోబర్ 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో తొలి రాజకీయ మహాసభ నిర్వహించగా.. అది సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ మహాసభ వేదికగా.. తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రకటించారాయాన. పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, వేలు నాచియార్ తదితరుల ఆశయాలపై నడుస్తానని స్పష్టం చేశారు. అప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. నీట్, జాతీయ నూతన విద్యా విధానం.. త్రిభాషా సిద్ధాంతం అమలు లాంటి అంశాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందిస్తూ రాజకీయంగానూ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. -
‘ఎంత నరకం అనుభవించాడో..’! పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు
తమిళనాడులో సంచలనం రేపిన అజిత్ కుమార్ (29) కస్టడీ డెత్(Custodial Death) కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. అందులో విచారణ పేరుతో అజిత్‌ను పోలీసులు ఎంతగా చిత్రహింసలకు గురి చేసి చావుకి కారణం అయ్యారో తేటతెల్లమైంది.తమిళనాట సంచలనం సృష్టించిన అజిత్ కుమార్ కేసు పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. భౌతికంగా అతనిపై పదే పదే అత్యంత పాశవికంగా పోలీసులు దాడి చేయడం వల్ల ముఖ్య అవయవాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బల ధాటికి అంతర్గతంగా రక్తస్రావం జరిగి అజిత్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఇండియాటుడే కథనం ప్రకారం.. అజిత్ కుమార్ మృతదేహంపై 44 గాయాలు ఉన్నాయి. అందులో 30 చోట్ల కండరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. గుండె, కాలేయంలో పెటెచియల్ హీమరేజ్‌లు (చిన్న రక్తస్రావ మచ్చలు) కనిపించాయి. ఇవి సాధారణంగా యాక్సిడెంట్లలో, ఉద్దేశపూర్వకంగా కొట్టిన సందర్భాల్లోనూ కనిపించవట. అలాంటిది.. అజిత్ ఒంట్లో ఈ మచ్చలు కనిపిస్తున్నాయంటే పోలీసులు ఎంతంగా హింసించారో అర్థవుతోంది.అలాగే బాటన్లు, రాడ్లు, కర్రలతో తల, ఇతర భాాగాలపై పదే పదే కొట్టడం వల్ల అజిత్‌కు బలంగా గాయాలయ్యాయి. మెదడుతో పాటు అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తల చర్మం కింద గాయాలు (సబ్‌స్కాల్ప్ కంట్యూషన్స్), పుర్రెపై నీలిమచ్చలు (ఎక్కైమోసిస్), అలాగే రెండు సెరిబ్రల్ లోబుల్లో రక్తస్రావం (హీమరేజ్) అయ్యింది. కళ్లు, ముక్కు, నోరు, చెవులు, ప్రైవేట్ భాగాల్లో కారం చల్లినట్లు ఆనవాలు లభించాయి. ఈ పోస్టుమార్టం నివేదికను బట్టి అజిత్ కుమార్‌ను పోలీసులు ఉద్దేశపూర్వకంగా.. అత్యంత క్రూరంగా హింసించారో స్పష్టమవుతోందని నివేదిక పేర్కొంది. ఏం జరిగిందంటే.. తమిళనాడు శివగంగై జిల్లా తిరుప్పువనం సమీపం మడపురంలోని ప్రసిద్ధ భద్రకాళియమ్మన్ ఆలయానికి జూన్ 27న వచ్చిన ఇద్దరు మహిళా భక్తులు.. కారులో ఉంచిన తమ నగలు, డబ్బు కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆలయంలో వెళ్లే ముందు కారు తాళాలను ఆలయ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న అజిత్‌కుమార్(27)కి ఇచ్చామని, అతని మీదే అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు విచారణ పేరుతో అతన్ని పిలిపించుకుని ప్రశ్నించి వదిలేశారు. ఆ మరుసటిరోజు కూడా రమ్మని చెప్పి.. పీఎస్‌కు కాకుండా రహస్య ప్రాంతానికి తరలించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో తానే దొంగించానని అజిత్ అబద్ధం చెప్పాడు. నగలు ఎక్కడ దాచానో చూపించానని ఆలయానికి తీసుకెళ్లి.. అక్కడ పోలీసుల కాళ్ల మీద పడి తాను తప్పు చేయలేదని, వదిలేయాలని వేడుకున్నాడు. కానీ, పోలీసులు అతన్ని మళ్లీ టార్చర్ చేశారు. అజిత్ అపస్మారక స్థితిలోకి జారుకోగా.. చెన్నై ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.బాధిత కుటుంబాన్ని ఓదార్చిన విజయ్ఈ ఘటన ప్రజాగ్రహానికి కారణమైంది. ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడం కలకలం రేపింది. నెట్టింట ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అజిత్ కుమార్ కస్టడీ మృతి కేసు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. ప్రతిపక్షాలు, సామాజిక కార్యకర్తలు, సినీ ప్రముఖులు కూడా ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి: “ఇది స్టాలిన్ పాలనలో పోలీసు అరాచకానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్.. ఈ కేసును జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి ఓదార్చారాయన. మరోవైపు శివగంగై ఉదంతంపై నిరసనకు టీవీకే పార్టీకి పోలీసులు అనుమతించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది ఆ పార్టీ. ఈ ఘటన ఇటు తమిళనాడుతో పాటు అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేసు తీవ్రత దృష్ట్యా CB-CID నుంచి CBIకి బదిలీ చేశారు. పోలీసుల చర్య క్షమించరానిదని పేర్కొన్న ముఖ్యమంత్రి స్టాలిన్ (MK Stalin).. దర్యాప్తులో ఎటువంటి సందేహాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అజిత్ కుటుంబానికి ₹50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి మంజూరు చేశారు. ఈ ఘటనపై జులై 8వ తేదీ లోపు నివేదిక ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రమే తన పౌరుడిని చంపింది అని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. నాకు భద్రత ఇవ్వండిఅజిత్ కుమార్‌ను ఆలయానికి తీసుకెళ్లిన సమయంలో పోలీసులు జరిపిన దాడిని అక్కడి ఉద్యోగి శక్తీశ్వరన్ రహస్యంగా చిత్రీకరించాడు. ఆ వీడియోనే విపరీతంగా వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ కేసులో ఉన్న ఏకైక ప్రత్యక్ష సాక్షి కూడా ఆ ఉద్యోగినే. దీంతో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. తనకు భద్రత కల్పించాలని కోరుతున్నారాయన. అరెస్టైన పోలీసుల్లో ఒకరు గుండాలతో, రౌడీ షీటర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడని, అతని నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ శక్తీశ్వరన్ డీజీపీకి లేఖ రాశారు.#Shocking A video has surfaced showing police attacking Ajith Kumar, a youth from Sivaganga. The police's First Information Report (FIR) claimed that Ajith died due to epilepsy and injuries sustained from a fall. #AjithkumarMysteryDeath #CustodyDeath @TheFederal_News pic.twitter.com/otW1AicDGZ— Mahalingam Ponnusamy (@mahajournalist) July 1, 2025 -
స్టార్ హీరోతో రిలేషన్ .. ప్రేమపై త్రిష పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రేమలో ఉన్నారనే రూమర్ గత కొంతకాలంగా అటు కోలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇద్దరు ప్రత్యేక్షంగా స్పందించకపోవడం.. కెరీర్ పరంగా బీజీ కావడంతో ఇటీవల అలాంటి పుకార్లు పెద్దగా రాలేదు.కానీ తాజాగా విజయ్ బర్త్‌డే రోజు త్రిష అతని ఫోటో షేర్ చేస్తూ విషెస్ చెప్పడం.. అదే ఫోటోకి త్రిష తల్లి లవ్ సింబల్ జోడించడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్త మరోసారి వైరల్ అయింది.తాజాగా ఈ పుకార్లపై త్రిష పరోక్షంగా స్పందించింది. ‘పూర్తిగా ప్రేమలో మునిగిపోతే..అది కొందరిని తిగమక చేస్తుంది’ అనే కొటేషన్‌ని త్రిష తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం త్రిష పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌తో ప్రేమను కన్ఫర్మ్ చేసిందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా త్రిష వయసు ప్రస్తుతం 42 ఏళ్లు. ఆమె పెళ్లిపై గతంలోనూ పలు రూమర్స్ వచ్చినా.. త్రిష వాటిని కొట్టి పారేసింది. మొత్తానికి 42 ఏళ్ల తర్వాత తన ప్రేమ విషయాన్ని చెప్పేసిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.త్రిష కెరీర్ విషయానికొస్తే. ఇటీవల థగ్‌లైఫ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్‌కి జోడీగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. సూర్య ‘కరుప్పు’ చిత్రంలో కూడా త్రిషనే హీరోయిన్గా తీసుకున్నారు. విజయ్ విషయానికొస్తే.. తన చివరి చిత్రం ‘జననాయకుడు’ (జన నాయగన్)తో ప్రేక్షకులను అలరించనున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ విజయ్ జన్మదినం రోజున విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
జన నాయగణ్ విజయ్ చివరి చిత్రం కాదా? మమిత ఏమందంటే?
స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జన నాయగన్ (Jana Nayagan Movie). ఇదే ఆయన చివరి చిత్రమని, దీని తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితమవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అది అబద్ధమయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. జన నాయగన్.. విజయ్ ఆఖరి సినిమానా? అని అందరి మనసులో ఉన్న ప్రశ్నని హీరోయిన్ మమితా బైజు నేరుగా దళపతినే అడిగేసింది. భావోద్వేగం..అందుకాయన 2026లో జరిగే ఎన్నికలపై ఆధారపడి ఉంటుందని చెప్పారంది. సినిమా షూటింగ్ అంతా సరదాగా గడిచినా.. చిత్రీకరణ చివరి రోజు మాత్రం విజయ్ సహా అందరూ భావోద్వేగానికి లోనయ్యారట! అందుకనే విజయ్ టీమ్‌తో కలిసి సరిగా ఫోటోలు కూడా దిగలేకపోయారని చెప్తోంది మమితా (Mamitha Baiju). జన నాయగన్ సినిమా విషయానికి వస్తే.. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష -
త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?
తమిళ హీరో విజయ్, హీరోయిన్ త్రిష గురించి ఏడాది క్రితం కొన్ని రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరూ ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలో ఒక్కటయ్యే అవకాశాలున్నాయని కాస్త గట్టిగానే తమిళ మీడియాలో వినిపించింది. తర్వాత కొన్నిరోజులకు అంతా సైలెంట్ అయిపోయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్రిష పెట్టిన ఫొటోనే అందుకు కారణం.దళపతి విజయ్.. ఆదివారం పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు ఆయనకు విష్ చేశారు. కీర్తి సురేశ్ కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్ చెబుతూ ఇన్ స్టాలో స్టోరీ పెట్టింది. అయితే త్రిష మాత్రం 'హ్యాపీ బర్త్ డే టూ బెస్టెస్ట్' అని క్యాప్షన్ పెట్టి, విజయ్ తన పెట్ డాగ్‌తో ఆడుతుండగా, తాను పక్కనే కూర్చుని ఉన్న ఫొటోని త్రిష పోస్ట్ చేసింది. దీంతో అభిమానులకు మరోసారి సందేహాలు మొదలయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)ఈ ఫొటో చూస్తే విజయ్.. త్రిష ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇది ఇప్పటి ఫొటోనా? పాత ఫొటోనా అనేది క్లారిటీ లేదు. కానీ అభిమానులు మాత్రం వీళ్లు ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కెరీర్ విషయానికొస్తే.. విజయ్ 'జన నాయగణ్' మూవీ చేస్తున్నాడు. ఇదే ఇతడికి చివరిది. ఎందుకంటే ఇప్పటికీ రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనుంది.త్రిష విషయానికొస్తే.. 40 ఏళ్లు దాటేసినా సరే పెళ్లి చేసుకోలేదు. గతంలో ఓసారి పెళ్లి వరకు వెళ్లింది గానీ ఎందుకో అది రద్దయిపోయింది. ఇక ఈమె పని అయిపోయింది అనుకునే టైంలో '96' మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చింది. తర్వాత 'పొన్నియిన్ సెల్వన్' రెండు పార్ట్స్, లియో లాంటి క్రేజీ సినిమాలు చేసింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున)Happy Birthday bestest🤗🧿 pic.twitter.com/K4JFdIZXjn— Trish (@trishtrashers) June 22, 2025 -
బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా అతడి చివరి సినిమా నుంచి సర్ప్రైజ్ వచ్చింది. అర్థరాత్రి 12 గంటలకు ఫస్ట్ రోర్ పేరిట 'జన నాయగణ్' నుంచి వీడియో రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ పోలీస్‌గా కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియోకు ఇతడి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎప్పటిలానే అనిరుధ్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు!)బయటకు చెప్పలేదు గానీ 'జన నాయగణ్' సినిమా 'భగవంత్ కేసరి' అనే తెలుగు సినిమాకు రీమేక్. గతంలో పలు అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు పోలీస్ గెటప్‌లో ఉన్న వీడియో రిలీజ్ చేయడంతో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్, మిగతా కంటెంట్ వస్తే గనుక రీమేక్ కాదా అనేది కన్ఫర్మ్ అయిపోతుంది.హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఈమె షూటింగ్ రీసెంట్‌గానే పూర్తయింది. మలయాళ బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుందని అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే రాజకీయాల్లకి అడుగుపెట్టిన విజయ్‌కి ఇదే చివరి చిత్రం కావడంతో అటు అంచనాలు గట్టిగానే ఉన్నాయి.(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు) -
'రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప'
నటుడు విజయ్ రాజకీయ పార్టీని నెలకొల్పి 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈనెల 22న విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇప్పటి నుంచే ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవేడుకలో పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.అప్పు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2026లో విజయ్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు. తమిళగ వెట్రి కళగం పార్టీకి తమిళ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 365రోజులు తమ తలైవన్ పుట్టినరోజును వేడుకను జరుపుకునే ఒకే ఒక్క పార్టీ తమిళగ వెట్రి కళగం అని ఆయన అన్నారు.రజనీకాంత్ కంటే విజయ్ ఎందులో గొప్ప: వేల్మురుగన్ఇదిలా ఉంటే తమిళ వాళ్ ఉరిమై పార్టీకి చెందిన వేల్మురుగన్ విజయ్‌పై విమర్శల దాడి చేశారు. ఒక వేడుకలో ఆయన మాట్లాడుతూ కరుణానిది పాలనలో పోరాడి, వాదాడి రాష్ట్రంలో 36 మెడికల్ కళాశాలను తీసుకొచ్చింది తానేనన్నారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన నటులు తమిళ సమాజానికి చేసిందేమిటని ప్రశ్నించారు. ఒక నటుడు (విజయ్) 10,12వ తరగతి విద్యార్థులను అభినందించడానికి మాత్రమే సమావేశాలు నిర్వహిస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, విజయకాంత్‌ల కంటే విజయ్ ఏమైనా గొప్పా అంటూ ఫైర్ అయ్యారు. చిన్న నటుడు బాలా కూడా తాను స్వయంగా సంపాదించిన డబ్బును పేదలకు సాయం చేస్తున్నారని, రాఘవ లార్సెన్ తాను సంపాదించిన మొత్తంలో వృద్ధులు, వికలాంగుల కోసం ఆశ్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈయన మాత్రం సమావేశాలు మాత్రమే నిర్వహిస్తున్నారని ధ్వజం మెత్తారు. -
విందులో విజయ్ ఎమోషనల్.. ఇక గుడ్‌బై
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పేరు వింటే చాలు తమిళనాడు ఊగిపోతుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ పేరు సినిమా రంగంలో ట్రెండింగ్‌లో ఉండకపోవచ్చు. ఎందుకంటే విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న చివరి చిత్రం జననాయకన్ అని తెలిసిందే. గతేడాదిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన విజయ్ రానున్న శాసనసభ ఎన్నికల్లో (2026) పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో జననాయకన్ తన చివరి చిత్రమని ఆయనే స్వయంగా ప్రకటించారు. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి గ్రిప్పింగ్స్ ఇప్పటికే విడుదలై చిత్ర అంచనాలను పెంచేశాయి. కాగా జననాయకన్ చిత్ర టీజర్‌ను విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈనెల 22న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో విజయ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా చిత్ర ఓటీటీ హక్కులను ఒక సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పొంగల్ సందర్భంగా జనవరి 2026లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా జననాయకన్ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ బిరియానీ విందును ఇచ్చిన విజయ్ భావోద్రేకానికి గురైనట్లు సమాచారం. అప్పట్లో రాజకీయ రంగప్రవేశం చేసిన ఎంజీఆర్ నటించిన చివరి చిత్రం మదురై మీట్ట సుందరపాండియన్. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. జననాయకన్ చిత్రం విజయ్ జీవితాన్ని ఎలా మారుస్తుందో అనే ఆసక్తి ఇరాన్ అభిమానుల్లో నెలకొంది. -
విద్యార్థులకు 'విజయ్' కానుకలు.. రాజకీయాలు వద్దంటూ సూచన
కోలీవుడ్ హీరో, తమిళగ వెట్రి కళగం నేత విజయ్ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా తమిళనాడు విద్యార్థులకు కానుకలు అందించారు. 2026 ఎన్నికల్లో మార్పు తథ్యమంటూ నినాదాలు హోరెత్తిస్తూనే.. చదువుకునే పిల్లలు రాజకీయ అంశాల గురించి తెలుసుకోవాలని చెప్పిన ఆయన తమ గోల్స్ పూర్తి అయ్యే వరకు వాటికి దూరంగా ఉండాలని వారించారు. ఇందుకు మహాబలిపురంలో మలివిడతగా జరిగిన విద్యా ప్రోత్సాహక కార్యక్రమం వేదికగా మారింది. పది, ప్లస్‌టూలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయ్ సత్కరిస్తూ, ప్రోత్సాహాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. మలివిడతగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో 75 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 500 మంది విద్యార్థులను సత్కరించి, ప్రోత్సాహాన్ని అందించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి సత్కరించడమే కాకుండా, వారితో గ్రూప్ ఫొటోలను విజయ్ దిగారు. అదే సమయంలో మైక్ అందుకున్న విద్యార్థులు విజయ్ తమలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల్లో విజయ్ రూపంలో మార్పు తథ్యమని నినదించారు. అదే సమయంలో మైక్ అందుకున్న విజయ్ రాజకీయాలు వద్దు, విద్యాపరంగా ముందుకెళ్దామని సూచించారు. విద్యార్థులెవరూ రాజకీయాలు మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. రాష్ట్ర స్థాయిలోని టాపర్లకు బంగారు ఉంగరాలను విజయ్ అందజేశారు. మలి విడతగా ఈనెల 13న మరో 71 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టాపర్లను విజయ్ సత్కరించేందుకు నిర్ణయించారు. -
'థగ్‌లైఫ్' కమల్ దెబ్బ.. జన నాయకన్ విజయ్‌కి తగిలింది
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్టు.. కమల్‌కి కన్నడిగులకు మధ్య నెలకొన్న వివాదం కాస్త.. దీనితో ఏ సంబంధం లేని తమిళ సినీ నటుడు విజయ్ మీద పడనుందా? అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. కన్నడ భాష మీద ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగి థగ్‌లైఫ్ సినిమాని నిషేధించాలనే వరకూ దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇరు పక్షాలూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో థగ్‌లైఫ్ సినిమా విడుదల అనంతరం పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.ఈ నేపధ్యంలో ఈ వివాదం అటు తిరిగి ఇటు తిరిగి తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్‌కు చుట్టుకోనుంది. రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టడానికి ముందుగా విజయ్ నటించిన చివరి సినిమా 'జన నాయకన్', ఇప్పుడు 'థగ్ లైఫ్' వివాదంతో ఇది పెనవేసుకుని పెను వివాదంలో చిక్కుకుంది. దీనికి కారణం జననాయకన్ చిత్రాన్ని నిర్మిస్తోంది బెంగళూరు కేంద్రంగా ఉన్న నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడమే.వచ్చే ఏడాది జనవరి 9న తమిళ పొంగల్ సందర్భంగా విడుదల కావల్సిన ఈ సినిమా.. విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికల సమరాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందింది. దీనిని సమయోచితంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వీరి ప్లాన్స్‌ను థగ్‌లైఫ్ దుమారం పెద్ద దెబ్బ కొట్టే ప్రమాదం కనిపిస్తోంది. థగ్ లైఫ్‌ని బ్యాన్ చేయాలనే ప్రచారం ఊపందుకోవడంతో పాటే సామాజిక మాధ్యమాల్లో 'బ్యాన్ జననాయకన్' అనే కొత్త క్యాంపెయిన్ మొదలైంది.థగ్ లైఫ్ సినిమాని కర్ణాటకలో నిషేధిస్తే, కన్నడ సినిమాలు తమిళనాడులో నిషేధించాలి. విజయ్ తన జననాయకన్ సినిమాని ఇక వదులుకోవాలి అంటూ ఎక్స్ వేదికగా రాజేష్ లింగేష్ అనే వ్యక్తి చేసిన ప్రకటనకు అనేక మంది మద్దతు తెలుపుతూ, జననాయకన్ కూడా బ్యాన్ చేయాలి అంటూ పోస్ట్‌లు చేస్తుండడం ఎక్కువైంది. తమిళ, కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషలలో విడుదల కానున్న జననాయకన్ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ పెట్టిన రాజకీయ పార్టీ తమిళక వెట్రి కజగం.. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పరిస్థితుల్లో... ఈ చిత్రం విడుదల, విజయం కూడా ఆ పార్టీకి చాలా కీలకం.దీంతో విజయ్ అభిమానులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సినిమాని విజయ్‌కు అత్యంత నమ్మకస్తుడైన జగదీష్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. కేవలం కన్నడ సంస్థ నిర్మిస్తున్నందుకు సినిమా నిషేధించడం న్యాయం కాదు. జననాయకన్ విడుదల కోసం భాషా బేధాలకు అతీతంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంటూ వారు అంటున్నారు. మరోవైపు విజయ్ రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఈ ప్రచారాన్ని ఎగదోస్తున్నారంటూ మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా నేడు థగ్‌లైఫ్.. కర్ణాటకలో ఎదుర్కోబోయే పరిస్థితులు రేపటి జననాయకన్ భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది సుస్పష్టం. -
'భగవంత్ కేసరి' రీమేక్.. ఆ ఒక్క సీన్ కోసం పట్టుబట్టిన విజయ్
‘భగవంత్ కేసరి’ని దళపతి విజయ్ వదిలిపెట్టలేదు. అంతలా ఈ చిత్రానికి ఆయన కనెక్ట్ అయ్యారు. బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘భగవంత్ కేసరి’. గతేడాదిలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను జననాయగన్ పేరుతో తమిళ్లో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇదే చివరి సినిమా అని కూడా తెలుస్తోంది. అయితే, ఈ రీమేక్ అంశం గురించి తాజాగా మరో కొత్త విషయం బయటకొచ్చింది.విజయ్ కొత్త సినిమా 'జన నాయగన్' కోసం ‘భగవంత్ కేసరి’లోని ఒక ముఖ్యమైన సన్నివేశానికి సంబంధించి హక్కులను పొందారట. ఈ సినిమాలో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' గురించి అందరికీ అవగాహన ఉండాలని బాలకృష్ణతో ఒక సన్నివేశం ఉంటుంది. దానిని చాలా చక్కగా అందరికీ అర్థం అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇప్పుడు అదే సీన్‌ను జన నాయగన్లో విజయ్ రీక్రియేట్ చేశాడని సమాచారం. ఈ సీన్ మాత్రమే రీమేక్ అని, మిగతాది అంతా భగవంత్ కేసరితో జన నాయగన్ సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన పలు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భయపడే ఒక అమ్మాయికి స్ఫూర్తినిచ్చి ఆమె జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే బాలయ్య పాత్ర ప్రేక్షకులందరికీ బాగా నచ్చుతుంది. అందుకే ఈ సినిమాపై విజయ్ ఆసక్తి చూపాడని తెలుస్తోంది. 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' సీన్ కోసం జగ నాయగన్ టీమ్ హక్కులు కూడా పొందిందని సమాచారం. అందుకోసం సుమారు రూ. 4 కోట్లు చెల్లించినట్లు టాక్. ఈ సీన్ మహిళలకు బాగా కనెక్ట్ అవుతుందని విజయ్ భావించాడట. పొలిటికల్‌గా కూడా తనకు కొంతమేరకు ఉపయోగపడొచ్చని తెలుస్తోంది.#JanaNayagan : Just to use a single episode, the makers have acquired the remake rights of #BhagavanthKesari film. Overall, there is no other connection between Jana Nayagan and Bhagavanth Kesari#JanaNayagan pic.twitter.com/sthnxzv4Q1— 𓃰TVK✘BALA𓃰 (@TvkSouthWing) May 19, 2025 -
తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
తమిళ పాలిటిక్స్.. పార్టీ నేతలకు విజయ్ కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: పార్టీ పరంగా కమిటీలు, పదవుల భర్తీ ప్రక్రియలన్నీ ఈ నెలాఖరులోపు ముగించే విధంగా ముఖ్య నేతలకు తమిళగ వెట్రి కళగం నేత విజయ్ ఆదేశాలు ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలను జూన్ నుంచి విస్తృతం చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటుతో జిల్లాల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో ముఖ్య పదవులన్నీ దాదాపుగా భర్తీ అయ్యాయి. ఇతర కమిటీలలో కొన్ని పదవుల భర్తీ కసరత్తులు జరుగుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని నెలలు ఉన్న దృష్ట్యా, ఇక ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణలో విజయ్ ఉన్నారు.ప్రస్తుతం విజయ్ నటిస్తున్న జననాయగన్ చిత్ర షూటింగ్ ఈనెలతో ముగియనున్నట్టు తెలిసింది. ఆ తర్వాత జూన్ మొదటి వారం నుంచి విజయ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లో ఉండబోతున్నారు. ఇందులో భాగంగా విజయ్ పర్యటనలకు సంబంధించి గత రెండు రోజులుగా చెన్నైలో జిల్లాల కార్యదర్శుల సమావేశం విస్తృతంగా సాగుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షణలో ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా అన్ని ప్రక్రియలను, పదవుల భర్తీని ఈ నెలాఖరులోపు ముగించాలని విజయ్ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జూన్ నుంచి ఆయన పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండబోతున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ సైతం సిద్ధమవుతోంది. -
విజయ్‌కు 105 సీట్లు?
సాక్షి, చెన్నై: విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీకి రానున్న ఎన్నికలలో 105 సీట్లలో గెలుపు ఖాయం అన్నది వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా మూడు నెలలుగా సాగిన సర్వే ఆధారంగా ఈ వివరాలు సోమవారం బయట పడ్డాయి. గత ఏడాది విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్రమంగా పార్టీ కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. పార్టీ ఆవిర్భావ వేడుక అనంతరం కొంత కాలం విజయ్ సినీమా షూటింగ్ బిజీలో పడ్డారు. గత మూడు నాలుగు నెలలుగా పార్టీ కార్యక్రమాలపై మళ్లీ దృష్టి పెట్టి, ప్రజలలోకి దూసుకెళ్లే కార్యాచరణలో ఉన్నారు. ఆ పార్టీ వర్గాలు విజయ్ పార్టీ పేరు, జెండాను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. బూత్ కమిటీలు తమ పనిని వేగవంతం చేశారు. ఇక, విజయ్ ప్రజా పర్యటనకు కార్యచరణలో ఉన్నారు. ఈ షెడ్యూల్ త్వరలో వె లువడనుంది. ఈ పరిస్థితులలో గత మూడు నెలలుగా సోషల్ మీడియాతో పాటూ పలు వర్గాల నుంచి ఓ సంస్థ సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వే మేరకు తాజాగా విజయ్ కు 105 సీట్లు ఖాయం అన్న సమాచారం చర్చకు దారి తీసింది. ఈ సర్వే మేరకు 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌కు 95 నుంచి 105 సీట్లతో ఆపటుగా 34.55 శాతం ఓట్లు దక్కబోతున్నట్టుగా సామాజిక మాధ్యమంలో సమాచారం వైరలైంది. అలాగే డీఎంకే కూటమికి 75 నుంచి 85 స్థానాల వరకు 30.20 శాతం ఓటింగ్‌తో, అన్నాడీఎంకేకు 55 నుంచి 65 సీట్లు 28.85 శాతం ఓట్లతో దక్కే అవకాశాలు ఉన్నాయన్న ఈ సమాచారం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. తమకు అనుకూలంగా సర్వేలు వస్తుండడంతో మరింతగా శ్రమించేందుకు తమిళగ వెట్రి కళగం వర్గాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా తమ తమ ప్రాంతాలలో గోడ ప్రచారాలను విస్తృతం చేయడానికి చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రైవేటుకు చెందిన ప్రహరీ గోడలు, ప్రదేశాలలో గోడ ప్రచారం కోసం ముందస్తుగా బుక్ చేసుకుంటుండడం గమనార్హం. -
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
తమిళగ వెట్రి కళగం నేత విజయ్, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ప్రకాష్ రాజ్ కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్, విజయ్‌లకు ఇద్దరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తుచేశారు. విజయ్ కూడా తమిళ్లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్‌కు ఎలాంటి గుర్తింపు లేనప్పుడే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అయితే, పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తే.. విజయ్ మాత్రం ఇప్పుడే సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారన్నారు.విజయ్, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు. ఆయనలో ఆవేశం తప్పా ఎలాంటి విజన్ లేదు. కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మార్పు కోసం అంటూ రాజకీయాలలోకి వస్తున్న వారు తమ ఇమేజ్ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు. విజయ్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు. గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు ఉన్న ఇమేజ్ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. -
తెలుగు డైరెక్టర్ అని తొక్కేశారు.. లేదంటే విజయ్ తో సినిమా!
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్. తెలుగు డైరెక్టర్లు తమిళ, మలయాళ హీరోలతో.. ఆయా భాషల్లోని దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే ఓ తెలుగు దర్శకుడికి చేతిదాకా వచ్చిన ఓ భారీ ఛాన్స్.. కొద్దిలో మిస్సయింది. తాను టాలీవుడ్ వాడిని కావడమే దీనికి కారణమని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: తెలుగు హీరోతో మృణాల్ ప్రేమ? నిజమేంటి?) రీసెంట్ గా 'జాట్' మూవీలతో ఆకట్టుకున్న తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని.. అంతకు ముందు బాలయ్యతో 'వీరసింహారెడ్డి' తీసి హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమా తర్వాత తమిళ హీరో విజయ్ ని కలిసి ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పించానని, కానీ చివరి నిమిషంలో తప్పుకోవాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు గల కారణాల్ని కూడా బయటపెట్టాడు.'వీరసింహారెడ్డి తర్వాత వెంటనే స్టోరీ రెడీ చేసుకుని తమిళ హీరో విజయ్ ని చెప్పాను. ఆయనకు నచ్చేసింది. సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. అనౌన్స్ చేద్దాం అనుకుంటున్న టైంలో తర్వాత నుంచి రాజకీయాల్లోకి వెళ్లిపోతారు అన్నప్పుడు తెలుగు డైరెక్టర్ కాదు తమిళ డైరెక్టర్ అయితే బాగుంటుందని లోకల్ వాళ్ల నుంచి ప్రెజర్ ఉంది. దీని ముందు వారిసు (వారసుడు) అని తెలుగు దర్శకుడితో చేశారు. మళ్లీ తెలుగు డైరెక్టర్ తో అంటే తమిళ వాళ్లందరు కూడా తెలుగోళ్లని తీసుకొచ్చి చేస్తే కరెక్ట్ కాదని ఆయనకు చెప్పారేమో. అలా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది' అని గోపీచంద్ మలినేని చెప్పుకొచ్చాడు.వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని.. విజయ్ తో సినిమా అనుకున్నాడు. ఆ ప్రాజెక్ట్ రద్దయింది. రవితేజతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ మూవీ అనౌన్స్ చేశారు. కారణమేంటో గానీ దీన్ని పక్కనబెట్టేశారు. ఫైనల్ గా హిందీలో 'జాట్' అనే మూవీ తీశాడు. గత నెలలో రిలీజైన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఆడింది. త్వరలోనే ఈ దర్శకుడు బాలయ్యతో మరో మూవీ చేయబోతున్నాడు.(ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా 'టూరిస్ట్ ఫ్యామిలీ') -
హీరోపై అభిమానంతో పిచ్చి పని.. కానిస్టేబుల్ సస్పెన్షన్
భద్రతా విధుల్లో ఉండాల్సిన ఒక పోలీసు కానిస్టేబుల్ తన అభిమాన హీరో కోసం వెళ్లి సస్పెండ్ అయ్యాడు. తమిళగ వెట్రి కళగం నేత విజయన్ను కలిసిన పోలీసు కానిస్టేబుల్ కదిరవన్‌ను సస్పెండ్ చేస్తూ మధురై పోలీసు కమిషనర్ లోకనాథన్ ఆదేశాలు జారీ చేశారు. విజయ్ ప్రస్తుతం కొడైకెనాల్లో జన నాయగన్ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఆయన కోసం అభిమానులు కొడైకెనాల్‌కు పోటెత్తుతున్నారు. అదే సమయంలో మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో కదిరవన్‌కు అక్కడ డ్యూటీ వేశారు. అయితే, భద్రతా విధులలో ఉండాల్సిన కానిస్టేబుల్ సెలవు పెట్టి మరీ కొడైకెనాల్లో పత్యక్షం కావడం చర్చకు దారి తీసింది. యూనిఫాంను పక్కన పెట్టి తానో అభిమాని అని చాటుకునే దిశగా ఆయన విజయ్ను కలిసి వచ్చారు. అయితే, విధులను పక్కన పెట్టినందుకు గాను కదిరవన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన కదిరవన్ తన యూనిఫామ్‌ను తొలగించి విజయ్ రాజకీయ పార్టీ కండువాను ధరించాడు. ఆపై ఆయనతో ఫోటోలు దిగాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. -
ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్‌కు విజయ్ సూచన
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ రెగ్యూలర్‌గా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. అయితే, తను ఎక్కడికి వెళ్లిన అభిమానులు మాత్రం భారీగా వచ్చేస్తున్నారు. తన వెంట పడ వద్దుని వేడుకుంటున్నా వారు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా తాను సినిమా షూటింగ్‌కు వెళ్తున్నానని సూచించినా తమ కోసం ఐదు నిమిషాలు అయినా సరే మాట్లాడి వెళ్లాలని రోడ్డుపైనే కూర్చున్నారు. అలా విజయ్‌కు మదురైలో ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. పార్టీ ఆవిర్భావంతో తమ ముందుకు వచ్చిన విజయ్ను చూసేందుకు తమిళనాడులో ఎక్కడికెళ్లినా అభిమానులు ఎగబడుతున్నారు. తమ అభిమానాన్ని అత్యుత్సాహంతో చూపించే వారెందరో ఉన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దు అని విజయ్ వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులలో చైన్నె నుంచి మదురై మీదుగా కొడైకెనాల్‌కు జననాగయం సినిమా షూటింగ్ నిమిత్తం విజయ్ వెళ్లారు. ఈ సమాచారంతో మదురై విమానాశ్రయంలో అభిమానులు ఉదయం నుంచే పోటెత్తారు. మదురైలో అనుమతి లేకుండా రోడ్ షోలు నిర్వహిస్తే చర్యలు తప్పవని విజయ్ అభిమానులకు కమిషనర్ లోకనాథన్ హెచ్చరికలు చేశారు. అయినా, అభిమానులు ఏ మాత్రం తగ్గలేదు. విజయ్ను చూసి, ఆయనకు ఆహ్వానం పలికే వెళ్తామని భీష్మించుకుని విమానాశ్రయం పరిసరాలలో కూర్చున్నారు. ఈ సమాచారంతో విజయ్ తొలిసారి చైన్నె విమానాశ్రయంలో మీడియా ముందుకు వచ్చారు. మీ అభిమానానికి కోట్లాది దండాలు అని పేర్కొంటూ, తాను సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్తున్నానని, తన పని తనను చేయనివ్వండని వేడుకున్నారు. తన కోసం మదురై విమానాశ్రయానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చినట్టు సమాచారం వచ్చిందని, అందుకే తాను మీడియా ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించ వద్దని, తన కాన్వాయ్‌ను అనుసరించ వద్దని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయం నుంచి అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లాలని కోరారు. అయితే, అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. విజయ్ విమానాశ్రయంలో అడుగు పెట్టగానే దూసుకెళ్లారు. విజయ్ను ఆహ్వానిస్తూ నినాదాలు హోరెత్తించారు. అభిమానులను కట్టడిచేయలేక పోలీసులకు తంటాలు పడ్డారు. విజయ్ వాహనం మీదకు దూసుకెళ్లేందుకు యత్నించిన వారిని బౌన్సర్లు అడ్డుకోక తప్పలేదు. విజయ్ వాహనాన్ని వెంబడిస్తూ పలువురు అభిమానులు దూసుకెళ్లడం గమనార్హం. -
ఆ హీరోయిన్ల పేర్లు కలిసేలా విజయ్ (TVK) పార్టీ ఉంది: మంత్రి
తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే నేత, మంత్రి పన్నీర్ సెల్వం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తమకు పోటీ కేవలం డీఎంకే పార్టీ మాత్రమేనని విజయ్ ఇప్పటికే సందేశం పంపాడు. కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి స్టాలిన్‌పై విమర్శలు చేస్తున్నారు కూడా.. అధికార పార్టీలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టేందుకు తాను ఉన్నానంటూ విజయ్ పలు వేదికలపై చెబుతున్నారు. దీంతో డీఎంకే మంత్రి పన్నీర్ సెల్వం తాజాగా విజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తాజాగా జరిగిన రాజకీయ సమావేశంలో విజయ్ పార్టీ గురించి మంత్రి పన్నీర్ సెల్వం కామెంట్స్ చేశారు. 'బ్లాక్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి మాకు అవినీతి గురించి పాఠాలు చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన తీసుకునే డబ్బు (రెమ్యునరేషన్) అంతా బ్లాక్ మనీ అని అందరికీ తెలిసిందే.' అని ఆయన అన్నారు. ఆపై వేదికపై నుంచే విజయ్ పార్టీ (TVK) అంటే ఏంటి..? దానికి సమాధానం చెప్పాలని జనసమూహాన్ని పన్నీర్ సెల్వం కోరారు. వెంటనే వారు (T-త్రిష, V- విజయ్, K- కీర్తి సురేష్) అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో మీరంతా బ్రిలియంట్స్ అంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తామని చెబుతుంటే నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.రాష్ట్రాన్ని నడపటం అంటే సినిమాలో నటించడం అంత సులభం అనుకుంటున్నారా.? అని మంత్రి ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట డీఎంకే పార్టీతో స్టాలిన్ తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మోస్ట్ పవర్ఫుల్ లీడర్‌గా స్టాలిన్ ఉన్నారని జాతీయ స్థాయి సర్వేలు కూడా తేల్చేశాయి. తర్వాతి రెండో స్థానంలో విజయ్ పార్టీ ఉందని ఆ సర్వేలు చెప్పాయి. అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు. దీంతో 2026 ఎన్నికల్లో విజయ్‌తో స్టాలిన్‌కు గట్టిపోటీ తప్పదని తెలుస్తోంది. -
పెళ్లిరోజు.. భార్యకు ఊహించని బహుమతిచ్చిన హీరో విజయ్ తండ్రి
పుట్టినరోజు, పెళ్లి రోజు వచ్చిందంటే చాలు.. భార్యాభర్తలు ఏదో ఒక బహుమతి ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ దర్శకుడు కూడా అదే పని చేశాడు. కాకపోతే 79 ఏళ్ల వయసులోనూ పెళ్లిరోజును గుర్తుపెట్టుకుని మరీ సతీమణికి ప్రేమగా బహుమతివ్వడం అందర్నీ ఒకింత ఆశ్చర్యపరుస్తోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు ఎస్ఏ చంద్రశేఖర్ (S A Chandrasekhar).ప్రముఖ డైరెక్టర్లు ఈయన దగ్గర పనిచేసినవాళ్లేఈ కోలీవుడ్ డైరెక్టర్.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని దాదాపు 70 సినిమాలు తెరకెక్కించాడు. తెలుగులో చట్టానికి కళ్లు లేవు, పల్లెటూరి మొనగాడు, దోపడి దొంగలు, దేవాంతకుడు వంటి చిత్రాలను రూపొందించాడు. డైరెక్టర్‌గానే కాకుండా నటుడిగా పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈయన దగ్గర సెంతిల్నాథన్, సి.రంగనాథన్, పవిత్రన్, ఎస్.శంకర్, ఎం. రాజేశ్ సహా పలువురు డైరెక్టర్లు అసిస్టెంట్‌గా పనిచేశారు.BMW కారు గిఫ్ట్చంద్రశేఖర్.. తన కుమారుడు విజయ్ (Vijay)ను హీరోగా వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పుడతడు దళపతిగా రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన విషయం తెలిసిందే! చంద్రశేఖర్ భార్య పేరు శోభ. తాజాగా వీళ్లు పెళ్లిరోజు సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాదు భాగస్వామికి వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్‌గా కారు ఇచ్చానంటూ ఓ వీడియో షేర్ చేశాడు. బీఎమ్‌డబ్ల్యూ కారు కొన్న చంద్రశేఖర్.. అందులో భార్యను ఎక్కించుకుని డ్రైవ్ చేశాడు. ఇది చూసిన అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by S A Chandrasekhar (@dir_sac) చదవండి: పాకిస్తాన్ సైన్యంలో ఫౌజీ హీరోయిన్ తండ్రి? క్లారిటీ ఇచ్చిన ఇమాన్వి


