'ఆ ట్విటర్ ఖాతా అంతా ఫేక్'.. కరూర్‌ ఘటనపై డ్రాగన్ హీరోయిన్ క్లారిటీ | kollywood actress Kayadu Lohar tweet about vijay tvk karur Incident | Sakshi
Sakshi News home page

Kayadu Lohar: 'ఆ ట్విటర్ ఖాతా అంతా ఫేక్'.. కరూర్‌ ఘటనపై డ్రాగన్ హీరోయిన్

Sep 28 2025 1:18 PM | Updated on Sep 28 2025 3:59 PM

kollywood actress Kayadu Lohar tweet about vijay tvk karur Incident

తన పేరుతో వస్తోన్న ట్విటర్‌ అంతా నకిలీ అని.. దయచేసి అలాంటివీ నమ్మవద్దని డ్రాగన్ హీరోయిన్ అభిమానులకు విజ్ఞప్తి చేిసంది.  ఈ మేరకు ట్విటర్‌లో తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టిందని.. అయితే తన పేరుతో ఉన్న నకిలీ ఖాతా పోస్టులను నమ్మవద్దని హితవు పలికింది.

కాయాదు తన ట్వీట్‌లో రాస్తూ..' నా పేరుతో పోస్ట్‌లు సర్క్యులేట్ చేస్తున్న ట్విట్టర్ ఖాతా నకిలీది. నాకు దానితో ఎటువంటి సంబంధం లేదు . ఆ అకౌంట్‌ నుంచి చేసిన ప్రకటనలు నావి కావు.  కరూర్ ర్యాలీలో జరిగిన విషాద సంఘటన నన్ను తీవ్రంగా బాధపెట్టింది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అయితే, కరూర్‌లో నాకు వ్యక్తిగత స్నేహితులు ఎవరూ లేరని.. నా పేరుతో వ్యాప్తి చెందుతున్న కథనం అబద్ధమని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. దయచేసి ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు.. ప్రచారం చేయవద్దు. మరోసారి ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ పోస్ట్ చేసింది.


కాగా.. తమిళనాడు జరిగిన విషాదంపై డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ పేరుతో ట్వీట్‌ వైరలైంది. .  కాగా.. నిన్న తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంపై పలువురు సినీతారలు స్పందించారు. రజీనీకాంత్, కమల్ హాసన్, మెగాస్టార్‌ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్.. ఈ ఘటనతో తన గుండె పగిలిందని ట్వీట్‌ చేశారు. వారిని ఓదార్చేందుకు కూడా మాటలు రావడం లేదని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన తరఫున రూ.20 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షలు అందిస్తామని తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement