స్టార్‌ హీరో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ ఆమెనా? | Vijay Super Hit Combo Repeat Once Again In Up Coming Film Goes Viral | Sakshi
Sakshi News home page

విజయ్‌ సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆ కాంబో రిపీట్!

Published Fri, Mar 15 2024 3:13 PM | Last Updated on Fri, Mar 15 2024 3:55 PM

Vijay Super Hit Combo Repeat once again in Up coming Film Goes Viral - Sakshi

లియో కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతోందా? అంటే దీనికి కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమధానమే వినిపిస్తోంది. నటుడు విజయ్‌, నటి త్రిష సూపర్ హిట్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. ఈ జంట ఇప్పుటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియోతో పాటు దాదాపు ఐదు చిత్రాల్లో జంటగా నటించారు. ఇందులో గిల్లీ, తిరుపాచ్చి, లియో చిత్రాలు మంచి విజయా న్ని సాధించాయి. కాగా తాజాగా మరోసారి ముచ్చటగా రెండో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. 

కాగా.. విజయ్‌ ప్రస్తుతం ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (గోట్‌) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా, అజ్మల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇందులో విజయ్‌ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. 

కాగా ఈ చిత్రంలోనే విజయ్‌తో నటి త్రిష మరోసారి జత కడుతున్నట్లు తాజా సమాచారం. ఇందు తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్‌ సరసన త్రిష నటించనున్నారు. అయితే ఇది ప్రత్యేక పాత్రేనని సమాచారం. కాగా ముందు ఈ పాత్రకు నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు.. ఆమె తిరస్కరించడంతో ఈ అవకాశం నటి త్రిషకు వచ్చినట్లు టాక్‌. కాగా.. గోట్‌ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. కాగా ప్రస్తుతం త్రిష నటుడు కమలహాసన్‌కు జంటగా థగ్స్‌ లైఫ్‌, అజిత్‌ సరసన విడాముయర్చి చిత్రాలతో పాటు, ఓ మలయాళ, తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement