Trisha
-
అజిత్ 'పట్టుదల' HD మూవీ స్టిల్స్
-
విడాముయర్చి పై చాలా ఆశలే పెట్టుకున్న కోలీవుడ్
-
విజయ్ ఆ విషయంలో మారాలి : త్రిష
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి ఉండదు. ప్రస్తుతం ఈయన ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో జననాయకన్ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇది. తదుపరి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్ త్రిష(Trisha) గురించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటి 22 ఏళ్ల సినీ జీవితం తెరిచిన పుస్తకమే. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగాను ఈమె పయనం సంచలనమే. త్రిషను పలువురు స్టార్ హీరోలతో కలిపి అనేక వదంతులు దొర్లుతుంటాయి. అలాంటివారిలో నటుడు విజయ్ పేరు వినిపిస్తుంది. విజయ్ త్రిష జంటగా మొట్టమొదటి సారిగా గిల్లీ చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వీరు హిట్ పెయిర్‌గా ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా తిరుపాచ్చి, ఆది, కురువి చిత్రాల్లో జంటగా నటించారు. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయిందని ప్రచారం జరిగింది. అంతేకాదు విజయ్, త్రిషల మధ్య ఏదో జరుగుతుందని పదంతులు జోరందుకుంది. ఆ తర్వాత ఏమైందో గానీ వీరిద్దరూ కలిసి ఏ చిత్రంలోని నటించలేదు. అలాంటిది సుమారు 14 ఏళ్ల తర్వాత లియో చిత్రంలో మళ్లీ జత కట్టారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి వసూలు సాధించింది. కాగా నటుడు విజయ్ తనకు ఎప్పుడు ప్రత్యేకమే అంటూ త్రిష ఒక భేటీలో పేర్కొన్నారు. దీంతో మళ్లీ వీరిపై రకరకాల వదంతులు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ఆ మధ్య తనకు రాజకీయాలంటే ఆసక్తి అని పేర్కొనడంతో ఇప్పుడు విజయ్ రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆమె నటనకు గుడ్ బై చెప్పి ఆ పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం హోరెత్తింది. అయితే ఈ ప్రచారాన్ని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. కాగా తాజాగా త్రిష నటుడు విజయ్ గురించి ఒక భేటీలో మాట్లాడుతూ షూటింగ్లో నటుడు శింబు తనను టీజ్ చేస్తారని, విజయ్ మాత్రం ఒక గోడ పక్కన చోటును వెతుక్కుని మౌనంగా కూర్చుంటారని చెప్పారు. ఆయనలో తనకు నచ్చనిది ఇదేనన్నారు. దాన్ని ఆయన మార్చుకోవాలని త్రిష పేర్కొన్నారు. -
ఓటీటీకి వచ్చేసిన త్రిష థ్రిల్లర్.. వారం రోజుల్లోనే ఎంట్రీ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రస్తుతం కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా ఉన్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో పెద్దగా కనిపించట్లేదు. గతేడాది విజయ్ సరసన ది గోట్ చిత్రంలో కనిపించిన త్రిష.. ప్రస్తుతం అజిత్ కుమార్ మూవీ విదాముయార్చితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఇదిలా ఉండగా.. త్రిష మలయాళంలో వరుస సినిమాలు చేస్తోంది. మాలీవుడ్‌లో ఐడెంటిటీ అనే మూవీలో నటించింది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో టొవినో థామస్ హీరోగా నటించారు. సంక్రాంతికి కానుకగా మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాకు అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు.మలయాళంలో హిట్ టాక్ రావడంతో తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేశారు. జనవరి 24న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ మూవీకి టాలీవుడ్ ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పెద్దగా రాణించలేకపోయింది. రూ. 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఐడెంటిటీ సినిమాకు బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ. 18 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.వారంలోనే ఓటీటీకి..గత శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సడన్‌గా ఓటీటీకి వచ్చేసింది. కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 31 నుంచే జీ5 వేదికగా అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ చిత్రంలో హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ప్రధాన పాత్రలో నటించారు. -
జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా...’ అంటూ అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణకుమారి అప్పట్లో సిల్వర్ స్క్రీన్‌పై చేసిన సందడిని నాటి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకూ అంటే... జోరుగా హుషారుగా షూటింగ్‌కి పోదమా... అంటూ కొందరు కథానాయికలు డైరీలో నాలుగుకి మించిన సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఆ హీరోయిన్లు చేస్తున్నసినిమాల గురించి తెలుసుకుందాం...రెండు దశాబ్దాలు దాటినా బిజీగా...చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా ప్రయాణం పూర్తి చేసుకున్నారు త్రిష. అందం, అభినయంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె ఇప్పటికీ ఫుల్ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అంతేకాదు.. అందం విషయంలోనూ యువ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో తెలుగు, తమిళ్, మలయాళంలో కలిపి అరడజను సినిమాలున్నాయి. ఆమె నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె.‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే మోహన్‌లాల్ లీడ్ రోల్లో డైరెక్టర్ జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు త్రిష. అదే విధంగా అజిత్ కుమార్ హీరోగా మగిళ్ తిరుమేని తెరకెక్కిస్తున్న ‘విడాముయర్చి’, అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ‘గుడ్ బ్యాడీ అగ్లీ’, కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం రూపొందిస్తున్న ‘థగ్ లైఫ్’, సూర్య కథానాయకుడిగా ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ‘సూర్య 45’ (వర్కింగ్ టైటిల్) వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ జోరు మీద ఉన్నారు త్రిష. తెలుగులో లేవు కానీ...తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బుట్ట బొమ్మగా స్థానం సొంతం చేసుకున్నారు హీరోయిన్ పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) అనే చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ. టాలీవుడ్లో పదేళ్ల ప్రయాణం పూజా హెగ్డేది. కాగా చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ, బాలీవుడ్, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు పూజా హెగ్డే.తమిళంలో స్టార్ హీరోలైన విజయ్, సూర్యలకు జోడీగా నటిస్తున్నారు. విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ‘జన నాయగన్’ అనే సినిమాతో పాటు, సూర్య కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘రెట్రో’ మూవీస్‌లో నటిస్తున్నారు పూజా హెగ్డే. అలాగే డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో రూపొందిన హిందీ మూవీ ‘దేవా’. పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉన్న పూజా హెగ్డే తెలుగులో మాత్రం ఒక్క సినిమాకి కూడా కమిట్ కాలేదు. జోరుగా లేడీ సూపర్ స్టార్ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. నటిగా రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఇప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళుతున్నారు. కథానాయికగా ఫుల్ క్రేజ్‌లో ఉన్నప్పుడే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో 2022 జూన్ 9న వివాహబంధంలోకి అడుగుపెట్టారు నయనతార. వీరిద్దరికీ ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. ఇక కెరీర్ పరంగా ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. తమిళంలో ‘టెస్ట్, మన్నాంగట్టి సిన్స్ 1960, రాక్కాయీ’ వంటి సినిమాలతో పాటు పేరు పెట్టని మరో తమిళ చిత్రం, ‘డియర్ స్టూడెంట్’తో పాటు మరో మలయాళ మూవీ, ‘టాక్సిక్’ అనే కన్నడ సినిమాతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు నయనతార. అయితే 2022లో విడుదలైన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ తర్వాత మరో తెలుగు చిత్రానికి పచ్చజెండా ఊపలేదామె.అరడజను సినిమాలతో‘చూసీ చూడంగానే నచ్చేశావే.. అడిగీ అడగకుండా వచ్చేశావే... నా మనసులోకి’ అంటూ రష్మికా మందన్నాని ఉద్దేశించి పాడుకుంటారు యువతరం ప్రేక్షకులు. అందం, అభినయంతో అంతలా వారిని ఆకట్టుకున్నారామె. కన్నడలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘ఛలో ’(2018) సినిమాతో తెలుగుకి పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్నారు ఈ కన్నడ బ్యూటీ. ఓ వైపు కథానాయకులకి జోడీగా నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి.వాటిలో ‘రెయిన్ బో, ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్ బో’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. అదే విధంగా ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గాళ్ ఫ్రెండ్’. అలాగే విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన బాలీవుడ్ మూవీ ‘ఛావా’లో హీరోయిన్గా చేశారు రష్మిక. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.ఇక సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న హిందీ మూవీ ‘సికందర్’లోనూ రష్మిక కథానాయిక. అదే విధంగా నాగార్జున, ధనుశ్ హీరోలుగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న తెలుగు, తమిళ చిత్రం ‘కుబేర’లోనూ హీరోయిన్గా నటించారు ఈ బ్యూటీ. మరోవైపు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ‘థామా’ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తున్నారు రష్మికా మందన్నా.ఏడు చిత్రాలతో బిజీ బిజీగా...మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. ‘భీమ్లా నాయక్’ (2022) చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమయ్యారు ఈ మలయాళ బ్యూటీ. ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు సంయుక్త. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో తెలుగులోనే ఐదు చిత్రాలుండగా, ఓ హిందీ ఫిల్మ్, ఓ మలయాళ సినిమా కూడా ఉంది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’, శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు డైరెక్షన్లో రూపొందుతున్న ‘నారి నారి నడుమ మురారి’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా లుధీర్ బైరెడ్డి తెరకెక్కిస్తున్న ‘హైందవ’, బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ‘అఖండ 2: తాండవం’ సినిమాల్లో నటిస్తున్నారు సంయుక్తా మీనన్. అదే విధంగా తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలోనూ నటిస్తున్నారామె.యోగేష్ కేఎంసీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అలాగే ఆమె నటిస్తున్న తొలి హిందీ చిత్రం ‘మహారాజ్ఞి–క్వీన్ ఆఫ్ క్వీన్స్’. ఈ మూవీకి చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదే విధంగా మోహన్‌లాల్ లీడ్ రోల్లో జీతూ జోసెఫ్ దర్వకత్వంలో రూపొందుతోన్న మలయాళ చిత్రం ‘రామ్’లోనూ నటిస్తున్నారు సంయుక్తా మీనన్. ఇలా ఏడు సినిమాలతో ఫుల్ బీజీ బీజీగా ఉన్నారామె. హుషారుగా యంగ్ హీరోయిన్టాలీవుడ్లో మోస్ట్ సెన్సేషన్ హీరోయిన్గా దూసుకెళుతున్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ (2021) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌ని సొంతం చేసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘ధమాకా’ (2022) సినిమాతో తెలుగులో తొలి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న శ్రీలీల వరుస చిత్రాలతో యమా జోరు మీదున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ చిత్రం ఉన్నాయి.నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాబిన్ హుడ్’, రవితేజ హీరోగా భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ‘మాస్ జాతర’, పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ వంటి తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు శ్రీలీల. అదే విధంగా శివ కార్తికేయన్ హీరోగా సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’ అనే తమిళ చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారామె.హిందీలోనూ...దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతా రామం’ (2022) సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మృణాళ్ ఠాకూర్. ఆ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. మృణాళ్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో ‘హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ బ్యూటీ ప్రభాస్ ‘కల్కి: 2898 ఏడీ’ చిత్రంలో అతిథి పాత్ర చేశారు. ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారారు. ఆమె హిందీలో ‘పూజా మేరీ జాన్, హై జవానీతో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2’, తుమ్ హో తో’ వంటి చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా అడివి శేష్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు మృణాళ్ ఠాకూర్.రెండు తెలుగు... రెండు హిందీ ప్రేక్షకుల హృదయాల్లో అతిలోక సుందరిగా అభిమానం సొంతం చేసుకున్న దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హిందీలో ఎంట్రీ ఇచ్చారు. యూత్ కలల రాణిగా మారారు ఈ బ్యూటీ. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘దేవర: పార్ట్ 1’ (2024) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేతిలో కూడా నాలుగు సినిమాలుఉన్నాయి. వాటిలో రెండు తెలుగు కాగా రెండు హిందీ మూవీస్.రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆర్సీ 16’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 2’ సినిమా కూడా ఉండనే ఉంది. అదే విధంగా హిందీలో ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి, పరమ్ సుందరి’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా షూటింగ్స్ చేస్తున్న కథానాయికలు ఇంకొందరు ఉన్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
నాన్న కల నెరవేర్చింది
‘కలలు కనడం కష్టం కాదు. కాణీ ఖర్చు కాదు’ లాంటి వెటకారాల మాట ఎలా ఉన్నా.... ఆ కలలే భవిష్యత్తుని నిర్దేశిస్తాయి.వందమందిలో ఒకరిగా ప్రత్యేకతతో వెలిగిపోయేలా చేస్తాయి. ‘నా కూతురు ఆడితే పరుగులు వెల్లువెత్తాల్సిందే’ ‘మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారణం... అంటూ నా కూతురు గురించి అందరూ ఘనంగా చెప్పుకోవాలి’... ఇలాంటి కలలు ఎన్నో కనేవాడు భద్రాచలానికి చెందిన రామిరెడ్డి.అయితే ఆయన కలలకు మాత్రమే పరిమితం కాలేదు. నిరంతరం తన కలల సాకారానికి ప్రయత్నించాడు. ఆ ఫలితమే స్టార్ క్రికెటర్... త్రిష గొంగడి(Trisha Gongadi). మలేషియాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ విమెన్ అండర్ 19, టీ 20 వరల్డ్ కప్(Women World Cup)లో స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.భద్రాచలం పట్టణానికి చెందిన గొంగడి రామిరెడ్డి క్రికెట్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశించినా పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కల నెరవేరలేదు. దీంతో ఫిట్నెస్ ట్రైనర్‌గా పనిచేస్తూనే పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహించేవాడు. ‘మా అమ్మాయిని బాగా చదివించాలి’... అనేది సగటు తండ్రి కోరిక.రామిరెడ్డి మాత్రం అలా కాదు... ‘మా అమ్మాయిని బాగా ఆడించాలి. క్రికెట్లో స్టార్‌ని చేయాలి’ అనుకునేవాడు. సినిమాలు, కామేడీ షోలు కాకుండా టీవీలో క్రికెట్ మ్యాచ్ హైలెట్స్ ఎక్కువగా చూపించేవాడు. చిన్నప్పుడే ఇలా చేయడం వల్ల బ్రెయిన్, మజిల్స్ ఆటకు తగ్గట్టుగా మౌల్డ్ అవుతాయని ఫిటెనెస్ ట్రైనర్‌గా ఆయన బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ చిన్నతనం నుంచే త్రిష క్రికెట్లో ప్రతిభ కనబరిచేది. దీంతో తన కల విషయంలో మరింత పట్దుదల పెరిగింది. కూతురిని ప్రోఫెషనల్ క్రికెటర్‌గా చూడాలనే లక్ష్యంతో కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మకాం మార్చాడు రామిరెడ్డి. అప్పుడు త్రిష వయసు ఏడేళ్లు. సికింద్రాబాద్‌లోని ‘సెయింట్ జాన్ ్స క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకునేది.ఎంతో ఆశ... చివరికి నిరాశ!్రపోఫెషనల్ ట్రైనింగ్‌లో ఆరితేరిన త్రిష పన్నెండేళ్ల వయస్సులో హైదరాబాద్ అండర్ 19 జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత అండర్ 19 ఇండియా తరఫున సౌత్ ఆఫ్రికాలో జరిగిన టోర్నమెంట్లో పాల్గొంది. ఆ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. బ్యాటింగ్‌తో పాటు లెగ్ స్పిన్నర్‌గా టోర్నీ గెలుపులో త్రిష తనవంతు పాత్ర పోషించింది. అయితే త్రిషకు ఈ టోర్నీలో ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. ఆ ఫలితం ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో స్పష్టంగా కనిపించింది. విమెన్ ఐపీఎల్ వేలంలో త్రిషాను తీసుకునేందుకు ఐపీఎల్ యాజమాన్యాలు ఆసక్తి చూపించలేదు. దీంతో గత ఐపీఎల్ సీజన్ కు ఆమె దూరంగా ఉండాల్సి వచ్చింది. అ గెలుపులో తాను ఒకరిగా ఉండటం కంటే ‘గెలుపుకు మూలం’ అనిపించేలా ప్రదర్శన చేయాలనే పట్టుదల త్రిషలో పెరిగింది.ఇక చూస్కోండివిమెన్ ఐపీఎల్లో ఎదురైన చేదు అనుభవం ‘పవర్ హిట్టింగ్’పై పట్టు సాధించేందుకు త్రిషకు తోడ్పడింది. గత డిసెంబరులో జరిగిన అండర్ 19, టీ 20 ఏషియా కప్ టోర్నమెంట్లో వరుసగా 58 నాటౌట్, 32, 52 పరుగులు సాధించింది. ఆ టోర్నీ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ కప్‌లో ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేసిన త్రిష 230 పరుగులు సాధించింది. ఇందులో స్కాట్లాండ్పై చేసిన 110 నాటౌట్ సెంచరీ కూడా ఉంది. ఇందులో 13 ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. ఈ సెంచరీతో అండర్ 19 టోర్నీలో తొలి సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. బౌలింగ్‌లోనూ రాణించి మూడు వికెట్లు తీసింది.అందనంత ఎత్తులో...టోర్నీలో మిగతా అమ్మాయిలకు అందనంత ఎత్తులో బ్యాటింగ్ యావరేజ్ 76.77తో త్రిష కొనసాగుతోంది. ఆమె తర్వాత రెండోస్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ డావినా పేరిన్ ఉంది. ఈ టోర్నీలో రెండుసార్లు త్రిష 40కి పైగా స్కోర్లు సాధించింది. అయితే అప్పటికే ప్రత్యర్థి జట్లు ముందుగా బ్యాటింగ్ చేయడంతో భారీ స్కోరు సాధించే అవకాశం త్రిషకు దక్కలేదు. కానీ స్కాట్ల్యాండ్తో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో త్రిష బ్యాట్ నుంచి ఫాస్టెస్ట్ సెంచరీ (53 బంతుల్లో) జాలువారింది. బ్యాటింగ్ యావరేజ్‌తో పాటు మోస్ట్ రన్స్, హయ్యెస్ట్ స్కోర్ విభాగంలోనూ త్రిష టాప్‌లో కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ మహిళల అండర్ 19 జట్టు సెమీస్‌కు చేరుకుంది.ఏజెన్సీప్రాంతం నుంచి మొదలైన త్రిష విజయపరంపర అంతర్జాతీయ స్థాయిలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవిమెన్ వరల్డ్ కప్‌లో ఇండియాకు ఆడాలి అండర్ 19, విమెన్ టీ20లో తొలి సెంచరీ చేయడం ద్వారా వరల్డ్ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది. విమెన్ అండర్ 19 టోర్నీలో మంచి పెర్ఫార్మెన్స్ చూపించి ఇండియా మహిళల జట్టుకు ఎంపిక కావాలి. రాబోయే వరల్డ్ కప్ టీమిండియా స్క్వాడ్‌లో నా పేరు ఉండాలనే లక్ష్యంతోనే ఈ టోర్నీకి వచ్చాను. నా లక్ష్యానికి తగ్గట్టుగా ఆడుతున్నాను. – గొంగడి త్రిష -
హిట్ సినిమా.. వారంలోనే ఓటీటీలో తెలుగు వర్షన్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కిన ఐడెంటిటీ(Identity Movie) సినిమా నేడు తెలుగులో విడుదలైంది. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ ప్రకటన కూడా అధికారికంగా వెలువడింది. వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించిన ఈ చిత్రాన్ని అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి కలెక్షన్స్ రాబట్టింది.'ఐడెంటిటీ' సినిమా ఓటీటీ రైట్స్‌ను జీ5 దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఇప్పటికే మలయాళ వర్షన్ విడుదలై చాలారోజు అయింది. దీంతో తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన చేశారు. అయితే, తెలుగులోనూ ఈరోజే (జనవరి 24) రిలీజ్ అయింది. ఇంతలోనే మరో వారం రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెడుతుండటం విశేషం. జనవరి 31న జీ5లో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుందని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్‌ను పంచుకుంది.ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు. -
విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో సంచలనాలకు చిరునామా నటి త్రిష(Trisha Krishnan) అంటారు. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఆమెకు సంబంధించి ఏ వార్త వచ్చినా నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. 41 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటూ భారీ హిట్లు కొడుతుంది. నటిగా 22 ఏళ్ల కెరీర్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ మొదలగు ఐదు భాషల్లో కథానాయకిగా సత్తా చాటుతుంది. ఇప్పటికీ అజిత్, చిరంజీవి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తూ అగ్ర కథానాయకిగానే కొనసాగుతుంది. ఇన్ని అర్హతలు కలిగిన ఈ చైన్నె సుందరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈమె గురించి వదంతులు చాలా కాలంగానే నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల నటుడు విజయ్‌తో (Vijay) కలుపుతూ రకరకాల ప్రచారం కూడా జరిగింది. ఈమె మాత్రం విజయ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ పలు వేదికల మీద తెలిపింది. అయితే, త్రిష త్వరలో రాజకీయ రంగ ప్రవేశం(Political Entry) చేయబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఈమె చాలా కాలం క్రితమే తనకు ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశ ఉందని పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. అదే విధంగా నటుడు విజయ్ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం బలంగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష తన అభిమానులకు త్వరలో ఒక షాకింగ్ న్యూస్ చెప్పబోతుందని వార్త సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఇప్పటికీ అగ్ర కథానాయకిగా నటిస్తూ బిజీగా ఉన్న త్రిష నటనకు స్వస్తి చెబుతారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే తనకు మంచి మిత్రుడు అని చెప్పుకునే నటుడు విజయ్ కూడా కెరీర్ పరంగా మంచి పీక్‌లో ఉండగానే నటనకు స్వస్తి చెబుతూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కాగా త్రిష ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పబోతున్నారనే వార్త ఎంతవరకు నిజం అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే, త్రిష పాలిటిక్స్‌లోకి తప్పకుండా ఎంట్రీ ఇస్తుందని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
త్రిష,టొవినో యాక్షన్ థ్రిల్లర్ సినిమా తెలుగులో విడుదల
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్(Tovino Thomas), త్రిష(Trisha) కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ(Identity Movie) చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. ఈమేరకు తాజాగా తెలుగు వర్షన్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భారీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించారు. మలయాళంలో జనవరి 2న విడుదలైన ఈ చిత్రం తెలుగులో జనవరి 24న రిలీజ్ కానుంది.ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉందని ఇప్పటికే మలయాళ రివ్యూలు తేల్చేశాయి. దీంతో సుమారు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎండీబీ రేటింగ్‌లో కూడా 9 వరకు ఉంది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై మక్కువ చూపారు. అయితే, మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా ‘ఐడెంటిటీ’ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి)ఐడెంటిటీ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా టొవినో థామస్ నటించారు. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో టొవినో థామస్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె చెబుతున్న ఆధారాలతో అతను ఎవరి స్కెచ్ వేశారు అనేది చాలా ఆసక్తిగా సినిమా ఉంటుంది. సంచలనం సృష్టించిన ఒక మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, స్కెచ్ ఆర్టిస్ట్ కలిసి ఎలా సాల్వ్ చేశారు అనే కథతో ఈ చిత్రం ఉంటుంది. సంక్రాంతికి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. కానీ, టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు ఉండటంవల్ల అవకాశం లేకుండాపోయింది. అందుకే ఈనెల 24వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఐడెంటిటీకి ఫిదా అవుతారు.టొవినో థామస్ నటించిన ఏఆర్ఎం మూవీ గతేడాది సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.120 కోట్లకుపైగా వసూలు చేసింది. ఆయన కెరీర్లో ఈ చిత్రం ఓ ల్యాండ్‌మార్క్ అని చెప్పవచ్చు. ఇప్పుడీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
థ్రిల్లింగ్ ఐడెంటిటీ
టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. దర్శక ద్వయం అఖిల్ బాయ్, అనాస్ ఖాన్ ఈ మూవీని తెరకెక్కించారు. రాజు మల్లియాత్, రాయ్ సిజె నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న మలయాళంలో రిలీజైంది. ఈ సినిమాకు మలయాళ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోందని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమా అదే టైటిల్‌తో తెలుగులో ఈ నెల 24న విడుదల కానుంది. మూవీ మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో శ్రీ వేదాక్షర మూవీస్ చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘ఉత్కంఠగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆకట్టు కునేలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
'96' సినిమా సీక్వెల్.. సింగపూర్, మలేషియా నుంచి కథ
ప్రస్థుతం చిత్రపరిశ్రమలో సీక్వెల్ నడుస్తోందని చెప్పవచ్చు. అయితే అన్ని చిత్రాల సీక్వెల్స్ హిట్ అవుతాయని గ్యారంటీ లేదు. బాహుబలి,పుష్ప వంటి కొన్ని చిత్రాల సీక్వెల్స్ మాత్రమే విజయం సాధించాయి. ఇండియన్–2, విడుదల-2 వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు పొందలేక పోయాయి. కాగా 2018లో తమిళ్లో విడుదలైన 96 చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇది పాఠశాల ప్రేమ కథా చిత్రంగా రూపొందింది. విదేశాల్లో ఉన్న త్రిష పాఠశాల స్నేహితులను కలవడానికి చైన్నెకి వస్తుంది. అప్పుడు తన చిన్ననాటి ప్రేమికుడు కూడా విజయ్‌సేతుపతి కూడా వస్తాడు. వారి మధ్య జరిగే మూగ ప్రేమే 96 చిత్ర కథ. కాగా ఏడేళ్ల తర్వాత ఈ చిత్ర సీక్వెల్‌కు దర్శకుడు ప్రేమ్‌కుమార్ సిద్ధం అవుతున్నారు. ఈయన ఇటీవల కార్తీ, అరవింద్‌స్వామి ప్రధాన పాత్రలు పోషించిన 'సత్యం సుందరం' చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఈ చిత్రం విడుదల సమయంలోనే 96 చిత్రానికి సీక్వెల్ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిసింది. ఈ చిత్రాన్ని వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మించనున్నారని సమాచారం. ఈ చిత్ర కథ సింగపూర్, మలేషియాల్లో జరిగే విధంగా ఉంటుందని దర్శకుడు ప్రేమ్‌కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తొలి భాగంలో త్రిష విదేశాల నుంచి చైన్నెకి వచ్చినట్లు చూపించిన విషయం తెలిసిందే. దీంతో రెండవ భాగం విదేశాల్లో జరుగుతుందని దర్శకుడు ఈసందర్భంగా చెప్పారు. అదేవిధంగా 96 చిత్ర కథను ప్రేమ ఇతివృత్తంతో రూపొందించగా, దాని సీక్వెల్ ప్రేమతో పాటు కుటుంబసమస్యలు, భావోద్రేకాలు వంటి అంశాలతో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
అజిత్ యాక్షన్ మూవీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, త్రిష జంటగా నటిస్తోన్న చిత్రం విడాముయార్చి. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.#Sawadeeka 🕺💃⚡️ https://t.co/Pm5XIZtP2LHappy New Year and love you all 🎉🎉🎉Dearest AK sir #MagizhThirumeni @trishtrashers Sung by @anthonydaasan 🎙️Written by @Arivubeing ✍🏻Choreography by @kayoas13 🕺#Vidaamuyarchi #EffortsNeverFail@LycaProductions #Subaskaran…— Anirudh Ravichander (@anirudhofficial) December 27, 2024ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. సవాదికా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ప్రస్తుతానికి కేవలం తమిళ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కాగా.. ఈ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, నిఖిల్ నాయర్, దాశరథి, గణేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
నా కొడుకు జోరో కన్నుమూశాడు!
‘నా కొడుకు జోరో క్రిస్మస్ రోజున కన్నుమూశాడు అంటూ నటి త్రిష ఇన్ స్ట్రాగామ్ పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు’. నటి త్రిష ఏంటి? కొడుకు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా? ఈ ఎవర్ గ్రీన్ హీరోయిన్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 40లోనూ 20లా స్టార్ హీరో లో సరసన నటిస్తున్నారు. కాగా ఈ బహు భాషా నటి సుధకి ప్రేమికురాలు అన్ని విషయం తెలిసిందే. కాగా ఇంట్లో జోరో అనే పెంపుడు కుక్క ఉంది అంది నటి త్రిషకు ప్రియమైన నేస్తం. అలాంటి కుక్క బుధవారం మరణించింది. దీని గురించి నటి త్రిష తన ఇన్ స్ట్రాగామ్ లో పేర్కొంటూ శ్ఙ్రీ 12 ఏళ్లు నాతో కలిసి పెరిగిన నా ప్రియమైన నేస్తం నా జోరో ( పెంపుడు కుక్క), క్రిస్మస్ రోజున కన్నుమూశాడు. జోరో లేకపోతే నా జీవితమే జీరో అని నా గురించి తెలిసిన వారందరికీ తెలుసు. జోరో మరణించడంతో మా కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాం. దీంతో సినిమాలకు కొద్ది రోజలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.శ్రీశ్రీ అని నటి త్రిష పేర్కొన్నారు.కాగా ఈమె మరణించిన కుక్కకు అంత్య క్రియలు నిర్వహించారు. ఆ సమాధిపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. నటి త్రిష చేసిన పోస్ట్ పలువురి హృదయాలను ద్రవింప జేసింది. -
వేకువజామున చనిపోయాడు.. త్రిష పోస్ట్ వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) బాధపడుతోంది. తన కొడుకు చనిపోయాడని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు కాస్త సమయం పడుతుందని తనని తానే సముదాయించుకుంది. ఇక్కడ జొర్రో అంటే త్రిష పెంపుడు కుక్క. పేరుకే కుక్క గానీ కొడుకులా పెంచుకున్నట్లు ఇన్ స్టాలో పోస్ట్ చూస్తే అర్థమవుతోంది.'నా కొడుకు జొర్రో.. ఈ క్రిస్మస్ నాడు వేకువజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసినవాళ్లకు.. జొర్రో నాకు ఎంతముఖ్యమనేది కూడా తెలుసు. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కుదుటపడటానికి కొన్నిరోజులు పడుతుంది. అప్పటివరకు అందుబాటులో ఉండను' అని హీరోయిన్ త్రిష ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ)గత ఇరవైళ్లుగా దక్షిణాది భాషల్లో హీరోయిన్గా చేస్తున్న త్రిష.. ఇప్పుడు 40 ఏళ్లు దాటినా సరే స్టార్ హీరోయిన్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో (Viswambhara Movie) మెయిన్ హీరోయిన్ ఈమెనే. తమిళంలో అజిత్ 'విడమూయార్చి', 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్. ఇది కాకుండా సూర్య, కమల్ హాసన్ (Kamal Haasan) కొత్త సినిమాల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మలయాళంలోనూ రెండు మూవీస్ చేస్తోంది.ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్న త్రిష.. ఇప్పుడు పెంపుడు కుక్క చనిపోయిందని పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్.. త్వరలో త్రిష తిరిగి మాములు మనిషి అవ్వాలని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కేసీఆర్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) -
Recap 2024: ఈ ఏడాది ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన హీరోయిన్స్ వీళ్ళే..!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నది సామెత. చిత్ర పరిశ్రమలో నటీనటులకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి అటు ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు కూడా పెంచుకోవాలి. అయితే పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. వారు నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాకపోవడం విశేషం. ఈ ఏడాది వెండితెరపై కనిపించని హీరోయిన్ల జాబితా డజనుకుపైగానే ఉంది. నయనతార, సమంత, అనుష్క, తమన్నా, త్రిష, సాయి పల్లవి, కీర్తీ సురేష్, పూజా హెగ్డే, శ్రుతీహాసన్, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, రాశీ ఖన్నా, నిధీ అగర్వాల్, మెహరీన్... వంటి పలువురు హీరోయిన్లు 2024ని మిస్ అయ్యారు. ఆ వివరాల్లోకి... 202రెండు సినిమాలతో జేజెమ్మతెలుగు చిత్ర పరిశ్రమలో జేజమ్మగా ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్నారు అనుష్క. ఆ మధ్య వరుస సినిమాలు చేసిన అనుష్క నాలుగేళ్లుగా కాస్త నెమ్మదించారు. 2020లో వచ్చిన ‘నిశ్శబ్దం’ సినిమా తర్వాత మూడేళ్ల అనంతరం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఆమె. అయితే 2024ని మాత్రం పూర్తిగా మిస్ అయ్యారు అనుష్క. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత తెలుగులో ఆమె కమిటైన చిత్రం ‘ఘాటీ’. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లోని ‘ఘాటీ’ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. నవంబరు 7న అనుష్క పుట్టినరోజు సందర్భంగా ‘ఘాటీ’ సినిమా నుంచి విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూ΄÷ందుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే సినిమా ద్వారా మలయాళ పరిశ్రమలో ఎంట్రీ ఇస్తున్నారు అనుష్క. ‘ఘాటీ’, ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ సినిమాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో 2025లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తారు అనుష్క. వచ్చే ఏడాదైనా... సౌత్‌లోని స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంతది ప్రత్యేక స్థానం. అందం, అభినయంతో దక్షిణాదిలోనే కాదు... ఉత్తరాదిలోనూ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారామె. ఆ మధ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఆమె ఈ మధ్య స్లో అయ్యారు. 2023లో ‘శాకుంతలం, ఖుషి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ 2024లో మాత్రం వెండితెరపై కనిపించలేదు. అయితే ‘సిటాడెల్ హనీ–బన్నీ’ అనే వెబ్ సిరీస్ ద్వారా వెబ్ ప్రేక్షకులను మాత్రం అలరించారామె. విజయ్ దేవరకొండకి జోడీగా సమంత నటించిన ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె కమిటైన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న ఈ సినిమాని ప్రకటించారు సమంత. అంతేకాదు... తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మెడలో నల్లపూసలు, చీర కట్టు, పెద్ద బొట్టుతో ఉన్న సమంత లుక్ చూస్తే ఆమె గృహిణి పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో గన్, ముఖం మీద రక్తపు మరకలు, ఆమె వెనకాల టెడ్డీ బేర్, స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్... ఇవన్నీ చూస్తే ఈ సినిమాలో మరొక కోణం కూడా ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించలేదు. మరి 2025లో అయినా సమంత వెండితెర ప్రేక్షకులను అలరిస్తారా? లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నారు సమంత. డాక్యుమెంటరీతో మాత్రమే... దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ అనగానే నయనతార పేరును టక్కున చెబుతారు ఆమె అభిమానులు. ఓ వైపు హీరోలకి జోడీగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారీ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఐదు తమిళ, రెండు మలయాళ, ఒకటి కన్నడ చిత్రం ఉంది. కాగా చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన ‘గాడ్ ఫాదర్’ (2022) సినిమాలో చిరంజీవి సోదరిగా నటించారు నయనతార. ఆ చిత్రం విడుదలై రెండేళ్లు దాటినా మరో తెలుగు సినిమా కమిట్ కాలేదామె. ఇతర భాషల్లో ఫుల్ బిజీగా ఉండటం వల్లనో లేకుంటే సరైన కథ కుదరకనో ఆమె తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపలేదు. ఆ విధంగా దక్షిణాదిలోనే అగ్ర కథానాయికగా దూసుకెళుతున్న నయనతార కూడా 2024లో ప్రేక్షకులను పలకరించలేక΄ోయారు. ఆమె నటించిన ఏ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాక΄ోవడంతో ఆమె ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. అయితే 2025లో మాత్రం దాదాపు అరడజనుకు పైగా సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే... ఓటీటీలో ప్రసారమవుతున్న ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీతో ఈ ఏడాది నయనతార కనిపించడం ఆమె అభిమానులకు ఓ చిన్న ఊరట. ప్రత్యేక పాటతో... చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం త్రిషది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి, తనకంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని సొంతం చేసుకున్నారామె. అందం, అభినయంలో ఇప్పటికీ నేటి తరం యువ హీరోయిన్లకు గట్టి ΄ోటీ ఇస్తున్నారు త్రిష. ఓ వైపు హీరోలకు జోడీగా నటిస్తూనే, మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ నటిస్తూ బిజీగా దూసుకెళుతున్న ఆమె నటించిన ఏ చిత్రం కూడా ఈ ఏడాది విడుదల కాలేదు. అయితే విజయ్ హీరోగా రూ΄÷ందిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’ (గోట్) సినిమాలో మాత్రం ఓ ప్రత్యేక ΄ాటలో నటించారు త్రిష. అలాగే ‘బృంద’ అనే ఓ వెబ్ సిరీస్‌తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించారామె. అవి మినహా 2024లో పూర్తి స్థాయిలో ఆమె ప్రేక్షకులను అలరించలేదు. అయితే వచ్చే ఏడాది పలు చిత్రాలతో తెరపై కనిపించనున్నారు. ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలు, రెండు మలయాళ సినిమాలతో ΄ాటు తెలుగులో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ కావడం విశేషం. ఇదిలా ఉంటే... 2025లో త్రిష నటించిన ఐదారు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం పక్కా అని స్పష్టం అవుతోంది. 2023లో మూడు... ఈ ఏడాది నో నటి, గాయని, మ్యూజిక్ కం΄ోజర్... ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సొంతం చేసుకున్నారు శ్రుతీహాసన్. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా దూసుకెళుతున్నారామె. 2023లో తెలుగులో ఆమె నటించిన ‘వాల్తేరు వీరయ్య (చిరంజీవి), వీరసింహారెడ్డి (బాలకృష్ణ), సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్ (ప్రభాస్) ’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు సినిమాలతో గత ఏడాది హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ 2024లో మాత్రం తన అభిమానులను నిరాశపరిచారు. ఈ ఏడాది ఆమె నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు శ్రుతీహాసన్. అలాగే ‘చెన్నై స్టోరీ’లోనూ నటిస్తున్నారామె. ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తాయని తెలుస్తోంది.వచ్చే ఏడాది స్ట్రయిట్ సినిమాతో... 2021లో ‘లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, ‘విరాట పర్వం’ చిత్రాలతో తెలుగు తెరపై కనిపించారు సాయి పల్లవి. ఆ తర్వాత తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకోలేదు. 2022లో ఆమె నటించిన తమిళ చిత్రం ‘గార్గీ’ తెలుగులోనూ విడుదలైంది. ఇక తమిళ చిత్రం ‘అమరన్’ తెలుగులోనూ విడుదల కావడంతో ఈ ఏడాది ఆ విధంగా తెలుగు ప్రేక్షకులను పలకరించారీ బ్యూటీ. సాయి పల్లవి నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘తండేల్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. సో... 2025లో స్ట్రయిట్ తెలుగు చిత్రంలో కనిపిస్తారామె. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. వచ్చే ఏడాది నాలుగు చిత్రాలతో... తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గోపికమ్మా, బుట్ట బొమ్మగా స్థానం సం΄ాదించుకున్నారు పూజా హెగ్డే. నాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్గా పరిచయమయ్యారామె. పదేళ్ల కెరీర్లో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, అఖిల్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి హీరోలకి జోడీగా నటించారు పూజా హెగ్డే. ‘ఆచార్య’ (2022) సినిమాలో రామ్‌చరణ్‌తో జతకట్టిన ఈ బ్యూటీ తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. అయితే ‘ఎఫ్ 3’ చిత్రంలో ఓ ΄ాటలో నర్తించారు. 2023లో ఆమె నటించిన ఒకే ఒక హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ రిలీజైంది. అయితే ఈ ఏడాది మాత్రం పూజ నటించిన ఏ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో మాత్రం రెండు హిందీ సినిమాలు, రెండు తమిళ చిత్రాలున్నాయి. 2024 గ్యాప్‌ని 2025లో భర్తీ చేయనున్నారు పూజ. వచ్చే ఏడాది నాలుగు చిత్రాల్లో పూజా హెగ్డే కనిపించే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే... తమన్నా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్, నిధీ అగర్వాల్, మెహరీన్ వంటి తారలు నటించిన ఏ భాషా చిత్రం కూడా 2024లో విడుదల కాలేదు. కీర్తీ సురేష్, రాశీ ఖన్నా, ప్రియమణి వంటి వారు 2024లో తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. కానీ, ఇతర భాషల ప్రేక్షకులను అలరించారు.– డేరంగుల జగన్ -
ఆలయంలో త్రిష పూజలు.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
నెటిజన్లకు ఎక్కువగా కంటెంట్స్ ఇచ్చే నటీమణుల్లో త్రిష ఒకరు అని చెప్పవచ్చు. కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ చైన్నె బ్యూటీ ఎప్పుడు చర్చనీయాంశమే. వృత్తిపరంగా చూస్తే 22 ఏళ్లు పూర్తి చేసింది. తన కెరీర్లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని, జయపజయాలను చవిచూసి ఇప్పటికీ అగ్రకథానాయకి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించడానికి ఏకై క ఆప్షన్‌గా వెలుగొందుతున్నారు. ఇక వ్యక్తిగతంగా త్రిష ఎప్పుడు సంచలనమే. ప్రేమ వ్యవహారంలో ఈమె గురించి పలు రకాల వార్తలు ప్రచారమవుతుంటాయి. అదేవిధంగా ఇంతకుముందే త్రిష పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయింది. 41 ఏళ్ల పరువాల ఈ భామ ఇప్పటికీ అవివాహితే అన్నది గమనార్హం. నటుడు విజయ్‌తో ఈమెను కలుపుతూ చాలాకాలంగా వదంతులు సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. తాజాగా నటి కీర్తి సురేష్ వివాహానికి నటుడు విజయ్, త్రిష చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే నటి త్రిష ఇలాంటి విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కాగా ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 45వ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి త్రిష కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్(కుమారస్వామి) ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. అక్కడ ఆమెను చూసిన ఇతర భక్తులు సాధారణ ప్రజలు ఆమెతో ఫొటో తీసుకోవడానికి గుమిగూడారు. వారందరితో ఫొటోలు దిగిన త్రిష అక్కడి నుంచి బయల్దేరి వచ్చేశారు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటి త్రిష దైవ దర్శనం చేసుకోవడంపై కూడా నెటిజన్లు ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు. View this post on Instagram A post shared by NTC Talks (@ntctalks) -
నయన్ ను వెనక్కి నెట్టిన త్రిష.. 22 ఏళ్ళు అయిన తగ్గని క్రేజ్..
-
త్రిషకు 22 ఏళ్లు పూర్తి.. సూర్యతో కేక్ కట్ చేసిన బ్యూటీ
చిత్ర పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వారి లక్షణం.. నటి త్రిష కూడా తన కెరీర్లో ఇదే చేసింది. 2002లో సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత విజయ్ సరసన నటించిన గిల్లీ, విక్రమ్ జంటగా చేసిన స్వామి వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించడంతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆపై తెలుగులో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్రిష బహుభాషా నటిగా మారిపోయారు. ఆ తర్వాత హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందారు. అలా ఇప్పుడు శతాధిక చిత్రాల కథానాయకిగా రాణిస్తున్న త్రిష అసలు వయసు 41 ఏళ్లు. కథానాయకి వయసు 22 ఏళ్లు. ఇప్పటికీ పలు భాషల్లో స్టార్ హీరోలతో జతకడుతూ ఆగ్ర కథానాయకిగా రాణించటం విశేషం. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్న నటి త్రిష, నటుడు కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ, సూర్య సరసన ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంతో పాటు మలయాళంలో మోహన్ లాల్ సరసన రామ్, టోవినో థామస్ కు జంటగా ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగు పదులు దాటినా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న త్రిష శుక్రవారంతో కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో ‘‘నేను కథానాయకిగా పరిచయమై 22 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రేక్షకులైన మీ వల్లే ఇదంతా జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఈ ఇకపోతే ఈమె శుక్రవారం సూర్య సరసన నటిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ చిత్ర యూనిట్ త్రిష కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. -
ట్రెండింగ్‌లో #JusticeforSangeetha.. అంతా త్రిష వల్లే?
ఆన్‌స్క్రీన్‌పై సూపర్ హిట్ అనిపించే జోడీలు కొన్ని ఉంటాయి. విజయ్ - త్రిష కూడా ఈ జాబితాలోకే వస్తారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా వీరు జంటగానే ఉంటారంటూ ఎప్పటినుంచో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ ఓ ప్రైవేట్ జెట్‌లో కలిసి ప్రయాణించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవగా జస్టిస్ ఫర్ సంగీత అన్న హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.భార్యకు దూరంగా విజయ్?సంగీత మరెవరో కాదు, విజయ్ భార్య. వీరిద్దరూ 1999లో పెళ్లి చేసుకోగా జేసన్ సంజయ్, దివ్య సాష అని ఇద్దరు సంతానం. గతేడాది విజయ్- సంగీత మధ్య పొరపచ్చాలు వచ్చాయని ప్రచారం జరిగింది. విజయ్ సినిమా ఈవెంట్లలోనూ కనిపించకపోవడంతో దూరం పెరిగిందని అంతా అనుకున్నారు. అయితే సంగీత వెకేషన్లో ఉండటం వల్లే విజయ్ మూవీ ఈవెంట్లకు హాజరు కాలేదన్నది మరో వాదన.ట్రెండింగ్‌లో విజయ్ -త్రిషఇప్పుడేకంగా వీరు కలిసి ట్రావెల్ చేస్తుండటంతో నెటిజన్లు విజయ్-త్రిష వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఏదైనా సినిమా కోసం కలిసి వెళ్తున్నారనుకోవచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు.Co-stars or power couple? Vijay and Trisha spotted boarding a private jet together. The industry is talking!#JusticeforSangeetha#AlluArjun #Delhi #AlluArjunArrest pic.twitter.com/q0NT6DQMB3— Roshan meena (@1f8be1a6f3fe4ad) December 13, 2024Exclusive footage of Vijay and Trisha sparks buzz! 🛩️👀 Work or something more? 🔥 #JusticeforSangeetha #TrishaKrishnan #ThalapathyVijay𓃵 pic.twitter.com/no2kkMUzuH— Rahul Kumar Pandey (@raaahulpandey) December 13, 2024చదవండి: Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ -
స్కెచ్ వేస్తారా?
త్రిష, టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఐడెంటిటీ’. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాజు మల్లియాత్, సీజే రాయ్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.ఈ చిత్రంలో స్కెచ్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు టొవినో థామస్. ఓ క్రైమ్‌ను చూసి త్రిష... నేరస్తుడిని పట్టుకునే క్రమంలో అతని స్కెచ్ వేస్తారా? అని టొవినోకు చెబుతున్నట్లుగా టీజర్లో కనిపిస్తోంది. టొవినోకు ఆ నేరస్తుడి ముఖాకృతిని త్రిష వివరిస్తుంటారు. వచ్చే జనవరిలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
రిపీట్ కాంబోస్‌తో ఊరిస్తున్న త్రిష..
-
45 రోజులు వర్షంలో షూటింగ్.. ఆ సినిమా మానేసి వెళ్లిపోదాం అనుకున్నా : త్రిష
‘నా కెరీర్లో ‘వర్షం’ సినిమా చాలా ప్రత్యేకం’ అన్నారు హీరోయిన్ త్రిష. ఇటీవల ఓ టీవీ షోలో తల్లి ఉమతో కలిసి పాల్గొన్నారు త్రిష. ‘మీ కెరీర్లో బాగా ఇబ్బంది పడిన సినిమా ఏంటి?’ అంటూ త్రిషని ప్రశ్నించారు యాంకర్. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ–‘‘నా కెరీర్లో ‘వర్షం’ మూవీ చాలా స్పెషల్. అలాగే ఎక్కువ ఇబ్బంది పడ్డ సినిమా కూడా అదే. నా కెరీర్ ఆరంభంలో ‘వర్షం’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఈ చిత్రం కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశాం. ఆ సమయంలో తడవడంతో జలుబు, జ్వరంతో ఇబ్బంది పడ్డాను. ఒక దశలో సినిమా మానేసి వెళ్లిపోవాలనిపించింది.అయితే ఆ చిత్రం ఘనవిజయం సాధించడంతో నా కష్టం మరచి పోయాను. తెలుగులో నాకు బ్రేక్ ఇచ్చిన సినిమా ‘వర్షం’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... త్రిష సోలో హీరోయిన్గా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన డైరెక్ట్ చిత్రం ‘వర్షం’. తరుణ్ హీరోగా తమిళ్, తెలుగు భాషల్లో తెరకెక్కిన ‘నీ మనసు నాకు తెలుసు’ (2003) చిత్రంలో శ్రియ ఓ హీరోయిన్ కాగా త్రిష మరో కథానాయికగా నటించారు. ప్రభాస్ హీరోగా శోభన్ దర్శకత్వం వహించిన ‘వర్షం’ చిత్రంలో సోలో హీరోయిన్గా నటించారు త్రిష. 2004 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘వర్షం’తో సూపర్‌హిట్ జోడీ అనిపించుకున్న ప్రభాస్–త్రిష ఆ తర్వాత ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) వంటి చిత్రాల్లో నటించారు. ఇక ‘వర్షం’ తర్వాత తెలుగులో త్రిష బిజీ హీరోయిన్ అయ్యారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, రవితేజ, గోపీచంద్, నితిన్, సిద్ధార్థ్ వంటి హీరోలకి జోడీగా నటించారు త్రిష. రెండు దశాబ్దాల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన త్రిష ఇప్పటికీ బిజీ హీరోయిన్గా దూసుకెళుతున్నారు. అలాగే యువ హీరోయిన్లకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం త్రిష నటిస్తున్న తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారామె. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి–త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. వచ్చే ఏడాది వేసవిలో ‘విశ్వంభర’ విడుదల కానుందని టాక్. అదే విధంగా ప్రస్తుతం పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు త్రిష. -
హీరో సూర్య 45వ చిత్రం ప్రారంభం..హీరోయిన్గా త్రిష (ఫొటోలు)
-
సూర్య @ 45
హీరో సూర్య 45వ చిత్రం బుధవారం ఉదయం పొల్లాచ్చి సమీపంలోని ఆనైమలై ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన మాసానీ అమ్మన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఇందులో నటి త్రిష హీరోయిన్గా నటించనున్నారు. నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవంలో నటుడు సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీల కుటుంబ సభ్యులు, నిర్మాత ఎస్ఆర్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.– సాక్షి, తమిళ సినిమా -
18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్
‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఇలా లాంగ్ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.పద్దెనిమిదేళ్ల తర్వాత... హీరో చిరంజీవి, హీరోయిన్ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్ అవుతోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా రూపొందిన ‘గేమ్ చేంజర్’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. 38 ఏళ్ల తర్వాత...సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తెరకెక్కించిన లోకేశ్ కనగరాజ్ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్–సత్యరాజ్ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్ భరత్’లో సత్యరాజ్ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్. అయితే సత్యరాజ్ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్ చేశారని కోలీవుడ్ టాక్. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్ కనగరాజ్. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇరవై ఏళ్ల తర్వాత... మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్ జోడీగా పేరొందిన మోహన్ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్ లాల్ హీరోగా తరుణ్ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్ 360’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోంది. ఎమ్. రంజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్ కొంబాట్’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోని వీరు (‘సాగర్ ఆలియాస్ జాకీ రీ లోడెడ్’ సినిమాలో మోహన్ లాల్ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.పాన్ ఇండియా సినిమా కోసంమలయాళ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్ ఓ పాన్ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్ లెంగ్త్ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్ లాల్ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్. 38 ఏళ్ల తర్వాత... హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్ టైలర్’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్ టైలర్’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.పంతొమ్మిదేళ్ల తర్వాత... తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్ త్రిషలది హిట్ జోడీ. వీరి కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్. సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్ టాక్. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004), ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్ అవుతుంది.టెస్ట్ మ్యాచ్‌కి సిద్ధం హీరోలు మాధవన్–సిద్ధార్థ్ క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్’. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్ శక్తిశ్రీ గోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్–సిద్ధార్థ్ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్–సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్ టాక్.– డేరంగుల జగన్ -
నేను మనుషులను పట్టించుకోను: త్రిష
అందాల భామ నటి త్రిష. నాలుగు పదుల పరువాల సంచలన నటి ఇప్పటికీ అవివాహితనే అన్నది తెలిసిందే. కథానాయకిగా సెంచరీలు కొట్టినా పెళ్లికి మాత్రం దూరంగా ఉంటూ సోలో లైఫే సో బెటర్ అనేలా నడుపుతున్నారు. అయితే చాలా కాలం క్రితమే చైన్నె బ్యూటీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఒక నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది కారణాలు ఏమైనా పెళ్లి పీటలు ఎక్కలేదు అప్పటినుంచి త్రిష నటనపైనే దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమే అంటూ అందుకు సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నారు. అదే విధంగా ఈ అమ్మాయి గురించి ప్రేమ వదంతులు చాలానే దొర్లాయి. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా అసలు మనుషులతో పనిఏంటి అనే విధంగా తన ఎక్స్ మీడియాలో ఓ టీట్ చేశారు. అందులో తాను మనుషులను దూరంగా పెడతానని, శునకాలను ప్రేమిస్తానని అయితే నా శునకాలు మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయన్నారు. కాబట్టి మనమంతా కలిసి ప్రేమైక సమాజాన్ని స్థాపిద్దాం అని త్రిష పేర్కొన్నారు. ఈమె ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేవిధంగా త్రిష గురించి మరో విషయం కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈమె తన అభిమాన నటుడు విజయ్ అని చాలాసార్లు పేర్కొన్నారు. కాగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో త్రిష ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటుడు విజయ్ ఆదివారం ఆయన తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమె మహానాడులో పాల్గొనక పోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. -
త్రిషకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా..?
వెండితెర వెలుగులైన సినీ తారలకు దేవుళ్లు అభిమానులే. వారి అభిమానం పొందకపోతే ఎవరూ స్టార్ కాలేరు అన్నది వాస్తవం. అలా అసంఖ్యాక అభిమానులు కలిగిన నటీమణుల్లో త్రిష ఒకరు. గత రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయాలతో అభిమానులను ఆరిస్తున్న అగ్ర కథానాయికగా రాణిస్తున్న నటి ఈ చైన్నె చిన్నది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రముఖ కథానాయకులు అందరితోనూ జతకట్టిన క్రెడిట్ ఈమెది. ఖట్టా మిఠా అనే హిందీ చిత్రంలో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైయ్యారు. అలా పాన్ ఇండియా హీరోయిన్గా ముద్ర వేసుకున్నారు. ఇప్పటికీ టాప్‌స్టార్స్‌తో జతకడుతున్న త్రిష చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఒకేసారి ఒకే హీరోతో రెండు చిత్రాల్లో నటించడం అన్నది అరుదైన విషయమే. అదేవిధంగా మణిరత్నం దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ త్రిష నటిస్తున్నారు. ఇకపోతే తెలుగులో చిరంజీవికి జతగా విశ్వంభర చిత్రంలో నటిస్తున్న ఈమె మలయాళంలో రామ్, ఐడెంటిటీ చిత్రాల్లో లభిస్తున్నారు. ప్రతిభకు కామా ఉంటుందేమో గాని ఫుల్స్టాప్ ఉండదు అని నిరూపించిన నటి త్రిష. ఆరంభ దశలో సామి, గిల్లి వంటి చిత్రాలకు ముందు ఆ తర్వాత అన్నట్టుగా వెలిగిన ఈమె ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా వెలిగిపోతున్నారు. అలాంటి త్రిషకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అలాంటిది ఈమె కూడా కొందరికి వీరాభిమానినేనట. ఒక భేటీలో త్రిష పేర్కొంటూ తనకు నటి అనుష్క, నిత్యామీనన్, ఇవానా, సాయి పల్లవి అంటే చాలా ఇష్టమని తాను వారికి అభిమానిని అని పేర్కొన్నారు. -
'విశ్వంభర' టీజర్ తేదీని ఫిక్స్ చేసిన మెగాస్టార్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. దసర సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఇదే విషయాన్ని తాజాగా ఒక పోస్టర్‌తో అభిమానులతో పంచుకున్నారు.దసర సందర్భంగా అక్టోబర్ 12న విశ్వంభర టీజర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శనివారం ఉదయం 10:49 గంటలకు ప్రేక్షకులను విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి కావస్తుంది.చిరంజీవి ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకులను మెప్పించారు. క్రేజీ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి ‘విశ్వంభర’ రెడీ అవుతోంది. ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోందని ఇప్పటికే చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. -
25 ఏళ్ల నాటి ఫోటో షేర్ చేసిన స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
కళామతల్లిని నమ్మినవారిని ఎన్నటికీ చేయి విడువదు. ఇందుకు ఉదాహరణ నటి త్రిష. సుమారు 25 ఏళ్లుగా ఈ బ్యూటీ చెక్కు చెదరని అందాలతో కథానాయకిగా రాణిస్తున్నారు. మధ్యలో చిన్న ఆటుపోటులకు గురైనా త్రిష సినిమా కెరీర్ అధికంగా ఉన్నత స్థాయిలోనే కొనసాగుతోంది. తొలుత తమిళంలో నాయకిగా రాణించినా, ఆ తరువాత ఆమె క్రేజ్ తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల వరకూ చేరింది. అలా ఈ ఐదు భాషల్లోనూ ప్రముఖ స్టార్స్‌తో జత కట్టి అగ్రకథానాయకిగా వెలిగి పోతున్నారు. ఇదీ చదవండి: అర్థరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్నిజం చెప్పాలంటే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో దర్శకుడు మణిరత్నం త్రిషకు మంచి రీఎంట్రీ ఇచ్చారనే చెప్పాలి. ఈ నాలుగు పదుల పరువాల భామ ఇప్పుడు నటుడు అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో పాటు కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా ఒక చిత్రం, మలయాళంలో మోహన్‌లాల్, టోవినో థామస్‌తో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. త్రిష మొదట్లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆమె ఆ కిరీటాన్ని 1999లో గెలుచుకున్నారు. అది జరిగి 25 ఏళ్ల గడిచిన సందర్భంగా ఆ మధురమైన స్మృతులను తలచుకుంటూ తన ఇన్‌స్ట్రాగామ్‌లో ఆ ఫొటోలను పోస్ట్ చేశారు. అందులో తన జీవితాన్ని మార్చిన రోజు అది అని పేర్కొన్నారు. -
ది గోట్ నుంచి 'విజయ్, త్రిష' మాస్ సాంగ్ విడుదల
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ (ది గోట్). తాజాగా ఈ సినిమా నుంచి మాస్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ, బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టింది.ది గోట్ సినిమాలో విజయ్‌తో కలిసి స్టార్ హీరోయిన్ త్రిష ఓ స్పెషల్ సాంగ్‌కు స్టెప్పులు వేశారు. వారిద్దరూ కలిసి వేసిన మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పాట కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ది గోట్ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 3న స్ట్రీమింగ్కు రావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. -
మహేశ్‌తో కాలేజ్ డేస్ నుంచే పరిచయం : త్రిష
‘‘మహేశ్‌బాబు చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కళాశాల రోజుల్లో చెన్నైలో ఉన్నాం’’ అన్నారు హీరోయిన్ త్రిష. మహేశ్‌బాబు, త్రిష కలిసి ‘అతడు’ (2005), ‘సైనికుడు’ (2006) వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ నటించలేదు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిషకి.. ‘మహేశ్‌బాబు గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అనే ప్రశ్న ఎదురైంది. (చదవండి: ఈ వీకెండ్ ఏకంగా 24 మూవీస్.. అవి ఏంటంటే?)ఇందుకు త్రిష బదులిస్తూ– ‘‘నాకు ఇష్టమైన నటుల్లో మహేశ్‌బాబు ఒకరు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తోటి నటులను చాలా గౌరవిస్తారు. సెట్లో చాలా సరదాగా ఉంటారు. అలాగే చాలా హార్డ్ వర్క్ చేస్తారు. తన షూటింగ్ అయిపోయినా కేరవ్యాన్‌లోకి వెళ్లకుండా మానిటర్ దగ్గర కూర్చొని గమనిస్తూ ఉంటారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మహేశ్ చాలా కాలం నుంచి నాకు తెలుసు. మేమిద్దరం కాలేజ్ డేస్‌లో చెన్నైలో ఉన్నాం. మా ఇద్దరికీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉండేవారు. వారి వల్ల మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. మేము యాక్టర్స్ అవుతామని అప్పుడు అనుకోలేదు’’ అన్నారు త్రిష. ఇదిలా ఉంటే త్రిష నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటిస్తున్నారు త్రిష. ‘స్టాలిన్’ (2006) సినిమా తర్వాత చిరంజీవి– త్రిష కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ‘విశ్వంభర’ విడుదల కానుంది. -
వయసు సంబంధం లేకుండా దూసుకుపోతున్న త్రిష ..
-
ఆ హీరో కోసం ఐటెం సాంగ్ త్రిష
-
స్టార్ హీరోపై అభిమానం.. స్పెషల్ సాంగ్‌కు త్రిష ఓకే
ఐటం సాంగ్స్‌లో నటించడానికి నటీమణులకు నిర్మాతలు భారీ మొత్తం చెల్లిస్తుంటారు. అందుకు ఉదాహరణ నటి తమన్నా. ఈమె చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేశారు. తాజాగా నటి త్రిష గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) చిత్రంలో ప్రత్యేక పాటలో మెరవనున్నారు. దీని గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా, చిత్ర వర్గాలు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం గోట్. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఎజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, మైక్ మోహన్, ప్రేమ్‌జీ, నటి మీనాక్షీ చౌదరి, స్నేహ, లైలా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబరు 5న భారీ ఎత్తున్న విడుదలకు సిద్ధం అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత వరకూ నిర్వహించ లేదు. కారణం ఇంతకు ముందు విజయ్ నటించిన చిత్రాల ఆడియో విడుదల వేడుకల సమయంలో పలు సమస్యలు ఎదురు కావడమే కావచ్చు. అయితే గోట్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేదీ, లేనిదీ త్వరలోనే వెల్లడిస్తామని క్రియేటివ్ నిర్మాత అర్చన ఇటీవల పేర్కొన్నారు. అయితే దాని గురించి ఇప్పటి వరకూ తెలపలేదు. ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు, టీజర్ విడుదలై గోట్ చిత్రంపై అంచనాలను పెంచేశాయి. తాజాగా నాలుగో పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. విజయ్‌తో నటి త్రిష నటించిన ప్రత్యేక పాటనే అయ్యి ఉంటుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా గోట్ చిత్రంలోని నాలుగవ పాట విడుదల కోసం విజయ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు త్రిష మరే సినిమాలోనూ ఐటం సాంగ్ చేయలేదు. విజయ్‌పై అభిమానంతో గోట్ సినిమాలో ప్రత్యేకమైన సాంగ్ చేసేందకు గ్రీన్ ఇచ్చిందని కోలివుడ్లో ప్రచారం జరుగుతుంది. -
డబుల్ చాన్స్?
హీరోయిన్ త్రిష ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’, తమిళంలో కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’, అజిత్ ‘విడా ముయర్చి’, మలయాళంలో మోహన్‌లాల్ ‘రామ్’... ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇంకా త్రిషకు మరో రెండు పెద్ద అవకాశాలు వచ్చాయనే టాక్ వినిపిస్తోంది. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమోః వెంకటేశాయ’ (2010), ‘బాడీగార్డ్’ (2012) చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్‌తో కలిసి త్రిష మరోసారి నటించనున్నారట. నందు దర్శకత్వంలో వెంకటేశ్ ఓ సినిమా చేయనున్నారని, ఇందులోనే త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ‘వర్షం’ (2004), ‘΄ûర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) సినిమాల్లో ప్రభాస్, త్రిష జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించనున్నారట. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోనే త్రిష హీరోయిన్గా నటిస్తారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇక పద్దెనిమిదేళ్ల తర్వాత చిరంజీవితో కలిసి త్రిష ‘విశ్వంభర’ చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి ‘స్టాలిన్’ (2006) చేశారు. మరి.. పన్నెండేళ్ల తర్వాత వెంకటేశ్‌తో, పదహారేళ్ల తర్వాత ప్రభాస్‌తో నటించే డబుల్ చాన్స్ త్రిషకు దక్కుతుందా? వేచి చూడాలి. -
ప్రభాస్‌కు బెస్ట్ జోడీ.. 18 ఏళ్ల తర్వాత ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
టాలీవుడ్లో హిట్ పెయిర్స్ లిస్ట్‌లో ప్రభాస్-త్రిష జోడీ ప్రముఖంగా ఉంటుంది. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి మూడు సినిమాల్లో కనిపించి మెప్పించారు. అయితే, మరోసారి వీరిద్దరూ వెండితెరపై మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలో త్రిష పేరు ట్రెండ్‌లో ఉంది. 40 ఏళ్లు దాటినా కూడా ఇప్పుడొస్తున్న హీరోయిన్లుకు ఏమాత్రం తగ్గని గ్లామర్‌తో ఈ బ్యూటీ దూసుకుపోతుంది.ప్రభాస్-త్రిష జోడీ వర్షం, బుజ్జిగాడు, పౌర్ణమి సినిమాలతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను ఫిదా చేశారు. ముఖ్యంగా వర్షం సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. స్టార్ హీరోయిన్ స్థాయికి చేర్చింది. అయితే, ఇప్పుడు మరోసారి ఈ జోడీ ‘స్పిరిట్’ సినిమాలో కలిసి నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిష అయితే బాగుంటుందని ప్లాన్ చేస్తున్నారట. ఈ అంశం గురించి ఇప్పటికే త్రిషతో చర్చలు కూడా జరిగాయని టాక్. ఈ భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని వార్తలు వస్తున్నాయి. సందీప్‌రెడ్డి వంగా నుంచి యానిమల్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రభాస్ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పిరిట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తయినట్లు ఇటీవల సందీప్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ ఒక బలమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. 'రాజాసాబ్'తో బిజీగా ఉన్న ఆయన ఈ చిత్రం తర్వాత స్పిరిట్ పట్టాలెక్కనుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. మరోవైపు త్రిష కూడా సౌత్ ఇండియాలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. 'బృంద' వెబ్ సిరీస్‌తో ఆమె భారీ విజయాన్ని అందుకుంది. చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో కూడా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. -
విశ్వంభర యాక్షన్
చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ అ¯Œ్ల అరసు నేతృత్వంలో ‘విశ్వంభర’ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘‘చిరంజీవి చరిష్మాటిక్ ప్రెజెన్స్ తో ‘విశ్వంభర’ మునుపెన్నడూ లేని ఎక్స్పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించడానికి రెడీ అవుతోంది. ‘విశ్వంభర’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్ వండర్లా ఉండబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న రిలీజ్ కానుంది. చిరంజీవి కోటి విరాళం కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వయనాడ్‌లో భారీ ఎత్తున ్ర΄ాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన నటీనటులు తమవంతుగా ఆపన్న హస్తం అందిస్తున్నారు. తాజాగా హీరో చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కోటి రూ΄ాయలు విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. అల్లు అర్జున్ 25లక్షల విరాళంవయనాడ్ వరద బాధితుల సహాయార్థం హీరో అల్లు అర్జున్ కూడా 25 లక్షలు విరాళం ప్రకటించారు.సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆ మొత్తాన్ని అందించనున్నట్లు ఆయన తెలి΄ారు. -
Brinda Web Series Review: 'బృంద' వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్: బృందవిడుదల: ఆగష్టు 2 నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ఎపిసోడ్స్: 8స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లాసౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.కథకథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్‌తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్‌తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది. మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్‌కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు. అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్‌ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ. త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్‌గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.ఎలా ఉందంటే..కథ ప్రారంభం 1996 టైమ్‌లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సిరీస్‌ను నడిపించారు. బృంద ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్‌లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్‌గా బృంద ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. -
భారీ బడ్జెట్ సినిమా నుంచి 'త్రిష' ఫస్ట్ లుక్ రిలీజ్
నటుడు అజిత్ కథానాయకుడిగా నటి స్తున్న తాజా చిత్రం 'విడాముయర్చి'. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మి స్తోంది. తరచూ వార్తల్లో ఉంటున్న చిత్రం నుంచి తాజాగా త్రిష ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.మొదట ఈ చిత్రానికి విఘ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, దర్శకుడు మగిళ్ తిరుమే ణి చెప్పిన కథ నచ్చడంతో అజిత్ ఆయన దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న విడాముయర్చి చిత్రంపై అంచనాలు మాత్రం భారీ స్థాయిలోనే ఉన్నాయి. తాజాగా విడుదలైన త్రిష ఫస్ట్ లుక్‌లో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. ఓ రెస్టారెంట్లో త్రిషతో పాటు అజిత్ ఉన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో అజిత్‌కు సతీమణిగా ఆమె కనిపించనుంది.కాగా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నారు. ఇంతకుముందు దీపావళికి విడుదలైన ఈయన చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌ను వారు కొనసాగిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా తెరకెక్కుతున్న దీని వ్యాపారం హాట్ హాట్‌గా జరుగుతున్నట్లు ప్రచారం. కర్ణాటకలో విడాముయర్చి చిత్రం వ్యాపారం రజనీకాంత్, విజయ్‌ల చిత్రాలను మించి పోయినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. #VidaaMuyarchi 🌟🧿#EffortsNeverFail pic.twitter.com/mTvEtUHuEN— Trish (@trishtrashers) July 19, 2024 -
14 ఏళ్ల తరువాత బాలీవుడ్లో అడుగుపెట్టనున్న బ్యూటీ!
వయసు పెరుగుతున్న కొద్ది, అందంతో పాటు అవకాశాలు పెరుగుతున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో నటి త్రిష ఒకరు. కెరీర్ దాదాపు ఎండ్ అయ్యిందనుకుంటున్న పరిస్థితుల్లో దర్శకుడు మణిరత్నం పుణ్యమా అంటూ పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో త్రిష మళ్లీ పూర్వవైభవాన్ని అందుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలే అవకాశాలు. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన గోట్ చిత్రంలో ఐటం సాంగ్‌కు డాన్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇకపోతే అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ చిత్రంలోనూ, తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్ వంటి చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా మరోసారి బాలీవుడ్లో అడుగు పెడుతున్నారన్నది తాజా సమాచారం. అక్కడ సంచలన స్టార్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో రొమాన్స్ చేయనున్నట్లు తెలిసింది. దీన్ని కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఈయన ప్రస్తుతం దివంగత ప్రముఖ నటుడు మురళీ రెండవ వారసుడు ఆకాశ్మురళిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ నేసిప్పాయా అనే చిత్రాన్ని తెరకెక్కించారు. నటి అదితి శంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. దీంతో దర్శకుడు విష్ణువర్థన్ బాలీవుడ్ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో నటి త్రిష కథానాయకిగా నటించనున్నట్లు అనధికారిక వార్త. ఈ చిత్రానికి ది బుల్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. చిత్రం తొలి షెడ్యూల్‌ను స్పెయిన్ దేశంలో నిర్వహించనున్నట్లు, ఇందులో నటి త్రిష పాల్గొనడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ బ్యూటీ 14 ఏళ్ల క్రితం ఖట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ప్రియదర్శన్ ఈమెను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. నటుడు అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం 2010లో విడుదలై ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో త్రిష ఆ తరువాత కన్నెత్తి చూడలేదు. అలాంటిది ఇన్నాళ్లకు దర్శకుడు విష్ణువర్ధన్ మరోసారి ఈమెను బాలీవుడ్‌కు తీసుకెళ్లుతున్నారన్న మాట. -
త్రిష కాదు మళ్లీ నయనతారనే
నటి నయనతార క్రేజ్ ఇప్పట్లో తగ్గేలాలేదు. లేడీ సూపర్‌స్టార్ పట్టం ఈమెను వదిలేలా లేదు. అంతే కాదు ఇంకా బహుభాషా నటిగా ఏలేస్తున్నారీ సంచలన నటి. విషయం, విశేషం ఏదైనా వార్తల్లో ఉండే నటి నయనతార. అది సినిమాలోనైనా కావచ్చు, వ్యక్తిగతంగానైనా కావచ్చు. ఇప్పటికీ తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మళయాళంలో నివిన్ బాలీ సరసన డియర్, యష్‌కు జంటగా టాక్సిక్ చిత్రాలతో పాటు మన్నాంగట్టి అనే తమిళ చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా మరో చిత్రానికి సంతకం చేశారు. ఈమె 2020లో దేవతగా ప్రధాన పాత్రను పోషించిన మూక్కుత్తి అమ్మన్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఆర్జే.బాలాజీ కీలక పాత్రను పోషించి దర్శకత్వం వహించారు. కాగా నాలుగేళ్ల తరువాత మూక్కుత్తి అమ్మన్ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. కాగా మూక్కుత్తి అమ్మన్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని, దీనికి మాసాణి అమ్మన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఆర్జే బాలాజీనే దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. అంతే కాకుండా ఇందులో నయనతార పాత్రలో నటి త్రిష నటించనున్నట్లు ప్రచారం వైరల్ అయ్యింది. అలాంటిది తాజాగా మూక్తుత్తి అమ్మన్ చిత్రానికి సీక్వెల్ రూపొందించనున్నట్లు వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ చిత్ర సంస్థ శనివారం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు ఇందులో నటి నయనతారనే నాయకిగా నటించనున్నట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇకపోతే ఈ చిత్రం నిర్మాణంలో నయనతార, విఘ్నేశ్‌శివన్‌కు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ భాగం కానున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు, చిత్రాన్ని 2025లో తెరపైకి తీసుకువచ్చేలే ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోసారి నయనతారను అమ్మవారిగా చూడబోతున్నామన్నమాట. -
నయనతార, త్రిష.. 'అమ్మోరు తల్లి'గా వచ్చేదెవరంటే..
'అమ్మోరు తల్లి' సినిమాలో నయనతార నటించిన విషయం తెలిసిందే. 2020లో వచ్చిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఇందులో కూడా మళ్లీ నయనతార నటిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. తమిళంలో 'మూకుత్తి అమ్మన్'గా తెరకెక్కిన సినిమాను తెలుగులో 'అమ్మోరు తల్లి' పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఫాంటసీ కామెడీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది.డిస్నీ+హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల అయిన 'అమ్మోరు తల్లి' సినిమాలో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ విజృంభించింది. అయితే, సీక్వెల్లో నటించేందుకు నయనతార నిరాకరించిందని, ఆ స్థానంలో త్రిష కథానాయికగా నటిస్తుందని అప్పట్లో ఒక వార్త నెట్టింట వైరల్ అయింది. నయనతార ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని ఆమెకు ప్రశంసలు కూడా దక్కాయి. అలాంటిది సీక్వెల్లో మరొకరిని తీసుకొస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చని భావించిన మేకర్స్ ఫైనల్‌గా నయన్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది. తాజాగా అమ్మోరు తల్లి 2 చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ వేల్స్ అధికారికంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను వారు విడుదల చేశారు. భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో పార్ట్ 1 తెరకెక్కించారు. మరీ సిక్వెల్లో వారు ఎలాంటి కథతతో వస్తారో చూడాల్సి ఉంది. -
బృంద వస్తోంది
హీరోయిన్ త్రిష టైటిల్ రోల్లో నటించిన థ్రిల్లింగ్ క్రైమ్ మిస్టరీ వెబ్ సిరీస్ ‘బృంద’. సూర్య మనోజ్ వంగాలా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ టీజర్ విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌లో పోలీసాఫీసర్ బృందగా త్రిష నటించారు. ఆమె నటించిన తొలి వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. -
ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. టీజర్ చూస్తే చాలు!
కోలీవుడ్ భామ త్రిష గతేడాది లియోతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటించనున్నారు. స్టాలిన్ తర్వాత మెగాస్టార్‌తో మరోసారి జతకట్టనున్నారు. వశిష్ట డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ జాబితాలో హీరోయిన్ త్రిష కూడా చేరిపోయారు. త్రిష కృష్ణన్, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తోన్న ఎమోషనల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ బ్రింద. సూర్య మనోజ్ వంగలదర్శకత్వంలో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తే 'ఈ ప్రపంచంలో మనం రాకముందు ఎంత చెడైనా ఉండొచ్చు.. కానీ వెళ్లేముందు ఎంతో కొంత మంచి చేసి వెళ్లడం మన బాధ్యత అనే డైలాగ్' విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీ నుంచి సోనిలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌లో జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. -
విజయ్,త్రిష రిలేషన్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సుచిత్ర
కోలీవుడ్ టాప్ హీరో విజయ్, హీరోయిన్ త్రిష మధ్య ఉన్న అనుబంధం గురించి గాయని సుచిత్ర సెన్సేషనల్ కామెంట్లు చేసింది. గత కొన్నిరోజుల క్రితం వారిద్దరి మధ్య పలు రూమర్స్ రావడంతో కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తరుచూ వారిద్దరూ విదేశాలకు ట్రిప్స్ వేస్తున్నారంటూ కొన్ని ఫోటోలను కూడా నెట్టింట షేర్ చేశారు. కానీ, విజయ్ ఫ్యాన్స్ వాటిని తిప్పికొట్టారు. విజయ్ రాజకీయాల్లోకి రావడం వల్లే ఇలాంటి రూమర్స్ చేస్తున్నారని వారు కౌంటర్ ఇచ్చారు.విజయ్, త్రిష బంధం గురించి తాజాగా సుచిత్ర ఇలా చెప్పుకొచ్చింది. విజయ్ ఆయన సతీమణి సంగీత తిరిగి ఎప్పుడో కలవాలి. అహంభావంతో చిన్నపాటి గొడవలతో వారి కుటుంబం చితికిపోయింది. ఇలాంటి సమయంలో త్రిష లాంటి పరాన్నజీవులు ఇతరుల జీవితాల్లోకి ప్రవేశిస్తారు. లిఫ్ట్‌లో సీక్రెట్‌గా తీసిన ఫోటోను ఆమె పోస్ట్ చేసినప్పటి నుంచి వారి గురించి చర్చ ఎక్కువ నడుస్తుంది. త్రిషకు కావాల్సింది కూడా ఇదే. విజయ్‌కు ఆమె దగ్గరగా ఉండాలని చూస్తుంది. అందుకే చాలా మంది ఎం.జి.ఆర్. - జయలలితను వారిద్దరితో పోలుస్తున్నారు.ఎంజీఆర్‌కు జయలలిత పరాన్నజీవి. ఎంజీఆర్ నుంచి రాజకీయాలపై పట్టు సాధించిన ఆమె ఆ తర్వాత ఎంజీఆర్‌ను విస్మరించారు. ఈ విషయంలో కరుణానిధి తాత కూడా ఈ పశ్చాత్తాపాన్ని అనుభవించారు. తన స్నేహితుడైన ఎంజీఆర్‌ను ఇలా నాశనం చేయడం వల్లే కరుణానిధికి జయలలిత నచ్చలేదు.ఎంజీఆర్ మరణానంతరం జయలలిత రాజకీయాల్లో మాత్రం బాగానే చేశారు. ప్రజలకు మంచి పాలనే అందించారు. రాజకీయంగా తమిళనాటలో ఎన్నటికీ చెరిగిపోని ముద్ర ఆమె వేశారు. అయితే, ఇప్పుడు అలాగే విజయ్ను త్రిష ఫాలో కావాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆయన గెలిచే అవకాశమే లేదు. ఇంకా ఎన్నికల్లో పాల్గొనని రాజకీయ పార్టీకి ఎలాంటి బాధ్యత ఉండదు. రాజకీయాల్లో ఉండాలనే సలహాలు విజయ్‌కు ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఇవన్నీ చాలా తప్పుడు సలహాలు. అని సుచిత్ర తన వీడియోలో మాట్లాడింది. అయితే, విజయ్, త్రిషలను ఎంజీఆర్-జయలలితతో పోల్చడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి తెలివి లేకుండా చనిపోయిన ఇద్దరు దిగ్గజాల గురించి నోటికొచ్చింది మాట్లాడటం ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆమెను పిచ్చి ఆసుపత్రిలో చేరిపించాలని కొందరు సలహాలు ఇస్తున్నారు. విజయ్, ఆయన భార్య సంగీత ఫోటోలు బయటకు వస్తేనే ఇలాంటి వివాదాలకు తెరపడుతుందని నెటిజన్లు అంటున్నారు. విజయ్, త్రిషల మధ్య మంచి స్నేహ బంధం ఉంటే రాజకీయంగా దెబ్బతీసేందుకే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. -
లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్ వ్యవహారం
కోలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ (ఒక్కడు రీమేక్) చిత్రం ఘన విజయం సాధించింది. రీసెంట్గా లియో ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితం విజయ్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో త్రిష ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఆపై 'నీ థాన్ ఎన్ కాదల్.. టిల్ డెత్ నీ థన్ ఎన్ కాదల్' అంటూ ఓ ఆంగ్ల పాటను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫోటో వైరల్ అవుతున్న సమయంలో త్రిష, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ వారు తెలుపుతున్నారు. అందుకు రుజువుగా ఒక పాత ఫోటోను వారు వైరల్ చేస్తున్నారు. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది. మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది. ఈ రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ్ ధరించిన షూ ఏదైతే ఉందో అదే త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తుంది. దీంతో విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్లారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిద్దరి మధ్య రహస్య స్నేహం నడుస్తుందా..? అంటూ కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి. వారు విడాకులు తీసుకోనున్నారు అనే రూమర్స్ కూడా వచ్చాయి. త్రిష విషయానికొస్తే 41 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్‌తో మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంది. చాలా కాలం క్రితం వరుణ్‌మణియన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం జరిగి పెళ్లి అంచులు వరకు వెళ్లి సడెన్‌గా బ్రేక్ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్న త్రిష ఇటీవల వెండితెరపై తన సత్తా చాటుతుంది. సౌత్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకే హీరోయిన్గా ప్రస్తుతం రికార్డ్ క్రియేట్ చేసింది. త్రిష, విజయ్ ఫోటోలను కోలీవుడ్‌లో కొందరు వైరల్ చేస్తూ.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ అనుమానాలకు అవకాశం ఇచ్చేలా కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కొందరు కావాలనే ఇలాంటి పని చేస్తున్నారని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. అలాంటి ఏదైనా విషయం ఉంటే ఆయన డైరెక్ట్‌గానే చెబుతారని వారు క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయం గురించి త్రిష, విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
రాజమౌళి సినిమాను త్రిష తిరస్కరించిందా.. కారణం ఆ హీరోనేనా..?
సౌత్ ఇండియాలో 25 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గుర్తింపును త్రిష కొనసాగిస్తుంది. మోడలింగ్ నుంచి హీరోయిన్గా 'జోడి' (తమిళ్) సినిమాతో 1999లో ఎంట్రీ ఇచ్చింది. అందులో హీరోయిన్ సిమ్రన్‌కు స్నేహితురాలిగా మెప్పించింది. ఈ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షించింది. 'నీ మనసు నాకు తెలుసు' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరైంది. తెలుగులో స్టార్ హీరోలతో నటించిన త్రిషకు కొన్నేళ్ల తర్వాత అవకాశాలు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి భారీ అవకాశాలను దక్కించుకుంటుంది.డైరెక్టర్ రాజమౌళి సినిమాను త్రిష కాదన్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. వరుస హిట్లతో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న రాజమౌళి.. 2009లో 'మగధీర' చిత్రం తర్వాత 'మర్యాద రామన్న' తెరకెక్కించారు. 2010లో విడుదలైన ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించే ఛాన్స్‌ను మొదట త్రిషకు రాజమౌళి ఆఫర్ చేశారట. అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. దీంతో కమెడియన్‌గా కొనసాగిన సునీల్‌తో నటించడం వల్ల తన మార్కెట్ పడిపోతుందని సున్నితంగా తిరస్కరించిందట. అయితే, ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన సలోని పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని కాదని పెద్ద తప్పు చేశానే అని ఆలోచనలో త్రిష పడిపోయిందట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. -
ఆ హీరో పెళ్లికి అడ్డుపడిన త్రిష.. ఇంతకీ ఏమైందంటే?
హీరోయిన్ త్రిష వయసు 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా తన హవా చూపిస్తోంది. రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. 40 దాటిపోయినా సరే ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. త్రిషపై వదంతులు చాలానే ఉన్నాయి. అలానే గతంలో ఓసారి నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది. ఇదంతా పక్కనబెడితే ఓ హీరో పెళ్లికి.. త్రిష అడ్డుపడిందని మీకు తెలుసా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)'ఒకరికి ఒకరు' సినిమాతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అలియా శ్రీరామ్.. త్రిషతో 'మనసెల్లామ్' అనే మూవీ చేశాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2007లో శ్రీకాంత్, వందన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వందనకు త్రిష అంతకు ముందే తెలుసు. దీంతో పెళ్లికి ముందు వందనతో నువ్వు శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవద్దని, అతడు మంచివాడు కాదని, ఇంగ్లీష్ మాట్లాడటం రాదని త్రిష చెప్పింది. ఇదే విషయాన్ని వందన, శ్రీకాంత్ దగ్గర చెప్పింది.ఎందుకలా చెప్పావ్ అని త్రిషని శ్రీకాంత్ అడగ్గా.. నువ్వు నా ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతున్నావ్ కదా, అందుకే ప్రాంక్ చేశానని త్రిష చెప్పుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇదిలా ఉండగా 1999లో 'జోడీ' మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేసింది. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. కానీ '96'తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 'పొన్నియన్ సెల్వన్' లాంటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి 'విశ్వంభర'లో నటిస్తోంది.(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ అమలాపాల్.. వీడియో వైరల్!) -
థగ్‌లైఫ్ షూటింగ్లో ప్రమాదం
సినీ నటులకు సుఖాలే కాదు, కష్టాలు ఎదురవుతుంటాయి. పలువురు నటీనటులు షూటింగ్లో ప్రమాదాలకు గురైన సంఘటలను ఉన్నాయి. కాగా తాజాగా కమల్‌హాసన్ చిత్రం థగ్‌లైఫ్ షూటింగ్లో ప్రమాదం జరిగింది. నటుడు కమలహాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం థగ్‌లైఫ్. నటుడు శింబు, త్రిష, మలయాళ నటుడు జోజూ జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుటికే రాజస్థాన్, ఢిల్లీ, కేరళ తదితర ప్రాంతాల్లో జరుపుకుని, 60 శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ నటుడు కమలహాసన్ ప్రతినాయకులతో పోరాడే సన్నివేశాలను దర్శకుడు మణిరత్నం చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా హెలికాప్టర్ నుంచి మలయాళ నటుడు జోజూ జార్జ్ కిందికి దూకుతుండగా ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన కాలి ఎముఖ విరిగిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. దీంతో ఆయన్ని కేరళ రాష్ట్రంలోని కొచ్చికి పంపించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా థగ్‌లైఫ్ చిత్రం తదుపరి షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఐరోపాకు బయలుదేరనున్నట్లు వెల్లడించాయి. -
'అమ్మోరు తల్లి'గా వచ్చేస్తున్న త్రిష
నయనతార 'అమ్మోరు తల్లి'గా ప్రేక్షకులను మెప్పించింది. ఆర్.జె.బాలాజీ, శరవణన్ డైరక్టర్స్‌గా తొలి సినిమాగా 'అమ్మోరు తల్లి'ని తెరకెక్కించారు. తమిళంలో 'మూకుత్తి అమ్మన్'గా తెరకెక్కిన సినిమాకు ఇది డబ్బింగ్. 2020లో డిస్నీ+హాట్‌స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల అయింది. ఆ సమయంలో ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాకు మరో సీక్వెల్ తీయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.భక్తి పేరుతో దొంగ బాబాలు చేస్తున్న మోసాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో రూపొందిన చిత్రమే అమ్మోరు తల్లి. ఇందులో ముక్కుపుడక అమ్మోరుగా నయన్ మెప్పించింది. అయితే, సీక్వెల్‌గా తెరకెక్కబోతున్న చిత్రంలో త్రిషకు ఆ ఛాన్స్ దక్కినట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రలో త్రిష అభినయం అయితే బాగుంటుందని చిత్ర వర్గాలు ఇప్పటికే పరోక్షంగా చెబుతున్నాయి. త్రిష ఈ పాత్ర ఒప్పుకుంటే మాత్రం ఆమెకు ఇలాంటి సినిమా ఇదే మొదటిది అవుతుంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. విశ్వంభర,థగ్‌లైఫ్, రామ్ వంటి చిత్రాల షూటింగ్ పనుల్లో ఆమె ఉంది. -
నయనతార ప్లేస్‌లో త్రిష?
తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ సెట్స్‌పైకి వెళ్లేలా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ‘మూకుత్తి అమ్మన్’ చిత్రంలో నయనతార టైటిల్ రోల్ చేయగా, ఆర్జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్జే శరవణన్‌తో కలిసి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది.వీక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ పనులను మొదలు పెట్టారట ఆర్జే బాలాజీ. అయితే సీక్వెల్లో నయనతార కాకుండా త్రిష నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఈసారి ఆర్జే బాలజీయే పూర్తి స్థాయిలో దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారట. మరి.. సీక్వెల్లో త్రిష నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
మగాడిలా మారిపోవాలని ఉంది.. త్రిష
కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? కుడి ఎడమైతే ఎలా ఉంటుంది? చాలా తమాషాగా ఉంటుంది కదూ. చైన్నె బ్యూటీ త్రిష కోరిక కూడా అలాంటి విచిత్రమైనదే. నటిగా రెండు దశాబ్దాల అనుభవం. మధ్యలో ఎత్తుపల్లాలు ఎదురైనా, నేటికీ ఎవర్గ్రీన్ హీరోయినే. ఇప్పపటీకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలరే. ఇదీ త్రిష రికార్డ్. గ్లామర్ పాత్రలకై నా, ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలకై నా, ఏ భాషలోనైనా రెడీ అంటూ తన సత్తాను చాటుతున్న ఈ సంచలన బహుభాషా నటి త్రిష.ప్రస్తుతం తమిళంలోనే అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళంలో మోహన్‌లాల్ సరసన రామ్, టోవినో థామస్‌కు జంటగా ఐడెంటిటి, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఏక కాలంలో ఐదు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఏకై క నటి త్రిషనే అయ్యుంటారు. ఈమె ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అందులో తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నారు. అదేమిటంటే తాను ఒక్క రోజు పురుషుడిగా ఉండాలన్నారు. ఒక కుర్రాడిలా ఉండడం ఎలా ఉంటుంది. అతని శరీర రూపకల్పన, అతని మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంటుందన్నారు. ఈ విషయం గురించి తన తల్లితో పదే పదే చెబుతుంటానని అన్నారు. ఆమె కోరిక నిజంగా విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది కదూ! -
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కనిపంచనుంది. వీరిద్దరు గతంలో స్టాలిన్ చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో మరో సీనియర్ నటిని ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో చూసేద్దాం.విశ్వంభరలో ఓ కీలక పాత్ర కోసం సీనియర్ నటి కోసం దర్శకుడు వశిష్ట సంప్రదించినట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతిని సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పినట్లు టాక్. అయితే అదే పాత్ర కోసం మరో సీనియర్ నటి ఖుష్బూని సంపద్రించగా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో స్టాలిన్ చిత్రంలో కూడా ఖుష్బు నటించారు. మరోవైపు ఈ చిత్రంలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ చిత్రంలో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా కూడా నటిస్తున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే నిజమైతే చిరంజీవి కెరీర్లో ఇది భారీ బడ్జెట్ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో త్రిషతో పాటు సురభి, ఇషా చావ్లా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే సంక్రాతి పండుగ కానుకగా జనవరి 10న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. -
సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
సుచి లీక్స్ గొడవ మళ్లీ మొదలైంది. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిప్‌గా మారింది.సుచీ లీక్స్ తర్వాత సుచిత్ర జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఒకానొక సమయంలో సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తర్వాత భర్త కార్తీక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది. తదనంతరం, ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా పాల్గొంది. చాలారోజుల తర్వాత ఇప్పుడు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ విషయాలను ఆమె పంచుకుంది. ముఖ్యంగా ధనుష్-ఐశ్వర్య విడాకులు, సుచీ లీక్స్ ఇష్యూ తదితర విషయాలపై సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ముఖ్యంగా సుచీ లీక్స్ పేరుతో విడుదల చేసిన ఫోటోలన్నీ త్రిషనే ఇచ్చిందని ఆమె చెప్పడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. 'సుచీ లీక్స్ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే. కానీ, ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాక ‘నేను హర్ట్ అయ్యాను’ అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసేది. త్రిష ఒక బిచ్.' అని సింగర్ సుచిత్ర సెన్సేషనల్ కామెంట్ చేసింది.సుచీ లీక్స్‌లో భాగంగా త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. ఆ సమయం నుంచే ఐశ్వర్య, ధనుష్ మధ్య విభేదాలు వచ్చాయని, చివరకు చేసేదేమిలేక వారు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు ఇప్పటికీ చెబుతుంటాయి. Trisha oruthi @trishtrashers bitch 🤣👀 https://t.co/9crRLcEUzE pic.twitter.com/kGaRJ8z16M— Nayanthara FC (@AjithTharan) May 14, 2024 -
అజిత్ కి షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
స్టార్ హీరోయిన్ త్రిష.. కెరీర్లో ఎన్నడూ లేనంత బిజీగా ఉన్నారు. 40 ఏళ్ల వయసులోనూ ఈమె నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ స్టార్స్‌తోనే కావడం శేషం. అన్ని భాషల్లోనూ ఏక కాలంలో నటించేస్తున్నారు. ప్రస్తుతం అజిత్ 'విడామయూర్చి', కమల్ హాసన్ 'థగ్ లైఫ్', చిరంజీవి 'విశ్వంభర', మోహన్ లాల్ 'రామ్' చిత్రాల్లో త్రిషనే హీరోయిన్.(ఇదీ చదవండి: నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!)కాగా అజిత్ 'విడా మయూర్చి' షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. దీంతో ఈ సినిమాకు కేటాయించిన డేట్స్‌ని విశ్వంభర, థగ్ లైఫ్ చిత్రాలకు ఉపయోగించేస్తోంది. దీంతో 'విడామయర్చి' చిత్రానికి షాక్ తగిలినట్లయింది. అయితే ఇదంతా దర్శకుడు మణిరత్నం చేసిన పని అనుకోవచ్చు.. ఎందుకంటే 'పొన్నియన్ సెల్వన్'లో కుందవై పాత్ర ఇచ్చి త్రిషకి మళ్లీ లైఫ్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఈమె ఊపిరిసలపనంత బిజీగా మారిపోయింది. టైమ్ అంటే ఇదే మరి.(ఇదీ చదవండి: నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్‌కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు) -
ఆడపిల్లనే...ఐతే ఏంటంట
హీరోలకు ప్రేమ కబుర్లు చెప్పే పాత్రలే ఎక్కువగా చేసే హీరోయిన్లు ఫర్ ఎ చేంజ్ నేరస్తులకు బుద్ధి చెప్పే పనిలో పడ్డారు. న్యాయ పోరాటం కోసం ఏం చేయడానికి అయినా వెనకాడని పోలీసాఫీసర్లుగా బెల్టు బిగించారు... తుపాకీ గురి పెట్టారు.. లాఠీకి పని చెప్పారు. ‘ఆడపిల్లనే... ఐతే ఏంటంట’ అంటూ ఓ హీరోయిన్ పోలీస్ పాత్రలో రెచ్చిపోయారు. మిగతా కథానాయికలు కూడా దాదాపు అలానే అంటూ పోలీసు పాత్రల్లో విజృంభించారు. ఆ పోలీసాఫీసర్ల గురించి తెలుసుకుందాం. సత్యభామ సాహసంహైదరాబాద్ సిటీ ఏసీపీ కె. సత్యభామగా చార్జ్ తీసుకున్నారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఓ అమ్మాయి కేసు విషయంలో సత్యభామ పోలీసాఫీసర్‌గా ఆల్మోస్ట్ సస్పెండ్ అవ్వాల్సిన పరిస్థితి. మరి.. సత్యభామ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అన్నది ‘సత్యభామ’ సినిమాలో చూడాలి. సత్యభామగా కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ చేసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో తక్కలపల్లి శ్రీనివాసరావు, బాబీ తిక్క నిర్మించారు. ఓ అమ్మాయి హత్యాచారం నేపథ్యంలో ‘సత్యభామ’ సినిమా కథ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో డీజీపీ నారాయణదాస్ పాత్రలో ప్రకాశ్‌రాజ్, అమరేందర్ అనే పాత్రలో నవీన్ చంద్ర లీడ్ రోల్స్‌లో నటించారు. నాగినీడు, హర్షవర్థన్, రవివర్మ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సంగతి ఇలా ఉంచితే... పోలీసాఫీసర్‌గా కాజల్ అగర్వాల్ నటించడం ఇది తొలిసారి కాదు. 2014లో తమిళ హీరో విజయ్ నటించిన ‘జిల్లా’, గత ఏడాది విడుదలైన తమిళ చిత్రం ‘ఘోస్టీ’లో కాజల్ పోలీసాఫీసర్‌గా నటించారు. ఆ రెండు చిత్రాల్లోనూ పవర్ఫుల్ పోలీస్‌గా ఒదిగిపోయారు కాజల్. తాజాగా ‘సత్యభామ’లో కూడా పవర్ఫుల్ ఆఫీసర్‌గా విజృంభించారని యూనిట్ పేర్కొంది.పాయల్ రక్షణహీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తొలిసారి ‘రక్షణ’ కోసం ఖాకీ డ్రెస్ ధరించి, లాఠీ పట్టారు. పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్‌గా నటించిన చిత్రం ఇది. ప్రణదీప్ ఠాకోర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఓ పోలీసాఫీసర్ జీవితంలోని ఓ ఘటనను ఆధారంగా చేసుకుని, ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించినట్లుగా యూనిట్ పేర్కొంది. రోషన్ , మానస్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ స్వరకర్త.అగ్ని నక్షత్రంమంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మర్డర్ మిస్టరీ చిత్రం ‘అగ్ని నక్షత్రం’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె దీక్ష అనే పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఎమ్. వంశీకృష్ణ దర్శకత్వంలో మంచు లక్ష్మి, మంచు మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. మలయాళీ నటుడు సిద్ధిఖ్, సముద్రఖని, విశ్వంత్, చైత్ర శుక్లా ఈ సినిమాలో ఇతర కీ రోల్స్‌లో కనిపిస్తారు. ఈ చిత్రం విడుదలపై స్పష్టత రావాల్సి ఉంది.ఐతే ఏంటంట?‘కలర్ ఫొటో’, ‘గామి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు నటిగా మరింత దగ్గరయ్యారు హీరోయిన్ చాందినీ చౌదరి. ఈ బ్యూటీ ఇటీవల పోలీసాఫీసర్‌గా డ్యూటీ చేశారు. ఈ డ్యూటీ ‘యేవమ్’ సినిమా కోసం. ఈ సినిమాలో చాందినీ చౌదరితో పాటు వశిష్ట సింహా, జై భారత్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించారు. ప్రకాశ్ దంతులూరి దర్శకత్వంలో నవదీప్, పవన్ గోపరాజు నిర్మించారు. మహిళా సాధికారిత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ఎస్ఐ సౌమ్య పాత్రలో కనిపిస్తారు చాందినీ చౌదరి.ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్‌పై ‘ఆడపిల్లనే!.. ఐతే ఏంటంట?’ అనే క్యాప్షన్ ఉంది. దీన్నిబట్టి ఈ సినిమాలో చాందిని పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఇలా పోలీసాఫీసర్లుగా కనిపించనున్న దక్షిణాది హీరోయిన్లు మరికొంతమంది ఉన్నారు.హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ‘బృందా’. త్రిష టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. ఇందులో త్రిష పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సూర్య వంగల దర్శకత్వం వహించిన ఈ తెలుగు వెబ్ సిరీస్ చిత్రీకరణ పూర్తయింది. స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. పవర్ఫుల్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కావడంవల్లే త్రిష ఈ వెబ్ సిరీస్ చేశారని కోలీవుడ్ టాక్. -
15 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెడుతున్న త్రిష
సౌత్ ఇండియాలో ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ ఏక కాలంలో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే, తాజాగా మరోసారి బాలీవుడ్లో రీఎంట్రీకి సిద్ధ అయినట్లు తెలుస్తోంది. త్రిష 2010లో కట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జంటగా త్రిష నటించింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో త్రిష కూడా ఇక అటు వైపు దృష్టి సారించలేదు. అలాంటిది సుమారు 15 ఏళ్ల తరువాత మరోసారి ఈ భామకు బాలీవుడ్ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు సల్మాన్‌ఖాన్ సరసన న టించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా 40 ఏళ్లను పూర్తి చేసుకుని 41వ సంతంలోకి అడుగు పెట్టిన త్రిష ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె ఆధ్యాత్మికంపై దృష్టి మళ్లించినట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు కారణం గత ఏడాది త్రిష తన పుట్టిన రోజును షిరిడీలో జరుపుకున్నా రు. కాగా ఈ ఏడాది నటుడు విజయ్ చెన్నైలో నిర్మించిన సాయిబాబా మందిరంలో చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా త్రిష సాయిబాబా భక్తురాలిగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే తనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎక్స్ మీడియా ద్వారా ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
నిమిషానికి రూ.1 కోటి సంపాదిస్తున్న బ్యూటీ.. త్రిష, నయనతార కాదండోయ్ (ఫోటోలు)
-
కమల్ హాసన్- మణిరత్నం కాంబో.. ఆ హీరోలు మళ్లీ..!
కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో దాదాపు 34 ఏళ్ల ముందు రూపొందిన చిత్రం నాయకన్. ఆ చిత్రం అప్పట్లో సాధించిన సంచలన విజయం సాధించింది. కాగా అదే కాంబినేషన్లో మళ్లీ ఇప్పుడు రూపొందుతున్న భారీ చిత్రం థగ్ లైఫ్. దీనిని మణిరత్నానికి చెందిన మెడ్రాస్ టాకీస్, కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ని ర్మిస్తున్నాయి. ఇందులో కమలహాసన్ సరసన నటి త్రిష నటిస్తుండగా నటుడు జయం రవి, దుల్కర్ సల్మాన్, సిద్ధార్థ్ ముఖ్య పాత్రలో పోషిస్తున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చైన్నెలో ప్రారంభమై ఆ తరువాత విదేశాల్లో చిత్రీకరణకు సినీ వర్గాలు వెళ్లాయి. అయితే అలాంటి సమయంలో తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో నటుడు కమలహాసన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చైన్నెకి తిరిగి వచ్చారు. దీంతో థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్ర షెడ్యూల్ వాయిదా పడడంతో నటుడు జయం రవి ఆ తరువాత దుల్కర్ సల్మాన్ ఇటీవల సిద్ధార్థ్ కూడా థగ్స్ లైఫ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జోరుగా సాగింది. అలాగఇందులో నటుడు శింబును ఒక ముఖ్యపాత్రకు ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ముందుగా ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిన జయంరవి, దుల్కర్ సల్మాన్‌లు మళ్లీ ఈ చిత్రంలో నటించడానికి తిరిగి వస్తున్నట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా పార్లమెంటు ఎన్నికల ముగిసిన వెంటనే కమలహాసన్ థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారన్నది తాజా సమాచారం. -
లేడీ సూపర్‌స్టార్‌కు గట్టి పోటీ.. ఆమె దెబ్బకు మాలీవుడ్‌కు!
ప్రస్తుతం నయనతార మాలీవుడ్ వైపు మళ్లుతున్నారా? పరిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగుతున్న నయనతారకు ఇప్పుడిప్పుడే ఆ పేరు దూరం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే చైన్నె సుందరి త్రిష నుంటి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో త్రిష కోలీవుడ్‌లో సూపర్ స్టార్ హోదాను కైవసం చేసుకోనుందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో గత కొద్దికాలంగా హాట్ టాపిక్ ఇదే. నయనతార గతేడాది జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు ఆ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. అయితే బాలీవుడ్లో మరో అవకాశం రాలేదు. ఇక తమిళంలో ఇటీవల ఈమె నటించిన ఇరైవన్, అన్నపూరణి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచాయి. ప్రస్తుతం నవ దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వం వహిస్తున్న మన్నాగట్టి, సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, మాధవన్‌తో కలిసి టెస్ట్ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. నయనతారకు వీటిలో ఏదో ఒకటి హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు నయన్‌కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్నాయి. నటి త్రిష వైపు వెళుతున్నాయని చెప్పక తప్పడం లేదు. ఆ తరువాత తెలుగులోనూ స్టార్ హీరోలైన చిరంజీవి, అల్లుఅర్జున్‌లతో కలిసి నటించే అవకాశాలను దక్కించుకున్నారు. అంతేకాకుండా మలయాళంలోనూ నటిస్తున్నారు. దీంతో నయనతార కూడా మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తన మాతృభాష అయిన ఈ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంతకుముందే మమ్ముట్టి, నివిన్‌బాలీ వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. అలా ఈమె మలయాళంలో నటించిన చివరి చిత్రం గోల్డ్. అల్పోన్స్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2022లో విడుదలై పెద్దగా ఆడలేదు. దీంతో కొంతకాలం మాలీవుడ్‌కు దూరంగా ఉంటూ వచ్చిన నయనతార తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనికి డియర్ స్టూడెంట్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నయనతార టీచర్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నటుడు నివిన్ బాలి హీరోగా నటిస్తున్నారు. -
అల్లు అర్జున్‌కి జోడీగా..?
‘పుష్ప: ది రైజ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన ‘పుష్ప: ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందులో భాగంగానే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో పడ్డారట అట్లీ. కాగా ఈ మూవీలో అల్లు అర్జున్‌కి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో సమంత, త్రిష పేర్లు వినిపిస్తున్నాయి. తొలుత త్రిష పేరు తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్‌కి ఆమె జోడీగా నటించనున్నారనే వార్తలు కోలీవుడ్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా సమంత పేరు వినిపిస్తోంది. అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరి’ సినిమాలో విజయ్‌కి జోడీగా నటించారు సమంత. అలాగే ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టారీ బ్యూటీ. అలాగే ‘పుష్ప: ది రైజ్’ మూవీలో ‘ఊ అంటావా...’ అంటూ ప్రత్యేక పాట చేశారు. తాజాగా వీరి జోడీ రిపీట్ కానుందనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి అల్లు అర్జున్ సరసన నటించేది సమంతా? త్రిషా? లేకుంటే ఇద్దరూ నటిస్తారా? ఈ ఇద్దరూ కాకుండా వేరే కథానాయిక నటిస్తారా? అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. ఈ అక్టోబర్‌లో అల్లు అర్జున్–అట్లీ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని టాక్. -
రెమ్యునరేషన్ పెంచేసిన త్రిష.. నయనతార కంటే ఎక్కువే!
తమిళసినిమా: నటి త్రిష తన స్నేహితురాలు, లేడీ సూపర్‌స్టార్ నయనతారను దాటేసి నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఇంతకుముందు వరకూ దక్షిణాదిలోనే నంబర్‌వన్ కథానాయకిగా నయనతార వెలుగొందారు. ఇప్పుటికీ ఆమె ఏ మాత్రం తగ్గలేదు. అయితే నటి త్రిష క్రేజ్ మాత్రమే బాగా పెరిగింది. అంతా దర్శకుడు మణిరత్నం పుణ్యమే అని చెప్పకతప్పదు. నటి త్రిష కెరీర్ పొన్నియిన్‌సెల్వన్ చిత్రానికి ముందు, ఆ తరువాత అని చెప్పాలి. ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు వరుసగా అపజయం కావడంతో గ్రాఫ్ పడిపోయింది. ఒక టైమ్‌లో చేతిలో చిత్రాలే లేకుండా పోయాయి. అలాంటి సమయంలో మణిరత్నం కరుణించడంతో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కందవై పాత్రలో నటించే అవకాశం వరించింది. అందులో నటి ఐశ్వర్యరాయ్ కూడా నటించారు. నిజం చెప్పాలంటే ఆమెను త్రిష డామినేట్ చేశారు. రాజసం ఒలకబోసిన త్రిష నటన అందరిని ఆకట్టుకుంది. ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. అంతే త్రిష సెకండ్ ఇన్నింగ్‌కు ఆ చిత్రంతోనే బీజం పడింది. ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించారు. ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్స్ లైఫ్, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర, మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్, నివిన్‌బాలీ సరసన ఐడెంటిట్టీ అంటూ స్టార్స్ సరసన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోట్లో కూడా ఒక ప్రత్యేక పాట, కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. కాగా లియో చిత్రంలో నటించడానికి రూ.6 కోట్లు పారితోషికం పుచ్చుకున్న త్రిష, ఇప్పుడు కమలహాసన్ సరసన నటిస్తున్న థగ్స్ లైఫ్ చిత్రం కోసం ఏకంగా రూ.12 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఇంత మొత్తంలో పారితోషికాన్ని నయనతార కూడా ఇప్పటి వరకూ పొందలేదు. దీంతో ఆమెను అధిగమించిన త్రిష ఇప్పుడు నంబర్‌వన్ స్థానానికి ఎగబాకారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
బాలీవుడ్ వైపు మళ్లీ ఎందుకు వెళ్లలేదంటే..: త్రిష
గత రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా బహుభాషల్లో రాణిస్తున్న నటి త్రిష. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ కథానాయకిగా వెలుగొందడం సాధారణ విషయం కాదు. ఒక దశలో ఈమె నటించిన హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు నిరాశపరచడంతో త్రిష పని అయ్యిపోయింది. తట్టా బుట్టా సర్దుకోవాల్సిసిందే అనే కామెంట్స్ వచ్చాయి. అయితే పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో,అదీ అగ్రహీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా కొందరు ప్రముఖ హీరోయిన్ల మాదిరిగానే త్రిష కూడా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అక్కడ 'కట్టా మిఠా' అనే చిత్రంలో నటించారు. అయితే అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఇటీవల ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్ కావడంతో బాలీవుడ్లో అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యానన్నారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు. దీంతో బాలీవుడ్లో నటించిన తొలి చిత్రం ప్లాప్ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్‌కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్లో తన కెరీర్‌ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థగ్ లైఫ్ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. -
భాగ్యనగరంలో ‘విశ్వంభర’ పూర్తి
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ‘బింబిసార’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ అందుకున్న వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘స్టాలిన్’ (2006) వంటి హిట్ మూవీలో జోడీగా నటించిన చిరంజీవి–త్రిష ‘విశ్వంభర’ మూవీ కోసం రెండోసారి కలిశారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన ‘విశ్వంభర’ షెడ్యూల్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి, త్రిషతో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్లో కొంత టాకీ పార్ట్, ఓ పాట, యాక్షన్ బ్లాక్‌ని చిత్రీకరించినట్లు యూనిట్ పేర్కొంది. ‘‘ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ మూవీ ఉంటుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే.. చిరంజీవి నివాసంలో చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో సహా యూనిట్‌తో దిగిన ఫొటోలను త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసి, ‘ఇదొక లెజెండరీ, అద్భుతమైన రోజు! విశ్వంభర’ అని పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: కార్తీక్ శబరీష్, లైన్‌ప్రోడ్యూసర్: రామిరెడ్డి శ్రీధర్ రెడ్డి. -
స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. మళ్లీ ఆమెనా?
లియో కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందా? అంటే దీనికి కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమధానమే వినిపిస్తోంది. నటుడు విజయ్, నటి త్రిష సూపర్ హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఈ జంట ఇప్పుటికే ఆది, గిల్లీ, తిరుపాచ్చి, కురువి, లియోతో పాటు దాదాపు ఐదు చిత్రాల్లో జంటగా నటించారు. ఇందులో గిల్లీ, తిరుపాచ్చి, లియో చిత్రాలు మంచి విజయా న్ని సాధించాయి. కాగా తాజాగా మరోసారి ముచ్చటగా రెండో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతున్నారన్నమాట. కాగా.. విజయ్ ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఇందులో విజయ్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలోనే విజయ్‌తో నటి త్రిష మరోసారి జత కడుతున్నట్లు తాజా సమాచారం. ఇందు తండ్రి పాత్రలో నటిస్తున్న విజయ్ సరసన త్రిష నటించనున్నారు. అయితే ఇది ప్రత్యేక పాత్రేనని సమాచారం. కాగా ముందు ఈ పాత్రకు నటి అనుష్కను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు.. ఆమె తిరస్కరించడంతో ఈ అవకాశం నటి త్రిషకు వచ్చినట్లు టాక్. కాగా.. గోట్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చైన్నెలో జరుగుతోంది. కాగా ప్రస్తుతం త్రిష నటుడు కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్, అజిత్ సరసన విడాముయర్చి చిత్రాలతో పాటు, ఓ మలయాళ, తెలుగు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్‌కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
విజయ్‌పై త్రిష ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళసినిమా: నాలుగు పదుల వయసులోనూ ప్రేక్షకులను అలరిస్తుస్తూ కథానాయిక రాణిస్తున్నారు నటి త్రిష. అంతే కాకుండా ఇప్పుటికీ పలు భాషల్లో అగ్ర కథా నాయకుల సరసన నటిస్తూ బిజీగా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈమె. అన్నీ కుదిరితే 10 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో మునిగిపోయేవారు. ఇక నిర్మాత, వ్యాపారవేత్త అయిన అరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం, పెళ్లి పీటల వరకూ వెళ్లి ఆగిపోయింది. ఆ తరువాత పెళ్లి మాట ఎత్తని త్రిష నటనపైనే దృష్టి సారించారు. అలా మధ్యలో నటిగా వెనుకబడినా, చిన్న గ్యాప్ తరువాత గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుల్‌ఫామ్‌లోకి వచ్చారు. అందుకు కారణం దర్శకుడు మణిరత్నం అని చెప్పకతప్పదు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ఆయన ఓ అవకాశం ఇచ్చి నటిగా త్రిషకు పునర్జన్మనే ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఈ చైన్నె చిన్నది కూడా సద్వినియోగం చేసుకున్నారు. యువరాణి కుందవైగా రాజఠీవీని ప్రదర్శించి ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ఆ తరువాత విజయ్‌కు జంటగా లియో చిత్రంలో నటించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈమె ఇంతకు ముందు విజయ్ సరనన గిల్లీ, ఆదీ, తిరుపాచ్చి, కురువి చిత్రాల్లో నటించారు. మళ్లీ 14 ఏళ్ల తరువాత లియో చిత్రం ఈ జంట కలిసి నటించారు. దీంతో వీరిద్దరి గురించి వదంతులు దొర్లుతున్నాయి. అయితే వాటిలో నిజమెంత అన్నది తెలియదు కానీ, ఇటీవల ఒక భేటీలో విజయ్ గురించి నటి త్రిష మాట్లాడుతూ విజయ్ తానూ పలు చిత్రాల్లో కలిసి నటించినట్లు చెప్పారు. అయితే గిల్లీ చిత్రానికి ముందు వరకూ అందరూ చెప్పుకుంటున్నట్లు కాదన్నారు. విజయ్ చాలా నెమ్మదస్తుడని పేర్కొన్నారు. గిల్లీ చిత్రం తరువాత తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యామని చెప్పారు. కాగా ఈ చైన్నె బ్యూటీ ప్రస్తుతం అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమలహాసన్ సరసన థగ్ లైఫ్ చిత్రాలతో 40 ఏళ్ల వయసులోనూ బిజీబీజీగా ఉన్నారు. -
త్రిష,చిరంజీవి కేసు విషయంలో మన్సూర్ అలీఖాన్‌కు ఊరట
కోలీవుడ్ నటుడు,రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి, చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీఖాన్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం నిజానికి నటి త్రిషనే మీపై పిటీషన్ దాఖలు చేయాలని మందలించడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను నటుడు మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని చైన్నె, అడయార్ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని ఆదేశించింది. అయితే తనపై విధించిన జరిమానాలు రద్దు చేయాలంటూ నటుడు మన్సూర్ చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనపై విధించిన రూ.లక్ష జరిమానాను రద్దు చేస్తూ, ఈ కేసును కూడా కొట్టివేయాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. -
ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు: త్రిష
త్రిష జీవితంలో సమస్యలు అనేవి కొత్తేమీ కాదు. ఈమె ఒక్కో స్టేజ్‌లో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాటిని ఎదురొడ్డి ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ చైన్నె సుందరి ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. ఆ తరువాత లియో చిత్రంలో విజయ్‌తో జతకట్టి కమర్షియల్ హిట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి చిత్రం, కమలహాసన్‌కు జంటగా థగ్స్ లైఫ్ వంటి భారీ క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అగ్రకథానాయకిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. (ఇదీ చదవండి: జయలలిత ఆస్తుల వేలం.. కోర్టుకు చెల్లించాల్సిన డబ్బు ఎంత..?) తాజాగా టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యక్తి గత ఆరోపణలకు గురవుతున్నారు. అన్నాడీఎంకే బహిష్కరణ కార్యనిర్వాహకుడు ఏవీ రాజు త్రిషను అప్రతిష్ట పాలు చేసే విధంగా ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది త్రిషను మానసిక క్షోభకు గురి చేసిన విషయం తెలిసిందే. కూవత్తూర్ సంఘటన సమయంలో నటుడు, రాజకీయ నాయకుడు కరుణాస్, నటి త్రిషతో పాటు మరికొందరిని గెస్ట్ హౌస్‌కి పంపారన్నదే ఏవీ.రాజు వేసిన నింద. దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష అతనిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్, సముద్రఖని, నాజర్ త్రిషపై ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు సపోర్ట్‌గా నిలిచిన ఆ ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ ఆమె పేర్కొన్నారు. -
ఆ హిట్ ఫ్రాంచైజీలోకి త్రిష.. జోడీ కుదిరిందా?
హీరో వెంకటేశ్, హీరోయిన్ త్రిష నాలుగోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వీరిద్దరూ గతంలో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ (2007), ‘నమో వెంకటేశ’(2010), ‘బాడీగార్డ్’(2012) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ హిట్ జోడీ ఇప్పుడు నాలుగోసారి కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాలు తీసి, హిట్ అందుకున్నారు అనిల్ రావిపూడి. ఈ ఫ్రాంచైజీలో ‘ఎఫ్ 4’ సినిమా ఉంటుందని ‘ఎఫ్ 3’ క్లైమాక్స్‌లో హింట్ ఇచ్చింది చిత్రయూనిట్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ సినిమాలు నిర్మించిన ‘దిల్’ రాజే తాజాగా వెంకీ–అనిల్ కాంబినేషన్ లో మూడో సినిమా నిర్మించనున్నారట. ఈ మూవీలో హీరోయిన్గా త్రిషని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. అంటే.. దాదాపు పుష్కరకాలం తర్వాత వెంకటేశ్–త్రిష మరోసారి జోడీగా నటించనున్నారన్నమాట. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందనున్ను ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వెంకటేశ్‌తో అనిల్ రావిపూడి తెరకెక్కించేది ‘ఎఫ్ 4’ సినిమానా? లేక మరొక చిత్రమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
'విశ్వంభర'లో అడుగుపెట్టిన ఇద్దరు హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' చిత్రం షూటింగ్ వేగంగా ప్రారంభం అయింది. చాలారోజుల నుంచే ఈ చిత్రానికి సంబంధించిన పలు సీన్స్ చిత్రీకరిస్తున్నారు డైరెక్టర్ వశిష్ఠ. కొద్దిరోజుల క్రితమే ఈ బిగ్ ప్రాజెక్ట్‌లోకి మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష కూడా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో చిరు పోస్ట్ చేశారు. సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత వారిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'విశ్వంభర'లో ఇషా చావ్లా, సురభి అవకాశాన్ని దక్కించుకున్నారు. వీరిద్దరిపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయిన సైలెంట్‌గా వీరిద్దరితో షూటింగ్ కూడా ప్రారంభించారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అందులో త్రిషతో పాటు ఇషా చావ్లా, సురభి కూడా పాల్గొంటారని టాక్. ప్రేమ కావాలి,రంభా ఊర్వసి మేనక వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో వీరిద్దరి పాత్ర ఎంత పరిధి వరకు ఉంటుందో తెలియాల్సి ఉంది. ‘విశ్వంభర’ని సంక్రాంతి పండగకి జనవరి 10న విడుదల కానుంది. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌గా దీనిని వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. -
అత్యధిక భాషల్లో రీమేకైన ఏకైక తెలుగు హిట్ సినిమా ఏదో తెలుసా..?
మంచి కథ ఉంటే ప్రాంతీయ, భాషా భేదాలుండవు అనేది నిజం. అందుకే అలాంటి కథలు ఏ భాషలో దొరికినా రీమేక్‌ల రూపంలో వాటిని మళ్లీ తెరకెక్కించి విడుదల చేస్తారు మేకర్స్. ఇప్పుడంటే ఈ ట్రెండ్ కాస్త తగ్గినప్పటికీ గతంలో ఎక్కువగా అరువు కథలకే ఎక్కవగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమా నాలుగైదు భాషల్లోకి రీమేక్ కావడం అనేది సహజంగానే జరుగుతుంది. కానీ టాలీవుడ్లో విడుదలైన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రం ఏకంగా 9 భాషల్లో రీమేక్ అయింది. సిద్ధార్థ్, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్ రాజు దీనిని నిర్మించారు. 2005లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. ధనిక కుటుంబానికి చెందిన అబ్బాయితో పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి చిక్కులు వచ్చాయి అనేది ఈ చిత్రం కథ. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నిలిచింది. 35 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది. తొమ్మిది భాషల్లో రీమేకైన తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 7 భారతీయ భాషల్లోకి, 2 విదేశీ భాషల్లోకి రీమేక్ అయింది. ఏ భాషలో ఏ పేరుతో విడుదలైందో మీరూ తెలుసుకోండి. 1. ఉనక్కం ఎనక్కం (తమిళం) 2. నీనెల్లో నానల్లే (కన్నడ) 3. రామయ్య వస్తావయ్యా (హిందీ) 4. సునా ఛాదీ మో రూపా ఛాదీ (ఒడియా) 5. నింగోల్ తజబ(మణిపురి) 6. తేరా మేరా కీ రిష్తా (పంజాబీ) 7. ఐ లవ్ యు (బెంగాలీ) 8. నిస్సా అమర్ తుమీ (బంగ్లాదేశ్ బెంగాలీ) 9. ది ఫ్లాష్ బ్లాక్: ఫర్కెరా హెర్దా (నేపాలీ) -
రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి త్రిషని.. వల్గర్ కామెంట్స్.. సారీ చెప్పిన EX ఎమ్మెల్యే
-
త్రిషకు మద్దతుగా కస్తూరి.. హీరోయిన్లు వేశ్యలా అంటూ వార్నింగ్
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. కస్తూరి సినిమాలే కాదు, పలు సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా తన అభిప్రాయాన్ని డైరెక్ట్‌గా చెబుతుంది. అవతల ఉండే వ్యక్తి ఎవరు ఉన్నా సరే.. తరువాత ఏమైనా కానియ్..ఐ డోంట్ కేర్ అనుకునే రకం ఆమె.. ఆమెలో ఉన్న డేరింగ్ తత్వం అది. అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. హీరోయిన్ త్రిషకు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగాడు.. దీంతో త్రిష కూడా అతనిపై కేసు కూడా పెట్టింది. ఈ అంశంపై హీరో విశాల్ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజుపై తీవ్రంగా విరుచుక పడిన విషయం తెలిసిందే. తాజాగా నటి కస్తూరి కూడా అతనిపై ఫైర్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమా.. ఆ సాంగ్ స్పెషల్) ఈ మధ్య సినిమా హీరోయిన్లపై విపరీతమైన దూషణలు పెరిగాయి.ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారు. నోరు, నాలుకలు ఉంటే సరిపోదు.. మనం ఏం మాట్లాడుతున్నామో అనే బుద్ది కూడా ఉండాలి. కొద్దిరోజుల క్రితం త్రిషపై మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్యలే చేశాడు.. మళ్లీ ఇప్పుడు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు త్రిషపై నీచమైన కామెంట్లు చేశాడు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. మీ రాజకీయ పార్టీలోని వ్యక్తులతో సమస్యలు ఉంటే అక్కడ చూసుకోకుండా ఇలా త్రిష పేరును తెరపైకి తీసుకొచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయం ఏంటి..? మీలాంటి వారికి మేము ఎలా కనిపిస్తున్నాం..? సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ మీ కంటికి వేశ్యల్లా కనిపిస్తున్నారా..? సినిమాలో పనిచేస్తున్న అమ్మాయిలకు అమ్మానాన్నలు ఉంటారనే ఆలోచన కూడా లేకుండా పోయిందా..? కనీసం వారి గురించి అయినా ఆలోచించరా..? ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని ఆడపిల్లల గురించి కామెంట్లు చేయండి. ఒక అమ్మాయి గురించి ఇలాంటి కామెంట్లు చేసే అధికారం మీకు ఎవడు ఇచ్చాడు..? ఎవరో చెప్పారు చెప్పారంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? మీ వద్ద ఆదారాలు ఉంటే బయట పెట్టండి. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మీకు ఉన్న గౌరవం పోతుంది. ఇలాంటి వారి వల్ల సమాజం కోసం పనిచేసే రాజకీయ నాయకులకు కూడా చెడ్డపేరు వస్తుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను కూడా అధిగమించి తమ కుటుంబాల కోసం ఆడపిల్లలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి మహిళలు వచ్చేదే తక్కువ.. పరిశ్రమలో అడుగుపెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ సినిమాల్లోకి వచ్చాక మీలాంటివారు ఇలాంటి ముద్రలు వేస్తుంటే ఎలా..? తమిళనాడులో అందరూ అమ్మగా పిలిచి అభిమానించే నాయకురాలు జయలలిత గారు. ఆమె కూడా నటిగా,మహిళగా, ముఖ్యమంత్రిగా వెలుగొందారనే విషయం మరిచిపోయారా..? ఆమె సారథ్యం వహించిన పార్టీలో ఇలాంటి వ్యక్తికి స్థానం ఇవ్వడం ఏంటి..? ఇప్పుడు జయలలిత ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా..? ఇలాంటి ఘటనలు తలుచుకుంటే బాధ కలుగుతుంది.' అని కస్తూరి అన్నారు. -
రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్.. త్రిష కీలక నిర్ణయం!
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. తాజాగా ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష టీం చర్యలకు దిగింది. ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్లో పంచుకున్నారు. తన లీగల్ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. pic.twitter.com/DmRXHibIYx — Trish (@trishtrashers) February 22, 2024 -
త్రిష థగ్ లైఫ్ ఆరంభం
‘థగ్ లైఫ్’ను ఆరంభించారు హీరోయిన్ త్రిష. ‘నాయగన్’ (తెలుగులో ‘నాయకుడు’) తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’. ‘జయం’ రవి, త్రిష, దుల్కర్ సల్మాన్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మీ ముఖ్య తారలుగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు త్రిష. సెట్స్‌లో ‘థగ్ లైఫ్’ స్క్రిప్ట్‌ను పట్టుకుని ఉన్నట్లుగా ఇన్‌స్టా స్టోరీలో త్రిష ఓ చిన్న వీడియోను షేర్ చేశారు. దీంతో ‘థగ్ లైఫ్’ సినిమా షూటింగ్లో త్రిష జాయిన్ అయ్యారని స్పష్టం అయింది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఈ సినిమా షెడ్యూల్ పూర్తవ్వగానే, నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం టీమ్ సెర్బియా వెళుతుందని కోలీవుడ్ సమాచారం. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్, మణిరత్నం, ఏ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్రిషకు క్షమాపణలు చెప్పిన ఏవీ రాజు: త్రిషను ఉద్దేశించి తమిళనాడు రాజకీయ నేత ఏవీ రాజు రెండు రోజుల క్రితం చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై లీగల్‌గా ముందుకు వెళ్తానని త్రిష పేర్కొన్నారు. అనంతరం మంగళవారం రాత్రి ఏవీ రాజు స్పందించారు. తాను ఏ యాక్టర్నీ టార్గెట్ చేయాలనుకోవడం లేదని, తన మాటలు తప్పుగా అర్థం చేసుకోబడ్డాయని, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు ఏవీ రాజు. -
వరసగా టార్గెట్ అయిపోతున్న త్రిష.. అసలు కారణం అదేనా?
హీరోయిన్ త్రిషకి ఎంత వద్దనుకున్నా కష్టాలు తప్పట్లేదు. మొన్నీ మధ్యే నటుడు మన్సూర్‌తో జరిగిన గొడవంతా ముగిసిందనుకునేలోపు.. మరో విషయంలో ఈ ముద్దుగుమ్మ టార్గెట్ అయిపోయింది. ఈసారి మాజీ ఎమ్మెల్యే రాజు అనవసర కామెంట్స్ చేశారు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి త్రిషని రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగారు. అసలు ఈ ఎమ్మెల్యే ఎందుకిలా మాట్లాడారు? కారణం ఏమై ఉంటుంది? సినీ ప్రేక్షకులు.. హీరోహీరోయిన్ల గురించి నోటికొచ్చింది మాట్లాడారంటే వాళ్లకు ఏం తెలుసులే అనుకోవచ్చు. తమిళనాడులో మాత్రం స్వయనా పలువురు నటులు, రాజకీయ నాయకులే రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సింగర్ చిన్మయి, నయనతార విషయంలో నటుడు రాధావరి గతంలో ప్రవర్తించిన తీరు, చేసిన కామెంట్స్ పై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. అయితే నయనతార మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ఈ తరహా సంఘటనలు జరిగాయి. (ఇదీ చదవండి: రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!) తాజాగా తమిళ సినిమాల్లో త్రిష కాస్త మళ్లీ క్రేజ్‌తో దూసుకెళ్తోంది. 'పొన్నియిన్ సెల్వన్', 'లియో' సినిమాలతో గతేడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతో ఈమెపై ఏదో ఓ కామెంట్ చేసేసి ఫేమస్ అయిపోవచ్చనో ఏమో తమిళనాడు మాజీ ఎమ్మెల్యే, అన్నాడీఎంకే నేత రాజు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది అసలు సందర్భమే కాదు. తీరా తనపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చేసరికి క్షమాపణ చెప్పేశారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. పైన జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే తమిళనాడులోని కొందరు వ్యక్తులు.. కావాలనే ఫేమ్ ఉన్న హీరోయిన్లపై చిల్లర కామెంట్స్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. తద్వారా కొన్నాళ్ల పాటు తాము వార్తల్లో ఉండొచ్చు, నలుగురు తమ గురించి మాట్లాడుకుంటారనే ఆలోచిస్తున్నారమో? అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అనే సందేహం వస్తోంది. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్‌పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్‌గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
ఆ తర్వాతే పెళ్లి.. త్రిష శపథం!
తమిళసినిమా: నటి త్రిష. ఈ పేరు వింటేనే కళ్లముందు కథలెన్నో కదలాడుతాయి. అంతగా సంచలనానికి సొంతం ఈ చైన్నె సుందరి. ఆదిలో అందాల పోటీల్లో చైన్నె సుందరిగా గెలిచి కిరీటం దక్కించుకుంది. తర్వాత నటిగా కింది స్థాయి నుంచి కెరీర్‌ను ప్రారంభించారు. అలా నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా జోడి చిత్రంలో ఒకటి రెండు సీన్స్‌లో కనిపించారు. అలా దర్శకుడు ప్రియదర్శన్ దృష్టిలో పడింది. లేసా లేసా చిత్రంలో కథానాయకిగా నటించే అవకాశాన్ని అందుకున్నారు. అయితే సూర్యకు జంటగా నటించిన మౌనం పేసియదే చిత్రం ముందుగా తెరపైకి వచ్చి తొలి విజయాన్ని దక్కించుకుంది. ఆ తరువాత సామి చిత్ర విజయం త్రిషకు స్టార్ హీరోయిన్ను చేసింది. ఇది నటిగా ఈమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకపోయింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో నటించి భారతీయ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జీవితంలో ఎత్తు పల్లాలనేవి ఎవరికై నా సహజం కాబట్టి ఈ బ్యూటీ చిన్న అపజయాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు. అందులో ఒకటి పెళ్లి. ఇది ఈమె జీవితంలో ఎండమావిగానే మారింది. చాలా కాలం క్రితమే వరుణ్‌మణియన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం జరిగి పెళ్లి అంచులు వరకు వెళ్లి సడెన్‌గా బ్రేక్ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్న త్రిష ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకున్నారు. ఆ పుణ్యం మాత్రం దర్శకుడు మణిరత్నందే. ఆ తరువాత విజయ్, అజిత్, కమలహాసన్ వంటి టాప్‌స్టార్స్‌తో జత కడుతూ తనూ బిజీగా ఉన్నారు. తెలుగులో చిరంజీవి, మలయాళంలో మోహన్‌లాల్, హిందీలో సల్మాన్‌ఖాన్ వంటి ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. దీంతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్న నయనతారను పక్కన పెట్టి ఆ పట్టాన్ని కై వసం చేసుకోవాలనే ఆశ త్రిష మనసులో చాలా కాలంగా ఉన్న కోరిక అంట. ఆ సమయం దగ్గర పడిందని ఈ బ్యూటీ భావిస్తున్నారని టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. దీనికి కారణం లేకపోలేదు. త్రిష విజయపథంలో సాగుతుంటే నయనతార వరుసగా అపజయాలను ఎదుర్కొంటున్నారు. దీంతో లేడీ సూపర్‌స్టార్ అనిపించుకున్న తరువాతే పెళ్లి అని త్రిష శపథం చేసుకున్నట్లు తాజాగా జరుగుతున్న ప్రచారం. మరి ఈ నాలుగు పదుల పరువాల ప్రౌడ శపథం నెరవేరేనా? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది. -
కాంచీపురం చీరతో మైమరిపిస్తున్న త్రిష..!
తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన వర్షం సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. సుమారు రెండు దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన లియో సినిమాలో తళ్లుక్కున మెరిసింది త్రిష. నిజం చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ తగ్గలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉందామె. ఈ నేపథ్యంలో ఆమెకు స్టార్డమ్ తెచ్చిపెట్టడంలో ఉపయోగపడేది ఆమె ధరించే దుస్తులనే చెప్పాలి. సినిమాలో ఎలా ఉన్నా బయట ఎక్కడ కనిపించిన ఆరు గజాల చీరతో సంప్రదాయ మహిళలా కనిపించి ఈజీగా మనుసులను దోచుకుంటుంది. ఏ వేడుక ఫంక్షన్ అయినా అందుకు తగ్గట్టు ఆమె చీరలు ఉంటాయనే చెప్పాలి. ఈ సారి ఏకంగా కాంచీవరం చీరతో స్టన్నింగ్ లుక్‌తో మైమరిపోస్తోంది! టాలీవుడ్ నటి త్రిష కృష్ణన్ ఏ వేడుకలో అయినా ఆమె సంప్రదాయ చీరలో ప్రత్యేక ఆకర్ణణగా కనిపిస్తారు. అంతెందుకు ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో కూడా జాడే అనే బ్రాండ్‌కి సంబంధించని ఎంబ్రాయిడర్ లేస్ బార్డర్ చీరలో తళుక్కుమన్నారు. ఈసారి మరింత స్టన్నింగ్ లుక్‌లో అభిమానులను ఆశ్చర్యపరిచే రీతీలో కాంజీవరం చీరతో మైమరిపించారు. సాముద్రిక పట్టు చీరపై కాంచీపుర పట్టు కళాత్మకత ఉట్టిపడేలా అందంగా ఉంది. ఆ చీర నారింజ పట్టీ బార్డర్‌తో క్లిష్టమైన మీనాకారి జరీ వీవ్లు ఉన్నాయి. ప్లేయిన్ కలర్ జాకట్ ఆ చీరకు మంచి లుకింగ్ తెచ్చిపెట్టింది. అది కూడా షార్ట్ హ్యాండ్ బ్లౌజ్‌తో చూస్తే సింపిల్‌గా ఉన్నా..చీర హెవీ వర్క్ దాన్ని భర్తీ చేసేలా అదిరిపోయింది. అలాగే ఈ కాంచీవరం చీరల అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు దాని స్టయిలే వేరు. అందుకు తగ్గట్టుగా త్రిష ధరించిన పచ్చ రాళ్లతో కూడిన నెక్లస్ ఒక జత బ్యాంగిలిస్, డాంగ్లింగ్ చెవిపోగులు సరిగ్గా మ్యాచ్ అయ్యాయి. మేకప్ కూడా పెద్దగా లేకుండా నేచురల్ లుక్‌లో ముగ్దమనోహరంగా కనిపించింది. అలాగే పెదాలు కూడా నేచురల్‌గా కనిపించే లిప్‌స్టిక్ రంగుతో జాగ్రత్త పడింది. చీర కట్టుకోవడమే గాక అందుకు తగ్గట్టు మేకప్ ఉంటే ఆ చీర లుక్ అదుర్స్ అన్నంత రేంజ్లో ఉంటుంది. సహజత్వం ఉట్టిపడేలా మేకప్ ఉంటే..ఏ సంప్రదాయ పట్టు చీర అయినా దాని అందం పదింతలు అవుతుంది అనేందుకు ఇదే ఉదాహరణ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంకెందుకు ఆలస్యం త్రిష మాదిరి లుక్‌లో కనిపించేందుకు ట్రై చేయండి మరీ..! View this post on Instagram A post shared by Pothys (@pothysofficial) (చదవండి: లెహంగా లుక్కే వేరు! ధరిస్తే ఏ వేడుకైనా గ్రాండ్‌గా వెలిగిపోవాల్సిందే!)