కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి ఉండదు. ప్రస్తుతం ఈయన ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇది. తదుపరి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు.
ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్ త్రిష(Trisha) గురించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటి 22 ఏళ్ల సినీ జీవితం తెరిచిన పుస్తకమే. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగాను ఈమె పయనం సంచలనమే. త్రిషను పలువురు స్టార్ హీరోలతో కలిపి అనేక వదంతులు దొర్లుతుంటాయి. అలాంటివారిలో నటుడు విజయ్ పేరు వినిపిస్తుంది. విజయ్ త్రిష జంటగా మొట్టమొదటి సారిగా గిల్లీ చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వీరు హిట్ పెయిర్‌గా ముద్ర వేసుకున్నారు.
ఆ తర్వాత వరుసగా తిరుపాచ్చి, ఆది, కురువి చిత్రాల్లో జంటగా నటించారు. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని ప్రచారం జరిగింది. అంతేకాదు విజయ్, త్రిషల మధ్య ఏదో జరుగుతుందని పదంతులు జోరందుకుంది. ఆ తర్వాత ఏమైందో గానీ వీరిద్దరూ కలిసి ఏ చిత్రంలోని నటించలేదు. అలాంటిది సుమారు 14 ఏళ్ల తర్వాత లియో చిత్రంలో మళ్లీ జత కట్టారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి వసూలు సాధించింది.
కాగా నటుడు విజయ్ తనకు ఎప్పుడు ప్రత్యేకమే అంటూ త్రిష ఒక భేటీలో పేర్కొన్నారు. దీంతో మళ్లీ వీరిపై రకరకాల వదంతులు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ఆ మధ్య తనకు రాజకీయాలంటే ఆసక్తి అని పేర్కొనడంతో ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆమె నటనకు గుడ్ బై చెప్పి ఆ పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం హోరెత్తింది. అయితే ఈ ప్రచారాన్ని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు.
కాగా తాజాగా త్రిష నటుడు విజయ్ గురించి ఒక భేటీలో మాట్లాడుతూ షూటింగ్‌లో నటుడు శింబు తనను టీజ్ చేస్తారని, విజయ్ మాత్రం ఒక గోడ పక్కన చోటును వెతుక్కుని మౌనంగా కూర్చుంటారని చెప్పారు. ఆయనలో తనకు నచ్చనిది ఇదేనన్నారు. దాన్ని ఆయన మార్చుకోవాలని త్రిష పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment